శ్రీ మదగ్ని మహాపురాణము - 36 / Agni Maha Purana - 36
🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 36 / Agni Maha Purana - 36 🌹
✍️. పుల్లెల శ్రీరామచంద్రుడు
ప్రథమ సంపుటము, అధ్యాయము - 13
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
శ్రీ గణేశాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ.
🌻. భారతము యొక్క వర్ణనము - 2 🌻
దైవవశముచే కురుపాండవుల మధ్య వైరము ఏర్పడెను. దుష్టబుద్ధియైన దుర్యోధనుడు లక్క ఇంటిలో పాండవులను కాల్చెను. కాని తల్లితో కూడిన పంచపాండవులును కాలిపోయిన ఇంటి నుండి తప్పించుకొని వెళ్ళిపోయిరి. పిమ్మట ఆ పాండవులు ఏకచక్రనగరమునందు మునివేషధారులై ఒక బ్రాహ్మణుని ఇంట నివసించిరి. అచట వారు బకరాక్షసుని చంపిరి.
వారు ద్రౌపదీస్వయంవర నిమిత్తమై పాంచాల దేశమునకు వెళ్లిరి. అచట వివిధాలంకారభూషిత యైన ద్రౌపదిని పాండవు లైదుగురును భార్యగా పొందిరి.
దుర్యోధనాదులచే గుర్తింపబడిన ఆ పాండవులు అర్దరాజ్యమును పొందిరి. అర్జునుడు, అగ్ని దేవునుండి గాండీవ మను దివ్యధనస్సును, ఉత్తమమైన రథమును, అక్షయ్యమైన బాణములు గల అమ్ములపొదలను పొందెను. ద్రోణునివలన బ్రహ్మద్యస్త్రములను పొందెను. కృష్ణుని యుద్ధసమయమున సారథిగా పొందెను. వారందరరును శస్త్రాస్త్రములందు నమర్థులైరి.
పాండుకుమారుడైన అర్జునుడు తన శరవర్షముచే, ఇంద్రుడు కురిపించిన వర్షమును అడ్డగించి, కృష్ణసహాయముతో, ఖాండవ వనము నందు అగ్నిని సంతృప్తిని చేసెను. పాండవులు నలుదిక్కులను జయించిరి. యధిష్ఠిరుడు రాజ్యము చేసెను. అధిక మగు సువర్ణదానము గల రాజసూయయాగమును చేసెను. దుర్యోధనుడు దీని నంతను సహింపలేకపోయెను. సోదరుడైన దుఃశాసనుడును, ఐశ్వర్యము లభించిన కర్ణుడును, శకునియు చెప్పగా యుధిష్ఠిరుని ద్యూతము నకై ఆహ్వానించి, ఆ ద్యూతశాలలో యుధిష్ఠిరుని మోనము చేసి నవ్వుచు, అతని రాజ్యమును హరించెను.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Agni Maha Purana -36 🌹
✍️ N. Gangadharan
📚. Prasad Bharadwaj
Chapter 13 - Bharatam
🌻 Origin of the Kauravas and Pāṇḍavas - 2 🌻
11. Karṇa, born to Kuntī, when she was a virgin, became a dependent of Duryodhana. By destiny there was enmity between the Kurus (Kauravas) and Pāṇḍavas.
12. The wicked Duryodhana burnt the Pāṇḍavas in the lac house. The Pāṇḍavas escaped from the burnt house along with their mother as the sixth.
13. Then at (the place) Ekacakrā, in the house of a brahmin, they all remained in the attire of an ascetic after killing the demon Baka.[2]
14. They went to the fair at Pāñcāla and in the svayamvara (self-choice) of Draupadī. The well adorned Draupadī was obtained by the five Pāṇḍavas.
15. Then (they) were known to have got half of the kingdom by Duryodhana and others. The divine bow Gāṇḍīva and the excellent chariot were obtained from the Fire god.
16. And in the battle, Arjuna got Kṛṣṇa as the charioteer and inexhaustible arrows and similarly the missiles (known as) Brahmā and other weapons (were obtained) from Droṇa. All were proficient in (the use of) arms.
17-18. (Acting on the words of) Kṛṣṇa, Arjuna put out the fire at the Khāṇḍava forest. And the Pāṇḍava (Arjuna) having obstructed rains (caused by Indra) with the shower of arrows, conquered the countries in different) directions. Yudhiṣṭhira ruled the country along with the (other) Pāṇḍavas. (He performed) the Rājasūya (sacrifice) (spending) plenty of gold. Suyodhana (Duryodhana) could not bear that.
19. Being directed by brother Duḥśāsana and by Karṇa who had been enriched by him, he won over Yudhiṣṭhira in dice, (being assisted) by Śakuni in playing the dice. His kingdom was also won by conceit. Those in the court laughed at him.
Continues....
🌹 🌹 🌹 🌹 🌹
20 Apr 2022
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment