శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 383 / Sri Lalitha Chaitanya Vijnanam - 383

🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 383 / Sri Lalitha Chaitanya Vijnanam - 383 🌹

🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻

✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్

సేకరణ : ప్రసాద్ భరద్వాజ

మూల మంత్రము :

🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁

🍀 83. ఓడ్యాణ పీఠనిలయా, బిందుమండల వాసినీ ।
రహోయాగ క్రమారాధ్యా, రహస్తర్పణ తర్పితా ॥ 83 ॥ 🍀

🌻 383. 'సద్యః ప్రసాదినీ'🌻

రహోూయాగము, రహస్తర్పణము జరుపువారిని అప్పటి కప్పుడు అనుగ్రహించునది శ్రీమాత. ‘ప్రసాద’ మనగా దేవి అనుగ్రహము. 'సద్యో' యనగా అప్పటి కప్పుడు అని అర్థము. 'సద్యః ప్రసాదిని' అనగా వెంటనే అనుగ్రహించు నది. రహోూయాగము, రహస్తర్పణము అనునవి ముందు నామము లలో తెలుపబడినది. వాటిని నిర్వర్తించుకొనువారు శ్రీమాత అనుగ్రహమునకు పాత్రు లగుదురు. అట్టివారి యందు శ్రీమాత మిక్కిలి ప్రసన్నురాలై యుండును. ఎప్పటి కప్పుడు వారిని రక్షించుకొను చుండును.

వారి యందు తన సాన్నిధ్యమును శాశ్వతముగ నిలుపును. తన వైభవము వారి వైభవముగ లోకములందు విస్తరింప చేయును. అమ్మ అనుగ్రహము ఇట్టిది అని తెలుపుట సాధ్యపడు విషయము కాదు. ఊహ కందని అనుగ్రహమును తన భక్తుల యెడల అప్రమత్తమై ప్రసరింప జేయును. తనకు సమర్పణ చెందినవారికి తన సాన్నిధ్య మిచ్చి, పరిపూర్ణమగు దివ్యవైభవమును ప్రసాదించును. ప్రసాద మనగా దైవమునకు సమర్పణ చేయబడి దైవముచే అనుగ్రహింపబడి దైవ ప్రతీకగా నిలచి యుండుట. అమ్మ భక్తులు, కృష్ణ భక్తులు అట్టివారు.

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹

🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 383 🌹

Contemplation of 1000 Names of Sri Lalitha Devi

✍️. Acharya Ravi Sarma
📚. Prasad Bharadwaj

🌻 83. Odyana pita nilaya nindu mandala vasini
Rahoyaga kramaradhya rahastarpana tarpata ॥ 83 ॥ 🌻

🌻 383. Sadyaḥ-prasāidinī सद्यः-प्रसादिनी 🌻

She bestows Her grace immediately for those who seek Her within. This has been discussed in the two previous nāma-s. By such internal worship, Her immediate grace is imminent.

Continues...

🌹 🌹 🌹 🌹 🌹

04 Jul 2022

ఓషో రోజువారీ ధ్యానాలు - 208. ఆధిపత్యం / Osho Daily Meditations - 208. DOMINATION

🌹. ఓషో రోజువారీ ధ్యానాలు - 208 / Osho Daily Meditations - 208 🌹

📚. ప్రసాద్ భరద్వాజ్

🍀 208. ఆధిపత్యం 🍀

🕉. తక్కువ భావం ఉంటేనే ఎక్కువ అవ్వాలనే ఆలోచన వస్తుంది; ప్రజలు తమ గురించి అనిశ్చితంగా ఉన్నందున వారు భయపడు తున్నారు. కాబట్టి వారు ఆధిపత్యం చెలాయిస్తారు. 🕉

చాలా ప్రసిద్ధ తూర్పు కథ ఉంది.... ఒక గుడ్డివాడు చెట్టుకింద కూర్చుని ఉన్నాడు. ఒక రాజు వచ్చి, అంధుడి పాదాలను తాకి, 'అయ్యా, రాజధానికి దారి ఎక్కడ ఉంది?' అని ఆడిగాడు, ఇంతలో ప్రధాన మంత్రి వచ్చి, అంధుడి పాదాలను తాకకుండా, 'ఏమయ్యా, రాజధానికి మార్గం ఎటు అని అడిగాడు. ' అప్పుడు ఒక సైనికుడు వచ్చి, వృద్ధ అంధుడిని తలపై కొట్టి, 'మూర్ఖుడా, రాజధానికి దారి ఎక్కడ ఉంది?' అంటాడు. ఫలితంగా రాజుగారి సమూహం దారి తప్పింది. వాళ్ళంతా వెళ్ళిపోయాక ఆ గుడ్డివాడు నవ్వడం మొదలుపెట్టాడు.అతని పక్కన మరొకరు కూర్చుని ఉన్నారు, అతను అడిగాడు. 'ఎందుకు నవ్వుతున్నావు?' అని.

అంధుడు, 'చూడండి, మొదటివాడు రాజు అయివుండాలి, రెండవవాడు ప్రధానమంత్రి అయివుండాలి, మూడవవాడు సాధారణ సైనికుడు అయి వుండాలి' అన్నాడు. మనిషి అబ్బురపడ్డాడు; అతను అడిగాడు, 'మీకు ఎలా తెలుసు? నువ్వు అంధుడివి.' అంధుడు, 'వారి ప్రవర్తనతోనే తెలుసుకున్నాను. రాజు నా పాదాలను తాకి తన ఔన్నత్యాన్ని నిరూపించు కున్నాడు. సైనికుడు నన్ను కొట్టి చాలా తక్కువ వాడిగా అనుభూతి చెందాడు. అతను దయనీయ స్థితిలో ఉన్నాడు.' ఆధిపత్యం అవసరం లేదు; అస్సలు అవసరం లేదు.

కొనసాగుతుంది...

🌹 🌹 🌹 🌹 🌹

🌹 Osho Daily Meditations - 208 🌹

📚. Prasad Bharadwaj

🍀 208. DOMINATION 🍀

🕉. The idea if dominating arises out if an inferiority complex; people dominate because they are afraid, because they are uncertain about themselves. 🕉

There is a very famous Eastern story.... A blind man is sitting under a tree. A king comes, touches the feet of the blind man, and says, "Sir, where is the way to the capital?" Then the prime minister of the king comes, and without touching the blind man's feet he says, "Mister, where is the way to the capital?" Then comes an orderly. He hits the old blind man on the head and says, "You fool, where is the way to the capital?" The king's party had lost its way. When they had all gone, the blind man started laughing.

Somebody else was sitting by his side, and he asked, "Why are you laughing?" The blind man said, "Look, the first man must have been a king, the second man must have been the prime minister, and the third was a poor constable." The man was puzzled; he asked, "How could you know? You are blind." The blind man said, "Just by their behavior .... The king was so certain of his superiority that he could touch my feet. The orderly was feeling so inferior that he had to hit me. He must be in a poor situation." There is no need to dominate; there is no need at all.

Continues...

🌹 🌹 🌹 🌹 🌹

04 Jul 2022

శ్రీ శివ మహా పురాణము - 589 / Sri Siva Maha Purana - 589

🌹 . శ్రీ శివ మహా పురాణము - 589 / Sri Siva Maha Purana - 589 🌹

రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. రుద్రసంహితా-కుమార ఖండః - అధ్యాయము - 03 🌴

🌻. కార్తికేయుని లీలలు - 2 🌻

బ్రహ్మ ఇట్లు పలికెను -

అతని ఈ మాటను విని ఆ బాలుడు తన వృత్తాంతమును చెప్పెను. తరువాత గొప్పలీలలను ప్రదర్శించు ఆ బాలకుడు గాధి కుమారుడగు విశ్వామిత్రుని ఉద్దేశించి ప్రేమతో నిట్లు పలికెను (11).

శివకుమారుడిట్లు పలికెను-

విశ్వామిత్రా! నీవు నా వరముచే బ్రహ్మార్షివైనావు. సంశయించకుము. వసిష్ఠాది మునులు నిన్ను నిత్యము ఆదరముతో కొనియాడ గలరు (12). కావున, నీవు నా ఆజ్ఞచే సంస్కారమును చేయవలెను. ఈ విషయమునంతయునూ నీవు పరమరహస్యముగా నుంచుము. ఎచ్చటనైననూ చెప్పవద్దు (13).

బ్రహ్మ ఇట్లు పలికెను -

ఓ దేవర్షీ ! అపుడాయన ఆనందముతో ఆ శివసుతునకు వేదోక్త విధానముతో సంస్కారను చేసెను (14).

గొప్పలీలలను ప్రదర్శించే ప్రభువగు ఆ శివసుతుడు ఆనందించి విశ్వామిత్ర మహార్షికి శ్రేష్టమగు దివ్వజ్ఞానము నిచ్చెను(15). ద్విజశ్రేష్ఠుడు, నానా లీలా పండితుడు అగు ఆ అగ్ని పుత్రుడు ఆ నాటి నుండియూ విశ్వామీత్రుని పురోహితునిగా చేసుకొనేను (16).

ఓ మహర్షీ! ఆయన ప్రదర్శించిన ఈ లీలలను నీకు చెప్పితిని. కుమారా! ఆ బాలకుని మరియొక లీలలను చెప్పెదను. ప్రీతితో వినుము(17).

తరువాత ఆగ్ని అచటకు వెళ్లి ఆ బాలుని చూచి 'పుత్రా!' అనీ ఆలింగనము చేసుకొని ముద్దిడి శక్తి అనే ఆయుధమును అతనికి ఇచ్చేను (18). గుహుడు ఆ శక్తిని చేత బట్టి పర్వత శిఖరము నెక్కి ఆ శక్తితో కొట్టగా ఆ శిఖరము నేలగూలెను (19). పదికోట్ల వీరులగు రాక్షసులు ముందుగా అతనిని సంహరించిటకై వచ్చిరి. ఆ బాలకుడు శక్తితో కొట్టగా వారు వెంటనే నశించిరి (20). గొప్ప హాహాకారము చెలరేగెను. పర్వతములతో సహా భూమి కంపించెను. ముల్లోకములు వణికిపోయెను. అప్పుడు ఇంద్రుడు దేవతలతో గూడి అచటకు వచ్చెను (21).

సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹

🌹 SRI SIVA MAHA PURANA - 589 🌹

✍️ J.L. SHASTRI
📚. Prasad Bharadwaj

🌴 Rudra-saṃhitā (4): Kumara-khaṇḍa - CHAPTER 03 🌴

🌻 The boyhood sports of Kārttikeya - 2 🌻

Brahmā said:—

11. On hearing his words the boy told him about his life. The divine boy, the cause of great enjoyment and protection, said to Gādhi’s son with great pleasure.

Śiva’s son said:—

12. O Viśvāmitra, thanks to my favour, you now become a brahminical sage. Vasiṣṭha and others will for ever regard you with respect.

13. Hence, at my behest you shall perform my purificatory rites. Keep this as a great secret. You shall not mention it anywhere.

Brahmā said:—

14. O celestial sage, in the manner laid down in the Vedas he performed the purificatory rites for the son of Śiva.

15. Śiva’s son, the cause of great enjoyment and protection, was glad and conferred divine wisdom on the sage.

16. The son of Agni made Viśvāmitra his priest. Form that time onwards he became a great brahmin and an expert in divine sports of various sorts.

17. O sage, the very first sport that he performed thus has been narrated to you by me. O dear, listen to another sport of his with wonder. I shall narrate it to you.

18-19. At that time he was known as white in colour. Agni went there and seeing his son who was divine and very holy called him “O dear son.” Agni embraced and kissed him too. He gave him a miraculous weapon, spear.

20 Guha took the spear and ascended the peak. He hit the peak with his spear and the peak fell down.

21. Ten thousand billions of heroic demons came there to attack him but were killed on being hit with the spear.

Continues....

🌹🌹🌹🌹🌹

04 Jul 2022

శ్రీ మదగ్ని మహాపురాణము - 73 / Agni Maha Purana - 73

🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 73 / Agni Maha Purana - 73 🌹

✍️. పుల్లెల శ్రీరామచంద్రుడు

ప్రథమ సంపుటము, అధ్యాయము - 25

సేకరణ : ప్రసాద్ భరద్వాజ

శ్రీ గణేశాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ.

🌻. "వాసుదేవ' 'సంకర్షణ' 'ప్రద్యుమ్న' 'అనిరుద్ధ' మంత్రముల లక్షణములు - 5 🌻

పురుష-ధీ-అహంకార-మనన్‌-చిత్త-శబ్ద-స్పర్శ-రస-రూప-గంధ-శ్రోత్ర-త్వక్‌-చక్షుర్‌-జిహ్వా-నాసికా-వాక్‌-పాణి-పాద-పాయు-ఉపస్థ-భూ-జల-తేజన్‌-వాయు-అకాశములు పంచవింశతివ్యూహము. పురుషుని వ్యాపకునిగా విన్యసించి, పదింటిని అంగుష్ఠాదులందు, మిగిలిన వాటిని హస్త తలమునందును విన్యసించవలెను.

పిమ్మట శిరస్సు, లలాటము, ముఖము, హృదయము, నాభి, గుహ్యము, ఊరువులు, జానువులు, పాదములు, దశేంద్రియములు, పాదములు, జానువులు, ఉపస్థ, హృదయము, శిరస్సు-వీటిపై క్రమముగా విన్యసించవలెను. షడ్వింశవ్యూహమునందు పురుషాత్మకు ముందు పరరూపము ఉండును. మిగిలినదంతయు వెనుక చెప్పనట్లే.

పండితుడు ఒక మండలముపై ప్రకృతిని ధ్యానించి పూజింపవలెను. పూర్వ-దక్షిణ-పశ్చిమ-ఉత్తరదిశలందు హృదయాదులను పూజింప వలెను. అగ్య్నాది కోణములందు అస్త్రమును, వైనతేయాదులను, దిక్పాలులను పూర్వమునందు వలెనే పూజింపవలెను. త్రివ్యూహమునందు అగ్ని మధ్యను దుండను. పూర్వాది దిక్కలందు దలములం దున్నదేవతలలో కూడా రాజ్యాద్యలంకృతుడై కమల కర్ణికయందు నభోరూపుడగు, మాన స్మాత (అంతరాత్మ) ఉండును.

ఈ విధముగ సర్వవ్యూహములతోను, గరుడాది పంచాంగములతోను, ఇంద్రాదులతోను కూడిన విశ్వరూపుని లోకస్థితినిమిత్తము, రాజ్యయముకొరకును పూజింపవలెను. సమస్తకామములను పొందును. ఆకాశమునం దున్న బీజమును స్మరించుచు విష్వక్సేనుని పేరుతో పూజించవలెను.

అగ్ని మహాపురాణములో వాసుదేవాదిమన్త్ర ప్రదర్శనరూప మగు ఇరువదియైదవ అధ్యాయము సమాప్తము.

సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹

🌹 Agni Maha Purana - 73 🌹

✍️ N. Gangadharan
📚. Prasad Bharadwaj

Chapter 25

🌻 Worship regarding Vāsudeva, Saṅkarṣaṇa, Pradyumna and Aniruddha - 5 🌻

41-43. There are twelve, twenty-five or twenty-six parts—the supreme being, intellect, ego, mind, thinking, touch, taste, colour, smell, ears, skin, eyes, tongue, nose, speech, hand, feet,. anus, generative organ, earth, water, light, wind and sky. The pervasive Supreme Being is assigned and then in the thumbs and other fingers.

44-46. The remnant are assigned in the palm, head, or forehead and then face, heart, navel, generative organ, thigh, knee, and feet are assigned to feet, knee, thing, generative organ, heart and head in order. A wise man has to meditate upon the great soul of the Supreme Being in these twenty-six things as before and then the nature has to be worshipped in a circular (altar). The heart and other (limbs) have to be worshipped in the east, south, west and north.

47. As before the weapons (of Viṣṇu, Vainateya (the vehicle bird of Viṣṇu) (are adored) in the corners of south-east etc. (One should adore) the guardian deities of the quarters also. In (the worship of) three parts, the fire (will be) at the centre.

48. The directions east etc. are decorated with the strength, abode and kingdom.

49-50. The omnipresent form (of Viṣṇu), endowed with all parts and the five constituents Garuḍa etc. as well as Indra and others, should be adored (by one) for conquering kingdoms and for firmness of all (objects). One may get all desires (fulfilled). Viṣvaksena (an epithet of Viṣṇu) is worshipped by (his) name, the mystic letter being placed in the ether.

Continues....

🌹 🌹 🌹 🌹 🌹

04 Jul 2022

కపిల గీత - 33 / Kapila Gita - 33

🌹. కపిల గీత - 33 / Kapila Gita - 33🌹

🍀. కపిల దేవహూతి సంవాదం 🍀

📚. ప్రసాద్‌ భరధ్వాజ

🌴. 14. భక్తియే అంతిమ విముక్తి - 3 🌴

33. అనిమిత్తా భాగవతీ భక్తిః సిద్ధేర్గరీయసీ
జరయత్యాశు యా కోశం నిగీర్ణమనలో యథా

ఇలాంటి భక్తి మోక్షము కన్నా గొప్పది. ఇలాంటి భక్తి మనకు ఉన్న హృదయ గ్రంధిని చేధింప చేస్తుంది, కాలుస్తుంది. పనికి రాని వస్తువులను అగ్ని ఎలా కాల్చి పారేస్తుందో పరమాత్మ యందు భక్తి అన్ని పాపాలను ధ్వంసం చేస్తుంది.

సశేషం..

🌹 🌹 🌹 🌹 🌹

🌹 Kapila Gita - 33 🌹

✍️ Swami Prabhupada.
📚 Prasad Bharadwaj

🌴 14. Bhakti as Ultimate Liberation - 3 🌴

33. animitta bhagavati bhaktih siddher gariyasi
jarayaty asu ya kosam nigirnam analo yatha

Bhakti, devotional service, dissolves the subtle body of the living entity without separate effort, just as fire in the stomach digests all that we eat.

Continues...

🌹 🌹 🌹 🌹 🌹

04 Jul 2022

04 Jul 2022 Daily Panchang నిత్య పంచాంగము

🌹04, July 2022 పంచాగము - Panchangam 🌹

శుభ సోమవారం, Monday, ఇందు వాసరే

మీకు ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని కోరుకుంటూ - ప్రసాద్ భరద్వాజ

🌻. పండుగలు మరియు పర్వదినాలు : స్కంద షష్టి, Skanda Sashti🌻

🍀. రుద్రనమక స్తోత్రం - 31 🍀

59. నమ ఉగ్రాయ భీమాయ నమశ్శంగాయ తే నమః!
నమస్తీర్థ్యాయ కూల్యాయ సికత్యాయ నమోనమః!!59!!

60. ప్రవాహ్యాయ నమస్తుభ్యమిరిణ్యాయ నమోనమః!
నమస్తే చంద్రచూడాయ ప్రపధ్యాయ నమోనమః!!6౦!!

🌻 🌻 🌻 🌻 🌻

🍀. నేటి సూక్తి : మన జీవితాలలో అశాంతికి మనమే కారకులము. మన ఆలోచనలలోని ఆర్ధము లేని కోరికలే మనల్ని తీవ్ర అశాంతికి గురి చేస్తున్నాయని గ్రహించండి. - మాస్టర్‌ ఆర్‌.కె. 🍀

🌷🌷🌷🌷🌷

శుభకృత్‌ సంవత్సరం, జేష్ఠ మాసం

ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు

తిథి: శుక్ల పంచమి 18:34:44 వరకు

తదుపరి శుక్ల షష్టి

నక్షత్రం: మఘ 08:44:16 వరకు

తదుపరి పూర్వ ఫల్గుణి

యోగం: సిధ్ధి 12:22:55 వరకు

తదుపరి వ్యతీపాత

కరణం: బవ 05:53:30 వరకు

వర్జ్యం: 17:19:40 - 19:02:48

దుర్ముహూర్తం: 12:46:43 - 13:39:17

మరియు 15:24:25 - 16:16:59

రాహు కాలం: 07:24:45 - 09:03:19

గుళిక కాలం: 13:59:00 - 15:37:33

యమ గండం: 10:41:52 - 12:20:26

అభిజిత్ ముహూర్తం: 11:54 - 12:46

అమృత కాలం: 06:06:48 - 07:51:36

మరియు 27:38:28 - 29:21:36

సూర్యోదయం: 05:46:11

సూర్యాస్తమయం: 18:54:40

చంద్రోదయం: 09:57:44

చంద్రాస్తమయం: 22:49:06

సూర్య సంచార రాశి: జెమిని

చంద్ర సంచార రాశి: సింహం

ధ్వాo క్ష యోగం - ధన నాశనం, కార్య

హాని 08:44:16 వరకు తదుపరి ధ్వజ

యోగం - కార్య సిధ్ధి

🌻 🌻 🌻 🌻 🌻

🍀. నిత్య ప్రార్థన 🍀

వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ

నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా

యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా

తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం

తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ

విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.

🌹🌹🌹🌹🌹

04 - JULY - 2022 MONDAY MESSAGES సోమవారం, ఇందు వాసర సందేశాలు

1) 🌹. నిత్య పంచాంగము Daily Panchangam 04, సోమవారం, జూలై 2022 ఇందు వాసరే Sunday 🌹
2) 🌹 కపిల గీత - 33 / Kapila Gita - 33🌹
3) 🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 73 / Agni Maha Purana - 73🌹 
4) 🌹. శివ మహా పురాణము - 589 / Siva Maha Purana - 589🌹
5) 🌹 ఓషో రోజువారీ ధ్యానములు - 208 / Osho Daily Meditations - 208🌹
6) 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 383 / Sri Lalitha Chaitanya Vijnanam - 383🌹 

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹04, July 2022 పంచాగము - Panchangam 🌹*
*శుభ సోమవారం, Monday, ఇందు వాసరే*
*మీకు ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని కోరుకుంటూ - ప్రసాద్ భరద్వాజ*

*🌻. పండుగలు మరియు పర్వదినాలు : స్కంద షష్టి, Skanda Sashti🌻*

*🍀. రుద్రనమక స్తోత్రం - 31 🍀*

*59. నమ ఉగ్రాయ భీమాయ నమశ్శంగాయ తే నమః!*
*నమస్తీర్థ్యాయ కూల్యాయ సికత్యాయ నమోనమః!!59!!*
*60. ప్రవాహ్యాయ నమస్తుభ్యమిరిణ్యాయ నమోనమః!*
*నమస్తే చంద్రచూడాయ ప్రపధ్యాయ నమోనమః!!6౦!!*
🌻 🌻 🌻 🌻 🌻

*🍀. నేటి సూక్తి : మన జీవితాలలో అశాంతికి మనమే కారకులము. మన ఆలోచనలలోని ఆర్ధము లేని కోరికలే మనల్ని తీవ్ర అశాంతికి గురి చేస్తున్నాయని గ్రహించండి. - మాస్టర్‌ ఆర్‌.కె. 🍀*

🌷🌷🌷🌷🌷

శుభకృత్‌ సంవత్సరం, జేష్ఠ మాసం
ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు
తిథి: శుక్ల పంచమి 18:34:44 వరకు
తదుపరి శుక్ల షష్టి
నక్షత్రం: మఘ 08:44:16 వరకు
తదుపరి పూర్వ ఫల్గుణి
యోగం: సిధ్ధి 12:22:55 వరకు
తదుపరి వ్యతీపాత
కరణం: బవ 05:53:30 వరకు
వర్జ్యం: 17:19:40 - 19:02:48
దుర్ముహూర్తం: 12:46:43 - 13:39:17
మరియు 15:24:25 - 16:16:59
రాహు కాలం: 07:24:45 - 09:03:19
గుళిక కాలం: 13:59:00 - 15:37:33
యమ గండం: 10:41:52 - 12:20:26
అభిజిత్ ముహూర్తం: 11:54 - 12:46
అమృత కాలం: 06:06:48 - 07:51:36
మరియు 27:38:28 - 29:21:36
సూర్యోదయం: 05:46:11
సూర్యాస్తమయం: 18:54:40
చంద్రోదయం: 09:57:44
చంద్రాస్తమయం: 22:49:06
సూర్య సంచార రాశి: జెమిని
చంద్ర సంచార రాశి: సింహం
ధ్వాo క్ష యోగం - ధన నాశనం, కార్య
హాని 08:44:16 వరకు తదుపరి ధ్వజ
యోగం - కార్య సిధ్ధి

🌻 🌻 🌻 🌻 🌻  

*🍀. నిత్య ప్రార్థన 🍀*
*వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ*
*నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా*
*యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా*
*తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం*
*తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ* 
*విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.*
🌹🌹🌹🌹🌹
#పంచాగముPanchangam 
#PanchangDaily
#DailyTeluguCalender 
Join and Share 
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/
https://prasadbharadwaj.wixsite.com/dailybhaktimessages
https://chaitanyavijnanam.tumblr.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. కపిల గీత - 33 / Kapila Gita - 33🌹*
*🍀. కపిల దేవహూతి సంవాదం 🍀*
*📚. ప్రసాద్‌ భరధ్వాజ*

*🌴. 14. భక్తియే అంతిమ విముక్తి - 3 🌴*

*33. అనిమిత్తా భాగవతీ భక్తిః సిద్ధేర్గరీయసీ*
*జరయత్యాశు యా కోశం నిగీర్ణమనలో యథా*

*ఇలాంటి భక్తి మోక్షము కన్నా గొప్పది. ఇలాంటి భక్తి మనకు ఉన్న హృదయ గ్రంధిని చేధింప చేస్తుంది, కాలుస్తుంది. పనికి రాని వస్తువులను అగ్ని ఎలా కాల్చి పారేస్తుందో పరమాత్మ యందు భక్తి అన్ని పాపాలను ధ్వంసం చేస్తుంది.*

*సశేషం..*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Kapila Gita - 33 🌹*
*✍️ Swami Prabhupada.*
*📚 Prasad Bharadwaj*

*🌴 14. Bhakti as Ultimate Liberation - 3 🌴*

*33. animitta bhagavati bhaktih siddher gariyasi*
*jarayaty asu ya kosam nigirnam analo yatha*

*Bhakti, devotional service, dissolves the subtle body of the living entity without separate effort, just as fire in the stomach digests all that we eat.*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹
#కపిలగీత #KapilaGita
 #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom
www.facebook.com/groups/maharshiwisdom/
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/
https://prasadbharadwaj.wixsite.com/dailybhaktimessages
https://chaitanyavijnanam.tumblr.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 73 / Agni Maha Purana - 73 🌹*
*✍️. పుల్లెల శ్రీరామచంద్రుడు*
*ప్రథమ సంపుటము, అధ్యాయము - 25*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*శ్రీ గణేశాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ.*

*🌻. "వాసుదేవ' 'సంకర్షణ' 'ప్రద్యుమ్న' 'అనిరుద్ధ' మంత్రముల లక్షణములు - 5 🌻*

పురుష-ధీ-అహంకార-మనన్‌-చిత్త-శబ్ద-స్పర్శ-రస-రూప-గంధ-శ్రోత్ర-త్వక్‌-చక్షుర్‌-జిహ్వా-నాసికా-వాక్‌-పాణి-పాద-పాయు-ఉపస్థ-భూ-జల-తేజన్‌-వాయు-అకాశములు పంచవింశతివ్యూహము. పురుషుని వ్యాపకునిగా విన్యసించి, పదింటిని అంగుష్ఠాదులందు, మిగిలిన వాటిని హస్త తలమునందును విన్యసించవలెను. 

పిమ్మట శిరస్సు, లలాటము, ముఖము, హృదయము, నాభి, గుహ్యము, ఊరువులు, జానువులు, పాదములు, దశేంద్రియములు, పాదములు, జానువులు, ఉపస్థ, హృదయము, శిరస్సు-వీటిపై క్రమముగా విన్యసించవలెను. షడ్వింశవ్యూహమునందు పురుషాత్మకు ముందు పరరూపము ఉండును. మిగిలినదంతయు వెనుక చెప్పనట్లే.

పండితుడు ఒక మండలముపై ప్రకృతిని ధ్యానించి పూజింపవలెను. పూర్వ-దక్షిణ-పశ్చిమ-ఉత్తరదిశలందు హృదయాదులను పూజింప వలెను. అగ్య్నాది కోణములందు అస్త్రమును, వైనతేయాదులను, దిక్పాలులను పూర్వమునందు వలెనే పూజింపవలెను. త్రివ్యూహమునందు అగ్ని మధ్యను దుండను. పూర్వాది దిక్కలందు దలములం దున్నదేవతలలో కూడా రాజ్యాద్యలంకృతుడై కమల కర్ణికయందు నభోరూపుడగు, మాన స్మాత (అంతరాత్మ) ఉండును.

ఈ విధముగ సర్వవ్యూహములతోను, గరుడాది పంచాంగములతోను, ఇంద్రాదులతోను కూడిన విశ్వరూపుని లోకస్థితినిమిత్తము, రాజ్యయముకొరకును పూజింపవలెను. సమస్తకామములను పొందును. ఆకాశమునం దున్న బీజమును స్మరించుచు విష్వక్సేనుని పేరుతో పూజించవలెను.

అగ్ని మహాపురాణములో వాసుదేవాదిమన్త్ర ప్రదర్శనరూప మగు ఇరువదియైదవ అధ్యాయము సమాప్తము.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Agni Maha Purana - 73 🌹*
*✍️ N. Gangadharan*
*📚. Prasad Bharadwaj *

*Chapter 25*
*🌻 Worship regarding Vāsudeva, Saṅkarṣaṇa, Pradyumna and Aniruddha - 5 🌻*

41-43. There are twelve, twenty-five or twenty-six parts—the supreme being, intellect, ego, mind, thinking, touch, taste, colour, smell, ears, skin, eyes, tongue, nose, speech, hand, feet,. anus, generative organ, earth, water, light, wind and sky. The pervasive Supreme Being is assigned and then in the thumbs and other fingers.

44-46. The remnant are assigned in the palm, head, or forehead and then face, heart, navel, generative organ, thigh, knee, and feet are assigned to feet, knee, thing, generative organ, heart and head in order. A wise man has to meditate upon the great soul of the Supreme Being in these twenty-six things as before and then the nature has to be worshipped in a circular (altar). The heart and other (limbs) have to be worshipped in the east, south, west and north.

47. As before the weapons (of Viṣṇu, Vainateya (the vehicle bird of Viṣṇu) (are adored) in the corners of south-east etc. (One should adore) the guardian deities of the quarters also. In (the worship of) three parts, the fire (will be) at the centre.

48. The directions east etc. are decorated with the strength, abode and kingdom.

49-50. The omnipresent form (of Viṣṇu), endowed with all parts and the five constituents Garuḍa etc. as well as Indra and others, should be adored (by one) for conquering kingdoms and for firmness of all (objects). One may get all desires (fulfilled). Viṣvaksena (an epithet of Viṣṇu) is worshipped by (his) name, the mystic letter being placed in the ether.

Continues....
🌹 🌹 🌹 🌹 🌹
#అగ్నిపురాణం #AgniMahaPuranam
https://t.me/AgniMahaPuranam
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/hindupuranas/
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/
https://prasadbharadwaj.wixsite.com/dailybhaktimessages
https://chaitanyavijnanam.tumblr.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 . శ్రీ శివ మహా పురాణము - 589 / Sri Siva Maha Purana - 589 🌹* 
రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ

*🌴. రుద్రసంహితా-కుమార ఖండః - అధ్యాయము - 03 🌴*

*🌻. కార్తికేయుని లీలలు - 2 🌻*

బ్రహ్మ ఇట్లు పలికెను -

అతని ఈ మాటను విని ఆ బాలుడు తన వృత్తాంతమును చెప్పెను. తరువాత గొప్పలీలలను ప్రదర్శించు ఆ బాలకుడు గాధి కుమారుడగు విశ్వామిత్రుని ఉద్దేశించి ప్రేమతో నిట్లు పలికెను (11).

శివకుమారుడిట్లు పలికెను-

విశ్వామిత్రా! నీవు నా వరముచే బ్రహ్మార్షివైనావు. సంశయించకుము. వసిష్ఠాది మునులు నిన్ను నిత్యము ఆదరముతో కొనియాడ గలరు (12). కావున, నీవు నా ఆజ్ఞచే సంస్కారమును చేయవలెను. ఈ విషయమునంతయునూ నీవు పరమరహస్యముగా నుంచుము. ఎచ్చటనైననూ చెప్పవద్దు (13).

బ్రహ్మ ఇట్లు పలికెను -

ఓ దేవర్షీ ! అపుడాయన ఆనందముతో ఆ శివసుతునకు వేదోక్త విధానముతో సంస్కారను చేసెను (14).

గొప్పలీలలను ప్రదర్శించే ప్రభువగు ఆ శివసుతుడు ఆనందించి విశ్వామిత్ర మహార్షికి శ్రేష్టమగు దివ్వజ్ఞానము నిచ్చెను(15). ద్విజశ్రేష్ఠుడు, నానా లీలా పండితుడు అగు ఆ అగ్ని పుత్రుడు ఆ నాటి నుండియూ విశ్వామీత్రుని పురోహితునిగా చేసుకొనేను (16).

ఓ మహర్షీ! ఆయన ప్రదర్శించిన ఈ లీలలను నీకు చెప్పితిని. కుమారా! ఆ బాలకుని మరియొక లీలలను చెప్పెదను. ప్రీతితో వినుము(17).

తరువాత ఆగ్ని అచటకు వెళ్లి ఆ బాలుని చూచి 'పుత్రా!' అనీ ఆలింగనము చేసుకొని ముద్దిడి శక్తి అనే ఆయుధమును అతనికి ఇచ్చేను (18). గుహుడు ఆ శక్తిని చేత బట్టి పర్వత శిఖరము నెక్కి ఆ శక్తితో కొట్టగా ఆ శిఖరము నేలగూలెను (19). పదికోట్ల వీరులగు రాక్షసులు ముందుగా అతనిని సంహరించిటకై వచ్చిరి. ఆ బాలకుడు శక్తితో కొట్టగా వారు వెంటనే నశించిరి (20). గొప్ప హాహాకారము చెలరేగెను. పర్వతములతో సహా భూమి కంపించెను. ముల్లోకములు వణికిపోయెను. అప్పుడు ఇంద్రుడు దేవతలతో గూడి అచటకు వచ్చెను (21).

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 SRI SIVA MAHA PURANA - 589 🌹*
*✍️ J.L. SHASTRI*
*📚. Prasad Bharadwaj *

*🌴 Rudra-saṃhitā (4): Kumara-khaṇḍa - CHAPTER 03 🌴*

*🌻 The boyhood sports of Kārttikeya - 2 🌻*

Brahmā said:—

11. On hearing his words the boy told him about his life. The divine boy, the cause of great enjoyment and protection, said to Gādhi’s son with great pleasure.
Śiva’s son said:—

12. O Viśvāmitra, thanks to my favour, you now become a brahminical sage. Vasiṣṭha and others will for ever regard you with respect.

13. Hence, at my behest you shall perform my purificatory rites. Keep this as a great secret. You shall not mention it anywhere.
Brahmā said:—

14. O celestial sage, in the manner laid down in the Vedas he performed the purificatory rites for the son of Śiva.

15. Śiva’s son, the cause of great enjoyment and protection, was glad and conferred divine wisdom on the sage.

16. The son of Agni made Viśvāmitra his priest. Form that time onwards he became a great brahmin and an expert in divine sports of various sorts.

17. O sage, the very first sport that he performed thus has been narrated to you by me. O dear, listen to another sport of his with wonder. I shall narrate it to you.

18-19. At that time he was known as white in colour. Agni went there and seeing his son who was divine and very holy called him “O dear son.” Agni embraced and kissed him too. He gave him a miraculous weapon, spear.

20 Guha took the spear and ascended the peak. He hit the peak with his spear and the peak fell down.

21. Ten thousand billions of heroic demons came there to attack him but were killed on being hit with the spear.

Continues....
🌹🌹🌹🌹🌹
#శివమహాపురాణము
#SivaMahaPuranam #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
https://facebook.com/groups/hindupuranas/
https://facebook.com/groups/chaitanyavijnanam/ 
https://t.me/ChaitanyaVijnanam
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/
https://prasadbharadwaj.wixsite.com/dailybhaktimessages
https://chaitanyavijnanam.tumblr.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. ఓషో రోజువారీ ధ్యానాలు - 208 / Osho Daily Meditations - 208 🌹*
*📚. ప్రసాద్ భరద్వాజ్*

*🍀 208. ఆధిపత్యం 🍀*

*🕉. తక్కువ భావం ఉంటేనే ఎక్కువ అవ్వాలనే ఆలోచన వస్తుంది; ప్రజలు తమ గురించి అనిశ్చితంగా ఉన్నందున వారు భయపడు తున్నారు. కాబట్టి వారు ఆధిపత్యం చెలాయిస్తారు. 🕉*
 
*చాలా ప్రసిద్ధ తూర్పు కథ ఉంది.... ఒక గుడ్డివాడు చెట్టుకింద కూర్చుని ఉన్నాడు. ఒక రాజు వచ్చి, అంధుడి పాదాలను తాకి, 'అయ్యా, రాజధానికి దారి ఎక్కడ ఉంది?' అని ఆడిగాడు, ఇంతలో ప్రధాన మంత్రి వచ్చి, అంధుడి పాదాలను తాకకుండా, 'ఏమయ్యా, రాజధానికి మార్గం ఎటు అని అడిగాడు. ' అప్పుడు ఒక సైనికుడు వచ్చి, వృద్ధ అంధుడిని తలపై కొట్టి, 'మూర్ఖుడా, రాజధానికి దారి ఎక్కడ ఉంది?' అంటాడు. ఫలితంగా రాజుగారి సమూహం దారి తప్పింది. వాళ్ళంతా వెళ్ళిపోయాక ఆ గుడ్డివాడు నవ్వడం మొదలుపెట్టాడు.అతని పక్కన మరొకరు కూర్చుని ఉన్నారు, అతను అడిగాడు. 'ఎందుకు నవ్వుతున్నావు?' అని.*

*అంధుడు, 'చూడండి, మొదటివాడు రాజు అయివుండాలి, రెండవవాడు ప్రధానమంత్రి అయివుండాలి, మూడవవాడు సాధారణ సైనికుడు అయి వుండాలి' అన్నాడు. మనిషి అబ్బురపడ్డాడు; అతను అడిగాడు, 'మీకు ఎలా తెలుసు? నువ్వు అంధుడివి.' అంధుడు, 'వారి ప్రవర్తనతోనే తెలుసుకున్నాను. రాజు నా పాదాలను తాకి తన ఔన్నత్యాన్ని నిరూపించు కున్నాడు. సైనికుడు నన్ను కొట్టి చాలా తక్కువ వాడిగా అనుభూతి చెందాడు. అతను దయనీయ స్థితిలో ఉన్నాడు.' ఆధిపత్యం అవసరం లేదు; అస్సలు అవసరం లేదు.*
  
*కొనసాగుతుంది...*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Osho Daily Meditations - 208 🌹*
*📚. Prasad Bharadwaj*

*🍀 208. DOMINATION 🍀*

*🕉. The idea if dominating arises out if an inferiority complex; people dominate because they are afraid, because they are uncertain about themselves. 🕉*
 
*There is a very famous Eastern story.... A blind man is sitting under a tree. A king comes, touches the feet of the blind man, and says, "Sir, where is the way to the capital?" Then the prime minister of the king comes, and without touching the blind man's feet he says, "Mister, where is the way to the capital?" Then comes an orderly. He hits the old blind man on the head and says, "You fool, where is the way to the capital?" The king's party had lost its way. When they had all gone, the blind man started laughing.*

*Somebody else was sitting by his side, and he asked, "Why are you laughing?" The blind man said, "Look, the first man must have been a king, the second man must have been the prime minister, and the third was a poor constable." The man was puzzled; he asked, "How could you know? You are blind." The blind man said, "Just by their behavior .... The king was so certain of his superiority that he could touch my feet. The orderly was feeling so inferior that he had to hit me. He must be in a poor situation." There is no need to dominate; there is no need at all.*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹
#ఓషోరోజువారీధ్యానములు
#OshoDailyMeditations
#ఓషోబోధనలు #OshoDiscourse 
#ఓషోనిర్మలధ్యానములు #PrasadBhardwaj 
https://t.me/ChaitanyaVijnanam
http://www.facebook.com/groups/oshoteachings/
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/
https://prasadbharadwaj.wixsite.com/dailybhaktimessages
https://chaitanyavijnanam.tumblr.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 383 / Sri Lalitha Chaitanya Vijnanam - 383 🌹*
*🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻*
*✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*మూల మంత్రము :*
*🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁*

*🍀 83. ఓడ్యాణ పీఠనిలయా, బిందుమండల వాసినీ ।*
*రహోయాగ క్రమారాధ్యా, రహస్తర్పణ తర్పితా ॥ 83 ॥ 🍀*

*🌻 383. 'సద్యః ప్రసాదినీ'🌻* 

*రహోూయాగము, రహస్తర్పణము జరుపువారిని అప్పటి కప్పుడు అనుగ్రహించునది శ్రీమాత. ‘ప్రసాద’ మనగా దేవి అనుగ్రహము. 'సద్యో' యనగా అప్పటి కప్పుడు అని అర్థము. 'సద్యః ప్రసాదిని' అనగా వెంటనే అనుగ్రహించు నది. రహోూయాగము, రహస్తర్పణము అనునవి ముందు నామము లలో తెలుపబడినది. వాటిని నిర్వర్తించుకొనువారు శ్రీమాత అనుగ్రహమునకు పాత్రు లగుదురు. అట్టివారి యందు శ్రీమాత మిక్కిలి ప్రసన్నురాలై యుండును. ఎప్పటి కప్పుడు వారిని రక్షించుకొను చుండును.*

*వారి యందు తన సాన్నిధ్యమును శాశ్వతముగ నిలుపును. తన వైభవము వారి వైభవముగ లోకములందు విస్తరింప చేయును. అమ్మ అనుగ్రహము ఇట్టిది అని తెలుపుట సాధ్యపడు విషయము కాదు. ఊహ కందని అనుగ్రహమును తన భక్తుల యెడల అప్రమత్తమై ప్రసరింప జేయును. తనకు సమర్పణ చెందినవారికి తన సాన్నిధ్య మిచ్చి, పరిపూర్ణమగు దివ్యవైభవమును ప్రసాదించును. ప్రసాద మనగా దైవమునకు సమర్పణ చేయబడి దైవముచే అనుగ్రహింపబడి దైవ ప్రతీకగా నిలచి యుండుట. అమ్మ భక్తులు, కృష్ణ భక్తులు అట్టివారు.*

*సశేషం...*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 383 🌹*
*Contemplation of 1000 Names of Sri Lalitha Devi* 
*✍️. Acharya Ravi Sarma *
*📚. Prasad Bharadwaj*

*🌻 83. Odyana pita nilaya nindu mandala vasini*
*Rahoyaga kramaradhya rahastarpana tarpata ॥ 83 ॥ 🌻*

*🌻 383. Sadyaḥ-prasāidinī सद्यः-प्रसादिनी 🌻*

*She bestows Her grace immediately for those who seek Her within. This has been discussed in the two previous nāma-s. By such internal worship, Her immediate grace is imminent.*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹
#శ్రీలలితాసహస్రనామచైతన్యవిజ్ఞానము #SriLalithaChaitanyaVijnanam #లలితాసహస్రనామములు #LalithaSahasranama
https://t.me/+LmH1GyjNXXlkNDRl
http://www.facebook.com/groups/srilalithachaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/
https://prasadbharadwaj.wixsite.com/dailybhaktimessages
https://chaitanyavijnanam.tumblr.com/
https://prasadbharadwaj.wixsite.com/lalithasahasranama

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹