శ్రీ విష్ణు సహస్ర నామములు - 70 / Sri Vishnu Sahasra Namavali - 70

🌹. శ్రీ విష్ణు సహస్ర నామములు - 70 / Sri Vishnu Sahasra Namavali - 70 🌹

నామము - భావము

📚. ప్రసాద్ భరద్వాజ

🌷. ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్ 🌷

జ్యేష్ట నక్షత్ర ద్వితీయ పాద శ్లోకం

🍀. 70. కామదేవః కామపాలః కామీ కాన్తః కృతాగమః|
అనిర్దేశ్యవపుః విష్ణుః వీరోనంతో ధనంజయః || 70 || 🍀

🍀 651) కామదేవ: -
చతుర్విధ పురుషార్థములను కోరువారిచే పూజింపబడువాడు.

🍀 652) కామపాల: -
భక్తులు తననుండి పొందిన పురుషార్థములను చక్కగా ఉపయోగపడునట్లు చూచువాడు.

🍀 653) కామీ -
సకల కోరికలు సిద్ధించినవాడు.

🍀 654) కాంత: -
రమణీయ రూపధారియైన వాడు.

🍀 655) కృతాగమ: -
శ్రుతి, స్తృతి ఇత్యాది శాస్త్రములు రచించినవాడు.

🍀 656) అనిర్దేశ్యవపు: -
నిర్దేశించి, నిర్వచించుటకు వీలుకానివాడు.

🍀 657) విష్ణు: -
భూమ్యాకాశాలను వ్యాపించినవాడు.

🍀 658) వీర: -
వీ ధాతువుచే సూచించు కర్మలచే నిండియున్నవాడు.

🍀 659) అనంత: -
సర్వత్రా, సర్వకాలములందు ఉండువాడు.

🍀 660) ధనంజయ: -
ధనమును జయించినవాడు.

సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹

🌹 Vishnu Sahasra Namavali - 70 🌹

Name - Meaning

📚 Prasad Bharadwaj

🌷 OM NARAYANAYA VIDMAHE VASUDEVAYA DHIMAHI । TANNO VISHNU PRACHODAYAT ॥ 🌷

Sloka for Jeshta 2nd Padam

🌻 70. kāmadevaḥ kāmapālaḥ kāmī kāntaḥ kṛtāgamaḥ |
anirdeśyavapurviṣṇurvīrōnantō dhanañjayaḥ || 70 || 🌻

🌻 651. Kāmadevaḥ:
One who is desired by persons in quest of the four values of life – Dharma, Artha, Kama and Moksha.

🌻 652. Kāmapālaḥ:
One who protects or assures the desired ends of people endowed with desires.

🌻 653. Kāmī:
One who by nature has all his desires satisfied.

🌻 654. Kāntaḥ:
One whose form is endowed with great beauty. Or one who effects the 'Anta' or dissolution of 'Ka' or Brahma at the end of a Dviparardha (the period of Brahma's lifetime extending over a hundred divine years).

🌻 655. Kṛtāgamaḥ:
He who produced scriptures like Shruti, Smruti and Agama.

🌻 656. Anirdeśya-vapuḥ:
He is called so, because, being above the Gunas, His form cannot be determined.

🌻 657. Viṣṇuḥ:
One whose brilliance has spread over the sky and over the earth.

🌻 658. Vīraḥ:
One who has the power of Gati or movement.

🌻 659. Anantaḥ:
One who pervades everything, who is eternal, who is the soul of all, and who cannot be limited by space, time, location, etc.

🌻 660. Dhananjayaḥ:
Arjuna is called so because by his conquest of the kingdoms in the four quarters he acquired great wealth. Arjuna is a Vibhuti, a glorious manifestation of the Lord.

Continues...

🌹 🌹 🌹 🌹 🌹

23 Nov 2020

భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 106

🌹. భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 106 🌹

✍️. శ్రీ బాలగోపాల్
📚. ప్రసాద్ భరద్వాజ

🌻. మానసిక గోళము - మనోభువనము - ఆరవ భూమిక - 11
🌻

442. మనోమయ గోళమందలి రెండవ భాగము అనుభూతులకు (హృదయము) అధికారి యందున్న సాధకుడు (సత్పురుషుడు) భగవంతుని నిజ స్వరూపమును ప్రత్యక్షముగా దివ్యా నేత్రము ద్వారా ఎల్లెడల చూచుచున్నాననెడి భావానుభూతిని పొందును. కాని తనను భగవంతునిలో భగవంతునిగా చూడలేదు. ఇదియే బ్రహ్మ సాక్షాత్కారము (ఆత్మ ప్రకాశము).

443. ఇతడు మహిమలు ప్రదర్శించడు.

444. ఇచట దర్శనము అనెడి ఇంద్రియ పరిజ్ఞానము మిగిలి యున్నది.

445. భౌతిక , సూక్ష్మ చైతన్యములు గల ఆత్మల యొక్క అనుభూతులపై అధికారము కల్గి వాటిని పరిపాలించును.

446. పరుల మనస్సుల యొక్క తలపుల యందును, తలపులు సృష్టించుట యందును సమర్ధుడగును. ఆత్మనిగ్రహము కలవాడగును.

447. సృష్టి అనుభవమంతయు మిథ్య ఎందుచేతననగా--సృష్టి సంబంధమైన సమస్త అనుభవములు సంస్కారముల వలన కలిగినవి. ఆ సంస్కారములు అభావము నుండి పుట్టినవి గనుక.

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹

23 Nov 2020

శివగీత - 121 / The Siva-Gita - 121

🌹. శివగీత - 121 / The Siva-Gita - 121 🌹

🌴. పరమేశ్వరుడు - శ్రీరాముడు మధ్య జరిగిన జ్ఞాన సంవాదము. 🌴

📚. ప్రసాద్ భరద్వాజ

అధ్యాయము 16

🌻. మొక్షాదికారి నిరూపణము - 2 🌻

యోమాం గురుం పాశుపతం -వ్రతం ద్వేష్టి నరాధిప,

విష్ణుం వాసన ముచ్యేత - జన్మ కోటి శ తైరపి 6

అనేక కర్మ సక్తోపి - శివ జ్ఞాన వివర్జితః ,

శివ భక్తి విహీనశ్చ - సంసారీ నైవ ముచ్యతే 7

ఆసక్తాః ఫల సంగేన - యేత్వ వైది క కర్మాణి,

దృష్ట మాత్ర ఫలాస్తే తు - న ముక్తా వాది కారిణః 8

అవిముక్తే ద్వార వత్యాం - శ్రీశైలే పుండరీకకే,

దేహాంతే తారకం బ్రహ్మ - లభతే మదను గ్రహాత్ 9

య్య హస్తౌ చ పాదౌచ - మనశ్చైన సుసంయుతమ్,

విద్యాత పశ్చ కీర్తిశ్చ -సతీర్ధ ఫల మశ్నుతే 10

పశుపతి వ్రత గురువగు నన్నెవడు ద్వేషించునో హరి ద్వేష మెవడు చేయునో, వాడు కోటి కల్పముల కైనను అనేక కర్మల శివ జ్ఞాన భక్తులు గాక సంసారియై బుట్టుచు ముక్తిని పొందలేడు.

ఫలాకాంక్ష తో వామాచారాదుల యందు,ఆసక్తి కలవారు తత్ఫలములను మాత్రమే పొందగలరు. కాని మొక్షాది కారము కానేరరు.

కాశిలో ను ద్వారకా పురము లోను అధవా శ్రీశైలములోను పుండరీకము నందును దేహమును వదులువారు (మరణించు వారు ) నాయనుగ్రహము వలన తారక బ్రహ్మను పొందుదురు.

ఎవ్వని కర చరణంబులు నియమితమై యుండునో విద్యా తపస్సు కీర్తి మొదలగునవి సమకూరునో వాడికే తీర్ధ వాస ఫలము లభించును. లేకున్నచో, నా తీర్దావాసము చేత పాపమునే యనుభవించు వాడగును.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

🌹 The Siva-Gita - 121 🌹

🌴. Dialogue between Rama and Lord Siva 🌴

✍️ Ayala somayajula.
📚. Prasad Bharadwaj

Chapter 16

🌻 Mokshadhikari Nirupanam - 2 🌻

I who am the Guru of the Pashupati Vratam, one who hates me one who hates Vishnu, such a person even after billions of kalpas would remain in the ocean of samsaara falling into the circle of births and deaths and would not gain Shivajnanam hence would not attain liberation.

One who performs rituals or chants my name with the expectation of fruition, he would gain the desired fruition only but cannot gain liberation.

One who dies in Kashi, Dwaraka, Sri Sailam, or Pundarikam with my grace they would gain Taraka Brahman and attain salvation.

One whose limbs remain conquered and help him gain knowledge, do austerities, gain fame such a person only gains the fruition of pilgrimage.

Others who aren't of cleansed heart gain only sins even by staying in those places of pilgrimage.

Continues...
🌹 🌹 🌹 🌹 🌹

23 Nov 2020

భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 167

🌹. భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 167 🌹

🌷. సద్గురు శివానంద 🌷
📚. ప్రసాద్ భరద్వాజ

🌻. కణ్వమహర్షి - 2 🌻

07. అందరికీ కలియుగంలో ఒకతే స్మృతి అనటానికి వీలులేదు. కొందరి అభిప్రాయంలో మనుస్మృతి కలియుగానికి వర్తించదు. శంఖలిఖితస్మృతి ద్వాపరయుగానికి వర్తిస్తుంది. భరద్వాజుడు చెప్పినటువంటి కొన్ని వాక్యాలు ఇప్పుడుకూడా మనకు వర్తిస్తాయి.

08. కాబట్టి యుగానికి ఒక్కొక్క స్మృతి – అంటే ఆ శాఖీయులని వాడమని ఒక అర్థం ఉంది. ఏ శాఖలో మనం ఉన్నమో ఆ శాఖలో ఆ ఋషిచెప్పిన స్మృతినివాడతమే సమంజసం అని భావించాలి. యుగధర్మం అలా ఉంది.

09. సామాన్యంగా నాలుగువర్ణాలవారికీ, సమస్త ప్రజలందరికీ, స్త్రీలకు, పురుషులందరికీ వర్తించే విధంగా స్మృతి ఒకటి ఉండగా; ప్రత్యేకమయిన ఒక కుటుంబీకులు వాళ్ళశాఖకుచెందిన ఋషులు చెప్పిన స్మృతులను వాళ్ళు అనుసరించాలి. అది యోగ్యమైంటువంటి విధానమని మనం భావించవచ్చు.

10. అందరూ మనుస్మృతి-మనుస్మృతి అని అంటారు. నిజానికి మనుస్మృతి ఇంత ప్రధాన్యత సంఘంలో ఇటీవలే వచ్చింది. ఈ స్మృతులన్నీ ఆయా ప్రంతాలలో ఉండేవి. కాశ్మీరు లోనూ, పంజాబులోనూ భరద్వాజస్మృతి ఎక్కువగా ఉండేది.

11. ఉత్తభారతప్రాంతాలలో యాజ్ఞవల్కస్మృతికూడా ప్రచారంలో ఉంది. వళ్ళ వివాహాదులుకూడా దానిని బట్టే నడుస్తాయని అంటారు వాళ్ళు. పంజాబులో అక్కడివాళ్ళకు వారి స్మృతే ప్రధానం. అలాగే కాశ్మీరులో ఇంకొక స్మృతి. గుజరాతులో మరొకటి ఉంది.

12. బ్రాహ్మణులలోకూడా అనేక ఋషివంశాలలో, గోత్రాలలో, శాఖలలో అనేక వంసకర్తలు చెప్పిన వాక్యాలను ఆయా కుటుంబాలవారు, ప్రాంతాలవారు అనుసరిస్తూ వాళ్ళ కార్యక్రమాలను నడుపుకునేవాళ్ళు. ‘కలౌ పరాశరస్మృతిః’- అంటే, కలిలో పరాశరుడు స్మృతి సామాన్య వ్యవహారంలో ఉన్నదని అర్థం. యాజ్ఞవల్కుడు, పరాశరుల స్మృతులు సామాన్యంగా అనుసరిస్తూ వచ్చారు.

13. శంఖలిఖిత స్మృతి ఒకటి ఉంది. నీతి, న్యాయము, ధర్మము, తాను చేసిన నేరానికి తనను తానే శిక్షించుకోవడం అనేది మనుశ్మృతిలో లేదు; కాని శంఖలిఖితులు దీనిని తమ స్మృతిలో చెప్పారు. “ఇంకొకళ్ళు శిక్షించేదాక ఎందుకుండాలి? నిన్ను నీవే శ్ఖించుకో! స్వర్గం కనబడుతుంది. మోక్షం కలుగుతుంది నువ్వు పెద్దలవద్దకు వెళ్ళి అడుగు. శిక్ష పడకపోతే నువ్వే శిక్షించుకో! నీకు తెలుసు” అని శంఖలిఖిత స్మృతి చెబుతుంది.

సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹

23 Nov 2020

శ్రీ శివ మహా పురాణము - 279

🌹 . శ్రీ శివ మహా పురాణము - 279 🌹

రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. రుద్ర సంహితా - సతీఖండః 🌴

66. అధ్యాయము - 21

🌻. సతీ శివుల విహారము - 2 🌻

అంగదములను, కంకణములను, ఉంగరములను మరల మరల వాటి స్థానములనుండి విడదీసి, శివుడు వాటిని మరల అదే స్థానములో అమర్చెడి వాడు (22). కాలికా! నీతో సమానమైన వర్ణము గల ఈ నీ చెలికత్తె వచ్చు చున్నది అని శివుడు పిలిచెడి వాడు. ఆమె ఆ దిశలో చూచుచుండగా, ఆమె ఉన్నతమగు స్తనములను దర్శించుట కొరకై అట్లు పిలిచెడివాడు (23).

ఒకప్పుడు మన్మథవికారముచే ఉన్మత్తమైన మానసము గల ఆ ప్రమధగణాధిపతి నర్మకేళి యందు ప్రీతిగల ఆమెతో గూడి ఆనందముతో నర్మకేళి యందు లగ్న మయ్యెడి వాడు (24). శంకరుడు పద్మములను, సుందరమగు పుష్పములను తెచ్చి సర్వావయవముల యందు ఆదరముతో పుష్పాభరణములను సమకూర్చెడివాడు (25).

భక్తవత్సలుడగు మహేశ్వరుడు కైలాసమునందు రమ్యములైన లతా గృహములన్నింటి యందు ప్రియురాలగు సతీదేవితో గూడి విహరించెను (26). ఆయన ఆమె లేనిదే ఎచటికైననూ వెళ్లడు; ఒంటరిగా ఉండడు; ఏ పనినీ చేయడు. శంకరుడు ఆమె లేనిదే క్షణమైననూ సుఖముగా నుండలేకపోయెను (27).

కైలాస పర్వత లతా గృహము లందు చిరకాలము విహరించి, శివుడు తన ఇచ్ఛచే హిమవత్పర్వతమును స్మరించి అచటకు వెళ్ళెను (28). మన్మథుడు శంకరుని సమీపమునందు ప్రవవేశించగానే, వసంతుడు కూడ ఆ ప్రభువు యొక్క హృదయములోని భావమును గ్రహించి తన ప్రభావమును విస్తరించెను (29).

వృక్షములన్నియు పుష్పించినవి. లతాదులు పుష్పించినవి. సరస్సులు వికసించిన పద్మములతో నిండినవి. పద్మములు తుమ్మెదలతో శోభిల్లినవి (30). అచట వసంతర్తువు ప్రవేశించ గానే, మలయమారుతము వీచెను. మంచి సువాసన గల పుష్పములు పడుటచే జలములు పరిమళ భరితములాయెను (31).

సంధ్యా కాలము నందలి చంద్రుని వలె ప్రకాశించే మోదుగు పుష్పములు ఆ వృక్షములు అనే యువతుల అధరములపై వసంతుని చిహ్నములు వలె, మన్మథుని అస్త్రము వలె రాజిల్లెను (32). సరస్సులయందు పద్మములు ప్రకాశించినవి. మెల్లగా వీచే వాయుదేవత సర్వమానవులను మోహింపజేయుటకు సంసిద్ధమగు చుండెను (33).

శంకరుని సన్నిధిలో నాగకేశర వృక్షములు బంగరువన్నె గల పుష్పములతో మన్మథిని జెండాల వలె మనోహరముగా ప్రకాశించినవి (34). లవంగముల తీగ పరిమళ గంధముచే వాయువును సువాసితము చేసి కామి జనుల మనస్సులను మిక్కిలి మోహింపజేసెను (35).

మామిడి చిగుళ్లను భక్షించి మధురముగా కూయు కోయిలలు మన్మథ బాణముల సముదాయమువలె నున్న మామిడి చిగుళ్లు అనే పర్యంకములపై మన్మథపీడితములై భాసిల్లెను (36). నిర్మలములగు సరస్సులు వికసించిన పద్మములతో కూడి, ఆత్మ జ్యోతి యొక్క ప్రకాశముతో నిండియున్న మహర్షుల హృదయముల వలె ప్రకాశించెను (37).

మంచు తునకలు సూర్యరశ్ముల సంగమముచే నీరుగారిని హృదయము గలవై అంతరిక్షములోనికి ఆవిరి రూపములో ఎగసినవి (38). అపుడు రాత్రులు చంద్రునితో, మంచుతో కూడియున్నవై ప్రియునితో కూడిన అందమైన యువతులవలె నిర్మలముగా ప్రకాశించుచున్నవి (39).

ఆ సమయములో మహాదేవుడు భార్యతో గూడి ఆ గొప్ప పర్వతమునందు లతా గృహములలో, మరియు నదులలో యథేచ్ఛగా చిరకాలము రమించెను (40). ఓ మహర్షీ! శివుడు ఆమె లేనిదే క్షణమైననూ శాంతముగా నుండలేక పోయెను. అదే తీరున, ఆ దాక్షాయణి కూడా ఆయనతో సమానముగా విహరించుచూ ప్రకాశించెను (41).

సంభోగ విషయములో సతీదేవి ఆయన మనస్సునకు ప్రీతిని కలిగించెను. ఆమె శివుని దేహములో ప్రవేశించు చున్నదా యన్నట్లు , ఆయన శక్తిని ఆ స్వాదించు చున్నదా యన్నట్లు ఉండెను (42). శివుడు ఆమె దేహమునంతనూ తాను స్వయముగా రచించిన పుష్పమాలలతో నూతన గృహమా యన్నట్లు అలంకరించెను (43).

శివుడు సల్లాపములతో, చూపులతో, హాస్యములతో, మరియు ప్రసంగములతో ఆ సతీదేవికి ఆ క్షణమునందే ఆత్మ జ్ఞానమును బోధించినాడా యన్నట్లుండెను (44). ఆమె ముఖార వింద సౌందర్యమును పానము చేసి హరుడు ఆనందముగా నుండెను. ఆయన ఆ సుందరితో అనేక విశేషములతో గూడిన గార్హస్థ్యములో ప్రేమావస్థను బడసెను (45).

ఆమె ముఖ పద్మము యొక్క సుగంధము చేత, ఆమె సౌందర్యములచేత, నర్మకేళుడు చేత బంధింపబడిన శివునకు, త్రాళ్లచే బంధిపబడిన మహాగజమునకు వలె, ఇతర చేష్టలు లేకుండెను (46).

మహేశ్వరుడు దక్షపుత్రితో గూడి ఈ తీరున హిమ వత్పర్వతమునందలి లతాగృహములలో, గుహలలో ప్రతిదినము రమించెను. ఓ దేవర్షీ! ఆయన ఇట్లు క్రీడించుచుండగా దివ్యమానముచే ఇరవై అయిదు సంవత్సరములు గడచినవి (47).

శ్రీ శివ మహాపురాణములో రెండవదియగు రుద్ర సంహితయందు రెండవదియగు సతీఖండలో సతీశివక్రీడా వర్ణనమనే ఇరువది ఒకటవ అధ్యాయము ముగిసినది (21).

సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹

23 Nov 2020

గీతోపనిషత్తు - 82

🌹. గీతోపనిషత్తు - 82 🌹

✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🍀 20 . శ్రీ భగవానువాచ - కర్మమును గూర్చిన 12 సూత్రములను అనుసరించుచూ యజ్ఞార్థముగ కర్మలు నిర్వర్తించు జ్ఞాని సంగము, బంధము లేక యుండును. అతని కర్మ మెప్పటికప్పుడు విలీనమైపోవు చుండును. 🍀

📚. 4. జ్ఞానయోగము - 23 📚

గతసంగస్య ముక్తస్య జ్ఞానావస్థిత చేతసః |
యజ్ఞ యాచరతః కర్మ సమగ్రం ప్రవిలీయతే || 23

కర్మమును గూర్చిన 12 సూత్రములను అనుసరించుచూ యజ్ఞార్థముగ కర్మలు నిర్వర్తించు జ్ఞాని సంగము, బంధము లేక యుండును. అతని కర్మ మెప్పటికప్పుడు విలీనమైపోవు చుండును. చేయుచున్న కర్మలనుండి మరల కర్మబంధములు పుట్ట కుండుట, చేయుట యందలి జ్ఞానముగ గుర్తించవలెను. చేయుచున్న కర్మనుండి పుట్టిన ఫలితమునందు సంగము లేకుండుట వలన బంధముండదు. సంగమున్నచోట బంధ ముండును.

కర్మఫల సంగము బంధముగాని, కర్మ సంగము బంధము కాదని తెలియవలెను. శ్రీకృష్ణుడు తన జీవితమున ముందు తెలిపిన 12 కర్మ సూత్రములను పాటించి చూపిన యోగి. సర్వమూ తానై ఏమియు నంటని యోగేశ్వరు డతడు. అతడు జీవితమున తానుగా ఏదియు సంకల్పించలేదు. ఏదియును కోరలేదు, ఎవ్వరినీ ఆశ్రయించలేదు. కర్మఫలాసక్తి చూపలేదు. నిత్యతృప్తుడై జీవించెను.

ఆశ, పరిగ్రహము అనునవి కానరావు. యతచిత్తుడై ఎప్పుడునూ కర్మల నాచరించెను. నిత్యతృప్తుడై లభించినదానికి సంతసించెను. సర్వబుద్ధియై ద్వంద్వముల కతీతముగ జీవించెను.

అతడంతరమున మత్సరము లేదు. మహాభారత యుద్ధమంతయు అతని చేతుల మీదుగా నడచినది. సర్వము తననుండి నిర్వహింప బడి తనకేమియు నంటక నిలచిన మహాయోగి. భారత యుద్ధ మందు కర్మలంటని మరియొక యోధుడు లేడు. భీష్మ ద్రోణాదులు సహితము కర్మబద్దులే. పాండవులునూ కర్మబద్దులే.

శ్రీకృష్ణు డొక్కడే అందరిని అధిగమించి, ఏ కర్మమూ అంటక నిలచిన విశిష్ట పురుషుడు. అతని జీవితమే మరల మరల జ్ఞానయోగ సూత్రములకు మూలమని తెలియవలెను. కనుకనే అతడు “నాథు కర్మ ఫలము నందపేక్ష లేదు. నన్ను కర్మలంటవు" అని తెలిపినాడు.

సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹

23 Nov 2020

23-NOVEMBER-2020 MESSAGES

1) 🌹 శ్రీమద్భగవద్గీత - 557 / Bhagavad-Gita - 557 🌹
2) 🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 124, 125 / Vishnu Sahasranama Contemplation - 124, 125🌹
3)🌹. శ్రీ దేవీ మహత్యము - దుర్గా సప్తశతి - 42 / Sri Devi Mahatyam - Durga Saptasati - 42🌹 
4) 🌹. కఠోపనిషత్ వివరణ - చలాచలభోధ - 111🌹
5) 🌹 Guru Geeta - Datta Vaakya - 130 🌹
6) 🌹. గజానన్ మహరాజ్ జీవిత చరిత్ర - 117 / Gajanan Maharaj Life History - 117🌹
Last Part
7) *🌹. శ్రీ లలితా సహస్ర స్తోత్రము - 57 🌹* 
8) 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 104, 105, 106 / Sri Lalita Chaitanya Vijnanam - 104, 105, 106 🌹
9) 🌹. శ్రీమద్భగవద్గీత - 469 / Bhagavad-Gita - 469🌹

10) 📚. గీతోపనిషత్తు - సాంఖ్య యోగము - 82 📚
11) 🌹. శివ మహా పురాణము - 280🌹
12) 🌹 Light On The Path - 35🌹
13) 🌹. భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 167🌹
14) 🌹. శివగీత - 121 / The Siva-Gita - 121🌹* 
15) 🌹 Seeds Of Consciousness - 231 🌹   
16) 🌹. భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 106 🌹
17) 🌹. శ్రీ విష్ణు సహస్ర నామములు - 70 / Sri Vishnu Sahasranama - 70 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🌹. శ్రీమద్భగవద్గీత - 557 / Bhagavad-Gita - 557 🌹*
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ

*🌴. 16వ అధ్యాయము - దైవాసుర స్వభావములు - 24 🌴*

24. తస్మాచ్చాస్త్రం ప్రమాణం తే కార్యాకార్యవ్యవస్థితౌ |
జ్ఞాత్వా శాస్త్రవిధానోక్తం కర్మ కర్తుమిహార్హసి ||

🌷. తాత్పర్యం : 
కనుక ప్రతియొక్కరు శాస్త్రనియమముల ద్వారా కార్యమననేమో, అకార్యమననేమో అవగాహనము చేసికొనవలెను. అట్టి విధినియమములను తెలిసియే మనుజుడు కార్యము నొనరించవలెను. తద్ధ్వారా అతడు క్రమముగా ఉద్ధరింపబడగలడు.

🌷. భాష్యము :
పంచదశాధ్యాయమున తెలుపబడినట్లు వేదములందలి నియమ, నిబంధనలన్నియును శ్రీకృష్ణభగవానుని తెలియుట కొరకే ఉద్దేశింపబడినవి. 

కనుక మనుజుడు భగవద్గీత ద్వారా శ్రీకృష్ణభగవానునెరిగి భక్తియుతసేవలో మిమగ్నుడై కృష్ణభక్తిరసభావన యందు ప్రతిష్టితుడైనచో వేదవాజ్మయమొసగు జ్ఞానమునందు అత్యున్నత పూర్ణత్వమును బడసినట్లే యగును. శ్రీకృష్ణభగవానుని పొందుటకై ఉద్దేశింపబడిన ఈ మార్గమును శ్రీచైతన్యమహాప్రభవు అత్యంత సులభము గావించిరి. 

కేవలము హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే / హరే రామ హరే రామ రామ రామ హరే హరే యను మహామంత్రమును జపించుట, భక్తియుక్తసేవాకార్యమున నిమగ్నుడగుట, కృష్ణునకు అర్పించిన ఆహారమునే ప్రసాదరూపమున గ్రహించుట వంటి కర్మలను గావించుమని ఆయన జనులకు ఉపదేశించిరి.

 ఇట్టి భక్తికార్యములన్నింటి యందు ప్రత్యక్షముగా నియుక్తుడైనవాడు వేదవాజ్మయము నంతటిని అధ్యయనము చేసినవానిగా భావింపబడును. అట్టివాడు పరిపూర్ణావగాహనకు నిశ్చయముగా వచ్చినట్టివాడే. 
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Bhagavad-Gita as It is - 557 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj

*🌴 Chapter 16 - The Divine and Demoniac Natures - 24 🌴*

24. tasmāc chāstraṁ pramāṇaṁ te
kāryākārya-vyavasthitau
jñātvā śāstra-vidhānoktaṁ
karma kartum ihārhasi

🌷 Translation : 
One should therefore understand what is duty and what is not duty by the regulations of the scriptures. Knowing such rules and regulations, one should act so that he may gradually be elevated.

🌹 Purport :
As stated in the Fifteenth Chapter, all the rules and regulations of the Vedas are meant for knowing Kṛṣṇa. If one understands Kṛṣṇa from the Bhagavad-gītā and becomes situated in Kṛṣṇa consciousness, engaging himself in devotional service, he has reached the highest perfection of knowledge offered by the Vedic literature.

 Lord Caitanya Mahāprabhu made this process very easy: He asked people simply to chant Hare Kṛṣṇa, Hare Kṛṣṇa, Kṛṣṇa Kṛṣṇa, Hare Hare/ Hare Rāma, Hare Rāma, Rāma Rāma, Hare Hare and to engage in the devotional service of the Lord and eat the remnants of foodstuff offered to the Deity. 

One who is directly engaged in all these devotional activities is to be understood as having studied all Vedic literature. He has come to the conclusion perfectly. Of course, for the ordinary persons who are not in Kṛṣṇa consciousness or who are not engaged in devotional service, what is to be done and what is not to be done must be decided by the injunctions of the Vedas. 

One should act accordingly, without argument. That is called following the principles of śāstra, or scripture. Śāstra is without the four principal defects that are visible in the conditioned soul: imperfect senses, the propensity for cheating, certainty of committing mistakes, and certainty of being illusioned. 

These four principal defects in conditioned life disqualify one from putting forth rules and regulations. Therefore, the rules and regulations as described in the śāstra – being above these defects – are accepted without alteration by all great saints, ācāryas and great souls.
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 124, 125 / Vishnu Sahasranama Contemplation - 124, 125 🌹*
📚. ప్రసాద్ భరద్వాజ 

*🌻124. సర్వవిద్భానుః, सर्वविद्भानुः, Sarvavidbhānuḥ🌻*

*ఓం సర్వవిద్భానవే నమః | ॐ सर्वविद्भानवे नमः | OM Sarvavidbhānave namaḥ*

సర్వం వేత్తి ప్రతియొక్క దానిని / అంతటినీ ఎరుగువాడు. సర్వం విందతి సమస్తమును పొందియుండును లేదా తాను పొందవలసినది ఏదీ లేనివాడు. ఈ రెండు వ్యుత్పత్తులతోను భాతి ఇతి భానుః ప్రకాశించువాడు అనగా స్వయం ప్రకాశరూపుడు. ఈతడు సర్వవిదుడును, భానుడును.

:: కఠోపనిషత్ - ద్వితీయాధ్యాయము, 5వ వల్లి ::
నతత్ర సూర్యోభాతి న చన్ద్రతారకం, నేమా విద్యుతో భాన్తి కుతోఽయమగ్నిః ।
తమేవ భాన్త మనుభాతి సర్వం భాసా సర్వమిదం విభాతి ॥ 15 ॥

సూర్యుడు, చంద్రుడు, నక్షత్రములు, విద్యుత్తులు అక్కడ ప్రకాశింపవు. ఇక ఈ అగ్ని సంగతి చెప్పవలెనా? ఆ యాత్మ ప్రకాశించుటచే దానిని ఆశ్రయించుకొని మిగిలినవన్నియు భాసించుచున్నవి. ఆత్మ వెలుగుచే ఇదంతయు వెలుగుచున్నది.

:: భగవద్గీత - పురుషోత్తమప్రాప్తి యోగము ::
యదాదిత్యగతం తేజో జగద్భాసయతేఽఖిలమ్ ।
యచ్చన్ద్రమసి యచ్చాగ్నౌ తత్తేజో విద్ధి మామకమ్ ॥ 12 ॥

సూర్యుని యందు ఏ తేజస్సు ప్రపంచమునంతయు ప్రకాశింపజేయుచున్నదో, అట్లే చంద్రునియందును, అగ్నియందును ఏ తేజస్సుగలదో, అది యంతయు నాదిగా నెరుంగుము.

సశేషం... 
🌹 🌹 🌹 🌹 🌹 

*🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION - 124🌹*
📚. Prasad Bharadwaj

*🌻124. Sarvavidbhānuḥ🌻*

*OM Sarvavidbhānave namaḥ*

Sarvaṃ vetti / सर्वं वेत्ति He who knows all. Sarvaṃ viṃdati / सर्वं विंदति He who attains all or the One who has nothing to attain. He also shines Bhāti. So He is Sarvavit and Bhānuḥ.

Kaṭhopaniṣat - Part II, Canto II
Natatra sūryobhāti na candratārakaṃ, nemā vidyuto bhānti kuto’yamagniḥ ,
Tameva bhānta manubhāti sarvaṃ bhāsā sarvamidaṃ vibhāti. (15)

:: कठोपनिषत् - द्वितीयाध्याय, द्वितीय स्कन्ध ::
नतत्र सूर्योभाति न चन्द्रतारकं, नेमा विद्युतो भान्ति कुतोऽयमग्निः ।
तमेव भान्त मनुभाति सर्वं भासा सर्वमिदं विभाति ॥ १५ ॥

There the Sun does not shine, neither do the Moon and the stars; nor do these flashes of lightening shine. How can this fire? He shining, all these shine; through his lustre all these are variously illumined.

Bhagavad Gītā - Chapter 15
Yadādityagataṃ tejo jagadbhāsayate’khilam,
Yaccandramasi yaccāgnau tattejo viddhi māmakam. (12)

:: श्रीमद्भगवद्गीता - पुरुषोत्तमप्राप्ति योग ::
यदादित्यगतं तेजो जगद्भासयतेऽखिलम् ।
यच्चन्द्रमसि यच्चाग्नौ तत्तेजो विद्धि मामकम् ॥ १२ ॥

That light in the Sun which illumines the whole world, that which is in the Moon, and that which is in fire - know that light to be Mine.

🌻 🌻 🌻 🌻 🌻 
Source Sloka
सर्वगस्सर्वविद्भानु र्विष्वक्सेनो जनार्धनः ।वेदो वेदविदव्यंगो वेदांगो वेदवित्कविः ॥ १४ ॥

సర్వగస్సర్వవిద్భాను ర్విష్వక్సేనో జనార్ధనః ।వేదో వేదవిదవ్యంగో వేదాంగో వేదవిత్కవిః ॥ ౧౪ ॥

Sarvagassarvavidbhānu rviṣvakseno janārdhanaḥ ।Vedo vedavidavyaṃgo vedāṃgo vedavitkaviḥ ॥ 14 ॥

Continues....
🌹 🌹 🌹 🌹 🌹

*🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 125 / Vishnu Sahasranama Contemplation - 125🌹*
📚. ప్రసాద్ భరద్వాజ 

*🌻125. విష్వక్సేనః, विष्वक्‌सेनः, Viṣvaksenaḥ🌻*

*ఓం విష్వక్సేనాయ నమః | ॐ विष्वक्‌सेनाय नमः | OM Viṣvaksenāya namaḥ*

విష్వక్సేన, विष्वक्‌सेन, Viṣvaksena
సర్వేత్యర్థేఽవ్యయం విష్వక్ పలాయనార్ధకోఽoచతిః ।
పలాయనే దైత్యసేనా సర్వా దృష్ట్వైవ యం రణే ।
స విష్వక్సేన ఇత్యుక్త ఈశ్వరో దైత్యసూదనః ॥

ఎవని రణోద్యోగ మాత్రముననే అనగా యుద్ధమునకై పరాక్రమించుట మాత్రముచేతనే దైత్య సేన అన్ని దిశలందు పారిపోవునో అట్టివాడు విష్వక్సేనుడు.

:: పోతన భాగవతము - పంచమ స్కందము ::
సీ. తనదు విభూతులైన తనరిన యా దేవ బృందతేజశ్శౌర్య బృంహణార్థ

మై భగవంతుడు నాదిదేవుండును నైన జగద్గురుం డచ్యుతుండు

సరిలేని ధర్మవిజ్ఞాన వైరాగ్యాదు లయిన విభూతుల నలరి యున్న

యట్టి విష్వక్సేనుఁ డాదిగాఁ గలుగు పార్షదులతోఁ గూడి ప్రశస్తమైన

గీ. నిజవరాయుధ దోర్ధండ నిత్య సత్త్వు, డగుచు నా పర్వతంబుపై నఖిల లోక

రక్షణార్థంబు కల్పపర్యంత మతఁడు, యోగమాయా పరీతుఁడై యొప్పుచుండు.

ఆ లోకాలోక పర్వతం మీద ఆదిదేవుడు, జగద్గురుడు, భగవంతుడూ అయిన శ్రీమన్నారాయణుడు లోకాలను రక్షించడం కోసం యోగ మాయా సహితుడై కల్పాంత పర్యంతం ఉంటాడు. దేవతల సమూహమంతా శ్రీమన్నారాయణుని వైభవస్వరూపమే. ఆ దేవతల తేజస్సూ, పరాక్రమమూ విస్తరింపజేయడం కోసం విష్ణుభగవానుడు ధర్మం, జ్ఞానం, వైరాగ్యం అనే విభూతులతో ప్రకాశించే విష్వక్సేనుడు మొదలయిన పార్షదులతో కూడి చతుర్భాహువులలో శ్రేష్ఠమయిన ఆయుధాలు ధరించి ఆ పర్వతం మీద ప్రకాశిస్తాడు. 

సశేషం... 
🌹 🌹 🌹 🌹 🌹 

*🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION - 125🌹*
📚. Prasad Bharadwaj

*🌻125. Viṣvaksenaḥ🌻*

*OM Viṣvaksenāya namaḥ*

Sarvetyarthe’vyayaṃ viṣvak palāyanārdhako’aṃcatiḥ,
Palāyane daityasenā sarvā dr̥ṣṭvaiva yaṃ raṇe,
Sa viṣvaksena ityukta īśvaro daityasūdanaḥ.

सर्वेत्यर्थेऽव्ययं विष्वक् पलायनार्धकोऽअंचतिः ।
पलायने दैत्यसेना सर्वा दृष्ट्वैव यं रणे ।
स विष्वक्सेन इत्युक्त ईश्वरो दैत्यसूदनः ॥

Merely by whose preparation to enter battlefield, the army of demons gets scattered in all directions.

Śrīmad Bhāgavata - Canto 5, Chapter 20
Teṣāṃ svavibhūtīnāṃ lokapālānāṃ ca vividhavīryopabr̥ṃhaṇāya bhagavānparamamahāpuruṣo mahāvibhūtipatirantaryāmyātmano viśuddhasatvaṃ dharmajñānavairāgyaiśvaryādhyaṣṭamahāsiddhayupalakṣaṇaṃ viṣvaksenādibhiḥ svapārṣadapravaraiḥ parivārito nijavarāyudhopaṣobhitairnijabhujadarāḍaiḥ sandhārayamāṇastasmingirivare samantātsakalalokasvastaya āste. (40)

:: श्रीमद्भागवते पञ्चमस्कन्धे विंशोऽध्यायः ::
तेषां स्वविभूतीनां लोकपालानां च विविधवीर्योपबृंहणाय भगवान्परममहापुरुषो महाविभूतिपतिरन्तर्याम्यात्मनो विशुद्धसत्वं धर्मज्ञानवैराग्यैश्वर्याध्यष्टमहासिद्धयुपलक्षणं विष्वक्सेनादिभिः स्वपार्षदप्रवरैः परिवारितो निजवरायुधोपषोभितैर्निजभुजदराडैः सन्धारयमाणस्तस्मिन्गिरिवरे समन्तात्सकललोकस्वस्तय आस्ते ॥ ४० ॥

The Supreme God is the master of all transcendental opulences and the master of the spiritual sky. He is the Supreme Person, Bhagavān, the Supersoul of everyone. The gods, led by Indra, the King of heaven, are entrusted with seeing to the affairs of the material world. To benefit all living beings in all the varied planets and to increase the power of those elephants and of the gods, the Lord manifests Himself on top of that mountain in a spiritual body, uncontaminated by the modes of material nature. Surrounded by His personal expansions and assistants like Viṣvaksena, He exhibits all His perfect opulences, such as religion and knowledge, and His mystic powers such as aṇimā, laghimā and mahimā. He is beautifully situated, and He is decorated by the different weapons in His four hands.

🌻 🌻 🌻 🌻 🌻 
Source Sloka
सर्वगस्सर्वविद्भानु र्विष्वक्सेनो जनार्धनः ।वेदो वेदविदव्यंगो वेदांगो वेदवित्कविः ॥ १४ ॥

సర్వగస్సర్వవిద్భాను ర్విష్వక్సేనో జనార్ధనః ।వేదో వేదవిదవ్యంగో వేదాంగో వేదవిత్కవిః ॥ ౧౪ ॥

Sarvagassarvavidbhānu rviṣvakseno janārdhanaḥ ।Vedo vedavidavyaṃgo vedāṃgo vedavitkaviḥ ॥ 14 ॥

Continues....
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. శ్రీ దేవీ మహత్యము - దుర్గా సప్తశతి - 42 / Sri Devi Mahatyam - Durga Saptasati - 42 🌹*
✍️. మల్లికార్జున శర్మ 
📚. ప్రసాద్ భరద్వాజ 

*అధ్యాయము 11*
*🌻. నారాయణీ స్తుతి - 6 🌻*

48. ఓ సురలారా! నేనప్పుడు మళ్ళీ వర్షాలు కురిసే దాక, లోకమంతటిని నా శరీరం* నుండి ఉత్పత్తి అయిన ప్రాణాలు నిలుపగల కాయగూరలతో పోషిస్తాను.

49. అప్పుడు నేను భూమిపై 'శాకంభరి' అనే పేర విఖ్యాతి చెందుతాను. అదే కాలంలో దుర్గముడు అనే మహారాక్షసుణ్ణి నేను వధిస్తాను.

50–52. అందుచేత నాకు దుర్గాదేవి అనే సుప్రసిద్ధ నామం కలుగుతుంది. మళ్ళీ హిమాలయ పర్వతంపై భయంకర రూపాన్ని దాల్చి మునిజన సంరక్షణార్థం నేను రాక్షసులను క్షయమొందిస్తాను. 

అంతట మునులెల్లరూ భక్తితో శరీరాలను వంచి నన్ను స్తుతిస్తారు, అందుచేత నాకు 'భీమాదేవి' అనే విఖ్యాత నామం సిద్ధిస్తుంది. 

53. అరుణుడు అనే రక్కసుడు ముల్లోకములకు మహాబాధ కలిగించినప్పుడు నేను లెక్కలేనన్ని భ్రమరము (తుమ్మెద)లతో కూడిన భ్రమరరూపాన్ని ధరించి ముల్లోకాల మేలు కొరకు ఆ మహాసురుణ్ణి వధిస్తాను.

54-55. అంతట లోకమంతా నన్ను 'భ్రామరి' అను పేర కీర్తిస్తారు. ఇలా రక్కసుల రాక వల్ల బాధ ఎప్పుడెప్పుడు కలుగుతాయో, అప్పుడెల్ల నేను అవతరించి శత్రువినాశం చేస్తాను.”

శ్రీ మార్కండేయపురాణమందలి సావర్ణిమన్వంతరంలో "దేవీ మాహాత్మ్యము" లోని "నారాయణీస్తుతి" అనే ఏకాదశాధ్యాయము సమాప్తం.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Sri Devi Mahatyam - Durga Saptasati - 42 🌹*
✍️. P. R. Ramachander
📚 Prasad Bharadwaj

*CHAPTER 11* 
*🌻 Hymn to Narayani - 6 🌻*

48. 'At that time, O devas, I shall maintain the whole world with life -sustaining vegetables, born out of my own (cosmic) body, till rains set in.

49. 'I shall be famed on the earth then as Sakambhari. At that very period I shall slay the great asura named Durgama.

50-53. 'Thereby I shall have the celebrated name of Durgadevi and again, assuming a terrible form on the mountain Himalaya, I shall destroy the rakshasas for the protection of the munis. 

Then all the munis, bowing their bodies reverently, shall praise me, and thereby I shall have the celebrated name of Bhimadevi. 

When the (asura) named Aruna shall work great havoc in the three worlds, having taken a (collective) bee-form, consisting of innumerable bees, I shall slay the great asura for the good of the world. 

54-55. 'And then people shall laud me every where as Bhramari. Thus whenever trouble arises due to the advent of the danavas, I shall incarnate and destroy the foes.' 

Here ends the eleventh chapter called 'Hymn to Narayani' of Devi-mahatmya in Markandeya Purana, during the period of Savarni, the Manu. 

Continues....
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. కఠోపనిషత్‌ వివరణ - చలాచలభోధ - 110 🌹*
✍️. సద్గురు శ్రీ విద్యాసాగర్ 
📚. ప్రసాద్ భరద్వాజ

*🌻. ఆత్మను తెలుసుకొను విధము -40 🌻*

అలా చేసుకోకుండా గుణత్రయాలను దాటి, సర్వసాక్షిత్వాన్ని ఆశ్రయించి, ఆ లక్ష్యాన్ని పొందాలని, ప్రత్యగాత్మ స్థితిలో నిలకడ చెంది ఉందాలి అని, ఉత్తమమైనటువంటి లక్ష్య సాధనను స్వీకరించి, ఈ సత్వగుణాన్ని కూడా తప్పక దాటాలి. ఇది కూడా తమోగుణావస్థ వంటి నిద్రావస్థ వంటిదే! నిద్ర ఎంతసేపు పోతాడు? సంతృప్తి కలిగేంత వరకూ పోతాడు. ఇంకా తరువాత పడుకుంటే ఒళ్ళు నొప్పులు వస్తాయి. 

ఇంకా పడుకుంటే ఇంకా తీవ్రమైన అనారోగ్యం వస్తుంది. అట్లాగే ఈ సత్వగుణాన్ని కూడా మనము ఒక నిద్రపోయేటప్పుడు దుప్పటి అవసరమా? కాదా? అంటే, ఎంతవరకూ అవసరం? దుప్పటిని విదిలించి మెలకువలోనికి ఎట్లా వచ్చేస్తున్నాము. 

అట్లాగే ఈ సత్వగుణం అనేటటువంటి దుప్పటిని తీసి అవతల పారేయాలి. ఈ ఆవరణను తొలగించుకోవాలి. ఈ ఆశ్రయాన్ని విడవాలి. విడిచి ‘స్వస్వరూప ఆత్మసాక్షాత్కార జ్ఞానంలో నిలవాలి’ అనేటువంటి ఉత్తమ ఉపదేశాన్ని ఇక్కడ యమధర్మరాజు గారు నచికేతునకు అందిస్తున్నారు.
హరిః ఓం

ప్రశ్న: స్వామీ, శ్రవణ మననాలు రెండు సాధనాలు. వాటి రిజల్ట్ [result] నిధి ధ్యాసలు అని విన్నాను స్వామి. తప్పా అండి అది?

సమాధానం: వాటిలో కలిగేటటువంటి పరిణామ ఫలం నీ అంతరిక పరిణామ ఫలం ఏదైతే వుంటుందో అది నిధి ధ్యాసలుగా మారుతుంది. నిజానికి సాధనాస్థితులలో ఆ నాలుగు స్థితులే. కానీ శ్రవణ మననాలే సరిగ్గా లేకపోతె నిధి ధ్యాసలు రావు కదా! 

దీనికి ఒక ఉదాహరణ చెపుతా చూడు. నీవు.. నేను మనిషిని, నేను మనిషిని, నేను మనిషిని అనుకొంటూ జీవిస్తావా? అనుకోవడం లేదుగా? మనిషిగా సహజంగా జీవిస్తావు. మరి సహజంగా ఎలా వున్నావు? శ్రవణం చేశావా? మననం చేశావా? లేదే? సహజంగా నిధి ధ్యాసలలోనే వున్నావుగా! మరి సహజంగా నేను ఆత్మ స్వరూపుడుగా వుండాలిగా! మరి ఉండడం లేదుగా. ఎందువల్ల? శరీరం నేను అనేటటువంటి పద్ధతిగా సహజం అయ్యావు కాబట్టి.

        కాబట్టి ఇప్పుడు మరలించాలి అంటే ఏమి చెయ్యాలి? నేను ఆత్మ స్వరూపుడు అనే భావాన్ని శ్రవణ మననాదుల ద్వారా అందించాలి. అందిస్తే, చేయగా, చేయగా, చేయగా.. కొంత కాలానికి ఏమైపోతుంది నీకు. నీ నామ రూపాలని నీవు మరచిపోతావు. నీ శరీరం నేను అనే భావన నుంచి మరచిపోతావు. మరచిపోయి క్రొత్తగా ప్రవేశపెట్టింది ఏమిటి ఇప్పుడు? నేను ఆత్మ స్వరూపుడు అనే భావాన్ని ప్రవేశపెట్టావు. ఆ భావనలో సహజం అయిపోతావు. ఎప్పుడైతే అందులో ఆ స్థితిలో సహజం అయిపోయావో అప్పుడు ఏమైంది? పాత్రోచితమైనటువంటివి కదా! .

నేను భార్యని, నేను అత్తగారిని, నేను అమ్మ గారిని, నేను స్త్రీ ని, నేను పురుషుడను ఇవన్నీ శరీర గతమైనటువంటి సంబంధోచితమైనటువంటివి. అంతే కదా! మరి అప్పుడు ఇవేవి సత్యం కాదు అని ఎవరు చెప్పక్కర్లేదు. నేను ఆత్మస్వరూపుడు అన్న భావనలో నువ్వు స్థిరం అయిపోతే నిధి ధ్యాసలుగా మారిపోయింది.

        ఇప్పుడు సదా ఎక్కడ ఉంటావు అంటే, దృష్టి భ్రూమధ్యం నుంచి సహస్రారానికి, సహస్రారం నుంచి భూమాకి ప్రయాణం చేస్తుంది. ఆ ద్వాదశాంతం అయినటువంటి భూమా స్థితిలో సహజంగా నిలకడ కలిగి వున్నటువంటి వాడికి శరీర స్ఫురణ కలుగడం లేదు. శరీరగత సంబంధాల యొక్క స్ఫురణ కలుగడం లేదు. సదా సమాధి నిష్ఠుడై ఉంటాడు. 

మరి ఆ సమాధి నిష్ఠలో ఏమి ఉనాయి అంటే నిధి ధ్యాసలే ఉన్నాయి. మరి ఆ నిధి ధ్యాస వరకు వెళ్ళాలిగా! శ్రవణ మననాదులను, నిధి ధ్యాసలు అయ్యేటట్లుగా చెయ్యాలిగా! ఆ షడ్ విధ సమాధి నిర్ణయాన్ని పొందాలిగా! ఆ సమాధికి అవతల ఉన్నటువంటి స్థితిలో నిలకడ కలిగి వుండాలి గా! ఆ స్థితి వలన నీవు ఆత్మ సాక్షాత్కార జ్ఞానాన్ని పొందవచ్చు. 

నీవు ఆత్మ నిష్ఠుడవు, బ్రహ్మ నిష్ఠుడవు, పరబ్రహ్మ నిర్ణయాన్ని పొందేటటువంటి అంతర్ముఖ ప్రయాణాన్ని సమాధి నిష్ఠ అనే పునాది గానే పూర్తి చేయాలి. వేరే మార్గం లేదు. కాబట్టి సమాధి నిష్టను పొందడం, బాహ్యం నుంచి విరమించినపుడు ఉత్తమమైన లక్ష్యముగా స్వీకరించాలి. మరలా అక్కడ నుంచి తదుపరి ప్రయాణన్ని పూర్తి చేయాలి.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹 Guru Geeta - Datta Vaakya - 131 🌹*
✍️ Sadguru Ganapathi Sachidananda
📚. Prasad Bharadwaj
123

Now, they are talking about where we should visualize the Guru as residing while meditating upon him.

Sloka:
Hrdambuje karnika madhya samsthe simhasane samsthita divyamurtim | Dhyayedgurum candrakala prakasam saccit sukhabhista varam dadanam ||

We should meditate upon the Sadguru visualizing him as one in a divine form, who is seated on the throne situated on the elevated part of our lotus like heart, shining with the splendor of the moon and granting us the boon of eternal bliss. 

Next, they describing with what colors and decorations one should visualize the form of the Guru, who is the source of self-realization. 

Sloka:
Svetambaram sveta vilepa puspam mukta vibhusam muditam trinetram | Vamanka pitha sthita divyasaktim 
mandasmitam sandra krpa nidhanam ||

One should meditate on the Guru who is the image of Siva, who has donned white clothes, applied white sandalwood paste, is decked in a garland of white flowers and in ornaments made of pearls, is happy, has the divine power seated on his left thigh, is ever-smiling and is an ocean of compassion.

It doesn’t mean the Guru should always appear as described in the Sloka. Since our Guru described in the Guru Gita, we should not ask the Guru to come dressed in white clothes and white pearls, or that he erase the dark decoration on his forehead and apply white sandal paste instead. If you say that, you’ll receive a good smacking. 

It means that he is not bound by any rules. However, there are hidden meanings behind whatever he is wearing. He may wear different footwear, wear different colored robes, or adorn himself with different kinds of sandalwood paste. All these have a hidden meaning. We should observe carefully. 

For instance, ochre robes indicate sacrifice and righteousness. The white flowers symbolize the fragrance and beauty of dharma combined with truth. The white sandalwood paste shows the state that’s beyond the dualities of passion and hatred. Did you see how much meaning there is in what he’s wearing? 

Continues....
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. శ్రీ గజానన్ మహరాజ్ జీవిత చరిత్ర - 115 / Sri Gajanan Maharaj Life History - 115 🌹*
✍️. దాసగణు స్వామి
📚. ప్రసాద్ భరద్వాజ

*🌻. 21వ అధ్యాయము - 3 🌻*
*చివరి భాగం*

శ్రీమహారాజు ఒకరోజు మధ్యాహ్నం సమయంలో ఒక ఆస్తికుని వేషంలో అతని దగ్గరకు వెళ్ళి, రామచంద్రపాటిల్ను బయటకు పిలిచి, తినడానికి ఏదయినా ఆహారం ఇమ్మని అడిగారు. రామచంద్ర పవిత్రుడు అవడంతో శ్రీగజానన్ మహారాజులా కనిపిస్తున్న ఆ ఆస్తికుని పిలుపువిని గుమ్మం దగ్గరకు వచ్చాడు. ఆ ఆస్తికుని చేతిని అతను గౌరవ పూర్వకంగా పట్టుకుని, ఇంటిలోకి తీసుకువచ్చి కూర్చునేందుకు పీట ఇచ్చాడు. 

తరువాత ఆయన పాదాలకు పూజ అర్పించి చేతులు కట్టుకుని ఆయన ముందునిలబడ్డాడు. అటుపిమ్మట... ఓ కుర్రవాడా ఒకవిషయం చెప్పడానికి నేను ప్రత్యేకంగా ఈరోజు ఇక్కడకు వచ్చాను, జాగ్రత్తగా విను. నీ అప్పుల గురించి చింతించకు. త్వరలో అవి చెల్లించబడతాయి. గోదావరినది ఎండాకాలంలో కొద్దిగా ఎండుతుంది అని గుర్తుంచుకో. 

కానీ శ్రీహరి, వానలాటి దీవెనల వల్ల నీకు అభివృద్ధి వరదలాగా వస్తుంది. నేను ఎక్కడయితే భోజనం చేస్తానో ఆఇంటిలో దేనికీ కొరవ ఉండదు. నాకోసం తినడానికి స్వాధిష్టమయిన భోజనం పళ్ళెం నిండా తీసుకునిరా, నీకు ఇష్టమయితే కొన్నిబట్టలు నాకు ఇవ్వు. అడిగేవాళ్ళు పవిత్రులు అయి ఉంటే, వాళ్ళు అడిగిన పూజలు, ఆహారం, ధనం అర్పిస్తే కనుక అవి తప్పనిసరిగా భగవంతుని చేరతాయి అని ఆ ఆస్తికుడు అన్నారు. 

రామచంద్ర పళ్ళెంనిండా కమ్మని భోజనం తీసుకురాగా ఆ ఆస్తికుడు సంతోషంగా అది తిన్నారు. ఆతరువాత పాటిల్ 5/ రూపాయలు ఆయనకు దక్షిణ ఇవ్వబోయాడు. అప్పుడు నాకు దక్షిణ అవసరంలేదు, శ్రీగజానన్ మహారాజు మందిర యాజమాన్యం పని నిన్ను స్వీకరించమని అడగడానికి వచ్చాను, నువ్వు శ్రీమహారాజుకు సేవచెయ్యడం అనే దక్షిణ నాకు ఇస్తే నేను సంతోషిస్తాను. 

ప్రస్తుతం ఈపనికి నీకంటే సామర్ధ్యం గల వాడు ఎవరూ నాకు కనబడటం లేదు, నాకు ఈ దక్షిణ ఇస్తే అనారోగ్యంతో బాధపడుతున్న నీ భార్య నయమవుతుంది, మీపిల్లవాడిని పిలువు, నేను అతని మెడలో ఒక తాయత్తు కడతాను దానివల్ల క్షుద్రశక్తులు అతని నుండి దూరంగా ఉంటాయి. 

ఈ అధికారిగా పనిచేయడం అనే ఉద్యోగం కష్టమయినది. ఎందుకంటే నీవాళ్ళే ఒక్కోసారి నీకు ఎదురు తిరగవచ్చు. ఇది పులిచర్మం వేసుకున్నటు వంటిది. జాగ్రత్తగా ఉపయోగించాలి. మనసులో ఈర్ష్య పెట్టుకోకు. నిజాయితీకి నిలబడు, ఎప్పుడూకూడా రాజశ్రేయస్సుకు భంగం కలిగే పనిచెయ్యవద్దు. మునులకు, యోగులకు సరి అయిన ఆదరంఇస్తూ, కపటి యోగులనుండి దూరంగా ఉండు. ఈ నియమాలు పాటిస్తే భగవంతుడు ఎప్పుడూ నిన్ను దీవిస్తాడు. 

నీఖర్చులు ఎప్పడూ నీఆదాయం పరిధిలో ఉండేలాగా చూసుకో, కానీ లేని ఆడంబరానికి పోకు. మునులు, యోగులను రిక్తహస్తాలతో ఇంటిదగ్గరనుండి వెళ్ళకుండా చూడు. నిజమయిన యోగులకు అవమానం అయితే భగవంతునికి కోపంవస్తుంది. కాబట్టి నిజమయిన యోగులను ఎప్పుడూ ప్రేమించు. 

నీ రక్త సంబంధీకులకు ఎప్పుడూ హాని చెయ్యడానికి ఆలోచించకు. మిగిలిన బంధువులకుకూడా ఆనవాయితీ ప్రకారం ఆదరణచెయ్యి. ఒకవేళ కోపం అంటూవస్తే అది పైకేతప్ప లోపల (పనసపండులా) పూర్తి ప్రేమతో నిండి ఉండాలి. నేను ఎప్పుడూ నీతో ఉంటానని గుర్తుంచుకో అని ఆ ఆస్తికుడు అన్నారు. మెడలో తాయత్తు కట్టిన తరువాత ఆ ఆస్తికుడు బయటకు వెళ్ళి అకస్మాత్తుగా అంతర్ధానం అయ్యారు. 

జరిగిన సంగతి గురించి పాటిల్ రోజంతా విచారించి, ఆ ఆస్తికుడు వేరే ఎవరో కాదు స్వయంగా శ్రీగజానన్ మహారాజే తనకు సలహా ఇచ్చేందుకు ఆ ఆస్తికుని వేషంలో వచ్చారు అన్న నిర్ణయానికి వచ్చాడు. ఆరోజు రాత్రి శ్రీమహారాజు అతని కలలో కనబడి సందేహాలు అన్నీ తీసివేస్తారు. శ్రీగజానన్ మహారాజుకు తన భక్తుల ఎడల అపారమైన అనుబంధం ఉంది. 

శ్రీమహారాజు యొక్క జీవిత చరిత్ర చాలా పవిత్రమయినది మరియు మానవాళిని రక్షించేది. కానీ దీనిని అనుభూతి పొందడానికి అచంచలమైన విశ్వాసం అవసరం. 

సమాప్తం.... 
జై శ్రీ గజానన్ మహరాజ్ 🙏
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Sri Gajanan Maharaj Life History - 115 🌹* 
✍️. Swamy Dasaganu 
📚. Prasad Bharadwaj

*🌻 Chapter 21 - part 3 🌻*
*Last Part*

At one noon time, Shri Gajanan Maharaj went to him in the garb of an ascetic, and calling Ramchandra Patil out, asked for some food to eat. Ramchandra, being a pious man, came to the door at that call of the ascetic and noticed that He looked like Shri Gajanan Maharaj. 

He, respectfully, holding the hand of that ascetic brought him into the house and gave a 'Pata' to sit on. Then Ramchandra offered Puja at his feet and stood before him with folded hands. 

Thereupon the ascetic said, O boy, I have especially come here today to tell you something. Listen carefully; don't worry about your debts. They will be repaid soon. Remember that the river Godavari dries up a bit in the summer. But with the rain of blessings from Shri Hari, there will be a flood of prosperity for you. 

Wherever I take food, that house will never be short of anything. Therefore, bring a dish full of delicious food for me to eat. If you like, give me some clothing also. Worship, food and monetary offering given to one, who asks for it, undoubtedly reaches God, provided He is really a pious person. 

Ramchandra brought a Thali full of delicious food and the ascetic happily ate it. Then Patil offered him Rs. Five as Dakshina. Thereupon the ascetic said, I don't want this Dakshina. I have come today to ask you to take up the management of Shri Gajanan Maharaj Temple. 

I shall be happy if you give me the Dakshina of 'Service to Shri Gajanan Maharaj '. At present, I don't see anybody more suitable than you for this work. Your ailing wife will regain her health by giving me this Dakshina. Call your son, and I will tie a holy ‘talisman’ around his neck, so that the evil spirits will keep away from him. 

This executive job of yours is a difficult one, as your own people, at times, turn against you; it is like a covering of tiger’s skin. Use it carefully, don't have jealous mind and stick to honesty. Never do anything that goes against the interest of the king. 

Give proper respect to sages and saints and keep away from the hypocrites. If you observe these principles, God will always bless you. Keep your expenditure within the limits of your income and never feign to be what you are not. Sages and saints should not be allowed to go empty handed from your doors. 

The insult of a real saint angers God. So always love the real saints. Never think of harming your blood relations and give other relatives traditional respects as per established practice. If at all you get angry, it should only be superficial, with full love inside like a jack fruit. Remember, that I am always with you.” 

After tying the talisman round his neck, the ascetic went out and suddenly disappeared. Patil thought over what happened the whole day and came to the conclusion that the ascetic was none other than Shri Gajanan Maharaj, who had, himself, come in the garb of an ascetic to advise him. 

The same night, Shri Gajanan Maharaj appeared in his dream and removed all the doubts. Shri Gajanan Maharaj has great attachment for his devotees. 

This biography of Shri Gajanan Maharaj is most pious and a savior for humanity, but it requires unshakable faith to experience it. 

The End.. 
Jai Gajanan Maharaj 🙏
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. శ్రీ లలితా సహస్ర నామ స్తోత్రము - 57 / Sri Lalitha Sahasra Nama Stotram - 57 🌹*
*ప్రసాద్ భరద్వాజ*

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 104, 105, 106 / Sri Lalitha Chaitanya Vijnanam - 104, 105, 106 🌹*
*సహస్ర నామముల తత్వ విచారణ*
✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్ 
సేకరణ : ప్రసాద్ భరద్వాజ 
మూల మంత్రము : 
*🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁*

*🍀. పూర్తి శ్లోకము :*
*ఆజ్ఞా చక్రాంతరాళస్థా, రుద్రగ్రంథి విభేదినీ |*
*సహస్రారాంబుజా రూఢా, సుధాసారాభి వర్షిణీ ‖ 39 ‖*

*🌻 104. 'రుద్రగ్రంథి విభేదినీ' 🌻*

రుద్రగ్రంథి ద్వయమును విశేషముగ భేదించునది శ్రీదేవి యని అర్థము.

స్వాధిష్ఠానమున బ్రహ్మగ్రంథి భేదనము, మణిపూరకమున విష్ణు గ్రంథి భేదనము తెలుపబడినవి. రుద్రగ్రంథి భేదనము అనాహత చక్రమున జరుగును. పంచభూతములలో భూమి, జలము బ్రహ్మ గ్రంథిచే నియమింపబడును. అగ్ని, దాని తేజస్సు విష్ణుగ్రంథిచే నియమింప బడును.

వాయువు, ఆకాశము రుద్రగ్రంథిచే నియమింప బడును. రుద్ర గ్రంథిని భేదించుట యనగా వాయువును ఆకాశమున చేర్చి, ఆకాశ తరంగములను దాటి చిదానంద స్థితిని చేరుట. శరీరము పంచభూతాత్మకము. అందు జీవుడు వసించి యుండును. 

పంచభూతములకు మూలము ఆకాశమే. ఆకాశము నుండి వాయువు, వాయువు నుండి అగ్ని (తేజస్సు), దాని నుండి జలము, దాని నుండి భూమి పుట్టుచున్నవి. వీనియందు ఉపస్థితుడైన జీవుడు క్రమముగ వీనిని దాటుటయే గ్రంథి భేదనము. 

శ్రీదేవి మొదట త్రిగుణాత్మికయై అందుండి పంచభూతములను సృష్టించినది. త్రిగుణములు పంచభూతములు కలిసి ఎనిమిది స్థానముల నేర్పరచినది. అవియే అష్ట ప్రకృతులు. అందు జీవుని ప్రవేశింపజేసి సృష్టి నిర్మాణము పూర్తి చేయును. ఆరోహణ క్రమమున జీవుడు, అమ్మ అనుగ్రహము ద్వారా వీటిని మరల దాటి స్వతంత్రుడై సృష్టి వైభవమును పొందును.

భూమి, జలముల కేంద్రములు మూలాధారము, స్వాధిష్ఠానము. అచట జీవుని నియమించునది బ్రహ్మగ్రంథి. మణిపూరకము అగ్ని స్థానము, భావమయ స్థానము. అచ్చట జీవుని నియమించునది విష్ణుగ్రంథి. అనాహతము, విశుద్ధి వరుసగా వాయువు, ఆకాశమునకు సంబంధించిన కేంద్రములు. వీనిని నిర్వర్తించునది రుద్రగ్రంథి. ఆజ్ఞ యందు జీవుడు స్వస్వరూపుడు, త్రిగుణాత్మకుడు మరియు విదేహుడు.

అనగా పంచభూతములతో కూడిన దేహము లేనివాడు. ఇతనినే హంస స్వరూపుడందును. విష్ణుగ్రంథి భేదన సమయమున జీవుడు తనయందు విష్ణువే స్వరూపము కొనియున్నాడని, భౌతిక దేహము తన విష్ణు రూపమునకు కవచమని తెలిపితిమి. రుద్రగ్రంథి భేదనమున నిజమునకున్నది విష్ణువే యనియు, తాను కాదనియు తెలియును. 'విశ్వం విష్ణుః' అను సత్యము దర్శనమగును.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 104 🌹*
*1000 Names of Sri Lalitha Devi* 
✍️. Ravi Sarma 
📚. Prasad Bharadwaj

*🌻 Rudragranthi-vibhedinī रुद्रग्रन्थि-विभेदिनी (104) 🌻*

She breaks the Rudra granthi and proceeds to sahasrāra. This is the last of the three knots. It has already been seen that Pañcadaśī mantra has three kūṭa-s and each kūṭa ends with hrīṃ (ह्रीं).  

Therefore, Pañcadaśī mantra has three hrīṃ-s. Each hrīṃ represents one granthi or knot. The bīja hrīṃ represents the candra kalā, (divisions of moon) whereas the other bīja-s in each of the kūṭa-s represent agni (fire), sun and moon (Please refer details at the end of nāma 84). 

 Once this granthi is crossed, Kuṇḍalinī reaches sahasrāra where she unites with Śiva. However, there are minor cakra-s in between ājñā and sahasrāra. The union of Śiva and Śaktī is represented by the bījā hrīṃ. Pañcadaśī mantra represents only the six cakra-s and three granthi-s.  

It does not mention about sahasrāra, which is beyond the subtler (kāmakalā) and subtlest (Kuṇḍalinī) forms of Lalitāmbikā. Once this last granthi is passed over, all the vāsana-s (impressions) go away leading to supreme knowledge. Till this point Kuṇḍalinī had to cross too many resistances to reach Her final destination.  

In the next nāma Her destination is explained. During the last leg of one’s journey to his domicile, (for example the flight is about to land) one always feels the happiness of seeing his dear ones.  

This is the sort of happiness She derives at this stage. She grants whatever boons one asks for at this cakra.

Continues....
🌹 🌹 🌹 🌹 🌹

*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 105 / Sri Lalitha Chaitanya Vijnanam - 105 🌹*
*సహస్ర నామముల తత్వ విచారణ*
✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్ 
సేకరణ : ప్రసాద్ భరద్వాజ 
మూల మంత్రము : 
*🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁*

*🍀. పూర్తి శ్లోకము :*
*ఆజ్ఞా చక్రాంతరాళస్థా, రుద్రగ్రంథి విభేదినీ |*
*సహస్రారాంబుజా రూఢా, సుధాసారాభి వర్షిణీ ‖ 39 ‖*

*🌻 105. 'సహస్రారాంబుజారూఢా' 🌻*

వేయి సంఖ్యల దళములు గల పద్మము అధిష్ఠించియున్న శ్రీదేవి అని అర్థము.

సహస్ర అను పదము సంకేత పదము. అది మంత్రము కూడ. 'స' అను అక్షరము పరతత్త్వమునకు సంకేతము. 'హ' అను అక్షరము పరాశక్తికి సంకేతము. 'స్ర' అను అక్షరము అగ్నిబీజము. ఆధారముగ నేర్పడిన సృష్టియని అర్థము. 

ఈ మంత్రము యొక్క రహస్యార్థము, సహస్రారకమల దర్శనులకు మాత్రమే తెలియగలదు. అత్రి ఆదిగాగల మహర్షులు ఈ మంత్రశక్తి నెరిగియున్నారు. సమస్త సృష్టి స్థితి లయ కార్యములు అవగతమై తమవంతు కర్తవ్యము నిర్వర్తించు శ్రీదేవి పరమ భక్తులకే ఈనామ రహస్యము తెలియగలదు. ఇతరులు తెలియలేరు.

ఈ మంత్ర రహస్యము తెలిసినవారు త్రిగుణముల కాధారమైన మూలశక్తిని తెలిసినవారే. మూల ప్రకృతిని తెలిసినవారే. అత్రి మహర్షి అనసూయత్వము ఆధారముగ సాగించిన తపస్సు ఫలముగ ఈ మంత్ర రహస్యము నెరిగినారు. 

అతడు శాంతివంతుడు, క్రతుక్రియానిష్ఠుడు, సత్త్వగుణోపేతుడు, శ్రద్ధావంతుడు మరియు కళావంతుడును. అతని యందు శ్రీదేవి పదహారు కళలు భాసించును. అనసూయాదేవి అత్రి మహర్షిని ఆరాధించి జగన్మాత స్థితిని పొందినది. త్రిగుణాతీతులే సహస్ర దళ పద్మమున స్థితికొనగలరు.

'సహస్ర' అను నామమునకు వేయి (1,000) అని అర్థము. వేయి అనగా మూడు లోకముల కవ్వలి తత్త్వము అని అర్థము. తత్త్వ మొకటియే. అది ఆధారముగ సువర్లోకము, భువర్లోకము, భూలోకము ఉద్భవించినవి. 

సహస్రార దళ పద్మమందు శ్రీదేవి యున్నదనగా ఆమె లోకాతీత, గుణాతీత యని అర్థము. అది పరమ పదము. అచట దేవి శివుని కూడియుండును. శివ తత్త్వము నాధార ముగ సమస్త సృష్టియు త్రిగుణముల ద్వారా ఏర్పరచి మూలాధార చక్రము వరకును వ్యాపించును.

 ఈ మొత్తము మార్గమంతయు అమ్మ చైతన్యమార్గమే. ఈ మార్గమున అమ్మ నిరాటంకముగ ఆరోహణము, అవరోహణము చేయుచు నుండును. ఆమె స్వస్థానము సహస్రారము.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 105 🌹*
*1000 Names of Sri Lalitha Devi* 
✍️. Ravi Sarma 
📚. Prasad Bharadwaj

*🌻Sahasrārambujārūḍhā सहस्राराम्बुजारूढा (105) 🌻*

She has now reached Her destination, the sahasrāra, where Śiva is waiting for Her. Sahasrāra is just below the brahmarandhra, an orifice in the skull that connects to cosmos (The existence of this orifice has not been medically proved.  

Perhaps this is like the pores that exist in our skin through which sweat comes out. But one can distinctly feel the cosmic connection through this orifice). The union of Śiva and Śaktī takes place at sahasrāra. The sādhaka, who all along was worshipping only the Śaktī, begins to worship Her along with Her creator, Śiva.  

There are fifty alphabets in Sanskrit (in another version it is fifty one including one more ḻa ळ). Based on these alphabets and multiplying this fifty by numeric twenty (made up of five basic elements, five karmendriya-s, five jñānendriya-s and five tanmātra-s) one thousand is arrived.  

This one thousand is said to be the number of psychic petals of an imaginary lotus flower in sahasrāra. 

Please refer ‘further reading on Sanskirt letters’ at the end of nāma 833).

Continues....
🌹 🌹 🌹 🌹 🌹

*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 106 / Sri Lalitha Chaitanya Vijnanam - 106 🌹*
*సహస్ర నామముల తత్వ విచారణ*
✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్ 
సేకరణ : ప్రసాద్ భరద్వాజ 
మూల మంత్రము : 
*🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁*

*🍀. పూర్తి శ్లోకము :*
*ఆజ్ఞా చక్రాంతరాళస్థా, రుద్రగ్రంథి విభేదినీ |*
*సహస్రారాంబుజా రూఢా, సుధాసారాభి వర్షిణీ ‖ 39 ‖*

*🌻 106. 'సుధాసారాభివర్షిణీ, 🌻*

సహస్రార కమలము యొక్క 'కర్ణిక' (తూడు లేక కాడ) నుండి అమృతధారలు వర్షింప చేయునది శ్రీదేవి అని అర్థము. 

సహస్ర దళ పద్మముయొక్క తూడు లేక కాడ వెన్నెముక యందలి సుషుమ్న నాడిగ మూలాధారము వరకు వ్యాపించి యుండును. ఈ నాడి నుండి శ్రీదేవి తెలివిని, ప్రాణమును ప్రసరింపచేయును. తూడు నందు అచ్చటచ్చట కణుపు లేర్పడి షట్చక్రము లేర్పడును. అచట గ్రంథులు కూడ ఏర్పడును. గ్రంథులు స్రవించు లక్షణము గలవి. 

సాధకుని చైతన్య స్ఫూర్తిని బట్టి అమ్మ అనుగ్రహముగ ప్రతి గ్రంథియు తత్సంబంధిత జ్ఞానమును, ప్రాణమును మిక్కుటముగ వర్షింప చేయగలదు. ఇట్లు వర్షింపచేయు గ్రంథులను ధేనువులని, కామధేనువులని ఋషులు సంకేతించిరి. శ్రీవిద్య, బ్రహ్మ విద్య, యోగవిద్య ఆదిగా గల మార్గమున సుధాసారము వర్షితము కాగలదు. సామాన్య మానవులకు షట్చక్రముల గ్రంథుల నుండి నరములు, నాడులు ఆధారముగ ప్రాణము, తెలివి శరీరమున తగుమాత్రముగ ప్రసరించు చుండును.

సాధనా మార్గమున ఈ గ్రంథులను పరిపుష్టము గావించుకొని వానిని కామధేనువులుగ తీర్చిదిద్దుకొను విద్య పెద్దలందించినారు. ఆ వశిష్ఠుడు జమదగ్ని ఆదిగా గల మహర్షుల వద్ద కామధేనువు లున్నట్లు పురాణములు తెలుపును. వారి వద్దగల కామధేనువు, ఒక ప్రత్యేకమైన గోవు కాదు. 

అది వారి ధేనుత్వమే, వారి తపశ్శక్తియే. తపశ్శక్తి ఒక లక్షణమైన గోవునందు వారు ప్రవేశింపచేసినప్పుడు ఆ గోవు కామధేను వగుచుండును. ఈ కామధేనుత్వము నందించునది శ్రీదేవియే. అమ్మ అనుగ్రహ వశమున అమాయకు డొకడు మహాకవి కాళిదాసువలె పరిణమించెను. 

వేదవ్యాసుడి తరువాత వేదవ్యాసుడంతటి వాడు కాళిదాస మహాకవియే. అమ్మ ఎంత ఆగ్రహించగలదో అంత అనుగ్రహించగలదు. ఆమె పాదములను హృదయమున భావించి పూజించు వారికి అమృతధారలు వర్షించు నవకాశము కలదు. మరణమును దాటుటకు, బ్రహ్మత్వమును పొందుటకు శ్రీదేవి పాదములు చాలును.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 106 🌹*
*1000 Names of Sri Lalitha Devi* 
✍️. Ravi Sarma 
📚. Prasad Bharadwaj

*🌻 Sudhāsārabhi-varṣiṇī सुधासारभि-वर्षिणी (106) 🌻*

There is one soma chakra in the middle of sahasrāra. When Kuṇḍalinī reaches this cakra, out of the heat generated by Her presence, the ambrosia which is stored there gets melted and drips through the throat and enters the entire nervous system.  

Soma cakra is discussed in nāma 240. Tantric interpretation of this ambrosia differs from this interpretation. Saundarya Laharī (verse 10) says, “You drench the nādi-s (nerves) in the body with the flood of nectar gushing through Your feet.”

{Further reading on ambrosia: The followers of samayācāra, (worshipping Her through the cakra-s of Kuṇḍalinī, beginning from mūlādhāra is called samayācāra. 

Please refer nāma 98) both the planet moon and cit-candra-mandalā (nāma 240) (cit means foundational consciousness) at sahasrāra represent Śrī Cakra as both have similar qualities. Both shed nectar. 

 Her lotus feet deemed to shine in the moon region of śrī Cakra. Moon is the master of all medicinal herbs that are said to ooze divine water known as nectar.}

Continues....
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. శ్రీమద్భగవద్గీత - 469 / Bhagavad-Gita - 469 🌹*
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ

*🌴. 13వ అధ్యాయము - క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగం - ప్రకృతి, పురుషుడు, చైతన్యము - 14 🌴*

14. సర్వత సర్వత: పాణిపాదం తత్ సర్వతో(క్షిశిరోముఖమ్ |
సర్వత: శ్రుతిమల్లోకే సర్వమావృత్య తిష్టతి ||

🌷. తాత్పర్యం : 
సర్వత్ర అతని హస్తములు, పాదములు, నయనములు, శిరములు, ముఖములు, కర్ణములు వ్యాపించియున్నవి. ఈ విధముగా పరమాత్మ సర్వమును ఆవరించి నిలిచియుండును.

🌷. భాష్యము :
సూర్యుడు తన అపరిమిత కిరణములను ప్రసరించుచు స్థితిని కలిగియున్నట్లు, పరమాత్ముడు తన శక్తిని సర్వత్ర వ్యాపింపజేయుచు నిలిచియుండును. 

అతడు సర్వవ్యాపి రూపమున స్థితిని కలిగియుండగా ఆదిగురువైన బ్రహ్మ మొదలుగా చీమ వరకు సర్వజీవులు అతని యందు స్థితిని కలిగియుందురు. అనగా అసంఖ్యాకములుగా గల శిరములు, పాదములు, హస్తములు, నయనములు, అసంఖ్యాక జీవులన్నియును పరమాత్మ యందే స్థితిని కలిగియున్నవి. 

జీవులందరును పరమాత్ముని అంతర్భాహ్యములందు స్తితులై యున్నారు. కనుకనే అతడు సర్వవ్యాపిగా తెలియబడినాడు. పరమాత్మవలెనే తాను సైతము సర్వత్ర పాదములు మరియు హస్తములు కలిగియున్నానని జీవుడెన్నడును పలుకలేడు. అది ఎన్నటికిని అతనికి సాధ్యము కాదు. 

వాస్తవమునకు తన హస్తములు మరియు పాదములు సర్వత్ర వ్యాపించియున్నను అజ్ఞానకారణముగా తాను అది తెలియలేకున్నాననియు, కాని సరియైన జ్ఞానసముపార్జన పిమ్మట నిజముగా తాను అట్టి స్థితిని పొందగలననియు జీవుడు తలచినచో అది సత్యవిరుద్ధమే కాగలదు. అనగా ప్రకృతిచే బద్ధుడైన జీవుడు ఎన్నడును పరమాత్ముడు కాజాలడు. పరమాత్ముడు సర్వదా జీవునికి భిన్నమైనవాడు. 

ఉదాహరణకు భగవానుడు హద్దు అనునది లేకుండా తన హస్తములను చాచగలడు. కాని జీవునకు అది సాధ్యము కాదు. కనుకనే తనకు ఎవరైనా పత్రమునుగాన, పుష్పమునుగాని, ఫలమునుగాని లేదా జలమునుగాని అర్పించినచో తాను స్వీకరింతునని ఆ శ్రీకృష్ణభగవానుడు పలికియున్నాడు. 

అనగా అతడు తన ధామమునందు దివ్యలీలలలో నిమగ్నుడై యున్నను సర్వవ్యాపకుడై యుండునని భావము. భగవానుని వలె తానును సర్వవ్యాపినని జీవుడెన్నడును పలుకజాలడు. కనుకనే ఈ శ్లోకము పరమాత్మునే(దేవదేవుని) వర్ణించుచున్నది గాని జీవాత్ముని కాదు.
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Bhagavad-Gita as It is - 469 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj

*🌴 Chapter 13 - Kshetra Kshtrajna Vibhaga Yoga - Nature, the Enjoyer and Consciousness - 14 🌴*

14. sarvataḥ pāṇi-pādaṁ tat
sarvato ’kṣi-śiro-mukham
sarvataḥ śrutimal loke
sarvam āvṛtya tiṣṭhati

🌷 Translation : 
Everywhere are His hands and legs, His eyes, heads and faces, and He has ears everywhere. In this way the Supersoul exists, pervading everything.

🌹 Purport :
As the sun exists diffusing its unlimited rays, so does the Supersoul, or Supreme Personality of Godhead. He exists in His all-pervading form, and in Him exist all the individual living entities, beginning from the first great teacher, Brahmā, down to the small ants. 

There are unlimited heads, legs, hands and eyes, and unlimited living entities. All are existing in and on the Supersoul. Therefore the Supersoul is all-pervading. The individual soul, however, cannot say that he has his hands, legs and eyes everywhere. 

That is not possible. If he thinks that under ignorance he is not conscious that his hands and legs are diffused all over but when he attains to proper knowledge he will come to that stage, his thinking is contradictory. 

This means that the individual soul, having become conditioned by material nature, is not supreme. The Supreme is different from the individual soul.

The Supreme Lord can extend His hand without limit; the individual soul cannot. In Bhagavad-gītā the Lord says that if anyone offers Him a flower, or a fruit, or a little water, He accepts it. If the Lord is a far distance away, how can He accept things? 

This is the omnipotence of the Lord: even though He is situated in His own abode, far, far away from earth, He can extend His hand to accept what anyone offers. 

That is His potency. In the Brahma-saṁhitā (5.37) it is stated, goloka eva nivasaty akhilātma-bhūtaḥ: although He is always engaged in pastimes in His transcendental planet, He is all-pervading. 

The individual soul cannot claim that he is all-pervading. Therefore this verse describes the Supreme Soul, the Personality of Godhead, not the individual soul.
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. గీతోపనిషత్తు - 82 🌹*
✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్ 
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

*🍀 20 . శ్రీ భగవానువాచ - కర్మమును గూర్చిన 12 సూత్రములను అనుసరించుచూ యజ్ఞార్థముగ కర్మలు నిర్వర్తించు జ్ఞాని సంగము, బంధము లేక యుండును. అతని కర్మ మెప్పటికప్పుడు విలీనమైపోవు చుండును. 🍀*

*📚. 4. జ్ఞానయోగము - 23 📚*

*గతసంగస్య ముక్తస్య జ్ఞానావస్థిత చేతసః |*
*యజ్ఞ యాచరతః కర్మ సమగ్రం ప్రవిలీయతే || 23*

కర్మమును గూర్చిన 12 సూత్రములను అనుసరించుచూ యజ్ఞార్థముగ కర్మలు నిర్వర్తించు జ్ఞాని సంగము, బంధము లేక యుండును. అతని కర్మ మెప్పటికప్పుడు విలీనమైపోవు చుండును. చేయుచున్న కర్మలనుండి మరల కర్మబంధములు పుట్ట కుండుట, చేయుట యందలి జ్ఞానముగ గుర్తించవలెను. చేయుచున్న కర్మనుండి పుట్టిన ఫలితమునందు సంగము లేకుండుట వలన బంధముండదు. సంగమున్నచోట బంధ ముండును.

కర్మఫల సంగము బంధముగాని, కర్మ సంగము బంధము కాదని తెలియవలెను. శ్రీకృష్ణుడు తన జీవితమున ముందు తెలిపిన 12 కర్మ సూత్రములను పాటించి చూపిన యోగి. సర్వమూ తానై ఏమియు నంటని యోగేశ్వరు డతడు. అతడు జీవితమున తానుగా ఏదియు సంకల్పించలేదు. ఏదియును కోరలేదు, ఎవ్వరినీ ఆశ్రయించలేదు. కర్మఫలాసక్తి చూపలేదు. నిత్యతృప్తుడై జీవించెను. 

ఆశ, పరిగ్రహము అనునవి కానరావు. యతచిత్తుడై ఎప్పుడునూ కర్మల నాచరించెను. నిత్యతృప్తుడై లభించినదానికి సంతసించెను. సర్వబుద్ధియై ద్వంద్వముల కతీతముగ జీవించెను.

అతడంతరమున మత్సరము లేదు. మహాభారత యుద్ధమంతయు అతని చేతుల మీదుగా నడచినది. సర్వము తననుండి నిర్వహింప బడి తనకేమియు నంటక నిలచిన మహాయోగి. భారత యుద్ధ మందు కర్మలంటని మరియొక యోధుడు లేడు. భీష్మ ద్రోణాదులు సహితము కర్మబద్దులే. పాండవులునూ కర్మబద్దులే. 

శ్రీకృష్ణు డొక్కడే అందరిని అధిగమించి, ఏ కర్మమూ అంటక నిలచిన విశిష్ట పురుషుడు. అతని జీవితమే మరల మరల జ్ఞానయోగ సూత్రములకు మూలమని తెలియవలెను. కనుకనే అతడు “నాథు కర్మ ఫలము నందపేక్ష లేదు. నన్ను కర్మలంటవు" అని తెలిపినాడు.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹 . శ్రీ శివ మహా పురాణము - 279 🌹* 
రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ

*🌴. రుద్ర సంహితా - సతీఖండః 🌴* 
66. అధ్యాయము - 21

*🌻. సతీ శివుల విహారము - 2 🌻*

అంగదములను, కంకణములను, ఉంగరములను మరల మరల వాటి స్థానములనుండి విడదీసి, శివుడు వాటిని మరల అదే స్థానములో అమర్చెడి వాడు (22). కాలికా! నీతో సమానమైన వర్ణము గల ఈ నీ చెలికత్తె వచ్చు చున్నది అని శివుడు పిలిచెడి వాడు. ఆమె ఆ దిశలో చూచుచుండగా, ఆమె ఉన్నతమగు స్తనములను దర్శించుట కొరకై అట్లు పిలిచెడివాడు (23). 

ఒకప్పుడు మన్మథవికారముచే ఉన్మత్తమైన మానసము గల ఆ ప్రమధగణాధిపతి నర్మకేళి యందు ప్రీతిగల ఆమెతో గూడి ఆనందముతో నర్మకేళి యందు లగ్న మయ్యెడి వాడు (24). శంకరుడు పద్మములను, సుందరమగు పుష్పములను తెచ్చి సర్వావయవముల యందు ఆదరముతో పుష్పాభరణములను సమకూర్చెడివాడు (25).

భక్తవత్సలుడగు మహేశ్వరుడు కైలాసమునందు రమ్యములైన లతా గృహములన్నింటి యందు ప్రియురాలగు సతీదేవితో గూడి విహరించెను (26). ఆయన ఆమె లేనిదే ఎచటికైననూ వెళ్లడు; ఒంటరిగా ఉండడు; ఏ పనినీ చేయడు. శంకరుడు ఆమె లేనిదే క్షణమైననూ సుఖముగా నుండలేకపోయెను (27). 

కైలాస పర్వత లతా గృహము లందు చిరకాలము విహరించి, శివుడు తన ఇచ్ఛచే హిమవత్పర్వతమును స్మరించి అచటకు వెళ్ళెను (28). మన్మథుడు శంకరుని సమీపమునందు ప్రవవేశించగానే, వసంతుడు కూడ ఆ ప్రభువు యొక్క హృదయములోని భావమును గ్రహించి తన ప్రభావమును విస్తరించెను (29).

వృక్షములన్నియు పుష్పించినవి. లతాదులు పుష్పించినవి. సరస్సులు వికసించిన పద్మములతో నిండినవి. పద్మములు తుమ్మెదలతో శోభిల్లినవి (30). అచట వసంతర్తువు ప్రవేశించ గానే, మలయమారుతము వీచెను. మంచి సువాసన గల పుష్పములు పడుటచే జలములు పరిమళ భరితములాయెను (31). 

సంధ్యా కాలము నందలి చంద్రుని వలె ప్రకాశించే మోదుగు పుష్పములు ఆ వృక్షములు అనే యువతుల అధరములపై వసంతుని చిహ్నములు వలె, మన్మథుని అస్త్రము వలె రాజిల్లెను (32). సరస్సులయందు పద్మములు ప్రకాశించినవి. మెల్లగా వీచే వాయుదేవత సర్వమానవులను మోహింపజేయుటకు సంసిద్ధమగు చుండెను (33).

శంకరుని సన్నిధిలో నాగకేశర వృక్షములు బంగరువన్నె గల పుష్పములతో మన్మథిని జెండాల వలె మనోహరముగా ప్రకాశించినవి (34). లవంగముల తీగ పరిమళ గంధముచే వాయువును సువాసితము చేసి కామి జనుల మనస్సులను మిక్కిలి మోహింపజేసెను (35). 

మామిడి చిగుళ్లను భక్షించి మధురముగా కూయు కోయిలలు మన్మథ బాణముల సముదాయమువలె నున్న మామిడి చిగుళ్లు అనే పర్యంకములపై మన్మథపీడితములై భాసిల్లెను (36). నిర్మలములగు సరస్సులు వికసించిన పద్మములతో కూడి, ఆత్మ జ్యోతి యొక్క ప్రకాశముతో నిండియున్న మహర్షుల హృదయముల వలె ప్రకాశించెను (37).

మంచు తునకలు సూర్యరశ్ముల సంగమముచే నీరుగారిని హృదయము గలవై అంతరిక్షములోనికి ఆవిరి రూపములో ఎగసినవి (38). అపుడు రాత్రులు చంద్రునితో, మంచుతో కూడియున్నవై ప్రియునితో కూడిన అందమైన యువతులవలె నిర్మలముగా ప్రకాశించుచున్నవి (39). 

ఆ సమయములో మహాదేవుడు భార్యతో గూడి ఆ గొప్ప పర్వతమునందు లతా గృహములలో, మరియు నదులలో యథేచ్ఛగా చిరకాలము రమించెను (40). ఓ మహర్షీ! శివుడు ఆమె లేనిదే క్షణమైననూ శాంతముగా నుండలేక పోయెను. అదే తీరున, ఆ దాక్షాయణి కూడా ఆయనతో సమానముగా విహరించుచూ ప్రకాశించెను (41).

సంభోగ విషయములో సతీదేవి ఆయన మనస్సునకు ప్రీతిని కలిగించెను. ఆమె శివుని దేహములో ప్రవేశించు చున్నదా యన్నట్లు , ఆయన శక్తిని ఆ స్వాదించు చున్నదా యన్నట్లు ఉండెను (42). శివుడు ఆమె దేహమునంతనూ తాను స్వయముగా రచించిన పుష్పమాలలతో నూతన గృహమా యన్నట్లు అలంకరించెను (43). 

శివుడు సల్లాపములతో, చూపులతో, హాస్యములతో, మరియు ప్రసంగములతో ఆ సతీదేవికి ఆ క్షణమునందే ఆత్మ జ్ఞానమును బోధించినాడా యన్నట్లుండెను (44). ఆమె ముఖార వింద సౌందర్యమును పానము చేసి హరుడు ఆనందముగా నుండెను. ఆయన ఆ సుందరితో అనేక విశేషములతో గూడిన గార్హస్థ్యములో ప్రేమావస్థను బడసెను (45).

  ఆమె ముఖ పద్మము యొక్క సుగంధము చేత, ఆమె సౌందర్యములచేత, నర్మకేళుడు చేత బంధింపబడిన శివునకు, త్రాళ్లచే బంధిపబడిన మహాగజమునకు వలె, ఇతర చేష్టలు లేకుండెను (46). 

మహేశ్వరుడు దక్షపుత్రితో గూడి ఈ తీరున హిమ వత్పర్వతమునందలి లతాగృహములలో, గుహలలో ప్రతిదినము రమించెను. ఓ దేవర్షీ! ఆయన ఇట్లు క్రీడించుచుండగా దివ్యమానముచే ఇరవై అయిదు సంవత్సరములు గడచినవి (47).

శ్రీ శివ మహాపురాణములో రెండవదియగు రుద్ర సంహితయందు రెండవదియగు సతీఖండలో సతీశివక్రీడా వర్ణనమనే ఇరువది ఒకటవ అధ్యాయము ముగిసినది (21).

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹 LIGHT ON THE PATH - 35 🌹*
*🍀 For those WHO DESIRE TO ENTER WITHIN - For DISCIPLES 🍀*
✍️. ANNIE BESANT and LEADBEATER
📚. Prasad Bharadwaj

CHAPTER 3 - THE FIRST RULE
*🌻KILL OUT AMBITION - Work as those work who are ambitious - 15 🌻*

161. Even the wise people are confused, it is said, as to the limits of each of these things. The right action is duty, that in which the man is expressing the life of Ishvara in his own place. In that he is to be a channel or agency, working with the knowledge, accuracy and completeness that the man who is not ambitious shows. 

If you take his work and put it beside that of the man who is ambitious you will see that it is equally well, nay, even better done, because it is done with absolute self-surrender and perfect balance.

162. If you find a man who is not working in that way, having lost desire for the fruit of action, but who is doing less than he ought to do, is working with less energy, less interest and less punctuality because he has no longer personal motives, then you see one who has not learned the duty of action before he took to inaction. 

It was said to me regarding certain people: “These men are beginning inaction before they have done action – by intellectual recognition of the worthlessness of the fruit of action before they have reached the point where they could work unselfishly. They are neither good men of the world, as they have stopped doing that, nor are they spiritual men throwing their energy into the evolution of mankind.”

163. There are two lives which a man may live who has reached the condition where the fruit of action does not affect him. He may retire to the jungle to live in seclusion or he may be busy amid the affairs of men.

 If he is sufficiently evolved to work energetically in the mental or in the spiritual plane, that life of physical inaction may be the best; that man is helping the world much more than he could do amid the bustle of the world. 

Yet such a man will often be sent back by his Master to lead his last life in the world. He will then live a life untainted by action, will show in the world the example of true action, will lead a life of perfect activity with all the energy that the most ambitious man can show.

164. When a man is living the spiritual life in the world it is not possible usually to tell by external means whether he is moved by desire or by duty. But there is one test which never fails by which one may always judge one’s own motive. 

How are you affected when the fruit of action is before you? If the slightest element of ambition enters into a man’s work he will show disappointment if it fails or elation if it succeeds. 

If there is no suffering for him in his failure, no element of personality has entered into his work; for if he has been working because Ishvara works, for the welfare of mankind, he will know his failure is not the failure of Ishvara, but that the failure is part of His Plan. 

From the standpoint of Ishvara failure is impossible, and often in human life failure is quite as necessary for ultimate success as success is necessary for ultimate success. His people may be sent sometimes to play the part of the failure so as to become stronger, to realize that where there is failure there is also success.

Continues...
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 167 🌹*
🌷. సద్గురు శివానంద 🌷
📚. ప్రసాద్ భరద్వాజ

*🌻. కణ్వమహర్షి - 2 🌻*

07. అందరికీ కలియుగంలో ఒకతే స్మృతి అనటానికి వీలులేదు. కొందరి అభిప్రాయంలో మనుస్మృతి కలియుగానికి వర్తించదు. శంఖలిఖితస్మృతి ద్వాపరయుగానికి వర్తిస్తుంది. భరద్వాజుడు చెప్పినటువంటి కొన్ని వాక్యాలు ఇప్పుడుకూడా మనకు వర్తిస్తాయి. 

08. కాబట్టి యుగానికి ఒక్కొక్క స్మృతి – అంటే ఆ శాఖీయులని వాడమని ఒక అర్థం ఉంది. ఏ శాఖలో మనం ఉన్నమో ఆ శాఖలో ఆ ఋషిచెప్పిన స్మృతినివాడతమే సమంజసం అని భావించాలి. యుగధర్మం అలా ఉంది.

09. సామాన్యంగా నాలుగువర్ణాలవారికీ, సమస్త ప్రజలందరికీ, స్త్రీలకు, పురుషులందరికీ వర్తించే విధంగా స్మృతి ఒకటి ఉండగా; ప్రత్యేకమయిన ఒక కుటుంబీకులు వాళ్ళశాఖకుచెందిన ఋషులు చెప్పిన స్మృతులను వాళ్ళు అనుసరించాలి. అది యోగ్యమైంటువంటి విధానమని మనం భావించవచ్చు. 

10. అందరూ మనుస్మృతి-మనుస్మృతి అని అంటారు. నిజానికి మనుస్మృతి ఇంత ప్రధాన్యత సంఘంలో ఇటీవలే వచ్చింది. ఈ స్మృతులన్నీ ఆయా ప్రంతాలలో ఉండేవి. కాశ్మీరు లోనూ, పంజాబులోనూ భరద్వాజస్మృతి ఎక్కువగా ఉండేది.

 11. ఉత్తభారతప్రాంతాలలో యాజ్ఞవల్కస్మృతికూడా ప్రచారంలో ఉంది. వళ్ళ వివాహాదులుకూడా దానిని బట్టే నడుస్తాయని అంటారు వాళ్ళు. పంజాబులో అక్కడివాళ్ళకు వారి స్మృతే ప్రధానం. అలాగే కాశ్మీరులో ఇంకొక స్మృతి. గుజరాతులో మరొకటి ఉంది. 

12. బ్రాహ్మణులలోకూడా అనేక ఋషివంశాలలో, గోత్రాలలో, శాఖలలో అనేక వంసకర్తలు చెప్పిన వాక్యాలను ఆయా కుటుంబాలవారు, ప్రాంతాలవారు అనుసరిస్తూ వాళ్ళ కార్యక్రమాలను నడుపుకునేవాళ్ళు. ‘కలౌ పరాశరస్మృతిః’- అంటే, కలిలో పరాశరుడు స్మృతి సామాన్య వ్యవహారంలో ఉన్నదని అర్థం. యాజ్ఞవల్కుడు, పరాశరుల స్మృతులు సామాన్యంగా అనుసరిస్తూ వచ్చారు.

13. శంఖలిఖిత స్మృతి ఒకటి ఉంది. నీతి, న్యాయము, ధర్మము, తాను చేసిన నేరానికి తనను తానే శిక్షించుకోవడం అనేది మనుశ్మృతిలో లేదు; కాని శంఖలిఖితులు దీనిని తమ స్మృతిలో చెప్పారు. “ఇంకొకళ్ళు శిక్షించేదాక ఎందుకుండాలి? నిన్ను నీవే శ్ఖించుకో! స్వర్గం కనబడుతుంది. మోక్షం కలుగుతుంది నువ్వు పెద్దలవద్దకు వెళ్ళి అడుగు. శిక్ష పడకపోతే నువ్వే శిక్షించుకో! నీకు తెలుసు” అని శంఖలిఖిత స్మృతి చెబుతుంది.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. శివగీత - 121 / The Siva-Gita - 121 🌹*
 *🌴. పరమేశ్వరుడు - శ్రీరాముడు మధ్య జరిగిన జ్ఞాన సంవాదము. 🌴*
📚. ప్రసాద్ భరద్వాజ 

అధ్యాయము 16
*🌻. మొక్షాదికారి నిరూపణము - 2 🌻*

యోమాం గురుం పాశుపతం -వ్రతం ద్వేష్టి నరాధిప,
విష్ణుం వాసన ముచ్యేత - జన్మ కోటి శ తైరపి 6
అనేక కర్మ సక్తోపి - శివ జ్ఞాన వివర్జితః ,
శివ భక్తి విహీనశ్చ - సంసారీ నైవ ముచ్యతే 7
ఆసక్తాః ఫల సంగేన - యేత్వ వైది క కర్మాణి,
దృష్ట మాత్ర ఫలాస్తే తు - న ముక్తా వాది కారిణః 8
అవిముక్తే ద్వార వత్యాం - శ్రీశైలే పుండరీకకే,
దేహాంతే తారకం బ్రహ్మ - లభతే మదను గ్రహాత్ 9
య్య హస్తౌ చ పాదౌచ - మనశ్చైన సుసంయుతమ్,
విద్యాత పశ్చ కీర్తిశ్చ -సతీర్ధ ఫల మశ్నుతే 10

పశుపతి వ్రత గురువగు నన్నెవడు ద్వేషించునో హరి ద్వేష మెవడు చేయునో, వాడు కోటి కల్పముల కైనను అనేక కర్మల శివ జ్ఞాన భక్తులు గాక సంసారియై బుట్టుచు ముక్తిని పొందలేడు.  

ఫలాకాంక్ష తో వామాచారాదుల యందు,ఆసక్తి కలవారు తత్ఫలములను మాత్రమే పొందగలరు. కాని మొక్షాది కారము కానేరరు. 

కాశిలో ను ద్వారకా పురము లోను అధవా శ్రీశైలములోను పుండరీకము నందును దేహమును వదులువారు (మరణించు వారు ) నాయనుగ్రహము వలన తారక బ్రహ్మను పొందుదురు.  

ఎవ్వని కర చరణంబులు నియమితమై యుండునో విద్యా తపస్సు కీర్తి మొదలగునవి సమకూరునో వాడికే తీర్ధ వాస ఫలము లభించును. లేకున్నచో, నా తీర్దావాసము చేత పాపమునే యనుభవించు వాడగును.

సశేషం... 
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 The Siva-Gita - 121 🌹*
*🌴. Dialogue between Rama and Lord Siva 🌴*
✍️ Ayala somayajula. 
📚. Prasad Bharadwaj

Chapter 16
*🌻 Mokshadhikari Nirupanam - 2 🌻*

I who am the Guru of the Pashupati Vratam, one who hates me one who hates Vishnu, such a person even after billions of kalpas would remain in the ocean of samsaara falling into the circle of births and deaths and would not gain Shivajnanam hence would not attain liberation.

 One who performs rituals or chants my name with the expectation of fruition, he would gain the desired fruition only but cannot gain liberation. 

One who dies in Kashi, Dwaraka, Sri Sailam, or Pundarikam with my grace they would gain Taraka Brahman and attain salvation. 

One whose limbs remain conquered and help him gain knowledge, do austerities, gain fame such a person only gains the fruition of pilgrimage. 

Others who aren't of cleansed heart gain only sins even by staying in those places of pilgrimage. 

Continues...
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹 Seeds Of Consciousness - 231 🌹*
✍️ Nisargadatta Maharaj 
 Nisargadatta Gita 
📚. Prasad Bharadwaj

*🌻 80. You are neither the 'I am' nor the activities carried out by the beingness - you as the Absolute are none of these.🌻*

This mirage 'I am' has to be understood along with all the tangle of activities that it gets itself caught up in. 

This illusory 'I am' or 'beingness' is the very root of everything, every activity you engage in, every action that you perform has the 'I am' as its basis. Can you recollect any activity prior to the appearance of 'I am'? No. 

So what does this suggest? It clearly shows that you stand apart from the 'I am' as the Absolute. The 'I am' has only appeared on you and you have nothing to do with it or its activities.
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 106 🌹*
✍️. శ్రీ బాలగోపాల్
📚. ప్రసాద్ భరద్వాజ

*🌻. మానసిక గోళము - మనోభువనము - ఆరవ భూమిక - 11 🌻*

442. మనోమయ గోళమందలి రెండవ భాగము అనుభూతులకు (హృదయము) అధికారి యందున్న సాధకుడు (సత్పురుషుడు) భగవంతుని నిజ స్వరూపమును ప్రత్యక్షముగా దివ్యా నేత్రము ద్వారా ఎల్లెడల చూచుచున్నాననెడి భావానుభూతిని పొందును. కాని తనను భగవంతునిలో భగవంతునిగా చూడలేదు. ఇదియే బ్రహ్మ సాక్షాత్కారము (ఆత్మ ప్రకాశము).

443. ఇతడు మహిమలు ప్రదర్శించడు.

444. ఇచట దర్శనము అనెడి ఇంద్రియ పరిజ్ఞానము మిగిలి యున్నది.

445. భౌతిక , సూక్ష్మ చైతన్యములు గల ఆత్మల యొక్క అనుభూతులపై అధికారము కల్గి వాటిని పరిపాలించును.

446. పరుల మనస్సుల యొక్క తలపుల యందును, తలపులు సృష్టించుట యందును సమర్ధుడగును. ఆత్మనిగ్రహము కలవాడగును.

447. సృష్టి అనుభవమంతయు మిథ్య ఎందుచేతననగా--సృష్టి సంబంధమైన సమస్త అనుభవములు సంస్కారముల వలన కలిగినవి. ఆ సంస్కారములు అభావము నుండి పుట్టినవి గనుక.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. శ్రీ విష్ణు సహస్ర నామములు - 70 / Sri Vishnu Sahasra Namavali - 70 🌹*
*నామము - భావము*
📚. ప్రసాద్ భరద్వాజ 

*🌷. ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్ 🌷*

*జ్యేష్ట నక్షత్ర ద్వితీయ పాద శ్లోకం*

*🍀. 70. కామదేవః కామపాలః కామీ కాన్తః కృతాగమః|*
*అనిర్దేశ్యవపుః విష్ణుః వీరోనంతో ధనంజయః || 70 || 🍀*

🍀 651) కామదేవ: - 
చతుర్విధ పురుషార్థములను కోరువారిచే పూజింప బడువాడు.

🍀 652) కామపాల: - 
భక్తులు తననుండి పొందిన పురుషార్థములను చక్కగా ఉపయోగపడునట్లు చూచువాడు.

🍀 653) కామీ - 
సకల కోరికలు సిద్ధించినవాడు.

🍀 654) కాంత: - 
రమణీయ రూపధారియైన వాడు.

🍀 655) కృతాగమ: - 
శ్రుతి, స్తృతి ఇత్యాది శాస్త్రములు రచించినవాడు.

🍀 656) అనిర్దేశ్యవపు: - 
నిర్దేశించి, నిర్వచించుటకు వీలుకానివాడు.

🍀 657) విష్ణు: - 
భూమ్యాకాశాలను వ్యాపించినవాడు.

🍀 658) వీర: - 
వీ ధాతువుచే సూచించు కర్మలచే నిండియున్నవాడు.

🍀 659) అనంత: - 
సర్వత్రా, సర్వకాలములందు ఉండువాడు.

🍀 660) ధనంజయ: - 
ధనమును జయించినవాడు.

సశేషం.... 
🌹 🌹 🌹 🌹 🌹 

*🌹 Vishnu Sahasra Namavali - 70 🌹*
*Name - Meaning*
📚 Prasad Bharadwaj

*🌷 OM NARAYANAYA VIDMAHE VASUDEVAYA DHIMAHI । TANNO VISHNU PRACHODAYAT ॥ 🌷*

*Sloka for Jeshta 2nd Padam*

*🌻 70. kāmadevaḥ kāmapālaḥ kāmī kāntaḥ kṛtāgamaḥ |*
*anirdeśyavapurviṣṇurvīrōnantō dhanañjayaḥ || 70 || 🌻*

🌻 651. Kāmadevaḥ: 
One who is desired by persons in quest of the four values of life – Dharma, Artha, Kama and Moksha.

🌻 652. Kāmapālaḥ: 
One who protects or assures the desired ends of people endowed with desires.

🌻 653. Kāmī: 
One who by nature has all his desires satisfied.

🌻 654. Kāntaḥ: 
One whose form is endowed with great beauty. Or one who effects the 'Anta' or dissolution of 'Ka' or Brahma at the end of a Dviparardha (the period of Brahma's lifetime extending over a hundred divine years).

🌻 655. Kṛtāgamaḥ:
 He who produced scriptures like Shruti, Smruti and Agama.

🌻 656. Anirdeśya-vapuḥ: 
He is called so, because, being above the Gunas, His form cannot be determined.

🌻 657. Viṣṇuḥ: 
One whose brilliance has spread over the sky and over the earth.

🌻 658. Vīraḥ: 
One who has the power of Gati or movement.

🌻 659. Anantaḥ: 
One who pervades everything, who is eternal, who is the soul of all, and who cannot be limited by space, time, location, etc.

🌻 660. Dhananjayaḥ: 
Arjuna is called so because by his conquest of the kingdoms in the four quarters he acquired great wealth. Arjuna is a Vibhuti, a glorious manifestation of the Lord.

Continues...
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 104, 105, 106 / Sri Lalitha Chaitanya Vijnanam - 104, 105, 106

🌹. శ్రీ లలితా సహస్ర నామ స్తోత్రము - 57 / Sri Lalitha Sahasra Nama Stotram - 57 🌹
ప్రసాద్ భరద్వాజ

🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 104, 105, 106 / Sri Lalitha Chaitanya Vijnanam - 104, 105, 106 🌹
సహస్ర నామముల తత్వ విచారణ

✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

మూల మంత్రము :

🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁

🍀. పూర్తి శ్లోకము :

ఆజ్ఞా చక్రాంతరాళస్థా, రుద్రగ్రంథి విభేదినీ |

సహస్రారాంబుజా రూఢా, సుధాసారాభి వర్షిణీ ‖ 39 ‖

🌻 104. 'రుద్రగ్రంథి విభేదినీ' 🌻

రుద్రగ్రంథి ద్వయమును విశేషముగ భేదించునది శ్రీదేవి యని అర్థము.

స్వాధిష్ఠానమున బ్రహ్మగ్రంథి భేదనము, మణిపూరకమున విష్ణు గ్రంథి భేదనము తెలుపబడినవి. రుద్రగ్రంథి భేదనము అనాహత చక్రమున జరుగును. పంచభూతములలో భూమి, జలము బ్రహ్మ గ్రంథిచే నియమింపబడును. అగ్ని, దాని తేజస్సు విష్ణుగ్రంథిచే నియమింప బడును.

వాయువు, ఆకాశము రుద్రగ్రంథిచే నియమింప బడును. రుద్ర గ్రంథిని భేదించుట యనగా వాయువును ఆకాశమున చేర్చి, ఆకాశ తరంగములను దాటి చిదానంద స్థితిని చేరుట. శరీరము పంచభూతాత్మకము. అందు జీవుడు వసించి యుండును.

పంచభూతములకు మూలము ఆకాశమే. ఆకాశము నుండి వాయువు, వాయువు నుండి అగ్ని (తేజస్సు), దాని నుండి జలము, దాని నుండి భూమి పుట్టుచున్నవి. వీనియందు ఉపస్థితుడైన జీవుడు క్రమముగ వీనిని దాటుటయే గ్రంథి భేదనము.

శ్రీదేవి మొదట త్రిగుణాత్మికయై అందుండి పంచభూతములను సృష్టించినది. త్రిగుణములు పంచభూతములు కలిసి ఎనిమిది స్థానముల నేర్పరచినది. అవియే అష్ట ప్రకృతులు. అందు జీవుని ప్రవేశింపజేసి సృష్టి నిర్మాణము పూర్తి చేయును. ఆరోహణ క్రమమున జీవుడు, అమ్మ అనుగ్రహము ద్వారా వీటిని మరల దాటి స్వతంత్రుడై సృష్టి వైభవమును పొందును.

భూమి, జలముల కేంద్రములు మూలాధారము, స్వాధిష్ఠానము. అచట జీవుని నియమించునది బ్రహ్మగ్రంథి. మణిపూరకము అగ్ని స్థానము, భావమయ స్థానము. అచ్చట జీవుని నియమించునది విష్ణుగ్రంథి. అనాహతము, విశుద్ధి వరుసగా వాయువు, ఆకాశమునకు సంబంధించిన కేంద్రములు. వీనిని నిర్వర్తించునది రుద్రగ్రంథి. ఆజ్ఞ యందు జీవుడు స్వస్వరూపుడు, త్రిగుణాత్మకుడు మరియు విదేహుడు.

అనగా పంచభూతములతో కూడిన దేహము లేనివాడు. ఇతనినే హంస స్వరూపుడందును. విష్ణుగ్రంథి భేదన సమయమున జీవుడు తనయందు విష్ణువే స్వరూపము కొనియున్నాడని, భౌతిక దేహము తన విష్ణు రూపమునకు కవచమని తెలిపితిమి. రుద్రగ్రంథి భేదనమున నిజమునకున్నది విష్ణువే యనియు, తాను కాదనియు తెలియును. 'విశ్వం విష్ణుః' అను సత్యము దర్శనమగును.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 104 🌹
1000 Names of Sri Lalitha Devi

✍️. Ravi Sarma
📚. Prasad Bharadwaj

🌻 Rudragranthi-vibhedinī रुद्रग्रन्थि-विभेदिनी (104) 🌻

She breaks the Rudra granthi and proceeds to sahasrāra. This is the last of the three knots. It has already been seen that Pañcadaśī mantra has three kūṭa-s and each kūṭa ends with hrīṃ (ह्रीं).

Therefore, Pañcadaśī mantra has three hrīṃ-s. Each hrīṃ represents one granthi or knot. The bīja hrīṃ represents the candra kalā, (divisions of moon) whereas the other bīja-s in each of the kūṭa-s represent agni (fire), sun and moon (Please refer details at the end of nāma 84).

Once this granthi is crossed, Kuṇḍalinī reaches sahasrāra where she unites with Śiva. However, there are minor cakra-s in between ājñā and sahasrāra. The union of Śiva and Śaktī is represented by the bījā hrīṃ. Pañcadaśī mantra represents only the six cakra-s and three granthi-s.

It does not mention about sahasrāra, which is beyond the subtler (kāmakalā) and subtlest (Kuṇḍalinī) forms of Lalitāmbikā. Once this last granthi is passed over, all the vāsana-s (impressions) go away leading to supreme knowledge. Till this point Kuṇḍalinī had to cross too many resistances to reach Her final destination.

In the next nāma Her destination is explained. During the last leg of one’s journey to his domicile, (for example the flight is about to land) one always feels the happiness of seeing his dear ones.

This is the sort of happiness She derives at this stage. She grants whatever boons one asks for at this cakra.

Continues....
🌹 🌹 🌹 🌹 🌹

🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 105 / Sri Lalitha Chaitanya Vijnanam - 105 🌹
సహస్ర నామముల తత్వ విచారణ

✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

మూల మంత్రము :

🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁

🍀. పూర్తి శ్లోకము :

ఆజ్ఞా చక్రాంతరాళస్థా, రుద్రగ్రంథి విభేదినీ |

సహస్రారాంబుజా రూఢా, సుధాసారాభి వర్షిణీ ‖ 39 ‖

🌻 105. 'సహస్రారాంబుజారూఢా' 🌻

వేయి సంఖ్యల దళములు గల పద్మము అధిష్ఠించియున్న శ్రీదేవి అని అర్థము.

సహస్ర అను పదము సంకేత పదము. అది మంత్రము కూడ. 'స' అను అక్షరము పరతత్త్వమునకు సంకేతము. 'హ' అను అక్షరము పరాశక్తికి సంకేతము. 'స్ర' అను అక్షరము అగ్నిబీజము. ఆధారముగ నేర్పడిన సృష్టియని అర్థము.

ఈ మంత్రము యొక్క రహస్యార్థము, సహస్రారకమల దర్శనులకు మాత్రమే తెలియగలదు. అత్రి ఆదిగాగల మహర్షులు ఈ మంత్రశక్తి నెరిగియున్నారు. సమస్త సృష్టి స్థితి లయ కార్యములు అవగతమై తమవంతు కర్తవ్యము నిర్వర్తించు శ్రీదేవి పరమ భక్తులకే ఈనామ రహస్యము తెలియగలదు. ఇతరులు తెలియలేరు.

ఈ మంత్ర రహస్యము తెలిసినవారు త్రిగుణముల కాధారమైన మూలశక్తిని తెలిసినవారే. మూల ప్రకృతిని తెలిసినవారే. అత్రి మహర్షి అనసూయత్వము ఆధారముగ సాగించిన తపస్సు ఫలముగ ఈ మంత్ర రహస్యము నెరిగినారు.

అతడు శాంతివంతుడు, క్రతుక్రియానిష్ఠుడు, సత్త్వగుణోపేతుడు, శ్రద్ధావంతుడు మరియు కళావంతుడును. అతని యందు శ్రీదేవి పదహారు కళలు భాసించును. అనసూయాదేవి అత్రి మహర్షిని ఆరాధించి జగన్మాత స్థితిని పొందినది. త్రిగుణాతీతులే సహస్ర దళ పద్మమున స్థితికొనగలరు.

'సహస్ర' అను నామమునకు వేయి (1,000) అని అర్థము. వేయి అనగా మూడు లోకముల కవ్వలి తత్త్వము అని అర్థము. తత్త్వ మొకటియే. అది ఆధారముగ సువర్లోకము, భువర్లోకము, భూలోకము ఉద్భవించినవి.

సహస్రార దళ పద్మమందు శ్రీదేవి యున్నదనగా ఆమె లోకాతీత, గుణాతీత యని అర్థము. అది పరమ పదము. అచట దేవి శివుని కూడియుండును. శివ తత్త్వము నాధార ముగ సమస్త సృష్టియు త్రిగుణముల ద్వారా ఏర్పరచి మూలాధార చక్రము వరకును వ్యాపించును.

ఈ మొత్తము మార్గమంతయు అమ్మ చైతన్యమార్గమే. ఈ మార్గమున అమ్మ నిరాటంకముగ ఆరోహణము, అవరోహణము చేయుచు నుండును. ఆమె స్వస్థానము సహస్రారము.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 105 🌹
1000 Names of Sri Lalitha Devi

✍️. Ravi Sarma
📚. Prasad Bharadwaj

🌻Sahasrārambujārūḍhā सहस्राराम्बुजारूढा (105) 🌻