✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
🍀 20 . శ్రీ భగవానువాచ - కర్మమును గూర్చిన 12 సూత్రములను అనుసరించుచూ యజ్ఞార్థముగ కర్మలు నిర్వర్తించు జ్ఞాని సంగము, బంధము లేక యుండును. అతని కర్మ మెప్పటికప్పుడు విలీనమైపోవు చుండును. 🍀
📚. 4. జ్ఞానయోగము - 23 📚
గతసంగస్య ముక్తస్య జ్ఞానావస్థిత చేతసః |
యజ్ఞ యాచరతః కర్మ సమగ్రం ప్రవిలీయతే || 23
కర్మమును గూర్చిన 12 సూత్రములను అనుసరించుచూ యజ్ఞార్థముగ కర్మలు నిర్వర్తించు జ్ఞాని సంగము, బంధము లేక యుండును. అతని కర్మ మెప్పటికప్పుడు విలీనమైపోవు చుండును. చేయుచున్న కర్మలనుండి మరల కర్మబంధములు పుట్ట కుండుట, చేయుట యందలి జ్ఞానముగ గుర్తించవలెను. చేయుచున్న కర్మనుండి పుట్టిన ఫలితమునందు సంగము లేకుండుట వలన బంధముండదు. సంగమున్నచోట బంధ ముండును.
కర్మఫల సంగము బంధముగాని, కర్మ సంగము బంధము కాదని తెలియవలెను. శ్రీకృష్ణుడు తన జీవితమున ముందు తెలిపిన 12 కర్మ సూత్రములను పాటించి చూపిన యోగి. సర్వమూ తానై ఏమియు నంటని యోగేశ్వరు డతడు. అతడు జీవితమున తానుగా ఏదియు సంకల్పించలేదు. ఏదియును కోరలేదు, ఎవ్వరినీ ఆశ్రయించలేదు. కర్మఫలాసక్తి చూపలేదు. నిత్యతృప్తుడై జీవించెను.
ఆశ, పరిగ్రహము అనునవి కానరావు. యతచిత్తుడై ఎప్పుడునూ కర్మల నాచరించెను. నిత్యతృప్తుడై లభించినదానికి సంతసించెను. సర్వబుద్ధియై ద్వంద్వముల కతీతముగ జీవించెను.
అతడంతరమున మత్సరము లేదు. మహాభారత యుద్ధమంతయు అతని చేతుల మీదుగా నడచినది. సర్వము తననుండి నిర్వహింప బడి తనకేమియు నంటక నిలచిన మహాయోగి. భారత యుద్ధ మందు కర్మలంటని మరియొక యోధుడు లేడు. భీష్మ ద్రోణాదులు సహితము కర్మబద్దులే. పాండవులునూ కర్మబద్దులే.
శ్రీకృష్ణు డొక్కడే అందరిని అధిగమించి, ఏ కర్మమూ అంటక నిలచిన విశిష్ట పురుషుడు. అతని జీవితమే మరల మరల జ్ఞానయోగ సూత్రములకు మూలమని తెలియవలెను. కనుకనే అతడు “నాథు కర్మ ఫలము నందపేక్ష లేదు. నన్ను కర్మలంటవు" అని తెలిపినాడు.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
23 Nov 2020
No comments:
Post a Comment