🌹 07, MARCH 2023 TUESDAY ALL MESSAGES మంగళవారం, భౌమ వాసర సందేశాలు 🌹

🍀🌹 07, MARCH 2023 TUESDAY ALL MESSAGES మంగళవారం, భౌమ వాసర సందేశాలు 🌹🍀
1) 🌹 07, MARCH 2023 TUESDAY, మంగళవారం, భౌమవాసరే, నిత్య పంచాంగము Daily Panchangam🌹
*🌹. హోళీ పండుగ, హోళికా దహనం, వసంత పూర్ణిమ, ఫాల్గుణ పూర్ణమి, లక్ష్మీ జయంతి, చైతన్య మహాప్రభు జయంతి శుభాకాంక్షలు / Happy Holi Festival , Holika Dahan, Vasanta Purnima, Lakshmi Jayanti, Chaitanya Mahaprabhu Jayanti to All. 🌹*
2) 🌹. శ్రీమద్భగవద్గీత - 336 / Bhagavad-Gita -336 🌹 🌴 8వ అధ్యాయము - అక్షరబ్రహ్మ యోగం / Akshara Brahma Yoga - 26 వ శ్లోకము 🌴
4) 🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 183 / Agni Maha Purana - 183 🌹 🌻. దశదిక్పతియాగ ము - 3 / Five divisions of installation - 3 🌻
4) 🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 048 / DAILY WISDOM - 048 🌹 🌻 17. అనుభవించే దాని పట్ల చైతన్యం ఉండకపోతే ఆ జీవిత అనుభవం కలగదు / 17. There is no Experience without a Consciousness of It 🌻
5) 🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 313 🌹
6) 🌹. శివ సూత్రములు - 50 / Siva Sutras - 50 🌹 
🌻 16. శుద్ధ తత్త్వ సంధానద్ వాపశుశక్తిః - 2 / 16. Śuddha-tattva- sandhānād-vāpaśuśaktiḥ - 2 🌻

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹07, మార్చి, March 2023 పంచాగము - Panchagam 🌹*
*శుభ మంగళవారం, Tuesday, భౌమ వాసరే*
*🍀. హోళీ పండుగ, హోళికా దహనం, వసంత పూర్ణిమ, ఫాల్గుణ పూర్ణమి, లక్ష్మీ జయంతి, చైతన్య మహాప్రభు జయంతి శుభాకాంక్షలు / Happy Holi Festival , Holika Dahan, Vasanta Purnima, Lakshmi Jayanti, Chaitanya Mahaprabhu Jayanti to All. 🍀*
*మనందరికి ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని పరమాత్మని స్మరిస్తూ - ప్రసాద్ భరద్వాజ*

*🌻. పండుగలు మరియు పర్వదినాలు : హోళీ పండుగ, హోళికా దహనం, వసంత పూర్ణిమ, ఫాల్గుణ పూర్ణమి, లక్ష్మీ జయంతి, చైతన్య మహాప్రభు జయంతి, Holi Festival , Holika Dahan, Vasanta Purnima, Lakshmi Jayanti, Chaitanya Mahaprabhu Jayanti 🌻*

*🍀. అపరాజితా స్తోత్రం - 9 🍀*

17. యా దేవీ సర్వభూతేషు శాంతిరూపేణ సంస్థితా |
నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః 
18. యా దేవీ సర్వభూతేషు శ్రద్ధారూపేణ సంస్థితా |
నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః

🌻 🌻 🌻 🌻 🌻

*🍀. నేటి సూక్తి : చతుర్విధధ్యానాలు : ఏకవిషయానికి చెందిన ఎడతెగని ఆలోచనా ప్రవాహంపై మనస్సును ఏకాగ్రం చెయ్యడం, ఆ విషయానికి సంబందించిన విజ్ఞానం స్ఫురించేటట్లు దానిని మనసులో ధారణ చెయ్యడం, మనసులోని ఆలోచనలకు వెనుకగా నిలువబడి వాటిని పరిశీలించడం, ఆలోచనల నన్నింటిని మనసులోంచి ఖాళీ చెయ్యడం, అనే యీ నాలుగు రకాల ధ్యాన పద్ధతులూ వరుసగా ఒకదాని కంటే ఒకటి ఎక్కువ కష్ట సాధ్యములై క్రమాధికంగా విస్తృత ఫలితాలను సాధకునకు అందిస్తాయి. 🍀*

🌷🌷🌷🌷🌷

శుభకృత్‌, శిశిర ఋతువు,
ఉత్తరాయణం, ఫాల్గుణ మాసం
తిథి: పూర్ణిమ 18:11:10 వరకు
తదుపరి కృష్ణ పాడ్యమి
నక్షత్రం: పూర్వ ఫల్గుణి 26:23:55
వరకు తదుపరి ఉత్తర ఫల్గుణి
యోగం: ధృతి 21:14:51 వరకు
తదుపరి శూల
కరణం: బవ 18:08:10 వరకు
వర్జ్యం: 08:51:40 - 10:36:48
దుర్ముహూర్తం: 08:53:12 - 09:40:46
రాహు కాలం: 15:25:38 - 16:54:49
గుళిక కాలం: 12:27:15 - 13:56:26
యమ గండం: 09:28:52 - 10:58:04
అభిజిత్ ముహూర్తం: 12:04 - 12:50
అమృత కాలం: 19:22:28 - 21:07:36
సూర్యోదయం: 06:30:30
సూర్యాస్తమయం: 18:24:00
చంద్రోదయం: 18:22:47
చంద్రాస్తమయం: 06:27:25
సూర్య సంచార రాశి: కుంభం
చంద్ర సంచార రాశి: సింహం
యోగాలు: ధూమ్ర యోగం - కార్య
భంగం, సొమ్ము నష్టం 26:23:55 వరకు
తదుపరి ధాత్రి యోగం - కార్య జయం
✍️. శ్రీ వక్కంతం చంద్రమౌళి
🌻 🌻 🌻 🌻 🌻  

*🍀. నిత్య ప్రార్థన 🍀*
*వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ*
*నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా*
*యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా*
*తయో సంస్మరణా త్పుంసాం సర్వతో జయ మంగళం*
*తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ* 
*విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.*
🌹🌹🌹🌹🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. హోళీ పండుగ, హోళికా దహనం, వసంత పూర్ణిమ, ఫాల్గుణ పూర్ణమి, లక్ష్మీ జయంతి, చైతన్య మహాప్రభు జయంతి శుభాకాంక్షలు / Happy Holi Festival , Holika Dahan, Vasanta Purnima, Lakshmi Jayanti, Chaitanya Mahaprabhu Jayanti to All. 🌹*
*🕉. ప్రసాద్ భరద్వాజ*

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీమద్భగవద్గీత - 336 / Bhagavad-Gita - 336 🌹*
*✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ*

*🌴. 8వ అధ్యాయము - అక్షరబ్రహ్మ యోగం - 26 🌴*

*26. శుక్లకృష్ణే గతీ హ్యేతే జగత: శాశ్వతే మతే |*
* ఏకయా యాత్యనావృత్తిమన్యయావర్తతే పున: ||*

🌷. తాత్పర్యం :
*ఈ జగత్తు వీడుటకు వేదాభిప్రాయము ననుసరించి శుక్ల, కృష్ణములనెడి రెండు మార్గములు కలవు. శుక్లమార్గమునందు మరణించువాడు తిరిగిరాకుండును. కాని చీకటిమార్గమున మరణించువాడు మాత్రము వెనుకకు తిరిగివచ్చును.*

🌷. భాష్యము :
మరణము మరియు పునరాగమనములను ఇదే వివరణను శ్రీబలదేవవిద్యాభూషణులు ఛాందోగ్యోపనిషత్తు (5.10.3-5) నుండి ఉదాహరించిరి. 

కామ్యకర్మరతులు, తాత్వికకల్పనాపరులు అనంతకాలముగా ఇట్టి మరణము మరియు పునరాగమనములందు తగుల్కొనియున్నారు. శ్రీకృష్ణుని శరణుజొచ్చని కారణముగా వారెన్నడును దివ్యమైన చరమమోక్షమును పొందలేరు.
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Bhagavad-Gita as It is - 336 🌹*
*✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj*

*🌴 Chapter 8 - Akshara Brahma Yoga - 26 🌴*

*26 . śukla-kṛṣṇe gatī hy ete jagataḥ śāśvate mate*
*ekayā yāty anāvṛttim anyayāvartate punaḥ*

🌷 Translation : 
*According to Vedic opinion, there are two ways of passing from this world – one in light and one in darkness. When one passes in light, he does not come back; but when one passes in darkness, he returns.*

🌹 Purport :
The same description of departure and return is quoted by Ācārya Baladeva Vidyābhūṣaṇa from the Chāndogya Upaniṣad (5.10.3–5). 

Those who are fruitive laborers and philosophical speculators from time immemorial are constantly going and coming. Actually they do not attain ultimate salvation, for they do not surrender to Kṛṣṇa.
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 183 / Agni Maha Purana - 183 🌹*
*✍️. పుల్లెల శ్రీరామచంద్రుడు, 📚. ప్రసాద్ భరద్వాజ*
*శ్రీ గణేశాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ.*
*ప్రథమ సంపుటము, అధ్యాయము - 56*

*🌻. దశదిక్పతియాగ ము - 3 🌻*

*పూర్వాది దిక్కులలోనున్న ధ్వజములపై కుముద-కుముదాక్ష-పుండరీక-వామన-శంకుకర్ణ-సర్వనేత్ర-సుముఖ-సుప్రతిష్ఠితులను దేవతలను పూజింపవలెను. వీరందరును కోట్లకొలది సద్గుణములు కలవారు. ఎఱ్ఱని దొండపండువలె ఎఱ్ఱగాకాలిన నూడ ఇరువది ఎనిమిది కలశలను నాలుగు శేర్ల నీళ్లతోనింపి 'కాలదండ' మను యోగములేని సమయమున స్థాపింపవలెను. వీటి అన్నింటికి కంఠభాగమునందు వస్త్రములుకట్టి, వాటిలో సువర్ణము ఉంచి, తోరణముల వెలుపల ఉంచవలెను. వేదికి తూర్పుమొదలైన నాలుగు దిక్కులందును, కోణములందును గూడ కలశములు స్థాపింపవెలను. మొదట నాలుగు కలశములను పూర్వాది దిక్కులు నాల్గింటియందు "అజిఘ్ర కలశమ్‌" ఇత్యాది మంత్రము చదువుచు స్థాపింపవలెను.*

*ఆ కలశలపై, పూర్వాది దిక్కులందు దిక్పాలకులను అవాహనచేసి పూజింపవెలను. "ఐరావతముపై ఎక్కి, హస్తమున వజ్రము ధరించిన దేవరాజువైన ఇంద్రా! ఇతరదేవతలతో కూడ ఇచటికి రమ్ము; ఈ తూర్పు ద్వారమును రక్షింపిము; దేవతాసమేతుడవైన నీకు నమస్కారము'' అని ప్రార్థించుచు ఇంద్రుని ఆవహనచేసి, "త్రాతారమిన్ద్రమ్‌" ఇత్యాదిమంత్రము పఠించుచు పూజింపవలెను.*

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Agni Maha Purana - 183 🌹*
*✍️ N. Gangadharan 📚. Prasad Bharadwaj *

*Chapter 56*
*🌻Five divisions of installation - 3 🌻*

13-15. The presiding deities of the banners (hoisted) in the (quarters) east etc., such as Kumuda, Kumudākṣa, Puṇḍarīka, Vāmana, Saṅkarṣaṇa, Sarvanetra, Sumukha and Supratiṣṭhita, who are endowed with countless (divine) qualities should. be worshipped. One hundred and eight pitchers resembling the ripe bimba fruit (in colour), not having black spots and having been filled with water and gold and having pieces of cloth around their necks should be placed outside the arches.

16. Pitchers should be placed at the east and other directions. Four pitchers should be placed at the corners of the sacrificial altar with the sacred syllable ājighra.

17. After having invoked Indra and others in the pitchers. in the east etc. one should worship (Indra). O Indra, the lord of celestials, the wielder of thunderbolt, seated on the elephant you come.

18. (You) protect the eastern door in the company of celestials. May salutations be to you. After having worshipped (Indra) with the sacred syllable trātāram indra[1], the wise man should invoke him.

Continues....
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 48 / DAILY WISDOM - 48 🌹*
*🍀 📖. యోగా యొక్క తత్వశాస్త్రం నుండి 🍀*
*✍️. ప్రసాద్ భరద్వాజ*

*🌻 17. అనుభవించే దాని పట్ల చైతన్యం ఉండకపోతే ఆ జీవిత అనుభవం కలగదు 🌻*

*మన జీవితాన్ని మన అనుభవం నుండి విడదీయలేము. మనం జీవితం అని పిలుస్తున్నది అనుభవం తప్ప మరొకటి కాదు. ఇది గుర్తుంచుకోవడం ముఖ్యం. అనుభవం, దాని స్వభావం ఏదైనప్పటికీ, ఆ అనుభవం యొక్క చైతన్యం నుండి విడదీయరానిది. చైతన్యం లేకుండా అనుభవం లేదు. మనము ఒక ప్రక్రియలో ఉన్నామని లేదా అనుభవ స్థితిలో ఉన్నామనే ఎరుక మనకి ఉంది.*

*అవగాహన లేకుంటే, మనం ఎలాంటి అనుభవం లేని స్థితిలో ఉన్నామని చెప్పవచ్చు. అనుభవం లేకపోవడమంటే ఏమి జరుగుతుందో తెలియకపోవడమే. ఇప్పుడు, మన జీవితం అంటే అనుభవంతో సమానంగా ఉండటం మరియు వాస్తవికత కోసం మన అన్వేషణ శాస్త్రీయ పద్ధతిలో పరిశీలనాత్మకంగా మరియు ప్రయోగాత్మకంగా ఉండటంతో, బాహ్య ప్రకృతి శాస్త్రీయ కోణంలో మన జీవితం లో ఎలా ప్రతిబింబిస్తుందో, మన వ్యక్తిగత జీవితానికి ఎలా ముడిపడి ఉందో మనం కనుగొనాలి.*

*కొనసాగుతుంది...*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 DAILY WISDOM - 48 🌹*
*🍀 📖 Philosophy of Yoga 🍀*
📝 Swami Krishnananda, 📚. Prasad Bharadwaj

*🌻 17. There is no Experience without a Consciousness of It 🌻*

*Our life is inseparable from our experience. What we call life is nothing but experience, and this is important to remember. And experience, whatever be the nature of it, is inseparable from a consciousness of that experience. There is no experience without a consciousness of it. We are aware that we are undergoing a process or are in a state of experience. If the awareness is absent, we cannot be said to be in a state of any experience at all.*

*To have no experience is to have no awareness of what is happening. Now, our life being identical with a conscious experience, and our search for reality being observational and experimental in the scientific fashion, we have to find out how the panorama of external nature, as it stands before us from the point of view of science, is connected with our personal life.*

Continues...
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 313 🌹*
*✍️. సౌభాగ్య 📚. ప్రసాద్ భరద్వాజ*

*🍀. ప్రార్ధన అంటే, నేను చిన్నవాణ్ణి, సమస్తం లేదా సంపూర్ణత నాకు సహకరించకుంటే నేను ఏమీ చేయలేను' అని. ప్రార్థన అంటే అహం అనంతానికి లొంగిపోవడం. నిరాశతో కాదు. గాఢమయిన అవగాహనతో లొంగిపోవడం. 🍀*

*ప్రయాణం ప్రేమతో ఆరంభమై కాంతిలోనో జ్ఞానోదయంలోనో ముగుస్తుంది. దానికి ప్రార్థన వంతెన. సమస్త తీర్థయాత్ర, అజ్ఞానం నించి వివేకానికి సాగేవి. అది ప్రార్థనకు సంబంధించిన తీర్థయాత్ర. ప్రార్ధన అంటే, నేను చిన్నవాణ్ణి, సమస్తం లేదా సంపూర్ణత నాకు సహకరించకుంటే నేను ఏమీ చేయలేను' అని.*

*ప్రార్థన అంటే అహం అనంతానికి లొంగిపోవడం. నిరాశతో కాదు. గాఢమయిన అవగాహనతో లొంగిపోవడం. చిన్ని అల సముద్రానికి వ్యతిరేకంగా ఎలా వెళుతుంది? అసలు ప్రయత్నమన్నదే అసంగతం. కానీ మానవజాతి చేస్తున్నది అదే. అనంత చైతన్య సముద్రంలో మనం అల్పమైన అలలం. అనంత చైతన్య సముద్రాన్ని దేవుడు, సత్యం, జ్ఞానోదయం, నిర్వాణం తావో, ధర్మం ఏమైనా అనండి. వాటన్నిటి అర్థం ఒకటే.*

*సశేషం ...*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శివ సూత్రములు - 050 / Siva Sutras - 050 🌹*
*🍀. శివ ఆగమ తత్వశాస్త్రం యొక్క సూత్రములు 🍀*
*1- శాంభవోపాయ*
 *✍️. ప్రసాద్‌ భరధ్వాజ*

*🌻 16. శుద్ధ-తత్త్వ-సంధానద్-వాపశుశక్తిః - 2 🌻*
*🌴. స్వచ్ఛమైన పూర్ణత్వాన్ని ధ్యానించడం ద్వారా సాధకుడు బంధించే శక్తి నుండి విముక్తుడవుతాడు 🌴*

*విశ్వం స్వతహాగా ఎప్పుడూ స్వచ్ఛంగా ఉంటుందని సూచించడానికి శివుడు శుద్ధ-తత్త్వాన్ని ఉపయోగించాడు. కానీ కర్మ బాధల కారణంగా దానితో సంబంధం ఉన్న సహజ మలినాల (మల) కారణంగా వ్యక్తి స్వయం చైతన్యం అపరిశుభ్రంగా మారుతుంది. సాధన లేదా అభ్యాసం ద్వారా ఆశించే వ్యక్తి పదే పదే ఏకత్వాన్ని ధృవీకరించినప్పుడు, అతని వ్యక్తిగత చైతన్యం భిన్నత్వాన్ని పక్కకు నెట్టడం ద్వారా స్వచ్ఛంగా మారుతుంది. యోగి చేసేది ఇదే.*

*కొనసాగుతుంది...*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Siva Sutras - 050 🌹*
*🍀Aphorisms of philosophy of Shiva āgama 🍀*
Part 1 - Sāmbhavopāya
*✍️. Acharya Ravi Sarma, 📚. Prasad Bharadwaj*

*🌻 16. Śuddha-tattva-sandhānād-vāpaśuśaktiḥ - 2 🌻*
*🌴. By contemplating the pure principle one is free of the power that binds 🌴*

*Śiva has used Śuddha-tattva to point out that universe by itself always remains pure. But the individual self becomes impure because of natural impurities (mala) associated with it due to karmic afflictions. When an aspirant repeatedly affirms through sādhana or practice, his individual consciousness also becomes pure by pushing aside, the differentiated perception that binds an individual. This is what a yogi does.*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
#నిత్యసందేశములు #DailyMessages 
Join and Share 
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/
https://prasadbharadwaj.wixsite.com/dailybhaktimessages2
https://chaitanyavijnanam.tumblr.com/
https://www.kooapp.com/profile/Prasad_Bharadwaj

శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 437 - 1 / Sri Lalitha Chaitanya Vijnanam - 437 - 1


🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 437 - 1 / Sri Lalitha Chaitanya Vijnanam - 437 - 1 🌹

🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻

✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్

సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁

🍀 93. కుశలా, కోమలాకారా, కురుకుళ్ళా, కులేశ్వరీ ।
కుళకుండాలయా, కౌళ మార్గతత్పర సేవితా ॥ 93 ॥ 🍀

🌻 437. 'కుళేశ్వరీ’ - 1 🌻


సజాతీయ సమూహమున కీశ్వరి శ్రీమాత అని అర్థము. సజాతులు, విజాతులు యేర్పడుటకు కారణము త్రిగుణముల సమ్మేళము నందుగల వ్యత్యాసమే. గుణ సామ్యమును బట్టి కులము లేర్పడుచున్నవి. సత్త్వ, రజస్తమో గుణములు రకరకములుగ సమ్మేళనము చెందును. దాని వలన వివిధములగు స్వభావము లేర్పడు చుండును. సారూప్యముగల స్వభావము ఒకచోట చేరుచుండును. ఇట్టి కారణము గనే పండితులుగను, అధికారులుగను, వ్యాపారులుగను, సమూహము లేర్పడు చుండును. గుణమునుబట్టి కులము లేర్పడును అనునది సత్యము. ఇట్లు త్రిగుణము లాధారముగ గుంపులు గుంపులుగ శ్రీమాత జీవులను యేర్పరచుచు నుండును. ఏనుగులొక గుంపుగ నుండును. అవి సింహములతో కలియవు. అట్లే సింహములు తామొక గుంపుగనుండును.


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 437 - 1 🌹

Contemplation of 1000 Names of Sri Lalitha Devi

✍️ Prasad Bharadwaj

🌻 93. Kushala komalakara kurukulla kuleshvari
Kulakundalaya kaolamarga tatpara sevita ॥ 93 ॥ 🌻

🌻 437. 'Kuleshwari' - 1 🌻


It means that Srimata is the lord of homogenous groups. What are homogenous groups? These are groups of people who have similar proportions of the Satva, Rajas and Tamo Gunas. A Group is formed based on the similar proportions of these Trigunas. Sattva and Rajas and Tamas are in various proportions. Because of that difference in proportions in the trigunas, different natures will arise. Like natures come together. Scholars, officials, businessmen, are such group of people with similar natures. It is true that caste is formed by Guna (The composite outcome of the proportional mixing of Trigunas). Thus Srimata made beings in different groups based on these Gunas. Elephants are a group. They do not mix with lions. Lions are a group. Like birds, like humans.


Continues...

🌹 🌹 🌹 🌹 🌹

Osho Daily Meditations - 317. FUNDAMENTAL ALONENESS / ఓషో రోజువారీ ధ్యానాలు - 317. ప్రాథమిక ఒంటరితనం


🌹. ఓషో రోజువారీ ధ్యానాలు - 317 / Osho Daily Meditations - 317 🌹

✍️. ప్రసాద్ భరద్వాజ

🍀 317. ప్రాథమిక ఒంటరితనం 🍀

🕉. మన నుండి మనం పారిపోలేము. మార్గం లేదు - మీరు మీరే. మరియు ఒంటరితనం చాలా ప్రాథమికమైనది, దాని నుండి తప్పించుకోవడానికి మార్గం లేదు. 🕉


మీరు ఒంటరితనం నుండి తప్పించుకోవడానికి ఎంత ఎక్కువగా ప్రయత్నిస్తే, మీరు అంత ఒంటరితనాన్ని అనుభవిస్తారు. మీరు ఒంటరితనాన్ని అంగీకరించడం ప్రారంభిస్తే, మీరు దానిని ప్రేమించడం ప్రారంభిస్తే, మీరు దానిని ఆస్వాదించడం ప్రారంభిస్తే, ఒంటరితనం అంతా అదృశ్యమవుతుంది. ఆపై ఒంటరితనానికి విపరీతమైన అందం వచ్చి చేరుతుంది. మనం ఒంటరిగా తయారవుతాము. ఆ ఒంటరితనమే మన స్వేచ్ఛ. అది ప్రేమకు వ్యతిరేకం కాదు. నిజానికి ఒంటరిగా ఉండి ఒంటరిగా ఎలా ఉండాలో తెలిసిన వ్యక్తి మాత్రమే ప్రేమించగలుగుతాడు. ఇది ప్రేమ యొక్క వైరుధ్యం: ఒంటరిగా ఉన్న వ్యక్తి మాత్రమే ప్రేమించగలడు మరియు ప్రేమించే వ్యక్తి మాత్రమే ఒంటరి అవుతాడు. వారు కలిసే వుంటారు. కాబట్టి మీరు ఒంటరిగా ఉండలేకపోతే, మీరు ప్రేమలో కూడా ఉండలేరు. అప్పుడు మీ ప్రేమ అని పిలవబడేదంతా మీ నుండి తప్పించుకోవడం మాత్రమే అవుతుంది.

ఇది నిజమైన ప్రేమ కాదు, నిజమైన సంబంధం కాదు. ఎవరు ఎవరితో సంబంధం కలిగి ఉంటారు? మీరు మీతో కూడా సంబంధం కలిగి ఉండరు. మీరు మరొకరితో ఎలా సంబంధం కలిగి ఉంటారు? మీరు అక్కడ లేరు - ఇతరులతో ఎవరు సంబంధం కలిగి ఉంటారు? కాబట్టి ప్రపంచంలో ఒక తప్పుడు ప్రేమ ఉంది: మీరు మీ నుండి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు, మరొకరు మీ నుండి, మరియు తన నుండి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. మీరిద్దరూ ఒకరికొకరు ఆశ్రయం పొందుతున్నారు. ఇది పరస్పర మోసం. మొదటి విషయం ఏమిటంటే, ఒకరి ప్రాథమిక బ్రహ్మచర్యం అంటే మన ఒంటరితనం మన వ్యక్తిత్వం అని తెలుసుకోవడం. ఆ ఒంటరితనం నుండి వేడుక జరుగుతుంది. మీ ప్రేమ ఆ వేడుక నుండి పనిచేయాలి. అప్పుడు మీరు ప్రేమించ గలుగుతారు.


కొనసాగుతుంది...

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Osho Daily Meditations - 317 🌹

📚. Prasad Bharadwaj

🍀 317. FUNDAMENTAL ALONENESS 🍀

🕉. We cannot run away from ourselves. There is no way--you are you. And the aloneness is so fundamental that there is no way to escape it. 🕉


The more you try to escape from aloneness, the lonelier you will feel. If you start accepting aloneness, if you start being in love with it, if you start enjoying it, then all loneliness will disappear. And then aloneness has beauty, tremendous beauty. We are made alone. That aloneness is our freedom. And it is not against love. In fact, only a person who is alone and knows how to be alone will be able to love. This is the paradox of love: That only the person who is alone can love, and only the person who loves becomes alone. They come together. So if you are not capable of being alone, you will not be capable of being in love either. Then all your so-called love will be just an escape from yourself.

It will not be real love, it will not be real relating. Who will relate with whom? You have not even related with yourself; how can you relate with the other? You are not there-who is going to relate with others? So a false kind of love exists in the world: You are trying to escape from yourself, the other is trying to escape from herself or himself, and you are both seeking shelter in each other. It is a mutual deception. The first thing is to know one's celibacy, one's fundamental celibacy--to know that our aloneness is our very individuality. Function from that aloneness. Even your love has to function from that base. Then you will be able to love.


Continues...

🌹 🌹 🌹 🌹 🌹


శ్రీ శివ మహా పురాణము - 696 / Sri Siva Maha Purana - 696


🌹 . శ్రీ శివ మహా పురాణము - 696 / Sri Siva Maha Purana - 696 🌹

✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి 📚. ప్రసాద్ భరద్వాజ

🌴. రుద్రసంహితా-యుద్ద ఖండః - అధ్యాయము - 03 🌴

🌻. త్రిపుర వధోపాయం - 2 🌻


దేవతల మొరలాల కించిన హరి వారితో ఇలా అన్నాడు. “బృందారకులారా! శంకరుడు చెప్పింది సత్యమే. సనాతన ధర్మం ఉన్న చోట దుఃఖం ఉండదు. ధర్మ స్వరూపమే దైవం. నేను దేవతా పక్షపాతినని మీకు తెలుసు. ధర్మాచరణలో ఉన్న వానికి దైవంతోపనిలేదు. దైవం కూడా వానికి ఏ విధమైన మేలు కీడులు తల పెట్ట లేదు. వాడు ఆచరిస్తూన్న ధర్మమే వానికి సుఖాలను ఇస్తుంది.

ముందుగా త్రిపురాసురుల రాజ్యంలో సనాతన ధర్మానికి హాని కలిగించి వారిని తద్విపరీత మార్గావలంబులుగా చేస్తాను. ఇదే వారి వధోపాయం! దీనికి ప్రారంభ ఘట్టంగా వారిచేత శివపూజ మానిపిస్తాను. తరువాత కార్యం దానంతట అదే చక్కబడుతుంది. మీరు మీమీ నెలవులకు వెళ్ళండి.” నారాయణుని పల్కులకు సంతసించి సుపర్వులు తమతమ స్థానాలకు చేరుకొన్నారు.


సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹




🌹 SRI SIVA MAHA PURANA - 696🌹

✍️ J.L. SHASTRI, 📚. Prasad Bharadwaj

🌴 Rudra-saṃhitā (4): Yuddha-khaṇḍa - CHAPTER 03 🌴

🌻 Tripura Vadopayam - 2 🌻

Hari said to them after hearing the cries of the gods. “Guys! What Shankara said is true. Where there is sanatana dharma there is no sorrow. God is the embodiment of Dharma. You know I'm a deity bias. He who is in Dharmacharana has nothing to do with God. Even God does not give him any kind of good or bad. The dharma he practices gives him happiness.

First, I will harm Sanatana Dharma in the kingdom of Tripurasuras and make them the pathfinders of change. This is their strategy! As a starting point for this, I will perform Shiva Puja by them. Then the task will take care of itself. You go to your periods.” The Suparvas reached their respective places after receiving Narayan's praises.


Continues....

🌹🌹🌹🌹🌹


విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 735 / Vishnu Sahasranama Contemplation - 735


🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 735 / Vishnu Sahasranama Contemplation - 735🌹

🌻735. మాధవః, माधवः, Mādhavaḥ🌻

ఓం మాధవాయ నమః | ॐ माधवाय नमः | OM Mādhavāya namaḥ


జాతత్వాన్మధుకులే సమాధవః ప్రోచ్యతే బుధైః

'మధువు' అనునతని వంశమున జనించిన వాడు గనుక మాధవః.

72. మాధవః, माधवः, Mādhavaḥ

167. మాధవః, माधवः, Mādhavaḥ


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹




🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 735🌹

🌻735. Mādhavaḥ🌻

OM Mādhavāya namaḥ


जातत्वान्मधुकुले समाधवः प्रोच्यते बुधैः / Jātatvānmadhukule samādhavaḥ procyate budhaiḥ

Since (in one of the incarnations) He is born in the family of Madhu, He is also has a name of Mādhavaḥ.

72. మాధవః, माधवः, Mādhavaḥ

167. మాధవః, माधवः, Mādhavaḥ


🌻 🌻 🌻 🌻 🌻


Source Sloka

एकोनैकस्सवः कः किं यत्तत्पदमनुत्तमम् ।
लोकबन्धुर्लोकनाथो माधवो भक्तवत्सलः ॥ ७८ ॥

ఏకోనైకస్సవః కః కిం యత్తత్పదమనుత్తమమ్ ।
లోకబన్ధుర్లోకనాథో మాధవో భక్తవత్సలః ॥ 78 ॥

Ekonaikassavaḥ kaḥ kiṃ yattatpadamanuttamam,
Lokabandhurlokanātho mādhavo bhaktavatsalaḥ ॥ 78 ॥


Continues....

🌹 🌹 🌹 🌹🌹



కపిల గీత - 143 / Kapila Gita - 143


🌹. కపిల గీత - 143 / Kapila Gita - 143 🌹

🍀. కపిల దేవహూతి సంవాదం 🍀

✍️. శ్రీమాన్ క.రామానుజాచార్యులు, 📚. ప్రసాద్‌ భరధ్వాజ

🌴 3. ప్రకృతి పురుషుల వివేకము వలన మోక్షప్రాప్తి - 27 🌴

27. యదైవమధ్యాత్మరతః కాలేన బహుజన్మనా|
సర్వత్ర జాతవైరాగ్య ఆబ్రహ్మభువనాన్మునిః॥


తాత్పర్యము : మనుష్యుడు పెక్కుజన్మల యందు నిరంతరము ఇట్లు ఆత్మచింతన యందే నిమగ్నుడైనచో, అతనికి బ్రహ్మలోక పర్యంతము గల సకలభోగముల యెడ వైరాగ్యము ఏర్పడును.

వ్యాఖ్య : పరమేశ్వరునికి భక్తితో కూడిన సేవలో నిమగ్నమైన వారిని ఎవరైనా భక్తుడు అని పిలుస్తారు. కానీ స్వచ్ఛమైన భక్తులు మరియు మిశ్రమ భక్తుల మధ్య వ్యత్యాసం ఉంటుంది. ఒక మిశ్రమ భక్తుడు భగవంతుని అతీంద్రియ నివాసంలో సంపూర్ణ ఆనందం మరియు జ్ఞానంతో శాశ్వతంగా నిమగ్నమై ఉన్న ఆధ్యాత్మిక ప్రయోజనం కోసం భక్తి సేవలో నిమగ్నమై ఉంటాడు. భౌతిక అస్తిత్వంలో, ఒక భక్తుడు పూర్తిగా శుద్ధి కానప్పుడు, అతను భౌతిక దుఃఖాల నుండి ఉపశమనం రూపంలో భగవంతుని నుండి భౌతిక ప్రయోజనాన్ని ఆశిస్తాడు. లేదా అతను భౌతిక లాభాన్ని కోరుకుంటాడు.

పరమాత్మ మరియు జీవుని మధ్య ఉన్న సంబంధం గురించి జ్ఞానంలో పురోగతిని లేదా సర్వోన్నత ప్రభువు యొక్క వాస్తవ స్వభావానికి సంబంధించిన జ్ఞానం కోరుకుంటాడు. ఒక వ్యక్తి ఈ పరిస్థితులకు అతీతంగా ఉన్నప్పుడు, అతన్ని స్వచ్ఛమైన భక్తుడు అంటారు. అతను ఏ భౌతిక ప్రయోజనం కోసం లేదా భగవంతుని అవగాహన కోసం భగవంతుని సేవలో నిమగ్నమై ఉండడు. అతని ఏకైక ఆసక్తి ఏమిటంటే, అతను భగవంతుని యొక్క సర్వోన్నత వ్యక్తిని ప్రేమించడం మరియు ఆయనను సంతృప్తి పరచడంలో పూర్ణంగా నిమగ్నమై ఉండటము.


సశేషం..🌹 🌹 🌹 🌹 🌹




🌹 Kapila Gita - 143 🌹

🍀 Conversation of Kapila and Devahuti 🍀

📚 Prasad Bharadwaj

🌴 3. Salvation due to wisdom of Nature and Jeeva - 27 🌴

27. yadaivam adhyātma-rataḥ kālena bahu-janmanā
sarvatra jāta-vairāgya ābrahma-bhuvanān muniḥ


MEANING : When a person thus engages in devotional service and self-realization for many, many years and births, he becomes completely reluctant to enjoy any one of the material planets, even up to the highest planet, which is known as Brahmaloka; he becomes fully developed in consciousness.

PURPORT : Anyone engaged in devotional service to the Supreme Personality of Godhead is known as a devotee, but there is a distinction between pure devotees and mixed devotees. A mixed devotee engages in devotional service for the spiritual benefit of being eternally engaged in the transcendental abode of the Lord in full bliss and knowledge. In material existence, when a devotee is not completely purified, he expects material benefit from the Lord in the form of relief from material miseries, or he wants material gain.

Advancement in knowledge of the relationship between the Supreme Personality of Godhead and the living entity, or knowledge as to the real nature of the Supreme Lord. When a person is transcendental to these conditions, he is called a pure devotee. He does not engage himself in the service of the Lord for any material benefit or for understanding of the Supreme Lord. His one interest is that he loves the Supreme Personality of Godhead, and he spontaneously engages in satisfying Him.


Continues...

🌹 🌹 🌹 🌹 🌹


06 Mar 2023 Daily Panchang నిత్య పంచాంగము


🌹 06, మార్చి, March 2023 పంచాగము - Panchagam 🌹

శుభ సోమవారం, Monday, ఇందు వాసరే

మనందరికి ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని పరమాత్మని స్మరిస్తూ - ప్రసాద్ భరద్వాజ

🌻. పండుగలు మరియు పర్వదినాలు : మాస మఘమ్ ‌ (తమిళ), Masi Magam (Tamil) 🌻

🍀. శ్రీ శివ సహస్రనామ స్తోత్రం - 23 🍀


43. వజ్రహస్తశ్చ విష్కంభీ చమూస్తంభన ఏవ చ |
వృత్తావృత్తకరస్తాలో మధుర్మధుకలోచనః

44. వాచస్పత్యో వాజసనో నిత్యాశ్రమపూజితః |
బ్రహ్మచారీ లోకచారీ సర్వచారీ విచారవిత్

🌻 🌻 🌻 🌻 🌻


🍀. నేటి సూక్తి : ఆలోచనల నన్నిటినీ మనస్సులోంచి ఖాళీచెయ్యడం ధ్యానపద్ధతులలో నొకటిగా భగవద్గీత పేర్కొన్నది. ఒక విధంగా భగద్గీతకు అభిమాన పాత్రమైన పద్ధతి కూడ అదేననిపిస్తుంది. యంత్రప్రాయమైన ఆలోచనా క్రమపు బానిసత్వం నుండి మనస్సుకు విమోచన కల్పించి, స్వాతంత్ర్య పూర్వకంగా ఆలోచనాతీతమైన విజ్ఞానస్థాయికి మనలను చేర్చగల పద్ధతి ఇది. 🍀

🌷🌷🌷🌷🌷


శుభకృత్‌, శిశిర ఋతువు,

ఉత్తరాయణం, ఫాల్గుణ మాసం

తిథి: శుక్ల చతుర్దశి 16:18:57

వరకు తదుపరి పూర్ణిమ

నక్షత్రం: మఘ 24:05:26 వరకు

తదుపరి పూర్వ ఫల్గుణి

యోగం: సుకర్మ 20:54:07 వరకు

తదుపరి ధృతి

కరణం: వణిజ 16:15:56 వరకు

వర్జ్యం: 10:48:30 - 12:34:42

దుర్ముహూర్తం: 12:51:14 - 13:38:44

మరియు 15:13:45 - 16:01:15

రాహు కాలం: 08:00:17 - 09:29:21

గుళిక కాలం: 13:56:33 - 15:25:37

యమ గండం: 10:58:25 - 12:27:29

అభిజిత్ ముహూర్తం: 12:04 - 12:50

అమృత కాలం: 21:25:42 - 23:11:54

సూర్యోదయం: 06:31:12

సూర్యాస్తమయం: 18:23:45

చంద్రోదయం: 17:33:36

చంద్రాస్తమయం: 05:51:45

సూర్య సంచార రాశి: కుంభం

చంద్ర సంచార రాశి: సింహం

యోగాలు: ధ్వాo క్ష యోగం - ధననాశనం,

కార్య హాని 24:05:26 వరకు తదుపరి

ధ్వజ యోగం - కార్య సిధ్ధి

✍️. శ్రీ వక్కంతం చంద్రమౌళి

🌻 🌻 🌻 🌻 🌻




🍀. నిత్య ప్రార్థన 🍀

వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ

నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా

యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా

తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం

తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ

విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.

🌹🌹🌹🌹🌹