శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 64, 65 / Sri Lalitha Chaitanya Vijnanam - 64, 65

🌹. శ్రీ లలితా సహస్ర స్తోత్రము - 36 🌹

🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 64, 65 / Sri Lalitha Chaitanya Vijnanam - 64, 65 🌹
సహస్ర నామముల తత్వ విచారణ

✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

మూల మంత్రము :

🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁

🍀. పూర్తి శ్లోకము :

24. దేవర్షి ఘనసంఘాతా స్తుయమానాత్మ వైభవ

భండాసుర వదోద్యుక్త శక్తిసేన సమన్విత

64. 'దేవర్షిగణసంఘాత స్తూయమానాత్మ వైభవా'

దేవతల చేతను, ఋషిగణముల చేతను స్తుతింపబడుచున్న ఆత్మవైభవము కలదానా అని అర్థము.

దేవగణములైనను, ఋషి గణములైనను, గ్రహతారకాదులైనను సర్వ ప్రాణికోటి, అమ్మ యిచ్ఛ నుండి వ్యక్తమైనవారే. అందరి జీవనము అమ్మ యిచ్ఛపై ఆధారపడియున్నది. ఆమె అనుగ్రహించినచో జ్ఞానవంతులగుదురు. ఆగ్రహించినచో ఆమె మాయలో పడుదురు.

ఎంత తెలిసిన వాడైననూ అమ్మ మాయకు లోబడియే జీవించు చుండును. ఆమె మాయ నెవరునూ దాట లేరు. త్రిమూర్తులు సైతము ఆమె మాయకు లోబడియే యుందురు గనుక ఆమె అనుగ్రహమునకై నిరంతరము స్తుతించుచునే యుందురు.

ఇచ్ఛ, జ్ఞానము, క్రియ అమ్మ ఆత్మవైభవములే. అయ్యవారు తదతీతము. అందువలన సత్సంకల్పము, జ్ఞానము బంధింపని క్రియ, జీవునకు జరుగవలెనన్నచో అమ్మ ఆత్మవైభవమును స్తుతించుటయే శరణ్యము.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 64 🌹
1000 Names of Sri Lalitha Devi

✍️. Ravi Sarma
📚. Prasad Bharadwaj

🌻 64. Devarṣi-gaṇa- saṃghāta -stūyamānātma-vaibhavā देवर्षि-गण-संघात-स्तूयमानात्म-वैभवा (64)

From this nāma, till nāma 84, Her slaying of demon Bhaṇḍāsura is described. Deva + rṣi + gaṇa. Deva means gods and goddesses, rṣi means sage and gaṇa means demigods.

Agni purāṇa says that there are seven types of gaṇa-s. For example Rudra gaṇa-s mean the assistants or helpers to Śiva. There is a separate stanza (11) in Śrī Rudraṁ offering prayers to Rudra gaṇa-s.

Rṣi-s mean great sages like Vasiṣṭha, Nārada, etc. Nārada is also called Deva rṣi. She is worshipped by gods, goddesses, sages, demigods and goddesses. Stūyamānātma means worshipping.

Vaibhavā means all pervading. Only Brahman or Pramātman is all pervading. Deva-s and rṣi-s will not worship anybody below the grade of the Supreme Brahman. So this indirectly implies Her status of nirguṇa Brahman.

It is also said that sage Nārada (deva) approached Lalitai to slay demon Bhaṇḍāsura who was causing immense trouble to Deva-s and rṣi-s.

The deeper meaning of this nāma is - demons here mean the ego arising out of ignorance. Lalitā is approached by them to absolve them of their ego, as She alone is capable of absolving them. Sins are committed because of ego.

Continues...
🌹 🌹 🌹 🌹 🌹

🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 65 / Sri Lalitha Chaitanya Vijnanam - 65 🌹
సహస్ర నామముల తత్వ విచారణ

✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

మూల మంత్రము :

🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁

🍀. పూర్తి శ్లోకము :

24. దేవర్షి ఘనసంఘాతా స్తుయమానాత్మ వైభవ

భండాసుర వదోద్యుక్త శక్తిసేన సమన్విత

65. 'భండాసుర వధోద్యుక్త శక్తిసేనా సమన్వితా'

భండాసురుని వధించుటకు శక్తి సేనగా వృద్ధిచెంది ఉద్యుక్తు

రాలైనదానా అని అర్థము.

భండుడు బూడిదనుండి పుట్టినవాడు. శివుడు మన్మథుని తన కోపాగ్నిచే దహించినపుడు అతని శరీరము బూడిదైనది. అప్పటినుండి మన్మథు డనంగుడైనాడు. ఆ బూడిద మన్మథుని శరీర సౌందర్యమే కాక, రుద్రుని కోపము కూడ పొందియున్నది. దానిని గణపతి చూసి, ఆ బూడిదతో ఒక చిత్రమైన పురుషాకారము నిర్మింపజేసెను. అది జూచి బ్రహ్మ ఆశ్చర్యపడెను. “భండ భండ” అనెను. భండ అనగా ఆశ్చర్యము.

ఆశ్చర్యమగు రూపము గలవాడని అర్థము. తన ప్రసక్తి లేకయే పుట్టుట వలన కూడ బ్రహ్మ ఆశ్చర్యపడెను. రుద్రుని కోపాగ్నిని కలిగిన విభూతి నుండి భండుడు పుట్టుటచే అతడు రుద్ర స్వభావము కలిగిన వాడయ్యెను. రాక్షసుడయ్యెను. రుద్రుని కోపశక్తిని వధించుట కెవ్వరికిని సాధ్యము కాలేదు. అందువలన దేవతలచే, ఋషులచే స్తుతింపబడి, సృష్టి సంరక్షణార్థము శ్రీదేవియే అనంత శక్తి రూపములుగా మారి ఒక సేనగా యేర్పడి, సమభావముతో భండుని చంపుటకు సంకల్పించినది.

భండుడనగా సిగ్గు లేనివాడు అనికూడ అర్థము. సిగ్గు, లజ్జలేనిది, జడమైనది దేహ పదార్థము. దేహి దేహమున గల మమకారముచే జ్ఞాన హీనుడై సిగ్గు వదలి ప్రవర్తించును. ధర్మమును మరచును. జడుడై జీవించును. అట్టి జడత్వమును శ్రీదేవి వధించగలదు. జడత్వమును వధించి, జీవు నుద్ధరించుట సమభావమే కదా! ప్రేమభావమే కదా! అమ్మ భండుని వధించుట జీవు నుద్ధరించుట కొరకే. భండవధకే అమ్మ శక్తి సేనగా ఏర్పడినది. అవియే అనంతమగు జ్ఞానమార్గములు.

జీవులను రకరకములుగా ఉద్ధరించుటే తన కర్తవ్యముగా అమ్మ ఉద్యమించును. జగన్మాత కన్న ప్రేమమూరు లెవ్వరును లేరు.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 65 🌹
1000 Names of Sri Lalitha Devi

✍️. Ravi Sarma
📚. Prasad Bharadwaj

🌻 65. Bhaṇḍāsura- vadhodyukta- śakti-senā-samanvitā भण्डासुर-वधोद्युक्त-शक्ति-सेना-समन्विता (65) 🌻

She is ready with Her army to wage a war against Bhaṇḍāsura. Her army consists of various goddesses mentioned in Śrī Cakra.

There is a story associated with this nāma. Manmatha, the god of love was burnt by Śiva to ashes. Gaṇeśa, playfully collected the ashes of Manmatha and created a man. Brahma, the lord of creation on seeing Gaṇeśa’s act said bhaṇda bhaṇda meaning well done.

That was how the demon was named as Bhaṇḍāsura. Since Manmatha was burnt by the fierce fire of the third eye of Śiva, Bhaṇḍāsura was said to be all powerful. He was an embodiment of evils.

Bhaṇda also means bondage. Śiva Sūtra (I.2) says jñānam bhandaḥ. The explanation given to bhandaḥ is limited knowledge. This means ignorance is the cause for bondage. Bondage refers to attachments, desires etc.

Since lack of knowledge is the cause for duality, it is called bondage. If one has knowledge, he will say I am That (Brahman). Innate nature or unconditioned state of mind is called ānava mala. It refers to the limitation pertaining to empirical individual. It is the primal limiting condition which reduces universal consciousness to a jīva or individual soul.

This state of mind is called innate because, the mind does not realise the Brahman and as a result gets bonded. Liberation is needed to get out of this bondage. This liberation is possible only with knowledge.

There is another interpretation for such a situation in Śiva Sūtra (I.6) which says that by intense awareness, the various śakti-s (various acts of Śaktī) are united causing the disappearance of the universe (māyā or illusion and duality), leaving the Supreme Consciousness (the Brahman) to be realized. This process is nothing but Self-realization.

The secretive meaning of this nāma is – Lalitai is ready to give us liberation from the cycles of birth and death, provided we have inclination to know about Her.

Bhaṇḍāsura is an embodiment of ignorance and resultant evil acts. She is ready to wage a war against ignorance and its associated acts.

Continues...
🌹 🌹 🌹 🌹 🌹

Join and Share
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom Telegram group
🌹
https://t.me/ChaitanyaVijnanam

🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom Telegram Channel 🌹
https://t.me/Spiritual_Wisdom

Join and Share
🌹. శ్రీ లలితా దేవి చైతన్యము Sri Lalitha Devi Chatanyam 🌹

https://t.me/SriMataChaitanyam

JOIN, SHARE విష్ణు సహస్రనామ స్తోత్రము / Vishnu Sahasranama group.
https://t.me/vishnusahasra

Like and Share
https://www.facebook.com/విష్ణు-సహస్ర-నామ-తత్వ-విచారణ-Vishnu-Sahasranama-111069880767259/

🌹. దత్త చైతన్యము Datta Chaitanya 🌹
https://t.me/joinchat/Aug7pkulz9hgXzvrPfoVaA

🌹 చైతన్య విజ్ఞానం Chaitanya Vijnanam 🌹
https://www.facebook.com/groups/465726374213849/

JOIN 🌹. SEEDS OF CONSCIOUSNESS 🌹
https://t.me/Seeds_Of_Consciousness

31 Oct 2020

శ్రీ గజానన్ మహరాజ్ జీవిత చరిత్ర - 94 / Sri Gajanan Maharaj Life History - 94

🌹. శ్రీ గజానన్ మహరాజ్ జీవిత చరిత్ర - 94 / Sri Gajanan Maharaj Life History - 94 🌹

✍️. దాసగణు స్వామి
📚. ప్రసాద్ భరద్వాజ

🌻. 19వ అధ్యాయము - 2 🌻

భక్తులు హరిపాటిల్ కు తను షేగాంకు ముఖ్యుడని మరియు బుటే ఒకగొప్ప షాహుకారని, మరి సహజంగా ఒక ఏనుగు ఇంకొక ఏనుగుతో తలపడాలి తప్ప తమలాంటి నక్కకాదని గుర్తుచేసారు. జాంబుమాలితో యుద్ధానికి హనుమంతుని ఎన్నుకున్నారు, అర్జునుడిని కర్ణునితో, అలా అంటూ హరిపాటిల్ ను నాగపూరు వెళ్ళి శ్రీమహారాజును షేగాం వెనక్కు తేవలసిందిగా వాళ్ళు అర్ధించారు.

శ్రీకృష్ణుడు ఏవిధంగా అయితే అయిష్టంగా హస్తినాపూరులో బసచేసారో, అదేవిధంగా శ్రీమహారాజుకూడా అయిష్టంగానే శ్రీబుటేతో బసచేసారు, కానీ అతను అది లక్ష్య పెట్టక శ్రీమహారాజు షేగాం వెళ్ళేందుకు వదలలేదు. బుటే పవిత్రడు, మించిమనిషి అయినప్పటికీ ఆస్తిమీద చాలాగర్వం ఉండేది. శ్రీమహారాజుతో పాటు అనేకమంది ప్రజలకుకూడా ఇతను భోజనం పెట్టేవాడు, మరియు భజనలు రోజంతా జరిగేవి.

కానీ షేగాంనుండి వచ్చిన ప్రజలను శ్రీమహారాజును చూసేందుకు అనుమతించబడేవారు కాదు. ఒకసారి కొంతమంది శ్రీమహారాజును వెనక్కు తీసుకు రావడానికి షేగాంనుండి వెళ్ళారు కానీ వాళ్ళు రిక్తహస్తాలతో వెనక్కి రావలసి వచ్చింది. ఇక ఇప్పుడు గొప్పభక్తుడయిన హరిపాటిల్ కొంతమంది స్నేహితులతో శ్రీమహారాజును వెనక్కు తీసుకు వచ్చేందుకు నాగపూరు బయలుదేరాడు.

అతను షేగాంలో రైలు ఎక్కుతుంటే, నాగపూరులో ఓగోపాలా హరిపాటిల్ నాగపూరు వస్తున్నాడు, కాబట్టి అతను వచ్చేముందే నన్ను వెళ్ళనీ, అతను ఇక్కడికి చేరితే శాంతి భంగం అవుతుంది. అతను ఒక బాధ్యతగల అధికారి అని గుర్తుంచుకో. నీఆస్తి నీకు బలం కానీ అతను శరీరక బలంతో నన్ను తీసుకుపోతాడు అని శ్రీమహారాజు అన్నారు.

హరిపాటిల్ నాగపూరు చేరి, తనని అటకాయిస్తున్న కాపరి వాడిని ప్రక్కకుతోసి, బలపూర్వకంగా బుటే ఇంటిలో ప్రవేశించాడు. ఆ సమయంలో పెద్దపంక్తిలో బ్రాహ్మణులు భోజనం చేసేందుకు సిద్ధంగా కూర్చుని ఉన్నారు. వాళ్ళందరికీ వెండి కంచం, గిన్నెలలో వంటకాలు వడ్డించబడ్డాయి. మరియు వారందరికీ కూర్చునేందుకు సీసంచెక్కతో చేసిన పీటలు ఇవ్వబడ్డాయి. అనేక పదార్ధాలు వడ్డించబడ్డాయి. వాళ్ళమధ్యలో ఎత్తయిన అలకంరించబడిన ఆసనంమీద శ్రీమహారాజు కూర్చున్నారు. బుటే ఆర్ధివిషయం అటువంటిది. అతనిని నాగపూరు కుబేరుడు అని పిలవడం సమంజసమే.

శ్రీమహారాజు, హరిపాటిల్ను ద్వారంలో చూడగానే అవు ఏవిధంగా దూడని కలవడానికి త్వరగా వెళుతుందో అదేవిధంగా శ్రీమహారాజు లేచి అతన్ని కలిసేందుకు వెళ్ళారు. ఓహరీ మనంషేగాం వెళ్ళిపోదాం. నేను ఇక్కడ ఉండదలచుకోలేదు. నువ్వు రావడం మంచిదయింది అని శ్రీమహారాజు అన్నారు. శ్రీమహారాజు బయటకు వెళ్ళిపోతూఉంటే గోపాల్ బుటే పరుగున వచ్చి ఆయనకాళ్ళు పట్టు కుంటూ ఓమహారాజ్ నన్ను ఈవిధంగా తిరస్కరించకండి, దయచేసి భోజనంచేసి తరువాత మీకు ఎక్కడికి వెళ్ళాలన్నా వెళ్ళండి అని అన్నాడు.

తరువాత హరిపాటిల్ తో శ్రీమహారాజుతో పాటు ప్రసాదం తీసుకుని తనకు ఉపకారం చేయమని, ఆయన ఇక ఏమాత్రం ఉండరని నేను అర్ధం చేసుకున్నాను. ఈబ్రాహ్మణుల సమక్షంలో నాగౌరవం కాపాడమని మిమ్మల్ని అర్ధిస్తున్నాను. శ్రీమహారాజు భోజనం తీసుకోకుండా వెళ్ళిపోతే ఈ బ్రాహ్మణులు కూడా తినరు, అది నాకు ఈ నాగపూరులో ఒక గొప్ప అవమానం, తిరస్కృతి అవుతాయి అని బుటే అన్నాడు. అతను అంగీకరించి, శ్రీమహారాజు, మరియు ఇతర షేగాం భక్తులతో ఆగి భోజనం చేసారు.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

🌹 Sri Gajanan Maharaj Life History - 94 🌹

✍️. Swamy Dasaganu
📚. Prasad Bharadwaj

🌻 Chapter 19 - part 2 🌻

The devotees reminded Hari Patil that he was the head of Shegaon and Buty a great Savkar, and as such only an elephant can fight another elephant.

Maruti was selected to fight Jambu Mali and Arjuna to fight Karna. Saying so, they requested Hari Patil to go to Nagpur to bring back Shi Maharaj to Shegaon. In fact Shri Gajanan Maharaj stayed unwillingly with Shri Buty just like Shrikrishna who stayed most unwillingly at Hastinapur.

Shri Gajanan Maharaj repeatedly asked Buty to let him go to Shegaon, but he ignored this request and did not allow Shri Gajanan Maharaj to go to Shegaon. Though Buty was a pious and a good person, he was too proud of his wealth. Along with Shri Gajanan Maharaj he used to feed scores of people, and continued the singing of Bhajans throughout the day.

However, people from Shegaon were not permitted to see Shri Gajanan Maharaj Once some people from Shegaon went to bring back Shri Gajanan Maharaj , but they had to return empty handed. Now it was the great devotee, Hari Patil, who along with some friends, started for Nagpur to bring back Shri Gajanan Maharaj .

As Patil was entering the train at Shegaon, Shri Gajanan Maharaj said to Buty, O Gopal, Hari Patil is coming to Nagpur, so let me go from here before he comes. When he reaches here, all the peace will be lost. Mind that he is an executive officer. Your strength is your wealth but he will take me away by his physical strength.

Hari Patil arrived at Nagpur and entered Buty's house by force, pushing aside the watchman who tried to obstruct his entry. At that time a row of Brahmins was getting ready to have lunch at Gopal Buty’s grand residence. All of them were served food in silver plates and bowls, and had sisam wood planks to sit on. Several dishes were served to them.

At the centre of these people was a raised and decorated seat on which Shri Gajanan Maharaj was sitting. Such was the show of Buty's wealth; he was rightly called the Kubera of Nagpur. As Shri Gajanan Maharaj saw Hari Patil at the door He got up and rushed to meet him, like a cow rushing to meet its calf. Shri Gajanan Maharaj said, O Hari, come, let us go back to Shegaon, I don't want to stay here. It is good that you have come.

As Shri Gajanan Maharaj was heading out, Gopal Buty rushed and, respectfully, caught a hold of Maharaj’s feet and said, O Maharaj, please do not reject me like this. Kindly take meals and then go wherever You like. Then he said to Hari Patil, Please oblige me by taking Prasad with Shri Gajanan Maharaj and then go.

I have understood that He won't stay here anymore. I request you to protect my prestige in the presence of these Brahmins. If Shri Gajanan Maharaj leaves now, without taking any food, all these Brahmins too will not eat and it will then, be a matter of great shame and condemnation for me in Nagpur.

He agreed, and then Shri Gajanan Maharaj , along with all the Shegaon devotees stayed and took meals at Buty’s residence.

Continues...
🌹 🌹 🌹 🌹 🌹

Facebook, WhatsApp & Telegram groups, WordPress:
https://incarnation14.wordpress.com/2020/09/23/social-media-groups-channels-telegram-facebook-whatsapp-etc/

31 Oct 2020

కఠోపనిషత్‌ వివరణ - చలాచలభోధ - 90

🌹. కఠోపనిషత్‌ వివరణ - చలాచలభోధ - 90 🌹

✍️. సద్గురు శ్రీ విద్యాసాగర్
📚. ప్రసాద్ భరద్వాజ

🌻. ఆత్మను తెలుసుకొను విధము -20
🌻

తత్ర సత్త్వం నిర్మలత్వాత్ ప్రకాశకమనామయమ్

సుఖసంగేన బధ్నాతి జ్ఞానసంగేన చానఘ

సత్వగుణ విశేషం వర్తిస్తుందని మనకు భగవద్గీతలో స్పష్టంగా చెప్పారు. నిర్మలమైనటువంటి బుద్ధి కలుగుతుంది. ఇతరులతో పోల్చి చూస్తే జ్ఞాన విశేషం కలుగుతుంది. ఎల్లప్పుడూ సుఖముగా ఉండేటువంటి స్థితి, ప్రయత్న రహిత స్థితిగా సత్వగుణంలో ఉన్నప్పుడు, ఎల్లప్పుడూ సుఖంగానే ఉండేటు వంటి స్థితి కలుగుతుంది. అయితే,

రజో రాగాత్మకం విద్ధి తృష్ణాసంగసముద్భవమ్

తన్నిబధ్నాతి కౌంతేయ కర్మసంగేన దేహినమ్

కర్మబంధము యొక్క తగులుకోవడమనేది రజోగుణ ధర్మం వల్లనే కలుగుతుంది. కాబట్టి, ప్రయత్నించి రజోగుణ ధర్మాన్ని విడవాలి. ప్రయత్నించి చంచలబుద్ధిని విడవాలి. ప్రయత్నించి ఇంద్రియార్థములను నిగ్రహించాలి. ఇంద్రియములను నిగ్రహించాలి. ఇంద్రియములను ఇంద్రియార్థములందు ప్రవేశింపనివ్వకుండుట.

ఏది ఆలోచిస్తే మనకు చంచల లక్షణం పెరిగిపోతుందో, ఆలోచన పరుగుపెడుతుందో, ఆ ఆలోచన ప్రారంభ స్థితిలో ఉండగానే, ఇది నాకు హానికరము అని గుర్తించి విరమించాలి. దానిని అట్లాగే కొనసాగించినట్లయితే నీవు రజోగుణ ధర్మానికి ఊతం ఇచ్చిన వాడవు అవుతావు. అప్పుడు ఏం చేయాలి మరి? ఎట్లా విరమించాలి అనేది ప్రశ్న? అక్కడల్లా దైవ నామ స్మరణ చేయాలి.

ఎప్పుడెప్పుడైతే, నీకు రజోగుణ ధర్మం ప్రారంభమై, నీకు చంచల లక్షణం కలుగుతుందో, మనోవ్యాకులత కలుగుతుందో, మనస్సుకి విక్షేప లక్షణం కలుగుతుందో, అప్పుడప్పుడల్లా నువ్వు ఈశ్వర నామ స్మరణ చేయాలి. భగవన్నామ స్మరణ చేయాలి. పరమాత్మను స్మరించాలి. సద్గురుమూర్తిని స్మరించాలి. జపం చేయాలి. అప్పుడప్పుడల్లా నువ్వు మానసిక జపం చేయాలి. అయితే రోజుకు ఎన్నిసార్లు చేయాలి ఈ మానసిక జపం ఇప్పుడు? ఎప్పుడెప్పుడైతే, మనస్సు రజోగుణ ధర్మానికి లోనైనప్పుడల్లా నువ్వు దానిని విరమింపచేయడానికి మనస్సుకి విరమించడానికి ఒకే ఒక్క సాధనం.... “జపతోనాస్తి పాతకః”

‘పాతకము’ అంటే అర్థం ఏమిటంటే, ఈ రజోగుణ ధర్మాన్ని అనుసరించి జీవించడమే పాతకమంటే! అంటే, ఇతరులు నొచ్చుకునేటట్లుగా చేసేటటువంటి లక్షణం మనలో బలపడుతుంది. ఇతరులను బాధింప చేసేటటువంటి లక్షణం మనలో బలపడుతుంది. తద్వారా మరొక మెట్టు దిగి తమోగుణ ధర్మంలోకి వెళ్ళి తాను కూడా బాధ పడతాడు.

ఈ రజోగుణ ధర్మం రజోగుణ ధర్మంలోనే పూర్తి అవ్వదు అది. అది మరో మెట్టు జారిపోతుంది కాలక్రమంలో. ఎంతో సేపు పట్టదు. ఒక నిమిషం, రెండు నిమిషాలు, ఐదు నిమిషాలలోపలే అది యాక్షన్‌, రియాక్షన్‌ లకు గురై, చర్యా ప్రతి చర్యలకు లోనై, వెంటనే తమోగుణ ధర్మంలోకి మారిపోతుంది.

తమస్త్వజ్ఞానజం విద్ధి మోహనం సర్వదేహినామ్ !

ప్రమాదాలస్యనిద్రాభిః తన్నిబధ్నాతి భారత !!

ప్రమాదము, ఆలస్యము, నిద్ర, భయము అనేటటువంటి వాటికి లోనయ్యేటట్లుగా చేస్తుంది. వీటిలో ఏదో ఒక ఫలితం వచ్చేస్తుంది తప్పక. తమోగుణంలోకి ప్రవేశించగానే అయితే ప్రమాదమో, లేకపోతే ఆలస్యమో, లేకపోతే నిద్రో, లేకపోతే భయమో ఈ నాల్గింటిలో ఏదో ఒక లక్షణం కలుగుతుంది.

ఈ నాలుగు లక్షణాలలో ఏ లక్షణం కలిగినా వెంటనే మనం గుర్తించాలి. ఓహో! తమోగుణంలోకి జారిపోయాను. అప్పుడు వ్యాకులత ఇంక ఘనిష్టం అయిపోతుంది. బలపడిపోతుంది. ఎంతగా బలపడిపోతుందయ్యా అంటే, ఇహ లేచి కూర్చుని దాన్ని సాధన చేయాలన్నమాట! - విద్యా సాగర్ గారు

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

Facebook, WhatsApp & Telegram groups, WordPress:
https://incarnation14.wordpress.com/2020/09/23/social-media-groups-channels-telegram-facebook-whatsapp-etc/

31 Oct 2020

శ్రీ దేవీ మహత్యము - దుర్గా సప్తశతి - 21 / Sri Devi Mahatyam - Durga Saptasati - 21

🌹. శ్రీ దేవీ మహత్యము - దుర్గా సప్తశతి - 21 / Sri Devi Mahatyam - Durga Saptasati - 21 🌹

✍️. మల్లికార్జున శర్మ
📚. ప్రసాద్ భరద్వాజ

అధ్యాయము 5

🌻. దేవీ దూతసంవాదం -6
🌻

111. ఓ శోభనాంగీ! దేవతల, గంధర్వుల, నాగుల వద్ద ఉన్న రత్నతుల్యాలైన ఇతర వస్తువులన్ని ఇప్పుడు నా వద్దనే ఉన్నాయి.

112. ఓ దేవీ! మేము నిన్ను ప్రపంచ స్త్రీలందరిలో రత్నసమానమైన

దానిగా తలచుచున్నాం. అటువంటి నీవు నన్ను చేరు. రత్నతుల్యములైన వస్తువుల నంన్నిటిని అనుభవించేవారం మేమే కదా.

113. ఓ క్రాలుగంటీ! నీవు రత్నసమానవడం చేత నన్ను గాని, మహాపరాక్రమశాలి అయిన నా తమ్ముడు నిశుంభుణ్ణి గాని సేవించు.

114. నన్ను పెళ్ళాడితే, అసమాన మహాసంపద నీకు లభింస్తుంది. నీ మదిలో ఇది చక్కగా ఆలోచించుకుని నా భార్యవు కమ్ము.

115-116. ఋషి పలికెను : ఇలా చెప్పగా, ఈ జగత్తును భరించే శరణ్య, శుభంకరి అయిన దుర్గాదేవి లోననవ్వుకొని గంభీరంగా ఇట్లనెను :

17–118. దేవి పలికెను: నీవు సత్యాన్నే పలికావు. ఈ విషయంలో నీవు కొద్దిపాటి అసత్యమైనా చెప్పలేదు. శుంభుడు త్రైలోక్య సార్వభౌముడే. నిశుంభుడూ అట్టివాడే.

119. కాని ఈ విషయంలో నేను దృఢనిశ్చయంతో ఆడిన మాటను బొంకు చేయడమెలా? మునుపు నేను అల్పబుద్ధినై చేసిన ప్రతిజ్ఞను విను.

120. యుద్ధంలో నన్ను ఎవడు ఓడిస్తాడో, నా గర్వాన్ని ఎవడు పోగొడతాడో, నా బలానికి లోకంలో సమానుడెవడో, అతడే నాకు భర్త అవుతాడు.

121. కాబట్టి ఇక్కడకు శుంభుడైనా, నిశుంభ మహాసురుడైనా వచ్చు గాక, నన్ను ఓడించి నాతో వెంటనే పాణిగ్రహణం చేయు గాక. జాగు ఎందుకు?

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

🌹 Sri Devi Mahatyam - Durga Saptasati - 21 🌹

✍️. P. R. Ramachander
📚 Prasad Bharadwaj

CHAPTER 5:

🌻 Devi's conversation with the messenger - 6
🌻

111. "O beautiful lady, whatever other rare objects there existed among the devas, the gandharvas and nagas are now with me.

112. "We look upon you, O Devi, as the jewel of womankind in the world. You who are such, come to me, since we are the enjoyers of the best objects.

113. "Take to me or to my younger brother Nishumbha of great prowess, O unsteady-eyed lady, for you are in truth a jewel.

114. "Wealth, great and beyond compare, you will get by marrying me. Think over this in your mind, and become my wife."' The Rishi said:

115-116. Thus told, Durga the adorable and auspicious, by whom this universe is supported, then became serene and said. The Devi said:

117-118. You have spoken truth; nothing false has been uttered by you in this matter. Shumbha is indeed the sovereign of the three worlds an likewise is also Nishumbha.

119. 'But in this matter, how can that which has been promised be made false? Hear what promise I had made already out of foolishness.

120. "He who conquers me in battle, removes my pride and is my match is strength in the world shall be my husband."

121. 'So let Shumbha come here then, or Nishumbha the great asura. Vanquishing me here, let him soon take my hand in marriage. Why delay?' The messenger said:

Continues....
🌹 🌹 🌹 🌹 🌹

Facebook, WhatsApp & Telegram groups, WordPress:
https://incarnation14.wordpress.com/2020/09/23/social-media-groups-channels-telegram-facebook-whatsapp-etc/

31 Oct 2020

విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 82, 83 / Vishnu Sahasranama Contemplation - 82, 83

🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 82, 83 / Vishnu Sahasranama Contemplation - 82, 83 🌹

📚. ప్రసాద్ భరద్వాజ

🌻 82. కృతజ్ఞః, कृतज्ञः, Kr̥tajñaḥ 🌻

ఓం కృతజ్ఞాయ నమః | ॐ कृतज्ञाय नमः | OM Kr̥tajñāya namaḥ

కృతం (ప్రాణినాం పుణ్యా పుణ్యాత్మకం కర్మ) జానాతి ఆయా ప్రాణుల పుణ్యా పుణ్య కర్ములను ఎరిగియుండును. లేదా తనకు భక్తులచే అర్పణ చేయబడిన దానిని కరుణతో ఎరుగును. ఉపాసకులు తనకు పత్ర పుష్పాదికమును ఈయగా దానిని అనంత కరుణతో ఎరిగి వారికి మోక్షమును ఇచ్చును.

:: పోతన భాగవతము - దశమ స్కందము, కుచేలోపాఖ్యానము ::

వ. అట్టి పురుషోత్తముండు భక్తినిష్ఠులైన సజ్జనులు లేశమాత్రంబగు పదార్థంబైన భక్తిపూర్వకంబుగా సమర్పించిన నది కోటిగుణితంబుగాఁ గైకొని మన్నించుటకు నిదియ దృష్టాంతంబు గాదె! మలిన దేహుండును, జీర్ణాంబరుండు నని చిత్తంబున హేయంబుగాఁ బాటింపక నా చేనున్న యడుకు లాదరంబున నారగించి నన్నుం గృతార్థునిం జేయుట యతని నిర్హేతుక దయయ కాదె! యట్టి కారుణ్య సాగరుండైన గోవిందుని చరణారవిందంబుల యందుల భక్తి ప్రతిభవంబునఁ గలుగుం గాక! యని యప్పుండరీకాక్షుని యందుల భక్తి తాత్పర్యంబునం దగిలి పత్నీసమేతుండై నిఖిల భోగంబులయందు నాసక్తిం బొరయక, రాగాది విరహితుండును నిర్వికారండునునై యఖిలక్రియలయందు ననంతుని యనంతధ్యాన సుధారసంబునం జొక్కుచు విగతబంధనుండై యపవర్గప్రాప్తి నొందె; మఱియును.

భక్తి తత్పరులైన సజ్జనులు సమర్పించిన పదార్థం లేశ మాత్రమే అయినా భగవంతుడు దానిని కోటానుకోట్లుగా భావించి స్వీకరించి భక్తులను అనుగ్రహిస్తాడనటానికి నా (కుచేలుని) వృత్తాంతమే తార్కాణం. మాసిన నా శరీరాన్ని, చినిగిన బట్టల్నీ చూచి శ్రీకృష్ణుడు మనస్సులోనయినా ఏవగించుకోలేదు. నా వద్దనున్న అటుకులను ప్రీతితో ఆరగించి నన్ను ధన్యుణ్ణి చేయడంలో అచ్యుతుని నిర్హేతుక వాత్సల్యం అభివ్యక్తమౌతూ ఉంది. అంతటి కరుణాసాగరుడైన గోవిందుని పాదారవిందాలమీద నాకు జన్మజన్మలకూ నిండైన భక్తి నెల్కొని ఉండు గాక! ఈ రీతిగా తలపోసి హరిస్మరణం మరవకుండా కుచేలుడు తన ఇల్లాలితో కలిసి జీవించాడు. భోగాలపై ఆసక్తి లేకుండా రాగద్వేషాది ద్వంద్వాల కతీతుడై, నిర్వికారుడై, హరిభక్తి సుధారస వాహినిలో ఓలలాడుతూ భవబంధాలను బాసి ముక్తుడయ్యాడు.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION - 82🌹

📚. Prasad Bharadwaj

🌻 82. కృతజ్ఞః, कृतज्ञः, Kr̥tajñaḥ 🌻

ఓం కృతజ్ఞాయ నమః | ॐ कृतज्ञाय नमः | OM Kr̥tajñāya namaḥ

Kr̥taṃ (prāṇināṃ puṇyā puṇyātmakaṃ karma) jānāti / कृतं (प्राणिनां पुण्या पुण्यात्मकं कर्म) जानाति One who knows everything about what has been done (Kr̥ta) by Jīvas. Even to those who make a small offering of leaf, flower etc., He grants Mokṣa (liberation).

Śrīmad Bhāgavata - Canto 10, Chapter 81

Kiñcitkarotvurvapi yatsvadattaṃ

Suhr̥tkr̥taṃ phalgvapi bhūrikārī,

Mayopaṇītaṃ pr̥thukaikamuṣṭiṃ

pratyagrahītprītiyuto mahātmā. (35)

:: श्रीमद्भागवते महापुराणे दशमस्कन्धे, नामैकाशीतितमोऽध्यायः ::

किञ्चित्करोत्वुर्वपि यत्स्वदत्तं

सुहृत्कृतं फल्ग्वपि भूरिकारी ।

मयोपणीतं पृथुकैकमुष्टिं

प्रत्यग्रहीत्प्रीतियुतो महात्मा ॥ ३५ ॥

The Lord considers even His greatest benedictions to be insignificant, while He magnifies even a small service rendered to Him by His devotee. Thus with pleasure the Supreme Soul accepted a single palmful of the flat rice I brought Him.

🌻 🌻 🌻 🌻 🌻

Source Sloka

ईश्वरो विक्रमी धन्वी मेधावी विक्रमः क्रमः ।अनुत्तमो दुरादर्षः कृतज्ञः कृतिरात्मवान् ॥ ९ ॥

ఈశ్వరో విక్రమీ ధన్వీ మేధావీ విక్రమః క్రమః ।అనుత్తమో దురాదర్షః కృతజ్ఞః కృతిరాత్మవాన్ ॥ ౯ ॥

Īśvaro vikramī dhanvī medhāvī vikramaḥ kramaḥ ।Anuttamo durādarṣaḥ kr̥tajñaḥ kr̥tirātmavān ॥ 9 ॥

Continues....
🌹 🌹 🌹 🌹 🌹

🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 83 / Vishnu Sahasranama Contemplation - 83 🌹

📚. ప్రసాద్ భరద్వాజ

🌻 83. కృతిః, कृतिः, Kr̥tiḥ 🌻

ఓం కృతయే నమః | ॐ कृतये नमः | OM Kr̥taye namaḥ

ప్రయత్నమునకు కృతి అని వ్యవహారము లేదా ఏ క్రియనైననూ 'కృతి' అనదగును. పరమాత్ముడు సర్వాత్మకుడును అన్నిటికిని ఆశ్రయమును కావున ఆట్టి కృతి శబ్దముచే పరమాత్ముడే చెప్పబడును.

:: భగవద్గీతా - కర్మ యోగము ::

న హి కశ్చిత్క్షణమపి జాతు తిష్ఠత్యకర్మకృత్ ।

కార్యతే హ్యవశః కర్మ సర్వః ప్రకృతిజైర్గుణైః ॥ 5 ॥

(ప్రపంచమున) ఎవడును ఒక్క క్షణకాలమైననూ కర్మచేయక ఉండనేరడు. ప్రకృతివలన బుట్టిన గుణములచే ప్రతివాడును సహజసిద్ధముగ కర్మలను చేయుచునే ఉన్నాడు.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION - 83 🌹

📚. Prasad Bharadwaj

🌻 83. Kr̥tiḥ 🌻

OM Kr̥taye namaḥ

Kr̥ti means effort. Or the act itself. Or being soul of all, He is considered as the basis of every act.

Bhagavad Gītā - Chapter 3

Na hi kaścitkṣaṇamapi jātu tiṣṭhatyakarmakr̥t,

Kāryate hyavaśaḥ karma sarvaḥ prakr̥tijairguṇaiḥ. (5)

:: भगवद्गीता - कर्म योग ::

न हि कश्चित्क्षणमपि जातु तिष्ठत्यकर्मकृत् ।

कार्यते ह्यवशः कर्म सर्वः प्रकृतिजैर्गुणैः ॥ ५ ॥

No one ever remains even for a moment without doing work. For all are made to work under compulsion by the guṇās born of Nature.

🌻 🌻 🌻 🌻 🌻

Source Sloka

ईश्वरो विक्रमी धन्वी मेधावी विक्रमः क्रमः ।अनुत्तमो दुरादर्षः कृतज्ञः कृतिरात्मवान् ॥ ९ ॥

ఈశ్వరో విక్రమీ ధన్వీ మేధావీ విక్రమః క్రమః ।అనుత్తమో దురాదర్షః కృతజ్ఞః కృతిరాత్మవాన్ ॥ ౯ ॥

Īśvaro vikramī dhanvī medhāvī vikramaḥ kramaḥ ।Anuttamo durādarṣaḥ kr̥tajñaḥ kr̥tirātmavān ॥ 9 ॥

Continues....
🌹 🌹 🌹 🌹 🌹

Facebook, WhatsApp & Telegram groups, WordPress:
https://incarnation14.wordpress.com/2020/09/23/social-media-groups-channels-telegram-facebook-whatsapp-etc/

31 Oct 2020

శ్రీ విష్ణు సహస్ర నామములు - 50 / Sri Vishnu Sahasra Namavali - 50

🌹. శ్రీ విష్ణు సహస్ర నామములు - 50 / Sri Vishnu Sahasra Namavali - 50 🌹

నామము - భావము

📚. ప్రసాద్ భరద్వాజ

🌻. ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్ 🌻

కన్యా రాశి- హస్త నక్షత్రం 2వ పాద శ్లోకం

🌻 50. స్వాపనః స్వవశో వ్యాపీ నైకాత్మా నైకకర్మకృత్|
వత్సరో వత్సలో వత్సీ రత్నగర్భో ధనేశరః|| 🌻

🍀 465) స్వాపన: -
తన మాయచేత ప్రాణులను ఆత్మజ్ఞాన రహితులుగాజేసి నిద్రపుచ్చువాడు.

🍀 466) స్వవశ: -
సర్వ స్వతంత్రమైనవాడు.

🍀 467) వ్యాపీ -
సర్వత్ర వ్యాపించియున్నవాడు.

🍀 468) నైకాత్మా -
అనేక రూపములలో విరాజిల్లువాడు.

🍀 469) నైక కర్మకృత్ -
సృష్టి, స్థితి, లయము మున్నగు అనేక కార్యములు చేయువాడు.

🍀 470) వత్సర: -
సర్వులకు వాసమైనవాడు.

🍀 471) వత్సల: -
భక్తులపై అపరిమిత వాత్సల్యము కలవాడు.

🍀 472) వత్సీ -
తండ్రి వంటివాడు.

🍀 473) రత్నగర్భ: -
సాగరము వలె తన గర్భమున రత్నములు గలవాడు.

🍀 474) ధనేశ్వర: -
ధనములకు ప్రభువు.

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹

🌹 Vishnu Sahasra Namavali - 49 🌹

Name - Meaning

📚 Prasad Bharadwaj

🌻 OM NARAYANAYA VIDMAHE VASUDEVAYA DHIMAHI । 
TANNO VISHNU PRACHODAYAT ॥ 🌻

Sloka for Kanya Rasi, Hasta 2nd Padam

🌻 50. svāpanassvavaśō vyāpī naikātmā naikakarmakṛt |
vatsarō vatsalō vatsī ratnagarbhō dhaneśvaraḥ || 50 || 🌻

🌻 465. Svāpanaḥ:
One who enfolds the Jivas in the sleep of Ajnana.

🌻 466. Svavaśaḥ:
One who is dominated by oneself and not anything else, as He is the cause of the whole cosmic process.

🌻 467. Vyāpī:
One who interpenetrates everything like Akasha.

🌻 468. Naikātmā:
One who manifests in different forms as the subsidiary agencies causing the various cosmic processes.

🌻 469. Naikakarmakṛt:
One who engages in innumerable activities in the process of creation, sustentation, etc.

🌻 470. Vatsaraḥ:
One in whom everything dwells.

🌻 471. Vatsalaḥ:
One who has love for His devotees.

🌻 472. Vatsī:
One who protects those who are dear to Him.

🌻 473. Ratnagarbhaḥ:
The Ocean is so called because gems are found in its depths. As the Lord has taken the form of the ocean, He is called by this name.

🌻 474. Dhaneśvaraḥ:
One who is the Lord of all wealth.

Continues...

🌹 🌹 🌹 🌹 🌹

Join and Share
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom Telegram group 🌹

https://t.me/ChaitanyaVijnanam

🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom Telegram Channel 🌹
https://t.me/Spiritual_Wisdom

Join and Share
🌹. శ్రీ లలితా దేవి చైతన్యము Sri Lalitha Devi Chatanyam 🌹

https://t.me/SriMataChaitanyam

JOIN, SHARE విష్ణు సహస్రనామ స్తోత్రము / Vishnu Sahasranama group.
https://t.me/vishnusahasra

Like and Share
https://www.facebook.com/విష్ణు-సహస్ర-నామ-తత్వ-విచారణ-Vishnu-Sahasranama-111069880767259/

🌹. దత్త చైతన్యము Datta Chaitanya 🌹
https://t.me/joinchat/Aug7pkulz9hgXzvrPfoVaA

🌹 చైతన్య విజ్ఞానం Chaitanya Vijnanam 🌹
https://www.facebook.com/groups/465726374213849/

JOIN 🌹. SEEDS OF CONSCIOUSNESS 🌹
https://t.me/Seeds_Of_Consciousness

30 Oct 2020

భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 87

🌹. భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 87 🌹

✍️. శ్రీ బాలగోపాల్
📚. ప్రసాద్ భరద్వాజ

🌻. భగవంతుని 7వ పాత్ర - సాధు పురుషులు, మహాపురుషులు, సత్పురుషులు, ముముక్షువులు - 09
🌻

373. లోపలి ఇంద్రియములతో ఉన్నతతర భూమికల అనుభవమును పొందును.

374. మొదటి మూడు భూమికలలో గాంధర్వ గానము వినిపించును. గాన స్వరూపము, గాన మాధుర్యము, గానానందము వర్ణించ నలవి కానివి.

375. మానవుడు సూక్ష్మ భూమికలో నున్నప్పుడు ఈ ప్రాణశక్తియే, ఈశ్వరీయముగను, జ్ఞానయుక్తముగను ఉపయోగింపబడును.

కానీ, సూక్ష్మ భూమికలో నున్నప్పుడు మనస్సు పరోక్షముగను, తెలియకుండగను ఉపయోగింపబడుచుండును.

376. మొదటి భూమిక భౌతిక-సూక్ష్మ ప్రపంచములను విడదీయు సరిహద్దు రేఖ వంటిది. మానవుని స్థితి లో భౌతిక చైతన్యము గల భగవంతుడు(కండ్లు, చెవులు, ముక్కులు) స్థూలేంద్రియాలతో సూక్ష్మ సంస్కార అనుభవమును పొందును.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #భగవద్ధర్శిని #అవతారమెహర్

30 Oct 2020

శివగీత - 103 / The Siva-Gita - 103

🌹. శివగీత - 103 / The Siva-Gita - 103 🌹

🌴. పరమేశ్వరుడు - శ్రీరాముడు మధ్య జరిగిన జ్ఞాన సంవాదము. 🌴

📚. ప్రసాద్ భరద్వాజ
ద్వాదశాధ్యాయము

🌻. మోక్ష యోగము - 4 🌻

జ్ఞానే నైవ వినశ్యంతిన - తుకర్మాయు తైరపి,

జ్ఞానా దూర్ద్వంతు యత్కింఛి - త్పుణ్యం వా పాపమేవ వా .26

క్రియతే బహు వాప్యల్పం- తేనాయాం విలిప్యతే,

శరీరారం భకం యత్తు - ప్రారబ్దం కర్మ జన్మనః 27

తద్భోగే నైన నష్టం స్యా - న్నతు జ్ఞానేన నశ్యతి,

నిర్మోహొ నిరహంకారో - నిర్లేప స్సంగర్జితః 28

సర్వ భూతే షు చాత్మానం - సర్వ భూతాని చాత్మని,

యః పశ్య స్సంచర త్యేష -జీవన్ముక్తో భిది యతే 29

అహి నిర్ల్వయని యద్వ - ద్ద్రష్టు: పూర్వం భయ ప్రదా,

తతోస్యన భయం కించి- త్తద్ద్వ ద్ద్రస్తురయం జనః 30

జ్ఞానోత్పత్త్య నంతరమున నేపాటి పుణ్యపాపములు చేసినను వాటితో గట్టబడడు. శరీరాం భకమగు ప్రారబ్ధ కర్మ మేదియున్నదో అది జీవునికి యనుభవము చేత నాశమందును గాని, జ్ఞానము చేత నశించదు. అహంకార మమకారములు లేక సాంగత్యమును వదలి నిర్లప్తుడై సమస్త భూతముల యందాత్మను, ఆత్మ యందు సమస్త ప్రాణులను ఎవ్వడు దర్శించునో మరియు నన్ను ధ్యానించునో వాడే జీవన్ముక్తు డనబడును.

తెలిసికొను పర్యంతము పాము పొర భయ పెట్టును. పిదప తొలగును. అట్లే వీడును చూచినా వారికి భయాదులను కల్పింపక ఉదాసీనుడై యుండును.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

🌹 The Siva-Gita - 103 🌹

🌴. Dialogue between Rama and Lord Siva 🌴

✍️ Ayala somayajula.
📚. Prasad Bharadwaj

Chapter 13
🌻 Moksha Yoga - 4
🌻

After self realization and attaining knowledge, whatever sins of virtuous deeds are done by the Jnani, they do not bind him and he remains untouched with those karmas and their fruits.

Whatever Prarabdha karma comes along with the body of the Jiva, that gets destroyed by experience but not through knowledge. Being devoid of ego and pride, leaving all attachments, remaining untouched (Nirlipta) when one sees self within all creatures and sees all creatures within self and meditates on me, he becomes Jivanmukta.

Continues...
🌹 🌹 🌹 🌹 🌹

#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #శివగీత #SivaGita

30 Oct 2020

భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 148

🌹. భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 148 🌹

🌷. సద్గురు శివానంద 🌷
📚. ప్రసాద్ భరద్వాజ

🌻. నారద మహర్షి - 22
🌻

157. దేవతలను పరమేశ్వరుని అంగములుగా భావిస్తేనే తత్ఫలితం కలుగుతుందని తెలుసుకోవాలి! ఈతడే దేహాలలో ఆత్మగా ఉన్నాడు. ‘భౌవనశ్చ భువనశ్చాధిపతిశ్చ’ అంటే, భువనముల యొక్క స్వరూపము అతడే; వాటి యొక్క అధిపతికూడా అతడే అని అర్థం. అతడు నియామకుడిగాకూడా ఉన్నాడు.

158. ‘యంతాచమే ధర్తాచమే క్షేమశ్చమే’ – అనే మంత్రానికి అర్థం, “అతడే నాకు నియామకుడూ – నేను ఏం తినాలి? ఎక్కడ ఉండాలి? ఎలా బతకాలి? అనేవి నిర్ణయిస్తూ నాకు ‘నియంతగా’ ఉన్నాడు. అతడియందు తదధీనవృత్తి నాకు ఉంది.

159. నాకు అతడు ‘ధర్త’ – అంటే, నన్ను ధరించిన వాడుగా ఉన్నాడు. ఆ విధంగా నాకు పరమేశ్వరుడు ‘యంత'(నియంత)గా, ‘ధర్త'(ధరించిన వాడు)గా ఉండటంచేత, నాకు ‘క్షేమం’ కలుగుతుంది(క్షేమశ్చమే)” అని. “ఇలాంటి భావనతో ఎవరయితే ఉంటాడో, అతడిని వేదమాత రక్షిస్తుంది. అప్పుడు ఈ కర్మలన్నీ అర్థవంతమై, మంగళప్రదమవుతాయి” అన్నాడు నారదుడు.

160. “కామ్యకర్మలు వదిలిపెట్టి నీవు చేసిన కర్మలు ఎవరిని గురించి చేసావో, వాటి గతి ఎలా పరిణమిస్తుందో తెలుసుకో! సర్వదేవ నమస్కారములూ ‘కేశవం ప్రతిగఛ్ఛతి’ – అంటె కేశవుడినే చేరతాయి. అంతేకాదు, సర్వ నమస్కారములూ – ఎవరు ఎవరికి చేఇసినాకూడా – లోపలి వస్తువునకు, అంటే అందరిలోపలా ఉండే కేశవునికే చెందుతున్నాయి. అది క్షేమకరం అవుతుంది.

161. కాబట్టి ఇంద్రియలోలుడవై ఉండవద్దు. అలా ఉంటే అది మృగచేష్టతో సమానం.””అంతా అస్త్పదార్థముతో నిండిఉన్న ఈ దేహం నది అనుకోరాదు. ఈ అస్త్పదార్థములతో ఎలాగైనా, ఎప్పటికైనా వియోగం తప్పదు. ఈ అస్త్పదార్థమునందున్న మనసుని వదిలి పెట్టుకుని, శాశ్వతమయిన, సమస్త జీవకోటికీ ఆశ్రయుడైన ఆ పరమేశ్వరుడిని ధ్యానిస్తూ ఈ లౌకిక జీవన విధానములో అన్నింటియందూ విరక్తుడివై నీవు తరించు.

162. శ్వేతద్వీపమని వైకుంఠానికిపేరు. వైకుంఠం శుద్ధసత్వగుణంచేత నిర్మితమై ఉంటుంది. శుద్ధసత్త్వగుణం అనేది భూలోకంలోని జీవుడియందుండదు. సత్త్వ గుణాధిక్యత ఉంటే ఉండవచ్చు. జీవాహంకారములో దేహాత్మభావన, దేహాభిమానము, అహము ఇవన్నీ ఉన్నప్పుడు శుద్ధసత్త్వం ఉండదు. యోగికూడా తురీయావస్థలో సత్త్వగుణాన్ని ఆశ్రయించడు. త్రిగుణములకు అతీతుడై ఉంటాడు. పైకివెళ్ళి తురీయస్థితిలో ఉంటాడేతప్ప, శుద్ధ సత్త్వగుణసంపన్నుడు కాదు.

163. అందుకనే అతనికి తపోభంగం కలిగినప్పుడు అతడు శపిస్తాడు. తన జీవలక్షణంలోని అహాన్ని చంపలేడు. త్రిగుణములను దాటలేడు. వాటిని కాసేపు విడిచి ఎక్కడికో వెళతాడంతే. కాబట్టి యోగి తురీయస్థితినుంచీ మళ్ళీ దేహాత్మభావన కొచ్చి – ఈ చైతన్యానికొచ్చి-జ్ఞానముచేత ఉద్దీప్తుడై, క్రమంగా సత్త్వగుణ ఆధిక్యతను పెంచుకుని మోక్షమార్గంలో వెళ్ళాలి.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #మహర్షులజ్ఞానం #సద్గురుశివానంద

30 Oct 2020

శ్రీ శివ మహా పురాణము - 260

🌹 .  శ్రీ శివ మహా పురాణము - 260  🌹

రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. రుద్ర సంహితా - సతీఖండః 🌴

61. అధ్యాయము - 16

🌻.విష్ణువు, బ్రహ్మ శివుని స్తుతించుట - 2 🌻

హే స్వామిన్‌! సృష్టిని చేసి నేను, స్థితిని చేసి విష్ణువు నీ ఆజ్ఞను పాలించినాము. శివుడే స్వయముగా నీ రూపముతో ఆవిర్భవించి లయకర్త అగుచున్నాడు (24). నీతోడు లేనిదే మేమిద్దరము మాకర్తవ్యములను నెరవేర్చ జాలము. కావున, నీవు జగత్కార్యమును నిర్వర్తించుటకై ఒక సుందరిని భార్యగా స్వీకరించుము (25).

ఈశ్వరుడిట్లు పలికెను -

హే బ్రహ్మన్‌!ఓ హరీ! మీరిద్దరు నాకు ఎల్లవేళలా మిక్కిలి ప్రియమైన వారు గదా! నిన్ను చూచినప్పుడు నాకు గొప్ప ఆనందము కలుగును (28). మీరిద్దరు దేవతలలో ప్రముఖులు, ముల్లోకములకు ప్రభువులు. జగత్కార్యమునందు లగ్నమైనన మనస్సు గల మీరు చెప్పిన మాట చాల యోగ్యమైనది (29).

దేవతాశ్రేష్ఠులారా! నాకు వివాహము ఉచితము కాదు. నేను తపోనిష్ఠుడను. విరాగిని. సర్వదా యోగమార్గమునందుండు వాడను (30). నేను పవిత్రమైన నివృత్తి మార్గములో నిర్వికారముగా నాయందు నేను రమించుచూ ఉన్నవాడను. జ్ఞానినగు నా రూపము అవధూతను పోలియుండును. నాకు కామములు లేవు. నేను ఆత్మాలోకన పరుడను (31).

నేను వికారములు లేని వాడను, భోగముల అక్కర లేనివాడను, నేను సర్వదా అశుభ్ర అమంగళ వేషమును ధరించువాడను. అట్టి నాకిపుడు ఈ లోకములో భార్యతో నేమి ప్రయోజనము గలదో చెప్పుము (32). నిత్యయోగ నిష్ఠుడనగు నాకు ఆనందము నిత్యముగనుండును గదా! జ్ఞాన విహీనుడైన పురుషుడైతే అనేక కోర్కెలను మనస్సులో భావించుచుండును (33).

లోకములో వివాహమును చేసుకొనుట ఇతరుల బంధములో చిక్కుకొనుటయేనని తెలియవలెను. కావున నాకు వివాహమునందు రుచి లేదు. నేను ముమ్మాటికీ సత్యమును పలుకుచున్నాను (34). ఆత్మ నిష్ఠుడను, సమ్యగ్దర్శన నిష్ఠుడను అగు నా ప్రవృత్తి నా కొరకై ఉండదు గదా! అయినప్పటికీ లోకకల్యాణ కొరకై మీరు చెప్పినట్లు చేయగలను (35).

సర్వదా భక్తులకు వశుడనై ఉండే నేను నీ మాటను గొప్ప మాటగా స్వీకరించి, ఇచ్చిన మాటను నిలబెట్టుకొనుట కొరకై వివాహమును చేసుకొనగలను (36). కాని, నేను ఎటువంటి సుందరిని ఏ షరతులపై వివాహమాడెదనో చెప్పెదను. వినుము. ఓ బ్రహ్మా! విష్ణో! నేను యోగ్యమగు మాటను మాత్రమే చెప్పెదను (37).

ఏ స్త్రీ నా తేజస్సును వివేకముతో ధరింప సమర్థురాలగునో, అట్టి యోగశక్తి గల, ఇచ్చవచ్చిన రూపమును ధరించగల యువతిని నాకు భార్యగా స్వీకరించుటకై చూపించుడు (38). నేను యోగనిష్ఠుడనై యుండగా ఆమె కూడ యోగ నిష్ఠురాలు గావలెను. మరియు,నేను కామాసక్తుడనైనచో, ఆమె కూడా కామసక్తురాలు కావలెను (39).

వేద వేత్తలగు విద్వాంసులు ఏ శివుని జ్యోతిస్స్వరూపమగు అక్షరపరబ్రహ్మమని వర్ణించెదరో, సనాతనుడగు శివుని ధ్యానించెదరో (40), అట్టి శివుని ధ్యానించని సమయములో నేను ఆమెతో విహరించెదను హే బ్రహ్మన్‌! నా ధ్యానమునందు విఘ్నమును కలిగించు స్త్రీ నాచే నశింపజేయబడును (41). నీవు, విష్ణువు మరియు నేను పరబ్రహ్మ యగు శివుని అంశములము. కాన, మనము మహాత్ములము. కావున మనము ఆయనను ధ్యానించుట ఉచితము (42).

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #శివమహాపురాణము

30 Oct 2020

గీతోపనిషత్తు - 64

🌹. గీతోపనిషత్తు - 64 🌹

✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🍀 1. ఉపదేశము -వాసుదేవ, సంకర్షణ, ప్రద్యుమ్న, అనిరుద్ధ వ్యూహములు నాలుగును అంతర్యామి ఆవాసములు. అవి మనలో అంతర్యామి ప్రజ్ఞగను, అహంకార ప్రజ్ఞగను, బుద్ధిగను, మనస్సుగను యున్నవి. చివరి మూడింటి యందు దైవము నిలచినచో యోగము పరిపూర్ణమగును. 🍀

📚. 4. జ్ఞానయోగము - 1
📚

01. ఇమం వివస్వతే యోగం ప్రోక్తవా నహ మవ్యయమ్ |

వివస్వాన్ మనవే ప్రాహ మను రిక్ష్వాక వే2 బ్రవీత్ || 1

నేనీ యోగమును సూర్యుని కుపదేశించగ సూర్యుడు

వైవస్వత మనువున కుపదేశించెను.

అతడు ఇక్ష్వాకున కుపదేశించెను అని భగవానుడు పలికినాడు గదా! 'నేను' అంతర్యామి యగు వాసుదేవ ప్రజ్ఞ కాగ సూర్యుడహంకార స్వరూపుడగు సంకర్షణ ప్రజ్ఞ. అతనికుపదేశమై సిద్ధి పొందుటచే అతని నుండి అంతర్యామి ప్రజ్ఞ మనువునకు ఉపదేశ పూర్వకముగ చేరినది. అతని బుద్ధి అంతర్యామిచే వెలిగింపబడినది. అతని నుండి అంతర్యామి ఉపదేశపూర్వకముగ భూమికి రాజుయైన ఇక్ష్వాకునకు చేరినది.

ఇక్ష్వాకును చేరిన అంతర్యామి ప్రజ్ఞ భూమిని నాలుగు పాదముల ధర్మమును నిలిపి పాలించినాడు. అట్లు యోగము పరిపూర్ణమైనది.

ఇక్ష్వాకు అనగా మనస్సు. మనస్సు శరీరమునకు రాజు. మనసే ఇంద్రియముల ద్వారా శరీరమును పోషించును, నడిపించును, పాలించును కూడ.

దివ్యత్వము మనసును చేరినచో మనసు దివ్యమై శరీర ధాతువులయందు వలసిన మార్పులేర్పరచి వాసనలను పారద్రోలి దివ్యకార్యమునకు సమర్పించును. అపుడే యోగము పరిపూర్ణమైనట్లు. అంతర్యామి అవతరించినట్లు.

అందరిలోని అంతరాత్మ అహంకారము, బుద్ధి, మనసుల లోనికి ప్రవహించుట వలన అవతరణము జరుగును. అపుడు శరీరము దివ్యమై ఇంద్రియముల ద్వారా పరిసరములకు దివ్యత్వమును ప్రసరింప చేయును. అవరోధములు లేక ఇంద్రియముల ద్వారా ప్రసరింప చేయగలవు. అట్టి స్థితి నొందిన మనస్సును అనిరుద్ధు డందురు. హృదయమున నిలచి తన చూపు, మాట, స్పర్శ, సాన్నిధ్యాదులతో అందరిని ప్రచోదనము గావించును. అట్టివాడు పరిపూర్ణ యోగి.

వాసుదేవ, సంకర్షణ, ప్రద్యుమ్న, అనిరుద్ధ వ్యూహములు నాలుగును అంతర్యామి ఆవాసములు. అవి మనలో అంతర్యామి ప్రజ్ఞగను, అహంకార ప్రజ్ఞగను, బుద్ధిగను, మనస్సుగను యున్నవి. చివరి మూడింటి యందు దైవము నిలచినచో యోగము పరిపూర్ణ మగును. ఇట్లు దైవమే యోగము తానుగ నందించుచున్నాడని ఉపదేశ మార్గమును, రహస్యమును భగవానుడు తెలిపెను.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

Join and Share
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom Telegram group
🌹
https://t.me/ChaitanyaVijnanam

🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom Telegram Channel 🌹
https://t.me/Spiritual_Wisdom

Join and Share
🌹. శ్రీ లలితా దేవి చైతన్యము Sri Lalitha Devi Chatanyam 🌹

https://t.me/SriMataChaitanyam

JOIN, SHARE విష్ణు సహస్రనామ స్తోత్రము / Vishnu Sahasranama group.
https://t.me/vishnusahasra

Like and Share
https://www.facebook.com/విష్ణు-సహస్ర-నామ-తత్వ-విచారణ-Vishnu-Sahasranama-111069880767259/

🌹. దత్త చైతన్యము Datta Chaitanya 🌹
https://t.me/joinchat/Aug7pkulz9hgXzvrPfoVaA

🌹 చైతన్య విజ్ఞానం Chaitanya Vijnanam 🌹
https://www.facebook.com/groups/465726374213849/

JOIN 🌹. SEEDS OF CONSCIOUSNESS 🌹
https://t.me/Seeds_Of_Consciousness

30 Oct 2020

శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 62, 63 / Sri Lalitha Chaitanya Vijnanam - 62, 63

🌹. శ్రీ లలితా సహస్ర స్తోత్రము - 35 🌹 

🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 62, 63 / Sri Lalitha Chaitanya Vijnanam - 62, 63 🌹

సహస్ర నామముల తత్వ విచారణ
✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్

సేకరణ : ప్రసాద్ భరద్వాజ

మూల మంత్రము :

🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁

🍀. పూర్తి శ్లోకము 

23. మహాపద్మాటవీ సంస్థ కదంబ వనవాసిని

సుదాసాగర మధ్యస్థ కామాక్షీ కామదాయినీ

🌻 62. 'కామాక్షీ! 🌻

కమనీయమగు కన్నులు కలది అని అర్ధము.

శ్రీదేవి కన్నులు అత్యంత ఆకర్షణీయములు. కనుల నుండియే సమస్తమును సృష్టించి పాలించు జగన్మాత శ్రీదేవి. ఆమె కనుల నుండి ప్రసరించు అనుగ్రహ కారణముగనే జీవులు తరింతురు.

దేవి అనుగ్రహము లేక జీవునికి మోక్షము లేదు. ఆమె అనుగ్రహమునకు వేచియుండుట తపస్విజనులు తెలుసుకొనిన సత్యము. సత్కర్మా చరణము, ఉపాసన, జ్ఞాన సముపార్జనము చేయుచు శ్రీదేవి కనుల నుండి ప్రసరించు అనుగ్రహ కిరణములకై సమస్త లోకములందు తపస్విజనులు వేచియుందురు.

స్వభావమున కన్యాత్వము చెందినవారినే శ్రీదేవి అనుగ్రహించునని జ్యోతిషశాస్త్రము తెలుపుచున్నది. కన్యారాశి పవిత్రతకు సంకేతము.

దానికి సప్తమ రాశియైన మీనరాశి నుండి, మీనములవలె కమనీయమైన కన్నులు గల జగన్మాత అనుగ్రహము ప్రసరింపజేయగ, కన్యాతత్త్వముగల జీవులు దివ్యజీవులై తరింపు చెందుచున్నారు. ఇట్టి వారిని కన్యా పుత్రులని వేదములు తెలుపుచున్నవి.

హీనుడై సిగ్గు, ల వదలి ప్రవర్తించును. ధర్మమును మరచును. జడుడై జీవించును. అట్టి జడత్వమును శ్రీదేవి వధించగలదు. జడత్వమును వధించి, జీవు నుద్ధరించుట సమభావమే కదా! ప్రేమభావమే కదా!

అమ్మ భండుని వధించుట జీవు నుద్ధరించుట కొరకే. భండవధకే అమ్మ శక్తి సేనగా ఏర్పడినది. అవియే అనంతమగు జ్ఞానమార్గములు. జీవులను రకరకములుగా ఉద్ధరించుటే తన కర్తవ్యముగా అమ్మ ఉద్యమించును. జగన్మాత కన్న ప్రేమమూరు లెవ్వరును లేరు.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 62 🌹
1000 Names of Sri Lalitha Devi

✍️. Ravi Sarma
📚. Prasad Bharadwaj

Kāmākṣī कामाक्षी (62)

She has lovely eyes. Her eyes are full of grace, compassion and mercy for the universe.

That is why, Her eyes are so beautiful. She fulfils all the desires of Her devotees by Her looks alone.

Normally, our thoughts are reflected through our eyes. Kāmā is the combination of two bīja-s kā + mā. kā means Sarasvatī and mā means Lakṣmī.

These two goddesses are said to be the eyes of Lalitā. Kāmā also means Śiva. This can mean that She is the eyes of Śiva.

Continues...
🌹 🌹 🌹 🌹 🌹

🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 63 / Sri Lalitha Chaitanya Vijnanam - 63 🌹
సహస్ర నామముల తత్వ విచారణ

✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

మూల మంత్రము :

🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁

🍀. పూర్తి శ్లోకము :

23. మహాపద్మాటవీ సంస్థ కదంబ వనవాసిని

సుదాసాగర మధ్యస్థ కామాక్షీ కామదాయినీ

🌻 63. 'కామదాయినీ 🌻

కోరికల నిచ్చునది అని భావము.

శ్రీదేవిని సేవించువారికి సకల వాంఛలను ఆమె పరిపూర్తి గావించును. శివుని వ్యక్తరూపమేగాన, శివ సాయుజ్యము కూడ నొసగగలదు. ఇహమును పరమును అందించునది శ్రీదేవి. ఆమె కామేశ్వరుని కూడ భక్తుల కందించగలదు. చిల్లర కామములన్నియు నెరవేర్చగలదని వేరుగ తెలుప నవసరము లేదు. అమ్మ నారాధించిన వారికి కోరికలు తీరుటలో సౌలభ్యమున్నది.

కామద + అయిని అని పలుకుటలో సమస్త కామ (కోరిక) పరితృప్తికి అమ్మయే శుభమగు వాహిక అని అర్థము. ఆమె సర్వకామప్రద. భక్తితో సేవించువారికి వరప్రదాత. బ్రహ్మ సహితము ఆమెను ప్రార్థించి ఇచ్ఛాశక్తి కలిగి సృష్టిని నిర్వర్తించు చున్నాడు అని బ్రహ్మాండ పురాణమందు తెలుపబడినది.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 63 🌹
1000 Names of Sri Lalitha Devi

✍️. Ravi Sarma
📚. Prasad Bharadwaj

🌻 Kāmadāyinī कामदायिनी (63) 🌻

She fulfils whatever is desired. There are several interpretations for this nāma. Kāma means Kāmeśvara, a form of Śiva. Dāyini means giver. It has been discussed earlier that Śaktī alone leads to Śiva and there is no direct access to Him.

She takes Her devotees to Śiva, the supreme prakāśa form, the nirguṇa Brahman (Brahman without attributes). She is like a veil around Śiva and unless this veil is removed, Śiva cannot be realized. This veil can be removed only at Her will.

Brahma, the creator gave Her two names Kāmākṣī and Kāmeśvarī. This is because of Her omniscient nature.

Brahma honoured her with these two names, because He was so impressed with all Her activities, which She does by mere glance. This interpretation indicates Her vimarśa form. Dāyini also means inheritance. She inherits Śiva, meaning that Śiva belongs to Her (possible obsession!).

The 59th nāma secretly refers to Vārāhi Devi, 60th nāma refers to Śyamalā Devi, 61st nāma to Kāmākṣī Devi and 62nd nāma refers to Mahā-tripura-sundarī (nāma 234, another form of Śaktī). These references are highly subtle in nature.

With this, the description of Her physical or gross form ends. Nāma-s 64 to 84 narrate the slaying of demon Bhandāsura. Here begins the narration of Her Supreme form and these recitals are also equally secretive in nature.

Continues...
🌹 🌹 🌹 🌹 🌹

30 Oct 2020

శ్రీ గజానన్ మహరాజ్ జీవిత చరిత్ర - 93 / Sri Gajanan Maharaj Life History - 93

🌹. శ్రీ గజానన్ మహరాజ్ జీవిత చరిత్ర - 93 / Sri Gajanan Maharaj Life History - 93 🌹

✍️. దాసగణు స్వామి
📚. ప్రసాద్ భరద్వాజ

🌻. 19వ అధ్యాయము - 1 🌻

శ్రీగణేశాయనమః ఆనందం ఇచ్చేవాడా, అభేదా జై. ఎల్లప్పుడూ మీముందు శిరస్సు వంచుకుని నన్ను ఉండనివ్వండి. ఓరాఘవా, రఘుపతీ ఆలస్యం చెయ్యక దయచేసి వచ్చి నన్ను ఆశీర్వదించండి. క్రూరంగా ఉండడం మీవంటి గొప్పవాళ్ళకి శోభించదు. ఓఅనంతా నేను అన్న దాని గురించి ఒకసారి ఆలోచించండి. ఓ జగన్నాధా నేను మిమ్మల్ని అత్యంత నిజాయితో పిలుస్తున్నాను, ఈదాసగణును నిరాశ పరచకండి.

శ్రీమహారాజు షేగాంలో ఉన్నప్పుడు, కాశీనాధ్ ఖండేరావ్ గరడే అనే బ్రాహ్మణుడు ఆయన దర్శనానికి వచ్చాడు. అతను మహారాజుముందు సాష్టాంగ పడ్డాడు. తన తండ్రి రాసినవిధంగా జీవన్ముక్తునిలో ఉండవలసిన గుర్తులన్నీ ఈయనలో ఉండడంచూసి అతను చాలా సంతోషించాడు.

ఖాంగాం నుండి షేగాం శ్రీమహారాజు దర్శనానికి రావడానికి చాలా అదృష్టవంతుడిని అని తనలో తాను అనుకున్నాడు. అతను అలా అనుకుంటూ ఉండగా, శ్రీమహారాజు మోచేతితో కొంచెంతోసి, వెళ్ళు నీకోరిక ఫలించింది. పోస్టుమనిషి నీకోసం తంతితో వేచి చూస్తున్నాడు అని శ్రీమహారాజు అన్నారు.

శ్రీమహారాజు అన్నదానికి అర్ధం అవగాహనకాక, కాశీనాధ్ కలవరపడ్డాడు. ఎందుకంటే ఆయనను ఏదీ అడగడానికి తను ఆయన దగ్గరకు రాలేదు. శ్రీమహారాజునే ఆయన అన్నదానికి అర్ధం అడుగుదామన్న సాహసంకూడా లేకపోయె. శ్రీమహారాజు ముందు చేతులు కట్టుకుని వంగి, తరువాత అతను ఖాంగాం తిరిగి వచ్చాడు.

శ్రీమహావిహారాజు అన్నదానికి అక్ష అన్నదానికి అర్ధం ఖాంగాంలో నిజంగానే ఒక పోస్టుమనిషి తన ద్వారందగ్గర తంతితో వేచి చూస్తున్నాడు. త్వరత్వరగా ఆతంతి అందుకుని, తనకు మునిసిఫ్గా ఉన్నత పదవి లభించి, మొర్షికి వేసినట్టు అందులోని వార్త చూసాడు. అప్పుడు శ్రీమహారాజు మొచేతితో తనకు ఇచ్చిన పొడుపు గురించి అర్ధం అయింది. ఆయోగి యొక్క జ్ఞానానికి ఆశ్చర్యపోయాడు.

శ్రీబుటే ఆహ్వానంమీద ఒకసారి శ్రీమహారాజు నాగపూరు వెళ్ళారు. ఈ నాగపూరు ఒకకాలంలో భోంసలే రాజ్యానికి రాజధాని, కానీ ఇప్పుడు ఆ గొప్పదనం పోయింది. ఇదంతా స్వాతంత్రం కోల్పోవడం వల్లనే. ఒక యజమానిని ముష్టివానిగా మార్చింది. విదేశీయులమీద గొప్పదనం కురిపించింది. మారుతున్న సమయంవల్ల ఏనుగులు, గుర్రాలు, పల్లకిలూ అంతర్ధానమయి మోటర్లుకు చోటు ఇచ్చాయి. దీనికి ఎవరినీ నిందించలేము.

సితబుల్డిలో శ్రీగోపాలబుటే నివాసగృహం ఉంది. శ్రీమహారాజును ఆగొప్ప భవనంలో ఒకపులిని కోటలో పెట్టినట్టు పెట్టారు. శ్రీమహారాజు ఎల్లకాలం తనతో ఉండాలని శ్రీబుటే వాంఛించాడు. షేగాం ప్రజలకు ఇతను శ్రీకృష్ణుని మధురకు తీసుకు వెళుతున్న అక్రూరుని లాగా కనిపించాడు. శ్రీమహారాజులేని షేగాం ఎడారిలా అవడంతో, భక్తులు హరిపాటిల్ను ఆయనను షేగాం వెనక్కు తేవలసిందిగా అర్ధించారు. శ్రీమహారాజులేని షేగాం జీవంలేని శరీరంలో ఉంది.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

🌹 Sri Gajanan Maharaj Life History - 93 🌹

✍️. Swamy Dasaganu
📚. Prasad Bharadwaj

🌻 Chapter 19 - part 1 🌻

Shri Ganeshayanamah! Jai to the giver of Joy! Jai to the Abheda! Let my head always bow before You. O Raghava! Raghupati! Please come to bless me without delay. It is not befitting for great ones to be harsh. O Ananta, please give a thought to what I say. O Jagannath, I call You most earnestly, don't disappoint this Dasganu.

When Shri Gajanan Maharaj was at Shegaon, one Brahmin by the name of Kashinath Khanderao Garde came for His Darshan. He prostrated before Shri Gajanan Maharaj and was very happy to find in Him all the signs of a Jeevan Mukta as written by his father. He found himself to be very fortunate to have come from Khamgaon to see Shri Gajanan Maharaj . While he was thinking so, Shri Gajanan Maharaj gave him a push by an elbow and said, Go, your desire is fulfilled.

The postman is waiting for you with the telegram.” Kashinath was confused, and could not understand the meaning of what Shri Gajanan Maharaj had said, as he had not come to ask for anything from Him. Neither could he dare to ask Shri Gajanan Maharaj the meaning of what He had said. With folded hands he bent before Shri Gajanan Maharaj and returned to Khamgaon.

At Khamgaon a postman was really waiting at his door with a telegram. Hurriedly he took the telegram and saw that it contained the news of his promotion as Munsif and tht he was posted to Morshi. Then he understood the meaning of the elbow push given to him by Shri Gajanan Maharaj and was surprised at the knowledge of the saint.

Upon receiving an invitation from Shri Buty, Shri Gajanan Maharaj went to Nagpur. Nagpur was once the capital of the Bhosle's kingdom, but now had lost all its grandeur. It was the result of losing independence, which had turned an owner into a beggar, and had bestowed greatness on to foreigners. Elephants, horses and palanquins had disappeared giving place to motors.

Changing times do have such effects and nobody can be blamed for these. Shri Gopal Buty's residence was in Sitaburdi. Gopal kept Shri Gajanan Maharaj in that palatial building just like enclosing a tiger in a fort. Shri Buty desired Shri Gajanan Maharaj to stay with him forever. For the people of Shegaon, he appeared like Akrura taking away Shrikrishna to Mathura.

Without Shri Gajanan Maharaj , Shegaon became a deserted place and so, all the devotees requested Hari Patil to bring Him back to Shegaon. Shegaon without Shri Gajanan Maharaj was like a body without life in it.

Continues...
🌹 🌹 🌹 🌹 🌹

30 Oct 2020

కఠోపనిషత్‌ వివరణ - చలాచలభోధ - 89

🌹. కఠోపనిషత్‌ వివరణ - చలాచలభోధ - 89 🌹

✍️. సద్గురు శ్రీ విద్యాసాగర్
📚. ప్రసాద్ భరద్వాజ

🌻. ఆత్మను తెలుసుకొను విధము -19
🌻

పగ్గములను తన చేతిలో దృఢముగా నుంచుకొను సారధి, గుర్రములను తన వశమందు ఉంచుకుని, రధమును సక్రమమార్గమున నడిపి, సుఖముగా గమ్యస్థానము చేర్చునటులనే, విజ్ఞానవంతుడు నిశ్చలమైన బుద్ధితో మనస్సును నిగ్రహించి, ఇంద్రియములను విషయాదులనుండి మరలించి, జనన మరణ రహిత, గమ్యస్థానమైన పరమాత్మను చేర్చును. అతనికి పునర్జన్మలేదు.

ఇది ఒక ఆశీర్వచన వాక్యం. ఎవరైతే పరమాత్మస్థితిని తెలుసుకున్నారో, వారికి పునర్జన్మ లేదు. అనేటటువంటి ఆశీర్వచన వాక్యాన్ని చెబుతున్నారు. ఎవరైతే ఈ ఆత్మానుభూతిని, ఎవరైతే ఈ బ్రహ్మనిష్ఠను, ఎవరైతే ఈ పరబ్రహ్మనిర్ణయాన్ని పొందారో, వారికి పునర్జన్మలేదు. వారు ఈ శరీరమనే రధాన్ని సరియైన రీతిగా వినియోగించుకున్నటువంటి వారు.

వారు పగ్గములను తమ చేతిలో, దృఢముగా పట్టుకున్నవారు. మనసు అనేటటువంటి దానిని తమ చేతిలో స్వాధీనపరచు కున్నటువంటి వారు. గుర్రాలను, ఇంద్రియములను తమ వశమున ఒనర్చుకున్నవారు. వాటిని వాటి ఇష్టం వచ్చినట్లు పోనివ్వకుండా, సరియైన మార్గంలో నడిపేటటువంటి వారు.

ఇంద్రియములను ఇంద్రియార్థములలోకి, ప్రవేశింపనీయక విషయములందు, ఆశపడనీయక, ఆసక్తిని పొందనీయక సంగత్వ దోషాన్ని పొందనీయక, సంతృప్తి అసంతృప్తులకు పొంగక, కుంగక సమత్వబుద్ధితో, భేద బుద్ధి లేకుండా సరియైనటువంటి మార్గములో ప్రయాణము చేసి, విజ్ఞానవంతుడై, నిశ్చలమైనటువంటి బుద్ధితో, మనస్సుని నిగ్రహించి, ఇంద్రియాదులను విషయాదులనుండి మరలించి, తన స్వస్థానమైనటువంటి, తన స్వరూపజ్ఞానాన్ని పొందుతున్నాడు. అలా పొందినటువంటి వారికి పునర్జన్మ లేదు. అనేటటువంటి ఆశీర్వచన వాక్యంతో, ఈ నాటి ప్రసంగాన్ని విరమిస్తూ ...

పగ్గములను తన చేతిలో దృఢముగా నుంచుకొను సారధి గుర్రములను తన వశమునందుంచుకుని, రథమును సక్రమ మార్గమున నడిపి, సుఖముగా గమ్యస్థానము చేర్చునటులనే, విజ్ఞానవంతుడు నిశ్చలమైన బుద్ధితో, మనస్సును నిగ్రహించి ఇంద్రియములను విషయాదుల నుండి మరలించి జనన మరణ రహిత గమ్యస్థానమైన పరమాత్మను చేర్చును. అతనికి పునర్జన్మ లేదు.

ఉఁ... ఇప్పటి వరకూ చెప్పనటువంటి సాధనా విధిని కొనసాగిస్తూ ఉన్నారు. శరీరము రథము వంటిది. ఆత్మ రధికుడు, బుద్ధి సారధి, మనస్సను పగ్గాలు, ఇంద్రియములు గుర్రాలు. వీటిని జాగ్రత్తగా పరిగెత్తించాలి. ఏ దిశగా పరిగెత్తించాలి? ఇప్పటి వరకూ చెప్పిన నాలుగు వాక్యాలలో ముఖ్యమైనటువంటివి రెండు పదాలున్నాయి. ‘విజ్ఞానవంతుడు’ - మనం ఎలా ఉండాలట మానవుడనేవాడు? విజ్ఞానవంతుడుగా ఉండాలి. విజ్ఞానవంతుడని ఎవరిని అంటాం? అంటే, నిశ్చలమైనటువంటి బుద్ధి కలిగినటువంటి వాళ్ళు మాత్రమే విజ్ఞానవంతులౌతారు.

బుద్ధి చంచలంగా ఉందనుకోండి, రజోగుణ ధర్మంతోటి, తమోగుణ ధర్మంతోటి.... తమోగుణ ధర్మంతో ఉన్నప్పుడేమో, జడ స్వరూపంగా ఉంటాము. మందకొడిగా ఉంటాడు. రజోగుణ ధర్మంగా ఉన్నప్పుడు విక్షేప శక్తితో కూడుకుని చంచలంగా ఉంటాడు. సత్వగుణమైనటువంటి సాత్విక శక్తితో కూడుకుని ఉన్నప్పుడు ఆ చంచలమంతా ఉడిగిపోతుందున్నమాట. ఉడిగిపోయి నిశ్చలంగా ఉంటాడు. స్థిరంగా ఉంటాడు. ఆ స్థిరమైనటువంటి బుద్ధి కలిగినటువంటి వాళ్ళు మాత్రమే మనస్సును నిగ్రహించగలుగుతారు.

మనో నిగ్రహోపాయం గురించి ఆలోచించాలి అంటేనే నువ్వు బుద్ధి పరిధిలో ఉండాలి. సత్వగుణ పరిధిలో ఉండాలి. ఆ వివేకాన్ని నువ్వు సంపాదిస్తే తప్ప, ఏ గుణధర్మం ద్వారా నీలో, ఏ రకమైనటువంటి చంచల స్వభావం కలుగుతోందో, నువ్వు గుర్తించి విరమించితే తప్ప, నీవు బుద్ధి పరిధిలో స్థిరంగా ఉండలేవు.

బుద్ధి పరిధిలో స్థిరంగా ఉంటే కానీ, నువ్వు ఇంద్రియాలనే గుర్రాలని ఏ మార్గంలో నువ్వు సరిగ్గా ప్రయాణింపచేయాలి అనేటువంటిది నీవు సరిగ్గా గుర్తించలేవు. అందుకని పెద్దలు ఏం చెప్పారంటే, భారతీయుల అందరి ఇళ్ళల్లో శ్రీ కృష్ణుడు రథసారధిగా, అర్జునుడు రథమును అధివసించినటువంటి ఫోటో అది ప్రతి ఒక్కరి ఇళ్ళల్లో ఉండాలి. విజయసారధి అయిన ఆ ఫోటో గీతాబోధ చెప్పేటటువంటి ఫోటో.

ఈ ఫోటో ప్రతి ఒక్కరి ఇళ్ళల్లో ఉండాలి అంటారు. కారణం ఏమిటంటే ఈ ఆత్మోపదేశాన్ని, ఈ రధాన్ని ఉపమానంగా చేసుకుని చెప్పారు అన్నమాట ఇక్కడ. పరమాత్మయే అక్కడ సారధిగా వ్యవహరించారు. అందువల్ల అర్జునుడికి విజయం వరించడంలో పెద్ద విశేషమేమీ లేదు.

అట్లాగే మనం కూడా బుద్ధి... నిశ్చల బుద్ధిని, సారధిగా గనుక పెట్టుకున్నట్లయితే, అది పరమాత్మ వైపు, జనన మరణ రాహిత్యం వైపు, మోక్షం వైపు, ముక్తి వైపు, మనల్ని నడిపిస్తుంది. అదే చంచలబుద్ధి గనుక ఉన్నట్లయితే, ఇంద్రియములను, ఇంద్రియార్థములైనటువంటి శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాలనే విషయాల వైపు పరిగెత్తిస్తుంది.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

30 Oct 2020

శ్రీ దేవీ మహత్యము - దుర్గా సప్తశతి - 20 / Sri Devi Mahatyam - Durga Saptasati - 20

🌹. శ్రీ దేవీ మహత్యము - దుర్గా సప్తశతి - 20 / Sri Devi Mahatyam - Durga Saptasati - 20 🌹

✍️. మల్లికార్జున శర్మ
📚. ప్రసాద్ భరద్వాజ

అధ్యాయము 5

🌻. దేవీ దూతసంవాదం - 5
🌻

96. ధనేశ్వరుడైన కుబేరుని నుండి తేబడిన మహాపద్మండే అనే నిధి ఇచట ఉంది. కింజల్కినిష్ అనే ఎన్నటికీ వాడిపోని తామరపూదండను సముద్రుడు ఇచ్చాడు.

97. వరుణుని ఛత్రం, బంగారం కురిసేది, మీ ఇంట ఉంది. పూర్వం ప్రజాపతిదైన రథోత్తమం కూడా ఇచట ఉంది.

98. ప్రభూ! యముని శక్తిరూపాయుధమైన ఉత్కాంతిదం నీవు తెచ్చావు. సముద్రరాజు యొక్క పాశం నీ సోదరుని సొత్తులో ఒకటై ఉంది.

99. సముద్రంలో పుట్టిన సమస్తరత్నజాతులు నిశుంభుని వద్ద కలవు. అగ్నిచేత పరిశుద్ధమొనర్పబడిన రెండు వస్త్రాలను అగ్నిహోత్రుడునీకు ఇచ్చాడు.

100. అసురనాథా! ఇలా నీవు రత్నాలను అన్నిటిని తెచ్చావు. శుభమూర్తి అయిన ఈ స్త్రీ రత్నాన్ని నీవెందుకు తీసుకురాలేదు?”

101-102. ఋషి పలికెను : చండుడు, ముండుడు చెప్పిన ఈ మాటలను విని శుంభుడు సుగ్రీవ మహాసురుని దేవి వద్దకు దూతగా పంపించాడు.

103. అతడిలా చెప్పాడు: “నీవు పోయి ఆమెతో నా మాటలుగా ఇలా చెప్పు. ఆమె త్వరితంగా నా వద్దకు సంప్రీతితో వచ్చే విధంగా ఈ కార్యాన్ని నిర్వహించు.”

104. పర్వతంపై, అతిసుందర తావున ఉన్న ఆ దేవి వద్దకు అతడు పోయి ప్రియ మధుర వాక్కులతో ఆమెతో పలికాడు.

105–106. దూత పలికెను : “దేవీ! రాక్షసప్రభువైన శుంభుడు ముల్లోకాలకు సార్వభౌముడు. ఆయన దూతగా పంపబడి నీ సన్నిధికొచ్చాను.

107. సర్వదేవతలు ఎవరి ఆజ్ఞను సదా శిరసావహిస్తారో, అసుర వైరులందరినీ ఎవరు ఓడించారో, ఆయన చెప్పిన మాటలను ఆలకించు:

108. ముల్లోకాలన్నీ నావి. దేవతలు నాకు వశవర్తులు. వారి యజ్ఞభాగాలన్ని నేను వేర్వేరుగా అనుభవిస్తున్నాను.

109-110. ముల్లోకాలలో గల శ్రేష్ఠమైన రత్నాలన్ని నా అధీనంలో ఉన్నాయి. అలాగే ఇంద్రుని వాహనమైన గజరత్నం (ఐరావతం) కూడా నా చేత తేబడింది. పాలమున్నీ చిలికినప్పుడు పుట్టిన ఉచ్చైశ్రవమనే అశ్వరత్నాన్ని దేవతలు నాకు ప్రణామపూర్వకంగా సమర్పించారు.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

🌹 Sri Devi Mahatyam - Durga Saptasati - 20 🌹

✍️. P. R. Ramachander
📚 Prasad Bharadwaj

CHAPTER 5:
🌻 Devi's conversation with the messenger - 5
🌻

96. 'Here is the treasure named Mahapadma brought from the lord of wealth. And the ocean gave a garland named Kinjalkini made of unfading lotus flowers.

97. 'In your house stands the gold-showering umbrella of Varuna. And here is the excellent chariot that was formerly Prajapati's.

98. By you, O Lord, Death's shakti weapon named Utkrantida has been carried off. the noose of the ocean-king is among your brother's possessions.

99. 'Nishumbha has every kind of gem produced in the sea. Fire also gave you two garments which are purified by fire.

100. 'Thus, O Lord of asuras, all gems have been brought by you. Why this beautiful lady-jewel is not seized by you? The Rishi said:

101-102. On hearing these words of Chanda and Munda, Shumbha sent the great asura Sugriva as messenger to the Devi. He said:

103. 'Go and tell her thus in my words and do the thing in such a manner that she may quickly come to me in love.'

104. He went there where the Devi was staying in a very beautiful spot on the mountain and spoke to her in fine and sweet words. The messenger said:

105-106. 'O Devi, Shumbha, lord of asuras, is the supreme sovereign of three worlds. Sent by him as messenger, I have come here to your presence.

107. 'Hearken to what has been said by him whose command is never resisted among the devas and who has vanquished all the foes of the asuras:

108. '(He says), "All the three worlds are mine and the devas are obedient to me. I enjoy all their hares in sacrifices separately.

109-110. "All the choicest gems in the three worlds are in my possession; and so is the gem of elephants, Airavata, the vehicle of the king of devas carried away be me. The devas themselves offered to me with salutations that gem of horses named Uccaisravas which arose at the churning of milk-ocean.

Continues....
🌹 🌹 🌹 🌹 🌹

30 Oct 2020

విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 80, 81 / Vishnu Sahasranama Contemplation - 80, 81

🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 80, 81 / Vishnu Sahasranama Contemplation - 80, 81 🌹

📚. ప్రసాద్ భరద్వాజ

🌻 80. అనుత్తమః, अनुत्तमः, Anuttamaḥ 🌻

ఓం అనుత్తమాయ నమః | ॐ अनुत्तमाय नमः | OM Anuttamāya namaḥ

అవిద్యమానః ఉత్తమః యస్మాత్ సః ఎవని కంటె ఉత్తముడు మరి ఎవడును అవిద్యమానుడో (లేడో) అతడు.

:: భగవద్గీత - విశ్వరూప సందర్శన యోగము ::

పితాఽసి లోకస్య చరాచరస్య త్వమస్య పూజ్యశ్చ గురుర్గరీయాన్ ।

న త్వత్సమోఽస్త్యభ్యధికః కుతోఽన్యో లోకత్రయేఽప్యప్రతిమప్రభావ ॥ 43 ॥

సాటిలేని ప్రభావముగల ఓ కృష్ణమూర్తి! మీరు చరాచరాత్మకమైన ఈ ప్రపంచమునంతకును తండ్రి అయియున్నారు. మఱియు మీరు పూజ్యులును, సర్వశ్రేష్ఠులగు గురువులును అయి వెలయుచున్నారు. ముల్లోకములందును మీతో సమానమైనవారు లేరు. ఇక మిమ్ములను మించినవారు మఱియొక రెట్లుండగలరు?

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION - 80🌹

📚. Prasad Bharadwaj

🌻 80. Anuttamaḥ 🌻

OM Anuttamāya namaḥ

Avidyamānaḥ uttamaḥ yasmāt saḥ / अविद्यमानः उत्तमः यस्मात् सः He who has no superior to Him is Anuttama.

Bhagavad Gīta - Chapter 11

Pitā’si lokasya carācarasya tvamasya pūjyaśca gururgarīyān,

Na tvatsamo’styabhyadhikaḥ kuto’nyo lokatraye’pyapratimaprabhāva. (43)

:: भगवद्‍गीता - विश्वरूप संदर्शन योग ::

पिताऽसि लोकस्य चराचरस्य त्वमस्य पूज्यश्च गुरुर्गरीयान् ।

न त्वत्समोऽस्त्यभ्यधिकः कुतोऽन्यो लोकत्रयेऽप्यप्रतिमप्रभाव ॥ ४३ ॥

You are the Father of all beings moving an non-moving; to this (world) You are worthy of worship, the Teacher and greater (than a teacher). There is none equal to you; how at all can there be anyone greater even in all the three worlds, O You of unrivalled power?

🌻 🌻 🌻 🌻 🌻

Source Sloka

ईश्वरो विक्रमी धन्वी मेधावी विक्रमः क्रमः ।अनुत्तमो दुरादर्षः कृतज्ञः कृतिरात्मवान् ॥ ९ ॥

ఈశ్వరో విక్రమీ ధన్వీ మేధావీ విక్రమః క్రమః ।అనుత్తమో దురాదర్షః కృతజ్ఞః కృతిరాత్మవాన్ ॥ ౯ ॥

Īśvaro vikramī dhanvī medhāvī vikramaḥ kramaḥ ।Anuttamo durādarṣaḥ kr̥tajñaḥ kr̥tirātmavān ॥ 9 ॥

Continues....
🌹 🌹 🌹 🌹 🌹

🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 81/ Vishnu Sahasranama Contemplation - 81🌹

📚. ప్రసాద్ భరద్వాజ

🌻 81. దురాదర్షః, दुरादर्षः, Durādarṣaḥ 🌻

ఓం దురాదర్షాయ నమః | ॐ दुरादर्षाय नमः | OM Durādarṣāya namaḥ

ధర్షణ శబ్దమునకు బెదిరుంచుట, అణచుట, లోంగ దీసికొనుట మొదలగునవి అర్థములు. దైత్యాదిభిః దుఃఖేనాపి ఆ (ఈషదపి) దర్షయితుం న శక్యతే ఇతి దైత్యులు మొదలగువారిచే ఎంత దుఃఖముచే (శ్రమచే) కూడ కొంచెమైనను ధర్షించబడుటకు శక్యుడు కాడు కావున విష్ణువు దురాదర్షః.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION - 81 🌹

📚. Prasad Bharadwaj

🌻 81. Durādarṣaḥ 🌻

OM Durādarṣāya namaḥ

Daityādibhiḥ duḥkhenāpi ā (īṣadapi) darṣayituṃ na śakyate iti / दैत्यादिभिः दुःखेनापि आ (ईषदपि) दर्षयितुं न शक्यते इति He who cannot be assailed by asuras (demons) and such.

🌻 🌻 🌻 🌻 🌻

Source Sloka

ईश्वरो विक्रमी धन्वी मेधावी विक्रमः क्रमः ।अनुत्तमो दुरादर्षः कृतज्ञः कृतिरात्मवान् ॥ ९ ॥

ఈశ్వరో విక్రమీ ధన్వీ మేధావీ విక్రమః క్రమః ।అనుత్తమో దురాదర్షః కృతజ్ఞః కృతిరాత్మవాన్ ॥ ౯ ॥

Īśvaro vikramī dhanvī medhāvī vikramaḥ kramaḥ ।Anuttamo durādarṣaḥ kr̥tajñaḥ kr̥tirātmavān ॥ 9 ॥

Continues....
🌹 🌹 🌹 🌹 🌹

30 Oct 2020

30-October-2020 Messages

 1) 🌹 శ్రీమద్భగవద్గీత - 532 / Bhagavad-Gita - 532 🌹

2) 🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 79, 80 / Vishnu Sahasranama Contemplation - 79, 80 🌹
3) 🌹 Sripada Srivallabha Charithamrutham - 320 🌹
5) 🌹. కఠోపనిషత్ వివరణ - చలాచలభోధ - 89 🌹
6) 🌹 Guru Geeta - Datta Vaakya - 108 🌹
7) 🌹. గజానన్ మహరాజ్ జీవిత చరిత్ర - 95 / Gajanan Maharaj Life History - 95 🌹
8) 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 62, 63 / Sri Lalita Chaitanya Vijnanam - 62, 63 🌹
9) *🌹. శ్రీ లలితా సహస్ర స్తోత్రము - 35 🌹*
10) 🌹. శ్రీమద్భగవద్గీత - 445 / Bhagavad-Gita - 447 🌹

 11) 📚. గీతోపనిషత్తు - సాంఖ్య యోగము - 63 📚
12) 🌹. శివ మహా పురాణము - 261 🌹
13) 🌹 Light On The Path - 17 🌹
14) 🌹. భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 148 🌹
15) 🌹. శివగీత - 102 / The Siva-Gita - 103 🌹* 
17) 🌹 Seeds Of Consciousness - 211 🌹   
16) 🌹. భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 87 🌹
18) 🌹. శ్రీ విష్ణు సహస్ర నామములు - 50 / Sri Vishnu Sahasranama - 50 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీమద్భగవద్గీత - 532  / Bhagavad-Gita - 532 🌹*

✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద

📚. ప్రసాద్ భరద్వాజ

*🌴. 15వ అధ్యాయము - పురుషోత్తమ యోగము - 17 🌴*

17.  ఉత్తమ: పురుషస్త్వస్య: పరమాత్మేత్యుదాహృత: |

యో లోకత్రయమావిశ్య బిభర్త్యవ్యయ ఈశ్వర: ||

🌷. తాత్పర్యం : 

ఈ ఇరువురు గాక మూడులోకములందును ప్రవేశించి వాటిని భరించు సాక్షాత్తు అవ్యయ ప్రభువును, పరమాత్ముడును అగు ఉత్తమపురుషుడును కలడు.

🌷. భాష్యము  :

ఈ శ్లోకమునందలి భావము కఠోపనిషత్తు (2.2.13) మరియు శ్వేతాశ్వతరోపనిషత్తు (6.13) నందు చక్కగా వివరింపబడినది. బంధ, ముక్తస్థితి యందున్న అసంఖ్యాకజీవులపైన పరమాత్మగా హృదయమందు నిలుచు దేవదేవుడు కలడని అందు తెలుపబడినది. “నిత్యో(నిత్యానాం చేతనశ్చేతనానాం” అనునది ఆ ఉపనిషత్తు నందలి వాక్యము. 

బద్ధ, ముక్తస్థితి యందున్న జీవులలో, వాటిని పోషించుచు కర్మానుసారముగా వారి భోగానుభవమునకు అవకాశమునొసగు దేవదేవుడను శ్రేష్ఠపురుషుడు వేరొకడు కలడని దీని భావము. ఆ దేవదేవుడైన శ్రీకృష్ణుడే ప్రతివారి హృదయమునందు పరమాత్మగా విరాజమానుడై యున్నాడు. అతనిని ఎరుగగలిగిన బుద్ధిమంతుడే సంపూర్ణశాంతిని పొందును గాని అన్యులు కారు.

🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Bhagavad-Gita as It is - 532 🌹

✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada

📚 Prasad Bharadwaj

*🌴 Chapter 15 - Purushothama Yoga  - 17 🌴*

17. uttamaḥ puruṣas tv anyaḥ

paramātmety udāhṛtaḥ

yo loka-trayam āviśya

bibharty avyaya īśvaraḥ

🌷 Translation : 

Besides these two, there is the greatest living personality, the Supreme Soul, the imperishable Lord Himself, who has entered the three worlds and is maintaining them.

🌹 Purport :

The idea of this verse is very nicely expressed in the Kaṭha Upaniṣad (2.2.13) and Śvetāśvatara Upaniṣad (6.13). It is clearly stated there that above the innumerable living entities, some of whom are conditioned and some of whom are liberated, there is the Supreme Personality, who is Paramātmā. The Upaniṣadic verse runs as follows: nityo nityānāṁ cetanaś cetanānām. 

The purport is that amongst all the living entities, both conditioned and liberated, there is one supreme living personality, the Supreme Personality of Godhead, who maintains them and gives them all the facility of enjoyment according to different work. 

That Supreme Personality of Godhead is situated in everyone’s heart as Paramātmā. A wise man who can understand Him is eligible to attain perfect peace, not others.

🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 Sripada  Srivallabha  Charithamrutham - 320 🌹*

✍️  Satya prasad

📚. Prasad Bharadwaj

Chapter 45

*🌻 Sripada stays in Shambala Giri village in Dronagiri Mountains 🌻*

Once in Peethikapuram, Sripada’s maternal uncle Venkaavadhanulu was teaching Vedam to children. There was a coconut tree nearby. One monkey came to that divine place and was attracting Veda dhwani (sound). That monkey was not spoiling anything there and was not interested in the fruits on the trees. It was listening to the sound of Veda carefully. 

Sripada asked His uncle, ‘Uncle! Will there be any avathars to coconut tree just like the avathars of God?’ His uncle said, ‘Kannaiah! What question is this? There must be a meaning in the question also.’ Sripada said, ‘Not like that. Tree is bearing the fruit. The fruit is again becoming a tree. Again tree is giving fruit. In this way, tree is going into the seed form and seed is raising to become a tree.’ 

The conversation ended there. Meanwhile, from the coconut tree, a big coconut fell down. Sripada took it into his hands. He looked at the monkey and said, ‘I don’t want to send you with empty hands. I am giving this to you with my hands as ‘prasad’. You should not ask for a second fruit from my hands. If you accept, you can take it.’ 

The monkey nodded its head indicating it’s acceptance. Sripada gave that coconut to the monkey and stroked its wholebody with love. It went away very much pleased. Who knows who that monkey was, why He gave that coconut, why He said that He would not give another coconut and how the coconut fell down on its own? His leelas are wonderful and beyond our imagination.

Sri Maha Prabhu went to the Sanjeevini Mountain called ‘Dronagiri’. For some days, He spent with Rishi groups happily there. Who knows what sort of grace He bestowed on those Maha yogis? From there He went to Shambala village where Kalki Prabhu would be born. 

That place can not be seen even by Maha Yogis. Great people who do tapas for thousands of years stay there. He drank

the pure water in the crystal mountain in Shambala village. People who drink it will remain at that age for ever. From then onwards, there was no change in His body and He remained as a 16 year old boy.

*🌻 Sripada goes from Gokarna Kshetram to divine lokas 🌻*

Later He roamed many divine places and graced devotees and maharshis, and reached ‘Gokarna kshetram’. Sripada stayed for three years in Gokarna kshetram. It is a sacred place. He showed many leelas there. They were uncountable. 

He enjoyed every moment in leelas. From there, he reached Srisailam. There Sri Bapanarya conducted a ‘yajnam’ previously and invoked the power from Surya Mandalam into the Mallikarjuna lingam. As a result of that, Sripada Srivallabha avathar came. From there, He went through yoga path, into the Surya Mandalam becoming like a ball of great Agni. 

From there, He went into Dhruva star, Sapta rishi mandalam, Ardra star and again came back to Srisailam after four months. On the request of the Maharshis of Ardra star, a new yogam called ‘Divya Jnana yogam’ was taught to the ‘siddha purushas’ in Srisailam. He sent those siddha purushas into Ardra star. His programme can not be understood. He is the only Lord to many crores of Brahmaandams. 

After sometime, He reached a divine place called Kurungadda.’ 

End of Chapter 45

Continues...

🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 80, 81 / Vishnu Sahasranama Contemplation - 80, 81 🌹*

📚. ప్రసాద్ భరద్వాజ 

*🌻 80. అనుత్తమః, अनुत्तमः, Anuttamaḥ 🌻*

*ఓం అనుత్తమాయ నమః | ॐ अनुत्तमाय नमः | OM Anuttamāya namaḥ*

అవిద్యమానః ఉత్తమః యస్మాత్ సః ఎవని కంటె ఉత్తముడు మరి ఎవడును అవిద్యమానుడో (లేడో) అతడు.

:: భగవద్గీత - విశ్వరూప సందర్శన యోగము ::

పితాఽసి లోకస్య చరాచరస్య త్వమస్య పూజ్యశ్చ గురుర్గరీయాన్ ।

న త్వత్సమోఽస్త్యభ్యధికః కుతోఽన్యో లోకత్రయేఽప్యప్రతిమప్రభావ ॥ 43 ॥

సాటిలేని ప్రభావముగల ఓ కృష్ణమూర్తి! మీరు చరాచరాత్మకమైన ఈ ప్రపంచమునంతకును తండ్రి అయియున్నారు. మఱియు మీరు పూజ్యులును, సర్వశ్రేష్ఠులగు గురువులును అయి వెలయుచున్నారు. ముల్లోకములందును మీతో సమానమైనవారు లేరు. ఇక మిమ్ములను మించినవారు మఱియొక రెట్లుండగలరు?

సశేషం... 

🌹 🌹 🌹 🌹 🌹 

*🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION - 80🌹*

📚. Prasad Bharadwaj 

*🌻 80.  Anuttamaḥ 🌻*

 *OM Anuttamāya namaḥ*

Avidyamānaḥ uttamaḥ yasmāt saḥ / अविद्यमानः उत्तमः यस्मात् सः He who has no superior to Him is Anuttama.

Bhagavad Gīta - Chapter 11

Pitā’si lokasya carācarasya tvamasya pūjyaśca gururgarīyān,

Na tvatsamo’styabhyadhikaḥ kuto’nyo lokatraye’pyapratimaprabhāva. (43)

:: भगवद्‍गीता - विश्वरूप संदर्शन योग ::

पिताऽसि लोकस्य चराचरस्य त्वमस्य पूज्यश्च गुरुर्गरीयान् ।

न त्वत्समोऽस्त्यभ्यधिकः कुतोऽन्यो लोकत्रयेऽप्यप्रतिमप्रभाव ॥ ४३ ॥

You are the Father of all beings moving an non-moving; to this (world) You are worthy of worship, the Teacher and greater (than a teacher). There is none equal to you; how at all can there be anyone greater even in all the three worlds, O You of unrivalled power?

🌻 🌻 🌻 🌻 🌻 

Source Sloka

ईश्वरो विक्रमी धन्वी मेधावी विक्रमः क्रमः ।अनुत्तमो दुरादर्षः कृतज्ञः कृतिरात्मवान् ॥ ९ ॥

ఈశ్వరో విక్రమీ ధన్వీ మేధావీ విక్రమః క్రమః ।అనుత్తమో దురాదర్షః కృతజ్ఞః కృతిరాత్మవాన్ ॥ ౯ ॥

Īśvaro vikramī dhanvī medhāvī vikramaḥ kramaḥ ।Anuttamo durādarṣaḥ kr̥tajñaḥ kr̥tirātmavān ॥ 9 ॥

Continues....

🌹 🌹 🌹 🌹 🌹

*🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 81/ Vishnu Sahasranama Contemplation - 81🌹*

📚. ప్రసాద్ భరద్వాజ 

*🌻 81. దురాదర్షః, दुरादर्षः, Durādarṣaḥ 🌻*

*ఓం దురాదర్షాయ నమః | ॐ दुरादर्षाय नमः | OM Durādarṣāya namaḥ*

ధర్షణ శబ్దమునకు బెదిరుంచుట, అణచుట, లోంగ దీసికొనుట మొదలగునవి అర్థములు. దైత్యాదిభిః దుఃఖేనాపి ఆ (ఈషదపి) దర్షయితుం న శక్యతే ఇతి దైత్యులు మొదలగువారిచే ఎంత దుఃఖముచే (శ్రమచే) కూడ కొంచెమైనను ధర్షించబడుటకు శక్యుడు కాడు కావున విష్ణువు దురాదర్షః.

సశేషం... 

🌹 🌹 🌹 🌹 🌹 

*🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION - 81🌹*

📚. Prasad Bharadwaj 

*🌻 81. Durādarṣaḥ 🌻*

*OM Durādarṣāya namaḥ*

Daityādibhiḥ duḥkhenāpi ā (īṣadapi) darṣayituṃ na śakyate iti / दैत्यादिभिः दुःखेनापि आ (ईषदपि) दर्षयितुं न शक्यते इति He who cannot be assailed by asuras (demons) and such.

🌻 🌻 🌻 🌻 🌻 

Source Sloka

ईश्वरो विक्रमी धन्वी मेधावी विक्रमः क्रमः ।अनुत्तमो दुरादर्षः कृतज्ञः कृतिरात्मवान् ॥ ९ ॥

ఈశ్వరో విక్రమీ ధన్వీ మేధావీ విక్రమః క్రమః ।అనుత్తమో దురాదర్షః కృతజ్ఞః కృతిరాత్మవాన్ ॥ ౯ ॥

Īśvaro vikramī dhanvī medhāvī vikramaḥ kramaḥ ।Anuttamo durādarṣaḥ kr̥tajñaḥ kr̥tirātmavān ॥ 9 ॥

Continues....

🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీ దేవీ మహత్యము - దుర్గా సప్తశతి - 20  / Sri Devi Mahatyam - Durga Saptasati - 20 🌹*

✍️. మల్లికార్జున శర్మ 

📚. ప్రసాద్ భరద్వాజ 

*అధ్యాయము 5*

*🌻. దేవీ దూతసంవాదం - 5 🌻*

96. ధనేశ్వరుడైన కుబేరుని నుండి తేబడిన మహాపద్మండే అనే నిధి ఇచట ఉంది. కింజల్కినిష్ అనే ఎన్నటికీ వాడిపోని తామరపూదండను సముద్రుడు ఇచ్చాడు.

97. వరుణుని ఛత్రం, బంగారం కురిసేది, మీ ఇంట ఉంది. పూర్వం ప్రజాపతిదైన రథోత్తమం కూడా ఇచట ఉంది. 

98. ప్రభూ! యముని శక్తిరూపాయుధమైన ఉత్కాంతిదం* నీవు తెచ్చావు. సముద్రరాజు యొక్క పాశం నీ సోదరుని సొత్తులో ఒకటై ఉంది.

99. సముద్రంలో పుట్టిన సమస్తరత్నజాతులు నిశుంభుని వద్ద కలవు. అగ్నిచేత పరిశుద్ధమొనర్పబడిన రెండు వస్త్రాలను అగ్నిహోత్రుడునీకు ఇచ్చాడు.

100. అసురనాథా! ఇలా నీవు రత్నాలను అన్నిటిని తెచ్చావు. శుభమూర్తి అయిన ఈ స్త్రీ రత్నాన్ని నీవెందుకు తీసుకురాలేదు?”

101-102. ఋషి పలికెను : చండుడు, ముండుడు చెప్పిన ఈ మాటలను విని శుంభుడు సుగ్రీవ మహాసురుని దేవి వద్దకు దూతగా పంపించాడు.

103. అతడిలా చెప్పాడు: “నీవు పోయి ఆమెతో నా మాటలుగా ఇలా చెప్పు. ఆమె త్వరితంగా నా వద్దకు సంప్రీతితో వచ్చే విధంగా ఈ కార్యాన్ని నిర్వహించు.”

104. పర్వతంపై, అతిసుందర తావున ఉన్న ఆ దేవి వద్దకు అతడు పోయి ప్రియ మధుర వాక్కులతో ఆమెతో పలికాడు.

105–106. దూత పలికెను : “దేవీ! రాక్షసప్రభువైన శుంభుడు ముల్లోకాలకు సార్వభౌముడు. ఆయన దూతగా పంపబడి నీ సన్నిధికొచ్చాను.

107. సర్వదేవతలు ఎవరి ఆజ్ఞను సదా శిరసావహిస్తారో, అసుర వైరులందరినీ ఎవరు ఓడించారో, ఆయన చెప్పిన మాటలను ఆలకించు:

108. ముల్లోకాలన్నీ నావి. దేవతలు నాకు వశవర్తులు. వారి యజ్ఞభాగాలన్ని నేను వేర్వేరుగా అనుభవిస్తున్నాను.

109-110. ముల్లోకాలలో గల శ్రేష్ఠమైన రత్నాలన్ని నా అధీనంలో ఉన్నాయి. అలాగే ఇంద్రుని వాహనమైన గజరత్నం (ఐరావతం) కూడా నా చేత తేబడింది. పాలమున్నీ చిలికినప్పుడు పుట్టిన ఉచ్చైశ్రవమనే అశ్వరత్నాన్ని దేవతలు నాకు ప్రణామపూర్వకంగా సమర్పించారు.

సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Sri Devi Mahatyam - Durga Saptasati - 20 🌹*

✍️. P. R. Ramachander

📚 Prasad Bharadwaj

*CHAPTER  5:* 

*🌻 Devi's conversation with the messenger  - 5 🌻*

 96. 'Here is the treasure named Mahapadma brought from the lord of wealth. And the ocean gave a garland named Kinjalkini made of unfading lotus flowers.

97. 'In your house stands the gold-showering umbrella of Varuna. And here is the excellent chariot that was formerly Prajapati's.

98. By you, O Lord, Death's shakti weapon named Utkrantida has been carried off. the noose of the ocean-king is among your brother's possessions.

99. 'Nishumbha has every kind of gem produced in the sea. Fire also gave you two garments which are purified by fire.

100. 'Thus, O Lord of asuras, all gems have been brought by you. Why this beautiful lady-jewel is not seized by you? The Rishi said:

101-102. On hearing these words of Chanda and Munda, Shumbha sent the great asura Sugriva as messenger to the Devi. He said:

103. 'Go and tell her thus in my words and do the thing in such a manner that she may quickly come to me in love.'

104. He went there where the Devi was staying in a very beautiful spot on the mountain and spoke to her in fine and sweet words. The messenger said:

105-106. 'O Devi, Shumbha, lord of asuras, is the supreme sovereign of three worlds. Sent by him as messenger, I have come here to your presence.

107. 'Hearken to what has been said by him whose command is never resisted among the devas and who has vanquished all the foes of the asuras:

108. '(He says), "All the three worlds are mine and the devas are obedient to me. I enjoy all their hares in sacrifices separately.

109-110. "All the choicest gems in the three worlds are in my possession; and so is the gem of elephants, Airavata, the vehicle of the king of devas carried away be me. The devas themselves offered to me with salutations that gem of horses named Uccaisravas which arose at the churning of milk-ocean. 

Continues....

🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. కఠోపనిషత్‌ వివరణ  - చలాచలభోధ  - 89 🌹*

✍️. సద్గురు శ్రీ విద్యాసాగర్ 

📚. ప్రసాద్ భరద్వాజ

*🌻.   ఆత్మను తెలుసుకొను విధము -19 🌻*

పగ్గములను తన చేతిలో దృఢముగా నుంచుకొను సారధి, గుర్రములను తన వశమందు ఉంచుకుని, రధమును సక్రమమార్గమున నడిపి, సుఖముగా గమ్యస్థానము చేర్చునటులనే, విజ్ఞానవంతుడు నిశ్చలమైన బుద్ధితో మనస్సును నిగ్రహించి, ఇంద్రియములను విషయాదులనుండి మరలించి, జనన మరణ రహిత, గమ్యస్థానమైన పరమాత్మను చేర్చును. అతనికి పునర్జన్మలేదు.

   ఇది ఒక ఆశీర్వచన వాక్యం. ఎవరైతే పరమాత్మస్థితిని తెలుసుకున్నారో, వారికి పునర్జన్మ లేదు. అనేటటువంటి ఆశీర్వచన వాక్యాన్ని చెబుతున్నారు. ఎవరైతే ఈ ఆత్మానుభూతిని, ఎవరైతే ఈ బ్రహ్మనిష్ఠను, ఎవరైతే ఈ పరబ్రహ్మనిర్ణయాన్ని పొందారో, వారికి పునర్జన్మలేదు. వారు ఈ శరీరమనే రధాన్ని సరియైన రీతిగా వినియోగించుకున్నటువంటి వారు. 

వారు పగ్గములను తమ చేతిలో, దృఢముగా పట్టుకున్నవారు. మనసు అనేటటువంటి దానిని తమ చేతిలో స్వాధీనపరచు కున్నటువంటి వారు. గుర్రాలను, ఇంద్రియములను తమ వశమున ఒనర్చుకున్నవారు. వాటిని వాటి ఇష్టం వచ్చినట్లు పోనివ్వకుండా, సరియైన మార్గంలో నడిపేటటువంటి వారు. 

ఇంద్రియములను ఇంద్రియార్థములలోకి, ప్రవేశింపనీయక విషయములందు, ఆశపడనీయక, ఆసక్తిని పొందనీయక సంగత్వ దోషాన్ని పొందనీయక, సంతృప్తి అసంతృప్తులకు పొంగక, కుంగక సమత్వబుద్ధితో, భేద బుద్ధి లేకుండా సరియైనటువంటి మార్గములో ప్రయాణము చేసి, విజ్ఞానవంతుడై, నిశ్చలమైనటువంటి బుద్ధితో, మనస్సుని నిగ్రహించి, ఇంద్రియాదులను విషయాదులనుండి మరలించి, తన స్వస్థానమైనటువంటి, తన స్వరూపజ్ఞానాన్ని పొందుతున్నాడు. అలా పొందినటువంటి వారికి పునర్జన్మ లేదు. అనేటటువంటి ఆశీర్వచన వాక్యంతో, ఈ నాటి ప్రసంగాన్ని విరమిస్తూ ...

        పగ్గములను తన చేతిలో దృఢముగా నుంచుకొను సారధి గుర్రములను తన వశమునందుంచుకుని, రథమును సక్రమ మార్గమున నడిపి, సుఖముగా గమ్యస్థానము చేర్చునటులనే, విజ్ఞానవంతుడు నిశ్చలమైన బుద్ధితో, మనస్సును నిగ్రహించి ఇంద్రియములను విషయాదుల నుండి మరలించి జనన మరణ రహిత గమ్యస్థానమైన పరమాత్మను చేర్చును. అతనికి పునర్జన్మ లేదు.

        ఉఁ... ఇప్పటి వరకూ చెప్పనటువంటి సాధనా విధిని కొనసాగిస్తూ ఉన్నారు. శరీరము రథము వంటిది. ఆత్మ రధికుడు, బుద్ధి సారధి, మనస్సను పగ్గాలు, ఇంద్రియములు గుర్రాలు. వీటిని జాగ్రత్తగా పరిగెత్తించాలి. ఏ దిశగా పరిగెత్తించాలి? ఇప్పటి వరకూ చెప్పిన నాలుగు వాక్యాలలో ముఖ్యమైనటువంటివి రెండు పదాలున్నాయి. ‘విజ్ఞానవంతుడు’ - మనం ఎలా ఉండాలట మానవుడనేవాడు? విజ్ఞానవంతుడుగా ఉండాలి. విజ్ఞానవంతుడని ఎవరిని అంటాం? అంటే, నిశ్చలమైనటువంటి బుద్ధి కలిగినటువంటి వాళ్ళు మాత్రమే విజ్ఞానవంతులౌతారు. 

బుద్ధి చంచలంగా ఉందనుకోండి, రజోగుణ ధర్మంతోటి, తమోగుణ ధర్మంతోటి.... తమోగుణ ధర్మంతో ఉన్నప్పుడేమో, జడ స్వరూపంగా ఉంటాము. మందకొడిగా ఉంటాడు. రజోగుణ ధర్మంగా ఉన్నప్పుడు విక్షేప శక్తితో కూడుకుని చంచలంగా ఉంటాడు. సత్వగుణమైనటువంటి సాత్విక శక్తితో కూడుకుని ఉన్నప్పుడు ఆ చంచలమంతా ఉడిగిపోతుందున్నమాట. ఉడిగిపోయి నిశ్చలంగా ఉంటాడు. స్థిరంగా ఉంటాడు. ఆ స్థిరమైనటువంటి బుద్ధి కలిగినటువంటి వాళ్ళు మాత్రమే మనస్సును నిగ్రహించగలుగుతారు.

        మనో నిగ్రహోపాయం గురించి ఆలోచించాలి అంటేనే నువ్వు బుద్ధి పరిధిలో ఉండాలి. సత్వగుణ పరిధిలో ఉండాలి. ఆ వివేకాన్ని నువ్వు సంపాదిస్తే తప్ప, ఏ గుణధర్మం ద్వారా నీలో, ఏ రకమైనటువంటి చంచల స్వభావం కలుగుతోందో, నువ్వు గుర్తించి విరమించితే తప్ప, నీవు బుద్ధి పరిధిలో స్థిరంగా ఉండలేవు. 

బుద్ధి పరిధిలో స్థిరంగా ఉంటే కానీ, నువ్వు ఇంద్రియాలనే గుర్రాలని ఏ మార్గంలో నువ్వు సరిగ్గా ప్రయాణింపచేయాలి అనేటువంటిది నీవు సరిగ్గా గుర్తించలేవు. అందుకని పెద్దలు ఏం చెప్పారంటే, భారతీయుల అందరి ఇళ్ళల్లో శ్రీ కృష్ణుడు రథసారధిగా, అర్జునుడు రథమును అధివసించినటువంటి ఫోటో అది ప్రతి ఒక్కరి ఇళ్ళల్లో ఉండాలి. విజయసారధి అయిన ఆ ఫోటో గీతాబోధ చెప్పేటటువంటి ఫోటో. 

ఈ ఫోటో ప్రతి ఒక్కరి ఇళ్ళల్లో ఉండాలి అంటారు. కారణం ఏమిటంటే ఈ ఆత్మోపదేశాన్ని, ఈ రధాన్ని ఉపమానంగా చేసుకుని చెప్పారు అన్నమాట ఇక్కడ. పరమాత్మయే అక్కడ సారధిగా వ్యవహరించారు. అందువల్ల అర్జునుడికి విజయం వరించడంలో పెద్ద విశేషమేమీ లేదు. 

అట్లాగే మనం కూడా బుద్ధి... నిశ్చల బుద్ధిని, సారధిగా గనుక పెట్టుకున్నట్లయితే, అది పరమాత్మ వైపు, జనన మరణ రాహిత్యం వైపు, మోక్షం వైపు, ముక్తి వైపు, మనల్ని నడిపిస్తుంది. అదే చంచలబుద్ధి గనుక ఉన్నట్లయితే, ఇంద్రియములను, ఇంద్రియార్థములైనటువంటి శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాలనే విషయాల వైపు పరిగెత్తిస్తుంది.

సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 Guru Geeta - Datta Vaakya - 108 🌹*

✍️ Sadguru Ganapathi Sachidananda

📚. Prasad Bharadwaj

101

We were discussing that Siva and Parvati were extremely pleased with Ganapathy’s intellect, reasoning and presence of mind. Secondly, they commended his deep-rooted faith in them as Gurus.  Because Ganapathy had strong faith in his Guru, Kumara Swamy encountered Ganapathy returning from  every sacred place he was entering. One should have faith in Guru like Ganapathy Swamy did.  

Ganapathy had complete faith in his parents as Guru. Such complete faith is what leads to  fulfillment of wishes. This is what leads to receiving Guru’s grace fully. This is what leads to  victory in every task.

Sloka:

Bhavaranya pravistasya dingmoha bhranta cetasah | Yena sandaristah panthah tasmai sri gurave namah ||

Obeisance to Sadguru who shows the good path in the jungle of samsara, where I have been wandering  aimlessly.

Sloka:

Tapatrayagni taptanam srantanam praninamume | Gurureva paraganga tasmai sri gurave namah ||

Guru is the most sacred water or Ganga for the living beings who are frayed and exhausted in the  fire of anxieties. Obeisance to such a Guru.

Sloka:

Hetave sarva jagatam samsararnava setave | Prabhave sarva vidyanam sambhave gurave namah ||

Obeisance to Sadguru who is the cause of all the worlds, who serves as a bridge to cross the ocean of Samsara, who is the Lord of all branches of knowledge, and who is the source of bliss and  happiness.

Here, “Shambhu” refers to the origin of happiness. Happiness here refers to eternal happiness, not  material happiness. Let’s recall the sloka again: 

Dhyanamulam guror murtih puja mulam guroh padam, mantra mulam gurorvakyam moksham mulam guroh krpa.

Sloka:

Dhyanamulam guror murtih puja mulam guroh padam | Mantra mulam gurorvakyam moksham mulam guroh krpa ||

One cannot chant this sloka enough number of times. One cannot sing this sloka in enough number of ways. You heard this in two different ways. 

The image of Guru is the foundation for meditation. The feet of Guru form the foundation for worship. The word of Guru is the foundation for mantra. The grace of Guru alone is the foundation  for redemption.

Sloka:

Haranam bhavararogasya taranam klesa varidheh | Bharanam sarvalokasya saranam carnam guroh ||

The foot of the Guru which roots out the disease of samsara and rebirths, which helps ferry me  across the ocean of sorrow, and that which holds all the worlds, is my refuge.

While concluding this sloka, they are making a special mention of the power of Guru’s curse and Guru’s blessings.

Continues...

🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీ గజానన్ మహరాజ్ జీవిత చరిత్ర - 93 /  Sri Gajanan Maharaj Life History - 93 🌹*

✍️. దాసగణు స్వామి

📚. ప్రసాద్ భరద్వాజ

*🌻. 19వ అధ్యాయము - 1 🌻*

 శ్రీగణేశాయనమః ఆనందం ఇచ్చేవాడా, అభేదా జై. ఎల్లప్పుడూ మీముందు శిరస్సు వంచుకుని నన్ను ఉండనివ్వండి. ఓరాఘవా, రఘుపతీ ఆలస్యం చెయ్యక దయచేసి వచ్చి నన్ను ఆశీర్వదించండి. క్రూరంగా ఉండడం మీవంటి గొప్పవాళ్ళకి శోభించదు. ఓఅనంతా నేను అన్న దాని గురించి ఒకసారి ఆలోచించండి. ఓ జగన్నాధా నేను మిమ్మల్ని అత్యంత నిజాయితో పిలుస్తున్నాను, ఈదాసగణును నిరాశ పరచకండి. 

శ్రీమహారాజు షేగాంలో ఉన్నప్పుడు, కాశీనాధ్ ఖండేరావ్ గరడే అనే బ్రాహ్మణుడు ఆయన దర్శనానికి వచ్చాడు. అతను మహారాజుముందు సాష్టాంగ పడ్డాడు. తన తండ్రి రాసినవిధంగా జీవన్ముక్తునిలో ఉండవలసిన గుర్తులన్నీ ఈయనలో ఉండడంచూసి అతను చాలా సంతోషించాడు. 

ఖాంగాం నుండి షేగాం శ్రీమహారాజు దర్శనానికి రావడానికి చాలా అదృష్టవంతుడిని అని తనలో తాను అనుకున్నాడు. అతను అలా అనుకుంటూ ఉండగా, శ్రీమహారాజు మోచేతితో కొంచెంతోసి, వెళ్ళు నీకోరిక ఫలించింది. పోస్టుమనిషి నీకోసం తంతితో వేచి చూస్తున్నాడు అని శ్రీమహారాజు అన్నారు. 

శ్రీమహారాజు అన్నదానికి అర్ధం అవగాహనకాక, కాశీనాధ్ కలవరపడ్డాడు. ఎందుకంటే ఆయనను ఏదీ అడగడానికి తను ఆయన దగ్గరకు రాలేదు. శ్రీమహారాజునే ఆయన అన్నదానికి అర్ధం అడుగుదామన్న సాహసంకూడా లేకపోయె. శ్రీమహారాజు ముందు చేతులు కట్టుకుని వంగి, తరువాత అతను ఖాంగాం తిరిగి వచ్చాడు. 

శ్రీమహావిహారాజు అన్నదానికి అక్ష అన్నదానికి అర్ధం ఖాంగాంలో నిజంగానే ఒక పోస్టుమనిషి తన ద్వారందగ్గర తంతితో వేచి చూస్తున్నాడు. త్వరత్వరగా ఆతంతి అందుకుని, తనకు మునిసిఫ్గా ఉన్నత పదవి లభించి, మొర్షికి వేసినట్టు అందులోని వార్త చూసాడు. అప్పుడు శ్రీమహారాజు మొచేతితో తనకు ఇచ్చిన పొడుపు గురించి అర్ధం అయింది. ఆయోగి యొక్క జ్ఞానానికి ఆశ్చర్యపోయాడు. 

శ్రీబుటే ఆహ్వానంమీద ఒకసారి శ్రీమహారాజు నాగపూరు వెళ్ళారు. ఈ నాగపూరు ఒకకాలంలో భోంసలే రాజ్యానికి రాజధాని, కానీ ఇప్పుడు ఆ గొప్పదనం పోయింది. ఇదంతా స్వాతంత్రం కోల్పోవడం వల్లనే. ఒక యజమానిని ముష్టివానిగా మార్చింది. విదేశీయులమీద గొప్పదనం కురిపించింది. మారుతున్న సమయంవల్ల ఏనుగులు, గుర్రాలు, పల్లకిలూ అంతర్ధానమయి మోటర్లుకు చోటు ఇచ్చాయి. దీనికి ఎవరినీ నిందించలేము. 

సితబుల్డిలో శ్రీగోపాలబుటే నివాసగృహం ఉంది. శ్రీమహారాజును ఆగొప్ప భవనంలో ఒకపులిని కోటలో పెట్టినట్టు పెట్టారు. శ్రీమహారాజు ఎల్లకాలం తనతో ఉండాలని శ్రీబుటే వాంఛించాడు. షేగాం ప్రజలకు ఇతను శ్రీకృష్ణుని మధురకు తీసుకు వెళుతున్న అక్రూరుని లాగా కనిపించాడు. శ్రీమహారాజులేని షేగాం ఎడారిలా అవడంతో, భక్తులు హరిపాటిల్ను ఆయనను షేగాం వెనక్కు తేవలసిందిగా అర్ధించారు. శ్రీమహారాజులేని షేగాం జీవంలేని శరీరంలో ఉంది. 

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Sri Gajanan Maharaj Life History - 93 🌹* 

✍️. Swamy Dasaganu 

📚. Prasad Bharadwaj

*🌻 Chapter 19 - part 1 🌻*

Shri Ganeshayanamah! Jai to the giver of Joy! Jai to the Abheda! Let my head always bow before You. O Raghava! Raghupati! Please come to bless me without delay. It is not befitting for great ones to be harsh. O Ananta, please give a thought to what I say. O Jagannath, I call You most earnestly, don't disappoint this Dasganu. 

When Shri Gajanan Maharaj was at Shegaon, one Brahmin by the name of Kashinath Khanderao Garde came for His Darshan. He prostrated before Shri Gajanan Maharaj and was very happy to find in Him all the signs of a Jeevan Mukta as written by his father. He found himself to be very fortunate to have come from Khamgaon to see Shri Gajanan Maharaj . While he was thinking so, Shri Gajanan Maharaj gave him a push by an elbow and said, Go, your desire is fulfilled. 

The postman is waiting for you with the telegram.” Kashinath was confused, and could not understand the meaning of what Shri Gajanan Maharaj had said, as he had not come to ask for anything from Him. Neither could he dare to ask Shri Gajanan Maharaj the meaning of what He had said. With folded hands he bent before Shri Gajanan Maharaj and returned to Khamgaon. 

At Khamgaon a postman was really waiting at his door with a telegram. Hurriedly he took the telegram and saw that it contained the news of his promotion as Munsif and tht he was posted to Morshi. Then he understood the meaning of the elbow push given to him by Shri Gajanan Maharaj and was surprised at the knowledge of the saint. 

Upon receiving an invitation from Shri Buty, Shri Gajanan Maharaj went to Nagpur. Nagpur was once the capital of the Bhosle's kingdom, but now had lost all its grandeur. It was the result of losing independence, which had turned an owner into a beggar, and had bestowed greatness on to foreigners. Elephants, horses and palanquins had disappeared giving place to motors. 

Changing times do have such effects and nobody can be blamed for these. Shri Gopal Buty's residence was in Sitaburdi. Gopal kept Shri Gajanan Maharaj in that palatial building just like enclosing a tiger in a fort. Shri Buty desired Shri Gajanan Maharaj to stay with him forever. For the people of Shegaon, he appeared like Akrura taking away Shrikrishna to Mathura. 

Without Shri Gajanan Maharaj , Shegaon became a deserted place and so, all the devotees requested Hari Patil to bring Him back to Shegaon. Shegaon without Shri Gajanan Maharaj was like a body without life in it. 

Continues...

🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము  - 62  / Sri Lalitha Chaitanya Vijnanam  - 62 🌹*

*సహస్ర నామముల తత్వ విచారణ*

✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్ 

సేకరణ : ప్రసాద్ భరద్వాజ 

మూల మంత్రము : 

*🍁. ఓం ఐం హ్రీం శ్రీం  శ్రీమాత్రే నమః 🍁*

*🍀. పూర్తి శ్లోకము :* 

*23. మహాపద్మాటవీ సంస్థ కదంబ వనవాసిని*

*సుదాసాగర మధ్యస్థ కామాక్షీ కామదాయినీ*

* 🌻 62. 'కామాక్షీ! 🌻*

కమనీయమగు కన్నులు కలది అని అర్ధము.

శ్రీదేవి కన్నులు అత్యంత ఆకర్షణీయములు. కనుల నుండియే సమస్తమును సృష్టించి పాలించు జగన్మాత శ్రీదేవి. ఆమె కనుల నుండి ప్రసరించు అనుగ్రహ కారణముగనే జీవులు తరింతురు. 

దేవి అనుగ్రహము లేక జీవునికి మోక్షము లేదు. ఆమె అనుగ్రహమునకు వేచియుండుట తపస్విజనులు తెలుసుకొనిన సత్యము. సత్కర్మా చరణము, ఉపాసన, జ్ఞాన సముపార్జనము చేయుచు శ్రీదేవి కనుల నుండి ప్రసరించు అనుగ్రహ కిరణములకై సమస్త లోకములందు తపస్విజనులు వేచియుందురు.

స్వభావమున కన్యాత్వము చెందినవారినే శ్రీదేవి అనుగ్రహించునని జ్యోతిషశాస్త్రము తెలుపుచున్నది. కన్యారాశి పవిత్రతకు సంకేతము.

దానికి సప్తమ రాశియైన మీనరాశి నుండి, మీనములవలె  కమనీయమైన కన్నులు గల జగన్మాత అనుగ్రహము ప్రసరింపజేయగ, కన్యాతత్త్వముగల జీవులు దివ్యజీవులై తరింపు చెందుచున్నారు. ఇట్టి వారిని కన్యా పుత్రులని వేదములు తెలుపుచున్నవి.

హీనుడై సిగ్గు, ల వదలి ప్రవర్తించును. ధర్మమును మరచును. జడుడై జీవించును. అట్టి జడత్వమును శ్రీదేవి వధించగలదు. జడత్వమును వధించి, జీవు నుద్ధరించుట సమభావమే కదా! ప్రేమభావమే కదా!

అమ్మ భండుని వధించుట జీవు నుద్ధరించుట కొరకే. భండవధకే అమ్మ శక్తి సేనగా ఏర్పడినది. అవియే అనంతమగు జ్ఞానమార్గములు. జీవులను రకరకములుగా ఉద్ధరించుటే తన కర్తవ్యముగా అమ్మ ఉద్యమించును. జగన్మాత కన్న ప్రేమమూరు లెవ్వరును లేరు.

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Sri Lalitha Chaitanya Vijnanam  - 62 🌹*

*1000 Names of Sri Lalitha Devi* 

✍️. Ravi Sarma 

📚. Prasad Bharadwaj

Kāmākṣī कामाक्षी (62)

She has lovely eyes.  Her eyes are full of grace, compassion and mercy for the universe.  

That is why, Her eyes are so beautiful.  She fulfils all the desires of Her devotees by Her looks alone.  

Normally, our thoughts are reflected through our eyes.  Kāmā is the combination of two bīja-s kā + mā.  kā means Sarasvatī and  mā  means Lakṣmī.  

These two goddesses are said to be the eyes of Lalitā.  Kāmā also means Śiva.  This can mean that She is the eyes of Śiva.

Continues...

🌹 🌹 🌹 🌹 🌹

*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము  - 63  / Sri Lalitha Chaitanya Vijnanam  - 63 🌹*

*సహస్ర నామముల తత్వ విచారణ*

✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్ 

సేకరణ : ప్రసాద్ భరద్వాజ 

మూల మంత్రము : 

*🍁. ఓం ఐం హ్రీం శ్రీం  శ్రీమాత్రే నమః 🍁*

*🍀. పూర్తి శ్లోకము :* 

*23. మహాపద్మాటవీ సంస్థ కదంబ వనవాసిని*

*సుదాసాగర మధ్యస్థ కామాక్షీ కామదాయినీ*

*🌻 63. 'కామదాయినీ 🌻*

కోరికల నిచ్చునది అని భావము.

శ్రీదేవిని సేవించువారికి సకల వాంఛలను ఆమె పరిపూర్తి గావించును. శివుని వ్యక్తరూపమేగాన, శివ సాయుజ్యము కూడ నొసగగలదు. ఇహమును పరమును అందించునది శ్రీదేవి. ఆమె కామేశ్వరుని కూడ భక్తుల కందించగలదు. చిల్లర కామములన్నియు నెరవేర్చగలదని వేరుగ తెలుప నవసరము లేదు. అమ్మ నారాధించిన వారికి కోరికలు తీరుటలో సౌలభ్యమున్నది. 

కామద + అయిని అని పలుకుటలో సమస్త కామ (కోరిక) పరితృప్తికి అమ్మయే శుభమగు వాహిక అని అర్థము. ఆమె సర్వకామప్రద. భక్తితో సేవించువారికి వరప్రదాత. బ్రహ్మ సహితము ఆమెను ప్రార్థించి ఇచ్ఛాశక్తి కలిగి సృష్టిని నిర్వర్తించు చున్నాడు అని బ్రహ్మాండ పురాణమందు తెలుపబడినది.

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Sri Lalitha Chaitanya Vijnanam  - 63  🌹*

*1000 Names of Sri Lalitha Devi* 

✍️. Ravi Sarma 

📚. Prasad Bharadwaj

*🌻 Kāmadāyinī कामदायिनी (63) 🌻*

She fulfils whatever  is desired.  There are several interpretations for this nāma.  Kāma means Kāmeśvara, a form of Śiva.  Dāyini means giver.  It has been discussed earlier that Śaktī alone leads to Śiva and there is no direct access to Him. 

She takes Her devotees to Śiva, the supreme prakāśa form, the nirguṇa Brahman (Brahman without attributes).  She is like a veil around Śiva and unless this veil is removed, Śiva cannot be realized.  This veil can be removed only at Her will. 

Brahma, the creator gave Her two names Kāmākṣī and Kāmeśvarī.  This is because of Her omniscient nature.  

Brahma honoured her with these two names, because He was so impressed with all Her activities, which She does by mere glance.  This interpretation indicates Her vimarśa form.  Dāyini also means inheritance.  She inherits Śiva, meaning that Śiva belongs to Her (possible obsession!).

The 59th  nāma secretly refers to Vārāhi Devi, 60th  nāma   refers to Śyamalā Devi, 61st  nāma   to Kāmākṣī Devi and 62nd  nāma refers to Mahā-tripura-sundarī (nāma 234, another form of Śaktī).  These references are highly subtle in nature. 

With this, the description of Her physical or gross form ends. Nāma-s 64 to 84 narrate the slaying of demon Bhandāsura. Here begins the narration of Her Supreme form and these recitals are also equally secretive in nature.

Continues...

🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🌹. శ్రీమద్భగవద్గీత - 447  / Bhagavad-Gita - 447 🌹*

✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద

📚. ప్రసాద్ భరద్వాజ

*🌴. 12వ అధ్యాయము -భక్తియోగము -02 🌴*

02.  శ్రీ భగవానువాచ

మయ్యావేశ్య మనో యే మాం నిత్యయుక్తా ఉపాసతే |

శ్రద్ధయా పరయోపేతాస్తే మే యుక్తతమా మతా: ||

🌷. తాత్పర్యం : 

శ్రీకృష్ణభగవానుడు పలికెను: నా స్వీయరూపము నందు మనస్సును లగ్నము చేసి దివ్యమును, ఘనమును అగు శ్రద్ధతో సదా నా అర్చనమునందు నియుక్తులైనవారు అత్యంత పరిపూర్ణములని నేను భావింతురు.

🌷. భాష్యము  : 

అర్జునుని ప్రశ్నకు సమాధానముగా శ్రీకృష్ణభగవానుడు తన స్వీయరూపమును ధ్యానించుచు శ్రద్ధాభక్తులను గూడి తనను పూజించువాడు యోగమునందు పరిపూర్ణుడని స్పష్టముగా పలుకుచున్నాడు. 

సర్వము కృష్ణుని కొరకే ఒనరింపబడుచున్నందున అట్టి కృష్ణభక్తిభావనలో నున్నవానికి ఎట్టి భౌతికకర్మలను ఉండవు. అటువంటి కృష్ణభక్తిరసభావనలో భక్తుడు సంతతమగ్నుడై యుండును.

 కొన్నిమార్లు అతడు జపమును గావించును. కొన్నిమార్లు కృష్ణుని గూర్చిన శ్రవణము లేదా పఠనమును కొనసాగించును. మరికొన్నిసార్లు కృష్ణునికై ప్రసాదమును తయారు చేయును. ఇంకొన్నిమార్లు కృష్ణుని నిమిత్తమై అవసరమైనదేదియో ఖరీదు చేయుటకు అంగడికేగును. 

ఇంకను మందిరమును శుభ్రము చేయుట, భగవానుని భోజనపాత్రులను కడుగుట వంటి కార్యముల నొనరించును. ఈ విధముగా ఆతడు కృష్ణపరకర్మలకు అంకితము కాకుండా క్షణకాలమును వృథాచేయడు. అటువంటి కర్మ సంపూర్ణముగా సమాధిగతమై యుండును.

🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Bhagavad-Gita as It is - 447 🌹*

✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada

📚 Prasad Bharadwaj

*🌴 Chapter 12 - Devotional Service - 02 🌴*

02. śrī-bhagavān uvāca

mayy āveśya mano ye māṁ

nitya-yuktā upāsate

śraddhayā parayopetās

te me yukta-tamā matāḥ

🌷 Translation : 

The Supreme Personality of Godhead said: Those who fix their minds on My personal form and are always engaged in worshiping Me with great and transcendental faith are considered by Me to be most perfect.

🌹 Purport :

In answer to Arjuna’s question, Kṛṣṇa clearly says that he who concentrates upon His personal form and who worships Him with faith and devotion is to be considered most perfect in yoga. 

For one in such Kṛṣṇa consciousness there are no material activities, because everything is done for Kṛṣṇa. A pure devotee is constantly engaged. 

Sometimes he chants, sometimes he hears or reads books about Kṛṣṇa, or sometimes he cooks prasādam or goes to the marketplace to purchase something for Kṛṣṇa, or sometimes he washes the temple or the dishes – whatever he does, he does not let a single moment pass without devoting his activities to Kṛṣṇa. Such action is in full samādhi.

🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. గీతోపనిషత్తు - 64 🌹*
✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్ 
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

*🍀 1. ఉపదేశము -వాసుదేవ, సంకర్షణ, ప్రద్యుమ్న, అనిరుద్ధ వ్యూహములు నాలుగును అంతర్యామి ఆవాసములు. అవి మనలో అంతర్యామి ప్రజ్ఞగను, అహంకార ప్రజ్ఞగను, బుద్ధిగను, మనస్సుగను యున్నవి. చివరి మూడింటి యందు దైవము నిలచినచో యోగము పరిపూర్ణమగును. 🍀*

*📚. 4. జ్ఞానయోగము - 1 📚*

01. ఇమం వివస్వతే యోగం ప్రోక్తవా నహ మవ్యయమ్ |
వివస్వాన్ మనవే ప్రాహ మను రిక్ష్వాక వే2 బ్రవీత్ || 1

నేనీ యోగమును సూర్యుని కుపదేశించగ సూర్యుడు
వైవస్వత మనువున కుపదేశించెను.

అతడు ఇక్ష్వాకున కుపదేశించెను అని భగవానుడు పలికినాడు గదా! 'నేను' అంతర్యామి యగు వాసుదేవ ప్రజ్ఞ కాగ సూర్యుడహంకార స్వరూపుడగు సంకర్షణ ప్రజ్ఞ. అతనికుపదేశమై సిద్ధి పొందుటచే అతని నుండి అంతర్యామి ప్రజ్ఞ మనువునకు ఉపదేశ పూర్వకముగ చేరినది. అతని బుద్ధి అంతర్యామిచే వెలిగింపబడినది. అతని నుండి అంతర్యామి ఉపదేశపూర్వకముగ భూమికి రాజుయైన ఇక్ష్వాకునకు చేరినది. 

ఇక్ష్వాకును చేరిన అంతర్యామి ప్రజ్ఞ భూమిని నాలుగు పాదముల ధర్మమును నిలిపి పాలించినాడు. అట్లు యోగము పరిపూర్ణమైనది.
ఇక్ష్వాకు అనగా మనస్సు. మనస్సు శరీరమునకు రాజు. మనసే ఇంద్రియముల ద్వారా శరీరమును పోషించును, నడిపించును, పాలించును కూడ. 

దివ్యత్వము మనసును చేరినచో మనసు దివ్యమై శరీర ధాతువులయందు వలసిన మార్పులేర్పరచి వాసనలను పారద్రోలి దివ్యకార్యమునకు సమర్పించును. అపుడే యోగము పరిపూర్ణమైనట్లు. అంతర్యామి అవతరించినట్లు. 

అందరిలోని అంతరాత్మ అహంకారము, బుద్ధి, మనసుల లోనికి ప్రవహించుట వలన అవతరణము జరుగును. అపుడు శరీరము దివ్యమై ఇంద్రియముల ద్వారా పరిసరములకు దివ్యత్వమును ప్రసరింప చేయును. అవరోధములు లేక ఇంద్రియముల ద్వారా ప్రసరింప చేయగలవు. అట్టి స్థితి నొందిన మనస్సును అనిరుద్ధు డందురు. హృదయమున నిలచి తన చూపు, మాట, స్పర్శ, సాన్నిధ్యాదులతో అందరిని ప్రచోదనము గావించును. అట్టివాడు పరిపూర్ణ యోగి. 

వాసుదేవ, సంకర్షణ, ప్రద్యుమ్న, అనిరుద్ధ వ్యూహములు నాలుగును అంతర్యామి ఆవాసములు. అవి మనలో అంతర్యామి ప్రజ్ఞగను, అహంకార ప్రజ్ఞగను, బుద్ధిగను, మనస్సుగను యున్నవి. చివరి మూడింటి యందు దైవము నిలచినచో యోగము పరిపూర్ణ మగును. ఇట్లు దైవమే యోగము తానుగ నందించుచున్నాడని ఉపదేశ మార్గమును, రహస్యమును భగవానుడు తెలిపెను.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹 . శ్రీ శివ మహా పురాణము - 260 🌹* 
రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ

*🌴. రుద్ర సంహితా - సతీఖండః 🌴* 
61. అధ్యాయము - 16

*🌻.విష్ణువు, బ్రహ్మ శివుని స్తుతించుట - 2 🌻*

 హే స్వామిన్‌! సృష్టిని చేసి నేను, స్థితిని చేసి విష్ణువు నీ ఆజ్ఞను పాలించినాము. శివుడే స్వయముగా నీ రూపముతో ఆవిర్భవించి లయకర్త అగుచున్నాడు (24). నీతోడు లేనిదే మేమిద్దరము మాకర్తవ్యములను నెరవేర్చ జాలము. కావున, నీవు జగత్కార్యమును నిర్వర్తించుటకై ఒక సుందరిని భార్యగా స్వీకరించుము (25).

ఈశ్వరుడిట్లు పలికెను -

హే బ్రహ్మన్‌!ఓ హరీ! మీరిద్దరు నాకు ఎల్లవేళలా మిక్కిలి ప్రియమైన వారు గదా! నిన్ను చూచినప్పుడు నాకు గొప్ప ఆనందము కలుగును (28). మీరిద్దరు దేవతలలో ప్రముఖులు, ముల్లోకములకు ప్రభువులు. జగత్కార్యమునందు లగ్నమైనన మనస్సు గల మీరు చెప్పిన మాట చాల యోగ్యమైనది (29).

దేవతాశ్రేష్ఠులారా! నాకు వివాహము ఉచితము కాదు. నేను తపోనిష్ఠుడను. విరాగిని. సర్వదా యోగమార్గమునందుండు వాడను (30). నేను పవిత్రమైన నివృత్తి మార్గములో నిర్వికారముగా నాయందు నేను రమించుచూ ఉన్నవాడను. జ్ఞానినగు నా రూపము అవధూతను పోలియుండును. నాకు కామములు లేవు. నేను ఆత్మాలోకన పరుడను (31).

నేను వికారములు లేని వాడను, భోగముల అక్కర లేనివాడను, నేను సర్వదా అశుభ్ర అమంగళ వేషమును ధరించువాడను. అట్టి నాకిపుడు ఈ లోకములో భార్యతో నేమి ప్రయోజనము గలదో చెప్పుము (32). నిత్యయోగ నిష్ఠుడనగు నాకు ఆనందము నిత్యముగనుండును గదా! జ్ఞాన విహీనుడైన పురుషుడైతే అనేక కోర్కెలను మనస్సులో భావించుచుండును (33). 

లోకములో వివాహమును చేసుకొనుట ఇతరుల బంధములో చిక్కుకొనుటయేనని తెలియవలెను. కావున నాకు వివాహమునందు రుచి లేదు. నేను ముమ్మాటికీ సత్యమును పలుకుచున్నాను (34). ఆత్మ నిష్ఠుడను, సమ్యగ్దర్శన నిష్ఠుడను అగు నా ప్రవృత్తి నా కొరకై ఉండదు గదా! అయినప్పటికీ లోకకల్యాణ కొరకై మీరు చెప్పినట్లు చేయగలను (35).

సర్వదా భక్తులకు వశుడనై ఉండే నేను నీ మాటను గొప్ప మాటగా స్వీకరించి, ఇచ్చిన మాటను నిలబెట్టుకొనుట కొరకై వివాహమును చేసుకొనగలను (36). కాని, నేను ఎటువంటి సుందరిని ఏ షరతులపై వివాహమాడెదనో చెప్పెదను. వినుము. ఓ బ్రహ్మా! విష్ణో! నేను యోగ్యమగు మాటను మాత్రమే చెప్పెదను (37). 

ఏ స్త్రీ నా తేజస్సును వివేకముతో ధరింప సమర్థురాలగునో, అట్టి యోగశక్తి గల, ఇచ్చవచ్చిన రూపమును ధరించగల యువతిని నాకు భార్యగా స్వీకరించుటకై చూపించుడు (38). నేను యోగనిష్ఠుడనై యుండగా ఆమె కూడ యోగ నిష్ఠురాలు గావలెను. మరియు,నేను కామాసక్తుడనైనచో, ఆమె కూడా కామసక్తురాలు కావలెను (39).

వేద వేత్తలగు విద్వాంసులు ఏ శివుని జ్యోతిస్స్వరూపమగు అక్షరపరబ్రహ్మమని వర్ణించెదరో, సనాతనుడగు శివుని ధ్యానించెదరో (40), అట్టి శివుని ధ్యానించని సమయములో నేను ఆమెతో విహరించెదను హే బ్రహ్మన్‌! నా ధ్యానమునందు విఘ్నమును కలిగించు స్త్రీ నాచే నశింపజేయబడును (41). నీవు, విష్ణువు మరియు నేను పరబ్రహ్మ యగు శివుని అంశములము. కాన, మనము మహాత్ములము. కావున మనము ఆయనను ధ్యానించుట ఉచితము (42). 

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹 LIGHT ON THE PATH - 17 🌹*
*🍀 For those WHO DESIRE TO ENTER WITHIN - For DISCIPLES 🍀*
✍️. ANNIE BESANT and LEADBEATER
📚. Prasad Bharadwaj

*🌻 Before the soul can stand in the presence of the Masters its feet must be washed in the blood of the heart. - 3 🌻*

71. On the occult path many pleasures connected with the outer world are seen to be a waste of time. There may be cases when it is a real effort to part with them, when there is a call from the higher life, and the aspirant responds to that call at a certain amount of cost to the lower nature. 

Then he must cast aside the lower in order to have the higher; but later on the attraction of the lower will have disappeared entirely. When a mart once fully realizes the higher, the lower simply ceases to exist for him, but in many cases he has to cast aside the lower before he really enters into the glory and the joy and the beauty of the spiritual life.

72. I have known many whose opportunities were good but who shrank back just at that point, and failed because they were not ready to give up all that they had previously enjoyed, and apparently receive nothing in return for it. Sometimes a man is afraid to let go of one thing until he can grasp the other, and so he holds fast to the lower; but it does not satisfy him, because he has glimpsed the higher. 

To give up everything at the Master’s call – one wonders whether one could do it; one always thought and hoped that one would, but when it comes to the point can you do it fully and cheerfully? Many have worked for years and years, and wonder why they do not attain, why they are not among those whom the Master is able to draw very close to Himself. The reason is always the same; it is the personality in some form that keeps them back. 

This giving up of everything is not a thing to be done with constant backsliding – giving up one day, and grasping and trying to keep the next – nor is it to be done with pride, with the pose: “I have given up everything.” 

That is quite the wrong attitude; it should be done as a matter of course, and cheerfully. The person who is going to succeed will feel that there is nothing else for him to do but to make the great renunciation when the moment comes.

Continues...
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 148 🌹*
🌷. సద్గురు శివానంద 🌷
📚. ప్రసాద్ భరద్వాజ

*🌻. నారద మహర్షి - 22 🌻*

157. దేవతలను పరమేశ్వరుని అంగములుగా భావిస్తేనే తత్ఫలితం కలుగుతుందని తెలుసుకోవాలి! ఈతడే దేహాలలో ఆత్మగా ఉన్నాడు. ‘భౌవనశ్చ భువనశ్చాధిపతిశ్చ’ అంటే, భువనముల యొక్క స్వరూపము అతడే; వాటి యొక్క అధిపతికూడా అతడే అని అర్థం. అతడు నియామకుడిగాకూడా ఉన్నాడు. 

158. ‘యంతాచమే ధర్తాచమే క్షేమశ్చమే’ – అనే మంత్రానికి అర్థం, “అతడే నాకు నియామకుడూ – నేను ఏం తినాలి? ఎక్కడ ఉండాలి? ఎలా బతకాలి? అనేవి నిర్ణయిస్తూ నాకు ‘నియంతగా’ ఉన్నాడు. అతడియందు తదధీనవృత్తి నాకు ఉంది. 

159. నాకు అతడు ‘ధర్త’ – అంటే, నన్ను ధరించిన వాడుగా ఉన్నాడు. ఆ విధంగా నాకు పరమేశ్వరుడు ‘యంత'(నియంత)గా, ‘ధర్త'(ధరించిన వాడు)గా ఉండటంచేత, నాకు ‘క్షేమం’ కలుగుతుంది(క్షేమశ్చమే)” అని. “ఇలాంటి భావనతో ఎవరయితే ఉంటాడో, అతడిని వేదమాత రక్షిస్తుంది. అప్పుడు ఈ కర్మలన్నీ అర్థవంతమై, మంగళప్రదమవుతాయి” అన్నాడు నారదుడు.

160. “కామ్యకర్మలు వదిలిపెట్టి నీవు చేసిన కర్మలు ఎవరిని గురించి చేసావో, వాటి గతి ఎలా పరిణమిస్తుందో తెలుసుకో! సర్వదేవ నమస్కారములూ ‘కేశవం ప్రతిగఛ్ఛతి’ – అంటె కేశవుడినే చేరతాయి. అంతేకాదు, సర్వ నమస్కారములూ – ఎవరు ఎవరికి చేఇసినాకూడా – లోపలి వస్తువునకు, అంటే అందరిలోపలా ఉండే కేశవునికే చెందుతున్నాయి. అది క్షేమకరం అవుతుంది. 

161. కాబట్టి ఇంద్రియలోలుడవై ఉండవద్దు. అలా ఉంటే అది మృగచేష్టతో సమానం.””అంతా అస్త్పదార్థముతో నిండిఉన్న ఈ దేహం నది అనుకోరాదు. ఈ అస్త్పదార్థములతో ఎలాగైనా, ఎప్పటికైనా వియోగం తప్పదు. ఈ అస్త్పదార్థమునందున్న మనసుని వదిలి పెట్టుకుని, శాశ్వతమయిన, సమస్త జీవకోటికీ ఆశ్రయుడైన ఆ పరమేశ్వరుడిని ధ్యానిస్తూ ఈ లౌకిక జీవన విధానములో అన్నింటియందూ విరక్తుడివై నీవు తరించు.

162. శ్వేతద్వీపమని వైకుంఠానికిపేరు. వైకుంఠం శుద్ధసత్వగుణంచేత నిర్మితమై ఉంటుంది. శుద్ధసత్త్వగుణం అనేది భూలోకంలోని జీవుడియందుండదు. సత్త్వ గుణాధిక్యత ఉంటే ఉండవచ్చు. జీవాహంకారములో దేహాత్మభావన, దేహాభిమానము, అహము ఇవన్నీ ఉన్నప్పుడు శుద్ధసత్త్వం ఉండదు. యోగికూడా తురీయావస్థలో సత్త్వగుణాన్ని ఆశ్రయించడు. త్రిగుణములకు అతీతుడై ఉంటాడు. పైకివెళ్ళి తురీయస్థితిలో ఉంటాడేతప్ప, శుద్ధ సత్త్వగుణసంపన్నుడు కాదు. 

163. అందుకనే అతనికి తపోభంగం కలిగినప్పుడు అతడు శపిస్తాడు. తన జీవలక్షణంలోని అహాన్ని చంపలేడు. త్రిగుణములను దాటలేడు. వాటిని కాసేపు విడిచి ఎక్కడికో వెళతాడంతే. కాబట్టి యోగి తురీయస్థితినుంచీ మళ్ళీ దేహాత్మభావన కొచ్చి – ఈ చైతన్యానికొచ్చి-జ్ఞానముచేత ఉద్దీప్తుడై, క్రమంగా సత్త్వగుణ ఆధిక్యతను పెంచుకుని మోక్షమార్గంలో వెళ్ళాలి.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. శివగీత - 103 / The Siva-Gita - 103 🌹*
 *🌴. పరమేశ్వరుడు - శ్రీరాముడు మధ్య జరిగిన జ్ఞాన సంవాదము. 🌴*
📚. ప్రసాద్ భరద్వాజ 

ద్వాదశాధ్యాయము
*🌻. మోక్ష యోగము - 4 🌻*

జ్ఞానే నైవ వినశ్యంతిన - తుకర్మాయు తైరపి,
జ్ఞానా దూర్ద్వంతు యత్కింఛి - త్పుణ్యం వా పాపమేవ వా .26
క్రియతే బహు వాప్యల్పం- తేనాయాం విలిప్యతే,
శరీరారం భకం యత్తు - ప్రారబ్దం కర్మ జన్మనః 27
తద్భోగే నైన నష్టం స్యా - న్నతు జ్ఞానేన నశ్యతి,
నిర్మోహొ నిరహంకారో - నిర్లేప స్సంగర్జితః 28
సర్వ భూతే షు చాత్మానం - సర్వ భూతాని చాత్మని,
యః పశ్య స్సంచర త్యేష -జీవన్ముక్తో భిది యతే 29
అహి నిర్ల్వయని యద్వ - ద్ద్రష్టు: పూర్వం భయ ప్రదా,
తతోస్యన భయం కించి- త్తద్ద్వ ద్ద్రస్తురయం జనః 30

జ్ఞానోత్పత్త్య నంతరమున నేపాటి పుణ్యపాపములు చేసినను వాటితో గట్టబడడు. శరీరాం భకమగు ప్రారబ్ధ కర్మ మేదియున్నదో అది జీవునికి యనుభవము చేత నాశమందును గాని, జ్ఞానము చేత నశించదు. అహంకార మమకారములు లేక సాంగత్యమును వదలి నిర్లప్తుడై సమస్త భూతముల యందాత్మను, ఆత్మ యందు సమస్త ప్రాణులను ఎవ్వడు దర్శించునో మరియు నన్ను ధ్యానించునో వాడే జీవన్ముక్తు డనబడును.  

తెలిసికొను పర్యంతము పాము పొర భయ పెట్టును. పిదప తొలగును. అట్లే వీడును చూచినా వారికి భయాదులను కల్పింపక ఉదాసీనుడై యుండును.

సశేషం... 
🌹 🌹 🌹 🌹 🌹  

*🌹 The Siva-Gita - 103 🌹*
*🌴. Dialogue between Rama and Lord Siva 🌴*
✍️ Ayala somayajula. 
📚. Prasad Bharadwaj

Chapter 13 
*🌻 Moksha Yoga - 4 🌻*

After self realization and attaining knowledge, whatever sins of virtuous deeds are done by the Jnani, they do not bind him and he remains untouched with those karmas and their fruits. 

Whatever Prarabdha karma comes along with the body of the Jiva, that gets destroyed by experience but not through knowledge. Being devoid of ego and pride, leaving all attachments, remaining untouched (Nirlipta) when one sees self within all creatures and sees all creatures within self and meditates on me, he becomes Jivanmukta.

Continues...
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹 Seeds Of Consciousness - 211 🌹*
✍️ Nisargadatta Maharaj 
 Nisargadatta Gita 
📚. Prasad Bharadwaj

*🌻 60. You have to realize that you are not the body or the knowledge ‘I am’, you as the Absolute are neither, nor do you
require them. 🌻*

When the knowledge ‘I am’ arose, you did not know what it was, it was just a feeling ‘you are’ absolutely non-verbal. You did not even know whether it was real or unreal, it was just there. 

When verbalization was thrust on you, you made the first mistake of believing the ‘I am’ to be real. The second mistake which was hammered onto you was to believe that you are a person born with a body and living in this world. That you would die one day you inferred by seeing people die around
you and these beliefs grew stronger on seeing births and deaths occurring around you almost everyday. 

What the Guru now tells you challenges all this, he tells you that you are neither the body nor the knowledge ‘I am’. He tells you that you are the formless Absolute and you do not require either of them, rather you were never them. 

The Guru can say so as that is his realization and you have to
have faith in his words.
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 87 🌹*
✍️. శ్రీ బాలగోపాల్
📚. ప్రసాద్ భరద్వాజ 

*🌻. భగవంతుని 7వ పాత్ర - సాధు పురుషులు, మహాపురుషులు, సత్పురుషులు, ముముక్షువులు - 09 🌻*

373. లోపలి ఇంద్రియములతో ఉన్నతతర భూమికల అనుభవమును పొందును.

374. మొదటి మూడు భూమికలలో గాంధర్వ గానము వినిపించును. గాన స్వరూపము, గాన మాధుర్యము, గానానందము వర్ణించ నలవి కానివి. 

375. మానవుడు సూక్ష్మ భూమికలో నున్నప్పుడు ఈ ప్రాణశక్తియే, ఈశ్వరీయముగను, జ్ఞానయుక్తముగను ఉపయోగింపబడును.

కానీ, సూక్ష్మ భూమికలో నున్నప్పుడు మనస్సు పరోక్షముగను, తెలియకుండగను ఉపయోగింపబడుచుండును. 

376. మొదటి భూమిక భౌతిక-సూక్ష్మ ప్రపంచములను విడదీయు సరిహద్దు రేఖ వంటిది. మానవుని స్థితి లో భౌతిక చైతన్యము గల భగవంతుడు(కండ్లు, చెవులు, ముక్కులు) స్థూలేంద్రియాలతో సూక్ష్మ సంస్కార అనుభవమును పొందును.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. శ్రీ విష్ణు సహస్ర నామములు - 50 / Sri Vishnu Sahasra Namavali - 50 🌹*
*నామము - భావము*
📚. ప్రసాద్ భరద్వాజ 

*🌻. ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్ 🌻*

*కన్యా రాశి- హస్త నక్షత్రం 2వ పాద శ్లోకం*

*🌻 50. స్వాపనః స్వవశో వ్యాపీ నైకాత్మా నైకకర్మకృత్|*
*వత్సరో వత్సలో వత్సీ రత్నగర్భో ధనేశరః|| 🌻*

అర్ధము :

🍀. స్వాపనః - 
జీవులను తన మాయతో ఆత్మజ్ఞానరహితులుగా జేయువాడు. 

🍀. స్వవశః - 
సర్వస్వతంత్రుడు. 

🍀. వ్యాపీ - 
సర్వత్త్రా వ్యాపించియున్నవాడు.

🍀. నైకాత్మా - 
అనేక రూపములతో విరాజిల్లువాడు.

🍀. నైక కర్మకృత్ - 
అనేక కార్యములు చేయువాడు.

🍀. వత్సరః - 
సర్వులకు వాసమైనవాడు.

🍀. వత్సలః - 
అపరిమిత వాత్సల్యము కలవాడు.

🍀. వత్సీ - 
అందరికీ తండ్రి. 

🍀. రత్నగర్భః - 
గర్భమున రత్నములు గలవాడు.

🍀. ధనేశ్వరః - 
ధనమునకు ప్రభువు.

సశేషం... 
🌹 🌹 🌹 🌹 🌹 

*🌹 Vishnu Sahasra Namavali - 49 🌹*
*Name - Meaning*
📚 Prasad Bharadwaj

*🌻 OM NARAYANAYA VIDMAHE VASUDEVAYA DHIMAHI । TANNO VISHNU PRACHODAYAT ॥ 🌻*

*Sloka for Kanya Rasi, Hasta 2nd Padam*

*🌻 50. svāpanassvavaśō vyāpī naikātmā naikakarmakṛt |*
*vatsarō vatsalō vatsī ratnagarbhō dhaneśvaraḥ || 50 || 🌻*

🌻 Svāpanaḥ: 
One who enfolds the Jivas in the sleep of Ajnana.

🌻 Svavaśaḥ: 
One who is dominated by oneself and not anything else, as He is the cause of the whole cosmic process.

🌻 Vyāpī: 
One who interpenetrates everything like Akasha.

🌻 Naikātmā: 
One who manifests in different forms as the subsidiary agencies causing the various cosmic processes.

🌻 Naikakarmakṛt: 
One who engages in innumerable activities in the process of creation, sustentation, etc.

🌻 Vatsaraḥ: 
One in whom everything dwells.

🌻 Vatsalaḥ: 
One who has love for His devotees.

🌻 Vatsī: 
One who protects those who are dear to Him.

🌻 Ratnagarbhaḥ: 
The Ocean is so called because gems are found in its depths. As the Lord has taken the form of the ocean, He is called by this name.

🌻 Dhaneśvaraḥ: 
One who is the Lord of all wealth.

Continues...
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

Join and Share
*🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom Telegram group 🌹*