1) 🌹 శ్రీమద్భగవద్గీత - 628 / Bhagavad-Gita - 628🌹
2) 🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 266, 267/ Vishnu Sahasranama Contemplation - 266, 267🌹
3) 🌹 Daily Wisdom - 47🌹
4) 🌹. వివేక చూడామణి - 11🌹
5) 🌹Viveka Chudamani - 11 🌹
6) 🌹. దేవాపి మహర్షి బోధనలు - 21🌹
7) 🌹. ఏకత్వమే జ్ఞానస్థితి 🌹
🍀. ‘స్వేచ్ఛ. మీరనుకుంటున్నది కాదు’ నుంచి ( ఓషో బోధ ) 🍀
8) 🌹. శ్రీమద్భగవద్గీత - 18 / Bhagavad-Gita - 18🌹
9) 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 198 / Sri Lalita Chaitanya Vijnanam - 198🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శ్రీమద్భగవద్గీత - 628 / Bhagavad-Gita - 628 🌹*
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ
*🌴. 18వ అధ్యాయము - మోక్ష సన్యాస యోగం - సన్న్యాసము యొక్క పూర్ణత్వము - 45 🌴*
45. స్వే స్వే కర్మణ్యభిరత: సంసిద్ధిం లభతే నర: |
స్వకర్మనిరత: సిధ్ధిం యథా విన్దతి తచ్ర్ఛుణు ||
🌷. తాత్పర్యం :
మనుజుడు తన గుణమునకు సంబంధించిన కర్మను చేయుట ద్వారా పూర్ణత్వమును పొందగలడు. ఇక దీనిని ఏ విధముగా ఒనరింపవచ్చునో నా నుండి ఆలకింపుము.
🌷. భాష్యము :
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Bhagavad-Gita as It is - 628 🌹*
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj
*🌴 Chapter 18 - Moksha Sanyasa Yoga - The Perfection of Renunciation - 45 🌴*
45. sve sve karmaṇy abhirataḥ
saṁsiddhiṁ labhate naraḥ
sva-karma-nirataḥ siddhiṁ
yathā vindati tac chṛṇu
🌷 Translation :
By following his qualities of work, every man can become perfect. Now please hear from Me how this can be done.
🌹 Purport :
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 266, 267 / Vishnu Sahasranama Contemplation - 266, 267 🌹*
📚. ప్రసాద్ భరద్వాజ
*🌻266. దుర్ధరః, दुर्धरः, Durdharaḥ🌻*
*ఓం దుర్ధరాయ నమః | ॐ दुर्धराय नमः | OM Durdharāya namaḥ*
పృథివ్యాదీన్యపి సదా లోకానాం ధారకాణి చ ।
అన్యైర్వోఢుమశక్యాని ధారయన్ పరమేశ్వరః ॥
దుఃఖేనాపి ధారయితుం అశక్యః ఎంతటి శ్రమతో కూడా ధరించబడుటకు శక్యుడు కాడు. ఏలయన లోకములను ధరియించునవియు ఇతరులచే ఎవ్వరిచేతనూ ధరించబడుటకు శక్యము కానివియును అగు పృథివి మొదలగు వానిని కూడా ధరించువాడు కావున నారాయణుడు ఎవరి చేతనూ ధరించబడ శక్యము కానివాడు. కావున దుర్ధరః.
లేదా దుఃఖేన ధ్యాన సమయే ముముక్షుభిః హృదయే ధార్యతే ధ్యాన సమయమున ముముక్షువుల అనగా మోక్షమును కోరువారిచేత ఎంతయో శ్రమచే హృదయమున ధరించబడును - దుర్ + ధరః.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
*🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 266🌹*
📚. Prasad Bharadwaj
*🌻266. Durdharaḥ🌻*
*OM Durdharāya namaḥ*
Pr̥thivyādīnyapi sadā lokānāṃ dhārakāṇi ca,
Anyairvoḍumaśakyāni dhārayan parameśvaraḥ.
पृथिव्यादीन्यपि सदा लोकानां धारकाणि च ।
अन्यैर्वोढुमशक्यानि धारयन् परमेश्वरः ॥
Duḥkhenāpi dhārayituṃ aśakyaḥ / दुःखेनापि धारयितुं अशक्यः No matter how hard it may be attempted, the One who cannot be supported by any one since He supports the universe which have objects like Earth that no one can support.
Or Duḥkhena dhyāna samaye mumukṣubhiḥ hr̥daye dhāryate / दुःखेन ध्यान समये मुमुक्षुभिः हृदये धार्यते He who is borne by the seekers of salvation with difficulty in their hearts at the time of contemplation and meditation.
🌻 🌻 🌻 🌻 🌻
Source Sloka
सुभुजो दुर्धरो वाग्मी महेन्द्रोवसुदो वसुः ।नैकरूपो बृहद्रूपः शिपिविष्टः प्रकाशनः ॥ २९ ॥
సుభుజో దుర్ధరో వాగ్మీ మహేన్ద్రోవసుదో వసుః ।నైకరూపో బృహద్రూపః శిపివిష్టః ప్రకాశనః ॥ ౨౯ ॥
Subhujo durdharo vāgmī mahendrovasudo vasuḥ ।Naikarūpo br̥hadrūpaḥ śipiviṣṭaḥ prakāśanaḥ ॥ 29 ॥
Continues....
🌹 🌹 🌹 🌹 🌹
*🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 267 / Vishnu Sahasranama Contemplation - 267🌹*
📚. ప్రసాద్ భరద్వాజ
*🌻267. వాగ్మీ, वाग्मी, Vāgmī🌻*
*ఓం వాగ్మినే నమః | ॐ वाग्मिने नमः | OM Vāgmine namaḥ*
యన్నిఃసృతా బ్రహ్మమయీ వాక్తద్వాగ్మీతి కథ్యతే వేదమయి వేదరూప అగు పవిత్ర పూజ్యవాక్కు ఈతనినుండి నిఃశ్వాసరూపమున వెలువడినది కావున ఈ విష్ణువు వాగ్మి.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
*🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 267🌹*
📚. Prasad Bharadwaj
*🌻267. Vāgmī🌻*
*OM Vāgmine namaḥ*
Yanniḥsr̥tā brahmamayī vāktadvāgmīti kathyate / यन्निःसृता ब्रह्ममयी वाक्तद्वाग्मीति कथ्यते One from whom the words constituting Veda come out.
🌻 🌻 🌻 🌻 🌻
Source Sloka
सुभुजो दुर्धरो वाग्मी महेन्द्रोवसुदो वसुः ।नैकरूपो बृहद्रूपः शिपिविष्टः प्रकाशनः ॥ २९ ॥
సుభుజో దుర్ధరో వాగ్మీ మహేన్ద్రోవసుదో వసుః ।నైకరూపో బృహద్రూపః శిపివిష్టః ప్రకాశనః ॥ ౨౯ ॥
Subhujo durdharo vāgmī mahendrovasudo vasuḥ ।Naikarūpo br̥hadrūpaḥ śipiviṣṭaḥ prakāśanaḥ ॥ 29 ॥
Continues....
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹 DAILY WISDOM - 47 🌹*
*🍀 📖 Philosophy of Yoga 🍀*
📝 Swami Krishnananda
📚. Prasad Bharadwaj
*🌻 16. Everything is Connected with Everything Else
🌻*
Everything has a connection with everything else. There is nothing which is not internally related to the Almighty, the Supreme Being. Every atom is so related, and every atom can be a teacher under given conditions.
We can touch God through every speck of space, because there is no such thing as a universe outside God. God is in everything that is experienced here as the world, or the universe, pervading and permeating all things, so that one cannot touch anything without touching God in some way.
There should not be any misconception that the deities, even the images, the so-called idols that the people worship, are all just nonsense or insignificant nothings; these are necessary prescriptions for the illness of the spirit in the stages of its evolution.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. వివేక చూడామణి - 11 🌹*
✍️ రచన : సద్గురు పేర్నేటి గంగాధర రావు
📚. ప్రసాద్ భరద్వాజ
*🍀. ప్రశ్న, జవాబు - 2 🍀*
52. ఇతరులు తన నెత్తిన మోపిన బరువు బాధ్యతలను ఇతరులే దింపివేయవలెను. కాని వ్యక్తి తనకు తానే కల్పించుకున్న ఆకలి వంటి బాధలను తనకుతానే తొలగించకొనవలెను.
53. ఒక రోగి తనకు తగిన ఆహారమును, మందును తాను తీసుకొన్నప్పుడు రోగము పూర్తిగా తగ్గుతుంది. కాని ఇతరుల కృషి వలన కాదు.
54. వస్తువుల యొక్క నిజమైన స్వభావమును ముందుగా వ్యక్తి తనకు తాను తన దృష్టి ద్వారా వివరముగా చూసి గ్రహించాలి గాని ఇతర పండితులు చెప్పినప్పటికి అర్థము కాదు. చంద్రుడు ఎలా ఉంటాడు అనేది తన కండ్ల ద్వారా చూసి తెలుసుకోవాలి. ఇతరులు ఎలా తెలియచెప్పగలరు.
55. అజ్ఞానము, కోరికలు, కర్మల లాంటి వాటిని వ్యక్తి స్వయముగా తనకు తాను తొలగించుకోవాలి గాని, 100 కోట్ల జన్మలెత్తినను ఎవరు తొలగించలేరు. అజ్ఞానము వలన కోరికలు, కోరికల వలన కర్మలు, కర్మల వలన పాపపుణ్యములు తప్పవు. ఇవన్నీ పోవాలంటే వాటి యొక్క జ్ఞానాన్ని పొందాలి.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹 VIVEKA CHUDAMANI - 11 🌹*
✍️ Swami Madhavananda
📚. Prasad Bharadwaj
*🌻 Question and Answer - 2 🌻*
52. Trouble such as that caused by a load on the head can be removed by others, but none but one’s own self can put a stop to the pain which is caused by hunger and the like.
53. The patient who takes (the proper) diet and medicine is alone seen to recover completely –not through work done by others."
54. The true nature of things is to be known personally, through the eye of clear illumination, and not through a sage: what the moon exactly is, is to be known with one’s own eyes; can others make him know it ?
55. Who but one’s own self can get rid of the bondage caused by the fetters of Ignorance, desire, action and the like, aye even in a hundred crore of cycles ?
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. దేవాపి మహర్షి బోధనలు - 21 🌹*
✍️. సద్గురు కె. పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
*🌻 12. నలుడు 🌻*
నలుని కథయందును, ధర్మరాజు కథయందును బోధింప బడిన సత్య మొక్కటియే. నలోపాఖ్యానమే మరికొన్ని విశేషములతో మహాభారతముగ ఈయబడినది. దమయంతికి క్రొత్తరూపమే ద్రౌపది. పంచపాండవుల సమగ్ర రూపమే నలుడు. నలుడు రూపుకట్టిన ధర్మము.
పంచేంద్రియములు, పంచభూతములు, పంచతన్మాత్రలు, విడివిడిగ పంచపాండవులు సమగ్రముగ నలుడు. నలుడు జూదమాడి ఓడెను. ధర్మజుడు కూడ జూదమాడి ఓడెను. ఇద్దరును రాజ్యమును కోల్పోయిరి. ఇద్దరును మరల వారి వారి సతీమణుల పాతివ్రత్య మహిమచే శుభమును పొందిరి.
దమయంతి, ద్రౌపది క్రియాశక్తి స్వరూపములు. శక్తి నుండియే సృష్టి పంచీకరణము చేయబడినది
కదా! పంచీకరణము చేయబడిన సృష్టియందు శక్తియే నిండియున్నది కదా!
ఈ అనుబంధమునే పరిణయముగ కీర్తించుట కవి సమయము. కావున నలుని కథ శ్రద్ధతో చదివినచో మహాభారతము చదివిన కలుగు వికాసము బీజప్రాయముగ కలుగ గలదు.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. ఏకత్వమే జ్ఞానస్థితి 🌹*
*🍀. ‘స్వేచ్ఛ. మీరనుకుంటున్నది కాదు’ నుంచి ( ఓషో బోధ ) 🍀*
✍️. భరత్, 📚. ప్రసాద్ భరద్వాజ
‘‘మీకు తెలియదు తాతయ్యా ‘‘టైమ్ ఈజ్ కిల్లింగ్ యు.’’ ఒకవేళ మీరన్నదే నిజమైతే ‘‘మీరు చంపుతున్న ఆ కాలాన్ని తీసుకొచ్చి నాకు చూపించండి’’ అన్నాను ఆయనతో.
‘‘కాలం కరిగిపోతోంది, వెళ్ళిపోతోంది’’లాంటి వ్యక్తీకరణలన్నీ కేవలం ఒక రకమైన ఓదార్పు మాత్రమే. బతికున్నంత వరకు కాలం వెళ్ళిపోతున్నట్లుగా భావించే మనిషి మరణిస్తున్నప్పుడు మాత్రం తాను వెళ్ళిపోతున్నట్లుగా భావిస్తాడు.
నిజానికి, ప్రతి క్షణం, మీ జీవితకాలాన్ని పోగొట్టుకుంటూ వెళ్ళిపోతున్నది మీరే. కానీ, మీరే ఇక్కడ స్థిరంగా ఉంటున్నట్లు, కాలమే వెళ్ళిపోతున్నట్లు భావిస్తున్నారు. నిజానికి, కాలం స్థిరంగానే ఉంది. దానిని లెక్కించేందుకు మనిషి సృష్టించిన గడియారాలు కూడా ఇక్కడ స్థిరంగానే ఉన్నాయి.
మీరెప్పుడైనా భారతదేశంలోని పంజాబ్‌కు వెళ్తే, అక్కడ మీరు ఎవరినీ ‘‘టైమెంతైంది?’’ అని అడగకండి. ఎందుకంటే, ఒకవేళ అప్పుడు సమయం 12 గంటలైతే వాళ్ళు మిమ్మల్ని చితకబాదుతారు. అందుకు వేదాంత పరమైన కారణముంది. ఒకవేళ మీరు వారి బారినుంచి బతికి బయట పడితే ఏదో అద్భుతం జరిగినట్లే, మీరు అదృష్టవంతులైనట్లే. వేదాంత తత్వం మూర్ఖుల చేతుల్లో పడితే అలాగే జరుగుతుంది.
జ్ఞానోదయ, సమాధి స్థితుల గురించి, మరణిస్తున్న మనిషి మానసిక స్థితి గురించి సిక్కు మత స్థాపకుడైన ‘‘గురునానక్’’ వివరిస్తూ ‘‘12 గంటల సమయంలో గడియారంలోని రెండుముళ్ళు ఒకటైనట్లుగా, సమాధి స్థితిలోను, మరణిస్తున్నప్పుడు మీలోని ద్వంద్వం నశించి మీరు ఏకత్వాన్ని పొంది అస్తిత్వంలో లీనమవుతారు’’ అన్నారు. అది కేవలం ఒక ఉదాహరణ మాత్రమే. అయినా, అప్పటినుంచి ‘‘12 గంటల సమయం’’ పంజాబ్‌లో మృత్యు సంకేతంగా పరిగణించబడుతోంది.
అందుకే ఆ సమయంలో మీరు సర్ధార్జీని ‘‘టైమెంతైంది?’’ అని అడిగితే, ‘‘అతను చావాలని మీరు శపిస్తున్నట్లుగా భావించిన’’ అతడు వెంటనే మిమ్మల్ని చితకబాదుతాడు. ఎవరైనా ఏడుపు ముఖంతో దయనీయంగా కనిపిస్తే ‘వాడకి పన్నెండయ్యింది’ అనడం పంజాబ్‌లో ఒక అలవాటుగా మారింది.
ఎందుకంటే, గడియారంలోని రెండు ముల్లులు కలుసుకోవడం విపరీతమైన దుఃఖాలకు, అనేక మానసిక వేదనలకు కారణమే కాక, అది మృత్యువుతో సమానమని వారు భావిస్తారు. అందువల్ల ‘‘పనె్నండు గంటల సమయం’’ దగ్గర పడుతుంటే సర్ధార్జీలందరూ గబగబా వారి గడియారంలోని సమయాన్ని ‘‘పన్నెండు గంటల ఐదు నిముషాలకు’’ మార్చడం నేను చాలాసార్లు చూశాను. అంతేకానీ, గురునానక్ వివరించిన జ్ఞానోదయ, సమాధి స్థితుల గురించి వారు ఎప్పుడూ ఆలోచించరు. ఎందుకంటే, ఆ విషయాన్ని వారు పూర్తిగా మరచిపోయారు.
మనిషి మరణిస్తున్నప్పుడు- అతనికి సమయంపన్నెండు ఆయినప్పుడు- గడచిన జీవితాన్నే పట్టుకుని వేలాడతాడు. దానివల్ల ఎలాంటి ప్రయోజనము ఉండకపోగా, భరించలేని బాధ అతనిని చుట్టుముట్టడంతో, అతడు అపస్మారక స్థితి (కోమా)లోకి వెళ్ళి, గత జీవితాన్ని పూర్తిగా మర్చిపోతాడు.
అతడు గత జీవితాన్ని ఎప్పటికీ గుర్తుకు తెచ్చుకోలేదు. ఒకవేళ ఎలాంటి కోరికలు లేకుండా, దేనికీ పట్టుకుని వేలాడకుండా జీవిస్తున్న సమయంలో మరణం ఆసన్నమైతే, మిమ్మల్ని బలవంతంగా అపస్మారక స్థితి (కోమా)లోకి నెట్టే అవసరం ప్రకృతికి ఉండదు కాబట్టి, మీరు పూర్తి ఎరుకతో సచేతనంగా మరణిస్తారు.
అప్పుడు గతంలో మీరు చేసిన వెధవ పనులన్నీ మీకు గుర్తొస్తాయి. కొన్ని కోరికలు తీరినా, తీరని కోరికలు తీర్చుకున్నా ఇంకా కొన్ని కోరికలు మిగిలే ఉంటాయి. అదొక వింత ఆట. ఆ ఆటలో మీరు ఎప్పుడూ కోల్పోవడమే జరుగుతుంది. ఆ ఆటలో మీరు నెగ్గినా, ఓడినా పెద్ద తేడా ఏమీ ఉండదు.
మీ ఆనందాలన్నీ నీటి కెరటాలపైన, మీ బాధలన్నీ రాతి పలకలపైన రాసిన రాతలు మాత్రమే.
అందుకు మీరు అనేక బాధలు పడ్డారు. కేవలం చిన్న చిన్న ఆనందాల కోసం మీ మొత్తం జీవితాన్ని పణంగా పెట్టారు. కానీ, పూర్తి ఎరుకతో సచేతనంగా మరణించే అత్యున్నత స్థితిలో మీరు మీ జీవితాన్ని పరికిస్తున్నప్పుడు అవి మీకు చిన్న చిన్న ఆటబొమ్మలుగా కనిపిస్తాయి.
- ఇంకాఉంది.
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🌹. శ్రీమద్భగవద్గీత - 18 / Bhagavad-Gita - 18 🌹
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ
🌴. ప్రధమ అధ్యాయము - శ్లోకము 18 🌴
18. ద్రుపదో ద్రౌపదేయాశ్చ
సర్వశ: పృథివీపతే |
సౌభద్రశ్చ మాహాబాహు:
శంఖాన్ దధ్ము: పృథక్ పృథక్ ||
🌷. తాత్పర్యం :
ద్రుపదుడు, ధ్రౌపదీతనయులు, గొప్ప బాహువులు గలిగిన సుభాద్రాతనయుడు మున్నగు వీరులందరును తమ తమ శంఖములను పూరించిరి.
🌷. బాష్యము :
🌹 🌹 🌹 🌹 🌹
🌹 BhagavadGita as It is - 18 🌹
✍️ Swami Bhakthi Vedanta Sri Prabhupada
📚. Prasad Bhardwaj
🌴 Chapter 1 - Verse 18 🌴
18. drupado draupadeyāś ca sarvaśaḥ pṛthivī-pate
saubhadraś ca mahā-bāhuḥ śaṅkhān dadhmuḥ pṛthak pṛthak
🌷 Translation :
Drupada, the sons of Draupadī, and others, O King, such as the mighty-armed son of Subhadrā, all blew their respective conchshells.
🌷 Purport :
🌹🌹🌹🌹🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 198 / Sri Lalitha Chaitanya Vijnanam - 198 🌹*
*సహస్ర నామముల తత్వ విచారణ*
✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
మూల మంత్రము :
*🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁*
*🍀. పూర్తి శ్లోకము :*
*దుష్టదూరా, దురాచార శమనీ, దోషవర్జితా |*
*సర్వజ్ఞా, సాంద్రకరుణా, సమానాధికవర్జితా ‖ 51 ‖*
*🌻 198. 'సమానాధికవర్జితా' 🌻*
శ్రీమాత యందు సమానత్వమే కాని ఆధిక్య భావముండదు అని అర్థము.
సమాన, అధిక వర్జితా అని ఈ నామమును ద్వంద్వ నామముగా తెలియవలెను. శ్రీమాత అందరియందును సమానముగనే యుండును. ఉపాధులనుబట్టి హెచ్చు తగ్గులున్నవి గాని, ఉపాధి యందున్నది ఎప్పుడునూ ఒక్కటియే. ఉగ్గుగిన్నె నుండి సముద్రము వరకూ నిండిన నీరుండును. ఉగ్గుగిన్నెలో తక్కువ నీరుండుటకు కారణము నీరు కాదు. గిన్నె పరిమాణము.
సృష్టియందు శ్రీమాత శక్తులు సమానము గనే వ్యాప్తి చెందియున్నవి. అధికము, అల్పము అను వ్యత్యాసములు శ్రీమాతకు లేవు. అందుకొనువారిని బట్టి యుండును. సూర్యకిరణములు సమానముగనే ప్రసరించును. కానీ చీకటి గృహములలోనికి అవి రాలేవు. కారణము గృహనిర్మాణ విధానమే. గాలి, వెలుతురు ఇంటిలోనికి ప్రవేశింపక పోవుటకు సూర్యుడు, వాయుదేవుడు కారణము కాదు. అట్లే నీరు, వేడిమి కూడ.
విద్యుత్తు కొన్ని దీపముల యందు ఎక్కువగ వెలుగుట, కొన్నిటియందు తక్కువగ వెలుగుటకు కారణము దీపముల పరిమాణమే కాని విద్యుత్తునకు సంబంధించినది కాదు. ఉపాధులలో ఉన్న వ్యత్యాసము వలన అందు వసించునది చిన్నదిగను, పెద్దదిగను గోచరించును. అదే విధముగ సృష్టియందున్న ఉపాధులలో శ్రీమాత నిండి యున్నది. ఉపాధి భేదము వలననే స్థావరములు, జంగమములు, మానవులు, దేవతలు, అసురులు ఒకరి కొకరు భిన్నమై గోచరింతురు.
అన్నిటి యందున్న శ్రీచైతన్యము దర్శించు వారికి అధికులని, అధములని భావించుట యుండదు. తెలియని వారికే ఈ భావనలు. తెలిసినవారి కంతయూ చైతన్య విలాసముగనే గోచరించును. తెలియుటకే మూలమైన శ్రీమాత ఈ కారణముగ ఆధిక్యమును చూపదు. ఆమె ఆధిక్యమును, అసుర భావమును వర్ణించినది. ఆమె దృష్టిలో తాను అధికమను భావము లేదు.
కనుక ఇతరులను గూర్చి అల్పులు అన్న భావన కూడ యుండుదు. అధికుల మసుకొన్నవారే కొందరిని అల్పులుగ చూతురు. దివ్యత్వమును అనుసరించువారు దానిని వర్ణింతురు. అట్టివారిని సౌజన్య మూర్తులందురు. చక్రవర్తి కుమారుడు అయివుండి కూడ, శ్రీరాముడు గుహునియందు, శబరియందు, వానరులయందు, అసురుల యందు సమానత్వమునే గరపెను. అట్లే పూర్ణపురుషుడైన శ్రీకృష్ణుడు కూడ గొల్ల పిల్లలతో చల్దులారగించెను. ఆధిక్యత అను భావమును వర్ణించినవారు అందరి హృదయములందు వసించగలరు.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 198 🌹*
*1000 Names of Sri Lalitha Devi*
✍️. Ravi Sarma
📚. Prasad Bharadwaj
*🌻Samānādhika-varjitā समानाधिक-वर्जिता (198) 🌻*
She has no equals. Śvetāśvatara Upaniṣad (VI. 8) says, “He has no body and no organs. No one is His equal. No one is His superior either. He possesses many powers of knowledge and powers of action.” The Upaniṣad talks about the nature of the Brahman.
Arjuna addresses Kṛṣṇa like this in Bhagavad Gīta ( XI.43) “You are the Lord of incomparable might, in all the three worlds there is none else even equal to You; how then, any better?” She has all these qualities.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శ్రీమద్భగవద్గీత - 539 / Bhagavad-Gita - 539 🌹*
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ
*🌴. 16వ అధ్యాయము - దైవాసుర స్వభావములు - 2 🌴*
2. అహింసా సత్యమక్రోధస్త్యాగ: శాన్తిరపైశునమ్ |
దయా భూతేష్వలోలుప్త్వం మార్దవం హ్రీరచాపలమ్ ||
🌷. తాత్పర్యం :
అహింస, సత్యసంధత, క్రోధరాహిత్యము, త్యాగము, శాంతి, ఇతరుల దోషముల నెన్నకుండుట, జీవులందరి యెడ దయ, లోభరాహిత్యము, మృదుత్వము, సిగ్గు, దృఢ నిశ్చయము,
🌷. భాష్యము :
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Bhagavad-Gita as It is - 539 🌹*
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj
*🌴 Chapter 16 - The Divine and Demoniac Natures - 2 🌴*
2. ahiṁsā satyam akrodhas
tyāgaḥ śāntir apaiśunam
dayā bhūteṣv aloluptvaṁ
mārdavaṁ hrīr acāpalam
🌷 Translation :
nonviolence; truthfulness; freedom from anger; renunciation; tranquillity; aversion to faultfinding; compassion for all living entities; freedom from covetousness; gentleness; modesty; steady determination;
🌹 Purport :
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
మీలో ఉన్న లోపాల నుండి మీరు ముక్తులు అవడానికి మృత్యువు మీద ఆధార పడకoడి. మీరు ఇప్పుడు ఎలా ఉన్నారో, మృత్యువు తరువాత కూడా మీరు ముందు ఎలా ఉన్నారో అలాగే ఉంటారు. మార్పు ఏమీ ఉండదు. మీరు కేవలం శరీరం మాత్రం వదులుతారు. మీరు మరణం కి ముందు దొంగ, లేదా మోసం చేసే వాళ్లు అయి ఉంటే, చనిపోగానే మీరు మహాపురుషుడు లేదా దేవ దూత అయిపోరు. ఒకవేళ నిజంగా అలానే జరిగితే, అందరం కలసి సముద్రంలో దూకి ఒక్కసారిగా దేవదూతలా మారిపోవచ్చు . కానీ అలా జరగదు. మీరు ముందు నుంచి మిమ్మల్ని మీరు ఎలా తయారు చేసుకున్నారో, మరణం తరువాత కూడా అలానే ఉంటారు. మీరు పునర్జన్మ ఎత్తునపుడు, అదే స్వభావం తీసుకుని వస్తారు. మార్పు రావాలి అంటే మార్పు కోసం ప్రయత్నం చేయాలి అదీ ఈ ప్రపంచంలో దేహం లో ఉన్నప్పుడు మాత్రమే సాధ్యము. భగవద్గీత లో శ్రీకృష్ణుడు అదే చెప్పారు, దేహం విడిచిపెట్టిన తరువాత ఆత్మ ఇంకో శరీరం తీసుకున్నప్పుడు, అదే మనసు, అవే వాసనలు, అవే సంస్కారాలు తీసుకుని మళ్ళీ పుడతారు అని. అంటే ఇదే మనసుతో మళ్ళీ పునర్జన్మ తీసుకుంటారు. అందుకే మార్పు అనేది దేహం లో ఉన్నప్పుడే తెచ్చుకోవాలి.
శుభోదయం మిత్రులకి...
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
Join and Share
*🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom Telegram group 🌹*
https://t.me/ChaitanyaVijnanam
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom Telegram Channel 🌹
https://t.me/Spiritual_Wisdom
Join and Share
🌹. శ్రీ లలితా దేవి చైతన్యము Sri Lalitha Devi Chatanyam 🌹
https://t.me/SriMataChaitanyam
JOIN, SHARE విష్ణు సహస్రనామ స్తోత్రము / Vishnu Sahasranama group.
https://t.me/vishnusahasra
Like and Share
https://www.facebook.com/విష్ణు-సహస్ర-నామ-తత్వ-విచారణ-Vishnu-Sahasranama-111069880767259/
🌹. దత్త చైతన్యము Datta Chaitanya 🌹
https://t.me/joinchat/Aug7pkulz9hgXzvrPfoVaA
🌹 చైతన్య విజ్ఞానం Chaitanya Vijnanam 🌹
https://www.facebook.com/groups/465726374213849/
JOIN 🌹. SEEDS OF CONSCIOUSNESS 🌹
https://t.me/Seeds_Of_Consciousness
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
Join and Share
చైతన్య విజ్ఞానం - Chaitanya Vijnanam
www.facebook.com/groups/chaitanyavijnanam/
Join and Share
DAILY SATSANG WISDOM
www.facebook.com/groups/dailysatsangwisdom/
Join and Share
భారతీయ మహర్షుల బోధనలు MAHARSHULA WISDOM
www.facebook.com/groups/maharshiwisdom/
Join and Share
శ్రీ లలితా చైతన్య విజ్ఞానం Sri Lalitha Chaitanya Vijnanam
http://www.facebook.com/groups/srilalithachaitanyavijnanam/
Join and share.....
విష్ణు సహస్ర నామ తత్వ విచారణ / Vishnu Sahasranama Contemplation
www.facebook.com/groups/vishnusahasranam/
Join and Share శ్రీమద్భగవద్గీత Bhagavad-Gita
www.facebook.com/groups/bhagavadgeetha/
Join and Share శ్రీ యోగ వాసిష్ఠ సారము / YOGA-VASISHTA
www.facebook.com/groups/yogavasishta/
Join and Share వివేక చూడామణి viveka chudamani
www.facebook.com/groups/vivekachudamani/
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 1 🌹*
*సహస్ర నామముల తత్వ విచారణ*
✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
మూల మంత్రము :
🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁*
*🌻 1. “శ్రీ మాతా 🌻*
శ్రీ” యనగా లక్షి, సరస్వతి, భూమి, భాగ్యము, సంపద, జయము, కాంతి, జ్ఞానము అను అర్ధములు కలవు.
'శ్రీమాత అనగా వరికి తల్లి అని అర్ధము. అనగా లలితాదెవి లక్ష్మి, సరస్వతి, రుద్రాణిలకు కూడా తల్లియై పరమశివుని పత్నియైన పరాశక్తి, పరాభట్టారిక అని తెలుపబడుచున్నది. అంతటికి అమ్మ ముగురమ్మల మూలపుటమ్మ అట్టి మాతృదెవి మోక్షార్ధులచె కూడ స్తుతింప దగినది. ఈమె వెదములకు, బ్రహ్మకు కూడ ముందుగ నున్నది.
శ్రీ యన విషము అను అర్ధము కూడ కలదు. మాత యన కంఠమున నుంచుకొనినది. అనగా ఈమె సృష్టి సంహారకారిణి కూడ.
లలితాదేవి సర్వజనయిత్రి. సమస్త భూతములు ఆమె నుండి పుట్టుచున్నవి. సర్వసృష్టికి మూలకారణము. లోకమున బాధ కలిగినపుడు తల్లిని స్మరించుట కద్దు. లోకములోని తల్లులు తాపత్రయములను పోగొట్టు సమర్ధురాండ్రు కారు. సంసార సాగరమందు పడి అన్య రక్షణ లేక భయగ్రస్తులైనవారు దురంత దుఃఖములను పొందుతారు జగన్మాతయగు శ్రీమాతను తలచినచో అభయము కలుగును.
దయావతిగాన మాతృమూర్తిగా స్తుతింప దగినది. సృష్టి మొత్తమును మూలాధారశక్తియె సకల బ్రహ్మాండములు ఈమె యందుండుటచె శ్రీమాతయైనది.
జనులచే ఆశయింపబడిన దగుటచే కూడ శ్రీ మాత అగుచున్నది. నిర్దుణ పరబ్రహ్మమె సృవ్యాదుల నొనర్ప సగుణ బ్రహ్మముగా వచ్చినపుడు శ్రీమాత యగుచున్నది.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 1000 Names - Lalitha Sahasranamam - 1 🌹*
✍️. Ravi Sarma
📚. Prasad Bharadwaj
*🌻 Śrī Mātā श्री माता (1) 🌻*
We address our mother as mātā. Mātā means mother. The prefix Śrī is important here. Śrī (श्री) represents the highest form of motherhood. The human mothers can take care of their children with love and affection.
But they cannot remove the miseries and sufferings of their loved ones, which they are destined to undergo. Since Lalitāmbikā is much more than a human mother is, She has the capacity to remove sorrows and miseries of Her children.
Children mean all the living beings in this universe, as She is the mother of the entire universe that includes the galaxy. She is addressed as mātā as She is the Creator, sustainer and also the dissolver. The universe was created out of Her. The universe acts as per Her instructions.
When the dissolution takes place, the universe merges back into Her. The cycle of saṃsāra (the world which has phenomenal existence and also meaning transmigration) repeats itself by birth, sustenance and death. Saṃsāra is called as an ocean. It is difficult to swim against the current of saṃsāra.
The current of saṃsāra is produced by sense organs. These sense organs in turn influence the mind that causes desires and attachments. Only Śrī Mātā is capable of helping us to cross the hurdles of saṃsāra and reach the destination (realization of Brahman). This is possible only by worshipping Her.
Śrī Mātā is also said to mean the mother of the Goddesses Śrī Lakṣmī (goddess of wealth), Sarasvatī (goddess of knowledge) and Rudrānī (the goddess of dissolution) the wife of Rudra. Rudra is different from Śiva. Therefore Śrī Mātā means the mother of these three goddesses.
Durvāsā is a great saint. He composed Śrī Śaktimahimnaḥ Stotram containing sixty one verses in Her praise. He surrenders to Śrī Mātā by saying “Oh! Mātā! the Supreme compassionate! I had born to a number of mothers. In future also, I may be born to a number of mothers.
My mothers are countless, as I had different mothers for my different births. I am so scared to be born again and to undergo the associated sufferings. Oh! Mātā! I am surrendering to you. Please give me relief from my future births.”
When Śrī is added as a prefix to any word, it shows the greatness. There are five such words with Śrī prefixed in the worship of the Devi. These five together are called Śrī Panchagam.
They are Śrī Puram (the place where She dwells), Śrī Cakra, the palace where She lives with Her body guards, Śrī Vidyā, the ritual worship, Śrī Sūktam, verses in praise of Her and Śrī Guru, the spiritual teacher who initiates his disciple into Śaktī worship. The main element of Śaktī worship is tantra śāstra.
Cont.. in page 2
Śrī also means Veda-s. Veda-s originated from the Brahman. Lalitāmbigai is the Brahman as repeatedly stressed in this Sahasranāma.
Śvetāśvatara Upaniṣad (VI.18) says, “He first created Brahma and then presented the Veda-s to Him. I, a seeker of liberation, take refuge in that luminous Lord who reveals the knowledge of the Self in the mind.”
It is also said that this nāma means the Pañcadaśī mantra.
It is pertinent to note that this Sahasranāma begins by addressing Lalitāmbikā as the mother of all, which emphasizes Her compassion for the universe and all its beings.
Since She is addressed as Śrī Mātā, this nāma refers to creation, the first act of the Brahman.
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 2 / Sri Lalitha Chaitanya Vijnanam - 2 🌹*
*సహస్ర నామముల తత్వ విచారణ*
✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
మూల మంత్రము :
🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁*
*🌻 2. “శీ మహారాజ్ణీ 🌻*
సమస్త ప్రపంచముల గుంపును పాలించు అధికారము గలది అని అర్ధము. రాజ శబ్దమునకు పాలించువాడు అని, రాజ్ఞి అను శబ్దమునకు వాలించునది అను అర్ధములు గలవు. ఎవరిచే సమస్త ప్రపంచము పుట్టింపబడి పాలింపబడుచున్నదో ఆ మహాశక్తిని ఇచ్చట స్మరించుట జరుగుచున్నది.
శ్రీ మహారాజ్ఞి పదమును, శ్రీం, అ, హ, రాజ్ఞి అని గ్రహించిన, శ్రీం-షోడశకళగను, అ-పరతత్త్వముగను, హ-అందుండి వెలువడిన వెలుగుగను, రాజ్ఞా-మాయకు అధిదెవతగను తెలియదగును. శ్రీ, శ్రీవిదధ్యలో పరమ రహస్యమైన షోడశాక్షరీ మంత్రము నందు మొదటి అక్షరము.
సద్దురువు నందు పూర్ణభక్తి విశ్వాసములు గల శిష్యునకు మాత్రము ఉపదేశింపదగిన అక్షరము. గురూపదేశము ననే ఈ అక్షరము పదహారు కళలను అంతర్ముఖముగ వికసింప చేయును. చతుర్లక్ష్మి మంత్రములలో కూడ శ్రీ మొదటి వర్ణముగ లల్లుడు వ్యాఖ్యానించెను. అకారము పరతత్త్వమే.
అక్షరములలో అకారము నేనని భగవంతుడు నుడివియున్నాడు కదా! (భగవద్దిత 10వ అధ్యాయము). అకారము శక్తి అని ఇచ్చట సంకేత పద్ధతిలో చెప్పబడినది. అనగా పరతత్త్వము వెలుగు, వెలుగు యొక్క షోడశ కళలుగ ఏర్పడు సృష్టి. దానిని ఆవరించియుండు మాయ ఈ నామమున కీర్తింపబడుచున్నది.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 2 🌹*
*1000 Names of Sri Lalitha Devi*
✍️. Ravi Sarma
📚. Prasad Bharadwaj
🌻 2. Śrī Mahārājñī श्री महाराज्ञी 🌻
Again this nāma also begins with Śrī. Mahārājñī means the queen of queens, the empress.
Most of the nāma-s of this Sahasranāma contain powerful bījākśara-s. It is difficult to segregate these bīja-s from the nāma. Bīja-s or bījākśara-s are either single Sanskrit alphabet or the combination of alphabets making a compound alphabet.
Each of these bīja-s is considered as highly secretive in nature, very powerful and can bestow powers on a person who regularly chants these bīja-s duly understanding its meaning. Specific rules are prescribed for pronunciation.
Ṣodaśī mantra is considered as the supreme of all the mantra-s in the worship of Devi. Ṣodaśī means sixteen kalā-s or letters.
Kalā* means the sixteen days of waxing or waning moon i.e. full moon to new moon or new moon to full moon. There is another mantra called Pañcadaśī consisting of fifteen letters. If one more bīja is added to fifteen lettered Pañcadaśī, it is called Ṣodaśī.
Saundarya Laharī (verse 1) says, “Oh! Mother, the letters of the three groups constitute Your mantra.” (A detailed study of Pañcadaśī mantra is provided in the introduction chapter and in nāma-s 85 to 89) If one chants the Ṣodaśī mantra for the prescribed number of times, (900,000 times) he or she will have no more births.
This sixteenth bīja of Ṣodaśī is hidden in this nāma. Normally, this should be learnt only from a Guru. The sixteenth bīja consists of the first four letters of this nāma Ś + r + ī + ṁ = Śrīm, (श्रीं) the Lakṣmī bīja, the bīja of sustenance.
The first nāma talks about Her creative power and the second nāma talks about Her power of sustenance. As a mother She creates and as the supreme queen, She sustains the universe.
Continues....
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 3 / Sri Lalitha Chaitanya Vijnanam - 3 🌹*
*సహస్ర నామముల తత్వ విచారణ*
✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
మూల మంత్రము :
🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁*
*🌻 3, 'శ్రీమత్సింహాసనేశ్వరి" 🌻*
సింహము ఆసనముగా కలది, సింహము నధిరోహించునది అని అర్ధము. సింహము నధిస్టించి మహిషాసురుని చంపినదిగాన అమ్మవారికి నామము వచ్చినది. సింహ శబ్దమునకు హింసించునది అని అర్ధము.
ఇచ్చట హింసించుట శమింప జేయుటగా పరిణమించునని గ్రహింపవలెను. దేవి అసురులను హింసించి, లోకమును శమింప జేయును. అవతారమూర్తులు కూడ అధర్మపరులను శిక్షించి లోకహితము చెయుదురు.
శివా-వశ; కశ్యప-పశ్యక అను శబ్బములుకూడ ఇట్లే వర్ణ వ్యత్యయముచే ఏర్పడినవే. అధర్మమును హింసించి, ధర్మమును ప్రతిష్టించు నని ఈ నామమున దేవి క్రీర్తింపబడుచున్నది. అజ్జానమున పడిన మానవు లను జ్ఞానమార్గమున నిలుపుటకు కూడ కాలక్రమమున హింసింపబడుట గమనింపవలిను.
ధర్మాధర్మ సమ్మిశ్రమముగ జీవనము సాగుచున్నప్పుడు మానవుడు కొంత హింసకు లోనగును. ఘర్షణ యుందును. క్రమశః వివెకియై ధర్మము నవలంబించుచు హింసింపబడని స్థితికి పరిణతి చెందుచుండును.
బాహ్యప్రపంచమున సంగము కల వాడు, అంతః ప్రపంచమున జ్ఞానము లేనివాడు కూడ ఘర్షణ చెందు చుండును.
అంతర్ముఖుడై హృదయమున జీవించువానిని కూడ సింహా సనమును అధిష్టించిన వాదని యోగము తెలుపుచున్నది. ధర్మాత్ములు హృదయము ఆధారముగా జీవింతురు. హృదయముతో ఆలోచింతురు. ఇతరుల శ్రేయస్సు తమ శ్రేయస్సుకన్న ప్రాధాన్యము వహించి యుండును.
యోగమున ప్రత్యాహార స్థితియందు సింహము నధిష్టించి యున్నట్లుగా అనగా హృదయమునందు స్థితి గొన్నట్లుగా యోగము తెలుపుచున్నది. దేవి యొక్క సహజస్థితి హృదయమె. అమె హృదయము సింహమును అధిష్టించి సమస్త సృష్టి కార్యమును నిర్వర్తించు చున్నదని ఈ నామము తెలుపుచున్నది.
పరమాత్మ హృదయమునుంది వ్యక్తమై (ప్రేమయే ఆధార ముగా సమస్త సృష్టిని పరివాలించుచున్నదని ఈ నామము తెలుపుచున్నది.
జ్యోతిషమున సింహరాళిని ఈ సందర్భమున వివరించుకొనుట ఉచితము. మనస్సును శ్వాసపై నిలిపి, అంతర్ముఖుడై “నో వాం” అను స్పందనమును సామగానముగ అనుభూతిచెందుట సింహరాశి లక్షణము.
హృదయమనెడి గుహలో నిరంతరము ఈ గానమునందు అనురక్తి చెందియుండు వారు ఆధ్యాత్మికముగ సింహములని పిలువ బడుదురు. హృదయభాగము సింహరాశికి సంబంధించినదే.
మానవ చేతన హృదయమును చేరినపుడు అమ్మను చేరినట్లుగను, సింహమను ఆసనమున ఆసీనుడైనట్లుగను జ్యోతిషము తెలుపుచున్నది. అనాహత చక్రము సింహరాశి సంబంధితమె.
అచట అహతముకాక వ్యక్తమగు చున్న ప్రణవమును అనుభవింతురు గాన అనాహత మనిరి. అట్లు అనాహత శబ్దమును అధిష్టించియున్నది కనుక దేవి సింహాసనాసీన అని కూడా తెలుపబడుచున్నది.
సింహము నధిష్టించినవారు మాత్రమే మహిషమును వధించ గలరు. పశుప్రాయముగ జీవించు స్వభావముగల మానవుడు దున్నపోతుతో సమానము. యమ నియమ ఆసన ప్రాణాయామాదుల మార్గమున ఈ మహిషమును వధించి సింహాసనము నధిష్టించుటయె యోగ మార్గము.
మహిష స్వభావము జీవించి యున్నంతకాలము హృదయమను సింహాసనమున ఆసీనుడగుట దుర్లభము. సమస్త దేవతారాధనములు, యజ్ఞయాగములు, పరహిత కార్యములు, జ్ఞాన యజ్ఞములు, మహిష తత్త్వమును వధించుటకే. ఇచ్చట మహిషమును హింసించి, సింహమును అధిష్టించుట 'హెచ్చరికగ చెప్పబడుచున్నది.
“వొంన, నింవా, నో౭ హం, హంన” అను ద్వయాక్షర మంత్రములు ఈ నామమునకు సంబంధించి యున్నవి.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 3 🌹*
*1000 Names of Sri Lalitha Devi*
✍️. Ravi Sarma
📚. Prasad Bharadwaj
*🌻 3. Śrīmat Siṃhāsaneśvarī श्रीमत् सिंहासनेश्वरी (3) 🌻*
Lalitāmbikā as the queen of queens is sitting on a lion. Lion is associated with ferociousness and is known as the king of animals. The supreme queen is using lion as her vehicle.
This description of Lalitāmbikā talks about Her role as the supreme dissolver. Simha in Sanskrit means lion. The root for the word siṃha is derived from the word himsa. Himsa in Sanskrit means destruction. Śrīmat + siṃha + āsanam + Iśvarī.
Śrīmat means the supreme respect given to Her in Her capacity as the destroyer of the universe, simha means lion, āsanam means seat (here it means throne), Iśvarī means the ruler.
The first three nāma-s of this Sahasranāma begin with the letter Śrī. Śrī means prosperity, wealth, etc. This bīja Śrī represents the goddess Lakṣmī, the goddess of wealth.
She is the wife of Śrī Mahā Viṣṇu. This nāma also conveys that the worshipper of Lalithai will attain all material prosperity.
Cont..in page 2
According to Jñānārnava, one of the ancient texts, there are eight mantra-s called simhāsana mantra-s to be performed on the four sides of the bindu in the Śrī Cakra and one in the bindu itself. Twenty four goddesses are worshiped in this simhāsana mantra. This nāma also means that Lalitāmbikā is the Īśvarī for these twenty four goddesses.
The first three nāma-s refer to the Supreme nature of Lalitāmbikā, the creator, the sustainer and the dissolver. As far as Her act of dissolution is concerned, She destroys those who commit sinful acts. But She ensures that Her true devotees merge with Her. This merger is called laya or absorption.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 4 / Sri Lalitha Chaitanya Vijnanam - 4 🌹*
*సహస్ర నామముల తత్వ విచారణ*
✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
మూల మంత్రము :
🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁*
🍀. పూర్తి శ్లోకము :
ఓం శ్రీమాత శ్రీమహారాజ్ఞీ శ్రీమత్సింహాసనేశ్వరీ
చిదగ్ని కుండసంభూత దేవకార్య సముద్యత
*🌻 4. “చిదగ్నికుండ సంభూతా” 🌻*
చిదగ్ని యను కుండము నుండి పుట్టినది అని అర్ధము. పరతత్త్వము నుండి ఏర్పడిన మొదటి సంకల్పమే యజ్ఞకుండము. అందుండియే సమస్త సృష్టి ఏర్పడును. సంకల్ప మెర్పడగానె చైతన్యము కూడ ఏర్పడును. ఆ చైతన్యము కోటి సూర్యులను మించిన అగ్నిగా వ్యక్తమగును.
సృష్టి యజ్ఞకుండమున చైతన్యాగ్ని ఈ విధముగ ఉదృవించును. అందుండి సమస్త లోకములు, ఆ లోకములందుండు జీవులు ఉద్భవింతురు. ఉధృవించిన సమస్త లోకములయందు, లోకుల యందు కూడ చైతన్యమను అగ్ని అంతర్హితముగ నున్నది. ఏ అగ్ని నుండి ఈ సమస్తము ఉద్భభవించినదో ఆ చైతన్యాగ్ని కూడ పరబ్రహ్మ స్వరూపిణియైన దేవి నుండి సంకల్పమాత్రముగ ఉద్బవించినదని భావన.
*మానవుడు నిద్ర నుండి మెల్కాంచుట ప్రతినిత్యము జరుగు చున్నది. స్థితి లేక సత్యము నందున్నటువంటి తత్త్వము చైతన్యముగ మెల్మాంచుచున్నది. ఈ మెల్కొనుటకు వలసిన సంకల్పము మానవుని ఎరుకలో లేదు.* *అంతర్హితముగ నున్న తత్త్వము నుండి ప్రేరణ (సంకల్పము) కలిగి, చైతన్యవంతుడుగ మెల్కాంచుచున్నాడు. ఇట్లు సత్యవంతుడు చైతన్యవంతుడగు చున్నాడు. అట్లే పెంజీకటి కవ్వలనున్న తత్త్వము (తమనః వరస్తాత) ఈ మొదటి సంకల్పమును వ్యక్తముజేసి, దాని నాధారముగ గొని చైతన్వాగ్నిగ వ్యక్తమగును.*
మెల్మాంచిన మానవుని నుండి మరల సంకల్పములు కలిగి, తన చుట్టును తన జీవితమను సృష్టి నేర్చరచుకొనుచున్నాడు.
అట్లే పరతత్త్వము నుండి సంభవించిన చైతన్యమను అగ్నికూడ మెల్మొనబడినదై సృష్టి కార్యమునకు పూనుకొనును. చైతన్యాగ్ని సంభవించగనే తమస్సను చీకటి హరింపబడి, వెలుగు వ్యాపించును. సత్యవంతుడు చైతన్యవంతుడగుట కూడ తమస్సు (నిద్ర) నుండి పరతత్త్వము చైతన్యముగా మెల్కాంచుటయె. ఇట్లు మెల్మ్కాంచిన తత్త్వము మరల పరతత్త్వములోనికి కాలగతిని యిమడగలదు. అనగా మరల తమోగుణము ఆవరింపగలదు. రాత్రి ఏర్పడగనే జీవులన్నియు నిద్ర యను తమస్సులోనికి తీసుకొనబడి పోవుచున్నవి కదా! కావున యజ్ఞార్థమై
సృష్టి నిర్మాణము చేయుటకు చైతన్వాగ్నిగ సంకల్పము నుండి వ్యక్తమగుట, మరల తిరోధానము చెందుట అనునవి పరతత్త్వ మాధారముగ జరుగుచున్నవి.
తమస్సు కవ్వలనుండు తత్త్వము తమస్సును భేదించు కొని రజస్సుగ నుదృవించును. తిరోధానమున మరల రజస్సును తమస్సు హరించుకొనును. ఆ తమస్సున కవ్వల స్టితి యున్నది. ఆ తమస్సున కివ్వల కూడ స్థితి యున్నది. తమస్సున కివలి స్ధితి సత్త్వగుణము నాశ్రయించి యుందును. తమస్సున కవ్వలిస్థితి త్రిగుణ ములకును ఆశయము.
ఈ చిదగ్ని శోక మోహములను దహింపగలదు. ఇది సమస్త ధర్మములను ధరించియుండును. దీనిని చెరుటయే దేవిని చేరుట. సంభూత అని చెప్పుటలో ఉన్నదే వ్యక్తమైనదని అవగాహన సమ్యక్+భూతు. చైతన్యాగ్ని రూపముగ వ్యక్తమగుటకు పూర్వము ధర్మముగ పరతత్త్వమున నున్నదియె కాని, పుట్టినదని అర్ధము కాదు.
అనగా దేవి యొక్క శాశ్వతత్త్వము సంభూతా అను పదముతో అద్భుతముగ ప్రతిపాదింపబడినది. భూతమనగా ఉన్నది వ్యక్తమైనదని అర్ధము. అనగా గుణాతీత తత్త్వము సగుణమైనదని గ్రహింపవలెను. ఈ నామము అష్టాక్షరీ నామము కనుక ఏడు లోకములకు ఆశ్రయము నిచ్చు ఎనిమిదవది అని కూడ గ్రహింపవలెను.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 4 🌹*
*1000 Names of Sri Lalitha Devi*
✍️. Ravi Sarma
📚. Prasad Bharadwaj
🌻 4. Cidagnikuṇḍa-saṃbhūtā चिदग्निकुण्ड-संभूता 🌻*
Cit + agni + kuṇḍa + saṃbhūta. Cit means the nirguṇa Brahman or the Brahman without attributes (the foundational consciousness). Agni kuṇḍa means a fire altar, in which fire sacrifices are done by offering oblations. Saṃbhūtā means born. Agni kuṇḍa or the fire altar means the dispeller of darkness.
*Darkness means lack of knowledge or ignorance which is called a-vidyā (vidyā means knowledge). This should not be interpreted as the one who was born out of the fire.*
She is the supreme consciousness who dispels ignorance. She dispels ignorance through Her form of pure consciousness, who illuminates within, dispelling the darkness of māyā.
The same explanation is given by Kṛṣṇa in Bhagavad Gīta (IV.37), “Like a fire turning the fire logs into ashes, the fire of knowledge burns to ashes all the karma-s (sarva karmani).”
Complete knowledge of the pure Brahman residing within, destroys all our karma-s whether good or bad. One should have no balance in karmic account to avoid further births.
Continues....
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 5 / Sri Lalitha Chaitanya Vijnanam - 5 🌹*
*సహస్ర నామముల తత్వ విచారణ*
✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
మూల మంత్రము :
*🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁*
*🍀. పూర్తి శ్లోకము :*
*ఓం శ్రీమాత శ్రీమహారాజ్ఞీ శ్రీమత్సింహాసనేశ్వరీ చిదగ్ని కుండసంభూత దేవకార్య సముద్యత*
*🌻 5. 'దేవకార్య సముద్యతా' 🌻*
ఈ నామము కూడ అష్టాక్షరియే. దేవతల కార్యమును నిర్వర్తించుటకై వ్యక్తమైనదని అర్ధము. సమస్త దేవతలు వచైతన్యాగ్ని నుండియె వెలువడి, సృష్టి సిర్మాణము చేయుచున్నారు. (బ్రహ్మాది దేవతలందరు కూడ ఈ చైతన్యమనెడి అగ్నికుండము నుండి పుట్టిన వారే.
చైతన్యాగ్నిగ యజ్ఞకుండమున ఆవిర్భవించగనె దేవతా కార్యము నకు దేవి ఉద్యుక్తురాలగును గాని, విశ్రాంతి గొనుట యుండదు. మానవుడు కూడ మెల్కాంచగనే కార్యములందు ఉద్యుక్తు డగుచున్నాడు కదా! ఈ ఉద్యుక్తత మానవులయందు గల దేవీ లక్షణమే. మెల్మాంచి బద్ధకముగ నుండుట, మరల పండుకొనుట తమోగుణ లక్షణము.
దేవి భక్తు డట్లుండడు, మేల్కాంచగనె ఈశ్వరార్చనముగ చేయవలసిన పనులయందు తనను తాను నియమించుకొనును. ఇది చైతన్యవంతుని లక్షణము. దేవి చైతన్యాగ్నిగ వ్యక్తమవగనె దేవకార్యము సిద్దించుటకై తనను తాను నియమించుకొనునని, ఆ విధముగ అత్యంత అప్రమత్తురా లని తెలియవలెను. పిలిచిన వెంటనె ఆలస్యము చెయక ప్రతిస్పందించు ప్రేమ స్వరూపిణియని గమనించవలెను.
సృష్టి అరంభమున వ్యక్తమై త్రిగుణాత్మకముగ తనను తాను విభజించుకొన్నప్పటికీ దేవతల ప్రార్ధనకు ప్రతిస్పందించి తానావిర్భవించి మహిషాసుర, భండాసురాదులను వధించినది.
దేవి ఒక్కరే అయినను ముగ్గురుగ కూడ గోచరించుచుండును. ఆమె నిత్యురాలు. దేవ సృష్టికి, దేవ రక్షణకు, ఏర్పడుట ఆమె 'సి రూప స్థితి. ఆమె అరూప అని కూడ తెలియవలెను. అరూపయె సరూప అగుచుండును. అట్లగుట అవసరమునుబట్ట జరుగును.
సృష్టి అంతయు దేవి నుండి దిగివచ్చిన దేవతలయొక్క యజ్ఞార్ధ కర్మగా జరుగుచూ ఉండును.
అట్లు జరుగు దేవతా యజ్ఞమున అసురులు కూడ ఉద్భవించు చుందురు. సురలనగా వెలుగు ప్రజ్ఞలు. వారి వలననే సృష్టియజ్ఞము జరుగుచుండును. అసురులనగా ఆ వెలుగులను ఆవరించి కమ్ముకొను చీకటి లేక తమస్సు. అట్లు జరిగినప్పుడెల్ల దెవి ఆవిర్భవించుటయు, ఆమె ఆవిర్భావ కారణముగ కమ్మిన చీకట్లు (తమస్సు) హరింబడుటయు జరుగుచుండును.
ఇదియే దేవి యొక్క దేవతారక్షణ స్వభావము. అంతమాత్రము చెత దేవి సుర పక్షవాతి యని అనతగదు. సృష్టి నిర్మాణమున, సృష్టి స్థితి కాలమున ఇట్లు రక్షించినను, తిరోధాన సమయమున తమోగుణమును లెక అసురమును అనుమతించును కదా! అందుచె సృష్టికార్యము జరుగు నపుడు దేవతలను రక్షించుచుండును. ప్రళయ కాలమున తమమును అనుమతించును.
అట్లనుమతించినచో మెల్కాంచిన జీవునకు నిదుర యుండదు. ఈ విధముగ దేవి జీవులను, లోకములను అనురక్షణము చేయుచుండును.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 5 🌹*
*1000 Names of Sri Lalitha Devi*
✍️. Ravi Sarma
📚. Prasad Bharadwaj
*🌻 5. Devakārya-samudyatā देवकार्य-समुद्यता 🌻*
She has manifested Herself to help deva-s (gods and goddesses). What is the help She can do for devās? It goes back to a story where deva-s were engaged in a war with the demons who are called as asura-s. She helps deva-s to win the battle with the demons. Deva-s do not perform evil deeds, therefore She always helps deva-s. When She is said to be a part of the Brahman, why She should manifest afresh to destroy the demons? When She is said to be the part of the Brahman, it refers to Her prakāśa form.
Prakāśa (the principle Self-revelation; consciousness; the principle by which ever other thing is known.) form represents Śiva and vimarśa (Self-consciousness as opposed to Self-revelation of Śiva ; the awareness of Śiva , full of knowledge and actions that bring about the world process) form represents Śaktī.
Since She is a part of the Supreme Śiva who Has created Her as His vimarśa form, the prakāśa form of Lalitāmbikā is subtly highlighted here without explicitly saying so. This nāma discusses Her prakāśa form.
There is an important saying in Yogavasiśtā, “I have two forms, ordinary and supreme. The ordinary form of mine is with hands and legs.
This form of mine is worshiped by ignorant men. The other one is my supreme form, the formless form without a beginning and an end. This form of mine has no qualities or attributes and is called the Brahman, Ātman, Paramātman, etc.”
In this nāma demons or asura-s means avidyā or ignorance. Deva-s means knowledge or vidyā. She helps those who seek knowledge about the Brahman.
Continues....
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 6 / Sri Lalitha Chaitanya Vijnanam - 6 🌹*
*సహస్ర నామముల తత్వ విచారణ*
✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
మూల మంత్రము :
*🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁*
*🍀. పూర్తి శ్లోకము :*
*ఉద్యద్భాను సహస్రాభ చతుర్బాహు సమన్విత*
*రాగాస్వరుప పాశాడ్యా క్రోధా కారంకుశోజ్జ్వల*
*🌻 6. 'ఉద్యద్భాను సహస్రాభా' 🌻*
ఉదయించుచున్న వేయి సూర్యుల కాంతి గలది అని అర్థము. ఉదయించుచున్న సూర్యుడు ఎర్రని కాంతి కలవాడై ఉండును. వేయి సూర్యు లొక్కమారు ఉదయించినచో ఏర్పడు ఎర్రని కాంతిని దేవి
కలిగియున్నదని తెలియవలెను. అనగా మిక్కిలి ఎర్రని దేహచ్ఛాయ గలదై దేవి ఉద్భవించుచున్నదని, అట్లే ఉపాసించ తగినదని ఈ నామము తెలుపుచున్నది. '
జపా కుసుమ భాసురా' అని కూడ దేవికి నామము కలదు. అనగా ఆమె శరీర కాంతి దాసానిపూవు వంటి ఎరుపుదనము కలిగినదని అర్థము. అరుణత్వము అమ్మ ఉద్భవించునప్పటి కాంతి. అరుణము రజస్సునకు, సంకల్పబలమునకు సంకేతము. దేవి అరుణత్వము కనులకు అగపడునది కాదు. వాక్కునకు అందునది కాదు.
బ్రహ్మాండమంతయు వ్యాపించియుండు తేజస్సే ఈ అరుణత్వము. అవ్యక్తమగు తత్త్వము నందు మొట్టమొదట వ్యక్తమగు కాంతి కూడ ఎరుపే నని
తెలియవలెను. ఈ ఎర్రదనము దేవి పరాక్రమమునకు, శక్తికి కూడ చిహ్నము.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 6 🌹*
*1000 Names of Sri Lalitha Devi*
✍️. Ravi Sarma
📚. Prasad Bharadwaj
*🌻 6. Udyadbhānu-sahasrābhā उद्यद्भानु-सहस्राभा (6) 🌻*
Udyad – rising; bhānu-sun; sahasra – thousand or countless; abhā - light. Lalitāmbikā appears as bright as thousand suns rising at the same time.
The colour of the rising sun is red. The complexion of Lalitāmbikā is red as described in the dhyāna śloka of this Sahasranāma (sakuṅkuma-vilepanām). Almost all the tantra śastra-s and ancient scriptures talk about Her complexion as red. In the previous nāma Her prakāśa form was discussed and in this nāma Her vimarśa form is being described. She has three forms – the prakāśa form or the subtle form, the vimarśa form or the physical form and Her parā form or the supreme form.
The prakāśa form of Her is said to be made of various mantra-s, the supreme one being mahā ṣodaśī mantra. Her vimarśa form is Her physical form. She is worshiped in thousands of forms. Her supreme form is realised through mental worship.
These forms and the associated red colour are for easier contemplation. From the next nāma onwards, Her physical form is being described. The red colour also indicates care. She looks after Her devotees with great care and affection like a mother.
Kṛṣṇa says (Bhagavad Gīta II.12) “If hundreds of thousands of suns were to rise at once into the sky, their radiance might resemble the effulgence of the Supreme Person in that universal form.”
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 7 / Sri Lalitha Chaitanya Vijnanam - 7 🌹*
*సహస్ర నామముల తత్వ విచారణ*
✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
మూల మంత్రము :
*🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁*
*🍀. పూర్తి శ్లోకము :*
*ఉద్యద్భాను సహస్రాభ చతుర్బాహు సమన్విత*
*రాగాస్వరుప పాశాడ్యా క్రోధా కారంకుశోజ్జ్వల*
*🌻 7. 'చతుర్బాహుసమన్వితా 🌻*
నాలుగు బాహువులు కలది, నాలుగు బాహువులుగా ఏర్పడినది లేక నాలుగు బాహువులతో కూడినది అని అర్థము. సంకల్పము నుండి ఏర్పడిన చేతనాగ్ని ఉద్భవించు సమయమున వేయి సూర్యుల అరుణకాంతిగా ఇంతకు ముందటి నామమున చెప్పబడినది.
అచటి నుండి క్రమశః నాలుగు బాహువులు పొందినదిగా ఈ నామము తెలుపుచున్నది. ఈ నాలుగు బాహువులే బ్రహ్మ జనించు నాలుగు దళముల పద్మముగను, అటుపై బ్రహ్మకేర్పడు నాలుగు ముఖములుగను, బ్రహ్మ ధరించు నాలుగు వేదములుగను తెలియవలెను.
అటులే దేవి ఉద్భవించినదై, సృష్టియందు నాలుగు స్థితుల యందున్నదని కూడ తెలియవలెను. ఈ నాలుగు స్థితులను పరా, పశ్యంతి, మధ్యమా , వైఖరి అని యందురు.
వైష్ణవ సంప్రదాయమున వాసుదేవ, సంకర్షణ , ప్రద్యుమ్న, అనిరుద్ధులుగా పేర్కొందురు. శాక్తేయులు ఆదిశక్తి, ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తులుగ పేర్కొందురు. నాలుగు కాలముల యందు నిండియున్న శక్తి స్వరూపిణిగ కూడ దేవిని గ్రహింపవచ్చును.
అనగా కృత, త్రేతా, ద్వాపర, కలియుగములలో వ్యాపించిన శక్తిగా భావన చేయవచ్చును. సృష్టి సమస్తము చతురస్రమే అని వేదము ఘోషించుచున్నది. విష్ణునామ సహస్రమునందు కూడ 'చతురస్రో' అను నామము కలదు. ఉద్భవించిన దేవి చతురస్రముగ రూపుగొనునని దీని భావము.
ఎర్రని కాంతితో కూడిన దేవి నాలుగు బాహువులు కలదిగ ధ్యానింపవలెనని కూడ ఇందలి సూచన. సృష్టి సమస్తము నందును ఈ నాలుగు బాహువులను దర్శింపవచ్చును. ప్రతి వస్తువునకును రూపముండును. ఆ రూపమునకు ఆధారముగ వర్ణముండును.
ఆ వర్ణమున కాధారముగ శబ్దముండును. శబ్దమున కాధారముగ తత్త్వముండును. తత్త్వము, శబ్దము, వర్ణము, రూపము అను నాలుగు స్థితులను ఒక వస్తువునందు దర్శించుటయే చతుర్బాహు దర్శనము.
కనబడు ప్రతి వస్తువు నందును కనపడక మూడు స్థితులు ఇమిడి యున్నవని తెలియవలెను. పురుష సూక్తమున ఈ ధర్మమునే “కనపడు విశ్వము, దానియందలి జీవులు ఒక పాదమని, కనపడక యున్న పాదములు మూడు అని, మొత్తము నాలుగు పాదములు పురుషునకు కలవని” వివరింపబడినది.
అటులనే గుణాతీతమైన తత్త్వము మూడు గుణములుగ ఏర్పడుట యందు కూడ ఈ చతుర్భాహువులను దర్శింపవచ్చును. దినము నందలి నాలుగు భాగములు (ఉదయము, మధ్యాహ్నము, సాయంత్రము, అర్థరాత్రి); మాసము నందలి నాలుగు భాగములు (శుక్లాష్టమి, పౌర్ణమి, కృష్ణాష్టమి లేక బహుళాష్టమి, అమావాస్య), సంవత్సరమందలి నాలుగు భాగములు (మకర సంక్రమణము, వసంత సంక్రమణము (ఉత్తర), కర్కాటక సంక్రమణము, శరత్ సంక్రమణము (దక్షిణ) కూడ దేవి నాలుగు బాహువులేనని భావన చేయవలెను.
మానవులందు కూడ దేవి నాలుగు బాహువులు - అహంకారము, బుద్ధి, చిత్తము, మనస్సు అను అంతఃకరణ చతుష్టయముగ పనిచేయు చుండును. అహంకార మనగా తానున్నానని తెలివి. ఇట్లు తన యందును, తన చుట్టును ఉన్న సృష్టియందును ఈ నాలుగు స్థితులను భావించి, ధ్యానించి, దర్శించుట ఒక చక్కని సాధనా మార్గము. ఈ దర్శనమున దేవి ఎంత అద్భుతముగ నాలుగు బాహువులతో కూడి యున్నదో తెలియగలదు.
బాల్య, యౌవన, కౌమార, వార్థక్యములు, బ్రహ్మచర్య, గార్హస్థ్య, వానప్రస్థ, సన్యాస ఆశ్రమములను కూడ ఈ సందర్భముగా దేవి చతుర్బాహువులుగ గమనింప వచ్చును. జాగ్రత్, స్వప్న, సుషుప్తి, తురీయావస్థల యందు కూడ ఈ చతుర్బాహువులను దర్శింపవచ్చును. తురీయము దేవి సహజస్థితి. సిద్ధుని సహజస్థితి కూడ ఇదియే.
తురీయమను తెరపై సుషుప్తి, స్వప్న, జాగ్రదవస్థలు వచ్చి పోవుచునుండును. మేల్కొనినపుడు, స్వప్నమునందును, నిద్రయందును, తానున్నానని తెలిసి యుండుటయే తురీయ స్థితి. దేవి సృష్టియందును , ప్రళయము నందును, వానికతీతముగను గోచరించును.
ఇట్లు శాశ్వతత్త్వము ఆధారముగ త్రిగుణాత్మకముగ సృష్టి స్థితి లయాదులు జరుగునని తెలుపుటయే నాలుగు బాహువుల సంకేతము. భారతీయ సంస్కృతి యందు దేవతల కిట్లు నాలుగు బాహువులను రూపించుట కిదియే రహస్యార్థము.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 7 🌹*
*1000 Names of Sri Lalitha Devi*
✍️. Ravi Sarma
📚. Prasad Bharadwaj
*🌻 Caturbāhu-samanvitā चतुर्बाहु-समन्विता (7) 🌻*
The physical appearance of Lalitāmbikā begins here. She has four arms.
These four arms represent Her ministers, through whom She administers.
These Devi-s who assist Her are described in the next four nāma-s.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 8 / Sri Lalitha Chaitanya Vijnanam - 8 🌹*
*సహస్ర నామముల తత్వ విచారణ*
✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
మూల మంత్రము :
*🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁*
*🍀. పూర్తి శ్లోకము :*
*ఉద్యద్భాను సహస్రాభ చతుర్బాహు సమన్విత*
*రాగాస్వరుప పాశాడ్యా క్రోధా కారంకుశోజ్జ్వల*
*🌻. 8. 'రాగస్వరూపపాశాఢ్యా' 🌻*
అమ్మవారి సృష్టి నిర్మాణ కార్యక్రమమున అత్యంత ప్రతిభావంతమైనది అనురాగ మను పాశము. ఈ పాశమే లేకున్నచో సృష్టి కథయే లేదు. దేవి నుండి ఈ అనురాగ పాశమే ఇచ్ఛాశక్తిగా స్రవించి సృష్టి కథను నడుపును.
జీవునియందు కూడ ఈ శక్తి కోరికగా పనిచేసి, తనదైన జీవితమును అల్లుకొనుచుండును. సమస్త ప్రపంచమును దేవి ఇచ్ఛాశక్తిచే నడుపబడుచున్నది. ప్రతి జీవియును తన వ్యక్తిగతమైన కోరికలచే నడుప బడుచున్నాడు కదా! కోరిక తనదని అనుకొనుచు సృష్టి కార్యమును చేయుచున్నాడు కదా! నిజమునకు తన కోరికగా వ్యక్తమగుచున్నది దేవి ఇచ్ఛాశక్తియే.
.
ఇచ్ఛ సృష్టి నిర్మాణమునకు గాని, వ్యక్తిగత జీవన నిర్మాణమునకు గాని పునాదిరాయియై నిలచును.
ఇచ్ఛ యుండరాదను కొనుట మెట్ట వేదాంతమగును. ఇచ్ఛను సృష్టి యందు ధర్మముతో జతపరచుట వలన జీవనము ప్రశాంతముగ జరుగగలదు. కోరికయే చెడ్డది
అనుకొనరాదు. ఎట్లు కోరుకొనవలెనో తెలియవలెను.
డబ్బు పాపిష్ఠిది అందురు. ఇది చేతకానివాడు పలుకు మాట. డబ్బు నెట్లు వినియోగ పరచవలెనో తెలిసినవాని చేతిలో అదే ధనము శోభను, వైభవమును కూర్చును. చేతకాని వానిని భ్రష్టుని చేయును.
అట్లే కోరిక కూడ. కోరికయే లేనిచో భగవంతునితో యోగము చెందుట కూడ ఉండదు కదా! సత్యమును కోరి దానికి సంబంధించిన మార్గమును తపనతో అన్వేషించి, మార్గమున అందింపబడిన నియమములను తీవ్రమైన నిష్ఠతో నిర్వర్తించినగాని, దైవమును పొందలేడు కదా !
దైవమును పొందు తీవ్రమైన కోరికనే తపస్సందురు. తపన లేని వానికి ఏదియును అందదు. పదార్థము వైపునకుగానీ, పరమార్థము వైపునకు గాని పయనించుటకు వానియందనురాగ ముండవలెను. అనురాగ మనగా ఎడతెరిపిలేని రాగము. ప్రియునికి ప్రేయసిపై ఎట్లహర్నిశలు ఉండునో, అట్లు తాను పొందదలచిన విషయమున రాగ ముండవలెను.
రాగమను పాశమును దేనిపై ప్రయోగింతుమో అది మనకు దక్కగలదు. అట్టి అనురాగము ధర్మబద్ధము కానిచో బంధనమునకు కారణమగును.
బంధకారణమైన అనురాగము పాశమువలె పనిచేయును. బంధ కారణము కాని అనురాగము ఉపకరణమై నిలచును. జీవుల పై మహాత్ముల అనురాగము ఉపకరణముగ కన్పట్టుచున్నది కదా! సంసార జీవుల యొక్క అనురాగము ఎడతెగని బంధములుగ ఏర్పడుచున్నవి కదా! జ్ఞానము నందలి తారతమ్యములే ఇట్టి స్థితులను కలిగించును.
దేవి యొక్క రాగ స్వరూప పాశము బంధస్థితిని హెచ్చరించుచున్నది, మోక్షస్థితిని సూచించుచున్నది అని తెలియవలెను.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 8 🌹*
*1000 Names of Sri Lalitha Devi*
✍️. Ravi Sarma
📚. Prasad Bharadwaj
*🌻 8. Rāgasvarūpa-pāśāḍhyā रागस्वरूप-पाशाढ्या 🌻*
Rāga means desire or a wish. Pāśa is a type of rope used to pull an object.
She pulls all the desires of Her devotees using this rope. There are three śakti-s (śakti in this context means power) – iccā, jñāna and kriya.
This nāma talks about iccā śakti or the desire. She never allows Her devotees to sink with desires.
This arm is Her left upper arm and is represented by Aśvārūdā Devi.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 9 / Sri Lalitha Chaitanya Vijnanam - 9 🌹*
*సహస్ర నామముల తత్వ విచారణ*
✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
మూల మంత్రము :
*🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁*
*🍀. పూర్తి శ్లోకము :*
*ఉద్యద్భాను సహస్రాభ చతుర్బాహు సమన్విత*
*రాగాస్వరుప పాశాడ్యా క్రోధా కారంకుశోజ్జ్వల*
*🌻 9. 'క్రోధాకారాంకుశోజ్జ్వలా' 🌻*
క్రోధమనెడు గుణమునకు ఆకారము దాల్చినదిగా దేవి అంకుశమును తెలియవలెను. అట్టి అంకుశమును ధరించిన ఉజ్జ్వల మూర్తిగా ఈ నామము దీనిని ప్రస్తుతి చేయుచున్నది. మదించిన ఏనుగు వంటి స్వభావమును కూడ నియమింపగలనని అంకుశము
తెలుపును. మదించిన వారికి భయము లేదు. భక్తి ఉండదు. అట్టి వారిని సైతము ఉజ్జ్వలమైన తన క్రోధమను అంకుశముతో సర్వశక్తిమయి అయిన దేవి శిక్షించి, రక్షించగలదు.
మదము కరుడుగట్టిన అజ్ఞానము. దానిని పటాపంచలు చేయగల ఆయుధముగ దేవి అంకుశమును భావింపవలెను. యమించునది అంకుశమను సత్యము తెలియవలెను. అంకుశాకారము జ్యోతిషమున శనిగ్రహమునకు వినియోగింతురు. లోకమున ధర్మము తప్పి వర్తించు వారిని యముని రూపమున దేవియే శాసించు చుండును.
కాలక్రమమున ఎంతటి మొనగాడినైనను శనిగ్రహ చారము దేవి బలహీన పరచగలదు. ఏనుగైనను కాలవశమున పీనుగ కాగలదు కదా! కాల రూపమున సమస్త జీవులను నిష్కర్షగా నియమించు శనిగ్రహ తత్త్వమును అంకుశముగా వేదఋషులు సంకేతించిరి. ధర్మమున దేవి జీవులను నియమించునని సందేశ మిచ్చుటకే క్రోధమే ఆకారముగా గల అంకుశమును ధరించినట్లుగా తెలియవలెను. సామాన్యులను కాలము రూపమున దేవి నియమించును.
కొందరిని కష్టముల ద్వారా, మరికొందరిని నష్టముల ద్వారా, ఇంకొందరిని అజపయము, అపకీర్తి రోగముల ద్వారా మరియు పీడల ద్వారా కర్మఫలముల ననుభవింపజేసి, ధర్మమార్గమున నిలబెట్టును. అన్నిటికీ మించి, మృత్యువు రూపమున జీవుల సమస్త సంపాదనములను హరించి, జీవనము పునః ప్రారంభమగునట్లు చేయును.
విశేష ప్రజ్ఞకలిగి అధర్మము నాచరించువారిని తానే అవతారమూర్తిగ దిగివచ్చి శిక్షించును. అతి విశేష శక్తులతో విజృంభించిన మహిష, భండాసురాదులను తానే స్వయముగ దిగివచ్చి శిక్షించును.
ఎవనికి ఏ శిక్ష విధించిన రక్షింపబడునో అట్టి శిక్షను సమతూకముగ అందించగల శక్తియే అంకుశమను దేవి ఆయుధము. త్రిమూర్తులు సైతము ఆమె ఆజ్ఞకు లోబడి సృష్టి నిర్వహణము గావించుచున్నారు.
వారికి సృష్టియం దవరోధము లేర్పడినచో తానే స్వయముగ చక్కదిద్దగలదు.
అజ్ఞానాంధకారమును తగు విధముగ శిక్షించి జీవప్రజ్ఞను జ్ఞానమునందు నిలుపు ఉపకరణముగ అంకుశము వినియోగపడుచున్నది. కావున దేవి భక్తులు క్రోధముతో కూడిన ఈ అంకుశమును జ్ఞాన ప్రదమని భావించి, నమస్కరించి స్తుతింతురు. రాగమను పాశము ఒక హస్తమున ధరించిన దేవి, మరియొక హస్తమున క్రోధమను అంకుశమును ధరించి, సృష్టి జీవుల యందు రాగము మితిమీర కుండునట్లుగ చక్కబెట్టుకొనుచున్నది.
సృష్టియందు ఈ విధముగ రాగమును పెంచునది, మితిమీరినపుడు త్రుంచునది కూడ దేవియే. సత్సాధకుడు వీనిని గమనించి, కష్టనష్టములు, అపజయము కలిగినపుడు దేవియే కాలరూపమున త్రుంచుచున్నదని భావించి, ప్రతీకార వాంఛ లేక, నిరాశా నిస్పృహలు చెందక, దేవిని శరణు పొంది ధర్మమున తనను తాను నియమించుకొనును.
ఇష్టకాలము వచ్చువరకు తలదాచుకొని మౌనముగ జీవించును. నలుడు, ధర్మరాజు, హరిశ్చంద్రుడు వంటి మహాత్ముల జీవితములయందు ఈ సత్యమును గమనింపవచ్చును.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 9 🌹*
*1000 Names of Sri Lalitha Devi*
✍️. Ravi Sarma
📚. Prasad Bharadwaj
*🌻 9. Krodhākāraṅkuśojvalā क्रोधाकारङ्कुशोज्वला 🌻*
She holds an elephant hook in her right upper arm. Krodha means hatred and akāra means knowledge.
This nāma talks about subtle body. Knowledge is always subtle. She uses this elephant hook to destroy the hatred if developed in Her devotees and gives them knowledge.
A bīja of Kālī, kroṁ (क्रों) is hidden in this nāma. Kālī is the destroyer of all evils. This right upper arm is represented by Sampathkarī Devi.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 10 / Sri Lalitha Chaitanya Vijnanam - 10 🌹*
*సహస్ర నామముల తత్వ విచారణ*
✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
మూల మంత్రము :
*🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁*
*🍀. పూర్తి శ్లోకము :*
3. మనోరూపేక్షు కోదండా పంచ తన్మాత్ర సాయకా
నిజారుణ ప్రభాపూర మజ్జద్బ్రహ్మండమండల
*🌻 10. 'మనోరూపేక్షుకోదండా' 🌻*
ఇక్షు కోదండమనగా చెఱకువిల్లు. జీవుని మనస్సు రూపమున దేవియే ఈ విల్లును ధరించియున్నది. చేతన దేవియైనపుడు అందుండి వ్యక్తమైన మనస్సు ధరించు కోరిక కూడ ఆమె ఆధారముగ నున్నదియే
కదా! జీవి మనసుయందు ఏర్పడు వేలాది సంకల్ప వికల్పములు యిచట సూచింపబడుచున్నవి.
మనసునకు కలుగు ఈ సంకల్ప వికల్పములకు చైతన్యమే ఆధారము. దేవి విశ్వాత్మ చైతన్యమే. ఆ
చైతన్యమే ప్రతి జీవియందును జీవచైతన్యముగ భాసించుచుండును. దాని ఆధారమున జీవుల మనస్సుల నుండి చిత్తప్రవృత్తులు వ్యక్తమగు చుండును.
దేవి హస్తమందలి చెఱకు విల్లు, భక్తుడు తన మనస్సుగా భావింపవలెను. తన మనస్సు అనెడి విల్లు దేవి అధీనమున నున్నదని ధ్యానింపవలెను. దేవికి సమర్పణ చేయబడిన మనస్సుగా తన మనస్సును మలచుకొనవలెను. ఆమె అధీనముననున్న తన మనస్సు చెఱకు రసము వలె జీవిత సారమును రుచి చూపించగలదు. ఆమె అధీనమున నిలువని మనస్సు వివిధములైన వికారములను పొందుచుండును.
చెఱకు తీపి తెలిసిన మానవుడు దానినే మరల మరల పొందుటకు ప్రయత్నించునట్లే దేవి అధీనమున చేరిన మనస్సు అదే విధముగ ఆమె సాన్నిధ్యమందు చేరుటకు ప్రయత్నించగలదు. ఒకవైపు పాశము, మరియొకవైపు అంకుశము.
డోలాయమానముగ జీవిని త్రిప్పలు పెట్టుచుండగా అలసట చెందిన మనస్సునకు ఇక్షుదండము ఉపాయమును సూచించు చున్నట్లు దేవి రూపమును ఇచట ప్రస్తుత పరచబడినది.
“నా వలెనే నీ మనస్సు కూడ దేవుని అధీనమున నిలుపుము. అప్పుడు పాశము, అంకుశము బారినుండి నీవు రక్షింపబడుదువు”
హస్తమునందలి ఇక్షుదండము బోధించుచున్నదని
గ్రహింపవలెను.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 10 🌹*
*1000 Names of Sri Lalitha Devi*
✍️. Ravi Sarma
📚. Prasad Bharadwaj
*🌻 10. Manorūpekṣu-kodaṇḍā मनोरूपेक्षु-कोदण्डा 🌻*
Mind involves both saṃkalpa and vikalpa. Saṃkalpa means resolve, process of thought. Vikalpa means difference of perception.
Both are opposite to each other. Mind is also subtle like knowledge. Mind is reflected through the five sensory organs.
It has both saṃkalpa and vikalpa quality as it acts through the impressions received from sense organs that get fine tuned in the form of thought and finally explodes in the form of actions.
Ikṣu means sugar cane and kodaṇḍa means a bow. She is holding in Her left lower arm a bow of sugar cane.
Why sugarcane bow? If sugarcane is crushed, sweet and tasty juice is obtained from which sugar is manufactured.
It means if one crushes his mind (controlling the mind), he gets the sweet reality of the Brahman. This arm is represented by Mantrinī also known Śyāmala Devi.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹