దేవాపి మహర్షి బోధనలు - 21


🌹. దేవాపి మహర్షి బోధనలు - 21 🌹

✍️. సద్గురు కె. పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ


🌻 12. నలుడు 🌻


నలుని కథయందును, ధర్మరాజు కథయందును బోధింప బడిన సత్య మొక్కటియే. నలోపాఖ్యానమే మరికొన్ని విశేషములతో మహాభారతముగ ఈయబడినది. దమయంతికి క్రొత్తరూపమే ద్రౌపది. పంచపాండవుల సమగ్ర రూపమే నలుడు. నలుడు రూపుకట్టిన ధర్మము.

పంచేంద్రియములు, పంచభూతములు, పంచతన్మాత్రలు, విడివిడిగ పంచపాండవులు సమగ్రముగ నలుడు. నలుడు జూదమాడి ఓడెను. ధర్మజుడు కూడ జూదమాడి ఓడెను. ఇద్దరును రాజ్యమును కోల్పోయిరి. ఇద్దరును మరల వారి వారి సతీమణుల పాతివ్రత్య మహిమచే శుభమును పొందిరి.

దమయంతి, ద్రౌపది క్రియాశక్తి స్వరూపములు. శక్తి నుండియే సృష్టి పంచీకరణము చేయబడినది

కదా! పంచీకరణము చేయబడిన సృష్టియందు శక్తియే నిండియున్నది కదా!

ఈ అనుబంధమునే పరిణయముగ కీర్తించుట కవి సమయము. కావున నలుని కథ శ్రద్ధతో చదివినచో మహాభారతము చదివిన కలుగు వికాసము బీజప్రాయముగ కలుగ గలదు.

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹


03 Feb 2021

No comments:

Post a Comment