🌹 30, AUGUST 2023 WEDNESDAY ALL MESSAGES బుధవారం, సౌమ్య వాసర సందేశాలు 🌹

🍀🌹 30, AUGUST 2023 WEDNESDAY ALL MESSAGES బుధవారం, సౌమ్య వాసర సందేశాలు 🌹🍀
1) 🌹 30, AUGUST 2023 WEDNESDAY బుధవారం, సౌమ్య వాసరే, నిత్య పంచాంగము Daily Panchangam🌹
🌹🍀. హయగ్రీవ జయంతి, రాఖీ పౌర్ణమి, రక్షా బంధనము శుభాకాంక్షలు అందరికి, Hayagriva Jayanti, Rakhi Pournami, Raksha Bandhan Good Wishes to All 🍀🌹
2) 🌹. శ్రీమద్భగవద్గీత - 421 / Bhagavad-Gita - 421 🌹
🌴. 11వ అధ్యాయము - విశ్వరూప సందర్శన యోగం - 07 / Chapter 11 - Viswaroopa Sandarsana Yoga - 07 🌴
3) 🌹 . శ్రీ శివ మహా పురాణము - 782 / Sri Siva Maha Purana - 782 🌹
🌻. దూత సంవాదము - 6 / Jalandhara’s emissary to Śiva - 6 🌻
4) 🌹. ఓషో రోజువారీ ధ్యానాలు - 35 / Osho Daily Meditations  - 35 🌹
🍀 35. కేంద్రీకృతం / 35. CENTERING 🍀
5) 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 473 - 1 / Sri Lalitha Chaitanya Vijnanam - 473 - 1 🌹 
🌻 473. ‘యశస్విని’ - 1 / 473. 'Yasaswini' - 1🌻

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 30, అగష్టు, AUGUST 2023 పంచాంగము - Panchangam 🌹*
*శుభ బుధవారం, సౌమ్య వాసరే Wednesday*
*🍀. హయగ్రీవ జయంతి, రాఖీ పౌర్ణమి, రక్షా బంధనము శుభాకాంక్షలు అందరికి, Hayagriva Jayanti, Rakhi Pournami, Raksha Bandhan Good Wishes to All 🍀*
*మనందరికి ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని పరమాత్మని స్మరిస్తూ - ప్రసాద్ భరద్వాజ*

*🌻. పండుగలు మరియు పర్వదినాలు : హయగ్రీవ జయంతి, రాఖీ పౌర్ణమి, రక్షా బంధనము, Hayagriva Jayanti, Rakhi Pournami, Raksha Bandhan 🌻*

*🍀. శ్రీ గజానన స్తోత్రం - 09 🍀*

*09. యది త్వయా నాథ కృతం న కించిత్తదా కథం సర్వమిదం విభాతి |*
*అతో మహాత్మానమచింత్యమేవ *గజాననం భక్తియుతా భజామః*

*🍀. శ్రీ హయగ్రీవ స్తోత్రం 🍀*
*జ్ఞానానన్దమయం దేవం నిర్మలస్ఫటికాకృతిమ్ ।*
*ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే ॥*

🌻 🌻 🌻 🌻 🌻

*🍀. నేటి సూక్తి : ఆకాంక్ష. వ్యాకులత - ఎడతెగని వ్యాకులత లేకపోవడం భగవంతుని యెడ నిక్కమైన ఆకాంక్ష లేకపోవడానికి ఛిహ్నంగా భావించరాదు. కొన్ని భక్తియోగ పద్ధతులలో అట్టి వ్యాకులత ప్రాధాన్యం వహించే మాట నిజమే. కాని, పూర్ణ యోగంలో అంతరాత్మ యందలి ఆకాంక్ష ఒక్కొక్కప్పుడు తరంగములుగ బయలు దేరడం వున్నా, నిశ్చలత్వమే దానికి పునాదియై నిలుకడగా అంతకంత కెక్కువగా సత్యజ్ఞాన సాక్షాత్కారానికి భగవదనుభూతికి సాధన భూతమవుతుంది.🍀*

🌷🌷🌷🌷🌷

విక్రమ: 2080 నల, శఖ: 1945 శోభన
కలియుగాబ్ది : 5124, శోభకృత్‌,
వర్ష ఋతువు, దక్షిణాయణం,
శ్రావణ మాసం
తిథి: శుక్ల చతుర్దశి 10:59:45 వరకు
తదుపరి పూర్ణిమ
నక్షత్రం: ధనిష్ట 20:47:44 వరకు
తదుపరి శతభిషం
యోగం: అతిగంధ్ 21:33:15 వరకు
తదుపరి సుకర్మ
కరణం: వణిజ 10:58:46 వరకు
వర్జ్యం: 03:20:20 - 04:44:04
మరియు 27:04:24 - 28:28:16
దుర్ముహూర్తం: 11:51:42 - 12:41:42
రాహు కాలం: 12:16:42 - 13:50:26
గుళిక కాలం: 10:42:58 - 12:16:42
యమ గండం: 07:35:30 - 09:09:14
అభిజిత్ ముహూర్తం: 11:52 - 12:40
అమృత కాలం: 11:42:44 - 13:06:28
సూర్యోదయం: 06:01:46
సూర్యాస్తమయం: 18:31:38
చంద్రోదయం: 18:14:53
చంద్రాస్తమయం: 04:57:54
సూర్య సంచార రాశి: సింహం
చంద్ర సంచార రాశి: మకరం
యోగాలు: మిత్ర యోగం - మిత్ర
లాభం 20:47:44 వరకు తదుపరి
మానస యోగం - కార్య లాభం
దిశ శూల: ఉత్తరం
✍️. శ్రీ వక్కంతం చంద్రమౌళి

🌻 🌻 🌻 🌻 🌻    

*🍀. నిత్య ప్రార్థన 🍀*
*వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ*
*నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా*
*యశివ నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా*
*తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం*
*తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ* 
*విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.*
🌹🌹🌹🌹🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹🍀. హయగ్రీవ జయంతి, రాఖీ పౌర్ణమి, రక్షా బంధనము శుభాకాంక్షలు అందరికి, Hayagriva Jayanti, Rakhi Pournami, Raksha Bandhan Good Wishes to All 🍀🌹*
*ప్రసాద్ భరద్వాజ*

*జ్ఞానానన్దమయం దేవం నిర్మలస్ఫటికాకృతిమ్ ।*
*ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే ॥*

*యేనబద్ధో బలీరాజ దానవేంద్రో మహాబలః ! తేనత్వామపి బద్ధ్నామి రక్షే మాచల మాచల!!*

*🌻. ప్రతి సంవత్సరం శ్రావణ మాసం పౌర్ణమి రోజున రక్షాబంధన్ పండుగను జరుపుకుంటారు. ఈ రాఖీ పౌర్ణమి రోజునే అక్కాచెల్లెల్లు తమ సోదరులకు రాఖీ కట్టి వారి ఆశీస్సులు తీసుకుంటారు. అయితే రాఖీని శుభముహూర్తంలో కడితేనే సోదరుడికి మేలు జరుగుతుంది. భద్ర కాలంలో అస్సలు రాఖీని కట్టకూడదు. ఆగస్టు 30న ఉదయం 10.58 గంటల నుంచి రాత్రి 09.01 గంటల వరకు భద్ర కాలం ఉంది. ఆ సమయంలో కడితే మీ సోదరుడు అనేక సమస్యలను ఎదుర్కోవల్సి వస్తుంది.*

*🌻. రాఖీ కట్టడానికి శుభ సమయం*

*రక్షాబంధన్ యొక్క శుభ సమయం ఆగస్టు 30న రాత్రి 09:01 గంటల ప్రారంభమై..ఆగస్టు 31 ఉదయం 07:05 వరకు ఉంటుంది. ఈ సమయంలో మీరు ఎప్పుడైనా మీ సోదరుడికి రాఖీ కట్టవచ్చు.*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీమద్భగవద్గీత - 421 / Bhagavad-Gita - 421 🌹*
*✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ*

*🌴. 11వ అధ్యాయము - విశ్వరూప సందర్శన యోగం - 07 🌴*

*07. ఇహైకస్థం జగత్కృత్స్నం పశ్యాద్య సచరాచరమ్*
*మమ దేహే గుడాకేశ యచ్చాన్య ద్ద్రష్టుమిచ్చసి ||*

*🌷. తాత్పర్యం : ఓ అర్జునా! నీవు చూడగోరు సమస్తమును నా దేహమున ఒక్కమారుగా గాంచుము. నీవు ప్రస్తుతము ఏది చూడగోరినను మరియు భవిష్యత్తున ఏది వీక్ష్మింపదలచినను ఈ విశ్వరూపము నీకు చూపగలదు. స్థావర, జంగమాది సర్వము ఏకస్థానమున దీని యందే సంపూర్ణముగా కలవు.*

*🌷. భాష్యము : ఒక్కచోటనే నిలిచి ఎవ్వరును సమస్తవిశ్వమును గాంచలేరు. ఎంతటి గొప్ప శాస్త్రజ్ఞుడైనను విశ్వము నందలి ఇతర భాగములలో ఏమి జరుగుచున్నదో గాంచలేడు. కాని అర్జునుని వంటి భక్తుడు మాత్రము విశ్వములోగల సర్వమును గాంచగలుగును. అతడు భూత, భవిష్యత్, వర్తమానములందు దేనినైనను గాంచుటకు వలసిన శక్తిని శ్రీకృష్ణుడు ఒసగును. ఆ విధముగా కృష్ణుని కరుణ వలననే అర్జునుడు సమస్తమును వీక్షింప సమర్థుడయ్యెను.*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Bhagavad-Gita as It is - 421 🌹*
*✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj*

*🌴 Chapter 11 - Viswaroopa Sandarsana Yoga - 07 🌴*

*07. ihaika-sthaṁ jagat kṛtsnaṁ paśyādya sa-carācaram*
*mama dehe guḍākeśa yac cānyad draṣṭum icchasi*

*🌷 Translation : O Arjuna, whatever you wish to see, behold at once in this body of Mine! This universal form can show you whatever you now desire to see and whatever you may want to see in the future. Everything – moving and nonmoving – is here completely, in one place.*

*🌹 Purport : No one can see the entire universe while sitting in one place. Even the most advanced scientist cannot see what is going on in other parts of the universe. But a devotee like Arjuna can see everything that exists in any part of the universe. Kṛṣṇa gives him the power to see anything he wants to see, past, present and future. Thus by the mercy of Kṛṣṇa, Arjuna is able to see everything.*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 . శ్రీ శివ మహా పురాణము - 782 / Sri Siva Maha Purana - 782 🌹* 
*✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి 📚. ప్రసాద్ భరద్వాజ*

*🌴. రుద్రసంహితా-యుద్ద ఖండః - అధ్యాయము - 19 🌴*

*🌻. దూత సంవాదము - 6 🌻*

*సనత్కుమారుడిట్లు పలికెను- ఆ పురుషుడు శివునిచే ఇట్లు ఆజ్ఞాపించబడిన వాడై తన కాళ్లుచేతుల లోని మాంసమును భక్షించెను. శిరస్సు మాత్రమే మిగిలి యుండెను (45). శిరస్సు మాత్రమే మిగిలి యుండుటను గాంచి సదాశివుడు మిక్కిలి ప్రసన్నుడై భయంకరమగు కర్మను ఆచరించిన ఆ పురుషునితో విస్మయపూర్వకముగా నిట్లనెను (46).*

*శివుడిట్లు పలికెను- ఓయీ మహాగణా! నా ఆజ్ఞను పాలించు నీవు ధన్యుడవు. ఓయీ శ్రేష్ఠపురుషా! నీ ఈ కర్మను గాంచి నేను మిక్కిలి సంతసించితిని (47). సర్వదా నా కుమారుడవు, మహాగణుడవు, మహావీరుడవు, దుష్టులందరికీ భయమును గొల్పువాడవు అగు నీవు కీర్తిముఖుడను పేరును గాంచుము (48). నన్ను పూజించు నా భక్తులు నాకు ప్రియుడవగు నిన్ను కూడ సర్వదా పూజించెదరు. నిన్ను పూజించని వారు నాకు ఎన్నటికి ప్రీతి పాత్రులు కాజాలరు (49).*

*సనత్కుమారుడిట్లు పలికెను- శివుని నుండి ఇట్టి వరమును పొంది ఆ పురుషుడు మిక్కిలి సంతసిల్లెను. అప్పటి నుండియు కీర్తిముఖుడు దేవదేవుని ద్వారము వద్ద నిలబడి యున్నాడు (50). శివుని పూజించువారు ఆ గణుని శ్రద్ధతో పూజించవలెను. ఎవరైతే ముందుగా ఆతనిని పూజించరో, వారి పూజ వ్యర్థమగును.*

*శ్రీ శివమహాపురాణములో రుద్ర సంహితయందు యుద్ధఖండములో దూతసంవాదమనే పందొమ్మిదవ అధ్యాయము ముగిసినది (19).*

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 SRI SIVA MAHA PURANA - 782🌹*
*✍️ J.L. SHASTRI, 📚. Prasad Bharadwaj *

*🌴 Rudra-saṃhitā (4): Yuddha-khaṇḍa - CHAPTER 19 🌴*

*🌻 Jalandhara’s emissary to Śiva - 6 🌻*

Anatkumāra said:—
45. On being commanded thus by Śiva, the being ate up the flesh from his limbs. He was then left only with his head.

46. On seeing that being of terrible activities, left only with his head, the delighted Sadāśiva spoke smilingly.

Śiva said:—
47. “O great Gaṇa, you are blessed since you carried out my behest to the very letter. O excellent one, I am pleased with this action of yours.

48. You shall hereafter be known by the title Kīrtimukha. You shall be my door-keeper. You shall be one of my great Gaṇas, very heroic and terrible to all wicked persons.

49. You are my favourite. In the course of my worship, you too shall be worshipped always by my devotees. Those who do not worship you cannot be pleasing to me.”

Sanatkumāra said:—
50. With this excellent blessing from Śiva, he became delighted. From that time onwards Kīrtimukha[2] was stationed at the entrance of the lord of the gods.

51. This Gaṇa shall be specially worshipped in the course of the adoration of Śiva. Those who do not worship him at the outset will find their worship in vain.

Continues....
🌹🌹🌹🌹🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. ఓషో రోజువారీ ధ్యానాలు - 35 / Osho Daily Meditations  - 35 🌹*
*✍️. ప్రసాద్ భరద్వాజ*

*🍀 35. కేంద్రీకృతం 🍀*

*🕉. దారి తప్పడం మరియు కేంద్రీకృతం అవడం మధ్య వైరుధ్యాన్ని సృష్టించవద్దు. సాక్షిగా ఉండండి. మీరు తప్పుదారి పడతారని భయపడితే, మీరు దారితప్పిపోయే అవకాశం ఎక్కువ; మీరు ఏది అణచివేయడానికి ప్రయత్నిస్తారో అది ముఖ్యమైనది అవుతుంది. 🕉*

*ఏదైనా తిరస్కరించాలని ప్రయత్నిస్తే అది చాలా ఆకర్షణీయంగా మారుతుంది. కాబట్టి దారి తప్పినందుకు ఎలాంటి ఖండనను సృష్టించవద్దు. నిజానికి, దానితో వెళ్ళండి. అది జరిగితే జరగనివ్వండి; అందులో తప్పు లేదు. అందులో ఏదో ఒకటి ఉండాలి, అందుకే అలా జరుగుతోంది. కొన్నిసార్లు తప్పుదారి పట్టడం కూడా మంచిది. నిజంగా కేంద్రీకృతంగా ఉండాలని కోరుకునే వ్యక్తి కేంద్రీకరణ గురించి చింతించకూడదు. మీరు దాని గురించి చింతిస్తే, ఆందోళన మిమ్మల్ని కేంద్రీకరించడానికి ఎప్పటికీ అనుమతించదు; మీకు చింతించని మనస్సు కావాలి. తప్పుదారి పట్టడం మంచిది; అందులో తప్పు లేదు. ఉనికితో పోరాటం ఆపండి. అన్ని సంఘర్షణలను అంటే జయించడం మరియు ఓడి పోవడం అనే ఆలోచనను ఆపండి. శరణాగతి చెందండి. శరణాగతిలో మీరు ఏమి చేయగలరు? మనసు దారి తప్పితే నువ్వూ తప్పుతావు; అది జరగకపోతే, అది కూడా ఫర్వాలేదు, కొన్నిసార్లు మీరు కేంద్రీకృతమై ఉంటారు. కొన్నిసార్లు ఉండరు.*

*కానీ లోతుగా మీరు ఎల్లప్పుడూ కేంద్రీకృతమై ఉంటారు ఎందుకంటే ఆందోళన లేదు. లేదంటే అంతా ఆందోళనగా మారవచ్చు. అప్పుడు తప్పుదారి పట్టడం అనేది ఒక వ్యక్తి చేయకూడని పాపం లాగా మారుతుంది-మరియు సమస్య మళ్లీ సృష్టించబడుతుంది. మీలో ఎప్పుడూ ద్వంద్వత్వాన్ని సృష్టించుకోకండి. మీరు ఎల్లప్పుడూ నిజం చెప్పాలని నిర్ణయించుకుంటే, అసత్యం అనే ఆకర్షణ ఉంటుంది. మీరు అహింసాత్మకంగా ఉండాలని నిర్ణయించుకుంటే, హింస పాపం అవుతుంది. మీరు కేంద్రీకృతంగా ఉండటానికి ప్రయత్నిస్తే, దారి తప్పడం పాపం అవుతుంది. అలా అన్ని మతాలు మూర్ఖత్వాలుగా మారాయి. అంగీకరించు, తప్పుదారికి కూడా సాక్షిగా ఉండు. అప్పుడు అందులో తప్పు ఉండదు.*

*కొనసాగుతుంది...*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Osho Daily Meditations  - 35 🌹*
📚. Prasad Bharadwaj

*🍀 35. CENTERING 🍀*

*🕉. Don't create conflict between going astray and remaining centered. Float. if you become afraid of going astray, there is a greater chance that you will go astray; whatever you try to suppress becomes significant.  🕉*

*Whatever you try to deny becomes very attractive. So don't create any condemnation of going astray. In fact, go with it. If it is happening, allow it to happen; there is nothing wrong in it. There must be something in it, and that's why it is happening. Sometimes even going astray is good. A person who really wants to remain centered should not worry about centering. If you worry about it, the worry will never allow you to be centered; you need an unworried mind. Going astray is good; there is nothing wrong in it. Stop fighting with existence. Stop all conflict and the idea of conquering-surrender. And when you surrender, what can you do? If the mind goes astray, you go; if it doesn't go, that too is okay, Sometimes you will be centered, and sometimes you will not.*

*But deep down you will always remain centered because there is no worry. Otherwise everything can become a worry. Then going astray becomes just like a sin one is not to commit-and the problem is created again. Never create duality within you. If you decide to always be true, then there will be an attraction to being untrue. If you decide to be nonviolent, then violence will become the sin. If you decide to be celibate, then sex will become the sin. If you try to be centered, going astray will become a sin-that's how all religions have become stupidities. Accept, go astray; there is nothing wrong in it.*

Continues...
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము  - 473 - 1  / Sri Lalitha Chaitanya Vijnanam  - 473 - 1 🌹*
*🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻*
*✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం  శ్రీమాత్రే నమః 🍁*

*🍀  97. వజ్రేశ్వరీ, వామదేవీ, వయోఽవస్థా వివర్జితా ।*
*సిద్ధేశ్వరీ, సిద్ధవిద్యా, సిద్ధమాతా, యశస్వినీ ॥ 97 ॥ 🍀*

*🌻 473. ‘యశస్విని’ - 1🌻*

*కీర్తి కలది శ్రీమాత అని అర్ధము. శ్రీమాత అనుగ్రహము కలవారికే యశస్సు కలుగును. కీర్తి కలుగును. ఎన్ని అర్హతలున్ననూ కీర్తి దక్కనివారు మిక్కుటముగ నుందురు. అర్హతలతో సంబంధము లేక కేవలము అనుగ్రహము చేతనే కీర్తి కలుగ గలదు. శ్రీమాత తలచుకొన్నచో కేవలము మూర్ఖుడై ననూ, జ్ఞానియై ప్రకాశింపగలడు. కాళిదాసు మహాకవి అమ్మ అనుగ్రహమున జగద్విఖ్యాతుడైనాడు. సకల శుభములు, జయములు అమ్మ కనుసన్నలలో యుండును.*

*సశేషం...*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Sri Lalitha Chaitanya Vijnanam  - 473 - 1 🌹*
*Contemplation of 1000 Names of Sri Lalitha Devi* 
*✍️ Prasad Bharadwaj*

*🌻 97. Vajreshvari vamadevi vayovasdha vivarjita*
*sideshvari sidhavidya sidhamata yashasvini ॥ 97 ॥ 🌻*

*🌻 473. 'Yasaswini' - 1🌻*

*It means Srimata has glory. Those who have the grace of Sri Mata will get success. There will be glory. There are people who do not get fame, no matter how many qualifications they have. Fame can be achieved by grace alone regardless of eligibility. When Shrimata decides, even a fool shines as a wise man. Kalidasa Mahakavi became world famous with the grace of Amma. All blessings and triumphs come with one look from Amma.*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
Join and Share 
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
https://t.me/+9zDjTpPe_PQzMWVl
https://t.me/Sivasutras
https://t.me/Seeds_Of_Consciousness
https://t.me/bhagavadgeethaa/
https://t.me/AgniMahaPuranam
https://t.me/+LmH1GyjNXXlkNDRl
http://www.facebook.com/groups/srilalithachaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/
https://prasadbharadwaj.wixsite.com/dailybhaktimessages2
https://chaitanyavijnanam.tumblr.com/
https://prasadbharadwaj.wixsite.com/lalithasahasranama
https://www.threads.net/@prasad.bharadwaj

ఓనమ్ శుభాకాంక్షలు - Good Wishes on Onam


🌹🍀. ఓనమ్ శుభాకాంక్షలు అందరికి‌, Onam Good Wishes to All 🍀🌹

ప్రసాద్ భరద్వాజ

Siva Sutras - 135 : 2-10. vidyasamhare taduttha svapna darsanam -7 / శివ సూత్రములు - 135 : 2-10. విద్యాసంహారే తదుత్త స్వప్న దర్శనం -7


🌹. శివ సూత్రములు - 135 / Siva Sutras - 135 🌹

🍀. శివ ఆగమ తత్వశాస్త్రం యొక్క సూత్రములు 🍀

2వ భాగం - శక్తోపాయ

✍️. ప్రసాద్‌ భరధ్వాజ

🌻 2-10. విద్యాసంహారే తదుత్త స్వప్న దర్శనం -7 🌻

🌴. ఆత్మశుద్ధి త్యాగంలో నిమ్న జ్ఞానము నశించి నప్పుడు, యోగి, ప్రపంచాన్ని శివుని స్వప్నంగా మరియు అతని శరీరం ఏర్పడినట్లు అనుభవిస్తాడు. అతను తన మాయ స్వరూపాన్ని గ్రహించి, స్వచ్ఛమైన జ్ఞానంలో స్థిరపడతాడు. 🌴


పాక్షికంగా మేల్కొన్న వారికి మెలకువ, స్వప్న, గాఢనిద్ర స్థితుల ప్రారంభంలో మరియు చివరిలో మాత్రమే స్వీయ-సాక్షాత్కారం ఉంటుంది. ఎందుకంటే నాకు స్వీయ-సాక్షాత్కారం స్థితులలో కూడా కలిగి ఉంటుంది, కానీ నిరంతరం కాదు. నమ్మినా నమ్మకపోయినా, ఇంతకు ముందు నేనుగా అనుభవించిన ఆ సంపూర్ణ స్వేచ్ఛ స్థితిని గుర్తుంచు కోవడమే కీలకం. ఎవరైనా ఆ స్థితిని స్మరించినప్పుడు, అతను ఆ గుణాన్ని వెంటనే పొందుతాడు. ఈ పద్ధతి యొక్క సరళతకు నేను ఆశ్చర్యపోయాను. బోధించ బడిననట్లుగా నేను అతని ద్యోతకం కోసం ఎదురు చూస్తున్నాను, కానీ శివం తనని ఈ విధంగా గ్రహించమని తెలిపాడు. దీని ప్రభావం తక్షణమే ఉంటుంది. అంటే యోగి వెంటనే దానిని గ్రహించిన వ్యక్తిగా తనను తాను గుర్తిస్తాడు.


కొనసాగుతుంది...

🌹 🌹 🌹 🌹 🌹



🌹 Siva Sutras - 135 🌹

🍀Aphorisms of philosophy of Shiva āgama 🍀

Part 2 - Śāktopāya.

✍️. Acharya Ravi Sarma, 📚. Prasad Bharadwaj

🌻 2-10. vidyāsamhāre taduttha svapna darśanam -7 🌻


🌴. When the knowledge is thus destroyed in the sacrifice of self-purification, the yogi experiences the world as a dream of Shiva and his body as a formation. He realizes their illusory nature and becomes established in pure knowledge. 🌴

The partially awakened only has Self-realization at the beginning and at the end of those states. Because I have Self-realization during the states too, but not constantly. Believe or not, the key is to remember the state of Absolute Freedom I experienced before. When one remember that State, he acquires that quality. Well, I am surprised due to the simplicity of the method. I was waiting for His revelation, as taught, but He asked me to grab Him that way. The effect is immediate, i.e. He reveals Himself as the Perceiver immediately!”


Continues...

🌹 🌹 🌹 🌹 🌹


DAILY WISDOM - 133 : 12. Life Without a Philosophy is Unimaginable / నిత్య ప్రజ్ఞా సందేశములు - 133 : 12. తత్వశాస్త్రం లేని జీవితం ఊహించలేనిది



🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 133 / DAILY WISDOM - 133 🌹

🍀 📖 . జీవితం యొక్క తత్వము నుండి 🍀

✍️. ప్రసాద్ భరద్వాజ

🌻 12. తత్వశాస్త్రం లేని జీవితం ఊహించలేనిది 🌻


తత్వశాస్త్రం అనేది సాధారణంగా జ్ఞానం పట్ల ప్రేమగా నిర్వచించబడింది. లేదా హేతువు చెప్పగలిగినంత విషయ వస్తువుల యొక్క లోతైన కారణన్యాయ జ్ఞానంగా కూడా నిర్వచించవచ్చు. ఇది ఒక సమగ్రమైన మరియు విమర్శనాత్మకమైన అధ్యయనం . మొత్తం అనుభవం యొక్క విశ్లేషణ. నమ్మకంతో, ఉద్దేశపూర్వకంగా మరియు హేతుబద్ధంగా దృఢంగా అవలంబించినా లేదా విశ్వాసం లేదా ద్వారా జీవితంలో స్పృహతో లేదా తెలియకుండానే అనుసరించినా, ప్రతి మనిషి తనకు తానుగా ఒక ప్రాథమిక తత్వాన్ని జీవితానికి ఆధారంగా చేసుకుంటాడు. ఇది ప్రపంచం మరియు వ్యక్తి మధ్య ఉన్న సంబంధం యొక్క సిద్ధాంతం. ఇది జీవితం పట్ల అతని మొత్తం వైఖరిని రూపొందిస్తుంది.

అరిస్టాటిల్ ఆది భౌతిక శాస్త్రాన్ని ప్రాథమిక శాస్త్రం అని పిలిచాడు, ఎందుకంటే మనిషికి ప్రతి భాగం లేదా మానవ అనుభవంలోని విషయాలను గురించి పూర్తి జ్ఞానాన్ని అందించడానికి దాని యొక్క సరైన అవగాహన సరిపోతుంది. వ్యక్తులందరూ స్పృహతో లేదా తెలియకుండా తమ కోసం తాము రూపొందించుకున్న జీవిత తత్వానికి అనుగుణంగా జీవిస్తారు. చదువుకోని, సంస్కారహీనులు కూడా తమదైన ఒక తత్వాన్ని కలిగి ఉంటారు. తత్వశాస్త్రం లేని జీవితం ఊహించలేనిది.


కొనసాగుతుంది...

🌹 🌹 🌹 🌹 🌹




🌹 DAILY WISDOM - 133 🌹

🍀 📖 The Philosophy of Life 🍀

📝 Swami Krishnananda
📚. Prasad Bharadwaj

🌻 12. Life Without a Philosophy is Unimaginable 🌻


Philosophy is generally defined as love of wisdom or the knowledge of things in general by their ultimate causes, so far as reason can attain to such knowledge. It is a comprehensive and critical study and analysis of experience as a whole. Whether it is consciously, deliberately and rationally adopted on conviction or consciously or unconsciously followed in life through faith or persuasion, every man constructs for himself a fundamental philosophy as the basis of life, a theory of the relation of the world and the individual, and this shapes his whole attitude to life.

Aristotle called metaphysics the fundamental science, for, a correct comprehension of it is enough to give man a complete knowledge of every constituent or content of human experience. All persons live in accordance with the philosophy of life that they have framed for themselves, consciously or unconsciously. Even the uneducated and the uncultured have a rough-and-ready philosophy of their own. Life without a philosophy is unimaginable.


Continues...

🌹 🌹 🌹 🌹 🌹


విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 820 / Vishnu Sahasranama Contemplation - 820


🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 820 / Vishnu Sahasranama Contemplation - 820🌹

🌻 820. శత్రుజిత్, शत्रुजित्, Śatrujit 🌻

ఓం శత్రుజితే నమః | ॐ शत्रुजिते नमः | OM Śatrujite namaḥ


సురశత్రవ ఏవాస్య శత్రవస్తాన్ జయత్యజః ।
ఇతి శత్రుజిదిత్యేవం కీర్త్యతే విబుధోత్తమైః ॥


విష్ణునకు స్వతః ఎవరును శత్రువులు కాకపోయినప్పటికీ, సురల శత్రువులే ఈతనికి శత్రువులు. అట్టి శత్రువులను జయించువాడు.



సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹




🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 820🌹

🌻820. Śatrujit🌻

OM Śatrujite namaḥ

सुरशत्रव एवास्य शत्रवस्तान् जयत्यजः ।
इति शत्रुजिदित्येवं कीर्त्यते विबुधोत्तमैः ॥

Suraśatrava evāsya śatravastān jayatyajaḥ,
Iti śatrujidityevaṃ kīrtyate vibudhottamaiḥ.


Though Lord Viṣṇu has no enemies, the foes of the devas alone are His enemies. He vanquishes them so Śatrujit.


🌻 🌻 🌻 🌻 🌻



Source Sloka

सुलभस्सुव्रतस्सिद्धश्शत्रुजिच्छत्रुतापनः ।
न्यग्रोधोदुम्बरोऽश्वत्थश्‍चाणूरान्ध्रनिषूदनः ॥ ८८ ॥

సులభస్సువ్రతస్సిద్ధశ్శత్రుజిచ్ఛత్రుతాపనః ।
న్యగ్రోధోదుమ్బరోఽశ్వత్థశ్‍చాణూరాన్ధ్రనిషూదనః ॥ 88 ॥

Sulabhassuvratassiddhaśśatrujicchatrutāpanaḥ,
Nyagrodhodumbaro’śvatthaśˈcāṇūrāndhraniṣūdanaḥ ॥ 88 ॥




Continues....

🌹 🌹 🌹 🌹


కపిల గీత - 228 / Kapila Gita - 228


🌹. కపిల గీత - 228 / Kapila Gita - 228 🌹

🍀. కపిల దేవహూతి సంవాదం 🍀

✍️. ప్రసాద్‌ భరధ్వాజ

🌴 5. భక్తి స్వరూపము - కాలమహిమ - 38 🌴

38. యోఽంతః ప్రవిశ్య భూతాని భూతైైరత్త్యఖిలాశ్రయః|
స విష్ణ్వాఖ్యోఽధియజ్ఞోఽసౌ కాలః కలయతాం ప్రభుః॥


తాత్పర్యము : కాలము సమస్త జగత్తునకు ఆశ్రయము. అందువలన అది సకల ప్రాణులలో ప్రవేశించి, ఒక ప్రాణి ద్వారా వేరొక ప్రాణిని సంహరింప జేయును. జగత్తును శాసించునట్టి వాడు, బ్రహ్మాది దేవతలకు ప్రభువైనవాడు విష్ణువే. కాలపురుషుడైన పరమాత్మయగు శ్రీమహావిష్ణువు యజ్ఞభోక్త. అతడే యజ్ఞఫలప్రదాత.

వ్యాఖ్య : భగవంతుడైన విష్ణువు యొక్క సర్వోన్నత వ్యక్తిత్వం ఈ భాగంలో స్పష్టంగా వివరించబడింది. అతను సర్వోన్నతమైన ఆనందించేవాడు, మరియు ఇతరులు అందరూ అతని సేవకులుగా పనిచేస్తున్నారు. చైతన్య చరిత్ర (CC ఆది 5.14) లో చెప్పబడినట్లుగా, ఏకలే ఈశ్వర కృష్ణుడు: ఏకైక భగవంతుడు విష్ణువు. ఆర సబ భృత్య: మిగతా వారందరూ అతని సేవకులు. బ్రహ్మ, శివుడు మరియు ఇతర దేవతలు అందరూ సేవకులే. అదే విష్ణువు పరమాత్మగా అందరి హృదయాలలోకి ప్రవేశిస్తాడు మరియు అతను మరొక జీవి ద్వారా ప్రతి జీవిని నాశనం చేస్తాడు.


సశేషం..

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Kapila Gita - 228 🌹

🍀 Conversation of Kapila and Devahuti 🍀

📚 Prasad Bharadwaj

🌴 5. Form of Bhakti - Glory of Time - 38 🌴

38. yo 'ntaḥ praviśya bhūtāni bhūtair atty akhilāśrayaḥ
sa viṣṇv-ākhyo 'dhiyajño 'sau kālaḥ kalayatāṁ prabhuḥ


MEANING : Lord Viṣṇu, the Supreme Personality of Godhead, who is the enjoyer of all sacrifices, is the time factor and the master of all masters. He enters everyone's heart, He is the support of everyone, and He causes every being to be annihilated by another.

PURPORT : Lord Viṣṇu, the Supreme Personality of Godhead, is clearly described in this passage. He is the supreme enjoyer, and all others are working as His servants. As stated in the Caitanya caritāmṛta (CC Adi 5.14), ekale īśvara kṛṣṇa: the only Supreme Lord is Viṣṇu. Āra saba bhṛtya: all others are His servants. Lord Brahmā, Lord Śiva and other demigods are all servants. The same Viṣṇu enters everyone's heart as Paramātmā, and He causes the annihilation of every being through another being.


Continues...

🌹 🌹 🌹 🌹 🌹




29 Aug 2023 : Daily Panchang నిత్య పంచాంగము


🌹 29, అగష్టు, AUGUST 2023 పంచాంగము - Panchangam 🌹

శుభ మంగళవారం, Tuesday, భౌమ వాసరే

🍀. ఓనమ్ శుభాకాంక్షలు అందరికి‌, Onam Good Wishes to All 🍀

మనందరికి ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని పరమాత్మని స్మరిస్తూ - ప్రసాద్ భరద్వాజ

🌻. పండుగలు మరియు పర్వదినాలు : ఓనమ్‌, Onam 🌻

🍀. శ్రీ ఆంజనేయ సహస్రనామ స్తోత్రం - 18 🍀

36. .రవిశ్చంద్రః కుజః సౌమ్యో గురుః కావ్యః శనైశ్చరః |
రాహుః కేతుర్మరుద్దాతా ధాతా హర్తా సమీరజః

37. మశకీకృతదేవారిర్దైత్యారిర్మధుసూదనః |
కామః కపిః కామపాలః కపిలో విశ్వజీవనః

🌻 🌻 🌻 🌻 🌻


🍀. నేటి సూక్తి : ఆకాంక్ష, ప్రాణిచేతన - హృత్పురుషుని నుండి బయలుదేరునదే నిక్కమైన ఆకాంక్ష. ప్రాణమయ చేతన విశుద్ధం గావించబడి హృత్పరుషాధీనం చెయ్యబడి నప్పుడు ఆ ఆకాంక్ష తీవ్రతను సంతరించుకొంటుంది. ప్రాణమయచేతన విశుద్ధం కానప్పుడు ఇకాంక్షయందలి తీవ్రత రాజసికమై, ఆసహనం, ఆశాభంగం, విపరీతభేదం . . మొదలైన అవలక్షణాలకు తావేర్పడుతుంది. 🍀


🌷🌷🌷🌷🌷




విక్రమ: 2080 నల, శఖ: 1945 శోభన

కలియుగాబ్ది : 5124, శోభకృత్‌,

వర్ష ఋతువు, దక్షిణాయణం,

శ్రావణ మాసం

తిథి: శుక్ల త్రయోదశి 14:49:10

వరకు తదుపరి శుక్ల చతుర్దశి

నక్షత్రం: శ్రవణ 23:50:25 వరకు

తదుపరి ధనిష్ట

యోగం: సౌభాగ్య 06:02:14 వరకు

తదుపరి శోభన

కరణం: తైతిల 14:46:11 వరకు

వర్జ్యం: 06:15:00 - 07:39:24

మరియు 27:19:30 - 28:43:18

దుర్ముహూర్తం: 08:31:46 - 09:21:49

రాహు కాలం: 15:24:42 - 16:58:33

గుళిక కాలం: 12:17:00 - 13:50:51

యమ గండం: 09:09:19 - 10:43:10

అభిజిత్ ముహూర్తం: 11:52 - 12:42

అమృత కాలం: 14:41:24 - 16:05:48

సూర్యోదయం: 06:01:36

సూర్యాస్తమయం: 18:32:25

చంద్రోదయం: 17:24:59

చంద్రాస్తమయం: 03:50:04

సూర్య సంచార రాశి: సింహం

చంద్ర సంచార రాశి: మకరం

యోగాలు: లంబ యోగం - చికాకులు,

అపశకునం 23:50:25 వరకు తదుపరి

ఉత్పాద యోగం - కష్టములు, ద్రవ్య నాశనం

దిశ శూల: ఉత్తరం

✍️. శ్రీ వక్కంతం చంద్రమౌళి

🌻 🌻 🌻 🌻 🌻




🍀. నిత్య ప్రార్థన 🍀

వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ

నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా

యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా

తయో సంస్మరణా త్పుంసాం సర్వతో జయ మంగళం

తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ

విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.

🌹🌹🌹🌹🌹