1) 🌹 06, JULY 2023 THURSDAY గురువారం, బృహస్పతి వాసరే, నిత్య పంచాంగము Daily Panchangam🌹
2) 🌹. శ్రీమద్భగవద్గీత - 394 / Bhagavad-Gita - 394 🌹
🌴10వ అధ్యాయము - విభూతి యోగం - 22 / Chapter 10 - Vibhuti Yoga - 22 🌴
3) 🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 240 / Agni Maha Purana - 240 🌹
🌻. స్నానతర్పణాది విధి కధనము - 6 / Mode of bathing and daily worship (snāna-viśeṣa) - 6 🌻
4) 🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 106 / DAILY WISDOM - 106 🌹
🌻 15. ఒక అస్పష్టమైన మరియు సూక్ష్మమైన రహస్యము / 15. An Indistinguishable and Subtle Mass of Mystery 🌻
5) 🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 372 🌹*
6) 🌹. శివ సూత్రములు - 108 / Siva Sutras - 108 🌹
🌻 2-07. మాతృక చక్ర సంబోధః - 11 / 2-07. Mātrkā chakra sambodhah - 11 🌻
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹 06, జూలై, JULY 2023 పంచాగము - Panchagam 🌹*
*శుభ గురువారం, బృహస్పతి వాసరే, Thursday*
*మనందరికి ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని పరమాత్మని స్మరిస్తూ - ప్రసాద్ భరద్వాజ*
*🌺. పండుగలు మరియు పర్వదినాలు : సంకష్టి చతుర్థి, Sankashti Chaturthi 🌺*
*🍀. శ్రీ దత్తాత్రేయ సహస్రనామ స్తోత్రం - 13 🍀*
*25. దత్తాత్రేయో దేవదత్తో యోగీ పరమభాస్కరః |*
*అవధూతః సర్వనాథః సత్కర్తా పురుషోత్తమః*
*26. జ్ఞానీ లోకవిభుః కాంతః శీతోష్ణసమబుద్ధకః |*
*విద్వేషీ జనసంహర్తా ధర్మబుద్ధివిచక్షణః*
🌻 🌻 🌻 🌻 🌻
*🍀. నేటి సూక్తి : అనుగ్రహం హక్కు కాదు - సక్రమమైన సుదీర్ఘ సాధనకూ, ఆత్మచైతన్య వికాసానికీ ముందే కారణం తెలియ రాకుండా భగవత్సాక్షాత్కారం కలిగే యెడల భగవంతుని అనుగ్రహంగా దానిని పేర్కొన వలసివుంటుంది. అయితే, అట్టి అనుగ్రహం ఏ సాధకుడూ తనకు హక్కు ఉన్నట్టు భగవంతునిపై విధించి సంపాదించేది కాదు. 🍀*
🌷🌷🌷🌷🌷
విక్రమ: 2080 నల, శఖ: 1945 శోభన
కలియుగాబ్ది : 5124, శోభకృత్,
గ్రీష్మ ఋతువు, ఉత్తరాయణం,
ఆషాఢ మాసం
తిథి: కృష్ణ తదియ 06:31:06
వరకు తదుపరి కృష్ణ చవితి
నక్షత్రం: ధనిష్ట 24:26:19 వరకు
తదుపరి శతభిషం
యోగం: ప్రీతి 24:00:58 వరకు
తదుపరి ఆయుష్మాన్
కరణం: విష్టి 06:31:06 వరకు
వర్జ్యం: 06:31:50 - 07:57:46
మరియు 30:59:18 - 32:26:42
దుర్ముహూర్తం: 10:09:23 - 11:01:55
మరియు 15:24:35 - 16:17:07
రాహు కాలం: 13:59:13 - 15:37:43
గుళిక కాలం: 09:03:43 - 10:42:13
యమ గండం: 05:46:44 - 07:25:13
అభిజిత్ ముహూర్తం: 11:54 - 12:46
అమృత కాలం: 15:07:26 - 16:33:22
సూర్యోదయం: 05:46:44
సూర్యాస్తమయం: 18:54:42
చంద్రోదయం: 21:51:36
చంద్రాస్తమయం: 08:35:21
సూర్య సంచార రాశి: జెమిని
చంద్ర సంచార రాశి: మకరం
యోగాలు: శ్రీవత్స యోగం - ధన
లాభం, సర్వ సౌఖ్యం 24:26:19 వరకు
తదుపరి వజ్ర యోగం - ఫల ప్రాప్తి
దిశ శూల: దక్షిణం
✍️. శ్రీ వక్కంతం చంద్రమౌళి
🌻 🌻 🌻 🌻 🌻
*🍀. నిత్య ప్రార్థన 🍀*
*వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ*
*నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా*
*యశివ నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా*
*తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం*
*తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ*
*విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.*
🌹🌹🌹🌹🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శ్రీమద్భగవద్గీత - 394 / Bhagavad-Gita - 394 🌹*
*✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ*
*🌴. 10వ అధ్యాయము - విభూతి యోగం - 22 🌴*
*22. వేదానాం సామవేదోస్మి దేవానామస్మి వాసవ: |*
*ఇన్ద్రియాణాం మనశ్చాస్మి భూతానామస్మి చేతనా ||*
🌷. తాత్పర్యం :
*నేను వేదములలో సామవేదమును, దేవతలలో స్వర్గాధిపతియైన ఇంద్రుడను, ఇంద్రియములలో మనస్సును, జీవుల యందలి ప్రాణమును (చైతన్యమును) అయి యున్నాను.*
🌷. భాష్యము :
*భౌతికపదార్థము మరియు ఆత్మ నడుమ భేదమేమనగా భౌతికపదార్థము జీవునివలె చైతన్యమును కలిగియుండదు. అనగా ఈ చైతన్యము దివ్యమును మరియు నిత్యమును అయి యున్నది. అట్టి చైతన్యమెన్నడును భౌతికపదార్థ సమ్మేళనముచే ఉద్భవించదు.*
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Bhagavad-Gita as It is - 394 🌹*
*✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj*
*🌴 Chapter 10 - Vibhuti Yoga - 22 🌴*
*22. vedānāṁ sāma-vedo ’smi devānām asmi vāsavaḥ*
*indriyāṇāṁ manaś cāsmi bhūtānām asmi cetanā*
🌷 Translation :
*Of the Vedas I am the Sāma Veda; of the demigods I am Indra, the king of heaven; of the senses I am the mind; and in living beings I am the living force [consciousness].*
🌹 Purport :
*The difference between matter and spirit is that matter has no consciousness like the living entity; therefore this consciousness is supreme and eternal. Consciousness cannot be produced by a combination of matter.*
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 241 / Agni Maha Purana - 241 🌹*
*✍️. పుల్లెల శ్రీరామచంద్రుడు, 📚. ప్రసాద్ భరద్వాజ*
*శ్రీ గణేశాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ.*
*ప్రథమ సంపుటము, అధ్యాయము - 72*
*🌻. స్నానతర్పణాది విధి కధనము - 6 🌻*
*పిమ్మట ఈ క్రింది వాక్యములు చదువుచు, సనకాది మునులకు (రెండేసి అంజలులు ఇచ్చుచు) తర్పణము చేయవలెను - ''ఓం షాం సనకాయ వషట్; ఓం హాం సనన్దనాయ వషట్; ఓం హాం సనాతనాయ వషట్; ఓం హాం సనత్కుమారాయ వషట్; ఓం హాం కపిలాయ వషట్; ఓం హాం పఞ్చశిఖాయ వషట్; ఓం హాం ఋభ##వే వషట్'' అను వాక్యములు చదువుచు దగ్గరగా ఉంచిన చేతుల కనిష్ఠికామూల భాగములనుండి జలాంజలి ఈయవలెను. ''ఓం హాం సర్వేభ్యో భూతేభ్యో వషట్'' అను మంత్రముచే వషడ్రూపభూతగణములకు తర్పణము చేయవలెను. పిమ్మట యజ్ఞోపవీతమును కుడిభుజముపై ఉండునట్లులు వేసికొని ప్రాచీనావీతి రెండుగా మణచిన కుశ మూలాగ్రముల నుండి తిలసహిత జలమును మూడేసి పర్యాయములు దివ్యపితృదేవతకలు అర్పించి తర్పణము చేయవలెను. ''ఓం హాం కవ్యవాహనాయ స్వధా; ఓం హాం అనలాయ స్వధా; ఓం హాం సోమాయ స్వధా; ఓం హాం యమాయ స్వధా; ఓం హాం అర్యవ్ణుె స్వధా; ఓం హాం అగ్నిష్వాత్తేభ్యః స్వధా; ఓం హాం బర్హిషద్భ్యః స్వధా; ఓం హాం ఆజ్యపేభ్యః స్వధా'' ఇత్యాదిమంత్రము లుచ్చరించుచు విశిష్ట దేవతలకు వలెనే దివ్య పితృదేవతలకును తర్పణము లీయవలెను.*
*''ఓం హాం ఈశానాయ పిత్రే స్వధా'' అని చెప్పి తండ్రికిని, ఓం హాం పితామహాయ స్వధా'' అని చెప్పి పితామహునకును, ''ఓం హాం శాన్తప్రపితామహాయ స్వధా'' అని చెప్పి ప్రపితామహునకును తర్పణము లీయవలెను. సమస్త ప్రేతపితృదేవతలకును ఈ విధముగనే తర్పణము చేయవలెను. ఎట్లనగా - ''ఓం హాం పితృభ్యః స్వధా; ఓం హాం పితామహేభ్యః స్వధా; ఓం హాం ప్రపితామహేభ్యః స్వధా; ఓం హాం పృద్ధప్రపితామహేభ్యః స్వధా; ఓం హాం మాతృభ్యః స్వధా; ఓం హాం మాతామహేభ్యః స్వధా; ఓం హాం ప్రమాతామహేభ్యః స్వధా; ఓం హాం వృద్ధమాతామహేభ్యః స్వధా; ఓం హాం సర్వేభ్యః పితృభ్యః స్వధా; ఓం హాం సర్వేభ్యః జ్ఞాతిభ్యః స్వధా, ఓం హాం సర్వాచార్యేభ్యః స్వధా; ఓం హాం దిగ్భ్యః స్వధాః ఓం హాం దిక్పతిభ్యః స్వధా; ఓం హాం సిద్ధేభ్యః స్వధాః ఓం హాం మాతృభ్యః స్వధా; ఓం హాం గ్రహేభ్యః స్వధా; ఓం మాం రక్షోభ్యః స్వధా'' - ఈ వాక్యముల నుచ్చరించుచు క్రమముగ పితృ-పితామహ-ప్రపితామహ-వృద్ధ ప్రపితామహ - మాతృ - సర్వజ్ఞాతి - సర్వాచార్య - సర్వదిక్ - దిక్పతి - సిద్ధ - మాతృకా - గ్రహ - రాక్షసులకు తర్పణము లీయవలెను.*
*అగ్ని మహాపురాణమునందు స్నానతర్పణాదివిధి యను డెబ్బదిరెండవ అధ్యాయము సమాప్తము.*
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Agni Maha Purana - 241 🌹*
*✍️ N. Gangadharan 📚. Prasad Bharadwaj *
*Chapter 72*
*🌻 Mode of bathing and daily worship (snāna-viśeṣa) - 6 🌻*
45. Vauṣaṭ to all spirits. One should (offer water of oblations) to the spirits, gods, and manes with the sacred thread placed on the right shoulder and with the tips of the kuśa and sesamum.
46. (Oblation should be offered) to the fire, the conveyor of offerings, to Soma, to Yama, to Aryamā, (the manes), Agni-manes, Agniṣvātta (and) Barhiṣada with the addition of svadhā (food).
47. (Oblations should be given) to (the manes) Ājyapa, Soma and to all manes as it would be done for the gods. Oṃ, hāṃ to Īśāna, the svadhā (food) should be offered to the (manes) (departed) father and grand-father.
48. (Oblations should be offered) to the great-grandfather and the manes in the form of preta (the form of the manes during the period of obsequies after one’s death), the fathers, grandfathers, and great grand-fathers.
49-50. Food oblations (should be given) to great-greatgrand-fathers, mother side relatives such as the maternal grandfathers, great-grandfathers, great-great-grandfathers and all manes. Food oblation (should be offered) to all departed paternal relatives, preceptors, to different quarters of heaven, to their lords, to the divine mothers and to demons.
Continues....
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 106 / DAILY WISDOM - 106 🌹*
*🍀 📖 . ఆత్మ యొక్క ఆరోహణ నుండి 🍀*
*✍️. ప్రసాద్ భరద్వాజ*
*🌻 15. ఒక అస్పష్టమైన మరియు సూక్ష్మమైన రహస్యము 🌻*
*మనస్సు మరియు శరీరం మధ్య సంబంధం యొక్క సమస్యకు పరిష్కారం బహుశా మానవ జీవి యొక్క మూలాల యొక్క లోతైన అధ్యయనంలో వెతకవచ్చు. ఖగోళ శాస్త్రం మరియు జీవ శాస్త్రం మానవ జీవి అణువు లేదా పరమాణువు అని పిలువబడే ఒక అవిభాజ్య పదార్థం యొక్క ఎదిగిన రూపం అని చెప్తాయి. ఉనికి యొక్క ఈ ఆదిమ స్థితిలో, పదార్థం మరియు చైతన్యం మధ్య, శరీరం మరియు మనస్సు మధ్య ఒక గీతను గీయడం అసాధ్యం. ఎందుకంటే ఇక్కడ ఉనికి అనేది ఒక అస్పష్టమైన మరియు సూక్ష్మమైన అవ్యక్త దశలో ఉన్నట్లు కనిపిస్తుంది.*
*ప్రపంచాన్ని శాసించే ధృఢ నిశ్చయత, వైజ్ఞానిక మేధస్సు, తత్వ వివేకం మొదలైన ఈ అద్భుత విషయాలు వాటి సూక్ష్మ రూపంలో ఒక కణంలో నిక్షిప్తమై ఉండడం ఆశ్చర్యకరమైన విషయం కాదా? ఒక చిన్న విత్తనంలో శక్తివంతమైన మరియు విస్తృతంగా వ్యాపించే మర్రి చెట్టు ఉనికిని ఎలా వివరించవచ్చు? ఆలోచన యొక్క మూలం, శరీరం యొక్క మూలం, దాని నిర్మాణం ఇలాగే ఉండవచ్చా?*
*కొనసాగుతుంది...*
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 DAILY WISDOM - 106 🌹*
*🍀 📖 The Ascent of the Spirit 🍀*
📝 Swami Krishnananda
📚. Prasad Bharadwaj
*🌻 15. An Indistinguishable and Subtle Mass of Mystery 🌻*
*The solution to the problem of the relation between the mind and the body is perhaps to be sought in a deeper study of the sources of the human organism itself. Investigations in the field of astrophysics and the science of life at the biological level have revealed that the human individual is a developed form of what was originally a united substance, call it an atom or cell. In this primordial condition of existence it would be impossible to draw a line between matter and consciousness, between body and mind, for here existence appears to be at the stage of an indistinguishable and subtle mass of mystery.*
*Is it not a wonder that poetic genius, scientific acumen and philosophic wisdom, which shake the world of mankind with their force of impact and power of conviction, should be hidden latently in a microscopic cellular form of sperm or gene or chromosome? How could one explain the presence of a mighty and wide-spreading banyan tree in an insignificantly small seed thereof? Could the origin of thought and the origin of the body be identical in its structure and formation?*
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 372 🌹*
*✍️. సౌభాగ్య 📚. ప్రసాద్ భరద్వాజ*
*🍀. సత్యం ఎప్పుడూ అనుభవంగానే వుంటుంది. దాన్ని గురించి చెప్పలేం కానీ దాన్ని పట్టుకోవచ్చు. ఎవరయితే చురుగ్గా వుంటారో వాళ్ళు దాని మెరుపుల్ని చూస్తారు. 🍀*
*మేలుకొన్న ప్రతి వ్యక్తి మనుషుల పట్ల అపూర్వమయిన అనురాగం ప్రదర్శిస్తాడు. తనకు వీలయినంత మేర ప్రయత్నిస్తాడు. అతని అనుభవంలో అవ్యక్తమయినది వుంటుంది. అది తెలుసుకోవాలనుకున్న వ్యక్తి దాన్ని అనుభవానికి తెచ్చుకోవాలి. సత్యం ఎప్పుడూ అనుభవంగానే వుంటుంది. నువ్వు నక్షత్రాలతో నిండి వుంటావు. పూలతో నిండి వుంటావు. కానీ వాటిని యితరులకు అందించడానికి అసమర్థుడుగా వుంటావు. అది అవ్యక్తం. ఎవరయితే చురుగ్గా వుంటారో వాళ్ళు దాని మెరుపుల్ని చూస్తారు. దాన్ని గురించి చెప్పలేం కానీ దాన్ని పట్టుకోవచ్చు.*
*సశేషం ...*
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శివ సూత్రములు - 108 / Siva Sutras - 108 🌹*
*🍀. శివ ఆగమ తత్వశాస్త్రం యొక్క సూత్రములు 🍀*
*2వ భాగం - శక్తోపాయ*
*✍️. ప్రసాద్ భరధ్వాజ*
*🌻 2-07. మాతృక చక్ర సంబోధః - 11 🌻*
*🌴. ఒక గురువు సహాయంతో, యోగి మాతృక చక్ర జ్ఞానాన్ని మరియు మంత్ర శక్తులను స్వీయ-శుద్ధి మరియు స్వీయ-సాక్షాత్కారం కోసం ఎలా ఉపయోగించాలో తెలుసుకుంటాడు. 🌴*
*శివుడు ఈ దశలో నపుంసక స్థితిలో ఉన్నాడని చెప్పబడింది, ఎందుకంటే అతను పట్టుకున్న ఆలోచన కారణంగా అతని సృష్టించే సామర్థ్యం తగ్గిపోతుందనే భావన అతనికి ఉంది. కానీ దీనికి విరుద్ధంగా, శివుడు జ్ఞానం మరియు ఆనందంతో నిండి ఉన్నాడు మరియు అతని తేజస్సు ఎప్పటికీ తగ్గదు. అతని తేజస్సు పెరగదు, తగ్గదు. అతను మార్పులకు అతీతుడు. అతను ఇప్పుడు సృష్టించకపోతే, అతను అపఖ్యాతి పాలవుతాడని అతను ఇప్పుడు భావించడం ప్రారంభించాడు. తన సర్వోన్నత అధికారాన్ని స్థాపించడానికి, అతను తన పదకొండవ కదలికను చేస్తాడు. శివుని ఈ కదలిక అతని మునుపటి కదలికల కంటే శక్తివంతమైనది.*
*కొనసాగుతుంది...*
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Siva Sutras - 108 🌹*
*🍀Aphorisms of philosophy of Shiva āgama 🍀*
Part 2 - Śāktopāya.
*✍️. Acharya Ravi Sarma, 📚. Prasad Bharadwaj*
*🌻 2-07. Mātrkā chakra sambodhah - 11 🌻*
*🌴. With the help of an guru, a yogi gains the knowledge of matruka chakra and how to harness the mantra shaktis, for self-purification and self-realization. 🌴*
*Śiva at this stage is said to be in the eunuch state as He has the imbibed feeling that due to His apprehended thought that His capacity to create may be lessened. But on the contrary, Śiva is full of knowledge and bliss and His splendour can never be lessened. His splendour can neither increase nor decrease. He is beyond changes and modifications. He now begins to feel that if He does not create now, he would be discredited. In order to establish His Supreme authority, He makes His eleventh movement. This movement of Śiva is more powerful than His previous movements.*
*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
Join and Share
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom
https://t.me/+9zDjTpPe_PQzMWVl
https://t.me/Sivasutras
https://t.me/Seeds_Of_Consciousness
https://t.me/bhagavadgeethaa/
https://t.me/AgniMahaPuranam
https://t.me/+LmH1GyjNXXlkNDRl
http://www.facebook.com/groups/srilalithachaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/
https://prasadbharadwaj.wixsite.com/dailybhaktimessages2
https://chaitanyavijnanam.tumblr.com/
https://prasadbharadwaj.wixsite.com/lalithasahasranama