అదే చైతన్యం.. అదే ఆత్మ

అదే చైతన్యం.. అదే ఆత్మ

భగవాన్ చెప్పింది ఒక్క విషయం నిరంతరం స్ఫురణలోకి తెచ్చుకోవాలి..... బాహ్య ప్రపంచంలో జరుగుతున్న ది నీద్వారా జరగటం లేదు నడిపించేది అంతా వాడే...

నీవు శరీరంతో తధ్యాత్మ చెంది నేను..నేనే చేస్తున్నాను అనే భావన తో  ఉండి కర్మ చేస్తున్నాను అనుకొని మాయలో పడుతున్నావు...

కానీ గాఢ నిద్రలో నీ ప్రమేయం లేకుండా నే అంతా జరిగిపోతున్నది.. నీలో ప్రాణం నిలిపేది ఎవడు.. వాడు అంటూ ఒకడున్నాడు కదా ..

అదే చైతన్యం.. అదే ఆత్మ.. వాడే దేవుడు... నిద్ర నుండి లేచిన తరువాత ఈ దేహం నాది అది నాది ఇది నాది అనుకుంటూ మాయ లో పడుతున్నావు... అలా కాకుండా నేను వున్నాను..

కానీ లోపల ఒకడున్నాడు అనుకుంటూ.. ఈ నేను.. ఆ నేను తో ఒకటై పోయి ఎరుకలో ఉండటమే సాధన

అద్భుతమైన లైఫ్ ఖచ్చితంగా ఇలా సాధ్యం

*అద్భుతమైన లైఫ్
ఖచ్చితంగా ఇలా సాధ్యం!*

ఈ క్షణం మీరెలా ఫీలవుతున్నారు? అద్భుతంగానా, డిజప్పాయింటెడ్‌గానా, బోర్‌గానా, చిరాకుగానా…? ఒక్కసారి అనలైజ్ చేసుకోండి. ఖచ్చితంగా మన లైఫ్‌ని డిసైడ్ చేసే అతి పెద్ద ఫేక్టర్ ఇది.

బ్రెయిన్‌కి పంపించబడాల్సిన instructions చాలాసార్లు తప్పుగా హైజాక్ అవుతుంటాయి. అందుకే మనం ఫెయిల్యూర్డ్ పీపుల్‌గా మిగిలిపోతున్నాం. ఇంకో మాటలో చెప్పాలంటే *“నెగిటివ్ ప్రోగ్రామింగ్”* చేయబడుతోంది బ్రెయిన్.

*బ్రెయిన్‌కి మంచీ చెడూకి మధ్య తేడా తెలీదు. మనం ఏది చెయ్యమంటే అది గుడ్డిగా చేస్తుంది.*

చిన్న ఉదాహరణ చెప్పాలంటే, మీరు *“ఈ మధ్య జనాల పేర్లు మర్చిపోతున్నాం” అని రిపీటెడ్‌గా అనుకుంటూ ఉన్నారనుకోండి.. బ్రెయిన్ అలాగే ప్రోగ్రామింగ్ చెయ్యబడుతుంది.* మీరు గుర్తుంచుకోవాలని ట్రై చేసిన ప్రతీసారీ గుర్తుంచుకోవలసిన పేరుని డెఫినెట్‌గా మర్చిపోయి… మన నెగిటివ్ ప్రోగ్రామింగ్‌ని విజయవంతంగా ప్రాసెస్ చేసి పారేస్తుంది బ్రెయిన్.

మీకు హెల్త్ బాలేదని అనుకుంటూ ఉండండి…. ఖచ్చితంగా ఏదో ఒక సమస్య వస్తుంది. *“బాలేదు బాలేదు” అనుకుంటున్న క్షణం నుండి బ్రెయిన్ వివిధ organsకి ఆదేశాలు జారీచేసి, బాడీ మెటబాలిజాన్ని తారుమారు చేసి ఏదో ఒక discomfort తలెత్తేలా చేసి తీరుతుంది.* దానికి మనం అప్పజెప్పిన task ఏదైతే ఉందో… “మన హెల్త్ బాలేదని” దాన్ని కంప్లీట్ చెయ్యడమే దాని లక్ష్యం.
————
చాలామంది ఉద్యోగాలు రావట్లేదనో, లైఫ్‌లో తాము ఎందుకూ పనికిరామనో, సంతోషం అంటే ఏమిటో తెలీదనో.. *రకరకాల మెంటల్ ట్రాప్‌లలో ఇరుక్కుపోతుంటారు.* ఇవి రిపీటెడ్ సజెషన్లని బ్రెయిన్‌కి పంపిస్తుంటాయి. దాంతో ఉద్యోగం కోసం ట్రై చేసే ప్రతీ ప్రయత్నంలోనూ ఏదో ఒక లోపం ఆటోమేటిక్‌గా వచ్చేస్తుంది, సంతోషంగా ఉండాలని ఎంత ప్రయత్నించినా చిరాకుగానే ఉండిపోతుంటాం.
————–
ప్రతీ క్షణం మన ఆలోచనల ద్వారానో, నోటితో మాటల ద్వారానో ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటాం. ఆ ఆలోచనలు ప్రోగ్రామింగ్ లాంటివి. *ఈ ప్రోగ్రామింగ్‌లో పాజిటివ్ ఏటిట్యూడ్ సాధించగలిగితే ఖచ్చితంగా ప్రతీ క్షణం చాలా అద్భుతంగా ఉంటుంది.*

అంటే *మనల్ని మనం blame చేసుకోవడం తగ్గించాలి, ఇతరులు మనల్ని చులకన చేస్తూ మాట్లాడే వాటిని బ్రెయిన్‌కి తీసుకుని కుంగిపోవడం తగ్గించాలి.* ఎంత నెగిటివ్ ఎనర్జీ మనం లోపలకు పంప్ చేస్తే అంత నెగిటివ్ output వస్తుంది. సరిగ్గా అలాగే *ఎంత పాజిటివ్ ఎనర్జీ పంప్ చేస్తే అంత పాజిటివ్ output వస్తుంది.*

ఇక్కడా మరో చిన్న ఉదాహరణ తీసుకుంటే… ఓ పబ్లిక్ గేదరింగ్‌లో అందరితో కలవలేక ఓ మూలన ఇరుక్కుంటే అందరూ సంతోషంగా ఉన్నట్లు కన్పిస్తారు. మనం ఒంటరిగా ఉన్న ఫీలింగ్ ఉంటుంది. అరమరికలు మర్చిపోయి మనుషుల మధ్య దూసుకుపోతే మన సంతోషం ముందూ, కలివిడితనం ముందూ అందరూ సరెండర్ అయిపోతారు.

సో *లైఫ్‌లో ప్రతీ క్షణం ఏ సిట్యుయేషన్‌ని ఎలా లీడ్ చేయాలన్నది మన చేతిలోనే ఉంటుంది. సో ఎలాంటి ఛాయిస్ తీసుకుంటే లైఫ్ అలా ఉంటుంది.*

*ప్రోగ్రామింగ్ ట్రాప్ అని మరొకటి ఉంటుంది. ఏదైనా సంఘటన జరిగిన వెంటనే దానికి సంబంధించిన పాత జ్ఞాపకాలూ, అనుభవాలూ ఏమైనా మన బ్రెయిన్ డేటాబేస్‌లో ఉన్నాయేమో బ్రెయిన్ చకాచకా స్కాన్ చేస్తుంది.*

ఉదా.కు.. రోజూ మీకు టీ తాగే అలవాటు ఉంటే గతంలో ఎప్పుడో ఓరోజు సాయంత్రం టీ తాగలేదనుకుందాం. బాగా తలనొప్పి వచ్చి ఉంటుంది.

సో ఈరోజు మీరు మళ్లీ టీ తాగలేదనుకుందాం. వాస్తవానికి తలనొప్పి వచ్చే అవకాశం లేకపోయినా.. *బ్రెయిన్ ఒక కండిషన్‌కి ఓ రిజల్ట్‌ని match చేసుకుని ఆ outcome ఎలాగైనా సాధించి పెడుతుంది.*

ఇక్కడ కండిషన్ ఏంటంటే.. టీ తాగలేదు.

రిజల్ట్స్ ఏమిటంటే తలనొప్పి రావాలి.

సో తలనొప్పి వచ్చే ఛాన్స్ లేకపోయినా డేటాబేస్‌లోని పాత రికార్డుల ప్రకారం శరీరంలో బయలాజికల్ మార్పులను సృష్టించి మొత్తానికి తలనొప్పి తెప్పించేస్తుంది.
————
*సో ప్రతీ కండిషన్‌నీ, ప్రతీ అనుభవాన్నీ, ప్రతీ రోజునీ, ప్రతీ క్షణాన్నీ కొత్తగా చూస్తే, కొత్తగా రెస్పాండ్ అవుతూ పోతే బ్రెయిన్ డేటాబేస్‌లోని పాత రికార్డులూ, పనికిమాలిన చేదు జ్ఞాపకాలూ అన్నీ కొట్టుకుపోతాయి. లైఫ్ ఎప్పుడూ కొత్తగా ఉంటుంది.. ఇప్పుడే లైఫ్ మొదలెట్టినంత తాజాగా ఉంటాం.*

జీవితం అందమైనది...ఆనందంగా జీవించండి

స్వర్గం – మోక్షం

🌹 *స్వర్గం – మోక్షం* 🌹

*మనిషి జీవితానికి లక్ష్యం ఏమిటనే ప్రశ్నకు మన పరంపరలో నాలుగు లక్ష్యాల్ని చెప్పారు.*

*అవి ధర్మం, అర్థం, కామం, మోక్షం అనేవి. ధర్మం అంటే సమాజ నియమాలకు అనుగుణంగా నడుచుకోవడం. అర్థం అంటే జీవితం సుఖంగా నడవడానికి కావల్సిన ధనాన్ని సంపాదించడం. కామం అంటే అన్ని విధాల కోరికలు, వాటిని తీర్చుకునే మార్గాలు ( ఇవి కూడా ధర్మానికి లోబడి ఉండాలి).*

*మోక్షం అంటే వీటన్నిటి నుండి బయటపడి, మనిషి తన స్వరూపమే బ్రహ్మస్వరూపమని తెలుసుకోవడం. కులం, మతం, వర్ణం, ఆశ్రమం మొదలైన అన్ని రకాల సమాజ నిబంధనలకీ అతీతుడై భగవంతుడెలా అన్నింటికీ అతీతుడో అలా వ్యవహరించడం.*

*మొదటి మూడూ సమాజవ్యవహారం సరిగా నడవడానికి కావల్సిన విషయాలు. వ్యవహారదశ (empirical level)అని అంటారు.*

*నాల్గవదైన మోక్షం ఈ వ్యవహారదశను దాటి వెళ్లేది. వేదవిచారం వల్ల కలిగిన జ్ఞానం, దానివల్ల వ్యక్తి ప్రవర్తనలో దృష్టికోణంలో వచ్చిన మార్పు, మనిషే భగవంతుడుగా వ్యవహరించడం. దీన్ని పరమార్థదశ (absolute level) అంటారు.*

*ఉపనిషత్తులు ఒకవైపు శాస్త్రీయంగా విచారం చేస్తూ మరొక వైపు సమాజానికి అవసరమైన విశ్వాసాల్ని కొన్నింటిని సమర్థిస్తూ ముందుకు సాగుతుంది.*

*స్వర్గం అనేది ఇలాంటి విశ్వాసమే. ఇది అన్ని మతాల్లో చెప్పబడిందే. కొన్ని మంచి పనులు చేసి ఈ లోకంలో ఎలా సుఖశాంతులు సంపాదిస్తామో అలాగే మరొక విధమైన మంచిపనులు (కర్మలు) చేసి స్వర్గాన్ని సంపాదించవచ్చని అన్నిమతాలూ చెబుతాయి.*

*భారతంలో (వనపర్వంలో) ఇంద్రద్యుమ్నుడు అనే రాజు కథ ఉంది. ఆ రాజు కొన్ని లక్షలకొలదీ యాగాలు చేసి వాటి ఫలితంగా చాలా ఏండ్లు స్వర్గంలో గడిపిన తర్వాత దేవతలు ఒకనాడు ఆయన పుణ్యంఫలం ముగిసిందని లెక్కవేసి, అతడిని భూలోకానికి పంపడానికి ప్రయత్నించారు. తన పుణ్యం బ్యాలెన్స్‌ ఇంకా ఉందని ఆయన వాదం.*

*భూలోకంలో ఎంతకాలం ఒక మనిషి కీర్తి ఉంటే అంతకాలం స్వర్గంలో ఉండవచ్చని ఒక నియమం. అందువల్ల భూమిపై ఇంకా ఆ రాజు కీర్తి ఉందా లేదా అని పరీక్షించాల్సి వచ్చింది. ఆ రాజుతో పాటు ఇద్దరు దేవతలు కూడా భూలోకానికి వచ్చారు.* *లోకంలో ఉన్న చిరంజీవుల్ని అందరినీ విచారించారు.* *అందరికంటే చిరంజీవి అయిన ఒక తాబేలు ఒకానొక కొలనులో ఉందని తెలిసింది. ఆ తాబేలును విచారించగా అది రాజును గుర్తించి ఎంతో గద్గద స్వరంతో చెప్పింది.*

*ఈ మహానుభావుడు ఎన్నో యాగాలు చేసి లక్షల గోవుల్ని దానం చేశాడు. ఆ గోవుల తొక్కిళ్లతోనూ, దానజలంతోనూ ఈ సరస్సు ఏర్పడింది. ఇది నాకు నివాసమయ్యింది.’ అని చెప్పింది. వెంటనే దివ్యరథం రావడం, రాజు మళ్లీ స్వర్గానికి వెళ్లడం అనేది కథ.*

*దీనర్థం ఏమిటంటే, స్వర్గం కొన్ని మంచిపనులు చేయడం వల్ల సాధింపబడేది. ఆ మంచి పనులు ఎంత ఎక్కువ ఉంటే అంత ఎక్కువ కాలం స్వర్గసుఖాలు ఉంటాయి. వీటిలో గొప్పదనం ఏమీ లేదు. ఇక్కడికన్నా ఎక్కువ సుఖాలు, మంచి భోజనం, డ్యాన్సులు వగైరా సమాజంలో తన కర్తవ్యాన్ని (ధర్మాన్ని) తాను చేస్తూ పుణ్యకార్యాలు చేస్తే స్వర్గం వస్తాయని మతం స్థాయిలో ఉన్న విశ్వాసం.*

*ఏది ఏమైనా, పుణ్యం కాస్తా అయిపోయాక వీసా అయిపోయిన వాడిలాగే స్వర్గం నుండి వెనక్కి రావాలి. అందువల్ల స్వర్గం కూడా కామం అనే హెడ్డింగ్‌ క్రిందకు వస్తుంది.*

*మోక్షం దీనికి పూర్తిగా బిన్నమైనది. ఇది కామం (కోరిక) కాదు. దీనిలో ఎక్కడా దేన్నీ పొందడం అనేది లేదు. వెళ్లడం అనేది లేదు. ఎక్కడో పెళ్లి సుఖాలు పొందేది లేదు. ఉన్నచోటే తన అసలు స్వరూపాన్ని తెలుసుకుని అన్ని రకాల కట్టుబాట్లనుండి, బంధాలనుండి, మనస్సులో నిర్మించుకున్న అడ్డుగోడల నుండి బయటకు వచ్చి ఉండడం.*

*కట్టుబాట్లు లేవంటే ఎలాంటి నియమాలూ లేకుండా ఇష్టం వచ్చి వచ్చినట్లు ప్రవర్తిస్తూ ఉంటాడని అర్థం కాదు. భగవంతునికి ఎలాగైతే రాగద్వేషాలూ, ఈర్ష్య, అసూయలు, కోరికలు మొదలైనవి లేవో తనూ అలాంటి దశకు రావడానికై చాలా కాలంగా వైరాగ్యాన్ని అభ్యాసం చేసి మనస్సును ఎంతో పవిత్రం చేసుకున్నట్టి స్థితి అది. ఇలాంటి పవిత్రమైన మనస్సు ఉన్న వ్యక్తి అందరికన్నా ఎక్కువగా ధర్మాన్ని ఆచరిస్తూ ఉంటాడు.*

*అందరిలోనూ దేవుణ్ని దర్శిస్తూ ఉంటాడు. అందరినీ ప్రేమిస్తూంటాడు. సమాజ నియమాల్ని పాటిస్తూంటాడు.*

*ఈనాటి మాటల్లో దీన్ని enlightenment అంటాం. అంటే మనిషి తను ఫలానా జాతి, కులానికి చెందినవాడ్ని, ఇంత గొప్పవాడ్ని, ఇంత మేధావిని అనే బరువులన్నీ వదిలేసి లైట్‌గా, అంటే బరువులు తగ్గించుకుని ఉండడం.*

*మోక్షం కేవలం పుస్తకజ్ఞానం వల్ల కలిగేది కాదు. వైరాగ్యాన్ని అభ్యాసం చేయడం వల్లనే మనస్సులో ఒక క్రమశిక్షణ ఏర్పడుతుంది. దీన్ని వేదాంత భాషలో చిత్తశుద్ధి అంటారు. ఆ స్థితిలో మనిషి తన స్వరూపాన్ని గూర్చి, భగవంతుడి గూర్చి ఉపనిషత్తులు చెప్పిన విషయాల్ని గురువు దగ్గర తెలుసుకోవడం, తెలుసుకున్న విషయాల్ని మననం చేసుకుంటూ అనుభవంలోకి తెచ్చుకోవడం ముఖ్యమైనవి.*

*తనతో పాటు ప్రపంచాన్నంతా కేవలం బ్రహ్మస్వరూపంగా చూడడం, తనను తాను ఎలా ప్రేమించుకుంటాడో అందరినీ అలాగే చూడడం సహజంగా వస్తుంది. దీన్ని గీత ఆరవ అధ్యాయంలో ‘ఆత్మౌపమ్యం’ అనే మాటతో శ్రీకృష్ణుడు చెబుతాడు.*

*మనిషి ఏదో స్వార్థంతో పొందేది కాదు మోక్షం. స్వార్థం నుండి బయటపడడం, చివరకు తన ఐడెంటిటీని కూడా కోల్పోవడం మోక్షం లక్షణం.*

*స్వర్గం అనే మాటను రిలిజియన్‌ స్థాయిలో (అనగా తాత్కాలిక స్థాయిలో) వేదాంతం అంగీకరిస్తుంది. చిన్నపిల్లల్ని బడికి పండానికి తల్లి ఎలా లాలిపాప్‌ ఇచ్చి పంపుతుందో, అలాగే సమాజంలో మనిషిని మంచి మార్గంలో పెట్డడానికి స్వర్గమనే లాలిపాప్‌ ఉందని భాగవతం చెబుతుంది. స్కూలుకు వెళ్లి చదువుపై శ్రద్ధ మొదలైన తర్వాత లాలిపాప్‌పై శ్రద్ధ ఎలా తొలగిపోతుందో అలాగే జ్ఞానమార్గంలో వచ్చినవాడికి స్వర్గంపై కోరిక తొలగి పోతుంది.*

*దీనివల్ల ముఖ్యంగా మనం గమనించేదేమంటే స్వర్గమనేది కొన్ని కర్మ (మంచిపనుల)ల వల్ల పొందబడేది. కానీ, మనిషి స్వార్థం సమసిపోలేదు. స్వార్థం పూర్తిగా సమసిపోయి సమాజానికి హితమైన పనుల్ని చేస్తూ జ్ఞానమార్గంలోన ఉన్నవాడు పై చెప్పిన మోక్షమనే స్థాయికి వస్తాడు.*
🌹 🌹 🌹 🌹 🌹 🌹 🌹
🙏 ప్రసాద్

పరకాయ ప్రవేశం : దాని ఒక విశేష ప్రయోజనం

🌹 *పరకాయ ప్రవేశం : దాని ఒక విశేష ప్రయోజనం* 🌹

ఈ కళ సిద్ధులలో ఒక అపూర్వమైన కళ.  సిద్ధ పురుషులు అవలంబించే కళ.  ఇందులో విశేషం ఏమిటంటే,  వీటి అన్నిటికి అతీతమైన, కైవల్యపథము తెలిసిన వాళ్లు కూడా...... సామాజిక ప్రయోజనాలకై ఈ  సిద్ధిని చేస్తారు. నాకు తెలిసిన కొందరు అఘోరీలు.... మానవతా దృక్పథంతో ఇది చేస్తూ ఉంటారు.

      "పరకాయం" అంటే కేవలం ఒక మనిషి దేహము నుండి మరో మనిషి దేహంలో ప్రవేశించడమే కానఖ్ఖరలేదు.

      సృష్టిలోని, ఏ ప్రాణి దేహంలోనైనా,  నీ ఉనికికి కారణమైన దేహాన్ని భద్రపరచుకొని  చేసేది.

      మామూలు మనుషులు అంచనా వేయలేని పలు కారణాల కోసం చేస్తారు. ఇందుకు కారణాలను  ఎత్తి చూపడం..... వారి నిమ్న పరిణతిని,  అవగాహనా లోపాన్ని చూపుతుంది.

      ఇది కేవలం ఇది కేవలం దైవానుగ్రహం. ఒకసారి నేను, ఒక ఋషి కలసి, "వీరమేఘనం" అనే ప్రయోగం చేయవలసి ఉంది. ఆయన ఒక కోతి దేహములో, నేను ఒక మర్రి చెట్టు లో ప్రవేశించ వలసి ఉంది. ఇప్పుడు ఆయన నాపై కూర్చుంటారు.  కోతి రూపంలో ఉన్న ఆయన  నాపై కూర్చున్నాక...... మేమిరువురం ధ్యానిస్తూ ప్రయోగం చేయాలి.

      ఇటువంటి బాహ్య శరీర  అనుభూతులు ఎన్నో...... మేము దైవానుగ్రహం వల్ల అనుభవించాము. పరకాయం ఒక దివ్యానుభూతి. దైవ ప్రార్థన కు ఒక ఉత్తమమైన మార్గము. సాధకుడిచే సాధన చేయించేది కేవలం దైవానుగ్రహము. పరిపూర్ణ దైవానుగ్రహం. ఇది జరిగి కొన్ని ఏళ్ళు అయ్యింది. అడవిలో ఒక ఆషాఢ పూర్ణిమ రోజు నేను ,
ఒక ప్రయోగం చేస్తూ...... ఉండగా కొన్ని సమిధలు పోయాయి. తర్వాత కొంత నెయ్యి, కొన్ని మూలికలు కూడా కనబడలేదు. తర్వాత   కొన్ని సామాన్లు, కొన్ని పాత్రలు ,కొన్ని పరికరాలు పోయాయి. ఆరు నెలల తర్వాత అడవిలో ఒక రాత్రి నన్ను ఎవరో నిద్ర లేపారు. లేచి చూస్తే చాలా పెద్ద వయస్సు ఉన్న ఒక చిన్న మరుగుజ్జు.

      అది నన్ను అనుసరించమని కోరింది. నేను అనుసరించాను. దాదాపు మూడు గంటల తరువాత మేము ఒక చోటుకు వెళ్ళాము. అక్కడ  మరియొక మరుగుజ్జు ఉన్నాడు. వారిరువురు కాసేపు సంభాషించుకున్నాక,  నన్ను కొన్ని ప్రశ్నలు అడిగారు. వాటికి సమాధానం చెప్పాను.

      మీ కోసం, నేను ఆ ప్రయోగం చేయడానికి సిద్ధంగా ఉన్నాను. కానీ అందుకని నాకు కొన్ని సమిధలు,నెయ్యి,పాత్రలు,మూలికలు,సరుకులు,పరికరాలు  కావాలి. అవన్నీ ఆషాఢ పూర్ణిమ నాడు  దొంగిలించబడ్డాయి. అప్పుడు ఒక అద్భుతం జరిగింది. ఎక్కడ నుండో ఒక సాధువు వచ్చి, పోయిన ఆషాఢ పూర్ణిమకు..... నీవు అడవిలో ప్రయోగం చేస్తుండగా.....కొన్ని వస్తువులు పోయాయి. గుర్తుందా?  అవన్నీ ఎక్కడ ఉన్నాయో నాకు తెలుసు. నేను  నిన్ను ఆ ప్రదేశానికి తీసుకుని వెళ్తాను. అప్పుడు ఈ మరుగుజ్జుల కై  ప్రయోగం చేయవచ్చు అన్నారు. మేమంతా అతనితో వెళ్ళాము.

     అతను నట్టడవిలో..... ఎక్కడో, ఏకాంత ప్రదేశానికి మమ్మల్ని తీసుకుని వెళ్లి ఒక "కొమ్ము బూరా" తీసి ఊదాడు. దొంగిలించబడ్డ అన్ని సామాన్లు మోపులుగా కట్టి వ్రేలాడుతుండగా 6 దున్నలు, 2 చిరుతలు అక్కడికి వచ్చాయి.

      సాధువు కూడా మాతో కూర్చొని,  "బ్రహ్మ వాగీశ్వరీ" ప్రయోగం చేయసాగాడు. మరుగుజ్జులు మాకు సహాయపడ్డారు.  అగ్ని లక్షణం దైవానుగ్రహం వల్ల ఎంతో బాగుంది.  "బగళా ముఖి" అనుగ్రహం వల్ల, మృగనయని, కుంభాన్ని అమృతంతో నింపింది.  ఆ కుంభాన్ని.... మేము మరుగుజ్జులకు ఇచ్చాము.

      నేను కళ్ళు మూసుకుని ధ్యానంలో ఉన్నప్పుడు..... అమృత కుంభాన్ని వారు అంబ కి ఇవ్వడం చూశాను.

      అంబ విషాదకు చెప్పింది. విషాద వత్సల తో మాట్లాడింది. వత్సల మరుగుజ్జులను , క్షమించండి.  అప్పుడు మరుగుజ్జులు భూతాలుగా మారి, ధర్మానికి వందనం చేశారు. పరలోక ద్వారాలు తెరువబడ్డాయి.

      అప్పుడు ఆ సాధువు కూడా దానికి నమస్కరించాడు.  వారెవరో కాదు -  చిత్రగుప్తుడు. నేను మిగిలిన కళ్ళు తెరచి చూసే సరికి, ఆ సాధువు ఎంతో ఆత్మీయంగా నాకేసి చూసి నవ్వుతున్నారు. నేను ఆయనకు నమస్కరించ గానే వారు అదృశ్యమైపోయారు .
🌹 🌹 🌹 🌹 🌹

అష్టావక్రగీత అధ్యయము 2

అష్టావక్రగీత

అధ్యయము 2

జనక ఉవాచ
2.1*అహో నిరంజనః శాంతో బోధోఅహం ప్రకృతే పరః*|
*ఏతావంతమహం కాలం మొహేనైవ విడంబితః*||

ఆహా! నేను నిరంజనుడను శాంతుడను ప్రకృతికంటె వేరైన తెలివి స్వరూపుడను ఇంత కలమువరకు మాయవలననే మోసాగింపబడితిని

2.2*యధాప్రకాశయామ్యేకో  దేహమేనంతథా జగత్*|
*అతో మమ జగత్సర్వమదావా న చ కించన*||

ఒక్కడినై ఈ దేహమును అట్లే సమస్త జగత్తును ప్రకాశింపచేయుచున్నాను అందుచేత జగత్తంతయు నేనే లేదా ఏదీయును నేను కాదు

2.3
*సశరీరమహోవిశ్వo పరిత్యజ్యమయాదునా|*
*కుతాశ్చిత్ కౌసలదేవ పరమాత్మావిలోక్యతే*||*

ఆహా! ఇప్పుడు నాచే శరీరముతో సహా జగత్తంతయువిడువబడి ఎట్లో వచ్చిన నేర్పరితనమువలన పరమాత్మను చూడబడుచున్నది

2.4
*యధానతోయతోభిన్నాః తరంగాః పేనబుద్బుదాః|*
*ఆత్మనోన తథాబిన్నం విశ్వమాత్మవినిర్గతమ్*||*

అలలు నురుగు బుడగలు నీటికంటే వేరుకానట్లు ఆత్మనుండి వచ్చిన విశ్వము ఆత్మకంటె వేరుకాదు

2.5
*తంతుమాత్రోభవేదేవ పటోయద్విద్వివిచారిత*|
*ఆత్మతన్మాత్రమేవేదాం తద్వధ్విశ్వంవిచారితమ్*||

విచారించినచో వస్త్రము ధారములు మాత్రమే అయినట్లు విచారించినచో ఈ విశ్వము ఆత్మమాత్రమే

2.6
*యథైవేక్షురసే క్లృప్తా తేన వ్యాప్తైవశర్కరా*|
*తథావిశ్వంమయికృపం మయావ్యాప్తం నిరంతరమ్*||

చేరకురసమునుండి వచ్చు చక్కెరయందు రసమే వ్యాపించి ఉన్నది అట్లే విశ్వము ఎల్లప్పుడు నాయందే నిర్మింపబడి నాచేతనే వ్యాపింపబడి ఉన్నది

2.7
*ఆత్మజ్ఞానాజ్జగద్బాతి ఆత్మజ్ఞానాన్న భాసతే*|
*రజ్జ్వజ్ఞానాదహిర్బాతి తజ్ణ నాద్బాసతే న హి*||

ఆత్మను తెలియకపోవుతావలన జగత్తు తోచుచున్నది ఆత్మజ్ఞానముకలిగినచో జగత్తు తోచదు ఎట్లనగా త్రాడు తెలియకపోవుటవలన పాము తోచుచున్నది తెలిసికొన్నచో తోచదు

2.8
*ప్రకాశోమే నిజంరూపం నాతిరిక్తోఅస్మ్యహం తతః*|
*యదా ప్రకాశతే విశ్వం తదాహం భాస ఏవహి*||

ప్రకాశించుటయే నా నిజమైన రూపము దానికంటే నేను వేరుకాదు విశ్వము తోచునపుడు నేనే ప్రకాశించుచున్నాను

2.9
*అహోవికల్పితం విశ్వo అజ్ఞానాన్మయి భాసతే*|
*రూప్యం శుక్తౌ ఫణీరజ్జౌ వారి సూర్యకరే యధా*||

ఆహా!విశ్వము నాయందు అజ్ఞానమువలన కల్పింపబడి తోచుచున్నది ఎట్లనగాఆలుచిప్పయందు వెండి త్రాడుయందు పాము ఎండమావియందు నీరు వలె

2.10
*మత్తోవినిర్గతం విశ్వం మయ్యేవలయమేష్యతి*|
*మృదికుంభోజలే వీచిః కనకే కటకంయథా*||

నానుండియే విశ్వము బయలువెడలి నాయందే తిరిగి కలసిపోవుచున్నది ఎట్లనగా మట్టియందు కుండ నీటియందు అల బంగారమునందు కడియమువలె

2.11
*అహో అహం నమోమహ్యం వినాశోయస్యనాస్తి మే*|
*బ్రహ్మదిస్తంబపర్యంతం జగన్నాశేఅపి తిష్ఠతః*||

ఆహా నేను! ఏ నేనుకు వినాశములేదో ఏది బ్రహ్మదేవుని మొదలు గడ్డిపోచ వరకు కల జగత్తంతయు నశించినను నిలచిఉండునో అట్టి నాకు నమస్కారము

2.12
*అహో అహం నమోమహ్యం ఏకోఅహం దేహవానపి*|
*క్వచిన్న గంతా నాగంతా వ్యాప్య విశ్వమవస్దితః*||

నేను దేహముతో ఉన్నాను అంతటా ఉన్నాను ఒక్కటిగానే ఉన్నాను ఒకచోటికి పోవుటకాని వచ్చుటకాని లేక విశ్వమంతయు వ్యాపించి ఉన్నాను అట్టి నాకు నమస్కారము
_*జ్ఞాని ప్రాణం విడువరు... దేహాన్ని విడుస్తారు...*

2.13
*అహో అహం నమోమహ్యం దక్షో నాస్తీహ మత్సమః*|
*ఆసంస్పృశ్య శరీరేణ యేన విశ్వం చిరం ధృతమ్*||

ఆహా నేను!శరీరమును అంటుకొనకయే విశ్వమునంతయుచిరకాలమునుండి నిలబెట్టుచున్న 'నేను' కు సాటియైన సమర్థుడు లేడు. అట్టి నాకు నమస్కారము

2.14
*అహో అహం నమోమహ్యం యస్య మేనాస్తి కించన*|
*అధవా యస్య మేసర్వం యాదవాఙ్మనసగోచరం*||

ఆహా నేను!నాది అనునది ఏ కొంచెమున్ను లేదు వాక్కు మనసులచే తెలియబడునదంతయు నాదే అట్టి నాకు నమస్కారము

2.15
*జ్ఞానం జ్ఞేయంతథా జ్ఞాతా త్రితయం నాస్తి వాస్తవం*|
*అజ్ఞానాద్బాతి యత్రేదం సోఅహమస్మి నిరంజనః*||

జ్ఞానము జ్ఞేయము జ్ఞాత అను మూడును వాస్తవముగా లేవు ఎక్కడ ఇదంతయు అజ్ఞానమువలన తోచుచున్నదో అట్టి నేను నిర్మలముగా ఉన్నాను

2.16
*ద్వైతమూలమహో దుఃఖం నాన్యతస్యాఅస్తి భేషజామ్*|
*దృశ్యమేతన్మృషా సర్వం ఏకోఅహం చిద్రసోఅమలః*||

ఆహా దుఃఖమునకు మూలము రెండవది ఉండుటయే ఈ సమస్త దృశ్యము అబద్ధమే నేను ఒక్కటైన నిర్మలమైన తెలివి ఆనందము అను దృష్టే దానికి మందు

2.17
*బోధమాత్రోఅహమజ్ఞానత్ ఉపథిః కల్పితో మాయా*|
*ఏవం విమృశతో నిత్యం నిర్వికల్పే స్దితిర్మమ*||

నేను తెలివి మాత్రమే అజ్ఞానమువలన నాచే ఉపాధి కల్పింపబడినది ఈ విధముగా విచారణచేయు నాకు ఎల్లప్పుడూ నిశ్చలస్దితియే ఉంటున్నది

2.18
*అహోమయి స్దితంవిశ్వo వస్తుతో న మయి స్దితమ్*|
*నమే బందోఅస్తిమోక్షో వాబ్రాంతిః శాంతా నిరాశ్రయా*||

ఆహా విశ్వము నాయందే ఉన్నది కానీ వాస్తవముగా నాయందు లేదు నాకు బంధము లేదు మోక్షమునులేదు నా అశ్రయము పోవుటచే భ్రాంతి శాంతించినది

2.19
*సశరీరమిదం విశ్వం న కించిదతి నిశ్చితం*|
*శుద్ధచిన్మాత్ర ఆత్మా చ తాత్కాస్మిన్ కల్పనాధునా*||

శరీరముతో సహా ఈ విశ్వము కొంచెమును లేనిదనియు ఆత్మ శుద్ధచైతన్యమే అనియు నిశ్చయమైనది ఇక దేనియందు కల్పన?

2.20
*శరీరం స్వర్గనరకౌ బంధమోక్షౌ భయం తథా*|
*కల్పనామాత్రమేవైతత్ కిం మే కార్యం చిదాత్మనః*||

శరీరము స్వర్గనరకములు బంధమోక్షములు భయమును ఊహలుమాత్రమే వీనితో నాకు పని ఏమి?

2.21
*అహో జనసమూహేఅపి న ద్వైతం పశ్యతో మమ*|
*అరన్యమివ సంవృతం క్వ రతిo కరవాణ్యాహమ్*||

ఆహా! జనుల మధ్యన కూడ ద్వైతమును చూడనట్టి నాకు అడవిలోవలె ఉన్నది నేను ఎక్కడ ప్రీతిని ఉంచెదను?

2.22
*నాహందేహో నమే దేహోజీవో నాహామహం హి చిత్*|
*అయమేవ హి మే బంధ ఆసీద్యా జీవితే స్పృహ*||

దేహము నేను కాదు దేహము నాదిన్నీ కాదు నేను జీవుడను కాను నేను తెలివినే బ్రతుకుటయందు ఉండిన ఆసక్తియే బంధమయ్యెను.

2.23
*అహో భువనకల్లోలైర్విచిత్రైర్థాక్ సముత్థితం*|
*మయ్యనంతమహంభోథౌ చిత్తవాతే సముద్యతే*||

ఆహా! నేను అను అంతులేని మహాసముద్రమునందు చిత్తము అను గాలి వీచుచుండగా జగత్తులు అను విచిత్ర తరంగములు త్వరగా పుట్టుచున్నవి

2.24
*మయ్యనంతమహంభోధౌ చిత్తవాతే ప్రశమ్యతి*|
*అభాగ్యాజ్జీవవణిజో జగత్పోతో వినశ్వరః*||

నేను అను అంతులేని మహాసముద్రమునందు చిత్తము అను గాలి ఆగినప్పుడు జీవుడు అను వర్తకుని దురదృష్టమువలన జగత్తు అను పడవ గిట్టుచున్నది

2.25
*మయ్యనంతమహంభోధౌ ఆశ్చర్యం జీవవీచయః*|
*ఉద్యంతి ఘ్నంతి ఖేలంతి ప్రవిశంతి స్వభావతః*||

ఆశ్చర్యము నేను అను మహాసముద్రమునందు జీవులు అను అలలు స్వభావమువలన లేచుచున్నవి కొట్టుకొనుచున్నవి ఆదుకొనుచున్నవి ఆగిపోవుచున్నవి.

          అధ్యాయము 2 సమాప్తము