అష్టావక్రగీత
అధ్యయము 2
జనక ఉవాచ
2.1*అహో నిరంజనః శాంతో బోధోఅహం ప్రకృతే పరః*|
*ఏతావంతమహం కాలం మొహేనైవ విడంబితః*||
ఆహా! నేను నిరంజనుడను శాంతుడను ప్రకృతికంటె వేరైన తెలివి స్వరూపుడను ఇంత కలమువరకు మాయవలననే మోసాగింపబడితిని
2.2*యధాప్రకాశయామ్యేకో దేహమేనంతథా జగత్*|
*అతో మమ జగత్సర్వమదావా న చ కించన*||
ఒక్కడినై ఈ దేహమును అట్లే సమస్త జగత్తును ప్రకాశింపచేయుచున్నాను అందుచేత జగత్తంతయు నేనే లేదా ఏదీయును నేను కాదు
2.3
*సశరీరమహోవిశ్వo పరిత్యజ్యమయాదునా|*
*కుతాశ్చిత్ కౌసలదేవ పరమాత్మావిలోక్యతే*||*
ఆహా! ఇప్పుడు నాచే శరీరముతో సహా జగత్తంతయువిడువబడి ఎట్లో వచ్చిన నేర్పరితనమువలన పరమాత్మను చూడబడుచున్నది
2.4
*యధానతోయతోభిన్నాః తరంగాః పేనబుద్బుదాః|*
*ఆత్మనోన తథాబిన్నం విశ్వమాత్మవినిర్గతమ్*||*
అలలు నురుగు బుడగలు నీటికంటే వేరుకానట్లు ఆత్మనుండి వచ్చిన విశ్వము ఆత్మకంటె వేరుకాదు
2.5
*తంతుమాత్రోభవేదేవ పటోయద్విద్వివిచారిత*|
*ఆత్మతన్మాత్రమేవేదాం తద్వధ్విశ్వంవిచారితమ్*||
విచారించినచో వస్త్రము ధారములు మాత్రమే అయినట్లు విచారించినచో ఈ విశ్వము ఆత్మమాత్రమే
2.6
*యథైవేక్షురసే క్లృప్తా తేన వ్యాప్తైవశర్కరా*|
*తథావిశ్వంమయికృపం మయావ్యాప్తం నిరంతరమ్*||
చేరకురసమునుండి వచ్చు చక్కెరయందు రసమే వ్యాపించి ఉన్నది అట్లే విశ్వము ఎల్లప్పుడు నాయందే నిర్మింపబడి నాచేతనే వ్యాపింపబడి ఉన్నది
2.7
*ఆత్మజ్ఞానాజ్జగద్బాతి ఆత్మజ్ఞానాన్న భాసతే*|
*రజ్జ్వజ్ఞానాదహిర్బాతి తజ్ణ నాద్బాసతే న హి*||
ఆత్మను తెలియకపోవుతావలన జగత్తు తోచుచున్నది ఆత్మజ్ఞానముకలిగినచో జగత్తు తోచదు ఎట్లనగా త్రాడు తెలియకపోవుటవలన పాము తోచుచున్నది తెలిసికొన్నచో తోచదు
2.8
*ప్రకాశోమే నిజంరూపం నాతిరిక్తోఅస్మ్యహం తతః*|
*యదా ప్రకాశతే విశ్వం తదాహం భాస ఏవహి*||
ప్రకాశించుటయే నా నిజమైన రూపము దానికంటే నేను వేరుకాదు విశ్వము తోచునపుడు నేనే ప్రకాశించుచున్నాను
2.9
*అహోవికల్పితం విశ్వo అజ్ఞానాన్మయి భాసతే*|
*రూప్యం శుక్తౌ ఫణీరజ్జౌ వారి సూర్యకరే యధా*||
ఆహా!విశ్వము నాయందు అజ్ఞానమువలన కల్పింపబడి తోచుచున్నది ఎట్లనగాఆలుచిప్పయందు వెండి త్రాడుయందు పాము ఎండమావియందు నీరు వలె
2.10
*మత్తోవినిర్గతం విశ్వం మయ్యేవలయమేష్యతి*|
*మృదికుంభోజలే వీచిః కనకే కటకంయథా*||
నానుండియే విశ్వము బయలువెడలి నాయందే తిరిగి కలసిపోవుచున్నది ఎట్లనగా మట్టియందు కుండ నీటియందు అల బంగారమునందు కడియమువలె
2.11
*అహో అహం నమోమహ్యం వినాశోయస్యనాస్తి మే*|
*బ్రహ్మదిస్తంబపర్యంతం జగన్నాశేఅపి తిష్ఠతః*||
ఆహా నేను! ఏ నేనుకు వినాశములేదో ఏది బ్రహ్మదేవుని మొదలు గడ్డిపోచ వరకు కల జగత్తంతయు నశించినను నిలచిఉండునో అట్టి నాకు నమస్కారము
2.12
*అహో అహం నమోమహ్యం ఏకోఅహం దేహవానపి*|
*క్వచిన్న గంతా నాగంతా వ్యాప్య విశ్వమవస్దితః*||
నేను దేహముతో ఉన్నాను అంతటా ఉన్నాను ఒక్కటిగానే ఉన్నాను ఒకచోటికి పోవుటకాని వచ్చుటకాని లేక విశ్వమంతయు వ్యాపించి ఉన్నాను అట్టి నాకు నమస్కారము
_*జ్ఞాని ప్రాణం విడువరు... దేహాన్ని విడుస్తారు...*
2.13
*అహో అహం నమోమహ్యం దక్షో నాస్తీహ మత్సమః*|
*ఆసంస్పృశ్య శరీరేణ యేన విశ్వం చిరం ధృతమ్*||
ఆహా నేను!శరీరమును అంటుకొనకయే విశ్వమునంతయుచిరకాలమునుండి నిలబెట్టుచున్న 'నేను' కు సాటియైన సమర్థుడు లేడు. అట్టి నాకు నమస్కారము
2.14
*అహో అహం నమోమహ్యం యస్య మేనాస్తి కించన*|
*అధవా యస్య మేసర్వం యాదవాఙ్మనసగోచరం*||
ఆహా నేను!నాది అనునది ఏ కొంచెమున్ను లేదు వాక్కు మనసులచే తెలియబడునదంతయు నాదే అట్టి నాకు నమస్కారము
2.15
*జ్ఞానం జ్ఞేయంతథా జ్ఞాతా త్రితయం నాస్తి వాస్తవం*|
*అజ్ఞానాద్బాతి యత్రేదం సోఅహమస్మి నిరంజనః*||
జ్ఞానము జ్ఞేయము జ్ఞాత అను మూడును వాస్తవముగా లేవు ఎక్కడ ఇదంతయు అజ్ఞానమువలన తోచుచున్నదో అట్టి నేను నిర్మలముగా ఉన్నాను
2.16
*ద్వైతమూలమహో దుఃఖం నాన్యతస్యాఅస్తి భేషజామ్*|
*దృశ్యమేతన్మృషా సర్వం ఏకోఅహం చిద్రసోఅమలః*||
ఆహా దుఃఖమునకు మూలము రెండవది ఉండుటయే ఈ సమస్త దృశ్యము అబద్ధమే నేను ఒక్కటైన నిర్మలమైన తెలివి ఆనందము అను దృష్టే దానికి మందు
2.17
*బోధమాత్రోఅహమజ్ఞానత్ ఉపథిః కల్పితో మాయా*|
*ఏవం విమృశతో నిత్యం నిర్వికల్పే స్దితిర్మమ*||
నేను తెలివి మాత్రమే అజ్ఞానమువలన నాచే ఉపాధి కల్పింపబడినది ఈ విధముగా విచారణచేయు నాకు ఎల్లప్పుడూ నిశ్చలస్దితియే ఉంటున్నది
2.18
*అహోమయి స్దితంవిశ్వo వస్తుతో న మయి స్దితమ్*|
*నమే బందోఅస్తిమోక్షో వాబ్రాంతిః శాంతా నిరాశ్రయా*||
ఆహా విశ్వము నాయందే ఉన్నది కానీ వాస్తవముగా నాయందు లేదు నాకు బంధము లేదు మోక్షమునులేదు నా అశ్రయము పోవుటచే భ్రాంతి శాంతించినది
2.19
*సశరీరమిదం విశ్వం న కించిదతి నిశ్చితం*|
*శుద్ధచిన్మాత్ర ఆత్మా చ తాత్కాస్మిన్ కల్పనాధునా*||
శరీరముతో సహా ఈ విశ్వము కొంచెమును లేనిదనియు ఆత్మ శుద్ధచైతన్యమే అనియు నిశ్చయమైనది ఇక దేనియందు కల్పన?
2.20
*శరీరం స్వర్గనరకౌ బంధమోక్షౌ భయం తథా*|
*కల్పనామాత్రమేవైతత్ కిం మే కార్యం చిదాత్మనః*||
శరీరము స్వర్గనరకములు బంధమోక్షములు భయమును ఊహలుమాత్రమే వీనితో నాకు పని ఏమి?
2.21
*అహో జనసమూహేఅపి న ద్వైతం పశ్యతో మమ*|
*అరన్యమివ సంవృతం క్వ రతిo కరవాణ్యాహమ్*||
ఆహా! జనుల మధ్యన కూడ ద్వైతమును చూడనట్టి నాకు అడవిలోవలె ఉన్నది నేను ఎక్కడ ప్రీతిని ఉంచెదను?
2.22
*నాహందేహో నమే దేహోజీవో నాహామహం హి చిత్*|
*అయమేవ హి మే బంధ ఆసీద్యా జీవితే స్పృహ*||
దేహము నేను కాదు దేహము నాదిన్నీ కాదు నేను జీవుడను కాను నేను తెలివినే బ్రతుకుటయందు ఉండిన ఆసక్తియే బంధమయ్యెను.
2.23
*అహో భువనకల్లోలైర్విచిత్రైర్థాక్ సముత్థితం*|
*మయ్యనంతమహంభోథౌ చిత్తవాతే సముద్యతే*||
ఆహా! నేను అను అంతులేని మహాసముద్రమునందు చిత్తము అను గాలి వీచుచుండగా జగత్తులు అను విచిత్ర తరంగములు త్వరగా పుట్టుచున్నవి
2.24
*మయ్యనంతమహంభోధౌ చిత్తవాతే ప్రశమ్యతి*|
*అభాగ్యాజ్జీవవణిజో జగత్పోతో వినశ్వరః*||
నేను అను అంతులేని మహాసముద్రమునందు చిత్తము అను గాలి ఆగినప్పుడు జీవుడు అను వర్తకుని దురదృష్టమువలన జగత్తు అను పడవ గిట్టుచున్నది
2.25
*మయ్యనంతమహంభోధౌ ఆశ్చర్యం జీవవీచయః*|
*ఉద్యంతి ఘ్నంతి ఖేలంతి ప్రవిశంతి స్వభావతః*||
ఆశ్చర్యము నేను అను మహాసముద్రమునందు జీవులు అను అలలు స్వభావమువలన లేచుచున్నవి కొట్టుకొనుచున్నవి ఆదుకొనుచున్నవి ఆగిపోవుచున్నవి.
అధ్యాయము 2 సమాప్తము
No comments:
Post a Comment