అదే చైతన్యం.. అదే ఆత్మ
భగవాన్ చెప్పింది ఒక్క విషయం నిరంతరం స్ఫురణలోకి తెచ్చుకోవాలి..... బాహ్య ప్రపంచంలో జరుగుతున్న ది నీద్వారా జరగటం లేదు నడిపించేది అంతా వాడే...
నీవు శరీరంతో తధ్యాత్మ చెంది నేను..నేనే చేస్తున్నాను అనే భావన తో ఉండి కర్మ చేస్తున్నాను అనుకొని మాయలో పడుతున్నావు...
కానీ గాఢ నిద్రలో నీ ప్రమేయం లేకుండా నే అంతా జరిగిపోతున్నది.. నీలో ప్రాణం నిలిపేది ఎవడు.. వాడు అంటూ ఒకడున్నాడు కదా ..
అదే చైతన్యం.. అదే ఆత్మ.. వాడే దేవుడు... నిద్ర నుండి లేచిన తరువాత ఈ దేహం నాది అది నాది ఇది నాది అనుకుంటూ మాయ లో పడుతున్నావు... అలా కాకుండా నేను వున్నాను..
కానీ లోపల ఒకడున్నాడు అనుకుంటూ.. ఈ నేను.. ఆ నేను తో ఒకటై పోయి ఎరుకలో ఉండటమే సాధన
No comments:
Post a Comment