మైత్రేయ మహర్షి బోధనలు - 82


🌹. మైత్రేయ మహర్షి బోధనలు - 82 🌹

✍️. రచన : సద్గురు కె. పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🌻 68. వింత బోధ 🌻


ఫకీరు ఒకడు బంతిని విసరుచు ప్రతిసారి ధ్యేయమును కొట్టుచున్నాడు. ఆశ్చర్య పడుచు అతని చుట్టూ వున్న పిల్లలు మరల బంతిని తెచ్చి ఫకీరు కిచ్చుచున్నారు. అతడు బంతిని విసిరి ధ్యేయమును కొట్టుట, పిల్లలు బంతిని తెచ్చి అతని కిచ్చుట అవిశ్రాంతముగ రెండు గంటలు సాగినది. ఫకీరునకు విసరుటలో విసుగులేదు. ధ్యేయమును చేరుటలో అశ్రద్ధ లేదు. పిల్లలకు ఉత్సాహములో విసుగులేదు. ఈ కార్యమును చాల సేపు నుండి చూచుచున్న ఒక పెద్దమనిషి ఫకీరును చేరి “మీరు జ్ఞానవంతులని తెలిసి మీనుండి జ్ఞానము పొందుటకై చాల సేపటి నుండి వేచి యున్నాను. మీ ఆటను విరమించి నాకేమైన జ్ఞానబోధను అనుగ్రహించవలెనని ఎదురు చూచుచున్నాను” అని పలికినాడు. అది వినిన ఫకీరు ఫక్కున నవ్వి ఇట్లనెను.

“ఎదురు చూచుటేల? చూచినచో సరిపోయెడిది గదా! ఇంత సేపు నేను చేసినది జ్ఞాన బోధయే. చేసిన జ్ఞానబోధను నీవు చూడలేదు. విసిరిన ప్రతి బంతి శ్రద్ధగ విసిరితిని. మరల అది నా చేతికే అందింపబడెను. అందలి రహస్యము గమనించితివా? నీ చేతి యందున్నది శ్రద్ధగ సద్వినియోగము చేయుము. అది మరల మరల నిన్నే చేరుచు నీ నుండి అవిరామముగ లోకహితము జరుగును. ఉన్నది సద్వినియోగము చేయుటయే నేను నీకందించిన జ్ఞానబోధ. ఇక బయలు దేరుము. వాచాలత్త్వమునకు నాకు సమయము లేదు.” వచ్చిన జ్ఞానాభిలాషి అబ్బురపడెను. అవగాహన పొందెను.


సశేషం.....

🌹 🌹 🌹 🌹 🌹


02 Mar 2022

నిర్మల ధ్యానాలు - ఓషో - 144


🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 144 🌹

✍️. సౌభాగ్య
📚. ప్రసాద్ భరద్వాజ

🍀. సమస్య మనతో వుంది. వునికితో కాదు. అనాది నించి జరుగుతున్న ప్రయత్నమొకటే. మనుషుల్ని మనసు విప్పేలా చెయ్యడం. అప్పుడు వాళ్ళు నక్షత్రాల్తో, మేఘల్తో, సూర్యచంద్రుల్తో సంబంధం ఏర్పరచు కుంటారు. దైవత్వమదే. 🍀


దేవుడు అందరి పట్లా సమభావంతో వుంటాడు. ఉనికిలో పక్షపాతం లేదు. ఉనికిలో కేవలం నిష్పక్షపాతమే వుంది. అట్లా అంటే అది చలనం లేనిదని కాదు. అందులో వెచ్చదనముంది. ప్రేమ వుంది. పట్టించుకోవడముంది. రక్షించడముంది. మనం ఆ వెచ్చదనానికి మనసు విప్పం. ముడుచుకుని వుంటాం. సమస్య మనతో వుంది. వునికితో కాదు. అనాది నించి జరుగుతున్న ప్రయత్నమొకటే. మనుషుల్ని మనసు విప్పేలా చెయ్యడం.

అప్పుడు వాళ్ళు నక్షత్రాల్తో, మేఘల్తో, సూర్యచంద్రుల్తో సంబంధం ఏర్పరచుకుంటారు. దైవత్వమదే. ప్రత్యేకంగా దేవుడంటూ లేదు. నువ్వు ఏది కోల్పోయావో దాని పట్ల స్పృహతో వుంటే దైవత్వం నీ అనుభవానికి వస్తుంది. నువ్వు జీవితాన్ని కోల్పోయావు, ప్రేమని కోల్పోయావు, సత్యాన్ని కోల్పోయావు. సాహసాన్ని దగ్గరికి చేర్చుకో. సౌందర్యానికి అభిముఖుడివికా. ఆనందానికి, ఆశీర్వాదానికి తల వంచు. సమస్తము నీదే. అది నిన్ను ఆహ్వానిస్తోంది.


సశేషం ...

🌹 🌹 🌹 🌹 🌹


02 Mar 2022

నిత్య ప్రజ్ఞా సందేశములు - 243 - 30. స్వాధీనత లాంటిదేమీ లేదు / DAILY WISDOM - 243 - 30. There is No Such Thing as Possession


🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 243 / DAILY WISDOM - 243 🌹

🍀 📖. ఉపనిషత్తులపై పాఠాల నుండి 🍀

📝. స్వామి కృష్ణానంద
📚. ప్రసాద్ భరద్వాజ్

🌻 30. స్వాధీనత లాంటిదేమీ లేదు 🌻


మీకు కొంత ఆస్తి ఉంటేనే మీరు సంతోషంగా ఉంటారు. ఆస్తి లేని వ్యక్తిని సంతోషంగా లేని వ్యక్తిగా పరిగణిస్తారు. ప్రజలు ఇలా అంటారు: “నా దగ్గర భూమి, ఇల్లు, డబ్బు ఏమీ లేవు. నా పరిస్థితి దయనీయంగా ఉంది." భూమి, డబ్బు, ఇల్లు లభిస్తే సంతోషం. కానీ ఉపనిషత్తు ఇలా చెబుతోంది: "భూమి, డబ్బు, ఇల్లు మొదలైన వాటిని సంపాదించడం ద్వారా మీరు సంతోషంగా ఉండరు." నిజానికి, స్వాధీనత అనేది సంతోషంగా ఉండటానికి మార్గం కాదు. స్వాధీనత అంటూ ఏమీ లేదు. మీరు భూమిని కలిగి ఉండలేరు. ఇది ఇప్పటికే ఉంది మరియు మీరు పుట్టక ముందు కూడా ఉంది. మీరు భూమిలోని కొంత భాగాన్ని మీదిగా స్వాధీనం చేసుకోగలరా? మీరు భూమిని ఎలా సొంతం చేసుకోగలరు?

మీరు ఒకరి నుండి కొనుగోలు చేయాలని ప్రతిపాదించిన ఇల్లు కూడా మీరు ఉనికిలో ఉండక ముందే అక్కడ ఉండాలి. "నా దగ్గర ఇది ఉంది" అని చెప్పడం ద్వారా మీరు అంటున్నది ఏమిటి? ఆ వస్తువు మీ శరీరంలోకి ప్రవేశిస్తుందా? ఇల్లు మీ మాంసం మరియు ఎముకలలోకి ప్రవేశిస్తుందా? భూమి మీ మెదడులోకి ప్రవేశిస్తుందా మరియు డబ్బు మీ చర్మం కింద ఉందా? అలా జరుగుతుందా? మీరు పుట్టక ముందు కూడా అవి బయట ఉన్నట్లే, అవి ఎల్లప్పుడూ బయటే ఉంటాయి. ఒకరి కడుపులోకి డబ్బు రావడం ఎవరూ చూడలేదు. స్పష్టమైన కారణాల వల్ల, బయట ఉన్న వస్తువు పూర్తిగా మీదే కాదు. నీది కాని వస్తువును ఎలా సొంతం చేసుకోగలవు? కానీ మీరు ఏదో ఒక విధంగా అది మీదే అని మిమ్మల్ని మీరు ఒప్పించుకుంటారు.


కొనసాగుతుంది...

🌹 🌹 🌹 🌹 🌹



🌹 DAILY WISDOM - 243 🌹

🍀 📖 from Lessons on the Upanishads 🍀

📝 Swami Krishnananda
📚. Prasad Bharadwaj

🌻 30. There is No Such Thing as Possession 🌻

You feel happy only if you have some property. A propertyless person is considered an unhappy person. People say: “I have nothing—neither land, nor house, nor money. My condition is pitiable.” If you obtain land, money and a house, you are happy. But the Upanishad says: “You will not be happy by acquiring land, money, house, etc.” Actually, possession is not the way of being happy. There is no such thing as possession. You cannot possess an area of land. It was already there, and was there even before you were born. Can you grab a piece of land, which is the earth? How can you grab the earth?

Even the house that we propose to purchase from somebody must have been there before you existed. What exactly do you mean by saying “I possess something”? Does that object enter into your body? Does the house seep into your flesh and bones? Does the land enter your brain, and is the money under your skin? Does it happen so? They always remain outside, just as they were outside even before you were born. Nobody has seen money entering into someone's stomach. For obvious reasons, a thing that is outside, totally, cannot become yours. How can you possess a thing that is not yours? But you somehow convince yourself that it is yours.


Continues...

🌹 🌹 🌹 🌹 🌹


02 Mar 2022 

శ్రీ మదగ్ని మహాపురాణము - 13 / Agni Maha Purana - 13


🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 13 / Agni Maha Purana - 13 🌹

✍️. పుల్లెల శ్రీరామచంద్రుడు
ప్రథమ సంపుటము, అధ్యాయము - 5

సేకరణ : ప్రసాద్ భరద్వాజ

శ్రీ గణేశాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ.

🌻. శ్రీ రామావతార వర్ణనము - 2 🌻

విశ్వామిత్రుడు కోరగా దశరథుడు యజ్ఞవిఘ్నములను తొలగించుటకై లక్ష్మణసమేతుడైన రాముని విశ్వామిత్రునితో పంపెను. తాటకను సంహరించిన రాముడు (విశ్వామిత్రునినుండి) అస్త్ర శస్త్రములను పొందను.

మానవాస్త్రముచే మారీచుని మూర్ఛితుని చేసి దూరముగా పడవేసెను. బలవంతుడైన ఆ రాముడు యజ్ఞమును పాడుచేయుచున్న సుబాహుని సేనా సహితముగా సంహరించెను.

శతానందుడు విశ్వామిత్రుని ప్రభావమును గూర్చి రామునకు చెప్పెను. ఆ యజ్ఞమునందు జనకుడు ముని సమేతుడైన రాముని పూజించెను.

రాముడు ధనస్సును ఎక్కు పెట్టి దానిని అనాయాసముగా విరచెను. జనకుడు వీర్యమే శుల్కముగా కలదియు, ఆమోనిజయు అగు తన కన్య యైన సీతను రామున కిచ్చెను. తండ్రి మొదలైన వారు వచ్చిన పిమ్మట రాముడు సీతను, లక్ష్మణనుడు ఊర్మిళను, జనకుని తమ్ముడైన కుశధ్వజుని కుమార్తెలైన మాండవీ శ్రుతకీర్తులను భరత శత్రఘ్నులును వివాహమాడిరి.

ఆ రాముడు జనకునిచే బాగుగా సత్కరింపబడినవాడై, వసిష్ఠాది సమేతుడై పరశురాముని జయించి ఆమోధ్యకు వెళ్ళెను. భరతుడు శత్రుఘ్న సమేతుడై యుధాజిత్తు నగరమునకు వెళ్ళెను.

అగ్ని మహాపురాణము నందు రామాయణ బాలకాండ వర్ణన మను పంచమాధ్యయము సమాప్తము.


సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹



🌹 Agni Maha Purana -13 🌹

✍️ N. Gangadharan
📚. Prasad Bharadwaj


Chapter 5

🌻 Manifestations of Viṣṇu as Rama - 2 🌻


The king being requested by (the sage) Viśvāmitra for the annihilation of those who impede (the performance) of the sacrifices sent Rāma and Lakṣmaṇa along with the sage. Rāma who had gone (with the sage) (and) was taught in the use of the weapons (astra[1] and śastra[1]) (became) the killer of (the demoness) Tāṭakā[2].

8. (Rāma) made (demon) Mārīca[3] stupefied by the missile (known as) Mānava and led him far away. The valiant killed also (the demon) Subāhu, the destroyer of sacrifices along with his army.

9. Residing at the (place) Siddhāśrama[4] along with (the sages) Viśvāmitra and others, (Rāma) went along with his brother to see the sacrifice (test for prowess) of Maithila (King Janaka).

10-12. At the instance of (the sage) Śatānanda[5] and on account of the glory of Viśvāmitra, that sage being shown due respects by the king at the sacrifice and Rāma being informed, sportively pulled the bow and broke it. (King) Janaka gave Sītā, the girl not born of the womb, and associated with a prize bid, to Rāma. And when the parents had come, Rāma also married that Jānakī (Sītā). In the same way Lakṣmaṇa (also married) Urmilā.

13-14. Then Śatrughna and Bharata married Śrutakīrti and Māṇḍavī, the two daughters of the brother of Janaka. Rāma after conquering Jāmadagni (Paraśurāma, son of Jamadagni) went to Ayodhyā with (sage) Vasiṣṭha and others and Bharata with Śatrughna went towards (the country of) Yudhājit (uncle of Bharata).


Continues....

🌹 🌹 🌹 🌹 🌹


02 Mar 2022

విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 564 / Vishnu Sahasranama Contemplation - 564


🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 564 / Vishnu Sahasranama Contemplation - 564🌹

📚. ప్రసాద్ భరద్వాజ

🌻 564. జ్యోతిరాదిత్యః, ज्योतिरादित्यः, Jyotirādityaḥ 🌻


ఓం జ్యోతిరాదిత్యాయ నమః | ॐ ज्योतिरादित्याय नमः | OM Jyotirādityāya namaḥ

జ్యోతిరాదిత్యః, ज्योतिरादित्यः, Jyotirādityaḥ

ఆదిత్యమణ్డలే జ్యోతిష్యాస్థితః పరమేశ్వరః ।
జ్యోతిరాదిత్య ఇతి స ప్రోచ్యతే విదుషాం వరైః ॥

జ్యోతిస్సునందు సవితృ మండలమునందు అనగా సూర్య మండలము నందు ఉండు ఆదిత్య రూపుడైన శ్రీ విష్ణువు జ్యోతిరాదిత్యుడు.


:: శ్రీమద్భగవద్గీత క్షేత్రక్షేత్రజ్ఞ విభాగ యోగము ::

జ్యోతిషామపి తజ్జ్యోతిస్తమసః పరముచ్యతే ।
జ్ఞానం జ్ఞేయం జ్ఞానగమ్యం హృది సర్వస్య విష్ఠితమ్ ॥ 18 ॥

పరబ్రహ్మము ప్రకాశించెడు సూర్యచంద్రాగ్న్యాది పదార్థములకుగూడ ప్రకాశము నిచ్చునదియు, తమస్సు అనగా అజ్ఞానము కంటె అతీతమైనదియు, జ్ఞాన స్వరూపమైనదియు, తెలియదగినదియు, జ్ఞానగుణములచే పొందదగినదియు, సమస్తప్రాణులయొక్క హృదయమునందు విశేషించియున్నదియునని చెప్పబడుచున్నది.


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹




🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 564🌹

📚. Prasad Bharadwaj

🌻 564. Jyotirādityaḥ 🌻



OM Jyotirādityāya namaḥ

आदित्यमण्डले ज्योतिष्यास्थितः परमेश्वरः ।
ज्योतिरादित्य इति स प्रोच्यते विदुषां वरैः ॥

Ādityamaṇḍale jyotiṣyāsthitaḥ parameśvaraḥ,
Jyotirāditya iti sa procyate viduṣāṃ varaiḥ.


Since Lord Viṣṇu resides as the splendorous effulgence in the orb of the sun, He is called Jyotirādityaḥ.


:: श्रीमद्भगवद्गीत क्षेत्रक्षेत्रज्ञ विभाग योग ::

ज्योतिषामपि तज्ज्योतिस्तमसः परमुच्यते ।
ज्ञानं ज्ञेयं ज्ञानगम्यं हृदि सर्वस्य विष्ठितम् ॥ १८ ॥


Śrīmad Bhagavad Gīta - Chapter 13

Jyotiṣāmapi tajjyotistamasaḥ paramucyate,
Jñānaṃ jñeyaṃ jñānagamyaṃ hr‌di sarvasya viṣṭhitam. 18.


That is the Light even of the lights; It is spoken of as beyond darkness. It is Knowledge, the Knowable and the Known. It exists specially in the hearts of all.


🌻 🌻 🌻 🌻 🌻


Source Sloka

भगवान् भगहाऽऽनन्दी वनमाली हलायुधः ।आदित्यो ज्योतिरादित्यस्सहिष्णुर्गतिसत्तमः ॥ ६० ॥

భగవాన్ భగహాఽఽనన్దీ వనమాలీ హలాయుధః ।ఆదిత్యో జ్యోతిరాదిత్యస్సహిష్ణుర్గతిసత్తమః ॥ 60 ॥

Bhagavān bhagahā’’nandī vanamālī halāyudhaḥ,Ādityo jyotirādityassahiṣṇurgatisattamaḥ ॥ 60 ॥


Continues....

🌹 🌹 🌹 🌹🌹


02 Mar 2022




02 - MARCH - 2022 బుధవారం MESSAGES మాఘ అమావాస్య

1) 🌹. నిత్య పంచాంగము Daily Panchangam, 02, మార్చి 2022 బుధవారం, సౌమ్య వాసరే 🌹 
2) 🌹. శ్రీమద్భగవద్గీత - 166 / Bhagavad-Gita - 166 - 4-04 జ్ఞానయోగము 🌹
3) 🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 564 / Vishnu Sahasranama Contemplation - 564🌹
4) 🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 13 / Agni Maha Purana 13 - రామావతార వర్ణనము - 2🌹 
5) 🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 243 / DAILY WISDOM - 243 🌹 
6) 🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 144 🌹
7) 🌹. మైత్రేయ మహర్షి బోధనలు - 82🌹 

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శుభ బుధవారం మిత్రులందరికీ 🌹*
*సౌమ్య వాసరే, 02, మార్చి 2022*
*మీకు ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని కోరుకుంటూ*
*ప్రసాద్ భరద్వాజ*

*🍀. శ్రీ గణేశ అష్టకం - 1 🍀*

*శ్రీగణేశాయ నమః ।*
*1. గణపతి-పరివారం చారుకేయూరహారం*
*గిరిధరవరసారం యోగినీచక్రచారమ్ ।*
*భవ-భయ-పరిహారం దుఃఖ-దారిద్రయ-దూరం*
*గణపతిమభివన్దే వక్రతుణ్డావతారమ్ ॥*

🌻 🌻 🌻 🌻 🌻

*🍀. నేటి సూక్తి : దేని కోసం స్వేచ్ఛ అనేది ఎప్పుడూ సృజనాత్మకమైనది. దేని నుంచి స్వేచ్ఛ అనేది సాధారణ లౌకిక విషయం. 🍀*

*పండుగలు మరియు పర్వదినాలు : మాఘ అమావాస్య, Magha Amavasya*

🌷🌷🌷🌷🌷

విక్రమ సంవత్సరం: 2078 ఆనంద
శఖ సంవత్సరం: 1943 ప్లవ,
ఉత్తరాయణం, శిశిర ఋతువు, 
మాఘ మాసం
తిథి: మాఘ అమావాశ్య 23:05:07 వరకు
తదుపరి శుక్ల పాడ్యమి
నక్షత్రం: శతభిషం 26:38:17 వరకు
తదుపరి పూర్వాభద్రపద
యోగం: శివ 08:21:56 వరకు
తదుపరి సిధ్ధ
కరణం: చతుష్పద 12:02:23 వరకు
సూర్యోదయం: 06:33:51
సూర్యాస్తమయం: 18:22:47
వైదిక సూర్యోదయం: 06:37:25
వైదిక సూర్యాస్తమయం: 18:19:12
చంద్రోదయం: 06:21:44
చంద్రాస్తమయం: 18:09:03
సూర్య సంచార రాశి: కుంభం
చంద్ర సంచార రాశి: కుంభం
వర్జ్యం: 10:39:00 - 12:10:20
దుర్ముహూర్తం: 12:04:41 - 12:51:56
రాహు కాలం: 12:28:19 - 13:56:56
గుళిక కాలం: 10:59:42 - 12:28:19
యమ గండం: 08:02:28 - 09:31:05
అభిజిత్ ముహూర్తం: 12:05 - 12:51
అమృత కాలం: 19:47:00 - 21:18:20
మానస యోగం - కార్య లాభం 
26:38:17 వరకు తదుపరి పద్మ 
యోగం - ఐశ్వర్య ప్రాప్తి

🌻 🌻 🌻 🌻 🌻  

*🍀. నిత్య ప్రార్థన 🍀*
*వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ*
*నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా*
*యశివ నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా*
*తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం*
*తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ* 
*విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.*
🌹🌹🌹🌹🌹
#పంచాగముPanchangam 
#PanchangDaily
#DailyTeluguCalender 
Join and Share 
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీమద్భగవద్గీత - 166 / Bhagavad-Gita - 166🌹*
*✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద*
*📚. ప్రసాద్ భరద్వాజ*

*🌴. చతుర్ధ అధ్యాయము - జ్ఞాన యోగము - 04 🌴*

*04. అర్జున ఉవాచ*
*అపరం భవతో జన్మ పరం జన్మ వివస్వత: |*
*కథమేతద్ విజానీయాం త్వమాదౌ ప్రోక్తవానితి ||*

*🌷. తాత్పర్యం :*
*అర్జునుడు పలికెను : సూర్యదేవుడైన వివస్వానుడు జన్మచే నీకన్నను పూర్వుడు. అట్టి యెడ ఆదిలో నీవీ జ్ఞానమును అతనికి ఉపదేశించితివనుటను నేనెట్లు అర్థము చేసికొనగలును?*

🌷. భాష్యము :
అర్జునుడు శ్రీకృష్ణభగవానుడు పరమభక్తుడు. అట్టి యెడ శ్రీకృష్ణుని వచనములను అతడు నమ్మకుండుట ఎట్లు సంభవించును? వాస్తవమేననగా అర్జునుడు ఇచ్చట తన కొరకు గాక భగవానుని యందు నమ్మకము లేనివారి కొరకు లేదా శ్రీకృష్ణుడు దేవదేవుడనెడి విషయమును అంగీకరింపని దానప్రవృత్తి కలవారి కొరకు ప్రశ్నించుచున్నాడు. అనగా వారి కొరకే అర్జునుడు శ్రీకృష్ణభగవానుని గూర్చి ఏమియును తెలియనివాని వలె ఈ విషయమును విచారణ కావించుచున్నాడు. 

దశమాధ్యాయమున విదితము కానున్నట్లు శ్రీకృష్ణుడు సమస్తమునకు మూలమైన భగవానుడనియు మరియు పరతత్త్వపు చరమానుభవమనియు అర్జునుడు సంపూర్ణముగా నెరిగియుండెను. అయినను ఆ దేవదేవుడు దేవకీదేవి తనయునిగా ధరత్రిపై అవతరించెను. అట్టి యెడ అతడు నిత్యుడైన ఆదిపురుషునిగా మరియు దేవదేవునిగా నిలిచియుండుట ఎట్లు సాధ్యమయ్యెనో సామాన్యమానవునకు బోధపడని విషయము. క

నుక ఆ విషయమును విశదపరచుటకే అర్జునుడు శ్రీకృష్ణుని ఈ ప్రశ్నను అడిగియుండెను. తద్ద్వారా శ్రీకృష్ణుడే ఈ విషయమును గూర్చి ప్రామాణికముగా పలుకగలడని అర్జునుడు భావించెను. శ్రీకృష్ణుడు పరమప్రామాణికుడు అనెడి సత్యమును ఈనాడే గాక అనంతకాలము నుండియు సమస్త ప్రపంచము ఆమోదించినది. 

కేవలము దానవులే అతనిని తిరస్కరింతురు. సర్వులచే శ్రీకృష్ణుడు ప్రామణికునిగా అంగీకరింపబడినందున అర్జునుడు ఈ ప్రశ్నను అతని ముందుంచుచున్నాడు. తద్ద్వార దానవప్రవృత్తి కలవారిచే వివరింపబడుటకు బదులు కృష్ణుడు తనను గూర్చి తానే వివరించుటకు అవకాశము కలుగగలదు. అట్టి దానవ ప్రవృత్తి గల వారు దానవస్వభావులైన తమ అనుయాయులు నిమిత్తమై సదా శ్రీకృష్ణుని గూర్చి వక్రభాష్యము కావింతురు. కాని వాస్తవమునకు ప్రతివారును తమ శ్రేయస్సు కొరకై కృష్ణ సంబంధ విజ్ఞానమును ఎరుగవలసి యున్నది. 
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Bhagavad-Gita as It is - 166 🌹*
*✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada*
*📚 Prasad Bharadwaj*

*🌴 Chapter 4 - Jnana Yoga - 04 🌴*

*04. arjuna uvāca*
*aparaṁ bhavato janma paraṁ janma vivasvataḥ*
*katham etad vijānīyāṁ tvam ādau proktavān iti*

*🌷 Translation :*
*Arjuna said: The sun-god Vivasvān is senior by birth to You. How am I to understand that in the beginning You instructed this science to him?*

🌷 Purport :
Arjuna is an accepted devotee of the Lord, so how could he not believe Kṛṣṇa’s words? The fact is that Arjuna is not inquiring for himself but for those who do not believe in the Supreme Personality of Godhead or for the demons who do not like the idea that Kṛṣṇa should be accepted as the Supreme Personality of Godhead; for them only Arjuna inquires on this point, as if he were himself not aware of the Personality of Godhead, or Kṛṣṇa. 

As it will be evident from the Tenth Chapter, Arjuna knew perfectly well that Kṛṣṇa is the Supreme Personality of Godhead, the fountainhead of everything and the last word in transcendence. Of course, Kṛṣṇa also appeared as the son of Devakī on this earth. How Kṛṣṇa remained the same Supreme Personality of Godhead, the eternal original person, is very difficult for an ordinary man to understand.

Therefore, to clarify this point, Arjuna put this question before Kṛṣṇa so that He Himself could speak authoritatively. That Kṛṣṇa is the supreme authority is accepted by the whole world, not only at present but from time immemorial, and the demons alone reject Him. Anyway, since Kṛṣṇa is the authority accepted by all, Arjuna put this question before Him in order that Kṛṣṇa would describe Himself without being depicted by the demons, who always try to distort Him in a way understandable to the demons and their followers. It is necessary that everyone, for his own interest, know the science of Kṛṣṇa. 
🌹 🌹 🌹 🌹 🌹
#భగవద్గీత #BhagavadGita
#చైతన్యవిజ్ఞానం #PrasadBhardwaj 
https://t.me/bhagavadgeethaa/
www.facebook.com/groups/bhagavadgeethaa/
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 564 / Vishnu Sahasranama Contemplation - 564🌹*
*📚. ప్రసాద్ భరద్వాజ*

*🌻 564. జ్యోతిరాదిత్యః, ज्योतिरादित्यः, Jyotirādityaḥ 🌻*

*ఓం జ్యోతిరాదిత్యాయ నమః | ॐ ज्योतिरादित्याय नमः | OM Jyotirādityāya namaḥ*

*జ్యోతిరాదిత్యః, ज्योतिरादित्यः, Jyotirādityaḥ*

*ఆదిత్యమణ్డలే జ్యోతిష్యాస్థితః పరమేశ్వరః ।*
*జ్యోతిరాదిత్య ఇతి స ప్రోచ్యతే విదుషాం వరైః ॥*

*జ్యోతిస్సునందు సవితృ మండలమునందు అనగా సూర్య మండలము నందు ఉండు ఆదిత్య రూపుడైన శ్రీ విష్ణువు జ్యోతిరాదిత్యుడు.*

:: శ్రీమద్భగవద్గీత క్షేత్రక్షేత్రజ్ఞ విభాగ యోగము ::
జ్యోతిషామపి తజ్జ్యోతిస్తమసః పరముచ్యతే ।
జ్ఞానం జ్ఞేయం జ్ఞానగమ్యం హృది సర్వస్య విష్ఠితమ్ ॥ 18 ॥

పరబ్రహ్మము ప్రకాశించెడు సూర్యచంద్రాగ్న్యాది పదార్థములకుగూడ ప్రకాశము నిచ్చునదియు, తమస్సు అనగా అజ్ఞానము కంటె అతీతమైనదియు, జ్ఞాన స్వరూపమైనదియు, తెలియదగినదియు, జ్ఞానగుణములచే పొందదగినదియు, సమస్తప్రాణులయొక్క హృదయమునందు విశేషించియున్నదియునని చెప్పబడుచున్నది.

సశేషం... 
🌹 🌹 🌹 🌹 🌹 

*🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 564🌹*
*📚. Prasad Bharadwaj*

*🌻 564. Jyotirādityaḥ 🌻*

*OM Jyotirādityāya namaḥ*

आदित्यमण्डले ज्योतिष्यास्थितः परमेश्वरः ।
ज्योतिरादित्य इति स प्रोच्यते विदुषां वरैः ॥ 

*Ādityamaṇḍale jyotiṣyāsthitaḥ parameśvaraḥ,*
*Jyotirāditya iti sa procyate viduṣāṃ varaiḥ.*

*Since Lord Viṣṇu resides as the splendorous effulgence in the orb of the sun, He is called Jyotirādityaḥ.*

:: श्रीमद्भगवद्गीत क्षेत्रक्षेत्रज्ञ विभाग योग ::
ज्योतिषामपि तज्ज्योतिस्तमसः परमुच्यते ।
ज्ञानं ज्ञेयं ज्ञानगम्यं हृदि सर्वस्य विष्ठितम् ॥ १८ ॥

Śrīmad Bhagavad Gīta - Chapter 13
Jyotiṣāmapi tajjyotistamasaḥ paramucyate,
Jñānaṃ jñeyaṃ jñānagamyaṃ hr‌di sarvasya viṣṭhitam. 18.

That is the Light even of the lights; It is spoken of as beyond darkness. It is Knowledge, the Knowable and the Known. It exists specially in the hearts of all.

🌻 🌻 🌻 🌻 🌻 
Source Sloka
भगवान् भगहाऽऽनन्दी वनमाली हलायुधः ।आदित्यो ज्योतिरादित्यस्सहिष्णुर्गतिसत्तमः ॥ ६० ॥

భగవాన్ భగహాఽఽనన్దీ వనమాలీ హలాయుధః ।ఆదిత్యో జ్యోతిరాదిత్యస్సహిష్ణుర్గతిసత్తమః ॥ 60 ॥

Bhagavān bhagahā’’nandī vanamālī halāyudhaḥ,Ādityo jyotirādityassahiṣṇurgatisattamaḥ ॥ 60 ॥

Continues....
🌹 🌹 🌹 🌹🌹
#విష్ణుసహస్రనామతత్వవిచారణ #విష్ణుసహస్రనామములు #VishnuSahasranama #PrasadBhardwaj 
https://t.me/vishnusahasranaam
www.facebook.com/groups/vishnusahasranaam/
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://chat.whatsapp.com/
https://incarnation14.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 13 / Agni Maha Purana - 13 🌹*
*✍️. పుల్లెల శ్రీరామచంద్రుడు*
*ప్రథమ సంపుటము, అధ్యాయము - 5*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*శ్రీ గణేశాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ.*

*🌻. శ్రీ రామావతార వర్ణనము - 2 🌻*

విశ్వామిత్రుడు కోరగా దశరథుడు యజ్ఞవిఘ్నములను తొలగించుటకై లక్ష్మణసమేతుడైన రాముని విశ్వామిత్రునితో పంపెను. తాటకను సంహరించిన రాముడు (విశ్వామిత్రునినుండి) అస్త్ర శస్త్రములను పొందను. 

మానవాస్త్రముచే మారీచుని మూర్ఛితుని చేసి దూరముగా పడవేసెను. బలవంతుడైన ఆ రాముడు యజ్ఞమును పాడుచేయుచున్న సుబాహుని సేనా సహితముగా సంహరించెను.

శతానందుడు విశ్వామిత్రుని ప్రభావమును గూర్చి రామునకు చెప్పెను. ఆ యజ్ఞమునందు జనకుడు ముని సమేతుడైన రాముని పూజించెను.
రాముడు ధనస్సును ఎక్కు పెట్టి దానిని అనాయాసముగా విరచెను. జనకుడు వీర్యమే శుల్కముగా కలదియు, ఆమోనిజయు అగు తన కన్య యైన సీతను రామున కిచ్చెను. తండ్రి మొదలైన వారు వచ్చిన పిమ్మట రాముడు సీతను, లక్ష్మణనుడు ఊర్మిళను, జనకుని తమ్ముడైన కుశధ్వజుని కుమార్తెలైన మాండవీ శ్రుతకీర్తులను భరత శత్రఘ్నులును వివాహమాడిరి.

ఆ రాముడు జనకునిచే బాగుగా సత్కరింపబడినవాడై, వసిష్ఠాది సమేతుడై పరశురాముని జయించి ఆమోధ్యకు వెళ్ళెను. భరతుడు శత్రుఘ్న సమేతుడై యుధాజిత్తు నగరమునకు వెళ్ళెను.
అగ్ని మహాపురాణము నందు రామాయణ బాలకాండ వర్ణన మను పంచమాధ్యయము సమాప్తము.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Agni Maha Purana -13 🌹*
*✍️ N. Gangadharan*
*📚. Prasad Bharadwaj *

Chapter 5 
*🌻 Manifestations of Viṣṇu as Rama - 2 🌻*

The king being requested by (the sage) Viśvāmitra for the annihilation of those who impede (the performance) of the sacrifices sent Rāma and Lakṣmaṇa along with the sage. Rāma who had gone (with the sage) (and) was taught in the use of the weapons (astra[1] and śastra[1]) (became) the killer of (the demoness) Tāṭakā[2].

8. (Rāma) made (demon) Mārīca[3] stupefied by the missile (known as) Mānava and led him far away. The valiant killed also (the demon) Subāhu, the destroyer of sacrifices along with his army.

9. Residing at the (place) Siddhāśrama[4] along with (the sages) Viśvāmitra and others, (Rāma) went along with his brother to see the sacrifice (test for prowess) of Maithila (King Janaka).

10-12. At the instance of (the sage) Śatānanda[5] and on account of the glory of Viśvāmitra, that sage being shown due respects by the king at the sacrifice and Rāma being informed, sportively pulled the bow and broke it. (King) Janaka gave Sītā, the girl not born of the womb, and associated with a prize bid, to Rāma. And when the parents had come, Rāma also married that Jānakī (Sītā). In the same way Lakṣmaṇa (also married) Urmilā.

13-14. Then Śatrughna and Bharata married Śrutakīrti and Māṇḍavī, the two daughters of the brother of Janaka. Rāma after conquering Jāmadagni (Paraśurāma, son of Jamadagni) went to Ayodhyā with (sage) Vasiṣṭha and others and Bharata with Śatrughna went towards (the country of) Yudhājit (uncle of Bharata).

Continues....
🌹 🌹 🌹 🌹 🌹
#అగ్నిపురాణం #శ్రీమదగ్నిమహాపురాణం #AgniMahaPuranam #చైతన్యవిజ్ఞానం
Join and Share 
🌹 అగ్ని మహా పురాణము చానెల్ 🌹Agni Maha Purana
https://t.me/AgniMahaPuranam
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom www.facebook.com/groups/hindupuranas/
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 243 / DAILY WISDOM - 243 🌹*
*🍀 📖. ఉపనిషత్తులపై పాఠాల నుండి 🍀*
*📝. స్వామి కృష్ణానంద*
*📚. ప్రసాద్ భరద్వాజ్*

*🌻 30. స్వాధీనత లాంటిదేమీ లేదు 🌻*

*మీకు కొంత ఆస్తి ఉంటేనే మీరు సంతోషంగా ఉంటారు. ఆస్తి లేని వ్యక్తిని సంతోషంగా లేని వ్యక్తిగా పరిగణిస్తారు. ప్రజలు ఇలా అంటారు: “నా దగ్గర భూమి, ఇల్లు, డబ్బు ఏమీ లేవు. నా పరిస్థితి దయనీయంగా ఉంది." భూమి, డబ్బు, ఇల్లు లభిస్తే సంతోషం. కానీ ఉపనిషత్తు ఇలా చెబుతోంది: "భూమి, డబ్బు, ఇల్లు మొదలైన వాటిని సంపాదించడం ద్వారా మీరు సంతోషంగా ఉండరు." నిజానికి, స్వాధీనత అనేది సంతోషంగా ఉండటానికి మార్గం కాదు. స్వాధీనత అంటూ ఏమీ లేదు. మీరు భూమిని కలిగి ఉండలేరు. ఇది ఇప్పటికే ఉంది మరియు మీరు పుట్టక ముందు కూడా ఉంది. మీరు భూమిలోని కొంత భాగాన్ని మీదిగా స్వాధీనం చేసుకోగలరా? మీరు భూమిని ఎలా సొంతం చేసుకోగలరు?*

*మీరు ఒకరి నుండి కొనుగోలు చేయాలని ప్రతిపాదించిన ఇల్లు కూడా మీరు ఉనికిలో ఉండక ముందే అక్కడ ఉండాలి. "నా దగ్గర ఇది ఉంది" అని చెప్పడం ద్వారా మీరు అంటున్నది ఏమిటి? ఆ వస్తువు మీ శరీరంలోకి ప్రవేశిస్తుందా? ఇల్లు మీ మాంసం మరియు ఎముకలలోకి ప్రవేశిస్తుందా? భూమి మీ మెదడులోకి ప్రవేశిస్తుందా మరియు డబ్బు మీ చర్మం కింద ఉందా? అలా జరుగుతుందా? మీరు పుట్టక ముందు కూడా అవి బయట ఉన్నట్లే, అవి ఎల్లప్పుడూ బయటే ఉంటాయి. ఒకరి కడుపులోకి డబ్బు రావడం ఎవరూ చూడలేదు. స్పష్టమైన కారణాల వల్ల, బయట ఉన్న వస్తువు పూర్తిగా మీదే కాదు. నీది కాని వస్తువును ఎలా సొంతం చేసుకోగలవు? కానీ మీరు ఏదో ఒక విధంగా అది మీదే అని మిమ్మల్ని మీరు ఒప్పించుకుంటారు.*

*కొనసాగుతుంది...*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 DAILY WISDOM - 243 🌹*
*🍀 📖 from Lessons on the Upanishads 🍀*
*📝 Swami Krishnananda*
*📚. Prasad Bharadwaj*

*🌻 30. There is No Such Thing as Possession 🌻*

*You feel happy only if you have some property. A propertyless person is considered an unhappy person. People say: “I have nothing—neither land, nor house, nor money. My condition is pitiable.” If you obtain land, money and a house, you are happy. But the Upanishad says: “You will not be happy by acquiring land, money, house, etc.” Actually, possession is not the way of being happy. There is no such thing as possession. You cannot possess an area of land. It was already there, and was there even before you were born. Can you grab a piece of land, which is the earth? How can you grab the earth?*

*Even the house that we propose to purchase from somebody must have been there before you existed. What exactly do you mean by saying “I possess something”? Does that object enter into your body? Does the house seep into your flesh and bones? Does the land enter your brain, and is the money under your skin? Does it happen so? They always remain outside, just as they were outside even before you were born. Nobody has seen money entering into someone's stomach. For obvious reasons, a thing that is outside, totally, cannot become yours. How can you possess a thing that is not yours? But you somehow convince yourself that it is yours.*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹
#DailyWisdom
#నిత్యప్రజ్ఞాసందేశములు #SwamiKrishnananda
 #PrasadBhardwaj 
https://t.me/Seeds_Of_Consciousness
www.facebook.com/groups/dailysatsangwisdom/ 
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://incarnation14.wordpress.com/
https://dailybhakthimessages.blogspot.com

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 144 🌹*
*✍️. సౌభాగ్య*
*📚. ప్రసాద్ భరద్వాజ*

*🍀. సమస్య మనతో వుంది. వునికితో కాదు. అనాది నించి జరుగుతున్న ప్రయత్నమొకటే. మనుషుల్ని మనసు విప్పేలా చెయ్యడం. అప్పుడు వాళ్ళు నక్షత్రాల్తో, మేఘల్తో, సూర్యచంద్రుల్తో సంబంధం ఏర్పరచు కుంటారు. దైవత్వమదే. 🍀*

*దేవుడు అందరి పట్లా సమభావంతో వుంటాడు. ఉనికిలో పక్షపాతం లేదు. ఉనికిలో కేవలం నిష్పక్షపాతమే వుంది. అట్లా అంటే అది చలనం లేనిదని కాదు. అందులో వెచ్చదనముంది. ప్రేమ వుంది. పట్టించుకోవడముంది. రక్షించడముంది. మనం ఆ వెచ్చదనానికి మనసు విప్పం. ముడుచుకుని వుంటాం. సమస్య మనతో వుంది. వునికితో కాదు. అనాది నించి జరుగుతున్న ప్రయత్నమొకటే. మనుషుల్ని మనసు విప్పేలా చెయ్యడం.*

*అప్పుడు వాళ్ళు నక్షత్రాల్తో, మేఘల్తో, సూర్యచంద్రుల్తో సంబంధం ఏర్పరచుకుంటారు. దైవత్వమదే. ప్రత్యేకంగా దేవుడంటూ లేదు. నువ్వు ఏది కోల్పోయావో దాని పట్ల స్పృహతో వుంటే దైవత్వం నీ అనుభవానికి వస్తుంది. నువ్వు జీవితాన్ని కోల్పోయావు, ప్రేమని కోల్పోయావు, సత్యాన్ని కోల్పోయావు. సాహసాన్ని దగ్గరికి చేర్చుకో. సౌందర్యానికి అభిముఖుడివికా. ఆనందానికి, ఆశీర్వాదానికి తల వంచు. సమస్తము నీదే. అది నిన్ను ఆహ్వానిస్తోంది.*

*సశేషం ...*
🌹 🌹 🌹 🌹 🌹
#ఓషోరోజువారీధ్యానములు
#OshoDailyMeditations
#ఓషోబోధనలు #OshoDiscourse 
#ఓషోనిర్మలధ్యానములు #PrasadBhardwaj 
https://t.me/ChaitanyaVijnanam
http://www.facebook.com/groups/oshoteachings/
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. మైత్రేయ మహర్షి బోధనలు - 82 🌹* 
*✍️. రచన : సద్గురు కె. పార్వతి కుమార్*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*

*🌻 68. వింత బోధ 🌻*

*ఫకీరు ఒకడు బంతిని విసరుచు ప్రతిసారి ధ్యేయమును కొట్టుచున్నాడు. ఆశ్చర్య పడుచు అతని చుట్టూ వున్న పిల్లలు మరల బంతిని తెచ్చి ఫకీరు కిచ్చుచున్నారు. అతడు బంతిని విసిరి ధ్యేయమును కొట్టుట, పిల్లలు బంతిని తెచ్చి అతని కిచ్చుట అవిశ్రాంతముగ రెండు గంటలు సాగినది. ఫకీరునకు విసరుటలో విసుగులేదు. ధ్యేయమును చేరుటలో అశ్రద్ధ లేదు. పిల్లలకు ఉత్సాహములో విసుగులేదు. ఈ కార్యమును చాల సేపు నుండి చూచుచున్న ఒక పెద్దమనిషి ఫకీరును చేరి “మీరు జ్ఞానవంతులని తెలిసి మీనుండి జ్ఞానము పొందుటకై చాల సేపటి నుండి వేచి యున్నాను. మీ ఆటను విరమించి నాకేమైన జ్ఞానబోధను అనుగ్రహించవలెనని ఎదురు చూచుచున్నాను” అని పలికినాడు. అది వినిన ఫకీరు ఫక్కున నవ్వి ఇట్లనెను.*

*“ఎదురు చూచుటేల? చూచినచో సరిపోయెడిది గదా! ఇంత సేపు నేను చేసినది జ్ఞాన బోధయే. చేసిన జ్ఞానబోధను నీవు చూడలేదు. విసిరిన ప్రతి బంతి శ్రద్ధగ విసిరితిని. మరల అది నా చేతికే అందింపబడెను. అందలి రహస్యము గమనించితివా? నీ చేతి యందున్నది శ్రద్ధగ సద్వినియోగము చేయుము. అది మరల మరల నిన్నే చేరుచు నీ నుండి అవిరామముగ లోకహితము జరుగును. ఉన్నది సద్వినియోగము చేయుటయే నేను నీకందించిన జ్ఞానబోధ. ఇక బయలు దేరుము. వాచాలత్త్వమునకు నాకు సమయము లేదు.” వచ్చిన జ్ఞానాభిలాషి అబ్బురపడెను. అవగాహన పొందెను.*

*సశేషం.....*
🌹 🌹 🌹 🌹 🌹
#మైత్రేయమహర్షిబోధనలు #MaitreyaMaharshi #సద్గురుపార్వతీకుమార్ #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
www.facebook.com/groups/maharshiwisdom/
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹