2-July-2020

1) శ్రీమద్భగవద్గీత - 329 / Bhagavad-Gita - 329

2)  శ్రీమద్భగవద్గీత - 415   / Bhagavad-Gita - 415

3) శ్రీపాద శ్రీవల్లభ చరితామృతము  - 203  / Sripada Srivallabha Charithamrutham - 203

4) మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 84

5) The Masters of Wisdom - The Journey Inside - 106

6) శ్రీ ఆర్యా ద్విశతి - 67

7) దాశరధి శతకము - పద్య స్వరూపం - 46 / Dasarathi Satakam - 46

8) నారద భక్తి సూత్రాలు - 23

9) పంచకోశములు - అన్నమయకోశము

10) సౌందర్య లహరి -30 / Soundarya Lahari - 30

11) శ్రీ శివ మహా పురాణము - 161

12) VEDA UPANISHAD SUKTHAM - 48

13) శ్రీ మదగ్ని మహాపురాణము - 33 

14) శ్రీ లలితా సహస్ర నామములు - 23 / Sri Lalita Sahasranamavali - Meaning - 23

15) AVATAR OF THE AGE MEHER BABA MANIFESTING - 38

16) భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 47

17) Seeds Of Consciousness - 113

18) మనోశక్తి - Mind Power - 51

19) సాయి తత్వం - మానవత్వం - 43 / Sai Philosophy is Humanity - 43



🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

Image may contain: 2 people


🌹. శ్రీమద్భగవద్గీత - 329 / Bhagavad-Gita - 329 🌹
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 9వ అధ్యాయము - రాజవిద్యా రాజగుహ్య యోగం - 10 🌴

10. మయాధ్యక్షేణ ప్రకృతి: సూయతే సచరాచరమ్ |
హేతునానేన కౌన్తేయ జగద్విపరివర్తతే ||

🌷. తాత్పర్యం :
ఓ కౌంతేయా! నా శక్తులలో ఒకటైన భౌతికప్రకృతి నా అధ్యక్షతన వర్తించుచు స్థావరజంగమములను సృష్టించుచున్నది. దాని నియమము ననుసరించియే ఈ జగత్తు మరల మరల సృష్టించబడుచు లయము నొందుచున్నది.

🌷. భాష్యము :
భౌతికజగత్తు కర్మలకు దూరముగా నున్నప్పటికి శ్రీకృష్ణభగవానుడే సర్వమునకు పరమాధ్యక్షుడని ఇచ్చట స్పష్టముగా తెలుపబడినది. ఈ సృష్టి వెనుక నున్న దివ్యసంకల్పము మరియు పూర్వరంగము ఆ దేవదేవుడే.

కాని దాని నిర్వహణము మాత్రము భౌతికప్రకృతిచే కొనసాగించబడుచుండును. వివిధరూపములలో, జాతులలో నున్న సర్వజీవులకు తాను తండ్రినని శ్రీకృష్ణభగవానుడు భగవద్గీత యందే తెలిపియున్నాడు.

సంతానము కొరకై తండ్రి తల్లి యందు బీజప్రదానము చేయునట్లు, భగవానడు కేవలము తన చూపు ద్వారా జీవులను ప్రకృతి గర్భములలో బీజరూపమున ఉంచగా వారు తమ పూర్వకోరికలు, కర్మల ననుసరించి వివిధరూపములలో మరియు జాతులలో జన్మింతురు.

జీవులందరును శ్రీకృష్ణభగవానుని వీక్షణము చేతనే జన్మించినను, తమ కర్మానుసారము మరియు కోరికల ననుసరించి వివిధ దేహములను పొందవలసివచ్చును.

అనగా యా భగవానునికి ఈ భౌతికసృష్టితో ఎట్టి ప్రత్యక్ష సంబంధము లేదు. కేవలము అతని వీక్షణము చేతనే ప్రభావితమై సమస్తము శీఘ్రమే సృష్టింపబడుచున్నది.

ప్రకృతిపై భగవానుడు దృష్టి సారించుచున్నందున సృష్టి విషయమున అతడు కర్మనొనరించుచున్నాడన్న విషయము సందేహరహితమైనను, భౌతికజగత్తు వ్యక్తీకరణమునందు మాత్రము అతనకి ప్రత్యక్ష సంబంధముండదు. ఈ విషయమున స్మృతి ఒక చక్కని ఉపమానమును ఒసగుచున్నది.

సువాసన కలిగిన పుష్పము మనుజూని ముందున్నప్పుడు దాని సుగంధము అతని ఘ్రాణశక్తిని చేరినను, మనుజుని ఘ్రాణశక్తి మరియు పుష్పములు ఒకదాని నుండి వేరొకటి విడివడియే యుండును.

భౌతికజగత్తు మరియు భగవానుని నడుమగల సంబంధము సైతము ఇట్టిదియే. వాస్తవమునకు భౌతికజగత్తులో ఎట్టి సంబంధము లేకున్నను అతడు తన వీక్షణముచే దానిని సృష్టించి నియమించును.

సారాంశమేమనగా శ్రీకృష్ణభగవానుని అధ్యక్షత లేనిదే ప్రకృతి ఏమియును చేయజాలదు. అయినను ఆ దేవదేవుడు సర్వవిధములైన భౌతికకర్మల యెడ అనాసక్తుడై యుండును.
🌹 🌹 🌹 🌹 🌹

🌹 Bhagavad-Gita as It is - 329 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj

🌴 Chapter 9 - Raja Vidya Raja Guhya Yoga - 10 🌴

10 . mayādhyakṣeṇa prakṛtiḥ
sūyate sa-carācaram
hetunānena kaunteya
jagad viparivartate

🌷 Translation :
This material nature, which is one of My energies, is working under My direction, O son of Kuntī, producing all moving and nonmoving beings. Under its rule this manifestation is created and annihilated again and again.

🌹 Purport :
It is clearly stated here that the Supreme Lord, although aloof from all the activities of the material world, remains the supreme director.

The Supreme Lord is the supreme will and the background of this material manifestation, but the management is being conducted by material nature. Kṛṣṇa also states in Bhagavad-gītā that of all the living entities in different forms and species, “I am the father.”

The father gives seeds to the womb of the mother for the child, and similarly the Supreme Lord by His mere glance injects all the living entities into the womb of material nature, and they come out in their different forms and species, according to their last desires and activities.

All these living entities, although born under the glance of the Supreme Lord, take their different bodies according to their past deeds and desires.

So the Lord is not directly attached to this material creation. He simply glances over material nature; material nature is thus activated, and everything is created immediately.

Because He glances over material nature, there is undoubtedly activity on the part of the Supreme Lord, but He has nothing to do with the manifestation of the material world directly.

There is a similar connection between the material world and the Supreme Personality of Godhead; actually He has nothing to do with this material world, but He creates by His glance and ordains.

In summary, material nature, without the superintendence of the Supreme Personality of Godhead, cannot do anything. Yet the Supreme Personality is detached from all material activities.
🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹


Image may contain: 2 people

🌹. శ్రీమద్భగవద్గీత - 415   / Bhagavad-Gita - 415  🌹
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 11వ అధ్యాయము - విశ్వరూప సందర్శన యోగం - 23 🌴

23. రూపం మహత్తే బహువక్త్రనేత్రం
మహాబాహో బహుబాహురుపాదమ్ |
బహూదరం బహు దంష్ట్రాకరాలం
దృష్ట్వా లోకా: ప్రవ్యథితాస్తథాహమ్ ||

🌷. తాత్పర్యం :
ఓ మహాబాహో! బహుముఖములును, నేత్రములను, భుజములను, ఊరువులను, పాదములను, ఉదరములను కలిగిన నీ గొప్ప రూపమును, భంకరమైన నీ బహుదంతములను గాంచి దేవతలతో కూడిన లోకములన్నియు వ్యథ చెందుచున్నవి. వానివలెనే నేనును కలతచెందుచున్నాను.

🌷. భాష్యము  :

🌹 🌹 🌹 🌹 🌹

🌹 Bhagavad-Gita as It is - 415 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj

🌴 Chapter 11 - Viswaroopa Sandarsana Yoga - 23 🌴

23. rūpaṁ mahat te bahu-vaktra-netraṁ
mahā-bāho bahu-bāhūru-pādam
bahūdaraṁ bahu-daṁṣṭrā-karālaṁ
dṛṣṭvā lokāḥ pravyathitās tathāham

🌷 Translation :
O mighty-armed one, all the planets with their demigods are disturbed at seeing Your great form, with its many faces, eyes, arms, thighs, legs and bellies and Your many terrible teeth; and as they are disturbed, so am I.

🌹 Purport :

🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

Image may contain: 1 person, outdoor


🌹. శ్రీపాద శ్రీవల్లభ చరితామృతము  - 203  / Sripada Srivallabha Charithamrutham - 203 🌹
✍️. శ్రీ మల్లాది గోవింద దీక్షితులు
📚. ప్రసాద్ భరద్వాజ

అధ్యాయము 34

🌻. మానవత్వమే అసలైన దైవత్వం (ధూమావతి) - 1 🌻

🌻. బ్రాహ్మణుని దీనావస్థ 🌻

మేమిద్దరం శ్రీపాదుల నామ స్మరణ చేస్తూ మా ప్రయాణం సాగిస్తూ ఒక గ్రామం చేరుకున్నాం. శ్రీపాదుల దయ వల్ల మా ప్రయాణంలో మాకు ప్రతిచోట అడగకుండానే ఆతిథ్యం లభించింది. ఆ గ్రామంలో విశేషం ఏమిటంటే ఒక ఋణదాత ఒక బ్రాహ్మణుడి ఇంటిలోని సామానంతా వీధిలో పారేస్తు న్నారు. పాపం! అతని భార్యా, పిల్లలు కూడా వీథిలో నిల్చు న్నారు.

ఒక గిరి గీసి పాపం ఆ బ్రాహ్మణుని అందులో నిల్చోబెట్టి ఎన్ని రోజుల్లో అప్పు తీరుస్తావో యఙ్ఞోపవీతం పట్టుకొని ఖచ్చితంగా చెప్పమని ఋణదాత నిర్బంధం చేస్తున్నాడు. ధర్మగుప్తులకు జాలి వేసి ధన సహాయం చేయాలనుకున్నారు.

కాని అప్పుడు అంత మొత్తం వారి వద్ద లేదు. ఆ బ్రాహ్మణుని దీనావస్థ చూసి జాలి వేసి నేను కల్పించుకొని ఋణదాతతో మరియొక రెండు వారాలు గడువు ఇచ్చినట్లయితే అతను అప్పు తీర్చగలడని, దానికి నేను హామీ అని చెప్పాను.

వెంటనే నా ప్రతిపాదనని ఒప్పుకుంటూ బాకీ తీర్చేవరకు మేమిద్దరం ఆ గ్రామంలోనే ఉండాలని, బ్రాహ్మణుడు ఋణం తీర్చక పోయిన పక్షంలో న్యాయాధికారి వేసే శిక్షను నేను అనుభవించవలసి ఉంటుందని షరతులు విధించారు ఆ ఋణదాత.

 పూర్వాపరాలు ఆలోచించకుండా ఎవరి విషయంలోనో తల దూర్చినందుకు, నాతోపాటుగ ధర్మగుప్తులను కూడా సంకట పరిస్థితులలో ఇరికించినందుకు నన్ను నేనే నిందిం చుకున్నాను. కాని ఇద్దరం శ్రీపాదులవారిదే భారమని, వారే మమ్మల్ని కాపాడుతారని నమ్మకంతో ఉన్నాము.

🌻. పందాల జోరు 🌻

ఆ బ్రాహ్మణుని చూడబోతే చాలా బీదవాడు. వంటకి సంభారాల మాట అటుంచి, దేవుడి దీపారాధనకైనా నూనె, వత్తి లాంటివి కూడా లేవు. కాలే కడుపులతో మేమిద్దరం కూర్చొని శ్రీపాదరాజం శరణం ప్రపద్యే అనే మంత్రాన్ని పాడుతుంటే ఆ వీధిలోని పిల్లలు, పెద్దలు కూడా మాతో కలిసి నామ సంకీర్తన చేసారు.

వారిలో కొందరు పంట కాపులు ఉన్నారు. నేనొక మహాపురుషుడి శిష్యుడినని, నా వద్ద దైవీశక్తులు ఉన్నాయని, అందుకే ధైర్యంగా హామీ ఇవ్వ గలిగానని, నాకు జోస్యంకూడా బాగా వచ్చని వాళ్ళు ఊరిలో ప్రచారం చేసారు.

నేనిచ్చిన హామీపైన ఆధారపడి బ్రాహ్మణుడు అప్పు తీరుస్తాడని కొందరు, తీర్చలేడని మరి కొందరు ఊళ్ళో పందాలు కాయడం మొదలు పెట్టారు. అనా లోచితంగా తమ భక్తుడు పలికిన మాటలను భగవంతుడే నిజం చేయాలని నేను మనసులో అనుకున్నాను.

 ఆ ఊళ్ళోనే శరభేశ్వరశాస్త్రి అనే పండితుడు ఉన్నారు. వారు మంత్ర శాస్త్రవేత్త కూడా. వారు ఏదో ప్రేతాత్మ సహాయంతో భూత, భవిష్యత్, వర్తమానాలు తూచా తప్పకుండా చెప్పే వారు. పందెగాళ్ళు కొందరు వారి దగ్గరకు వెళ్ళి విషయం చెప్పగానే అతడు ప్రేతాత్మని ప్రశ్నించారు.

అది బ్రాహ్మణుడు అప్పు తీర్చలేడని చెప్పడంతో ఆయన అదే నొక్కి చెప్పారు. దీనితో నూర్ల వరహాలలో పందాలు కాయ సాగారు. శంకరభట్టుకి వత్తాసు ఇస్తున్నవాళ్ళు పేద బ్రాహ్మ ణుడి ఇంటికి సంభారాలు పంపడం మొదలు పెట్టారు.

కాని నాకు పరిస్థితి అంతా అయోమయంగా ఉంది. “తండ్రీ! శ్రీపాదా! అంతంత మాత్రం చదువుతో, ఏ ఆధ్యాత్మిక శక్తి, జపతపాలు, యోగాభ్యాసాలు, నియమ నిష్ఠలు లేని నేను, కేవలం మీమీద ప్రగాఢ భక్తితో మీ చరిత్ర వ్రాయడానికి కుతూహల పడుతున్న నేను అనాలోచితంగా ఈ పరిస్థితు లలో ఇరుక్కున్నాను. నన్ను గట్టెక్కించు ప్రభూ, మీదే భారం,” అని ప్రార్థించాక ఎంతో ధైర్యంగా అనిపించింది.

🌻. శరభేశ్వరశాస్త్రి సోదరి 🌻

శరభేశ్వరశాస్త్రికి ఆ గ్రామంలోనే నివసిస్తున్న ఒక చెల్లెలు ఉంది. భర్త చనిపోయి తనకు వైధవ్యం వచ్చినట్లు ఆమెకు కల వచ్చింది. అన్నగారికి తన కల గురించి చెప్పితే ఆయన ప్రేతాత్మను అడిగి దేశాంతరంలో ఉన్న ఆమె భర్తని దొంగలు దోచుకొని చంపివేసారని చెప్పారు.

కంటికి మంటికి ఏకధారగా ఏడుస్తున్న ఆమెను ఓదార్చడానికి వెళ్ళిన పంటకాపులు ఆమెని నా వద్దకు తెచ్చారు. వస్తూనే ఆమె, “అన్నా! నా మాంగల్యాన్ని రక్షించండి,” అంటూ నా కాళ్ళ మీద పడింది.

నేను అప్రయత్నంగా నీ భర్తకు ఏమీ కాదు, అని చెప్పి పంచదేవ్పహాడ్లో పంటకాపు మాకు ఇచ్చిన అక్షతలు కొన్ని ఇచ్చి పూజగదిలో భద్ర పరచమని చెప్పి ఆమె భర్త కొద్ది రోజులలో తిరిగి వస్తారని ధైర్యం చెప్పాను.

ఈ విషయం విన్న శరభేశ్వరశాస్త్రి అగ్గి మీద గుగ్గిలంఅయి తన చెల్లెలి భర్త తిరిగి వచ్చి తన జోస్యం తప్పినట్లయితే తానే ఆ బ్రాహ్మణుడి బాకీ పూర్తిగా తీరుస్తానని, శంకరభట్టుని గురువుగా స్వీకరించి శ్రీపాదులను ఆరాధిస్తానని ప్రతిఙ్ఞ చేసారు. నాల్గవరోజు చెల్లెలి భర్త దేశాంతరం నుండి తిరిగి వచ్చారు.

మార్గ మధ్యంలో దొంగలు తనను చంపబోగా సమయానికి ఒక ముస్లిం పహల్వాన్ వచ్చి తనను ఆదు కున్నారని చెప్పడంతో నేను ఇచ్చిన మంత్రాక్షతల వల్ల తన భర్త బ్రతికాడని ఆమె భావించింది.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

🌹 Sripada  Srivallabha  Charithamrutham - 203  🌹
✍️  Satya prasad
📚. Prasad Bharadwaj

CHAPTER 20
🌴. The  Story  of  Vissavadhanulu Description  of  Sripada’s  divine  auspicious  form - 10 🌴

🌻. Sripada  is  the  form  of  all  Gods  and  the  root  of  all  🌻

When  Bapanarya  put  a  series  of  questions,  Sripada  smiled  pleasingly  and  said,  ‘Thatha!  Just now  I  gave  higher  states  to  this  thorny  bush.  There  should  not  be  any  doubt  whether  there  is  a precedence  in  the  shastras  for  my  actions. 

I  am  present  in  all  planes  of  yoga.  A  yogi  in  that respective  plane  will  be  able  to  know  me.  Srishti  (creation)  is  not  ‘Maya’.  To  think  of  this  as  shristi  is ‘Maya’.  In  all  this  creation,  there  is  only  one  ‘chaitanyam’  of  God. 

But  it  is  subject  to  transformations in  different  kinds  of  states.  Time  (kaala)  is  necessary  for  this  process  of  transformation.  As  there  is awareness  of  ‘time’,  there  is  an  experience  of  transformation. 

This  ‘time’  is  caused  by  the movements  of  the  planets  like  Sun  and  Moon.  Atri  Maharshi  had  the  awareness  of  the  three  ‘kaalas’ (past,  present  and  future)  and  the  awareness  of  three  states  (jagrit,  swapna  and  shshupti)  at  the same  time.

 In  this  creation,  the  great  woman  who  had  the  experience  of  Anasuya  tatwam  (no  ill feeling  towards  anything)  is  Anasuya  Matha.

 I  have  the  experience  of  ‘creation,  protection  and annihalation’  ‘the  gross,  subtle  and  causal  bodies’,  ‘past,  present  and  future’  and  all  other  things  at the  same  time.  Hence,  mine  is  eternal  ‘present’  (vartamanam). 

I  experience  the  thing  that happened,  that  is  happening  and  that  is  going  to  happen  at  the  same  ‘time’.  In  that  state,  it  is  true that  Trimurthis  and  three  Shaktis  were  in  Adiparashakti  before  the  ‘creation’.  Myself  and Adiparashakti  are  not  different. 

But  there  is  a  subtle  matter  in  this.  As  there  is  a  ‘Mahasankalpam’ that  all  the  creation  has  to  come  from  ‘female  form’,  Adiparashakti  form  has  expressed  itself. 

But how  does  the  sankalpam  occur  to  Adiparashakti  that  the  creation  must  be  done  and  the  creation should  be  in  a  particular  manner?  The  power  behind  that  sankalpam  is  Myself  in  the  form  of  Maha Sankalpam. 

The  manifestation  of  Adiparashakti,  the  three  Murthis  and  the  three  Shaktis  occurred  in accordance  with  the  Maha  Sankalpam.  This  is  the  matter  of  utmost  secrecy.  If  that  Maha  Sankalpam ‘wills’,  it  happens  immediately.  The  ‘will’  and  the  ‘happening’  occur  at  the  same  time.

 I  am  the  root ‘shakti’  which  controls  all  shaktis.  In  this  creation,  the  relation  of  father  and  mother,  father  and  son, wife  and  husband  and  Brother  and  Sister  are  essential. 

To  make  these  sacred  relations  as  ideal,  the forms  of  ‘Devis’  and  ‘Devathas’  have  come.  Jeeva  is  the  Shakti  in  the  Maya.  I  am  Shakti  which transcends  ‘maya’.  Maya  Shakti  and  Maha  Shakti  meet  only  with  the  help  of  Yoga  Shakti. 

The  same Maha  Shakti  which  is  seen  in  a  female  form  as  Vasavi  Kanyaka,  is  seen  in  male  form  as  Sripada Srivallabha.

The  expression  of  two  forms  of  Shakti  is  also  due  to  the  ‘will’  of  Maha  Sankalpam.  While being  worshipped  as  Adipara  Shakti  or  the  root  Datta,  the  three  Murthis  and  the  three  Shaktis remain  merged. 

Only  people  having  the  wealth  of  sadhana  will  understand  these  relations  of  Gods, their  philosophies  and  the  experiences  of  those  states.  

Continues...
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

Image may contain: 1 person

🌹. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 84 🌹
✍️. రచన : సద్గురు ఇ. కృష్ణమాచార్యులు
📚 . సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🌻 సాధన- సమిష్టి జీవనము - 5 🌻

తమకూ, తోటివారికీ నడుమ విభజన రేఖ గీచే ఏ అంశమునయినా మరవగలగాలి, సమిష్టి జీవన‌ మాధుర్యంలో తమను తామే మరవగలగాలి. అపుడే‌ దివ్యానంద స్పర్శ‌ అందుతుంది.

ఇంకో విషయము. ఆధునిక యువత చాలా వరకు ఇంగిత జ్ఞానంతో కన్నా, ఉద్వేగాలకు, ఆవేశాలకు లోనై నిర్ణయాలు తీసుకోవడం జరుగుతున్నది. దీనికి ముఖ్యకారణము తల్లిదండ్రులు, మానవుల గుండె లోతుల్ని తడిమి రసప్లావితం చేయగల కావ్యాలను వారికి అందింపలేక పోవడమే. సాధకులు అనుదినమూ రామాయణ భారత‌ భాగవతాది కావ్యపఠనము విధిగా అవలంభించాలి.

రానున్న శతాబ్దములలో సమిష్టి జీవనం అన్ని సరిహద్దులను చెరపేసి విస్తరిస్తుంది. ఇది పరమగురువుల ప్రణాళిక. దీనికి అనుగుణముగా సాగలేనివారే వెనుకబడిపోతారు. క్రొత్తవారు చేరతారు అంతే.
....✍ మాస్టర్ ఇ.కె.
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

No photo description available.

🌹 The Masters of Wisdom - The Journey Inside - 106 🌹
🌴 The Aquarian AGE - 2 🌴
✍️ Master E. Krishnamacharya
📚 . Prasad Bharadwaj

🌻 Descent of the Aquarian Energy - 1 🌻

Towards the end of the 19th century, Madame Blavatsky foresaw that at the beginning of the 20th century an energy would come to uplift humanity and to usher in the Age of Aquarius.

Some of her followers then prepared Jiddu Krishnamurti as a pure instrument for receiving the energy. But the Divine had other plans.

The descending energy was so strong; the higher circles decided that the energy could only be received by the Agastya Ashram.

Agastya, the Master of the Nilagiri Mountains, also called Master Jupiter, always came to the rescue of the Hierarchy in situations of crisis. And it was decided that the energy would touch the planet in Kumbhakonam (temple city in the state of Tamil Nadu, India).

The name of the place means 'Aquarius Angle'. There is an Adi Kumbeswara Temple, and the lake where the energy entered is still considered very sacred today.

Master CVV, an advanced disciple of Agastya, was chosen to receive the energy.

He decided to be born in the same place that the Aquarian Energy had visited before. He was born in Kumbhakonam in 1868, 42 years before the descent of the Energy.

Until the descent, he led the life of a Raja Yogi, full of splendour and fulfilment. He knew that the energy was touching the earth and that he would receive this energy.

At the midnight of March 31, 1910, when the tail of Halley's comet touched the earth, there was a strong thunderclap over Kumbhakonam and the energies struck the Master's house like a mighty lightning bolt. He sat awake in the antechamber of the house, ready to receive the energy of the comet.

The energy penetrated him and was absorbed by him. This is not possible for a normal person.

🌻 🌻 🌻 🌻 🌻 🌻 🌻
Sources used: Master K.P. Kumar: The Aquarian Master. Div. seminar notes/ Master E. Krishnamacharya: Spiritual Astrology.

Continues....
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

Image may contain: 1 person

🌹. శ్రీ ఆర్యా ద్విశతి  - 67 🌹
🌻. శ్రీ లలితా స్తవరత్న వైజ్ఞానిక ధ్యాన యోగము 🌻
✍️. విరచితం : భగవాన్ శ్రీ క్రోధభట్టారక  (దుర్వాస మహర్షి)
📚. ప్రసాద్ భరద్వాజ

🌻 II ఆర్యా ద్విశతి - 133వ శ్లోకము II 🌻

 (సంక్షోభకారకచక్రాధిష్ఠాన దేవత శ్రీత్రిపురసుందరీ ధ్యానము)
సంక్షోభకారకే౨స్మిన్ చక్రే శ్రీత్రిపురసుందరీ సాక్షాత్ I
గోప్త్రీ గుప్తతరాఖ్యా గోపాయతు మాం కృపార్ద్రయా దృష్ట్యా II ౧౩౩

🌻. తాత్పర్యము :
అస్మిన్ - ఈ, సంక్షోభకారకే చక్రే - సంక్షోభకారకమనే చక్రము నందు, గుప్తతరాఖ్యా - గుప్తతరయను పేరుగల, గోప్త్రీ - రక్షించునట్టి దేవతయగు, శ్రీత్రిపురసుందరీ సాక్షాత్ - సాక్షాత్తుగా శ్రీత్రిపురసుందరీదేవత, కృపార్ద్రయా - దయారసముతో చల్లనైన, దృష్ట్యా - చూపుతో, మాం - మమ్మల్ని, గోపాయతు - రక్షించుగాక !!

ఈ సంక్షోభకారక చక్రమునందు, గుప్తతర అను యోగినీదేవతలకు అధిష్ఠానదేవత, రక్షించునట్టి దేవతయగు, సాక్షాత్తుగా శ్రీత్రిపురసుందరీ అమ్మవారు, దయారసముతో నిండిన చల్లని చూపుతో మమ్మల్ని రక్షించుగాక !!

🌻 II ఆర్యా ద్విశతి - 134వ శ్లోకము II 🌻

సంక్షోభ కారకేఽస్మిం
శ్చక్రే శ్రీ త్రిపుర సున్దరీ సాక్షాత్ I
గోప్త్రీ గుప్తతరాఖ్యా
గోపాయతు మాం కృపార్ద్రయా దృష్ట్యా II 134 II

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹


Image may contain: 2 people


🌹. దాశరధి శతకము - పద్య స్వరూపం - 46  / Dasarathi Satakam - 46 🌹
పద్యము - భావము
📚. ప్రసాద్ భరద్వాజ

🌻 91వ పద్యము :
ఎక్కడి తల్లిదండ్రి సుతులెక్కడి వారు కళత్ర బాంధవం
బెక్కడ జీవుఁడెట్టి తను వెత్తిన బుట్టును బోవుచున్న వా
డొక్కడెపాప పుణయ ఫల మొందిన నొక్కడె కానరాడువే
ఱొక్కడు వెంటనంటిభవ మొల్లనయాకృప జూడువయ్యనీ
టక్కరి మాయలందిడక దాశరథీ కరుణా పయోనిధీ

🌻. భావము :
తల్లిదండ్రులు, కుమారులు, భార్య, వీరంతా ఎక్కడినుంచి వచ్చారు? ఎన్నో జన్మలనెత్తుతూ, బంధములతగుల్కొని జీవించి మరణించునది దేహమే కాని, అన్నింట ప్రకాశించు జీవుడు ఒకడే. అన్ని జన్మల పాపపుణ్యములను జీవుడు తానే అనుభవించవలెను కాని ఎవరూ తోడురారు. నాకు మరు జన్మ మీద ఆశలేదు. హే రామా! నన్ను ఈ సంసార బంధములనించి విముక్తుని చేసి జీవన్ముక్తిని ప్రసాదించుము కరుణాసాగరా!

🌻. 92వ పద్యము :
దొరసినకాయముల్ముదిమి తోచినఁజూచిప్రభుత్వముల్సిరు
ల్మెఱపులుగాగజూచిమఱి మేదినిలోఁదమతోడివారుముం
దరుగుటజూచిచూచి తెగు నాయువెఱుంగక మోహపాశము
ల్దరుగనివారికేమిగతి దాశరథీ కరుణాపయోనిధీ

🌻. భావము :
శరీరము వుర్ధాప్యములో శుష్కించినా, రాచరికములు, సిరులు అశాశ్వతములైనవివని తెలిసినా, తోటివారు చనిపోయినప్పుడు తాను కూడా ఒకరోజు చనిపోవలసిందేనని తెలిసినా మొహములో పడుతున్నాము. అట్టి ఈ వ్యామోహ పాశములను వదిలించి మా విముక్తి మార్గమును చుపవయా దేవా! దీనమందిరా!

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

🌹 Dasarathi Satakam - 46 🌹
Sloka and Meaning
📚. Prasad Bharadwaj
 
🌻 91th  Poem :
ekkaDi tallidaMDri sutulekkaDi vAru kaLatra bAMdhavaM
bekkaDa jIvuDeTTi tanu vettina buTTucu bOvucunna vA
DokkaDepApa puNya Pala moMdina nokkaDe kAnarADuvE
rxokkaDu veMTanaMTiBava mollanayAkRupa jUDavayya nI
Takkari mAyalaMdiDaka dASarathI karuNA payOnidhI.

🌻 Meaning :
The apparent relationships like mother, father, son, wife and relatives are all illusory. Except the sins and good things done by us nothing follows us after we die. Therefore please show compassion and prevent me from getting entrapped by your Maya.

🌻 92th Poem :
dorasinakAyamulmudimi tOcinajUcipraButvamulsirul
merxupulugAgajUcimarxi mEdinilOdamatODivArumuM
daruguTajUcicUci tagu nAyuverxuMgaka mOhapASamu
ldaruganivArikEmigati dASarathI karuNApayOnidhI.

🌻 Meaning :
Human beings observe people growing old, see that power and riches are not permanent, notice some of their contemporaries die before their own eyes, realise that their own life is coming to end soon and yet are unable to come out of the shackles of infatuation for worldly objects. What is the fate of such people? (What recourse should they take?).

Continues...
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

Image may contain: Yanamandra Srinivasa Bhaskara Rao, text that says 'NARADA MAHARSHI'

🌹. నారద భక్తి సూత్రాలు - 23 🌹
✍️. సద్గురు శ్రీ విజ్ఞాన స్వరూప్ కోసూరి మురళీకృష్ణ, అచల గురు పీఠము.
📚. ప్రసాద్ భరద్వాజ
ప్రథమాధ్యాయం - సూత్రము - 14

🌻 14.   లోకోఽపి తావదేవ, భోజనాది వ్యాపారస్త్వా శరీర ధారణావధి 🌻

            లోకాచారాలు దేశకాల పాత్రతలనుబట్టి భిన్న భిన్నంగా ఉంటాయి. నియమాలు అన్ని చోట్లా, అన్ని కాలాలలో అందరిలో ఒకే విధంగా ఉండవు.

సిద్ధుడికి మాత్రం ఏ నియమం వర్తించదు. అతడు ఒకప్పుడు లోకాచారానికి విరుద్ధంగా కూడా ఉండవచ్చును. ఎందుకంటే అతడు స్వయం బుద్ధితో పనిచేయడు.

ఈశ్వర ప్రేరణను బట్టి వర్తిస్తాడు. ఆ పరాభక్తుడేది ఆచరిస్తే అదే ధర్మమౌతుంది. ఈ విధమైన మార్పుకు కారణం దేశ కాల పాత్రతలలో వచ్చిన మార్పే గాని అది పూర్వ శాస్త్ర తిరస్కారం కాదు.

            శరీర ధారణ విషయంలోను, భోజనాది వ్యాపారాల విషయంలోను అతడు తన జీవితాన్ని భగవత్సేవకు వినియోగపడేలా ఉంటాడు. అంతేగాని శరీరేంద్రియ, లోక సంబంధ విషయాలను అతడెప్పుడో అధిగమించే ఉన్నాడు.

ఏనాడో భగవదర్పితమయి ఉన్నాడు. తన శరీర పోషణ కొరకు  కాకుండా, భగవత్సేవ కొరకు మాత్రమే ఏదైనా చేస్తూ ఉంటాడు. అయినా వ్యాధి, బాధలు కలిగినప్పుడు శరీర పోషణను ఉపేక్షించడు.

అతడు శరీరాభి మానాన్ని విడచినవాడు గనుక, ఆ శరీరాన్ని భగవత్సేవకు ఉపయోగపడే పనిముట్టుగా భావించి దానిని పనిచేసే స్థితిలో ఉంచుకోవడానికన్నట్లు బాగు చేసుకుంటూ ఉంటాడు. సార్వజనీనమైన సామాన్యమైన రీతిలో ఇతరుల ఉన్నతికొరకు వ్యవహరిస్తూ ఉంటాడు.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

No photo description available.

🌹. పంచకోశములు - అన్నమయకోశము 🌹
✍️. సద్గురు శ్రీ విద్యాసాగర్
చలాచల బోధ...
📚. ప్రసాద్ భరద్వాజ

కోశము అంటే కత్తిని కప్పివుంచే వర. కత్తిని వర ఏవిధముగా  కప్పి ఉంచుతుందో అదేవిధముగా నేను ఆత్మను అనే భావనను  పంచకోశములతో తధాత్మ్యత మరుగు పరుస్తున్నది. తిరిగి నీవు ఆత్మ స్వరూపుడవు, పంచకోశములకు విలక్షణుడవు అని నిరూపించుటకు, స్థిరపరచుటకు  పంచకోశ విచారణను  చెబుతారు.
 
అన్నమయకోశము,ప్రాణమయకోశము ,మనోమయకోశము  ,విజ్ఞానమయకోశము ,ఆనందమయకోశము  అను ఐదింటిని పంచకోశములు అంటారు.
 
నేను వ్యవహరించే సమయమున,  శరీర ,ప్రాణ మనో బుద్ధులతో తధాత్మ్యతను సూచించుటకు పెట్టిన పేర్లు పంచకోశములు. శరీర ,ప్రాణ మనో బుద్ధులతో తధాత్మ్యతను తొలగింప చేసి  సాక్షిగా నిలిపేది  పంచకోశ విచారణ.
 
బాహ్య నేత్రములకు కనిపించే ఈ శరీరమును అన్నమయకోశము అంటారు. అన్నము వలన పుట్టి ,అన్నము వలన  పెరిగి, అన్నము లేకపోయిన నశిస్తుంది కాబట్టి దీనికి అన్నమయకోశము అను పేరు వచ్చినది. దీనినే స్థుల శరీరము అని కూడా అంటారు.
 
 సర్వ కాల సర్వ అవస్థల యందు పరిణామము లేక ఏక రీతిగా ఉండునది ఆత్మ.

అన్నమయకోశము పుట్టుకకు పూర్వము లేదు, మరణము తరువాత ఉండదు. కనుక సర్వ కాలముల  యందు ఉండుట లేదు.
శరీరము  బాల్య , యవ్వన , కౌమార, వృద్దాప్యముల యందు  నిరంతరము మార్పు   చెందు చున్నది. కనుక  అన్నమయకోశము ఆత్మ కాదు.
 
కాని నేను  వ్యవహరించే సమయమున
నేను అందముగా లేక అంద విహీనముగా ఉన్నాను
నేను బలవంతుడను , బలహీనుడను
నేను  బాలుడను ,యవ్వనుడను  , వృద్దుడను, నేను గృహస్తుడను, సన్యాసిని.
నేను ఆరోగ్యముగా లేక  అనారోగ్యముతో ఉన్నాను    అని
శరీరమునకు సంబందించిన వాటిని నేనుకు ఆపాదిస్తున్నాము.
 
నేను ఆత్మ స్వరూపుడను. నేను శరీరమును కాదు. పైనవన్నియు శరీరమునకు సంబందించినవి అని ఉదాసీనముగా , సాక్షిగా ఉండవలెను.
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

Image may contain: text

🌹. సౌందర్య లహరి -30 / Soundarya Lahari - 30 🌹
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. అష్టసిధ్దులు కలుగుటకు, పరకాయ ప్రవేశ శక్తి కలుగుటకు 🌴

శ్లో: 30. స్వదేహోధ్భూతాభిర్ఘృణిభి రణిమాద్యాభి రభితో
 నిషేవ్యేనిత్యే త్వా మహమితి సదా భావయతియః l
కిమాశ్చర్యం తస్య త్రినయనసమృద్ధిం తృణయతో
మహా సంవర్తాగ్ని ర్విరచయతి నీరాజన విధిమ్ ll
 
🌻. తాత్పర్యము : 
అమ్మా ! ఆద్యంతములు లేని దానవు అని లోకములచే కీర్తింపబడు ఓ తల్లీ, నీ శరీరమునుండి వచ్చు కిరణములు, అణిమాణిమ సిద్ధులు ఆవరింప బడినట్టి నిన్ను ఏ సాధకుడు ధ్యానించు చున్నాడో, ఈశ్వరుని సంపదను కూడా తృణప్రాయముగా చూచు ఆ సాధకునికి ప్రళయాగ్ని సైతము నీరాజనము పట్టుననుట అతిశయోక్తి కాదు కదా !

🌻. జప విధానం - నైవేద్యం:--

ఈ శ్లోకమును 1000 సార్లు ప్రతి రోజు 96 రోజులు జపం చేస్తూ, తేనె, పప్పు అన్నము, తాంబూలము నివేదించినచో అష్టసిధ్దులు కలుగునని, పరకాయ ప్రవేశ శక్తి లభిస్తుందని చెప్పబడింది.
🌹 🌹 🌹 🌹 🌹

🌹 Soundarya Lahari - 30 🌹
📚 Prasad Bharadwaj

🌴 Ashta Siddhi's and Entering another body 🌴

30. Sva-deh'odbhutabhir ghrnibhir animadyabhir abhito Nishevye nitye tvamahamiti sada bhavayati yah; Kim-ascharyam tasya tri-nayana-samrddhim trinayato Maha-samvartagnir virchayati nirajana-vidhim.

🌻 Translation :
It is not surprising to know, oh mother, who does not have birth and death, and who is most suitable to be served, that the destroying fire of the deluge, shows prayerful harathi to the one Who considers you, (who is of the form of rays, and is surrounded on all four sides, by the angels of power called anima,) as his soul always, and who considers the wealth of the three eyed god, as worthless and as equal to dried grass.

🌻 Chanting procedure and Nivedyam (offerings to the Lord) :

If one chants this verse 1000 times each day for 96 days, offering  honey, kulaannam (Dhal Rice ) and thambulam  as prasadam, it is said that one would be able to get Ashta Siddhi's and ability to enter another body.

🌻 BENEFICIAL RESULTS:
Attainment of physical power, control of senses, power of tansmigration into other bodies.(Yantra is to be borne on the head during the recital).
 
🌻 Literal Results:
Bodily ailments getting cured.
🌹 🌹 🌹 🌹 🌹 

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

Image may contain: 1 person


🌹 . శ్రీ శివ మహా పురాణము - 161 🌹 

రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి

📚. ప్రసాద్ భరద్వాజ


🌴. రుద్ర సంహితా - సృష్టిఖండః 🌴 

38. అధ్యాయము - 13


🌻. శివపూజ - 1 🌻


బ్రహ్మోవాచ |


అతః పరం ప్రవక్ష్యామి పూజా విధి మనుత్తమమ్‌ | శ్రూయతా మృషయో దేవా స్సర్వకామ సుఖా వహమ్‌ || 1


బ్రహ్మే మూహూర్తే చోత్థాయ సంస్మరేత్సాంబకం శివమ్‌ | కుర్యాత్తత్ర్పార్థనాం భక్త్యా సాంజలిర్నతమస్తకః || 2


ఉత్తష్ఠోత్తిష్ఠ దేవేశ ఉత్తిష్ఠ హృదయేశయ | ఉత్తిష్ఠ త్వముమాస్వామిన్‌ బ్రహ్మాండే మంగలం కురు || 3


జానామి ధర్మం న చమే ప్రవృత్తిః జానా మ్యధర్మం న చ మే నివృత్తిః |


త్వయా మహాదేవ హృది స్థితేన యథా నియుక్తోsస్మి తథా కరోమి || 4


బ్రహ్మ ఇట్లు పలికెను -


ఓ ఋషులారా! దేవతలారా! మీకీపైన సర్వశ్రేష్ఠము, సర్వకామనలను సుఖమును ఇచ్చునది యగు పూజావిధిని చెప్పగలను. వినుడు (1). 


బ్రాహ్మ మూహూర్తము నందు లేచి సాంబ సదాశివుని స్మరించవలెను. తలవంచి, అంజలి యొగ్గి భక్తి తో ఆయనను ప్రార్థించవలెను (2). 


ఓ దేవదేవా! లెమ్ము. హృదయము నందుండు వాడా! లెమ్ము. ఉమాపతే! నీవు లెమ్ము. జగత్తునకు మంగళములనిమ్ము (3). 


నేను ధర్మము నెరింగియూ, అనుష్ఠంపకున్నాను. అధర్మము నెరింగి యూ పరిహరింపకున్నాను. ఓ మహాదేవా! హృదయమునందున్న నీవు ఎట్లు ఆజ్ఞాపించిననూ, అటులనే చేసెదను (4).


ఇత్యుక్త్వా వచనం భక్త్వా స్మృత్వా చ గురుపాదకే | బహిర్గచ్ఛే ద్దక్షిణాశాం త్యాగార్ధం మలమూత్రయోః || 5


దేహ శుద్ధిం తతః కృత్వా సమృజ్జలవిశోధనైః | హస్తౌ పాదౌ చ ప్రక్షాల్య దంత ధావనమాచరేత్‌ || 6


దివానాథే త్వనుదితే కృత్వా వై దంతధావనమ్‌ | ముఖం షోడశవారం తు ప్రక్షాల్యాంజలిభిస్తథా || 7


షష్ఠ్యాద్యమాశ్చ తిథయో నవమ్యర్కదినే తథా | వర్జ్యాస్సురర్షయో యత్నాద్భక్తేన రదధావనే || 8


ఈ విధముగా భక్తితో స్తోత్రము చేసి, గురు పాదములను స్మరించి, మలమూత్ర విసర్జన కొరకు దక్షిణ దిక్కునకు వెళ్లవలెను (5). 


తరువాత మట్టితో, మరియు నీటితో దేహశుద్ధి గావించుకొని, చేతులను కాళ్లను కడుగు కొని దంతధావనమును చేయవలెను. (6). 


సూర్యుడు ఉదయించుటకు ముందే దంత ధావనము చేసి, దోసిలి లోని నీటితో ముఖమును పదునారు సార్లు కడుగు కొనవలెను (7). 


ఓ దేవతలారా! ఋషులారా! షష్ఠి, పాడ్యమి, అమావాస్య, నవమి, అను తిథుల యందు, ఆదివారమునాడు భక్తుడు (పుల్లతో) దంత ధావనమును వీడవలెను (8).


యథా వకాశం సుస్నాయా న్నద్యాదిష్వథవా గృహే | దేశకాలా విరుద్ధం చ స్నానం కార్యం నరేణ చ || 9


రవేర్దినే తథా శ్రాద్ధే సంక్రాంతౌ గ్రహణ తథా | మహాదినే తథా తీర్థే హ్యు పవాసదినే తథా || 10


ఆశౌచేప్యథవా ప్రాప్తే న స్నాయాదుష్ణవారిణా | యథా సాభి ముఖం స్నాయాత్తీర్థదౌ భక్తి మాన్నరః || 11


తైలా భ్యంగం చ కుర్వీత వారాన్‌ దృష్ట్వా క్రమేణ చ | నిత్యమ భ్యంగకే చైవ వాసితం వా న దూషి తమ్‌ || 12


శ్రాద్ధే చ గ్రహణ చైవోపవాసే ప్రతి పద్దినే | అథవా సార్షపం తైలం న దుష్యేద్గ్రహణం వినా || 13


అవకాశమును బట్టి నదిలో గాని, సరస్సులోగాని, లేదా గృహమునందు గాని, చక్కగా స్నానమును చేయవలెను. మానవుడు దేశకాలములకు విరోధము లేకుండా స్నానము నాచరించవలెను (9). 


ఆదివారమునాడు, శ్రాద్ధ దినము నాడు, సంక్రాంతి యందు, గ్రహణమునందు, శివరాత్రి నాడు,పుణ్యక్షేత్రము నందు ఉపవాసము చేసిన నాడు (10), 


మరియు ఆ శౌచము వచ్చినప్పుడు వేడినీటితో స్నానమాడరాదు. భక్తి గలవాడు మానవుడు తీర్థాదులయందు ప్రవాహమునకు అభిముఖముగా స్నానము చేయవలెను (11). 


వారములోని గుణదోషములను పరికించి, నూనెతో అభ్యంగనన స్నానమును చేయవలెను. నిత్యము అభ్యంగనము చేయు వ్యక్తి తైలమును వాడుటలో దోషము లేదు. సుగంధ ద్రవ్యములను కలిపిన తైలమును వాడుటలో దోషము లేదు (12).


 శ్రాద్ధమునాడు, గ్రహణకాలముందు , ఉపవాసమున్ననాడు, మరియు పాడ్యమి నాడు ఆవాల నూనెను వాడుట దోషము కాదు (13).


సశేషం.....

🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

Image may contain: 4 people

🌹. VEDA UPANISHAD SUKTHAM - 48 🌹

🌻 1. Annapurna Upanishad - 10 🌻

--- From Atharva Veda

✍️ Dr. A. G. Krishna Warrier

📚. Prasad Bharadwaj


III-6. It wanders from a cloth to a pot and thence to a big cart. The mind wanders among objects as a monkey does from tree to tree. 


III-7. The five openings, eyes and so forth, known as the sense organs of cognition, I am watching carefully with my mind. 


III-8. O you sense-organs! Slowly give up your mood of agitation. Here I am, the divine spiritual Self, the witness of all. 


III-9. With that all-knowing Self, I have comprehended (the nature of) eyes, etc. I am completely secure and at peace. Luckily I am fearless. 


III-10. Incessantly I rest in my Self, the Fourth; my vital breaths, its extensions, have all, in due order, subsided within. 


III-11. (I am) as a fire with its multitudinous flames, when the fuel has been consumed; it blazed forth but now is extinguished - the blazing fire has, indeed, been extinguished. 


III-12. Having been purified utterly, I remain equable, enjoying all alike, as it were. I am awake though in deep sleep; though in deep sleep, I am awake. 


III-13-14. Resorting to the Fourth, I remain within the body with a stable status, having abandoned, together with the long thread of sound reaching upto OM, objects in all the three worlds fashioned by imagination.


Continues....

🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

Image may contain: 1 person

🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 33 🌹

✍️. శ్రీ పుల్లెల శ్రీరామచంద్రుడు

ప్రథమ సంపుటము, అధ్యాయము - 14

సేకరణ : ప్రసాద్ భరద్వాజ


🌻. భారత వ్యాఖ్యానము - 4 🌻


అగ్నిరువాచ:


¸°ధిష్ఠిరీ కురుక్షేత్రం య¸° దౌర్యోధనీ చమూః | భీష్మద్రోణాదికాన్‌ దృష్ట్వా నాయుధ్యతి గురూనితి. 1


పార్థం హ్యువాచ భగవాన్నశోచ్యా భీష్మముఖ్యకాః | శరీరాణి వినాశీని న శరీరీ వినశ్యతి. 2


అయమాత్మా పరం బ్రహ్మ అహం బ్రహ్మాస్మి విద్ధితమ్‌ | సిద్ధ్యసిధ్ధ్యో సమో యోగీ రాజధర్మం ప్రపాలయ.


యధిష్ఠిరుని సేనయు, దుర్యోధనుని సేనయు కురుక్షేత్రమును చేరినవి. అర్జునుడు భీష్మద్రోణాదులను చూచి యుద్ధము చేయడని తెలిసికొని, భగవంతుడైన శ్రీకృష్ణు డాతనితో ఇట్లనెను. భీష్మాదులను గూర్చి శోకింప పనిలేదు. శరీరములు నశించును గాని ఆత్మ నశించదు. ఈ జీవాత్మ పరమాత్మయే. "నేనే పరబ్రహ్మను" అని తెలిసికొనుము. ప్రయత్నము సిద్ధించినను, సిద్ధింపకున్నను సమబుద్ధి కలవాడవై, యోగివై, రాజధర్మమును పాలించుము.


కృష్ణోక్తో7థార్జునో7యుధ్యద్రథస్థో వాద్యశబ్దవాన్‌ | భీష్మః సేనాపతిరభూ దదౌ దౌర్యోధనే బలే. 4


పాణ్డవానాం శిఖాణ్డీ చ తయోర్యుద్దం బభూవ హ | ధార్తారాష్ట్రాః పాణ్డవాంశ్చ జఘ్నుర్యుద్ధే సభీష్మకాః. 5


ధార్తరాష్ట్రాన్శిఖణ్డ్యాద్యాః పాణ్డవా జఘ్నరాహవే | దేవసురసమం యుద్ధం కురుపాణ్డవసేనయోః 6


బభూవ ఖస్థ దేవానాం పశ్యతాం ప్రీతివర్ధనమ్‌ |


ఈ విధముగా కృష్ణుడు ఉపదేశించగా అర్జునుడు రథముపై నెక్కి, వాద్య శబ్దములు చేయుచు యుద్ధము చేసెను. మొదట దుర్యోధన సైన్యమునకు భీష్ముడు సేనాపతి యయ్యెను. పాండవలకు శిఖండి సేనాపతి అయ్యెను. ఆ రెండు సైన్యములకును యుద్ధము జరిగెను. భీష్మునితో కూడన కౌరవులు యుధ్ధమునందు పాండవులను కొట్టిరి. శిఖండి మొదలగు పాండవ పక్షీయులు యుద్ధమునందు కౌరవులను కొట్టిరి. కురుపాండవ సేనల మధ్య యుద్ధము, ఆకాశము నుండి చూచుచున్న దేవతలకు ప్రీతిని వృద్ధిపొందించుచు, దైవాసుర యుద్ధము వలె జరిగెను.


భీష్మో7సై#్త్రః పాణ్డవం సైన్యం దశాహోభిర్న్యపాతయత్‌. 7


దశ##మే హ్యర్జునో బాణౖర్భీష్మం వీరం వవర్ష హా | శిఖణ్డీ ద్రుపదోక్తో7సై#్త్రర్వవర్ష జలదో యథా. 8


హస్త్యశ్వరథపాదాతమన్యోన్యాస్త్రనిపాతితమ్‌ |


భీష్ముడు పది దివసములలో, అస్త్రములచే పాండవ సైన్యమును ధ్వంసము చేసెను. పదవ రోజున, అర్జునుడు వీరుడైన భీష్మునిపై బాణవర్షము కురింపించెను. ద్రుపదుడు ప్రేరేపించగా శిఖండి కూడ, మేఘమువలె అస్త్రములను వర్షించెను. పరస్పరము ప్రయోగించిన అస్త్రజాలముచే ఏనుగులు, గుఱ్ఱములు, రథములు, కాలిబంటులు నేలపై కూలెను.


భీష్మః స్వచ్ఛన్దమృత్యశ్చ యుద్దమార్గం ప్రదర్శ్య చ. 9


వసూక్తో వసులోకాయ శరశయ్యాగతః స్థితః | ఉత్తరాయణమీక్షంశ్చ ధ్యాయన్‌ విష్ణుం స్తువన్‌ స్థితః 10


స్వేచ్ఛామరణము గల భీష్ముడు తనతో ఎట్లు యుద్ధము చేయవలెనో పాండవులకు చెప్పి వసువులచేత ప్రేరితుడై, వసులోకమునకు తిరిగి వెళ్ళదలచి, శరశయ్యాగతుడై విష్ణువును ధ్యానించుచు, స్తుతించుచు, ఉత్తారాయణమునకై వేచి యుండెను.


సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

No photo description available.

🌹 AVATAR OF THE AGE MEHER BABA MANIFESTING - 38 🌹

Chapter 12

✍️ Bhau Kalchuri

📚 . Prasad Bharadwaj 


🌻 The period of Preparation 🌻


The heart is the seat of the mind. It is the deepest part of the mind, and the heart is where the functions of the mind take rest. 


The Power House is a symbol for the total manifestation. Each one of us has a bulb (a heart), and because of the work of the Avatar, action and reaction are taking place in every individual mind. Thereby, a cleansing process is happening in each heart.  


If one's heart is very clean, the bulb is powerful and bright, but if it is filthy, the bulb is weak and dim. Individual effort is also required to cleanse the heart so the light in the bulb shines powerful and bright.  


This individual effort is the preparing of the bulb. The Power House is only a symbol of the total manifestation.  


The result of the universal work of the Avatar signi fies pulling the main switch of the Power House on. 


Each individual's cable is already connected with the Power House during the physical presence of the Avatar.  


The bulb is being prepared in each individual and since the hearts of most people are filthy, the cleansing process is going on. People are becoming prepared.  


When the Avatar turns on the main switch, each bulb will have its light according to its capacity, and this will be the time for his Light to shine as his total manifestation. 


Avatar Meher B aba is gradually manifesting, and we will undergo a period of preparation until we are ready to experience his total manifestation. When you are lost you look for guidance. When you are in darkness you look for light.  


In this manner, the Avatar create s such a situation in the world that each one feels lost in darkness, looking for a guiding light.  


The light is the divine free impressions from the sun of his being. In this manner, the Avatar maintains a proper relationship between his shadow, the creati on, and his Reality, the Infinite.


Continues... 

🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

Image may contain: one or more people

🌹. భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 47 🌹

🌷. సద్గురు శివానంద 🌷

📚. ప్రసాద్ భరద్వాజ


🌻. అత్రి – అనసూయ - 14 🌻


64. పరమాత్మ వస్తువును తెలుసుకోవటం ఎలాగూ సాధ్యంకాదుకాబట్టి, పరమాత్మ సగుణ స్వరూపంలో మనవలె ఒకమానవ అవతారంలో వచ్చినప్ఫడు, దాన్ని ప్రేమిస్తేచాలు. 


65. పరమాత్మ సగుణ స్వరూపంలో ఉన్నప్పుడు ప్రేమించటమే నీ కర్తవ్యం. నీ ప్రేమద్వారా అతన్ని పొందు – అని బోధ. ప్రేమ, భక్తి రెండింటికీ తేడా ఏమీలేదు. రెండూ ఒకటే. అలాగే భక్తి భావం ఉంటే, దానిని వదలనేవదలకుండా ఉండేది ప్రేమ. 


66. పరమాత్మను పొందాలి అంటే మనలో లేనటువంటి ఒక క్రొత్త గుణాన్ని సంపాదించుకోవలసిన అవసరం, ఆవశ్యకత లేదు. నీలో సహజంగా మానవుడిగా ఏయే లక్షణములున్నాయో వాటినే ఆధారంచేసుకొని నీవు భగవంతుడిని చేరవచ్చు.


67. జీవలక్షణములో ఉండేటటువంటి సహజమయిన గుణములే ఈశ్వరుడిని చేరటానికి సమర్ధవంతములు. నీలో ఏయేగుణములున్నాయో – ఈ గుణములనే నువ్వు ఈశ్వరునియందు ఆపాదించుకో! నీవు ఉన్న స్థితిని వదిలిపెట్టి లేనిస్థితిని పొందవలసిన పనియేమిలేదు. ఉన్న స్థితిలోనే ఆయనను పొందవచ్చు.


సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

No photo description available.

🌹 Seeds Of Consciousness - 113 🌹

✍️ Nisargadatta Maharaj 

📚. Prasad Bharadwaj


Unless you make tremendous efforts, you will not be convinced that effort will take you nowhere. 


The self is so self-confident that unless it is totally discouraged it will not give up. 


Mere verbal conviction is not enough. Hard facts alone can show the absolute nothingness of the self-image

🌹 🌹 🌹 🌹🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

Image may contain: 3 people, including వినుకొండ శ్రీశనైశ్చరస్వాామి దేవస్థానము

🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 23 / Sri Lalita Sahasranamavali - Meaning - 23 🌹

🌻. మంత్రము - అర్ధం 🌻

📚. ప్రసాద్ భరద్వాజ


శ్లోకము 53


205. సర్వయంత్రాత్మికా - 

అన్ని యంత్రములకు స్వరూపముగా గలది.


206. సర్వతంత్రరూపా - 

అన్ని తంత్రములను తన రూపముగా గలది.


207. మనోన్మనీ - 

మననస్థితిలో మేల్కాంచిన మననము చేయబడునట్టిది.


208. మాహేశ్వరీ - మహేశ్వర సంబంధమైనది.


209. మహాదేవీ - 

మహిమాన్వితమైన ఆధిపత్యము కలది.


210. మహాలక్ష్మీ - గొప్పవైన లక్ష్మలు గలది.


211. మృడప్రియా - 

శివుని ప్రియురాలు.


సశేషం.... 

🌹 🌹 🌹 🌹 🌹 

🌹. Sri Lalita Sahasranamavali - Meaning - 23 🌹

📚. Prasad Bharadwaj 


🌻 Sahasra Namavali - 23 🌻


205 ) Sarva yanthrathmika -   

She who is represented by all yantras(Talisman)


206 ) Sarva thanthra roopa -   

She who is  also goddess of all Thanthras which is a method of worship


207 ) Manonmani -   

She who is the result of mental thoughts of  thoughts and actions


208 ) Maaheswari -   

She who is the consort of Maheswara (Lord of everything)


209 ) Mahaa devi -   

She who is the consort of Mahe Deva(God of all gods)


210 ) Maha lakshmi -   

She who takes the form of Mahalaksmi, the goddess of wealth


211 ) Mrida priya -  

 She who is dear to Mrida (a name of Lord Shiva)


Continues...

🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

Image may contain: night

🌹. మనోశక్తి - Mind Power - 51 🌹

 Know Your Infinite Mind

🌴. సేత్ విజ్ఞానం - చానెలింగ్ ద్వారా మానవజాతికి అందించిన సందేశాలు. 🌴

సంకలనం : శ్రీవైష్ణవి 

📚. ప్రసాద్ భరద్వాజ


Q 51:-- మూల చైతన్యం - 1 


Ans :--

రాళ్లు, కొండలు, పర్వతాలు, గ్రహాలు, galaxies అన్నిటికి ఆత్మ ఉంది. విశ్వమంతా ఆవరించి ఉన్న ఆత్మయే అనంత బ్రహ్మాండ మూలచైతన్యం.


1) భూమి మీద ఒక వ్యక్తి చైతన్య పరిణామం చెందినా విస్తరించిన, కదలిక ఏర్పడిన దాని ప్రభావం మూలచైతన్యంలో multidimensional కోణాలతో అనంత దిశలు ప్రతిస్పందిస్తుంది.


2) ప్రతి సెకనులో పది లక్షల వంతు సమయంలో మూలచైతన్యం అనంతమైన combinations అనంతమైన సంభావ్యతలతో అనంత రూపాలతో అనంత దేహాలతో తనను తాను సృష్టించుకుంటుంది. ఈ అనంత తత్వాన్ని దర్శించాలంటే అంతర్ ప్రయాణం, ధ్యానం ఒక్కటే మార్గం.


3) భూమి, భూమి పైన నివసించే మానవజాతి జీవాత్మలన్నీ చైతన్య పరిణామం చెందడానికి అనంతమైన సంభావ్యతలు ఉన్నాయి.


for ex:-మనం అమెరికా నుండి ఇంగ్లాండ్ వెళ్ళడానికి లెక్కలేనన్ని మార్గాలను ఎంచుకోవచ్చు.


రోడ్ ద్వారా గాని,జల మార్గం ద్వారా గాని, ఆకాశమార్గం ద్వారా గాని ఎన్నో సంభావ్యతలును ఎంచుకుంటాము. మనం ఒక మార్గాన్ని ఎంచుకుంటే అదే మన వాస్తవం అవుతుంది.


కానీ మన అంతర్ ప్రపంచం ద్వారా అనంతమైన సంభావ్యత లు ఎంచుకుని చైతన్య పరిణామం ఏకకాలంలో పొందుతున్నాము. మనం చైతన్య పరిణామం చెందాలంటే ఈ క్షణమే అనంతమైన సంభావ్యత లు కలిగివున్నాము.


సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

Image may contain: 1 person, sitting

🌹. సాయి తత్వం - మానవత్వం - 43 / Sai Philosophy is Humanity - 43 🌹

🌴. అధ్యాయము - 6 🌴

📚. ప్రసాద్ భరద్వాజ


🌻. మరమ్మతులు - 1 🌻


1. గోపాలరావుగుండునకు ఇంకొక మంచి యాలోచన తట్టెను. ఉరుసు ఉత్సవమును ప్రారంభించినవిధముగనే, మసీదును తగినట్లుగా తీర్చిదిద్దవలెనని నిశ్చయించుకొనెను.


2. మసీదు మరమ్మతు చేయు నిమిత్తమై రాళ్ళను తెప్పించి చెక్కించెను. కాని ఈపని బాబా అతనికి నియమించలేదు.


3. నానాసాహెబు చాందోర్కరుకు ఆ సేవ లభించినది. రాళ్ళ తాపన కార్యము కాకాసాహేబు దీక్షిత్కు నియోగింపబడెను.


4. మసీదుకు మరమ్మతులు చేయుట మొదట బాబా కిష్టము లేకుండెను. కాని భక్తుడగు మహల్సాపతి కల్పించుకొని, యెటులనో బాబా యనుమతిని సాధించెను.


5. బాబా చావడిలోపండుకొన్న ఒక్క రాత్రిలో మసీదు నేలను చక్కని రాళ్ళతో తాపనచేయుట ముగించిరి.


6. అప్పటినుండి బాబా గోనెగుడ్డపై కూర్చుండుట మాని చిన్న పరుపుమీద కూర్చుండువారు. గొప్ప వ్యయ ప్రయాసలతో 1911వ సంవత్సరములో సభామండపము పూర్తిచేసిరి.


7. మసీదుకు ముందున్న జాగా చాలా చిన్నది. సౌకర్యముగా లేకుండెను. కాకాసాహెబు దీక్షిత్ దానిని విశాలపరచి పై కప్పు వేయదలచెను.


8. ఎంతో డబ్బు పెట్టి ఇనుపస్తంభములు మొదలగునవి తెప్పించి పని ప్రారంభించెను. రాత్రయంతయు శ్రమపడి స్తంభములు నాటెడివారు.


9. మరుసటిదినము ప్రాతఃకాలముననే బాబా చావడినుండి వచ్చి యది యంతయు జూచి కోపముతో వానిని పీకి పారవైచెడివారు.


10. ఒకసారి బాబా మిక్కిలి కోపోద్దీపితుడై, నాటిన ఇనుపస్తంభమును ఒక చేతితో బెకలించుచు, రెండవచేతితో తాత్యాపాటీలు పీకను బట్టుకొనెను.


11. తాత్యా తలపాగాను బలవంతముగా దీసి, యగ్గిపుల్లతో నిప్పంటించి, యొక గోతిలో పారవైచెను.


సశేషం... 

🌹 🌹 🌹 🌹 🌹 


🌹. Sai Philosophy is Humanity - 43 🌹

Chapter 6

✍️. Sri NV. Gunaji

📚. Prasad Bharadwaj


🌻 Repairs to the Masjid - 1 🌻


Another important idea occured to Gopal Gund. Just as he started the Urus or fair, he thought that he should put the Masjid in order. 


So in order to carry out the repairs, he collected stones and got them dressed. But this work was not assigned to him. 


This was reserved for Nanasaheb Chandorkar, and the pavement -work for Kakasaheb Dixit. 


First, Baba was unwilling to allow them to have these works done, but with the intervention of Mahalsapati, a local devotee of Baba, His permission was secured. 


When the pavement was completed in one night in the Masjid, Baba took a small Gadi for His seat, discarding the usual piece of sack - cloth used till then. In 1911, the Sabha - Mandap (court - yard) was also put in order with great labour and effort. The open space in front of the Masjid was very small and inconvenient. 


Kakasaheb Dixit wanted to extend it and put on it roofing. At great expense, he got iron-posts, and pillars and trusses and started the work. 


At night, all the devotees worked hard and fixed the posts; but Baba, when he returned from Chavadi next morning, uprooted them all and threw them out. 


Once it so happened that Baba got very excited, caught a pole with one hand, and began to shake and uproot it, and with the other hand caught the neck of Tatya Patil. 


He took by force Tatya’s Pheta, struck a match, set it on fire and threw it in a pit.


Continues....

🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹