1) 🌹 శ్రీమద్భగవద్గీత - 618 / Bhagavad-Gita - 618🌹
2) 🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 246, 247 / Vishnu Sahasranama Contemplation - 246, 247🌹
3) 🌹 Daily Wisdom - 37🌹
4) 🌹. కఠోపనిషత్ వివరణ - చలాచలభోధ - 171🌹
5) 🌹. వివేక చూడామణి / Viveka Chudamani - 01 🌹
6) 🌹. దేవాపి మహర్షి బోధనలు - 11🌹
7) 🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 119 / Sri Lalitha Sahasra Namaavali - 119 🌹
8) 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 188 / Sri Lalita Chaitanya Vijnanam - 188🌹
9) 🌹. ధైర్యమున్న చోటే దాపరికం ఉండదు - జీవితం మార్మికమైనది 🌹
🍀. ‘స్వేచ్ఛ. మీరనుకుంటున్నది కాదు’ నుంచి ( ఓషో బోధ ) 🍀
10) 🌹. శ్రీమద్భగవద్గీత - 531 / Bhagavad-Gita - 531🌹
11) 🌹. శ్రీమద్భగవద్గీత - 8 / Bhagavad-Gita - 8🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
12) 🌹. గీతోపనిషత్తు - సాంఖ్య యోగము - 132🌹
13) 🌹. శివ మహా పురాణము - 332🌹
14) 🌹 Light On The Path - 85🌹
15) 🌹. భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 217🌹
16) 🌹 Seeds Of Consciousness - 281 🌹
17) 🌹. భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 156🌹
18) 🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 12 / Lalitha Sahasra Namavali - 12🌹
19) 🌹. శ్రీ విష్ణు సహస్ర నామములు - 12 / Sri Vishnu Sahasranama - 12🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శ్రీమద్భగవద్గీత - 618 / Bhagavad-Gita - 618 🌹*
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ
*🌴. 18వ అధ్యాయము - మోక్ష సన్యాస యోగం - సన్న్యాసము యొక్క పూర్ణత్వము - 35 🌴*
35. యయా స్వప్నం భయం శోకం విషాదం మదమేవ చ |
న విముఞ్చతి దుర్మేధా ధృతి: సా పార్థ తామసీ ||
🌷. తాత్పర్యం :
ఓ పార్థా! ఒక స్వప్నము, భయము, శోకము, విషాదము, భ్రాంతి యనువానిని దాటలేనటువంటి మందబుద్ధితో కూడిన నిశ్చయము తమోగుణమునకు సంబంధించినట్టిది.
🌷. భాష్యము :
సత్త్వగుణప్రదానుడైనవాడు స్వప్నమును పొందడని భావింపరాదు. ఇచ్చట స్వప్నమనగా అధికనిద్ర యని అర్థము. స్వప్నము సహజమై యున్నందున సత్త్వరజస్తమో గుణములన్నింటి యందును కలుగుచుండును.
కాని అధికనిద్రను నివారింపజాలనివారు, విషయభోగములను అనుభవించుచున్నామనెడి గర్వమును వీడలేనివారు, భౌతికప్రకృతిపై ఆధిపత్యమనెడి స్వప్నమును కలిగియుండువారు, ఇంద్రియమనోప్రాణములను తద్రీతిగనే నియుక్తము చేయువారు తమోగుణప్రదానమైన నిశ్చయము (ధృతి) కలిగినవారుగా పరిగణింపబడుదురు.
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Bhagavad-Gita as It is - 618 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj
*🌴 Chapter 18 - Moksha Sanyasa Yoga - The Perfection of Renunciation - 35 🌴*
35. yayā svapnaṁ bhayaṁ śokaṁ
viṣādaṁ madam eva ca
na vimuñcati durmedhā
dhṛtiḥ sā pārtha tāmasī
🌷 Translation :
And that determination which cannot go beyond dreaming, fearfulness, lamentation, moroseness and illusion – such unintelligent determination, O son of Pṛthā, is in the mode of darkness.
🌹 Purport :
It should not be concluded that a person in the mode of goodness does not dream. Here “dream” means too much sleep. Dreaming is always present; either in the mode of goodness, passion or ignorance, dreaming is a natural occurrence.
But those who cannot avoid oversleeping, who cannot avoid the pride of enjoying material objects, who are always dreaming of lording it over the material world, and whose life, mind and senses are thus engaged, are considered to have determination in the mode of ignorance.
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 246, 247 / Vishnu Sahasranama Contemplation - 246, 247 🌹*
📚. ప్రసాద్ భరద్వాజ
*🌻246. నరః, नरः, Naraḥ🌻*
*ఓం నరాయ నమః | ॐ नराय नमः | OM Narāya namaḥ*
నయతి ప్రాణులను, విశ్వములను సృష్టిస్థితిలయాదులచే స్వస్వవ్యాపారములయందు ముందునకు కొనిపొవును. భక్తులను తన పరమపదమునకు కొనిపోవును. నయతీతి నరః ప్రోక్తః పరమాత్మా సనాతనః శాశ్వతుడగు పరమాత్ముడు నయతి/కొనిపోవును అను వ్యుత్పత్తి చే నరః అని చెప్పబడుచున్నాడు అను వ్యాసవచనముచే నరుడు అనగా విష్ణువు.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
*🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 246🌹*
📚. Prasad Bharadwaj
*🌻246. Naraḥ🌻*
*OM Narāya namaḥ*
Nayatīti naraḥ proktaḥ paramātmā sanātanaḥ / नयतीति नरः प्रोक्तः परमात्मा सनातनः The eternal Paramātma is said to lead men to salvation. So He is Naraḥ.
🌻 🌻 🌻 🌻 🌻
Source Sloka
सुप्रसादः प्रसन्नात्मा विश्वधृग्विश्वभुग्विभुः ।
सत्कर्तासत्कृतस्साधुर्जह्नुर्नारायणो नरः ॥ २६ ॥
సుప్రసాదః ప్రసన్నాత్మా విశ్వధృగ్విశ్వభుగ్విభుః ।
సత్కర్తాసత్కృతస్సాధుర్జహ్నుర్నారాయణో నరః ॥ ౨౬ ॥
Suprasādaḥ prasannātmā viśvadhr̥gviśvabhugvibhuḥ ।
Satkartāsatkr̥tassādhurjahnurnārāyaṇo naraḥ ॥ 26 ॥
Continues....
🌹 🌹 🌹 🌹 🌹
*🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 247 / Vishnu Sahasranama Contemplation - 247🌹*
📚. ప్రసాద్ భరద్వాజ
*🌻247. అసంఖ్యేయః, असंख्येयः, Asaṃkhyeyaḥ🌻*
*ఓం అసంఖ్యేయాయ నమః | ॐ असंख्येयाय नमः | OM Asaṃkhyeyāya namaḥ*
సంఖ్యాతుం న శక్యతే లెక్కించబడిటకు శక్యుడు కాని వాడు. ఈతనియందు నామ బేధ రూప భేదాదికమగు సంఖ్య వాస్తవమున ఉండదు. ఉపాసనార్థమై - ఈ కనబడు నామభేద రూప భేదాదులన్నియు కల్పించుకొనబడినవి.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
*🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 247🌹*
📚. Prasad Bharadwaj
*🌻247. Asaṃkhyeyaḥ🌻*
*OM Asaṃkhyeyāya namaḥ*
Saṃkhyātuṃ na śakyate / संख्यातुं न शक्यते The One who cannot be enumerated. He cannot be attributed a limited number of forms. All the known manifestations are only a help ease His worship and in reality He is beyond these.
Śrīmad Bhāgavata - Canto 5, Chapter 18
Yasminnasaṅkhyeyaviśeṣanāma rūpākr̥tau kavibhiḥ kalpiteyam,
Saṅkhyā yayā tattvadr̥śāpanīyate tasmai namaḥ sāṅkhyanidarṣanāya te iti. (33)
:: श्रीमद्भागवते पङ्चम स्कन्धे अष्टदशोऽध्यायः ::
यस्मिन्नसङ्ख्येयविशेषनाम रूपाकृतौ कविभिः कल्पितेयम् ।
सङ्ख्या यया तत्त्वदृशापनीयते तस्मै नमः साङ्ख्यनिदर्षनाय ते इति ॥ ३३ ॥
O my Lord, Your name, form and bodily features are expanded in countless forms. No one can determine exactly how many forms exist, yet You Yourself, in Your incarnation as the learned scholar Kapiladeva, have analyzed the cosmic manifestation as containing twenty-four elements.
Therefore if one is interested in Sāńkhya philosophy, by which one can enumerate the different truths, he must hear it from You. Unfortunately, non-devotees simply count the different elements and remain ignorant of Your actual form. I offer my respectful obeisances unto You.
🌻 🌻 🌻 🌻 🌻
Source Sloka
असंख्येयोऽप्रमेयात्मा विशिष्टश्शिष्टकृच्छुचिः ।सिद्दार्थस्सिद्धसङ्कल्पः सिद्धिदस्सिद्धिसाधनः ॥ २७ ॥
అసంఖ్యేయోఽప్రమేయాత్మా విశిష్టశ్శిష్టకృచ్ఛుచిః ।సిద్దార్థస్సిద్ధసఙ్కల్పః సిద్ధిదస్సిద్ధిసాధనః ॥ ౨౭ ॥
Asaṃkhyeyo’prameyātmā viśiṣṭaśśiṣṭakr̥cchuciḥ ।Siddārthassiddhasaṅkalpaḥ siddhidassiddhisādhanaḥ ॥ 27 ॥
Continues....
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹 DAILY WISDOM - 37 🌹*
*🍀 📖 Philosophy of Yoga 🍀*
📝 Swami Krishnananda
📚. Prasad Bharadwaj
*🌻 6. We are on a Long Journey 🌻*
We know that the world is not made up of human beings alone. There are others below us and above us. We are in the middle hanging somewhere on the rope that stretches from the Earth to the heavens. We are on a long journey.
We are not stationed in this world as permanent proprietors of properties here. We are not owners of anything. We are in a moving flux, as I said. We are on a perpetual journey onward, and we cannot, as a great master said, step into the same water of the river the next moment, because the next moment we step into different water of the same river. Thus, too, the next moment we are not living the same life.
Every moment we are in a new life into which we perpetually enter, and the so-called continuity of our personality which makes us feel that we were yesterday the same thing that we are today, and the hope that we shall be tomorrow exactly what we are today, is due to a limitation of the way in which the mind works, the way in which we get tied up to one set of connotations in this movement.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🌹. వివేక చూడామణి - 1 / Viveka Chudamani - 1 🌹
✍️. రచన : సద్గురు పేర్నేటి గంగాధర రావు
📚. ప్రసాద్ భరద్వాజ
🌻 2. మానవ జన్మ - 1 🌻
1. మొదటి శ్లోకములో శ్రీ శంకరాచార్యులవారు ''గురువే ప్రత్యక్ష దైవ'' మన్నట్లు తన గురువైన గోవిందా చార్యుల వారిని దైవముగా స్తుతించినారు.
2. 84 లక్షల జీవరాశులలో మానవ జన్మ ఉత్తమమైనది. మానవులలో పురుషజన్మ ఉన్నతమైనది. అందులోనూ వైదిక మతములో బ్రహ్మ జ్ఞానము గొప్పది. బ్రహ్మ జ్ఞానము ద్వారా ఆత్మ అనాత్మల భేదమును గ్రహించుట, బ్రహ్మమును తెలుసుకొనుట అరుదైన విషయము. అట్లాంటి మానవుడు ముక్తిని పొందాలంటే 100 కోట్ల జన్మలు ఎత్తవలసి ఉంటుంది.
3. భగవంతుని కృపతో మానవునిగా జన్మించుట, జన్మ పరంపర నుండి విముక్తికై కృషి చేయుట మరియు అందుకు సద్గురువు యొక్క రక్షణ అను మూడు ముఖ్య విషయములు అవసరము.
4. పురుషునిగా లభించిన మానవ జన్మ ద్వారా వేదవిజ్ఞానమును పొందిన మనిషి జన్మ రాహిత్యానికి కృషి చేయకుండా, ఆత్మహత్య సదృశమైన లౌకికానందములో చిక్కుకొనుట అనుచితము.
5. మనిషి తనకు లభించిన పురుష మానవ జన్మను జన్మ పరంపర నుండి విముక్తికై కృషి చేయకుండుట ఎంత తెలివి తక్కువ తనము.
6. జీవాత్మ పరమాత్మ ఒక్కటే అను సత్యాన్ని గ్రహించకుండా ప్రపంచమున్నంత కాలము 432 మిలియన్ల సంవత్సరములు యగ్నయాగాదులు చేసి, దేవతలను తృప్తి పరచినను జన్మ రాహిత్య స్థితి లభించదు.
7. సంపదలు, వేదాల పఠనము, యగ్నయాగాదులు మొదలగు వాటి వలన పరమాత్మను పొందలేము. జన్మ రాహిత్యము లభించదు.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
*🌹VIVEKA CHUDAMANI - 1 🌹*
✍️ Swami Madhavananda
1. I bow to Govinda, whose nature is Bliss Supreme, who is the Sadguru, who can beknown only from the import of all Vedanta, and who is beyond the reach of speech and mind.
2. For all beings a human birth is difficult to obtain, more so is a male body; rarer thanthat is Brahmanahood; rarer still is the attachment to the path of Vedic religion; higher than this is erudition in the scriptures; discrimination between the Self and not-Self, Realisation, and continuing in a state of identity with Brahman – these come next in order. (This kind of) Mukti (Liberation) is not to be attained except through the wellearned merits of a hundred crore of births.
3. These are three things which are rare indeed and are due to the grace of God – namely, a human birth, the longing for Liberation, and the protecting care of a perfected sage.
4. The man who, having by some means obtained a human birth, with a male body and mastery of the Vedas to boot, is foolish enough not to exert himself for self-liberation, verily commits suicide, for he kills himself by clinging to things unreal.
5. What greater fool is there than the man who having obtained a rare human body, and a masculine body too, neglects to achieve the real end of this life ?
6. Let people quote the Scriptures and sacrifice to the gods, let them perform rituals andworship the deities, but there is no Liberation without the realisation of one’s identity with the Atman, no, not even in the lifetime of a hundred Brahmas put together.
7. There is no hope of immortality by means of riches – such indeed is the declaration of the Vedas. Hence it is clear that works cannot be the cause of Liberation.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. దేవాపి మహర్షి బోధనలు - 11 🌹*
✍️. సద్గురు కె. పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
*🌻 4. అశ్వవిద్య - 3 🌻*
సంవత్సర చక్రమును ప్రవర్తింప చేయుచున్న శక్తి అశ్వమే. అది సూర్య కేంద్రితమైన శక్తి. అందుండియే సర్వము నందును విత్తనములు మొలక రూపమున మరల మరల బహువిధముగ జన్మించుచున్నవి.
మరల మరల పునరావృతమైన వర్షించు పర్జన్య శక్తి కూడ అశ్వమే. అనగా సూర్య కేంద్రకమైన సంవత్సర చక్రమున అగ్ని అశ్వ స్వరూపుడు. దాని నారోహించి పర్జన్య శక్తి వర్తించు చుండును.
భూమి సూర్యుని చుట్టూ వృత్తాకారముగ తిరుగు నపుడు ఏర్పడు అక్షరములన్నియు తేజోమయములు. సూర్యుని నుండి భూమికి చేరు ఈ కిరణములన్నియు భూమికిని సూర్యునికి వెలుగు మార్గము లేర్పరచుచున్నవి.
సూర్యుని నుండి భూమికి గమనము చేయుచు వ్యాపించి యన్నవి. అనగా అశ్వములుగ నున్నవి. ఈ వెలుగు కిరణముల నాధారము చేసుకొని భూలోకము నుండి సూర్యులోకమునకు చేరవచ్చును. మహాభారతమున ఉదంకోపాఖ్యానమున ఈ రహస్యమునే సూచన ప్రాయముగ వేదవ్యాసుడు తెలిపినాడు.
పాతాళమున బంధింపబడిన ఉదంకుడు అశ్వము యొక్క తోకను ఆధారముగ గొని శ్వాసను పూరించి, అశ్వము యొక్క ముఖము ద్వారా ఊర్థ్వమున కేతెంచి, గురు సాన్నిధ్యమున నిలచును. ఇచ్చట సంకేతింపబడిన అశ్వము కిరణమే.
పదార్థమునందు బద్ధులైన జీవులు కూడ వెలుగు కిరణముల నాధారముగ చేసుకొని, ఊర్థ్వముఖముగ వెలుగు పుట్టు చోటులో చేరుటకు సాధన మార్గము సంకేతింపబడినది.
తన యందలి హృదయము లేక భ్రూమధ్యము అను వెలుగు కేంద్రములపై సాధకుడు మనస్సు లగ్నముచేసి శ్వాస నాధారముగ ఆ కేంద్రములను చేరుట అశ్వవిద్య యొక్క రెండవ సందేశము.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. ధైర్యమున్న చోటే దాపరికం ఉండదు - జీవితం మార్మికమైనది 🌹*
🍀. ‘స్వేచ్ఛ. మీరనుకుంటున్నది కాదు’ నుంచి ( ఓషో బోధ ) 🍀*)
ఓషో నవజీవన మార్గదర్శకాలు ‘స్వేచ్ఛ.మీరనుకుంటున్నది కాదు’ నుంచి స్వీకృతం.
అలా ప్రార్థన కూడా చివరికి ఒక ప్రయోజనం కోసమే అన్నట్లుగా తయారైంది. ప్రతి క్షణం జీవితం ఎలాసాగితే అలా సాగనివ్వడమే ప్రమాదకరంగా, ప్రమోదంగా జీవించడమంటే. ప్రతి క్షణానికి ‘‘దాని విలువ’’దానికుంది. అయినా మీరు ఏమాత్రం భయపడరు. ఎందుకంటే, మృత్యువు ఉందని, దానినుంచి ఎవరూ తప్పించుకోలేరని మీకు తెలుసు. ఆ సత్యాన్ని మీరు అంగీకరిస్తారు.
నిజానికి, మీరు- శారీరకంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా- ప్రతిక్షణం మృత్యువును చాలా ఆనందంగా ఎదుర్కొంటున్నారు. అందువల్ల అలా ఆనందించే క్షణాలలోనే మృత్యువు సాక్షాత్కరించే క్షణమొకటి వస్తుంది. కాబట్టి, కేవలం ఆనందించే క్షణాలలోనే మీరు మృత్యువును నేరుగా కలుసుకుంటారు. అదే ప్రమాదంలో ప్రమోదంగా జీవించడమంటే.
కేవలం ధైర్యమున్న వ్యక్తులు మాత్రమే ఎప్పుడూ ప్రమాదకరమైన వాటి కోసం అనే్వషిస్తారు. అందుకే వారు ఏమాత్రం ఆలోచించకుండా చాలా దురుసుగా ప్రమాదాలలోకి ప్రవేశిస్తారు. వారి జీవిత పరమార్థం బీమా సంస్థల కోసం కాదు. వారు హిమాలయ శిఖరాలను మాత్రమే కాదు, అంతరంగ శిఖరాలను కూడా అధిరోహిస్తారు. అలాగే వారు సముద్ర కెరటాలపై మాత్రమే కాదు, అంతరంగ తరంగాలపై కూడా విహరిస్తారు.
కానీ, ఒక విషయం గుర్తుంచుకోండి: ‘‘అపాయాన్ని ఆహ్వానించే కళ’’ గురించి ఎప్పుడూ మర్చిపోకండి. ఎప్పుడూ అలాంటి సామర్థ్యంతోనే ఉండండి. అపాయాన్ని ఆస్వాదించే అవకాశం ఎక్కడ ఉన్నా, దానిని వదులుకోకండి. దానివల్ల మీరు కోల్పోయేది ఏదీ ఉండదు. నిజానికి, కేవలం అపాయం మాత్రమే వాస్తవంగా జీవించే వారికి లభించే హామీ.
🌷. జీవితం మార్మికమైనది: 🌷
‘‘వివరించలేనిదేదో ఉంది’’అనే భావనను అంగీకరించేందుకు మనసుకు కాస్త సమస్యగానే ఉంటుంది. చాలా విరుద్ధంగా, గందరగోళంగా ఉండేవన్నీ మీ మనసును కలవరపెట్టేవే.
ధార్మిక, వేదాంత, విజ్ఞాన, గణాంక చరిత్రలన్నింటికీ ఉన్నది అదే మూలం, అదే మనసు, అదే దురద. మీరు మీ దురదను మీకు నచ్చినట్లు గోక్కుంటే, ఇతరులు వారి దురదను వారికి నచ్చినట్లు గోక్కుంటారు.
కాబట్టి, ఇక్కడ దురద గురించి-అది ఏమిటో, ఎలాంటిదో- సరిగా అర్థం చేసుకోవాలి. ‘‘అస్తిత్వం మార్మికమైనది కాదు’’అనే నమ్మకమే ‘దురద’. కాబట్టి, అస్తిత్వ మర్మాన్ని ఏదో విధంగా ఛేదించినప్పుడే ఆ దురదపోయి మనసుకు సౌకర్యంగా ఉంటుంది.
దేవుడు, దేవుని ఏకైక కుమారుడు, పవిత్ర పిశాచి- వీరిని సృష్టించడం ద్వారా నమ్మకం విషయంలో క్రైస్తవ మతం ఎంత చెయ్యాలో అంతా చేసింది. అలాగే ఇతర మతాలు కూడా వాటికి తోచినట్లు చేశాయి. అలా అన్ని మతాలు వాటి పద్ధతులలో మూయలేని బిలాన్ని మూసే ప్రయత్నం చేశాయి.
కానీ, ఎంత చేసినా ఆ బిలం ఇంకా కనిపిస్తూనే ఉంది. నిజానికి, దానిని ఎంత ఎక్కువగా మూసేందుకు ప్రయత్నిస్తే అది అంత ఎక్కువగా ఉన్నట్లు కనిపిస్తుంది. పైగా, అలా మూసేందుకు మీరుచేసే ప్రయత్నం ‘‘ఆ బిలాన్ని ఎవరైనా చూస్తారేమో’’అని మీరు భయపడుతున్నట్లు స్పష్టం చేస్తుంది.
మానసిక ప్రపంచంలోని శాఖలన్నీ ప్రత్యేకించి గణితశాస్త్ర పద్ధతిలో చిన్న చిన్న అతుకులతో ఆ బిలాన్ని మూసే పని చేస్తున్నాయి. ఎందుకంటే, గణితశాస్త్రం పూర్తిగా మనసుతో ఆడే ఆట.
దేవుడున్నాడని భావించే వేదాంతులున్నట్లే ‘‘అది కాదు’ ’అని భావించే గణిత శాస్తవ్రేత్తలున్నారు. వారికి ‘‘దేవుడు’’ అనేది కేవలం ఒక భావన మాత్రమే.
- ఇంకాఉంది
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🌹. శ్రీమద్భగవద్గీత - 8 / Bhagavad-Gita - 8 🌹
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ
🌴. ప్రధమ అధ్యాయము - విషాద యోగము - 8 🌴
8. భావాన్ భీష్మశ్చ
కర్ణశ్చ సమితింజయ:
అశ్వత్థామా వికర్ణశ్చ
సౌమదత్తిస్తథైవ చ ||
🌷. తాత్పర్యం :
యుద్దమునందు ఎల్లప్పుడును విజయమును సాధించు మీరు,భీష్ముడు, కర్ణుడు,కృపుడు, అశ్వత్థామ,వికర్ణుడు మరియు సోమదత్తుని తనయుడైన భూరిశ్రవుడు వంటివారు మన సైన్యము నందున్నారు.
🌷. భాష్యము:
యుద్దరంగమున గల నిత్య జయశీలురైన ప్రముఖవీరులను దుర్యోధనుడు పేర్కొనుచున్నాడు. వికర్ణుడు దుర్యోధనుని సోదరుడు. అశ్వత్థామ ద్రోణాచార్యుని పుత్రుడు. సౌమదత్తుడు లేదా భూరిశ్రవుడు బాహ్లీకరాజు తనయుడు. పాండురాజుతో వివాహమునకు పూర్వము కుంతీదేవికి జన్మించియున్నందున కర్ణుడు అర్జునునికి సోదరుడు. కృపాచార్యుని కవల సోదరి ద్రోణాచార్యుని భార్య.
🌹 🌹 🌹 🌹 🌹
🌹 BhagavadGita As it is - 8 🌹
✍️ Swamy Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj
🌴 Chapter 1 - Vishada Yoga - 8 🌴
8. bhavān bhīṣmaś ca karṇaś ca
kṛpaś ca samitiṁ-jayaḥ
aśvatthāmā vikarṇaś ca
saumadattis tathaiva ca
🌷 Translation :
There are personalities like you, Bhīṣma, Karṇa, Kṛpa, Aśvatthāmā, Vikarṇa and the son of Somadatta called Bhūriśravā, who are always victorious in battle.
🌷 Purport :
Duryodhana mentions the exceptional heroes in the battle, all of whom are ever victorious. Vikarṇa is the brother of Duryodhana, Aśvatthāmā is the son of Droṇācārya, and Saumadatti, or Bhūriśravā, is the son of the King of the Bāhlīkas. Karṇa is the half brother of Arjuna, as he was born of Kuntī before her marriage with King Pāṇḍu. Kṛpācārya’s twin sister married Droṇācārya.
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 188 / Sri Lalitha Chaitanya Vijnanam - 188 🌹*
*సహస్ర నామముల తత్వ విచారణ*
✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
మూల మంత్రము :
*🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁*
*🍀. పూర్తి శ్లోకము :*
*నిస్తులా, నీలచికురా, నిరపాయా, నిరత్యయా |*
*దుర్లభా, దుర్గమా, దుర్గా, దుఃఖహంత్రీ, సుఖప్రదా ‖ 50 ‖*
*🌻 188. 'దుర్లభా' 🌻*
లభింప శక్యము కానిది శ్రీమాత అని అర్థము.
శ్రీమాత లభించుట అనగా దర్శన, స్పర్శన, సంభాషణాదులు ఆమెతో జరుగుట, ఎవ్వరునూ సాధింపదగిన విషయము కాదు. ఎటువంటి సాధనలచేతకూడా ఆమె సాధ్యపడదు. అసాధ్యురాలు. ఆమెకై ఆమె అనుగ్రహింప వలెను గాని, తానుగా ఎవ్వరూ ఆమెను పొందలేరు.
శ్రీమాత లభ్యమగుటకు చేయు ప్రయత్నములన్నియూ అహంకార పూరితములే కదా! అహంకారమున్నప్పుడే ప్రయత్నముండును. అది తామసికముగాని, రాజసికముగాని, సాత్వికముగాని అయివుండును. సాత్విక అహంకారములకు కూడ ఆమె లభించుట అసాధ్యము. ఆలిచిప్పలో ముత్యపు చినుకు పడుట ఆలిచిప్ప వశమున లేదు. సూర్యోదయపు వేళ మబ్బులు అడ్డు రావచ్చును. వేచి యుండుటయే కమలము పని. సాత్వికమగు సాధనయే భక్తుల కర్తవ్యము.
సిద్ధి వారి ఆధీనములో లేదు. పై విధముగనే సమస్త కార్యముల నిర్వర్తనమునకు, అవి సిద్ధించుటకు, నడుమ తెలియనిదొకటి యున్నది. పరీక్షలు వ్రాసినను, ఫలితములకై వేచి ఉండవలెను కదా! మృష్టాన్న భోజనము ఎదురుగా ఉన్ననూ భుజించుటకు వీలుపడని సన్నివేశములున్నవి కదా! సంపద లున్ననూ, సుఖపడవలెనను నియమమేమియూ లేదు. ఆరోగ్యమున్ననూ ఆయుర్దాయము మనచేతిలో లేదు.
ఇట్లన్ని విషయము లందు దుర్లభత్వము గోచరించుచుండును. దైనందిన జీవితమంతయూ ప్రాప్తాప్రాప్తములుగా నడచును. లభించుట, లభింపకపోవుట జీవుల అధీనములో లేదు. ఎంత స్వాధీనుల మనుకున్ననూ జీవులు పరాధీనులే. శ్రీమాత అనుగ్రహమే ప్రాప్తమునకు కారణము. జీవునికి వలసినవి లభించినపుడెల్ల, ఇందువలన లభించినవి అనుకొనుట ఒక తెలివి.
ఆ తెలివి సత్యము కాదు. ఇందువలన, అందువలన అని భావించువారికి, ఎందువలనో తెలియని సన్నివేశము లేర్పడును. తనకు లభించినవి దైవమిచ్చినవని భావించుచూ, సంతుష్టిపడుట నిజమగు భక్తుల లక్షణము. అట్టివారు కర్తవ్య నిర్వహణమున శ్రద్ధ వహింతురు. లభించుట, లభింపక పోవుట దైవమునకే వదలి వేయుదురు. లభించిననూ, లభింపకపోయిననూ దైవానుగ్రహముగ భావింతురు.
ఎవనికెప్పుడేమి లభించునో, ఏమి లభింపదో ఎవరికినీ తెలియదు. ఆ సమస్తమును శ్రీమాత ఆధీనమున నున్నది. ఆమె అనుగ్రహము తెలియుట దుర్లభము.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 188 🌹*
*1000 Names of Sri Lalitha Devi*
✍️. Ravi Sarma
📚. Prasad Bharadwaj
*🌻 Durlabhā दुर्लभा (188)🌻*
She does not transgress Her limits. It has already been seen that She functions as per the law of karma-s, the law of the Lord. Law of karma is enacted by Her, and She does not transgress Her own laws. She sets an example for others to follow.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శ్రీమద్భగవద్గీత - 531 / Bhagavad-Gita - 531 🌹*
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ
*🌴. 15వ అధ్యాయము - పురుషోత్తమ యోగము - 14 🌴*
14. అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రిత: |
ప్రాణాపానసమాయుక్త: పచామ్యన్నం చతుర్విధమ్ ||
🌷. తాత్పర్యం :
ప్రాణుల దేహములందలి జఠరాగ్నిని నేను, ప్రాణాపానవాయువులతో కూడి నేను నాలుగు విధములైన ఆహారములను పచనము చేయుచున్నాను.
🌷. భాష్యము :
భుజించిన ఆహారము జీర్ణము చేయుటకు ఉదరమందు అగ్ని కలదని ఆయుర్వేదము ద్వారా మనకు అవగతమగుచున్నది. అట్టి అగ్ని తగినరీతి ప్రజ్వరిల్లినపుడు ఆకలి కలుగును. సరిగా ప్రజ్వలితము కానపుడు ఆకలి కాదు. ఆ విధముగా అగ్ని తగినరీతి ప్రజ్వలితము కానపుడు వైద్యము అవసరమగును. ఉదరమునందలి ఆ అగ్ని దేవదేవుడైన శ్రీకృష్ణుని ప్రాతినిధ్యము.
శ్రీకృష్ణభగవానుడు అగ్నిరూపమున ఉదరమునందు వసించి అన్నిరకములైన ఆహారమును పచనము చేయుచున్నాడని బృహదారాణ్యకోపనిషత్తు(5.9.1) నిర్ధారించుచున్నది (ఆయ మగ్ని: వైశ్వానరో యో(యం అంత:పురుషే యేనేద మన్నం పచ్యతే). అనగా భగవానుడు సర్వవిధ ఆహారపచనము నందు సహాయభూతుడగుచున్నందున భోజన విషయమున జీవుడు స్వతంత్రుడు కాడు. జీర్ణక్రియయందు భగవానుడు తోడ్పడనిదే జీవునకు ఆహారమును భుజింప అవకాశము కలుగదు.
ఈ విధముగా శ్రీకృష్ణుభగవానుడు ఆహారమును సృష్టించుట మరియు ఉదరమున జీర్ణము చేయుట వంటి కార్యముల నొనరించుట చేతనే, మనము జీవితమున అనుభవించ గలుగుచున్నాము. ఈ విషయము వేదాంతసూత్రము నందు(1.2.27) కూడా “శబ్దాదిభ్యో(న్త: ప్రతిష్టానాచ్చ” యని స్థిరీకరింపబడినది.
అనగా శ్రీకృష్ణభగవానుడు శబ్దమునందు, దేహమునందు, వాయువు నందేగాక ఉదరమందు జీర్ణకారకశక్తి రూపమును స్థితుడై యున్నాడు. ఇక నాలుగురకముల ఆహారములనగా భక్ష్యములు, భోజ్యములు, చోష్యములు, లేహ్యములని భావము. వీటన్నింటిని జీర్ణము చేయువాడు భగవానుడే.
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Bhagavad-Gita as It is - 531 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj
*🌴 Chapter 15 - Purushothama Yoga - 14 🌴*
14. ahaṁ vaiśvānaro bhūtvā
prāṇināṁ deham āśritaḥ
prāṇāpāna-samāyuktaḥ
pacāmy annaṁ catur-vidham
🌷 Translation :
I am the fire of digestion in the bodies of all living entities, and I join with the air of life, outgoing and incoming, to digest the four kinds of foodstuff.
🌹 Purport :
According to Āyur-vedic śāstra, we understand that there is a fire in the stomach which digests all food sent there. When the fire is not blazing there is no hunger, and when the fire is in order we become hungry. Sometimes when the fire is not going nicely, treatment is required. In any case, this fire is representative of the Supreme Personality of Godhead.
Vedic mantras (Bṛhad-āraṇyaka Upaniṣad 5.9.1) also confirm that the Supreme Lord or Brahman is situated in the form of fire within the stomach and is digesting all kinds of foodstuff (ayam agnir vaiśvānaro yo ’yam antaḥ puruṣe yenedam annaṁ pacyate). Therefore since He is helping the digestion of all kinds of foodstuff, the living entity is not independent in the eating process.
Unless the Supreme Lord helps him in digesting, there is no possibility of eating. He thus produces and digests foodstuff, and by His grace we are enjoying life. In the Vedānta-sūtra (1.2.27) this is also confirmed.
Śabdādibhyo ’ntaḥ pratiṣṭhānāc ca: the Lord is situated within sound and within the body, within the air and even within the stomach as the digestive force.
There are four kinds of foodstuff – some are drunk, some are chewed, some are licked up, and some are sucked – and He is the digestive force for all of them.
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. గీతోపనిషత్తు -132 🌹*
✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
*📚. 5వ అధ్యాయము - కర్మసన్న్యాస యోగము 📚*
శ్లోకము 17
*🍀. 15. అపునరావృత్తి - సర్వమునకు ఆధారమైన తత్వము నందు తమ బుద్ధిని నిలుపువారు, నేను' అను అహంకారమును, నేను' అను సర్వాంతర్యామి ప్రజ్ఞయందు స్థిరముగ నిలుపువారు ఆ తత్వము నందే నిష్ఠగలవారు, అదియే తానైన వారు. పునరావృత్తిలేని స్థితిని పొందు చున్నారు. జ్ఞాన మనగ ఆ తత్త్వముతో ముడిపడుటయే అట్టి వారిని పాపము లంటవు. ఉన్నది యొకటే. దానినే సత్యమందురు. అన్నిటి యందున్నను, అన్నిటికి అతీతముగ నుండునది, అన్నిటికి ఆధారమై యుండునది ఈ తత్త్వము. దానితో ముడిపడి యుండుట నిజమగు జ్ఞానము, నిజమగు భక్తి, నిజమగు యోగము, నిజమగు సన్న్యాసము, వైరాగ్యము. బుద్ధి చేతను, స్మరణ చేతను, నిష్ఠ చేతను దానియందు స్థిరపడినవారు శాశ్వతులు. అట్టివారిని త్రిగుణాత్మకమగు ప్రకృతి ఆరోహణ, అవరోహణ క్రమములకు గురిచేయదు. వీరు సహజ జ్ఞానులు. వారి స్థితి సహజ సమాధి స్థితి. 🍀*
దద్బుద్ధయ స్తదాత్మాన సన్నిస్తత్పరాయణా |
గచ్ఛంత్యపునరావృత్తం జ్ఞాననిర్దూత కల్మషాః || 17
సర్వమునకు ఆధారమైన తత్వము నందు తమ బుద్ధిని నిలుపువారు, నేను' అను అహంకారమును, నేను' అను సర్వాంతర్యామి ప్రజ్ఞయందు స్థిరముగ నిలుపువారు ఆ తత్వము నందే నిష్ఠగలవారు, అదియే తానైన వారు. పునరావృత్తిలేని స్థితిని పొందు చున్నారు. జ్ఞాన మనగ ఆ తత్త్వముతో ముడిపడుటయే అట్టి వారిని పాపము లంటవు. ఉన్నది యొకటే. దానినే సత్యమందురు.
ఉండుట సృష్టి యందు అన్ని స్థితుల యందు ఉన్నది. సృష్టికి పూర్వము కూడ నున్నది. అందుండే కాలము, ప్రకృతి, శక్తి, త్రిగుణములు, పంచ భూతములు పుట్టుచున్నవి. త్రిగుణముల నుండియే సర్వజీవ రాశులు పుట్టుచున్నవి. అన్నిటి యందు ఉండుటగ ఆ పరతత్వ మున్నది. అదియే సత్యము. రాయి రప్ప కూడ ఉండుట యను స్థితియందున్నది. అన్నిటి యందున్నను, అన్నిటికి అతీతముగ నుండునది, అన్నిటికి ఆధారమై యుండునది ఈ తత్త్వము.
దీనినే పరమాత్మయని, అంతర్యామియని సంబోధింతురు. నిజమునకు అందరికిని, అన్నిటికిని అదే మూలము. దానితో ముడిపడి యుండుట నిజమగు జ్ఞానము, నిజమగు భక్తి, నిజమగు యోగము, నిజమగు సన్న్యాసము, వైరాగ్యము.
బుద్ధి చేతను, స్మరణ చేతను, నిష్ఠ చేతను దానియందు స్థిరపడినవారు శాశ్వతులు. అట్టివారిని త్రిగుణాత్మకమగు ప్రకృతి ఆరోహణ, అవరోహణ క్రమములకు గురిచేయదు. సనక సనంద నాదులు, వశిష్ఠ అగస్త్యులు అట్టివారు.
తత్వముతో ముడిపడిన వారిని ప్రకృతి గుణములు సృశించవు గనుక, పాపపుణ్యములు పునర్జన్మలు వారి కుండవు. వీరు సహజ జ్ఞానులు. వారి స్థితి సహజ సమాధి స్థితి.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹 . శ్రీ శివ మహా పురాణము - 332 🌹*
రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ
*🌴. రుద్ర సంహితా - సతీఖండః 🌴*
83. అధ్యాయము - 38
*🌻. క్షువదధీచుల వివాదము - 4 🌻*
క్షువ మహారాజు ఇట్లు పలికెను -
హే భగవన్! ధర్మములు తెలిసినవాడు, వినయముతో నిండిన మనస్సు గలవాడు, దధీచుడని పేరు బడిసినవాడు అగు ఒకానొక బ్రాహ్మణుడు నాకు పూర్వము మిత్రుడుగ నుండెడివాడు (54). మృత్యుంజయుడు, దోషరహితుడు, మహాదేవుడు అగు శంకరుని ఆరాధించి ఆతడు ఆ ప్రభావముచే సర్వకాలములయందు సర్వులకు వధింప శక్యము కాని వాడుగా అయినాడు (55).
మహాతపస్వియగు ఆ దధీచి సభామధ్యమునందు అవమానకరముగా తన ఎడమకాలితో నా శిరస్సుపై వేగముగా తన్నెను (56). మరియు 'నేను మృత్యుంజయుని వద్దనుండి మంచి వరములను పొందియున్నాను గాన, నేను దేనికీ భయపడను ' అని ఆతడు గర్వముతో పలికెను. హే విష్ణో! ఆతడు అతిశయించిన గర్వము కలిగియున్నాడు (57).
బ్రహ్మఇట్లు పలికెను -
అపుడు మహాత్ముడగు దధీచుని ఎవ్వరైననూ సంహరించలేరను సత్యమును భావన చేసిన శ్రీహరి మహేశ్వరుని సాటిలేని మహిమను స్మరించుకొనెను (58). ఇట్లు స్మరించి శ్రీహరి బ్రహ్మపుత్రుడగు క్షువునితో వెంటనే ఇట్లనెను; ఓ రాజా శ్రేష్ఠా! బ్రాహ్మణులకు ఎచటనైననూ లేశ##మైననూ భయము లేదు (59).
ఓ రాజా! ప్రత్యేకించి రుద్రభక్తులకు భయము లేనే లేదు. ఆ బ్రాహ్మణునకు దుఃఖమును కలిగించినచో, ఆతడు దేవతనగు నాకు కూడ శాపము నీయగల్గును (60). ఆయన శాపముచే దక్షయజ్ఞములో దేవదేవుడగు శివుని వలన నాకు వినాశము కలుగును. ఓ రాజేంద్రా! నాకు మరల అభివృద్ధి కూడ కలుగ గలదు (61).
ఓ రాజేంద్రా! కావున నేను నీతో కలిసి సర్వయత్నములు చేసిననూ వ్యర్థము. నీకు దధీచిపై విజయము లభించుటకై నేనే యత్నించెదను (62). విష్ణువు యొక్క ఈ మాటను విని క్షువ మహారాజు 'సరే' అనెను. ఆ కోరిక (దధీచిపై విజయము) యందు ఉత్కంఠతో గూడిన మనస్సు గల క్షువుడు విష్ణువుయందలి ప్రీతితో అచటనే ఉండెను (63).
శ్రీ శివమహాపురాణములో రెండవదియగు రుద్ర సంహితయందు రెండవదియగు సతీఖండలో క్షువ దధీచి వివాద వర్ణనమనే ముప్పది ఎనిమిదవ అధ్యాయము ముగిసినది (38).
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹 LIGHT ON THE PATH - 85 🌹*
*🍀 For those WHO DESIRE TO ENTER WITHIN - For DISCIPLES 🍀*
✍️. ANNIE BESANT and LEADBEATER
📚. Prasad Bharadwaj
CHAPTER 7 - THE 13th RULE
*🌻 13. Desire power ardently. - 3 🌻*
339. All the problems of life which seem complex, if not incomprehensible, down here, become far simpler when looked at from a higher plane. The same thing is true of much lower levels.
When one examines microscopic creatures such as live in a drop of water one finds complex and beautiful forms of life. The further one goes into these infinitely small matters the more one discovers their amazing complexity.
One wonders how even to the Deity Himself these worlds could possibly be a, simple thing, and yet they are, for when we look from even such higher points of view as we are able to gain, we can see that it is the permutations and combinations of the seven forces of the One Life which produce all these wonderful results.
The factors involved in the production are few and simple; therefore the higher one rises the more one can understand, and that which down here seems impossible to grasp proves quite within reach when viewed from higher levels.
340. We may reverently and reasonably assume, I think, that the Logos can hold the whole of His system simultaneously in His mind, and without any difficulty see what is being done in every remotest ramification of it. The whole system in all its multiplicity must be immediately self-evident – something one could put down on a sheet of foolscap, as it were.
To the Manu and Bodhi-sattva the work of moulding and guiding the races of men, which seems to us so complex and even confused, must be quite clear and straightforward.
341. Our business is to serve the Master in our small sphere. The detail is our care, not His. What He wants is that the whole work shall go well, and anything that we can do to make it do so is our share in it.
Those who stand nearer to Him in thought and have by such association grown somewhat into His attitude in regard to it, are always eager to do anything, however simple, which may seem of use.
We can write a little letter, perhaps, which will change the current of a man’s life, or we may deliver a lecture and try to change the opinion of some hundreds of people, and not succeed; the little letter is just as real a piece of work.
There may be some of us who are so busy that we cannot do anything personally. In that case we are probably earning money, and so perhaps we could give some money to enable others to do that work.
There are a great many little ways in which every one can work. It is no use waiting for a big opportunity with the idea that when it comes we shall be ready to take it. We are very much more likely to be ready if we get ourselves into the habit of always doing the little things that we can do now.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 217 🌹*
🌷. సద్గురు శివానంద 🌷
📚. ప్రసాద్ భరద్వాజ
*🌻. జైమినిమహర్షి - 2 🌻*
06. వ్యాసమహర్షి ఎప్పుడయితే కర్మకాండ, జ్ఞానకాండ అని రెండు వుభాగాలు ఈ విషయంలో చేసారో; ఏది అనుసరణీయం, ఏది ప్రధానమైనది అనే ప్రశ్న సహజంగా పుట్టింది. అంతకుముందు అదీ ఉంది, ఇదీ ఉంది. వేద్దంతులున్నారు. విజ్ఞానవేత్తలున్నారు. బ్రహ్మలున్నారు. మోక్షకాములున్నారు. మోక్షంకొరకే జీవించేవాళ్ళున్నారు. కర్మకాండకూడా ఉన్నది.
07. ఆ విధంగా వేదంలో ఈ రెండువిభాగాలలో ఏది అత్యుత్కృష్టమైనది, ఏది అనుసరణీయము, సర్వులకూ విధిగావుండి, అందరికీ అనుసరణీయమయిన మతం ఒకటున్నాదా అని ప్రశ్న వచ్చినప్పుడు; దానికి సమాధానంగా జైమిని తన మతాన్ని ప్రతిష్ఠచేసాడు.
08. ఎన్నిరకాలుగా జైమిని గురించి మనం సమర్థించే ప్రయత్నంచేసినా, వ్యాసమతం జైమినిమతం కాదు. జైమినిమతం వ్యాససమ్మతం కాదు. ఇద్దరికీ వేదమే ప్రమాణం, ఇద్దరూ వేదపురుషులే! సందేహంలేదు. అయితే భేదంమాత్రం ఉంది. అక్కడే ఆర్య సంస్కృతి విచిత్రమైన మలుపు తిరిగింది.
జైమినిమహర్షి చరిత్ర పరమపవిత్రమైనది.
09. ఆయన కర్మకాండ ప్రతిపాదించినా, ఈశ్వరుడిని ప్రతిపాదించలేదు. అది ఏ మార్గంలో అన్నాడు అని ఆలోచంచాలి మనం. ఎందుకంటే, ఈశ్వరుడులేడని ఒకమాట అంటే అది అంత సులభమయిన విషయంకాదు. అది సద్విమర్శగా జాగ్రత్తగా పరిగణనలోనికి తీసుకోవలసిన విషయం.
10. స్థూలంగా మాత్రం ఆయన ఈశ్వర అస్తిత్వమును ఒప్పుకోలేదు. ‘ఈశ్వరుడన్నవాడులేడు. వేదములున్నవి. కర్మలున్నవి. అంతే నీకు ముఖ్యమైన విధి” అని ఆయన మతం. ఆయన జీవితచరిత్రను సంగ్రహంగా నాలుగు ముఖ్యవిషయాలతో తెలుసుకుని ఆయనకు నమస్కరించటమే మన కర్తవ్యం.
11. ఈ మహాత్ముల చరిత్రలన్నీకూడా, ఏ కుతంబంలో ఎవరు ఎక్కడ పుట్టిపెరిగారో అన్న విషయం అందరి విషయంలోనూ చెప్పబడిలేదు. అలాగే జైమినిమహర్షికూడా! ఆయన తల్లితండ్రులెవరో తెలియదు. జన్మవిశేషాలు తెలియవు. మరి ఒక్కటే ‘నేను వ్యాసమహర్షి శిష్యుణ్ణి’ అన్నాడు.
జైమినిమహర్షి తనవంతుగా సామవేదాన్ని అనేకమందికి చెప్పాడు.
12. జైమిని సుమంతుడనే కుమారుడికి సామమును ఇచ్చాడు. అతడి కుమారుడు సుకర్ముడనేవాడు, తండ్రి వద్ద సామవేదాన్ని తీసుకుని, వేయిశాఖలుగా దానిని విభాగంచేసాడు. ఇప్పుడన్ని శాఖలులేవు. రెండేశాఖలున్నాయి. కాశ్మీరదేసంలో సామవేదం పుట్టిందంటారు.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹 Seeds Of Consciousness - 281 🌹*
✍️ Nisargadatta Maharaj
Nisargadatta Gita
📚. Prasad Bharadwaj
*🌻130. There are no techniques except the technique that 'I am' - that is, the firm conviction that 'I am' means only 'I am'.🌻*
Again, the Guru places emphasis on his technique and teaching, or initiation, as mentioned earlier.
The only technique prescribed is abidance in 'I am' and developing the firm conviction that 'I am'. What does this conviction mean? It means that when you abide in the 'I am', It is ONLY the 'I am' and nothing else - the 'I am' in its purity.
You should be completely infused with the knowledge 'I am', everywhere and at all times. Then and only then you stand a chance of transcending it.
Continues....
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 156 🌹*
✍️. శ్రీ బాలగోపాల్
📚. ప్రసాద్ భరద్వాజ
*🌻. భగవంతుని పదవపాత్ర సద్గురువు - 1 🌻*
గురుబ్రహ్మ గురుర్విష్ణుః
గురుదేవో మహేశ్వరః
గురుస్సాక్షాత్ పరంబ్రహ్మ
తస్మైశ్రీ గురవేనమః
612. భగవంతుని 10 వ స్థితిలో నున్నవారు సద్గురువులు, అవతారపురుషుడు.
613. భగవంతుని 10వ స్థితిలో సద్గురువు, భగవంతుని అనంతజ్ఞాన,శక్తి,ఆనందములను అనుభవించుటయే కాక, వాటిని భగవత్కార్కాలయము ద్వారా పరులకై వినియోగపరచును.
614. మానవునిగా ఉన్న భగవంతుడు, భగవంతుని స్థితిలో గమ్యస్థానమును చేరిన తరువాత చాలా అరుదుగా తన అనంతానందమును వీడి, సాధారణ చైతన్య స్థితికి క్రిందకి దిగివచ్చును.అనగా భగవంతుని జీవితములో స్థిరపడును ఇచ్చట మానవునిలో భగవంతుని జీవితము ప్రతిష్ఠింపబడినది. ఇదియే ఆత్మ ప్రతిష్టాపనము.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 12 / Sri Lalita Sahasranamavali - Meaning - 12 🌹*
🌻. మంత్రము - అర్ధం 🌻
📚. ప్రసాద్ భరద్వాజ
*🍀 12. అనాకలిత సాదృశ్య చుబుక శ్రీ విరాజితా |
కామేశబద్ధ మాంగల్య సూత్రశోభిత కంథరా ‖ 12 ‖🍀*
29) అనాకలిత సాదృశ్య చుబుక శ్రీ విరాజితా -
లభ్యము గాని లేదా దొరకని పోలిక గల గడ్డము యొక్క శోభ చేత ప్రకాశించునది.
30) కామేశ బద్ధ మాంగల్యసూత్ర శోభిత కంధరా -
పరమశివుని చేత కట్టబడిన మంగళసూత్రముచే, పవిత్ర సౌందర్యముతో ప్రకాశించుచున్న మెడ గలిగినది.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
*🌹. Sri Lalita Sahasranamavali - Meaning - 12 🌹*
📚. Prasad Bharadwaj
*🌻 12. anākalita-sādṛśya-cibukaśrī-virājitā |*
*kāmeśa-baddha-māṅgalya-sūtra-śobhita-kandharā || 12 ||🌻*
29 ) Anakalidha Sadrushya Chibuka sri virajitha -
She who has a beautiful chin which has nothing else to compare
30 ) Kamesha baddha mangalya sutra shobitha kandhara -
She who shines with the sacred thread in her neck tied by Lord Kameshwara
Continues....
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శ్రీ విష్ణు సహస్ర నామములు - 12 / Sri Vishnu Sahasra Namavali - 12 🌹*
*నామము - భావము*
📚. ప్రసాద్ భరద్వాజ
*🌻. ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్ 🌻*
*మేషరాశి - కృత్తిక నక్షత్ర 4వ పాద శ్లోకం*
*🍀 12. వసుర్వసుమనా స్సత్యః సమాత్మా సమ్మిత స్సమః|
అమోఘః పుండరీకాక్షో వృషాకర్మా వృషాకృతిః||12 🍀*
🍀 104) వసుః -
సమస్త జీవుల శరీరములందు(ఉపాధులలో) వసించువాడు.
🍀 105) వసుమనాః -
ఎటువంటి వికారములకు లొంగనివాడు.
🍀 106) సత్యః -
నిజమైనది, నాశనము లేనిది, శాశ్వతమైనది.
🍀 107) సమాత్మా -
భేదభావములేని ఆత్మస్వరూపుడు.
108) సమ్మితః -
జ్ఞానులచే అనుభూతిపొందినవాడు, ఉపనిషత్తులచే వర్ణింపబడినవాడు.
🍀 109) సమః -
అన్నింటియందు సమభావము గలవాడు, ఎల్లప్పుడు ఒకేలా వుండువాడు.
🍀 110) అమోఘః -
అమోఘమైనవాడు, అన్నింటికన్నా అధికుడు.
🍀 111) పుణ్డరీకాక్షః -
తామరపూవు వంటి కన్నులు గలవాడు, జీవుల హృదయ కమలమున వశించువాడు.
🍀 112) వృషకర్మా -
ధర్మమే తన కర్మగా మెలుగువాడు.
🍀 113) వృషాకృతిః -
ధర్మమే తానుగా వ్యక్తమయ్యేవాడు, ధర్మస్వరూపుడు.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Vishnu Sahasra Namavali - 12 🌹*
*Name - Meaning*
📚 Prasad Bharadwaj
*🌻 OM NARAYANAYA VIDMAHE VASUDEVAYA DHIMAHI । TANNO VISHNU PRACHODAYAT ॥ 🌻*
*Sloka for Kruthika 4th Pada*
*🌻 vasurvasumanāḥ satyaḥ samātmā sammitaḥ samaḥ |*
*amōghaḥ puṇḍarīkākṣō vṛṣakarmā vṛṣākṛtiḥ || 12 || 🌻*
🌻 104) Vasu –
The Lord Who Lives in Every Being
🌻 105) Vasumana –
The Lord Who has a Good Heart
🌻 106) Satya –
The Lord Who is Truth Personified
🌻 107) Samatma –
The Lord Who is the Same in All
🌻 108) Sammita –
The Unlimited in All
🌻 109) Sama –
The Lord Who is Unchanging at All Times
🌻 110) Amogha –
Ever Useful
🌻 111) Pundarikaksha –
Pervading the Lotus of the Heart
🌻 112) Vrishakarma –
The Lord Whose Every Act is Righteous
🌻 113) Vrishakriti –
The Lord Who is Born to Uphold Dharma
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹