Showing posts with label భగవద్దర్శిని - అవతార్ మెహర్. Show all posts
Showing posts with label భగవద్దర్శిని - అవతార్ మెహర్. Show all posts
భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 212
🌹. భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 212 🌹
✍️. శ్రీ బాలగోపాల్
📚. ప్రసాద్ భరద్వాజ
🌻. భగవంతుడు - 2 🌻
చివరిభాగము.
775. యదార్ధ మేమనగా:-
సత్యమును అనుభవింప వలెను. భగవంతుని దివ్యత్వమును పొందవలెను. దివ్యత్వములో బ్రతుకవలెను. ఇదియే సత్యధర్మము.
1. "భగవంతుడు:- ప్రతిచోట నుండి సమస్తమును చేయుచున్నాడు.
2. భగవంతుడు:- మనలో నుండి సమస్తమును తెలిసి కొనుచున్నాడు.
3. భగవంతుడు:- మనకు వెలుపల నుండి సర్వమును చూచూచున్నాడు.
4. భగవంతుడు:- మనకు ఆవల నుండి సర్వము తానై యున్నాడు."
----మెహెర్ బాబా
సమాప్తం...🙏. జై మెహర్ బాబా.
🌹 🌹 🌹 🌹 🌹
24 Apr 2021
భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 211
🌹. భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 211 🌹
✍️. శ్రీ బాలగోపాల్
📚. ప్రసాద్ భరద్వాజ
🌻. భగవంతుడు - 1 🌻
భగవంతుడు
774.
1. "భగవంతుడు అనిర్వాచ్యుడు (ఇట్టివాడిని చెప్పశక్యము కానివాడు)
2. భగవంతుడు నిర్వివాదాంశుడు (వాదోప వాదములచే తెలియబడువాడుకాడు)
3. భగవంతుడు సిద్ధాంతీకరింప బడడు.
4. భగవంతుడు చర్చల వలన తెలియబడడు.
5. భగవంతుడు అగ్రాహ్యుడు (బౌద్ధిక ప్రజ్ఞచే అవగాహనము కానివాడు)
6. భగవంతుడు ప్రేమద్వారా మన అహంభావములను వానిలో కోల్పోవుట వలన బ్రతుకులో మాత్రము అనుభవనీయుడు".
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
22 Apr 2021
భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 210
🌹. భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 210 🌹
✍️. శ్రీ బాలగోపాల్
📚. ప్రసాద్ భరద్వాజ
🌻. సమీక్ష - 8 🌻
(ఊ) ఆదిలో ఆత్మ, తన యందు ఎఱుక లేకుండెను. మధ్యలో జీవాత్మయై, దేహముల యందు ఎఱుక కల్గి వాటి తాదాత్మ్యమును పొంది, దేహములే తానని భావించెను. అంత్యములో తన యందు పూర్తి ఎఱుకను కలిగి, తానే పరమాత్మ అయ్యెను.
అనుభవ పూర్వకమైన యీ సత్యస్థితి, భూతలము మీద మానవ రూపములలో భగవంతుని నాలుగు వేర్వేరు దివ్య ఉన్నత స్థాయిలుగా వ్యక్తమగు చుండును.
1. మజ్ జూబియత్ | బ్రహ్మీభూతుడు (విదేహ ముక్తుడు) | సృష్టిలో కర్తవ్యము లేదు.
2. తురీయావస్థ | జీవన్ముక్తుడు (పరమ హంస) | లేదు
3. సులూకియత్ | సలీక్ | లేదు
4. కుతుబీయత్ | సద్గురువు | (దివ్యాధికారి)
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
20 Apr 2021
భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 209
🌹. భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 209 🌹
✍️. శ్రీ బాలగోపాల్
📚. ప్రసాద్ భరద్వాజ
🌻. సమీక్ష - 7 🌻
773. అనంతుడు, శాశ్వతుడు, నిరాకారుడు అయిన భగవంతుడు తన మిథ్యాస్థితులలో సృష్ట్యాది నుండి ఆరవ భూమిక వరకు తన స్వీయ సృష్టి వలన -
(అ). సంస్కార భూయిష్టుడై తొలిగా స్థూల రూపముల చైతన్యమును పొంది, భౌతిక ప్రపంచానుభవమును సంపాదించెను.
(ఆ). అట్లే సూక్ష్మ రూపముల చైతన్యమును పొంది, సూక్ష్మ ప్రపంచానుభవమును పొందెను.
(ఇ) మానసిక రూపముల చైతన్యమును పొంది, మనోమయ ప్రపంచానుభవమును పొందెను.
(ఈ) చివరకు అనంత పరమాత్మ యొక్క చైతన్యమును పొంది, తన శాశ్వత స్థితి యొక్క అనుభవమును పొందెను.
(ఉ) మానవ రూపములో "నేను భగవంతుడను" అనెడు సర్వోన్నతావస్థానమును చేరుకొని, పరమ సత్యానుభూతిని బడయుటయే జీవిత గమ్యము.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
18 Apr 2021
భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 208
🌹. భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 208 🌹
✍️. శ్రీ బాలగోపాల్
📚. ప్రసాద్ భరద్వాజ
🌻. సమీక్ష - 6 🌻
772. రూపము లేని ఆత్మ జనన మరణములు లేని ఆత్మ అనంతమైన ఆత్మ శాశ్వతమైన ఆత్మ కాస్త-సుఖములు సుఖ - దుఃఖములు మొదలైన ద్వంద్వములకు అతీతమైన ఆత్మ తనకు -- రూపమున్నదనియు, జనన మరణములు పొందుచుంటిననియు, పరిమితమైన దానననియు, అనిత్యమైన దానననియు గల అనుభవమును పొందుటకు సంస్కారములే కారణము.
ఈ అజ్ఞానమునకు కూడా సంస్కారములు కారణము. ఈ ద్వంద్వ అనుభములన్నియు స్థూల రూపమే పొందుచున్నది.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
16 Apr 2021
భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 207
🌹. భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 207 🌹
✍️. శ్రీ బాలగోపాల్
📚. ప్రసాద్ భరద్వాజ
🌻. సమీక్ష - 5 🌻
768. ఆత్మా, భౌతిక ప్రపంచనుభవమును పొందు చున్నపుడు జనన - మరణములు, కష్ట -సుఖములు, పుణ్య - పాపములు మొదలైన ద్వంద్వ అనుభవములు అన్నింటిని, యీ స్థూల రూపమే పొందుచున్నది.
769. ఆత్మకు స్థూలరూపము నీడ వంటిది. పరమాత్మకు భౌతిక ప్రపంచము నీడవంటిది.
770. ఆత్మ పొందుచున్న అనుభవములన్నియు తన నీడయైన స్థూలరూపానుభవములే కాని, ఆత్మకు ఎట్టి అనుభవము లేదు.
771. భౌతిక ప్రపంచము పరమాత్మకు ఛాయ కాబట్టి, ప్రపంచ అనుభవములు అన్నియు, అయదార్ధమైనవి.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
14 Apr 2021
భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 206
🌹. భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 206 🌹
✍️. శ్రీ బాలగోపాల్
📚. ప్రసాద్ భరద్వాజ
🌻. సమీక్ష - 4 🌻
764. స్థూల, సూక్ష్మ, కారణ దేహములు - పరిమితిగలవి, రూపముగలవి, నశ్వరమైనవి.
765. ముల్లోకములు - ఆయదార్థములు, ఆభాసములు, కల్పితములు, స్వప్నతుల్యములు.
766. ఆత్మ, స్థూల రూపముల ద్వారా, భౌతిక ప్రపంచనుభవమును పొందుచున్నపుడు, అసంఖ్యాక రూపములతో సహకరించు చుండును. దీనినే జననము అందురు.
767. ఆత్మ, స్థూలరూపముల ద్వారా భౌతిక ప్రపంచనుభవమును పొందుచున్నపుడు, అసంఖ్యాక రూపముల నుండి వియోగ మందు చుండును. దీనినే మరణము అందురు.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
12 Apr 21
భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 205
🌹. భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 205 🌹
✍️. శ్రీ బాలగోపాల్
📚. ప్రసాద్ భరద్వాజ
🌻. సమీక్ష - 3 🌻
760. ఆత్మా ఎట్టి సంస్కారములను కలిగియున్న, అట్టి వాటికనుగుణ్యమగు శరీరముతో తాదాత్మ్యత చెంది, ఆ శరీరమునే తానని భావించును.
761. సంస్కారములు కారణముననే, ఆత్మ, శరీరములే తననెడి భావమును పొందుచున్నది. ఈ అజ్ఞానమునకు కారణమూ, సమస్త అనుభములకు కారణము, ఈ సంస్కారములే.
762. ఆత్మయొక్క చైతన్యము, ఎట్టి సంస్కారములయందు చిక్క్యవాది యుండునో, అట్టివాటికనుగుణ్య శరీరములు ద్వారా, ఆ సంస్కార అనుభమును పొందితీరవలసినదే.
763. ఆత్మకు - స్థూల సూక్ష్మ - కారణ దేహములు - ప్రతిబింబములు.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
10 Apr 2021
భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 204
🌹. భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 204 🌹
✍️. శ్రీ బాలగోపాల్
📚. ప్రసాద్ భరద్వాజ
🌻. సమీక్ష - 2 🌻
756. ఆత్మలన్నియు ఒక్కటే అయినప్పుడు, అవియన్నియు పరమాత్మలోనే యున్నప్పుడు, వీటిలో ఇన్ని వ్యత్యాసములుండుటకు గల కారణమేమి?
757. వివిధమైన, వేర్వేరు సంసారములో కారణము.
758. ఆత్మ, ఎట్టి సంస్కారములను కలిగియున్న, అట్టి వాటికనుగుణ్యమైన శరీరముయొక్క చైతన్యమునే కలిగియుండి, ఆయా ప్రపంచనుభవమును పొందుచుండును.
759. 1. స్థూల సంస్కారములు -- అన్నయ్య దేహ చైతన్యం - భౌతిక ప్రపంచనుభవము.
2. సూక్ష్మ సంస్కారము -- ప్రాణమయ దేహ చైతన్యం - సూక్ష్మ ప్రపంచనుభవము
3. మానసిక సంస్కారము -- మనోమయ దేహ చైతన్యం - మనోమయ ప్రపంచనుభవము
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
8 Apr 2021
భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 203
🌹. భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 203 🌹
✍️. శ్రీ బాలగోపాల్
📚. ప్రసాద్ భరద్వాజ
🌻. సమీక్ష - 1 🌻
751. ఆత్మలన్నియు ఆ పరమాత్మలో ఉండెను, ఉన్నవి, ఉండును.
752. ఆత్మలన్నియు ఒకటే.అన్ని ఆత్మలు ఒక్కటే.
753. ఆత్మలన్నియు అనంతమైనవి. శాశ్వతమైనవి.నిరాకారమైనవి.
754. ఆత్మలన్నియు వాటి జీవనములో ఉనికిలో ఒకటిగనే యున్నవి. కాని అత్మలలో వ్యత్యాసములేదు.
755. కానీ -- ఆత్మలయొక్క చైతన్యములో, ప్రపంచనుభావములో, భూమికలలో,
బంధములలో, స్థితిలో, తాదాత్మ్యతలో మాత్రము వ్యత్యాసములున్నవి. ఈ వ్యత్యాసములు గల ఆత్మలన్నియు పరమాత్మలోనే యున్నవి.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
06 Apr 2021
భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 202
🌹. భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 202 🌹
✍️. శ్రీ బాలగోపాల్
📚. ప్రసాద్ భరద్వాజ
🌻. హల్ - ముకామ్ -అంతరానుభవము - 2 🌻
747. బాటసారి ఒక ప్రత్యేక ఆంతరికానుభవములో, ఒక ప్రత్యేక భూమికలో ఆగిపోవుటకు ముకామ్ అందురు.
748. హల్, ముకామ్ ఈ రెండును ఆరవ భూమిక వరుకు జంటగా నుండును. హల్, ఎల్లప్పుడును' ముకామ్'ను తన ఆధీనమందుంచు కొనును.
749. ఏడవ భూమికలో హాల్ ముకామ్ లకు తావు లేదు, ఉండదు.
750. హాల్ ఉన్నచోటనే ద్వైతముండును. సప్తమభూమిక నుండి సామాన్య చైతన్య స్థాయికి క్రిందికివచ్చి, ధర్మ నిర్వహణకై ఏ దేనిభూమిక యందు ప్రతిష్టితుడైనప్పుడు ఆ ప్రత్యేక భూమిక ఆతనికి "ముకామ్" అగును.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
04 Apr 2021
భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 201
🌹. భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 201 🌹
✍️. శ్రీ బాలగోపాల్
📚. ప్రసాద్ భరద్వాజ
🌻. హల్ - ముకామ్ -అంతరానుభవము - 1 🌻
743. హల్ అనుపదమునకు సాధారణ అర్థము అంతరానుభవము.
744. మొదటి భూమిక నుండి ఆరవ భూమిక వరకు 'హల్ ' ఆయా ఉనికికి సంబంధించి యుండును.
745. ఈ అంతరికానుభవము హర్షోన్మత్తతతో కూడి యుండును. ఈ హర్షోన్మత్తత స్వాధీన మందుడును. స్వాధీనములో లేక యుండును.
746. ప్రత్యేక అర్ధములో హల్, దివ్య హర్షోన్మత్తత, ఇది. అది నిలిచియున్న స్థానబలిమిని బట్టి తర తమ భేదములలో అనుభవింపబడు చుండును.
హాల్=భావము. ముకామ్=స్థానము.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
02 Apr 2021
భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 200
🌹. భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 200 🌹
✍️. శ్రీ బాలగోపాల్
📚. ప్రసాద్ భరద్వాజ
🌻. దృఢ విశ్వాసములు - అయిదు విధములైన జ్ఞానములు 🌻
741. 1. బావిని త్రవ్వకయే, ఇచ్చట మంచి నీరున్నదని భావించుటయు, భూమిని త్రవ్వుకొనుచు లోపలికి చొచ్చుకొని పోవుటయు మొదటి విశ్వాసము.
2. నీటిని కన్నులార చూచుట రెండవ విశ్వాసము.
3. నీటిని రుచి చూచుట మూడవ విశ్వాసము.
4. ఆ నీటిని గూర్చి ఇతరులకు వర్ణించి చెప్పుట నాల్గవ విశ్వాసము.
742. అయిదు విధములైన జ్ఞానము
1. ప్రాపంచిక జ్ఞానము (96వ పాయింట్ చూడుము)
2. ధర్మశాస్త్ర జ్ఞానము (98వ పాయింట్ చూడుము)
3. ఆధ్యాత్మిక జ్ఞానము} దార్శనికుల జ్ఞానము } (106వ పాయింట్ చూడుడు)
4. బ్రహ్మ జ్ఞానము (136వ పాయింట్ చూడుడు)
5. విశ్వ విజ్ఞానము}
సర్వజ్ఞత్వము} (156వ పాయింట్ చూడుడు)
(అవతార పురుషుని దివ్య జ్ఞానము)
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
31 Mar 2021
భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 199
🌹. భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 199 🌹
✍️. శ్రీ బాలగోపాల్
📚. ప్రసాద్ భరద్వాజ
🌻. సత్యానుభూతి - చతుర్విధ నిశ్చయార్థకములు 🌻
739. ఆత్మ నాల్గు స్థితుల ద్వారా పురోగమించగా సత్య సంబంధమగు నిత్య సత్యానుభూతిని సేకరించును.
740. చతుర్విధ నిశ్చయార్థకములు
1. అంతరానుభూతుల నుండి, దృశ్యముల నుండి లేక ఆధ్యాత్మిక అనుభవముల నుండి (అవి మార్గమందలి అనుభవములు కానీ లేక అన్యము కానీ) కలిగిన నిస్సంశయము.
2. సాక్షీభూతమైన నిస్సంశయము. సర్వత్రా భగవంతుని ప్రత్యక్షముగా చూపుట వలన కలిగిన నిస్సంశయము.
3. భగవదైక్యము వలన కలిగిన నిస్సంశయము.
4. మానవునిలోగల దివ్యత్వ పరిపూర్ణత్వమునకు సంబంధించిన అనుభవముతో కూడిన నిస్సంశయము. దీని వలన ఆతడు భగవంతుని యొక్క, విశ్వము యొక్క రహస్యములను ఎఱుంగును.
ఈ శక్తి ఒక్క సార్వభౌమిక మనస్సునకే (మహాకారణ శరీరము) గలదు. ఇది సమస్త దివ్య విచారమునకు పీఠము.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
29 Mar 2021
భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 198
🌹. భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 198 🌹
✍️. శ్రీ బాలగోపాల్
📚. ప్రసాద్ భరద్వాజ
🌻. త్రిభువనములు - ఆధ్యాత్మిక జీవితము యొక్క నాల్గు దశలు 🌻
736.
1. భౌతిక గోళము + సంయుక్త గోళమందలి భాగము { అన్న భువనము. }
2. సూక్ష్మ గోళము + సమగ్ర గోళమందలి భాగము { ప్రాణ భువనము. }
3. మానసిక గోళము + సమగ్ర గోళమందలి భాగము { మనో భువనము }
737. ఆధ్యాత్మిక జీవితము యొక్క నాల్గు దశలు :--
1. ధర్మశాస్త్ర మార్గము (కర్మకాండ మార్గము)
2. ఆధ్యాత్మిక మార్గము
3. ఐక్యమార్గము.
4. అనుభవ మార్గము.
పై నాల్గు దశలను అక్రోటు పండుతో పోల్చవచ్చును.
738.
1. అక్రోటు పండు యొక్క పై చర్మము లేక తొక్క, కర్మకాండ వంటిది.
2. దానిలోపలి పొర ఆధ్మాత్మిక మార్గము వంటిది.
3. దానిలోపలనున్న గుజ్జు ఐక్యము వంటిది.
4. గుజ్జులోపలి సారము అనుభవము వంటిది.
ఈ నాల్గును పరస్పరాశ్రితములై యున్నవి.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
27 Mar 2021
2. దానిలోపలి పొర ఆధ్మాత్మిక మార్గము వంటిది.
3. దానిలోపలనున్న గుజ్జు ఐక్యము వంటిది.
4. గుజ్జులోపలి సారము అనుభవము వంటిది.
ఈ నాల్గును పరస్పరాశ్రితములై యున్నవి.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
27 Mar 2021
భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 197
🌹. భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 197 🌹
✍️. శ్రీ బాలగోపాల్
📚. ప్రసాద్ భరద్వాజ
🌻. 734. పంచ గోళములు 🌻
734. పంచ గోళములు
1. భౌతిక గోళము , 2. సూక్ష్మ గోళము, 3. మానసిక గోళము, 4. సంయుక్త గోళము, 5. సత్యగోళము
ఇవి అన్నియు పరస్పర సంబంధ గోళములు.
735. సంయుక్త గోళము:
ఇది 21 అంతర్గోళములతో కూడి ఉన్నది. ఒక అర్ధములో ఇది యొక గోళము. మరియొక అర్థములో అసలు గోళమే కాదు.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
25 Mar 2021
భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 196
🌹. భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 196 🌹
✍️. శ్రీ బాలగోపాల్
📚. ప్రసాద్ భరద్వాజ
🌻. అవతారపురుషుడు - సద్గురువు చేయు మహిమలు 🌻
730. భగవంతునిలో అవతార పురుషునకు గల సంబంధము ఐచ్ఛిక సాన్నిహిత్యము.
731. భగవంతునితో సద్గురువునకు గల సంబంధము అనైఛ్చిక సాన్నిహిత్యము.
732. అవతార పురుషుడు మహిమలు చేయుటలో.... భగవంతుడు అభినేత (కారణుడు) మానవుడు నిమిత్తమాత్రుడు.
733. సద్గురువు మహిమలు చేయుటలో, మానవుడు అభినేత (కారణుడు) భగవంతుడు నిమిత్త మాత్రుడు.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
23 Mar 2021
భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 195
🌹. భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 195 🌹
✍️. శ్రీ బాలగోపాల్
📚. ప్రసాద్ భరద్వాజ
🌻. భగవంతుని పదవపాత్ర సద్గురువు - నాల్గవ దివ్య యానము - సద్గురువు -అవతార పురుషుడు. -9 🌻
726. అవతార పురుషుడు, సద్గురువు ఎందుకు మహిమలు ప్రదర్శింతురు?
ఆధ్యాత్మిక విలువల యందు తమకు గల సంపూర్ణ జ్ఞానం వలన, ప్రజలకు హాని జరుగకుండా వారిని రక్షించుటకై మహిమలను ప్రదర్శింతురు.
727. సద్గురువులు ఉన్నవి ఉన్నట్లుగనే కనిపించునట్లు చేయుచూ, ఇదివరకే యున్న మాయాతెరను చీల్చివైచి సత్యమును చూపింతురు .సృష్టి ,భావనా మాత్రమే యనియు గ్రహింప జేయుదురు.
728. సద్గురువుల శక్తులు స్వయంశక్తులు.ఎందుచేత?తామే అనంతశక్తి స్వరూపులు గనుక.యోగులు అట్లుగాక, శక్తులను అప్పుగొని వాటిద్వారా మహిమలు చేయుదురు.
729. తురీయ అవస్త యందున్న జీవన్ముక్తునకు అధికారము లేదు. కాబట్టి మహిమలు ప్రదర్శించడు.కానీ అతనికి తెలియకనే అతని ద్వారా మహిమలు జరుగు అవకాశం లేకపోలేదు.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
21 Mar 2021
భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 194
✍️. శ్రీ బాలగోపాల్
📚. ప్రసాద్ భరద్వాజ
🌻. భగవంతుని పదవపాత్ర సద్గురువు - నాల్గవ దివ్య యానము - సద్గురువు -అవతార పురుషుడు. - 8 🌻
ఎరుక తోడను ఎరుక లేకను జరిగెడు మహిమలు
724. అవతార పురుషుని వలన, సద్గురువుల వలన జరిగెడు మహిమలు 2 రకములు.
1. ఐచ్ఛికముగా చేయు మహిమలు
2. తాము చేయవలెనని, తెలిసియుండి చేయు మహిమలు.
725. 1. తమ దివ్యసంకల్పము యొక్క తీవ్రత ననుసరించి భాహ్యముగా చేయు మహిమలు.
2. అనైఛ్చికంగా జరుగు మహిమలు. తమకు తెలియకనే జరుగు చుండెడి మహిమలు తమ పరిసర ములలో ఎప్పుడూను క్రియాత్మక మగు శక్తితో కూడిన వాతావరణం చుట్టి యుండును. మహిమలు జరుగుటకు తాము మూల కారకులు కాబట్టి అనైఛ్చికంగా జరుగు చుండు మహిమలు వారికి తెలియకనే జరుగుచుండును.
3. ప్రపంచము యొక్క ఆధ్యాత్మిక జాగృతి కొరకే సద్గురువుల మూలముగా ఎల్లప్పుడును ఐచ్చికముగను అనైఛ్చికముగను (ఎరుకను ఎరుక లేకను) మహిమలు జరుగుచుండును.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
18 Mar 2021
భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 193
🌹. భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 193 🌹
✍️. శ్రీ బాలగోపాల్
📚. ప్రసాద్ భరద్వాజ
🌻. భగవంతుని పదవపాత్ర సద్గురువు - నాల్గవ దివ్య యానము - సద్గురువు -అవతార పురుషుడు. - 7 🌻
మహిమా ప్రదర్శనములు. వివిధములైన సిద్ధులు, లేక చమత్కారములు.
723.
1. అవతార పురుషుడు చేయు మహిమలు
2. సద్గురువు చేయు మహిమలు
3. మహాపురుషుడు (5వ భూమిక) సత్పరుషుడు (6వ భూమిక) చేయు మహిమలు.
4. 1, 2, 3, 4 భూమికలలో నుండు యోగులు చేయు మహిమలు.
1. సార్వజనీనముగా అవసరమైనప్పుడు, అవతార పురుషుడు విశ్వాత్మక లక్షణముతో మహిమలు చేయును. పరిస్థితుల ననుసరించి, అవతార పురుషుడు అంతవరకు 6, 5 లేక 4 భూమికలలో నుండును. ఆ మహిమలు చాల ఉధృతముగ నున్నప్పుడు అంతవరకు 4వ భూమికలో నుండును.
2. సద్గురువు కూడా మానవుల ఆధ్యాత్మిక శ్రేయస్సుకై మహిమలు చేయును. కాని అవతార పురుషుడు చేసినట్లు, విశ్వమంతటికి సంబంధించి యుండవు. అవసర పరిస్థితులను బట్టి, అవతార పురుషుని వలెనే, అంతవరకు 6, 5, 4 భూమికలలో నుండును. 7వ భూమికలో బ్రహ్మీభూతుడు మహిమలు చేయడు. ఎందుచేత ననగా ఆతనికి యీ సృష్టిలేదు. కాబట్టి.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
16 Mar 2021
Subscribe to:
Posts (Atom)



















