భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 209


🌹. భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 209 🌹

✍️. శ్రీ బాలగోపాల్
📚. ప్రసాద్ భరద్వాజ

🌻. సమీక్ష - 7 🌻


773. అనంతుడు, శాశ్వతుడు, నిరాకారుడు అయిన భగవంతుడు తన మిథ్యాస్థితులలో సృష్ట్యాది నుండి ఆరవ భూమిక వరకు తన స్వీయ సృష్టి వలన -

(అ). సంస్కార భూయిష్టుడై తొలిగా స్థూల రూపముల చైతన్యమును పొంది, భౌతిక ప్రపంచానుభవమును సంపాదించెను.

(ఆ). అట్లే సూక్ష్మ రూపముల చైతన్యమును పొంది, సూక్ష్మ ప్రపంచానుభవమును పొందెను.

(ఇ) మానసిక రూపముల చైతన్యమును పొంది, మనోమయ ప్రపంచానుభవమును పొందెను.

(ఈ) చివరకు అనంత పరమాత్మ యొక్క చైతన్యమును పొంది, తన శాశ్వత స్థితి యొక్క అనుభవమును పొందెను.

(ఉ) మానవ రూపములో "నేను భగవంతుడను" అనెడు సర్వోన్నతావస్థానమును చేరుకొని, పరమ సత్యానుభూతిని బడయుటయే జీవిత గమ్యము.


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹


18 Apr 2021

No comments:

Post a Comment