2) 🌹. శివ మహా పురాణము - 387🌹
3) 🌹 Light On The Path - 136🌹
4)🌹. మాస్టర్ ఇ.కె సందేశాలు -15🌹
5) 🌹. భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 209🌹
6) 🌹 Osho Daily Meditations - 4 🌹
7) 🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 64 / Lalitha Sahasra Namavali - 64🌹
8) 🌹. శ్రీ విష్ణు సహస్ర నామములు - 64 / Sri Vishnu Sahasranama - 64 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. గీతోపనిషత్తు -187 🌹*
✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
*📚. 6వ అధ్యాయము - ఆత్మ సంయమ యోగము 📚*
శ్లోకము 28
*🍀 28. అత్యంత సుఖము - ఎల్లప్పుడును ఆత్మతోనే సాయుజ్యము చేయుచు యోగమున నిలచినవాడు బ్రహ్మస్పర్శ లభించుటచే అత్యంత సుఖమును పొందుచున్నాడు. శారీరక సుఖము కన్న యింద్రియ సుఖము గొప్పది. ఇంద్రియ సుఖము కన్న మనో సుఖము గొప్పది. మనో సుఖము కన్న బుద్ధి లోక సుఖము గొప్పది. అంతకన్న గొప్పది ఆత్మ సుఖము. ఆత్మ బ్రహ్మస్పర్శతో పొందునది పూర్ణ సుఖము. ఇట్టి సోపానక్రమమున ప్రాథమిక సుఖములు అశాశ్వతములు. మాధ్యమిక సుఖములు శాశ్వతములు. ఉత్తమ సుఖములు శాశ్వత సుఖములలో కూడ ఉత్తమ శ్రేణికి చెందినవి. ఇట్టి సోపాన సుఖమును అవగాహన చేసుకొనుట బుద్ధిమంతుల కావశ్యకము. 🍀*
యుంజన్నేవం సదా22 త్మానం యోగీ విగతకల్మషః |
సుఖేన బ్రహ్మసంస్పర్శ మత్యంతం సుఖ మశ్నుతే || 28
ఎల్లప్పుడును ఆత్మతోనే సాయుజ్యము చేయుచు యోగమున నిలచినవాడు బ్రహ్మస్పర్శ లభించుటచే అత్యంత సుఖమును పొందుచున్నాడు. ఈ శ్లోకము ముందు శ్లోకమునకు కొనసాగింపే. ఆత్మతో బాగుగ రతి చెందిన చిత్తము సమస్తము నందు దానినే దర్శించుచు,
బ్రహ్మము స్పర్శను పొందుచు, బ్రహ్మానందము పొందుచు నుండును. అట్టివాడు విగత కల్మషుడని, సుఖవంతుడని ముందు శ్లోకములలోనే చెప్పబడినది. మరల మరల చెప్పుటలో సుఖ మెంత సుఖమో తెలుపుచున్నారు. సుఖము పొందునని, ఉత్తమ సుఖము పొందునని, అత్యుత్తమ సుఖము పొందునని, సోపాన క్రమమున సుఖమును గూర్చి గీతాచార్యుడు తెలుపుచున్నాడు.
శారీరక సుఖము కన్న యింద్రియ సుఖము గొప్పది. ఇంద్రియ సుఖము కన్న మనో సుఖము గొప్పది. మనో సుఖము కన్న బుద్ధి లోక సుఖము గొప్పది. అంతకన్న గొప్పది ఆత్మ సుఖము. ఆత్మ బ్రహ్మస్పర్శతో పొందునది పూర్ణ సుఖము. ఇట్టి సోపానక్రమమున ప్రాథమిక సుఖములు అశాశ్వతములు. మాధ్యమిక సుఖములు శాశ్వతములు. ఉత్తమ సుఖములు శాశ్వత సుఖములలోకూడ ఉత్తమ శ్రేణికి చెందినవి.
అందువలన అత్యంత సుఖమని ఈ శ్లోకమున చెప్పబడుచున్నది. ఆత్మసుఖము కలవానికి ఇతర సుఖములు లేనిచో ఇబ్బంది లేదు. అట్టి వానికి మనస్సేంద్రియ శరీరములు ఉన్నను లేకున్నను ఒక్కటియే. మనస్సేంద్రియ శరీర సుఖములు స్థిరములు కావు. బుధ్యాత్మ సుఖములు స్థిరము.
ఇట్టి సోపాన సుఖమును అవగాహన చేసుకొనుట బుద్ధిమంతుల కావశ్యకము. కేవలము అన్నపానాదులు, హాస నిద్రాదులు మాత్రమే సుఖ మనుకొనువారు పసివారు. మానవుల యందు వీరే ఎక్కువ. ఉత్తమోత్తమ సుఖములు తెలిసినవారు ఇట్టి పసివారికి కూడ అత్యుత్తమ సుఖము కలుగవలెనని ఆరాట పడుచుందురు. వారి ఆరాటమునకు విశ్వప్రేమయే కారణము కాని, తాపత్రయము కారణము కాదు.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #గీతోపనిషత్ #సద్గురుపార్వతీకుమార్
Join and Share
🌹. భగవద్గీత BhagavadGita Telegram, FB Groups 🌹
https://t.me/bhagavadgeethaa/
www.facebook.com/groups/bhagavadgeethaa/
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹 . శ్రీ శివ మహా పురాణము - 387🌹*
రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ
*🌴. రుద్ర సంహితా - పార్వతీ ఖండః 🌴*
అధ్యాయము - 16
*🌻. బ్రహ్మ దేవతల నోదార్చుట - 1 🌻*
బ్రహ్మఇట్లు పలికెను-
అపుడా దేవతలందరు తారకునిచే పీడింపబడిన వారై ప్రజాపతిని మహాభక్తితో ప్రణమిల్లి స్తుతించిరి.(1) సత్యము, మనోహరమునగు దేవతల స్తుతిని విని నేను మిక్కిలి ప్రసన్నుడనై దేవతలకు ఇట్లు బదులిడితిని(2). దేవతలారా! స్వాగతము. మీ మీ అధికారములు విఘ్నములు లేకుండా కొనసాగుచున్నవా? మీరందరు ఇచటకుఏల వచ్చితిరి? చెప్పుడు(3). ఆ దేవతలందరు ఈ నామాటను విని ప్రణమిల్లి తారకుని బెడదచే దీనులుగా నున్నవారై నాతో నిట్లనిరి(4).
దేవతలిట్లు పలికిరి-
హే లోకనాథా! నీవు ఇచ్చిన వరముచే గర్వితుడైన తారకాసురుడు మమ్ములను బలాత్కారముగా మాపదవుల నుండి వెళ్లగొట్టి ఆపదవులను తానే ఆక్రమించెను(5), మాకు కలిగిన ఈ విపత్తు గురించి నీకు తెలియనే లేదా? మేము నిన్ను శరణు జొచ్చితిమి. మా దుఃఖమును వెంటనే దూరము చేయుము(6). మేము ఎచ్చట నున్ననూ మమ్ములనీ దుఃఖము రాత్రింబగళ్లు పీడించుచున్నది. మేము ఎచటకు పారిపోయిననూ, తారకుడచటనే మాకు ప్రత్యక్షమగుచున్నాడు(7). హే సర్వేశ్వరా! తండ్రీ తారకుని వలన మాకు సంప్రాప్తమైన దుఃఖముచే మేమందరము మిక్కిలి పీడింపబడి దుఃఖితులమై యున్నాము(8)
అగ్ని, యముడు, వరుణుడు, నిర్ ఋతి, వాయువు, మరియు ఇతర దిక్పాలకులందరు వానికి వశులై(9), మనుష్యులవలె సంచరించుచూ, వివిధ పరికరములను చేతబట్టి, ఆ మహాసురుని సేవించుచున్నారు. వారికి ఒక క్షణమైననూ స్వాతంత్ర్యము లేకున్నది (10). ఇట్లు వానిచే పీడింపబడిన దేవతలందరు అన్ని కాలములయందు వానికి వశులై, వానికోరికకు అనురూపమగు పనులను చేయుచూ, వాని సేవకులై జీవించుచున్నారు.(11) వారి యువతులు అందరు, మరియు అప్సరస స్త్రీలు ఎవరు గలరో, వారిని అందరినీ మహాబలశాలియగు ఆ తారకాసురుడు తన వశము చేసుకొనెను(12)
యజ్ఞములు ఆగిపోయినవి . తాపసులు తపస్సును చేయుటకు లేదు. లోకములలో దాన ధర్మాదికము లేమియూ జరుగుట లేదు (13) వాని సేనాపతి, మహా పాపి అగు క్రౌంచుసురుడొకడు గలడు. వాడు ప్రతి దినము పాతాళ లోకమునకు వెళ్లి ప్రజలను బాధించుచున్నాడు (14) ఓ జగత్కర్తా! కఠిన హృదయుడు పాపియగు ఆ తారకుడు హఠాత్తుగా ఈ ముల్లోకముల రాజ్యమును మానుండి అపహరించినాడు.(15) హే లోకనాథా! ఆ రాక్షసుడు మా స్థానములకు మేము వెళ్లకుండగా వారించుచున్నాడు. నీవు మాకు ఒక స్థానమును నిర్దేశించుము. మేము అచటకు వెళ్లి స్వస్థులమై ఉండెదము.(16)
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #శివమహాపురాణము
Join and Share
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://t.me/ChaitanyaVijnanam
https://pyramidbook.in/Chaitanyavijnanam
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹 LIGHT ON THE PATH - 136 🌹*
*🍀 For those WHO DESIRE TO ENTER WITHIN - For DISCIPLES 🍀*
✍️. ANNIE BESANT and LEADBEATER
📚. Prasad Bharadwaj
CHAPTER 11 -
*🌻 21. Look for the flower to bloom in the silence that follows the storm: not till then - 1 🌻*
515. It shall grow, it will shoot up, it will make branches and leaves and form buds, while the storm continues, while the battle lasts. But not till the whole personality of the man is dissolved and melted – not until it is held by the divine fragment which has created it, as a mere subject for grave experiment and experience – not until the whole nature has yielded and become subject unto its Higher Self, can the bloom open.
Then will come a calm such as comes in a tropical country after the heavy rain, when nature works so swiftly that one may see her action. Such a calm will come to the harassed spirit. And in the deep silence the mysterious event will occur which will prove that the way has been found.
Call it by what name you will, it is a voice that speaks where there is none to speak – it is a messenger that comes, a messenger without form or substance; or it is the flower of the soul that has opened. It cannot be described by any metaphor. But it can be felt after, looked for, and desired, even amid the raging of the storm.
516. C.W.L. – The blooming of the flower is the development, the unfoldment of the soul. The worst feature of sorrow and suffering down here is the feeling that one is helpless. People engage in all sorts of struggles, and in many cases think they are predestined to fail.
They will say: “I have heard of certain people making rapid progress, but there is no chance for me.” They are hopeless about it because they do not know. We can never again have that feeling when once the soul has unfolded itself, because we know. We shall still have struggles and troubles and difficulties, but we know for certain that as souls we are invincible.
517. As is said here, it is in the silence and the calm that the soul grows. People tell us, and I think that they often emphasize it quite unduly, that the soul grows through suffering. Put that way the statement is not quite correct. It is by making mistakes and correcting them that the soul learns how to grow, and suffering invariably comes as the result of the mistakes; but as I have explained before, the growth does not take place during the suffering, but afterwards.
A person may be very much better after a surgical operation, but the improvement does not take place while the operation is being performed.1 (1 Ante. p. 100.) In like manner while people are in the throes of all sorts of terrible difficulties they are not growing, but by the way in which they meet those difficulties they may be learning to grow after they have surmounted them.
It is in the silence which follows the storm that the flower grows. It is possible that plants may develop strength within themselves by enduring a storm, but growth can come only when the buffeting of the storm is over. We must have gone through the turmoil of battle before we gain that great reward of victory, the real unfoldment of the soul, which brings with it a calm certainty which nothing again can ever shake.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #LightonPath #Theosophy
Join and Share
Thosophical Teachings దివ్యజ్ఞాన సందేశములు
www.facebook.com/groups/theosophywisdom/
https://t.me/Seeds_Of_Consciousness
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 15 🌹*
✍️. సద్గురు ఇ. కృష్ణమాచార్యులు
సంకలనం : వేణు మాధవ్
📚. ప్రసాద్ భరద్వాజ
*🌻. మానసిక బలహీనతలు - భయము 🌻*
సాధకుడు భగవదనుభూతిని పొందుటకై చేయు సాధనామార్గమున తన అథశ్చేతనలో దాగియున్న కొన్ని ప్రతికూల భావనల నుండి బయటపడవలెను.
ప్రతి జీవుడు సహజముగా దైవాంశగా ఉన్న ప్రేమ, త్యాగము, వినయము వంటి దివ్యగుణములతో కూడియున్నను, దేహధారి అగుటతో పరిణామమున కొన్ని అసుర లక్షణములు కూడ అతనిని కప్పియుండును.
సరియైన వివేచనతో, ఇంగితజ్ఞానముతో, సత్సాంగత్యముతో, కర్తవ్య నిష్ఠతో వీని నుండి బయటపడవచ్చును.
సాధకుడు మున్ముందుగా తన లోపములను సమర్థించుకొనుటకు, కప్పిపుచ్చుటకు ప్రయత్నింపక, వానిని సూటిగా అంగీకరించుటకు సంసిద్ధుడు కావలెను. తన లోపముల ఉనికిని అంగీకరించుటకు సిద్ధము కానివాడు వానిని సరిదిద్దుకొనుటకు ఎట్లు ఇష్టపడును?
సాధుపురుషులను ఆశ్రయించి, వారి యందు వినయముతో మెలగుచూ, వారిని అనుసరించుటతో తన లోపములను శుద్ధి చేసుకొనవచ్చును.
తన లోపములను గూర్చి క్రుంగిపోనక్కరలేదు. ఎంతటి దురాచారుడైనను తన పూర్వకర్మ ప్రధానము వలన ఏర్పడిన దుర్వాసనల నుండి బయటపడును.
దయామయుడైన దేవుడు అవకాశములను ఇచ్చుచున్నాడు. సర్వాంతర్యామికి శరణంది, సేవించనారంబించుటతో తనలో దాగియున్న దివ్యగుణములు వికసింపసాగును.....
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #మాస్టర్‌ఇకెసందేశములు
Join and Share
🌷. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు 🌷
www.facebook.com/groups/masterek/
https://t.me/ChaitanyaVijnanam
www.facebook.com/groups/chaitanyavijnanam/
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹 Osho Daily Meditations - 4 🌹*
📚. Prasad Bharadwaj
*🍀 AN ECHOING PLACE 🍀*
*🕉 The world is an echoing place. If we throw anger, anger comes back; if we give love, love comes back. 🕉*
Love should not be demanding; otherwise it loses wings, it cannot fly.
It becomes rooted in the earth becomes very earthly; then it is lust and it brings great misery and great suffering.
Love should not be conditional, one should not expect anything out of it. It should be for its own sake-not for any reward, not for any result. If there is some motive in it, again, your love cannot become the sky.
It is confined to the motive; the motive becomes its definition, its boundary.
Unmotivated love has no boundary: It is pure elation, exuberance, it is the fragrance of the heart. And just because there is no desire for any result, it does not mean that results do not happen; they do, they happen a thousand fold, because whatever we give to the world comes back, it rebounds.
The world is an echoing place. If we throw anger, anger comes back; if we
give love, love comes back. But that is a natural phenomenon; one need not think about it. One can trust: It happens on its own.
This is the law of karma: Whatever you sow, you reap; whatever you give, you receive. So there is no need to think about it, it is automatic. Hate, and you will be hated. Love, and you will be loved.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #ఓషోబోధనలు #OshoDiscourse #OshoDailyMeditations
Join and Share
🌹 ఓషో బోధనలు - Osho Teachings 🌹
http://www.facebook.com/groups/oshoteachings/
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://t.me/ChaitanyaVijnanam
https://pyramidbook.in/Chaitanyavijnanam
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 209 🌹*
✍️. శ్రీ బాలగోపాల్
📚. ప్రసాద్ భరద్వాజ
*🌻. సమీక్ష - 7 🌻*
773. అనంతుడు, శాశ్వతుడు, నిరాకారుడు అయిన భగవంతుడు తన మిథ్యాస్థితులలో సృష్ట్యాది నుండి ఆరవ భూమిక వరకు తన స్వీయ సృష్టి వలన -
(అ). సంస్కార భూయిష్టుడై తొలిగా స్థూల రూపముల చైతన్యమును పొంది, భౌతిక ప్రపంచానుభవమును సంపాదించెను.
(ఆ). అట్లే సూక్ష్మ రూపముల చైతన్యమును పొంది, సూక్ష్మ ప్రపంచానుభవమును పొందెను.
(ఇ) మానసిక రూపముల చైతన్యమును పొంది, మనోమయ ప్రపంచానుభవమును పొందెను.
(ఈ) చివరకు అనంత పరమాత్మ యొక్క చైతన్యమును పొంది, తన శాశ్వత స్థితి యొక్క అనుభవమును పొందెను.
(ఉ) మానవ రూపములో "నేను భగవంతుడను" అనెడు సర్వోన్నతావస్థానమును చేరుకొని, పరమ సత్యానుభూతిని బడయుటయే జీవిత గమ్యము.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #భగవద్ధర్శిని #అవతారమెహర్
Join and share
🌹 Meher Baba అవతార్ మెహర్ బాబా 🌹
www.facebook.com/groups/avataarmeherbaba/
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://t.me/ChaitanyaVijnanam
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 64 / Sri Lalita Sahasranamavali - Meaning - 64 🌹*
🌻. మంత్రము - అర్ధం 🌻
📚. ప్రసాద్ భరద్వాజ
*🍀. 64. సంహారిణీ, రుద్రరూపా, తిరోధానకరీశ్వరీ ।*
*సదాశివానుగ్రహదా, పంచకృత్య పరాయణా ॥ 64 ॥ 🍀*
🍀 268. సంహారిణీ -
ప్రళయకాలంలో సమస్త వస్తుజీవజాలాన్ని తనలోనికి ఉపసంహరణ గావించి, లీనము చేసుకొనునది.
🍀 269. రుద్రరూపా -
రుద్రుని యొక్క రూపు దాల్చింది.
🍀 270. తిరోధానకరీ -
మఱుగు పరచుటను చేయునది.
🍀 271. ఈశ్వరీ -
ఈశ్వరుని యొక్క శక్తిరూపములో ఉండునది.
🍀 272. సదాశివా -
సదాశివ స్వరూపిణి.
🍀 273. అనుగ్రహదా -
అనుగ్రహమును ఇచ్చునది.
🍀 274. పంచకృత్య పరాయణా -
సృష్టి, స్థితి, లయ, తిరోధాన, అనుగ్రహాలనే అయిదు కృత్యముల యందు ఆసక్తి కలది.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
*🌹. Sri Lalita Sahasranamavali - Meaning - 64 🌹*
📚. Prasad Bharadwaj
*🌻 64. saṁhāriṇī rudrarūpā tirodhāna-karīśvarī |*
*sadāśivā'nugrahadā pañcakṛtya-parāyaṇā || 64 || 🌻*
🌻 268 ) Samharini -
She who destroys
🌻 269 ) Rudhra roopa -
She who is of the form of Rudhra
🌻 270 ) Thirodhana kari -
She who hides herself from us
🌻 271 ) Eeswari -
She who is of the form of easwara
🌻 272 ) Sadashivaa -
She who is of the form of Sadashiva
🌻 273 ) Anugrahada -
She who blesses
🌻 274 ) Pancha krithya parayana -
She who is engaged in the five duties of creation, existence, dissolving, disappearing, and Blessings.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #లలితాదేవి #LalithaDevi #లలితాసహస్రనామ #LalithaSahasranama
Join and Share
🌹. శ్రీ లలితా దేవి చైతన్యము Sri Lalitha Devi Chatanyam 🌹
https://t.me/srilalithachaitanyavijnanam
http://www.facebook.com/groups/srilalithachaitanyavijnanam/
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శ్రీ విష్ణు సహస్ర నామములు - 64 / Sri Vishnu Sahasra Namavali - 64 🌹*
*నామము - భావము*
📚. ప్రసాద్ భరద్వాజ
*🌷. ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్ 🌷*
*విశాఖ నక్షత్ర చతుర్ధ పాద శ్లోకం*
*🌻 64. అనివర్తీ నివృత్తాత్మా సంక్షేప్తా క్షేమకృచ్ఛివః |*
*శ్రీవత్సవక్షాః శ్రీవాసః శ్రీపతిః శ్రీమతాంవరః ‖ 64 ‖ 🌻*
🍀 596) అనివర్తీ -
ధర్మ మార్గమున ఎన్నడూ వెనుకకు మఱలని వాడు.
🍀 597) నివృత్తాత్మా -
నియమింపబడిన మనసు గలవాడు.
🍀 598) సంక్షేప్తా -
జగత్తును ప్రళయకాలమున సూక్షము గావించువాడు.
🍀 599) క్షేమకృత్ -
క్షేమమును గూర్చువాడు.
🍀 600) శివ: -
తనను స్మరించు వారలను పవిత్రము చేయువాడు.
🍀 601) శ్రీవత్సవక్షా -
శ్రీ వత్సమనెడి చిహ్నమును వక్షస్థలమున ధరించినవాడు.
🍀 602) శ్రీ వాస: -
వక్షస్థలమున లక్ష్మీదేవికి వాసమైనవాడు.
🍀 603) శ్రీపతి: -
లక్ష్మీదేవికి భర్తయైనవాడు.
🍀 604) శ్రీమతాంవరా: -
శ్రీమంతులైన వారిలో శ్రేష్ఠుడు.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Vishnu Sahasra Namavali - 64 🌹*
*Name - Meaning*
📚 Prasad Bharadwaj
*🌷 OM NARAYANAYA VIDMAHE VASUDEVAYA DHIMAHI । TANNO VISHNU PRACHODAYAT ॥ 🌷*
*Sloka for Visakha 4th Padam*
*🌻 64. anivartī nivṛttātmā saṁkṣeptā kṣemakṛcchivaḥ |* *śrīvatsavakṣāḥ śrīvāsaḥ śrīpatiḥ śrīmatāṁ varaḥ || 64 || 🌻*
🌻 596. Anivartī: One who never retreats in the battle with Asuras. Or one who, being devoted to Dharma, never abandons it.
🌻 597. Nivṛttātmā:
One whose mind is naturally withdrawn from the objects of senses.
🌻 598. Saṁkṣeptā: One who at the time of cosmic dissolution contracts the expansive universe into a subtle state.
🌻 599. Kṣemakṛt:
One who gives Kshema or protection to those that go to him.
🌻 600. Śivaḥ:
One who purifies everyone by the very utterance of His name.
🌻 601. Śrīvatsavakṣāḥ:
One on whose chest there is a mark called Shrivasta.
🌻 602. Śrīvāsaḥ:
One on whose chest Shridevi always dwells.
🌻 603. Śrīpatiḥ:
One whom at the time of the churning of the Milk ocean Shridevi chose as her consort, rejecting all other Devas and Asuras. Or Shri mean supreme Cosmic Power. The Lord is the master of that Power.
🌻 604. Śrīmatāṁ-varaḥ:
One who is supreme over all deities like Brahma who are endowed with power and wealth of the Vedas.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #విష్ణుసహస్రనామములు #VishnuSahasranama
Join and Share
విష్ణు సహస్రనామ స్తోత్రము / Vishnu Sahasranama group.
https://t.me/vishnusahasranaam
www.facebook.com/groups/vishnusahasranaam/
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
No comments:
Post a Comment