శ్రీ మదగ్ని మహాపురాణము (Śrī Madagni Mahāpurāṇamu)


 


M̴̛̖͈̗͂͜ͅé̵̖̹̰̹̣̗̞̳̤̂̀̾̊͑̊̚͠s̴̛̭̙̊͂͑ş̷̖̦͖̰̄̈́̈͌̊ą̶̮̺̳͕̰̝͕͂̐͑g̶̡͍̝̲̘͍̦̹̯̭̈́̌̋͐̍͗́̎̍͝ę̷̩̘̮̘̜̻̣̔̓̓̐͂̈͂́́͛s̵̛̰͚̲̹̥̳̏͒͜ͅ ̷͎͈̳̜̰̫͓̲̇̀̓͆̀̕͘f̷̼̟̣̝̟̈́ŗ̵̛̝̲̯͙̥̤̰̲̌͐́̀̓ó̴̡̦̩̙͖̳̦̖̺̭͌͊̂͗̀͛͋͝ṁ̴̛͓͈͓̜͎͒̍̑̾̏͗͘ ̵̖̈ ̵̩̱̝̙̖̬͖͎͈̅͑͠1̷̨̓ ̶̧̢̛̱͍͔͉̯͕̾͑̽̔̆͋͌̐̊ ̷̢͈̩̝̣͊͌́͑̉̚͜ţ̴̢͇͖̲͕͊̾̇̏́̽͝͝o̵̢͕̺͌͐̀̆̏̿̐̿̕ ̴̗̭̺̼̭̃̍̍̏̾̍̍̓̕͝ ̸̯̯̼̬͇̹͍̺͂͠ͅ6̸̻̄̉̉̋̽͊̕5̵̰̭͂́͑̀ ̸̡̭̺̏̉̓͝.̷͕̳́͑̊̃.̵͓̘̖͈̠̪̮̒̀̀̓̓̏͒͘͜.̶͍̘̖̮̼̠̥̖̈́̌͑͋̅
̵̦̅̀̌͊̒C̴̨͓̳̣̤͍̊̓̇̋̃̾̈́̌͝õ̶͈m̶̧̼̳͈̉̈́̈́̍̄̀̏̕i̷̮͍͍̒̏͊̑̀̽͐̀n̵̩̤̖̫͗̋̌̉͊g̶̛̘̈̓̿̋́̕ ̸͚͔̥͍͍͉̓͒̓̅͐̇̀͝S̶͙̫͙̓́̇̿͝͠ỡ̸̡̨̢̧͎̪͎̜͉͓̐̃̀͒̒͛̈́͒ơ̷̧̥̮̞̤̣̙̯̊̽̿̏͊̎̓̕͝ͅn̵̨̰̩͇͇̼͕͕̊͜.̷̺͉̪̯̖̏̔͊̓͐͒͐̀͘.̷̣̎̐͌̄͆̑.̴̢̨͎͉̝̍̑̉̓̇͝͝.̶̡̛̳͔̘͚͐̆̽̆̓͝

🅼🅴🆂🆂🅰🅶🅴🆂 🅵🆁🅾🅼   1   🆃🅾   65 . . .
🅲🅾🅼🅸🅽🅶 🆂🅾🅾🅽 . . .

 

------------------------------------ x ------------------------------------
🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 66 🌹
✍️. శ్రీ పుల్లెల శ్రీరామచంద్రుడు
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

ప్రథమ సంపుటము, అధ్యాయము - 27

🌻. దీక్షా విధి - 7 🌻

హోమేన శోధయేత్పశ్చాత్సంహార క్రమయోగతః | యాని సూత్రాణి బద్దాని ముక్త్వా కర్మాణి దేశికః. 63
శిష్యదేహాత్సమాహృత్య క్రమాత్తత్త్వాని శోధయేత్‌ | అగ్నౌ ప్రాకృతికే విష్ణౌ లయం నీత్వాధిదైవికే. 64

శుద్దం తత్త్వమశుద్ధేన పూర్ణాహుత్యా తు సాధయేత్‌ |

పిమ్మట సంహారక్రమమున హోమముచే శోధనము చేయవలెను. శిష్యుని దేమముపై కట్టిన కర్మరూప సూత్రములను విడిపించి, వాటిని ఒకచోట పోగుచేసి, తత్త్వ శోధనము చేయవలెను. ప్రాకృతికాగ్నియందును, ఆధిదైవిక విష్ణువునందును లయముచేసి, అశుద్ధులతో కూడిన తత్త్వమును పూర్ణాహుతిచే శుద్ధము చేయవలెను.

శిష్యే ప్రకృతిమాపన్నే దగ్ధ్వా ప్రాకృతికాన్‌ గుణాన్‌. 65

మోచయే దధికారే వా నియుంజ్యాద్ధేశికః విశూన్‌ |

ప్రాకృతిక గుణములను దహించి శిష్యుడు ప్రకృతిస్థుడైన పిమ్మట గురువు ఆతనిని విముక్తుని చేయవలెను; లేదా శిశువులను (శిష్యులను) అధికారమునందు నియుక్తులను చేయవలెను.

అథాన్యాం శక్తి దీక్షాం వా కుర్యాద్భావే స్థితో గురుః. 66
భక్త్యా సంప్రతిపన్నానాం యతీనాం నిర్ధనస్య పచ | సంపూజ్య స్థణ్డిలే విష్ణుం పార్శ్వస్థం స్థాప్య పుత్రకమ్‌. 67
దేవతాభిముఖః శిష్యస్తిర్యగాస్యః స్వయం స్థితః | అధ్వానం నిఖిలం ధ్యాత్వా పర్వభిః స్త్వెర్వికల్ఫతమ్‌. 68
శిష్యదేహే తథా దేవమాదిదైవిక యాజనమ్‌ | ధ్యానయోగేన సంచిన్త్య పూర్వవత్తాడనాదినా. 69

క్రమాత్తత్త్వాని సర్వాణి శోధయేత్థ్సణ్డిలే హరౌ |

లేదా గురువు భావస్థితుడై మరియొక శక్తిదీక్ష యైన చేయవలెను. యతులు గాని, నిర్ధనులు గిన భక్తి పూర్వకముగ తన నాశ్రయించి నపుడు స్థండిలముపై విష్ణువును పూజించి, పార్శ్వమునందే కూర్చుండబెట్టవలెను. 

శిష్యుడు దేవతాభిముఖుడుగా ఉండగా గురువు ముఖమును అడ్డముగా త్రిప్పి కూర్చుండవలెను. స్వీయపర్వములతో వికల్పిత మైన సకలాధ్వమును శిష్యునిదేహముపై ధ్యానించి పిమ్మట ఆధిదైవికపూజ చేయవలెను. ధ్యానమోగముచే చింతించి, వెనుక చెప్పిన విధమున తాడనాదికముచే క్రమముగ స్థండిలముపై నున్న హరియందు సకలతత్త్వసంశోధనము చేయవలెను.

తాడనేన వియోజ్యాథ గృహీత్వాత్మని తత్పరః. 70
దేవే సంయోజ్య సంశోధ్య గృహీత్వా తత్స్వభావతః | ఆనీయ శుద్దభావేన సన్ధయిత్వా క్రమేణ తు. 71

శోధయేద్ధ్యానయోగేన సర్వతో జ్ఞానముద్రయా |

పిమ్మట తాడనముచేత విడిపించి, తత్పరత్వముతో తనలో గ్రహించి, దేవునితో సంబంధింప చేసి, పరిశోధనము చేసి, దేవస్వరూపమున గ్రహించి, శుద్ధభావముతో తీసికొని వచ్చి, క్రమముగ సంధింపచేసి, ధ్యానమోగము నవలంబించి జ్ఞానముద్రతో శోధింపవలెను.

శుద్ధేషు సర్వతత్త్వేషు ప్రధానే చేశ్వరే స్థితే. 72
దగ్ఠ్వా నిర్వాపయేచ్ఛిష్యాన్‌ పదే చైశే నియోజయేత్‌ | నినయేత్సిద్దిమార్సే వా సాధకం దేశికోత్తమః. 73

సర్వతత్త్వములను శుద్ధము లైన పిమ్మట ప్రధాను డగు ఈశ్వరుడు మాత్రము ఉండగా, శిష్యులను(పాశములను) దహించి నిర్వాపితులను చేయవలెను. ఈశ్వరస్థానమున వారిని నియుక్తులను చేయవలెను. లేదా దేశికోత్తముడు సాధికుని సిద్ధిమార్గమును పొందింపచేయవలెను.

ఏవమేవాధికారస్థో గృహే కర్మణ్యతన్ద్రితః | ఆత్మానం శోధయంస్తిష్ఠే ద్యావద్రాగక్షయో భవేత్‌. 74

అధికారము గల గృహస్థుడు ఈ విధముగ కర్మాచరణవిషయమున అలసత్వము లేనివాడై, రాగము క్షీణించు వరకును ఆత్మశోధనము చేసికొనుచు ఉండవలెను.

క్షీణరాగమథాత్మానం జ్ఞాత్వా సంశుద్ధకిల్బిషః | ఆరోప్య పుత్రే శిష్యే వాహ్యధికారం తు సంయమీ. 75
దగ్ధ్వా మాయామయం పాశం ప్రవ్రజ్య స్వాత్మని స్థితః | శరీరపాతమాకాజ్‌క్షన్నా సీతావ్యక్త లిఙ్గవాన్‌. 76

ఇత్యాది మహాపురాణ ఆగ్నేయే సర్వదీక్షాకథనం నామ సప్తవింశోధ్యాయః.

తన కున్నరాగము క్షీణించిన దను విషయము గుర్తించి, పాపము లన్నియు తొలగిన ఆతడు పుత్రునకు గాని శిష్యునకు గాని అధికారము అప్పగించి, సంయమియై, మాయామయ మగు పాశమును దహింపచేసకిని, సన్యాసము స్వీకరించి, ఆత్మచింతాపరాయణుడై, తన స్థితిని ఇతరులకు వ్యక్తముచేయక శరీరపాతమునకై (మరణమునకై) వేచి యుండవలెను.

అగ్ని మహాపురాణములో సర్వదీక్షాకథన మను ఇరువదిఏడవ అధ్యాయము సమాప్తము.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

11.Aug.2020

------------------------------------ x ------------------------------------

🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 67 🌹
✍️. శ్రీ పుల్లెల శ్రీరామచంద్రుడు
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

ప్రథమ సంపుటము, అధ్యాయము - 28
🌻. అభిషేక విధానం 🌻

అథాష్టావింశోధ్యాయః

అథాచార్యాభిషేకవిధానమ్‌

నారద ఉవాచ :

అభిషేకం ప్రవక్ష్యామి యథా కుర్యాత్తు పుత్రకః | సిద్ధిభాక్సాధకో యేన రోగీ రోగాద్విముచతే. 1

రాజ్యం రాజా సుతం స్త్రీ చ ప్రాప్నుయాన్మలనాశనమ్‌ |

నారుదుడు పలికెను : శిష్యుడు ఆచార్యాభిషేకము ఎట్టు చేయవలెనో చెప్పదను. దీనిచేత సాధకుడు సిద్ధిని పొందును. రోగి రోగవిముక్తు డగును. రాజు రాజ్యమును, స్త్రీ కుమారుని, పాపవినాశమును పొందును.

మృత్స్నాకుమ్భాన్‌ సురత్నాఢ్యాన్మధ్యే పూర్వాదితో న్యసేత్‌. 2
సహస్రావర్తితాన్‌ కుర్యాదథవా శతవర్తితాన్‌ | మణ్డలే మణ్డలే విష్ణుం ప్రాచ్చైశాన్యోశ్చ పీఠకే. 3
నివేశ్చ సకలీకృత్య పుత్రకం సాధకాదికమ్‌ | అభిషేకం సమభ్యర్చ్య కుర్యాద్గీతాదిపూర్వకమ్‌. 4

తూర్పున ప్రారంభించి మంచి రత్నములతో కూడిన మట్టి కుండలను మండప మధ్యభాగమున ఉంచవలెను. వాటిని సహస్రావర్తితములు లేదా శాతావర్తితములు చేయవలెను. 

మండలమునందు తూర్పు - ఈశాన్యదిక్కులందు పీఠముపై విష్ణువును ఉంచి, సాధకునికిని, శిష్యునికిని సకలీకరణము చేయవలెను. పిమ్మట గీతాదిపూర్వకముగా అచార్యునకు పూజ చేసి అభిషేకము చేయవలెను.

దద్యాఛ్చ యోగపీఠాదీన్‌ స్వనుగ్రాహ్యాస్త్వయా నరాః |
గురుశ్చ సమయాన్‌ బ్రూయాద్గుప్తః శిష్యోథ సర్వభాక్‌. 5

ఇత్యాది మహాపురాణ ఆగ్నేయే ఆచార్యాభిషేకో నామాష్టావింశో೭ధ్యాయః |

యోగపీఠాదులను సమర్పింపవలెను. ''నీవు నరులను అనుగ్రహింపవలెను'' అని ప్రార్థించవలెను. గురువు కూడ శిష్యునకు నియమము లన్నియు బోధించవలెను. ఈ విధముగా గురురక్షణ పొందిన శిష్యుడు అన్ని లాభములను సంపాదింపగలడు.

అగ్ని మహాపురాణములో ఆచార్యాభిషేక మను ఇరువది ఎనిమిదవ అధ్యాయము సమాప్తము.

సశేషం... 
🌹 🌹 🌹 🌹 🌹

13.Aug.2020

------------------------------------ x ------------------------------------

 

🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 68 🌹

✍️. శ్రీ పుల్లెల శ్రీరామచంద్రుడు
ప్రథమ సంపుటము, అధ్యాయము - 29

సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🌻. సర్వతో భద్ర మండల విధి - 1 🌻

అథ ఏకోనత్రింశోధ్యాయః.

అథ సర్వతోభద్రమణ్డలవిధిః

నారద ఉవాచ :

సాధకః సాధయేన్మన్త్రం దేవతాయతనాదికే | శుద్ధభూమౌ గృహే ప్రాచ్యే మణ్డలే హరిమీశ్వరమ్‌. 1
చతురశ్రీకృతే క్షేత్రే మణ్డలాదీని వై లిఖేత్‌ | రసబాణాక్షికోష్ఠేషు సర్వతోభద్రమాలిఖేత్‌. 2
షట్త్రింశత్కోష్ఠకైః పద్మం పీఠం పఙ్త్క్యా బహిర్భవేత్‌ | ద్వాభ్యాం తు వీథికా తస్మాద్ద్వాభ్యాం ద్వారాణి దిక్షు చ. 3

సాధకుడు దేవాలయాదులలో మంత్రసాధన చేయవలెను. తూర్పు గృహమునందు శుద్ధమైన భూమిపై, మండలమునందు, ప్రభు వైన హరిని స్థాపింపవలెను. చతురశ్రముగ చేసిన క్షేత్రము మీద మండలాదులను వ్రాయవలెను. 

రెండు వందల ఏబదియారు(256) కోష్ఠములలో సర్వతోభద్ర మండలమును గీయవలెను. ముప్పదియారు కోణములతో పద్మము గీయవలెను. పీఠము పంక్తికి వెలుపల ఉండవలెను. దానినుండి రెండింటిచేత వీథియు, రెండింటిచే దిక్కులలో ద్వారములును నిర్మించవలెను.

వర్తులం భ్రామయిత్వా తు పద్మక్షేత్రం పురోదితమ్‌ | పద్మార్ధే భ్రామయిత్వా తు భాగం ద్వాదశకం బహిః. 4

విభజ్య భ్రామయేచ్ఛేషం చతుః క్షేత్రం తు వర్తులమ్‌ |

వెనుక చెప్పన పద్మక్షేత్రమును వర్తులముగా త్రిప్పి, పద్మార్ధమునందు ద్వాదశభాగము బైట త్రిప్పి, మిగిలిన క్షేత్రమును నాలుగుగా విభజించి, వర్తులముగా చేయవలెను.

ప్రథముం కర్ణకాక్షేత్రం కేసరాణాం ద్వితీయకమ్‌. 5

తృతీయం దలసన్ధీనాం దలాగ్రాణాం చతుర్థకమ్‌ |

మొదటిది కర్ణకయొక్క క్షేత్రము. రెండవది కేసరముల క్షేత్రము. మూడవది దలసంధుల క్షేత్రము. నాల్గవది దలాగ్రముల క్షేత్రము.

ప్రసార్య కోణసూత్రాణి కోణదిఙ్మధ్యమం తతః. 6

నిధాయ కేసరాగ్రే తు దలసన్ధీంస్తు లాఞ్ఛయేత్‌ | పాతయిత్వాథ సూత్రాణి తత్ర పత్రాష్టకం లిఖేత్‌. 7

దలసన్ధ్యన్తరాలం తు మానం మధ్యేనిధాయ తు | దలాగ్రం భ్రమయేత్తేన తదగ్రే తదనన్తరమ్‌. 8

తదన్త రాలం తత్పార్శ్వే కృత్వా బాహ్యక్రమేణ చ కేసరే తు లిఖేద్ద్వౌ ద్వౌ దలమధ్యే తతః పునః. 9

పద్మలక్ష్మైతత్సామాన్యం ద్విషట్కదలముచ్చతే | కర్ణికార్ధేన మానేన ప్రాక్సంస్థం భ్రామయేత్‌ క్రమాత్‌. 10

తత్పార్శ్వే భ్రమయోగేన కుడ్ణల్యః షడ్భవన్తి హి | ఏవం ద్వాదశ మత్స్యాః స్యు ర్ద్విషట్కదలకం చ తైః.

కోణస్థానములనుండి, కోణములకు ఎదురుగా ఉన్న మధ్యభాగమువరకును దారము లాగి, కేసరముల అగ్రములందుంచి దళముల సంధులను గుర్తింపవలెను. 

పిమ్మట దారమును క్రిందికి జార్చి, ఎనిమిది దళముల పద్మమును గీయవలెను. దలముల సంధుల మధ్యమునందు ఎంత ఎడ ముండునో అంత ఎడమునందు అగ్రభాగమున, దలాగ్రములను గీయవలెను. వాటి మధ్మమానమును వాటి పార్శ్వమునందుంచి బాహ్యక్రమమున ఒక్కొక్క దలముపై రెండేసి కేసరములు గీయవలెను. 

ఇది పద్మయొక్క సామన్యలక్షణము. ఇపుడు ద్వాదశ కమల లక్షణము చెప్పబడుచున్నది. కర్ణిక యొక్క అర్ధమానమున తూర్పదిక్కు వైపు దార ముంచి క్రమముగా అన్ని వైపుల త్రిప్పవలెను. 

దాని పార్శ్వమునందు చేసిన భ్రమణముచే ఆరు కుండలుల చిహ్నములు, పండ్రెండు మత్స్యముల చిహ్నములు ఏర్పడును. వీటిచే ద్వాదశ దల కమలమేర్పడును.

సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹

#అగ్నిపురాణం

14.Aug.2020

------------------------------------ x ------------------------------------


🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 69 🌹
✍️. శ్రీ పుల్లెల శ్రీరామచంద్రుడు

ప్రథమ సంపుటము, అధ్యాయము - 29
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🌻. సర్వతో భద్ర మండల విధి - 2 🌻

పఞ్చపత్రాభిసిద్ధ్యర్థం మత్స్యే కృత్వైవమబ్జకమ్‌ | వ్యోమరేఖా బహిఃపీఠం తత్ర కోష్ఠాని మార్జయేత్‌. 12

త్రీణి కోణషు పాదార్థం ద్విద్వికాన్యపరాణి తు | చతుర్దిక్షు విలిప్తాని పత్రకాణి భవన్త్యుత. 13

తతః పఙ్త్కిద్వయం దిక్షు వీథ్యర్థం తు విలోపయేత్‌ | ద్వారాణ్యాశాసు కుర్వీత చత్వారి చతసృష్వపి. 14

పంచదలాదుల నిర్మాణమునకు కూడ ఈ విధముగనే మత్స్యచిహ్నములచే కమలములు నిర్మించి ఆకాశ##రేఖకు బైట నున్న పీఠభాగమునందలి కోష్ఠములను తుడిచివేయవలెను. పీఠభాగముయొక్క నాలుగు కోణములలో మూడేసి కోష్ఠకములను ఆ పీఠముయొక్క నాలుగు పాదాలుగా కల్పింపవలెను. 

నాలుగు దిక్కులందును మిగిలిన రెండేసి జోడులను, అనగా నాలుగు కోష్ఠకములను, తుడిచి వేయవలెను. అవి పీఠమునకు పాదాలుగా ఏర్పడును. పీఠము వెలుపల నాలుగు దిక్కులలో ఉన్న రెండు రెండు పలక్తులను తుడిచివేసి వీథి ఏర్పరుపవలెను. పిమ్మట నాలుగు దిక్కులందును నాలుగు ద్వారములు ఏర్పరుపవలెను.


ద్వారాణాం పార్శ్వతః శోభా అష్టౌ కుర్యాద్విచక్షణః | తత్పార్శ్వ ఉపశోభాస్తు తావత్యః పరికీర్తితాః. 15

సమీప ఉపశోభానాం కోణాస్తు పరికీర్తితాః | చతుర్దిక్షు తతో ద్వే ద్వే చిన్త యేన్మధ్యకోష్ఠకైః. 16

చత్వారి బమ్యతో మృజ్యాదేకైకం పార్శ్వయోరపి | శోభార్థం పార్శ్వయోస్త్రీణి త్రీణి లుమ్పేద్దలస్య తు. 17

తద్వద్విపర్యయే కుర్యాదుపశోభాం తతః పరమ్‌ | కోణస్యాన్తర్బహిస్త్రీణి చిన్త యేద్ద్విర్విభేదతః. 18

విద్వాంసుడు, ద్వారముల పార్శ్వభాగములందు ఎనిమిది శోభాస్థానములను, వాటి పార్శ్వభాగములందు ఉపశోభాస్థానములను, ఏర్పరుపవలెను. శోభలు ఎన్నియో ఉపశోభలు కూడ అన్నియే ఉండును. ఉపశోభల సమీపమునందున్న స్థానములకు కోణము లని పేరు. 

పిమ్మట నాలుగు దిక్కులందును మధ్యనున్న రెండేసి కోష్ఠములను, వాటి బాహ్యపంక్తిలోని, మధ్యకోష్ఠములను ద్వారనిర్మాణమునకై ఉపమోగింపవలెను. వాటి నన్నింటిని కలిపి తుడిచివేయగా నాలుగు ద్వారము లేర్పడును. ద్వారముయొక్క లెండు పార్శ్వములందలి క్షేత్రమునకు వెలుపల నున్న పంక్తియందలి ఒక్కొక్క కోష్ఠమును, లోపలి పంక్తియందలి మూడు మూడు కోష్ఠములను శోభానిర్మాణార్థమై తుడిచి వేయవలెను.

శోభాపార్శ్వభాగమునందు ఇందులకు విపరీతముగ చేయుటచే అనగా క్షేత్రమునకు వెలుపల నున్న పంక్తియందలి మూడు మూడు కోష్ఠములను, లోపలనున్న పంక్తియందలి ఒక్కొక్క కోష్టమును తుడిచివేయగా ఉపశోభలు నిర్మింపబడును. పిమ్మట కోణమునకు లోపల, వెలుపల నున్న మూడు మూడు కోష్ఠమలు భేదమును తుడిచివేసి ఒకటిగా చేసి చింతనము చేయవలెను.


ఏవం షోడశకోష్ఠం స్యా దేవమన్యత్తు మణ్డలమ్‌ | ద్విషట్కభాగే షట్త్రింశత్పదం పద్మం తు వీథికా. 19

ఏకా పఙ్త్కిః పరాభ్యాం తు ద్వారశోభాది పూర్వవత్‌ | ద్వాదశాఙ్గులిభిః పద్మమేకహస్తే తు మణ్డలే. 20

ద్విహస్తే హస్తమాత్రం స్యాద్వృద్ధ్యా ద్వారేణ వా చరేత్‌ | అపీఠం చతురస్రం స్యాద్ద్వికరం చక్రపఙ్కజమ్‌. 21

పద్మార్థం నవభిః ప్రోక్తం నాభిస్తు తిసృభిఃస్మృతా | అష్టాభిస్త్వరకాన్‌ కుర్యాన్నేమిం తు చతురఙ్గులైః. 22

త్రిధా విభజ్య చ క్షేత్రమన్తర్ద్వాభ్యామథాఙ్కయేత్‌ | పఞ్చాన్తరసద్ధ్యర్థం తేష్వాస్ఫాల్య లిఖేదరాన్‌. 23

ఇంతవరకును పదునారేసి కోష్ఠములతో ఏర్పడు రెండువలదల ఏబదిఆరు కోష్ఠములు గల మండలము వర్ణింపబడినది. ఇతర మండలనిర్మాణము కూడ ఈ విధముగనే చేయవచ్చును. 

పండ్రెండేసి కోష్ఠములచే నూటనలభైనాలుగు కోష్ఠకముల మండలము ఏర్పడును. దానిలో కూడు మధ్యనున్న ముప్పదియారు పదముల (కోష్ఠముల)చే కమల మేర్పడును. దీనిలో వీథి ఉండదు. ఒక పంక్తి పీఠమునకై ఏర్పరుపబడును. మిగిలిన రెండు పంక్తులచే, వెనుక చెప్పన విధమున, ద్వారశోభలు కల్పిలంపబడును. 

ఒక హస్తము ప్రమాణము గల మండలమునందు కమలక్షేత్రము పండ్రెండు అంగుళముల ప్రమాణముతో నుండును. రెండు హస్తములు ప్రమాణము గల మండలమునందు కమలస్థానము ఒక హస్తము వెడల్పు-పొడవులతో నుండును. ఈ విధముగా ప్రమాణమును పెంచుచు ద్వారాదులతో మండలనిర్మాణము చేయవలెను.

రెండు హస్తముల ప్రమాణము గల పీఠరహిత మగు చతురస్రమండలమునందు చక్రాకారకమలమును నిర్మించవలెను. పద్మార్థము తొమ్మిది అంగుళము లుండును. నాభి మూడు అంగుళములు. ఎనిమిది అంగుళముల ఆకులు, నాలుగు అంగుళముల నేమి ఏర్పరుపవలెను. 

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹


15.Aug.2020

------------------------------------ x ------------------------------------


🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 70 🌹
✍️. శ్రీ పుల్లెల శ్రీరామచంద్రుడు
ప్రథమ సంపుటము, అధ్యాయము - 29
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🌻. సర్వతో భద్ర మండల విధి - 3 🌻

ఇన్దీవరదలాకారానథవా మాతులుఙ్గవత్‌ | పద్మపత్రాయతాన్వాపి లిఖేదిచ్ఛానురూపతః. 24
భ్రామయిత్వా బహిర్నే మావరసన్ధ్యరే స్థితః | భ్రామయేదరమూలం తు సన్ధిమధ్యే వ్యవస్థితః. 25
అరమధ్యే స్థితో మధ్యమరణిం భ్రామయేత్సమమ్‌ | ఏవం సన్ధ్యన్తరాః సమ్యఙ్మాతులుఙ్గనిభాః సమాః. 26

క్షేత్రమును మూడు భాగములుగ విభజించి, మరల లోపలినుండి ఒక్కొక్కదానిని రెండేసి భాగములు చేయవలెను. లోపల నున్న ఐదు కోష్ఠములను తుడిచివేసి వాటిపై ఆకులు నిర్మింపవలెను. ఈ ఆకులు ఇందీవరదళాకారములో గాని, మాతులింగ ఫలాకారములో గాని, కమలదళాకారమలో గాని ఉండవచ్చును.

లేదా వాటి ఆకారమును తమ ఇచ్ఛ ప్రకారము చేయవచ్చును. ఆకుల సంధుల మధ్యదారముంచి, దానిని వెలుపల నున్న నేమి (చక్రాంతము) వరకు లాగి, నాలుగు వైపుల త్రిప్పవలెను.

ఆకుయొక్క సంధియందు దారమునుంచి దాని మూలభాగమును త్రిప్పవలెను. ఆకు మధ్యస్థానము నందు దారము ఉంచి ఆ మధ్యభాగము నలువైపులకును సమముగా దారము త్రిప్పవలెను. ఈ విధముగా త్రిప్పగా మాతులుంగాకారము గల ఆకు లేర్పడును.

విభజ్య సప్తధా క్షేత్రం చతుర్దశకరం సమమ్‌ | ద్విధా కృతే శతం హ్యత్ర షణ్ణవత్యధికాని తు. 27
కోష్ఠకాని చతుర్భిసై#్తర్మధ్యే భద్రం సమాలిఖేత్‌ | పరితో విసృజేద్వీథ్యై తథా దిక్షు సమాలిఖేత్‌. 28
కమలాని పునర్వీథ్యై పరితః పరిమృజ్య తు | ద్వే ద్వే మధ్యమకోష్ఠే తు గ్రీవార్థం దిక్షు లోపయేత్‌. 29
చత్వారి బాహ్యతః పశ్చాత్త్రీణి త్రీణి తు తోపయత్‌ | గ్రీవా పార్శ్వే బహిస్త్వే కా శోభా సా పరికీర్తితా. 30
విసృజ్య బాహ్యకోణషు సప్తాన్తస్త్రీణి మార్జయేత్‌ | మణ్డలం నవభాగం స్యాన్న వవ్యూహం హరిం యజేత్‌. 31
పఞ్చవింశతికవ్యూహం మణ్డలం విశ్వరూపకమ్‌ | ద్వాత్రింశద్ధస్తకం క్షేత్రం భక్తం ద్వాత్రింవతాసమమ్‌. 32
ఏవం కృతే చతుర్వింశత్యధికం తు సహస్రకమ్‌ | కోష్ఠకానాం సముద్దిష్టం మధ్యే షోడశకోష్ఠకైః. 33
భద్రకం పరిలిఖ్యాథ పార్శ్వే పఙ్త్కిం విమృజ్య తు | తతః షోడవభిః కోష్ఠైర్దిక్షు భద్రాష్టకం లిఖేత్‌. 34

పదునాలుగు హస్తముల క్షేత్రమును ఏడు భాగములుగ విభజించి, మరల రెండేసి భాగములుగ విభజింపవలెను. 

లేదా - తూర్పునుండి పశ్చిమము వరకును, ఉత్తరమునుండి దక్షిణము వరకును పదునైదేసి సమానరేఖలు గీయవలెను. ఇట్లు చేయుటచే నూటతొంబదియారు కోష్ఠము లేర్పడును. వీటిలో మధ్య నున్న నాలుగు కోష్ఠములచే భద్రమండలము ఏర్పరుపవలెను. దాని నాలుగు వైపుల వీథికొరకై స్థానము విడువవలెను.

మరల అన్ని దిక్కులందును కమలములు గీయవలెను. ఆ కమలములు నాల్గు వైపులందును వీథికొరకై ఒక్కొక్క కోష్ఠమును తుడిచివేయవలెను. పిమ్మట, మధ్య నున్న రెండేసి కోష్ఠములను కంఠభాగముకొరకై తుడిచివేయవలెను. 

పిమ్మట వెలుపల నున్న నాలుగేసికోష్టమలలో మూడు మూడు కోష్ఠములను తుడిచివేయవలెను. వెలుపల నున్న ఒక్కొక్క కోష్ఠమును కంఠస్థానపార్శ్వమునందు మిగల్చవలెను. దానికి ద్వారశోభ యనిపేరు.

వెలుపల నున్న కోణములలో ఏడింటిని మినహాయించి లోపల నున్న మూడేసి కోష్ఠములను తుడిచివేయవలెను. దానికి 'నవనాలము' లేదా ''నవనాభమండలము'' అని పేరు. 

దాని తొమ్మిది నాభులయందు, నవవ్యూహరూపుడైన శ్రీహరిని పూజింపవలెను. ఇరువదియైదు వ్యూహముల మండలము విశ్వవ్యాపి యైనది. ముప్పదిరెండు హస్తముల క్షేత్రమును, ముప్పదిరెండుచేతనే సమముగా విభజింపవలెను. 

అనగా పైనుంచి క్రిందికి ముప్పదిమూడు రేఖలు గీసి, అడ్డముగా కూడ ముప్పదిమూడు రేఖలు గీయవలెను. ఈ విధముగ ఒక వెయ్యి ఇరువదినాలుగు కోష్ఠములు ఏర్పడును. వాటిలో మధ్య నున్న పదునారు కోష్ఠకములతో ''భద్రమండలము''ను నిర్మింపవలెను. 

మరల నాలుగు ప్రక్కల నున్న ఒక్కొక్క పంక్తిని విడువలెను. పిమ్మట ఎనిమిది దిక్కులందును పదునారు కోష్ఠకములచే ఎనిమిది భద్రమండలములు ఏర్పరుపవలెను. దీనికి ''భద్రాష్టకము'' అని పేరు.

తతో7పి పఙ్త్కిం సంమృజ్య తద్వత్‌ షోడశభద్రకమ్‌ |

లిఖిత్వా పరితః పఙ్త్కిం విమృజ్యాథ ప్రకల్పయేత్‌. 35
ద్వారద్వాదశకం దిక్షు త్రీణి త్రీణి యథాక్రమాత్‌ | షడ్భిశ్చ పరిలుప్యాన్తర్మధ్యే చత్వారి పార్శ్వయోః. 36

దాని తరువాత నున్న ఒక పంక్తి చెరిపి వేసి మరల వెనుకటి వలె పదునారు భద్రమండలములు వ్రాయవలెను. పిమ్మట అన్ని ప్రక్కలను ఉన్న ఒక్కొక్క పంక్తి చెరిపివేసి ఒక్కొక్క దిక్కున మూడేసి చొప్పున పండ్రెండు ద్వారములు నిర్మింపవలెను. వెలుపల నున్న ఆరు కోష్ఠములు తుడిచివేసి మధ్యభాగముయొక్క పార్శ్వభాగములందలి నాలిగింటిని తుడిచివేయవలెను. 

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #అగ్నిపురాణం

17.Aug.2020

------------------------------------ x ------------------------------------


🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 71 🌹
✍️. శ్రీ పుల్లెల శ్రీరామచంద్రుడు

ప్రథమ సంపుటము, అధ్యాయము - 29

సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🌻. సర్వతో భద్ర మండల విధి - 4 🌻

చత్వార్యన్తర్బహిర్ద్వే తు శోభార్థం పరిమృజ్య తు | ఉపద్వారప్రసిద్ధ్యర్థం త్రీణ్యన్తః పఞ్చ బాహ్యతః. 37

పరిమృజ్య తథా శోభాం పూర్వవత్పరికల్పయేత్‌ | వహ్నికోణషు సప్తాన్తస్త్రీణి కోష్ఠాని మార్జయేత్‌. 38

పఞ్చవింశతికవ్యూహే పరం బ్రహ్మ యజేచ్ఛుభీ | మధ్యే పూర్వాదితః పద్మే వాసుదేవాదయః క్రమాత్‌. 39

వరాహం పూజయిత్వా చ పూర్వపద్మే తతః క్రమాత్‌ | వ్యూహాన్‌ సంపూజయేత్తావద్యావత్‌ షట్త్రింశగో భవేత్‌. 40

యథోక్తం వ్యూహ మఖిలమేకస్మన్‌ పఙ్కజే క్రమాత్‌ | యష్టవ్యమితి యత్నేన ప్రచేతా మన్యతే7ధ్వరమ్‌. 41

సత్యస్తు మూర్తిభేదేన విభక్తం మన్యతే 7చ్యుతమ్‌ | చత్వారింశత్కరం క్షేత్రం హ్యుత్తరం విభజేత్ర్కమాత్‌. 42

ఏకైకం సప్తధా భూయస్తథైకైకం ద్విధా పునః | చతుష్షష్ట్యుత్తరం సప్తశతాన్యేకసహస్రకమ్‌. 43

కోష్ఠకానాం భద్రకం చ మధ్యే షోడశకోష్ఠకైః | పార్శ్వే వీథీం తతశ్చాభద్రాణ్యథ చ వీథికామ్‌. 44

షోడశాబ్జాన్యథో వీథీ చతుర్వింశతిపఙ్కజమ్‌ | వీథీపద్మాని ద్వాత్రింశత్‌ పఙ్త్కివీథిజకాన్యథ. 45

చత్వారింశత్తతో వీథీశేషపఙ్త్కిత్రయేణ చ | ద్వారశోభోపశోభాః స్యుర్దిక్షు మధ్యే విలోప్య చ. 46

ద్విచతుష్షడ్ద్వారసిద్ధ్యై చతుర్దిక్షు విలోపయేత్‌ | పఞ్చత్రీణ్యకకం బాహ్యే శోభోపద్వారసిద్ధయే. 47

ద్వారాణాం పార్శ్వయోరన్తః షడ్వా చత్వారి మధ్యతః | ద్వే ద్వే లుప్యే దేవమేవ షడ్‌ భవన్త్యుపశోభికాః. 48

ఏకస్యాం దిశి సఙ్ఖ్యాః స్యుశ్చతస్రః పరిసంఖ్యయా | ఏకైకస్యాం దిశి త్రీణి ద్వారాణ్యపి భవన్త్యుత. 49

పఞ్చ పఞ్చ చ కోణషు పఙ్త్కౌ పఙ్త్కౌ క్రమాత్సృజేత్‌ | కోష్ఠకాని భవేదేవం మర్త్యేష్టం మణ్డలం శుభమ్‌.

ఇత్యాది మహాపురాణ ఆగ్నేయే సర్వతోభద్రమణ్డలాది విధిర్నామోనత్రింశోధ్యాయః.

మరల, శోభానిర్మాణమునకై లోపల నున్న నాలుగు కోష్ఠములను, వెలుపల నున్న రెండు కోష్ఠములను తుడిచి వేయవలెను. పిమ్మట ఉపద్వారము లేర్పడుటకై లోపల నున్న మూడు కోష్ఠములను, వెలుపలనున్న ఐదు కోష్ఠములను తుడిచివేయవలెను. 

పిమ్మట, వెనుక చెప్పిన విధమున శోభ నిర్మింపవలెను. కోణములలో వెలుపల నున్న ఏడు కోష్ఠములను, లోపలనున్న మూడు కోష్ఠములను తుడిచివేయవలెను. ఈ విధముగ ఏర్పడిన పంచవింశతి వ్యూహమండలము లోపల నున్న కమలకర్ణికపై పరమాత్మను పూజింపవలెను. 

మరల తూర్పు మొదలైన దిక్కులలో నున్న కమలములపై క్రమముగా వాసుదేవాదుల పూజ చేయవలెను. పిమ్మట తూర్పున నున్న కమలముపై భగవంతుడగు వారహమూర్తిని పూజించి క్రమముగా ఇరువదిఐదువ్యూహముల పూజచేయవలెను.

ఇరువదియారవ తత్త్వమైన పరమాత్మునిపూజ సంపన్నమగువరకును ఈ క్రమముజరుగవలెను. ఒకేమండలముపై అన్ని వ్యూహముల పూజనుక్రమముగా చేయవలెనని ప్రచేతసుని మతము. కాని సత్యాచార్యుని మతము ప్రకారము మూర్తిభేధమును బట్టి పరమాత్ముని వ్యక్తిత్వము నందు భేదమేర్పడును గాన విభిన్న మూర్తుల పూజ వేరువేరుగా చేయవలెను.

నలుబది హస్తముల మండలమును అడ్డగీతలు గీసి క్రమముగా విభజింపవలెను. మొదట ఒక్కొక్కదానికి ఏడేసి భాగములు చేయవలెను. మరల ఒక్కొక్కదానిని మూడేసి భాగములు చేసి, వాటిని గూడ రెండేసి భాగములు చేయవలెను. 

ఈ విధముగ ఒక వెయ్యి ఏడువందల అరువదినాలుగు (1764) కోష్ఠకము ఏర్పడును. మధ్య నున్న పదునారు కోష్ఠకములతో కమలమును నిర్మింపవలెను. పార్శ్వభాగమున వీథి నిర్మించవలెను. పిమ్మట ఎనిమిది భద్రములు, వీథులు నిర్మింపవలెను. పిమ్మట పదునారుదలములు కమలమును వీథినినిర్మింపవలెను. 

పిమ్మట క్రమముగ ఇరువదినాలుగు దలముల కమలము వీథి ముప్పదిరెండు దళముల కమలము, వీథి, నలుబది దళముల కమలము, వీథి నిర్మింపవలెను. పిమ్మట మిగిలిన మూడుపంక్తులచే ద్వారములు, శోభలు ఉపశోభలు, నిర్మింపవలెను.

సర్వదిశల మధ్యభాగమునందు ద్వారసిద్ధి కొరకై రెండు నాలుగు, ఆరు కొష్ఠకములు తుడిచివేయవలెను. దానిబాహ్యభాగమునందు శోభా-ఉపద్వారము లేర్పడుటకై ఐదు కోష్ఠములు, మూడు కోష్ఠములు తుడిచివేయవలెను. 

ద్వారముల పార్శ్వములందు, లోపలి వైపున, క్రమముగా ఆరు కోష్ఠములు, నాలుగు కోష్ఠములు తుడిచివేయవలెను. మధ్య నున్న రెండు రెండు కోష్ఠములు కూడ తుడిచివేయవలెను. ఈ విధముగ ఆరు ఉపశోభలు ఏర్పడును. 

ఒక్కొక్క దిక్కునందు నాలుగేసి శోభలు, మూడేసి ద్వారములను ఉండును. కోణములలో ఒక్కొక్క పంక్తిలోని ఐదేసి కోష్ఠముల విడువవలెను. అవి కోణము లగును. ఈ విధముగ చేయగా కావలసిన సుందరమైన మండల మేర్పడునున.

అగ్నేయమహాపురాణమునందు సర్వతోభద్రమండలాది విధి యను ఇరువదితొమ్మిదవ అధ్యాయము సమాప్తము.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

18.Aug.2020

------------------------------------ x ------------------------------------


🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 72 🌹
✍️. శ్రీ పుల్లెల శ్రీరామచంద్రుడు
సేకరణ : ప్రసాద్ భరద్వాజ


ప్రథమ సంపుటము, అధ్యాయము - 30
🌻. అధ మండల విధి - 1 🌻

అథ త్రింశోధ్యాయః.

అథ మణ్డలవిధిః

నారద ఉవాచ :

మధ్యే పద్మే యజేద్బ్రహ్మ సాఙ్గం పూర్వేబ్జనాభకమ్‌ | ఆగ్నేయేబ్జే చ ప్రకృతిం యామ్యేబ్జే పురుషంయజేత్‌. 1

పురుషాద్దక్షిణ వహ్నిం నైరృతే వారుణనిలమ్‌ | ఆదిత్యమైన్దవే పద్మే బుగ్యజుశ్చే శపద్మ కే. 2

ఇన్ద్రాదీంశ్చ ద్వితీయాయాం పద్మే షోడశకే తథా | సామాథర్వాణమాకాశం వాయుం తేజ స్తథా జలమ్‌. 3

పృథివీం చ మనశ్చైవ శ్రోత్రం త్వక్చక్షురర్చయేత్‌. | రసనాం చ తథా ఘ్రాణం భూర్భువశ్చైవ షోడశమ్‌. 4

నారదుడు చెప్పెను : భద్రమండలము మధ్య నున్న కమలమున అంగదేవతాసహితబ్రహ్మను పూజింపవలెను. 

తూర్పున నున్న కమలమున పద్మనాభుని, ఆగ్నేయమున నుద్న కమలమున ప్రకృతిని, దక్షిణమున నున్న కమలమున పురుషుని దక్షిణభాగమున అగ్నిదేవతను, నైరృతిదిక్కున నిరృతిని, పశ్చిమదిక్కున నున్న కమలమున వరుణుని, వాయవ్యదిక్కునం దున్న కమలమున వాయువును, ఉత్తరదిక్కునందున్న కమలమున ఆదిత్యుని, ఈశాన్యదిక్కునందున్న కమలమున బుగ్వేదయజుర్వేదములను పూజింపవలెను.

రెండవ ఆవరణమునందు ఇంద్రాది దిక్పాలకులను, షోడశదలకమలమున క్రమముగా సామవేద, అథర్వవేద, ఆకాశ, వాయు, తేజో, జల, పృథివీ, మనః, శ్రోత్ర, త్వక్‌, నేత్ర, రసనా, ఘ్రాణ, భూర్లోక, భువర్లోకములను పూజింపవలెను.

మహర్జనస్తపఃసత్యమత్యగ్నిష్టోమమేవ చ | తథాగ్నిష్టోమకం చోక్థం షోడశీం వాజపేయకమ్‌. 5

అతిరాత్రం చ సంపూజ్య తథాప్తోర్యామమర్చయేత్‌ | మనోబుద్ధిమహఙ్కారం శబ్ధం స్పర్శం చ రూపకమ్‌. 6

రసం గన్ధం చ పద్మేషు చతుర్వింశతిషు క్రమాత్‌ | జీవం మనో ధియం చాహం ప్రకృతిం శబ్దమాత్రకమ్‌.

వాసుదేవాదిమూర్తీశ్ఛీ తథా చైవ దశాత్మకమ్‌ | మనః శ్రోతం త్వచం ప్రార్చ్య చక్షుశ్చ రసనం తథా. 8

ఘ్రాణం వాక్పాణిపాదం చ ద్వాత్రింశద్వారిజేష్విమాన్‌ | చతుర్థావరణ పూజ్యాః సాఙ్గాః సపరివారకాః. 9

పిమ్మట తృతీయవరణము నందలి, ఇరువదినాలుగు దళముల కమలమున క్రమముగ మహర్లోక, జనలోక, తపోలోక, సత్యలోక, అగ్నిష్టోమ, అత్యగ్నిష్ణోమ, ఉక్థ, షోడశీ, వాజపేయ, అతిరాత్ర, ఆప్తోర్యామ, వ్యష్టిమనో, వ్యష్టిబుద్ధి, వ్యష్ట్యహంకార, శబ్ద, స్పర్శ, రూప, రస, గంధ, జీవ, సమస్టిమనః, సమష్టిబుద్ధి (మహత్తత్వ), సమష్ట్యహంకార, ప్రకృతులను పూజింపవలెను. వీటి అన్నింటియొక్క స్వరూపము శబ్దమాత్రమే. అనగా కేవలము వీటి పేరులు చెప్పి నమస్కరించిన చాలును; మూర్తులను ధ్యానింపవసరము లేదు. 

ఇరువదియైదవ అధ్యాయములో చెప్పిన వాసుదేవాదిమూర్తులను తొమ్మిందింటిని, దశవిధప్రాణములను, మనో, బుద్ధ్య, హంకార, పాయు, ఉపస్థలను, శ్రోత్ర, త్వక్‌, నేత్ర, రసనా, ఘ్రాణ, వాక్‌, పాణి, పాదములను, ఈ ముప్పదిరెండింటిని, ముప్పదిరెండు దళముల కమలమున ఆర్చన చేయవలెను. ఇవి నాల్గవ అవరణమునందలి దేతవలు. ఈ ఆవరణమున సాంగసపరివార దేవతాపూజ చేయవలెను.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹


19.Aug.2020

------------------------------------ x ------------------------------------


🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 73 🌹

✍️. శ్రీ పుల్లెల శ్రీరామచంద్రుడు
ప్రథమ సంపుటము, అధ్యాయము - 30
సేకరణ : ప్రసాద్ భరద్వాజ


🌻. అధ మండల విధి - 2 🌻

పాయూపస్థౌ చ సంపూజ్య మాసానాం ద్వాదశాధిపాన్‌ |

పురుషోత్తమాదిషడ్వింశాన్‌ బాహ్యావరణ కే యజేత్‌. 10
చక్రాబ్జే తేషు సంపూజ్యా మాసానాం పతయః క్రమాత్‌ | అష్టౌ ప్రకృతయః షడ్వా పఞ్చాథ చతురోపరే. 11
రజఃపాతం తతః కుర్యాల్లిఖితే మణ్డలే శృణు | కర్ణికాపీతవర్ణా స్యాద్రేవాః సర్వాః సితాః సమాః. 12
ద్విహస్తేఙ్గుష్ఠమాత్రాః స్యుర్హస్తే చార్ధసమాః సితాః | పద్మం శుక్లేన సన్ధీంస్తు కృష్ణేన శ్యామతో7థవా. 13
కేసరా రక్తపీతాః స్యుః కోణాన్రక్తేన పూరయేత్‌ | భూషయేద్యోగపీఠం తు యథేష్టం సార్వవర్ణికైః. 14
లతావితానపత్రాద్యైర్వీథికాముప శోభయేత్‌ | పీఠద్వారే తు శక్లేన శోభారక్తేన పీతతః. 15
ఉపశోభాం చ నీలేన కోణసంఖ్యాశ్చ వై సితాన్‌ | భద్రకే పూరణం ప్రోక్తమేవమన్యేషు పూరణమ్‌. 16
త్రికోణం సితరక్తేన కృష్ణేన చ విభూషయేత్‌ | ద్వికోణం రక్తపీతాభ్యాం నాభిం కృష్ణేన చక్ర కే. 17

పిమ్మట వెలుపలి ఆవరణమునందు పాయు-ఉపస్థల పూజ చేసి, పండ్రెండు మాసాల అధిపతులను, పురుషోత్తముడు మొదలగు ఇరువది యారు తత్త్వములను పూజించవలెను. 

మాసాధిపతుల పూజ చక్రాబ్జముపై క్రమముగా చేయవలెను. ఎనిమిది, లేదా ఆరు, లేదా ఐదు ప్రకృతులను అచటనే పూజింపవలెను. పిమ్మట మండలములపై వేరు వేరు రంగులు గల చూర్ణములు చల్లవలెను. 

ఎచట ఏ రంగుగల చూర్ఱము చల్లవలెనో చెప్పదను; వినుము కమలకర్ణిక రంగు పసుపు పచ్చగా ఉండవలెను. సమస్తరేఖులును సమప్రమాణము గలవై తెల్ల రంగలో నుండవలెను. రెండు హస్తముల మండలముల రేఖలు బొటనవ్రేలంత లావుగా ఉండవలెను. 

ఒక హస్తము మండలమునందలి రేఖలు బొటనవ్రేలి లావులో సగము లావు ఉండవలెను. రేఖలు తెల్లగా ఉండవలెను. పద్మములకు తెల్లరంగును, సంధులకు నలుపు లేదా నీలి రంగు వేయవలెను. 

కేసరములు ఎరుపు-పసుపురంగులో ఉండవలెను. కోణములం దున్న కోష్ఠములను ఎఱ్ఱని రంగు గల చూర్ణముతో నింపవలెను. ఈ విధముగా యోగపీఠమును యథేష్టముగ అన్ని రంగులతోను అలంకరింపవలెను. వీథిని లతలతోడను, పత్రాదులతోడను అలంకరింపవలెను. 

పీఠద్వారమును తెల్లని రంగు గల చూర్ణముతోను, శోభాస్థానములను ఎఱ్ఱని చూర్ణములతోడను నింపవలెను. ఉపశోభలపై నీలి రంగు చూర్ణము చల్లవలెను. కోణముల శంఖములను తెల్లగా చిత్రింపవలెను. ఇది భద్రమండలముపై రంగు లుంచు విధానము. 

ఇతర మండలముపై గూడ ఈ విధముగనే అనేకవిధము లగు వర్ణములు గల చూర్ణములు చల్లవలెను. త్రికోణమండలము తెలుపు - ఎరుపు - నలుపురంగులతో అలంకరింపవలెను. ద్వికోణమును ఎరుపు-పసుపురంగులతో అలంకరింపవలెను.

చక్రకమలమునందలి నాభిస్థానమును నలుపురంగు చూర్ఱముతో అలంకరిపవలెను.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹


20.Aug.2020

------------------------------------ x ------------------------------------


🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 74 🌹

✍️. శ్రీ పుల్లెల శ్రీరామచంద్రుడు
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

ప్రథమ సంపుటము, అధ్యాయము - 30

🌻. అధ మండల విధి - 3 🌻

అరకాన్పీతరక్తాభిః శ్యామన్నే మిం తు రక్తతః | 
సితశ్యామారుణాః కృష్ణాః పీతా రేఖాస్తు బాహ్యతః. 18

శాలిపిష్టాది శుక్లం స్యాద్రక్తం కౌసుంభకాదికమ్‌ | 
హరిద్రయా చ హారిద్రం కృష్ణం స్యాద్దగ్ధధాన్యతః. 19

శమీపత్రాదికైః శ్యామం బీజానాం లక్షమప్యతః | 
చతుర్లక్షస్తు మన్త్రాణాం విద్యానాం లక్షసాధనమ్‌. 20

అయుతం బుద్ధవాద్యానాం స్తోత్రాణాం చ సహస్రకమ్‌ | 
పూర్వమేవాథ లక్షేణ మన్త్రశుద్తిస్తథాత్మనః. 21

తథాపరేణ లక్షేణ మన్త్రః క్షేత్రీకృతో భవేత్‌ | 
పూర్వసేవాసమో హోమో బీజానాం సంప్రకీర్తితః. 22

పూర్వసేవాదశాంశేన మన్త్రాదీనాం ప్రకీర్తితా | 
పురశ్చరణమన్త్రే తు మాసికం వ్రతమాచరేత్‌. 23

భువి న్యసేద్వామపాదం న గృహ్ణీయాత్ర్పతిగ్రహమ్‌ | 
ఏవం ద్విత్రిగుణన్తెవ మధ్యమోత్తమసిద్ధయః. 24

మన్త్రధ్యానం ప్రవక్ష్యామి యేన స్యాన్మన్త్రజంఫలమ్‌ | 
స్థూలం శబ్దమయం రూపం విగ్రహం బాహ్యమిష్యతే. 25

సూక్ష్మం జ్యోతిర్మయం రూపం హార్దం చిన్తామయం భవేత్‌ |
చిన్తయా రహితం యత్తు తత్పరం పరికీర్తితమ్‌. 26

వారాహసింహశక్తీ నాం స్థూలరూపం ప్రధానతః | 
చిన్తయా రహితం రూపం వాసుదేవస్య కీర్తితమ్‌. 27

చక్రకమలము ఆకులకు పసుపు-ఎరుపు రంగులు వేయవలెను. చక్రము అంచును నీలము-ఎరుపు రంగులు వేసి అలంకరింపవలెను. బైట నున్న రేఖలకు తెలుపు, శ్యామము, ఎరుపు, నలుపు, పసుపు రంగులు వేయవలెను. 

వరిపిండి మొదలగువాటిని తెలుపురంగునకు ఉపమోగించవచ్చును. కుసుంధచూర్ణాదులు ఎరుపురంగునకును, పసుపు పసుపురంగునకును, మాడ్చిన బియ్యపు పిండు నల్లరంగునకును ఉపయోగించును. శమీపత్రాదులచే శ్యామవర్ణము వేయవచ్చును. 

బీజమంత్రములను ఒక లక్ష జపించుటచేతను, ఇతరమంత్రములను అక్షరలక్షలు జపించుటచేతను, విద్యలను ఒక లక్షజపించుటచేతను, బుద్ధవిద్యలను పదివేల సార్లు జపముచేయుటచేతను స్తోత్రములను వేయి పర్యాయములు జపించుటచేతను, లేదా అన్ని మంత్రములను మొదట ఒక లక్ష జపించుటచేతను, మంత్రశుద్ధియు, ఆత్మశుద్ధియు కూడ కల్గును. 

రెండవ పర్యాయము ఒక లక్ష జపించుటచే మంత్రము క్షేత్రీకృత మగును (సాధకునకు దానిపై నిలకడ ఏర్పడును). బీజమంత్రజపము మొదట ఎంత సంఖ్యలో చేయబడునో హోమము కూడ అంత సంఖ్యలోనే చేయవలెను. ఇతరమంత్రముల విషయమున హోమము జపసంఖ్యలో పదవ వంతు చేయవలెను. 

మంత్రపురశ్చరణము చేయ సంకల్పించినప్పుడు ఒక్కొక్క మాసము వ్రతము ఆవలంబింపవలెను. నేలపై మొదట ఎడమ కాలు ఉంచవలెను. దానము పట్టగూడదు. ఈ రెండు రెట్లు-మూడురెట్లు జపము చేసిననే మధ్యమ-ఉత్తమశ్రేణికి చెందిన ఫలముల లభించును.

ఇపుడు మంత్రమువలన ఫలము సిద్ధించుటకై ఉపమోగించు మంత్రధ్యానమును చెప్పెదను - మంత్రముయొక్క స్థూలరూపము శబ్దము. ఇది దాని బాహ్యరూపము. 

మంత్రముయొక్క సూక్ష్మరూపము జ్యోతిర్మయ మైనది. ఇదే దాని ఆంతరరూపము. ఇది కేవలము చింతనామయ మైనది. చింతనమునకు కూడు అతీతమైనది మంత్రముయొక్క పరరూపము.

వరాహ-నరసింహ-శక్తిమంత్రముల స్థూలరూపమునకే ప్రాధాన్యము. వాసుదేవుని రూపము చిన్తనరహిత మని చెప్పబడినది.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹


21.Aug.2020

------------------------------------ x ------------------------------------


🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 75 🌹
✍️. శ్రీ పుల్లెల శ్రీరామచంద్రుడు

ప్రథమ సంపుటము, అధ్యాయము - 30
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🌻. అధ మండల విధి - 4 🌻

ఇతరేషాం స్మృతం రూపం హార్దచిన్తామయం సదా |

స్థూలం వై రాజమాఖ్యాతం సూక్ష్మం వై లిఙ్గితం భవేత్‌. 28

చిన్తయా రహితం రూపమైశ్వరం పరికీర్తితమ్‌ | హృత్పుణ్డరీకనిలయం చైతన్యం జ్యోతిరవ్యయమ్‌. 29

బీజం బీజాత్మకం ధ్యాయేత్కదమ్బకుసుమాకృతి | కుమ్భాన్తరగతో దీపో నిరుర్ధప్రసవౌ యథా. 30

సంహతః కేవలస్తిష్ఠేదేవం మన్త్రేశ్వరో హృది | అనేక సుషిరే కుమ్భే తావన్మాత్రా గభస్తయః. 31

ప్రసరన్తి బహిస్తద్వన్నాడీభిర్బీజరశ్మయః | అథావభాసతో దైవీమాత్మకృత్యతనుం స్థితా. 32

హృదయాత్ర్పస్థితా నాడ్యో దర్శనేన్ద్రియగోచరాః | అగ్నీ షోమాత్మ కే తాసాం నాడ్యౌ నాసాగ్ర సంస్థితే. 33

సమ్యగ్గుహ్యేన యోగేన జిత్వా దేహసమీరణమ్‌ | జపధ్యానరతో మన్త్రీ మన్త్రలక్షణమశ్నుతే. 34

దేవాత్మకో భూతమాత్రాన్ముచ్యతే చేన్ద్రియగ్రహాత్‌ |

ఇత్యాది మహాపురాణ ఆగ్నేయే మణ్డలాదివర్ణనం నామ త్రింశోధ్యాయః

ఇతరదేవతల చింతామయ మగు ఆంతరికరూపమే సర్వదా ముఖమైనదిగ పరిగణింపబడుచున్నది. 

విరాట్టు యొక్క స్వరూపము స్థూలము. లింగమయస్వరూపము సూక్ష్మము. ఈశ్వరుని రూపము చింతారహితము. బీజమంత్రము హృదయ కమలము నందు నివసించునది; అవినాశి; చిన్మయము; జ్యోతిస్వరూపము. జీవాత్మకము. దాని ఆకాశము కదంబ పుష్పముతో సమానము.

ఈ విధముగ ధ్యానింపవలెను. కుండలో నుంచిన దీపముయొక్క కాంతి పైకి ప్రసరింపకుండునట్లు నిరుద్ధమై సంహతరూపమున ఒంటరిగా ఉన్నట్లు, మంత్రేశ్వరుడు హృదయమునందు ప్రకాశించుచుండును. 

అనేక రంధ్రములున్న కుంభములో నుంచిన దీపము కాంతులు ఎన్ని రంధ్రము లున్నవో అన్ని బైటకు ప్రసరించినట్లు జ్యోతిర్మయబీజ మంత్రముల రశ్ములు నాడుల ద్వారా ప్రసరించుచు దేవాత్మకదేహముతో ప్రకాశించును. 

నాడులు హృదయమునుండి బయల్వెడలి నేత్రేంద్రియమువరకును ప్రసరించి ఉన్నవి. వాటిలో అగ్ని - సోమాత్మకము లగు రెండు నాడులు నాసికాగ్రభాగమునందుడును. 

మంత్రసాధకుడు ఉద్ఘాతయోగముచే శరీరవ్యాపియై యున్న ప్రాణవాయువును చక్కగా జయించి జపధ్యానతత్పరుడై యున్నచో ఆతనికి మంత్రఫలము లభించును. పంచభూతతన్మాత్రల శుద్ధి చేసికొని యోగాభ్యాసము చేయు సాధకుడు కోరికలు కలవాడైనచో అణిమాదిసిద్ధులను పొందును.

వైరాగ్యవంతు డైనచో ఆ సిద్ధులను దాటి, చిన్మయస్వరూపముతో నుండి, భరూతమాత్రలనుండియు, ఇంద్రియము లనెడు గ్రహములనుండి సర్వదా విముక్తుడగును.

అగ్ని మహాపురాణమునందు మండలాదివర్ణన మను ముప్పదవ అధ్యాయము సమాప్తము.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #అగ్నిపురాణం

24.Aug.2020

------------------------------------ x ------------------------------------




🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 76 🌹

✍️. శ్రీ పుల్లెల శ్రీరామచంద్రుడు

ప్రథమ సంపుటము, అధ్యాయము - 31

సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🌻.అథ కుశాపామార్జన విధానమ్‌ - 1 🌻

రక్షణ చేయు విధానం 

అగ్ని రువాచ :

రక్షాం స్వస్య పరేషాం వక్ష్యేతాం మార్జనాహ్వయామ్‌ |యయా విముచ్యతే దుఃఖైః సుఖం చ ప్రాప్నుయాన్నరః. 1

ఓం నమః పరమార్థాయ పురుషాయ పరమాత్మనే | అరూపబహురూపాయ వ్యాపినే పరమాత్మనే. 2

నిష్కల్మషాయ శుద్ధాయ ధ్యానయోగరతాయ చ | నమస్కృత్య ప్రవక్ష్యామి యత్తత్సిధ్యతు మ వచః. 3

వరాహాయ నృసింహాయ వామనాయ మహాత్మనే | నమస్కృత్య ప్రవక్ష్యామి యత్తత్సిధ్యతు మే వచః. 4

త్రివిక్రమాయ రామాయ వైకుణ్ఠాయ నరాయ చ | నమస్కృత్య ప్రవక్ష్యామి యత్తత్సిధ్యతు మేవచః. 5

అగ్నిదేవుడు చెప్పెను : ఓ మునీ! ఇపుడు నేను ఆత్మరక్షను, ఇతరుల రక్షను చేయు విధానమును చెప్పచున్నాను. దీనికి ''మార్జనము'' లేదా ''అపామార్జనము'' అని పేరు. ఈ రక్ష చేసికొనుటచే మానవుడు దుఃఖములు తొలగి సుఖము పొందును.

సచ్చిదానందస్వరూపుడును, పరమార్థభూతుడును, సర్వాంతర్యామియు, మహాత్ముడును, నిరాకారుడును, సహస్రాకారములు ధరించినవాడును, సర్వవ్యాపకుడును, అగు పరమాత్మకు నమస్కరించుచున్నాను. 

కల్మషరహితుడును, పరమశుద్ధుడును, నిత్యధ్యానయోగనిరతుడును అగు పరమాత్మకు నమస్కరించి రక్షావిషయమును చెప్పుచున్నాను. నా వాక్కు సత్య మగు గాక. భగవంతు డైన వరాహమూర్తికిని, నృసింహునకును, వామనునకును నమస్కరించి రక్షావిషయమున చెప్పెదను. 

నా వాక్యము సిద్ధించుగాక. భగవతంతుడైన త్రివిక్రమునకును, శ్రీరామునకును, శ్రీమహావిష్ణువునకును, నరునకును నమస్కరించి నేను రక్షావిషయమున చెప్పుచున్నాను. అది సత్యమగు గాక.

వరాహనరసింహేశ వామనేశ త్రివిక్రమ | హయగ్రీవేశ సర్వేశ హృషీ కేశ హరాశుభమ్‌. 6

అపరాజితచక్రా ద్యైశ్చతుర్భిః పరమాయుధైః| అఖణ్డితానుభావైస్త్వం సర్వదుఃఖహరో భవ. 7

హరాముకస్య దురితం సర్వం చ కుశలం కురు | మృత్యుబన్ధార్తిభయదం దురితస్య చ యత్ఫలమ్‌. 8

ఓ వరాహస్వామీ! నృసింహేశ్వరా! త్రివిక్రమా! హయగ్రీవేశా! సర్వేశా! హృషీకేశా! నా నమస్త అశుభములను హరింపుము. 

ఎవ్వనిచేతను ఓడింపరాని ఓ పరమేశ్వరా! ఆకుంఠితశక్తి గల నీ చక్రావ్యాయుధములు నాలిగింటిచే సమస్తదుష్టుల సంహారము చేయుము. 

ఓ ప్రభూ! ఫలానావాని సంపూర్ణపాపములను హరించి ఆతనికి పూర్తిగ కుశలక్షేమము ను ప్రసాదించుము. పాపములవలన కలుగు మృత్యు, బంధన, రోగ, పీడా, భయాదులను తొలగింపుము.

పరాభిధ్యానసహితైః ప్రయుక్తం చాభిచారికమ్‌ | గరస్పర్శమహారోగప్రయోగం జరయా జర. 9

ఓం నమో వాసుదేవాయ నమః కృష్ణాయ ఖడ్గినే | నమః పుష్కరనేత్రాయ కేశవాయాదిచక్రిణ. 10

నమః కమలకిఞ్జిల్కపీతనిర్మలవాసనే | మహాహవరిపుస్కన్ధఘృష్టచక్రాయ చక్రిణ. 11

దంష్ట్రోద్ధృతక్షితిభృతే త్రయిమూర్తి మతే నమః | మహాయజ్ఞవరాహాయ శేషభోగాఙ్కశాయినే. 12

తప్తహాటక కేశాన్తజ్వలత్పావకలోచన | వజ్రాధికనఖస్పర్శ దివ్యసింహ నమో7స్తు తే. 13

కాశ్యపాయాతిహ్రస్వాయ బుగ్యజుఃసామభూషిణ | తుభ్యం వామనరూపాయాక్రమతే గాం నమో నమః. 14

ఇతరుల వినాశమును కోరువారు చేసిన అభిచారిక ప్రయోగములను, వారిచ్చిన విషమిశ్రాన్నపానములను, వారు కల్పించిన మహారోగములను జరాజీర్ణములుగ చేసి వాటి నన్నింటిని నశింపచేయుము.

ఓం భగవంతు డైన వాసుదేవునకు నమస్కారము. ఖడ్గధారియైన కృష్ణునకు నమస్కారము. కమలనేత్రుడును, ఆది చక్రధారియు అగు కేశవునకు సమస్కారము. 

పద్మముల కింజల్కముల వలె పసుపు రంగు గల నిర్మలవస్త్రములు ధరించిన, భగవంతుడైన పీతాంబరునకు నమస్కారము. ఘోరసంగ్రామములలో శత్రువుల కంఠములతో రాచుకొను చక్రమును ధరించిన చక్రపాణికి నమస్కారము. 

కోరపై లేవదీయబడిన భూమిని ధరించినవాడును, వేదవిగ్రహుడును శేషశయ్యపై శయనింఉవాడును అగు మహాయజ్ఞవరాహమూర్తికి నమస్కారము. ఓ! దివ్యసింహమూర్తీ! నీ కేశాంతములు కరిగించిన బంగారము వలె ప్రకాశించుచున్నవి.

నేత్రములు అగ్ని వలె ప్రజ్వంచుచున్నవి. నీ నఖముల స్పర్వ వజ్రస్పర్శకంటె గూడ ఎక్కువ తీక్షణమైనది. నీకు నమస్కారము. చాల చిన్న శరీరము కలిగి, బుగ్వజుఃసామవేదముచే అలంకృతుడ వైన కాశ్యపకుమారా! వామనా! నమస్కారము. 

పిమ్మట విరాడ్రూపము ధరించి భూమిని ఆక్రమించిన త్రివిక్రమునకు నమస్కారము.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #అగ్నిపురాణం

25.Aug.2020

------------------------------------ x ------------------------------------




🌹.   శ్రీ మదగ్ని మహాపురాణము - 77   🌹

✍️. శ్రీ పుల్లెల శ్రీరామచంద్రుడు

ప్రథమ సంపుటము, అధ్యాయము - 31

సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🌻. అథ కుశాపామార్జన విధానమ్‌ - 2 🌻

రక్షణ చేసే విధానం

వరాహాశేషదుష్టాని సర్వపాపఫలాని వై | మర్ద మర్ద మహాదంష్ట్ర మర్ద మర్ద చ తత్ఫలమ్‌. 15

నారసింహ కరాలాస్య దన్తప్రాన్తాలోజ్జ్వల | భఞ్జ భఞ్జ నినాదేన దుష్టాన్‌ పశ్యార్తి నాశన. 16

బుగ్యజుఃసామగర్భాభిర్వాగ్భిర్వామనరూపధృక్‌ | ప్రశమం సర్వదుఃఖాని నయత్వస్య జనార్దన. 17

ఐకాహికం ద్వ్యాహికం చ తథా త్రిదివసం జ్వరమ్‌ | చాతుర్థికం తథాత్యుగ్రం తథైవ సతతం జ్వరమ్‌. 18

దోషోత్ఠం సంనిపాతోత్థం తథైవాగన్తుకం జ్వరమ్‌ | శమం నయాశు గోవిన్ద చ్ఛిన్ధి చ్ఛిన్ధ్యస్య వేదనామ్‌. 19

ఓ వరాహమూర్తీ! సమస్తపాపఫలరూపమున వచ్చిన సకలదుష్టరోగములను ఆణచివేయుము; ఆణచివేయుము.

గొప్పకోరలు గల మహావరాహా! పాపమువలన కలిగిన ఫలమును అణచివేయుము; అణచివేయుము. వికట మైన ముఖము గల నీ దంతాగ్రములు అగ్ని వలె ప్రకాశించుచున్నవి. 

ఓ ఆర్తివినాశనా! ఆక్రమణము చేయు దుష్టుల వైపు చూడుము; నీ గర్జనముచే వారి నందరిని నశింపచేయుము; నశింపచేయుము. 

ఓ! వామనమూర్తీ! ఋగ్యజుఃసామవేదముల గూఢతత్త్వములతో నిండిన వాక్కుతో ఈ ఆర్తుని సకలదుఃఖములను శమింపచేయుము గోవిందా! త్రిదోషములవలన కలిగినదియు, సంనిపాతమువలన కలిగినదియ, ఆగంతుకమునుఅగు ఐకాహికజ్వరమును (రోజువిడిచి రోజువచ్చు జ్వరము),

ద్వ్యాహికజ్వరమును (రెండు రోజులకు (వచ్చునది). త్ర్యాహికజ్వరమును, అత్యంతముభయంకర మగు చాతుర్థిక జ్వరమును (నాలుగురోజులకొకసారివచ్చునది), మానకుండా వచ్చు జ్వరమును శీఘ్రముగ శమింప చేయుము. దానివలన కలుగు బాధలను తొలగింపుము.

నేత్రదుఃఖం శిరోదుఃఖం దుఃకంచౌరగసంభవమ్‌ | అనిశ్వాసమతిశ్వాసం పరితాపం సవేపథుమ్‌. 20

గుదఘ్రాణాఙ్ఘ్రిరోగాంశ్చ కుష్ఠరోగాం స్తథా క్షయమ్‌ | కామలాదీంస్తథా రోగాన్‌ ప్రమేహాంశ్చాతిదారుణాన్‌. 21

భగన్దరాతిసారాంశ్చ ముఖరోగాంశ్చ వల్గులీమ్‌ | అశ్మరీం మూత్రకృచ్ఛ్రాంశ్చ రోగానన్యాంశ్చ దారుణాన్‌. 22

యే వాతప్రభవా రోగా యే చ పిత్తసముద్భవాః | కఫోద్భవాశ్చ యే కేచిద్యే చాన్యే సాంనిపాతికాః. 23

ఆగన్తుకాశ్చ యే రోగా లూతావిస్ఫోటకాదయః | తే సర్వే ప్రశమం యాన్తు వాసుదేవస్య కీర్తనాత్‌. 24

విలయం యాన్తు తే సర్వే విష్ణోరుచ్చారణన చ | క్షయం గచ్ఛన్తు చాశేషాస్తే చక్రాభిహతా హరేః. 25

అచ్యుతానన్తగోవిన్దనామోచ్చరణభేషజాత్‌ | నశ్యన్తి సకలా రోగాః సత్యం సత్యం వదామ్యహమ్‌. 26

నేత్రరోగమును, శిరోరోగమును, ఉదరరోగమును, శ్వాసావరోధమును, అతిశ్వాసమును, పరితాపమును, కంపనమును. గుదరోగమును, నాసికారోగమును, పాదరోగమును, కుష్ఠరోగములను, క్షయరోగమును,

కామలాదిరోగములను, అత్యంతముదారుణమైన ప్రమేహమును, భగందర - అతిసారములను, ముఖరోగమును, వల్గులీరోగమును, అశ్మరీరోగమును, ఇతర మూత్రకృచ్ఛ్రరోగములను, ఇతరములైన భయంకరరోగములను తొలగింపుము. 

వాత-పిత్త-కఫలములవలన కలిగిన రోగములును, సంనిపాతములవలన కలిగిన రోగములును, ఆగంతుకరోగములును, లూతా-విస్ఫోటాదిరోగములును భగవంతు డగు వాసుదేవుని నామసంకీర్తనమాత్రముననే తొలగిపోవుగాక. 

ఆ రోగము లన్నియు శ్రీ మహావిష్ణు నామోచ్చరణమాత్రముననే నశించి పోవుగాక. 

అవి అన్నియు శ్రీమహావిష్ణువు చక్రముచే కొట్టబడి తొలగిపోవుగాక. 'అచ్యుత', 'అనంత' 'గోవిన్ద' అను నామములను ఉచ్చరించుట అనెడు ఔషధముచే సకలరోగములును నశించును. నేను చెప్పునది సత్యము: సత్యము.

సశేషం... 
🌹 🌹 🌹 🌹 🌹


------------------------------------ x ------------------------------------




🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 78 🌹

✍️. శ్రీ పుల్లెల శ్రీరామచంద్రుడు
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

ప్రథమ సంపుటము, అధ్యాయము - 31

🌻.అథ కుశాపామార్జన విధానమ్‌ - 3 🌻

స్థావరం జఙ్గమం వాపి కృత్రిమం చాపి యద్విషమ్‌ | 
దన్తోద్భవం నఖభవమాకాశప్రభవం విషమ్‌. 27

లూతాదిప్రభవం యచ్చ విషమన్యత్తు దుఃఖదమ్‌ | 
శమం నయతు తత్సర్వం వాసుదేవస్య కీర్తనమ్‌. 28

గ్రహాన్‌ ప్రేతగ్రహాంశ్చాపి తథా వై డాకినీగ్రహాన్‌ | 
వేతాలాంశ్చ పిశాచాంశ్చ గన్ధర్వాన్‌ యక్షరాక్షసాన్‌. 29

శకునీపూతనాద్యాంశ్చ తథా వైనాయకాన్‌ గ్రహాన్‌ | 
ముఖమణ్డీం తథా క్రూరాం రేవతీం వృద్ధరేవతీమ్‌. 30

వృద్ధికాఖ్యాన్‌ గ్రహాంశ్చోగ్రాంస్తథా మాతృగ్రహానపి | 
బాలస్య విష్ణోశ్చరితం హన్తు బాలగ్రహానిమాన్‌. ప31

వృద్ధాశ్చ యే గ్రహాః కేచిత్‌ యే చ బాలగ్రహాః క్వచిత | 
నరసింహస్య తే దృష్ట్యా దగ్ధా యే చాపి ¸°వనే. 32

సటాకరాలవదనో నారసింహో మహాబలః | 
గ్రహానశేషాన్నిః శేషాన్‌ కరోతు జగతో హితః. 33

నరసింహ మహాసింహ జ్వాలామాలోజ్జ్వలానన |
 గ్రహానశేషాన్‌ సర్వేశ ఖాద ఖాదాగ్నిలోచన. 34

స్థావరము, జంగమము, కృత్రిమము, దంతములందు పుట్టినది, నఖములందు పుట్టినది, అకాశమునందు పుట్టినది, సాలెపురుగు మొదలగువాటినుండి పుట్టినది, ఇంకను ఇతరవిధములైన దుఃఖకర మగు విషమును భగవంతుడైన వాసుదేవుని స్మరణము నశింపచేయుగాక. 

బాలకృష్ణుని చరిత్రముయొక్క కీర్తనము గ్రహ-ప్రేతగ్రహ-డాకినీ పూతనాది గ్రహ-వినాయకగ్రహ - ముఖమండికా - క్రూరరేవతీ - వృద్ధరేవతీ - వృద్ధికానామకోగ్రగ్రహ - మాతృగ్రహాదులగు బాలగ్రహములను నశింపచేయుగాక! 

భగవంతుడ వైన నరసివంహా! నీ దృష్టిప్రసారముచే బాలగ్రహములు, యువగ్రహములు, వృద్ధగ్రహాములు దగ్ధము లైపోవుగాక! 

జూలుతో భయంకర మైన ముఖము కలవాడును, లోకమునకు హితము చేకూర్చువాడును, మహాబలవంతుడును అగు భగవంతు డైన నృసింహుడు సమస్తబాలగ్రహములను నశింపచేయుగాక, 

ఓ నరసింహా! మహాసింహా! జ్వాలామాలలచే నీ ముఖమండలము ప్రకాశించుచున్నది. ఓ అగ్ని లోచనా! సర్వేశ్వరా! సమస్తగ్రహములను భక్షించుము! భక్షించుము.

యే రోగా యే మహోత్పాతా యద్విషం యే మహాగ్రహాః | యాని చ క్రూరభూతాని గ్రహాపీడాశ్చ దారుణాః.

శస్త్రక్షతేషు యే దోషా జ్వాలా గర్దభకాదయకః | 
తాని సర్వాణి సర్వాత్మా పరమాత్మా జనార్దనః. 36

కించిద్రూపం సమాస్థాయ వాసుదేవస్య నాశయ | 
క్షిప్త్వా సుదర్శనం చక్రం జ్వాలామాలాతిభీషణమ్‌. 37

సర్వదుష్టోపశమనం కురు దేవవరాచ్యుత | 
సుదర్శన మహాజ్వాలా చ్ఛిన్ధి చ్ఛిన్థి మహారవ. 38

సర్వదుష్టాని రక్షాంసి క్షయం యాన్తు విభీషణ |
 ప్రాచ్యాం ప్రతీచ్యాం చ దిశి దక్షిణోత్తరతస్తథా. 39

రక్షాం కరోతు సర్వాత్మా నరసింహః స్వగర్జితైః | 
దివిభువ్యన్తరిక్షేచ పృష్ఠతః పార్శ్వతో7గ్రత. 40

రక్షాం కరోతు భగవాన్‌ బహురూపీ జనార్దనః | 
యథా విష్ణుర్జగత్సర్వం సదేవాసురమానుషమ్‌. 41

పరమాత్ము డైన జనార్దనుడు సర్వాత్మస్వరూపుడు. ఓ వాసుదేవా! ఈ వ్యక్తియందు ఏ రోగములన్నవో, ఏ మహోత్పాతము లున్నవో, ఏ విషమున్నదో, ఏ మహాగ్రము లున్నవో, క్రూరభూతము లున్నవో, దారుణ మైన గ్రహపీడ లున్నవో వాటి నన్నింటిని ఏదియో ఒక రూపము ధరించి నశింపచేయుము. 

దేవశ్రేష్ఠుడ వైన అచ్యుతా! జ్వాలామాలలచే మిక్కిలి భయంకరమైన సుదర్శనచక్రమును ప్రయోగించి దుష్టరోగలముల నన్నింటిని నశించేయుము. 

తీవ్రజ్వాలలచే ప్రకాశించుచు, మహాధ్వని చేయుచున్న సుదర్శనచక్రమా! సమస్తదుష్టరాక్షసులను సంహరింపుము; సంహరింపుము. 

నీ ప్రభావముచే ఆ రాక్షసు లందరును నశింతురుగాక. సర్వాత్మకు డగు నృసింహుడు, తన గర్జనముచే, పూర్వ-పశ్చిమ-ఉత్తర-దక్షిణదిశలందు రక్షించుగాక. 

అ నేక రూపములను ధరించు భగవంతుడైన జనార్దనుడు స్వర్గలోక-భూలోక-అంతరిక్షములందును, ముందును, వెనుకను రక్షించుగాక. 

దేవాసుర మనుష్యసహిత మగు ఈ జగత్తు అంతుయు భగవంతు డగు విష్ణుయొక్క స్వరూపమే. ఈ సత్యముయొక్క ప్రభావముచే ఈతని దుష్టరోగము లన్నియు నశించుగాక.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #అగ్నిపురాణం

27 Aug 2020

------------------------------------ x ------------------------------------


🌹.  శ్రీ మదగ్ని మహాపురాణము - 79  🌹

✍️. శ్రీ పుల్లెల శ్రీరామచంద్రుడు

ప్రథమ సంపుటము, అధ్యాయము - 31

సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🌻.అథ కుశాపామార్జన విధానమ్‌ - 4 🌻

తేన సత్యేన దుష్టాని శమమస్య ప్రజన్తువై | యథా విష్ణౌ స్మృతే సద్యః సంక్షయం యాన్తి పాతకాః. 42

సత్యేన తేన సకలం దుష్టమస్య ప్రశామ్యతు | యథా యజ్ఞేశ్వరో విష్ణుర్దేవేష్వపి హి గీయతే. 43

సత్యేన తేన సకలం యన్మయోక్తం తథాస్తు తత్‌ | శాన్తిరస్తు శివం చాస్తు దుష్టమస్య ప్రశామ్యతు. 44

వాసుదేవశరీరోత్థైః కుశైర్నిర్ణాశితం మయా | అపామార్జతు గోవిన్దో నరో నారాయణస్తథా. 45

తథాస్తు సర్వదుఃఖానాం ప్రళయో వచనాద్దరేః | అపామార్జనకం శస్తం సర్వరోగాదివారణమ్‌. 46

అహం హరిః కుశా విష్ణుర్హతా రోగా మయా తవ. 47

ఇత్యాగ్నేయే మహాపురాణ కుశాపామార్జనవర్ణనం నామ ఏకత్రింశో7ధ్యాయః.

''విష్ణువును స్మరింపగనే సర్వపాపములును వెంటనే తొలగిపోవును'' అను సత్యముయొక్క ప్రభావముచే వీని దుష్టరోగము లన్నియు శాంతించుగాక.

''యజ్ఞేశ్వరుడైన విష్ణువు దేవతలచే ప్రశంసించబడుచున్నాడు'' అనెడు సత్యముయొక్క ప్రభావముచే నా మాట సత్య మగుగాక. శాంతి కలుగుగాక. మంగల మగుగాక. 

ఈతని దుష్టరోగములు నశించుగాక. భగవంతు డైన వాసుదేవుని శరీరమునుండి పుట్టిన కుశలచే నేను ఈతని రోగములను తొలగించితిని. నరనారాయణులు, గోవిందుడును వీనికి అపామార్జనము చేయుగాక. 

శ్రీహరి వచనము ప్రకారము ఈతని సంపూర్ణదుఃఖములు శమించుగాక. సమప్తరోగాదులను నివారించుటకు అపామార్జనస్తోత్రము ప్రశస్త మైనది. నేను శ్రీహరిని. నేను నీ రోగములను నశింపచేసితిని.

అగ్నిమహాపురాణమునందలి కేశాపామార్జనస్తోత్రవర్ణన మను ముప్పదియొకటవ అధ్యాయము సమాప్తము.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #అగ్నిపురాణం

28 Aug 2020

------------------------------------ x ------------------------------------


🌹.   శ్రీ మదగ్ని మహాపురాణము - 80  🌹

ప్రథమ సంపుటము, అధ్యాయము - 32

✍️. శ్రీ పుల్లెల శ్రీరామచంద్రుడు
సేకరణ : ప్రసాద్ భరద్వాజ


🌻. అథ సంస్కార కథనమ్‌‌ 🌻

అగ్ని రువాచ :

నిర్వాణాదిషు దీక్షాసు చత్వారింశత్తథాష్ట చ | సంస్కారాన్కారయేద్ధీమాఞ్ఛృణు తాన్యైః సురో భవేత్‌. 1
గర్బాధానం యోన్యాం వై తతః పుంసవనం చరేత్‌ | సీమన్తోన్నయనం చైవ జాతకర్మ చ నామ చ. 2

అన్నాశనం తతశ్చూడా బ్రహ్మచర్యం వ్రతాని చ | చత్వారి వైష్ణవీ పార్థీ భౌతికీ శ్రౌతికీ తథా. 3

గోదానం స్నాతకత్వం చ పాకయజ్ఞాశ్చ సప్త తే | అష్టకా పార్వణశ్రాద్ధం శ్రావణ్యాగ్రయణీతిచ. 4

చైత్రీ చాశ్యయుజీ సప్త హవిర్యజ్ఞాశ్చ తాఞ్ఛృణు | అధానం చాగ్నిహోత్రం చ దర్శో వై పౌర్ణమాసకః. 5

చాతుర్మాస్యం పశోర్బన్ధః సౌత్రామణిరథాపరః | సోమసంస్థాః సప్త శృణు చాగ్నిష్టోమః క్రతూత్తమః. 6

అత్యగ్నిష్టోమ ఉక్థశ్చ షోడశీవాజపేయకః | అతిరాత్రాప్తోర్యామశ్చ సహస్రేశాః సవాఇమే. 7

హిరణ్యాఙ్ఘ్రిర్హిరణ్యాక్షో హిరణ్యమిత్ర ఇత్యతః | | హిరణ్యపాణి ర్హేమాక్షో మేమాఙ్గో హేమసూత్రకః. 8

హిరణ్యాస్యో హిరణ్యాఙ్గో హేమజిహ్వా హిరణ్యవాన్‌ | అశ్వమేధో హి సర్వేశో గుణాశ్చాష్టాథ తాఞ్ఛృణు. 9

దయా చ సర్వభూతేషు క్షాన్తిశ్చైవ తథార్జవమ్‌ | శౌచం చైవ మనాయాసో మఙ్గలం చాపరో గుణః. 10

అకార్పణ్యం చాస్పృహా చ మూలేన జుహుయాచ్ఛతమ్‌ | సౌరశాక్తేయ విష్ణ్వీశదీక్షాస్వేతే సమాః స్మృతాః. 11

సంస్కారైః సంస్కృతశ్చతైర్భుక్తిం ముక్తిమవాప్నుయాత్‌ | సర్వరోగాదినిర్ముక్తో దేవవద్వర్తతే నరః. 12

జప్యాద్ధోమాత్పూజనాచ్చ ధ్యానాద్దేవస్య చేష్టభాక్‌ |

ఇత్యాది మమాపురాణ ఆగ్నేయే అష్టచత్వారింశత్సంస్కారకథనం నామ ద్వాత్రింశో7ధ్యాయః.

అగ్నిదేవుడు చెప్పను :

బుద్ధిమంతు డగు పురుషుడు నిర్వాణాదిదీక్షలలో నలబదియోనిమిది సంస్కారములు చేసికొనవలెను. ఆ సంస్కారములను గూర్చి వినుము.

వీటిచే మనుష్యుడు దేవతాతుల్యు డగును. మొట్టమొదట యోనిలో, గర్భాధానము. పిమ్మట (2) పుంసవన సంస్కారము చేయవలెను: పిమ్మట (3) సీమంతోన్నయనము, (4) జాతకర్మ (5) నామకరణము (6) అన్నప్రాశనము (7) చూడాకర్మ (8) బ్రహ్మచర్యము (9) వైష్ణవి (10) పార్థి (11) భౌతిక (12) శ్రౌతికి అను నాలుగు బ్రహ్మచర్యవ్రతములు, (13) గోదానము (14) సమావర్తనము (15) అష్టక (16) అన్వష్టక (17) పార్వణశ్రాద్ధము (18) శ్రావణి (19 ఆగ్రహాయణి (20) చైత్రి (21) ఆశ్యయుజి అను ఏడు పాకయజ్ఞములు, (22) ఆధానము (23) అగ్ని హోత్రము (24) దర్శము (25) పౌర్ణమాసము (26) చాతుర్మాస్యము (27) పశుబంధము (28) సౌత్రామణి అను ఏడు హవిర్యజ్ఞములు (29) యజ్ఞములలో శ్రేష్ఠ మైన దగు అగ్నిష్టోమము (30) అత్యగ్నిష్టోమము (31) ఉక్థ్యము (32) షోడశి (33) వాజపేయము (34) అతిరాత్రము (35) అప్తోర్యామముఅను ఏడు సోమసంస్థలు, (36) హిరణ్యాంఘ్రి (37) హిరణ్యాక్షము (38) హిరణ్యమిత్రము (39) హిరణ్యపాణి (40) హేమాక్షము (41) హేమాంగము (42) హేమసూత్రము (43) హిరణ్యాస్యము (44) హిరణ్యాంగము (45) హేమజిహ్వము (46) హిరణ్యవత్తు (47) అన్ని యజ్ఞములకును అధిపతి యైన (1) అశ్వమేధము అను సహస్రేశయజ్ఞములు, 

సర్వభూతదయ, క్షమ, ఋజుత్వము, శౌచము, అనాయాసము, మంగళము, అకార్పణ్యము, అస్పృహ అను ఎనిమిది గుణములు. ఈ సంస్కారములను చేయవలెను.

ఇష్టదేవతా మూల మంత్రమున నూరు ఆహుతు లివ్వవలెను. 

సౌర-శాక్త-వైష్ణవ-శైవ దీక్షలలో అన్నింటియందును ఇవి సమానమే. ఈ సంస్కారములచే సంస్కృతు డగు పురుషుడు భోగములను, మోక్షమును కూడ పొందును. సమస్తరోగములచే విముక్తుడై దేవతాపురుషుడు వలె నుండును.

మునుష్యునకు ఇష్టదేవతామంత్ర జప-హోమ-పూజా-ధ్యానములచే ఆభీష్టప్రాప్తి కలుగును.

ఆగ్నేయమహాపురాణమునందలి సంస్కారవర్ణన మను ముప్పదిరెండవ అధ్యాయము సమాప్తము.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #అగ్నిపురాణం

29 Aug 2020

------------------------------------ x ------------------------------------


🌹.   శ్రీ మదగ్ని మహాపురాణము - 81  🌹
✍️. శ్రీ పుల్లెల శ్రీరామచంద్రుడు

ప్రథమ సంపుటము, అధ్యాయము - 33
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🌻. అథ పవిత్రారోపణ విధానమ్‌‌‌ - 1 🌻

అగ్ని రువాచ

పవిత్రారోపణం వక్ష్యే వర్షపూజాఫలం హరేః | ఆషాఢాదౌ కార్తికాన్తే ప్రతిప త్త్యజ్యతే తిథిః. 1

శ్రియా గౌర్యా గణశస్య సరస్వత్యా గుహస్య చ | మార్తణ్డమాతృదుర్గాణాం నాగర్షిహరిమన్మథైః. 2

శివస్య బ్రహ్మణస్తద్వద్ద్వితీయాదితిథేః క్రమాత్‌ | యస్య దేవస్య యో భక్తః పవిత్రా తస్య సా తిథిః. 3

అగ్నిదేవుడు పలికెను : మునీ! ఇపుడు నేను పవిత్రారోపణమను గూర్చి చెప్పెదను. సంత్సరమునందు ఒక మారు పవిత్రారోపణము చేసినచో, సంవత్సర మంతయు శ్రీహరి పూజ చేసిన ఫలము నిచ్చును. ఆషాఢశుక్ల ఏకాదశి మొదలు కార్తిక శుక్లైకాదశి వరకు నున్న కాలమున పవిత్రారోపణము చేయవలెను. 

ప్రతిపత్తు విడువవలెను. ద్వితీయాదితిథులు క్రమముగ లక్ష్మాదిదేవతల తిథులు. ద్వితీయ లక్ష్మికి, తృతీయ గౌరికి, చతుర్థి గణశునికి, పంచమి సరస్వతికి, షష్ఠి కుమారస్వమికి, సప్తమి సూర్యునకు, అష్టమి మాతృదేతలకు, నవమి దుర్గకు, దశమి నాగులకు, ఏకాదశి ఋషులకు, ద్వాదశి విష్ణువునకు, త్రయోదశి మన్మథునకు, చతుర్దశి శివునకు, పౌర్ణమాస్యవాస్యలు బ్రహ్మకు సంబంధించినవి. ఏ ఉపాసకుడు ఏ దేవతను ఉపాసించునో ఆతనికి ఆ దేవతయొక్క తిథి పవిత్ర మైనది.

ఆరోహణే తుల్యవిధిః పృథఙ్‌ మన్త్రాదికం యది | సౌవర్ణం రాజతం తామ్రం నేత్రకార్పాసకాదికమ్‌. 4

పవిత్రారోపణవిధి అందరు దేవతలకును సమానమే. మంత్రాదులు మాత్రమే ఆయా దేవతలకు వేరు వేరుగా నుండును. పవిత్రకమును నిర్మించుటకై బంగారము, వెండి రాగి తీగలను నూలు దారముగాని ఉపమోగింపవలెను.

బ్రాహ్మణ్యా కర్తితం సూత్రం తదలాభే తు సంస్కృతమ్‌ |

ద్విగుణం త్రిగుణీకృత్య తేన కుర్యాత్‌ పవిత్రకమ్‌. 5

అష్టోత్తరశతాదూర్ధ్వం తదర్ధం చోత్తమాదికమ్‌ | క్రియాలోపవిఘాతార్థం యత్త్వయాభిహితం ప్రభో. 6

మయా తత్ర్కియతే దేవ యథా యత్ర పవిత్రకమ్‌ | అవిఘ్నం తు భవేదత్ర కురు నాథ జయావ్యయ. 7

బ్రాహ్మణస్త్రీచేతితో వడికిన నూలు చాల శ్రేష్ఠమైనది. అది లభించనిచో ఏ దారము నైనను గ్రహించి, దానిని సంస్కరించి, ఉపమోగింపవలెను. 

దారమును మూడుపేటలు చేసి, మరల దానిని మూడు పేటలు చేసి, దానితో పవిత్రకమును నిర్మింపవలెను. నూట ఎనిమిది మొదలు అధికము లగు తంతువులతో నిర్మించిన పవిత్రకము ఉత్తమాదిశ్రేణికి చెందినదిగ పరిగణింపబడుచున్నది.

పవిత్రరోపణమునకు ముందు ఇష్టదేవతను గూర్చి ఈ విధముగ ప్రార్థింపవలెను. ''ప్రభూ! క్రియాలోపమువలన కలిగిన దోషమును తొలగించుటకై నీవు ఏ సాధమును చెప్పినావో దానినే నేను చేయుచున్నాను.

ఎక్కడ ఏ పవిత్రకము ఆవశ్యకమో అక్కడ అట్టి పవిత్రకమునే అర్పించగలను. నీ కృపచే ఈ కార్యమునందు విఘ్నబాధ లేవియు కలుగకుండుగాక. అవినాశి యైన పరమేశ్వరా! నీకు జయ మగుగాక.

ప్రార్థ్యతన్మణ్డలాయాదౌ గాయత్ర్యా బన్ధయేన్నరః | ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి. 8

తన్నో విష్ణుః ప్రచోదయాద్దేవదేవానురూపతః | జానూరునాభినాసాన్తం ప్రతిమాసు పవిత్రకమ్‌. ప9

పాదాన్తా వనమాలా స్యాదష్టోత్తర సహస్రతః | మాలాం తు కల్పసాధ్యాం వా ద్విగుణాం షోడశాఙ్గులామ్‌. 10

కర్ణికా కేసరం పత్రం మన్త్రాద్యం మణ్డలాన్తకమ్‌ | మణ్డలాఙ్గులమాత్రైక చక్రాబ్జాదౌ పవిత్రకమ్‌. 11

స్థణ్డిలే7ఙ్గులమానేన ఆత్మనః సప్తవింశతిః |

ఈ విధముగ ప్రార్థించు పవిత్రకమును ఇష్టదేవతామండలమునకు గాయత్రీమంత్రముతో కట్టవలెను. ''ఓం నమో నారాయణాయ విద్మహే, వాసుదేవాయ దీమహి, తన్నో విష్ణుః ప్రచోదయాత్‌'' అనునది ఇష్టదేవత యగు నారాయణుని గాయత్రీమంత్రము. ఈ గాయత్రీ ఇష్టదేవతానామానుసారముగ ఉండును. దేవప్రతిమలపై అర్పించుటకు అనేకవిధములగు పవిత్రకము లుండును. 

విగ్రహముయొక్క నాభివరకు వచ్చునది ఒకటి; తొడలవరకు వచ్చునది మరి యొకటి మోకాళ్ళవరకు వచ్చునది మరియొకటి. పాదములవరకు వ్రేలాడునది ఒకటి. చివరిదానికి వనమాల అని పేరు. దానిని ఒక వెయ్యి ఎనిమిది దారములతో నిర్మింపవలెను. 

సాధారణమాలను శక్త్యనుసారము నిర్మింపవలెను. లేదా అది పదునారు అంగుళములకంటె రెట్టింపు పెద్దదిగా ఉండవలెను. కర్ణికా-కేసర-దళాదులుగల యంత్ర-చక్రదిమండలములపై వేయు పవిత్రకము పైనుండి క్రిందివరకును కప్పునదిగా ఉండవలెను.

ఒక చక్రము, ఒక కమలము ఉన్న మంక్షలముపై ఆ మండలము ఎన్ని అంగుళము లున్నదో అన్ని అంగుళముల పవిత్రకము అర్పింపవలెను. వేదిపై అర్పించు పవిత్రకము తన చేతి అంగుళములతో ముప్పదియేడు అంగుళముల పొడ వుండవలెను.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #అగ్నిపురాణం

30.Aug.2020

------------------------------------ x ------------------------------------


🌹.   శ్రీ మదగ్ని మహాపురాణము - 82  🌹
✍️. శ్రీ పుల్లెల శ్రీరామచంద్రుడు

ప్రథమ సంపుటము, అధ్యాయము - 33
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🌻. అథ పవిత్రారోపణ విధానమ్‌‌‌ - 2 🌻

ఆచార్యాణాం చ సూత్రాణి పితృమాత్రాదిపుస్తకే. 12

నాభ్యన్తం ద్వాదశగ్రన్థిం తథా గన్ధపవిత్రకే | అఙ్గలాత్కల్పనాదౌద్విర్మాలా చాష్టోత్తరం శతమ్‌. 13

అథవార్కచతుర్వింశషట్త్రింశన్మాలికా ద్విజ | అనామామధ్యమాఙ్గుష్ఠైర్మన్దాద్యైర్మాలికార్థిభిః. 14

కనిష్ఠాదౌ ద్వాదశ వా గ్రన్థయః స్యుః పవిత్రకే | రవేః కుమ్భహుతాశాదేః సమ్భవీ విష్ణువన్మతమ్‌. 15

పీఠస్య పీఠమానం స్యాన్మేఖలాన్తే చ కుణ్డకే | యథాశక్త సూత్రగ్రన్థిః పరిచారే7థ వైష్ణవే. 16

సూత్రాణి వా సప్తదశ సూత్రేణ త్రివిభక్త కౌ |

ఆచార్యునికొరకును, తలిదండ్రులకొరకును, పుస్తకముపై ఉంచుటకొరకును నిర్మింపబుడు పవిత్రకమునాభిప్రదేశమువరకును వ్రేలాడవలెను. దీనికి పండ్రెండు ముడులు ఉండవలెను. దానిపై మంచి గంధము పూయవలెను.

వనమాలయందు రెండేసి అంగుళములదూరమున క్రమముగా నూటఎనిమిది ముడులు వేయవలెను. లేదా కనిష్ఠ-మధ్యదు-ఉత్తమపత్రకములపై క్రమముగా పండ్రెండు, ఇరువదినాలుగు, ముప్పదియారుముడులు వేయవలెను. 

మంద-మధ్యమ-ఉత్తమమాలార్థు లగ పురుషులు అనామికా-మధ్యమా-అంగుష్ఠములచేతనే పవిత్రకములను గ్రహింపవలెను. లేదా కనిష్ఠకాది నామధేయములు గల పవిత్రకములందు అన్నింటియందును పండ్రెండేసి ముడులే ఉండవలెను.

(తంతువుల సంఖ్యను పట్టియు, పొడవును పట్టియు ఈ కనిష్ఠికాదినామదేయము లేర్పడినవి). సూర్యునకు, కలశమునకు, అగ్ని మొదలగు వాటికిని గూడ యథాసంభవముగ భగవంతు డగు విష్ణువునకు వలెనే పవిత్రకములను అర్పించుట ఉత్తమ మని చెప్పబడినది. పీఠముకొరకు దాని పొడవును పట్టియు, కుండమునకు దాని మేఖలపర్యంతమును పొడవు గల పవిత్రకముండవలెను. 

విష్ణుపార్షదులకు యథాశక్తిగ సూత్రగ్రంథులను సమర్పింపవలెను. లేదా గ్రంథులు లేకుండ పదునేడు సూత్రములు సమర్పింపవలెను. భద్రుడను పార్షదునకు త్రిసూత్రము సమర్పింపవలెను.

ఏకాదశ్యాం యాగగృహే భగవన్తం హరిం యజేత్‌. 18

సమస్తపరివారాయ బలిం పీఠే సమర్చయేత్‌ | క్షౌం క్షేత్రపాలాయ ద్వారాన్తే ద్వారోపరి శ్రియమ్‌. 19

ధాత్రే దక్షే విధాత్రే చ గఙ్గాం చ యమునాం తథా | శఙ్ఖపర్మనిధీ పూజ్య మధ్యే వాస్త్వపసారణమ్‌. 20

సారఙ్గాయేతి భూతానాం భూతశుద్ధిం స్థితశ్చరేత్‌ |

ఓం హూం హః ఫట్‌ హ్రూం గన్ధతన్మాత్రం సంహరామి నమః.

ఓం హ్రూం హః ఫట్‌ హ్రూం రసతన్మాత్రం సంహరామి నమః.

ఓం హ్రూం హః ఫట్‌ హ్రూం రూపతన్మాత్రం సంహరామి నమః.

ఓం హ్రూం హః ఫట్‌ హ్రరూం స్పర్శతన్మాత్రం సంహరామి నమః.

ఓం హ్రూం హః ఫట్‌ హ్రూం శబ్దతన్మాత్రం సంహరామి నమః.

పఞ్చోద్ఘాతైర్గన్థతన్మాత్రస్వరూపం భూమిమణ్డలమ్‌ |

చతురస్రం చ పీతం చ కఠినం వజ్రలాఙ్ఛితమ్‌.

ఇన్ద్రాధిదైవతం పాదయుగ్మమధ్యగతం స్మరేత్‌ |

శుద్ధం చ రసతన్మాత్రం ప్రవిలాప్యాథ సంహరేత్‌ 7

రసమాత్రం రూపమాత్రే క్మరమేణానేన పూజకః. 22

పవిత్రమును గోరోచనముతోను, అగురుకర్పూరములు కలిపిన పసుపుతోను, కుంకుమరంగుతోను పూయవలెను. భక్తుడు ఏకాదశీదివసమున స్నానసంధ్యాదులు చేసి, పూజగృహము వ్రవేవించి, భగవంతుడగు శ్రీహరిని పూజింపవలెను.

విష్ణువుయొక్క సమస్తపరివారమునకును బలి సమర్పించి విష్ణువును పూజింపవలెను. ద్వారముయొక్క అంతమునందు ''క్షం క్షేత్రపాలాయ నమః'' అని చెప్పి క్షేత్రపాలపూజ చేయవలెను.

ద్వారము పై భాగమున ''శ్రియై నమః'' అని చెప్పుచు శ్రీదేవిని పూజించవలెను. ద్వారదక్షిణ (కుడి) దేశమున ''ధాత్రే నమః'' ''గంగాయై నమః'' అను మంత్రము లుచ్చరించుచు, ధాతను, గంగను పూజింపవలెను. ఎడమ వైపున ''విధాత్రే నమః'' ''యమునాయై నమః'' అని చెప్పుచు విధాతను, యమునను, పూజింపవలెను. 

ఇదే విధముగ ద్వారముయొక్క కుడి-ఎడమ ప్రదేశములందు క్రమముగ ''శఙ్ఖనిధయే నమః'' పద్మనిధయే నమః''అని చెప్పుచు శంఖపద్మనిధులను పూజింపవలెను.

[పిదప మండపములోపల కుడి హిదము మణవను మూడు మార్లు కొట్టి విఘ్నములను పారద్రోలవలెను].

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #అగ్నిపురాణం

31.Aug.2020

------------------------------------ x ------------------------------------


🌹.   శ్రీ మదగ్ని మహాపురాణము - 83  🌹

✍️. శ్రీ పుల్లెల శ్రీరామచంద్రుడు

ప్రథమ సంపుటము, అధ్యాయము - 33

సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🌻. అథ పవిత్రారోపణ విధానమ్‌‌‌ - 3 🌻

పిమ్మట ''సారఙ్గాయ నమః అని అనుచు విఘ్నకారములగు భూతములను పారద్రోలవలెను. [పిమ్మట ''ఓం హాం వాస్త్వదిపతయే బ్రహ్మణే నమః'' అను మంత్రము నుచ్చరించుచు బ్రహ్మ యొక్క స్థానమున పుష్పము లుంచవలెను]. పిదప ఆసనముపై కూర్చుండి భూతశుద్ధి చేయవలెను.

''ఓం హ్రూం హః ఫట్‌ హ్రూం గన్దతన్మాత్రం సంహరామి నమః.

ఓం హ్రూం హః ఫట్‌ హ్రూం రసతన్మాత్రం సంహరామి నమః.

ఓం హ్రూం హః ఫట్‌ హ్రూం రూపతన్మాత్రం సంహరామి నమః.

ఓం హ్రూం హః ఫట్‌ హ్రూం స్ప

ర్శతన్మాత్రం సంహరామి నమః.

ఓం హ్రూం హః ఫట్‌ హ్రూం శబ్దతన్మాత్రం సంహరామి నమః.''

అను ఐదు ఉద్ఘాతవాక్యముల నుచ్చరించుచు గంధతన్మాత్రస్వరూప మగు భూమండలమును, వజ్రచిహ్నితము, సూవర్ణమయము, చతురస్రము (నలుపలకలు గలది) పీఠమును, ఇంద్రాదిదేవతలను తన పాదముల మధ్య నున్నట్లు చూచుచు వాటి భావన చేయవలెను. 

ఈ విధముగ శుద్ధ మగు గంధతన్మాత్రను రసతన్మాత్రయందు లీనము చేసి ఉపాసకుడు అదే క్రమమున రసతన్మాత్రను రూపతన్మాత్రయందు లీనము చేయవలెను.

ఓం హ్రీం హః ఫట్‌ హ్రూం రసతన్మాత్రం సంహరామి నమః.

ఓం హ్రీం హః ఫట్‌ హ్రూం రూపతన్మాత్రం సంహరామి నమః.

ఓం హ్రీం హః ఫట్‌ హ్రూం స్పర్శతన్మాత్రం సంహరామి నమః.

ఓం హ్రీం హః ఫట్‌ హ్రూం శబ్దతన్మాత్రం సంహరామి నమః.

జానునాభిమధ్యగతం శ్వేతం వై పద్మలాఞ్ఛితమ్‌ |

శుక్లచన్ద్రం చార్ధచన్ద్రం ధ్యాయేద్వరుణదైవతమ్‌.

చతుర్భిశ్చ తదుద్ఘాతైః శుద్ధం తద్రసమాత్రకమ్‌ | సంహరేద్రసతన్మాత్రం రూపమాత్రే చ సంహరేత్‌. 24

ఓం హ్రీం హః ఫట్‌ హ్రూం రసతన్మాత్రం సంహరామి నమః.

ఓం హ్రీం హః ఫట్‌ హ్రూం రూపతన్మాత్రం సంహరామి నమః.

ఓం హ్రీం హః ఫట్‌ హ్రూం స్పర్శతన్మాత్రం సంహరామి నమః.

ఓం హ్రీం హః ఫట్‌ హ్రూం శబ్దతన్మాత్రం సంహరామి నమః''.

అను నాలుగు ఉద్ఘాతవాక్యముల నుచ్చరించుచు మోకాళ్లు మొదలు నాభివరకును ఉన్న శరీరభాగమును శ్వేతకములచే చిహ్నిత మైనదానినిగాను, శుక్లవర్ణ మైనదానినిగాను, అర్ధచంద్రాకారము కలదానినిగాను చూడవలెను. 

ఈ జలీయ భాగమునకు వరుణుడు దేవత యని భావన చేయవలెను. పై నాలుగు ఉద్ఘాతవాక్యములను ఉచ్చరించుటచే రసతన్మాత్రము శుద్ధ మగును. ఈ రసతన్మాత్రను రూపత్మాత్రయుందు లీనము చేయవలెను.

ఓం హ్రూం హః ఫట్‌ హ్రూం రూపతన్మాత్రం సంహరామి నమః.

ఓం హ్రూం హః ఫట్‌ హ్రూం స్పర్శతన్మాత్రం సంహరామి నమః.

ఓం హ్రూం హః ఫట్‌ హ్రూం శబ్దతన్మాత్రం సంహరామి నమః.

ఇతి త్రిభిస్తదుద్ఘాతైస్త్రీకోణం వహ్నిమణ్డలమ్‌ | నాభికణ్ఠమధ్యగతం రక్తం స్వస్తికలాఞ్ఛి

తమ్‌. 25

ధ్యాత్వా7నలాధిదైవం తచ్ఛుద్ధం స్పర్శే లయం నయేత్‌ |

ఓం హ్రూం హః ఫట్‌ హ్రూం శబ్దతన్మాత్రం సంహరామి నమః.

ఓం హ్రూం హఃఫట్‌ హ్రూం స్పర్శతన్మాత్రం సంహరామి నమః.

ఓం హ్రూం హః ఫట్‌ హ్రూం శబ్దతన్మాత్రం సంహరామి నమః.''

అను మూడు మూడు ఉద్ఘాతవాక్యముల నుచ్చరించుచు నాభి మొదలు కంఠమువరకును ఉన్న భాగమునందు త్రికోణాకారాగ్ని మండలమును భావింపవలెను. దాని రంగు ఎరుపు. 

అది స్వస్తికాకారముచే చిహ్నితమైనది. దిన అధిదేవత అగ్ని. ఈ విధముగా శుద్ధము చేయబడిన రూపతన్మాత్రను స్పర్శతన్మాత్రయందు లీనము చేయవలెను.

ఓం హ్రీం హః ఫట్‌ హ్రూం స్పర్శతన్మాత్రం సంహరామి నమః.

ఓం హ్రీం హః ఫట్‌ హ్రూం శబ్దతన్మాత్రం సంహరామి నమః.

కణ్ఠనాసామధ్యగతం వృత్తం వై వాయుమణ్డలమ్‌ |

ద్విరుద్ధౌర్తధూమ్రవర్ణం ధ్యాయేచ్ఛుద్ధేన్దులాఞ్ఛితమ్‌ |

స్పర్శమాత్రం శబ్దమాత్రే సంహరేద్ధ్యానయోగతః. 27

ఓం హ్రీం హః ఫట్‌ హ్రూం శబ్దతన్మాత్రం సంహరామి నమః.

ఏకోద్ఘాతేన చాకాశం శుద్ధస్ఫటికసన్నిభమ్‌ | నాసాపుటశిఖాన్తఃస్థ మాకాశముపసంహరేత్‌. 28

పిమ్మట - ''ఓం హ్రీం హః ఫట్‌ హ్రూం స్పర్శతన్మాత్రం సంహరామి నమః.

ఓం హ్రీం హః ఫట్‌ హ్రూం శబ్ధతన్మాత్రం సంహరామి నమః.''

అను రెండు ఉద్ఘాతవాక్యములు నుచ్చరించుచు కంఠము మొదలు నాసికామధ్య వరకును ఉన్న భాగమునందు గోలాకారవాయు మండలమును భావన చేయవలెను. దాని రంగు ధూమము వలె నుండును. అది నిష్కలంకచంద్రునిచే చిహ్నిత మైనది. స్పర్శతన్మాత్రమును ధ్యానముచే శబతన్మాత్రయందు లీనము చేయవలెను. 

పిమ్మట ''ఓం హ్రీం హః ఫట్‌ హ్రూం శబ్దతన్మాత్రం సంహారామి నమః'' అను ఒక ఉద్ఘాతవాక్యము నుచ్చరించుచు శుద్ధ స్ఫటికముతో సమానమైన ఆకాశమును, వాసికనుండు శిఖవరకును ఉన్న శరీరభాగముపై భావన చేయవలెను. ఆ శుద్థాకాశము (అహాంకారమునందు) ఉపసంహరింపవలెను.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #అగ్నిపురాణం

01 Sep 2020

------------------------------------ x ------------------------------------





🌹.   శ్రీ మదగ్ని మహాపురాణము - 84  🌹
✍️. శ్రీ పుల్లెల శ్రీరామచంద్రుడు

ప్రథమ సంపుటము, అధ్యాయము - 33
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🌻. అథ పవిత్రారోపణ విధానమ్‌‌‌ - 4 🌻

శోషణాద్యైర్దేహశుద్ధిం కుర్యాదేవ క్రమాత్తతః | 
శుష్కం కలేవరం ధ్యాయేత్పాదాద్యం చ శిఖాన్తకమ్‌. 29

యం బీజేన వం బీజేన జ్వాలామాలాసమాయుతమ్‌ | 
దేహం రమిత్యనేనైన బ్రహ్మరన్ధ్రాద్వినిర్గతమ్‌. 30

బిన్దుం ధ్యాత్వా చామృతస్య తేన భస్మ కలేవరమ్‌ | 
సంస్థాపయేల్లమిత్యస్మాద్దేహం సంపాద్య దివ్యకమ్‌. 31

న్యాసం కృత్వా కరే దేహే మానసం యాగమాచరేత్‌ |
విష్ణుం సాఙ్గం హృది పద్మే మనసైః కుసుమాదిభిః. 32

మూలమన్త్రేణ దేవేశం ప్రార్థయేద్భుక్తి ముక్తిదమ్‌ | 
స్వాగతం దేవదేవేశ సన్నిధౌ భవ కేశవ. 33

గృహాణ మానసీం పూజాం యథార్థం పరిభావితమ్‌ | 
ఆధారశక్తః కూర్మోథ పూజ్యోనన్తో మహీ తతః. 34

మధ్యే7గ్న్యాదౌ చ ధర్మాద్యా అధర్మాద్యాశ్చ ముఖ్యగాః |
సత్త్వాదిమధ్యే పద్మ చ మాయావిద్యాఖ్యతత్త్వకే. 35

కాలతత్త్వం చ సూర్యాదిమణ్డలం పక్షిరాజకః | 
మధ్యే తతశ్చ వాయవ్యాదీశాన్తా గురుపఙ్త్కికా. 36

పిమ్మట శోషణాదుల ద్వారా దేహశుద్ధి చేసుకొనవలెను. పాదమునంచి శిఖవరకును దేహము 'యం' అను వాయుబీజముచే ఎండుపోయినట్లు భావన చయవలెను. పిమ్మట 'రం' అను బీజము ద్వారా అగ్నిని ప్రకటించి సమస్తశరీరము అగ్నిజ్వాలలచే దగ్ధ మై భస్మ మైనట్లు భావన చేయవలెను. 

పిమ్మట 'వం' బిందువును ఉచ్చరించుచు బ్రహ్మరంధ్రమునుండి అమృతబిందువు ఆవిర్భవించినట్లు భావన చేయవలెను. దాని నుండి ప్రవహించిన అమృతధారచే శరీరము నంతను ముంచెత్తివేయవలెను.

పిమ్మట 'లం' అను బీజమును ఉచ్చరించుచు ఆ భస్మమునుండి దివ్యదేహము ఆవిర్భివించి నట్లు భావన చేయవలెను. ఈ విధముగ దివ్యదేహభావన చేసి అంగన్యాసకరన్యాసములు చేయవలెను. పిమ్మట మానసయాగానుష్ఠానము చేయవలెను. 

హృదయకమలముపై అంగదేవతాసహితు డగు మహావిష్ణువును నిలిపి, మానసిక వుష్పాద్యుపచారములు చేయుచు, మూలమంత్రము లుచ్చరించుచు పూజింపవలెను. ఆ భగవంతుడు భోగమోక్షముల నిచ్చువాడు. మానసిక పూజలను స్వీకరింపు మని భగవంతుని ఈ విధముగ ప్రార్థింపవలెను. 

''దేవా! దేవాధిదేవా! కేశవా! నీకు స్వాగతము. నా సమీపమున సన్నిహితుడవై నేను అర్పించు మానసికపూజను కైకొనుము.'' పీఠము మధ్యభాగమునందు, యోగపీఠమును ధరించు ఆధారశక్తియైన కూర్మమును, అనంతుని, పృథివిని పూజింపవలెను.

ఆగ్నేయకోణము మొదలగు నాలుగు కోణములందును క్రమముగ ధర్మ-జ్ఞాన-వైరాగ్య-ఐశ్వర్యములను పూజింపవలెను. తూర్పమొదలగు ప్రధానదిక్కులందు అధర్మ-అజ్ఞాన-అవైరాగ్య-అనైశ్వర్యములను పూజింపవలెను.

పీఠమధ్యమునందు సత్త్వాదిగుణత్రయమును, కమలమును, మాయను, అవిద్యను, కాలతత్త్వమును, సూర్యాదిమండలములను, పక్షిరా జైన గరుత్మంతుని పూజింపవలెను. పీఠము వాయవ్యకోణమునుండి ఈశాన్యకోణము వరకు గురుపంక్తిని పూజింపవలెను.

గణః సరస్వతీ పూజ్య నారదో నలకూబరః | 
గురుర్గురోః పాదుకా చ పరో గురుశ్చ పాదుకా. 37

పూర్వసిద్ధాః పరసిద్ధాః కేసరేషు చ శక్తయః | 
లక్ష్మీః సరస్వతీ ప్రీతి కీర్తిః శాన్తిశ్చ కాన్తికా. 38

పుష్టిస్తుష్టిర్మ హేన్ద్రాద్యా మధ్యేచావాహితో హరిః | 
ధృతిశ్రీరతికాన్త్యాద్యా మూలేన స్థాపితోచ్యుతః. 39

ఓం అభిముఖో భ##వేతి ప్రార్థ్య ప్రాచ్యాం సన్నిహితో భవః
విన్యస్యార్ఘ్యాదికం దత్వా గన్ధాద్యైర్మూలతో యజేత్‌. 40

ఓం భీషయ భీషయ హృచ్ఛిరస్త్రాసయ వై పునః | 
మర్దయ మర్దయ శిఖా అగ్న్యాదౌ శస్త్రతో7స్త్రకమ్‌. 41

రక్ష రక్ష ప్రధ్వంసయ ప్రధ్వంసయ కవచాయ నమస్తతః |
ఓం హ్రూం ఫట్‌ అస్త్రాయ నమో మూలబీజేన చాఙ్గకమ్‌. 42

పూర్వదక్షాప్యసౌమ్యేషు మూర్త్యావరణమర్చయేత్‌ |

గణములు, సరస్వతి, నారదుడు, నలకూబరుడు, గురువు, గురుపాదుక. పరమగురువు, ఆతని పాదుక-వీటి పూజయే గురుపంక్తిపూజ. పూర్వసిద్ధ-పరసిద్ధ శక్తులను కేసరములపై పూజింపవలెను. 

లక్ష్మి, సరస్వతి, ప్రీతి, కీర్తి, శాంతి, కాంతి, పుష్టి-; తుష్టి-వీరు పూర్వసిద్ధశక్తులు, పూర్వాది దిక్కులలో క్రమముగ ఈ శక్తుల పూజ చేయవలెను. ఇంద్రాదిదిక్పాలకులను గూడ వారి వారి దిక్కులందు పూజింపవలెను. వీరందరి మధ్యయందు శ్రీహరి విరాజిల్లుచుండును.

ధృతి, శ్రీ రతి, కాంత్యాదులు పరసిద్ధశక్తులు. మూలమంత్రముచే అచ్యుతుని స్థాపింపవలెను. పూజాప్రారంభమున- ''ఓం అభిముఖో భవ'' పూర్వదిక్కున నా సమీపమున నుండు అని భగవంతుని ప్రార్థింపవలెను. 

ఈ విధముగ ప్రార్థించి స్థాపించిన పిమ్మట అర్ఘ్యపాద్యాదులను సమర్పించి, గంధాద్యుపచారముల ద్వారా మూలమంత్రముతో అచ్యుతుని పూజింపవలెను. 

''భీషయ భీషయ హృదయాయ నమః'' ''ఓం త్రాసయ త్రాసయ శిరసే నమః'' ''ఓం మర్దయ మర్దయ శిఖాయై నమః ''ఓం రక్ష రక్ష నేత్రత్రయాయ నమః '' ''ఓం ప్రధ్వంసయ ప్రధ్వంసయ కవచాయ నమః'' ఓం హూం ఫట్‌ అస్త్రాయ నమః'' 

ఈ విధముగ ఆగ్నేయాదివిదిశలయందు క్రమముగా, మూలబీజములతో అంగముల పూజ చేయవలెను. తూర్పు, దక్షిణము, పశ్చిమము, ఉత్తరము ఈ దిక్కులందు మూర్త్యాత్మక ఆవరణముల పూజ చేయవలెను.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #అగ్నిపురాణం

02 Sep 2020

------------------------------------ x ------------------------------------


🌹.   శ్రీ మదగ్ని మహాపురాణము - 85  🌹

✍️. శ్రీ పుల్లెల శ్రీరామచంద్రుడు

ప్రథమ సంపుటము, అధ్యాయము - 33

సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🌻. అథ పవిత్రారోపణ విధానమ్‌‌‌ - 5 🌻

వాసుదేవః సఙ్కర్షణః ప్రద్యుమ్నశ్చానిరుద్దకః. 43

అగ్న్యాదౌ శ్రీధృతిరతికాన్తయో మూర్తయో హరేః | శఙ్ఖచక్రగదాపద్మమగ్న్యాదౌ పూర్వకాదికమ్‌. 44

శార్‌జ్గం చ ముసలం ఖడ్గం వనమాలాం చ తద్బహిః | ఇన్ద్రాద్యాశ్చ తథానన్తో నైరృత్యాం వరుణసత్తః. 45

బ్రహ్మేన్ద్రేశానయోర్మధ్యే అస్త్రావరణకం బహిః | ఐరావతస్తతశ్ఛాగో మహిషో వానరో ఝషః. 46

మృగః శశో7థ వృషభః కూర్మో హంసస్తతో బహిః |

పృశ్నిగర్భః కుముదాద్యా ద్వారపాలా ద్వయం ద్వయమ్‌. 47

పూర్వాద్యుత్త రద్వారాన్తం హరిం నత్వా బలిం బహి ః | విష్ణపార్షదేభ్యో నమో బలిపీఠే బలిం దదేత్‌. 48

విశ్వాయ విష్వక్సేనాత్మనే ఈశానకే యజేత్‌ | దేవస్య దక్షిణ హస్తే రక్షాసూత్రం చ బన్ధయేత్‌. 49

సంవత్సరకృతార్చాయాః సంపూర్ణఫలదాయినే | పవిత్రారోహణాయేదం కౌస్తుభం ధారయ ఓం నమః. 50

ఉపవాసాదినియమం కుర్యాద్వై దేవసన్నిధౌ | ఉపవాసాదినియతో దేవం సంతోషయామ్యహమ్‌. 51

కామక్రోధాదయః సర్వే మా మే తిష్ఠన్తు సర్వధా | అద్యప్రభృతి దేవేశ యావద్వై శేషికం దినమ్‌. 52

యజమానో హ్యశక్త శ్చే త్కుర్యాన్నక్తాదికమ్‌ వ్రతీ | హుత్వావిసర్జయేత్‌ స్తుత్వా శ్రీకరం నిత్యపూజనమ్‌. 53

ఓం హ్రీం శ్రీం శ్రీధరాయ త్రైలోక్యమోహనాయనమః.

ఇత్యాదిమహాపురాణ ఆగ్నేయే పవిత్రారోహణ శ్రీదరనినత్యపూజావిధానం నామ త్రయస్త్రింశో7ధ్యాయః.

వాసుదేవుడు, సంకర్షణుడు, ప్రద్యుమ్నుడు, అనిరుద్ధుడు అని నాలుగుమూర్తులు. అగ్నేయాదివిదిశలయందు క్రమముగ శ్రీ, రతి, ధృతి, కాంతలను పూజింపవలెను.

వీరు కూడ శ్రీహరి మూర్తులే. అగ్న్యాదికోణములందు క్రమముగ శంఖ-చక్ర-గదా-పద్మములను పూజింపవలెను. తూర్పు మొదలైన దిక్కులందు శార్‌జ్గ- మసల - ఖడ్గ - వనమాలలను పూజించవలెను. 

వాటి వెలుపల తూర్పు మొదలగు దిక్కులందు క్రమముగ ఇంద్ర - అగ్ని-యమ-నిర్బతి- వరుణ-వాయు-కుబేర-ఈశానులను పూజించి నైరృతి పశ్చమదిక్కల మధ్య అనంతుని, తూర్పు-ఈశాన్యదిక్కుల మధ్య బ్రహ్మను పూజించవలెను 

వీటి బైట వజ్రము మొదలగు అస్త్రమయఆవరణములను పూజించవలెను. వీటి బైట దిక్పలకుల వాహనరూపములగు ఆవరణములను పూజింపవలెను.

తూర్పు మొదలగు దిక్కులందు క్రమముగ ఐరావతమును, మేకను, దున్నపోతును, వానరుని, మత్స్యమును, మృగమును, చెవులపిల్లిని, వృషభమును, కూర్మమును, హంసను పూజింపవలెను. 

వీటి బయట పృశ్నిగర్భుడు, కుముదుడు మొదలగు ద్వారపాలులను పూజింపలెను. తూర్పు మొదలు ఉత్తరము వరకు, అన్ని దిక్కులందును ఇద్దరిద్దరు ద్వారపాంకులను పూజింపవలెను. 

పిమ్మట శ్రీహరికి నమస్కారము చేసి వెలుపల బలి అర్పింపవలెను. ''ఓం విష్ణుపార్షదేభ్యో నమః '' అను మంత్రము నుచ్చరించుచు విష్ణుపీఠముపై వారలకు బలి అర్పింపవలెను. 

ఈశానదిక్కునందు ''ఓం విశ్వాయ విష్వక్సేనాయ నమః'' అను మంత్రముచే విష్వక్సేనపూజ చేయవలెను. పిమ్మట దేవుని కుడిచేతికి రక్షాసూత్రము కట్టవలెను. ఆ సమయమున ఆ భగవంతునితో ఇట్లు చెప్పవలెను-

''దేవా! ఒక సంత్సరముపాటు నిరంతరము జరుగు మీ పూజయొక్క సంపూర్ణఫలము లభించుటకై జరుప నున్న పవిత్రారోపణకర్మకొరకై ఈ కౌతుకసూత్రమును ధరింపుము. ఓం నమః''. పిమ్మట భగవంతుని సమీపమున ఉపవాసాది నియమములను అవలంబించి ఇట్లు చెప్పవలెను.

''నేను నియమపూర్వకముగ ఉపవాసాదులు చేసి ఇష్టదేవతకు సంతోషము కలిగింపగలను. దేవేశ్వరా! నేడు మొదలు వైశేషిక ఉత్సవ దివసము వరకును కామక్రోధాదిదోషము లేవియు నా వద్దకు రాకుండు గాక''. 

వ్రతమును స్వీకరించిన యజమానుడు ఉపవాసముచేయు సామర్థ్యము లేని పక్షమున నక్తవ్రతము (రాత్రిమాత్రమే భోజనము చేయుట) ఆచరించవలెను. హవనము చేసి భగవంతునిస్తోత్రము చేసిన పిమ్మట భగవంతుని ఉద్వాసన చెప్పవలెను.

భగవంతుని నిత్యపూజ చేసి చో లక్ష్మి ప్రాప్తించును. భగవంతుని పూజించుటకై ''ఓం హ్రీం శ్రీం శ్రీధరాయ త్రైలోక్యమోహనాయ నమః'' అనునది మంత్రము.

శ్రీ అగ్ని మహాపురాణమునందు పవిత్రారోపణమున శ్రీధరనిత్యపూజావిధాన మను ముప్పదిమూడవ అధ్యాయము సమాప్తము.

సశేషం... 
🌹 🌹 🌹 🌹 🌹

#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #అగ్నిపురాణం

03.Sep.2020

------------------------------------ x ------------------------------------

------------------------------------ x ------------------------------------

No comments:

Post a Comment