శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 323 -1 / Sri Lalitha Chaitanya Vijnanam - 323-1


🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 323 -1 / Sri Lalitha Chaitanya Vijnanam - 323-1 🌹

🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻

✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

మూల మంత్రము :

🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁

🍀 73. కామ్యా, కామకళారూపా, కదంబ కుసుమ ప్రియా ।
కళ్యాణీ, జగతీకందా, కరుణారస సాగరా ॥ 73 ॥ 🍀

🌻 323-1. 'కదంబ కుసుమప్రియా'🌻

కదంబ పుష్పముల యందు ప్రీతి కలది శ్రీమాత అని అర్థము. కదంబ మనగా సిందూర వర్ణము అని ఒక అర్థము కలదు. కదంబ పుష్పములు గోళాకారము, సిందూర వర్ణము కలిగి యుండును. సిందూర వర్ణము యందు పసుపు సిందూరము, ఎఱుపు సిందూరము కూడ గలవు. ఈ వర్ణము భావలోక పవిత్రతకు చిహ్నము. భావ లోకమునందు పరిపూర్ణమగు పవిత్రత శ్రీదేవి సాన్నిధ్యము. ఈ వర్ణ తరంగములను ధ్యానించిన భావమాలిన్యములు నిర్మూలింపబడును.

అపుడు బుద్ధి లోకము అందుబాటులో నుండును. పవిత్రమగు కదంబ పుష్పముల వంటి మనస్సు గల వారందరూ శ్రీమాత ప్రీతిపాత్రులే. పవిత్రమగు మనస్సులే కదంబ కుసుమములు. వాని యందే శ్రీమాతకు ప్రీతి. శ్రీమాతను పూజించుటకు కూడ ఈ వర్ణము పూవులను మిక్కుటముగ వాడుట సంప్రదాయము. అట్టి వర్ణ పుష్పములు పవిత్రములు గనుక వానితో చేయు పూజ వలన శ్రీమాత ప్రీతి చెందగలదు.


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 323-1 🌹

Contemplation of 1000 Names of Sri Lalitha Devi

✍️. Ravi Sarma
📚. Prasad Bharadwaj

🌻 73. Kamya kamakalarupa kadanba kusumapriya
Kalyani jagatikanda karunarasasagara ॥ 73 ॥ 🌻

🌻 323-1. Kadamba-kusuma-priyā कदम्ब-कुसुम-प्रिया (323)🌻

She is fond of kadamba flowers, amidst the tress of which She lives (nāma 60). The same nāma appears in Lalitā Triśatī as nāma 11. Lalitā Triśatī consists of 300 nāma-s. This 300 is arrived at by multiplying fifteen bīja-s of Pañcadaśī by twenty. The first bīja in Pañcadaśī is ‘ka’ (क). The first twenty nāma-s begin with this bīja and the next twenty nāma-s begin with next alphabet of Pañcadaśī ‘e’ (ए). Triśatī is considered very powerful as it originates from the Pañcadaśī mantra.

There are said to be five types of sacred trees and kadamba tree is one among them. These five sacred trees said to represent the four components of antaḥkaraṇa viz. mind, intellect, consciousness and ego and the fifth being the heart where the soul is said to reside (Some modern interpretations point out that the soul resides within the pineal gland, the gland of divinity). The smell of these flowers is compared to the modifications of the mind.


Continues...

🌹 🌹 🌹 🌹 🌹


26 Nov 2021

నిర్మల ధ్యానాలు - ఓషో - 100


🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 100 🌹

✍️. సౌభాగ్య
📚. ప్రసాద్ భరద్వాజ

🍀. దేవుడికి చీకటి తెలీదు. మనకు చీకటి ఒకటే తెలుసు. అందుకనే దేవుడితో మనకు సంబంధం వుండదు. మనం కూడా ఎక్కడ చీకటి అంతమవుతుందో కేవలం కాంతి మాత్రమే వుంటుందో ఆ కేంద్రానికి చేరాలి. 🍀

దేవుడికి చీకటి లేదు. కాంతికి చీకటి లేదు. కాంతి లేనపుడు మాత్రమే చీకటి వుంటుంది. అందువల్ల ఆ రెండూ కలవవు. కాంతికి చీకటి వుందనే విషయమే తెలీదు. కాంతికి ఎట్లా తెలుస్తుంది? ఎందుకంటే కాంతి వుంటే చీకటి వుండదు. అది లేనపుడే చీకటి వుంటుంది. దేవుడికి చీకటి తెలీదు. మనకు చీకటి ఒకటే తెలుసు.

అందుకనే దేవుడితో మనకు సంబంధం వుండదు. మనం కూడా ఎక్కడ చీకటి అంతమవుతుందో కేవలం కాంతి మాత్రమే వుంటుందో ఆ కేంద్రానికి చేరాలి. ఆ రోజు చీకటి మన నించీ మాయమయిన రోజు. ఆ రోజు మనకు గొప్ప ఉత్సవం కలిగే రోజు. మనకు గొప్ప ఆశీర్వాదం దొరికే రోజు. ఆ రోజు ఏదంటే నువ్వు కాంతి అని తెలుసుకున్న రోజు.

సశేషం ...

🌹 🌹 🌹 🌹 🌹


26 Nov 2021

మైత్రేయ మహర్షి బోధనలు - 33


🌹. మైత్రేయ మహర్షి బోధనలు - 33 🌹

✍️. రచన : సద్గురు కె. పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🌻 22. క్రమము - క్రతువు 🌻

దైనందిన జీవనము ఒక క్రతువు వలె క్రమబద్ధము కావలెను. క్రమమే క్రతువునకు బలము. క్రమమే జీవనమునకు కూడ బలము. శ్రమ జీవనము క్రమ జీవనగముగ ఉత్తీర్ణత చెందవలెను. క్రమమబ్బిన వారికి పరమబ్బుట సాధ్యము కదా! దైనందిన కార్యక్రమములకు ఒక క్రమమేర్పరచుటకు ప్రయత్నించుము. అట్టి ప్రయత్నము విసుగు వచ్చుట సహజము. ఓర్పుతో విసుగును జయించ వలెను.

శ్రద్ధ, ఓర్పు విసుగునకు విరుగుడు. అటులనే విసుగు శ్రద్ధా ఓర్పులకు మరణము. జీవితమున క్రమమేర్పరచినపుడు నీ యందు ఘర్షణ కూడ కలుగ గలదు. ఘర్షణము స్వభావమును మధనము చేయు శక్తి. మథనము నందు కూడ క్రమమును విడువకుము. క్రమవంతుడు చైతన్యమున పెరుగును. అనగా వికాసము చెందుట, వ్యాపించుట అతడికి జరుగ గలవు. క్రమము చేత పరమును కూడ ఆక్రమించ వచ్చును. అతడే నిజమైన పరాక్రమవంతుడు. అనగా క్రమమాధారముగ పరమును కూడ ఆక్రమించిన వాడని అర్థము. అగస్త్యాదులు అట్టివారు.


సశేషం.....

🌹 🌹 🌹 🌹 🌹


26 Nov 2021

విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 516 / Vishnu Sahasranama Contemplation - 516


🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 516 / Vishnu Sahasranama Contemplation - 516 🌹

📚. ప్రసాద్ భరద్వాజ

🌻 516. అమిత విక్రమః, अमित विक्रमः, Amita vikramaḥ 🌻

ఓం అమితవిక్రమాయ నమః | ॐ अमितविक्रमाय नमः | OM Amitavikramāya namaḥ

అపరిచ్ఛిన్నోమితో యత్ విక్రమాఽశ్చక్రిణ స్త్రయః ।
అమితో విక్రమశ్శౌర్యం వాస్యేత్యమిత విక్రమః ॥

ఈతనికి ఇంతయని పరిమితి నిర్ణయించనలవికాని పెద్ద పాజ్ఞాసములు మూడు త్రివిక్రమావతారమున (వామనావతారము) కలవు. లేదా ఈతనికి అమితమైన శౌర్యము గలదు.

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹


🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 516 🌹

📚. Prasad Bharadwaj

🌻 516. Amita vikramaḥ 🌻

OM Amitavikramāya namaḥ

अपरिच्छिन्नोमितो यत् विक्रमाऽश्चक्रिण स्त्रयः ।
अमितो विक्रमश्शौर्यं वास्येत्यमित विक्रमः ॥

Aparicchinnomito yat vikramā’ścakriṇa strayaḥ,
Amito vikramaśśauryaṃ vāsyetyamita vikramaḥ.

Whose vikramās i.e., three steps were amitaḥ or unlimited in the Trivikrama or Vāmana incarnation. Or Whose Vikrama or valor is amitam i.e., enormous.

🌻 🌻 🌻 🌻 🌻

Source Sloka

जीवो विनयिता साक्षी मुकुन्दोऽमितविक्रमः ।
अम्भोनिधिरनन्तात्मा महोदधिशयोऽन्तकः ॥ ५५ ॥

జీవో వినయితా సాక్షీ ముకున్దోఽమితవిక్రమః ।
అమ్భోనిధిరనన్తాత్మా మహోదధిశయోఽన్తకః ॥ 55 ॥

Jīvo vinayitā sākṣī mukundo’mitavikramaḥ,
Ambhonidhiranantātmā mahodadhiśayo’ntakaḥ ॥ 55 ॥


Continues....

🌹 🌹 🌹 🌹🌹


26 Nov 2021

26-NOVEMBER-2021 MESSAGES

1) 🌹. నిత్య పంచాంగము Daily Panchangam 26, ఆక్టోబర్ 2021 శుక్ర వారం, భృగువారము, కార్తీక మాసం 22వ రోజు 🌹
2) 🌹. శ్రీమద్భగవద్గీత - 119 / Bhagavad-Gita - 119 2-72🌹*
3) 🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 516 / Vishnu Sahasranama Contemplation - 516 🌹
4) 🌹 DAILY WISDOM - 194🌹 
5) 🌹. మైత్రేయ మహర్షి బోధనలు - 33🌹
6) 🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 100 🌹
7) 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 323-1 / Sri Lalitha Chaitanya Vijnanam - 323-1 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. శుభ శుక్రవారం మిత్రులందరికీ 🌹*
*26, నవంబర్‌ 2021, భృగువారము*
*మీకు ఈ రోజు అంతా కాలం అనుకూలించాలి అని కోరుకుంటూ*
*ప్రసాద్ భరద్వాజ*

*🍀. కార్తీక మాసం 22వ రోజు 🍀*

*నిషిద్ధములు : పంటికి పని చెప్పే పదార్ధాలు*
*దానములు : బంగారం, గోధుమలు, పట్టుబట్టలు*
*పూజించాల్సిన దైవము : సూర్యుడు*
*జపించాల్సిన మంత్రము :*
*ఓం సూం – సౌరయే స్వాహా, ఓం భాం – భాస్కరాయ స్వాహా*
*ఫలితము :- ఆయురారోగ్య తేజో బుద్ధులు*

🌻 🌻 🌻 🌻 🌻

విక్రమ సంవత్సరం: 2078 ఆనంద
శఖ సంవత్సరం: 1943 ప్లవ, 
దక్షిణాయణం, శరద్‌ ఋతువు,  
కార్తీక మాసం
తిథి: కృష్ణ సప్తమి 29:44:49 వరకు 
తదుపరి కృష్ణ అష్టమి 
నక్షత్రం: ఆశ్లేష 20:37:01 వరకు 
తదుపరి మఘ
యోగం: బ్రహ్మ 08:02:06 వరకు 
తదుపరి ఇంద్ర
కరణం: విష్టి 17:13:25 వరకు
వర్జ్యం: 08:35:32 - 10:18:36
దుర్ముహూర్తం: 08:41:28 - 09:26:18 
మరియు 12:25:40 - 13:10:30
రాహు కాలం: 10:39:10 - 12:03:14
గుళిక కాలం: 07:51:01 - 09:15:05
యమ గండం: 14:51:23 - 16:15:28
అభిజిత్ ముహూర్తం: 11:41 - 12:25
అమృత కాలం: 18:53:56 - 20:37:00
సూర్యోదయం: 06:26:57
సూర్యాస్తమయం: 17:39:32
వైదిక సూర్యోదయం: 06:30:46
వైదిక సూర్యాస్తమయం: 17:35:42
చంద్రోదయం: 23:28:52
చంద్రాస్తమయం: 11:55:00
సూర్య సంచార రాశి: వృశ్చికం
చంద్ర సంచార రాశి: కర్కాటకం
మృత్యు యోగం - మృత్యు భయం 
20:37:00 వరకు తదుపరి కాల యోగం
 - అవమానం
పండుగలు : లేదు
🌻 🌻 🌻 🌻 🌻  

*🍀. నిత్య ప్రార్థన 🍀*
*వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ*
*నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా*
*యశివ నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా*
*తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం*
*తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ* 
*విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.*
🌹🌹🌹🌹🌹
#పంచాగముPanchangam 
Join and Share 
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://dailybhakthimessages.blogspot.com

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. శ్రీమద్భగవద్గీత - 119 / Bhagavad-Gita - 119 🌹*
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ

*🌴. ద్వితీయ అధ్యాయము - సాంఖ్య యోగము - 72 🌴*

72. ఏషా బ్రాహ్మీ స్థితి: పార్థ నైనాం ప్రాప్య విముహ్యతి |
స్థిత్వాస్యామన్తకాలే(పి బ్రహ్మనిర్వాణ మృచ్చతి ||

🌷. తాత్పర్యం :
*ఇదియే అధ్యాత్మికమును, దివ్యమును అయిన జీవన విధానము. దీనిని పొందిన పిమ్మట మనుజుడు మోహము నొందడు. మరణ సమయము నందును ఆ విధముగా స్థితుడైనవట్టి వాడు భగవద్రాజ్యమున ప్రవేశింపగలుగును.*

🌷. భాష్యము :
కృష్ణభక్తిభావనము (ఆధ్యాత్మిక జీవనము) మనుజడు క్షణములో పొందవచ్చును లేదా కోట్లాది జన్మలు ఎత్తినను పొందలేక పోవచ్చును. ఇది కేవలము తత్త్వము యొక్క అవగాహన మరియు అంగీకకారముపైననే ఆధారపడి యున్నది. కృష్ణునకు శరణము నొందుట ద్వారా ఖట్వాంగమహారాజు మరణమునకు కొలది నిమిషమునకు ముందే అట్టి జీవనస్థితి పొందగలిగెను. వాస్తవమునకు విషయపూర్ణ జీవనమునకు ముగించుటయే నిర్వాణము. 

భౌతికజీవనము తరువాత మిగులునది శూన్యమని భౌద్ధవాదము తెలుపుచుండగా అందులకు భిన్నముగా శ్రీమద్భగవద్గీత ఉపదేశించుచున్నది. అనగా నిజమైన జీవితము భౌతికజీవితపు అంతము పిమ్మట ఆరంభమగుచున్నది. ఈ భౌతికజీవన విధానము ప్రతి యొక్కరు అంతము చేసికొనియే తీరవలెనని తెలిసికొనుట లౌకికునికి సరిపోవును. కాని ఆధ్యాత్మికముగా పురోభివృద్ధి నొందినవాడు భౌతికజన్మము తదుపరి వేరొక ఆధ్యాత్మికముగా కలదని ఎరుగవలెను. జన్మ ముగియుటకు పూర్వమే మనుజుడు అదృష్టవశమున కృష్ణభక్తిరసభావితుడు అయినచో శీఘ్రమే “బ్రహ్మనిర్వాణస్థితి”ని పొందగలడు. 

భగవద్ధామమునకు మరియు భగవానుని సేవకు భేదము లేదు. ఆ రెండును ఒకే పూర్ణత్వస్థాయిలో ఉన్నట్టివి కనుక భగవానుని సేవయందు నిలుచుట యన్నది భగవద్ధామమును పొందినట్లే యగును. భౌతికజగమునందు ఇంద్రియప్రీతి కర్మలుండగా అధ్యాత్మికజగమున కృష్ణపరకర్మలుండును. ఈ జన్మమునందే కృష్ణభక్తిని పొందుట యనునది శీఘ్రమే బ్రహ్మస్థితిని కలుగజేయును. కనుకనే కృష్ణభక్తిరసభావితుడు భగవద్రాజ్యమున నిశ్చయముగా ప్రవేశించినట్టివాడే యగుచున్నాడు.

బ్రహ్మము భౌతికత్వమునకు వ్యతిరేకమైనది. కనుక “బ్రహ్మీస్థితి” యనగా భౌతిక కర్మకలాపములను కూడిన స్థాయిలో నిలువకుండుట యని అర్థము. శ్రీకృష్ణభగవానునికి ఒనర్చబడు భక్తియుక్తసేవ ముక్తస్థితిగా భగవద్గీత యందు అంగీకరింపబడినది (సగుణాన్ సమతీత్యైతాన్ బ్రహ్మభూయాయ కల్పతే). కనుకనే బ్రాహ్మీస్థితి భౌతికబంధముల నుండి ముక్తిని పొందినట్టి స్థితియై యున్నది.

భగవద్గీత యొక్క ఈ ద్వితీయాధ్యాయము గీతాసారమని శ్రీల భక్తివినోదఠాకూరులు తెలిపియుండిరి. కర్మయోగము, జ్ఞానయోగము, భక్తియోగములనునవి భగవద్గీత యందలి చర్చనీయాంశములు. ఈ ద్వితీయధ్యాయమున గీతాసారాంశముగా కర్మయోగము, జ్ఞానయోగము స్పష్టముగా చర్చించబడి భక్తియోగము కొద్దిగా సూచించబడినది.

శ్రీమద్భగవద్గీత యందలి “గీతాసారము” అను ద్వితీయాధ్యాయమునకు భక్తివేదాంతభాష్యము సమాప్తము.
🌹 🌹 🌹 🌹 🌹 

*🌹 Bhagavad-Gita as It is - 119 🌹*
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj

*🌴 Chapter 2 - Sankhya Yoga - 72 🌴*

72. eṣā brāhmī sthitiḥ pārtha naināṁ prāpya vimuhyati
sthitvāsyām anta-kāle ’pi brahma-nirvāṇam ṛcchati

🌷Translation :
*That is the way of the spiritual and godly life, after attaining which a man is not bewildered. If one is thus situated even at the hour of death, one can enter into the kingdom of God.*

🌷 Purport :
One can attain Kṛṣṇa consciousness or divine life at once, within a second – or one may not attain such a state of life even after millions of births. It is only a matter of understanding and accepting the fact. Khaṭvāṅga Mahārāja attained this state of life just a few minutes before his death, by surrendering unto Kṛṣṇa. Nirvāṇa means ending the process of materialistic life. According to Buddhist philosophy, there is only void after the completion of this material life, but Bhagavad-gītā teaches differently. 

Actual life begins after the completion of this material life. For the gross materialist it is sufficient to know that one has to end this materialistic way of life, but for persons who are spiritually advanced, there is another life after this materialistic life. Before ending this life, if one fortunately becomes Kṛṣṇa conscious, he at once attains the stage of brahma-nirvāṇa. There is no difference between the kingdom of God and the devotional service of the Lord.

Thus end the Bhaktivedanta Purports to the Second Chapter of the Śrīmad Bhagavad-gītā in the matter of its Contents.
🌹 🌹 🌹 🌹 🌹
#భగవద్గీత #BhagavadGita #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share 
🌹. భగవద్గీత BhagavadGita Telegram, FB Groups 🌹
https://t.me/bhagavadgeethaa/
www.facebook.com/groups/bhagavadgeethaa/
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/chaitanyavijnanam/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 516 / Vishnu Sahasranama Contemplation - 516 🌹*
📚. ప్రసాద్ భరద్వాజ

*🌻 516. అమిత విక్రమః, अमित विक्रमः, Amita vikramaḥ 🌻*

*ఓం అమితవిక్రమాయ నమః | ॐ अमितविक्रमाय नमः | OM Amitavikramāya namaḥ*

*అపరిచ్ఛిన్నోమితో యత్ విక్రమాఽశ్చక్రిణ స్త్రయః ।*
*అమితో విక్రమశ్శౌర్యం వాస్యేత్యమిత విక్రమః ॥*

*ఈతనికి ఇంతయని పరిమితి నిర్ణయించనలవికాని పెద్ద పాజ్ఞాసములు మూడు త్రివిక్రమావతారమున (వామనావతారము) కలవు. లేదా ఈతనికి అమితమైన శౌర్యము గలదు.*

సశేషం... 
🌹 🌹 🌹 🌹 🌹 

*🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 516 🌹*
📚. Prasad Bharadwaj

*🌻 516. Amita vikramaḥ 🌻*

*OM Amitavikramāya namaḥ*

अपरिच्छिन्नोमितो यत् विक्रमाऽश्चक्रिण स्त्रयः ।
अमितो विक्रमश्शौर्यं वास्येत्यमित विक्रमः ॥

*Aparicchinnomito yat vikramā’ścakriṇa strayaḥ,*
*Amito vikramaśśauryaṃ vāsyetyamita vikramaḥ.*

*Whose vikramās i.e., three steps were amitaḥ or unlimited in the Trivikrama or Vāmana incarnation. Or Whose Vikrama or valor is amitam i.e., enormous.*

🌻 🌻 🌻 🌻 🌻 
Source Sloka
जीवो विनयिता साक्षी मुकुन्दोऽमितविक्रमः ।
अम्भोनिधिरनन्तात्मा महोदधिशयोऽन्तकः ॥ ५५ ॥

జీవో వినయితా సాక్షీ ముకున్దోఽమితవిక్రమః ।
అమ్భోనిధిరనన్తాత్మా మహోదధిశయోఽన్తకః ॥ 55 ॥

Jīvo vinayitā sākṣī mukundo’mitavikramaḥ,
Ambhonidhiranantātmā mahodadhiśayo’ntakaḥ ॥ 55 ॥

Continues....
🌹 🌹 🌹 🌹🌹
#విష్ణుసహస్రనామతత్వవిచారణ #VishnuSahasranamacontemplation #విష్ణుసహస్రనామములు #VishnuSahasranama #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
https://t.me/vishnusahasranaam
www.facebook.com/groups/vishnusahasranaam/
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/chaitanyavijnanam/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹 DAILY WISDOM - 194 🌹*
*🍀 📖 The Spiritual Import of the Mahabharata and the Bhagavadgita 🍀*
*📝 Swami Krishnananda*
*📚. Prasad Bharadwaj*

*🌻 12. How Could There be Sorrow for the Spirit? 🌻*

*There is such a thing called the sorrow of the spirit, though it may look like an anomaly. How could there be sorrow for the spirit? Yes, there is some kind of situation in which our deeper self finds itself in its search for the Absolute. These are all interesting stages that are in mystical theology and the yoga of the advent of the spirit.*

*Some of the songs and poems of the Vaishnava saints of the south, the Alvars, particularly the Nawars, and some of the rapturous expressions of the leading Shaivite saints, will be enough examples to us of the inexpressible and intricate spiritual processes through which the seeker has to pass. We are accustomed merely to a little japa, a little study of the Gita that we chant and repeat by rote every day like a machine, and we feel that our work is over, that we have done our sadhana.*

*The deeper spirit has to be touched, and it has to be dug out like an imbedded illness. When it is pulled out there is a reaction, and the reaction is a spiritual experience by itself, through which Arjuna had to pass. A little of it is given to us in the first chapter and the earlier portions of the second chapter of the Bhagavadgita.*

Continues...
🌹 🌹 🌹 🌹 🌹
#DailyWisdom #SwamiKrishnananda
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share 
🌹. Daily satsang Wisdom 🌹 
www.facebook.com/groups/dailysatsangwisdom/
https://t.me/Seeds_Of_Consciousness
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://pyramidbook.in/Chaitanyavijnanam

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. మైత్రేయ మహర్షి బోధనలు - 33 🌹* 
*✍️. రచన : సద్గురు కె. పార్వతి కుమార్*
 *సేకరణ : ప్రసాద్ భరద్వాజ *

*🌻 22. క్రమము - క్రతువు 🌻*

*దైనందిన జీవనము ఒక క్రతువు వలె క్రమబద్ధము కావలెను. క్రమమే క్రతువునకు బలము. క్రమమే జీవనమునకు కూడ బలము. శ్రమ జీవనము క్రమ జీవనగముగ ఉత్తీర్ణత చెందవలెను. క్రమమబ్బిన వారికి పరమబ్బుట సాధ్యము కదా! దైనందిన కార్యక్రమములకు ఒక క్రమమేర్పరచుటకు ప్రయత్నించుము. అట్టి ప్రయత్నము విసుగు వచ్చుట సహజము. ఓర్పుతో విసుగును జయించ వలెను.*

శ్రద్ధ, ఓర్పు విసుగునకు విరుగుడు. అటులనే విసుగు శ్రద్ధా ఓర్పులకు మరణము. జీవితమున క్రమమేర్పరచినపుడు నీ యందు ఘర్షణ కూడ కలుగ గలదు. ఘర్షణము స్వభావమును మధనము చేయు శక్తి. మథనము నందు కూడ క్రమమును విడువకుము. క్రమవంతుడు చైతన్యమున పెరుగును. అనగా వికాసము చెందుట, వ్యాపించుట అతడికి జరుగ గలవు. క్రమము చేత పరమును కూడ ఆక్రమించ వచ్చును. అతడే నిజమైన పరాక్రమవంతుడు. అనగా క్రమమాధారముగ పరమును కూడ ఆక్రమించిన వాడని అర్థము. అగస్త్యాదులు అట్టివారు.*

*సశేషం.....*
🌹 🌹 🌹 🌹 🌹
#మైత్రేయమహర్షిబోధనలు #MaitreyaMaharshi #సద్గురుపార్వతీకుమార్ #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share
భారతీయ మహర్షుల బోధనలు Maharshula Wisdom 
www.facebook.com/groups/maharshiwisdom/
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 100 🌹*
✍️. సౌభాగ్య
📚. ప్రసాద్ భరద్వాజ

*🍀. దేవుడికి చీకటి తెలీదు. మనకు చీకటి ఒకటే తెలుసు. అందుకనే దేవుడితో మనకు సంబంధం వుండదు. మనం కూడా ఎక్కడ చీకటి అంతమవుతుందో కేవలం కాంతి మాత్రమే వుంటుందో ఆ కేంద్రానికి చేరాలి. 🍀*

*దేవుడికి చీకటి లేదు. కాంతికి చీకటి లేదు. కాంతి లేనపుడు మాత్రమే చీకటి వుంటుంది. అందువల్ల ఆ రెండూ కలవవు. కాంతికి చీకటి వుందనే విషయమే తెలీదు. కాంతికి ఎట్లా తెలుస్తుంది? ఎందుకంటే కాంతి వుంటే చీకటి వుండదు. అది లేనపుడే చీకటి వుంటుంది. దేవుడికి చీకటి తెలీదు. మనకు చీకటి ఒకటే తెలుసు.*

*అందుకనే దేవుడితో మనకు సంబంధం వుండదు. మనం కూడా ఎక్కడ చీకటి అంతమవుతుందో కేవలం కాంతి మాత్రమే వుంటుందో ఆ కేంద్రానికి చేరాలి. ఆ రోజు చీకటి మన నించీ మాయమయిన రోజు. ఆ రోజు మనకు గొప్ప ఉత్సవం కలిగే రోజు. మనకు గొప్ప ఆశీర్వాదం దొరికే రోజు. ఆ రోజు ఏదంటే నువ్వు కాంతి అని తెలుసుకున్న రోజు.*

సశేషం ...
🌹 🌹 🌹 🌹 🌹
#ఓషోబోధనలు #OshoDiscourse #OshoDailyMeditations #ఓషోనిర్మలధ్యానములు #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share 
🌹 ఓషో బోధనలు - Osho Teachings 🌹
https://t.me/ChaitanyaVijnanam 
http://www.facebook.com/groups/oshoteachings/
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://pyramidbook.in/Chaitanyavijnanam

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 323 -1 / Sri Lalitha Chaitanya Vijnanam - 323-1 🌹*
*🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻*
*✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*మూల మంత్రము :*
*🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁*

*🍀 73. కామ్యా, కామకళారూపా, కదంబ కుసుమ ప్రియా ।
కళ్యాణీ, జగతీకందా, కరుణారస సాగరా ॥ 73 ॥ 🍀*

*🌻 323-1. 'కదంబ కుసుమప్రియా'🌻* 

*కదంబ పుష్పముల యందు ప్రీతి కలది శ్రీమాత అని అర్థము. కదంబ మనగా సిందూర వర్ణము అని ఒక అర్థము కలదు. కదంబ పుష్పములు గోళాకారము, సిందూర వర్ణము కలిగి యుండును. సిందూర వర్ణము యందు పసుపు సిందూరము, ఎఱుపు సిందూరము కూడ గలవు. ఈ వర్ణము భావలోక పవిత్రతకు చిహ్నము. భావ లోకమునందు పరిపూర్ణమగు పవిత్రత శ్రీదేవి సాన్నిధ్యము. ఈ వర్ణ తరంగములను ధ్యానించిన భావమాలిన్యములు నిర్మూలింపబడును.*

*అపుడు బుద్ధి లోకము అందుబాటులో నుండును. పవిత్రమగు కదంబ పుష్పముల వంటి మనస్సు గల వారందరూ శ్రీమాత ప్రీతిపాత్రులే. పవిత్రమగు మనస్సులే కదంబ కుసుమములు. వాని యందే శ్రీమాతకు ప్రీతి. శ్రీమాతను పూజించుటకు కూడ ఈ వర్ణము పూవులను మిక్కుటముగ వాడుట సంప్రదాయము. అట్టి వర్ణ పుష్పములు పవిత్రములు గనుక వానితో చేయు పూజ వలన శ్రీమాత ప్రీతి చెందగలదు.*

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 323-1 🌹*
*Contemplation of 1000 Names of Sri Lalitha Devi* 
*✍️. Ravi Sarma *
*📚. Prasad Bharadwaj*

*🌻 73. Kamya kamakalarupa kadanba kusumapriya
Kalyani jagatikanda karunarasasagara ॥ 73 ॥ 🌻*

*🌻 323-1. Kadamba-kusuma-priyā कदम्ब-कुसुम-प्रिया (323)🌻*

*She is fond of kadamba flowers, amidst the tress of which She lives (nāma 60). The same nāma appears in Lalitā Triśatī as nāma 11. Lalitā Triśatī consists of 300 nāma-s. This 300 is arrived at by multiplying fifteen bīja-s of Pañcadaśī by twenty. The first bīja in Pañcadaśī is ‘ka’ (क). The first twenty nāma-s begin with this bīja and the next twenty nāma-s begin with next alphabet of Pañcadaśī ‘e’ (ए). Triśatī is considered very powerful as it originates from the Pañcadaśī mantra.*

*There are said to be five types of sacred trees and kadamba tree is one among them. These five sacred trees said to represent the four components of antaḥkaraṇa viz. mind, intellect, consciousness and ego and the fifth being the heart where the soul is said to reside (Some modern interpretations point out that the soul resides within the pineal gland, the gland of divinity). The smell of these flowers is compared to the modifications of the mind.*

Continues...
🌹 🌹 🌹 🌹 🌹
#శ్రీలలితాసహస్రనామచైతన్యవిజ్ఞానము #SriLalithaChaitanyaVijnanam #లలితాసహస్రనామములు #LalithaSahasranama
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share 
🌹. శ్రీ లలితా దేవి చైతన్యము Sri Lalitha Devi Chatanyam 🌹
https://t.me/srilalithachaitanyavijnanam
http://www.facebook.com/groups/srilalithachaitanyavijnanam/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

25-NOVEMBER-2021 MESSAGES

1) 🌹. నిత్య పంచాంగము Daily Panchangam 25, గురువారం, నవంబర్ 2021  బృహస్పతి వారము 🌹
🍀. కార్తీక మాసం 21వ రోజు 🍀

2) 🌹. గీతోపనిషత్తు - సాంఖ్య యోగము - 281 🌹  
3) 🌹. శివ మహా పురాణము - 480🌹 
4) 🌹 వివేక చూడామణి - 157 / Viveka Chudamani - 157🌹
5)🌹. మాస్టర్ ఇ.కె సందేశాలు -109🌹  
6) 🌹 Osho Daily Meditations - 98🌹
7) 🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 157 / Sri Lalitha Sahasra Namaavali - Meaning - 157 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. శుభ గురువారం మిత్రులందరికీ 🌹*
*25, నవంబర్‌ 2021, బృహస్పతి వారము*
*మీకు ఈ రోజు అంతా కాలం అనుకూలించాలి అని కోరుకుంటూ*
*ప్రసాద్ భరద్వాజ*

*🍀. కార్తీక మాసం 21వ రోజు 🍀*

నిషిద్ధములు : ఉల్లి, ఉసిరి, ఉప్పు, పులుపు, కారం
దానములు : యథాశక్తి సమస్త దానాలూ
పూజించాల్సిన దైవము : 
కుమారస్వామి
జపించాల్సిన మంత్రము : 
ఓం సాం శరవణ భవాయ కుమారాయ స్వాహా
ఫలితము : సత్సంతానసిద్ధి, జ్ఞానం, దిగ్విజయం

🌻 🌻 🌻 🌻 🌻

విక్రమ సంవత్సరం: 2078 ఆనంద
శఖ సంవత్సరం: 1943 ప్లవ, 
దక్షిణాయణం, శరద్‌ ఋతువు,  
కార్తీక మాసం
తిథి: కృష్ణ షష్టి 28:43:33 వరకు
తదుపరి కృష్ణ సప్తమి
నక్షత్రం: పుష్యమి 18:50:46 
వరకు తదుపరి ఆశ్లేష
యోగం: శుక్ల 07:57:09 వరకు 
తదుపరి బ్రహ్మ
కరణం: గార 15:54:00 వరకు
వర్జ్యం: 01:17:20 - 03:02:36
దుర్ముహూర్తం: 10:10:44 - 10:55:37 
మరియు 14:39:59 - 15:24:52
రాహు కాలం: 13:27:04 - 14:51:12
గుళిక కాలం: 09:14:38 - 10:38:47
యమ గండం: 06:26:22 - 07:50:30
అభిజిత్ ముహూర్తం: 11:40 - 12:24
అమృత కాలం: 11:48:56 - 13:34:12
సూర్యోదయం: 06:26:22
సూర్యాస్తమయం: 17:39:29
వైదిక సూర్యోదయం: 06:30:10
వైదిక సూర్యాస్తమయం: 17:35:40
చంద్రోదయం: 22:35:13
చంద్రాస్తమయం: 11:11:29
సూర్య సంచార రాశి: వృశ్చికం
చంద్ర సంచార రాశి: కర్కాటకం
శుభ యోగం - కార్య జయం 18:50:46 
వరకు తదుపరి అమృత యోగం - 
కార్య సిధ్ది 
పండుగలు : లేదు
🌻 🌻 🌻 🌻 🌻  

*🍀. నిత్య ప్రార్థన 🍀*
*వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ*
*నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా*
*యశివ నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా*
*తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం*
*తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ* 
*విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.*
🌹🌹🌹🌹🌹
#పంచాగముPanchangam 
Join and Share 
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://dailybhakthimessages.blogspot.com

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. గీతోపనిషత్తు -281 🌹*
*✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*📚. 9వ అధ్యాయము - రాజవిద్య రాజగుహ్య యోగము 📚*
శ్లోకము 14-1
 
*🍀 14-1. మహాత్ములు - మహాత్ముల లక్షణములు : 1. భగవంతుని ఈశ్వరత్వము తెలిసి యుండుట. 2. అన్నిటికి మూలము అతడేయని తెలిసియుండుట. 3. అన్యమేదియు లేదని నిశ్చయముగ తెలిసి యుండుట. 4. నిత్యమతని దర్శించు ప్రయత్నమున నుండుట. 5. దైవదర్శన ప్రయత్నమే దృఢమగు వ్రతముగ నుండుట. 6. అన్నిట, అంతట నిండియున్న దైవమునకు నామ రూపాది భేదములు లేక మనస్సున నమస్కరించు కొనుట. 7. అతని లీలావైభవములు దర్శించుచు నిత్యము కొనియాడు చుండుట. 8. నిత్యము దైవీతత్త్వముతో ప్రజ్జాపరముగ కూడి యుండుట. 9. భక్తి శ్రద్ధలతో ఆ తత్త్వమునకు అత్యంత సమీపమున వసించి యుండుట. 🍀*

సతతం కీర్తయంతో మాం యతంతశ్చ దృఢవ్రతాః |
నమస్యంతశ్చ మాం భక్త్యా నిత్యయుక్తా ఉపాసతే || 14

*తాత్పర్యము : దైవీ ప్రకృతి నాశ్రయించిన వారిని గూర్చి ముందు శ్లోకమున తెలుపబడినది. వారి లక్షణములు మరికొన్ని ఈ శ్లోకమున దైవము తెలియజేయుచున్నాడు. ముందు శ్లోకమున మహాత్ములు దైవమును భూతము లన్నిటికిని మూలమని, అది అవ్యయమగు తత్త్వమని తెలిసి అన్యము లేని మనసుతో వానిని నిత్యము సేవించు చుందురని తెలిపెను.* 

*వివరణము : ఈ శ్లోకమున వారు నిత్యము దైవ దర్శన యత్నముననే యుందురని (యతంతః), ఆ ప్రయత్నమే దృఢమగు వ్రతముగ ఏర్పరచుకొని యుందురని, (దృఢవ్రతః), సతతము అన్నిట, అంతట ఆ దైవీ తత్త్వమునే దర్శించుచు, కీర్తించుచు నుందురని (సతతం కీర్తయంత?), సమస్తము నందు దర్శింపబడుచున్న దైవమునకు మనస్సున నమస్కరించుచు నుందురని (నమస్యంతి), నిత్యము ఆ విధముగ దైవముతోనే కూడియుందురని (నిత్యయుక్తః), భక్తితో ఈశ్వరునకు అతి చేరువగ వసింతురని (భక్త్యా ఉపాసతే) తెలుప బడుచున్నది.* 

*మహాత్ముల లక్షణములు 13, 14 శ్లోకములలో ఈ క్రింది విధముగ తెలుపబడినవి.*

*1. భగవంతుని ఈశ్వరత్వము తెలిసి యుండుట.*
*2. అన్నిటికి మూలము అతడేయని తెలిసియుండుట.*
*3. అన్యమేదియు లేదని నిశ్చయముగ తెలిసి యుండుట.*
*4. నిత్యమతని దర్శించు ప్రయత్నమున నుండుట.*
*5. దైవదర్శన ప్రయత్నమే దృఢమగు వ్రతముగ నుండుట.*
*6. అన్నిట, అంతట నిండియున్న దైవమునకు నామ రూపాది భేదములు లేక మనస్సున నమస్కరించు కొనుట.*
*7. అతని లీలావైభవములు దర్శించుచు నిత్యము కొనియాడు చుండుట.*
*8. నిత్యము దైవీతత్త్వముతో ప్రజ్జాపరముగ కూడి యుండుట.*
*9. భక్తి శ్రద్ధలతో ఆ తత్త్వమునకు అత్యంత సమీపమున వసించి యుండుట.*

*సశేషం...*
🌹 🌹 🌹 🌹 🌹
#గీతోపనిషత్ #సద్గురుపార్వతీకుమార్
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share 
🌹. భగవద్గీత BhagavadGita Telegram, FB Groups 🌹
https://t.me/bhagavadgeethaa/
www.facebook.com/groups/bhagavadgeethaa/
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/chaitanyavijnanam/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 . శ్రీ శివ మహా పురాణము - 480 🌹* 
రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ

*🌴. రుద్ర సంహితా - పార్వతీ ఖండః 🌴* 
అధ్యాయము - 36

*🌻. సప్తర్షుల ఉపదేశము - 2 🌻*

బ్రహ్మ ఇట్లు పలికెను-

ఈ హిమవంతుడు ఇట్లు పలికి తన కుమార్తెను ప్రేమతో వీక్షించి ఆమెను ఆలంకరింపజేసి మహర్షియొక్క ఒడిలో కూర్చుండబెట్టెను (12). ఆ పర్వరాజు మరల ఆ ఋషులతో నిట్లనెను: ఈ భాగమును నేను శివునకు ఇచ్చు చున్నాను. ఇది నిశ్చితము (13).

ఋషులిట్లు పలికిరి-

ఓ పర్వతరాజా! యాచించువాడు శంకరుడు. దాత స్వయముగా నీవే. యాచింపబడునది పార్వతీదేవి. ఇంతకంటె శ్రేష్ఠమగు సన్నివేశము మరి యేమి గలదు? (14) ఓ హిమవంతుడా! నీ ప్రవర్తన నీ శిఖరముల వలె ఉన్నతమై యున్నది. పర్వతములన్నింటికి అధిపతివగు నీవు అందరికంటె శ్రేష్ఠుడవు. నీవు ధన్యుడవు (15).

బ్రహ్మ ఇట్లు పలికెను-

పవిత్ర హృదయముగల ఆ మహర్షులు ఇట్లు పలికి, 'శివునకు సుఖమును ఇమ్ము' అని పార్వతిని ఆశీర్వదించిరి (16). 'నీకు మంగళము కలుగు గాక! శుక్ల పక్ష చంద్రునివలె నీ గుణములు వృద్ధి పొందును గాక!' అని వారు పార్వతిని చేతితో స్పృశించి ఆశీర్వదించిరి (17). ఆ మహర్షులందు ఇట్లు పలికి హిమవంతునకు పుష్పములను, ఫలములను ఆనందముతో సమర్పించి విశ్వాసమును కలిగించిరి (18). గొప్ప శివభక్తురాలు, సాధ్వి, సుందరి అగు అరుంధతి ఆ సమయములో అచట మేనను తన గుణసంపదచే తన వశము చేసుకొనెను (19).

ఆమె మంగళములకు నిలయము ఉత్తమము అగు లోకాచారము ననుసరించి హిమవంతుని మీసములకు పసుపు కుంకుమల లేపమును చేసెను (20). తరువాత వారు నాల్గవ దినమున ఉత్తమ లగ్నమును నిర్ణయించి పరస్పరము సన్మానించుకొని శివుని సన్నిధికి వెళ్లిరి (21). వసిష్ఠాది ఋషులందరు కైలాసమునకు వెళ్లి శివునకు నమస్కరించి అనేక సూక్తులచే స్తుతించి పరమేశ్వరునితో నిట్లనిరి (22).

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
#శివమహాపురాణము #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share 
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://t.me/ChaitanyaVijnanam
https://pyramidbook.in/Chaitanyavijnanam

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. వివేక చూడామణి - 157 / Viveka Chudamani - 157🌹*
✍️ రచన : *పేర్నేటి గంగాధర రావు*
సేకరణ : ప్రసాద్ భరద్వాజ 

*🍀. 32. నేను బ్రహ్మాన్ని తెలుసుకొన్నవాడిని -4 🍀*

*515. నేను ఏవిధమైన కర్మ చేయని, మార్పులేని, విభజనకు వీలులేని, ఆకారములేని, పూర్ణము, శాశ్వతము, దేని మీద ఆధారపడని రెండవది ఏదీలేని ఏకైక ఆత్మను నేనే.*

*516. విశ్వమంతా నేనే, అన్ని నేనే, నేనే అన్నింటిలో ప్రతిబింబించేది, నేనే రెండవది ఏదీలేని ఒకేఒక్కడిని. ఏవిధమైన చీలికలు లేని పూర్తి శాశ్వతమైన ఆత్మను, విభజించుటకు వీలులేని ఆత్మను నేను.*

*517. ఈ ప్రకాశవంతమైన స్వయం ప్రకాశముతో, దయా సముద్రుడును అయిన నీకు ఇవే నావందనములు. ఓ ఉన్నతమైన బోధకుడా నీకు ఇవే నా శతకోటి వందనములు.*

* సశేషం....*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 VIVEKA CHUDAMANI - 157 🌹*
✍️ Sri Adi Shankaracharya
Swami Madhavananda
📚 Prasad Bharadwaj

*🌻 32. I am the one who knows Brahman -4🌻*

*515. I am without activity, changeless, without parts, formless, absolute, eternal, without any other support, the One without a second.*

*516. I am the Universal, I am the All, I am transcendent, the One without a second. I am Absolute and Infinite Knowledge, I am Bliss and indivisible.*

*517. This splendour of the sovereignty of Self-effulgence I have received by virtue of the supreme majesty of thy grace. Salutations to thee, O glorious, noble-minded Teacher, salutations again and again !*

*Continues.... *
🌹 🌹 🌹 🌹 🌹
#వివేకచూడామణి #VivekaChudamani #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share 
🌹. వివేకచూడామణి Viveka Chudamani 🌹
https://t.me/vivekchudamani
www.facebook.com/groups/vivekachudamani/
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://t.me/ChaitanyaVijnanam

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹 VIVEKA CHUDAMANI - 157 🌹*
✍️ Sri Adi Shankaracharya
Swami Madhavananda
📚 Prasad Bharadwaj

*🌻 32. I am the one who knows Brahman -4🌻*

*515. I am without activity, changeless, without parts, formless, absolute, eternal, without any other support, the One without a second.*

*516. I am the Universal, I am the All, I am transcendent, the One without a second. I am Absolute and Infinite Knowledge, I am Bliss and indivisible.*

*517. This splendour of the sovereignty of Self-effulgence I have received by virtue of the supreme majesty of thy grace. Salutations to thee, O glorious, noble-minded Teacher, salutations again and again !*

*Continues.... *
🌹 🌹 🌹 🌹 🌹
#వివేకచూడామణి #VivekaChudamani #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share 
🌹. వివేకచూడామణి Viveka Chudamani 🌹
https://t.me/vivekchudamani
www.facebook.com/groups/vivekachudamani/
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://t.me/ChaitanyaVijnanam 

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 109 🌹*
✍️. రచన : సద్గురు ఇ. కృష్ణమాచార్యులు 
సంకలనము : వేణుమాధవ్ 
📚 . సేకరణ : ప్రసాద్ భరద్వాజ

*🌻. కోరికలు - ధర్మస్వరూపము 🌻*

*ధర్మము మొదలగు వాని స్వరూపము కోరిన వానిని బట్టి మారుచుండును. కోరనివాని ధర్మమునకు ప్రభువు అచ్యుతుడు. కోరిన వారి ధర్మమునకు ప్రభువులు కోరిన వారే. తుదకు మోక్షము కూడ నిట్లే. మోక్షమనగా ఉపాసకుడు ఏమనుకొనుచున్నాడో అదియే దక్కును గాని , సకల బంధ విమోచనము దక్కదు‌ . మోక్షమునకు గూర్చి తనకు గల అభిప్రాయములు తనను బంధించును. అపుడు మోక్షమను పేర జీవుడు బద్ధుడగుచు దాని కొరకై యత్నించుచు చచ్చుచు, పుట్టుచుండును.*
*🌻. ఇదియే విష్ణుమాయ.*

* ఎదిరించి యుద్ధము చేయుచున్నను , భక్తితో కొలిచినను శ్రద్ధతో మనస్సు విష్ణుని యందుంచుట జరుగును. ఏ విధముగా జరిగినను వానిపై మనస్సు నిలుచుట చాలును. దానితో వారి భావములు కరగిపోయి మనస్సు మాత్రము నిలబడును. ఆ మనస్సు భగవంతుని ప్రతిబింబముగా పరిణమించును. అపుడు జీవుడుండక భగవంతుడే యుండును.*  
*🌻. అదియే మోక్షస్థితి.*

...... ✍🏼 *మాస్టర్ ఇ.కె.*🌻
🌹 🌹 🌹 🌹 🌹
#మాస్టర్‌ఇకెసందేశములు #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share
🌷. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు 🌷 
www.facebook.com/groups/masterek/
https://t.me/ChaitanyaVijnanam
 www.facebook.com/groups/chaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹 Osho Daily Meditations - 98 🌹*
📚. Prasad Bharadwaj

*🍀 98. MOVEMENT AND STILLNESS 🍀*

*🕉 On the circumference is a dance, and at the center is absolute stillness. 🕉*
 
*Meditation is not just when you close your eyes and sit silently In fact, deep down, when Buddha is sitting silently under his bodhi tree, not moving at all, there is a dance deep inside him-the dance of consciousness. It is invisible of course, but the dance is there" because nothing remains at rest. Rest is an unreal word; nothing corresponds to rest in reality.*

*It depends on us: We can make our life just a restlessness or a dance. Rest is not in the nature of things, but we can have a very chaotic restlessness-that is misery, that is neurosis, that is madness. Or we can be creative with this energy; then restlessness is no longer restless. It becomes smooth, graceful-it starts taking the form of a dance and a song. And the paradox is that when the dancer is totally in dance, there is rest-the impossible happens, the center of the cyclone. But that rest is not possible in any other way.*

*When the dance is total, only then does that rest happen. And there is a center to this whole dance. It cannot go on without a center. The periphery is dancing, the circumference is dancing-to know the center, the only way is to become a total dance. Only then, in contrast to the dance, does one suddenly become aware of something very quiet and very still.*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹
#ఓషోబోధనలు #OshoDiscourse #OshoDailyMeditations #ఓషోనిర్మలధ్యానములు #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share 
🌹 ఓషో బోధనలు - Osho Teachings 🌹
https://t.me/ChaitanyaVijnanam 
http://www.facebook.com/groups/oshoteachings/
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://pyramidbook.in/Chaitanyavijnanam

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 157 / Sri Lalita Sahasranamavali - Meaning - 157 🌹*
🌻. మంత్రము - అర్ధం 🌻
📚. ప్రసాద్ భరద్వాజ

*🍀 157. ముకుందా, ముక్తి నిలయా, మూలవిగ్రహ రూపిణీ ।*
*భావజ్ఞా, భవరోగఘ్నీ భవచక్ర ప్రవర్తినీ ॥ 157 ॥ 🍀*

🍀 835. ముకుందా : 
విష్ణు రూపిణీ 

🍀 836. ముక్తినిలయా : 
ముక్తికి స్థానమైనది 

🍀 837. మూలవిగ్రహరూపిణీ : 
అన్నింటికీ మూలమైనది 

🍀 838. భావఙ్ఞా : 
సర్వజీవుల మానసిక భావములను తెల్సినది 

🍀 839. భవరోగఘ్నీ :
 జన్మపరంపర అను రోగమును పోగొట్టునది 

🍀 840. భవచక్ర ప్రవర్తినీ : 
లోకచక్రమును నడిపించునది.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

*🌹. Sri Lalita Sahasranamavali - Meaning - 157 🌹*
📚. Prasad Bharadwaj 

*🌻 157. Mukunda muktinilaya mulavigraharupini*
*Bhavagyna bhavarogaghni bhavachakra pravartini ॥ 157 ॥ 🌻*

🌻 835 ) Mukundaa -   
She who gives redemption

🌻 836 ) Mukthi nilaya -   
She who is the seat of redemption

🌻 837 ) Moola vigraha roopini -   
She who is the basic statue

🌻 838 ) Bavagna -   
She who understands wishes and thoughts

🌻 839 ) Bhava rokagni -  
 She who cures the sin of birth

🌻 840 ) Bhava Chakra Pravarthani -   
She makes the wheel of birth rotate

Continues...
🌹 🌹 🌹 🌹 🌹
 #లలితాసహస్రనామములు #LalithaSahasranam
 #PrasadBhardwaj 
🌹. శ్రీ లలితా దేవి చైతన్యము Sri Lalitha Devi Chatanyam 🌹
https://t.me/srilalithachaitanyavijnanam
http://www.facebook.com/groups/srilalithachaitanyavijnanam/ https://mymandir.page.link/wdh7G
https://t.me/ChaitanyaVijnanam 
www.facebook.com/groups/chaitanyavijnanam/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹