శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 310-2 / Sri Lalitha Chaitanya Vijnanam - 310-2

🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 310-2 / Sri Lalitha Chaitanya Vijnanam - 310-2🌹

సహస్ర నామముల తత్వ విచారణ

✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

మూల మంత్రము :

🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁

🍀 71. రాజరాజార్చితా, రాజ్ఞీ, రమ్యా, రాజీవలోచనా ।
రంజనీ, రమణీ, రస్యా, రణత్కింకిణి మేఖలా ॥ 71 ॥ 🍀

🌻 310-2. 'రమణీ' 🌻

శ్రీమాతను ఆరాధన చేయువారు భక్తితో, అర్హతతో ఆరాధన చేసినచో కోపతాపములు, ఈర్ష్య అసూయలు, లోభమోహములు, అశుభ భావములు అదృశ్యమగును. ఇది సత్యము. శ్రీసూక్తమున ఈ సత్యమును ప్రతిపాదించుట జరిగినది. ఆరాధనా మార్గమున అశుభమతి పోయి శుభమతి యేర్పడుట తథ్యము. పై విధమగు అవగుణములు పోవలెనని భావించిననూ పోవు. భక్తి శ్రద్ధలతో అమ్మను ఆరాధించినచో క్రమముగ శుభమతి అగుట తథ్యము.

ఇట్టి శుభమతులు ఆడుచు పాడుచు, ప్రకృతి యందు ఆనందించుచు జీవనము సాగించు చుందురు. జీవితమున అలుపు సొలుపు వుండదు. పొరపొచ్చెములు లేక కలిసి మెలిసి అందరితోను పనిచేయుదురు. ఇట్టి వారియందు 'రమణి' అను శ్రీమాత ప్రజ్ఞ సన్నిధి నిచ్చుచుండును. అందరూ కోరునది ప్రాథమికముగ ఈ దశయే. శ్రీమాత రమణి, దేవదేవుడు రమణుడు.

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹

🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 310-2 🌹

1000 Names of Sri Lalitha Devi

✍️. Ravi Sarma
📚. Prasad Bharadwaj

🍀 71. rājarājārcitā rājñī ramyā rājīvalocanā |
rañjanī ramaṇī rasyā raṇatkiṅkiṇi-mekhalā || 71 || 🍀

🌻 310-2. Ramaṇī रमणी (310) 🌻

The articulation by this Upaniṣad clearly proves that Self is not different from the Brahman. If one feels the difference, it is due to māyā or illusion. When we eat meat, She also eats meat with us. When we relish onion, She also relishes onion with us. When we are poor, She is also poor and when we are rich She is also rich. This is the uniqueness of omnipresence.

Arjuna says to Kṛṣṇa after seeing his universal form (viśva-rūpa-darśan) “Overjoyed I am, that gazed upon a vision never seen before, yet my mind is afflicted with fear. Be merciful to me and show only your God form (the original form of Kṛṣṇa)” (Bhagavad Gīta XI.45). We should never feel that God is different from our Self. The God within you and within him is one and the same. The only difference is the soul. Certain souls realize God and certain others do not realize God and this purely depends upon one’s karma.

Continues...

🌹 🌹 🌹 🌹 🌹

20 Sep 2021

నిర్మల ధ్యానాలు - ఓషో - 74

🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 74 🌹

✍️. సౌభాగ్య
📚. ప్రసాద్ భరద్వాజ

🍀. వ్యక్తి కొత్త దాన్ని ప్రేమించడం నేర్చుకోవాలి. లేకుంటే అభివృద్ధికి అవకాశం లేదు. పాతదాన్ని వదులుకునే సాహసమున్నపుడే ఎదుగుదల వుంటుంది. పాతది ప్రతిబంధకం. కొత్తది స్వేచ్ఛనిస్తుంది. సత్యం ఎప్పుడూ కొత్తదే. 🍀

పాతదాన్ని వదులుకోవడం కష్టం. కానీ వదిలేయాలి. ఎందుకంటే అప్పుడే కొత్త దానికి అవకాశముంటుంది. కొత్త దాన్ని అంగీకరించడం కష్టం. కారణం అది మనకు పరిచయం లేనిది. లోపల్లోపల భయపడతాం. కానీ వ్యక్తి కొత్త దాన్ని ప్రేమించడం నేర్చుకోవాలి. లేకుంటే అభివృద్ధికి అవకాశం లేదు. పాతదాన్ని వదులుకునే సాహసమున్నపుడే ఎదుగుదల వుంటుంది. కొత్తదాన్ని ప్రేమించే ధైర్యం వుండాలి. అది ఎప్పుడో ఒకపుడు కాదు ప్రతిక్షణం వుండాలి. ప్రతిసారీ మన తలపును పాతది, కొత్తది కొడుతూ వుంటాయి.

కానీ ప్రతిసారీ విను. కొత్తదాన్ని విను. పాతదాన్ని పట్టించుకోకు. పాతది ప్రతిబంధకం. కొత్తది స్వేచ్ఛనిస్తుంది. సత్యం ఎప్పుడూ కొత్తదే. దేవుడు ఎప్పుడూ తాజాగా వుంటాడు. ఉదయకాంతిలో మంచుబిందువులా తళతళలాడుతూ వుంటాడు.

సశేషం ...

🌹 🌹 🌹 🌹 🌹

20 Sep 2021

మైత్రేయ మహర్షి బోధనలు - 7

🌹. మైత్రేయ మహర్షి బోధనలు - 7 🌹

✍️. రచన : సద్గురు కె. పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🌻 5. ఆశయము 🌻

ఉత్తమమైన ఒక గమ్యమును ఏర్పరచుకొని, దానికై కృషి చేయుచు కృషిలో భాగముగ తనను, తనవనరులను సమర్పణ చేయుచు గమ్యమును చేరుట సాధనయందు ముఖ్యమైన అంశము. తమదైన సేవ జాతికి ఈవిధముగ సమర్పించుట వలన సాధకుడు తప్పక పరిణితి చెందును. ఏమహాత్ముని జీవితమును గమనించినను ఈ అంశము ప్రస్ఫుటముగ గోచరించును. బుద్ధుడు అహింసా భావమును ప్రతిష్ఠితము చేసెను. ఆదిశంకరులు జ్ఞానమును పునః ప్రతిష్ఠితము చేసిరి. రామానుజులు భక్తిభావమును ప్రతిష్ఠితము చేసిరి. కొందరు యోగమును, మరికొందరు జీవుల సేవయు, మరి కొందరు దీనజనోద్ధరణము.

ఇంకొందరు మనోవికాసము కలిగించుట. ఇట్లు రకరకములుగ ఉత్తమమైన ప్రణాళికలను నిర్వర్తింప చేసిరి. మహాత్ముల మార్గమున స్ఫూర్తినొందిన సత్సాధకుడు తనదైన సేవా కార్యక్రమమును ఒకటి సంకల్పించి నిర్వర్తించుచు ఉన్నత పరిణామ ములను జీవుల కేర్పరచుటకు కృషి చేయవలెను. కేవలము తన ముక్తి కొరకు సాధన చేయువారు గమ్యమును చేరలేరు. తమకు ముక్తి అనునది స్వార్థమే కదా! స్వార్థము,ముక్తి ఒకే కాలమున ఎట్లు సిద్దించగలవు? జీవుల సేవ కారణమున ఏర్పడు నిస్వార్థత, ముక్తికి హేతువగును. తనదగు సేవా ప్రణాళికను నిర్వర్తించు సందర్భమున తాను మొదట ఏకాకిగ నుండును.

తాను నిర్వర్తించు కార్యమునందలి పవిత్రతను బట్టి సజ్జనులు చేరుట, ఒక బృందముగ నేర్పడుట కూడ జరుగును. సమిష్టిగ, సహకార బుద్ధితో కార్యములను నిర్వర్తించుట వలన ప్రణాళిక సిద్ధించును. మార్గమున నిస్పృహ, సందేహము, భయము, స్వార్థము అను నలుగురు దుండగులు దారికాచి దోచుకొన గలరు. సాధకుడు అప్రమత్తుడై ఈ నలుగురు దుండగులు బారిని పడకుండ ఉత్సాహముతో ముందుకు సాగవలెను. ఇట్టి నిర్మాణాత్మక మైన సేవాప్రణాళిక కనీసము 12 సంవత్సరములు నిర్వర్తించుచూ అందు సహకరించు అనుయాయులకు సంపూర్ణముగ అందించి తాను కృతకృత్యుడు కాగలడు. ఇది మమ్ములను మిక్కిలిగ ఆకర్షించు అంశము. మా సాన్నిధ్యము, సహకారము లభించుటకు మార్గము.

సశేషం.....

🌹 🌹 🌹 🌹 🌹

20 Sep 2021

విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 490 / Vishnu Sahasranama Contemplation - 490

🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 490 / Vishnu Sahasranama Contemplation - 490 🌹

🌻 490. ఆదిదేవః, आदिदेवः, Ādidevaḥ 🌻

ఓం ఆదిదేవాయ నమః | ॐ आदिदेवाय नमः | OM Ādidevāya namaḥ

ఆదిదేవః, आदिदेवः, Ādidevaḥ

ఆదీయంతే సర్వభూతాన్యనేనేత్యాదిరచ్యుతః ।
దేవశ్చాసావితి విష్ణురాదిదేవ ఇతీర్యతే ॥

ప్రళయాది సమయములయందు సర్వభూతములనూ తనలోనికి గ్రహించుతాడుగనుక అచ్యుతుడు 'ఆదిః' అనబడును. ఈ విష్ణుడు అట్లు ఆదియగు అనగా సర్వభూతములను తనలోనికి గ్రహించువాడగు దేవుడుగనుక ఆదిదేవః.

:: పోతన భాగవతము ద్వాదశ స్కంధము ::

సీ. సకలగుణాతీతు సర్వజ్ఞు సర్వేశు నఖిలలోకాధారు, నాదిదేవుఁ
బరమదయార సోద్భాసితుఁ ద్రిదశాభి వందితపాదాబ్జు వనధీశయను
నాశ్రితమందారు నాద్యంతశూన్యుని వేదాంతవేద్యుని విశ్వమయునిఁ
గౌస్తుభ శ్రీవత్స కమనీయవక్షుని సంఖచక్రగదాశిశార్ఙ్గధరుని
తే. శోభనాకారుఁ బీతాంబరాభిరాము, రత్నరాజితమకుటవిభ్రాజమానుఁ
బుండరీకాక్షు మహనీయపుణ్యదేహుఁ దలఁతు నుతియింతు దేవకీతనయునెపుడు. (50)

గుణములకన్నింటికీ అతీతమైనవాడునూ, సర్వమూ తెలిసినవాడునూ, అన్నింటికీ ఈశ్వరుడైనవాడునూ, సర్వలోకాలకూ ఆధారమైనవాడునూ, ఆదిదేవుడునూ, గొప్పదైన కరుణారసంచేత ప్రకాశించేవాడునూ, దేవతల వందనాలను అందుకునే పాదాబ్జాలు కలవాడునూ, సముద్రంలో శయనించేవాడునూ, ఆశ్రయించిన వారి పాలిటికి కల్పవృక్షంవంటివాడునూ, ఆదీ-అంతమూ అనేవి లేనివాడునూ, వేదాంతంచేత తెలియదగినవాడునూ, విశ్వమంతా నిండిఉన్నవాడునూ, వక్షస్థలం మీద కౌస్తుభమూ శ్రీవత్సమూ కలవాడునూ, శంఖమూ, చక్రమూ, గదా, ఖడ్గమూ, శార్ఙ్గం అనే ధనుస్సు ధరించి ఉండేవాడునూ, మంగళకరమైన రూపం కలవాడునూ, పీతాంబరము ధరించి మనోహరంగా కనిపించేవాడునూ, రత్నాలచేత ప్రకాశించే కిరీటంతో వెలుగులు నింపేవాడునూ, పద్మపత్రాలవంటి నేత్రాలు కలవాడునూ, గొప్పదైన పుణ్యవంతమైన శరీరం కలవాడునూ అయిన దేవకీనందనుని స్మరించి యెల్లప్పుడూ స్తుతిస్తూ ఉంటాను.

334. ఆదిదేవః, आदिदेवः, Ādidevaḥ

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹

🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 490 🌹

🌻 490. Ādidevaḥ 🌻

OM Ādidevāya namaḥ

आदीयंते सर्वभूतान्यनेनेत्यादिरच्युतः ।
देवश्चासाविति विष्णुरादिदेव इतीर्यते ॥

Ādīyante sarvabhūtānyanenetyādiracyutaḥ,
Devaścāsāviti viṣṇurādideva itīryate.

During the times of dissolution, all the beings are drawn into Lord Acyuta; hence He is 'Ādiḥ'. As Lord Viṣṇu is the Deva who draws all beings to Himself, He is called Ādidevaḥ.

::श्रीमद्भागवते एकादशस्कन्धे चतुर्थोऽध्यायह् ::

भूतैर्यदा पङ्चभिरात्मसृष्टैः पुरं विराजं विरचय्य तस्मिन् ।
स्वांशेन विष्टः पुरुशाभिधानम् अवाप नारायण आदिदेवः ॥

Śrīmad Bhāgavata - Canto 11, Chapter 4

Bhūtairyadā paṅcabhirātmasrṣṭaiḥ puraṃ virājaṃ viracayya tasmin,
Svāṃśena viṣṭaḥ puruśābhidhānam avāpa nārāyaṇa ādidevaḥ.

When the primeval Lord Nārāyana created His universal body out of the five elements produced from Himself and then entered within that universal body by His own plenary portion, He thus became known as the Purusa.

334. ఆదిదేవః, आदिदेवः, Ādidevaḥ

🌻 🌻 🌻 🌻 🌻

Source Sloka

गभस्तिनेमिस्सत्त्वस्थस्सिंहो भूतमहेश्वरः ।आदिदेवो महादेवो देवेशो देवभृद्गुरुः ॥ ५२ ॥

గభస్తినేమిస్సత్త్వస్థస్సింహో భూతమహేశ్వరః ।ఆదిదేవో మహాదేవో దేవేశో దేవభృద్గురుః ॥ 52 ॥

Gabhastinemissattvasthassiṃho bhūtamaheśvaraḥ,Ādidevo mahādevo deveśo devabhrdguruḥ ॥ 52 ॥

Continues....

🌹 🌹 🌹 🌹🌹

20 Sep 2021

20-SEPTEMBER-2021 MESSAGES

1) 🌹. నిత్య పంచాంగము Daily Panchangam 20 సెప్టెంబర్ 2021 శరద్ పౌర్ణమి శుభాకాంక్షలు 🌹
2) 🌹. శ్రీమద్భగవద్గీత - 93 / Bhagavad-Gita - 93 - 2-46🌹*
3) 🌹. శ్రీమద్భగవద్గీత - 661 / Bhagavad-Gita - 661 -18-72🌹
4) 🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 490 / Vishnu Sahasranama Contemplation - 490🌹
5) 🌹 DAILY WISDOM - 168🌹
6) 🌹. మైత్రేయ మహర్షి బోధనలు - 7 🌹
7) 🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 74 🌹
8) 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 310-2 / Sri Lalitha Chaitanya Vijnanam - 310-2🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శరద్‌ పౌర్ణమి శుభాకాంక్షలు మరియు శుభ సోమవారం మిత్రులందరికీ 🌹*
*ప్రసాద్ భరద్వాజ*

*🍀. దారిద్య్ర దహన శివస్తోత్రం-2 🍀*

చర్మాంబరాయ శవభస్మవిలేపనాయ
ఫాలేక్షణాయ మణికుండలమండితాయ |
మంజీరపాదయుగళాయ జటాధరాయ
దారిద్ర్యదుఃఖదహనాయ నమః శివాయ || 4 ||
పంచాననాయ ఫణిరాజవిభూషణాయ
హేమాంశుకాయ భువనత్రయమండితాయ |
ఆనందభూమివరదాయ తమోమయాయ 
దారిద్ర్యదుఃఖదహనాయ నమః శివాయ || 5 ||
భానుప్రియాయ భవసాగరతారణాయ
కాలాంతకాయ కమలాసనపూజితాయ |
నేత్రత్రయాయ శుభలక్షణ లక్షితాయ
దారిద్ర్యదుఃఖదహనాయ నమః శివాయ || 6 ||
🌻 🌻 🌻 🌻 🌻

20 సోమవారం, సెప్టెంబర్‌ 2021
విక్రమ సంవత్సరం: 2078 ఆనంద
శఖ సంవత్సరం: 1943 ప్లవ
దక్షిణాయణం, శరద్ ఋతువు
చాంద్రమానం : బాద్రపద మాసం
తిథి: పూర్ణిమ 29:25:05 వరకు తదుపరి కృష్ణ పాడ్యమి
పక్షం: శుక్ల-పక్ష
నక్షత్రం: పూర్వాభద్రపద 28:03:02 వరకు 
తదుపరి ఉత్తరాభద్రపద
యోగం: శూల 15:22:42 వరకు తదుపరి దండ
కరణం: విష్టి 17:26:40 వరకు
వర్జ్యం: 10:01:48 - 11:40:00
దుర్ముహూర్తం: 12:33:39 - 13:22:16 మరియు
14:59:30 - 15:48:08
రాహు కాలం: 07:35:50 - 09:07:00
గుళిక కాలం: 13:40:30 - 15:11:40
యమ గండం: 10:38:10 - 12:09:20
అభిజిత్ ముహూర్తం: 11:45 - 12:33
అమృత కాలం: 19:51:00 - 21:29:12 
మరియు 24:06:00 - 25:46:20
సూర్యోదయం: 06:04:40
సూర్యాస్తమయం: 18:14:03
వైదిక సూర్యోదయం: 06:08:12
వైదిక సూర్యాస్తమయం: 18:10:28
చంద్రోదయం: 18:06:13
చంద్రాస్తమయం: 05:19:09
సూర్య రాశి: కన్య, చంద్ర రాశి: కుంభం
ఆనందాదియోగం: ముసల యోగం - దుఃఖం 28:03:00 
వరకు తదుపరి గద యోగం - కార్య హాని , చెడు
పండుగలు : శరద్‌ పౌర్ణమి 
🌻 🌻 🌻 🌻 🌻  

*🍀. నిత్య ప్రార్థన 🍀*
వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ
నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా
యశివ నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా
తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం
తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.
🌹🌹🌹🌹🌹
Join and Share 
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://pyramidbook.in/Chaitanyavijnanam

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. శ్రీమద్భగవద్గీత -93 / Bhagavad-Gita - 93 🌹*
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద 
📚. ప్రసాద్ భరద్వాజ 

*🌴. ద్వితీయ అధ్యాయము - సాంఖ్య యోగము - 46 🌴*

46. యావానర్థ ఉదపానే సర్వత: సంప్లుతోదకే |
తావాన్ సర్వేషు వేదేషు బ్రాహ్మణస్య విజానత: ||

🌷. తాత్పర్యం :
*చిన్ననుతిచే ఒనగూడు ప్రయోజనములన్నియును శీఘ్రమే పెద్ద జలాశయము నందలి జలముచే సిద్ధించురీతి, వేదముల సమస్త ప్రయోజనములు వాని అంతరార్థమును గ్రహించిన వానికి సిద్ధించుచున్నవి.*

🌻. భాష్యము :
వేదవాజ్మయమునందలి కర్మకాండ భాగములో తెలియజేయబడిన యజ్ఞములు మరియు కర్మలన్నియును క్రమానుగతమైన ఆత్మానుభూతి కొరకే నిర్దేశింపబడినవి. ఇక ఆత్మానుభవపు ప్రయోజనము భగవద్గీత యొక్క పంచదశాధ్యాయము (15.15) నందు స్పష్టముగా తెలుపబడినది. సమస్తమునకు ఆదికారణుడైన శ్రీకృష్ణభగవానుని ఎరుగుటయే వేదాధ్యయనపు ప్రయోజనమని అచ్చట వివరించబడినది; అనగా శ్రీకృష్ణుని గూర్చియు మరియు అతనితో జీవునికి గల నిత్యసంబంధమును గూర్చియు తెలియజేయుటయే అత్మనుభవపు నిజమైనభావము. గీత యొక్క పంచదశాధ్యాయపు (15.7) నందు జీవులకు శ్రీకృష్ణభగవానునితో గల సంబంధము సైతము వివరింపబడినది. జీవులందరును శ్రీకృష్ణుని అంశలు గావున ప్రతిజీవుడును కృష్ణభక్తిభావన యందు పునరుద్ధరించుకొనుటయే వేదజ్ఞానపు పూర్ణతస్థితియై యున్నది. ఈ విషయమున శ్రీమద్భాగవతము (3.33.7) నందు ఇట్లు స్థిరీకరించబడినది.

అహో బత శ్వపచో తో గరీయాన్ యజ్జిహ్వాగ్రే వర్తతే నాం తుభ్యమ్ |
 తేపుస్తప స్తే జుహువు: సస్నురార్యా బ్రహ్మానూ చుర్నామ గృణన్తి యే తే ||

“హే ప్రభూ! నీ పవిత్ర నామమును కీర్తించువాడు చండాలుని (శునకమాంసను భుజించువాడు) వంశము వంటి అధమవంశములో జన్మించినను అత్యున్నత ఆత్మానుభవస్థాయిలో నున్నట్టివాడు. అట్టివాడు వేదప్రకారము సర్వవిధములైన యజ్ఞములను, తపస్సులను ఆచరించినట్టివాడే! సమస్త పుణ్యతీర్థములలో స్నానమాచరించి, వేదవాజ్మయమును పలుమార్లు అధ్యయనము చేసినట్టివాడే! అట్టివాడే ఆర్యవంశములో ఉత్తముడని పరిగణింపబడును.”
🌹 🌹 🌹 🌹 🌹 

*🌹 Bhagavad-Gita as It is - 93 🌹*
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada 
📚 Prasad Bharadwaj 

*🌴 Chapter 2 - Sankhya Yoga - 46 🌴*

46. yāvān artha uda-pāne sarvataḥ samplutodake
tāvān sarveṣu vedeṣu brāhmaṇasya vijānataḥ

🌻 Translation :
*All purposes served by a small well can at once be served by a great reservoir of water. Similarly, all the purposes of the Vedas can be served to one who knows the purpose behind them.*

🌻 Purport :
The rituals and sacrifices mentioned in the karma-kāṇḍa division of the Vedic literature are meant to encourage gradual development of self-realization. And the purpose of self-realization is clearly stated in the Fifteenth Chapter of the Bhagavad-gītā (15.15): the purpose of studying the Vedas is to know Lord Kṛṣṇa, the primeval cause of everything. So, self-realization means understanding Kṛṣṇa and one’s eternal relationship with Him. 
🌹 🌹 🌹 🌹 🌹
#భగవద్గీత #BhagavadGita #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share 
🌹. భగవద్గీత BhagavadGita Telegram, FB Groups 🌹
https://t.me/bhagavadgeethaa/
www.facebook.com/groups/bhagavadgeethaa/
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/chaitanyavijnanam/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. శ్రీమద్భగవద్గీత - 661 / Bhagavad-Gita - 661 🌹*
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ

*🌴. 18వ అధ్యాయము - మోక్ష సన్యాస యోగం - సన్న్యాసము యొక్క పూర్ణత్వము - 72 🌴*

72. కచ్చిదేతచ్చ్రుతం పార్థ 
త్వయైకాగ్రేణ చేతసా |
కచ్చిదజ్ఞానసమ్మోహ: 
ప్రనష్ట స్తే ధనంజయ ||

🌷. తాత్పర్యం : 
ఓ పార్థా! ధనంజయా! ఏకాగ్రమనస్సుతో దీనినంతటిని నీవు శ్రవణము చేసితివా? నీ అజ్ఞానము మరియు మోహము ఇప్పుడు నశించినవా?

🌷. భాష్యము :
శ్రీకృష్ణభగవానుడు ఇచ్చట అర్జునునికి ఆధ్యాత్మికగురువు వలె వర్తించుచున్నాడు. కనుకనే అర్జునుడు భగవద్గీతను సరియైన విధముగా అవగతము చేసికొనెనా లేదా యని ప్రశ్నించుట అతని ధర్మమై యున్నది. ఒకవేళ అర్జునుడు అవగతము చేసికొననిచో అవసరమైన ఏదేని ఒక విషయమును గాని లేదా సంపూర్ణగీతను గాని శ్రీకృష్ణుడు తిరిగి తెలుపుటకు సంసిద్ధుడై యున్నాడు. 

వాస్తవమునకు శ్రీకృష్ణుని వంటి గురువు నుండి గాని, శ్రీకృష్ణుని ప్రతినిధియైన ఆధ్యాత్మికగురువు నుండి గాని గీతాశ్రవణము చేసినవాడు తన అజ్ఞానమును నశింపజేసికొనగలడు. భగవద్గీత యనునది ఏదో ఒక కవి లేదా నవలారచయితచే రచింపబడినది కాదు. అది సాక్షాత్తు దేవదేవుడైన శ్రీకృష్ణునిచే పలుకబడినట్టిది. 

కనుక శ్రీకృష్ణుని నుండి గాని, అతని ప్రామాణిక ఆధ్యాత్మిక ప్రతినిధి నుండి గాని ఆ ఉపదేశములను శ్రవణము చేయగలిగిన భాగ్యవంతుడు తప్పక ముక్తపురుషుడై అజ్ఞానాంధకారము నుండి బయటపడగలడు.
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Bhagavad-Gita as It is - 661 🌹*
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj

*🌴 Chapter 18 - Moksha Sanyasa Yoga - The Perfection of Renunciation - 72 🌴*

72. kaccid etac chrutaṁ pārtha
tvayaikāgreṇa cetasā
kaccid ajñāna-sammohaḥ
praṇaṣṭas te dhanañ-jaya

🌷 Translation : 
O son of Pṛthā, O conqueror of wealth, have you heard this with an attentive mind? And are your ignorance and illusions now dispelled?

🌹 Purport :
The Lord was acting as the spiritual master of Arjuna. Therefore it was His duty to inquire from Arjuna whether he understood the whole Bhagavad-gītā in its proper perspective. If not, the Lord was ready to re-explain any point, or the whole Bhagavad-gītā if so required. 

Actually, anyone who hears Bhagavad-gītā from a bona fide spiritual master like Kṛṣṇa or His representative will find that all his ignorance is dispelled. Bhagavad-gītā is not an ordinary book written by a poet or fiction writer; it is spoken by the Supreme Personality of Godhead. 

Any person fortunate enough to hear these teachings from Kṛṣṇa or from His bona fide spiritual representative is sure to become a liberated person and get out of the darkness of ignorance.
🌹 🌹 🌹 🌹 🌹
#భగవద్గీత #BhagavadGita #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share 
🌹. భగవద్గీత BhagavadGita Telegram, FB Groups 🌹
https://t.me/bhagavadgeethaa/
www.facebook.com/groups/bhagavadgeethaa/
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/chaitanyavijnanam/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 490 / Vishnu Sahasranama Contemplation - 490 🌹*

*🌻 490. ఆదిదేవః, आदिदेवः, Ādidevaḥ 🌻*

*ఓం ఆదిదేవాయ నమః | ॐ आदिदेवाय नमः | OM Ādidevāya namaḥ*

ఆదిదేవః, आदिदेवः, Ādidevaḥ

ఆదీయంతే సర్వభూతాన్యనేనేత్యాదిరచ్యుతః ।
దేవశ్చాసావితి విష్ణురాదిదేవ ఇతీర్యతే ॥

ప్రళయాది సమయములయందు సర్వభూతములనూ తనలోనికి గ్రహించుతాడుగనుక అచ్యుతుడు 'ఆదిః' అనబడును. ఈ విష్ణుడు అట్లు ఆదియగు అనగా సర్వభూతములను తనలోనికి గ్రహించువాడగు దేవుడుగనుక ఆదిదేవః.

:: పోతన భాగవతము ద్వాదశ స్కంధము ::
సీ. సకలగుణాతీతు సర్వజ్ఞు సర్వేశు నఖిలలోకాధారు, నాదిదేవుఁ
బరమదయార సోద్భాసితుఁ ద్రిదశాభి వందితపాదాబ్జు వనధీశయను
నాశ్రితమందారు నాద్యంతశూన్యుని వేదాంతవేద్యుని విశ్వమయునిఁ
గౌస్తుభ శ్రీవత్స కమనీయవక్షుని సంఖచక్రగదాశిశార్ఙ్గధరుని
తే. శోభనాకారుఁ బీతాంబరాభిరాము, రత్నరాజితమకుటవిభ్రాజమానుఁ
బుండరీకాక్షు మహనీయపుణ్యదేహుఁ దలఁతు నుతియింతు దేవకీతనయునెపుడు. (50)

గుణములకన్నింటికీ అతీతమైనవాడునూ, సర్వమూ తెలిసినవాడునూ, అన్నింటికీ ఈశ్వరుడైనవాడునూ, సర్వలోకాలకూ ఆధారమైనవాడునూ, ఆదిదేవుడునూ, గొప్పదైన కరుణారసంచేత ప్రకాశించేవాడునూ, దేవతల వందనాలను అందుకునే పాదాబ్జాలు కలవాడునూ, సముద్రంలో శయనించేవాడునూ, ఆశ్రయించిన వారి పాలిటికి కల్పవృక్షంవంటివాడునూ, ఆదీ-అంతమూ అనేవి లేనివాడునూ, వేదాంతంచేత తెలియదగినవాడునూ, విశ్వమంతా నిండిఉన్నవాడునూ, వక్షస్థలం మీద కౌస్తుభమూ శ్రీవత్సమూ కలవాడునూ, శంఖమూ, చక్రమూ, గదా, ఖడ్గమూ, శార్ఙ్గం అనే ధనుస్సు ధరించి ఉండేవాడునూ, మంగళకరమైన రూపం కలవాడునూ, పీతాంబరము ధరించి మనోహరంగా కనిపించేవాడునూ, రత్నాలచేత ప్రకాశించే కిరీటంతో వెలుగులు నింపేవాడునూ, పద్మపత్రాలవంటి నేత్రాలు కలవాడునూ, గొప్పదైన పుణ్యవంతమైన శరీరం కలవాడునూ అయిన దేవకీనందనుని స్మరించి యెల్లప్పుడూ స్తుతిస్తూ ఉంటాను.

334. ఆదిదేవః, आदिदेवः, Ādidevaḥ

సశేషం... 
🌹 🌹 🌹 🌹 🌹 

*🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 490 🌹*

*🌻 490. Ādidevaḥ 🌻*

*OM Ādidevāya namaḥ*

आदीयंते सर्वभूतान्यनेनेत्यादिरच्युतः ।
देवश्चासाविति विष्णुरादिदेव इतीर्यते ॥ 

Ādīyante sarvabhūtānyanenetyādiracyutaḥ,
Devaścāsāviti viṣṇurādideva itīryate.

During the times of dissolution, all the beings are drawn into Lord Acyuta; hence He is 'Ādiḥ'. As Lord Viṣṇu is the Deva who draws all beings to Himself, He is called Ādidevaḥ.

::श्रीमद्भागवते एकादशस्कन्धे चतुर्थोऽध्यायह् ::
भूतैर्यदा पङ्चभिरात्मसृष्टैः पुरं विराजं विरचय्य तस्मिन् ।
स्वांशेन विष्टः पुरुशाभिधानम् अवाप नारायण आदिदेवः ॥

Śrīmad Bhāgavata - Canto 11, Chapter 4
Bhūtairyadā paṅcabhirātmasrṣṭaiḥ puraṃ virājaṃ viracayya tasmin,
Svāṃśena viṣṭaḥ puruśābhidhānam avāpa nārāyaṇa ādidevaḥ.

When the primeval Lord Nārāyana created His universal body out of the five elements produced from Himself and then entered within that universal body by His own plenary portion, He thus became known as the Purusa.

334. ఆదిదేవః, आदिदेवः, Ādidevaḥ

🌻 🌻 🌻 🌻 🌻 
Source Sloka
गभस्तिनेमिस्सत्त्वस्थस्सिंहो भूतमहेश्वरः ।आदिदेवो महादेवो देवेशो देवभृद्गुरुः ॥ ५२ ॥

గభస్తినేమిస్సత్త్వస్థస్సింహో భూతమహేశ్వరః ।ఆదిదేవో మహాదేవో దేవేశో దేవభృద్గురుః ॥ 52 ॥

Gabhastinemissattvasthassiṃho bhūtamaheśvaraḥ,Ādidevo mahādevo deveśo devabhrdguruḥ ॥ 52 ॥

Continues....
🌹 🌹 🌹 🌹🌹
#విష్ణుసహస్రనామతత్వవిచారణ #VishnuSahasranamacontemplation #విష్ణుసహస్రనామములు #VishnuSahasranama #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
https://t.me/vishnusahasranaam
www.facebook.com/groups/vishnusahasranaam/
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/chaitanyavijnanam/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹 DAILY WISDOM - 168 🌹*
*🍀 📖 In the Light of Wisdom 🍀*
📝 Swami Krishnananda
📚. Prasad Bharadwaj

*🌻 16. What is Above this World? 🌻*

For psychologists, reality means the social world. For them, we must be in tune with the world outside. For them ‘world’ means mankind. The world of human beings is called the world as far as they are concerned, because we are not concerned with the astronomical world. If the world of human society has to be regarded as the reality, then the attunement of our minds with it should assure our happiness. But we saw in our earlier discussion that this is not the case. People who are well off in society are not always found to be happy. 

They have a secret problem which they cannot understand or much less explain. Yoga began to contemplate the mysteries behind the phenomenon of unhappiness persisting in spite of one’s having everything in life. We may be the king of the whole world, yet it is still doubtful if we are going to be happy, and we will still have many problems. What is above this world? Why not conquer that? May be we have ambitions. Desires cannot be overcome even if we were the kings of this world. Death will come to us when it is time to leave this world.

Continues...
🌹 🌹 🌹 🌹 🌹
#DailyWisdom #SwamiKrishnananda
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share 
🌹. Daily satsang Wisdom 🌹 
www.facebook.com/groups/dailysatsangwisdom/
https://t.me/Seeds_Of_Consciousness
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://pyramidbook.in/Chaitanyavijnanam

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. మైత్రేయ మహర్షి బోధనలు - 7 🌹* 
✍️. రచన : సద్గురు కె. పార్వతి కుమార్
 సేకరణ : ప్రసాద్ భరద్వాజ 

*🌻 5. ఆశయము 🌻*

ఉత్తమమైన ఒక గమ్యమును ఏర్పరచుకొని, దానికై కృషి చేయుచు కృషిలో భాగముగ తనను, తనవనరులను సమర్పణ చేయుచు గమ్యమును చేరుట సాధనయందు ముఖ్యమైన అంశము. తమదైన సేవ జాతికి ఈవిధముగ సమర్పించుట వలన సాధకుడు తప్పక పరిణితి చెందును. ఏమహాత్ముని జీవితమును గమనించినను ఈ అంశము ప్రస్ఫుటముగ గోచరించును. బుద్ధుడు అహింసా భావమును ప్రతిష్ఠితము చేసెను. ఆదిశంకరులు జ్ఞానమును పునః ప్రతిష్ఠితము చేసిరి. రామానుజులు భక్తిభావమును ప్రతిష్ఠితము చేసిరి. కొందరు యోగమును, మరికొందరు జీవుల సేవయు, మరి కొందరు దీనజనోద్ధరణము. 

ఇంకొందరు మనోవికాసము కలిగించుట. ఇట్లు రకరకములుగ ఉత్తమమైన ప్రణాళికలను నిర్వర్తింప చేసిరి. మహాత్ముల మార్గమున స్ఫూర్తినొందిన సత్సాధకుడు తనదైన సేవా కార్యక్రమమును ఒకటి సంకల్పించి నిర్వర్తించుచు ఉన్నత పరిణామ ములను జీవుల కేర్పరచుటకు కృషి చేయవలెను. కేవలము తన ముక్తి కొరకు సాధన చేయువారు గమ్యమును చేరలేరు. తమకు ముక్తి అనునది స్వార్థమే కదా! స్వార్థము,ముక్తి ఒకే కాలమున ఎట్లు సిద్దించగలవు? జీవుల సేవ కారణమున ఏర్పడు నిస్వార్థత, ముక్తికి హేతువగును. తనదగు సేవా ప్రణాళికను నిర్వర్తించు సందర్భమున తాను మొదట ఏకాకిగ నుండును. 

తాను నిర్వర్తించు కార్యమునందలి పవిత్రతను బట్టి సజ్జనులు చేరుట, ఒక బృందముగ నేర్పడుట కూడ జరుగును. సమిష్టిగ, సహకార బుద్ధితో కార్యములను నిర్వర్తించుట వలన ప్రణాళిక సిద్ధించును. మార్గమున నిస్పృహ, సందేహము, భయము, స్వార్థము అను నలుగురు దుండగులు దారికాచి దోచుకొన గలరు. సాధకుడు అప్రమత్తుడై ఈ నలుగురు దుండగులు బారిని పడకుండ ఉత్సాహముతో ముందుకు సాగవలెను. ఇట్టి నిర్మాణాత్మక మైన సేవాప్రణాళిక కనీసము 12 సంవత్సరములు నిర్వర్తించుచూ అందు సహకరించు అనుయాయులకు సంపూర్ణముగ అందించి తాను కృతకృత్యుడు కాగలడు. ఇది మమ్ములను మిక్కిలిగ ఆకర్షించు అంశము. మా సాన్నిధ్యము, సహకారము లభించుటకు మార్గము.

సశేషం.....
🌹 🌹 🌹 🌹 🌹
#మైత్రేయమహర్షిబోధనలు #MaitreyaMaharshi #సద్గురుపార్వతీకుమార్ #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share
భారతీయ మహర్షుల బోధనలు Maharshula Wisdom 
www.facebook.com/groups/maharshiwisdom/
www.facebook.com/groups/chaitanyavijnanam/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 74 🌹*
✍️. సౌభాగ్య
📚. ప్రసాద్ భరద్వాజ

*🍀. వ్యక్తి కొత్త దాన్ని ప్రేమించడం నేర్చుకోవాలి. లేకుంటే అభివృద్ధికి అవకాశం లేదు. పాతదాన్ని వదులుకునే సాహసమున్నపుడే ఎదుగుదల వుంటుంది. పాతది ప్రతిబంధకం. కొత్తది స్వేచ్ఛనిస్తుంది. సత్యం ఎప్పుడూ కొత్తదే. 🍀*

పాతదాన్ని వదులుకోవడం కష్టం. కానీ వదిలేయాలి. ఎందుకంటే అప్పుడే కొత్త దానికి అవకాశముంటుంది. కొత్త దాన్ని అంగీకరించడం కష్టం. కారణం అది మనకు పరిచయం లేనిది. లోపల్లోపల భయపడతాం. కానీ వ్యక్తి కొత్త దాన్ని ప్రేమించడం నేర్చుకోవాలి. లేకుంటే అభివృద్ధికి అవకాశం లేదు. పాతదాన్ని వదులుకునే సాహసమున్నపుడే ఎదుగుదల వుంటుంది. కొత్తదాన్ని ప్రేమించే ధైర్యం వుండాలి. అది ఎప్పుడో ఒకపుడు కాదు ప్రతిక్షణం వుండాలి. ప్రతిసారీ మన తలపును పాతది, కొత్తది కొడుతూ వుంటాయి. 

కానీ ప్రతిసారీ విను. కొత్తదాన్ని విను. పాతదాన్ని పట్టించుకోకు. పాతది ప్రతిబంధకం. కొత్తది స్వేచ్ఛనిస్తుంది. సత్యం ఎప్పుడూ కొత్తదే. దేవుడు ఎప్పుడూ తాజాగా వుంటాడు. ఉదయకాంతిలో మంచుబిందువులా తళతళలాడుతూ వుంటాడు.

సశేషం ...
🌹 🌹 🌹 🌹 🌹
#ఓషోబోధనలు #OshoDiscourse #OshoDailyMeditations #ఓషోనిర్మలధ్యానములు #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share 
🌹 ఓషో బోధనలు - Osho Teachings 🌹
https://t.me/ChaitanyaVijnanam 
http://www.facebook.com/groups/oshoteachings/
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://pyramidbook.in/Chaitanyavijnanam

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 310-2 / Sri Lalitha Chaitanya Vijnanam - 310-2🌹*
*సహస్ర నామముల తత్వ విచారణ*
✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్ 
సేకరణ : ప్రసాద్ భరద్వాజ 
మూల మంత్రము : 
*🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁*

*🍀 71. రాజరాజార్చితా, రాజ్ఞీ, రమ్యా, రాజీవలోచనా ।*
*రంజనీ, రమణీ, రస్యా, రణత్కింకిణి మేఖలా ॥ 71 ॥ 🍀*

*🌻 310-2. 'రమణీ' 🌻* 

శ్రీమాతను ఆరాధన చేయువారు భక్తితో, అర్హతతో ఆరాధన చేసినచో కోపతాపములు, ఈర్ష్య అసూయలు, లోభమోహములు, అశుభ భావములు అదృశ్యమగును. ఇది సత్యము. శ్రీసూక్తమున ఈ సత్యమును ప్రతిపాదించుట జరిగినది. ఆరాధనా మార్గమున అశుభమతి పోయి శుభమతి యేర్పడుట తథ్యము. పై విధమగు అవగుణములు పోవలెనని భావించిననూ పోవు. భక్తి శ్రద్ధలతో అమ్మను ఆరాధించినచో క్రమముగ శుభమతి అగుట తథ్యము. 

ఇట్టి శుభమతులు ఆడుచు పాడుచు, ప్రకృతి యందు ఆనందించుచు జీవనము సాగించు చుందురు. జీవితమున అలుపు సొలుపు వుండదు. పొరపొచ్చెములు లేక కలిసి మెలిసి అందరితోను పనిచేయుదురు. ఇట్టి వారియందు 'రమణి' అను శ్రీమాత ప్రజ్ఞ సన్నిధి నిచ్చుచుండును. అందరూ కోరునది ప్రాథమికముగ ఈ దశయే. శ్రీమాత రమణి, దేవదేవుడు రమణుడు. 

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 310-2 🌹*
*1000 Names of Sri Lalitha Devi* 
✍️. Ravi Sarma 
📚. Prasad Bharadwaj

*🍀 71. rājarājārcitā rājñī ramyā rājīvalocanā |*
*rañjanī ramaṇī rasyā raṇatkiṅkiṇi-mekhalā || 71 || 🍀*

*🌻 310-2. Ramaṇī रमणी (310) 🌻*

The articulation by this Upaniṣad clearly proves that Self is not different from the Brahman. If one feels the difference, it is due to māyā or illusion. When we eat meat, She also eats meat with us. When we relish onion, She also relishes onion with us. When we are poor, She is also poor and when we are rich She is also rich. This is the uniqueness of omnipresence.

 Arjuna says to Kṛṣṇa after seeing his universal form (viśva-rūpa-darśan) “Overjoyed I am, that gazed upon a vision never seen before, yet my mind is afflicted with fear. Be merciful to me and show only your God form (the original form of Kṛṣṇa)” (Bhagavad Gīta XI.45). We should never feel that God is different from our Self. The God within you and within him is one and the same. The only difference is the soul. Certain souls realize God and certain others do not realize God and this purely depends upon one’s karma.

Continues...
🌹 🌹 🌹 🌹 🌹
#శ్రీలలితాసహస్రనామచైతన్యవిజ్ఞానము #SriLalithaChaitanyaVijnanam #లలితాసహస్రనామములు #LalithaSahasranama
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share 
🌹. శ్రీ లలితా దేవి చైతన్యము Sri Lalitha Devi Chatanyam 🌹
https://t.me/srilalithachaitanyavijnanam
http://www.facebook.com/groups/srilalithachaitanyavijnanam/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹