శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 310-2 / Sri Lalitha Chaitanya Vijnanam - 310-2
🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 310-2 / Sri Lalitha Chaitanya Vijnanam - 310-2🌹
సహస్ర నామముల తత్వ విచారణ
✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
మూల మంత్రము :
🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁
🍀 71. రాజరాజార్చితా, రాజ్ఞీ, రమ్యా, రాజీవలోచనా ।
రంజనీ, రమణీ, రస్యా, రణత్కింకిణి మేఖలా ॥ 71 ॥ 🍀
🌻 310-2. 'రమణీ' 🌻
శ్రీమాతను ఆరాధన చేయువారు భక్తితో, అర్హతతో ఆరాధన చేసినచో కోపతాపములు, ఈర్ష్య అసూయలు, లోభమోహములు, అశుభ భావములు అదృశ్యమగును. ఇది సత్యము. శ్రీసూక్తమున ఈ సత్యమును ప్రతిపాదించుట జరిగినది. ఆరాధనా మార్గమున అశుభమతి పోయి శుభమతి యేర్పడుట తథ్యము. పై విధమగు అవగుణములు పోవలెనని భావించిననూ పోవు. భక్తి శ్రద్ధలతో అమ్మను ఆరాధించినచో క్రమముగ శుభమతి అగుట తథ్యము.
ఇట్టి శుభమతులు ఆడుచు పాడుచు, ప్రకృతి యందు ఆనందించుచు జీవనము సాగించు చుందురు. జీవితమున అలుపు సొలుపు వుండదు. పొరపొచ్చెములు లేక కలిసి మెలిసి అందరితోను పనిచేయుదురు. ఇట్టి వారియందు 'రమణి' అను శ్రీమాత ప్రజ్ఞ సన్నిధి నిచ్చుచుండును. అందరూ కోరునది ప్రాథమికముగ ఈ దశయే. శ్రీమాత రమణి, దేవదేవుడు రమణుడు.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 310-2 🌹
1000 Names of Sri Lalitha Devi
✍️. Ravi Sarma
📚. Prasad Bharadwaj
🍀 71. rājarājārcitā rājñī ramyā rājīvalocanā |
rañjanī ramaṇī rasyā raṇatkiṅkiṇi-mekhalā || 71 || 🍀
🌻 310-2. Ramaṇī रमणी (310) 🌻
The articulation by this Upaniṣad clearly proves that Self is not different from the Brahman. If one feels the difference, it is due to māyā or illusion. When we eat meat, She also eats meat with us. When we relish onion, She also relishes onion with us. When we are poor, She is also poor and when we are rich She is also rich. This is the uniqueness of omnipresence.
Arjuna says to Kṛṣṇa after seeing his universal form (viśva-rūpa-darśan) “Overjoyed I am, that gazed upon a vision never seen before, yet my mind is afflicted with fear. Be merciful to me and show only your God form (the original form of Kṛṣṇa)” (Bhagavad Gīta XI.45). We should never feel that God is different from our Self. The God within you and within him is one and the same. The only difference is the soul. Certain souls realize God and certain others do not realize God and this purely depends upon one’s karma.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
20 Sep 2021
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment