ఉత్పన్న ఏకాదశి, ఏకాదశి తిథి జయంతి పురాణ గాధ, ప్రాముఖ్యత మరియు పూజా విధానం UTPANNA EKADASI STORY, IMPORTANCE AND POOJA VIDHI


https://youtu.be/xpT-guIzjHI


🌹 ఉత్పన్న ఏకాదశి, ఏకాదశి తిథి జయంతి పురాణ గాధ, ప్రాముఖ్యత మరియు పూజా విధానం UTPANNA EKADASI STORY, IMPORTANCE AND POOJA VIDHI 🌹

ప్రసాద్‌ భరధ్వాజ

Prasad Bharadwaj



🍀 ఏకాదశి నాడు లక్ష్మీ నారాయణుల ఆరాధనతో అన్ని పాపాలు తొలగి కొరికలన్నీ తీరుతాయి. సకల సంపదలు కలుగుతాయి. లక్ష్మీదేవి, విష్ణు అనుగ్రహంతో సంతోషంగా ఉండవచ్చు. 🍀

🍀 On Ekadashi, by worshipping Goddess Lakshmi and Narayana, all sins are removed and all desires are fulfilled. All wealth is obtained. May you be happy with the blessings of Goddess Lakshmi and Lord Vishnu. 🍀



Like, Subscribe and Share

https://youtube.com/@ChaitanyaVijnaanam

🌹🌹🌹🌹🌹

ఉత్పన్న ఏకాదశి ప్రాముఖ్యత తెలుసుకోండి! ఉత్పన్న ఏకాదశి, ఏకాదశి తిథి జయంతి శుభాకాంక్షలు Greetings on Utpanna Ekadashi and Ekadashi Tithi Jayanti.


🌹 ఉత్పన్న ఏకాదశి పూజా విధానం, ప్రాముఖ్యత తెలుసుకోండి! ఉత్పన్న ఏకాదశి, ఏకాదశి తిథి జయంతి శుభాకాంక్షలు అందరికి 🌹

ప్రసాద్ భరద్వాజ


🌹 Learn about the Utpanna Ekadashi worship procedure and its significance! Greetings to everyone on the Utpanna Ekadashi, Ekadashi Tithi Jayanti 🌹

Prasad Bharadwaj



కార్తీక పూర్ణిమ తర్వాత వచ్చే కృష్ణపక్ష ఏకాదశిని ఉత్పన్న ఏకాదశి అంటారు. ఈ ఉత్పన్న ఏకాదశి శ్రీమహావిష్ణువుకి అత్యంత ప్రీతికరమైన తిథి. ఉపవాసాలు ఆచరించవలసిన ముఖ్యమైన ఏకాదశి ఈ ఉత్పన్న ఏకాదశి. శ్రీమహావిష్ణువు శక్తి స్వరూపాలను తెలిపే ఏకాదశులలో ఇది చాలా ప్రత్యేకమైనదిగా చెబుతారు. ఉత్పన్న ఏకాదశిని కార్తీక మాసంలో విశిష్టమైన ఏకాదశిగా పేర్కొంటారు.

ముర అనే రాక్షసుడిని శ్రీమహావిష్ణువు సంహరించే సందర్భంలో ఆయన నుంచి ఒక శక్తి ఉద్భవించి రాక్షసుడైన మురను సంహరించింది. అప్పుడు విష్ణువు సంతసించి ఆమెకు ఏకాదశి అని పేరుపెట్టాడు. సప్తమాతృకలలో ఒక స్వరూపమైన వైష్ణవీదేవి కూడా విష్ణువు నుంచి ఉద్భవించిన శక్తి స్వరూపాలలో ఒక స్వరూపమే. అందువల్ల ఉత్పన్న ఏకాదశిని ఏకాదశి తిథి జయంతిగా భావిస్తారు.

ఈరోజు ఉపవాసం చేస్తే మంచి ఫలితాలు ఉంటాయని పురాణ వచనం. ఉత్పన్న ఏకాదశి రోజున ఉపవాసం ఉన్నవారి పాపాలు పరిహారమవుతాయి. ముర అంటే తామసిక, రాజసిక, అరిషడ్వర్గాలకు ప్రతీక. ఈ రోజు ఉపవాసం ఉండి శ్రీమహావిష్ణువును పూజించిన వారు తమలోని మురను జయించి మిగతా 23 ఏకాదశులలో ఉపవాసం చేసిన ఫలితం కలిగి వైకుంఠప్రాప్తి పొందగలరు.


🌻 ఉత్పన్న ఏకాదశి 2025 🌻

ఈ సంవత్సరం ఉత్పన్న ఏకాదశి నవంబర్ 15న వచ్చింది. ఏకాదశి తిథి నవంబర్ 14 రాత్రి 12:49కి ప్రారంభమై, నవంబర్ 15 తెల్లవారుజామున 2:37కి ముగుస్తుంది.ఈ లెక్కన నవంబర్ 15న జరుపుకోవాలి. ఏకాదశి రోజున విష్ణువుని ఆరాధించాలి. పురాణాలలో ఏకాదశి ఉపవాసం ప్రాముఖ్యత గురించి చెప్పబడింది. అయితే, ఈ ఏడాది వచ్చే ఈ ఉత్పన్న ఏకాదశి మరింత ప్రాముఖ్యతను కలిగింది.

ఈ ఏకాదశి నాడు పూర్వాషాఢ నక్షత్రం, విష్కంభ యోగం, అభిజిత్ ముహూర్తం కలయిక ఉండడం, పైగా ఈసారి శనివారం రావడం మరో విశేషం. శనివారం నాడు విష్ణుమూర్తిని, లక్ష్మీదేవిని పూజిస్తే సకల శుభాలు కలుగుతాయి. దక్షిణావర్తి శంఖంతో అభిషేకం చేసి, తులసి దళాలు, తీయటి ఆహార పదార్థాలు సమర్పిస్తే మంచిది.



🪔 నువ్వుల నూనెతో దీపారాధన 🪔

శనివారం రావడం వలన శని దేవుడికి నువ్వుల నూనెతో దీపారాధన చేయండి. ఏకాదశి నాడు నీరు కూడా తాగకుండా ఉపవాసం ఉంటే విష్ణుమూర్తి అనుగ్రహాన్ని పొందవచ్చు. ఏకాదశి నాడు ఉపవాసం ఉంటే అన్ని పాపాలు తొలగిపోతాయి, కోరికలన్నీ తీరుతాయి.



🍀 ఉత్పన్న ఏకాదశి పూజా విధానం 🍀

ఉత్పన్న ఏకాదశి పూజా విధానం గురించి చూస్తే.. సూర్యోదయానికి ముందే నిద్రలేచి స్నానం చేయాలి. పూజా స్థలాన్ని శుభ్రం చేసుకుని, విష్ణుమూర్తి విగ్రహం లేదా ఫోటోని పెట్టి దీపారాధన చేయండి.

ఆ తర్వాత గంగాజలంతో విష్ణుమూర్తికి అభిషేకం చేసి, ఐదు రకాల పండ్లు నైవేద్యంగా పెట్టండి.

దీంతో పాటుగా తులసి మొక్క ముందు దీపారాధన చేయండి.

ఉపవాసం ఉండడం వలన సకల సంపదలు కలుగుతాయి, ఆరోగ్యం కూడా బాగుంటుంది. సకల పాపాలు తొలగిపోయి సంతోషకరమైన జీవితాన్ని గడపవచ్చు. లక్ష్మీదేవి, విష్ణు అనుగ్రహంతో సంతోషంగా ఉండవచ్చు.

ఈ ఏకాదశి నాడు దానధర్మాలు చేస్తే మరింత ఎక్కువ పుణ్యం వస్తుంది. జీవితంలో ఆనందం కూడా ఉంటుంది.

🌹🌹🌹🌹🌹

ఈ రోజు ఉత్పన్న ఏకాదశి, శనివారం నాడు తప్పక చేయవలసినవి Today is Dhyvathya Ekadashi, things to do on Saturday (a YT Short)



https://youtube.com/shorts/KLpIBZaoTLw


🌹  ఈ రోజు ఉత్పన్న ఏకాదశి, శనివారం నాడు తప్పక చేయవలసినవి  
Today is Utpanna Ekadashi, things to do on Saturday  🌹

ప్రసాద్ భరద్వాజ

Prasad Bharadwaj


(a YT Short)


🌹🌹🌹🌹🌹

కార్తీక మాసం 25వ రోజు చేయవలసినవి Things to do on 25th Day of Kartika Month (a YT Short)



https://youtube.com/shorts/5HVjr0m2Jp8


🌹 కార్తీక మాసం 25వ రోజు చేయవలసినవి
Things to do on 25th Day of Kartika Month 🌹

ప్రసాద్ భరద్వాజ


(a YT Short)


Like, Subscribe and Share

https://youtube.com/@ChaitanyaVijnaanam

🌹🌹🌹🌹🌹



కార్తీక పురాణం 25వ అధ్యాయము - దూర్వాసుడు అంబరీషుని శపించుట Karthika Puranam 25th Chapter Parayan



https://www.youtube.com/watch?v=BTCGglNVXPU


🌹 కార్తీక పురాణం 25వ అధ్యాయము - దూర్వాసుడు అంబరీషుని శపించుట 
KARTHIKA PURANAM 25th CHAPTER PARAYAN 🌹

ప్రసాద్ భరద్వాజ


Like, Subscribe and Share

https://youtube.com/@ChaitanyaVijnaanam

🌹🌹🌹🌹🌹


కార్తీక పురాణం - 25 : 25వ అధ్యాయము - దూర్వాసుడు అంబరీషుని శపించుట Kartika Purana - 25 : Chapter 25 - Durvasa curses Ambarish


🌹. కార్తీక పురాణం - 25 🌹
🌻 25వ అధ్యాయము - దూర్వాసుడు అంబరీషుని శపించుట 🌻
ప్రసాద్ భరద్వాజ

🌹. Kartika Purana - 25 🌹
🌻 Chapter 25 - Durvasa curses Ambarish 🌻
Prasad Bharadwaja


"అంబరీషా! పూర్వజన్మలో కించిత్ పాప విశేషము వలన నీకీ యనర్ధము వచ్చినది. నీ బుద్దిచే దీర్ఘముగా ఆలోచించి నీకెటుల అనుకూలించునో అటులనే చేయుము. ఇక మాకు సెలవిప్పించుము" అని పండితులు పలికిరి. అంత అంబరీషుడు "ఓ పండితోత్తములారా! నానిశ్చితాభిప్రాయమును ఆలకించి వెడలుడు. ద్వాదశీనిష్టను విడచుట కన్న, విప్రశాపము అధికమయినది కాదు. జలపానము చేయుట వలన బ్రాహణుని అవమానపరచుటగాదు. ద్వాదశిని విడచుటయుగాదు. అప్పుడు దూర్వాసుడు నన్నేల నిందించును? నిందింపడు. నా తొల్లి పుణ్యఫలము నశింపదు. గాన, జలపాన మొనరించి వూరకుందును" అని వారి యెదుటనే జలపానము నొనరించెను.

అంబరీషుడు జలపాన మొనరించిన మరుక్షణముచే దూర్వాసుడు స్నానజపాదులు పూర్తి చేసుకొని అక్కడకు వచ్చెను. వచ్చిన వెంటనే ఆ ముని మహారౌద్రాకారుడై క౦డ్ల వెంట నిప్పులు గ్రక్కుచూ "ఓరీ మదాంధా! నన్ను భోజనానికి రమ్మని, నేను రాకనే నీవేల భుజించితివి? ఎంత దుర్మార్గము, ఎంత నిర్లక్ష్యము? ఎంతటి ధర్మ పరిత్యాగివి? అతిధికి అన్నము పెట్టెదనని ఆశజూపి పెట్టకుండా తాను తినినవాడు మలభక్ష కుడగును. అట్టి అధముడు మరుజన్మలో పురుగై పుట్టును. నీవు భోజనమునకు బదులు జలపానము చేసితివి. అది భోజనముతో సమానమైనదే. నీవు అతిధిని విడిచి భుజించినావు కాన, నీవు నమ్మకద్రోహివగుదువేగాని హరిభక్తుడవెట్లు కాగలవు? శ్రీ హరి బ్రాహణావమానమును సహింపడు. మమ్మే యవమానించుట యనిన శ్రీహరిని అవమానించుటయే. నీవంటి హరినిందాపరుడు మరి యొకడులేడు. నీవు మహాభక్తుడనని అతి గర్వము కలవాడవై వున్నావు. ఆ గర్వముతోనే నీవు నన్ను భోజనమునకు ఆహ్వనించి అవమానపరచి నిర్లక్ష్యముగా జలపాన మొనరించితివి. అంబరీషా! నీవెట్లు పవిత్ర రాజకుటుంబములో బుట్టినావురా! నీ వంశము కళంకము కాలేదా?" అని కోపముతో నోటికి వచ్చినట్లు తిట్టెను. అ౦బరీషుడు, ముని కోపమునకు గడ గడ వణుకుచు, ముకుళిత హస్తములతో "మహానుభావా! నేను ధర్మహీనుడను, నా యజ్ఞానముచే నేనీ కార్యము చేసితిని. నన్ను రక్షింపుడు. బ్రాహణులకు శాంతియే ప్రధానము. మీరు తపోధనులూ, దయా దాక్షిణ్యములు గలవారూ కాన, నన్ను కాపాడు" డని అతని పాదములపై పడెను. దయాశూన్యుడైన దూర్వాసుడు అంబరీషుని తలను తన యెడమకాలితో తన్ని "దోషికీ శాపమీయకుండా వుండరాదు. నీవు మొదటి జన్మలో చేపగాను, రెండవ జన్మలో తాబేలుగానూ, మూడవజన్మలో పందిగాను, నాలుగవ జన్మలో సింహముగాను, యైదవజన్మలో వామనుడు గాను, ఆరోవ జన్మలో క్రూరుడవగు బ్రాహణుడవుగాను, యేడవ జన్మలో మూఢుడవైన రాజుగాను, యెనిమిదవ జన్మలో రాజ్యముగాని సింహాసనముగానిలేనట్టి రాజుగాను, తొమ్మిదవ జన్మలో పాషండ మతస్తునిగాను, పదవ జన్మలో పాప బుద్ధిగల దయలేని బ్రాహ్మణుడవుగాను పుట్టెదవుగాక" అని వెనుక ముందు లాలోచించక శపించెను. ఇంకను కోపము తగ్గనందున మరల శపించుటకు ఉద్యుక్తడగుచుండగా, శ్రీ మహావిష్ణువు బ్రాహణ శాపము వృధాకాకూడదని, తన భక్తునికి ఏ అపాయము కలుగకుండుటకు - అంబరీషుని హృదయములో ప్రవేశించి "మునివర్యా! అటులనే - మీ శాపమనుభవింతు" నని ప్రాధేయపడెను. కాని దూర్వసుడింకనూ కోపము పెంచుకొని శపించబోగా, శ్రీమన్నారాయణుడు తన సుదర్శన చక్రమును అడ్డుపెట్టెను. ఆ సుదర్శనము కోటి సూర్యప్రభలతో అగ్నిజ్వాలలు గ్రక్కుచూ దూర్వసునిపై పడబోయెను. అంత దూర్వాసుడు ఆ చక్రము తనని మసిచేయునని తలంచి ప్రాణముపై ఆశ కలిగి అచటి నుండి "బ్రతుకుజీవుడా" యని పరుగిడెను. మహాతేజస్సుతో చక్రాయుధము దూర్వసుని తరుముచుండెను. దుర్వాసుడు తనను కాపాడమని భూలోకమున ఉన్న మహామునులను, దేవలోకమున కరిగి దేవేంద్రుని, బ్రహ్మలోకానికి వెళ్లి బ్రహ్మదేవుని, కైలాసమునకు వెళ్లి పరమేశ్వరునీ యెంత ప్రార్దంచినను వారు సైతము చక్రాయుధము బారినుండి దూర్వాసుని కాపాడలేకపోయిరి.

ఇట్లు స్కాంద పురాణంతర్గత వశిష్టప్రోక్త కార్తీక మహాత్మ్యమందలి పంచవింశోధ్యాయము - ఇరవయ్యయిదో రోజు పారాయణము సమాప్తము.

🌹 🌹 🌹 🌹 🌹




🌹కార్తీక మాసం 25వ రోజు పూజించ వలసిన దైవం - చేయవలసిన మంత్రం - దానం - నైవేద్యం 🌹
ప్రసాద్‌ భరధ్వాజ

నిషిద్ధములు:- పులుపు, చారు - వగయిరా ద్రవపదార్ధాలు

దానములు:- యథాశక్తి

పూజించాల్సిన దైవము:- దిక్పాలకులు

జపించాల్సిన మంత్రము:-

ఓం ఈశావాస్యాయ స్వాహా

🌹 🌹 🌹 🌹 🌹