అద్భుత సృష్టి (Adbhuta Sr̥ṣṭi)

🌹. అద్భుత సృష్టి - 1 🌹
✍. DNA స్వర్ణలత గారు
📚. ప్రసాద్ భరద్వాజ

ఈ పుస్తకం గురించి బ్రహ్మర్షి పితామహ పత్రి సార్ మాటలు

🌟 *"అద్భుత సృష్టి"*🌟

మహాయోగిని, పిరమిడ్ మాస్టర్ "స్వర్ణలత" గారికి నా హృదయపూర్వక అభినందనలు! ఇంత గొప్ప గ్రంథం తెలుగు భాషలో రావటం చాలా అద్భుతమైన విషయం! ఎన్నో లోకాలు!
ఎన్నో శరీరాలు
ఎన్నో చక్రాలు
ఎంతో ఉన్నతి చెందాలి! అన్నింటికీ ఉంటాయి అర్థాలు!

తెలుసుకున్న వారికి తెలుసుకున్నంత!
ప్రతి పిరమిడ్ ధ్యాని తప్పక చదవాలి!
ఏమీ అర్థం కాకపోయినా చదవాలి!
తినగ తినగ వేము తీయగనుండును కదా! ఈ పుస్తకాన్ని తింటూనే ఉందాం!
మరొకసారి స్వర్ణలత గారికి అభినందనలు!
***

*🌻. విశ్వం/సృష్టి ఆవిర్భావం - 1 🌻*

కొన్ని కోట్ల సంవత్సరాలకు పూర్వం అంటే (బిలియన్, ట్రిలియన్ సంవత్సరాలకు పూర్వం) *"మూల చైతన్యం"*( దానినే మనం 'దేవుడు లేదా ఎటర్నల్ బుద్ధా అంటాం') ఒక అమరత్వం ..తనని తాను సృష్టించుకుంది.

🔺వ్యక్తంకాని..
అవ్యక్తరూపం.. శూన్యంగా ఉన్న స్థితి. ఈ స్థితి వ్యక్తం అవ్వడం ప్రారంభించింది.

🔺మొదట శూన్యంగా ఉన్న ఈ అవ్యక్త రూపం కొద్దిగా కదిలింది. ఈ కదలికనే *"ఆలోచన"* అన్నారు. ఈ ఆలోచనే మొదటి ఆలోచన. మొదటి ఆలోచన పుట్టిన స్థలం *"ఆది మానసం"*(మొదటి మనస్సు) అన్నాం. మొదటి మనస్సులో పుట్టిన మొదటి ఆలోచనే *"ఆది సంకల్పం"*.

🔺ప్రతి ఆలోచనకు ఒక *"శక్తి"* ఉంటుంది. శక్తికి ప్రకంపన ఉంటుంది.( వైబ్రేషన్) *"వైబ్రేట్"* అంటే ప్రకంపించేది లేదా కదిలేది. అలలు అలలుగా ఈ ప్రకంపనా రంగం నుండి ఒక పెద్ద విస్పోటనం సృష్టించబడింది. విస్పోటనం గావించబడిన మూల చైతన్యం నుండి *"మూల ఆత్మలు"* సృష్టించబడ్డాయి.

*సంకల్పం*=ఒక పనిని పూర్తి చేయడానికి వేసుకునే బలమైన ప్రణాళిక.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

------------------------------------ x ------------------------------------


🌹. అద్భుత సృష్టి - 2 🌹
✍. రచన, సంకలనం- DNA స్వర్ణలత గారు
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🌻. విశ్వం/సృష్టి ఆవిర్భావం - 2 🌻

🌟 మూల చైతన్యం మూడు విధాలుగా విభజించబడింది.

1. కాంతి
2. శబ్దం
3. శక్తి

(మూలకాంతి, మూలశక్తి, మూలశబ్దం) గా సృష్టించబడ్డాయి. ఇవి అన్నీ ఆది చైతన్యంలోని విభాగాలే.

మూలశక్తికి మరోపేరే - " ఆదిపరాశక్తి"

ఆదిశక్తి నుండి సృష్టి, స్థితి, లయలు సృష్టించబడ్డాయి.

1. సృష్టి - సన్ ఎనర్జీ - బ్రహ్మ - సృష్టికారకుడు -సృష్టికర్త -(సృష్టిప్రదాత)

2. స్థితి - మదర్ ఎనర్జీ - విష్ణు - స్థితికారకుడు - పోషణకర్త - (స్థితి ప్రదాత)

3. లయ - ఫాదర్ ఎనర్జీ - మహేశ్వర - లయకారకుడు - జ్ఞానకర్త (జ్ఞాన ప్రదాత)

1. యూనివర్సల్ ఫాదర్ ఎనర్జీ (తండ్రి ) - కాన్షియస్ నెస్ (ఎరుక)

2. యూనివర్సల్ మదర్ ఎనర్జీ (తల్లి) - లైఫ్ ఫోర్స్ (ప్రాణశక్తి)

3. యూనివర్సల్ సన్ ఎనర్జీ (కొడుకు) -మెటీరియల్ ఎనర్జీ (పదార్థం)

ఈ మూడు శక్తులతోనే ఎన్నో యూనివర్సలనూ, గెలాక్సీలనూ, సోలార్ సిస్టమ్ లనూ మరి గ్రహాలనూ సృష్టించడం జరిగింది. 

సశేషం... 
🌹 🌹 🌹 🌹 🌹

------------------------------------ x ------------------------------------


🌹. అద్భుత సృష్టి - 3 🌹
✍️. DNA స్వర్ణలత గారు
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🌻. విశ్వం/సృష్టి ఆవిర్భావం - 3 🌻

🌟 మనం ఉన్న సోలార్ సిస్టమ్ (సౌర కుటుంబం) లోని సూర్యుడు తన యొక్క ప్లానెటరీ సెంట్రల్ సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉంటాడు. ఇది జరగడానికి సుమారు 26,000 సంవత్సరాలు పడుతుంది. 

ఇదంతా ఒకానొక *"ప్రకంపనా రంగం"* అని చెప్పవచ్చు. ప్లానెటరీ కేంద్ర సూర్యుడు గెలాక్టిక్ సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉంటాడు. ఈ గెలాక్టిక్ కేంద్ర సూర్యుడు యూనివర్సల్ కేంద్ర సూర్యుని (సెంట్రల్ సన్) చుట్టూ తిరుగుతూ ఉంటాడు.

🌟ఈ ప్రకంపన ద్వారా సృష్టి యావత్తు కి పోషణ లభిస్తూ ఉంటుంది.
మూల చైతన్యం నుండి(శూన్యం) - ఆదిఆత్మ (ఆదిశక్తి) ఉద్భవించింది.
ఆదిఆత్మ నుండి - బ్రహ్మాత్మల సృష్టి జరిగింది.
బ్రహ్మాత్మల నుండి - విశ్వాత్మల సృష్టి జరిగింది.
విశ్వాత్మల నుండి - మహా ఆత్మల సృష్టి జరిగింది.
మహా ఆత్మల నుండి - పూర్ణాత్మల సృష్టి జరిగింది.
పూర్ణొత్మల నుండి - జీవాత్మలు సృష్టించబడ్డాయి.

ఈ ఆత్మ లన్నింటినీ యూనివర్సలు(విశ్వాలు), గేలక్సీలు, నక్షత్రాలు, ప్లానెట్స్ లోకి పంపడం జరిగింది. ఈ ఆత్మ స్వరూపాలు అన్నీ సూపర్ సోల్ (భగవంతుడు)నుండి ఒకేసారి సృష్టించబడ్డాయి. అందుకే వీటన్నింటి వయస్సు ఒక్కటే!

🌟 పూర్తి విశ్వంలో ఇప్పటికి ఏడుసార్లు సృష్టి జరిగింది. సృష్టియావత్తు సృష్టించబడుతూ, లయం పొందుతూ, మళ్ళీ సృష్టించబడుతూ ఉంటుంది. ఇదే సృష్టి ప్రణాళిక!

సశేషం... 
🌹 🌹 🌹 🌹 🌹

11.Aug.2020

------------------------------------ x ------------------------------------

🌹. అద్భుత సృష్టి - 4 🌹
✍ రచన, సంకలనం- DNA స్వర్ణలత గారు
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🌻. విశ్వం/సృష్టి ఆవిర్భావం - 4 🌻

🌟 ఇప్పుడు మనం 27వ కల్పం అయిన "శ్వేతవరాహకల్పం" లోని "వైవసత్వ మన్వంతరం" లో ఉన్నాం.

🌟ప్రతి మతం కూడా "యుగాలు మారుతూ ఉంటాయి" అని ఒప్పుకుంది. వీటన్నింటిలో జీవ పరిణామక్రమం జరుగుతూనే ఉంటుంది.

ఈ పరిణామక్రమం కోసం శక్తి, జ్ఞానం, స్థితి ఎప్పుడూ అవసరం అవుతూనే ఉంటాయి. సకల జీవరాశి కూడా ఈ మూడు స్థితులపైనే ఆధారపడుతూ ఉంటుంది.

🌟 జీవం అంటే ప్రాణం. ఈ ప్రాణం మనకు సూర్యుని నుండి వస్తుంది. ఆ సూర్యునికి మూలం నుండి వస్తుంది. సూర్యునిలో జీవశక్తి తరంగాలుఎప్పటికప్పుడు ఉద్భవిస్తూనే ఉంటాయి. ఈ శక్తి తరంగాలు ప్రకంపనల రూపంలో జీవులకు అందుతూ ఉంటాయి. తిరిగి జీవుల నుండి పునఃప్రసరణ చేయబడతాయి.

🌟ఈ భూమిని సృష్టించడానికి ముందు వేరే లోకంలో మరొక చోట ఎన్నో ప్రయోగాలు చేసిన తర్వాత మనం ఉన్న ఈ భూమిని సృష్టించి... దాని పై జీవరాశి సృష్టించబడింది. ఈ భూమి పై మొదట చైతన్యాలను మాత్రమే సృష్టించడం మరి కొన్ని ప్రయోగాల తర్వాత జీవరాశిని సృష్టించడం జరిగింది.

🌟తరువాత జీవుల దేహాలను సృష్టించి.. విశ్వం యొక్క సమాచార జ్ఞానమంతా కూడా మానవ దేహంలోని క్షణాల్లో ఉన్న న్యూక్లియస్ లోపల ఉన్న క్రోమోజోమ్స్ లోని D.N.A. లోని "జీన్స్" (అంటే జన్యువుల)లో నిక్షిప్తం చేయడం జరిగింది 

సశేషం.. 
🌹 🌹 🌹 🌹 🌹

13.Aug.2020

------------------------------------ x ------------------------------------

🌹. అద్భుత సృష్టి - 5 🌹
✍ రచన, సంకలనం- DNA స్వర్ణలత గారు
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🌻. విశ్వం/సృష్టి ఆవిర్భావం - 5 🌻

🌟. ఈ విశ్వం యొక్క సమస్త జ్ఞానం... మానవ D.N.A.లో నిక్షిప్తమై సూక్ష్మరూపంలో దాగి ఉంది. దీనినే "జన్యు సమాచారం" అంటారు.

భౌతిక అసెన్షన్ పొందడానికి.. బాధలు, భయాలు, కష్టాలు వీటన్నింటినీ (ద్వంద్వత్వాన్ని ) దాటి ఎప్పుడైతే మానవుడు ముందుకు వస్తాడో.. అప్పుడు ఏకత్వం లోకి వస్తాడు. సకల జీవరాశికీ, ఇతర విశ్వాలకూ "మార్గదర్శక ఆత్మ" గా మానవుడు మారతాడు.

🌟. అప్పుడు ఈ భూమి అంతర్ విశ్వాల, విశ్లేషణ, వినిమయ, సమాచార, ప్రసరణా కేంద్రంగా మారి తన యొక్క లక్ష్యాన్ని నెరవేర్చుకుంది. భూమి లక్ష్యం పూర్తి అయ్యింది అంటే ..మన లక్ష్యం కూడా పూర్తి అయినట్లే!

🌟. ఈ సృష్టి యావత్తు.. భూమిపై ఉన్న వారికి ఎన్నో విశ్వాలలో ఉన్నవారితో అంతర్గత కలయిక( ఇంటర్ కనెక్షన్) కలిగి ఉంది. ఈ భూమిపై ఉన్న వారు మారితే.. ఎన్నో విశ్వాలలో ఉన్న ఇలాంటి భూములు కూడా మారడం జరుగుతుంది.

🌟. విశ్వం నిరంతరం సృష్టించబడుతూ, మార్పు చెందుతూ, పరిణతి చెందుతూ ముందుకు ప్రయాణిస్తూనే ఉంటుంది. దీనినే "పరిణామక్రమం" అన్నారు. ఈ పరిణామం కోసం కొన్ని కొలతలను మరి కాల గమనాలను సృష్టించడం జరిగింది. శక్తి ప్రసరణ కేంద్రాలనూ, శబ్దతరంగ భేరులనూ (ప్రకంపనలు) జ్ఞాన భాండాగారాలనూ, (కర్మ)చేసిన పని కోసం కర్మ ఫలితాలనూ, వాటి కోసం కర్మవర్కర్స్ నీ, కాంతి ప్రసరణకోసం 1,44,000 మంది కాంతి లోక వాసులనూ మరి వారి పై అధికారులను ఇలా ఎన్నో శక్తులతో మూల చైతన్యం తనని తాను సృష్టించుకుంది.

🌟. దేవీ పురాణం మరి బ్రహ్మాండ పురాణాలల్లో సృష్టి రహస్యం గురించి అద్భుతంగా వెల్లడించబడింది!

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

14.Aug.2020

------------------------------------ x ------------------------------------


🌹. అద్భుత సృష్టి - 6 🌹
✍ రచన, సంకలనం- DNA స్వర్ణలత గారు
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🌟 2. భూమి - మానవ సృష్టి 🌟

💫. సృష్టిలో మిగతా అన్ని అంశాల లాగే.. ఈ భూమి కూడా సృష్టించ బడింది. ఈ భూమిపై ఇన్ని వనరులు ఉండటానికి కారణం - "ఈ భూమిని ఒక ప్రయోగశాల లాగా మరి స్వేచ్ఛా సంకల్ప సీమగా సృష్టించాలి" అనే ప్రాథమిక సృష్టికర్త యొక్క సంకల్పం. ఈ ప్రయోగశాలను "అంతర్ విశ్వాల సమాచార విశ్లేషణ, వినిమయ, ప్రసార కేంద్రం" గా మలచడం జరిగింది.

ఈ ప్రాజెక్టు కోసం.. ఎన్నో ఇతర విశ్వాల ప్రతినిధులు ఈ భూమిపై జన్మలు తీసుకునేలా ప్రయత్నాలు ప్రారంభం అయ్యాయి.

అనంతవిశ్వంలో ఉన్న జన్యుశాస్త్ర నిపుణులు.. ఈ భూమిపై జన్మ తీసుకుంటున్న విశ్వ ప్రతినిధుల జన్యువులను తయారుచేసి అందులో విశ్వ సమాచారం, వంశ సమాచారాలను.. ప్రకంపనల రూపంలో, విద్యుత్ తరంగాల రూపంలో క్రోడీకరించిన సమాచారాన్ని నిక్షిప్తం చేసి ..భూమిపై జీవించే ప్రాణులుగా సృష్టించడం జరిగింది. ఇతర విశ్వాలలో ఉన్న ఎంతో జన్యు పరిజ్ఞానాన్ని పొందుపరుస్తూ మానవులనూ మరి జంతువులనూ వైవిధ్యంగా తయారు చేశారు.

వీటి యొక్క జీవ పరిణామక్రమాలను ఎప్పటికప్పుడు నమోదు చేసుకుంటూ (ఆకాషిక్ రికార్డ్స్ రూపంలో) వాటిని అధ్యయనం చేస్తూ ఈ భూమిని ఒక కాంతి కేంద్రంగా... ఒక సమాచార కేంద్రంగా... ఒక "సజీవ గ్రంథాలయం" గా తీర్చిదిద్దారు!

(సశేషం)
🌹 🌹 🌹 🌹 🌹

15.Aug.2020

------------------------------------ x ------------------------------------


🌹. అద్భుత సృష్టి - 7 🌹
✍ రచన, సంకలనం- DNA స్వర్ణలత గారు
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🌟 2. భూమి - మానవ సృష్టి - 2 🌟

🌟. ఈ భూమిని సమాచార ప్రసరణ కేంద్రంగా మలచిన వారు "కాంతి శరీరధారులు"! 'కాంతి' అంటే 'చైతన్యం'. కాంతే సమాచారం. ఈ సమాచారాన్ని విభిన్న ప్రకంపనల రూపంలో.. DNA లోని జన్యువులలో పదిలపరచి ఈ భూమిని ప్రయోగశాలగా మార్చారు. 

ఇక్కడ కొన్ని కోట్ల సంవత్సరాలు (అనేక యుగాలు) ఎన్నో జన్యుపరిజ్ఞాన పరిశోధనలు జరిగాయి. మన పుస్తకాలలో చదువుకున్న చరిత్రకు పూర్వమే భూమి ఎంతో గొప్ప నాగరికతను సంతరించుకుంది. ఇప్పుడు modern science చేస్తున్న కొత్త కొత్త ప్రయోగాలు అన్నీ ఈ భూమిపై ఎప్పుడో జరిగిపోయాయి!

💫. ఇంతటి జ్ఞానాన్ని నిక్షిప్తం చేసుకున్న ఈ భూమి అనే సజీవ గ్రంథాలయాన్ని సొంతం చేసుకోవడానికి ఎన్నో విశ్వాలవాళ్ళు ఎన్నో ప్రయత్నాలు చేసి యుద్ధాలు కూడా చేసుకున్నారు.

💫. ఇప్పటి కాలమానం ప్రకారం మూడు లక్షల సంవత్సరాలకు పూర్వం ఈ భూమి దురాక్రమణకు గురి అయింది. ఈ ఆక్రమణదారులకు భూమి, భూలోకవాసులు విజ్ఞానులుగా, స్వతంత్రులుగా ఉండటం ఇష్టం లేదు. 

భూమిపై ఉన్న మనుషులను అజ్ఞానులుగా తయారు చేసి ఈ భూమిని ఆక్రమించి వారి ఆధీనంలోకి తెచ్చుకున్నట్లైయితే... ఇలాంటి ఎన్నో విశ్వాలతో ఉన్న భూములు తమ ఆధీనంలోకి వస్తాయనీ.. తద్వారా మూలం పై (భగవంతునిపై) తిరుగుబాటు చేయవచ్చు అన్న ఆలోచనతో వారు భూమిని దురాక్రమించడం జరిగింది.

💫. భూమిని ఆక్రమించిన వెంటనే వాళ్ళు మొదట భూమిపైకి వస్తున్న ఇతర విశ్వాల సమాచార వ్యవస్థను ధ్వంసం చేశారు. దీని ద్వారా మానవునికి అందుతోన్న జ్ఞానం అందకుండాపోయి .. 

కాంతి ద్వారాలు అన్నీ మూసివేయబడ్డాయి. 'కాంతి' అంటే 'జ్ఞానం'. ఈ జ్ఞాన ప్రసరణ భూమిపైకి మరి ఏ ఇతర దారుల గుండా రాకుండా భూమి యొక్క కాంతి గ్రిడ్ లను ఛేదించి.. చీకటి శక్తుల యొక్క పటిష్టమైన గ్రిడ్ లను తయారు చేశారు. వీటి వల్ల కాంతి భూమిపైకి రాకుండా కొన్ని వేల సంవత్సరాలపాటు చీకటిలో ఉండిపోయింది.

'చీకటి' అంటే 'అజ్ఞానం'. ఇలా వాళ్ళు భూమినీ మరి భూమిపై ఉన్న మనుషులనూ పూర్తి అజ్ఞానులుగా, ద్వంద్వత్వపు గేమ్ లోని పావులుగా తయారు చేశారు. 

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹


17.Aug.20202

------------------------------------ x ------------------------------------

🌹. అద్భుత సృష్టి - 8 🌹
✍ రచన, సంకలనం- DNA స్వర్ణలత గారు
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🌟 2. భూమి - మానవ సృష్టి - 3 🌟

🌟. ఈ భూమిని ఆక్రమించిన వారు గొప్ప జన్యుశాస్త్ర నిపుణులు! వారు ప్రాణప్రతిష్ట చేయడంలో నిష్ణాతులు. దురాక్రమణకు ముందు ఉన్న మానవుడు సాక్షాత్తు దైవమే! ఈ దైవంలో ఎన్నో అద్భుతశక్తులు దాగి ఉన్నాయి. పరిపూర్ణజ్ఞానం, పరిపూర్ణప్రేమ, పరిపూర్ణచైతన్యం అనే దివ్యశక్తులు కలిగిన "స్త్రీ శక్తి (ఫెమినైన్ఎనర్జీ)" ని కలిగి ఉన్న దివ్యమానవుడు.

💫. ఈ పరిపూర్ణ శక్తులన్నింటినీ గ్రహిస్తూ, వినియోగిస్తూ, ఆనందవిహారిగా ఉన్న ఈ దైవమానవుడు దురాక్రమణ తరువాత తన సర్వశక్తులూ కోల్పోయి.. సామాన్య మానవునిగా మారిపోయాడు.

💫. దైవం మానవ చైతన్యమైన తన జన్యువులను (12 ప్రోగులు నుండి144 ప్రోగుల వరకు ఉన్న జ్ఞానం)ఎన్నో ప్రయోగాలు చేసి వాటిలో ఉన్న పరిపూర్ణ శక్తులను, జ్ఞానాన్ని తొలగించి రెండు ప్రోగుల అల్పమైన మానవునిగా... ఇతరులపై ఆధారపడే వ్యక్తిగా మార్చారు. 
వీరి యొక్క లక్ష్యం కేవలం భౌతికతే. ఈ "రెండు ప్రోగుల మానవుడు" అజ్ఞానిగా, అరిషడ్వర్గాలకు లోబడి ఉండే వ్యక్తిగా ఉంటూ, మూలాధారస్థితి కన్నా తక్కువ స్థాయిలో జీవిస్తున్నారు.

💫. మానవుల యొక్క ఈ అజ్ఞానం కారణంగా స్వేచ్ఛా సీమగా ఉండవలసిన భూమి ఆక్రమణ భూమిగా మారిపోయింది.
ఎన్నో విశ్వాలకు జ్ఞానం అందించవలసిన ఈ భూమి, ఇక్కడ ఉన్న చీకటిని (అజ్ఞానం) ఇతరులకు పంచే స్థితికి తయారయింది. ఈ భూమిని ఆక్రమించుకున్న వారి లక్ష్యం కూడా అదే. ఈ భూమి ద్వారా అనంత విశ్వాలను జయించవచ్చు అన్న కోరిక. 
ఈ భూమిని మొదటగా సృష్టించిన చైతన్య స్వరూపులు అయిన సృష్టికర్తలకు ఈ భూమిని వదులుకోవడం ఇష్టంలేదు. ఉన్నత కాంతిలోకాలలోని ... ఉన్నత శరీరధారులతో సంప్రదించి ఈ భూమినీ, ఈ భూమిపై ఉన్న జీవరాశినీ పునర్నిర్మించే పనిని చేపట్టారు.
తిరిగి భూమిని వెలుగులతో నింపటానికి భూమి చుట్టూ ఉన్న గ్రిడ్ లను సరిచేసి.. కాంతి వచ్చే మార్గాలైన కాంతి ద్వారాలనూ మరి సమయ ద్వారాలనూ తెరవడానికి వారు ప్రయత్నించారు. 
ఈ కార్యక్రమానికి ముందే వారు "మానవ జన్యువులను తిరిగి 12 ప్రోగులకు సరిచేయాలి" అని ఒక నిర్ణయం తీసుకున్నారు. ఆ ప్రాజెక్ట్ వర్క్ 12 లోకాల వారు స్వీకరించి పూర్తి చేయడం జరిగింది. ఇది అంతా లక్ష సంవత్సరాల పూర్వమే ప్రారంభం అయింది.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

18.Aug.2020

------------------------------------ x ------------------------------------

🌹. అద్భుత సృష్టి - 9 🌹
✍ రచన, సంకలనం- DNA స్వర్ణలత గారు
సేకరణ : ప్రసాద్ భరద్వాజ


🌟. మనకు నూతన DNA ఇచ్చినవారు. 🌟

నూతన ప్రాజెక్ట్ రూపంలో నూతన DNA పునరుద్ధరణ శకం ప్రారంభమైంది. 

విశ్వాల యొక్క శాంతిభద్రతల కోసం కొన్ని లక్షల సంవత్సరాల క్రితం ఏర్పడిన "ఇంటర్ గెలాక్టిక్ ఫెడరేషన్ ఆఫ్ లైట్" నిబురా కౌన్సిల్ సభ్యులు, ఆస్తర్ కమాండర్ సభ్యులు, వైట్ బ్రదర్ హుడ్ ఆఫ్ గ్రేట్ లోటస్ యొక్క 12 కిరణాలు, 12 ఉన్నత లోకవాసులు, గురువులు, దైవాలు ఎందరో ఈ ప్రాజెక్ట్ లో భాగస్వాములు అయ్యారు.

💫. 12 DNA ప్రోగుల నూతన మానవుని కోసం నూతన సృష్టికి శ్రీకారం చుట్టారు. అందులో భాగంగా I.G. ఫెడరేషన్ ఆఫ్ లైట్ ద్వారా "లైరా " అనబడే కాంతి లోకంలో ఒక మీటింగ్ ఏర్పాటు జరిగింది. 

"ఇప్పటి వరకు మనం భూమిని ప్రతిసారీ నాశనం చేసి తిరిగి నిర్మిస్తూ వస్తున్నాం అయినా కొంత కాలం తరువాత అదే పరిస్థితి మిగులుతుంది. కాబట్టి ఈసారి భూమిని పునః నిర్మాణం చేయడం కాకుండా శాశ్వత పునరుద్ధరణ కార్యక్రమం చేపడదాం" అని వారు నిర్ణయించారు.

💫. అంటే ఇక్కడ ఉన్న మానవులను ప్రళయంతో అంతం చేయకుండా.. మానవునిలో ఉన్న తక్కువ చైతన్యాలను (2ప్రోగుల DNA), ఉన్నత చైతన్యాలుగా(12ప్రోగుల DNA) మార్చాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా భూమిపైకి "ఫ్లైడియన్స్" వచ్చి ఎన్నో ముఖ్య పరీక్షలు నిర్వహించడం జరిగింది. ఆ తర్వాత ఎన్నో స్టార్ నేషన్స్ వారు కూడా ఈ భూమి మీదకు రావడం జరిగింది.

💫. ఈ ప్రక్రియలో భాగంగా 12 ఉన్నత లోకవాసులు తమ యొక్క DNA సామర్థ్యాలను ఇచ్చి.. 12 ప్రోగుల దేవత్వం నిండిన నూతన మానవుని తయారు చేశారు.

12 ప్రోగుల DNA ని ఇచ్చిన వారి పేర్లు;

1. ప్లైడియన్స్
2. ఆర్కుట్యూరియన్స్
3. ఆండ్రోమెడన్స్
4. సిరియన్స్
5. లైరన్స్
6. వేగన్స్
7. అల్ఫా సెంట్యూరియన్స్
8. బెలిట్రీషియన్స్
9. ఓరియన్స్
10. వేస్తాస్
11. ఫాన్
12. ఓవర్ లైటింగ్

మీరంతా వారివారి ప్రత్యేక సామర్థ్యాలున్న DNA ని ఇచ్చి మనల్ని నూతన మానవునిగా తయారు చేశారు.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹


19.Aug.2020

------------------------------------ x ------------------------------------

🌹. అద్భుత సృష్టి - 10 🌹
✍ రచన, సంకలనం- DNA స్వర్ణలత గారు
సేకరణ : ప్రసాద్ భరద్వాజ


🌟. మనకు నూతన DNA ఇచ్చినవారు. - 2 🌟

🌟. 12 ప్రోగుల ఉన్నత చైతన్యాలను తయారు చేసి మానవుడిలోనే DNA రూపంలో భద్రపరచడం జరిగింది. వెంటనే వారికి ఆ జ్ఞానాన్ని అందుబాటులోనికి రాకుండా వీరు జాగ్రత్తపడ్డారు. 

ఎందుకంటే నూతన మానవుని సృష్టించిన సమయానికి భూమిపై ఇప్పుడు ఉన్నంత ఉన్నత స్థాయి ఫ్రీక్వెన్సీ లేదు. అందుకనే ఈ భూమికి ఉన్నతస్థితి ఫ్రీక్వెన్సీ వచ్చేవరకు, మానవునిలో 2 ప్రోగులు మాత్రమే యాక్టివేషన్ లో ఉన్నాయి. మిగతా 10 ప్రోగులు నిద్రాణస్థితిలో ఉండటం జరిగింది. ఈ నిద్రాణమై ఉన్న 10 ప్రోగులలోనే కాంతి భాషకు సంబంధించిన మన యొక్క డైమెన్షన్ల జ్ఞానం దాగి ఉంది.

💫. ఎప్పుడైతే మానవునిలోని 12 ప్రోగ్రులు జాగృతి అవుతాయో అప్పుడు ఈ భూమి తిరిగి "అంతర్ విశ్వాల విశ్లేషణ, వినిమయ, సమాచార ప్రసరణా కేంద్రం" అనే స్వేచ్ఛ - సంకల్ప - ఆదర్శ శక్తి క్షేత్రంగా మారి, తారాస్థాయిలో నిలిచిపోతుంది. ఈ సామాన్య(2 ప్రోగుల) మానవుడు దైవ (12ప్రోగుల) మానవునిగా మారిపోతాడు.

💫. మానవ దేహ కణాల్లో ఉండే సన్నని దారపు ప్రోగుల లాంటి నిర్మాణాన్ని DNA అని పిలుస్తారు. ఈ నిర్మాణంలో మానవుని యొక్క మానవ, విశ్వ దైవిక శక్తుల యొక్క సమాచారం అనే కేంద్రాలతో కనెక్షన్ కలిగి ఉంటుంది.

💫. ఈ సన్నని దారపు ప్రోగులు కణాల్లో కాంతి ఎన్ కోడెడ్ ఫిలమెంట్లు శక్తితో కూడుకుని ఉంటాయి. ఈ సన్నని దారపు ప్రోగులనే "DNA" అంటారు.

💫. DNAమెలి తిప్పిన నిచ్చెనలా ఉంటుంది. దీనిని " DNA Helix" అంటారు. (రెండు రంగుల కరెంట్ వైరు మెలి తిప్పి ఎలా అయితే ఉంటుందో అదే విధంగా ఉంటుంది.) దీనిని సర్పిలాకార DNA అని పిలుస్తారు.

💫. మానవ DNAలో 12 ప్రోగుల సమాచార జ్ఞానం ఉంటుంది. ఈ 12 ప్రోగులు 12 శక్తి క్షేత్రాలతోనూ, 12 లోకాలతోనూ, 12 పవిత్ర జామితియ్య గ్రిడ్లతోనూ అనుసంధానం కలిగి ఉంటుంది.

సశేషం.... 
🌹 🌹 🌹 🌹 🌹


20.Aug.2020

------------------------------------ x ------------------------------------



అద్భుత సృష్టి - 11 

 రచన, సంకలనం- DNA స్వర్ణలత గారు
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

. ఇప్పుడు మన యొక్క DNA 2 నుండి 12 స్థాయిల వరకు ఎదిగే క్రమంలో ఉంది. ఇది యుగమార్పుల వలన సంభవించింది. ఎన్నో యుగాలుగా కోట్ల మంది తమ సహజమైన స్థితి ని అంగీకరించి తమ యొక్క శరీర ఫ్రీక్వెన్సీని 2 ప్రోగులు స్థాయి నుండి 12 ప్రోగుల స్థాయికి ఎదిగేలా తమ శరీరాలలో మార్పులు తెచ్చుకుంటున్నారు.


. వారు మారడమే కాకుండా గ్రహంపైన కూడా ఎన్నో మార్పులను తీసుకుని వచ్చి ఈ గ్రహాన్ని పవిత్ర శక్తి క్షేత్రంగా మారుస్తున్నారు.
12 ప్రోగుల DNA శరీర కణాల్లోనే కాకుండా శరీరం బయట విశ్వం మూలం వరకు విస్తరించి ఉంటుంది.

. అధిక శక్తి, కాంతి సమాచారం శరీరంలోనికి రావటం వలన DNA యాక్టివేట్ అయ్యి మన శరీర ఫ్రీక్వెన్సీ పెరిగి ఒక గొప్ప స్థితిలోకి మారుతుంది. ఎప్పుడైతే భౌతిక శరీరం తన స్థితిని మార్చుకుని క్రిస్టల్ రూపమైన కాంతి శరీరంగా మారుతుందో ఆ రూపాన్ని "12 ప్రోగుల DNA యాక్టివేషన్" అని చెప్పడం జరిగింది.

. క్రిస్టల్ రూపమైన కాంతి శరీరంలోని కణ నిర్మాణం ఎప్పటికీ నశింపుకాని విధంగా ఉంటుంది. ఈ శరీరాన్ని కలిగిన వారిని "ఇమ్మోర్టల్ బీయింగ్స్" అంటారు. ఈ కాంతి దేహం సూపర్ కంప్యూటర్ వలె పని చేస్తూ అన్ని విశ్వాల సమాచారాన్నంతా నిక్షిప్తం చేస్తూ పునః ప్రసారం చేస్తూ ఉంటుంది.

. దీనివలన శరీరంలోని శక్తి క్షేత్రాలు అన్నీ కూడా ఏకీకృతం అవ్వడం జరుగుతుంది. దివ్యత్వపు జాగృతి పెరుగుతుంది. మానవ అనుభవాల నుండి దివ్య అనుభవాలను పొందే స్థితికి మారిపోతుంది.
ఇప్పటి వరకు ఉన్న సరికాని శక్తి అయిన భౌతికమైన గ్రేడ్లను చేదిస్తూ కాంతి గ్రేడ్లను ఏర్పాటు చేసుకుంటుంది. శరీరం బయటా మరి లోపలా కూడా కాంతిని కలిగి ఏక స్థితిని పొందుతూ ప్రాధాన్యం తాదాత్మ్యం చెందుతూ ఉంటుంది.

. తనని తాను మార్చుకోవడమే కాకుండా తాను నివసిస్తున్న గ్రహాన్నీ..‌. ఆ గ్రహంపై ఉన్న జీవరాశినంతటినీ ఒక గొప్ప షిఫ్టులోనికి తీసుకొని వెళ్ళడం జరుగుతుంది.

. ఈ మార్పు కారణంగా ఎన్నో విశ్వాలు (భూమితో అనుసంధానమైనవి) శాంతినీ, కాంతినీ పొంది జాగృతమవ్వడం జరుగుతుంది. బహుశా ఈ మార్పును " నూతన యుగ మార్పు" అనవచ్చు. ఈ మార్పు ఇంకా, ఇంకా జరుగుతూ భూమి అనంతంగా చైతన్యవంతం అవుతూ ఉంటూనే ఉంటుంది.(This is endless process). 

సశేషం.... 


21.Aug.2020

------------------------------------ x ------------------------------------


🌹. అద్భుత సృష్టి - 12 🌹

✍ రచన, సంకలనం- DNA స్వర్ణలత గారు
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🌟. DNA సంక్షిప్త చరిత్ర 🌟

💫. చాలా సంవత్సరాల క్రితం భూమి మీద మొట్టమొదట మానవుడు ఏర్పడినప్పుడు వారి యొక్క DNA చాలా భిన్నంగా ఉండేది.

ఈ DNAలో ఉన్న జ్ఞానం ద్వారా ఈ భూమిపైన ద్వంద్వత్వం నుండి నేర్చుకుంటూ మూడవ, నాల్గవ, ఐదవ పరిధులలో తేలికగా పరిణితి చెందేలా ఉండేది. కొంతమంది 5వ పరిధిని దాటి ఎదగగలిగేవారు. వారి యొక్క DNA "72 జతల(144స్ట్రాండ్స్) డబుల్ హెలిక్ స్ట్రాండ్స్" ని కలిగి ఉండేవారు. వీరిని మన 'పూర్వీకులు' లేదా 'అసెండెడ్ మాస్టర్స్' లేదా 'దైవాలు' అని పిలిచేవారు.

💫. వీరి యొక్క భౌతిక దేహాలలో 128 కోడాన్స్(codons)ను కలిగి ఉండేవారు.

1 కోడాన్ =3 లెటర్స్ ని కలిగి ఉంటుంది. (3 nucleotides కలిపితే ఒక కోడాన్ అవుతుంది) అలాగే 1 కోడాన్ కు- 3లైట్ఎన్ కోడెడ్ ఫిలమెంట్స్ ని కలిపిన DNA తో వారు అద్భుతమైన శక్తి సామర్థ్యాలు కలిగి ఉండేవారు.

💫. ఈ "కోడాన్స్..." లైట్ఎన్ కోడెడ్ ఫిలమెంట్స్ అన్నీ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ శక్తితో (విద్యుదయస్కాంతశక్తి) తయారవుతాయి. LEF(Sugar pair) అంటే.. DNAలో నిచ్చెనలాగా రెండువైపుల పొడవాటి లైన్స్ ఉంటాయి. వాటిని "Sugar Pair" అని పిలుస్తారు. 

💫. మూలశక్తి మన శరీరంలోని న్యూక్లియస్ ఎనర్జీ రూపంలో.. దాని క్రోమోజోమ్స్ లోని Sugar Pair,LEFs, కోడాన్స్, నాలుగు న్యూక్లియోటైడ్స్ కలిపి DNA Strands గా తయారుచేయడం జరిగింది.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹


24.Aug.2020

------------------------------------ x ------------------------------------



🌹. అద్భుత సృష్టి - 13 🌹

✍ రచన, సంకలనం- DNA స్వర్ణలత గారు
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🌟. భూమి దురాక్రమణ తర్వాత మూడవ పరిధికి పడిపోయింది.12 ఉన్నత తలాలకు ఎదగగలిగిన ఈ భూమి 3వ పరిధి స్థాయికి పరిమితమైనందువల్ల మానవుల DNA 2 ప్రోగుల స్థాయికి పడిపోయింది. కొన్ని లక్షల సంవత్సరాల క్రితం వరకు భూమి 12 తలాల స్థాయికి ఎదిగి ఉండినప్పుడు...72 జతల DNA (144Strands-12×12) గా ఉండేది.

💫. అట్లాంటియన్ నాగరికత సమయంలో అంతరిక్ష యుగ మార్పుల వల్ల చాలా సంవత్సరాలు మనం సిక్స్ డబుల్ స్ట్రాండ్ స్ట్రక్చర్ అయిన 12 స్ట్రాండ్స్ లో ఉండిపోయాం.

మిలియన్ సంవత్సరాలకు పూర్వం DNA 12 ప్రోగుల నుండి,2 ప్రోగులకు పడిపోయింది. ఆ సమయంలో DNA లో ఉన్న 128 కోడాన్స్.. 20 కోడాన్స్ కు తగ్గించబడ్డాయి. 384 లైట్ ఎన్ కోడెడ్ ఫిలమెంట్స్ నుండి 60 LEF కి తగ్గించబడ్డాయి.

💠 LEF ద్వారా షుగర్ పెయిర్ తయారు చేయబడతాయి (శక్తి వ్యవస్థ).

💠. 1 కోడాన్ =3 న్యూక్లియోటైడ్స్ కలిపితే ఒక కోడాన్ అవుతుంది (సమాచార వ్యవస్థ).

💠. మిలియన్ సంవత్సరాల నుండి ఇదే స్థితిలో నిలిచిపోయాం.

💠. 20 సంవత్సరాల నుండి DNA ను పునర్నిర్మాణం (లేదా) క్రియాశీలపరిచే సమాచారం - మూలం నుండి భూమిపైకి అత్యధికంగా అందుబాటులోకి వచ్చింది.

💠. సైన్స్ DNA గురించి 2 ప్రోగులు మాత్రమే యాక్టివేషన్ లో ఉందనీ.. మిగిలిన 10 ప్రోగులు "జంక్ DNA" గా నిద్రాణస్థితిలో ఉన్నాయనీ చెబుతుంది.

💫. స్పిరిచువల్ సైంటిస్టులు "నిద్రాణమై ఉన్న DNA లోనే మన ఆధ్యాత్మిక జ్ఞానం మరి అందులోని విశ్వ సమాచారం దాగి ఉంది" అని తేల్చి చెప్పారు. 'ఇది జంక్ DNA కాదు... స్పిరిచ్యువల్ DNA" అని వారు చెప్పడం జరిగింది.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #అద్భతసృష్టి

25.Aug.2020

------------------------------------ x ------------------------------------



🌹. అద్భుత సృష్టి - 14 🌹

✍ రచన, సంకలనం- DNA స్వర్ణలత గారు
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🌟. DNA ఎక్కడ లొకేట్ అయి ఉంది ? (లేదా) DNA ఉన్న స్థానం"

మన మెదడు మధ్య భాగంలో (రెండు అర్థ గోళాలకు) "పీనియల్ గ్రంథి" అనే ఒక చిన్న వినాళ గ్రంథి ఉంటుంది. ఇది ఫైన్ కోన్ ఆకారంలో ఉంటుంది. ఈ పీనియల్ గ్రంథిలో సెంట్రల్ సెల్ అనే ఆత్మకణం ఉంటుంది. దీనిని మాస్టర్ సెల్ లేదా "హౌజ్ ఆఫ్ ది సోల్" అని పిలుస్తారు(ఆత్మ యొక్క స్థానం లేదా ఇల్లు అని).

💫. సైన్స్ మెదడు యొక్క ఎండోక్రైన్ గ్లాండ్ నే "పీనియల్ గ్రంథి" అంటుంది. ఇది pinecone ఆకారంలో ఉండటం వలన దానికి ఆ పేరు వచ్చింది. ఇది మెదడు యొక్క కేంద్రంలో ఉంటుంది.

పీనియల్ గ్లాండ్ లో ఉన్న "మాస్టర్ సెల్" క్రొత్త కణాలను సృష్టించడం మరి వాటికి సంబంధించిన జ్ఞానాన్ని అందించడం చేస్తుంది..

🌟. "మాస్టర్ సెల్" 🌟

మాస్టర్ సెల్ లోపల ఉన్న న్యూక్లియస్ ఎనర్జీలో క్రోమోజోమ్స్, క్రోమోజోమ్స్ లోపల DNA స్ట్రాండ్స్, DNA లో కోడాన్స్, LEFs ఉంటాయి.

మాస్టర్ సెల్, కణాలకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని కలిగి ఉంటుంది.(కణాల అభివృద్ధి, క్షీణత మరి వృద్ధీకరణకు సంబంధించిన సమస్త జ్ఞానం ఇందులోనే ఉంటుంది.)

💫. ఈ "మాస్టర్ సెల్" లోనే శక్తినీ మరి కాంతినీ ట్రాన్స్ ఫర్ చేసి రిసీవ్ చేసుకోగలిగిన codons మరి LEF కలిగిన ప్రోగులు ఉన్నాయి. ప్రస్తుతం మన మాస్టర్ సెల్ 20 కోడాన్ - 60 LEFs ని కలిగి,2 ప్రోగుల DNA గా ఉంది.

ఇప్పుడు మనం 20 codons నుండి - 60 codons గా 60 LEF నుండి - 180 LEFs గా అభివృద్ధి చెంది 12 ప్రోగుల DNA (దివ్యత్వం కలిగిన) మానవునిగా మారవలసి వుంది. చాలా రకాల సమస్యలకు "మాస్టర్ సెల్" ద్వారానే పరిష్కారం చేయవచ్చు.

ఈ మాస్టర్ సెల్.. DNA యాక్టివేషన్ లో ప్రధాన పాత్ర పోషిస్తుంది.( శరీరంలో గుండెలా) "' మాస్టర్ సెల్' లోపలనే ఒక చిన్న విశ్వం దాగి ఉంది" అని మాస్టర్స్ లేదా దేవతలు చెప్పడం జరిగింది.

DNA యాక్టివేషన్ లో.. మాస్టర్ సెల్ యాక్టివేషన్ ప్రధానమైన మాస్టర్ "కీ" లాంటిది. ఈ మాస్టర్ సెల్ లోనే యూత్ వైటాలిటీ (తేజం) క్రోమోజోమ్స్ ఉన్నాయి. 

సశేషం.... 
🌹 🌹 🌹 🌹 🌹

#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #అద్భతసృష్టి 

26 Aug 2020

------------------------------------ x ------------------------------------




🌹. అద్భుత సృష్టి - 15 🌹

✍ రచన, సంకలనం- DNA స్వర్ణలత గారు
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🌟. యూత్ వైటాలిటీ క్రోమోజోమ్స్ 🌟

శరీరంలో ప్రతి కణంలో 23 జతల క్రోమోజోమ్స్ ఉంటాయి.

ప్రతి క్రోమోజోమ్ లో DNA Strands - ప్రోగులు ఉంటాయి. మొదటి క్రోమోజోమ్ అయిన మాస్టర్ సెల్ లోని  క్రోమోజోమ్స్ నే "యూత్ వైటాలిటీ క్రోమోజోమ్స్" అంటారు.

💫. ఈ క్రోమోజోమ్స అన్నీ X,Y ఆకారంలో ఉండి పెయిర్స్ గా ఉంటాయి. ఒక్క క్రోమోజోమ్ ని కనుక ఆక్టివేట్ చేస్తే మిగిలినవన్నీ యాక్టివేట్ అవుతాయి. ఇవన్నీ మార్ఫోజెనిటిక్ ఫీల్డ్ లో ఉంటాయి.

ఈ యూత్ వైటాలిటీ క్రోమోజోమ్స్ మానవుని యొక్క దినచర్యను నిర్దేశిస్తాయి.

ఈ యూత్ వైటాలిటీక్రోమోజోమ్స్ లోనే షాడో DNA అనే తంతులు (ప్రోగులు) ఉంటాయి. ఈ షాడో DNA లోనే మానవుని యొక్క సమస్త సమాచారం జ్ఞానం దాగి ఉంటుంది.

🌟 షాడో DNA Strands (DNA ప్రోగులు)

మాస్టర్ సెల్ ని మనం కలిగి ఉన్నాం. ఈ మాస్టర్ సెల్ వలనే మనం భగవంతుని జీవిగా గుర్తించబడ్డాం( భగవంతుని ప్రతిరూపాలు). మాస్టర్ సెల్ లోని క్రోమోజోమ్స్ లో DNA ఉంటుంది,ఈ DNA 2ప్రోగులు యాక్టివ్ గానూ 10 ప్రోగులు నిద్రాణస్థితిలో ఉన్నాయి. ఈ నిద్రాణమైన DNA నే "షాడో DNA" అంటారు. 

💫. ఈ నిద్రాణమై ఉన్న షాడో DNA లోనే మానవుని యొక్క జన్మాంతర జ్ఞానం మరి శక్తి సామర్థ్యాలు దాగి ఉన్నాయి.

💫. మానవుని యొక్క పరిణామక్రమంలో ప్రతికూల జ్ఞాపకాలు (నెగిటివ్ ఫీలింగ్స్) చేరటం వలన ఇవి అన్నీ DNA లో భాగంగా మారిపోయాయి. ఇవి అన్నీ వివిధ వ్యాధుల రూపంలో బయటకు వస్తాయి. 

అలాగే ఎన్నో జన్మల నుండి తెచ్చుకున్న కర్మలు, ఎన్నో లోకాల యొక్క జ్ఞానం ఈ షాడో DNA లోనే దాగి ఉంటుంది. మనం మన 12 ప్రోగులను జాగృత పరచాలంటే వీటిని క్లియర్ చేసి, జ్ఞానాన్ని అభివృద్ధి పరచవలసి ఉంటుంది. దీనినే "DNA యాక్టివేషన్" అన్నారు.

💫. ఈ DNA యాక్టివేషన్ లో క్లీనింగ్ తర్వాత 2ప్రోగుల DNA.. 12 ప్రోగుల DNA గా మార్పు చెందుతుంది.

ఇది 16 దశలలో జరుగుతుంది. ఈ దశలలో DNA తంతులలోకి రెయిన్ బో లైట్ వస్తుంది. దీని ద్వారా క్రోమోజోమ్స్ చివరలకు క్యాపింగ్ ఏర్పడతాయి. వీటినే "టెలిమియర్ క్యాపింగ్" అంటారు. ఇది అంతా కూడా "లా ఆఫ్ టైమ్" ప్రకారం మూలం యొక్క పూర్తి అంగీకారంతో జరుగుతుంది. 

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #అద్భుతసృష్టి

27 Aug 2020

------------------------------------ x ------------------------------------




🌹.   అద్భుత సృష్టి - 16   🌹

✍ రచన, సంకలనం- DNA స్వర్ణలత గారు
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🌟. టెలిమియర్ : 🌟

💠. క్రోమోజోమ్స్ చివరలను రక్షించటానికి ధరించే రక్షణ కవచాలనే "టెలిమియర్స్" అంటారు. ఇవి వివిధ ప్రోటీన్స్ యొక్క చర్యల వలన పునరావృతం చేయబడతాయి.

💠. ఈ టెలిమియర్స్ ద్వారానే DNA యొక్క డబుల్ హీలింగ్ తంతులు ఒకదానికొకటి కలవకుండా.. ఒకే విధంగా కనిపిస్తాయి.

💠. టెలిమియర్స్ అభివృద్ధి చెంది టెలిమియర్ సెస్ గా విస్తరిస్తాయి.

💠. ఇవి మానవునిలోనూ, ఇతర జీవరాశులలోనూ ప్రత్యేక రివర్స్ ఎంజైమ్స్ ని కలిగి ఉంటాయి. వీటినే 'స్టాప్ కోడింగ్' అంటారు.

💠. DNA పైన ఈ టెలిమియర్ అనే క్యాపింగ్ లేకపోతే DNA లు పొడవుగా పెరిగిపోతూ క్యాన్సర్ కణితలుగా మారుతాయి. చర్మవ్యాధులు వస్తాయి. లుకేమియా, సెల్యూలార్ వార్ధక్యం సంభవిస్తుంది.

💠. టెలిమియర్స్ క్యాపింగ్ లేకపోవటం వల్ల, క్రోమోజోమ్స్ ఒకదానితో ఒకటి కలిసిపోయి తీవ్ర నష్టం జరుగుతుంది.

💠. ఈ నష్టం వల్ల సాధారణ శారీరక కణాలలో మరమ్మత్తులకు సాధ్యం కాదు.

💠. టెలిమియర్స్ సరిగ్గా లేకపోతే వృద్ధాప్యానికి సంబంధించిన వ్యాధులు వస్తాయి. కణాలు త్వరగా చనిపోతాయి. సెల్యులార్ ఏజింగ్ ( వార్థక్యం) వస్తుంది.

💠. డి ఎన్ ఏ యాక్టివేషన్ ద్వారా టెలిమియర్స్ క్యాపింగ్ ప్రక్రియ సరిచేయబడుతుంది. దీని ద్వారా సంపూర్ణ ఆరోగ్యం సంభవిస్తుంది.

🌟. మైటోకాండ్రియా 🌟

💠. ఇది న్యూక్లియస్ లో.. క్రోమోజోమ్ తో కలిసి తిరుగుతూ ఉంటుంది. ఇందులో కణశక్తి ఉంటుంది. అందుకే దీనిని కణశక్తి భాండాగారం అన్నారు. ఇందులో కూడా కొంత జన్యుపరమైన జ్ఞానం దాగి ఉంటుంది.

💠. సెల్ కేంద్రంలోని న్యూక్లియస్ లో ఉన్న క్రోమోజోమ్ లోని జ్ఞానం.. 'సమాచారం' ( బ్లూ ప్రింట్) రూపంలో ఉంటుంది. మైటోకాండ్రియాలో 'ఎనర్జీ' రూపంలో ఉంటుంది.

💠. ఇందులో ఉండే కణాలను.. "శక్తి కణాలు" అంటారు.

💠. మైటోకాండ్రియా లో కూడా కొంత సొంత డిఎన్ఏ ఉంటుంది. దీనినే "మైటోకాండ్రియల్ డిఎన్ఏ" అంటారు.

సశేషం.... 
🌹 🌹 🌹 🌹 🌹

#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #అద్భుతసృష్టి

28 Aug 2020

------------------------------------ x ------------------------------------


🌹.  అద్భుత సృష్టి - 17  🌹

✍ రచన, సంకలనం- DNA స్వర్ణలత గారు
సేకరణ : ప్రసాద్ భరద్వాజ


🌟. 4. DNA సైన్స్ పరంగా 🌟

DNA అంటే "డీ- ఆక్సీ రైబో న్యూక్లియిక్ ఆసిడ్". ఇది మానవులలో, సకల జీవరాశులలో ఉండే వంశపారంపర్య పదార్థం (అనువంశిక అణువు), ఒకానొక వ్యక్తి యొక్క ప్రతి కణంలో దాదాపు ఒకే DNA ఉంటుంది. DNA అనేది కణకేంద్రంలో ఉంటుంది. దీనిని "న్యూక్లియర్ DNA" అని అంటారు. ఇందులో ఆత్మసామర్ధ్యాలు మరి జ్ఞానం ఉంటాయి.

💫. కొంత DNA మైటోకాండ్రియా లో కూడా ఉంటుంది. దీనినే "మైటోకాండ్రియల్ DNA" అని అంటారు. 

మైటోకాండ్రియల్ DNA స్ట్రక్చర్.. మనం తీసుకునే ఆహారాన్ని శక్తిగా మార్చి కణాలకు అందిస్తుంది.

💫. ఈ DNAగురించి సమాచారం ఏమిటి అంటే.. ఇందులో ఉన్న DNA కోడ్స్ ఏదైతే ఉందో అది అంతటా 4 కెమికల్ బేస్ లను కలిగి ఉంటుంది.

DNAలోని ప్రతి తంతులు లేక ప్రోగులు అనేక AP న్యూక్లియోటైడ్, పాలిమర్స్ ని కలిగి ఉంటాయి.

🌟. ఈ న్యూక్లియోటైడ్స్ మూడు రకాలు 🌟

1. ఫాస్పేట్ సముదాయం
2. డీఆక్సిరైబోస్ అనే చక్కెర సముదాయం
3. నత్రజని షరలు (బేసులు)

🌟. ఈ నత్రజని షరలు తిరిగి నాలుగు రకాలు:-

1. అడినైన్(Adenine)

2.గ్వానైన్ ( Guanine)

3.సైటోసిన్(Cytosine)

4.థైమైన్(Thymine)

మానవజాతి అందరి లోనూ మూడు బిలియన్ల బెస్ టోన్స్ ని కలిగి ఉంటుంది. 99% మానవజాతి అంతా ఓకే ఆధారిత బేస్ టోన్స్ కలిగి ఉంటారు. మిగిలిన 1% తేడాతోనే మానవులలో వ్యత్యాసాలు ఉన్నాయి.

💫. బేస్ టోన్స్ అయిన అడినైన్, గ్వానైన్, సైటోసిన్, థైమైన్ ఒకదానితో ఒకటి కలిసి జతలుగా ఏర్పడతాయి. అంటే A,T (Adenine + Thymine) C,G (Cytosine+Guanine) తో కలిసి కొన్ని యూనియన్ లేదా యూనిట్లుగా ఏర్పడతాయి. ప్రతి బేస్.. చక్కెర అణువూ మరి ఫాస్పేట్ అణువుతో జతచేయబడి, చక్కర ఫాస్పేట్ న్యూక్లియోటైడ్ గా మారుతాయి.

💫. ఈ AT, CG అనే న్యూక్లియోటైడ్స్ ని చక్కెర ఫాస్పేట్ పొడవాటి లైన్ తో జత చేయడం జరుగుతుంది.

💫. న్యూక్లియోటైడ్స్ సముదాయాన్ని - "కోడాన్స్" అనీ.. చక్కెర ఫాస్పేట్ పొడవాటి లైన్ ను - "లైట్ ఎన్ కోడెడ్ ఫిలమెంట్" అనీ పిలుస్తారు. వీటిని అన్నింటినీ కలిపి "డబుల్ హెలిక్స్ స్ట్రక్చర్" అని పిలుస్తారు లేదా "2 Strands DNA" అని పిలుస్తారు. ఇది మెలిపెట్టిన... సవ్యదిశలో ఉన్న నిచ్చెనలా ఉంటుంది. DNA యొక్క స్పెషాలిటీ.. తనలాంటి డూప్లికేట్స్ ని తయారుచేయడం.(కణవిభజనలో DNA కూడా విభజించబడి తిరిగి మునుపటి కణంలో ఉన్న DNA లా తిరిగి సృష్టించబడుతుంది).

🌟. డీ - ఆక్సి రైబో న్యూక్లిక్ యాసిడ్ (DNA)🌟

"డీ -ఆక్సి రైబో న్యూక్లియిక్ యాసిడ్" అనేది ఒక అనువంశిక అణువు. ఇది ప్రతి జాతి యొక్క జీవ సంపద సూచనలను కలిగి ఉంటుంది.( వంశపారంపర్య సమాచారం) పునరుత్పత్తి సమయంలో వ్యక్తి తల్లిదండ్రుల యొక్క ఆర్గానిజం నుండి సమాచారాన్ని సరఫరా చేసుకుంటూ... కొత్త జన్యువులను తయారు చేసుకుంటారు.

సశేషం.....
🌹 🌹 🌹 🌹 🌹

#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #అద్భుతసృష్టి

29 Aug 2020

------------------------------------ x ------------------------------------


🌹.  అద్భుత సృష్టి - 18  🌹

✍ రచన, సంకలనం- DNA స్వర్ణలత గారు
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🌟. DNA శరీరంలో ఎక్కడ ఉంటుంది? 🌟

జీవులను (ఆర్గానిజం) "యుకారియోట్స్"(Eukaryotic) అంటారు. యుకారియోట్స్ అంటే నిజకేంద్రిక జీవులు.

ఈ DNA అనేది కణం లోపల న్యూక్లియస్ లో ఉంటుంది. శరీరంలో 100 ట్రిలియన్ పైన కణాలు ఉంటాయి. ప్రతి కణంలో DNA Strands ఉంటాయి. కణంలో ఉన్న క్రోమోజోమ్స్ అతి చిన్నగా ఉండటం వలన.. ఈ DNA నొక్కి ప్యాక్ చేసి ఉంచడం జరిగింది. ఒక్కకణంలో నొక్క బడిన DNA పొడవు 125 మిలియన్ మీటర్లు ఉంటుంది. శరీరంలోని అన్ని DNA లను ఊడదీసి కలిపితే ఇక్కడ నుండి కేంద్రసూర్యుని వరకు దీనిని కనెక్ట్ చేయవచ్చు.

💫. DNA ప్రతిరూపణ (డూప్లికేషన్) కోసం కొంత నిర్మాణం ఉంటుంది. DNA పెరగకుండా ఆపడం కోసం(స్టాపింగ్) కొంత నిర్మాణం చేయడం జరిగింది. DNA కణ విభజన సమయంలో సమాచారం డూప్లికేట్ అవుతూ ఉంటుంది లేదా కాపీ చేయబడుతుంది.

💫. DNAలో ఉన్న జ్ఞానాన్ని "జీన్స్" అనడం జరిగింది. కొంత DNA మైటోకాండ్రియాలో కూడా ఉంటుంది. ఇది కణానికి శక్తినిస్తుంది. 

💫. లైంగికపునరుత్పత్తిలో జీవులు సగం తల్లి నుండి, సగం తండ్రి నుండి DNA ని పొందుతారు. వంశ చరిత్ర ఉన్న DNAని ఇద్దరి నుండి పొందుతారు. మైటోకాండ్రియల్ DNA అనేది కేవలం అండం (తల్లి)నుండి మాత్రమే రిలీజ్ అవుతుంది. తండ్రి స్పెర్మ్ (శుక్ర కణం) నుండి కాదు.

🌟. DNA దేనితో తయారు అవుతుంది..? 🌟

"న్యూక్లియోటైడ్స్" అనే బిల్డింగ్ బ్లాక్స్ తో DNA తయారు చేయబడుతుంది. ఫాస్పేట్ మరి చక్కెర సమూహాలు మరి నాలుగు రకాల నత్రజని స్థావరాలతో DNA తయారు చేయబడింది.

ఈ న్యూక్లియోటైడ్స్ ని 4 రకాల నైట్రోజన్ బేస్ లు (నత్రజని షరాలు) అంటారు.

1. అడినైన్ (Adenine)
2.థైమైన్ (Thymine)
3.గ్వానైన్ (Guanine)
4.సైటోసిన్(Cytosine)

ఈ నాలుగు న్యూక్లియోటైడ్స్ లోనే DNA యొక్క జీవ సంబంధిత సమాచారం మొత్తం దాగి ఉంది. వ్యక్తి తన శరీరాన్ని ఏ విధంగా తయారు చేసుకోవాలి అంటే.. ఆ విధంగా ఈ న్యూక్లియోటైడ్స్ శరీరాకృతిని తయారు చేస్తాయి. 

ఉదాహరణ :-ATCGTT క్రమంఅనేది మన కళ్ళను నీలికళ్ళుగా తయారు చేస్తుంది. ATCGT అనేది కళ్ళను గోధుమ రంగు కళ్ళుగా తయారు చేస్తుంది. ఒక్క న్యూక్లియోటైడ్ మార్పుతో కళ్ళలో ఇంత తేడా జరిగింది.

💫. మానవుడు కణంలో.. 23 జతల క్రోమోజోమ్స్.. అందులో 3 బిలియన్ల బేస్ టోన్స్ (ACGT)లు.‌ అందులో 30,000 చురుకుగా పని చేసే జన్యువులను కలిగి ఉన్నాడు.

🌟. DNA ఏం చేస్తుంది? 🌟

జీవ అభివృద్ధి పనితీరు, జీవించడానికి మరి పునరుత్పత్తికి సంబంధించిన సమస్త సమాచార జ్ఞానాన్ని DNA రూపంలో పొందుపరచడం జరిగింది.

💫. మానవ శరీరం తనలోని సంక్లిష్ట అణువుల (complex molecules లేదా అణువుల సముదాయం) ద్వారా అవసరమైన ప్రోటీన్స్ ని మరి అమైనో యాసిడ్స్ నీ ఎప్పటికప్పుడు తయారు చేసుకుంటూ ఉంటుంది. మన యొక్కDNA ప్రోటీన్స్ తయారు చేయటానికి పనికి వచ్చే క్రమాన్ని " జీన్స్" అన్నారు. మానవులలో ఉన్న జీన్స్ యొక్క పరిణామం 1000 బేస్ టోన్స్ నుండి ఒక బిలియన్ బెస్ టోన్స్ వరకు ఉంటుంది. వీటి యొక్క క్రమంలో చాలా తేడాలు ఉంటాయి. ఇందులో 1% జీన్స్ మాత్రమే శరీరానికి అవసరమైన ప్రొటీన్స్ ని అమైనోయాసిడ్స్ ని తయారుచేసి శరీరాన్ని శక్తివంతంగా ఉంచుతుంది.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #అద్భుతసృష్టి

30.Aug.2020

------------------------------------ x ------------------------------------


🌹. అద్భుత సృష్టి - 19 🌹

✍ రచన, సంకలనం- DNA స్వర్ణలత గారు
సేకరణ : ప్రసాద్ భరద్వాజ


🌟. ప్రొటీన్ల తయారీకి DNA ఎలా ఉపయోగపడుతుంది? 🌟

ఇది రెండు దశలలో జరుగుతుంది.

1. మొదటి దశలో-ఎంజైమ్స్ DNA లోని సమాచారాన్ని చదివి మెస్సెంజర్ రైబో న్యూక్లియిక్ ఆమ్లం (mRNA)కు అందజేస్తాయి. DNAకు రైబోసోమ్స్ కి మధ్య mRNA అనేది సమాచార వ్యవస్థను నడిపించి ప్రొటీన్ తయారీలో తన వంతు పాత్రను నిర్వహిస్తుంది.

2. రెండవ దశ:-mRNA లోని సమాచారం ద్వారా అమినో ఆమ్లాల(Amino acids) భాషలోకి అనువదించి శరీరానికి అవసరమైన ప్రొటీన్స్ (బిల్డింగ్ బ్లాక్స్) తయారీ యంత్రాంగానికి సహాయకుడిగా ప్రోటీన్స్ ని తయారు చేసుకుంటుంది. ఇది చాలా పెద్ద పని ఎందుకంటే 20 రకాల అమినోయాసిడ్స్ ఉంటాయి. వీటి ద్వారా రకరకాల ప్రోటీన్స్ ని తయారు చేయవలసి ఉంటుంది.

🌟. DNA ని ఎవరు కనుగొన్నారు?- ( సైన్స్ పరంగా)

1869 సంవత్సరం చివరలో బయోకెమిస్ట్ "ఫ్రైడరిచ్ మీషెర్" మొదటిసారిగా DNA ని కనుగొనడం జరిగింది తరువాత ఇందులో ఉన్న జ్ఞానాన్ని తెలుసుకోవటానికి సైంటిస్టులకు ఒక శతాబ్ద కాలం పట్టింది.

"DNA లో ఉన్న సమాచారం ఒక తరం నుండి మరొక తరానికి తీసుకుని వెళ్తుంది." అని 1953లో "జేమ్స్ వాట్సన్", "ప్రాన్సీస్ క్రిక్" మారిన్ విల్కిన్స్ మరి రోసలిండ్ ఫ్రాంక్లిన్ కృషివల్ల తేలింది.

🌟. సైన్స్ ఇచ్చిన సమాచారం ప్రకారం DNA గురించి సంక్షిప్తంగా 🌟

🔹. శరీరం అనేది ఎన్నో కణాల సముదాయం అనీ, కణ కేంద్రకంలో 23 జతల క్రోమోజోమ్స్ ఉంటాయి అనీ తేలింది.

🔹 క్రోమోజోమ్స్ లోపల DNA స్ట్రాండ్స్ ఉంటాయి.

🔹 DNA అంటే డీ - ఆక్సీ రైబో న్యూక్లియిక్ ఆమ్లం అంటారు.

🔹 DNA జన్యువులలో ఉన్న వంశపారంపర్యంగా వచ్చిన జ్ఞాన సమాచారం అంతా నిక్షిప్తం చేయబడి ఉంటుంది. ఇది సకల జీవరాశులలోనూ ఈ విధంగానే ఉంటుంది.

🔹 DNA లో 30,000 చురుకుగా పనిచేసే జన్యువులు ఉంటాయి. ప్రతి జన్యువుకు నిర్దిష్ట చర్య ఉంటుంది.

🔹. ఈ DNA..తల్లి యొక్క మరి తండ్రియొక్క కణాలు అయిన అండం మరి శుక్రకణం నుండి బిడ్డకు సంక్రమిస్తాయి. ఇవి ఎనిమిది కణాల కలయిక. దీనిని "ప్రైమోర్డియల్ సెల్" అంటారు. కాబట్టి ఇది అనువంశిక అణువు.

🔹. క్రోమోజోమ్స్ "X" ఆకారంలో, "Y" ఆకారంలో ఉంటాయి. DNA అనేది క్రోమోజోమ్స్ లోపల ఫోల్డ్ చేయబడి ఉంటుంది. ఈ క్రోమోజోమ్స్ చివర్ల DNA బయటకు విడిపోకుండా క్యాపింగ్ చేయబడతాయి. దీనినే "టెలిమియర్ క్యాపింగ్" అంటారు.

🔹 క్రోమోజోమ్స్ చివర్ల ఈ టెలిమియర్ క్యాపింగ్ అనేది లేకపోతే DNA విడివడి పొడవుగా అంతం అనేది లేకుండా పెరుగుతూ ఉంటుంది.

ఉదాహరణకు:- షూ- లేస్ చివర్ల నొక్కబడి ఉన్న ప్లాస్టిక్ క్యాప్స్ లాంటివి ఉంటాయి. అవి ఊడిపోతే లేస్ ఎలా ఊడిపోతుందో అదేవిధంగా.

🔹 DNA ఇలా అన్నేచురల్ గా పెరుగుతూ ఉంటే అక్కడ ఉన్న ఆర్గాన్స్ కూడా అన్ నాచురల్ గా పెరుగుతాయి‌ వీటినే క్యాన్సర్ కణుతులు అంటారు. అందుకే ఈ టెలిమియర్ క్యాపింగ్ చాలా ప్రధానమైనది.

🔹 DNAలో అధికశాతం 98 నుండి 99% జ్ఞానం నాన్ కోడింగ్ లో ఉంది. దీనిని "జంక్ DNA " అన్నారు.

🔹 1 నుండి 2% కోడింగ్ DNA ద్వారా శరీరానికి అవసరమైన ప్రోటీన్స్ తయారు చేయబడతాయి.

🔹. 98 నుండి 99% నాన్ కోడింగ్ DNA. దీనిని "జంక్ DNA" అన్నారు. ఇది ఎందుకూ పనికి రాదు అంటూ డైమెన్షనల్ ఫ్రీక్వెన్సీ మరి జ్యామితీయ కొలతల సమాంతర జ్ఞానం ఉండవచ్చు అని సైన్స్ చెప్పింది.

సశేషం.... 
🌹 🌹 🌹 🌹 🌹

#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #అద్భుతసృష్టి

31.Aug.2020

------------------------------------ x ------------------------------------


🌹.  అద్భుత సృష్టి - 20  🌹

✍ రచన, సంకలనం- DNA స్వర్ణలత గారు
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🌟. 5. పీనియల్ గ్రంథి 🌟

💠. ప్రైమోర్డియల్ సెల్ కమ్యూనికేషన్ మార్గం 💠

పీనియల్ గ్రంథి

పీనియల్ గ్రంథి మన మెదడులోని రెండు అర్థగోళాల మధ్య ఉన్న చిన్న ఎండోక్రైన్ గ్రంథి. దీని సైజు 5.8 మిల్లీ మీటర్స్ ఉండి పైన్ కోన్ ఆకారంలో ఉండే అతి చిన్న గ్రంథి. పీనియల్ గ్రంథి "సెరటోనిన్" "మెలటోనిన్" అనే రసాయనాలను ఉత్పత్తి చేస్తుంది. 

అందువలన "నిద్ర - మెలుకువ చక్రం" అని కూడా అంటారు. దీనిని ఆత్మ యొక్క స్థానం అని చెబుతారు. "సోల్ స్టార్( పూర్ణాత్మ )" నుండి ఎప్పటికప్పుడు జ్ఞానం అనే లోతైన జ్ఞాపకాలను కలిగి ఉంటుంది. మన యొక్క హైయ్యర్ సెల్ఫ్ (పూర్ణాత్మ) యొక్క జ్ఞానాన్నీ మరి భౌతిక జీవిత జ్ఞానాన్నీ పొందడానికి గేట్ వే లాంటిది.

💫. ఈ గ్రంధి వివిధ డైమెన్షన్ ల యొక్క చేతనా జ్ఞానాన్ని కలిగి ఉంటుంది. అందువలన విభజన యొక్క భ్రమలు (చీకటి శక్తులు ఏర్పరిచిన చీకటి పొరలు అనే మాయ భ్రమలు) దాటి చూడగలుగుతుంది.

పీనియల్ గ్రంథి లోపల "మాస్టర్ క్రిస్టల్ సెల్ (MCC)" లేదా "సెంట్రల్ సెల్" అనే ఈధర్ నిర్మాణం ఉంటుంది.

💫. ఈ MCC సోల్ స్టార్ యొక్క QI (ఇంటెలిజెన్స్) అని చెప్పవచ్చు. MCC లోనే ఆత్మ యొక్క ఈథర్ బ్లూప్రింట్, పరిపూర్ణ దైవత్వం, అవగాహన ఉంటుంది. MCC యొక్క ప్రతి ధ్వని ద్వారా ఆది కణాలు అయిన ప్రైమోర్డియల్ సెల్ ని కనెక్ట్ చేసుకుని DNA ని యాక్టివేట్ చేస్తుంది.

💫. ప్రైమోర్డియల్ సెల్:- ప్రైమోర్డియల్ కణాలు వ్యక్తి యొక్క మొదటి ఎనిమిది కణాలు తల్లి అండం నుండి, తండ్రి శుక్రకణం నుండి తెచ్చుకున్న మొదటి 8 కణాల కలయికనే "ప్రైమోర్డియల్ కణం" అన్నారు. వీటినే మొదటి బీజకణాలు అంటారు. దీనితో "జైగోట్" తయారవుతుంది.

ప్రైమోర్డియల్ కణాలు మనలో మూలాధార, స్వాధిష్ఠాన చక్రాల మధ్య స్థితం అయి ఉంటాయి. ఇది ఎనిమిది కోణాలతో గొప్ప జ్యామిత్రిక స్ట్రక్చర్ ని కలిగి ఉంటుంది. ఇది స్ఫటికాకార మ్యాట్రిక్స్ తోనూ, (ఆరిక్ ఫీల్డ్) తోను, హాలోగ్రాఫిక్ ఫీల్డ్ శక్తి తోను, మన యొక్క టైంలైన్ తోను కనెక్ట్ అయి జీవితమంతా ఈ విధంగా జీవనం సాగిస్తుంటుంది.

💫. ప్రైమోర్డియల్ సెల్ యూనివర్స్ యొక్క పవిత్ర జ్యామిత్రిక స్థితి ఉంటుంది. ఈ స్ట్రక్చర్ లో యూనివర్సల్ ట్రూత్ (విశ్వోద్భవ రహస్యాలు) ఎన్నో లైఫ్ టైమ్స్ యొక్క (తాను భూమిమీద పొందిన) భౌతిక అనుభవాల సారం అంతా దాగి ఉంది.

ఈ పవిత్ర జ్యామిత్రికతలోనే మనం భౌతిక జీవితంలో నేర్చుకోవలసిన ద్వంద్వత్వపు లిమిటేషన్స్, నమ్మకాలు, సంప్రదాయాలు, సంస్కృతి, ఆచారాలు మొదలైనవాటి అన్నింటి ద్వారా సూక్ష్మ నైపుణ్యాలను, భాష లేదా రూపంలో ఈ జ్యామిత్రిక గ్రిడ్ లలో పొందుపరచబడ్డాయి.

💫. మన యొక్క సామూహిక అభివృద్ధి కొరకు సృష్టిలో ఉన్న సమస్త సమాచార జ్ఞానం.. "అనంత మేధస్సు" ద్వారా భౌతిక ఉప అణువుల వరకు అందజేయబడే సిస్టమే ఈ జ్యామిత్రిక సిస్టమ్.

మన యొక్క ప్రైమోర్డియల్ సెల్ 8-కణాలతో పవిత్ర జ్యామిత్రిక స్ట్రక్చర్ కలిగి "కాస్మిక్ ఎగ్" (హిరణ్య గర్భం) ఆకృతిని కలిగి ఉంటుంది. ఈ ఆకారాన్ని "మెటాట్రానిక్ క్యూబ్" అని పిలుస్తారు.

🌟. ప్రైమోర్డియల్ సెల్ యొక్క ఉపయోగం :

ఇంటెలిజెంట్ స్టోర్ హౌస్ ఆఫ్ QI(Quantum Intelligence)(శక్తి, ప్రాణం,ఆరాశక్తి) భౌతిక శరీరానికి జ్ఞానాన్ని అందించి దాని ద్వారా పనిచేసేలా చేస్తుంది.

పీనియల్ గ్రంథి ప్రైమోర్డియల్ సెల్ యొక్క అనుసంధానం జరిగితే వీటి యొక్క జ్ఞానవిస్తరణ ద్వారా DNA స్ట్రక్చర్ విస్తరణ జరుగుతుంది.

💫. పీనియల్ గ్రంథి.. విశ్వశక్తిని గ్రహించి తన నుండి ఒక "వేవ్ పాత్" ని ఏర్పరచుకుంటుంది. అది సెంట్రల్ ఛానెల్ అయిన సుషుమ్ననాడి ద్వారా హృదయ చక్రాన్ని ఓపెన్ చేస్తూ నాభి వద్ద ఉన్న మణిపూరక చక్రం తో కనెక్ట్ అవుతూ స్వాధిష్టాన, మూలాధార చక్రం మధ్య ఉన్న ఈ ప్రైమోర్డియల్ సెల్ తో కనెక్ట్ అవుతుంది. 

ఎప్పుడైతే ఈ మార్గం ఏర్పడుతుందో DNA లోని హైయర్ స్టేజెస్ అన్నీ ఓపెన్ అవుతాయి. ఈ మార్గం ఎప్పుడైతే ఏర్పడుతుందో బ్రెయిన్ కి అందే.. "తీటా", "గామా" బ్రెయిన్ వేవ్స్ ద్వారా DNA యాక్టివేషన్ కి మార్గం తెరుచుకుంటుంది.

సశేషం... 
🌹 🌹 🌹 🌹 🌹

#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #అద్భుతసృష్టి

01.Sep.2020

------------------------------------ x ------------------------------------



🌹.  అద్భుత సృష్టి - 21  🌹

✍ రచన, సంకలనం- DNA స్వర్ణలత గారు
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🌟. 6. చైతన్య విస్తరణ 🌟

మూల ప్రకృతి (భగవంతుని చైతన్యం) ఎన్నో ప్రపంచాలుగా విభజన పొందింది. అందులో తన యొక్క చైతన్యమైన DNA ని (మూల చైతన్య బీజ జ్ఞానాన్ని) నిలిపి, తాను వీటి ద్వారా విస్తరిస్తూ పరిణామం చెందుతుంది.

మూల చైతన్యం తనని తాను మూడు ప్రపంచాలుగా విస్తరించింది. ఈ మూడు ప్రపంచాలు, ఏడు పరిధులుగా (7 ప్లైన్స్ లేక తలాలుగా) విభజించబడుతుంది.

🔹. విశ్వంలోని మూడు ప్రపంచాలు:-

1. Physical world- భౌతిక ప్రపంచం
2. Astral world- సూక్ష్మలోకం, కారణలోకం, మహాకారణలోకం
3. Angelic world- దేవతా రాజ్యాలు, ఫెయిరీస్ లోకాలు

💠. Physical world (భౌతిక ప్రపంచం)

ఈ భౌతిక ప్రపంచాన్ని తిరిగి నాలుగు మహా రాజ్యాలు (kingdoms) క్రింద విభజించారు.

🔺. 1. మినరల్ కింగ్ డమ్ - ఖనిజ సామ్రాజ్యం

🔺. 2. ప్లాంట్ కింగ్ డమ్ - వృక్ష సామ్రాజ్యం

🔺. 3. యానిమల్ కింగ్ డమ్ -జంతు సామ్రాజ్యం

🔺. 4. హ్యూమన్ కింగ్ డమ్ - మానవ సామ్రాజ్యం

💠. ఆస్ట్రల్ వరల్డ్స్ - ఇవి మూడు:-

🔺. 1. సూక్ష్మ లోకాలు - ఇక్కడ సూక్ష్మ శరీరధారులు, సూక్ష్మజీవులు ఉంటాయి. (మన సూక్ష్మశరీరయానం లో మొదట దీనినే "టచ్" చేస్తాం)

ఈ సూక్ష్మ తలాలు లేక లోకాలు రెండు రకాలు.

🌀. లోయర్ ఆస్ట్రల్ వరల్డ్స్(దిగువ జ్యోతి ప్రపంచాలు)-

ఇక్కడ లోయర్ ఆస్ట్రల్ జీవులు ఉంటాయి. వీటిని "లోయర్ ఆస్ట్రల్ ఎంటిటీస్" అంటారు. ఇవి ఇతర జీవులపైన ఆధారపడి బ్రతుకుతాయి. మనలో ఉన్న లోయర్ చైతన్యాలను ఆహారంగా తీసుకుంటూ బ్రతుకుతాయి. (అరిషడ్వర్గాలు)

🌀. హైయ్యర్ ఆస్ట్రల్ వరల్డ్స్ - (ఉన్నత జ్యోతి ప్రపంచాలు) -హైయ్యర్ ఆస్ట్రల్ జీవులు ఉంటాయి. ఇవి ఉన్నత చైతన్యాలను తయారు చేస్తాయి.

🔺. కారణ లోకాలు -ఇక్కడ కారణశరీరధారులు, కారణశరీరజీవులు (కాజల్ బీయింగ్స్, కాజల్ మాస్టర్స్) ఉంటారు. ఇది జీవి యొక్క జన్మకారణ లోకం,ఈ కారణాలను తీసుకునే ఆత్మ తన ప్రయాణాన్ని భూమికి మళ్ళిస్తుంది.

🔺. మహా కారణ లోకాలు-ఇక్కడ మహా కారణ శరీరంధారులు, మహా కారణ జీవులు ఉంటాయి. ఈ మహా కారణ శరీరధారులనే "మాస్టర్స్", గ్రాండ్ మాస్టర్స్" అంటారు. అలాగే ఇక్కడ ఉన్న జీవులను "గ్రాండ్ బీయింగ్స్ అంటారు. ఇక్కడ ఉన్నవారిని మహాత్మలు, విశ్వాత్మలు, బ్రహ్మాత్మలు అంటారు. ఇది మహా అద్భుత ప్రపంచం, దీనిని "జ్ఞాన" లేక "కాంతి ప్రపంచం" అంటారు. మూలచైతన్యం యొక్క మహా కారణం ఇక్కడ ఉంటుంది. ఇక్కడ ఉన్న వారు అంతా ఆ మూల చైతన్యము యొక్క మహాకారణం కోసం పని చేస్తారు. 

💠. ఏంజెలిక్ వరల్డ్ -(దేవతా ప్రపంచం) ఇక్కడ దేవతలు, దేవదూతలు (వీరినే మెస్సెంజర్స్) అంటారు. భగవంతునికి జీవాత్మ కు మధ్య వార్తాహరులు. మూల ఆత్మ యొక్క మహాన్ కారణాన్ని ఆత్మకు (జీవునికి) అందజేసి ఆ విధంగా పనిచేసేలా చేస్తారు. వీరినే "ఏంజెల్స్" మరి "ఆర్కేంజల్స్" అంటారు.

ఇంకా ఇక్కడ ప్రకృతి దేవతలు(ఫైయిరీస్) ప్రకృతి ఆత్మలు (పంచభూతాలు) ప్రకృతి జీవులు (చేపలు, పక్షులు, సరీసృపాలు, కీటకాలు) ఉంటాయి. ఇది దైవం యొక్క గొప్ప ప్రపంచం.

సశేషం.... 
🌹 🌹 🌹 🌹 🌹

#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #అద్భతసృష్టి 

02 Sep 2020

------------------------------------ x ------------------------------------


🌹.  అద్భుత సృష్టి - 22  🌹

✍️ . రచన, సంకలనం- DNA స్వర్ణలత గారు
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🌟. 7.ప్లేన్స్(తలాలు)-చైతన్య ఉన్నత లోకాలు 🌟

💫. మూల చైతన్యం ఏడు ఉన్నత లోకాలను లేదా తలాలను కలిగి ఉంది. వీటినే "సెవెన్ ప్లేన్స్" అన్నారు. ఏడు తలాలకు వాటికి సంబంధించిన సొంత ఫ్రీక్వెన్సీ, ఎనర్జీ మరి వైబ్రేషన్ ఉంటాయి. ప్రతి ఒక్క తలం మరియొక తలంతో అంతర్గత అనుసంధానం కలిగి ఉంటుంది.

💫. ఒకదానితో ఒకటి కనెక్షన్ అయి ఉన్న ఒక్కొక్క తలానికి స్వంత రూల్స్ (rules), న్యాయం(laws), కండిషన్స్(conditions), కమిట్మెంట్స్(commitments) ఉంటాయి.

💫. మన యొక్క మెంటల్, ఎమోషనల్, ఫిజికల్, స్పిరిచ్యువల్ శరీరాలలో ముఖ్యమైన భాగాలతో ఈ ఏడు తలాలకు కనెక్షన్ ఉంది. ఈ ఏడు తలాల యొక్క ప్రభావం మన ప్రధాన గ్రంధులపై పడుతుంది. ఈ గ్రంధులు ఫ్రీక్వెన్సీ ప్రకారం తమలోని శక్తిని చక్రాస్ ద్వారా అందుకుని.. శరీరానికి అవసరమైన స్రావాలు ( ఎంజైమ్స్ ని) తయారుచేసుకుంటాయి.

అయితే మనలో ఉన్న ఈ చక్రాలు, గ్రంధులు మన యొక్క వైబ్రేషన్ బట్టి మార్పు చెందుతూ ఉంటాయి. 

eg:-మనం లోయర్ ఎమోషన్స్ కలిగి ఉంటే మన శక్తిని కోల్పోతూ ఉంటాం. ఈ చైతన్య తలాల యొక్క శక్తి ద్వారా దీనిని సరిచేయవచ్చు.

💠. 1. మొదటి చైతన్య తలం ( 1st Plane)

🔹. స్థూల తలం: దీనిని "భూలోకం (ఫిజికల్ ప్లేన్)" అంటారు. ఇది మొదటి తలం. ఇది అన్నమయ కోశంతో, మూలాధార చక్రంతో కనెక్ట్ అయి ఉంటుంది. ఇక్కడ భూమి పైన మహా చైతన్యం "నాన్ ఆర్గానిక్ మెటీరియల్" వరల్డ్ గా ఉంటుంది.

Eg:-మినరల్స్, క్రిస్టల్స్, మట్టి మరి రాతి సంబంధమైనది.

మినరల్స్ శరీరానికి చాలా అవసరం. మినరల్స్ శరీరానికి సరిపోయినంత లేక పోతే వ్యాధులు సంక్రమిస్తాయి. మినరల్స్ ను "ఖనిజాలు" అంటారు.

Eg:-శరీరానికి హిమోగ్లోబిన్ కావాలంటే "ఐరన్" అనే ఖనిజం అవసరమవుతుంది. క్యాల్షియం ద్వారా గట్టి ఎముకలు, దంతాలు తయారవుతాయి. అలాగే అయోడిన్ థైరాయిడ్ ఫంక్షన్ ని సరిగ్గా ఉండేలా చేస్తుంది. మొదటి చైతన్య తలం నుండి మనకు అవసరమైన 'సపోర్ట్' లభిస్తుంది. ఇది అన్నమయ కోశం ద్వారా స్వీకరిస్తూ మూలాధార చక్రానికి పంపిస్తుంది. శక్తిని శరీరంలోని గ్రంధులు స్వీకరించి వాటికి సంబంధించిన అవయవాలకు అందిస్తాయి. అలాగే మానవ మనుగడకు అవసరమైన సపోర్ట్ శక్తి ద్వారా లభిస్తుంది. దీనినే "సర్వైవల్ ఎనర్జీ" అంటారు మొదటి తలం నుండి DNA లోనికి మానవ మనుగడ లేదా 'సర్వైవల్' అనే కోడింగ్ లభిస్తుంది..

💠. 2. రెండవ చైతన్య తలం (2nd Plane)

🔹. ఆస్ట్రల్ ప్లేన్: దీనిని "భువర్లోకం (కామ తలం)" అంటారు. ఇది రెండవ తలం. ఇది ప్రాణమయ కోశంతో, స్వాధిష్టాన చక్రంతో అనుసంధానం అయి ఉంటుంది. ఇక్కడ చైతన్యం "ఆర్గానిక్ మెటీరియల్" రూపంలో ఉంటుంది.

Eg:-విటమిన్స్, మొక్కలు, చెట్లు, ఎలిమెంట్స్, నేచర్ స్పిరిట్స్, లివింగ్ థింగ్స్, ఫెయిరీ స్పిరిట్స్, పంచభూతాలు, బ్యాక్టీరియా మరి వైరస్ ఉంటాయి.

💫. శరీరానికి విటమిన్స్ లోపం ఉంటే శరీరం నీరసించిపోతుంది. మనపై మనకు కాన్ఫిడెన్స్ తగ్గిపోతుంది. శక్తిని కోల్పోతాం. విటమిన్స్ ద్వారా మన శరీరానికి ఎదుగుదల, కాంతి, ఆరోగ్యం, సహజమైన సంపూర్ణమైన జీవితం లభిస్తాయి.

💫. రెండవ చైతన్య తలాల నుండి మనకు ప్రేమశక్తి లభిస్తుంది. ఇది రెండవ దేహమైన ప్రాణమయ కోశం ద్వారా స్వాధిష్టాన చక్రానికి అంది.. దాని ద్వారా శరీర గ్రంధుల ద్వారా శరీర అవయవాలకు అందజేస్తుంది. ప్రేమశక్తి ద్వారా క్రియేషన్ ఎనర్జీ అందుతుంది. దీని ద్వారా మనకు కో- క్రియేషన్/ పునరుత్పత్తి మన డీఎన్ఏలో కోడింగ్ గా అందించబడింది.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #అద్భుతసృష్టి

03.Sep.2020

------------------------------------ x ------------------------------------


🌹.  అద్భుత సృష్టి - 23  🌹

✍️ . రచన, సంకలనం- DNA స్వర్ణలత గారు
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🌟. 7.ప్లేన్స్(తలాలు)-చైతన్య ఉన్నత లోకాలు - 2 🌟

🌟. మూడవ చైతన్య తలం (3rd Plane)🌟

💠. మనోమయ తలం 😘 దీనిని "సువర్లోకం (మెంటల్ ప్లేన్)" అంటారు. ఇది మూడవ తలం. ఇది మనోమయకోశంతో మణిపూరక చక్రంతో అనుసంధానం అయి ఉంటుంది. ఇక్కడ చైతన్యం మానవులుగా, జంతువులుగా జన్మలు తీసుకోవడం జరిగింది. దీనిని 'వాస్తవిక ప్రపంచం' అంటారు. ఇక్కడ మనుషులు ఇతర లైఫ్ ఫామ్స్ కలిసి జీవించడం జరుగుతుంది.

💫. ఈ తలం ఎమోషన్స్, కోరికలు మరి అభిరుచి మొదలైన లక్షణాలను కలిగి ఉంటుంది. ఈ మూడవ చైతన్య తలం యొక్క శక్తి ద్వారా మన శరీరంలో ప్రొటీన్స్ ని తయారు చేసుకుంటుంది. ప్రొటీన్ ద్వారా అణువులు, కార్బన్ ఆధారిత శరీర నిర్మాణం తయారవుతాయి. ప్రొటీన్ అనేది శరీరానికి అందకపోతే శరీరంలో వ్యాధినిరోధకశక్తి తగ్గుతుంది, లేదా పోషక లోపం జరుగుతుంది. ఈ మూడవ చైతన్య తలం నుండి మన DNA లోనికి భౌతిక వాస్తవాలను సృష్టించడం, పోషణ అనే కోడింగ్ లభిస్తుంది. ఇక్కడ DNAలో ఉన్న కోడింగ్ "సంకల్పశక్తి." ఇక్కడ స్లోగన్ ఏమిటి అంటే "కోరుకో, ఇష్టపడు, అవసరాన్ని తీర్చుకో" అంటుంది.

🌟. 4. నాలుగవ చైతన్య తలం(4th Plane)🌟

💠. బుద్ధి తలం: దీనిని "మహర్లోకం (బుద్ధిక్ ప్లేన్)" అంటారు. ఇది 4వ తలం. ఇది విజ్ఞానమయ కోశంతోనూ, అనాహత చక్రంతోనూ కనెక్ట్ అయి ఉంటుంది. ఇది స్పిరిట్ వరల్డ్(spirit world) . ఇక్కడికి చనిపోయిన ఆత్మలు వెళతాయి.

4వ తలం నుండి మనకు DNA ద్వారా వినికిడి, రుచి, స్పర్శ, అనుభూతులు(feelings) అనే జ్ఞానేంద్రియాల జ్ఞానం పొందుతున్నాం.ఈ తలం నుండి శరీరానికి అవసరమైన కార్బోహైడ్రేట్స్ లభిస్తాయి. వీటివల్ల శరీరానికి శక్తి వస్తుంది. అణువులోనికి ఆత్మశక్తి ఫీలింగ్స్ ద్వారా DNA లో కోడింగ్ రూపంలో పొందుపరచడం జరుగుతుంది. మన DNA లో ఉన్న కోడింగ్ కరుణతో కూడిన ప్రేమ.

🌟. 5. ఐదవ చైతన్య తలం(5th Plane)🌟

💠. ఆత్మ తలం: దీనిని "జనాలోకం (స్పిరిచువల్ ప్లేన్)" అంటారు. ఇది5 తలం. ఇది ఆనందమయ కోశంతోనూ, విశుద్ధచక్రం తోనూ కనెక్ట్ అయి ఉంటుంది.

5వ తలం..ఉన్నత ఆత్మలైన అసెండెడ్ మాస్టర్స్, ఎన్ లైటెన్డ్ బీయింగ్స్, ఏంజిల్స్ మన యొక్క స్పిరిట్ గైడ్స్, మన యొక్క స్పిరిచువల్ ఫాదర్, మదర్ ఇక్కడే ఉంటారు. Eg :- లార్డ్ శివ, బుద్ధ, గణేష్, జీసస్, మహమ్మద్, కృష్ణ, రామ.. మొదలైనవారు ఉండే తలం ఇది.

5వ తలం నుండి మనకు లిపిడ్స్, ఫ్యాటీయాసిడ్స్, నాచురల్ ఆయిల్స్, సీడ్స్, నట్స్ ( బాదం, జీడిపప్పు, పిస్తా మొదలైనవి) లభిస్తాయి. వీటి ద్వారా మన భౌతికదేహం కొవ్వు పదార్థాలను తయారు చేసుకుంటుంది. వీటి లోపం వల్ల శరీరంలో " hormonal imbalance" వస్తుంది(హార్మోన్స్ తగ్గుతాయి).5 వ చైతన్య తలం నుండి వచ్చే ఆహారం ద్వారా మన DNA లో ఉన్న స్పిరిచువల్ బ్యాలెన్స్ అనే కోడింగ్ డెవలప్ చేయబడుతుంది.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #అద్భుతసృష్టి

04.Sep.2020

------------------------------------ x ------------------------------------


🌹.  అద్భుత సృష్టి - 24  🌹

✍️ . రచన, సంకలనం- DNA స్వర్ణలత గారు
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🌟. 7.ప్లేన్స్(తలాలు)-చైతన్య ఉన్నత లోకాలు - 3 🌟

🌟 6. ఆరవ చైతన్య తలం(6th Plane) 🌟

💠. అణుపాదక తలం: దీనిని "తపోలోకం (డివైన్ ప్లేన్)" అని అంటారు. ఇది 6 తలం. ఇది విశ్వమయకోశంతోనూ, ఆజ్ఞాచక్రంతోనూ కనెక్ట్ అయి ఉంటుంది. ఇక్కడ విశ్వానికి కావలసిన నీతి- నియమాలు అన్నీ ఇక్కడ నుండే ఉద్భవిస్తాయి.

Eg:-కార్యకారణ సిద్ధాంతం, సమయ సిద్ధాంతం, అయస్కాంత సిద్ధాంతం, ఆకర్షణ సిద్ధాంతం, గురుత్వాకర్షణ సిద్ధాంతం, కాంతి సిద్ధాంతం. ఇలాంటి ఎన్నో సిద్ధాంతాలు ఇక్కడ నుండే యూనివర్స్ లోకి ప్రవేశపెట్టడం జరుగుతుంది.

ఈ 6వ చైతన్య తలం నుండి మనకు న్యూక్లియిక్ ఆసిడ్ తయారవుతుంది. ఈ న్యూక్లియిక్ ఆసిడ్ లేకపోతే DNA స్ట్రక్చర్ లేదు. 

ఈ DNA అనేది లేకపోతే, ఈ భౌతిక ప్రపంచంలో భౌతికత, ఆధ్యాత్మికత అనే రెండు ప్రపంచాలు లేనేలేవు. ఉన్నదంతా ఒకే ప్రపంచం అంటే 6వ తలం మనకు స్పిరిచువల్ స్ట్రక్చర్ ని (ఆధ్యాత్మిక నిర్మాణాన్ని) ఇచ్చింది. దీని ద్వారా మనకు భౌతికత మరి ఆధ్యాత్మికత అంతా ఒకటే "సర్వం ఖల్విదం బ్రహ్మ" అని అర్థం.

🌟. 7. ఏడవ చైతన్య తలం (7th Plane)

💠. ఇది ఆదితలం(తోరస్): దీనిని "సత్యలోకం (మొనాడిక్ ప్లేన్)" అంటారు. ఇది ఏడవ తలం. ఇది నిర్వాణమయకోశంతో మరి ఏడవ చక్రం అయిన సహస్రారంతో కనెక్ట్ అయి ఉంటుంది. దీనినే మనం "క్రియేటర్ ఆఫ్ ఆల్ దటీజ్ (creator of all that is)" లేదా "సృష్టికర్త" అన్నారు. 

ఇక్కడ తెల్లని కాంతి, స్వచ్ఛమైన శక్తి ఉంటాయి. ఏడవ తలం మూలం యొక్క పరిపూర్ణమైన ప్రేమ,విజ్ఞానం, క్రియేటివ్ ఎనర్జీ (సృష్టించే శక్త) ఇస్తుంది. దీనినే "100% వాస్తవికతను సృష్టించే లోకం" అన్నారు. (100% మానిఫెస్ట్ స్టేషన్ జోన్ అని పిలిచారు)

ఏడవ తలం నుండి శరీరానికి ATP (Adenosine triphosphate) అడినోసిన్ ట్రై ఫాస్పేట్ లభిస్తుంది. ATP అంటే విశ్వశక్తి, ఇది జీవులందరిలో ఉంటుంది.

Eg:- "యా దేవీ సర్వ భూతేషు శక్తి రూపేణ సంస్థితా" అని వేదాలలో అన్నారు. సర్వభూతాలలో సంచరిస్తున్న శక్తి ఏదైతే ఉందో అదే మన శరీరంలో అణు పరమాణు స్థితిలో, న్యూక్లియస్ లో ఉన్న ఈ ATP అనే శక్తి. ఈ శక్తి DNA ద్వారా జీవశక్తి రూపంలో ఉంటే "కుండలినీ" రూపంలో మనకు అనంత చైతన్యాన్ని అందిస్తుంది. దీనినే "ఆదిశక్తి" అన్నారు.

ఈ 7 ఉన్నత తలాలు, 3 ప్రపంచాల నుండి సకల విశ్వం మన యొక్క జ్ఞానాన్ని, భౌతిక, ఆధ్యాత్మిక, మానసిక, బుద్ధిక్, ఆనంద, విశ్వమయ నిర్వాణమయ కోశాలలోకి అందుకుంటూ ఉంటుంది.

💫. ఈ సమస్త తలాల యొక్క జ్ఞానం "బైనరీ కోడ్" రూపంలో (సోలార్ లెటర్స్) అగ్ని అక్షరాలుగా మనDNA లో పొందుపరచడం జరిగింది. అది DNA నుండి మనకి ఎప్పటికప్పుడు DNA సంక్రియ ద్వారా అందజేయ బడుతుంది.

💫. ఈ లోకాల జ్ఞానాన్ని బట్టి చూస్తే మానవ మనుగడకు DNA అభివృద్ధి చెందడం ఎంత అవసరమో అర్థమవుతుంది.

ఇంత అవసరమైన DNA అభివృద్ధి చెందాలి అంటే తప్పనిసరిగా శాఖాహారం ఉత్తమోత్తమమని మన ఉన్నత చైతన్యాలు చెబుతున్నాయి. ఎందుకంటే మన ఉన్నత చైతన్య తలాల నుండి మన శరీర అవయవాలు, అందులో జీవశక్తులకు కావలసినవి అన్నీ ప్రకృతి నుండి తయారు అవుతున్నవే. వాటిని తీసుకోవడం వలనే మనం తిరిగి చైతన్యవంతులం అవుతాం.

🙏. "జయహో శాకాహార జగత్ కి జయహో"🙏

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #అద్భుతసృష్టి

05.Sep.2020

------------------------------------ x ------------------------------------


🌹.   అద్భుత సృష్టి - 24   🌹

✍️ . రచన, సంకలనం- DNA స్వర్ణలత గారు
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🌟 8. మానవ దేహం - ఆధ్యాత్మిక కనెక్షన్స్🌟
(అనుసంధానం)

💠. మానవ దేహం రెండు కనెక్షన్స్ ని (అనుసంధానాలను) కలిగి ఉంటుంది.

1. ఇంటర్నల్ కనెక్షన్,

2. ఎక్స్ టర్నల్ కనెక్షన్

🔹 1. ఇంటర్నల్ కనెక్షన్ (Internal connection) శరీరంలో ఉన్న శక్తి క్షేత్రాలు అయిన ఏడు చక్రాల కుండలినీ వ్యవస్థ. వీటిని భౌతిక శక్తి క్షేత్రాలు అంటారు.

🔹 2. ఎక్స్ టర్నల్ కనెక్షన్స్ -విశ్వశక్తి క్షేత్రాలు (External connection) "ఆరా" లో ఉన్న యూనివర్సల్ ఐదు చక్రాల వ్యవస్థ.

భౌతిక శక్తి క్షేత్రాలు 7, విశ్వ శక్తి క్షేత్రాలు5, భౌతికదేహంలోని అణు పరమాణుస్థితిలో ఉన్న న్యూక్లియస్ ఎనర్జీలో DNA లో ఉన్న కోడాన్స్ తో కనెక్ట్ అయి ఉంటాయి.

💫. ఆత్మ యొక్క భౌతిక, విశ్వ సమాచారం అంతా (LEFs) "లైట్ ఎన్ కోడెడ్ ఫిలమెంట్స్" లో డేటాలో స్టోర్ చేయబడి ఉంటాయి.

ఈ కోడాన్స్ లోనూ, LEFsలోనూ సమస్తానికి సంబంధించిన సమస్త సమాచారం దాగి ఉంది. (LEFs+Codons =DNA)ని కలిపి "జెనటిక్ హార్డ్ డ్రైవ్(Genetic hard drive)" అని పిలుస్తారు.

ప్రతి DNA Strandsలో 12 పొరలు ఉంటాయి. అలాగే 12 కోణాలు ఉంటాయి.

DNA Strandsలో ఉన్న 12 పొరలు లేదా 12 ప్రోగులు 3వ పరిధికి సంబంధించిన భౌతిక చక్రాలతోనూ 5వ పరిధికి సంబంధించిన సోలార్ చక్రాస్ తోనూ కనెక్ట్ అయి ఉంటాయి. ఈ రెండు చక్రా వ్యవస్థల ద్వారా మూలం యొక్క శక్తిని మన దేహంలో అనుసంధానించుకుని భౌతిక అసెన్షన్ ద్వారా 12 ఉన్నత సంభావ్యతలలోకి నేరుగా చేరుకొని మూలంలో (భగవంతునిలో) ఎదుగుతాము.

🌟. చక్రాస్ ద్వారా DNA లోకి సమాచారం ఎక్కడి నుండి వస్తుంది?

చక్రా సిస్టమ్ ద్వారా DNAలోకి సమాచారం రెండు ప్రధానమైన మూలాల నుండి వస్తుంది.

1. వంశపారంపర్యంగా తల్లిదండ్రుల నుండి

2. ఉన్నత లోకాల సమాచారం ఉన్నత ఆత్మల నుండి

💠 1.వంశపారంపర్యంగా

🔹. 1.ఈ భౌతిక దేహం ఏ తల్లిదండ్రుల నుండి ప్రాప్తించినదో వారి యొక్క (bloodline) వంశం నుండి మనకు మన మొదటి కణాలు అయిన ప్రైమోర్డియల్ సెల్ (అండం- శుక్రకణాల కలయిక ద్వారా పిండం, జైగోట్ ఏర్పడడం) ద్వారా వంశం యొక్క సమస్త జ్ఞానం DNA లోని సమాచారంగా ఇవ్వబడ్డాయి. ఈ సమాచారం మన గత జన్మలలో చేసిన కర్మలు, మన యొక్క పూర్వీకుల కర్మల నుండి భావాలు, భావావేశాలు, మనస్థితులు, భయాలు, బంధాలు, మూఢనమ్మకాలు, అంధ విశ్వాసాలు, మూర్ఖత్వం, శక్తి, జ్ఞానం మొదలైనవి ఎన్నో ప్రైమోర్డియల్ సెల్ ద్వారా తెచ్చుకున్నాం, ద్వంద్వత్వ జీవితాన్ని నేర్చుకోవటం కొరకు.

🔹. 2.2000సంవత్సరాల నుండి ఉన్నత తలవాసులు యొక్క సమాచారం, మద్దతు మనకి నాన్ ఫిజికల్ జీవుల నుండి అందుతుంది. నాన్ ఫిజికల్ జీవులనే మనం "కర్మదేవతలు" గా పిలుస్తాం. వీరిలో 42 శాశ్వత సభ్యులు, 150 కన్సల్టింగ్ సభ్యులు ఉంటారు. మనం ఎన్నో లోకాలలో జీవించిన జీవితాల సారమైన జ్ఞానం, ఉన్నత సమాచార రూపంలో మన చక్రాల ద్వారా DNA కి అందజేస్తున్నారు. ఇది అంతా కూడా ఎలక్ట్రో మాగ్నెటిక్ ఫీల్డ్ (విద్యుత్ అయస్కాంత క్షేత్రం) ద్వారా జరుగుతుంది.

ఎలక్ట్రో మాగ్నెటిక్ ఫీల్డ్ ద్వారా ప్రకంపిస్తున్న శక్తి తరంగాలు చక్రా వ్యవస్థకు మన రెండవ దేహమైన ప్రాణమయ శరీరం ద్వారా అందించబడతాయి. ఈ దేహం తాను స్వీకరించిన శక్తిని పరమాణుస్థితిలో ఉన్న న్యూక్లియస్ ఎనర్జీ లోని DNA కి అందచేయబడుతుంది.

సశేషం.... 
🌹 🌹 🌹 🌹 🌹

#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #అద్భుతసృష్టి

07.Sep.2020

------------------------------------ x ------------------------------------

🌹.   అద్భుత సృష్టి - 25   🌹

✍️ . రచన, సంకలనం- DNA స్వర్ణలత గారు
సేకరణ : ప్రసాద్ భరద్వాజ


🌟 9. భౌతిక శక్తి క్షేత్రాలు - ఆధ్యాత్మిక శక్తి క్షేత్రాలు🌟

💠 1.భౌతిక శక్తి క్షేత్రాలనే మన ఋషులు "7 చక్రాలు" అని పిలిచారు. రెండవ దేహమైన ప్రాణమయ శరీరంలోనే (స్పిన్నింగ్ డిస్క్ ) చక్రాస్ ఉంటాయి.

💠 2.ఆధ్యాత్మిక శక్తి క్షేత్రాలనే "విశ్వశక్తి క్షేత్రాలు" అంటారు. ఇవి 5. ఇవి మన ఆరాలో ఉంటాయి. వీటిని "ఆరా చక్రాస్" అంటారు.


🌼. 1. భౌతిక చక్రా సిస్టమ్:-

మనం విద్యుత్ శక్తి(EE) అయస్కాంతశక్తి(ME) కలయికతో ఏర్పడిన మూడవ పరిధి శరీరాలు కలిగిన మూడవ పరిధి జీవులం. 

మనం 3వ పరిధి భూమిలో నివశిస్తున్నాం. మన దేహం బయో- అయస్కాంత జీవిత రూపం (Bio - Magnetic Life form) మన శక్తి శరీరాన్ని చూసినట్లయితే ఉత్తర- దక్షిణ ధృవాల మధ్య ప్రవహించే విద్యుత్ అయస్కాంత గీతల మధ్య ఉన్న జీవరూపంలా ఉంటుంది.

💫. కాళ్ళ నుండి తల వరకు వ్యాపించి ఉన్న (ఉత్తరం- తల, దక్షణం- కాళ్ళు ధృవాల) శక్తి క్షేత్ర పంక్తులనే "టూబ్ తోరస్" అంటారు. ఇది గోనాడ్ ఆకారంలో (బోర్లించిన గుడ్డు) ఉంటుంది. దీనినే ప్రాణశక్తి సంచారం చేసే "ఈధర్ అల్లిక" నిర్మాణం కలిగిన లోపలి శరీరం (2 దేహం), దీనినే మన యొక్క శక్తి క్షేత్రం అన్నారు.ఇది బయటకు శక్తిని విస్తరిస్తూ ఉంటుంది దానిని "ఆరా" అన్నారు. ఇదే మన యొక్క ప్రకాశం.

ఆత్మ శక్తి ప్రవాహం ద్వారానే ప్రాణమయ శరీరంలోకి ప్రవేశించిన శక్తి అక్కడ ఉన్న "స్పిన్నింగ్ డిస్క్( చక్రాస్)" ద్వారా భౌతిక శరీరానికి అవసరమైన పోషణ లభిస్తుంది. 

ఈ ప్రక్రియ ద్వారా శరీరానికి అవసరమైన పోషణ లభిస్తుంది.

ప్రస్తుతం వెన్నెముకను ఆధారం చేసుకుని కొన్ని ప్రాణనాడుల కలయికతో ఎనర్జీ సెంటర్స్ ఏర్పడి ఉన్నాయి. వీటినే చక్రాస్ అన్నారు. ఇవి మొత్తం 7 శక్తి క్షేత్రాలు. ఇవి జంక్షన్ బాక్స్ లుగా ఉంటాయి అంటే ఇంటికి ట్రాన్స్ ఫార్మర్ నుండి కరెంటు పోల్ ద్వారా మన ఇంటిలోని జంక్షన్ బాక్స్ ద్వారా కరెంట్ తీసుకున్నట్లుగా మన దేహంతో కూడా ఇదే విధంగా శక్తి సంచారం జరుగుతుంది.

💫. మన శరీరంలో జరిగే శక్తి సంచారాన్ని "న్యూరో ఎలక్ట్రికల్ సర్క్యుటరీ సిస్టమ్" అంటారు. అయస్కాంత తరంగాలను పంపించడానికి ఉన్న జంక్షన్ పాయింట్స్ ద్వారా ఎక్కువ తక్కువలను నియంత్రించి శక్తిని (ఎనర్జీ) శరీరమంతా ప్రవహింప చేస్తాయి.

శరీరంలోని ప్రతి ప్రాంతానికి శక్తిని కేంద్రనాడీ వ్యవస్థ ద్వారా పంపించడం జరుగుతుంది. ఈ శక్తి సంచారం ప్రాణనాడుల ద్వారా జరిగేది అంతా కొన్ని ప్రాంతాలలో జంక్షన్ పాయింట్స్ ని కలిగి ఉన్నాయి. ఈ జంక్షన్ పాయింట్స్ ని "చక్ర స్థానాలు" అన్నారు. చక్రాలు శరీరంలో అనేక విధులను నిర్వహిస్తాయి. ఈ చక్రాస్ అన్నీ కూడా శరీరంలోని వినాళ గ్రంధులకు(Endocrine glands) అనుసంధానించబడి ఉంటాయి. 

చక్రాస్ అన్నీ కూడా( కలర్, టోన్) వర్ణం,, శబ్ద తరంగాల ద్వారా పనిచేస్తాయి. చక్రా యాక్టివేషన్ కూడా కలర్, టోన్ ద్వారా జరుగుతుంది.

💠. చక్రా పేర్లు:

1. మూలాధార చక్రం

2. స్వాధిష్టాన చక్రం

3. మణిపూరక చక్రం

4. అనాహత చక్రం

5. విశుద్ధి చక్రం

6. ఆజ్ఞా చక్రం

7. సహస్రార స్థితి.

సశేషం...... 
🌹 🌹 🌹 🌹 🌹

#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #అద్భుతసృష్టి

08.Sep.2020

------------------------------------ x ------------------------------------



🌹.   అద్భుత సృష్టి - 26   🌹

✍️ . రచన, సంకలనం- DNA స్వర్ణలత గారు
సేకరణ : ప్రసాద్ భరద్వాజ


🌟. 1. మూలాధార చక్రం:-

ఇది శరీరంలోని (అడ్రీనల్ గ్రంథి) కి కనెక్ట్ చేయబడి ఉంటుంది. మూలాధార చక్రం శరీర అవయవాలు అయిన ఎముకలు, బోన్ మ్యారో (ఎముకల మజ్జ), జుట్టు, కంటి రెటీనా, చర్మం, జాయింట్స్ తో కనెక్ట్ అయి ఉంటుంది. 

ప్రాణమయ శరీరంలో పైన చెప్పిన శరీర అవయవాల ప్రాంతంలో బ్లాక్స్ ఏర్పడి ఉంటే ఆ శరీర అవయవంలో ఇబ్బందులు (వ్యాధులు) సంక్రమించడం జరుగుతుంది. ఈ "బ్లాక్స్" అనేవి మనలోని అరిషడ్వర్గాల ద్వారా ఏర్పడతాయి. ఇది పృథ్వీ తత్వాన్ని కలిగి ఉంటుంది.

💫. భయం వల్ల ఈ చక్రం బ్లాక్ చేయబడుతుంది. ఈ చక్రంలో "సర్వైవల్ (మానవ మనుగడ)" అనే శక్తి ఉంటుంది. ఈ శక్తి ద్వారా భౌతిక అవసరాలు, భౌతిక ఆనందాలు పొందటం జరుగుతుంది.

Eg:-వ్యక్తిత్వ వికాసానికి భౌతికపరమైన అవసరాలకు ఇది సహాయం చేస్తుంది. భూమితో అనుసంధానమై ఉన్నామన్న భావనను కలిగిస్తుంది. సెల్ఫ్ ఇంపార్టెన్స్ ని కలిగిస్తుంది. స్థిరత్వం లభిస్తుంది. భద్రత దొరుకుతుంది. ఈ చక్రం సక్రమంగా పని చేయడం వలన భౌతిక ప్రపంచంతో కనెక్ట్ అయి భౌతిక వాస్తవంతో జీవిస్తాం.

💠. ఈ చక్రం అండర్ యాక్టివ్ అయితే:- భయం, ఆందోళన, విశ్రాంతి లేకపోవడం, నిరాశకు గురి అవ్వడం జరుగుతుంది.

🔹. ఇది ఓవర్ యాక్టివ్ అయితే:-

అధిక భౌతిక వాదాన్ని కలిగి ఉండటం జరుగుతుంది.

🌈. ఇది సమస్థితిలో ఉంటే:-

సర్వైవల్ శక్తి జాగృతి, కుండలినీ జాగృతి అవుతుంది. ఈ చక్రం రంగు ఎరుపు, పృధ్వీతత్వం, గంధం వాసన దీని క్వాలిటీ. ఈ క్వాలిటీ ఎక్కువ అయితే భౌతిక వాసనలో పడిపోతాం. 

ఈ చక్రం ద్వారా మనం భూలోకం తో అనుసంధానం అయినప్పుడు మనం ముముక్షువుగా మన ఆధ్యాత్మిక ప్రగతిని మొదలుపెడతాం! సత్యాన్ని వెదకడం మొదలుపెడతాం.

ఈ చక్రం అడ్రీనల్ గ్రంధి ద్వారా మొదటి స్ట్రాండ్DNAని కనెక్ట్ చేసుకుంటుంది. దీని ద్వారా "నేను ఏ సత్యాన్ని అయితే స్వీకరిస్తున్నానో.. ఆ సత్యంపై స్థిరంగా ఉన్నాను" అని చెబుతుంది. (నేనే అంతా- అహం బ్రహ్మాస్మి)

🌀. సాధన, సంకల్పం:-

1.నా మూలాధార చక్రంలో భయం తాలూకు, భౌతికవాదం తాలూకు బ్లాక్స్ మరి వీటికి సంబంధించిన కర్మ ముద్రలు, కర్మ కనెక్షన్స్ అన్నీ రిలీజ్ కావాలని నా పూర్ణాత్మ, పరమగురుమండలిని, మూలచైతన్యాన్ని, కర్మ యొక్క అధి దేవతలను ప్రార్థిస్తున్నాను."

🌀. సంకల్పం:-2. 

"నేను అహం బ్రహ్మాస్మి స్థితిని అంగీకరిస్తున్నాను. నా మూలాధార చక్రాన్ని పూర్తిగా ఆక్టివేట్ చేసుకుంటున్నాను. నా సర్వైవల్ శక్తి నాలో 100% డెవలప్ చేసుకుంటున్నాను. నా యొక్క అడ్రీనల్ గ్రంధి మరి దానికి అనుసంధానం చేయబడిన శరీర అవయవాలు అన్నీ సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నాయి."

సశేషం..... 
🌹 🌹 🌹 🌹 🌹

#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #అద్భుతసృష్టి

09.Sep.2020

------------------------------------ x ------------------------------------


🌹.  అద్భుత సృష్టి - 27  🌹

✍️ . రచన, సంకలనం- DNA స్వర్ణలత గారు
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🌟 2.స్వాధిష్టాన చక్రం:-

దీని రంగు.. నారింజ రంగు. ఇది శరీరంలో గోనాడ్ గ్రంధులతో కనెక్ట్ అయి ఉంటుంది. దీని స్థానం శరీరంలో బొడ్డుకు రెండు అంగుళాలు క్రింద. ఇది శరీర అవయవాలు అయిన బీజకోశాలతో, గర్భాశయంతో, అండాశయంతో, వృషణాలతో(స్త్రీ - పురుష సంతానోత్పత్తి కేంద్రాలు), కిడ్నీస్, యూరినరీ బ్లాడర్ తో కనెక్ట్ చేయబడి ఉంటుంది. 

"అపరాధ భావం" అనే ఎనర్జీతో ఈ చక్రం బ్లాక్ చేయబడుతుంది. ఈ చక్రంలో ఉన్న శక్తి .. ఆనందం, క్రియేషన్స్ కి సంబంధించిన ప్రేమ, సృజనాత్మక శక్తి, ప్లానింగ్, సహజ సౌందర్యంతో నిండి ఉంటుంది.

🌈. లాభాలు:-
భావోద్వేగాలను బ్యాలెన్స్ చేస్తుంది. లైంగికతను కంట్రోల్లో ఉంచుతుంది. సృజనాత్మక శక్తిని పెంపొందిస్తుంది. నూతన వాస్తవాలను సృష్టిస్తుంది. లైంగిక సామర్థ్యం కలిగి ఉంటుంది. జీవితంలో సమతాస్థితి (లైఫ్ లో బ్యాలెన్సింగ్), రిసీవింగ్ కెపాసిటీ కలిగి ఉంటుంది.

🌀. అండర్ యాక్టివ్:-
ఒంటరితనం ఫీల్ అవుతాం. అన్ ఎమోషనల్ గా ఉంటాం. దృఢమైన మానసికస్థితి లేకుండా ఉండటం జరుగుతుంది.

🔹. ఓవర్ యాక్టివ్:-
కోరికలకు బానిసలుగా మారుతారు. సెక్స్ పరంగా స్థిరత్వం లేకుండా ఉంటారు.

💠. సమతుల్యత:- 
జీవితం మరి ప్రతివిషయం పట్ల స్పష్టత కలిగి ఉంటారు. లైంగిక పరంగా పూర్తి ఆనందాన్ని పొందుతారు. భావోద్వేగాలపై పూర్తి స్వేచ్ఛను కలిగి ఉంటారు. స్వాధిష్టాన క్వాలిటీ... రుచి, భావన ఇక్కడ సరిగ్గా ఉండటం చాలా అవసరం.

ఇది జలతత్త్వాన్ని కలిగి ఉంటుంది. అంటే మార్పు చెందించుకునే తత్వం ఇది. భువర్లోకంతో కనెక్ట్ అయి ఉంటుంది. ఈ చక్రం ద్వారా మనం సాధకునిగా మన ఆధ్యాత్మిక ప్రగతిని మరింత ముందుకు తీసుకొని వెళతాం.

ఇది గోనాడ్ గ్రంథులతో కనెక్ట్ అయిన రెండవ స్ట్రాండ్ DNA తో కనెక్ట్ చేయబడుతుంది. 

"దీని ద్వారా నేను ఏది అయితే స్వీకరిస్తున్నానో (ఉన్నదంతా ఒకటే) దానినే నేను మ్యానిఫెస్ట్ చేస్తున్నాను. దీని ద్వారా నా సంబంధబాంధవ్యాలు మంచి స్థితిలో ఉంచుకుంటున్నాను."

🌟 సాధనా సంకల్పం 1:- 

"నా స్వాధిష్టాన చక్రంలో ఉన్న అపరాధభావం (తప్పు చేశానన్న భావన) మూలాలతో సహా నా నుండి తొలగించబడాలి."

సంకల్పం 2:- 

"నాలో ఉన్న... నేను తప్పు చేశానన్న భావన తాలూకు సరికాని శక్తి తరంగాలు, కర్మలు వాటి యొక్క ముద్రలు అన్నీ మూలాలతో సహా తొలగించబడాలి."

సంకల్పం 3:- 

"నేను మమాత్మా సర్వ భూతాత్మా స్థితిని అంగీకరిస్తున్నాను; ఉన్నదంతా ఒకటే అని నమ్ముతున్నాను. నేను, నా కుటుంబం, నా సమాజం, నా దేశం, నా ప్రపంచం అంతా ఆనందంతో, కాంతితో, ప్రేమతో నిండిపోవాలి."

సశేషం...... 
🌹 🌹 🌹 🌹 🌹

#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #అద్భుతసృష్టి

10.Sep.2020

------------------------------------ x ------------------------------------


🌹.   అద్భుత సృష్టి - 278  🌹

✍️ . రచన, సంకలనం- DNA స్వర్ణలత గారు
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🌟 3. మణిపూరక చక్రం: 🌻

ఇది పసుపు రంగు, క్వాలిటీ - రూపం, అగ్ని - తత్వం, గుణం-రూపం ను కలిగి ఉంటుంది. ఇది బాహ్యం ద్వారా అంతరాన్ని ప్రభావితం చేస్తుంది. ఇది శరీర అవయవాలలో... కాలేయం, పాంక్రియాస్ గ్రంధితో, పెద్ద ప్రేగులు, చిన్న ప్రేగులు, అపెండిసైటిస్, పొట్ట భాగంతో కనెక్ట్ అయి ఉంటుంది. ప్రాణమయ కోశంలో బ్లాక్స్ (శక్తి నిరోధకాలు) ఉంటే వాటికి సంబంధించిన వ్యాధులు సంక్రమిస్తాయి.

💫. ఈ చక్రం "అవమాన భారం" అనే ఫీలింగ్ ద్వారా బ్లాక్ చేయబడుతుంది. ఈ చక్రంలో ఉన్న శక్తి.. సంకల్పశక్తి ! "విన్నింగ్ యాటిట్యూడ్" అంటే గెలవాలి అనే తపన మరి దృఢనిశ్చయం కలిగి ఉంటుంది.

🌷. లాభాలు:- 

ఈ చక్రం ద్వారా గౌరవం, చిత్తశుద్ధి మరి మూలశక్తి అయిన సంకల్పశక్తి ఓపెన్ చేయబడతాయి. మన యొక్క శక్తి మనకు తెలుస్తుంది. మనపై మనకు కంట్రోలింగ్ వస్తుంది. ఆత్మగౌరవం పెంపొందించబడుతుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. శక్తి మెరుగుపడుతుంది.

🌀. అండర్ యాక్టివ్ అయితే:- ధైర్యం లేకపోవడం, వ్యతిరేక భావనలు కలిగి ఉండడం.

🔹. ఓవర్ యాక్టివ్ అయితే:- కోపం మరి అహంకారానికి దారి తీస్తుంది.

"నేను సువర్లోకంతో కనెక్ట్ అయి ఋషిగా ఎదుగుతున్నాను. ప్యాంక్రియాస్ గ్రంధి ద్వారా నేను 3వ స్ట్రాండ్ DNA తో కనెక్ట్ చేయబడి ఉన్నాను."

"దీని ద్వారా నేను ఏదైతే మూలం నుండి ఫీల్ అవుతున్నానో(నా వాస్తవానికి నేనే సృష్టికర్తను)దానిని అనుభూతి చెందుతూ మనకు అవసరమైన భౌతిక, ఆధ్యాత్మిక ప్రగతులను సృష్టిస్తున్నాను."

💠. సాధన సంకల్పం 1: 

"నా మణిపూరక చక్రంలో ఉన్న సరికాని శక్తులు అన్నీ క్లీన్ చేయబడాలి. నాలో అంతర్గతంగా దాగి ఉన్న అవమాన భారం అనే ఫీలింగ్ ని వదిలి వేస్తున్నాను. నేను ఇతరులను అవమానించి ఉంటే అందుకు క్షమాపణ అడుగుతున్నాను. దీనికి సంబంధించిన కర్మల ముద్రలు మూలాలతో సహా నా చైతన్యం నుండి తొలగించబడాలి."

సంకల్పం -2: 

" 'నా వాస్తవానికి నేనే సృష్టికర్తను' అని మనఃపూర్వకంగా నమ్ముతున్నాను. నేను భౌతికంగా, ఆధ్యాత్మికంగా అత్యున్నత స్థానంలో ఉండాలని సంకల్పిస్తున్నాను."

సశేషం.... 
🌹 🌹 🌹 🌹 🌹

#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #అద్భుతసృష్టి

11.Sep.2020

------------------------------------ x ------------------------------------


🌹.  అద్భుత సృష్టి - 29  🌹

✍️ . రచన, సంకలనం- DNA స్వర్ణలత గారు
సేకరణ : ప్రసాద్ భరద్వాజ


🌻. 4. అనాహత చక్రం: 🌻

గ్రీన్ కలర్, ఆకుపచ్చరంగు-థైమస్ గ్రంధి (Thymus gland), వాయుతత్వం. క్వాలిటీ-స్పర్శ, ఫీలింగ్.

✨. ఈ చక్రం హృదయం మధ్య భాగంలో ఉంటుంది. దీనిని గుండె చక్రం అంటారు. ఇది ఆత్మ యొక్క కేంద్ర స్థానం. శరీరంలో గుండెతోనూ, ఊపిరితిత్తులతోనూ, గాల్ బ్లాడర్ తోనూ, డయాఫ్రమ్ తోనూ ఈ చక్రం కనెక్ట్ అయి ఉంటుంది. ప్రాణమయ శరీరంలో ఈ ప్రాంతాలలో ఎక్కడ బ్లాక్స్ ( శక్తి నిరోధకాలు) ఉన్నా శరీరంలోని ఆ అవయవాలలో వ్యాధులు సంక్రమిస్తాయి. 

ఈ చక్రంలో ఉన్న శక్తి "unconditional love" మరి "కరుణతో కూడుకున్న ప్రేమ." దీనిని గొప్ప ట్రాన్స్ ఫార్మర్ గా పిలుస్తారు. ఈ చక్రం "దుఃఖం" అనే ఎనర్జీతో బ్లాక్ చేయబడి ఉంటుంది.

💠. లాభాలు: 

జీవితంలో బ్యాలెన్స్ వస్తుంది. ప్రేమ, కరుణ, విశ్వాసం, నిష్కపట ప్రేమ, స్వేచ్ఛా సామర్థ్యాలను కలిగి ఉండటం. భయం లేకుండా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ని పెంపొందిస్తుంది.

🌀. అండర్ యాక్టివ్:

తన మీద తనకు నమ్మకం లేకపోవడం, శరీరం ఎప్పుడూ చల్లగా ఉండడం, వ్యక్తుల మధ్య మనస్పర్థలు వచ్చి దూరం పెరిగిపోతుంది.

🔹. ఓవర్ యాక్టివేట్: 

ఎలాంటి ఫీలింగ్స్ లేకపోవడం (ప్రేమకు సంబంధించి) అవగాహనారాహిత్యం, అహం సమస్యలు తలెత్తడం జరుగుతుంది.

🌟. సమతుల్యంగా ఉంటే: కరుణ, ప్రేమ, స్నేహం కలిగి ఉంటాం. భావోద్వేగాలు శాంతియుతంగా ఉంటాయి. హృదయపూర్వకంగా జీవిస్తాం. ఈ చక్రం మహర్లోకంతో కనెక్ట్ అయి ఉంది. ఈ శక్తి ద్వారా మనం "మహర్షి" గా ఎదుగుతాం.

ఈ చక్రం 4 వ ప్రోగు DNA తో కనెక్ట్ అయి ఉంది. దీని ద్వారా మనం మూలం నుండి ఏదైతే ఫీల్ అవుతున్నామో(రాధాకృష్ణ తత్వం, జీసస్ తత్వం, ప్రేమ) దీనినే ఇతరులకు పంచుకున్నాం.

🌼. సాధనా సంకల్పం 1:- 

"నా అనాహత చక్రంలో ఉన్న సరికాని శక్తులు అన్నీ మూలాలతో సహా తొలగించబడాలి. ఇందులో ఉన్న దుఃఖం పూర్తిగా తొలగించబడాలి. నేను ఏ ఆత్మ స్వరూపానికి అయినా దుఃఖాన్ని కలిగించి ఉంటే ఆ ఆత్మ స్వరూపులు అందరూ నన్ను క్షమించాలి. దీనికి సంబంధించిన కర్మలు, కర్మ ముద్రలు మూలాలతో సహా నా నుండి తొలగించబడాలి."

🏵️. సంకల్పం-2:- 

"నాలో అంతర్గతంగా దాగి ఉన్న విశ్వశక్తి అయిన కరుణతో కూడుకున్న ప్రేమ అభివృద్ధి చెందాలి. నా హృదయం అనంత ప్రేమతో నిండిపోయి దానిని ఇతరులకు పునఃప్రసరణ చేయాలి. నేను ప్రేమతో, కరుణతో జీవిస్తూ ఇతరులను ఇతర జీవరాశులను అదే విధంగా జీవించేలా చేస్తాను."

సశేషం... 
🌹 🌹 🌹 🌹 🌹

#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #అద్భుతసృష్టి

12.Sep.2020

------------------------------------ x ------------------------------------


🌹.   అద్భుత సృష్టి - 30  🌹

✍️ . రచన, సంకలనం- DNA స్వర్ణలత గారు
సేకరణ : ప్రసాద్ భరద్వాజ


🌻 5. విశుద్ధి చక్రం: 🌻

లైట్ బ్లూ కలర్. థైరాయిడ్ గ్రంధితో కనెక్ట్ అయి ఉంటుంది. ఆకాశతత్వం, దీని క్వాలిటీ - శబ్దంను కలిగి ఉంటుంది.ఇది శరీరంలో థైరాయిడ్, ప్యారాథైరాయిడ్ గ్రంథుల తో స్వరపేటిక, స్వరనాళాలు, గొంతు, అన్నవాహికతో కనెక్ట్ అయి ఉంటుంది. 

ప్రాణమయశరీరంలో ఈ ప్రాంతంలో బ్లాక్స్ (శక్తి నిరోధకాలు) ఎక్కడ ఉన్నా ఆ ప్రాంతంలో ఉన్న శరీర అవయవాలు వ్యాధిగ్రస్తం అవుతాయి. ఈ చక్రం అసత్యాలు మాట్లాడం వలన, అసత్యాలు ప్రమోట్ చేయడం వలన బ్లాక్ చేయబడుతుంది. ఈ చక్రం నుండి భావాలు, భావోద్వేగాలు ఎక్స్ ప్రెషన్స్ రూపంలో (మాటలరూపంలో) బయటకు వ్యక్తం చేయబడతాయి.

🌟. లాభాలు: 

నిజాయితీగా ఉండడం, మన అంతర్గతభావాలను స్పష్టంగా వ్యక్తపరచటానికి మాటల ద్వారా, నిశ్శబ్దం ద్వారా కళాత్మకంగా ప్రదర్శిస్తాం. ఆధ్యాత్మిక బాహ్య ప్రపంచాలలో హైయ్యర్ క్రియేషన్ ను చేస్తాం.

🌀. అండర్ యాక్టివ్: 

సిగ్గుపడడం, మాట్లాడలేకపోవడం.

🔹. ఓవర్ యాక్టివ్ గా ఉంటే: ఎక్కువగా మాట్లాడడం, చెడుమాటలు వినేవారుగా తయారవుతారు.

💠. సమతుల్యం: నిరంతరం సమతుల్యతతో ఉంటాం, సమతుల్యతతో వ్యవహరిస్తాం.

💫. ఈ చక్రం ద్వారా మనం "జనలోకం" తో కనెక్ట్ అయి "రాజర్షి" గా ఎదుగుతాం; ఈ చక్రం DNA 5వ ప్రోగుతో కనెక్ట్ అవుతుంది. ఈ DNA ద్వారా మూలం నుండి మనం ఏ సత్యాన్ని అయితే పొందుతున్నామో దాన్నే మాట్లాడుతూ ఉండాలి. ఇక్కడ ఉన్న "క్రియాశక్తి" ని మనం వినియోగించుకోవాలి.

💠. సాధనా సంకల్పం-1: 

"నా విశుద్ధి చక్రంలో ఉన్న సరికాని శక్తులు అన్నీ మూలాలతో సహా తొలగించబడాలి. నేను అసత్యాలను మాట్లాడం వలన కానీ, ప్రమోట్ చేయడం వలన కానీ ఏర్పడిన కర్మబ్లాక్స్, ముద్రలు ఏం ఉన్నా మూలాలతో సహా తొలగించబడాలి. ఈ అసత్యాల వలన నష్టం, కష్టం కలిగిన వారిని మనఃపూర్వకంగా క్షమించమని ప్రార్థిస్తున్నాను."

🌻. సంకల్పం-2: 

"నా విశుద్ధి చక్రం పూర్తిస్థాయిలో యాక్టివేషన్ లోకి రావాలి. నాలో సత్య ప్రకటన అభివృద్ధి చెందాలి. ఉన్నత సృజనాత్మకత అభివృద్ధి చెందాలి. నా జీవితం పట్ల నాకు స్పష్టత ఏర్పడాలి. నేను మూలశక్తి యొక్క వార్తాహరునిగా మారాలి. నా యొక్క సమాచార ప్రసరణ వ్యవస్థ, నా యొక్క క్రియాశక్తి అద్భుతంగా అభివృద్ధి చెందాలి."

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #అద్భుతసృష్టి

14 Sep 2020

------------------------------------ x ------------------------------------



🌹.   అద్భుత సృష్టి - 31  🌹

✍️ . రచన, సంకలనం- DNA స్వర్ణలత గారు
సేకరణ : ప్రసాద్ భరద్వాజ


🌻 . 6. ఆజ్ఞా చక్రం: 🌻

ఇండిగో బ్లూ కలర్, పీనియల్ గ్రంధితో కనెక్ట్ అయి ఉంటుంది. ఈ చక్రం దివ్యత్వాన్ని కలిగి ఉంటుంది. దీని క్వాలిటీ -దివ్యనేత్రం ,ఇచ్ఛాశక్తి, దివ్యసంకల్పశక్తి. 

💫. ఈ చక్రం శరీరంలోని కన్ను, చెవి, ముక్కు, నోరు అలాగే శరీరంలోని ప్రధాన నాడులు అయిన 72 నాడులతో కనెక్ట్ అయి ఉంటుంది. ప్రాణమయ శరీరంలో ఈ ప్రాంతాలలో ఎక్కడ శక్తి నిరోధకాలు (బ్లాక్స్) ఉంటే వాటికి సంబంధించిన వ్యాధులు సంక్రమిస్తాయి.

నిత్యజీవితంలో మనల్ని ఆధ్యాత్మిక జీవి ( స్పిరిచువల్ బీయింగ్) గా ఉంచుతుంది. సహజ అవబోధన (ఇన్ ట్యూషన్) కలిగి ఉంటుంది. ఎరుక స్థితి, అంతర్ దృష్టి, దివ్యదృష్టి ఈ చక్రం ద్వారా బహుమతిగా పొందాం.

🌀. ఈ చక్రం అండర్ యాక్టివ్ గా ఉంటే: భ్రమలను కలిగిస్తుంది. చూసిన దానినే నమ్మటం, నిజమైన ఆలోచనాపరుడుగా ఉండడం, (తాను పట్టిన కుందేలుకు మూడే కాళ్ళు అనే వారిగా) ప్రతికూలశక్తులతో బాధపడుతుంటారు.

🔹. ఈ చక్రం ఓవర్ యాక్టివ్ గా ఉంటే: ఫ్యాంటసీ (ఊహల ప్రపంచం)లో బ్రతుకుతూ మతిభ్రమణం కలిగి సైకోలా తయారవుతారు.

💠. ఈ చక్రం సమతుల్యంగా ఉంటే: సిక్స్త్ సెన్స్, ఇన్ ట్యూటివ్ నాలెడ్జ్, ఊహశక్తి, దివ్యనేత్రం, దివ్యలోకాలతో అనుసంధానం, అంతర్ దృష్టి కలిగి ఉంటారు. 

ఈ చక్రం తపోలోకంతో కనెక్ట్ అయి ఉంటుంది. దీని శక్తి మనల్ని "బ్రహ్మర్షులు" గా తయారుచేసి బ్రహ్మానందంలో ఉంచుతుంది.

ఈ చక్రం DNA లో 6వ ప్రోగుతో కనెక్ట్ అయి ఉంటుంది. ఇది పీనియల్ గ్రంథి ద్వారా మనం దేనినైతే చూస్తున్నామో ( దివ్య నేత్రశక్తితో) దానినే అది పరిపూర్ణంగా స్వీకరిస్తుంది.

🌟. సాధనా సంకల్పం 1:- 

"నా ఆజ్ఞాచక్రంలో ఉన్న సరికాని శక్తులన్నీ మూలాలతో సహా తొలగించబడాలి. నేను ఈ ఆజ్ఞాచక్రం ద్వారా చేసిన సరికాని కర్మలు, వాటి తాలూకు గుర్తులు, ముద్రలు మూలాలతో తొలగించబడాలి. ఈ కర్మల తాలూకు ఆత్మ స్వరూపులు నన్ను మనఃపూర్వకంగా క్షమించాలి."

🌻. సంకల్పం 2:- 

"నా ఆజ్ఞాచక్రం పరిపూర్ణంగా యాక్టివేషన్ లోకి రావాలి. ఇక్కడ ఉన్న దివ్యశక్తులు నాలో పరిపూర్ణంగా అభివృద్ధి చెంది, నన్ను బ్రహ్మర్షిగా మార్చాలి. నేను నా ప్రపంచం, అందులోని సకల జీవరాశి బ్రహ్మానందంతో ఉండాలి."

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #అద్భుతసృష్టి

15 Sep 2020

------------------------------------ x ------------------------------------




🌹. అద్భుత సృష్టి - 32 🌹

✍️ . రచన, సంకలనం- DNA స్వర్ణలత గారు
సేకరణ : ప్రసాద్ భరద్వాజ


🌻. 7.సహస్రార స్థితి:- 🌻

వైలెట్ కలర్, పిట్యూటరీ గ్రంధితో కనెక్ట్ అయి ఉంటుంది. దీని క్వాలిటీ - హయ్యర్ విల్ పవర్ కలిగి ఉండడం, జ్ఞానశక్తి కలిగి ఉంటుంది.

ఈ చక్రం శరీరంలో బ్రెయిన్ తోనూ, శరీరంలో సమస్తనాడులతోనూ కనెక్ట్ అయి ఉంటుంది. ప్రాణమయ శరీరంలో ఎక్కడ శక్తి నిరోధకాలు ఉన్నా వాటికి సంబంధించిన వ్యాధులు సంక్రమిస్తాయి. ఈ చక్రాన్ని "కిరీట చక్రం" అంటారు. 

ఇందులో ఆధ్యాత్మికంగా ఎదగడానికి అనంతమైన (సహస్రం అంటే వేయి) పాజిబులిటీస్ (అవకాశాలు) ఉంటాయి. ఇది అనంతలోకాలతో కనెక్ట్ అయి ఉంటుంది. ఈ చక్రం "అహంకారం" అనే శక్తితో బ్లాక్ చేయబడి ఉంటుంది.


🌟. లాభాలు:- 

ఈ చక్రంలో ఉన్న శక్తి "కృష్ణ చైతన్యం" మనల్ని ఈ చక్రం గ్రేట్ క్రియేటర్ గా మార్చుతుంది. విశ్వంతో కనెక్ట్ చేస్తుంది. అంతా తానే ఉన్నానన్న స్థితిని కలిగిస్తుంది. న్యాయబద్ధంగా జీవిస్తాం. న్యాయబద్ధమైన నిర్ణయాలు తీసుకుంటాం మరి ఏకత్వంలో జీవిస్తాం.


🌀. ఈ చక్రం అండర్ యాక్టివ్ లో ఉంటే: ఆధ్యాత్మికతకు దూరంగా ఉంటాం.

🔹. ఈ చక్రం ఓవర్ యాక్టివ్ లో ఉంటే: కాంతి, శక్తి ఎక్కువ అయినదన్న భావన కలుగుతుంది. భూమితో కనెక్షన్ (భౌతికతలో కనెక్షన్) ఉండదు. అహంకారపూరితంగా (అహంకారిగా) ఉంటాం.

💠. ఈ చక్రం సమతుల్యంగా ఉండడం వలన: ఉన్నత చైతన్యంతో నిరంతరం కనెక్ట్ అయి ఉంటాం. హయ్యర్ కాన్షియస్ కి ఒక వారధిని ఏర్పరుచుతుంది. ఆధ్యాత్మిక అనుసంధానాన్ని ఇస్తుంది. పరిపూర్ణ భగవత్ స్థితిని పొందుతాం.

ఈ చక్రం సత్యలోకంతో కనెక్ట్ అయి మనల్ని "దేవర్షి" గా పరిపూర్ణ చైతన్యాలుగా మార్చుతుంది. ఈ చక్రం DNA లో 7 ప్రోగులతో కనెక్ట్ అయి యూనివర్స్ (విశ్వం) నుంచి చైతన్యాన్ని పొందుతుంది. ఇది పిట్యూటరీ హైపోథాలమస్ గ్రంధులతో అనుసంధానం అయి ఉంటుంది.

"నీ విశ్వం నుండి నేను దేనినైతే పొందుతానో (అర్థనారీశ్వర తత్వం) దానినే అనుభవిస్తున్నాను, వింటున్నాను, చూస్తున్నాను, మాట్లాడుతున్నాను, పంచుతున్నాను, సృష్టిస్తున్నాను మరి సాధిస్తున్నాను."


🌼. సాధన ధ్యాన సంకల్పం 1:- 

"నా సహస్రార చక్రంలో ఉన్న సరికాని శక్తులన్నీ మూలాలతో సహా తొలగించబడాలి. నాలో అహంకారం ద్వారా నేను ఏ ఆత్మ స్వరూపానికి అయినా కష్టాన్ని, నష్టాన్ని కలిగించి ఉంటే వాళ్ళు నన్ను మనఃస్పూర్తిగా క్షమించాలి. వీటికి సంబంధించిన కర్మలు, కర్మముద్రలు, గుర్తులు ఏమి ఉన్నా సెల్యులార్ స్థాయి నుంచి పూర్తిగా తొలగించబడాలి."


🌻. సంకల్పం -2 : 

"నా సహస్రారచక్రం అత్యంత శక్తివంతంగా మారాలి. దీనిలోని అనంత అవకాశాలు ఓపెన్ అవ్వాలి మరి నేను ఏకత్వంలో జీవించాలి. ఐ యాం ప్రజెన్స్ (అహం బ్రహ్మాస్మి) గా మారిపోవాలి. జ్ఞాన శక్తి నాలో పరిపూర్ణంగా మేల్కొనాలి."

సశేషం... 
🌹 🌹 🌹 🌹 🌹

#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #అద్భుతసృష్టి


WhatsApp, Telegram, Facebook groups:
https://incarnation14.wordpress.com/2020/09/23/social-media-groups-channels-telegram-facebook-whatsapp-etc/


16 Sep 2020


------------------------------------ x ------------------------------------


🌹.   అద్భుత సృష్టి - 33  🌹

✍️ . రచన, సంకలనం- DNA స్వర్ణలత గారు
సేకరణ : ప్రసాద్ భరద్వాజ


🌟. 10. ఇతర ఆధ్యాత్మిక చక్రాలు లేదా ఆరా చక్రాలు (5)

🟤. 8. ఆరిక్ చక్రా: 

ఇది తలకు 18 అడుగుల ఎత్తులో ఉంటుంది. 8వ ప్రోగు DNA తో కనెక్ట్ అయి ఉంటుంది. ఈ చక్రాశక్తి ద్వారా ఆత్మ యొక్క మిషన్ కంప్లీట్ చేస్తాం. ఇది శరీరంలోని ఏడు చక్రాలతో అనుసంధానమై ఉంటుంది. ఈ చక్రాల ద్వారా దీనిని యాక్టివేట్ చేయవచ్చు.

🟢 9. భూమి చక్రా: 

కాళ్ళకు అడుగున క్రింది భాగంలో ఉంటుంది. మన కుటుంబలైన్ ను కలిగి ఉంటుంది. తొమ్మిదవ ప్రోగు DNA తో కనెక్ట్ అయి ఈ చక్రం నడుము క్రింద ఉన్న లోయర్ తలాలకు సంబంధించిన చక్రాస్ తోనూ( అతల, వితర, సుతల, తలాతల, మహాతల, రసాతల, పాతాళ చక్రాలు) వాటికి సంబంధించిన అవయవాలతోనూ కనెక్ట్ అయి ఉంటుంది.

ఈ చక్రంలో పూర్వీకుల కర్మలతో కనెక్ట్ చేయబడి ఉంటుంది. దీనిని యాక్టివ్ చేస్తే మిగిలిన చక్రాస్ ని యాక్టివేట్ చేయగలం. ఇది DNA తొమ్మిదవ ప్రోగుతో కనెక్ట్ అయి ఉంటుంది. దీనిని మన "ఆకాషిక్ రికార్డ్ బ్లూప్రింట్" అనవచ్చు.

🌞. 10. సూర్య చక్రా: 

మనం ఈ చక్రం ద్వారా మన యొక్క సూర్యుని తో కనెక్ట్ అయి ఉంటాం. ఈ చక్రం సూర్య కాంతి ద్వారా విశ్వ సమాచారాన్ని, శక్తిని మన DNA కి అందజేస్తుంది. 

ఇది DNA లో 10వ ప్రోగుతో కనెక్ట్ అయి ఉంటుంది. మన సూర్యుని లాంటి ఎన్నో సూర్యులు విశ్వంలో ఉన్నాయి. వాటన్నింటితో కనెక్ట్ అయ్యేలా ఈ చక్రం చేస్తుంది.

🟣. 11. సోల్ స్టార్ చక్రా:

ఈ చక్రం పూర్ణాత్మతో అనుసంధానం కలిగి ఉంటుంది.11వ ప్రోగు DNA తో కనెక్ట్ అయి ఉంటుంది. విశ్వంలోని అన్ని గెలాక్సీల జ్ఞానాన్ని అందజేస్తుంది.

🔵. 12. కాస్మిక్ స్టార్ చక్రా: 

దీనిని "విశ్వ చక్రం" అంటారు. ఇది విశ్వం యొక్క గుండె చక్రం. అన్ని సూర్యులకు "సెంట్రల్ సన్ (ప్రధాన సూర్యుడు)" ఒకరు ఉంటారు. వారితో మనల్ని కనెక్ట్ చేస్తుంది. 

ఈ చక్రం DNA లోని 12వ ప్రోగుతో కనెక్ట్ అయి ఉంటుంది. విశ్వం యొక్క మూల చైతన్యం యొక్క సమాచారం ఎప్పటికప్పుడు మన DNA లోకి అందిస్తుంది. 

ఆ విధంగా మనం కూడా ప్రకాశించేలా చేస్తుంది. ఈ 12 చక్రాలు, 12ప్రోగులు, 12 లోకాలతో, 12 సంభావ్యతలతో ,12 కొలతలు ( జ్యామితి గ్రిడ్లు)తో కనెక్ట్ అయి మనల్ని మల్టీ డైమెన్షనల్ బీయింగ్ (ఆత్మ) గా మార్చుతుంది.

సశేషం.....
🌹🌹🌹🌹🌹

#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #అద్భుతసృష్టి

19 Sep 2020

------------------------------------ x ------------------------------------



🌹.   అద్భుత సృష్టి - 34   🌹

✍️ . రచన, సంకలనం- DNA స్వర్ణలత గారు
సేకరణ : ప్రసాద్ భరద్వాజ



🌟 11.ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్

(విద్యుత్ అయస్కాంత శక్తి క్షేత్రం)


✨. విశ్వశక్తి (లేదా) విశ్వ చైతన్యం విద్యుత్ అయస్కాంత శక్తి రూపంలో ప్రకంపిస్తూ ఉంటుంది.

విద్యుత్ అయస్కాంత శక్తి క్షేత్రం (Emf) అనేది రెండు వాహకాలు యొక్క కలయిక ఇందులో...


🌟. 
1. విద్యుత్ శక్తి క్షేత్రం (Electrical Energy) అనేది పురుషశక్తి(Male Energy).

2. అయస్కాంత శక్తి క్షేత్రం (Magnetic Energy) అనేది స్త్రీ శక్తి (Female Energy).

ఈ భూమి పై మన దేహాలు విద్యుత్ అయస్కాంత శక్తితో కూడుకున్న జీవరూపాలు. మనం మల్టీ డైమెన్షనల్ లైట్ బీయింగ్స్(విద్యుత్ అయస్కాంత జీవిత రూపాలు). మనం భూమి పైన జీవిస్తూ ద్వంద్వత్వం గేమ్ ఆడుతున్న శక్తి స్వరూపులం.

శరీరంలో ఈ శక్తి C.W (Clockwise) కుడి వైపుకి, A.C.W(Anti Clockwise)ఎడమ వైపుకి తిరుగుతూ ఉంటుంది.

పురుష శక్తి (ఎలక్ట్రికల్ ఎనర్జీ) కుడివైపుకి తిరిగితే, స్త్రీ శక్తి (మాగ్నెటిక్ ఎనర్జీ) ఎడమవైపుకు తిరుగుతూ శక్తి క్షేత్రాన్ని చక్రాస్ నుండి ఆరా ద్వారా క్రియేట్ చేస్తుంది.


💫. ఈ ఫ్రీక్వెన్సీలను Hz రూపంలో కొలుస్తాం. Emf మనకు తీటా, బీటా, డెల్టా, ఆల్ఫా, గామా తరంగాల రూపంలో బ్రెయిన్ వేవ్స్ గా శరీరానికిశక్తిగా అందుతూ ఉంటాయి. Emf (ఎలక్ట్రో మాగ్నెటిక్ ఫీల్డ్) నుండి వస్తున్న శక్తి చక్రాస్ స్వీకరించి పరమాణు స్థితిలో ఉన్న న్యూక్లియస్ ఎనర్జీగా తయారు చేసుకుంటుంది. తద్వారా DNA నుండి శరీరానికి అవసరమైన ప్రొటీన్స్ ని మిగిలిన శక్తులను తయారు చేసుకుని సంపూర్ణ ఆరోగ్యాన్ని, ఆధ్యాత్మిక ప్రగతిని పొందేలా చేస్తుంది.


సశేషం..... 
🌹 🌹 🌹 🌹 🌹

#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #అద్భుతసృష్టి


WhatsApp, Telegram, Facebook groups:
https://incarnation14.wordpress.com/2020/09/23/social-media-groups-channels-telegram-facebook-whatsapp-etc/


20 Sep 2020

------------------------------------ x ------------------------------------



🌹.   అద్భుత సృష్టి - 35  🌹

✍️ . రచన, సంకలనం- DNA స్వర్ణలత గారు
సేకరణ : ప్రసాద్ భరద్వాజ


🌻 12. DNA సంక్రియ 🌻

DNA ని సంక్రియం చేయటం వలన వచ్చే ఫలితాలు:

💫. మన శరీరంలో 100 ట్రిలియన్ కణాలు ఉన్నాయి. ప్రతి క్షణంలో DNA ప్రోగులు ఉంటాయి. DNA లో 30,000 చురుకుగా పనిచేసే జీన్స్ ఉన్నాయి. ప్రతి జన్యువుకు నిర్దిష్ట చర్య ఉంటుంది. చర్మం, కన్ను, జుట్టు, ఎత్తు, రంగు, వేలిముద్రలు మొదలైనవి ఎన్నో విభాగాలలో ఈ జన్యువుల పాత్ర ఉంటుంది.

DNAలో... కోడాన్, లైట్ కోడ్స్ అనేవి ఉంటాయి. ఈ "లైట్ కోడ్స్" ని యాక్టివేట్ చేయడం వలన మన శారీరక, మానసిక, భావోద్వేగ, ఆధ్యాత్మిక శరీరాలలో ఎన్నో మార్పులు చెందించి, ఆకాశిక్ రికార్డ్ సరిచేయబడి నూతన దివ్యత్వాన్ని మనకు అందిస్తుంది.

🌟 1.DNA యాక్టివేషన్ తో శరీరానికి వచ్చే లాభాలు/ ప్రయోజనాలు:-

✨. మెరుగైన జీవక్రియను పెంచి, శక్తిని అభివృద్ధి పరిచి, మెటబాలిక్ సిస్టమ్ ను ఇంప్రూవ్ చేస్తుంది.

✨ మనం తీసుకున్న ఆహారంలో సహజమైన కొవ్వు ఎంత అవసరమో దానినే గ్రహిస్తుంది. చెడు కొలెస్ట్రాల్ ను తొలగిస్తుంది; శారీరక సమతుల్యతను ఏర్పరుస్తుంది.

✨. శరీరానికి నీటి నిల్వ అయిన 70% వాటర్ ని బ్యాలెన్స్ చేస్తుంది.

✨ ఆహారం ఎక్కువగా తీసుకోవాలనే కోరికను తగ్గిస్తుంది. కానీ శరీరానికి అవసరమైన పోషకాలను అందిస్తుంది.

✨. శరీరంలో సరికాని విషాలను తొలగించి శరీరాన్ని మెరిసేలా చేస్తుంది.

✨. డైజెస్టివ్ సిస్టమ్ (జీర్ణక్రియ)ను మెరుగు పరుస్తుంది.

✨. శరీరానికి అవసరమైన పోషకాలను అందిస్తుంది.

✨. కంటి చూపు మెరుగుపడుతుంది. జుట్టు బాగా పెరుగుతుంది.

✨. కణాలు త్వరగా హిల్ చేయబడతాయి. కణానికీ, కణానికీ మధ్య కమ్యూనికేషన్ ఏర్పడి శరీరానికి సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుంది.


🌟. 2. భావోద్వేగ మానసిక ప్రయోజనాలు:-

✨. మానసిక స్పష్టత, ప్రశాంతత ఏర్పడుతుంది. జ్ఞాపకశక్తి మెరుగవుతుంది. (పూర్వజ్ఞానం కూడా జ్ఞాపకం వస్తుంది)

✨. స్వీయ ప్రేమ లభిస్తుంది. మనలో కరుణ, ప్రేమ, కృతజ్ఞత, సహకారం, ప్రశంసలు అనే గొప్ప లక్షణాలు మేల్కొంటాయి.

✨. ఆందోళన, ఒత్తిడి తగ్గుతాయి.

✨. విజన్స్ ద్వారా, అంతర్ దృష్టి ద్వారా మార్గదర్శకత్వం దొరుకుతుంది.

✨. జీవితంపై స్పష్టత వస్తుంది.

✨. పాత సెల్యూలర్ మెమొరీ తుడిచి పెట్టబడుతుంది.

✨. హైయ్యర్ సెల్ఫ్ నుండి ప్రేమానుభూతి, శ్రేయస్సు యొక్క భావన, ప్రయోజనం, భద్రత, ఏకత్వం లభిస్తాయి.

✨. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మెరుగు పరచబడుతుంది.


🌟 3. ఆధ్యాత్మిక ప్రయోజనాలు:-

✨. ఉన్నత చైతన్యం నుండి కనెక్షన్ ఏర్పడుతుంది. చైతన్యం యొక్క ప్రేమ, జ్ఞానం, శక్తి, యూనివర్సల్ ట్రూత్ ని తెలుసుకుంటూ మనం కూడా ఉన్నత చైతన్య స్థాయికి ఎదుగుతాం.

✨. పదార్థం నుండి పరమార్థం వరకు ఎదుగుతాం. ఆధ్యాత్మిక పరిపూర్ణ జీవితాన్ని జీవిస్తాం.

✨. లా ఆఫ్ అండర్ స్టాండింగ్ ద్వారా ఆత్మ సామర్థ్యమైన చైతన్యాన్ని ఎప్పటికప్పుడు అర్థం చేసుకుంటాం.

✨. మన యొక్క ఆత్మ బహుమతులు మేల్కొంటాయి. దివ్యనేత్రం, దివ్యశ్రవణం, దివ్యభాషణం, దివ్యస్పర్శ, సూక్ష్మశరీరయానం, ఛానెలింగ్, మీడియమ్ షిప్, లెవిటేషన్, బైలొకేషన్ మొదలైన ఎన్నో దివ్యశక్తులు మేల్కొంటాయి.

✨. గెలాక్సీ/ మల్టీగెలాక్సీ/ యూనివర్స్/ మల్టీ యూనివర్స్ స్థాయిలోకి ఎదుగుతాం. హైయ్యర్ సెల్ఫ్ గా భూమి మీదే మన శక్తిని ప్రకటిస్తాం.

✨. అన్ని లోకాలలో కో- క్రియేటర్ గా మనకు గుర్తింపు లభిస్తుంది.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

అద్భుత సృష్టి ప్రింటెడ్ పుస్తకం కోసం సంప్రదించవలసిన ఫోన్ నెంబర్స్:
9396267139, 9652938737, 7730012579

#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #అద్భుతసృష్టి

21 Sep 2020

------------------------------------ x ------------------------------------


🌹.   అద్భుత సృష్టి - 36   🌹

✍️ . రచన, సంకలనం- DNA స్వర్ణలత గారు
సేకరణ : ప్రసాద్ భరద్వాజ


🌟. DNA యాక్టివేషన్ మూడు విధాలుగా జరుగుతుంది.

🔵 లెవల్ -1
✨ 1 నుండి 4 తంతుల యాక్టివేషన్ లో బ్రెయిన్ చక్రా యాక్టివేషన్ అవుతుంది. సహస్రార స్థితిలోకి మారుతాం.

🟢 లెవల్ -2
✨5 నుండి 8 తంతుల యాక్టివేషన్ లో సోల్ చక్రా యాక్టివేషన్ లోకి వస్తుంది. పూర్ణాత్మ స్థితిలోకి మారుతాం.

🟣 లెవల్ -3
✨ 9 నుండి 12 తంతుల యాక్టివేషన్ లో హైయ్యర్ కాన్షియస్ తో కనెక్టివిటీ ఏర్పడుతుంది. సుప్రీమ్ సోల్ (మూల చైతన్య స్థితి) లోకి మారుతాం.


🌟. 13. DNA 12 ప్రోగులు - 12 లేయర్స్

💫. 1వ స్ట్రాండ్: 
మన శరీర నిర్మాణం అంటే మన ఆరోగ్యం, నాడీమండలం, శరీర అవయవ నిర్మాణం, మొత్తం మన భౌతిక విషయాలకు సంబంధించిన సమాచారం అంతా ఇందులో ఉంటుంది.

💫. 2 వ స్ట్రాండ్ : 
దీనిని మన "ఎమోషనల్ లేయిర్" అంటారు. ధర్మం - అధర్మం, చీకటి - వెలుగు, జ్ఞానం - అజ్ఞానం అనే విషయాలు వివేచనకు ప్రాతినిధ్యం వహిస్తుంది. ఈ లేయర్ బ్యాలెన్స్ కొరకు చాలా ముఖ్యమైనది. జీవిత పాఠాలు కలిగి ఉన్న ఈ లేయర్ పేరు "డివైన్ బ్లూప్రింట్".

ఈ పొరలో ద్వంద్వత్వం దాగి వుంది. మొదటి పొర భౌతికత్వాన్నీ, రెండవ పొర అంతరంగం అనే వేరువేరు విషయాలను చూపి కొన్ని వేల సంవత్సరాలుగా ద్వంద్వత్వానికి ప్రాతినిధ్యం వహిస్తుంది.

💫. 3వ స్ట్రాండ్ : 
ఈ లేయర్ "అసెన్షన్ యాక్టివేషన్" కు సంబంధించినది. అసెన్షన్ కి సంబంధించిన కోడింగ్ ఈ లేయర్ లో ఉంటుంది.

💫. 4వ & 5వ స్ట్రాండ్స్ : 
ఈ లేయర్స్ "ఆకాశిక్ రికార్డ్స్" కు అనుసంధానం చేయబడి ఉంటాయి. ఈ లేయర్స్ ని యాక్టివేట్ చేసుకున్నట్లయితే మన DNA నుండి తొలగించబడిన సమాచారమంతా మళ్ళీ పొందవచ్చు.

💫. 6వ స్ట్రాండ్ : 
ఈ లేయర్ మన గుణాలను బ్యాలెన్స్ చేస్తుంది. ఆ గుణాలలో మాస్టరీ పొందడం జరుగుతుంది.

💫. 7వ స్ట్రాండ్ : 
ఈ లేయర్ కి లెమూరియన్ భాషలో "సోలారా" అంటారు. దీని అర్థం "DNA మాస్టర్" అని అర్థం. ఇది మూల బీజపు లేయర్. ఇది ఎంత ఎక్కువ వైబ్రేషన్స్ కలిగి ఉంటే అంత ఎక్కువగా ఎదుగుతుంది. ఈ మూల బీజపు లేయర్ అతి సూక్ష్మ గ్రాహ్యతను అభివృద్ధి పరుస్తుంది.

ఈ లేయర్ వలన మనం విశ్వ రహస్యాలను టెలిస్కోప్, మైక్రోస్కోప్ లేకుండా నిర్దిష్ట ఫ్రీక్వెన్సీ తో కాస్మోస్ కి ట్యూన్ అయి సమస్త సమాచార జ్ఞానాన్ని తెలుసుకోగలుగుతాం.

💫. 8వ స్ట్రాండ్ : 
ఇది వ్యక్తిగత ఆకాషిక్ రికార్డు లాంటిది. 4వ డైమెన్షన్ తర్వాత ట్రైమ్ స్పేస్ ఉండదు. కాబట్టి మన గత జన్మలన్నీ సమాంతర జన్మలుగా ఏకకాలంలో మన వివిధ జన్మలను తెలియజేస్తుంది. ఇది శాశ్వతత్వానికి సంబంధించినది.

💫. 9వ స్ట్రాండ్ : 
దీని యాక్టివేషన్ ద్వారా హీలింగ్ పవర్ యాక్టివేషన్ లోకి వస్తుంది. ఇది మన కర్మలను విడుదల చేసి మనలో చైతన్య విస్తరణ, ఆధ్యాత్మిక ప్రగతిని పెంపొందిస్తుంది.

💫. 10వ స్ట్రాండ్ : 
ఇది మనల్ని గాడ్ కాన్షియస్నెస్ లోకి (దేవుని చైతన్యంలోకి) తీసుకుని వెళ్తుంది. దీనిని "చైతన్యపు లేయర్" అంటారు.

💫. 11వ స్ట్రాండ్ : 
దీనిని "విజ్ డమ్ ఆఫ్ ఫెమినైన్ (స్త్రీ తత్వపు విజ్ఞానం)" అంటారు. ఇది శక్తి, కరుణ మరి శాంతిని యాక్టివేషన్ చేస్తుంది. స్త్రీ - పురుష శక్తులను సమతుల్యం చేస్తుంది.

💫. 12వ స్ట్రాండ్ : 
ఇది దైవత్వపు లేయర్. ప్రేమ, దైవత్వం మనలో నింపుతుంది మరి మనం అంతరంగంలో దైవ మానవునిగా జీవిస్తూ, భూమిపైన వాస్తవికతతో జీవిస్తాం. సకల జీవరాశిని సమంగా ప్రేమిస్తూ తల్లిలా అందరినీ సంరక్షిస్తాం.


🌟. 12 స్ట్రాండ్ DNA యాక్టివేషన్ మూడు విధాలుగా జరుగుతుంది.🌟

💫. 1. సహస్రార చక్ర క్రిస్టల్స్ యాక్టివేషన్ లోకి వస్తాయి. తల మధ్యభాగంలో బ్రహ్మరంధ్రం ఉంటుంది. దాని చుట్టూ 12 క్రిస్టల్స్ ఉంటాయి. ఈ 12 క్రిస్టల్స్ ఒకదానితో ఒకటి అనుసంధానం పొందుతాయి. ఈ 12 క్రిస్టల్స్ 12 చక్రాలతోనూ, 12 డైమెన్షన్స్ తోనూ DNA ప్రోగులతోనూ కనెక్ట్ అయి ఉంటాయి. ఇవి ఎనర్జీని తయారు చేసుకోవటానికి ఒక దానితో ఒకటి కనెక్ట్ అయి.. ఒక రూపాన్ని తీసుకుంటాయి.

💫. 2. ఈ రూపాన్నే "మెర్కాబా" అంటారు. దీనిని "యూనివర్సల్ యాంటీనా " అంటారు. మన సూక్ష్మ శరీరం మెర్కాబా షేప్ తీసుకొని డైమెన్షన్ టూ డైమెన్షన్ ప్రయాణిస్తుంది. ఈ మెర్కాబా వలన ఔటర్ బాడీ అనుభవాలు వస్తాయి. హైయ్యర్ డైమెన్షనల్ మెస్సేజెస్ అన్నీ రిసీవ్ చేసుకోవడం జరుగుతుంది.

💫. 3.మన తలలో పీనియల్, పిట్యూటరీ గ్రంధులతో పాటు హైపోథాలమస్ గ్రంథి ఉంటుంది. ఈ మూడు గ్రంథులు యాక్టివేషన్ లోకి వస్తాయి. ఈ హైపోథాలమస్ గ్రంథిని "యూనివర్సల్ ట్రాన్స్ లేటర్" అంటారు. ఉన్నత లోకాల సమాచారాన్నీ మరి జ్ఞానాన్నీ ఇది ట్రాన్సిలేట్ చేస్తుంది. (ఉన్నత సమాచారం కాంతి భాషల్లో ఉంటుంది).


🌟. DNA యాక్టివేషన్ కి అడ్డుపడే అంశాలు🌟

1. కర్మ సిద్ధాంతం
2. డెత్ సీల్స్ (J స్టీల్స్ )
3. ఇంప్లాంట్స్
4. చక్రాలు సీల్స్


సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #అద్భుతసృష్టి

22 Sep 2020

------------------------------------ x ------------------------------------



🌹. అద్భుత సృష్టి - 37 🌹

✍️ . రచన, సంకలనం- DNA స్వర్ణలత గారు
సేకరణ : ప్రసాద్ భరద్వాజ


🌻 14. కర్మ సిద్ధాంతం 🌻

ఆత్మ తన అనుభవాల కోసం కర్మలను చేస్తుంది. అనుభవసారం నుంచి కర్మ ఫలితాలను ఎంచుకుంటుంది. ఇవి అన్నీ ఆకాషిక్ రికార్డ్స్ లో ఎప్పటికప్పుడు నమోదు చేయబడతాయి. ఈ నమోదైన కర్మ విశేషాలను విశ్లేషించి... సమగ్రపరచి జీవి యొక్క తరువాత దశ కోసం అందజేయడం జరుగుతుంది.

💫. ఈ వర్క్ కొరకు "కర్మ దేవతలు" అనే వారు పని చేస్తున్నారు. వ్యక్తి తన ఆత్మ ప్రయాణాన్ని సరిగ్గా కొనసాగించటానికి కర్మ సంబంధం ఉన్నవారికి ఆ విధమైన అనుభవాలను ఇస్తూ తాను నేర్చుకుంటూ, నేర్పుతూ తన 3వ పరిధి జీవితాన్ని ముగించుకుని ఉన్నత పరిధులకు ఎదుగవలసి ఉంటుంది.

కర్మ సిద్ధాంతం ప్రకారం "నీవు ఏ విత్తనాన్ని నాటితే అదే పంటను పొందుతావు" అని విశ్వనియమం చెబుతుంది.

ఉదా:- మనం ఆనందంగా, ఆరోగ్యంగా ఉండాలి అంటే అటువంటి ఫలితాలను ఇతరులకు ఇవ్వవలసి ఉంటుంది.

🔹. ఈ కర్మ ఫలితాలు మూడు రకాలు:-

1. సంచిత కర్మలు:- 
గత ఎన్నో జన్మల యొక్క కర్మ ఫలితాలు.

2. ప్రారబ్ద కర్మలు:- 
గత జన్మ యొక్క ఎన్నో కర్మ ఫలితాలు.

3. ఆగామి కర్మలు:- 
ఎప్పటికప్పుడే ఫలితాలనిచ్చే కర్మలు.

💫. వీటన్నింటినీ మన జీవన ప్రయాణంలో తొలగించుకుంటేనే మనం ముందుకు (అసెన్షన్ లోకి) వెళతాం.

కర్మలు మంచి లేదా చెడు ఏవి అయినా మనం వాటిని జీరో చేయవలసి ఉంటుంది. కర్మలను జీరో చేయడం అంటే కర్మను అర్థం చేసుకోవడమే! మరి ఆచరణలో పెట్టవలసిన విషయాలను నేర్చుకోవడమే! కర్మను అనుభవించడం అంటే ఎన్ని జన్మలైనా మనం నేర్చుకోవలసిన పాఠాలు పూర్తికాలేకపోతే తిరిగి తిరిగి ఆ అనుభవ జ్ఞానం కోసం మనం జన్మ తర్వాత జన్మ తీసుకోవలసి ఉంటుంది.

ఎప్పుడైతే మన పాఠాలు మనకు వస్తాయో.. తిరిగి ఆ కర్మ కోసం కాకుండా మరొక కర్మ కోసం ప్రయాణం కొనసాగుతుంది.

ఈ కర్మ పాఠాల ద్వారా మనం ఎన్ లైటెన్ మెంట్ (దివ్యజ్ఞాన ప్రకాశం) ని పొందుతాం.

🌀. సాధన - సంకల్ప ధ్యానం 1:

నేను ఈ భూమి మీద జన్మతీసుకున్నది మొదలు ఇప్పటివరకు తెలిసి కానీ, తెలియక కానీ సకల జీవరాశిలో ఎవరికైనా కష్టాన్నీ, నష్టాన్నీ, బాధను కానీ, భయాన్ని కానీ కలిగించి ఉంటే ఆ ఆత్మ స్వరూపులందరూ నన్ను మనస్ఫూర్తిగా క్షమించవలసినదిగా కోరుకుంటున్నాను".

🌀. సాధనా సంకల్పం - 2:

"నా యొక్క గత జన్మలన్నింటిలోనూ నన్ను ఎవరైనా మానసికంగా కానీ, శారీరకంగా కానీ, బుద్ధి పరంగా కానీ, ఆత్మపరంగా గానీ హింసించి ఉంటే వారందరినీ నా అన్ని శరీరాలనుండి మనఃపూర్తిగా విడుదల చేస్తూ క్షమిస్తున్నాను."

సశేషం.... 
🌹 🌹 🌹 🌹 🌹

Whatsapp Group 
https://chat.whatsapp.com/5LFkJu3UEcQ5Kgx46WRsin

Telegram Group 
https://t.me/ChaitanyaVijnanam

#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #అద్భుతసృష్టి

23 Sep 2020

------------------------------------ x ------------------------------------


🌹.   అద్భుత సృష్టి - 38   🌹

✍️ . రచన, సంకలనం- DNA స్వర్ణలత గారు
సేకరణ : ప్రసాద్ భరద్వాజ


🌻. 15. అన్ నాచురల్ డెత్ సీల్స్ (J సీల్స్) 🌻

జోహూవియన్ అనునాకీ డెత్ సీల్స్. వీటిని రూపొందించినవారు "జోహూవియన్ అనునాకీ" వారు. భూమికి వేసిన ప్రొటెక్టివ్ గ్రిడ్ ల సమయంలో భూమిపై ఉన్న ఏగ్జియల్ లైన్స్ (Axial Lines) ద్వారా వచ్చే హైయర్ శక్తిని మానవునికి అందకుండా ఎనర్జిటిక్ కనెక్షన్ కలిగి ఉండకుండా ఉండటం కోసం మనం ఈ భూమి మీద పుట్టినప్పుడే ఈ సీల్స్ మనలో పెట్టడం జరిగింది. 

ఈ సీల్స్ యొక్క ప్రభావం వంశపారంపర్యంగా మన జన్యు నిర్మాణంలో నిక్షిప్తమై ఉన్నాయి. అవి ఒకరి తరువాత ఒకరికి పాస్ అవుతాయి. ఈ సీల్స్ ద్వారా మనం మన సామర్థ్యాలను మర్చిపోయి అసెన్షన్ కి దూరం అవుతున్నాం. "J సీల్ " యొక్క ప్రభావం మన పైన, భూమి పైన రెండింటిపైన ఉంటుంది.

💫. భూమి ఏగ్జియల్ లైన్ శక్తి పంక్తులు కలిగి ఉంటుంది.

"J-సీల్స్" అనేవి ఎగ్జియల్ లైన్ -7 పై పెట్టబడి ఉన్నాయి. అదేవిధంగా మన దేహంలో ఎడమ భాగంలో వీటిని ఉంచడం జరిగింది.

"J- సీల్స్" ప్రభావంతో మానవులు త్వరగా మరణానికి దగ్గరవుతారు. అందుకే వీటిని డెత్ సీల్స్ (మరణ ముద్రలు) అన్నారు. 

మనల్ని భగవంతుడు మొదటగా తయారు చేసినప్పుడు ఏంజెల్ మానవుని(దైవ మానవుని) గా సృష్టించడం జరిగింది. 

ఈ దైవ మానవునికి మరణం అనేది లేదు. మారితే ఆ దేహం కాంతిగా మారుతుంది లేదా అసెండ్ అవుతుంది తప్ప మరణించదు! అంత పటిష్టంగా మన దేహాన్ని తయారు చేయడం జరిగింది. భగవంతుడు, మాస్టర్స్, ఏంజెల్స్ మనల్ని "12 ప్రోగుల డైమండ్ సన్ DNA" గా సృష్టించారు.

ఈ 12 ప్రోగుల DNA యాక్టివేషన్ అనేది అతి సహజంగా మనకు 12 నుండి 44 సంవత్సరముల మధ్య కాలంలో మన దేహంలో ఉన్న 12 ప్రోగుల DNA పూర్తిస్థాయిలో జాగృతి అవ్వవలసి ఉంటుంది. మనం మానవ దేహం నుండి దైవదేహంగా మారతాం, కానీ ఈ J సీల్స్ మరి ఇంప్లాంట్స్ కారణంగా ఈ ప్రక్రియకు దూరం అవుతున్నాం. అసెన్షన్ జరగకుండా ఈ J సీల్స్ మరి ఇంప్లాంట్స్ అడ్డుపడుతున్నాయి. ఈ J సీల్స్ కారణంగా అనారోగ్యం, ముసలితనం, మరణం సంభవిస్తున్నాయి.

"అనూనాకి టీమ్" వాళ్ళు భూమి యొక్క శక్తి గ్రిడ్ లను మార్చివేసి ఈ సీల్స్ పెట్టిన కారణంగా భూమికి అందవలసిన శక్తి పూర్తిగా అందటంలేదు. శక్తిని పొందలేకపోవడం కారణంగా మానవ దేహం అమరదేహం అవ్వకుండా సీల్స్ ఇంప్లాంట్స్ ఎప్పటికప్పుడు అడ్డు పడుతున్నాయి. భూమి యొక్క గ్రిడ్ లను, J సీల్స్ ని, ఇంప్లాంట్స్ ని సరి చేయగలిగితే మనం అతి త్వరగా అసెన్షన్ పొందుతాం.

💫. J సీల్స్ శరీరంలో తల పైన ఒకటి, గుండె, ఎడమ ఊపిరితిత్తులు ఉన్న ప్లేస్ లో మరి ఎడమ మోకాలిలో, పీనియల్ గ్రంథిలో, మెడ ఎడమవైపున మరి లింఫాటిక్ గ్రంధి వద్ద, ఎడమ తొడభాగంలో, అల్ట్రా మేజర్ దగ్గర హైపోధాలమస్ వద్ద( పుర్రె, వెన్నెముక కలిసే దగ్గర) ఎడమ భుజంలో ఈ సీల్స్ ని మన శరీరం అనాటమీ సిస్టమ్ లో పెట్టడం జరిగింది. భూమికి 12 ఏగ్జియల్ వర్టికల్ ఎనర్జీ లైన్స్ గ్లోబ్ మొత్తం ఉంటాయి. అయితే J సీల్స్ ఎగ్జీయల్ లైన్-7 పై పెట్టడం జరిగింది. అలాగే మన దేహంలో కూడా పెట్టబడి ఉన్నాయి.

సశేషం.... 
🌹 🌹 🌹 🌹 🌹

WhatsApp, Telegram, Facebook groups:
https://incarnation14.wordpress.com/2020/09/23/social-media-groups-channels-telegram-facebook-whatsapp-etc/

#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #అద్భుతసృష్టి

25 Sep 2020

------------------------------------ x ------------------------------------


🌹.   అద్భుత సృష్టి - 39   🌹

✍️ . రచన, సంకలనం- DNA స్వర్ణలత గారు
సేకరణ : ప్రసాద్ భరద్వాజ


🌟. మన దేహంలో పెట్టబడిన Jసీల్స్, ఇంప్లాంట్స్ కారణంగా DNA activation disturb అవుతుంది.

✨. J సీల్స్ మొత్తం -7.అవి:-

1.M.T ఇంప్లాంట్స్

2. టెంప్లర్ సీల్స్

3.టెంప్లర్ ఎగ్జియల్ సీల్స్

4. సెల్ డెత్ ప్రోగ్రామింగ్

5.క్రౌన్ ఆఫ్ త్రోన్ లేదా ముళ్ళకిరీటం

6 జీటా సీల్

7. టవర్ ఆఫ్ బాబిల్ సీల్

❇ 1.M.T ఇంప్లాంట్స్ అనేవి కొన్ని ఇంప్లాంట్స్ ని కలిపి ఉంటాయి. వీటి కారణంగా యాక్టివేషన్ రివర్స్ లో జరుగుతుంది. M.T ఇంప్లాంట్స్ మొత్తం నాలుగు. అవి రెండు నుదురు వద్ద, ఒకటి మెడ వెనుక భాగంలో, మరొకటి నాభి పైన పెట్టబడి వున్నాయి. నుదురు వద్ద పెట్టిన ఇంప్లాంట్స్ మన దైవత్వ లక్షణమైన దివ్య నేత్రాన్నీ, దివ్యజ్ఞానాన్నీ ఎప్పటికీ అభివృద్ధి పరచుకోకుండా ఈ ఇంప్లాంట్స్ అడ్డుపడతాయి. 

💫. మెడ వెనుక పెట్టబడిన ఇంప్లాంట్స్ కారణంగా హైపోధాలమస్ గ్రంథి యాక్టివేట్ అవ్వకుండా అడ్డుపడుతుంది. ఈ హైపోథాలామస్ గ్రంథిని యూనివర్సల్ ట్రాన్సలేటర్( విశ్వ అనువాదం) అంటారు. కాంతి భాషను మనభాషలోకి అనువదిస్తుంది. 

హైయ్యర్ సమాచారం ఎప్పటికప్పుడు అందుకుని మనల్ని ‌ఆ విధంగా ఎదిగేలా చేస్తుంది. ఈ ఇంప్లాంట్స్ కారణంగానే మనం దీన్ని పొందలేము. 4వ ఇంప్లాంట్ నాభి వద్ద ఉంటుంది. దీని కారణంగా దిగువ 3 చక్రాలు అభివృద్ధి పరచుకుని..హైయ్యర్ చక్రాస్ తో కలిసి అనుసంధానం అవ్వవలసి ఉంటుంది. హైయ్యర్ సమాచారం ఎప్పటికప్పుడు అందుకుంటూ మనల్ని హైయ్యర్ సెల్ఫ్ స్ధాయికి ఎదగకుండా ఈ సీల్ అడ్డుపడుతుంది.

.

❇ 2.టెంప్లర్ సీల్ 😘

ఇవి ఒకరి నుండి ఒకరికి జెనెటికల్ గా పాస్ అవుతాయి. మనం ఎన్ని జన్మలు తీసుకుంటే అన్ని జన్మలలోనూ ఇవి మన జీన్స్ తో పాటు క్యారీ అవుతాయి. వీటి ప్రభావం మనపైన చాలా ఎక్కువగా ఉంటుంది. దీని వలన మన ఫిజికల్ అసెన్షన్ జరగకుండా చేస్తుంది.

ఈ టెంప్లర్ సీల్ వల్ల మన 2 వ ప్రోగు DNAలో 6వ బేస్ టోన్ ని తొలగించటం జరిగింది. 4 వ ప్రోగు DNAలో 6వ ఓవర్ టోన్ తొలగించారు.

💫. ఐదవ ప్రోగు DNAలో పన్నెండవ ఓవర్ టోన్ తొలగించారు. వీటి తొలగింపు కారణంగా మన జీవితం పెద్ద మలుపుకు గురై ఆస్ట్రల్, మెంటల్, ఎమోషనల్ బాడీస్ యొక్క ఐదవ పరిధి కాన్షియస్ నెస్ ని పొందకుండా బ్లాక్ చేయడం జరిగింది.(అసెన్షన్ పొందడానికి మనకి మొత్తం 12 ఎలక్ట్రికల్ ఓవర్ టోన్స్, 12 మ్యాగ్నెటిక్ బేస్ టోన్స్ తో 12 ప్రోగుల DNA అల్లబడి ఉన్నాయి.)

ఇది డైమన్షనల్ ఫ్రీక్వెన్సీని బట్టి తయారు చేయబడి ఉన్నాయి ఈ మొత్తాన్ని మన భౌతిక దేహంలో అమర్చుకొని, తల్లిదండ్రుల నుండి తీసుకున్న హార్మోనల్ DNA తో కలిపి అమర్చుకున్నాం. DNAలో మ్యాగ్నెటిక్ ఓవర్ టోన్స్, ఎలక్ట్రికల్ బేస్ టోన్స్ మిస్సయితే 12 ప్రోగుల సన్ DNA టెంప్లేట్ యాక్టివేషన్ అనే అసెన్షన్ జరుగదు.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #అద్భుతసృష్టి


WhatsApp, Telegram, Facebook groups:
https://incarnation14.wordpress.com/2020/09/23/social-media-groups-channels-telegram-facebook-whatsapp-etc/

26 Sep 2020

------------------------------------ x ------------------------------------

🌹. అద్భుత సృష్టి - 40 🌹

✍️ . రచన, సంకలనం- DNA స్వర్ణలత గారు
సేకరణ : ప్రసాద్ భరద్వాజ


❇ 3. టెంప్లర్ ఆగ్జియన్ సీల్ :

ఈ సీల్ కారణంగా DNAలోని మొదటి ప్రోగులో 6వ బేస్ టోన్, 5వ స్ట్రాండ్ DNA లో 6వ బేస్ టోన్, 6వ స్ట్రాంగ్ DNA లో 6వ బేస్ టోన్ తొలగించడం జరిగింది. దీని ఫలితంగా జెనిటిక్ కోడ్ లో ఇబ్బందులు ఏర్పడ్డాయి. 

వీటి కారణంగా మనం మన DNA యాక్టివేషన్ లో వచ్చే ఫలితాలను గుర్తించలేక పోతున్నాం. దీనివలన హైయ్యర్ డైమెన్షన్ కి క్వాలిఫై అవ్వలేక డిప్రెషన్ కి గురి అవుతున్నాం. మనల్ని మనం గుర్తించ లేక పోతున్నాం. ఈ సీల్స్ ని తొలగించుకుంటే మనం అసెన్షన్ సైకిల్ లో ఎదిగి ముందుకు వెళ్ళగలుగుతాం.

❇ 4. సెల్ డెత్ ప్రోగ్రామ్:-

కణానికి తిరిగి సృష్టించడం అనే గుణం ఉంటుంది. "సెల్ డెత్ ప్రోగ్రామ్" అనే సీల్ కారణంగా మన శరీరంలోని కణాలు త్వరగా చనిపోవడం జరుగుతుంది. ఈ సీల్ కారణంగా కొత్త కణాలు పుట్టుక ఉండదు. పాతవి మరణిస్తూ ఉంటాయి. దీని కారణంగా శరీర అవయవాలు త్వరగా పాడవటం జరుగుతుంది. అలాగే ముసలితనం అనేది అతి త్వరగా కనిపిస్తుంది.

❇ 5. క్రౌన్ ఆఫ్ త్రోన్:- 

ఈ సీల్ తలచుట్టూ ముళ్ళకిరీటంలా ఉంటుంది. అతి సహజంగా బ్రహ్మరంధ్రం నుండి విశ్వ శక్తిని తీసుకొని ప్రాణమయ శరీరం అంతా శక్తితో నింపుకొని శరీర అవయవాలను శక్తితో నింపడం అనేది జరుగుతుంది. కానీ ఈ సీల్ కారణంగా విశ్వశక్తి బ్రహ్మరంధ్రంలోకి ప్రవేశించ కుండా ఈ సీల్ అడ్డుకుంటుంది. అందుకే కొందరికి ధ్యానంలో శక్తిని గ్రహిస్తున్నప్పుడు తల భారంగా భరించలేనంత బరువుగా అనిపిస్తుంది. 

దీనికి కారణం " క్రౌన్ ఆఫ్ త్రోన్" అనే ముళ్ళ కిరీటమే. ఈ సీల్ మనకు హైయ్యర్ డైమెన్షన్ ల కనెక్షన్ అందకుండా చేస్తుంది. 4వ డైమెన్షన్ నుండి 15వ డైమెన్షన్ వరకు ఎదగవలసిన మనం ఎదగకుండా ఇది అడ్డుకుంటుంది. 4 నుండి 15 డైమెన్షన్ వరకు విస్తరించి ఉన్న మన యొక్క ఆత్మ స్థితిని మనకు దక్కకుండా చేస్తుంది. 

ఆత్మ స్థితిని నిరంతరం వినియోగిస్తూ ఎదగవలసి ఉంటుంది. కానీ ప్రస్తుతం ఇది జరగడం లేదు. ఉన్నత తలాల యొక్క జ్ఞానం, శక్తి, స్థితులను గ్రహించి మనం 3వ పరిధి భూమిని దాటాలి. కానీ ఇది మనల్ని 3వ పరిధి భూమిని దాటకుండా చేస్తుంది.

❇. 6.జీటా సీల్:-

ఇది ప్రతి ఒక్కరిలో ఉంటుంది. మన భౌతిక శరీరంలోని డీఎన్ఏలో 4వ ప్రోగులో 2 బేస్ టోన్ మరి 2వ,3వ ఓవర్ టోన్స్ ని రిమూవ్ చేయడం జరిగింది. అలాగే భూమికి కూడా చేయడం జరిగింది. దీని కారణంగా భూమి యొక్క శక్తి అయిన హైయ్యరార్క్ (భూమి కోర్లో ఉండే కుండలిని శక్తి) బయటకు రాకుండా కంచెలా వేయడం జరిగింది. 

దీని కారణంగా భూమి శక్తిని మనం పొందలేకుండా ఉన్నాం. మనం మన భౌతిక అవసరాలు భూమి శక్తితో తీర్చుకుంటాం కానీ...ఇది మన భౌతిక అవసరాలు తీరకుండా చేస్తుంది. 

జీటాసీల్ కారణంగా మన ఆత్మస్థితి (సోల్ ఐడెంటిటీ)ని, హైయ్యర్ సెల్ఫ్ ని (పూర్ణాత్మని) మరి ఇన్ ట్యూషనల్ బాడీ (అంతర్వాణి ప్రబోధ శరీరానికి) మొదలైన మేలుకొలుపు(అవేకనింగ్) శక్తులను మనం పొందకుండా ఇది అడ్డుపడుతుంది.

4వ ప్రోగు DNAలో ఈ జీటా సీల్ కారణంగా మన యొక్క ఆత్మ సామర్థ్యాలు బ్లాక్ చేయబడి ఉన్నాయి. దీని వలన సెల్ఫ్ అవేకెనింగ్, సెల్ఫ్ అన్ కండీషనల్ లవ్, ఓమ్ని లవ్ (దైవ ప్రేమ)ను పొందలేకపోతున్నాము.

5వ ప్రోగుని డెవలప్ కాకుండా ఈ జీటాసీల్ బ్లాక్ చేస్తుంది. దీని కారణంగా మనం త్వరితగతిన లోయర్ ఎంటిటీస్(సూక్ష్మ జీవులు)కి కనెక్ట్ అవుతాం. ఈ ప్రక్రియను "ఫ్రీక్వెన్సీ కంచె" అంటాం. అంటే ఎప్పటికప్పుడు ఇవి మన ఫ్రీక్వెన్సీని అడ్డుకుంటూ ఉంటాయి. 

దీని కారణంగా మనకి ఆస్ట్రల్ అవేర్నెస్, ఆస్ట్రల్ ట్రావెల్, ఇన్ ట్యూషన్ ఫ్రీక్వెన్సీ లోకి మనం వెళ్ళి వీటిని పొందకుండా ఈసీల్ అడ్డుపడుతుంది. మనకి వచ్చిన విజన్స్ కూడా మరచి పోవడానికి కారణం ఈ జీటాసీల్. దీనిని క్రీస్తుశకం 1748 వ సంవత్సరంలో మనలో పెట్టడం ప్రారంభించారు.

సశేషం.... 
🌹 🌹 🌹 🌹 🌹

#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #అద్భుతసృష్టి

WhatsApp, Telegram, Facebook groups:
https://incarnation14.wordpress.com/2020/09/23/social-media-groups-channels-telegram-facebook-whatsapp-etc/

27 Sep 2020

------------------------------------ x ------------------------------------



🌹. అద్భుత సృష్టి - 41 🌹

✍️ . రచన, సంకలనం- DNA స్వర్ణలత గారు
సేకరణ : ప్రసాద్ భరద్వాజ


❇ 7. టవర్ ఆఫ్ బాబిల్ సీల్ :

క్రీస్తు పూర్వము 3470 వ సంవత్సరంలో చీకటి శక్తుల కారణంగా "బిబ్లికల్ టవర్ ఆఫ్ బాబిల్ స్టోరీ" అనేది జరిగింది. చీకటి శక్తులు భూమి యొక్క అయస్కాంత క్షేత్రాన్ని మార్పు చేశారు. దీని ప్రభావం వలన మన డిఎన్ఏ టెంప్లేట్స్ లో చాలా మార్పులు సంభవించాయి. సహజమైన కుండలినీ జాగృతి అనే దానిని బ్లాక్ చేశారు. పీనియల్, పిట్యూటరీ, హైపొథాలమస్ మరి థైరాయిడ్ అనే ఉన్నత శక్తి క్షేత్రాలు సరిగ్గా పనిచేయటం మాని వేశాయి. దీని కారణంగా మన జీవన ప్రమాణం తగ్గిపోయింది. 

హైయ్యర్ సెన్నరీ ఫర్ సెప్షన్ ( అతీంద్రియ శక్తులు) తగ్గి మెమొరీ లాస్ (మతిమరుపు) వస్తుంది. DNAలో ఉన్న ఒరిజినల్ లాంగ్వేజ్ ప్యాట్రన్స్ ఇటు అటు అయ్యాయి. 12 అక్షరాలు ఉన్న భాషాస్థితి నుండి 5 అక్షరాల క్రిందికి నిర్మాణం చేయడం జరిగింది.

💫. ఈ లెటర్స్ (అక్షరాలు) సోలార్ ఎనర్జీతో తయారుచేయబడిన ఒక కోడింగ్ లెటర్స్ మన జన్మాంతర, గ్రహాంతర జ్ఞానం అంతా ఈ అక్షరాల లోనే నిక్షిప్తంగా ఉంటుంది. వీటిని "సోలార్ లెటర్స్" అంటారు.

ఎప్పుడైతే డిఎన్ఏ లో ఉన్న సోలార్ అక్షరాలను తొలగించారో ఆనందం, ఆరోగ్యం అనే కోడింగ్ అందక మన జాతి వ్యాధిగ్రస్తులుగా యవ్వనంలోనే మరణించేవారుగా తయారయింది.

మనం ఈ టవర్ ఆఫ్ బాబిల్ సీల్స్ ని తొలగించుకుంటే మన కుండలినీ జాగృతి పరిపూర్ణంగా జరుగుతుంది. ఉన్నత శక్తులు మనలో మేల్కొంటాయి. ఈ J సీల్స్ కారణంగా మనం మన ఒరిజినల్ డిజైన్ టెంప్లేట్స్ ని DNAలో తొలగించుకోవడం జరిగింది. 

దీని కారణంగా మనం ఎవరో, ఈ భూమి మీదకు ఎందుకు వచ్చామో మన లైఫ్ పర్పస్ ఏమిటో మనకి తెలియకుండా పోయింది. లక్ష్యసిద్ధి లేకుండా పునరపి జననం- పునరపి మరణంలో పడిపొతున్నాము. 

మనం వీటిని తొలగించుకుంటే మన ఒరిజినల్ టెంప్లేట్స్ అయిన ఇండిగో DNA,ఏంజెలిక్ DNA యాక్టివేషన్ లోకి వస్తాయి. ఇక్కడ మరణమనేది ఉండదు. భౌతిక దేహం కాంతి దేహం గా మారి భౌతిక అసెన్షన్ పొందుతాం.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #అద్భుతసృష్టి


WhatsApp, Telegram, Facebook groups:
https://incarnation14.wordpress.com/2020/09/23/social-media-groups-channels-telegram-facebook-whatsapp-etc/


28 Sep 2020

------------------------------------ x ------------------------------------



🌹.   అద్భుత సృష్టి - 42   🌹

✍️ . రచన, సంకలనం- DNA స్వర్ణలత గారు
సేకరణ : ప్రసాద్ భరద్వాజ


🌻. సాధనా సంకల్పం :- 🌻 

J సీన్స్ ని క్లియర్ చేయటానికి మనకు సహాయం చేయడానికి కొందరు రహస్య ప్రతినిధులు ఉన్నారు. వారిని ఆహ్వానించుకుందాం.

1. ప్రాథమిక సృష్టికర్త (మూల చైతన్యం)

2. మన పూర్ణాత్మల పరంపర

3. మన గురుపరంపర

4. లార్డ్ శివ, కృష్ణ, జీసెస్, మహమ్మద్, మెల్సిజెడక్స్

5. యూనివర్సల్ ఫాదర్, మదర్ గాడ్స్

6. వైట్ బ్రదర్ హుడ్ ఆఫ్ గ్రేట్ లోటస్ - వారి 12 కిరణాలు

7. కంపెనీ ఆఫ్ హెవెన్

8. మహాత్మలు, మన సూర్యుడైనా హీలియోస్, వేస్తా ఫాన్ ఓవర్ లైటింగ్

9. గెలాక్టిక్ సభ్యులు

10.దివ్యత్వపు ప్రేమ కాంతి, ఆర్కేంజల్స్, ఆర్కేంజెల్ మైఖేల్, మెటా ట్రాన్ అందరినీ ఆహ్వానించుకుందాం!

💠 సంకల్పం 1:- 

"నాలో ఉన్న సరికాని శక్తులను మూలాలతో సహా నా పరమాణు కణస్థితి నుండి పూర్తిగా తొలగించవలసిందిగా కోరుతున్నాను. ఈ సరికాని శక్తుల తాలూకు కనెక్షన్స్, అగ్రిమెంట్స్, అటాచ్ మెంట్స్ ఏమ్ ఉన్నా మూలాలతో సహా తొలగించబడాలి."

💠 2. సంకల్పం-ఇంప్లాంట్స్ క్లీనింగ్:- 

"నాలో ఉన్న ఇంప్లాంట్స్ గానీ, హలోగ్రాఫిక్ డివైజెస్ కానీ ఉన్నట్లైతే వాటిని మూలాలతో సహా తొలగించవలసినదిగా కోరుతున్నాను."

💠 3. సంకల్పం -పారాసైట్స్ పరాన్న జీవులు: 

"నాలో ఉన్న పారాసైట్స్ కి సంబంధించిన ఇంప్లాంట్స్, సరికాని శక్తులు, హోలోగ్రాఫిక్ ప్రొజెక్షన్స్ ని మూలాలతో సహా తొలగించి కాంతిగా మార్చవలసినదిగా నా పూర్ణాత్మను కోరుతున్నాను."

💠 4. సంకల్పం:- 

నన్ను ఎదగకుండా అడ్డుపడుతున్న ఈథర్ స్పటికాకార నియంత్రకాలు తొలగించబడాలి. నా యొక్క ఏడు చక్రాలపై ఉన్న ఎథిరిక్ సీల్స్ మూలాలతో సహా తొలగించబడాలి."

💠 5. సంకల్పం 😘 

"నాయొక్క కర్మ ముద్రలు, ఒప్పందాలు, ప్రతిజ్ఞలు, భయం తాలూకు ఎథిరిక్ కార్డ్స్, కోపం తాలూకు ఎథిరిక్ కార్డ్స్ తొలగించబడాలి."

💠. 6. సంకల్పం 😘 

నన్ను అసెన్షన్ వైపు వెళ్ళకుండా అడ్డుపడుతున్న J సీల్స్, ఇంప్లాంట్స్, ట్యాగ్ మూల ముద్రలు ఏవి ఉన్నా అణు- పరమాణు కణ స్థాయి నుండి DNA మూలం నుండి తొలగించవలసిందిగా కోరుతున్నాను. తొలగించబడిన ప్రాంతమంతా కాంతితో నిండిపోవాలి. నా నుండి విడుదలైనవన్నీ కాంతిగా మారిపోవాలి.

💠. 7. సంకల్పం:- 

నా యొక్క పూర్ణాత్మకూ మరి ఉన్నత ఆత్మ స్వరూపులందరికీ నమస్కారం. గురువులకు, గురు చైతన్య శక్తులకు నమస్కరిస్తున్నాను. నా యొక్క ఆత్మ చైతన్యశక్తి ద్వారా... నా యొక్క కాంతి శక్తి ద్వారా నా యొక్క అన్ని రకాలైన ఒప్పందాలు, అగ్రిమెంట్స్, కాంట్రాక్ట్స్, కనెక్షన్స్, ఎటాచ్ మెంట్స్ ఏమైనా చీకటి శక్తులతో కనెక్ట్ అయివుంటే.. అవన్నీ మూలాలతో సహా తొలగించు కుంటున్నాను. 

నా ఆత్మ శక్తి ద్వారా, పూర్ణ చైతన్యం ద్వారా వీటన్నింటినీ రద్దు చేస్తున్నాను. గతం, వర్తమానం, భవిష్యత్ అగ్రిమెంట్స్, కాంట్రాక్ట్స్, కనెక్షన్స్ రద్దు చేస్తున్నాను. వీటిని పూర్తిగా వదిలి చైతన్యంతో మమేకమవుతున్నాను. ఇది ఇలాగే జరగాలి. తథాస్తు.. తథాస్తు.. తథాస్తు.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #అద్భుతసృష్టి

WhatsApp, Telegram, Facebook groups:
https://incarnation14.wordpress.com/2020/09/23/social-media-groups-channels-telegram-facebook-whatsapp-etc/

30 Sep 2020

------------------------------------ x ------------------------------------


🌹.   అద్భుత సృష్టి - 43   🌹

✍️ . రచన, సంకలనం- DNA స్వర్ణలత గారు
సేకరణ : ప్రసాద్ భరద్వాజ


🌻 16.సిలికేట్ మాట్రిక్స్🌻

సిలికేట్ మ్యాట్రిక్స్ DNA అనేది DNA యొక్క పన్నెండు ప్రోగులను సంక్రియం చేసే పద్ధతి. 12 ప్రోగుల DNA యాక్టివేషన్ ద్వారా శరీరం నశించకుండా (మరణించకుండా) ఉన్నత తలాలకు ప్రయాణించ గలిగే స్థితికి మారుతుంది.

💠. స్పటికాకార బ్లూప్రింట్ ని మార్చడం:-

ఒకప్పుడు ఈ భూమి అత్యున్నతమైన స్థాయిలో ఉండేది. ఆ సమయంలో ఈ భూమి యొక్క ఆత్మ పేరు "తారా"; ఈ భూమి 12 ఉన్నత లోకాల స్థాయి శక్తిని కలిగి ఉండేది కానీ ఇప్పుడు ఆ స్థాయి మార్చబడింది.

12 శక్తి స్థాయిలు కలిగిన ఈ భూమి రెండు శక్తి స్థాయిలకు దిగిపోయిన తరువాత ఈ భూమిని "గెయియా" అనే ఆత్మ పరిపాలిస్తోంది.

💫. ఈ భూమిపైకి మానవులు భగవంతుని యొక్క రూపురేఖలతో దైవమానవునిగా సృష్టించబడ్డారు. ఇతని DNA లో 12 ఉన్నత స్వర్గాల యొక్క జన్యు నిర్మాణం కలిగి ఉండేది. ఈ మానవుని "ఎమరాల్డ్ DNA ఆర్డర్ ఫౌండర్ రేస్ మానవుడు" అనేవారు.

💫. ఇప్పుడు మానవుడు తన డీఎన్ఏలో మొదటి జన్యుజ్ఞానాన్ని కోల్పోయి (12 స్థాయిల నుండి రెండు స్థాయిలకు దిగిపోయాడు) అతి సామాన్యుడిగా ఉన్నాడు. ఈ స్థితిని మార్చి తిరిగి అతనికి పూర్వవైభవాన్ని పొందేలా చేయడమే "DNA సంక్రియ". అంటే "DNA సంక్రియ" అనేది కణస్థాయి నుండి తీసుకొని రావలసిన మార్పు. మన DNAలో గుప్త జ్ఞానం దాగి ఉంది. ఈ గుప్త జ్ఞానం ఉన్న DNAని "జంక్ DNA" అన్నారు. ఈ DNAలో ఉన్నత తలాల సమాచారం, ఉన్నత జ్ఞానం, శక్తి నిక్షిప్తం చేయబడి ఉన్నాయి.

💠. డైమండ్ సన్ DNA కోడ్:-

మనల్ని మొదట దైవ మానవునిగా తయారు చేసినప్పుడు మనం అత్యధికమైన DNA స్థాయిని కలిగి ఉండే వాళ్ళం. దాని పేరు 12 ప్రోగుల డైమెండ్ సన్ DNA తో ఉన్నప్పుడు మనల్ని "ఏంజెలిక్ హ్యూమన్" అని పిలిచేవారు.

💫 24 స్ట్రాండ్ DNA ని కలిగి ఉన్నప్పుడు డబుల్ డైమండ్ సన్ DNAలేదా ఎమరాల్డ్ సన్ DNA అని పిలిచేవారు. ఇవే కాకుండా ఇంకా ఎన్నో స్థాయిలు ఉన్నాయి. గోల్డెన్ సన్ DNA, ప్లాటినమ్ సన్ DNA మొదలైనవి ఎన్నో ఉన్నాయి. ఈ సిలికేట్ మ్యాట్రిక్స్ లో మానవుడు= 12 ప్రోగుల డైమండ్ సన్ DNA ని కలిగి ఉంటాడు. సిలికెట్ మ్యాట్రిక్స్ అంటే నిద్రాణమై ఉన్న మానవ DNA పరిణామ సంభావ్యత అని అర్థం.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹


#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #అద్భుతసృష్టి


WhatsApp, Telegram, Facebook groups:
https://incarnation14.wordpress.com/2020/09/23/social-media-groups-channels-telegram-facebook-whatsapp-etc/


02 Oct 2020

------------------------------------ x ------------------------------------


🌹. అద్భుత సృష్టి - 44 🌹

✍️ . రచన, సంకలనం- DNA స్వర్ణలత గారు
సేకరణ : ప్రసాద్ భరద్వాజ


🌻. ఫైర్ కోడ్స్ :- 🌻 

మన 12 ప్రోగుల DNAలో 12 నిద్రాణమైన సంకేతాలు దాగి ఉన్నాయి. 12 నిద్రాణమై ఉన్న సంకేతాలు మన తలలో బ్రహ్మరంధ్రం చుట్టూ ఉన్న 12 స్టార్ క్రిస్టల్స్ తోనూ 12 లోకాలతోనూ అనుసంధానించ బడిన కాంతి యొక్క ప్రతినిధులు. ఇది12 నిద్రాణమైన జన్యు సంకేతాలను కలిగివుంటాయి. వీటిని పరివర్తన సంకేతాలు లేదా ఫైర్ లెటర్స్ (అగ్ని అక్షరాలు) అంటారు. 

ఈ 12 అగ్ని అక్షరాలను సిలికేట్ మ్యాట్రిక్స్ లేదా "క్రిస్టల్ జీన్స్" అని పిలుస్తారు. ఇది మానవ జీవితం యొక్క అసలు జన్యునిర్మాణం. ప్రతి DNA స్టాండ్ చైతన్యం యొక్క ఎరుకని, శక్తిని కలిగి ఉన్న డైమెన్షనల్ ఫ్రీక్వెన్సీతో కూడుకున్న ఫైర్ లెటర్ కోడ్ (అగ్ని అక్షరాన్ని) కలిగి ఉంటుంది. దీని యొక్క ఫ్రీక్వెన్సీ ని "స్కేలార్ వేవ్ ప్రోగ్రామ్" అంటారు.

✨. నిద్రాణమై ఉన్న జన్యుసంకేతాలు (సోలార్ లెటర్స్) ఒకదానితో ఒకటి కలిసి సంక్రియ (యాక్టివేషన్) చేయవచ్చు. ఇలా చేయడాన్ని ఒక దానితో ఒకటి ప్లగ్గిన్ చేయడం అంటారు. ఈ ప్రక్రియను "సెల్యులార్ ట్రాన్స్ మ్యుటేషన్" అనవచ్చు.

✨. చాలా తక్కువ మందిలో మాత్రమే ఇప్పటివరకు ఈ DNA సంక్రియ జరిగింది. ఈ యాక్టివేషన్ అధికంగా అందరిలో జరగాలి అంటే మనం మార్ఫో జెనెటిక్ ఫీల్డ్ కి కనెక్ట్ అవ్వవలసి ఉంటుంది.

🌟. మార్ఫో జెనటిక్ ఫీల్డ్

"మార్ఫో జెనిటిక్ ఫీల్డ్" అంటే అందరిలో ఉన్న ఒకే చైతన్య స్థాయి. దీని కారణంగా ఒకరిలో ఆధ్యాత్మిక ప్రగతి సంభవిస్తే మిగిలిన అందరు మానవులలో ఈ మార్పు సంభవిస్తుంది.

ఉదా: అడవిలో ఉన్న ఒక జంతువు మరి యొక జంతువు నుండి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తే వచ్చే టెక్నినిక్స్ ఏవైతే ఉంటాయో.. అవి ప్రతి ఒక్క జంతువుకి వాటి యొక్క మార్ఫోజెనటిక్ ఫీల్డ్ ద్వారా ఈ జ్ఞానం అందజేయబడుతుంది. ఇప్పటి వరకు మానవులందరికీ ఒక చైతన్యం, జంతువులకు మరి వృక్షాలకు చైతన్యం వేరు వేరుగా ఉండేది. 

కానీ ఇప్పుడు ఈ మూడు చైతన్యాలు ఏకమై " టెట్రా మార్ఫోజెనెటిక్ ఫీల్డ్" నడుస్తుంది. అంటే సకల జీవరాశి యొక్క దైవ జన్యు చైతన్యం ఒక్కటే. కాబట్టి ఇక్కడ ఎవరు అభివృద్ధి చెందినా ఆ మార్పు.. ఆ జ్ఞానం.. వారి జన్యువుల ద్వారా ఇతరులకు అందజేయబడుతుంది. ప్రస్తుతం మన DNAలోని అగ్ని అక్షరాల సంకేతాల జ్ఞానం విచ్ఛిన్నం చేయబడి ఉంది. వీటిని సరిచేసి, యాక్టివేట్ చేయవలసి ఉంది.

✨. ఈ సిలికేట్ మ్యాట్రిక్స్ యొక్క జ్ఞానం ద్వారానే శరీరంలోని సహస్రార క్రిస్టల్ స్టీల్స్ ని సరిచేయగలుగుతాము. క్రిస్టల్ స్టీల్స్, అగ్ని అక్షరాలు, DNA సంక్రియ పరచబడాలి అంటే ఈ దేహానికి శక్తి, కాంతి, సౌండ్ యొక్క ఫ్రీక్వెన్సీ లు అధికంగా కావలసి ఉంటుంది. 

వీటిని పొందే మార్గమే "ధ్యానం". ధ్యానంలో కాంతిని వినియోగిస్తే అది కాంతి ధ్యానం, శబ్దాన్ని వినియోగిస్తే అది నాదధ్యానం అవుతుంది. వాటి ద్వారానే మనం DNA సంక్రియం చేయబడి అందులోని 

అగ్నిఅక్షరాలు యాక్టివేషన్ లోకి తీసుకుని రాబడి 12 క్రిస్టల్ గ్రిడ్స్ ఓపెన్ అయి సిలికేట్ మ్యాట్రిక్స్ తయారు చేయబడతాయి. దీని ద్వారా భౌతిక శరీరం అమరత్వాన్ని సంతరించుకుని 12 ఉన్నత లోకాల జ్ఞానంతో 12 ఉన్నత స్థాయిలకు ఎదిగి "తారాస్థాయిలో" నిలుస్తుంది.

సశేషం... 
🌹 🌹 🌹 🌹 🌹

#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #అద్భుతసృష్టి


WhatsApp, Telegram, Facebook groups:
https://incarnation14.wordpress.com/2020/09/23/social-media-groups-channels-telegram-facebook-whatsapp-etc/


03 Oct 2020

------------------------------------ x ------------------------------------




🌹.   అద్భుత సృష్టి - 45   🌹

✍️ . రచన, సంకలనం- DNA స్వర్ణలత గారు
సేకరణ : ప్రసాద్ భరద్వాజ



🌻 17. 12 స్ట్రాంగ్ DNA, RNA ప్రాసెస్ 🌻


✨. 12 ప్రోగుల DNAని రీకోడింగ్ చేయడాన్ని 12 స్ట్రాండ్ DNA రీకోడింగ్ ప్రాసెస్ అంటారు.

మెడికల్ సైన్స్ 2ప్రోగుల DNA గురించి తెలుసుకుంది కానీ... మిగిలిన 10 ప్రోగుల జంక్ DNA గురించి తెలుసుకోలేక పోయింది. 

ఇటీవల తెలిసిన విషయం ఏమిటంటే మన యొక్క 10 ప్రోగుల DNAలోనే ఎంతో జ్ఞానం దాగి ఉన్నది అని. ఈ DNA లోనే మల్టీడైమెన్షన్ కాన్షియస్నెస్ దాగి ఉంది. ఈ కాన్షియస్నెస్ మనకు అందుబాటులోకి రావాలి అంటే DNA, RNA ప్రాసెస్ ద్వారా మాత్రమే జరుగుతుంది.

RRA ప్రాసెస్ అంటే=రీ-అలైనింగ్,రీ-కనెక్టింగ్, యాక్టివేటింగ్ ప్రాసెస్ (DNA పునరమరిక కనెక్టింగ్ ప్రక్రియ).

ఈ ప్రక్రియ ద్వారా మన యొక్క బహుమతీయ (మల్టీడైమెన్షనల్) శక్తిసామర్థ్యాలు, భౌతిక సామర్థ్యాలను ఎథిరిక్ లెవెల్లో న్యూరల్ నెట్వర్క్ ద్వారా అభివృద్ధి చేయడం జరుగుతుంది. ఎక్స్ పీరియన్స్ లు పొందుతాం. ఉన్నత లోక సమాచారాన్ని అందుకోగలుగుతాం.



✨. ఈ ప్రక్రియ ద్వారా ఇతర డైమెన్షన్స్ ని చూడడం, కమ్యూనికేట్ చేయడం జరుగుతుంది. ఈ DNA 

రీకోడింగ్ ప్రాసెస్ ద్వారా మొదట థైమస్ గ్రంథి ఆక్టివేట్ చేయబడుతుంది. ఈ థైమస్ గ్రంధి ప్రేమను, శక్తిని గ్రహిస్తూ ట్రాన్స్ ఫర్ చేస్తుంది. ఇది అంతా భావోద్వేగాల క్లియరింగ్ ద్వారా చేయవలసి ఉంటుంది.



🌟 ఉదా:- DNA రీకోడింగ్ అనేది ఇంతకు ముందు స్విచ్ ఆఫ్ చేయబడిన జ్ఞానాన్ని తిరిగి యాక్టివేట్ చేయడం.



✨. DNAలో ఉన్న 144 సంకేతాలు (సమస్త విశ్వసమాచార జ్ఞానాన్ని నిక్షిప్తం పూర్తిస్థాయిలో యాక్టివేట్ అవుతుంది. మానవ శరీర నిర్మాణం ఉన్నత స్థితిలోకి తీసుకుని వెళ్ళడం జరుగుతుంది.

DNA,RRA (DNAరీకోడింగ్) ప్రాసెస్ ద్వారా ఈథర్ శరీరం లైట్ 

బాడీ లెవెల్ కి ఎదుగుతుంది. ఇందులో మొదటి స్థాయిలో 2 ప్రోగుల DNA 12 ప్రోగుల DNA గా అభివృద్ధి చెందుతుంది. 12 ప్రోగులు సహస్రార చక్రంలో ఉన్న 12 సహస్రార క్రిస్టల్స్ కనెక్షన్ ద్వారా క్రౌన్ చక్రా క్రిస్టల్ కూడలి ఏర్పడుతుంది.



✨. దీని ద్వారా ఉన్నత లోకాల నుండి వస్తున్న ఉన్నత లోకాల లైఫ్ ఫోర్స్ ఎనర్జీ (విశ్వమయ ప్రాణశక్తి) మనతో పూర్తిస్థాయిలో కనెక్ట్ అవుతుంది. ఈ శక్తి లో ఉన్న జీవశక్తి శరీరంలోకి ప్రవేశించి శరీరాన్ని మరింత శక్తివంతంగా మారుతుంది.



✨. ఈ RRA ప్రాసెస్( DNA పునరమరిక ప్రక్రియ)లో మొదటగా క్రౌన్ చక్రా క్రిస్టల్స్ ఆక్టివేట్ చేయబడతాయి. ఇవి మొత్తం పన్నెండు ఉంటాయి. ఒక దానితో ఒకటి అనుసంధానం అయ్యి "మెర్కాబా యాంటీనా" ఏర్పడుతుంది.



✨. ఈ మెర్కాబా ఆంటీనా ద్వారా మనకి అవుటర్ బాడీ అనుభవాలు వస్తాయి. తర్వాత హైపోథాలమస్ గ్రంథి యాక్టివేషన్ లోకి వస్తుంది. ఉన్నతలోక సమాచారం కాంతి భాష రూపంలో ఉంటుంది. కాంతి భాష అంటే - భావం రూపంలో, చిత్రాల రూపంలో, రంగుల రూపాలలో ఉంటాయి. వీటిని అనువదించి ఆ చిత్రం యొక్క సమాచారాన్నీ, జ్ఞానాన్నీ మనకు అందించే ఏకైక గ్రంథి ఈ హైపోథాలమస్.


హైపోథాలమస్ యాక్టివేషన్ కి వచ్చింది అంటే జెనెటిక్ ఇంజనీయర్స్ యొక్క పని అయిన RRA ప్రాసెస్ కంప్లీట్ అయినట్లే.


సశేషం.... 
🌹 🌹 🌹 🌹 🌹


#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #అద్భుతసృష్టి


04 Oct 2020


------------------------------------ x ------------------------------------


🌹.   అద్భుత సృష్టి - 46   🌹

✍️ . రచన, సంకలనం- DNA స్వర్ణలత గారు
సేకరణ : ప్రసాద్ భరద్వాజ


🌻 . DNA యాక్టివేషన్ పూర్తి అయినట్లు మనకు ప్రూఫ్ ఏమిటి? 🌻

✨. భౌతిక నేత్రాలకు కనిపించని 'ఆది భౌతిక' శక్తులను చూడగలగడం.

✨. "ఆరా" ఫోటోలను చూడడం.

✨. శరీరంలో ఉత్పన్నమవుతున్న భావోద్వేగాలను ముందే గుర్తించి కంట్రోల్ చేయగలుగుతాం.

✨. ఫిజికల్, మెంటల్ బాడీలో వచ్చే ఫీలింగ్స్ ను అర్థం చేసుకోగలుగుతాం.

✨. ఉన్నత సమాచారాలను అందుకుంటాం.

✨. కష్టాలను అధిగమించే మార్గం మనకే అవగతం అవుతుంది.

✨. గతజన్మలను తెలుసుకుంటాం.

✨. దివ్యనేత్రం యాక్టివేట్ చేయబడుతుంది.

✨. ఆస్ట్రల్ ట్రావెల్ మొదలైన ఎన్నో సామర్థ్యాలు మనకు అవగతమవుతూ ఉంటాయి.

🌟. DNA సంక్రియ పరచవలసిన అవసరం ఏమిటి?:- 🌟

ఇప్పుడు మనం, మన భూమితో కలిసి 1990 లో మొదటిసారిగా "ఫోటాన్ బ్యాండ్" లోకి ప్రవేశించాం. ఈ ప్రక్రియ 2000 సంవత్సరాల పాటు జరుగుతుంది. 

అంటే భూమి 2000 సంవత్సరాల పాటు తీవ్రమైన కాంతిలో ఉంటుంది. ఫోటాన్ బ్యాండ్ మ్యాగ్నెటిక్ రేడియోధార్మికత (అధికరేడియేషన్) మరి శక్తి తరంగాల ద్వారా మన యొక్క జీవిత క్రమం పూర్తిగా మారి మనల్ని God Level కి మార్చుతుంది. అంటే 3వ పరిధి పౌనఃపున్యం స్థాయిల నుండి ఉన్నత పౌనఃపున్య స్థాయిలోకి మార్చుతుంది. ఈ ఫోటాన్ శక్తి క్షేత్రం మన జీవితాన్ని అన్ని కోణాల నుంచి ఎదిగేలా చేస్తుంది.

✨. ఉదా:- గింజస్ధాయి నుండి మహా వృక్షం(ఎన్ లైటెన్ మెంట్) స్థాయి వరకు ఎదగడం.

మన శరీరాలలో ఉన్న కణాలలోని అణు నిర్మాణాలు నెమ్మదిగా వాటికి అవే రీ-ట్యూనింగ్ అవుతాయి‌. భూమి పెరుగుతున్న ఫ్రీక్వెన్సీ స్థాయికి మనం కూడా ఎదగడం జరుగుతుంది.

✨. 3వ పరిధి కార్బన్ బాడీ (అణుఫ్రీక్వెన్సీ కార్బన్ స్పిన్) నుండి 5వ పరిధి క్రిస్టల్ బాడిగా (అణు ఫ్రీక్వెన్సీ క్రిస్టల్ స్పిన్ సరిపోయేలా) మారుతుంది.ఈ మార్పు ఒక్క మానవులలోనే కాదు మొత్తం గ్యాలక్సీ లోని సకల జీవరాశీ మార్పు చెందుతుంది. పూర్తి గెలాక్సీ మల్టీ డైమెన్షనల్ స్థాయిలో ఎదుగుతుంది. మనల్ని మల్టీ డైమెన్షనల్ లైట్ బీయింగ్ గా మార్చుతుంది. ఈ పని అంతా RRA ద్వారా జరుగుతుంది.

🌟. సాధన - ప్రక్రియ :

డీప్ మెడిటేషన్ చేయ్యాలి. ప్రశాంతంగా కూర్చుని దీర్ఘశ్వాస తీసుకోవాలి. గుండె కేంద్ర బిందువు దగ్గర దృష్టిని నిలిపి దీర్ఘశ్వాసను గ్రహించాలి. ఇప్పుడు అన్ని చక్రాస్ పైన దృష్టిని నిలిపి ధ్యానం చేద్దాం. 

దీంతో అన్ని చక్రాస్ ఓపెన్ అవుతాయి. ఎప్పుడైతే చక్రాస్ ఓపెన్ అవుతాయో మన కాళ్ళు క్రింద ఉన్న భూమి యొక్క స్టార్ చక్రాతో కనెక్షన్ ఏర్పడాలని కోరుకుందాం. అక్కడ నుండి మన తలపై ఉన్న ఆత్మ యొక్క స్టార్ చక్రాతో కనెక్షన్ అవ్వాలని కోరుకుందాం. ఈ ప్రక్రియ ద్వారా శరీరంలోని అన్ని చక్రాలు ఏకస్థితిలోకి తీసుకుని రాబడాలని కోరుకుందాం. మరొక దీర్ఘశ్వాసను తీసుకొని మెల్లగా వదులుదాం.

✨. సంకల్పం-1:-

కాస్మోస్ లోని ( విశ్వంలోని) కాస్మిక్ హార్ట్ చక్రాతో కనెక్ట్ అవ్వాలి అనుకుందాం‌. ఆర్కేంజల్ మైఖేల్ ని ఆహ్వానించుకుందాం. DNA, RRA సభ్యులను ఆహ్వానించుకుందాం.

✨. "నా సహస్రార చక్రం ఓపెన్ చేసి కాంతిని శరీరంలోకి ప్రవేశ పెట్టండి"

✨. ఈ కాంతి శరీరంలోని ప్రతి అణువు, పరమాణువు స్థితులలోకి వెళుతున్నట్లు భావించండి.

✨. "ఈ కాంతి అణువు పరమాణువులోని ప్రతి DNA ని రిపేర్ చేసి రీకోడింగ్-రీయాక్టివేషన్ జరగాలి" అనుకుందాం.

✨. "ఈ కాంతి DNAలో ఉన్న 12 అగ్ని అక్షరాలు పూర్తి స్థాయిలో యాక్టివేషన్ లోకి తీసుకొని రావాలి" అనుకుందాం.

✨. "అగ్ని అక్షరాలలో ఉన్న సమాచారం అంతా తిరిగి పునరుద్ధరించబడాలి" అని కోరుకుందాం.

✨. కాంతిని ఇంకా ఇంకా స్వీకరిస్తూ శరీరం "ఆరా" అంతా కాంతివంతంగా మారుతుంది.

✨. "ఈ కాంతి ద్వారా 2 ప్రోగుల DNA..12 ప్రోగుల DNA స్ధాయికి పూర్తిగా మారిపోతుంది. ఈ కాంతి దేహం అయిన మెర్కబా బాడీని యాక్టివేషన్ చేసుకున్నాను." ఇందుకు మాస్టర్స్ కి ధన్యవాదాలు తెలుపుదాం.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹


#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #అద్భుతసృష్టి


WhatsApp, Telegram, Facebook groups:
https://incarnation14.wordpress.com/2020/09/23/social-media-groups-channels-telegram-facebook-whatsapp-etc/


05 Oct 2020

------------------------------------ x ------------------------------------


🌹.    అద్భుత సృష్టి - 47   🌹

✍️ . రచన, సంకలనం- DNA స్వర్ణలత గారు
సేకరణ : ప్రసాద్ భరద్వాజ


🌻 18. లైట్ బాడీస్ ( కాంతి శరీర స్థాయిలు) 🌻

కాంతి శరీరం అంటే నశింపు లేని దివ్యత్వం. ఈ కాంతి దేహం పొందటం అంటే తాను దైవంగా మారినట్లే. మన ప్రస్తుత శరీరం పరిణామం చెందుతూ అధిక మొత్తంలో కాంతిని స్వీకరిస్తూ నెమ్మది నెమ్మదిగా శరీరంలోని అణువులు అన్ని తమ ఫ్రీక్వెన్సీని "కార్బన్ స్థితి" నుండి "కాంతి స్థితి" లోనికి మార్చుకుంటుంది.

✨. ఈ ఆత్మకు సంబంధించిన అన్ని శక్తులు, శక్తి క్షేత్రాలు, శరీర అవయవాలు అన్నీ కూడా తమ ఫ్రీక్వెన్సీని ఉన్నత స్థాయి ఫ్రీక్వెన్సీతో అనుసంధానం చేస్తూ అతి సాధారణ భౌతిక స్థాయి నుండి ఆదిభౌతిక స్థాయికి, అక్కడి నుండి అనంత చైతన్య స్థాయికి ఎదిగేలా చేస్తుంది.

✨. కాంతిని స్వీకరిస్తూ.. ప్రత్యక్షంగా, పరోక్షంగా, శారీరక, మానసిక, బుద్ధి, చైతన్య స్ధితులలో ప్రత్యేక మార్పులు జరుగుతాయి.

కర్బన ఆధారిత శరీర అణువులు మార్పును చెందుతున్న తరుణంలో కర్మలు కడగబడడం జరుగుతుంది. శరీరం అధిక సాంద్రతను కోల్పోవడం జరుగుతుంది. ఈ తరుణంలో శరీరం అతి సాధారణమైన రుగ్మతలకు గురి కావడం జరుగుతుంది. (జ్వరం, తలనొప్పి, దద్దులు, కండరాలు బిగదీయడం, కీళ్లనొప్పులు మొదలైనవి)

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹


#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #అద్భుతసృష్టి 


Facebook, WhatsApp, Telegram groups:
https://incarnation14.wordpress.com/2020/09/23/social-media-groups-channels-telegram-facebook-whatsapp-etc/


06 Oct 2020

------------------------------------ x ------------------------------------



🌹.   అద్భుత సృష్టి - 48   🌹

✍️ . రచన, సంకలనం- DNA స్వర్ణలత గారు
సేకరణ : ప్రసాద్ భరద్వాజ


🌻 18. లైట్ బాడీస్ (కాంతి శరీర స్థాయిలు) 🌻

కాంతి శరీరం అంటే నశింపు లేని దివ్యత్వం. ఈ కాంతి దేహం పొందటం అంటే తాను దైవంగా మారినట్లే. మన ప్రస్తుత శరీరం పరిణామం చెందుతూ అధిక మొత్తంలో కాంతిని స్వీకరిస్తూ నెమ్మది నెమ్మదిగా శరీరంలోని అణువులు అన్ని తమ ఫ్రీక్వెన్సీని "కార్బన్ స్థితి" నుండి "కాంతి స్థితి" లోనికి మార్చుకుంటుంది.

✨. ఈ ఆత్మకు సంబంధించిన అన్ని శక్తులు, శక్తి క్షేత్రాలు, శరీర అవయవాలు అన్నీ కూడా తమ ఫ్రీక్వెన్సీని ఉన్నత స్థాయి ఫ్రీక్వెన్సీతో అనుసంధానం చేస్తూ అతి సాధారణ భౌతిక స్థాయి నుండి ఆదిభౌతిక స్థాయికి, అక్కడి నుండి అనంత చైతన్య స్థాయికి ఎదిగేలా చేస్తుంది.

✨. కాంతిని స్వీకరిస్తూ.. ప్రత్యక్షంగా, పరోక్షంగా, శారీరక, మానసిక, బుద్ధి, చైతన్య స్ధితులలో ప్రత్యేక మార్పులు జరుగుతాయి.

కర్బన ఆధారిత శరీర అణువులు మార్పును చెందుతున్న తరుణంలో కర్మలు కడగబడడం జరుగుతుంది. శరీరం అధిక సాంద్రతను కోల్పోవడం జరుగుతుంది. ఈ తరుణంలో శరీరం అతి సాధారణమైన రుగ్మతలకు గురి కావడం జరుగుతుంది. (జ్వరం, తలనొప్పి, దద్దులు, కండరాలు బిగదీయడం, కీళ్లనొప్పులు మొదలైనవి)

సశేషం.....
🌹 🌹 🌹 🌹 🌹


#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #అద్భుతసృష్టి 


Facebook, WhatsApp, Telegram groups:
https://incarnation14.wordpress.com/2020/09/23/social-media-groups-channels-telegram-facebook-whatsapp-etc/


07 Oct 2020

------------------------------------ x ------------------------------------


🌹.   అద్భుత సృష్టి - 49   🌹

✍️ . రచన, సంకలనం- DNA స్వర్ణలత గారు
సేకరణ : ప్రసాద్ భరద్వాజ


🌻. భూమికి వచ్చే కాంతి, జ్ఞానం కొన్ని స్టార్ గేట్స్ ద్వారా వస్తుంది‌. అవి: 🌻

తలం. దేశం పేరు 

1వ డైమెన్షన్.. స్టార్ గేట్... అడరే- ఐర్లాండ్

2వ డైమెన్షన్.. స్టార్ గేట్ ... స్టోన్ హెంజ్-ఇంగ్లాండ్

3వ డైమెన్షన్..‌ స్టార్ గేట్‌‌... సీడెన్ వాష్ - U.S

4వ డైమెన్షన్.. స్టార్ గేట్... మ్యన్ హటన్ ద్వీపము-U.S.A

5వ డైమెన్షన్.. స్టార్ గేట్...బాలీ- దక్షిణ పసిఫిక్

6వ డైమెన్షన్.. స్టార్ గేట్...ఉలురు - హైయ్యర్ రాక్ - ఆస్ట్రేలియా

7వ డైమెన్షన్..స్టార్ గేట్... ఫీనిక్స్- అరిజోనా U.S, హిమాలయస్ లో టిబెట్

8వ డైమెన్షన్స్.. స్టార్ గేట్... అట్లాంటిక్ మహాసముద్రం బెర్ముడా యో S.W

9వ డైమెన్షన్.. స్టార్ గేట్... అంటార్కిటికా

10వ డైమెన్షన్.. స్టార్ గేట్... బాగ్దాద్ - ఇరాక్

11వ డైమెన్షన్.. స్టార్ గేట్...న్యూగ్రాండ్ - ఐర్లాండ్

12 వ డైమెన్షన్.. స్టార్ గేట్... కార్నవాల్ - U.K

ఈ స్టార్ గేట్స్ నుంచి వచ్చే కాంతి మన DNA పైన పనిచేస్తుంది. ఎప్పుడైతే DNA యాక్టివేషన్ అవుతుందో, కార్బన్ ఆధారిత శరీరం కాంతి శరీరంగా మార్చబడుతుంది.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹


#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #అద్భుతసృష్టి 


08 Oct 2020

------------------------------------ x ------------------------------------



🌹.   అద్భుత సృష్టి - 50   🌹

✍️ . రచన, సంకలనం- DNA స్వర్ణలత గారు
సేకరణ : ప్రసాద్ భరద్వాజ


🌻. లైట్ బాడీ యాక్టివేషన్ 🌻

🌟. "లైట్ బాడీ యాక్టివేషన్" అంటే మానసిక, భౌతిక, భావోద్వేగ ఆధ్యాత్మిక శరీరాల అభివృద్ధి. ఇదంతా కూడా భూమి యొక్క గ్రిడ్ ల సవరణ ద్వారా జరుగుతుంది. "గ్రిడ్స్" అనేవి జామెట్రికల్ స్ట్రక్చర్ ను కలిగి ఉంటాయి. అలాగే మన దేహంలో కూడా ఈ జామెట్రికల్ స్ట్రక్చర్ ఉంటుంది. ఈ స్ట్రక్చర్ 12 డైమెన్షన్స్ కు సంబంధించిన ఎనర్జీతో యాక్టివేట్ అవుతుంది.

✨. మానవ దేహంలోని విద్యుత్ అయస్కాంత తరంగాల శక్తితో కలిసి అనంత విశ్వంలో మల్టీ డైమెన్షనల్ సెల్ఫ్ తో మనల్ని కనెక్ట్ చేస్తుంది. హైయ్యర్ సెల్ఫ్ తో కనెక్ట్ అవ్వడం వలన మనలో విద్యుత్ ప్రవాహం ద్వారా మనలో దాగి ఉన్న డేటాను (DNAలో నిక్షిప్తమైన జ్ఞానాన్ని)ఎన్ కోడ్ చేసి మన అభివృద్ధికి సహాయపడుతుంది. మనల్ని హైయ్యర్ సెల్ఫ్ స్ధాయికి ఎదిగేలా చేస్తుంది.

✨. మన లైట్ బాడీ యాక్టివేషన్ వలన మనల్ని విశ్వమూలాలతో ఏకీకృతం చేస్తుంది. మన యొక్క అణునిర్మాణం పునర్వ్యవస్థీకరింపబడుతుంది. శరీరాన్ని భారరహిత (తేలిక)పరిచి ఫ్రీగా ఉంచి విశ్వమూలంతో కనెక్ట్ చేస్తుంది. ఇలా చేయడానికి సహకరించే లైట్ బాడి యొక్క పవిత్ర జ్యామితిని "మెర్కాబా" అంటారు.

✨. శరీరంలోకి కాంతి ప్రవేశించినప్పుడు ఆశక్తి స్పిన్ అవుతూ టెట్రాహైడ్రాన్(చతుర్భుజి) రూపంలో ప్రవేశిస్తూ శరీరంలోకి విస్తరిస్తుంది. మెర్కాబా అనేది ఒక ఖచ్చితమైన రేఖాగణిత క్షేత్రం. ఫలదీకరణ చేసిన పిండం (తల్లి నుండి అండం, తండ్రి నుండి శుక్రకణం)నే జైగోట్ అని పిలుస్తారు. ఈ జైగోట్ యొక్క మొదటి ఎనిమిది కణాల నమూనా అయిన ప్రైమోర్డియల్ సెల్ నే మెర్కాబా అని పిలుస్తారు.

✨. ఈ 8 కణాల స్థావరం మొదటి చక్రం అయిన మూలాధారంలో మానవ శరీరం యొక్క జ్యామితీయ క్షేత్రంలో ఉంటుంది. ఈ 8 కణాలు కూడా శరీరం చుట్టూ ఉన్న శక్తిక్షేత్రాలకూ మరి గ్రిడ్ లకూ అనుసంధానం చేయబడి కేంద్రబిందువులా ఉంటాయి. అందుకనే ఈ మెర్కాబా క్షేత్రం సృష్టియొక్క మాతృక (మ్యాట్రిక్స్). దీనినే "ఆత్మ యొక్క బ్లూప్రింట్" అని పిలుస్తారు. దీని వలనే భౌతిక శరీరం సూక్ష్మ శరీరాలు ఆత్మ యొక్క ప్రయోజనాలు జీవితం యొక్క ప్రయోజనాలు మానిఫెస్ట్ చేయబడతాయి.

✨. ఈ మెర్కాబా లైట్ బాడీ అనేది స్థలం, సమయం, కొలతలను మించిన ఒకానొక గొప్ప స్థితి. ఇది శరీరంలోని ప్రతి అణువుతోనూ కంపనాస్ధాయిని (ఫ్రీక్వెన్సీ) పెంచుకుని నిర్దిష్ట ప్రతిధ్వనిని ప్రతి కణంలో యాక్టివేట్ చేసుకొని దేవుని యొక్క పునరుత్పత్తి అంశంగా శరీరంలో కనెక్ట్ చేసుకుంటుంది.

✨. మనలో ఉన్న స్త్రీ- పురుష తత్వాలను ఏకం చేస్తుంది. కుడి మెదడు female energy (స్త్రీశక్తి) కి కనెక్ట్ చేయబడి ఉంటుంది. దీని ద్వారా మనిషికి యూనిటీ కాన్షియస్ నెస్ (ఐక్యతా సృహ) మరి నమ్మకం, ప్రేమ, కరుణ, స్నేహం అనే ఫీలింగ్స్ తో మనల్ని కనెక్ట్ చేస్తుంది.

✨. ఎడమ మెదడు పురుష శక్తితో కనెక్ట్ అయి ఉంటుంది. ద్వంద్వత్వ జీవితంవల్ల ఆత్మ అన్ని రకాల అనుభవాలను తీసుకోవడానికి ఇది సహాయపడుతుంది.

✨. ద్వంద్వత్వం నుండి ఏకత్వం వైపు ప్రయాణించాలి అంటే స్త్రీ పురుష శక్తుల కలయిక ద్వారా the law of one ఏకత్వపు సిద్ధాంతం ప్రకారం అసెన్షన్ వైపు ప్రయాణం చేయడానికి అవసరమైన జ్ఞానాన్ని అందిస్తుంది.

✨. ఈ అసెన్షన్ ప్రాసెస్ లో భౌతిక దేహం స్పిరిచ్యువల్ బాడీతో కలయిక ద్వారా లైట్ బాడీగా మారుతుంది. ఈ కలయిక ద్వారా హైయ్యర్ సెల్ఫ్ ఫిజికల్ బాడీలోకి అవరోహణ అవుతుంది. మన యొక్క జీవకణాలు కాంతి శక్తి తీసుకొని అభివృద్ధి చెంది ఆత్మచైతన్యంగా మార్పు చెందుతాయి. ఆత్మ యొక్క ప్రతి అవరోహణ భౌతిక కణాలలోని పరమాణు నిర్మాణాన్ని కాంతి పరమాణువులుగా మార్చడాన్నే లైట్ బాడీస్థితి అంటారు.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹


#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #అద్భుతసృష్టి 


Facebook, WhatsApp, Telegram groups:
https://incarnation14.wordpress.com/2020/09/23/social-media-groups-channels-telegram-facebook-whatsapp-etc/


09 Oct 2020

------------------------------------ x ------------------------------------




🌹.   అద్భుత సృష్టి - 51   🌹

✍️ . రచన, సంకలనం- DNA స్వర్ణలత గారు
సేకరణ : ప్రసాద్ భరద్వాజ



🌻 . ఈ లైట్ బాడీ యాక్టివేషన్ అనేది 12 లెవెల్స్ లో భౌతికస్థాయిలో జరుగుతుంది. 🌻

✨. 12 లైట్ బాడీస్ జాగృతిలో ప్రతి ఒక్క లైట్ బాడీ యాక్టివేషన్ లో ఎన్నో మార్పులు శారీరకంగా, మానసికంగా సంభవిస్తూనే ఉంటాయి. భూమి తీసుకుంటున్న కాంతి, శక్తి, జ్ఞానం ద్వారా మానవ, సకల జీవరాశిలో మార్పులు సంభవిస్తాయి. 

ఈ మార్పులు జాతి మొత్తంలో సంభవిస్తాయి. ఈ మార్పులకు కారణం భూమిపై ఉన్న "స్టార్ గేట్స్" నుంచి వచ్చే కాంతి మూలం.


🌻. యాక్టివేషన్ జరిగేటప్పుడు మనలో వచ్చే మార్పులు: 🌻

✨. 1వ. లెవెల్:-

మొదటి లైట్ బాడీ యాక్టివేషన్ జరిగే సమయంలో శరీర సాంద్రత అధికంగా పడిపోతుంది. దీంతో తల తిరుగుతున్న ఫీలింగ్ కలుగుతుంది. ప్లూ, తలనొప్పి, డయేరియా, రాషెస్, మజిల్, జాయింట్ నొప్పులు వస్తాయి.

ప్లూ లక్షణాలు అనేవి నిజమైన ప్లూ లక్షణాలు కావు. అవి అన్నీ కాంతి శరీర లక్షణాలు.

✨. మెదడు యొక్క కెమిస్ట్రీ మార్చబడుతూ ఉంటుంది. కుడి ,ఎడమ మెదడులలో మార్పులు సంభవించి.. పీనియల్, పిట్యూటరీ గ్రంథులు ఇప్పుడు ఉన్న స్టేజ్ కన్నా మరింతగా మార్పు చెందుతాయి.

✨. DNA ప్రోగుల్లో ఉన్న కెమికల్ కాంపోనెంట్స్ మారి హైయ్యర్ స్ధాయికి వెళతాయి. (హైడ్రోజన్ అణువులు తమ అణుస్థాయిని మార్చుకుంటూ, అధిక కాంతిని పొందుతూ, పాత స్థితిని మార్చి DNAలో దాగి ఉన్న జ్ఞానాన్ని బయటికి తీసుకుని వస్తూ ఉంటుంది.)

✨. కాంతి DNAలోకి ప్రవేశించినప్పుడు శరీరం ఎన్నో మార్పులకి గురి అవుతుంది. ఆశ్చర్యాన్ని కలిగించే విధంగా ఒక్కొక్క సమయంలో అపరిమితమైన ఆనందం కలుగుతుంది. 

మరియొక సమయంలో సాంద్రత పడిపోయి పాతబాధలు, శోకాలు బయటపడటం జరుగుతుంది. శరీరం అధిక వేడిని కలిగి ఫ్లూ- లక్షణాలు కనబడతాయి. పాత ఉద్వేగాలు అన్నీ బయటకు వస్తాయి.

✨. 2వ లెవల్:- 

ఎథిరిక్ బ్లూప్రింట్ లో ఉన్న కార్మిక్ లెసన్స్ అన్నిటినీ రిలీజ్ చేయడం జరుగుతుంది. చాలామందికి ఈ స్థితిలో "నేను ఇంకా ఎందుకు ఇక్కడ ఉన్నాను?" అని అనిపిస్తూ ఉంటుంది.

కాంతి ఎథిరిక్ బ్లూప్రింట్ ను మార్చడం వలన 4 వ డైమెన్షన్ కి సంబంధించిన ఎమోషనల్, మెంటల్ బాడీస్ లో చాలా త్వరగా మార్పులు సంభవిస్తాయి. దీని వలన చాలా అలసి పోయిన ఫీలింగ్ వస్తుంది.

✨. హైయ్యర్ సెల్ఫ్ ఈ శరీరంలో ఉన్న ఆత్మతో కలియడం వలన అలసత్వంతో కూడిన అనుభూతి కొనసాగుతూ ఉంటాయి. జీవితం ఆత్మతో అనుసంధానంతో

ఆత్మ కనెక్షన్ స్ట్రాంగ్ అవుతున్నట్టుగా ఉంటుంది.

సశేషం......
🌹 🌹 🌹 🌹 🌹


#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #అద్భుతసృష్టి


Facebook, WhatsApp, Telegram groups:


10 Oct 2020

------------------------------------ x ------------------------------------


🌹.   అద్భుత సృష్టి - 52   🌹

✍️ . రచన, సంకలనం- DNA స్వర్ణలత గారు
సేకరణ : ప్రసాద్ భరద్వాజ


🌻. యాక్టివేషన్ జరిగేటప్పుడు మనలో వచ్చే మార్పులు - 2 🌻

🌟 3వ లెవెల్:-

భౌతిక భావాలన్నీ మరింత బలంగా మార్చబడతాయి. మన శరీరాలు కాంతిని గ్రహించడమే కాకుండా చాలా మార్పులను పొందుతూ కాంతి యొక్క అధికశక్తిని తనలోకి, భూమిపైకి తీసుకుని వస్తూ గ్రహం మొత్తం యొక్క మార్పుకు సహకరిస్తుంది. శరీరంలో ఈ సమయంలో చాలా మార్పులు వస్తాయి. రబ్బర్ బ్యాండ్ ను సాగదీస్తే ఎలా అయితే సాగుతుందో, వదిలేస్తే ఎలా మామూలు స్థితికి వస్తుందో అదే విధంగా మన శరీరంలో ups and

downs జరుగుతూ ఉంటాయి.

ప్రతి సెల్ లోనూ కాంతి ప్రవేశించి, హైయ్యర్ డైమెన్షన్ యొక్క జ్ఞానం, శక్తి అనుసంధానం చేయబడుతుంది. ఆత్మతో భౌతిక సంభాషణ ప్రారంభం అవుతుంది.

🌟. 4వ లెవెల్:-

ఈ స్థితిలో అధిక శాతం మార్పులు మెదడులో జరుగుతూ ఉంటాయి. మెదడు కణాలలో, నెర్వస్ సిస్టమ్ లో ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ అధికంగా రావడం జరుగుతుంది. దీని వలన మెదడు కెమిస్ట్రీలో మార్పులు సంభవించి తలనొప్పి, బర్నింగ్ సెన్షేషన్, వినికిడి శక్తి లోపం, కంటిచూపులో మసకమసకగా రెండుగా కనిపించడం జరుగుతూ ఉంటుంది. మరియొక సమయంలో ఛాతీ నొప్పులు వస్తూ ఉంటాయి.

✨. మనం కనుక సిద్ధంగా ఉంటే.. క్రిస్టల్ రెగ్యులేటర్ మన యొక్క ఎథిరిక్ శరీరంలో అధిక కాంతిని ప్రవేశపెడుతూ 5 వ డైమెన్షన్ కి సంబంధించిన బ్లూప్రింట్స్ తో కనెక్ట్ చేస్తారు.

ఛాతి నొప్పి అధికంగా వుంటుంది. దీనికి కారణం మన యొక్క హృదయం మరింతగా ఓపెన్ అవుతుందని అర్థం.(గుండెలోతులు తెరవబడుతున్నాయి.)

✨. టెలిపతి థర్డ్ ఐ యాక్టివేషన్ జరుగుతుంది. ఎమోషనల్ బాడీని అర్థం చేసుకుంటూ దానిలో

వచ్చే మార్పులను అంగీకరిస్తూ దానిని కంట్రోల్ చేయగలుగుతాము.

✨. విద్యుత్ అయస్కాంత తరంగాల శక్తి మెదడులోకి ప్రసరించడం వలన ఆ ప్రాంతంలో ఒక రసాయనిక చర్య జరుగుతుంది. ఈ సమయంలో తలనొప్పి,అస్పష్టమైన దృష్టి, వినికిడి లోపం కలుగుతాయి. మీ మెదడులో ఉన్న రెండు అర్ధగోళాల మధ్య ఎలక్ట్రికల్ ఫైరింగ్ జరుగుతున్నట్లు అనిపిస్తుంది. విద్యుత్ శక్తి శరీరం అంతా ప్రసరించి వెన్నెముక క్రిందవరకు వెళ్ళి మనోహరమైన అనుసంధానం జరుగుతుంది. (కుండలినీ జాగృతి అనేది అద్భుతంగా జరుగుతుంది.)

సశేషం.....
🌹 🌹 🌹 🌹 🌹


#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #అద్భుతసృష్టి


11 Oct 2020

------------------------------------ x ------------------------------------


🌹. అద్భుత సృష్టి - 53 🌹

✍️ . రచన, సంకలనం- DNA స్వర్ణలత గారు
సేకరణ : ప్రసాద్ భరద్వాజ


🌻. యాక్టివేషన్ జరిగేటప్పుడు మనలో వచ్చే మార్పులు - 3 🌻

🌟. 5వ లెవెల్

మన మెంటల్ బాడీ ఆత్మ కు అనుగుణంగా ఉండాలని కోరుకుంటుంది. ఇప్పటివరకు ఉన్న కలల ప్రపంచం మారుతుంది. గొప్ప గొప్ప కలలు ఎరుకతో కనడం జరుగుతుంది. ఆలోచనా ప్రక్రియ సరళంగా మారుతుంది. ప్రశ్న మరి తెలుసుకోవడం మధ్య తేడాను గ్రహిస్తూ ఉంటాం.

✨. సమాజం, తల్లిదండ్రులు, బంధువులు, స్నేహితుల నుండి వచ్చిన అలవాట్లు మార్చబడతాయి. "నేనే అంతా" అనే స్థితి నుండి "మనమంతా ఒక్కటే" అనే స్థితికి మారుతాం.(మమాత్మా సర్వభూతాత్మ స్థితి) పాత భావాలన్నీ తొలగించబడి కొత్త భావాలను రీ ప్రోగ్రామింగ్ చేయడం జరుగుతుంది.

✨. ప్రతి విషయాన్నీ అర్థం చేసుకుంటూ తీర్పు ఇచ్చే మెంటాలిటీ నుండి హృదయం ద్వారా స్పందించే గుణానికి రీప్రోగ్రామింగ్ చేయబడతాం.

✨. కలల ద్వారా వివేచనావంతమైన మరి సరళమైన ఆలోచనా విధానాన్ని అభివృద్ధి పరచుకుంటాం. పాత ఆలోచనా విధానం అంతా మార్చబడి శరీరం నుండి విడుదల చేయబడుతుంది. "నేను ఎవరు?" అనే ప్రశ్న తలెత్తుతుంది. "ఎవరు?" అన్న ప్రశ్నకు సమాధానం వెతకటం ప్రారంభిస్తాం.

🌟. 6వ లెవెల్:-

పరస్పర మద్దతును ఇచ్చిపుచ్చుకుంటూ ఒక్కొక్కరి ఎదుగుదలకు సహకరించుకుంటూ ఉంటాం.

సంబంధ బాంధవ్యాలలో, ఉద్యోగ, వ్యాపారాలలో అధిక మార్పులు సంభవిస్తాయి. మన యొక్క ఫ్రీక్వెన్సీ మార్పుల వలన ఇప్పటివరకు ఉన్న స్నేహితులు మారి..కొత్తవారు పరిచయం అవుతూ ఉంటారు అంటే మన సంబంధబాంధవ్యాలు అప్ గ్రేడ్ అవుతూ ఉంటాయి.

✨. 33% అధిక శక్తి పొందుతూ అంతరంగ శక్తులను మేల్కొల్పడం జరుగుతుంది.

ఆత్మ విస్తారమైన అవగాహన కలిగి ఉంటుంది. రియాలిటీ యొక్క జ్ఞానాన్ని ఎప్పటికప్పుడు అందిస్తూ లైట్ తో పనిచేసే లాగా మనల్ని ప్రోత్సహిస్తుంది. మీరు భౌతిక పదార్థం కాదని మల్టీ డైమెన్షనల్ బీయింగ్ అని తెలియజేస్తుంది. unconditional love షరతులు లేని ప్రేమను కలిగి ఉంటుంది. కరుణ ను కలిగి ఉంటాం. దీని వలన తమ జీవితాలకు ఇతరుల యొక్క జీవితాలకు సేవ చేయడం జరుగుతుంది.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹


#చైతన్యవిజ్ఞానం #ChaitanyaVijnanam #PrasadBhardwaj #అద్భుతసృష్టి


12 Oct 2020

------------------------------------ x ------------------------------------

🌹. అద్భుత సృష్టి - 54 🌹

✍️ . రచన, సంకలనం- DNA స్వర్ణలత గారు
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🌻. యాక్టివేషన్ జరిగేటప్పుడు మనలో వచ్చే మార్పులు - 4 🌻

🌟. 7వ లెవెల్:-


హృదయ చక్రం తెరవబడి భావోద్వేగాల విషయంలో దృష్టిని సాధించడం జరుగుతుంది. పాత భావాలు భావోద్వేగాలను మరింతగా రిలీజ్ చేస్తూ ఉంటాం.(ఇది మరింతగా భావోద్వేగాల మార్పు సమయం అని చెప్పవచ్చు.)ప్రతి పని కూడా పిల్లల్లాగా స్వచ్ఛమైన మనస్సుతో చేయడం జరుగుతుంది. వాస్తవంలో జీవించడం జరుగుతుంది.

✨. మనం ప్రతి చిన్న ఫీలింగ్ ని కూడా అర్థం చేసుకుంటూ ఉంటాం. ప్రతి క్షణంలో మరింత అనుభూతిని చెందుతూ ఉంటాం. పాత సంబంధాలు దూరమౌతూ ఉంటాయి.

✨. చాతి నొప్పి మరింత సహజంగా అనిపిస్తుంది.

దీనికి కారణం గుండె శక్తిక్షేత్రాలు(హృదయ చక్రం) మరింతగా తెరవబడి విశ్వమూలశక్తితో అనుసంధానం అవుతుంటాయి.(ఇక్కడ చక్రా మెడిటేషన్ చాలా బాగా ఉపయోగపడుతుంది)

✨. హృదయంలో నిక్షిప్తమై ఉన్న భయాలు తొలగించబడతాయి. శరీరాలు, శక్తిక్షేత్రాలు సమలేఖనంలోనికి తీసుకునిరాబడతాయి.

✨. పీనియల్ మరి పిట్యూటరీ గ్రంథులు మరింతగా తెరవబడతాయి. వీటిలో ఉన్న శక్తులు జాగృతి అవుతూ వృద్ధాప్యాన్నీ, మరణాన్నీ శరీరానికి దూరం చేస్తూ ఉంటాయి. నుదురుచక్రం, తల వెనుక చక్రంలో అధిక ఒత్తిడి కలిగి తలనొప్పి విపరీతంగా అనిపిస్తుంది.

✨. పీనియల్ గ్రంథి మరింతగా ఓపెన్ అయ్యి అది మల్టీడైమెన్షనల్ గా ఎదుగుతూ ఉంటుంది. ఈ సమయంలో ద్వంద్వత్వం మరింతగా బయటకు కనిపిస్తూ ఉంటుంది.

✨. ఈ సమయంలో కొన్ని రోజులు "ఆనందంతో ఉన్నాం" అనిపిస్తుంది. మరి కొన్ని రోజులు భయంతో గడుపుతూ ఉంటాం. 

✨. ఆత్మతో అనుసంధానం పెరుగుతుంది. దీనివలన మనం మరింతగా అధిరోహణ పొందుతూ ఉంటాం. ఈ తరుణంలో భూమిని విడిచి హైయ్యర్ సెల్ఫ్ తో కలిసిపోవాలనిపిస్తూ ఉంటుంది.

✨. ఆనందాన్ని నేర్చుకుంటూ అనుభవిస్తూ ఉంటాం. ఈ స్థితిని గ్రహంపై ఉన్న అందరికీ అనుభవంలోకి తీసుకొని రావాలి అని అనిపిస్తూ ఉంటుంది. దాని కోసం ప్రయత్నాలు ప్రారంభిస్తాం.

✨. ఈ పురోగమన దశ వల్ల మనం తీసుకునే ఆహారంలో మరింత మార్పులు సంభవిస్తాయి. శరీరం సాత్విక ఆహారాన్నే కోరుకుంటుంది.

మాంసం, మద్యం, చక్కెర కెమికల్ ఫుడ్ శరీరానికి హాని కలిగిస్తూ శరీరాన్ని అసెన్షన్ వైపుకు వెళ్ళకుండా చేస్తుంది.

✨. 8వ లెవెల్:-

ఈ స్థితిలో అందరిలో మనం మాస్టరీని చూస్తాం. మరింతగా గ్రహానికి సేవ చేయాలని ఉన్నతంగా కోరుకుంటూ ఉంటాం. ప్రాపంచకంగా శ్రమపడి సంపాదించాలి అనే తత్వాన్ని వదిలివేస్తాం.

✨. పీనియల్ పిట్యుటరీ గ్రంథులు ఇంకా మరింతగా మారుతూ ఉంటాయి. దీని కారణంగా తలనొప్పి వస్తూ ఉంటుంది. మనతో ఉన్న లైట్ బీయింగ్స్ ని తలలో ఉన్న ఎండార్ఫిన్ విడుదల చేసి మనకు మరింత రిలీఫ్ ని కలిగించమని అడుగుదాం!

✨. మెదడు సంక్రియం చేయబడుతూ ఉంటుంది. ముఖ్యంగా సరెబ్రమ్( దీనిని స్లీపింగ్ జాయింట్ అంటారు) విస్తరణ జరుగుతుంది. నుదురులో త్రిభుజాకార సీడ్ స్పటికాలు మరి మెదడు యొక్క కుడివైపున ఉన్న రికార్డర్ స్పటికాలు మరి 8,9,10 చక్రాలు ఆక్టివేట్ చేయబడతాయి.

✨. మనలో జరిగే మార్పులను గురించి చెప్పటానికి మాటలను వెతుక్కోవలసి ఉంటుంది. మరింత గందరగోళంగా ఉంటుంది. మనలో జరుగుతున్న మార్పులను డీ-కోడ్ చేయమని మన చక్రా మాస్టర్స్ ని అడుగుదాం!

✨. ఈ స్థితిలో చాలా గ్రేడింగ్ అవసరమవుతుంది. స్వచ్ఛమైన గాలి, ఆహారం, అధిక ప్రాణశక్తిని గ్రహిస్తూ మరింతగా మెరుగుపడుతూ ఉంటాం. ధ్యానం అత్యద్భుతంగా ఉపయోగపడుతుంది.

✨. ఈథర్ నుండి సంపూర్ణ ఆరోగ్యం పొందుతూ ఉంటాం.

పీనియల్ గ్రంథి సైజు పెరగడం వలన రెండు కనుబొమ్మల మధ్య ఒత్తిడి పెరుగుతుంది. దివ్య నేత్రం యాక్టివేషన్ లోకి వస్తుంది. పిట్యూటరీ గ్రంధి సైజు పెరగడం వలన తల వెనుక భాగంలో ఒత్తిడి పెరుగుతున్నట్లు అనిపిస్తుంది. వీటి ద్వారా మనం ఆత్మ యొక్క మార్గదర్శకత్వాన్నీ ఆత్మ యొక్క నిర్ణయాలు అందుకోవడం ప్రారంభిస్తాం.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

Join and Share చైతన్య విజ్ఞానం Spiritual wisdom Telegram group 
https://t.me/ChaitanyaVijnanam

#ChaitanyaVijnanam#PrasadBhardwaj#చైతన్యవిజ్ఞానం#అద్భుతసృష్టి

13 Oct 2020

------------------------------------ x ------------------------------------


*🌹. అద్భుత సృష్టి - 55 🌹*
✍️ . రచన, సంకలనం- DNA స్వర్ణలత గారు
సేకరణ : ప్రసాద్ భరద్వాజ


*🌻. యాక్టివేషన్ జరిగేటప్పుడు మనలో వచ్చే మార్పులు - 5 🌻*

🌟. *9వ లెవెల్:-*

5వ డైమెన్షనల్ లైట్ బాడీని, 6వ డైమెన్షనల్ బ్లూప్రింట్ అయిన జ్యామితీయ సిస్టమ్ ను డీ- కోడ్ చేయగలుగుతాము. దీని ద్వారా కొత్త టెంప్లేట్స్ మార్చి కాంతి భాషను ఉపయోగిస్తాం.

✨. శక్తి క్షేత్రాలు ఒకదానితో ఒకటి అనుసంధానించబడి మరింతగా విశ్వమూలంతో కలుస్తూ ఉంటాం. భౌతికమైన విషయాలతో, వ్యక్తులతో డిటాచ్ మెంట్ వస్తూ ఉంటుంది.

✨. వభజన, పరిమితి అనే భావాలను తొలగిస్తూ ఉంటాం. కోరికలను విడుదల చేస్తూ నిజమైన స్వేచ్ఛ వైపు ప్రయాణం సాగిస్తాం.
9వ స్థాయి కాంతి దేహం అసెన్షన్ అనేది భౌతిక దేహంలో చూస్తాం. మనం దైవిక యొక్క శక్తులుగా మారుతాం.(భగవంతుని ప్రతినిధులుగా)

✨. 9 వ స్థాయి అనేది భ్రమలను తొలగించుకుని స్వేచ్ఛ వైపు ప్రయాణిస్తూ, మరింత పారవశ్యంలో స్వేచ్ఛా సంకల్పాలను పొందుతూ ఆత్మనుండి మార్గదర్శకత్వాన్ని పొందుతాం. మనుగడ భయాలు నశిస్తాయి. అవి తలెత్తినప్పటికీ అవాస్తవాలు అని వదిలేస్తూ ఉంటాం.

✨. 9 వ స్థాయి ముగిసే సమయానికి పాతభావాలన్నీ తొలగించబడి *"ఐయామ్ ప్రెజెన్స్"* లో కలుస్తాం. జ్యామితి యొక్క అధిక స్థాయిలను అర్థం చేసుకుంటూ.. దైవత్వం స్థాయికి ఎదగటం ప్రారంభిస్తాం. ఒక్కొక్కసారి శరీరం పెరుగుతున్నట్లు, తగ్గుతున్నట్లు అనిపిస్తుంది. ఇలాంటి మార్పులు శరీరంలో ఎన్నో జరుగుతాయి.

🌟 *10వ లెవెల్:-*

2వ ప్రోగు DNA నుండి 12వ ప్రోగుల DNA స్థాయికి ఎదుగుతాం. మూలం యొక్క స్పృహ అధికమవుతుంది. మనలో *"టెలీపోర్టేషన్"* అనేది మొదలవుతుంది.

✨. మర్కాబా(లైట్ బాడీ కి పేరు) నిర్మింపబడుతుంది. ఇది ఇతర పరిధులలోకి, డైమెన్షన్ లోకి వెళ్ళడానికి సహాయపడుతుంది. మనకు మార్గదర్శకత్వం వహించడానికి మన స్పృహ మనకు సహాయం చేస్తుంది. మనం మూలంతో కనెక్ట్ అవుతాం. మనమే గ్రేట్ స్పిరిచ్యువల్ మాస్టర్ గా మరి అవతార్ గా ఎదిగే అవగాహన కలుగుతుంది. మెర్కాబాను యాక్టివేట్ చేయడం వలన టైం, స్పేస్, డైమెన్షనల్ స్థాయిని దాటడం జరుగుతుంది.

🌟 *11వ లెవెల్:-*

లైట్ బాడీ యొక్క అన్ని స్థాయిలు నిర్మించబడతాయి మరి సంక్రియం చేయబడతాయి. స్పిన్ పాయింట్స్ (చక్రాస్) ద్వారా భౌతిక శరీరానికి ఈ శక్తిని అందించడం జరుగుతుంది.

✨. మన దేహంలో ఉన్న లైట్ మాట్రిక్స్ యొక్క భౌతిక ఆక్యుపంక్చర్ మెరీడియన్స్ అన్నీ కూడా కాంతిని సంతరించుకుని 3వ పరిధి సర్క్యుటరీ సిస్టమ్ నుండి మన దేహాన్ని 5వ పరిధి సర్క్యులేటరీ సిస్టానికి మారుస్తుంది. సెల్యులార్ సిస్టమ్ లు పునరుద్ధరించబడతాయి.

✨. గతం, వర్తమానం, భవిష్యత్తు ఏకకాలంలోకి తీసుకొని రాబడతాయి. అన్నీ సమాంతరంగా ఉంటాయి.( ఇక్కడ గత కర్మలు, వర్తమాన కర్మలు, భవిష్యత్తు కర్మలు ఏకకాలంలో తీర్చుకుంటూ ఉంటాం.)
ఆత్మ యొక్క పారవశ్యాన్ని పొందుతూ భూమిపై స్వర్గాన్ని నిర్మిస్తాం.

✨. ఈ స్థితిలో లైట్ యొక్క ద బెస్ట్ టెక్నాలజీని వినియోగిస్తాం. కొత్త కమ్యూనికేషన్ సిస్టమ్ డెవలప్ అవుతుంది. ప్రభుత్వంలో అనేక మార్పులు సంభవించి నూతన సరికొత్త ప్రభుత్వం స్థాపించబడుతుంది. భూమి పైన వనరుల పంపిణీ వ్యవస్థను యాక్సెస్ చేసి సృష్టిస్తాం.

✨. *"స్వర్ణ యుగం"* అనే నూతన సృష్టిని చేస్తాం. దీని కొరకు అందరికీ మనమే ప్రత్యేక శిక్షణను అందిస్తాం. కొత్త శక్తి ప్రసరణ జరిగి అనేక స్థాయిలలో కాంతి లెవెల్స్ పెంచబడతాయి. భగవంతునితో కలిసి పనిచేయడం ప్రారంభిస్తాం. దేవుడు వేరు మనం వేరు కాదని తెలుస్తుంది .
భూమి మీద స్వర్గం నిర్మించడంలో దృష్టిని సారిస్తారు.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

15 Oct 20


------------------------------------ x ------------------------------------

*🌹. అద్భుత సృష్టి  - 56 🌹*
✍️ . రచన, సంకలనం- DNA స్వర్ణలత గారు
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

*🌻. యాక్టివేషన్ జరిగేటప్పుడు మనలో వచ్చే మార్పులు - 6 🌻*

🌟. *12వ లెవెల్*

ఇది చివరి స్థాయి మెర్కాబా యాక్టివేషన్. దీని ద్వారా భూమిపైన డివైన్ ప్లాన్ ని నిర్మించడం జరుగుతుంది.

భూమిపై అసెన్షన్ కోసం విచ్చేసిన సోల్ ఫ్యామిలీని, సోల్ ప్రభుత్వాలను కౌన్సిల్స్ ని కలుస్తారు. వివిధ కమ్యూనిటీస్ తో కొత్త ఆచారాలు అన్నీ కూడా ఆత్మ సార్వభౌమత్వంలో భాగాలుగా మారుతాయి లేదా మేల్కొంటాయి.

✨. నిరంతరం సంతోషకరమైన జీవితాన్ని జీవిస్తూ క్రొత్త ప్రపంచాలను సృష్టించడం జరుగుతుంది. మనం సంపూర్ణత్వంలో ఉంటాం మరి ఈ ప్రపంచంలోనే మరొక క్రొత్త కాంతి ప్రపంచాలను సృష్టిస్తాం.

*🌻. భూమిలో వచ్చే మార్పులు: 🌻*

కొత్త ప్రపంచం వ్యవస్థల సృష్టి అమలు కొనసాగించడం జరుగుతుంది. సరికొత్త ప్రభుత్వాలు ఏర్పడతాయి. కొత్త ఆర్థిక వ్యవస్థ ఏర్పడుతుంది.

మెరుగైన విద్యావ్యవస్థలు, మెరుగైన ఆహారవ్యవస్థలు, వనరుల కేటాయింపులు మొదలైనవి ఉనికిలోనికి వస్తాయి. భూమి అసెన్షన్ చివరిదశ కొరకు DNA 12వ స్థాయి దీక్షను చేపడుతుంది. తద్వారా అందరూ ఆనందంగా సమానత్వం, సామరస్యంతో ఉంటారు.

✨. జనులు కాంతి  గ్రేడ్లకు అనుసంధానం చేయబడి.. గ్రహం,  గ్రహంపై ఉన్న మానవాళి అంతా దైవిక ప్రణాళిక అయిన చివరి దశకు చేరుకొని మరింతగా కీర్తి ప్రకాశంతో, కాంతి అనుసంధానంతో ప్రకాశిస్తూ ఉంటారు.

✨. గ్రహం కాంతిని మరింతగా స్వీకరిస్తూ తన స్థాయిని అభివృద్ధి పరుచుకుంటూ మల్టీస్టార్ సిస్టంలోకి వెళుతుంది. ఇక్కడ ప్రతి ఒక్కరూ లైట్ బాడీగా మరి ఆత్మ యొక్క పూర్తి స్థాయిశక్తితో ప్రతిబింబిస్తూ ఉంటారు.
*-జాన్ముహీన్ వ్రాసిన "ఇన్ రెసొనెన్స్"* పుస్తకం నుండి.

✨. భౌతిక స్థాయిలో  12 లెవెల్స్ లో మార్పులు జరిగిన తర్వాత మన 7 దేహాలు 7 కాంతి శరీరాలుగా అభివృద్ధి చెందుతూ...ఆ స్థాయిలో మూలం వరకూ విస్తరిస్తూ..  విశ్వవ్యాప్తమైన మనం విశ్వమానవునిగా.. దైవిక జీవిగా మారుతాము. ఈ దేహం అమరదేహం అవుతుంది.

*అన్నమయకోశం-- ప్లానెటరీ లైట్ బాడీ*

*ప్రాణమయకోశం--సోలార్ లైట్ బాడీ*

*మనోమయకోశం--ఇంటర్ స్టెల్లార్ లైట్ బాడీ*

*విజ్ఞానమయకోశం--గెలాక్టిక్ లైట్ బాడీ*

*ఆనందమయకోశం--ఇంటర్ గెలాక్టిక్ లైట్ బాడీ*

*విశ్వమయకోశం--యూనివర్సల్ లైట్ బాడీ*

*నిర్వాణమయ కోశం-- మల్టీయూనివర్సల్ లైట్ బాడీ*

ఈ స్థాయికి ఎదిగి మనం అమరులుగా మారుతాం. ఈ దేహం అమరదేహం  అవుతుంది. ఈ భూమి మీద ఉంటూనే విశ్వకార్యక్రమాలన్నింటికీ బాధ్యత వహిస్తాం. *"డివైన్ గైడ్ ( దివ్య మానవునిగా దివ్య మార్గదర్శకులుగా) మారుతాం.*
*ఉదా:- మహావతార్ బాబాజీ"*

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

16 Oct 2020

------------------------------------ x ------------------------------------

------------------------------------ x ------------------------------------


No comments:

Post a Comment