శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 544 - 3 / Sri Lalitha Chaitanya Vijnanam - 544 - 3


🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 544 - 3 / Sri Lalitha Chaitanya Vijnanam - 544 - 3 🌹

🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻

✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్

సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁

🍀 111. పుణ్యకీర్తిః, పుణ్యలభ్యా, పుణ్యశ్రవణ కీర్తనా ।
పులోమజార్చితా, బంధమోచనీ, బంధురాలకా ॥ 111 ॥ 🍀

🌻 544. 'పుణ్యశ్రవణ కీర్తనా' - 3 🌻


కీర్తనము సుప్రసిద్ధమగు దేవతా ప్రశంస. దైవ ప్రశంసకు భజన, కీర్తన భారతీయ సంప్రదాయమున ప్రసిద్ధి గాంచినవి. కీర్తన ద్వారా భగవత్ స్మరణము రుచికరముగ సాగును. కీర్తన చేయుకొలది రుచి పెరుగుచు నుండును. తన్మయత్వము సిద్ధించును. భక్తి పారవశ్యమున కీర్తనము చేయుచుండగ శ్రీమాత సంతసమున దరి చేరును. సాన్నిధ్య మిచ్చును. శ్రవణము, కీర్తనము దైవమును చేరుటకు గల నవ విధ ఉపాయములలో ప్రధానమైనవి. అందరికిని అందుబాటులో నుండునవి. కలి యుగమందు నామ సంకీర్తనయే ప్రధానమని భాగవతము తెలుపుచున్నది.


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 544 - 3 🌹

Contemplation of 1000 Names of Sri Lalitha Devi

✍️ Prasad Bharadwaj

🌻 111. Punyakirtih punyalabhya punyashravana kirtana
pulomajarchita bandhamochani bandhuralaka ॥111 ॥ 🌻

🌻 544. 'Punyashravana Kirtana' - 3 🌻


The hymn is a well-known praise of the goddess. Bhajans and kirtans in praise of God are popular in Indian tradition. Remembrance of god through kirtan is tasteful. The taste of increases as the kirtan proceeds. Concentration is achieved. When kirtan is done in devotional ecstasy Srimata comes nearer in appreciation. Gives close proximity. Listening and glorifying are the key ways amongst nine to reach God. Available to all. The Bhagavata states that Nama Sankīrtana is important in Kali Yuga.


Continues...

🌹 🌹 🌹 🌹 🌹


Examining the roots of Faith is Necessary for Aspirants / విశ్వాసం యొక్క మూలాలను పరిశీలించడం సాధకులకు అవసరం


🌹 విశ్వాసం యొక్క మూలాలను పరిశీలించడం సాధకులకు అవసరం / Examining the roots of Faith is Necessary for Aspirants 🌹

✍️ ప్రసాద్‌ భరధ్వాజ


మనం సరైన వాళ్లమని అనుకోవడం అంటే అందరూ తప్పు అని అనుకోవడం లాంటిదే. ఈ రకమైన అహంకారం జ్ఞానం మరియు అవగాహన యొక్క తీవ్రమైన లోపాన్ని ప్రతిబింబిస్తుంది. అలాంటి అసహనం మరియు ద్వేషం, తిరుగుబాటుకు దారి తీస్తుంది. అంతే కాకుండా ఇది సత్యాన్ని కనుగొనకుండా నిరోధిస్తుంది. మన తప్పులు మరియు బలహీనతలను సంపూర్ణ నిష్పక్షపాతంగా పరిశీలించుకుంటే తప్ప ఆత్మ సాక్షాత్కారం అసాధ్యం. అవాంఛిత కలుపుతో ఎటువంటి అనుబంధం లేని తెలివైన రైతు వలె మన నమ్మకాలు మరియు మన విశ్వాసాల మూలాలకు మనం మొగ్గు చూపాలి. అవాంఛితమైన వాటిని గుర్తించి, మోహం లేకుండా బయటకు విసిరి వేయాలి.

అలాగే మన చెడు అలవాట్లను మరియు హానికరమైన ప్రవర్తనా విధానాలను కూడా విసిరి వేయాలి. తద్వారా వచ్చే మార్పు మనకున్న ధృడత్వం మరియు స్థిరత్వం యొక్క లోపాలను సూచిస్తున్నాయని మనం అనుకోకూడదు. పరమ సత్యాన్ని గ్రహించడానికి స్వీయ పరివర్తన అవసరం మరియు అనివార్యం. మనల్ని మనం ఆత్మగా గ్రహించాలంటే మనల్ని మనం పునః నిర్మించుకోవాలి. మనలో ఉన్న పక్షపాతాలు, అపసవ్య నమ్మకాలు మరియు సిద్ధాంతాలు, మన స్వీయ ఆత్మ సాక్షాత్కార లక్ష్యం నుండి మనల్ని మరింత దూరంగా తీసుకు వెళతాయి. కనుక ఇటువంటి వాటి పట్ల సాధకులు సదా అప్రమత్తంగా ఉండాలి.

🌹🌹🌹🌹🌹




🌹 Examining the roots of Faith is Necessary for Aspirants 🌹

Prasad Bharadwaj


To think that we are right is the same as thinking that every one else is wrong. This kind of pride reflects a serious lack of knowledge and wisdom. Such intolerance leads to hatred and rebellion and it also prevents us from discovering the truth. Self realization is impossible unless we are willing to examine our mistakes and weaknesses with absolute impartiality. We should tend to the roots of our beliefs and our faith like the clever farmer who does not have any attachment to the unwanted weed and pulls it out with objective lack of attachment.

Just like that, we should also throw away our bad habits and detrimental behavior patterns. We must not think that this change reflects a lack of strength and stability. Self transformation is essential and indispensable for the realization of the truth. We must re-build ourselves if we want to be realized souls: bias, prejudice, and dogma can only take us further from this goal. So seekers should always be alert about such things.

🌹🌹🌹🌹🌹


సిద్దేశ్వరయానం - 58 Siddeshwarayanam - 58

🌹 సిద్దేశ్వరయానం - 58 🌹

💐 శ్రీ సిద్దేశ్వరానంద భారతీ స్వామి విరచిత 💐

🏵 శిష్యురాలు భైరవీ బ్రాహ్మణి 🏵


యోగేశ్వరి మరునాడు సాయంకాలం మళ్ళీ ఆశ్రమానికి వెళ్ళేసరికి కాళీయోగి బయటకు వెళ్ళే ప్రయత్నంలో ఉన్నట్లు కన్పించింది. వారితో పాటు వారి పరివారము కొద్దిమంది బయలుదేరుతున్నారు. ఎక్కడికి వెడుతున్నారని నెమ్మదిగా పరివారంలో ఒకరిని అడిగింది. సనాతనగోస్వామి సమాధిదగ్గరకు, హితహరివంశ మహరాజ్ అదృశ్యమైన స్థలానికి వెడుతున్నట్లు చెప్పబడింది. వారితో పాటు తానుకూడా అక్కడికి వస్తానని అభ్యర్థించగా యోగి సరేనన్నాడు. ఆ రెండు చోట్లకూడా, పూర్వమహానీయులతో వారు మాట్లాడుతూనే ఉన్నట్లున్నది. అక్కడ నుండి మళ్ళీ రూపగోస్వామి సమాధిమందిరానికి వచ్చిన తరువాత శిష్యులంతా నమస్కరించి వెళ్ళిపోయినారు. యోగేశ్వరి ఒక్కతే మిగిలి ఉన్నది. యోగి విశ్రాంతిగా కూర్చున్న తరువాత, ఆమె నిన్న తాను పొందిన దర్శనాన్ని గూర్చి అడుగుదామని అనుకొంటూ ఉండగా యోగి ఇలా అన్నారు.

యోగి : అమ్మా ! నిన్న నీవు పొందిన అనుభవాన్ని గూర్చి అడగాలని అనుకొంటున్నావు. రాధాభక్తురాలివయిన నీకు కాళీదేవితో జన్మాంతర బంధం ఉండటం వల్ల నీకా అనుభూతి ఇవ్వబడింది. నీవు దర్శించిన కాళీదేవి విగ్రహం ఇక్కడకు కొన్ని వందల మైళ్ళ దూరంలో ఒక మహారణ్యంలోని నా ఆశ్రమంలో ఉన్నది. బృందావనంతోను ఇంతకముందు ఇక్కడ జీవించిన గోస్వాములతోను, భక్తులతోను ఉన్న అనుబంధం వల్ల వారు భౌతికశరీరాలతో ఉన్నప్పుడు ఏర్పడిన మైత్రిని పురస్కరించుకొని, వారు పాంచభౌతిక శరీరాలు విడచిపెట్టినా రాధాదేవి పరివారంలో మంజరులుగా మారిపోయినారు. నాకు దీర్ఘాయువు ఉండటం వల్ల ఇక్కడకు వచ్చి వారిని పలకరిస్తుంటాను. కాళీదేవి అనుగ్రహంవల్ల ఇప్పటికి కొన్ని వందల సంవత్సరాల నుండి జీవించియున్నాను. ఇక్కడి పెద్దల వల్ల నీవూ కొంతవిన్నావు. నీకు నిన్న ఇవ్వబడిన అనుభూతి కాళీదేవి యొక్క అనుగ్రహము నీలో పునర్వికసిత మవుతున్నదనటానికి గుర్తు. నిన్ను ఎన్నో జన్మలనుండి ఎరుగుదును. నీ వెవరో నీకు సంబంధించిన వివరాలు నీవే తెలుసుకొంటే నీకు సంతృప్తి కరంగా ఉంటుంది. ఆ స్థితి రావటానికి నీవు తీవ్రతపస్సు చేయాలి. వేగంగా రావాలంటే తాంత్రిక సాధనలు చేయాలి. అదినీ సంకల్పం మీద, భగవతి మహాకాళి కృపమీద ఆధారపడి ఉన్నది. నేనింక రెండు రోజులలో ఇక్కడ నుంచి బయలుదేరి వెడుతున్నాను. నీ మార్గం నిశ్చయించుకోవలసినదానిని నీవే.

యోగేశ్వరి : మీ మాటలు వింటూంటే నాలో ఏదో కొత్తమార్పు వస్తున్నది. నేను ఆలోచించుకొని రేపు మీ దర్శనానికి వస్తాను. మీ కరుణాకటాక్షములు నామీద ప్రసరించాలని ప్రార్థిస్తున్నాను.

యోగి : తథాస్తు.

యోగీశ్వరి ఇంటికి వెళ్ళిపోయింది. ఆ రాత్రంతా ఎడతెగని ఆలోచనలు. "ఇప్పుడు నేనేమి చేయాలి ? కాళీయోగి ఇచ్చిన అనుభూతివల్ల ఆయన మాటల వల్ల తెలియని దివ్యలోకాల తలుపులు తెరుచుకొంటున్నవి. మొదటి నుండి ఆధ్యాత్మిక రంగంలో ఉన్నతస్థానం సాధించాలన్న తపన లోలోపల అగ్నిజ్వాలవలె రగులుతున్నది. దానిని సాధించాలంటే కఠోర తపస్సాధన చేయాలి. వయస్సు వచ్చింది కనుక పెళ్ళికి ఇప్పటికే ఆలస్యమయిందని అమ్మ గొడవ చేస్తున్నది. ఇంట్లో ఉంటే ఎక్కువకాలం పెళ్లిని ఆపటం సాధ్యం కాదు. కనుక గార్హస్థ్యబంధంలో ఇరుక్కోకుండా తాను సిద్ధయోగినిగా మారాలి.

బృందావన ధామంలో అనన్యమైన రాధాకృష్ణభక్తి మార్గాన్ని తప్ప మరొకదానిని గూర్చి ఇక్కడి భక్తులు ఆలోచించరు. మంత్రశక్తుల యందు దీర్ఘాయువు నందు తాంత్రికసాధనల యందు ఇక్కడ ఆశ్రమాధిపతులకు గాని వారి శిష్యులకు గాని ఆసక్తి లేదు. నాకు రాధాకృష్ణుల యందు భక్తి ఉన్నది. కానీ దానితో పాటు సిద్ధులయందు కూడా మోజు ఉన్నది. ఆ కాళీయోగి ఎప్పటివాడో ? 300 ఏండ్లు దాటుతున్నా ముసలితనం రాలేదు. నేను కూడా ఆ విధంగా దీర్ఘాయురారోగ్యములు సాధించగలనా ?

జరాభారంపైన పడకుండా ఆపగలనా? ఇవన్నీ సాధించాలంటే సిద్ధుడైన గురువు యొక్క సహాయం లేకుండా సాధ్యంకాదు. కన్పిస్తున్నంతలో ఒక్క కాళీయోగి మాత్రమే చేయగలిగిన పని ఇది. కనుక నా జీవిత లక్ష్యం నెరవేరాలంటే ఆయనతో వెళ్ళాలి. వారి ఆశ్రమంలో వారి నీడలో ఉండి, ఆయన అనుగ్రహంతోనే ననుకొన్నది సాదించాలి. ఒకసారి ఆయనతో వెళ్ళిపోతే తిరిగి ఎప్పటి రాగలనో, చెప్పకుండా వెడితే ఏమయినానో ! అని అమ్మ దిగులు పడుతుంది. చెప్పితే పోనీయరు” ఇలా పరిపరివిధాల ఆలోచించి ఆమె ఒక నిశ్చయానికి వచ్చింది.


( సశేషం )

🌹🌹🌹🌹🌹


శ్రీ శివ మహా పురాణము - 884 / Sri Siva Maha Purana - 884


🌹 . శ్రీ శివ మహా పురాణము - 884 / Sri Siva Maha Purana - 884 🌹

✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి 📚. ప్రసాద్ భరద్వాజ

🌴. రుద్రసంహితా-యుద్ద ఖండః - అధ్యాయము - 39 🌴

🌻. శంఖచూడుని సైన్యమును వధించుట - 4 🌻


మరల శివశంఖచూడుల మధ్య పెద్ద యుద్ధము చెలరేగెను. పర్వతములు, సరస్సులు మరియు సముద్రములతో కూడియున్న భూమి మరియు స్వర్గము కూడ కంపించెను (29). ఆ యుద్ధములో శంఖచూడుడు ప్రయోగించిన బాణములను శివుడు, శివుడు ప్రయోగించిన వేలాది బాణములను శంఖచూడుడు అనేక పర్యాయములు తమ తమ వాడి బాణములతో ఛేదించిరి (30). అపుడు శంభుడు కోపించి త్రిశూలముతో వానిని కొట్టగా, ఆ దెబ్బకు తాళజాలక ఆతడు మూర్ఛిల్లి నేలపై బడెను (31). అపుడా రాక్షసుడు క్షణములో తెలివి దెచ్చుకొని ధనస్సును ఎక్కుపెట్టి రుద్రుని, ఆయన అనుచరులనందరినీ బాణములతో కొట్టెను (32).

ప్రతాపవంతుడగు శంఖచూడుడు పదివేల బాహువులను పొంది ఒక్కసారిగా పదివేల చక్రములతో శంకరుని కప్పివేసెను (33). అపుడు దుర్గకు భర్త, దుర్గమములగు కష్టములనుండి గట్టెక్కించువాడు నగు రుద్రుడు కోపించి వెంటనే ఉత్తమములగు తన బాణములతో ఆ చక్రములను ఛేదించెను (34). అపుడా దానవుడు పెద్ద సేనతో గూడి గదను చేతబట్టి వెంటనే శివుని కొట్టుటకై వేగముగా ముందునకురికెను (35). దుష్టుల మదమునడంచు ఆ శివుడు మిక్కిలి కోపించి వేగముగా మీద పడబోవుచున్న ఆ శంఖచూడుని గదను పదునైన కత్తితో ముక్కలుగా చేసెను (36).


సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹




🌹 SRI SIVA MAHA PURANA - 884 🌹

✍️ J.L. SHASTRI, 📚. Prasad Bhadwaj

🌴 Rudra-saṃhitā (5): Yuddha-khaṇḍa - CHAPTER 39 🌴

🌻 The annihilation of the army of Śaṅkhacūḍa - 4 🌻


29. Again the great battle between Śiva and the Dānava was resumed. The heaven and the earth including all mountains, oceans and rivers shook and trembled.

30. Śiva split up the arrows discharged by the son of Dambha by means of hundred and thousands of his fierce arrows. Similarly the arrows of Śiva were split up by the Dānava.

31. Then the infuriated Śiva hit him with his trident. Unable to bear that blow he fell unconscious on the ground.

32. The Asura regained consciousness rapidly. He seized his bow and hit Rudra and all others by means of his arrows.

33. The valorous Saṅkhacūḍa assumed ten thousand arms by means of magic and rapidly enveloped Śiva by means of ten thousand discuses.

34. Then Śiva, the infuriated consort of Durgā, the destroyer of all insurmountable distress split the discuses rapidly by means of his excellent arrows.

35. Then the Dānava seized his mace and accompanied by a huge army rushed at Śiva with the intention to kill him.

36. The infuriated Śiva, the destroyer of the pride of the wicked split the mace of the Dānava rushing headlong by means of a sharp-edged sword.


Continues....

🌹🌹🌹🌹🌹


శ్రీమద్భగవద్గీత - 530: 14వ అధ్., శ్లో 06 / Bhagavad-Gita - 530: Chap. 14, Ver. 06

 

🌹. శ్రీమద్భగవద్గీత - 530 / Bhagavad-Gita - 530 🌹

✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 14వ అధ్యాయము - గుణత్రయ విభాగ యోగము - ప్రకృతి త్రిగుణములు - 6 🌴

06. తత్ర సత్త్వం నిర్మలత్వాత్ ప్రకాశమనామయమ్ |
సుఖసఙ్గేన బధ్నాతి జ్ఞానసఙ్గేన చానఘ ||


🌷. తాత్పర్యం : ఓ పాపరహితుడా! సత్త్వగుణము మిగిలిన రెండు గుణముల కన్నను పవిత్రమైనదగుటచే ప్రకాశమానమై మనుజుని సర్వపాపఫలము నుండి ముక్తుని చేయును. ఆ గుణము నందున్న వారు సుఖభావన చేతను, జ్ఞానభావన చేతను బద్ధులగుదురు.

🌷. భాష్యము : భౌతికప్రకృతిచే బద్ధులయ్యెడి జీవులు పలురకములుగా నుందురు. వారిలో ఒకడు సుఖిగా గోచరించును, వేరొకడు క్రియాశీలుడుగా కనిపించును, మరి ఇంకొకడు నిస్సహాయునిగా నుండును. మనస్సునకు సంబంధించిన ఇట్టి భావములే ప్రకృతి యందు జీవుల బద్దస్థితికి కారణములగుచున్నవి. జీవులెట్లు వివిధరీతులుగా బంధితులగుదురో ఈ అధ్యాయమున వివరింపబడినది. అట్టి బంధకారణములలో మొదట ఇచ్చట సత్త్వగుణము పరిశీలింపబడుచున్నది. సత్త్వగుణము నలవరచుకొనుట ద్వారా మనుజుడు బద్ధులైన ఇతర గుణములవారి కన్నను బుద్ధిమంతుడగును. జగములో సత్త్వగుణాభివృద్ధి యొక్క ఫలమిదియే.

ఆ విధముగా సత్త్వగుణమును వృద్ధిచేసికొనినవాడు భౌతికక్లేశములచే అంతగా ప్రభావితుడు కాడు. అంతియేగాక అట్టివాడు జ్ఞానమును పొందవలెనను భావనయు కలిగియుండును. అట్లు సత్త్వగుణము నందు స్థితుడై యుండవలెను. సత్త్వగుణము నందలి సుఖభావనకు మనుజుడు తాను దాదాపు సర్వపాపముల నుండి ముక్తిని పొందియున్నాననెడి అవగాహనయే కారణము. కాని వాస్తవమునకు వేదంజ్ఞానము ప్రకారము సత్త్వగుణమనగా ఉన్నతమైన జ్ఞానము మరియు అధికతరమైన సుఖభావనమని భావము. కాని వచ్చిన చిక్కేమనగా జీవుడు సత్త్వగుణమునందు స్థితుడైనంతనే తాను జ్ఞానాభివృద్ధి నొందితిననియు మరియు ఇతరులకన్నను మెరుగనియు తలచును. ఈ విధముగా అతడు బద్ధుడగును.

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Bhagavad-Gita as It is - 530 🌹

✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj

🌴 Chapter 14 - Gunatraya Vibhaga Yoga - Nature, 3 Gunas - 06 🌴

06. tatra sattvaṁ nirmalatvāt prakāśakam anāmayam
sukha-saṅgena badhnāti jñāna-saṅgena cānagha


🌷 Translation : O sinless one, the mode of goodness, being purer than the others, is illuminating, and it frees one from all sinful reactions. Those situated in that mode become conditioned by a sense of happiness and knowledge.

🌹 Purport : The living entities conditioned by material nature are of various types. One is happy, another is very active, and another is helpless. All these types of psychological manifestations are causes of the entities’ conditioned status in nature. How they are differently conditioned is explained in this section of Bhagavad-gītā. The mode of goodness is first considered. The effect of developing the mode of goodness in the material world is that one becomes wiser than those otherwise conditioned. A man in the mode of goodness is not so much affected by material miseries, and he has a sense of advancement in material knowledge.

The representative type is the brāhmaṇa, who is supposed to be situated in the mode of goodness. This sense of happiness is due to understanding that, in the mode of goodness, one is more or less free from sinful reactions. Actually, in the Vedic literature it is said that the mode of goodness means greater knowledge and a greater sense of happiness. The difficulty here is that when a living entity is situated in the mode of goodness he becomes conditioned to feel that he is advanced in knowledge and is better than others. In this way he becomes conditioned.

🌹 🌹 🌹 🌹 🌹


🌹 09, MAY 2024 THURSDAY ALL MESSAGES గురువారం, బృహస్పతి వాసర సందేశాలు🌹

🍀🌹 09, MAY 2024 THURSDAY ALL MESSAGES గురువారం, బృహస్పతి వాసర సందేశాలు🌹🍀
1) 🌹. శ్రీమద్భగవద్గీత - 530 / Bhagavad-Gita - 530 🌹
🌴. 13వ అధ్యాయము - క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగం - ప్రకృతి, పురుషుడు, చైతన్యము - 41 / Chapter 13 - Kshetra Kshtrajna Vibhaga Yoga - Nature, the Enjoyer and Consciousness - 41 🌴
2) 🌹. శ్రీ శివ మహా పురాణము - 884 / Sri Siva Maha Purana - 884 🌹
🌻. శంఖచూడుని సైన్యమును వధించుట - 4 / The annihilation of the army of Śaṅkhacūḍa - 4 🌻
3) 🌹 సిద్దేశ్వరయానం - 58 🌹
5) 🌹 విశ్వాసం యొక్క మూలాలను పరిశీలించడం సాధకులకు అవసరం / Examining the roots of Faith is Necessary for Aspirants 🌹
6) 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 544 - 3 / Sri Lalitha Chaitanya Vijnanam - 544 - 3 🌹 
🌻 544. 'పుణ్యశ్రవణ కీర్తనా' - 3 / 544. 'Punyashravana Kirtana' - 3 🌻

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీమద్భగవద్గీత - 530 / Bhagavad-Gita - 530 🌹*
*✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ*

*🌴. 14వ అధ్యాయము - గుణత్రయ విభాగ యోగము - ప్రకృతి త్రిగుణములు - 6 🌴*

*06. తత్ర సత్త్వం నిర్మలత్వాత్ ప్రకాశమనామయమ్ |*
*సుఖసఙ్గేన బధ్నాతి జ్ఞానసఙ్గేన చానఘ ||*

*🌷. తాత్పర్యం : ఓ పాపరహితుడా! సత్త్వగుణము మిగిలిన రెండు గుణముల కన్నను పవిత్రమైనదగుటచే ప్రకాశమానమై మనుజుని సర్వపాపఫలము నుండి ముక్తుని చేయును. ఆ గుణము నందున్న వారు సుఖభావన చేతను, జ్ఞానభావన చేతను బద్ధులగుదురు.*

*🌷. భాష్యము : భౌతికప్రకృతిచే బద్ధులయ్యెడి జీవులు పలురకములుగా నుందురు. వారిలో ఒకడు సుఖిగా గోచరించును, వేరొకడు క్రియాశీలుడుగా కనిపించును, మరి ఇంకొకడు నిస్సహాయునిగా నుండును. మనస్సునకు సంబంధించిన ఇట్టి భావములే ప్రకృతి యందు జీవుల బద్దస్థితికి కారణములగుచున్నవి. జీవులెట్లు వివిధరీతులుగా బంధితులగుదురో ఈ అధ్యాయమున వివరింపబడినది. అట్టి బంధకారణములలో మొదట ఇచ్చట సత్త్వగుణము పరిశీలింపబడుచున్నది. సత్త్వగుణము నలవరచుకొనుట ద్వారా మనుజుడు బద్ధులైన ఇతర గుణములవారి కన్నను బుద్ధిమంతుడగును. జగములో సత్త్వగుణాభివృద్ధి యొక్క ఫలమిదియే.*

*ఆ విధముగా సత్త్వగుణమును వృద్ధిచేసికొనినవాడు భౌతికక్లేశములచే అంతగా ప్రభావితుడు కాడు. అంతియేగాక అట్టివాడు జ్ఞానమును పొందవలెనను భావనయు కలిగియుండును. అట్లు సత్త్వగుణము నందు స్థితుడై యుండవలెను. సత్త్వగుణము నందలి సుఖభావనకు మనుజుడు తాను దాదాపు సర్వపాపముల నుండి ముక్తిని పొందియున్నాననెడి అవగాహనయే కారణము. కాని వాస్తవమునకు వేదంజ్ఞానము ప్రకారము సత్త్వగుణమనగా ఉన్నతమైన జ్ఞానము మరియు అధికతరమైన సుఖభావనమని భావము. కాని వచ్చిన చిక్కేమనగా జీవుడు సత్త్వగుణమునందు స్థితుడైనంతనే తాను జ్ఞానాభివృద్ధి నొందితిననియు మరియు ఇతరులకన్నను మెరుగనియు తలచును. ఈ విధముగా అతడు బద్ధుడగును.*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Bhagavad-Gita as It is - 530 🌹*
*✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj*

*🌴 Chapter 14 - Gunatraya Vibhaga Yoga - Nature, 3 Gunas - 06 🌴*

*06. tatra sattvaṁ nirmalatvāt prakāśakam anāmayam*
*sukha-saṅgena badhnāti jñāna-saṅgena cānagha*

*🌷 Translation : O sinless one, the mode of goodness, being purer than the others, is illuminating, and it frees one from all sinful reactions. Those situated in that mode become conditioned by a sense of happiness and knowledge.*

*🌹 Purport : The living entities conditioned by material nature are of various types. One is happy, another is very active, and another is helpless. All these types of psychological manifestations are causes of the entities’ conditioned status in nature. How they are differently conditioned is explained in this section of Bhagavad-gītā. The mode of goodness is first considered. The effect of developing the mode of goodness in the material world is that one becomes wiser than those otherwise conditioned. A man in the mode of goodness is not so much affected by material miseries, and he has a sense of advancement in material knowledge.*

*The representative type is the brāhmaṇa, who is supposed to be situated in the mode of goodness. This sense of happiness is due to understanding that, in the mode of goodness, one is more or less free from sinful reactions. Actually, in the Vedic literature it is said that the mode of goodness means greater knowledge and a greater sense of happiness. The difficulty here is that when a living entity is situated in the mode of goodness he becomes conditioned to feel that he is advanced in knowledge and is better than others. In this way he becomes conditioned.*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 . శ్రీ శివ మహా పురాణము - 884 / Sri Siva Maha Purana - 884 🌹* 
*✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి 📚. ప్రసాద్ భరద్వాజ*

*🌴. రుద్రసంహితా-యుద్ద ఖండః - అధ్యాయము - 39 🌴*

*🌻. శంఖచూడుని సైన్యమును వధించుట - 4 🌻*

*మరల శివశంఖచూడుల మధ్య పెద్ద యుద్ధము చెలరేగెను. పర్వతములు, సరస్సులు మరియు సముద్రములతో కూడియున్న భూమి మరియు స్వర్గము కూడ కంపించెను (29). ఆ యుద్ధములో శంఖచూడుడు ప్రయోగించిన బాణములను శివుడు, శివుడు ప్రయోగించిన వేలాది బాణములను శంఖచూడుడు అనేక పర్యాయములు తమ తమ వాడి బాణములతో ఛేదించిరి (30). అపుడు శంభుడు కోపించి త్రిశూలముతో వానిని కొట్టగా, ఆ దెబ్బకు తాళజాలక ఆతడు మూర్ఛిల్లి నేలపై బడెను (31). అపుడా రాక్షసుడు క్షణములో తెలివి దెచ్చుకొని ధనస్సును ఎక్కుపెట్టి రుద్రుని, ఆయన అనుచరులనందరినీ బాణములతో కొట్టెను (32).*

*ప్రతాపవంతుడగు శంఖచూడుడు పదివేల బాహువులను పొంది ఒక్కసారిగా పదివేల చక్రములతో శంకరుని కప్పివేసెను (33). అపుడు దుర్గకు భర్త, దుర్గమములగు కష్టములనుండి గట్టెక్కించువాడు నగు రుద్రుడు కోపించి వెంటనే ఉత్తమములగు తన బాణములతో ఆ చక్రములను ఛేదించెను (34). అపుడా దానవుడు పెద్ద సేనతో గూడి గదను చేతబట్టి వెంటనే శివుని కొట్టుటకై వేగముగా ముందునకురికెను (35). దుష్టుల మదమునడంచు ఆ శివుడు మిక్కిలి కోపించి వేగముగా మీద పడబోవుచున్న ఆ శంఖచూడుని గదను పదునైన కత్తితో ముక్కలుగా చేసెను (36).*

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 SRI SIVA MAHA PURANA - 884 🌹*
*✍️ J.L. SHASTRI, 📚. Prasad Bhadwaj *

*🌴 Rudra-saṃhitā (5): Yuddha-khaṇḍa - CHAPTER 39 🌴*

*🌻 The annihilation of the army of Śaṅkhacūḍa - 4 🌻*

29. Again the great battle between Śiva and the Dānava was resumed. The heaven and the earth including all mountains, oceans and rivers shook and trembled.

30. Śiva split up the arrows discharged by the son of Dambha by means of hundred and thousands of his fierce arrows. Similarly the arrows of Śiva were split up by the Dānava.

31. Then the infuriated Śiva hit him with his trident. Unable to bear that blow he fell unconscious on the ground.

32. The Asura regained consciousness rapidly. He seized his bow and hit Rudra and all others by means of his arrows.

33. The valorous Saṅkhacūḍa assumed ten thousand arms by means of magic and rapidly enveloped Śiva by means of ten thousand discuses.

34. Then Śiva, the infuriated consort of Durgā, the destroyer of all insurmountable distress split the discuses rapidly by means of his excellent arrows.

35. Then the Dānava seized his mace and accompanied by a huge army rushed at Śiva with the intention to kill him.

36. The infuriated Śiva, the destroyer of the pride of the wicked split the mace of the Dānava rushing headlong by means of a sharp-edged sword.

Continues....
🌹🌹🌹🌹🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 సిద్దేశ్వరయానం - 58 🌹*

*💐 శ్రీ సిద్దేశ్వరానంద భారతీ స్వామి విరచిత 💐*

*🏵 శిష్యురాలు భైరవీ బ్రాహ్మణి 🏵*

*యోగేశ్వరి మరునాడు సాయంకాలం మళ్ళీ ఆశ్రమానికి వెళ్ళేసరికి కాళీయోగి బయటకు వెళ్ళే ప్రయత్నంలో ఉన్నట్లు కన్పించింది. వారితో పాటు వారి పరివారము కొద్దిమంది బయలుదేరుతున్నారు. ఎక్కడికి వెడుతున్నారని నెమ్మదిగా పరివారంలో ఒకరిని అడిగింది. సనాతనగోస్వామి సమాధిదగ్గరకు, హితహరివంశ మహరాజ్ అదృశ్యమైన స్థలానికి వెడుతున్నట్లు చెప్పబడింది. వారితో పాటు తానుకూడా అక్కడికి వస్తానని అభ్యర్థించగా యోగి సరేనన్నాడు. ఆ రెండు చోట్లకూడా, పూర్వమహానీయులతో వారు మాట్లాడుతూనే ఉన్నట్లున్నది. అక్కడ నుండి మళ్ళీ రూపగోస్వామి సమాధిమందిరానికి వచ్చిన తరువాత శిష్యులంతా నమస్కరించి వెళ్ళిపోయినారు. యోగేశ్వరి ఒక్కతే మిగిలి ఉన్నది. యోగి విశ్రాంతిగా కూర్చున్న తరువాత, ఆమె నిన్న తాను పొందిన దర్శనాన్ని గూర్చి అడుగుదామని అనుకొంటూ ఉండగా యోగి ఇలా అన్నారు.*

*యోగి : అమ్మా ! నిన్న నీవు పొందిన అనుభవాన్ని గూర్చి అడగాలని అనుకొంటున్నావు. రాధాభక్తురాలివయిన నీకు కాళీదేవితో జన్మాంతర బంధం ఉండటం వల్ల నీకా అనుభూతి ఇవ్వబడింది. నీవు దర్శించిన కాళీదేవి విగ్రహం ఇక్కడకు కొన్ని వందల మైళ్ళ దూరంలో ఒక మహారణ్యంలోని నా ఆశ్రమంలో ఉన్నది. బృందావనంతోను ఇంతకముందు ఇక్కడ జీవించిన గోస్వాములతోను, భక్తులతోను ఉన్న అనుబంధం వల్ల వారు భౌతికశరీరాలతో ఉన్నప్పుడు ఏర్పడిన మైత్రిని పురస్కరించుకొని, వారు పాంచభౌతిక శరీరాలు విడచిపెట్టినా రాధాదేవి పరివారంలో మంజరులుగా మారిపోయినారు. నాకు దీర్ఘాయువు ఉండటం వల్ల ఇక్కడకు వచ్చి వారిని పలకరిస్తుంటాను. కాళీదేవి అనుగ్రహంవల్ల ఇప్పటికి కొన్ని వందల సంవత్సరాల నుండి జీవించియున్నాను. ఇక్కడి పెద్దల వల్ల నీవూ కొంతవిన్నావు. నీకు నిన్న ఇవ్వబడిన అనుభూతి కాళీదేవి యొక్క అనుగ్రహము నీలో పునర్వికసిత మవుతున్నదనటానికి గుర్తు. నిన్ను ఎన్నో జన్మలనుండి ఎరుగుదును. నీ వెవరో నీకు సంబంధించిన వివరాలు నీవే తెలుసుకొంటే నీకు సంతృప్తి కరంగా ఉంటుంది. ఆ స్థితి రావటానికి నీవు తీవ్రతపస్సు చేయాలి. వేగంగా రావాలంటే తాంత్రిక సాధనలు చేయాలి. అదినీ సంకల్పం మీద, భగవతి మహాకాళి కృపమీద ఆధారపడి ఉన్నది. నేనింక రెండు రోజులలో ఇక్కడ నుంచి బయలుదేరి వెడుతున్నాను. నీ మార్గం నిశ్చయించుకోవలసినదానిని నీవే.*

*యోగేశ్వరి : మీ మాటలు వింటూంటే నాలో ఏదో కొత్తమార్పు వస్తున్నది. నేను ఆలోచించుకొని రేపు మీ దర్శనానికి వస్తాను. మీ కరుణాకటాక్షములు నామీద ప్రసరించాలని ప్రార్థిస్తున్నాను.*
*యోగి : తథాస్తు.*
*యోగీశ్వరి ఇంటికి వెళ్ళిపోయింది. ఆ రాత్రంతా ఎడతెగని ఆలోచనలు. "ఇప్పుడు నేనేమి చేయాలి ? కాళీయోగి ఇచ్చిన అనుభూతివల్ల ఆయన మాటల వల్ల తెలియని దివ్యలోకాల తలుపులు తెరుచుకొంటున్నవి. మొదటి నుండి ఆధ్యాత్మిక రంగంలో ఉన్నతస్థానం సాధించాలన్న తపన లోలోపల అగ్నిజ్వాలవలె రగులుతున్నది. దానిని సాధించాలంటే కఠోర తపస్సాధన చేయాలి. వయస్సు వచ్చింది కనుక పెళ్ళికి ఇప్పటికే ఆలస్యమయిందని అమ్మ గొడవ చేస్తున్నది. ఇంట్లో ఉంటే ఎక్కువకాలం పెళ్లిని ఆపటం సాధ్యం కాదు. కనుక గార్హస్థ్యబంధంలో ఇరుక్కోకుండా తాను సిద్ధయోగినిగా మారాలి.*

*బృందావన ధామంలో అనన్యమైన రాధాకృష్ణభక్తి మార్గాన్ని తప్ప మరొకదానిని గూర్చి ఇక్కడి భక్తులు ఆలోచించరు. మంత్రశక్తుల యందు దీర్ఘాయువు నందు తాంత్రికసాధనల యందు ఇక్కడ ఆశ్రమాధిపతులకు గాని వారి శిష్యులకు గాని ఆసక్తి లేదు. నాకు రాధాకృష్ణుల యందు భక్తి ఉన్నది. కానీ దానితో పాటు సిద్ధులయందు కూడా మోజు ఉన్నది. ఆ కాళీయోగి ఎప్పటివాడో ? 300 ఏండ్లు దాటుతున్నా ముసలితనం రాలేదు. నేను కూడా ఆ విధంగా దీర్ఘాయురారోగ్యములు సాధించగలనా ?*

*జరాభారంపైన పడకుండా ఆపగలనా? ఇవన్నీ సాధించాలంటే సిద్ధుడైన గురువు యొక్క సహాయం లేకుండా సాధ్యంకాదు. కన్పిస్తున్నంతలో ఒక్క కాళీయోగి మాత్రమే చేయగలిగిన పని ఇది. కనుక నా జీవిత లక్ష్యం నెరవేరాలంటే ఆయనతో వెళ్ళాలి. వారి ఆశ్రమంలో వారి నీడలో ఉండి, ఆయన అనుగ్రహంతోనే ననుకొన్నది సాదించాలి. ఒకసారి ఆయనతో వెళ్ళిపోతే తిరిగి ఎప్పటి రాగలనో, చెప్పకుండా వెడితే ఏమయినానో ! అని అమ్మ దిగులు పడుతుంది. చెప్పితే పోనీయరు” ఇలా పరిపరివిధాల ఆలోచించి ఆమె ఒక నిశ్చయానికి వచ్చింది.*

*( సశేషం )*
🌹🌹🌹🌹🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 విశ్వాసం యొక్క మూలాలను పరిశీలించడం సాధకులకు అవసరం / Examining the roots of Faith is Necessary for Aspirants 🌹*
*✍️ ప్రసాద్‌ భరధ్వాజ*

*మనం సరైన వాళ్లమని అనుకోవడం అంటే అందరూ తప్పు అని అనుకోవడం లాంటిదే. ఈ రకమైన అహంకారం జ్ఞానం మరియు అవగాహన యొక్క తీవ్రమైన లోపాన్ని ప్రతిబింబిస్తుంది. అలాంటి అసహనం మరియు ద్వేషం, తిరుగుబాటుకు దారి తీస్తుంది. అంతే కాకుండా ఇది సత్యాన్ని కనుగొనకుండా నిరోధిస్తుంది. మన తప్పులు మరియు బలహీనతలను సంపూర్ణ నిష్పక్షపాతంగా పరిశీలించుకుంటే తప్ప ఆత్మ సాక్షాత్కారం అసాధ్యం. అవాంఛిత కలుపుతో ఎటువంటి అనుబంధం లేని తెలివైన రైతు వలె మన నమ్మకాలు మరియు మన విశ్వాసాల మూలాలకు మనం మొగ్గు చూపాలి. అవాంఛితమైన వాటిని గుర్తించి, మోహం లేకుండా బయటకు విసిరి వేయాలి.*

*అలాగే మన చెడు అలవాట్లను మరియు హానికరమైన ప్రవర్తనా విధానాలను కూడా విసిరి వేయాలి. తద్వారా వచ్చే మార్పు మనకున్న ధృడత్వం మరియు స్థిరత్వం యొక్క లోపాలను సూచిస్తున్నాయని మనం అనుకోకూడదు. పరమ సత్యాన్ని గ్రహించడానికి స్వీయ పరివర్తన అవసరం మరియు అనివార్యం. మనల్ని మనం ఆత్మగా గ్రహించాలంటే మనల్ని మనం పునః నిర్మించుకోవాలి. మనలో ఉన్న పక్షపాతాలు, అపసవ్య నమ్మకాలు మరియు సిద్ధాంతాలు, మన స్వీయ ఆత్మ సాక్షాత్కార లక్ష్యం నుండి మనల్ని మరింత దూరంగా తీసుకు వెళతాయి. కనుక ఇటువంటి వాటి పట్ల సాధకులు సదా అప్రమత్తంగా ఉండాలి.*
🌹🌹🌹🌹🌹

*🌹 Examining the roots of Faith is Necessary for Aspirants 🌹*
*Prasad Bharadwaj*

*To think that we are right is the same as thinking that every one else is wrong. This kind of pride reflects a serious lack of knowledge and wisdom. Such intolerance leads to hatred and rebellion and it also prevents us from discovering the truth. Self realization is impossible unless we are willing to examine our mistakes and weaknesses with absolute impartiality. We should tend to the roots of our beliefs and our faith like the clever farmer who does not have any attachment to the unwanted weed and pulls it out with objective lack of attachment.*

*Just like that, we should also throw away our bad habits and detrimental behavior patterns. We must not think that this change reflects a lack of strength and stability. Self transformation is essential and indispensable for the realization of the truth. We must re-build ourselves if we want to be realized souls: bias, prejudice, and dogma can only take us further from this goal. So seekers should always be alert about such things.*
🌹🌹🌹🌹🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము  - 544 - 3  / Sri Lalitha Chaitanya Vijnanam  - 544 - 3 🌹*
*🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻*
*✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం  శ్రీమాత్రే నమః 🍁*

*🍀 111. పుణ్యకీర్తిః, పుణ్యలభ్యా, పుణ్యశ్రవణ కీర్తనా ।*
*పులోమజార్చితా, బంధమోచనీ, బంధురాలకా ॥ 111 ॥ 🍀*

*🌻 544. 'పుణ్యశ్రవణ కీర్తనా' - 3 🌻*

*కీర్తనము సుప్రసిద్ధమగు దేవతా ప్రశంస. దైవ ప్రశంసకు భజన, కీర్తన భారతీయ సంప్రదాయమున ప్రసిద్ధి గాంచినవి. కీర్తన ద్వారా భగవత్ స్మరణము రుచికరముగ సాగును. కీర్తన చేయుకొలది రుచి పెరుగుచు నుండును. తన్మయత్వము సిద్ధించును. భక్తి పారవశ్యమున కీర్తనము చేయుచుండగ శ్రీమాత సంతసమున దరి చేరును. సాన్నిధ్య మిచ్చును. శ్రవణము, కీర్తనము దైవమును చేరుటకు గల నవ విధ ఉపాయములలో ప్రధానమైనవి. అందరికిని అందుబాటులో నుండునవి.  కలి యుగమందు నామ సంకీర్తనయే ప్రధానమని భాగవతము తెలుపుచున్నది.*

*సశేషం...*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Sri Lalitha Chaitanya Vijnanam  - 544 - 3 🌹*
*Contemplation of 1000 Names of Sri Lalitha Devi* 
*✍️ Prasad Bharadwaj*

*🌻 111. Punyakirtih punyalabhya punyashravana kirtana*
*pulomajarchita bandhamochani bandhuralaka ॥111 ॥ 🌻*

*🌻 544. 'Punyashravana Kirtana' - 3 🌻*

*The hymn is a well-known praise of the goddess. Bhajans and kirtans in praise of God are popular in Indian tradition. Remembrance of god through kirtan is tasteful. The taste of increases as the kirtan proceeds. Concentration is achieved. When kirtan is done in devotional ecstasy Srimata comes nearer in appreciation. Gives close proximity. Listening and glorifying are the key ways amongst nine to reach God. Available to all. The Bhagavata states that Nama Sankīrtana is important in Kali Yuga.*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
#నిత్యసందేశములు #DailyMessages 
Join and Share 
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
https://t.me/+9zDjTpPe_PQzMWVl
https://t.me/Sivasutras
https://t.me/Seeds_Of_Consciousness
https://t.me/bhagavadgeethaa/
https://t.me/AgniMahaPuranam
https://t.me/+LmH1GyjNXXlkNDRl
http://www.facebook.com/groups/srilalithachaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/
https://prasadbharadwaj.wixsite.com/dailybhaktimessages3
https://www.kooapp.com/profile/Prasad_Bharadwaj
https://www.threads.net/@prasad.bharadwaj