శ్రీ శివ మహా పురాణము - 380

🌹 . శ్రీ శివ మహా పురాణము - 380 🌹

రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. రుద్ర సంహితా - పార్వతీ ఖండః 🌴

అధ్యాయము - 13

🌻. పార్వతీ పరమేశ్వర సంవాదము - 3 🌻

ఓ మహర్షీ! ఇట్లు ఆ శివాదేవి ధ్యాననిమగ్నుడైన శంకరుని సేవించుచుండగా చాల కాలము గడిచిపోయెను (44). ఒకప్పుడు ఆ కాళి సఖురాండ్రిద్దరితో గూడి శంకరుని ఆశ్రమములో కామ వర్ధకము, మంచి తాళము గలది అగు మధురమైన పాటను పాడెను (45). మరియొకప్పుడు ఆమె దర్భలను, పుష్పములను, సమిధలను స్వయముగా తెచ్చెడిది. ఆమె అక్కడ స్థలము నంతనూ సఖురాండ్రతో గూడి శుభ్రము చేయుచుండెడిది (46).

ఒకప్పుడామె అనురాగముతో కూడినదై చంద్రశేఖరుని కుటీరములో ఆయన సమీపములో గూర్చుండి ఆయనను ఆశ్చర్యముతో చూచుచుండెడిది (47). భూతపతియగు ఆ శివుడు విషయాసంగములేనిదై తన సమీపములోనున్న ఆమెను చూచి, పూర్వము సతీరూపములో నున్న దేవియే ఈమె యని తపః ప్రభావముచే మనస్సుతో దర్శించెను (48).

శివుడు తన సమీపమునందున్నట్టియు, మహాలావణ్యదనిధియైనట్టియు, మహర్షులకు కూడ మోహమును కలిగించగల ఆ కాళీ దేవిని వెంటనే భార్యగా స్వీకరించలేదు (49). ఇంద్రియ జయము కలిగి నిత్యము నిష్ఠతో తనను సేవించుచున్న ఆమెను అనేక పర్యాయములు చూచిన పిదప మహాదేవునకు దయ కలిగి ఇట్లు తలపోసెను (50).

ఈ కాళి ఎప్పుడైతే తపస్సును తీవ్రముగా చేయునో, అప్పుడు ఆమెలోని గర్వము యొక్క బీజము తొలగిపోవును. అపుడామెను నేను స్వీకరించగలను (51).

బ్రహ్మ ఇట్లు పలికెను-

భూపతి, మహాయోగిశ్రేష్టుడు, గొప్ప లీలలను ప్రదర్శించువాడునగు ఆ ప్రభువు ఇట్లు తలపోసి వెంటనే ధ్యాననిమగ్నుడయ్యెను. (52). ధ్యానమునందు నిమగ్నుడైన ఆ శివపరమాత్మ యొక్క హృదయములో మరియొక తలంపు లేకుండెను. ఓమహర్షీ! (53) కాళీదేవి సర్వకాలములయందు ఆ మహాత్ముని రూపమును స్మరింస్తూ, ప్రతి దినము ఆ శంభుని మంచి భక్తితో చక్కగా సేవించెను(54). శివుడు నిత్యము ఆ సుందరిని చూచుచూ, పూర్వమందలి దుఃఖమును మరచిపోయెను. ధ్యాన నిమగ్నుడైన ఆ శివుడు ఆమెను చూచుచున్ననూ చూడని వాడు వలెనే యుండెను. (55). ఇంతలో ఇంద్రుడు మొదలగు దేవతలు, మరియు మునులు బ్రహ్మ యొక్కఆజ్ఞను ఆదరముతో స్వీకరింతి మన్మథుడు అచటకు పంపింరి(56).

మహాబలవంతుడగు తారకాసురునిచే మిక్కిలి పీడించబడిన దేవతలు రుద్రుడు కాళిని ప్రేమించి వివాహమాడునట్లు చేయుటకై మన్మథుని పంపిరి(57). మన్మథుడు అచటకు వెళ్లి తన ఉపాయములనన్నిచినీ ప్రయోగించెను. శివుడు లేశ##మైననూ చలించలేదు. పైగా అతనిని బూడిదగా చేసెను.(58) ఓ మహర్షి! పార్వతి కూడా తన గర్వమును విడనాడెను. ఆ సతి శివుని ఆదేశముచే గొప్ప తపస్సును చేసి శివుని భర్తగా పొందెను. (59) ఆ పార్వతీ పరమేశ్వరులు మిక్కిలి ఆనందించిరి. ఇతరులకు ఉపకరించుటలో ప్రీతి గల ఆ దంపతులు దేవ కార్యమును నెరవేర్చిరి(60).

శ్రీ శివ మహాపురాణములో రుద్ర సంహితయందు పార్వతీ ఖండలో పార్వతీ పరమేశ్వ సంవాద వర్ణన మనే పదమూడవ అధ్యాయము ముగిసినది(13).

సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹

04 Apr 2021

గీతోపనిషత్తు -180

🌹. గీతోపనిషత్తు -180 🌹

✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

📚. 6వ అధ్యాయము - ఆత్మ సంయమ యోగము 📚

శ్లోకము 21

🍀 21-2. హృదయ కేంద్రము - బుద్ధి కేంద్రము హృదయమున నుండును. మనస్సును శ్వాసపై లగ్నము చేసినచో హృదయమును చేరవచ్చును. చిత్తము హృదయము నందుంచుట నేర్చినచో బుద్ధియందుండుట వీలుపడును. హృదయము నందుండుట అనినను, బుద్ధి యందుండుట అనినను, అంతరంగ మందుండుట అనినను ఒకటియే. మనస్సు బాహ్య రంగమునందు ప్రవేశించుటకు ఆధారము. బుద్ధి అంతరంగమును శోధించుటకు ఆధారము. బుద్ధి యందు స్థిరముగ నుండి, “నేను” అను వెలుగును భావించుచు, దర్శించుచు నుండువాడు 'యోగి' అని తెలియవలెను. అతడు అవసరమును బట్టి మనస్సును ప్రవేశించునుగాని, సహజముగ బుద్ధియందే యుండును. 🍀

సుఖ మత్యంతికం యత్త ద్బుద్ధిగ్రాహ్య మతీంద్రియమ్ |
వేత్తి యత్ర న చైవాయం స్థిత శ్చలతి తత్త్వతః || 21

ఉత్తమోత్తమమైన మోక్ష సాధనకు కూడ దేహము ప్రధానమైనది గనుక, దేహ నిర్వహణకు మనసేంద్రియములు అవసరము కనుక, మనసేంద్రియములను తూలనాడరాదు. అశ్రద్ధ చేయ రాదు. హింసింపరాదు. వానిచే బంధింప బడకుండ, వానిని నిర్వర్తించు సామర్థ్యమును పొందవలెను.

చిత్తము బాహ్యమున నిర్వర్తించవలసిన కార్యము లేవియు లేనపుడు మనస్సున కూర్చుండ నవసరము లేదు. మనస్సు కార్యాలయము వంటిది. బాహ్యసంబంధిత కార్యములను నిర్వర్తించుటకే కదా మనము కార్యాలయమున కేగునది. బాహ్య కార్యములు లేనపుడు ప్రత్యేకించి సెలవుదినమున కార్యాలమున కేగము. అట్లే బాహ్యమగు కార్యములు లేనపుడు జీవుడు మనస్సున కూర్చుండ నవసరమే లేదు.

అతడు బుద్ధిలోనికి చనుట మేలు. బుద్ధి కేంద్రము హృదయమున నుండును. మనస్సును శ్వాసపై లగ్నము చేసినచో హృదయమును చేరవచ్చును. చిత్తము హృదయము నందుంచుట నేర్చినచో బుద్ధియందుండుట వీలుపడును. హృదయము నందుండుట అనినను, బుద్ధి యందుండుట అనినను, అంతరంగ మందుండుట అనినను ఒకటియే. మనస్సు బాహ్య రంగమునందు ప్రవేశించుటకు ఆధారము.

బుద్ధి అంతరంగమును శోధించుటకు ఆధారము. ఈ శ్లోకమందు ఆత్మ బుద్ధి గ్రాహ్యమని, మన సేంద్రియ గ్రాహ్యము కాదని చెప్పబడినది. బుద్ధి అను వెలుగున చేరి, నేనను వెలుగును భావించుచు, దర్శించుచు నుండుట చెప్పబడినది.

అట్లు చేయు వానికి ఆద్యంతములు లేని సుఖముండునని భగవంతుడు చెప్పుచున్నాడు. పై విధముగ బుద్ధియందు స్థిరముగ నుండి, “నేను” అను వెలుగును భావించుచు, దర్శించుచు నుండువాడు 'యోగి' అని తెలియవలెను. అతడు అవసరమును బట్టి మనస్సును ప్రవేశించునుగాని, సహజముగ బుద్ధియందే యుండును.

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹

04 Apr 2021

శ్రీ లలితా సహస్ర నామములు - 57 / Sri Lalita Sahasranamavali - Meaning - 57

🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 57 / Sri Lalita Sahasranamavali - Meaning - 57 🌹

🌻. మంత్రము - అర్ధం 🌻

📚. ప్రసాద్ భరద్వాజ

🍀 57. మహేశ్వర మహాకల్ప మహాతాండవ సాక్షిణీ ।
మహాకామేశ మహిషీ, మహాత్రిపుర సుందరీ ॥ 57 ॥ 🍀

🍀 232. మహేశ్వర మహాకల్ప మహాతాండవ సాక్షిణీ -
సదాశివునిచే మహాప్రళయ సమయమునందు చేయబడు గొప్ప తాండవ నృత్యమును సాక్షి స్వరూపిణి.

🍀 233. మహా కామేశ మహిషీ -
మహేశ్వరుని పట్టపురాణి.

🍀 234. మహాత్రిపుర సుందరీ -
గొప్పదైన త్రిపురసుందరి.

సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹

🌹. Sri Lalita Sahasranamavali - Meaning - 57 🌹

📚. Prasad Bharadwaj

🌻 57. maheśvara-mahākalpa-mahātāṇḍava-sākṣiṇī |
mahākāmeśa-mahiṣī mahātripura-sundarī || 57 || 🌻

🌻 232 ) Maheswara Mahakalpa Maha thandava sakshini -
She who will be the witness to the great dance to be performed by the great lord at the end of the worlds

🌻 233 ) Maha kamesha mahishi -
She who is the prime consort of the great Kameshwara

🌻 234 ) Maha tripura sundari -
She who is the beauty of the three great cities.

Continues....

🌹 🌹 🌹 🌹 🌹

04 Apr 2021

భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 202

🌹. భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 202 🌹

✍️. శ్రీ బాలగోపాల్
📚. ప్రసాద్ భరద్వాజ

🌻. హల్‌ - ముకామ్‌ -అంతరానుభవము - 2 🌻

747. బాటసారి ఒక ప్రత్యేక ఆంతరికానుభవములో, ఒక ప్రత్యేక భూమికలో ఆగిపోవుటకు ముకామ్ అందురు.

748. హల్, ముకామ్ ఈ రెండును ఆరవ భూమిక వరుకు జంటగా నుండును. హల్, ఎల్లప్పుడును' ముకామ్'ను తన ఆధీనమందుంచు కొనును.

749. ఏడవ భూమికలో హాల్ ముకామ్ లకు తావు లేదు, ఉండదు.

750. హాల్ ఉన్నచోటనే ద్వైతముండును. సప్తమభూమిక నుండి సామాన్య చైతన్య స్థాయికి క్రిందికివచ్చి, ధర్మ నిర్వహణకై ఏ దేనిభూమిక యందు ప్రతిష్టితుడైనప్పుడు ఆ ప్రత్యేక భూమిక ఆతనికి "ముకామ్" అగును.

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹

04 Apr 2021

మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 8

🌹. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 8 🌹

✍️. సద్గురు ఇ. కృష్ణమాచార్యులు
సంకలనము : వేణుమాధవ్
📚. ప్రసాద్ భరద్వాజ

🌻. నిత్యదినచర్య- యోగసాధన 🌻

ఉన్నత స్థితి రావాలంటే‌ దినచర్యను క్రమబద్ధం చేసికోవాలి. వేకువజాము దేవతాప్రజ్ఞలు మనతో అనుసంధానం పొందే పుణ్య సమయం. అపుడే మేల్కొనాలి. వీలున్నంత వరకు ఒకే సమయం.... ముఖ్యంగా సంధ్యా సమయంలో ప్రార్థన చేయాలి. సూర్యాత్ముని అనుగ్రహం వెలుగుగా మన యందు వర్థిల్లాలి కదా.

అసలు నిద్రలోంచి నేల పైకి కాలు పెట్టే ముందే, తన చుట్టూ జీవులంతా అంతర్యామి స్వరూపులే అని, వాని ఆరాధనమే తనకు అనుగ్రహింపుమని గురువును వేడుకోవాలి.

అలాగే నిద్రలోకి జారే ముందు కూడ, గురువును స్మరించి, తనకు పవిత్రతను ప్రసాదింపుమని వేడుకోవాలి. నిద్రలో అపుడు సూక్ష్మ శరీరం కూడ శుద్ధంగా ప్రవర్తిస్తుంది.

రోజు చేసే కుటుంబ సంబంధమయిన పనులు, వృత్తి పనులకు అదే సమయం కేటాయించుకోవాలి. చిన్న చిన్న పనులలో సమయపాలన, క్రమశిక్షణ పాటించకపోతే, యోగ సాధనలోపైకి పోలేము.

తన కర్తవ్యాలే గుర్తుండాలి కాని, ఇతరులు చేయవలసినవి చేయలేదని బాధ్యత‌ వారిపై నెట్టరాదు. ....

🌹 🌹 🌹 🌹 🌹

04 Apr 2021

4-APRIL-2021 MESSAGES

1) 🌹. గీతోపనిషత్తు - సాంఖ్య యోగము - 180🌹  
2) 🌹. శివ మహా పురాణము - 380🌹 
3) 🌹 Light On The Path - 129🌹
4)🌹. మాస్టర్ ఇ.కె సందేశాలు -8 🌹
5) 🌹 Seeds Of Consciousness - 327🌹   
6) 🌹. భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 202🌹
7) 🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 57 / Lalitha Sahasra Namavali - 57🌹 
8) 🌹. శ్రీ విష్ణు సహస్ర నామములు - 57 / Sri Vishnu Sahasranama - 57🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. గీతోపనిషత్తు -180 🌹*
✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్ 
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
*📚. 6వ అధ్యాయము - ఆత్మ సంయమ యోగము 📚*
శ్లోకము 21

*🍀 21-2. హృదయ కేంద్రము - బుద్ధి కేంద్రము హృదయమున నుండును. మనస్సును శ్వాసపై లగ్నము చేసినచో హృదయమును చేరవచ్చును. చిత్తము హృదయము నందుంచుట నేర్చినచో బుద్ధియందుండుట వీలుపడును. హృదయము నందుండుట అనినను, బుద్ధి యందుండుట అనినను, అంతరంగ మందుండుట అనినను ఒకటియే. మనస్సు బాహ్య రంగమునందు ప్రవేశించుటకు ఆధారము. బుద్ధి అంతరంగమును శోధించుటకు ఆధారము. బుద్ధి యందు స్థిరముగ నుండి, “నేను” అను వెలుగును భావించుచు, దర్శించుచు నుండువాడు 'యోగి' అని తెలియవలెను. అతడు అవసరమును బట్టి మనస్సును ప్రవేశించునుగాని, సహజముగ బుద్ధియందే యుండును. 🍀*

సుఖ మత్యంతికం యత్త ద్బుద్ధిగ్రాహ్య మతీంద్రియమ్ |
వేత్తి యత్ర న చైవాయం స్థిత శ్చలతి తత్త్వతః || 21

ఉత్తమోత్తమమైన మోక్ష సాధనకు కూడ దేహము ప్రధానమైనది గనుక, దేహ నిర్వహణకు మనసేంద్రియములు అవసరము కనుక, మనసేంద్రియములను తూలనాడరాదు. అశ్రద్ధ చేయ రాదు. హింసింపరాదు. వానిచే బంధింప బడకుండ, వానిని నిర్వర్తించు సామర్థ్యమును పొందవలెను. 

చిత్తము బాహ్యమున నిర్వర్తించవలసిన కార్యము లేవియు లేనపుడు మనస్సున కూర్చుండ నవసరము లేదు. మనస్సు కార్యాలయము వంటిది. బాహ్యసంబంధిత కార్యములను నిర్వర్తించుటకే కదా మనము కార్యాలయమున కేగునది. బాహ్య కార్యములు లేనపుడు ప్రత్యేకించి సెలవుదినమున కార్యాలమున కేగము. అట్లే బాహ్యమగు కార్యములు లేనపుడు జీవుడు మనస్సున కూర్చుండ నవసరమే లేదు. 

అతడు బుద్ధిలోనికి చనుట మేలు. బుద్ధి కేంద్రము హృదయమున నుండును. మనస్సును శ్వాసపై లగ్నము చేసినచో హృదయమును చేరవచ్చును. చిత్తము హృదయము నందుంచుట నేర్చినచో బుద్ధియందుండుట వీలుపడును. హృదయము నందుండుట అనినను, బుద్ధి యందుండుట అనినను, అంతరంగ మందుండుట అనినను ఒకటియే. మనస్సు బాహ్య రంగమునందు ప్రవేశించుటకు ఆధారము. 

బుద్ధి అంతరంగమును శోధించుటకు ఆధారము. ఈ శ్లోకమందు ఆత్మ బుద్ధి గ్రాహ్యమని, మన సేంద్రియ గ్రాహ్యము కాదని చెప్పబడినది. బుద్ధి అను వెలుగున చేరి, నేనను వెలుగును భావించుచు, దర్శించుచు నుండుట చెప్పబడినది. 

అట్లు చేయు వానికి ఆద్యంతములు లేని సుఖముండునని భగవంతుడు చెప్పుచున్నాడు. పై విధముగ బుద్ధియందు స్థిరముగ నుండి, “నేను” అను వెలుగును భావించుచు, దర్శించుచు నుండువాడు 'యోగి' అని తెలియవలెను. అతడు అవసరమును బట్టి మనస్సును ప్రవేశించునుగాని, సహజముగ బుద్ధియందే యుండును.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #గీతోపనిషత్ #సద్గురుపార్వతీకుమార్

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 . శ్రీ శివ మహా పురాణము - 380🌹* 
రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ

*🌴. రుద్ర సంహితా - పార్వతీ ఖండః 🌴* 
అధ్యాయము - 13

*🌻. పార్వతీ పరమేశ్వర సంవాదము - 3 🌻*

ఓ మహర్షీ! ఇట్లు ఆ శివాదేవి ధ్యాననిమగ్నుడైన శంకరుని సేవించుచుండగా చాల కాలము గడిచిపోయెను (44). ఒకప్పుడు ఆ కాళి సఖురాండ్రిద్దరితో గూడి శంకరుని ఆశ్రమములో కామ వర్ధకము, మంచి తాళము గలది అగు మధురమైన పాటను పాడెను (45). మరియొకప్పుడు ఆమె దర్భలను, పుష్పములను, సమిధలను స్వయముగా తెచ్చెడిది. ఆమె అక్కడ స్థలము నంతనూ సఖురాండ్రతో గూడి శుభ్రము చేయుచుండెడిది (46).

ఒకప్పుడామె అనురాగముతో కూడినదై చంద్రశేఖరుని కుటీరములో ఆయన సమీపములో గూర్చుండి ఆయనను ఆశ్చర్యముతో చూచుచుండెడిది (47). భూతపతియగు ఆ శివుడు విషయాసంగములేనిదై తన సమీపములోనున్న ఆమెను చూచి, పూర్వము సతీరూపములో నున్న దేవియే ఈమె యని తపః ప్రభావముచే మనస్సుతో దర్శించెను (48). 

శివుడు తన సమీపమునందున్నట్టియు, మహాలావణ్యదనిధియైనట్టియు, మహర్షులకు కూడ మోహమును కలిగించగల ఆ కాళీ దేవిని వెంటనే భార్యగా స్వీకరించలేదు (49). ఇంద్రియ జయము కలిగి నిత్యము నిష్ఠతో తనను సేవించుచున్న ఆమెను అనేక పర్యాయములు చూచిన పిదప మహాదేవునకు దయ కలిగి ఇట్లు తలపోసెను (50).

ఈ కాళి ఎప్పుడైతే తపస్సును తీవ్రముగా చేయునో, అప్పుడు ఆమెలోని గర్వము యొక్క బీజము తొలగిపోవును. అపుడామెను నేను స్వీకరించగలను (51).

బ్రహ్మ ఇట్లు పలికెను-

భూపతి, మహాయోగిశ్రేష్టుడు, గొప్ప లీలలను ప్రదర్శించువాడునగు ఆ ప్రభువు ఇట్లు తలపోసి వెంటనే ధ్యాననిమగ్నుడయ్యెను. (52). ధ్యానమునందు నిమగ్నుడైన ఆ శివపరమాత్మ యొక్క హృదయములో మరియొక తలంపు లేకుండెను. ఓమహర్షీ! (53) కాళీదేవి సర్వకాలములయందు ఆ మహాత్ముని రూపమును స్మరింస్తూ, ప్రతి దినము ఆ శంభుని మంచి భక్తితో చక్కగా సేవించెను(54). శివుడు నిత్యము ఆ సుందరిని చూచుచూ, పూర్వమందలి దుఃఖమును మరచిపోయెను. ధ్యాన నిమగ్నుడైన ఆ శివుడు ఆమెను చూచుచున్ననూ చూడని వాడు వలెనే యుండెను. (55). ఇంతలో ఇంద్రుడు మొదలగు దేవతలు, మరియు మునులు బ్రహ్మ యొక్కఆజ్ఞను ఆదరముతో స్వీకరింతి మన్మథుడు అచటకు పంపింరి(56).

  మహాబలవంతుడగు తారకాసురునిచే మిక్కిలి పీడించబడిన దేవతలు రుద్రుడు కాళిని ప్రేమించి వివాహమాడునట్లు చేయుటకై మన్మథుని పంపిరి(57). మన్మథుడు అచటకు వెళ్లి తన ఉపాయములనన్నిచినీ ప్రయోగించెను. శివుడు లేశ##మైననూ చలించలేదు. పైగా అతనిని బూడిదగా చేసెను.(58) ఓ మహర్షి! పార్వతి కూడా తన గర్వమును విడనాడెను. ఆ సతి శివుని ఆదేశముచే గొప్ప తపస్సును చేసి శివుని భర్తగా పొందెను. (59) ఆ పార్వతీ పరమేశ్వరులు మిక్కిలి ఆనందించిరి. ఇతరులకు ఉపకరించుటలో ప్రీతి గల ఆ దంపతులు దేవ కార్యమును నెరవేర్చిరి(60).

శ్రీ శివ మహాపురాణములో రుద్ర సంహితయందు పార్వతీ ఖండలో పార్వతీ పరమేశ్వ సంవాద వర్ణన మనే పదమూడవ అధ్యాయము ముగిసినది(13).

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #శివమహాపురాణము

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 LIGHT ON THE PATH - 129 🌹*
*🍀 For those WHO DESIRE TO ENTER WITHIN - For DISCIPLES 🍀*
✍️. ANNIE BESANT and LEADBEATER
📚. Prasad Bharadwaj

CHAPTER 10 - The Note on 20th RULE
*🌻 20. Do not condemn the man that yields - 1 🌻*

 487. But do not condemn the man that yields; stretch out your hand to him as a brother pilgrim whose feet have become heavy with mire. 

Remember, O disciple, that great though the gulf may be between the good man and the sinner, it is greater between the good man and the man who has attained knowledge; it is immeasurable between the good man and the one on the threshold of divinity. Therefore be wary lest too soon you fancy yourself a thing apart from the mass.

488. A.B. – Here we are told that we must not condemn the man who yields to temptation. When you have passed through the stage of trial, there is no fear of your condemning anyone. When temptations are transcended, and you think of the time when you still felt them, you will not condemn the man who yields.

489. The difference between the virtuous and the vicious man is comparatively little; both are struggling in the early stages, and when looked at from either side the difference is small. 

But when a man has attained knowledge and has seen the meaning of virtue and vice, he has made an enormous step. When he sees virtue and vice only as the pair of opposites, he has transcended knowledge; he stands on the threshold of divinity, and the difference is immeasurable. 

We have the warning here that if we too soon think ourselves apart from the mass there will come the temptation to despise those below us, and then we shall fall. A person who has reached divinity looks down on no one; he can feel with all, and is one with the lowest.

490. When you have found the beginning of the way the star of your soul will show its light; and by that light you will perceive how great is the darkness in which it burns. Mind, heart, brain, all are obscure and dark until the first great battle has been won. 

Be not appalled and terrified by the sight; keep your eyes fixed on the small light and it will grow. But let the darkness within help you to understand the helplessness of those who have seen no light, whose souls are in profound gloom. 

Continues...
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #LightonPath #Theosophy

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🌹. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 8 🌹
✍️. సద్గురు ఇ. కృష్ణమాచార్యులు 
సంకలనము : వేణుమాధవ్
📚. ప్రసాద్ భరద్వాజ

🌻. నిత్యదినచర్య- యోగసాధన 🌻 

ఉన్నత స్థితి రావాలంటే‌ దినచర్యను క్రమబద్ధం చేసికోవాలి. వేకువజాము దేవతాప్రజ్ఞలు మనతో అనుసంధానం పొందే పుణ్య సమయం. అపుడే మేల్కొనాలి. వీలున్నంత వరకు ఒకే సమయం.... ముఖ్యంగా సంధ్యా సమయంలో ప్రార్థన చేయాలి. సూర్యాత్ముని అనుగ్రహం వెలుగుగా మన యందు వర్థిల్లాలి కదా. 

అసలు నిద్రలోంచి నేల పైకి కాలు పెట్టే ముందే, తన చుట్టూ జీవులంతా అంతర్యామి స్వరూపులే అని, వాని ఆరాధనమే తనకు అనుగ్రహింపుమని గురువును వేడుకోవాలి. 

అలాగే నిద్రలోకి జారే ముందు కూడ, గురువును స్మరించి, తనకు పవిత్రతను ప్రసాదింపుమని వేడుకోవాలి. నిద్రలో అపుడు సూక్ష్మ శరీరం కూడ శుద్ధంగా ప్రవర్తిస్తుంది. 

రోజు చేసే కుటుంబ సంబంధమయిన పనులు, వృత్తి పనులకు అదే సమయం కేటాయించుకోవాలి. చిన్న చిన్న పనులలో సమయపాలన, క్రమశిక్షణ పాటించకపోతే, యోగ సాధనలోపైకి పోలేము. 

తన కర్తవ్యాలే గుర్తుండాలి కాని, ఇతరులు చేయవలసినవి చేయలేదని బాధ్యత‌ వారిపై నెట్టరాదు. ....
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #మాస్టర్‌ఇకెసందేశములు

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 Seeds Of Consciousness - 327 🌹*
✍️ Nisargadatta Maharaj 
 Nisargadatta Gita 
📚. Prasad Bharadwaj

*🌻 176. Stabilize in the 'Bindu' (Point) 'I am' and transcend it. 'Bindu' means without duality (Bin=without, Du=two).🌻*

It is the 'I am' again and it has been given a new name for a better understanding: the 'Bindu' (point), which when split into two words 'Bin' and 'Du' means without duality. How is this so? As the focus of your meditation on the 'I am' (or when the knowledge 'I am') meditates on itself for a prolonged period, a stage comes when it is only the 'I am' everywhere. 

When this happens, there is nothing else but the 'I am', it is a non-dual state. This 'Bindu' (point) is located nowhere yet is everywhere, it is there indwelling in you, find it and get stabilized in it.

Continues....
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #SeedsofConsciousness #Nisargadatta

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 202 🌹*
✍️. శ్రీ బాలగోపాల్
📚. ప్రసాద్ భరద్వాజ

*🌻. హల్‌ - ముకామ్‌ -అంతరానుభవము - 2 🌻*

747. బాటసారి ఒక ప్రత్యేక ఆంతరికానుభవములో, ఒక ప్రత్యేక భూమికలో ఆగిపోవుటకు ముకామ్ అందురు.

748. హల్, ముకామ్ ఈ రెండును ఆరవ భూమిక వరుకు జంటగా నుండును. హల్, ఎల్లప్పుడును' ముకామ్'ను తన ఆధీనమందుంచు కొనును.

749. ఏడవ భూమికలో హాల్ ముకామ్ లకు తావు లేదు, ఉండదు.

750. హాల్ ఉన్నచోటనే ద్వైతముండును. సప్తమభూమిక నుండి సామాన్య చైతన్య స్థాయికి క్రిందికివచ్చి, ధర్మ నిర్వహణకై ఏ దేనిభూమిక యందు ప్రతిష్టితుడైనప్పుడు ఆ ప్రత్యేక భూమిక ఆతనికి "ముకామ్" అగును.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #భగవద్ధర్శిని #అవతారమెహర్

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 57 / Sri Lalita Sahasranamavali - Meaning - 57 🌹*
🌻. మంత్రము - అర్ధం 🌻
📚. ప్రసాద్ భరద్వాజ

*🍀 57. మహేశ్వర మహాకల్ప మహాతాండవ సాక్షిణీ ।*
*మహాకామేశ మహిషీ, మహాత్రిపుర సుందరీ ॥ 57 ॥ 🍀*

🍀 232. మహేశ్వర మహాకల్ప మహాతాండవ సాక్షిణీ - 
సదాశివునిచే మహాప్రళయ సమయమునందు చేయబడు గొప్ప తాండవ నృత్యమును సాక్షి స్వరూపిణి.

🍀 233. మహా కామేశ మహిషీ -
 మహేశ్వరుని పట్టపురాణి.

🍀 234. మహాత్రిపుర సుందరీ - 
గొప్పదైన త్రిపురసుందరి.

సశేషం.... 
🌹 🌹 🌹 🌹 🌹 

🌹. Sri Lalita Sahasranamavali - Meaning - 57 🌹
📚. Prasad Bharadwaj 

*🌻 57. maheśvara-mahākalpa-mahātāṇḍava-sākṣiṇī |*
*mahākāmeśa-mahiṣī mahātripura-sundarī || 57 || 🌻*

🌻 232 ) Maheswara Mahakalpa Maha thandava sakshini -   
She who will be the witness to the great dance to be performed by the great lord at the end of the worlds

🌻 233 ) Maha kamesha mahishi -   
She who is the prime consort of the great Kameshwara

🌻 234 ) Maha tripura sundari -   
She who is the beauty of the three great cities.

Continues....
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #లలితాదేవి #LalithaDevi #లలితాసహస్రనామ #LalithaSahasranama

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీ విష్ణు సహస్ర నామములు - 57 / Sri Vishnu Sahasra Namavali - 57 🌹*
*నామము - భావము*
📚. ప్రసాద్ భరద్వాజ 

*🌷. ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్ 🌷*

*🌻 57. మహర్షిః కపిలాచార్యః కృతజ్ఞో మేదినీపతిః।*
*త్రిపద స్త్రిదశాధ్యక్షః మహాశృంగః కృతాంతకృత్॥ 57 🌻*

*స్వాతి నక్షత్ర ప్రధమ పాద శ్లోకం*   

🍀 531) మహర్షి: కపిలాచార్య: - 
వేదవిదుడైన కపిలమునిగా అవతరించినవాడు.

🍀 532) కృతజ్ఞ: - 
సృష్టి, సృష్టికర్త రెండును తానైనవాడు.

🍀 533) మేదినీపతి: - 
భూదేవికి భర్తయైనవాడు.

🍀 534) త్రిపద: - 
మూడు పాదములతో సమస్తము కొలిచినవాడు. వామనుడని భావము.

🍀 535) త్రిదశాధ్యక్ష: - 
జీవులనుభవించు జాగ్రుత, స్వప్న, సుషుప్త్య వస్థలకు సాక్షియైనవాడు.

🍀 536) మహాశృంగ: - 
ప్రళయకాల సాగరములోని నావను గొప్పదియైన తన కొమ్మున బంధించి సత్యవ్రతుని ఆయన అనుచరులైన ఋషులను ప్రళయము నుండి రక్షించినవాడు.

🍀 537) కృతాంతకృత్ - 
మృత్యువుని ఖండించినవాడు.

సశేషం.... 
🌹 🌹 🌹 🌹 🌹 

*🌹 Vishnu Sahasra Namavali - 57 🌹*
*Name - Meaning*
📚 Prasad Bharadwaj

*🌷 OM NARAYANAYA VIDMAHE VASUDEVAYA DHIMAHI । TANNO VISHNU PRACHODAYAT ॥ 🌷*
*Sloka for Swathi 1st Padam*

*🌻 57. maharṣiḥ kapilācāryaḥ kṛtajñō medinīpatiḥ |* *tripadastridaśādhyakṣō mahāśṛṅgaḥ kṛtāntakṛt || 57 || 🌻*

🌻 531. Maharṣiḥ Kapilācāryaḥ: 
Kapila is called Maharshi because he was master of all the Vedas.

🌻 532. Kṛtajñaḥ: 
Kruta means the world because it is of the nature of an effect.

🌻 533. Medinīpatiḥ: 
One who is the Lord of the earth.

🌻 534. Tripadaḥ: 
One having three strides.

🌻 535. Tridaśādhyakṣaḥ: 
One who is the witness of the three states of waking, dream and sleep, which spring from the influence of the Gunas.

🌻 536. Mahāśṛṅgaḥ: 
One with a great antenna.

🌻 537. Kṛtānta-kṛt: 
One who brings about the destruction of the Kruta or the manifested condition of 
the universe.

Continues....
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #విష్ణుసహస్రనామములు #VishnuSahasranama

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

Join and Share ALL
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://t.me/ChaitanyaVijnanam
https://pyramidbook.in/Chaitanyavijnanam

Join and Share 
🌹. భగవద్గీత BhagavadGita Telegram, WA, FB Groups 🌹
https://t.me/bhagavadgeethaa/
www.facebook.com/groups/bhagavadgeethaa/
https://chat.whatsapp.com/BzCAiTrm6X9K1NsjyGWzlg

Join and Share
విష్ణు సహస్రనామ స్తోత్రము / Vishnu Sahasranama group. 
https://t.me/vishnusahasranaam
www.facebook.com/groups/vishnusahasranaam/

Join and Share 
🌹. Daily satsang Wisdom 🌹 
www.facebook.com/groups/dailysatsangwisdom/
https://t.me/Seeds_Of_Consciousness
https://pyramidbook.in/dailywisdom

Join and Share 
🌹. వివేకచూడామణి Viveka Chudamani 🌹
www.facebook.com/groups/vivekachudamani/
https://pyramidbook.in/vivekachudamani

Join and Share
భారతీయ మహర్షుల బోధనలు MAHARSHULA WISDOM
www.facebook.com/groups/maharshiwisdom/
https://pyramidbook.in/maharshiwisdom

Join and Share 
🌹. శ్రీ లలితా దేవి చైతన్యము Sri Lalitha Devi Chatanyam 🌹
https://t.me/srilalithachaitanyavijnanam
http://www.facebook.com/groups/srilalithachaitanyavijnanam/

Join and share
Meher Baba అవతార్‌ మెహర్‌ బాబా
www.facebook.com/groups/avataarmeherbaba/

Join and Share
Thosophical Teachings దివ్యజ్ఞాన సందేశములు
www.facebook.com/groups/theosophywisdom/

Join and Share
🌹. శ్రీ దత్త చైతన్యం - Sri Datta Chaitanyam 🌹
www.facebook.com/groups/dattachaitanyam/

Join and Share
🌷. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు 🌷 
www.facebook.com/groups/masterek/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹