శ్రీ లలితా సహస్ర నామములు - 124 / Sri Lalita Sahasranamavali - Meaning - 124

🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 124 / Sri Lalita Sahasranamavali - Meaning - 124 🌹

🌻. మంత్రము - అర్ధం 🌻

📚. ప్రసాద్ భరద్వాజ

🍀 124. ఆదిశక్తి, రమేయా,ఽఽత్మా, పరమా, పావనాకృతిః |
అనేకకోటి బ్రహ్మాండ జననీ, దివ్యవిగ్రహా ‖ 124 ‖ 🍀

🍀 615. ఆదిశక్తిః -
ప్రథమముగా నున్న శక్తి స్వరూపిణి.

🍀 616. అమేయా -
కొలుచుటకు, గణించుటకు గాని, నిర్వహించుటకు గాని అలవికానిది.

🍀 617. ఆత్మా -
ఆత్మ స్వరూపిణి.

🍀 618. పరమా -
సర్వీత్కృష్టమైనది.

🍀 619. పావనాకృతిః -
పవిత్రమైన స్వరూపము గలది.

🍀 620. అనేకకోటి బ్రహ్మాండజననీ -
అనంతమైన సమూహములుగా నుండు బ్రహ్మాండములకు తల్లి.

🍀 621. దివ్యవిగ్రహా -
వెలుగుచుండు రూపము గలది.

సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹

🌹. Sri Lalita Sahasranamavali - Meaning - 124 🌹

📚. Prasad Bharadwaj

🌻 124. ādiśaktir ameyā''tmā paramā pāvanākṛtiḥ |
anekakoṭi-brahmāṇḍa-jananī divyavigrahā || 124 || 🌻

🌻 615 ) Adishakthi -
She who is the primeval force

🌻 616 ) Ameya -
She who cannot be measured

🌻 617 ) Atma -
She who is the soul

🌻 618 ) Parama -
She who is better than all others

🌻 619 ) Pavana krithi -
She who is personification of purity

🌻 620 ) Aneka koti Bramanda janani -
She who is the mother of several billions of universes

🌻 621 ) Divya Vigraha -
She who is beautifully made

Continues...

🌹 🌹 🌹 🌹 🌹

02 Sep 2021

మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 76

🌹. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 76 🌹

✍️. రచన : సద్గురు ఇ. కృష్ణమాచార్యులు
📚 . సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🌻. శాశ్వతసత్యము ఎవరి ధ్యానమును‌ బట్టి వారికి గోచరించును. 🌻

ఉన్నదే సత్యముగాని గోచరించునది సత్యము కాదు. భావము నిశ్చలమైనపుడు ఎవరి భావనను బట్టి వారికి సత్యము గోచరించును.

కర్తవ్యము ‌మనస్సును పవిత్రము చేసి‌ సంఘమునకు సుఖమును కలిగించును. సంఘము సుఖవంతము కావలెననియు దానికై తాను పాప విముక్తమైన మనస్సును పొందవలెననియు పాత్రత కలవాడు యోగించును.

తాను సుఖవంతుడు కావలెననియు, ప్రజలు పవిత్రులు కావలెననియు కోరునట్టి మనస్సు కలుషితమైనది.

అది మహాపదలను పుట్టించును. అట్టి సంఘమున నివసించువారికి మహాపదలు తప్పవు. ఈ స్థితి నుండి నిరంతరము రక్షింపబడుటకే యోగాభ్యాసము.

యజ్ఞార్థ కర్మ, యజ్ఞార్థ బుద్ధి యొక్క సద్వినియోగమునందు దృష్టి చెదురుట కలిధర్మములలో మొదటిది.

✍️. మాస్టర్ ఇ.కె.🌻

🌹 🌹 🌹 🌹 🌹

02 Sep 2021

వివేక చూడామణి - 124 / Viveka Chudamani - 124

🌹. వివేక చూడామణి - 124 / Viveka Chudamani - 124🌹

✍️ రచన : పేర్నేటి గంగాధర రావు
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🍀. 26. ఆత్మ మార్పులేనిది - 11 🍀

410. జ్ఞాని తన హృదయములో సమాధి ద్వారా బ్రహ్మాన్ని తెలుసుకొని, అది ఏ మాత్రము తిరుగులేని శాశ్వతత్వము, పూర్తి సత్యముతో, ఏ విధమైన వ్యతిరేకత లేకుండా ఉంది. శాంతమైన మహా సముద్రము దానికి పేరు లేదు. అందులో మంచిలేదు, చెడులేదు. అది శాశ్వతమైనది. శాంతిని పొందినది. ఏకమైనది.

411. ఎపుడైతే మనస్సు సమాధిలో విశ్రాంతిని పొందుతుందో అపుడు నీవు ఆత్మను నీలో దర్శించగలవు. అది శాశ్వతమై ఔన్నత్యమును పొంది, గత జన్మల వలన ఏర్పడిన బంధాలను వదిలించుకొని జాగ్రత్తగా మోక్ష స్థితిని పొందుతుంది. అనగా మోక్షానికి ముందు మానవ జన్మ ఎత్తవలసి ఉంటుంది.

412. ఆత్మను గూర్చి ధ్యానము చేయి. అది నీలోనే ఉన్నది. పరిమితమైన అన్ని విషయాలకు అది వేరుగా ఉన్నది. అదే ఉన్నతమై స్థిరమైన జ్ఞానము. అది ఒకటే రెండవది లేనిది. దానిని తెలుసుకొన్నప్పుడు నీవు పుట్టుక చావులకు అతీతముగా ముక్తిని పొందుతావు.

సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹

🌹 VIVEKA CHUDAMANI - 124 🌹

✍️ Sri Adi Shankaracharya
Swami Madhavananda

📚 Prasad Bharadwaj

🌻 26. Self is Unchangeable - 11 🌻

410. The wise man realises in his heart, through Samadhi, the Infinite Brahman, which is undecaying and immortal, the positive Entity which precludes all negations, which resembles the placid ocean and is without a name, in which there are neither merits nor demerits, and which is eternal, pacified and One.

411. With the mind restrained in Samadhi, behold in thy self the Atman, of infinite glory, cut off thy bondage strengthened by the impressions of previous births, and carefully attain the consummation of thy birth as a human being.

412. Meditate on the Atman, which resides in thee, which is devoid of all limiting adjuncts, the Existence - Knowledge - Bliss Absolute, the One without a second, and thou shalt no more come under the round of births and deaths.

Continues....

🌹 🌹 🌹 🌹 🌹

02 Sep 2021

శ్రీ శివ మహా పురాణము - 447

🌹 . శ్రీ శివ మహా పురాణము - 447🌹

రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. రుద్ర సంహితా - పార్వతీ ఖండః 🌴

అధ్యాయము - 30

🌻. పార్వతి గృహమునకు మరలి వచ్చుట - 1 🌻

నారదిట్లు పలికెను -

ఓ విధీ! తండ్రీ! మహాత్మా! పరమసత్యమును దర్శించు నీవు ధన్యుడవు. నీ అనుగ్రహముచే నేనీ అద్భుతగాథను వింటిని (1). శివుడు తన పర్వతమునకు వెళ్లిన పిదప సర్వమంగళయగు పార్వతి ఏమి చేసెను? ఎచటకు వెళ్లెను? ఓ మహా బుద్ధీ! నాకు ఆ గాథను చెప్పుము (2).

బ్రహ్మ ఇట్లు పలికెను-

వత్సా! ప్రీతితో వినుము. నేను శివుని స్మరించి, శివుడు తన ధామమునకు వెళ్లిన తరువాత జరిగిన వృత్తాంతమును చెప్పెదను (3). తన రూపమును సార్థకము చేసుకున్న పార్వతి కూడా సఖురాండ్రతో గూడి మహాదేవనామమును జపిస్తూ తన తండ్రిగారి గృహమునకు వెళ్లెను (4). మేనా హిమవంతులు పార్వతి రాకును గురించి విని హర్షమును పట్టజాలక దివ్యమగు రథమును నధిష్టించి ఎదురేగిరి (5). పురోహితులు, పౌరులు, పెద్ద సంఖ్యలో సఖురాండ్రు, బంధువులు మరియు ఇతరులు అందరు విచ్చేసిరి (6).

అపుడు మైనాకు మొదలగు సోదరులందరు మహానందముతో నిండిన వారై జయధ్వానమును చేస్తూ విచ్చేసిరి (7). ప్రకాశించే రాజ మార్గమునందు మంగళఘటమును స్థాపించిరి. రాజమార్గము చందనము, అగరు, కస్తూరి, ఫలములు మరియు శాఖలతో ప్రకాశించెను (8).

పురోహితులగు బ్రాహ్మణులతో, బ్రహ్మవేత్తలగు ఋషులతో, నాట్యముచేయు స్త్రీలతో, మరియు పర్వతముల వంటి గొప్ప ఏనుగులతో రాజమార్గము శోభిల్లెను (9). రెండు వైపులా అరటి స్తంభములచే అలంకిరంపబడిన ఆ రాజమార్గములో భర్త, పిల్లలు గల ముత్తైదువలు దీపములను చేతబట్టి గుంపులుగా నిలబడిరి (10).

అచట బ్రాహ్మణ బృందములు మంగళ ధ్వనిని చేయుచుండిరి. శంఖము మొదలగు అనేక వాద్యములు మ్రోయింప బడుచుండెను (11). ఇంతలో దుర్గ తన నగరమునకు సమీపించెను. ఆమె నగరములో ప్రవేశిస్తూనే, ఆనందము పట్టజాలని తల్లిదండ్రులను చూచెను (12). మిక్కిలి ప్రసన్నులై వేగముగా వచ్చిన వారిని చూచి కాళి మిక్కిలి సంతసించి, తన సఖురాండ్రతో సహా వారికి నమస్కరించెను (13). వారు పూర్ణమగు ఆశ్వీరచనములను పలికి 'ఓ అమ్మాయీ!' అని అక్కున చేర్చుకుని ప్రేమను పట్టజాలక ఆనందబాష్పములను రాల్చిరి (14).

సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹

02 Sep 2021

గీతోపనిషత్తు -248

🌹. గీతోపనిషత్తు -248 🌹

✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

📚. 8వ అధ్యాయము - అక్షర పరబ్రహ్మ యోగము 📚

శ్లోకము 26

🍀 25. నిశ్వాస - ఉచ్ఛ్వాస 🍀

శుక్ల కృషే గతీ హ్యేతే జగతః శాశ్వతే మతే |
ఏకయా యా త్యనావృత్తి మన్యయా 2 వర్తతే పునః || 26

తాత్పర్యము : శుక్ల కృష్ణ మార్గములు రెండునూ జగత్తున శాశ్వతముగ నుండునని తెలుపబడు చున్నవి. వాని వలన జన్మరాహిత్యము, పునర్జన్మము అను రెండు విధానములు శాశ్వతముగ తెరువబడి యున్నవి.

వివరణము : ఒక గృహము నందుగాని, గ్రామమునందు గాని, పట్టణము నందుగాని ప్రవేశించుటకు నిష్క్రమించుటకు మార్గము లుండవలెనుగదా! “లోపల, వెలుపల" మార్గములు

లేని నిర్మాణము నిరుపయోగము. సృష్టియంతయు అద్భుతమగు నిర్మాణము. దేవతలు, ఋషులు దైవ సహకారమున ఈ సృష్టి నిర్మాణము గావించి, ఇందు ప్రాణికోట్లను ప్రవేశపెట్టుట జరిగినది. ప్రవేశించువారికి నిష్క్రమణ మార్గము కూడ తెలుపబడినది. కనుకనే సృష్టి పరిపూర్ణము.

ఒక క్రీడారంగమున ప్రవేశించుట యే గాని నిష్క్రమించుట లేనిచో, అది కారాగారమే యగును గాని క్రీడారంగము కానేరదు. గుహలో ప్రవేశించిన వానికి సహితము వెలుపలకు చను మార్గము తెలిసి యుండవలెను. లోపలకు, వెలుపలకు గల మార్గములు తెలియుట జ్ఞానము. సృష్టి ఒక పద్మవ్యూహము వంటిది. అందు ప్రవేశించుటయే తెలిసి, నిష్క్రమించుట తెలియనపుడు నశించుట తథ్యమని అభిమన్యుని కథ అందించు చున్నది.

భగవద్గీత యందు వెలుపలకు చను మార్గము చెప్పుటకే ఈ అక్షర పరబ్రహ్మ యోగము తెలుపుట జరిగినది. 12, 13 శ్లోకముల యందు దేహమునుండి వెలువడు విధానము జీవులకు బోధించుట జరిగినది. సృష్టి లోపలకు, వెలుపలకు చరించు నారదాది మునీంద్రులు జీవులందరికిని ఆదర్శము. యథేచ్ఛగ సృష్టియను క్రీడారంగమున ప్రవేశించుచు, దివ్య సంకల్పములు నిర్వర్తించుచు, అపుడపుడు సృష్టికి ఆవల ప్రకాశించుచుండు తత్త్వము దర్శించుచు జీవించువారు నారదాది మహర్షులు, సనక సనందనాది కుమారులు మొదలగు వారు.

నారాయణ లోకము నుండి అధోలోకము వరకు అవరోహణము, ఆరోహణము చేయు మార్గములు తెలిసినవారే నిజమగు మార్గదర్శకులు. వారు కాలమును బట్టి, కర్తవ్యమును బట్టి కృష్ణ శుక్ల గతులను మన్నింతురు. భగవంతుని నిశ్వాసగ సృష్టిలోనికి దారి ఏర్పడగ, ఉచ్ఛ్వాసగ సృష్టినుండి భగవంతునికి దారు లేర్పడినవి. స్పందనాత్మకుడగు జీవునకు శ్వాస ఎట్లో, సృష్టియందు కూడ రాకపోకల మార్గమునకు వాని ఆవశ్యకతను తెలిసి వర్తించుట జ్ఞానము. ఒకదాని కన్న ఒకటి గొప్పదని భావించుట యోగ విరుద్ధము.

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹

02 Sep 2021

2-SEPTEMBER-2021 MESSAGES

1) 🌹. నిత్య పంచాంగము / Daily పంచాంగం గురువారం 2-సెప్టెంబర్-2021 🌹
2) 🌹. గీతోపనిషత్తు - సాంఖ్య యోగము - 249 🌹  
3) 🌹. శివ మహా పురాణము - 447🌹 
4) 🌹 వివేక చూడామణి - 124 / Viveka Chudamani - 124🌹
5)🌹. మాస్టర్ ఇ.కె సందేశాలు -76🌹  
6) 🌹 Osho Daily Meditations - 66🌹
7) 🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 124🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శుభ గురువారం మిత్రులందరికీ 🌹*
*ప్రసాద్ భరద్వాజ*

*🍀. శ్రీ నందనందనాష్టకం-1 🍀*

సుచారువక్త్రమండలం సుకర్ణరత్నకుండలమ్ |
సుచర్చితాంగచందనం నమామి నందనందనమ్ || 1

సుదీర్ఘనేత్రపంకజం శిఖీశిఖండమూర్ధజమ్ |
అనంతకోటిమోహనం నమామి నందనందనమ్ || 2
🌻 🌻 🌻 🌻 🌻

02 గురువారం, సెప్టంబర్‌ 2021
విక్రమ సంవత్సరం: 2078 ఆనంద
శఖ సంవత్సరం: 1943 ప్లవ
ఆయనం: దక్షిణాయణ, వర్ష ఋతువు
చాంద్రమానం : శ్రావణ మాసం
తిథి: కృష్ణ దశమి 06:23:02 వరకు తదుపరి కృష్ణ ఏకాదశి
పక్షం: కృష్ణ-పక్ష
నక్షత్రం: ఆర్ద్ర 14:57:01 వరకు తదుపరి పునర్వసు
యోగం: సిధ్ధి 10:09:23 వరకు తదుపరి వ్యతీపాత
 కరణం: విష్టి 06:22:01 వరకు
వర్జ్యం: 27:49:30 - 29:32:30
దుర్ముహూర్తం: 10:11:09 - 11:00:55 మరియు
15:09:48 - 15:59:34
రాహు కాలం: 13:48:55 - 15:22:14
గుళిక కాలం: 09:08:56 - 10:42:15
యమ గండం: 06:02:16 - 07:35:36
అభిజిత్ ముహూర్తం: 11:51 - 12:39
అమృత కాలం: 03:58:15 - 05:43:39
సూర్యోదయం: 06:02:16, సూర్యాస్తమయం: 18:28:53
వైదిక సూర్యోదయం: 06:05:51, 
వైదిక సూర్యాస్తమయం: 18:25:20
చంద్రోదయం: 01:29:17, చంద్రాస్తమయం: 15:06:40
సూర్య సంచార రాశి: సింహం, చంద్ర సంచార రాశి: జెమిని
ఆనందాదియోగం: కాల యోగం - అవమానం 14:57:01
వరకు తదుపరి సిద్ది యోగం - కార్య సిధ్ధి , ధన ప్రాప్తి 
పండుగలు :

*🍀. నిత్య ప్రార్థన 🍀*
వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ
నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా
యశివ నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా
తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం
తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.
🌹🌹🌹🌹🌹
Join and Share 
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://pyramidbook.in/Chaitanyavijnanam

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. గీతోపనిషత్తు -248 🌹*
✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్ 
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
*📚. 8వ అధ్యాయము - అక్షర పరబ్రహ్మ యోగము 📚*
శ్లోకము 26
 
*🍀 25. నిశ్వాస - ఉచ్ఛ్వాస 🍀*

శుక్ల కృషే గతీ హ్యేతే జగతః శాశ్వతే మతే |
ఏకయా యా త్యనావృత్తి మన్యయా 2 వర్తతే పునః || 26

తాత్పర్యము : శుక్ల కృష్ణ మార్గములు రెండునూ జగత్తున శాశ్వతముగ నుండునని తెలుపబడు చున్నవి. వాని వలన జన్మరాహిత్యము, పునర్జన్మము అను రెండు విధానములు శాశ్వతముగ తెరువబడి యున్నవి.

వివరణము : ఒక గృహము నందుగాని, గ్రామమునందు గాని, పట్టణము నందుగాని ప్రవేశించుటకు నిష్క్రమించుటకు మార్గము లుండవలెనుగదా! “లోపల, వెలుపల" మార్గములు
లేని నిర్మాణము నిరుపయోగము. సృష్టియంతయు అద్భుతమగు నిర్మాణము. దేవతలు, ఋషులు దైవ సహకారమున ఈ సృష్టి నిర్మాణము గావించి, ఇందు ప్రాణికోట్లను ప్రవేశపెట్టుట జరిగినది. ప్రవేశించువారికి నిష్క్రమణ మార్గము కూడ తెలుపబడినది. కనుకనే సృష్టి పరిపూర్ణము.

ఒక క్రీడారంగమున ప్రవేశించుట యే గాని నిష్క్రమించుట లేనిచో, అది కారాగారమే యగును గాని క్రీడారంగము కానేరదు. గుహలో ప్రవేశించిన వానికి సహితము వెలుపలకు చను మార్గము తెలిసి యుండవలెను. లోపలకు, వెలుపలకు గల మార్గములు తెలియుట జ్ఞానము. సృష్టి ఒక పద్మవ్యూహము వంటిది. అందు ప్రవేశించుటయే తెలిసి, నిష్క్రమించుట తెలియనపుడు నశించుట తథ్యమని అభిమన్యుని కథ అందించు చున్నది. 

భగవద్గీత యందు వెలుపలకు చను మార్గము చెప్పుటకే ఈ అక్షర పరబ్రహ్మ యోగము తెలుపుట జరిగినది. 12, 13 శ్లోకముల యందు దేహమునుండి వెలువడు విధానము జీవులకు బోధించుట జరిగినది. సృష్టి లోపలకు, వెలుపలకు చరించు నారదాది మునీంద్రులు జీవులందరికిని ఆదర్శము. యథేచ్ఛగ సృష్టియను క్రీడారంగమున ప్రవేశించుచు, దివ్య సంకల్పములు నిర్వర్తించుచు, అపుడపుడు సృష్టికి ఆవల ప్రకాశించుచుండు తత్త్వము దర్శించుచు జీవించువారు నారదాది మహర్షులు, సనక సనందనాది కుమారులు మొదలగు వారు. 

నారాయణ లోకము నుండి అధోలోకము వరకు అవరోహణము, ఆరోహణము చేయు మార్గములు తెలిసినవారే నిజమగు మార్గదర్శకులు. వారు కాలమును బట్టి, కర్తవ్యమును బట్టి కృష్ణ శుక్ల గతులను మన్నింతురు. భగవంతుని నిశ్వాసగ సృష్టిలోనికి దారి ఏర్పడగ, ఉచ్ఛ్వాసగ సృష్టినుండి భగవంతునికి దారు లేర్పడినవి. స్పందనాత్మకుడగు జీవునకు శ్వాస ఎట్లో, సృష్టియందు కూడ రాకపోకల మార్గమునకు వాని ఆవశ్యకతను తెలిసి వర్తించుట జ్ఞానము. ఒకదాని కన్న ఒకటి గొప్పదని భావించుట యోగ విరుద్ధము. 

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
#గీతోపనిషత్ #సద్గురుపార్వతీకుమార్
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share 
🌹. భగవద్గీత BhagavadGita Telegram, FB Groups 🌹
https://t.me/bhagavadgeethaa/
www.facebook.com/groups/bhagavadgeethaa/
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/chaitanyavijnanam/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 . శ్రీ శివ మహా పురాణము - 447🌹* 
రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ

*🌴. రుద్ర సంహితా - పార్వతీ ఖండః 🌴* 
అధ్యాయము - 30

*🌻. పార్వతి గృహమునకు మరలి వచ్చుట - 1 🌻*

నారదిట్లు పలికెను -

ఓ విధీ! తండ్రీ! మహాత్మా! పరమసత్యమును దర్శించు నీవు ధన్యుడవు. నీ అనుగ్రహముచే నేనీ అద్భుతగాథను వింటిని (1). శివుడు తన పర్వతమునకు వెళ్లిన పిదప సర్వమంగళయగు పార్వతి ఏమి చేసెను? ఎచటకు వెళ్లెను? ఓ మహా బుద్ధీ! నాకు ఆ గాథను చెప్పుము (2).

బ్రహ్మ ఇట్లు పలికెను-

వత్సా! ప్రీతితో వినుము. నేను శివుని స్మరించి, శివుడు తన ధామమునకు వెళ్లిన తరువాత జరిగిన వృత్తాంతమును చెప్పెదను (3). తన రూపమును సార్థకము చేసుకున్న పార్వతి కూడా సఖురాండ్రతో గూడి మహాదేవనామమును జపిస్తూ తన తండ్రిగారి గృహమునకు వెళ్లెను (4). మేనా హిమవంతులు పార్వతి రాకును గురించి విని హర్షమును పట్టజాలక దివ్యమగు రథమును నధిష్టించి ఎదురేగిరి (5). పురోహితులు, పౌరులు, పెద్ద సంఖ్యలో సఖురాండ్రు, బంధువులు మరియు ఇతరులు అందరు విచ్చేసిరి (6).

అపుడు మైనాకు మొదలగు సోదరులందరు మహానందముతో నిండిన వారై జయధ్వానమును చేస్తూ విచ్చేసిరి (7). ప్రకాశించే రాజ మార్గమునందు మంగళఘటమును స్థాపించిరి. రాజమార్గము చందనము, అగరు, కస్తూరి, ఫలములు మరియు శాఖలతో ప్రకాశించెను (8).

పురోహితులగు బ్రాహ్మణులతో, బ్రహ్మవేత్తలగు ఋషులతో, నాట్యముచేయు స్త్రీలతో, మరియు పర్వతముల వంటి గొప్ప ఏనుగులతో రాజమార్గము శోభిల్లెను (9). రెండు వైపులా అరటి స్తంభములచే అలంకిరంపబడిన ఆ రాజమార్గములో భర్త, పిల్లలు గల ముత్తైదువలు దీపములను చేతబట్టి గుంపులుగా నిలబడిరి (10).

అచట బ్రాహ్మణ బృందములు మంగళ ధ్వనిని చేయుచుండిరి. శంఖము మొదలగు అనేక వాద్యములు మ్రోయింప బడుచుండెను (11). ఇంతలో దుర్గ తన నగరమునకు సమీపించెను. ఆమె నగరములో ప్రవేశిస్తూనే, ఆనందము పట్టజాలని తల్లిదండ్రులను చూచెను (12). మిక్కిలి ప్రసన్నులై వేగముగా వచ్చిన వారిని చూచి కాళి మిక్కిలి సంతసించి, తన సఖురాండ్రతో సహా వారికి నమస్కరించెను (13). వారు పూర్ణమగు ఆశ్వీరచనములను పలికి 'ఓ అమ్మాయీ!' అని అక్కున చేర్చుకుని ప్రేమను పట్టజాలక ఆనందబాష్పములను రాల్చిరి (14).

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
#శివమహాపురాణము #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share 
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://t.me/ChaitanyaVijnanam
https://pyramidbook.in/Chaitanyavijnanam

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. వివేక చూడామణి - 124 / Viveka Chudamani - 124🌹*
✍️ రచన : *పేర్నేటి గంగాధర రావు*
సేకరణ : ప్రసాద్ భరద్వాజ 

*🍀. 26. ఆత్మ మార్పులేనిది - 11 🍀*

410. జ్ఞాని తన హృదయములో సమాధి ద్వారా బ్రహ్మాన్ని తెలుసుకొని, అది ఏ మాత్రము తిరుగులేని శాశ్వతత్వము, పూర్తి సత్యముతో, ఏ విధమైన వ్యతిరేకత లేకుండా ఉంది. శాంతమైన మహా సముద్రము దానికి పేరు లేదు. అందులో మంచిలేదు, చెడులేదు. అది శాశ్వతమైనది. శాంతిని పొందినది. ఏకమైనది. 

411. ఎపుడైతే మనస్సు సమాధిలో విశ్రాంతిని పొందుతుందో అపుడు నీవు ఆత్మను నీలో దర్శించగలవు. అది శాశ్వతమై ఔన్నత్యమును పొంది, గత జన్మల వలన ఏర్పడిన బంధాలను వదిలించుకొని జాగ్రత్తగా మోక్ష స్థితిని పొందుతుంది. అనగా మోక్షానికి ముందు మానవ జన్మ ఎత్తవలసి ఉంటుంది. 

412. ఆత్మను గూర్చి ధ్యానము చేయి. అది నీలోనే ఉన్నది. పరిమితమైన అన్ని విషయాలకు అది వేరుగా ఉన్నది. అదే ఉన్నతమై స్థిరమైన జ్ఞానము. అది ఒకటే రెండవది లేనిది. దానిని తెలుసుకొన్నప్పుడు నీవు పుట్టుక చావులకు అతీతముగా ముక్తిని పొందుతావు.

 సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 VIVEKA CHUDAMANI - 124 🌹*
✍️ Sri Adi Shankaracharya
Swami Madhavananda
📚 Prasad Bharadwaj

*🌻 26. Self is Unchangeable - 11 🌻*

410. The wise man realises in his heart, through Samadhi, the Infinite Brahman, which is undecaying and immortal, the positive Entity which precludes all negations, which resembles the placid ocean and is without a name, in which there are neither merits nor demerits, and which is eternal, pacified and One.

411. With the mind restrained in Samadhi, behold in thy self the Atman, of infinite glory, cut off thy bondage strengthened by the impressions of previous births, and carefully attain the consummation of thy birth as a human being.

412. Meditate on the Atman, which resides in thee, which is devoid of all limiting adjuncts, the Existence - Knowledge - Bliss Absolute, the One without a second, and thou shalt no more come under the round of births and deaths.

Continues.... 
🌹 🌹 🌹 🌹 🌹
#వివేకచూడామణి #VivekaChudamani #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share 
🌹. వివేకచూడామణి Viveka Chudamani 🌹
https://t.me/vivekchudamani
www.facebook.com/groups/vivekachudamani/
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://t.me/ChaitanyaVijnanam

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 76 🌹*
✍️. రచన : సద్గురు ఇ. కృష్ణమాచార్యులు 
📚 . సేకరణ : ప్రసాద్ భరద్వాజ

*🌻. శాశ్వతసత్యము ఎవరి ధ్యానమును‌ బట్టి వారికి గోచరించును. 🌻*

 ఉన్నదే సత్యముగాని గోచరించునది సత్యము కాదు. భావము నిశ్చలమైనపుడు ఎవరి భావనను బట్టి వారికి సత్యము గోచరించును.  

కర్తవ్యము ‌మనస్సును పవిత్రము చేసి‌ సంఘమునకు సుఖమును కలిగించును. సంఘము సుఖవంతము కావలెననియు దానికై తాను పాప విముక్తమైన మనస్సును పొందవలెననియు పాత్రత కలవాడు యోగించును. 

తాను సుఖవంతుడు కావలెననియు, ప్రజలు పవిత్రులు కావలెననియు కోరునట్టి మనస్సు కలుషితమైనది. 

అది మహాపదలను పుట్టించును. అట్టి సంఘమున నివసించువారికి మహాపదలు తప్పవు. ఈ స్థితి నుండి నిరంతరము రక్షింపబడుటకే యోగాభ్యాసము. 

యజ్ఞార్థ కర్మ, యజ్ఞార్థ బుద్ధి యొక్క సద్వినియోగమునందు దృష్టి చెదురుట కలిధర్మములలో మొదటిది.

✍️. *మాస్టర్ ఇ.కె.*🌻
🌹 🌹 🌹 🌹 🌹
#మాస్టర్‌ఇకెసందేశములు #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share
🌷. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు 🌷 
www.facebook.com/groups/masterek/
https://t.me/ChaitanyaVijnanam
 www.facebook.com/groups/chaitanyavijnanam/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 Osho Daily Meditations - 65 🌹*
📚. Prasad Bharadwaj

*🍀 65. SATORI - illumination 🍀*

*🕉 Many times glimpses if satori, illumination, come, but you cannot hold them. Don't be worried that you could not hold them for longer. Forget all about it. Just remember the situation in which it happened and try to move into that situation again and again. 🕉*

The experience is not important. How you were feeling, the situation, that is important. If you can re-create that situation, the experience will happen again. Experience is not important. The situation is important; how were you feeling? Flowing, loving ... what was the situation? Music may have been on, people may have been dancing, eating. Remember the flavor of food, or some beautiful person just by your side, a friend talking to you-and suddenly .... Just remember the aroma in which it happened, the field. Try to create that field. Just sit silently and try to create that situation again. 

Sometimes it happens accidentally, The whole science of yoga developed out of accidents. The first time, people were not looking for satori; how would they know about it? The first time it happened in a certain situation, and they became aware. They started seeking it, searching for methods to reach it. Naturally they became aware that if the situation could be created again, maybe the experience would follow. This is how, by trial and error, the whole science of yoga, tantra, and Zen developed. It took centuries to develop them. 

But everybody has to find in what situation his satori starts bubbling, samadhi starts happening. Everybody has to feel their own way. If you are just a little alert, after a few experiences you will become able to create these situations.

Continues...
🌹 🌹 🌹 🌹 🌹
#ఓషోబోధనలు #OshoDiscourse #OshoDailyMeditations #ఓషోనిర్మలధ్యానములు #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share 
🌹 ఓషో బోధనలు - Osho Teachings 🌹
https://t.me/ChaitanyaVijnanam 
http://www.facebook.com/groups/oshoteachings/
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://pyramidbook.in/Chaitanyavijnanam

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 124 / Sri Lalita Sahasranamavali - Meaning - 124 🌹*
🌻. మంత్రము - అర్ధం 🌻
📚. ప్రసాద్ భరద్వాజ

*🍀 124. ఆదిశక్తి, రమేయా,ఽఽత్మా, పరమా, పావనాకృతిః |*
*అనేకకోటి బ్రహ్మాండ జననీ, దివ్యవిగ్రహా ‖ 124 ‖ 🍀*

🍀 615. ఆదిశక్తిః - 
ప్రథమముగా నున్న శక్తి స్వరూపిణి.

🍀 616. అమేయా - 
కొలుచుటకు, గణించుటకు గాని, నిర్వహించుటకు గాని అలవికానిది.

🍀 617. ఆత్మా - 
ఆత్మ స్వరూపిణి.

🍀 618. పరమా - 
సర్వీత్కృష్టమైనది.

🍀 619. పావనాకృతిః -
 పవిత్రమైన స్వరూపము గలది.

🍀 620. అనేకకోటి బ్రహ్మాండజననీ - 
అనంతమైన సమూహములుగా నుండు బ్రహ్మాండములకు తల్లి.

🍀 621. దివ్యవిగ్రహా - 
వెలుగుచుండు రూపము గలది.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

*🌹. Sri Lalita Sahasranamavali - Meaning - 124 🌹*
📚. Prasad Bharadwaj 

*🌻 124. ādiśaktir ameyā''tmā paramā pāvanākṛtiḥ |*
*anekakoṭi-brahmāṇḍa-jananī divyavigrahā || 124 || 🌻*

🌻 615 ) Adishakthi -   
She who is the primeval force

🌻 616 ) Ameya -   
She who cannot be measured

🌻 617 ) Atma -   
She who is the soul

🌻 618 ) Parama -   
She who is better than all others

🌻 619 ) Pavana krithi -   
She who is personification of purity

🌻 620 ) Aneka koti Bramanda janani -   
She who is the mother of several billions of universes

🌻 621 ) Divya Vigraha -   
She who is beautifully made

Continues...
🌹 🌹 🌹 🌹 🌹
 #లలితాసహస్రనామ #LalithaSahasranama
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share 
🌹. శ్రీ లలితా దేవి చైతన్యము Sri Lalitha Devi Chatanyam 🌹
https://t.me/srilalithachaitanyavijnanam
http://www.facebook.com/groups/srilalithachaitanyavijnanam/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹