🌹 27, JULY 2023 THURSDAY ALL MESSAGES గురువారం, బృహస్పతి వాసర సందేశాలు 🌹

🍀🌹 27, JULY 2023 THURSDAY ALL MESSAGES గురువారం, బృహస్పతి వాసర సందేశాలు 🌹🍀
1) 🌹 27, JULY 2023 THURSDAY గురువారం, బృహస్పతి వాసరే, నిత్య పంచాంగము Daily Panchangam🌹
2) 🌹. శ్రీమద్భగవద్గీత - 404 / Bhagavad-Gita - 404 🌹
 🌴10వ అధ్యాయము - విభూతి యోగం - 32 / Chapter 10 - Vibhuti Yoga - 32 🌴
3) 🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 251 / Agni Maha Purana - 251 🌹 
🌻. శివ పూజా విధి వర్ణనము - 7 / Mode of worshipping Śiva (śivapūjā) - 7 🌻
4) 🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 116 / DAILY WISDOM - 116 🌹 
 🌻 25. చట్టం యొక్క తత్వశాస్త్రం యొక్క పునాది / 25. The Foundation of the Philosophy of Law 🌻
5) 🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 382 🌹*
6) 🌹. శివ సూత్రములు - 118 / Siva Sutras - 118 🌹 
🌻 2-07. మాతృక చక్ర సంబోధః   - 21 / 2-07. Mātrkā chakra sambodhah   - 21 🌻

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 27, జూలై, JULY 2023 పంచాంగము - Panchangam 🌹*
*శుభ గురువారం, బృహస్పతి వాసరే, Thursday*
*మనందరికి ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని పరమాత్మని స్మరిస్తూ - ప్రసాద్ భరద్వాజ*

*🌺. పండుగలు మరియు పర్వదినాలు : లేవు 🌺*

*🍀. శ్రీ దత్తాత్రేయ సహస్రనామ స్తోత్రం - 15 🍀*

*29. నిర్వికల్పః సురశ్రేష్ఠో హ్యుత్తమో లోకపూజితః |*
*గుణాతీతః పూర్ణగుణీ బ్రహ్మణ్యో ద్విజసంవృతః*
*30. దిగంబరో మహాజ్ఞేయో విశ్వాత్మాఽఽత్మపరాయణః* |
*వేదాంతశ్రవణో వేదీ కలావాన్నిష్కలత్రవాన్*

🌻 🌻 🌻 🌻 🌻

*🍀. నేటి సూక్తి : మానవ సంబంధాల నిస్సారతా భావం - ప్రాణకోశపు బాహ్యతల మందలి ఆశాభంగం వల్లనో, ఇతరులు తనను ప్రేమించడం మానివేసి నందువల్లనో, తనచే ప్రేమించ బడేవారు తాను మొదట్లో అనుకున్న దాని కంటే వేరు విధంగా ఉన్నట్టు తరువాత తెలుసు కున్నందు వల్లనో - ఇట్లెన్నో స్పష్టమైన కారణాలను పురస్కరించుకొని మానవ సంబంధాలను నిస్సారములుగా భావించడం ఒక్కొక్కప్పుడు
జరగవచ్చు. 🍀*

🌷🌷🌷🌷🌷

విక్రమ: 2080 నల, శఖ: 1945 శోభన
కలియుగాబ్ది : 5124, శోభకృత్‌,
వర్ష ఋతువు, దక్షిణాయణం,
శ్రావణ మాసం
తిథి: శుక్ల-నవమి 15:49:33 వరకు
తదుపరి శుక్ల-దశమి
నక్షత్రం: విశాఖ 25:29:17 వరకు
తదుపరి అనూరాధ
యోగం: శుభ 13:38:49 వరకు
తదుపరి శుక్ల
కరణం: కౌలవ 15:41:33 వరకు
వర్జ్యం: 06:51:58 - 08:29:06
మరియు 29:23:30 - 30:57:18
దుర్ముహూర్తం: 10:12:54 - 11:04:45
మరియు 15:23:59 - 16:15:49
రాహు కాలం: 13:59:44 - 15:36:56
గుళిక కాలం: 09:08:06 - 10:45:18
యమ గండం: 05:53:40 - 07:30:53
అభిజిత్ ముహూర్తం: 11:57 - 12:47
అమృత కాలం: 16:34:46 - 18:11:54
సూర్యోదయం: 05:53:40
సూర్యాస్తమయం: 18:51:22
చంద్రోదయం: 13:35:23
చంద్రాస్తమయం: 00:20:00
సూర్య సంచార రాశి: కర్కాటకం
చంద్ర సంచార రాశి: తుల
యోగాలు: వర్ధమాన యోగం - ఉత్తమ
ఫలం 25:29:17 వరకు తదుపరి 
ఆనంద యోగం - కార్య సిధ్ధి
దిశ శూల: దక్షిణం
✍️. శ్రీ వక్కంతం చంద్రమౌళి
🌻 🌻 🌻 🌻 🌻  

*🍀. నిత్య ప్రార్థన 🍀*
*వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ*
*నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా*
*యశివ నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా*
*తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం*
*తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ* 
*విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.*
🌹🌹🌹🌹🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీమద్భగవద్గీత - 404 / Bhagavad-Gita - 404 🌹*
*✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ*

*🌴. 10వ అధ్యాయము - విభూతి యోగం - 33 🌴*

*32. సర్గాణామాదిరన్తశ్చ మధ్యం చైవాహమర్జున |*
*ఆధ్యాత్మవిద్యా విద్యానాం వాద: ప్రవదతామహమ్ ||*

*🌷. తాత్పర్యం : ఓ అర్జునా! సమస్తసృష్టికి ఆది, అంతము, మధ్యమము కూడా నేనే. అదే విధముగా నేను శాస్త్రములలో ఆత్మకు సంబంధించిన ఆధ్యాత్మిక శాస్త్రమును, తార్కికులలో కడపటి సత్యమును అయియున్నాను.*

*🌻. భాష్యము : భౌతికతత్త్వముల సృష్టి యనునది సృష్టులలో ఆదియైనది. పూర్వము వివరింపబడినట్లు విశ్వము మహావిష్ణువుచే (గర్భోదకశాయివిష్ణువు మరియు క్షీరోదకశాయివిష్ణువు) సృష్టినొంది, పోషింపబడి, పిదప శివునిచే లయమొందింపబడును. బ్రహ్మదేవుడు వాస్తవమునకు గౌణసృష్టికర్త. విశ్వపు ఈ సృష్టి, స్థితి, లయకారకులందరును కృష్ణుని భౌతిక గుణావతారములు. కనుకనే శ్రీకృష్ణభగవానుడు సర్వసృష్టులకు ఆది, మధ్యము, అంతమునై యున్నాడు. ఉన్నతవిజ్ఞానము కొరకు నాలుగువేదములు, షడంగములు, వేదాంత సూత్రములు, తర్కశాస్త్రములు, ధర్మశాస్త్రములు, పురాణములు ఆది పలుగ్రంథములు గలవు.*

*మొత్తము మీద ఉన్నతవిజ్ఞానము కొరకు పదునాలుగు విభాగముల గ్రంథములు కలవు. వీటిలో ఆధ్యాత్మిక విద్యను ఒసగునట్టి గ్రంథము (ముఖ్యముగా వేదాంతసూత్రము) శ్రీకృష్ణుని ప్రాతినిధ్యము వహించును. తార్కికుల నడుమ వివిధములైన వాదములు జరుగుచుండును. నిదర్శనముతో తన వాడమునే బలపరచువాదము జల్పమనవడును. ప్రతిపక్షమును ఓడించుటయే ప్రధానముగా భావించి చేయబడు వాదము వితండము. కాని వాస్తవతత్త్వ నిర్ణయమే నిజమైన వాదము. అట్టి కడపటి సత్యము శ్రీకృష్ణుని ప్రాతినిధ్యము వహించును.*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Bhagavad-Gita as It is - 404 🌹*
*✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj*

*🌴 Chapter 10 - Vibhuti Yoga - 32 🌴*

*32. sargāṇām ādir antaś ca madhyaṁ caivāham arjuna*
*adhyātma-vidyā vidyānāṁ vādaḥ pravadatām aham*

*🌷 Translation : Of all creations I am the beginning and the end and also the middle, O Arjuna. Of all sciences I am the spiritual science of the self, and among logicians I am the conclusive truth.*

*🌹 Purport : Among the created manifestations, the first is the creation of the total material elements. As explained before, the cosmic manifestation is created and conducted by Mahā-viṣṇu, Garbhodaka-śāyī Viṣṇu and Kṣīrodaka-śāyī Viṣṇu, and then again it is annihilated by Lord Śiva. Brahmā is a secondary creator. All these agents of creation, maintenance and annihilation are incarnations of the material qualities of the Supreme Lord. Therefore He is the beginning, the middle and the end of all creation.*

*For advanced education there are various kinds of books of knowledge, such as the four Vedas, their six supplements, the Vedānta-sūtra, books of logic, books of religiosity and the Purāṇas. So all together there are fourteen divisions of books of education. Of these, the book which presents adhyātma-vidyā, spiritual knowledge – in particular, the Vedānta-sūtra – represents Kṛṣṇa. Among logicians there are different kinds of argument. Supporting one’s argument with evidence that also supports the opposing side is called jalpa. Merely trying to defeat one’s opponent is called vitaṇḍā. But the actual conclusion is called vāda. This conclusive truth is a representation of Kṛṣṇa.*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 251 / Agni Maha Purana - 251 🌹*
*✍️. పుల్లెల శ్రీరామచంద్రుడు, 📚. ప్రసాద్ భరద్వాజ*
*శ్రీ గణేశాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ.*
*ప్రథమ సంపుటము, అధ్యాయము - 74*

*🌻. శివ పూజా విధి వర్ణనము - 7 🌻*

*ఆత్మ - ద్రవ్య - మంత్రలింగ శుద్ధులు చేసిన పిమ్మట సకల దేవతలను పూజించవలెను. వాయువ్యమునందు, ''ఓం హాం గణపతయే నమః'' అని ఉచ్చరించుచు గణపతిని పూజించవలెను. ఈశాన్యమునందు ''ఓం హాం గురుభ్యో నమః'' అని చెప్పుచు గురు - పరమగురు - పరాత్పరగురు - పరమేష్ఠిగురువులను గురుపరంపరను పూజించవలెను. కూర్మరూప మగు శిలపై ఉన్న అంకురతుల్య మగు ఆధారశక్తిని పూజించి, బ్రహ్మశిలపై కూర్చున్న శివుని ఆసనమైన అనంతదేవుని ''ఓం హాం అనన్తాయ నమః'' అను మంత్రముతో పూజింపవలెను. శివుని సింహాసనముగా నున్న మంచమునకు నాలుగు కోళ్ళు ఉండును. వాటి ఆకారము సింహాకారమున విచిత్రముగా నుండును. ఈ సింహములు మండలాకారమున నిలచి ఎదుట నున్నదాని పృష్ఠభాగమును చూచు చుండును. ఇవి సత్య - త్రేతా - ద్వాపర - కలియుగములకు ప్రతీకములు. పిమ్మట శివుని ఆసనపాదుకలను పూజించవలెను. పిమ్మట ఆగ్నేయాది విదిశలలో నున్న ధర్మ - జ్ఞాన - వైరాగ్య - ఐశ్వర్యములను పూజింవలెను. వీటి రంగులు వరుసగ కర్పూర - కుంకుమ - సువర్ణ - కజ్జలము (కాటుక)లతో సమానముగ నుండును. వీటి నాలుగు కాళ్ళకును పూజ చేసి ఆసనముపై నున్న అష్టదలకమలము నందలి క్రింది దళములను, పై దళములను మొత్తము కలమలమును పూజించి, ''ఓం హాం కర్షికాయై నమః'' అను మంత్రముతో కర్ణికామధ్య భాగమును పూజించవలెను.*

*ఆ కమలము యొక్క ఎనిమిది పూర్వాది దళములందును, మధ్యభాగమునందును తొమ్మండుగురు శక్తులను పూజించవలెను. ఆ శక్తులు హస్తములలో చామరములు ధరించి యుందురు. వరద - అభయముద్రలు కూడ ఉండును. వామా-జ్యేష్ఠా-రౌద్రీ-కాలీ-కలవికారిణీ - బలవికారిణీ - బలప్రమథనీ - సర్వభూతదమనీ - మనోన్మనీ ఆను ఎనమండుగురు శక్తులను అష్టదలముల పైనను. మనోన్మని యను శక్తిని కమలకేసరములందును ''హాం కామాయై నమః'' ఇత్యాది మంత్రము లుచ్చరించుచు పూజించవలెను. పిమ్మట పృథివ్యాద్యష్టమూర్తులను, విశుద్ధవిద్యాదేహమును భావించుచు పూజ చేయవలెను. శుద్ధవిద్యను, తత్త్వవ్యాపక ఆసనమును పూజించవలెను. ఆ సింహాసనముపై కర్పూరము వలె తెల్లగా ఉన్నవాడును, సర్వవ్యాపియు, ఐదు ముఖములు గలవాడును అగు మహాదేవుని ప్రతిష్ఠ చేయవలెను. ఆయనకు పది భుజము లుండును. శిరస్సున అర్ధచంద్రు ఉండును. కుడి చేతులలో శక్తి - ఋష్టి - శూల - ఖట్వాంగ - వరదముద్ర లుండును. ఎడమ చేతులలో డమరు - బీజపూర - సర్పన - అక్షసూత్ర - నీలకమలము లను ధరించి యుండును.*

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Agni Maha Purana - 251 🌹*
*✍️ N. Gangadharan 📚. Prasad Bharadwaj *

*Chapter 74*
*🌻 Mode of worshipping Śiva (śivapūjā) - 7 🌻*

44-45. One should worship the goddess of the seat (of the god) in the kūmaśilā (the tortoise form on the stone) as possessing complexion of the tender shoots and the seat of Śiva known as ananta (endless) should be worshipped as seated on the brahmaśilā along with the attendants of the god such as Vicitra-keśa, Kṛta and Tretā who form the seat and shoes as they were of divinity.

46. Then the worshipper should worship righteousness, knowledge, detachment and prosperity, towards the south-east as possessing the hues of camphor, saffron, gold and collyrium respectively.

47-48. At the centre of the lotus-shaped diagram and in its petals in the east etc. one should worship the energy goddesses—Vāmā, Jyeṣṭhā, Raudrī, Kālī, Kālavikariṇī, Balavikaraṇī and Balapramathanī in order as holding the chowries and as conferring boons and offering protection.

49. One should worship (the goddesses)—Hāṃ, (salutations) to Sarvabhūtadamanī, (salutations) to Manonmanī, to Kṣiti, to Śuddhavidyā at the extremities of the petals (of the lotus diagram) as also the seat as spread over the component parts of the universe.

50-51. The lord of white complexion, possessing five faces and ten arms, all-pervasive, bearing the crescent moon and carrying weapons—spear, sword, lance, and staff in the right hands and a drum, citron, blue lotus, a string and a waterlily in the left hands should be located on the lion-seat.

Continues....
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 116 / DAILY WISDOM - 116 🌹*
*🍀 📖 . ఆత్మ యొక్క ఆరోహణ నుండి 🍀*
*✍️. ప్రసాద్ భరద్వాజ*

*🌻 25. చట్టం యొక్క తత్వశాస్త్రం యొక్క పునాది 🌻*

*ధర్మం అనేది ఒక అతీతమైన శక్తి. ఇది సంపూర్ణత యొక్క పరాకాష్టకు చేరుకునే వరకు చైతన్యం యొక్క క్రమబద్ధమైన ఏకీకరణను కోరుతుంది. ఈ విధంగా, ధర్మం అనేది వివిధ దశల్లో, సంపూర్ణత స్థాయిల్లో విశ్వం పని చేసే విధానం. ఇది సమగ్ర విశ్వ ఏకత్వం నుంచి అణు సముదాయ కదలికల వరకు పని చేస్తుంది. కాబట్టి సామాజిక చట్టాలు మరియు రాజకీయ పరిపాలనా వ్యవస్థల పట్ల ధర్మం పని చేయకుండా పోదు.*

*విశ్వాన్ని నడిపించే ఈ ధర్మం మాత్రమే వ్యక్తులకు వారి చర్యలు మరియు ప్రతిచర్యలకు తగిన ప్రతిఫలాన్ని, శిక్షని ఇస్తుంది. మానవ ప్రవర్తనలన్నింటికీ ఇదే ఆధారం. మానవులు పరస్పర ప్రేమ మరియు సహకారం కోసం పరితపిస్తూనే తోటివారి పట్ల అపనమ్మకంతో, దాడి చేయడానికి సిద్ధంగా ఉండే అర్థంకాని ప్రవర్తనకు కారణం ఇదే. ఇక్కడ మనకు, బహుశా, చట్టం యొక్క తత్వశాస్త్రం యొక్క పునాది ఉంది. నీతి మరియు నైతికతకు ధర్మం వల్ల విలువ ఉంది. ధర్మానికి ఒక అర్థం ఉంది. అది తనకు మించిన సత్యాన్ని సూచిస్తుంది.*

*కొనసాగుతుంది...*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 DAILY WISDOM - 116 🌹*
*🍀 📖 The Ascent of the Spirit 🍀*
📝 Swami Krishnananda
📚. Prasad Bharadwaj

*🌻 25. The Foundation of the Philosophy of Law 🌻*

*Law is a transcendent, connotative significance or force which demands a gradational integration of consciousness, both in quantity and quality simultaneously, until it reaches its culmination, which is known as the Absolute. Law is, thus, an operation of the system of the Absolute, in different evolutionary degrees of comprehensiveness and perfection, right from the Ultimate Causality of the universe down to the revolution of an atom or the vibration of an electron. Social laws and political systems of administration cannot, therefore, be separated from the requisitions necessitated by the law of the Absolute.*

*It is just this Universal Transcendent Principle that either rewards or punishes individuals by its gradational actions and reactions, and it is this, again, that is the basis of all human behaviour, looking so inscrutable, and this is the explanation as to why individuals strive for mutual love and cooperation, and, at the same time, keep themselves ready with a knife hidden in their armpits. Here we have, perhaps, the foundation of the philosophy of law. Ethics and morality have, thus, a necessary value. Law has a meaning, and it points to a truth beyond itself.*

Continues...
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 382 🌹*
*✍️. సౌభాగ్య 📚. ప్రసాద్ భరద్వాజ*

*🍀. ప్రార్ధన అంటే అనంతాన్ని ప్రేమించడం. అనంత విశ్వం పట్ల ప్రేమ, వృక్షాలతో, రాళ్ళతో, నదుల్తో, పర్వతాల్తో, నక్షత్రాల్తో స్నేహంగా వుండడం. 🍀*

*స్నేహంలో ఆధ్యాత్మికత వుంది. ప్రేమ శరీర సంబంధి. స్నేహం ఆధ్యాత్మికం. ప్రేమ స్నేహంగా మారకుంటే దాని గుండా అతను బాధపడాల్సి వుంటుంది. ఆనందం కన్నా అతను బాధల్ని ఎక్కువ పొందుతాడు. దానికి కారణం ప్రేమ శక్తిలో లేదు. ప్రేమ స్వచ్ఛంగా మార్చక పోవడంలో వుంది. కళాత్మకంగా లేకపోవడంలో వుంది. అది నీకు అందిందని అనుకోవడంలో వుంది.
నీ ప్రేమ స్నేహంగా వుండనీ. నీ ప్రేమ ప్రార్థనగా వుండనీ.*

*అక్కడ రెండు అవకాశాలున్నాయి. నువ్వు స్నేహంగా వున్న వ్యక్తి పట్ల ప్రేమగా వుంటే నువ్వు ఎందర్నో ప్రేమించగలవు. నీ సరిహద్దు విస్తరిస్తుంది. విశాలమవుతుంది. దాని వల్ల నువ్వు ప్రేమతో యితర్లని అంటుకుపోవడం అంటూ జరగదు. ప్రార్ధన అంటే అనంతాన్ని ప్రేమిస్తుంది. అనంత విశ్వం పట్ల ప్రేమ, వృక్షాలతో, రాళ్ళతో, నదుల్తో, పర్వతాల్తో, నక్షత్రాల్తో స్నేహంగా వుండడం. అట్లా వుంటే ప్రార్థన అన్నది మతమవుతుంది.*

*సశేషం ...*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శివ సూత్రములు - 118 / Siva Sutras - 118 🌹*
*🍀. శివ ఆగమ తత్వశాస్త్రం యొక్క సూత్రములు 🍀*
*2వ భాగం - శక్తోపాయ*
*✍️. ప్రసాద్‌ భరధ్వాజ*

*🌻 2-07. మాతృక చక్ర సంబోధః   - 21 🌻*
*🌴. ఒక గురువు సహాయంతో, యోగి మాతృక చక్ర జ్ఞానాన్ని మరియు మంత్ర శక్తులను స్వీయ-శుద్ధి మరియు స్వీయ-సాక్షాత్కారం కోసం ఎలా ఉపయోగించాలో తెలుసుకుంటాడు. 🌴*

*ఆ విధంగా, సృష్టించబడిన సృష్టికి తాను విశ్వం అని గ్రహించగలిగే చైతన్యంతో నింపబడాలి. ఇది సాధకుడికి అహం ఇదమ్ అని చెప్పుకునేలా చేస్తుంది, అంటే నేను ఇది, ఇక్కడ ఇది అంటే విశ్వం. శివ సంకల్పం అయిన శక్తి యొక్క అభివ్యక్తి వలన ఆధ్యాత్మిక అన్వేషకుడు ఈ దశను పొందుతాడు. ఈ చర్చ శివుడు మరియు శక్తి స్వతంత్రంగా కనిపించినప్పటికీ, వాస్తవానికి అవి ఒకే అస్తిత్వం అని కూడా నిరూపిస్తుంది. నిజమైన ఆధ్యాత్మిక అభిలాషిలో, ఈ వ్యక్తీకరణలన్నీ అతని కుండలినీ శక్తి ద్వారా జరుగుతాయి, ఇది నేను శివుడిని అని ధృవీకరించే ముగింపుకు అతన్ని నడిపిస్తుంది.*

*కొనసాగుతుంది...*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Siva Sutras  - 118 🌹*
*🍀Aphorisms of philosophy of Shiva āgama 🍀*
Part 2 - Śāktopāya.
*✍️. Acharya Ravi Sarma, 📚. Prasad Bharadwaj*

*🌻 2-07.  Mātrkā chakra sambodhah   - 21 🌻*
*🌴. With the help of an guru, a yogi gains the knowledge of matruka chakra and how to harness the mantra shaktis, for self-purification and self-realization.  🌴*

*Thus, the creation having been made is to be infused with consciousness that is capable of making one realise that he is the universe. This makes the aspirant to say aham idam, which means I am this, where this means the universe. A spiritual seeker attains this stage because of the manifestation of Śaktī, the will of Śiva. This discussion also goes to prove that Śiva and Śaktī, though appear to be independent, in reality They are single entity. In a true spiritual aspirant, all these manifestations happen through his kuṇḍalinī energy, which leads him to the logical conclusion of affirming I am Śiva.*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
Join and Share 
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
https://t.me/+9zDjTpPe_PQzMWVl
https://t.me/Sivasutras
https://t.me/Seeds_Of_Consciousness
https://t.me/bhagavadgeethaa/
https://t.me/AgniMahaPuranam
https://t.me/+LmH1GyjNXXlkNDRl
http://www.facebook.com/groups/srilalithachaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/
https://prasadbharadwaj.wixsite.com/dailybhaktimessages2
https://chaitanyavijnanam.tumblr.com/
https://prasadbharadwaj.wixsite.com/lalithasahasranama
https://www.threads.net/@prasad.bharadwaj

శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 466 - 2 / Sri Lalitha Chaitanya Vijnanam - 466 - 2


🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 466 - 2 / Sri Lalitha Chaitanya Vijnanam - 466 - 2 🌹

🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻

✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్

సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁

🍀 96. సుముఖీ, నళినీ, సుభ్రూః, శోభనా, సురనాయికా ।
కాలకంఠీ, కాంతిమతీ, క్షోభిణీ, సూక్ష్మరూపిణీ ॥ 96 ॥ 🍀

🌻 466. ‘సూక్ష్మరూపిణి’ - 2 / 466. 'Sukshmarupini' - 2🌻


రూపములు మందముగను, సున్నితముగను గోచరించును. సున్నితమగు రూపములలో మరీ సున్నితమగు రూపము లుండును. అందు పదార్థము తక్కువ, వెలుగెక్కువగ నుండును. ఇట్టి రూపములు కన్నులకు గోచరింపవు. ఋషుల రూపములు, దేవతా రూపములు ఇట్టి రూపములై యున్నవి. ఉదాహరణకు పంచభూతములతో చేయ బడిన రూపములలో పదార్థముతో చేయబడు రూపముకన్న, నీటితో చేయబడిన రూపము సున్నితము. అగ్నిరూపము మరింత సున్నితము. వాయు రూపము గోచరింపనంత సున్నితము. ఆకాశరూపము అన్నింటి కన్న సూక్ష్మముగ నుండును. ఇట్లు రూపములు స్థూలము, సూక్ష్మము, సూక్ష్మతరము, సూక్ష్మతమముగా యుండును. అవ్యక్తము నుండి వ్యక్తమునకు సృష్టి కొనిరాబడు చున్నప్పుడు ప్రకృతి అష్ట ప్రకృతులుగ సూక్ష్మము నుండి స్థూలమునకు యేర్పడును. ఇది అవరోహణ క్రమము.


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 466 - 2 🌹

Contemplation of 1000 Names of Sri Lalitha Devi

✍️ Prasad Bharadwaj

🌻 96. Sumukhi nalini subhru shobhana suranaeika
Karikanti kantimati kshobhini sukshmarupini ॥ 96 ॥ 🌻

🌻 466. 'Sukshmarupini' - 2 🌻


Appearances are thick and delicate. Among the delicate forms there is a very delicate form. That has less material and more light. These forms are invisible to the eyes. The forms of the sages and the forms of the gods are these forms. For example, among forms made of five elements, the form made of water is more sensitive than the form made of matter. Agnirupa is more sensitive. Vayu form is so subtle as to be invisible. The sky is the subtlest of all. These forms are gross, subtle and subtler. When creation is brought from the unmanifest to the manifest, the eight natures of nature are divided from the subtle to the gross. This is in descending order.


Continues...

🌹 🌹 🌹 🌹 🌹


Osho Daily Meditations - 18. BEHIND ANGER / ఓషో రోజువారీ ధ్యానాలు - 18. కోపం వెనుక



🌹. ఓషో రోజువారీ ధ్యానాలు - 18 / Osho Daily Meditations - 18 🌹

✍️. ప్రసాద్ భరద్వాజ

🍀 18. కోపం వెనుక 🍀

🕉. కోపం నుండి సృజనాత్మకతకు మారండి, వెంటనే మీలో గొప్ప మార్పు తలెత్తడాన్ని మీరు చూస్తారు. రేపు అవే విషయాలు కోపంగా ఉండటానికి సాకులుగా భావించవు. 🕉


కోపంతో బాధపడుతున్న వంద మందిలో, దాదాపు 50 శాతం మంది చాలా సృజనాత్మక శక్తితో బాధ పడుతున్నారు, అది వారు ఉపయోగించలేక పోయారు. వారి సమస్య కోపం కాదు, జీవితాంతం ఇలాగే ఆలోచిస్తూనే ఉంటారు. సమస్యను సరిగ్గా గుర్తించిన తర్వాత, అందులో సగం ఇప్పటికే పరిష్కరించ బడింది. మీ శక్తులను సృజనాత్మకతలో ఉంచండి. కోపాన్ని సమస్యగా మరచిపోండి; దానిని విస్మరించండి. మీ శక్తిని మరింత సృజనాత్మకత వైపు మళ్లించండి.

మీరు ఇష్టపడే దానిలో మిమ్మల్ని మీరు నింపుకోండి. కోపాన్ని మీ సమస్యగా మార్చుకునే బదులు, సృజనాత్మకత మీ ధ్యాన వస్తువుగా ఉండనివ్వండి. కోపం నుండి సృజనాత్మకతకు మారండి మరియు వెంటనే మీలో గొప్ప మార్పును మీరు చూస్తారు. మరియు రేపు అదే విషయాలు కోపంగా ఉండటానికి సాకులుగా భావించవు ఎందుకంటే ఇప్పుడు శక్తి కదులుతోంది, అది తనను తాను ఆనందిస్తోంది, దాని స్వంత నృత్యం. చిన్న చిన్న విషయాలను ఎవరు పట్టించుకుంటారు?


కొనసాగుతుంది...

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Osho Daily Meditations - 18 🌹

📚. Prasad Bharadwaj

🍀 18. BEHIND ANGER 🍀

🕉 Shift from anger to creativity, and immediately you will see a great change arising in you. Tomorrow the same things will not feel like excuses for being angry. 🕉


Out of one hundred people suffering from anger, about 50 percent suffer from too much creative energy that they have not been able to put into use. Their problem is not anger, but they will go on thinking their whole life that it is. Once a problem is diagnosed rightly, half of it is already solved.Put your energies into creativity. Forget about anger as a problem; ignore it. Channel your energy towards more creativity.

Pour yourself into something that you love. Rather than making anger your problem, let creativity be your object of meditation. Shift from anger to creativity and immediately you will see a great change arising in you. And tomorrow the same things will not feel like excuses for being angry because now energy is moving, it is enjoying itself, its own dance. Who cares about small things?


Continues...

🌹 🌹 🌹 🌹 🌹


శ్రీ శివ మహా పురాణము - 764 / Sri Siva Maha Purana - 764


🌹 . శ్రీ శివ మహా పురాణము - 764 / Sri Siva Maha Purana - 764🌹

✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి 📚. ప్రసాద్ భరద్వాజ

🌴. రుద్రసంహితా-యుద్ద ఖండః - అధ్యాయము - 16 🌴

🌻. దేవాసుర యుధ్ధము - 5 🌻

జలంధరుడిట్లు పలికెను - ఓ రాక్షసవీరులారా! బలశాలుడు, కాని పిరికి వారునగు ఇంద్రాది దేవతలతో మీరు భయంకరమగు యుద్ధమును చేయుడు (35). లక్షమంది మౌర్యులు, వందమంది దౌర్హృదులు, కోటిమంది కాలకేయాసురులు (36). లక్షమంది కంకులు మరియు ఇతరులు తమసైన్యములతో గూడి నా ఆజ్ఞచే బయలుదేరెదరు గాక! (37).

మీరందరు వివిధ వస్త్రములను, అస్త్రములను దోడ్కొని, సంశయములను విడనాడి నిర్భయులై, పెద్దపైన్యమును వెంటబెట్టుకొని సన్నద్ధులై బయలుదేరుడు (38). ఓ శుంభనిశుంభులారా! మహావీరులగు మీరిద్దరు యుద్ధమునకు భయపడే నీచులగు దేవతలను క్షణకాలములో నాశనము చేయుడు (39).

సనత్కుమారుడిట్లు పలికెను- యుద్ధనిపుణులగు ఆ రాక్షసులందరు జలంధరునిచే ఇట్లు ఆజ్ఞాపించబడిన వారై చతురంగ సైన్యముతో గూడి యుద్ధమును చేసిరి (40). దేవదానవులు గదలతో, పదునైన బాణములతో, శూలములతో, పట్టిశములతో, తోమరాయుధములతో, గొడ్డళ్లతో, శూలములతో ఒకరినొకరు సంహరించుకొనిరి (41). హృషీకేశుని సన్నిధిచే బలమును పొందియున్న మహావీరులగు దేవతలు కూడ ఇతరములగు వివిధాయుధములతో రాక్షసులను సంహరించిరి (42). దేవదానవులు సింహనాదములను చేస్తూ వాడి బాణములను ప్రయోగిస్తూ, మరియు రోకళ్లతో తోమరాయుధములతో యుద్దమును చేసిరి (43). ఈ తీరున దేవదానవులకు గొప్ప సంగ్రామము జరిగెను. అత్యుగ్రమగు ఆ యుద్దము మునులకు సిద్ధులకు భయమును కలిగించెను (44).

శ్రీ శివమహాపురాణములోరుద్రసంహితయందలి యుద్ధఖండలో దేవాసురయుద్ధ వర్ణన మనే పదునారవ అధ్యాయము ముగిసినది (16).


సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹




🌹 SRI SIVA MAHA PURANA - 764🌹

✍️ J.L. SHASTRI, 📚. Prasad Bharadwaj

🌴 Rudra-saṃhitā (4): Yuddha-khaṇḍa - CHAPTER 16 🌴


🌻 The battle of the gods - 5 🌻


Jalandhara said:—

35. O Excellent Asuras, put up a stiff fight with Indra and other gods who are always cowardly though they have a huge army.

36-37. At my bidding let all these come out with their entire army—the Mauryas numbering a hundred thousand, the Dhūmras in hundreds, the Asuras and the Kālakeyas in crores and the Kālakas, the Daurhṛdas and the Kaṅkas in lakhs.

38. All of you come out readily equipped with many divisions of the army and different kinds of weapons. Be fearless and free from hesitations.

39. O Śumbha, O Niśumbha, destroy in a trice the insignificant gods who feel nervous in the battle field. You are extremely valorous.


Sanatkumāra said:—

40-41. Thus the Asuras clever and efficient in battle, commanded by Jalandhara on the one hand and gods equipped with the four sorts of fighting groups on the other fought one another with maces, arrows, javelins, spears etc. They hit one another with axes and spears.

42. The strong ones hit and struck with different weapons. The heroic gods supported and invigorated by Hṛṣīkeśa roared like lions and discharged sharp arrows.

43. Some fought with arrows of very sharp points; some with pestles and iron clubs and some with axes and spears.

44. Thus the fight between the gods and the Asuras was terrific. It was very fierce frightening the sages and the Siddhas.


Continues....

🌹🌹🌹🌹🌹


విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 803 / Vishnu Sahasranama Contemplation - 803


🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 803 / Vishnu Sahasranama Contemplation - 803🌹

🌻803. మహాహ్రదః, महाह्रदः, Mahāhradaḥ🌻

ఓం మహాహృదాయ నమః | ॐ महाहृदाय नमः | OM Mahāhr‌dāya namaḥ


అవగాహ్య యదానన్దం విశ్రమ్య సుఖ మాసతే ।
మహాహ్రద ఇవ మహాయోగినస్స మహాహ్రదః ॥

గొప్ప హ్రదము అనగా మడుగువంటివాడు. ఏలయన ముముక్షువులు అనగా యోగులు ఆ పరమాత్ముని అనుభవము వలన కలుగు ఆనందమున మునిగి స్నానమాడి విశ్రాంతినంది సుఖముగ నుందురు గనుక.


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹




🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 803🌹

🌻803. Mahāhradaḥ🌻

OM Mahāhr‌dāya namaḥ


अवगाह्य यदानन्दं विश्रम्य सुख मासते ।
महाह्रद इव महायोगिनस्स महाह्रदः ॥

Avagāhya yadānandaṃ viśramya sukha māsate,
Mahāhrada iva mahāyoginassa mahāhradaḥ.


Since the yogis remain peaceful and happy plunging in the refreshing waters of His bliss, He is compared to a big pond of cool water; hence He is Mahāhradaḥ.


🌻 🌻 🌻 🌻 🌻


Source Sloka

सुवर्णबिंदुरक्षोभ्यस्सर्ववागीश्वरेश्वरः ।
महाह्रदो महागर्तो महाभूतो महानिधिः ॥ ८६ ॥

సువర్ణబిందురక్షోభ్యస్సర్వవాగీశ్వరేశ్వరః ।
మహాహ్రదో మహాగర్తో మహాభూతో మహానిధిః ॥ 86 ॥

Suvarṇabiṃdurakṣobhyassarvavāgīśvareśvaraḥ,
Mahāhrado mahāgarto mahābhūto mahānidhiḥ ॥ 86 ॥



Continues....

🌹 🌹 🌹 🌹🌹


కపిల గీత - 211 / Kapila Gita - 211


🌹. కపిల గీత - 211 / Kapila Gita - 211 🌹

🍀. కపిల దేవహూతి సంవాదం 🍀

✍️. ప్రసాద్‌ భరధ్వాజ

🌴 5. భక్తి స్వరూపము - కాలమహిమ - 21 🌴

21. అహం సర్వేషు భూతేషు భూతాత్మావస్థితస్సదా|
తమవజ్ఞాయ మాం మర్త్య కురుతేఽర్చావిడంబనమ్॥


తాత్పర్యము : భగవంతుడు ఆత్మస్వరూపమున సకలజీవుల యందును సర్వదా యుండును. సర్వప్రాణులలో ఆత్మస్వరూపముగా, భగవంతుడు అంతర్యామిగా ఉన్నవిషయమును విస్మరించి వారియెడ అనాదరభావము వహించుచు, కేవలము భగవత్ప్రతిమనే అర్చించు వాని పూజ ఆడంబరముతో గూడినదేయగును.

వ్యాఖ్య : పరమాత్మ అన్ని వేళలా అన్ని చోట్లా అందరిలో అంతర్యామిగా ఉంటాడు. ఈ విషయాన్ని కాస్తా మరచిపోయి, నిర్లక్షం చేసి, ఆ భావాన్ని వదిలిపెట్టి, ఆరాధనకు అర్భాటం చేస్తాడు. సర్వభూతాంతర్యామిగా ఉన్న నన్ను గుర్తించకుండా ఆరాధనలో ఆడంబరం చూపిస్తే అది ఆడంబరం మాత్రమే. అంతటా పరమాత్మను చూడగలిగినవాడు, పరమాత్మ రూపముగా ఉన్న వారందరినీ సమానముగా ఆదరిస్తాడు, ఆదరిస్తాడు. వారందరి సహకారముతో భగవానున్ని ఆరాధిస్తాడు. దాన్ని మర్చిపోయి అర్చావిడంబనం చేస్తున్న వారికి నా మీద భక్తి ఉండదు.


సశేషం..

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Kapila Gita - 211 🌹

🍀 Conversation of Kapila and Devahuti 🍀

📚 Prasad Bharadwaj

🌴 5. Form of Bhakti - Glory of Time - 21 🌴

21. ahaṁ sarveṣu bhūteṣu bhūtātmāvasthitaḥ sadā
tam avajñāya māṁ martyaḥ kurute 'rcā-viḍambanam

MEANING : I am present in every living entity as the Supersoul. If someone neglects or disregards that Supersoul everywhere and engages himself in the worship of the Deity in the temple, that is simply imitation.


PURPORT : In purified consciousness, or Kṛṣṇa consciousness, one sees the presence of Kṛṣṇa everywhere. If, therefore, one only engages in Deity worship in the temple and does not consider other living entities, then he is in the lowest grade of devotional service. One who worships the Deity in the temple and does not show respect to others is a devotee on the material platform, in the lowest stage of devotional service. A devotee should try to understand everything in relationship with Kṛṣṇa and try to serve everything in that spirit. To serve everything means to engage everything in the service of Kṛṣṇa. If a person is innocent and does not know his relationship with Kṛṣṇa, an advanced devotee should try to engage him in the service of Kṛṣṇa. One who is advanced in Kṛṣṇa consciousness can engage not only the living being but everything in the service of Kṛṣṇa.


Continues...

🌹 🌹 🌹 🌹 🌹



26 Jul 2023 Daily Panchang నిత్య పంచాంగము


🌹 26, జూలై, JULY 2023 పంచాంగము - Panchangam 🌹

శుభ బుధవారం, సౌమ్య వాసరే Wednesday

మనందరికి ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని పరమాత్మని స్మరిస్తూ - ప్రసాద్ భరద్వాజ

🌺. పండుగలు మరియు పర్వదినాలు : మాసిక దుర్గాష్టమి, Masik Durgashtami 🌺

🍀. శ్రీ గజానన స్తోత్రం - 04 🍀

04. జగత్ప్రమాణం జగదీశమేవ- -మగమ్యమాద్యం జగదాదిహీనమ్ |
అనాత్మనాం మోహప్రదం పురాణం గజాననం భక్తియుతా భజామః

🌻 🌻 🌻 🌻 🌻

🍀. నేటి సూక్తి : మానవ ప్రేమలోని కలగాపులగపు స్థితి - మానవ ప్రేమలో ప్రాణకోశ ప్రవృత్తులతో పాటు మనఃకోశ, అంతః హృదయకోశ ప్రవృత్తులు కూడా చేరి వుండవచ్చుననే మాట నిజమే. కాని, అదంతా ఒక కలగాపులగపు స్థితి. కనుకనే. ఒక దశకు వచ్చే సరికి జీవితము, ప్రపంచము, మానవ సమాజము, అందలి సంబంధాలు, ఈ మానవ సేవాభావం కూడా తక్కిన ప్రవృత్తుల వలెనే (ఆహంకార భూయిష్ఠం) - ఇవన్నీ నిస్సారములై గోచరిస్తాయి. 🍀

🌷🌷🌷🌷🌷



విక్రమ: 2080 నల, శఖ: 1945 శోభన

కలియుగాబ్ది : 5124, శోభకృత్‌,

వర్ష ఋతువు, దక్షిణాయణం,

శ్రావణ మాసం

తిథి: శుక్ల-అష్టమి 15:53:06 వరకు

తదుపరి శుక్ల-నవమి

నక్షత్రం: స్వాతి 25:11:39 వరకు

తదుపరి విశాఖ

యోగం: సద్య 14:39:54 వరకు

తదుపరి శుభ

కరణం: బవ 15:47:06 వరకు

వర్జ్యం: 05:55:38 - 07:36:06

మరియు 30:51:12 - 32:28:24

దుర్ముహూర్తం: 11:56:35 - 12:48:28

రాహు కాలం: 12:22:32 - 13:59:49

గుళిక కాలం: 10:45:14 - 12:22:32

యమ గండం: 07:30:39 - 09:07:57

అభిజిత్ ముహూర్తం: 11:57 - 12:47

అమృత కాలం: 15:58:26 - 17:38:54

సూర్యోదయం: 05:53:21

సూర్యాస్తమయం: 18:51:42

చంద్రోదయం: 12:40:01

చంద్రాస్తమయం: 00:20:00

సూర్య సంచార రాశి: కర్కాటకం

చంద్ర సంచార రాశి: తుల

యోగాలు: ధూమ్ర యోగం - కార్య

భంగం, సొమ్ము నష్టం 25:11:39 వరకు

తదుపరి ధాత్రి యోగం - కార్య జయం

దిశ శూల: ఉత్తరం

✍️. శ్రీ వక్కంతం చంద్రమౌళి

🌻 🌻 🌻 🌻 🌻




🍀. నిత్య ప్రార్థన 🍀

వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ

నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా

యశివ నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా

తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం

తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ

విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.

🌹🌹🌹🌹🌹