శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 278 / Sri Lalitha Chaitanya Vijnanam - 278

🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 278 / Sri Lalitha Chaitanya Vijnanam - 278 🌹

సహస్ర నామముల తత్వ విచారణ

✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

మూల మంత్రము :

🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁

🍀 65. భానుమండల మధ్యస్థా, భైరవీ, భగమాలినీ ।
పద్మాసనా, భగవతీ, పద్మనాభ సహోదరీ ॥ 65 ॥ 🍀

🌻 278. 'పద్మాసనా' 🌻

పద్మము ఆసనముగా గలది శ్రీదేవి అని అర్థము.

పద్మము సృష్టి చిహ్నము. సృష్టివలె పొరలు పొరలుగా విచ్చుకొనునది. పద్మదళములు ప్రకృతి మయములు. పద్మనాళము జ్ఞానమయ నాళము. ఈ నాళము బురద యగు భౌతిక సృష్టి నుండి పరతత్త్వమందుకొనుడు సత్యలోక స్థితి వఱకు వ్యాపించి యుండును. పద్మనాళము బ్రహ్మరంధ్రము వంటిది. దళముల అరలు, పొరలు వివిధలోకములై విప్పారును. దళముల యందలి కాంతి శుద్ధ చైతన్యము. పద్మముగా వ్యాప్తి చెందునది పరతత్త్వము.

దళము లన్నియూ నాళముతో సంబంధము కలిగియుండుట సృష్టి యందలి ఏకత్వమును, ఐక్యతను, యోగస్థితిని సూచించును. ఈ సృష్టియను పద్మమును అధిష్ఠించి యుండు చైతన్య స్వరూపిణి శ్రీమాత గనుక ఆమెయే పద్మాసనా. చతుర్ముఖ బ్రహ్మ సృష్టికర్త అగుటచే అతడు కూడ పద్మమున ఆసీనుడైనట్లు పురాణములు తెలుపుచున్నవి. అతడు ప్రత్యక్ష సృష్టికర్త.

శ్రీమాత పరోక్ష సృష్టికర్త. మానవుల యందు కూడా వివిధ లోకము లున్నవి. ఎన్ని లోకములు గలవో అన్ని పద్మములు కూడ ఏర్పడగలవు. పూర్ణ పురుషుల యందు పద్మము లన్నియూ వికసించి యుండును. వారు వికసించిన ముఖపద్మము కలిగి యుందురు. ఇతరులకు పద్మములు వికసింపక చక్రముల వలె యుండును. అన్ని లోకములయందు అన్ని పద్మముల యందు ఆసీనురాలై యుండునది శ్రీమాతయే.

ఆమె అనుగ్రహముననే చక్రములు పద్మములుగ విచ్చుకొనును. సహస్రార దళ పద్మమున పరమ శివునితో కూడియున్న శ్రీమాత జీవుల కొఱకు జీవ సృష్టిని గావించి తానే సహస్రారము నుండి ఆజ్ఞకు, అచ్చట నుండి విశుద్ధి కేంద్రమునకు, అటు తరువాత వెన్నెముక ద్వారా మూలాధారమునకు చేరును. శ్రీమాత మూలాధారమును చేరుటయే భౌతిక సృష్టికి ఆధారము.

ఆమె 'మూలాధారైక నిలయ'. జీవుని యొక్క పరిణామమును బట్టి మూలాధారము నుండి మరల తిరుగు ప్రయాణము ఊర్ధ్వగతిగ చేయును. కుండలిని వలె చుట్టలు చుట్టుకొనిన శ్రీమాత ఊర్ధ్వగతి చెందుటకు సంకల్పించినపుడు జీవుడు సాధన మార్గమును బట్టును. అతని సాధన యందలి శ్రద్ధా భక్తులను బట్టి శ్రీమాత ఊర్ధ్వముగ వ్యాప్తి చెందుచు షట్ పద్మముల నధిష్ఠించును. జీవుడు పరిపూర్ణుడై నపుడు సహస్రారమును చేరి శివునితో యోగించును.

ఆమె ననుసరించుచు జీవుడు కూడ పరమును చేరును. ఇట్లు పద్మము నందాసీన మైన సర్వమును నిర్వహించు చున్నది. శ్రీమాత. పద్మాసన యగు శ్రీమాతను ఆరాధించినచో దుఃఖములు తొలగును. భాగ్యమును పొందును. దేహము, గృహము స్వర్ణమయ మగును. స్త్రీ సహకారము పరిపూర్ణముగ నుండును. సుఖములతో కూడిన దైవయోగ ముండును. పద్మము ఆసనముగా గల శ్రీమాత సర్వ శుభంకరి అని ఎఱుగవలెను. పద్మము అతి విస్తారమైన సంకేతము. ఇతర నామములలో మరికొంత వివరింపబడును.

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹

🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 278 🌹

1000 Names of Sri Lalitha Devi

✍️. Ravi Sarma
📚. Prasad Bharadwaj

🍀 65. bhānumaṇḍala-madhyasthā bhairavī bhagamālinī |
padmāsanā bhagavatī padmanābha-sahodarī || 65 || 🍀

🌻 Padmāsanā पद्मासना (278) 🌻

She is seated on a lotus or She is sitting in the posture of padmāsana (a yogic way of sitting, cross legged). Padma means lotus. When one is seated in padmāsana, the posture will appear like a lotus.

The leaves of lotus creeper are compared to prakṛti (the source of objectivity), its filaments to vikṛti (categories, changed condition), and its stalk to knowledge. Padma also means the Goddess of wealth Lakṣmī. In this context it indicates that She distributes wealth to Her devotees.

Here wealth does not mean material wealth only, but also the intellectual wealth, the capacity to have higher level of consciousness, needed to realise the Brahman. It could also mean the Brahma, the lord of Creation.

Continues...

🌹 🌹 🌹 🌹 🌹

13 Jun 2021

నిర్మల ధ్యానాలు - ఓషో - 30

🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 30 🌹

✍️. సౌభాగ్య
📚. ప్రసాద్ భరద్వాజ

🍀. గతాన్ని వదులుకుంటే అనంతానికి, శాశ్వతత్వానికి తలుపులు తెరుస్తావు. 🍀

ధైర్యమంటే ఏమిటి? దానికి విశిష్టమయిన అర్థాన్ని యిస్తే ధైర్యమంటే మనకు పరిచితమైన దాన్ని, తెలిసిన దాన్ని వదులుకునే సామర్థ్యం. ఎందుకంటే మనసంటే అదే. పరిచితమైంది. తెలిసింది. గతం. నువ్వొకసారి గతాన్ని వదులుకుంటే అనంతానికి, శాశ్వతత్వానికి తలుపులు తెరుస్తావు.

కానీ అట్లా సిద్ధపడడానికి మనిషి భయపడతాడు. అనంత శూన్యంలో అన్నీ కోల్పోతానని ఆందోళనకు గురవుతాడు. మనసు చాలా చిన్న విషయం. అది సుఖంలో వుంటుంది. చిన్ని పురుగు. అది బంగారు పంజరం లాంటిది. అది అందంగా వుంటుంది. నువ్వు దాన్ని అలంకరించవచ్చు. ప్రతి ఒక్కరూ దాన్ని అలంకరించడానికి ప్రయత్నిస్తారు.

మన విధ్యా విధానమంతా అదే. ఆ బంగారు పంజరాన్ని ఎంత అందంగా అలంకరిస్తారంటే దాంట్లోంచి బయటపడడం దాదాపు అసాధ్యం. దానికి అతుక్కుపోతావు. నీకు రెక్కలున్న సంగతి మరచిపోతావు. అనంత ఆకాశం నీకు ఆహ్వానం పలుకుతోంది. నువ్వు నక్షత్రాల కేసి సాగవచ్చు. నీ ముందు ఎంతో దూరం పరచుకుని వుంది.

అందువల్ల ధైర్యంగా బంగారు పంజరమనే మనసును వదిలిపెట్టి అజ్ఞాతమైన దాని కేసి, తెలియని దానికేసి వెళ్ళగలగడమే సాహసం. అన్ని భయాల్ని, అన్ని భ్రమల్ని, భద్రతల్ని వదలిపెట్టి వెళ్ళడం అట్లాంటి లక్షణాలున్న వ్యక్తి మాత్రమే మతమున్నవాడు.

సశేషం ...

🌹 🌹 🌹 🌹 🌹

13 Jun 2021

వివేక చూడామణి - 87 / Viveka Chudamani - 87

🌹. వివేక చూడామణి - 87 / Viveka Chudamani - 87🌹

✍️ రచన : పేర్నేటి గంగాధర రావు
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🍀. 21. అహంభావము - 3 🍀

299. ఎవరికైన ఈ అహంకారముతో సంబంధమున్నచో అట్టి వ్యక్తి విముక్తిని గూర్చి మాట్లాడవలసిన పని లేదు. విముక్తి అనేది తిరుగులేనిది.

300. అహంకారము యొక్క బంధనాల నుండి స్వేచ్ఛను పొందాలంటే వ్యక్తి తన యొక్క అసలు సత్యమైన, స్వచ్ఛమైన, శాశ్వతమైన ఎల్లపుడు ఆనంద స్థితిలో ఉండేది, స్వయం ప్రకాశవంతమైన ఆత్మను పొందాలి. ఎలానంటే రాహుగ్రహము నుండి విముక్తి పొందిన చంద్రుడు ఎలా ప్రకాశిస్తాడో అలాగా.

301. బుద్ది వలన మాలిణ్యముతో కూడిన భౌతిక సంబంధములు ఎలా సృష్టించబడినవో, అవి శరీరానికి కళంకము తెచ్చి, నేను బలవంతుడును, నేను అమాయకుడను, నేను సంతోషముతో ఉన్నాను అనే భావనలు అహంతో చోటుచేసుకొను చున్నాయి. ఎపుడైతే ఈ అహంభావము నాశనం అయిపోతుందో అపుడే ఏ అడ్డంకులు లేకుండా బ్రహ్మమును పొందగలడు.

సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹

🌹 VIVEKA CHUDAMANI - 87 🌹

✍️ Sri Adi Shankaracharya
Swami Madhavananda

📚 Prasad Bharadwaj

🌻 21. Ego Feeling - 3 🌻

299. So long as one has any relation to this wicked ego, there should not be the least talk about Liberation, which is unique.

300. Freed from the clutches of egoism, as the moon from those of Rahu, man attains to his real nature, and becomes pure, infinite, ever blissful and self-luminous.

301. That which has been created by the Buddhi extremely deluded by Nescience, and which is perceived in this body as "I am such and such" – when that egoism is totally destroyed, one attains an unobstructed identity with Brahman.

Continues....

🌹 🌹 🌹 🌹 🌹

13 Jun 2021

దేవాపి మహర్షి బోధనలు - 98

🌹. దేవాపి మహర్షి బోధనలు - 98 🌹

✍️. సద్గురు కె. పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🌻 78. మధుర మార్గము -2 🌻

మధుర మార్గమునకు జగద్గురువే గురువు. అతడే శ్రీకృష్ణుడు. అతని సాన్నిధ్య స్థితియే మధురానగరము. ఋషులు, దేవర్షులు, దేవతలు, మునులు, యోగులు నిమిత్త కారణములను గైకొని దివ్య మాధుర్యమునకై మధురానగరము వచ్చి పోవుచు నుండెడివారు.

మముబోంట్ల వారి మాట యిక చెప్ప నవసరము లేదు. జగత్తునే మోహింప చేయగల చరితము శ్రీకృష్ణునిది. అతని సాన్నిధ్యము వర్ణనాతీతమగు మాధుర్యము కలిగించును. జీవుల అస్థిత్వమునే మరపింపచేయగల మాధుర్య మాయన సాన్నిధ్యమున నున్నది. గోప స్త్రీలే యన నేల? నారదాది మహర్షులు సైతము, అతని సాన్నిధ్య మాధుర్యమునకై తపన చెందుచుండిరి. అతని చూపు మధురము, నడక మధురము, నవ్వు మధురము, మాట మధురము, చేత మధురము, గానము మధురము, రథసారథ్యము మధురము.

పరవశము కలిగించు అతని రూపమును చూచి మహా భారత యుద్ధమున శత్రువులందరును అతని ముందే చేరిరి. యుద్ధమును గమనించిన మాబోటి వారికిది విదితము. అర్జునుని అస్త్రములచే సంహరింపక మునుపే కృష్ణుని చూపులతో చూపులను కలిపి శత్రువు లతనిని చేరిరి. కేవలము రక్తమాంసాదులతో కూడిన దేహములనే అర్జునుడు వధించెను. యుద్ధమున భీష్ముడొకడే ఇది గమనించెను.

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹

13 Jun 2021

విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 420, 421 / Vishnu Sahasranama Contemplation - 420, 421

🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 420 / Vishnu Sahasranama Contemplation - 420🌹

📚. ప్రసాద్ భరద్వాజ

🌻420. పరిగ్రహః, परिग्रहः, Parigrahaḥ🌻

ఓం పరిగ్రహాయ నమః | ॐ परिग्रहाय नमः | OM Parigrahāya namaḥ

గృహ్యతే సర్వగతత్వాత్ పరితః శరణార్థిభిః ।
పరితో జ్ఞాయతే వేతి పరిగృహ్ణాతి వార్పితం ।
పుత్రపుష్పాదికం భక్తైరితి వాఽయం పరిగ్రహః ॥

పరమాత్ముడు తాను సర్వగతుడు కావున తన శరణము కోరువారిచేత అన్ని వైపులనుండియు ఆశ్రయించ బడుచున్నాడు. లేదా భక్తులచే అర్పించబడు పత్రపుష్పాదికమును స్వీకరించును.

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹

🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 420🌹

📚. Prasad Bharadwaj

🌻 420. Parigrahaḥ 🌻

OM Parigrahāya namaḥ

Gr̥hyate sarvagatatvāt paritaḥ śaraṇārthibhiḥ,
Parito jñāyate veti parigr̥hṇāti vārpitaṃ,
Putrapuṣpādikaṃ bhaktairiti vā’yaṃ parigrahaḥ.

गृह्यते सर्वगतत्वात् परितः शरणार्थिभिः ।
परितो ज्ञायते वेति परिगृह्णाति वार्पितं ।
पुत्रपुष्पादिकं भक्तैरिति वाऽयं परिग्रहः ॥

Since He is all pervading, He is approached on all sides by those who take refuge in Him. Or as He is omnipresent, He receives offerings made by His devotees.

🌻 🌻 🌻 🌻 🌻

Source Sloka

ऋतुस्सुदर्शनः कालः परमेष्ठी परिग्रहः ।
उग्रस्संवत्सरो दक्षो विश्रामो विश्वदक्षिणः ॥ ४५ ॥

ఋతుస్సుదర్శనః కాలః పరమేష్ఠీ పరిగ్రహః ।
ఉగ్రస్సంవత్సరో దక్షో విశ్రామో విశ్వదక్షిణః ॥ ౪౫ ॥

R̥tussudarśanaḥ kālaḥ parameṣṭhī parigrahaḥ ।
Ugrassaṃvatsaro dakṣo viśrāmo viśvadakṣiṇaḥ ॥ 45 ॥

Continues....

🌹 🌹 🌹 🌹🌹

🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 421 / Vishnu Sahasranama Contemplation - 421🌹

📚. ప్రసాద్ భరద్వాజ

🌻421. ఉగ్రః, उग्रः, Ugraḥ🌻

ఓం ఉగ్రాయ నమః | ॐ उग्राय नमः | OM Ugrāya namaḥ

సూర్యాదినామపి భయ హేతుత్వాదుగ్ర ఉచ్యతే ।
భీషోదేతి సూర్య ఇతి శ్రుతి వాక్య బలాద్ధరిః ॥

భయముగొలుపువాడు. సూర్యుడు మొదలగు వారిని కూడ భయమును కలిగించువాడు.

:: తైత్తిరీయోపనిషత్ - ఆనందవల్లి (బ్రహ్మానందవల్లి) ద్వితీయాధ్యాయః - అష్టమోఽనువాకః ::

భీషాఽస్మాద్వాతః పవతే । భీషోదేతి సూర్యః । భీషాఽస్మాదగ్నిశ్చేన్ద్రశ్చ । మృత్యుర్ధావతి పఞ్చమ ఇతి । ... (1)

వాయువు పరబ్రహ్మము భయము చేత వీచుచున్నది. సూర్యుడు సైతమూ పరబ్రహ్మము భయము వలన ఉదయించుచున్నాడు. పరబ్రహ్మము వలన భయముచేత అగ్నియు, ఇంద్రుడు, అయిదవవాడగు యముడును ప్రవర్తించుచున్నారు.

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹

🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 421🌹

📚. Prasad Bharadwaj

🌻421. Ugraḥ🌻

OM Ugrāya namaḥ

Sūryādināmapi bhaya hetutvādugra ucyate,
Bhīṣodeti sūrya iti śruti vākya balāddhariḥ.

सूर्यादिनामपि भय हेतुत्वादुग्र उच्यते ।
भीषोदेति सूर्य इति श्रुति वाक्य बलाद्धरिः ॥

One who is the cause of fear even to entities like Sun.

Taittirīya Upaniṣad - Ānandavalli (Brahmānandavalli) Section II - Chapter VIII
Bhīṣā’smādvātaḥ pavate , bhīṣodeti sūryaḥ , bhīṣā’smādagniścendraśca , mr̥tyurdhāvati pañcama iti , ... (1)

:: तैत्तिरीयोपनिषत् - आनंदवल्लि (ब्रह्मानंदवल्लि) द्वितीयाध्यायः - अष्टमोऽनुवाकः ::
भीषाऽस्माद्वातः पवते । भीषोदेति सूर्यः । भीषाऽस्मादग्निश्चेन्द्रश्च । मृत्युर्धावति पञ्चम इति । ... (१)

From Its (parabrahma) fear, the wind blows; from fear rises the sun, from the fear of It again Indra, Fire and the fifth i.e., death, proceed (to their respective duties).

🌻 🌻 🌻 🌻 🌻

Source Sloka

ऋतुस्सुदर्शनः कालः परमेष्ठी परिग्रहः ।
उग्रस्संवत्सरो दक्षो विश्रामो विश्वदक्षिणः ॥ ४५ ॥

ఋతుస్సుదర్శనః కాలః పరమేష్ఠీ పరిగ్రహః ।
ఉగ్రస్సంవత్సరో దక్షో విశ్రామో విశ్వదక్షిణః ॥ ౪౫ ॥

R̥tussudarśanaḥ kālaḥ parameṣṭhī parigrahaḥ ।
Ugrassaṃvatsaro dakṣo viśrāmo viśvadakṣiṇaḥ ॥ 45 ॥

Continues....

🌹 🌹 🌹 🌹🌹

13 Jun 2021

సర్వరోగ నివారణి సూర్య స్తోత్రం

🌹. సర్వరోగ నివారణి సూర్య స్తోత్రం 🌹

సూర్యభగవానుడు ఆరోగ్య ప్రదాత.

ఐశ్వర్య ప్రదాత కర్మ సాక్షి ప్రత్యక్ష నారాయణుడు.

సమస్త సూర్యమండలానికి వెలుగును ప్రసాదించే దైవము. అటువంటి సూర్యారాధన సమస్త రోగములను హరించి ఆరోగ్యమును అందిస్తుంది.

సర్వ రోగాలు మాయమవ్వాలంటే సూర్యభగవానుడిని స్తుతించండి.
శక్తివంతమైన సూర్య స్తోత్రమును ప్రతిరోజూ పఠిస్తే--రోగాలు దరిచేరవు.

1::ఉద్యన్నద్య వివస్వాన్ ఆరోహన్నుత్తరాం దివందేవః
హృద్రోగం మమ సూర్యో హరిమాణం చాశునాశయతు

2::నిమిషార్టే నైకేన త్వేచశ తేద్వేసహస్రేద్వే
క్రమమాణ యోజనానాం నమోస్తుతే నళిననాధాయ

3::కర్మజ్ఞానఖదశకం మనశ్చజీవ ఇతి విశ్వసర్గాయ
ద్వాదశధాయోవిచరతి సద్వాదశమూర్తి రస్తు మోదాయ

4::త్వం యజుఋక్ సామత్వం త్వమాగమస్త్వం వషట్కారః
త్వం విశ్వం త్వం హంసః త్వం భానో ! పరమహంసశ్చ

5::శివరూపాత్ జ్ఞానమహంత్వత్తో ముక్తిం జనార్దనాకారాత్
శిఖిరూపాదైశ్వర్యం భవతశ్చారోగ్యమిచ్చామి

6::త్వచిరోషా దృశిదోషా హృదిదోషా యే~ఖిలేంద్రి యజదోషాః
తాన్ పూషా హతదోషః కించిద్రోషాగ్నినాదహదు

7::తిమిరమివ నేత్రతిమిరం పటలమివాశేషరోగపటలం నహః
కాచమివాధినికోశం కాలపితారోగశూన్యతాం కురుతాత్

8::యశ్యచ సహస్రాంశోరభిషులేశో హిమాంశు బింబగతః
భాసయతి నక్తమఖిలం కీలయతు విపద్గణానరుణః

9::యేనవినాంధం తమసం జగదేతత్, యత్రసతి చరాచరం విశ్వం
దృతబోధం, తం నళినీ భర్తారం హర్తారమా పదామీళే

10::వాతాశ్మరీ గదార్శః త్వగ్దోష మహోదర (ప్రమేహాంశ్చ)
గ్రహణీ భగంధరాఖ్యా మహారుజోపిత్వమేవహంసి

11::ధర్మార్ధ కామ మోక్ష ప్రతిరోధిన ఉగ్రతాపవేగకరాన్
బందీకృతేంద్రియ గణాన్ గదాన్ విఖండ యతుచండాంశుః

12::త్వం మాతాత్వం శరణత్వం దాతాత్వం ధనః త్వమాచార్యః
త్వం త్రాతా త్వం హర్తావిపదాం ; అర్క ! ప్రసీద మమ

ఫలశ్రుతి.
ఇత్యార్యా ద్వాదశకం సాంబస్య పురోనభా స్థలాత్పతితం
పఠతాం భాగ్యసమృద్ధిః సమస్త రోగక్షయ స్స్యాత్

ఈ స్తోత్రాన్ని శ్రద్ధతో పఠించేవారికి భాగ్యాభివృద్ధి కలుగుతుంది.
సకల అనారోగ్య సమస్యలు హరింపబడతాయి.

🌹 🌹 🌹 🌹 🌹

13 Jun 2021

13-JUNE-2021 MESSAGES

1) 🌹 శ్రీమద్భగవద్గీత - 1-49 / Bhagavad-Gita - 1-49 - 2 - 2 🌹
2) 🌹 శ్రీమద్భగవద్గీత - 617 / Bhagavad-Gita - 617 - 18-28🌹 
3) 🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 420 421 / Vishnu Sahasranama Contemplation - 420, 421🌹
4) 🌹 Daily Wisdom - 124🌹
5) 🌹. వివేక చూడామణి - 87🌹
6) 🌹Viveka Chudamani - 87🌹
7) 🌹. దేవాపి మహర్షి బోధనలు - 87🌹
8) 🌹. నిర్మల ధ్యానములు - 30🌹
9) 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 276 / Sri Lalita Chaitanya Vijnanam - 276 🌹 

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీమద్భగవద్గీత - 49 / Bhagavad-Gita - 49 🌹*
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద 
📚. ప్రసాద్ భరద్వాజ 

*🌴. ద్వితీయ అధ్యాయము - సాంఖ్య యోగము - 2 🌴*

2. శ్రీభగవానువాచ
కుతస్త్వా కశ్మలమిదం విషమే సముపస్థితమ్ | అనార్యజుష్ట మస్వర్గ్య మకీర్తికర మర్జున ||

🌷. తాత్పర్యం :
శ్రీకృష్ణభగవానుడు పలికెను: 
ఓ అర్జునా! నీకీ కల్మషము ఎచ్చట నుండి ప్రాప్తించినది? జీవితపు వీలువ నెరిగిన మనుజునకు ఇది అర్హము కానట్టిది. ఇది ఉన్నత లోకములను లభింపజేయదు. పైగా అపకీర్తిని కలిగించును.

🌷. భాష్యము :
శ్రీకృష్ణుడన్నను మరియు పూర్ణపురుషోత్తముడగు భగవానుడన్నను ఒక్కటియే. కనుకనే శ్రీకృష్ణుడు భగవద్గీత యందంతటను భగవానుని సంభోదింపబడినాడు. పరతత్త్వమునందు చరమాంశము భగవానుడే. పరతత్త్వమనునది బ్రహ్మము (సర్వత్రా వ్యాపించియుండెడి పరమపురుషుని రూపు), పరమాత్మ (దేవదేవుడైన శ్రీకృష్ణుడు) అనెడి మూడుదశలలో అనుభూతమగుచున్నది. శ్రీమద్భాగవతము (1.2.11) నందు ఇట్టి పరతత్త్వభావము ఈ క్రింది విధముగా వివరింపబడినది.

వదన్తి తత్తత్త్వవిదస్తత్వం యత్ జ్ఞానమద్వయమ్ |
బ్రహ్మేతి పరమాత్మేతి భగవానితి శబ్ధ్యతే ||

“పరతతత్వమనునది తత్త్వవిదులచే మూడుదశలలో అనుభూతమగుచున్నది. అవియన్నియును అభిన్నములై యున్నవి. పరతత్త్వపూ ఆ వివిధదశలే బ్రహ్మము, పరమాత్ముడు, భగవానుడు అనుచు తెలుపబడును.”
🌹🌹🌹🌹🌹

*🌹 Bhagavad-Gita as It is - 49 🌹*
✍️ Swamy Bhakthi Vedantha Sri Prabhupada 
📚. Prasad Bharadwaj 

*🌴 Chapter 2 - Sankhya Yoga - 2 🌴*

2. śrī-bhagavān uvāca kutas tvā kaśmalam idaṁ viṣame samupasthitam anārya-juṣṭam asvargyam akīrti-karam arjuna

🌷 Translation : 
The Supreme Personality of Godhead said: My dear Arjuna, how have these impurities come upon you? They are not at all befitting a man who knows the value of life. They lead not to higher planets but to infamy.

🌷 Purport : 
Kṛṣṇa and the Supreme Personality of Godhead are identical. Therefore Lord Kṛṣṇa is referred to as Bhagavān throughout the Gītā. Bhagavān is the ultimate in the Absolute Truth. The Absolute Truth is realized in three phases of understanding, namely Brahman, or the impersonal all-pervasive spirit; Paramātmā, or the localized aspect of the Supreme within the heart of all living entities; and Bhagavān, or the Supreme Personality of Godhead, Lord Kṛṣṇa. In the Śrīmad-Bhāgavatam (1.2.11) this conception of the Absolute Truth is explained thus:

vadanti tat tattva-vidas
tattvaṁ yaj jñānam advayam
brahmeti paramātmeti
bhagavān iti śabdyate

“The Absolute Truth is realized in three phases of understanding by the knower of the Absolute Truth, and all of them are identical. Such phases of the Absolute Truth are expressed as Brahman, Paramātmā and Bhagavān.”
🌹🌹🌹🌹🌹
#భగవద్గీత #BhagavadGita #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share 
🌹. భగవద్గీత BhagavadGita Telegram, FB Groups 🌹
https://t.me/bhagavadgeethaa/
www.facebook.com/groups/bhagavadgeethaa/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీమద్భగవద్గీత - 617 / Bhagavad-Gita - 617 🌹*
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ

*🌴. 18వ అధ్యాయము - మోక్ష సన్యాస యోగం - సన్న్యాసము యొక్క పూర్ణత్వము - 28 🌴*

28. ఆయుక్త: ప్రాకృత: స్తబ్ధ: శఠో నైష్కృతికోలస: |
విషాదీ దీర్ఘసూత్రీ చ కర్తా తామస ఉచ్యతే ||

🌷. తాత్పర్యం : 
భౌతికాసక్తుడును, మొండితనము కలవాడును, మోసము చేయువాడును, ఇతరులను అవమానించుటయందు దక్షుడును, సోమరియును, సదా చింతాక్రాంతుడును, వృథా కాలవ్యయమును చేయువాడునునై సదా శాస్త్ర నిర్దేశములకు విరుద్ధముగా కర్మనొనరించువాడు తమోగుణకర్తయని చెప్పబడును.

🌷. భాష్యము :
ఎటువంటి కర్మము చేయదగినదో, ఎటువంటి కర్మము చేయరానిదో శాస్త్రనిర్దేశములందు మనము గాంచవచ్చును. అటువంటి శాస్త్రనిర్దేశములను లెక్కజేయనివారు చేయరానటువంటి కర్మ యందే నియుక్తులగుచు సాధారణముగా భౌతికాసక్తులై యుందురు. వారు ప్రకృతి త్రిగుణముల ననుసరించియే వర్తింతురు గాని శాస్త్రనియమముల ననుసరించి కాదు. అట్టి కర్తలు మృదుద్వాభావులై యుండక సాధారణముగా మోసకారులు మరియు ఇతరులను అవమానపరచుట యందు దక్షులై యుందురు. 

సోమరులై యుండు అట్టివారు చేయవలసిన పని ఉన్నప్పటికిని దానిని సక్రమముగా ఒనరింపక తరువాత చేయుదుమని ప్రక్కకు పెట్టుదురు. తత్కారణముగా వారు చింతాక్రాంతులై యుందురు. కాలవిలంబనము చేయుటలో వారు అత్యంత దక్షులై యుండి గంటలో చేయవలసిన కార్యమును సంవత్సరముల తరబడి ఒనరింతురు. అటువంటి కర్తలు తమోగుణమునందు నిలిచినట్టివారు.
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Bhagavad-Gita as It is - 617 🌹*
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj

*🌴 Chapter 18 - Moksha Sanyasa Yoga - The Perfection of Renunciation - 28 🌴*

28. ayuktaḥ prākṛtaḥ stabdhaḥ śaṭho naiṣkṛtiko ’lasaḥ
viṣādī dīrgha-sūtrī ca kartā tāmasa ucyate

🌷 Translation : 
The worker who is always engaged in work against the injunctions of the scripture, who is materialistic, obstinate, cheating and expert in insulting others, and who is lazy, always morose and procrastinating is said to be a worker in the mode of ignorance.

🌹 Purport :
In the scriptural injunctions we find what sort of work should be performed and what sort of work should not be performed. Those who do not care for those injunctions engage in work not to be done, and such persons are generally materialistic. 

They work according to the modes of nature, not according to the injunctions of the scripture. Such workers are not very gentle, and generally they are always cunning and expert in insulting others. 

They are very lazy; even though they have some duty, they do not do it properly, and they put it aside to be done later on. Therefore they appear to be morose. They procrastinate; anything which can be done in an hour they drag on for years. Such workers are situated in the mode of ignorance.
🌹 🌹 🌹 🌹 🌹
#భగవద్గీత #BhagavadGita #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share 
🌹. భగవద్గీత BhagavadGita Telegram, FB Groups 🌹
https://t.me/bhagavadgeethaa/
www.facebook.com/groups/bhagavadgeethaa/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 420, 421 / Vishnu Sahasranama Contemplation - 420, 421 🌹*
📚. ప్రసాద్ భరద్వాజ

*🌻420. పరిగ్రహః, परिग्रहः, Parigrahaḥ🌻*

*ఓం పరిగ్రహాయ నమః | ॐ परिग्रहाय नमः | OM Parigrahāya namaḥ*

గృహ్యతే సర్వగతత్వాత్ పరితః శరణార్థిభిః ।
పరితో జ్ఞాయతే వేతి పరిగృహ్ణాతి వార్పితం ।
పుత్రపుష్పాదికం భక్తైరితి వాఽయం పరిగ్రహః ॥

పరమాత్ముడు తాను సర్వగతుడు కావున తన శరణము కోరువారిచేత అన్ని వైపులనుండియు ఆశ్రయించ బడుచున్నాడు. లేదా భక్తులచే అర్పించబడు పత్రపుష్పాదికమును స్వీకరించును.

సశేషం... 
🌹 🌹 🌹 🌹 🌹 

*🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 420🌹*
📚. Prasad Bharadwaj

*🌻 420. Parigrahaḥ 🌻*

*OM Parigrahāya namaḥ*

Gr̥hyate sarvagatatvāt paritaḥ śaraṇārthibhiḥ,
Parito jñāyate veti parigr̥hṇāti vārpitaṃ,
Putrapuṣpādikaṃ bhaktairiti vā’yaṃ parigrahaḥ.

गृह्यते सर्वगतत्वात् परितः शरणार्थिभिः ।
परितो ज्ञायते वेति परिगृह्णाति वार्पितं ।
पुत्रपुष्पादिकं भक्तैरिति वाऽयं परिग्रहः ॥ 

Since He is all pervading, He is approached on all sides by those who take refuge in Him. Or as He is omnipresent, He receives offerings made by His devotees.

🌻 🌻 🌻 🌻 🌻 
Source Sloka
ऋतुस्सुदर्शनः कालः परमेष्ठी परिग्रहः ।
उग्रस्संवत्सरो दक्षो विश्रामो विश्वदक्षिणः ॥ ४५ ॥

ఋతుస్సుదర్శనః కాలః పరమేష్ఠీ పరిగ్రహః ।
ఉగ్రస్సంవత్సరో దక్షో విశ్రామో విశ్వదక్షిణః ॥ ౪౫ ॥

R̥tussudarśanaḥ kālaḥ parameṣṭhī parigrahaḥ ।
Ugrassaṃvatsaro dakṣo viśrāmo viśvadakṣiṇaḥ ॥ 45 ॥

Continues....
🌹 🌹 🌹 🌹🌹

*🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 421 / Vishnu Sahasranama Contemplation - 421🌹*
📚. ప్రసాద్ భరద్వాజ

*🌻421. ఉగ్రః, उग्रः, Ugraḥ🌻*

*ఓం ఉగ్రాయ నమః | ॐ उग्राय नमः | OM Ugrāya namaḥ*

సూర్యాదినామపి భయ హేతుత్వాదుగ్ర ఉచ్యతే ।
భీషోదేతి సూర్య ఇతి శ్రుతి వాక్య బలాద్ధరిః ॥

భయముగొలుపువాడు. సూర్యుడు మొదలగు వారిని కూడ భయమును కలిగించువాడు.

:: తైత్తిరీయోపనిషత్ - ఆనందవల్లి (బ్రహ్మానందవల్లి) ద్వితీయాధ్యాయః - అష్టమోఽనువాకః ::
భీషాఽస్మాద్వాతః పవతే । భీషోదేతి సూర్యః । భీషాఽస్మాదగ్నిశ్చేన్ద్రశ్చ । మృత్యుర్ధావతి పఞ్చమ ఇతి । ... (1)

వాయువు పరబ్రహ్మము భయము చేత వీచుచున్నది. సూర్యుడు సైతమూ పరబ్రహ్మము భయము వలన ఉదయించుచున్నాడు. పరబ్రహ్మము వలన భయముచేత అగ్నియు, ఇంద్రుడు, అయిదవవాడగు యముడును ప్రవర్తించుచున్నారు.

సశేషం... 
🌹 🌹 🌹 🌹 🌹 

*🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 421🌹*
📚. Prasad Bharadwaj

*🌻421. Ugraḥ🌻*

*OM Ugrāya namaḥ*

Sūryādināmapi bhaya hetutvādugra ucyate,
Bhīṣodeti sūrya iti śruti vākya balāddhariḥ.

सूर्यादिनामपि भय हेतुत्वादुग्र उच्यते ।
भीषोदेति सूर्य इति श्रुति वाक्य बलाद्धरिः ॥

One who is the cause of fear even to entities like Sun.

Taittirīya Upaniṣad - Ānandavalli (Brahmānandavalli) Section II - Chapter VIII
Bhīṣā’smādvātaḥ pavate , bhīṣodeti sūryaḥ , bhīṣā’smādagniścendraśca , mr̥tyurdhāvati pañcama iti , ... (1)

:: तैत्तिरीयोपनिषत् - आनंदवल्लि (ब्रह्मानंदवल्लि) द्वितीयाध्यायः - अष्टमोऽनुवाकः ::
भीषाऽस्माद्वातः पवते । भीषोदेति सूर्यः । भीषाऽस्मादग्निश्चेन्द्रश्च । मृत्युर्धावति पञ्चम इति । ... (१)

From Its (parabrahma) fear, the wind blows; from fear rises the sun, from the fear of It again Indra, Fire and the fifth i.e., death, proceed (to their respective duties).

🌻 🌻 🌻 🌻 🌻 
Source Sloka
ऋतुस्सुदर्शनः कालः परमेष्ठी परिग्रहः ।
उग्रस्संवत्सरो दक्षो विश्रामो विश्वदक्षिणः ॥ ४५ ॥

ఋతుస్సుదర్శనః కాలః పరమేష్ఠీ పరిగ్రహః ।
ఉగ్రస్సంవత్సరో దక్షో విశ్రామో విశ్వదక్షిణః ॥ ౪౫ ॥

R̥tussudarśanaḥ kālaḥ parameṣṭhī parigrahaḥ ।
Ugrassaṃvatsaro dakṣo viśrāmo viśvadakṣiṇaḥ ॥ 45 ॥

Continues....
🌹 🌹 🌹 🌹🌹
#విష్ణుసహస్రనామములు #VishnuSahasranama #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share
విష్ణు సహస్రనామ స్తోత్రము / Vishnu Sahasranama group. 
https://t.me/vishnusahasranaam
www.facebook.com/groups/vishnusahasranaam/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 DAILY WISDOM - 124 🌹*
*🍀 📖 The Philosophy of Life 🍀*
📝 Swami Krishnananda
📚. Prasad Bharadwaj

*🌻 3. The Ascent of the Finite to the Infinite 🌻*

Philosophy is a rational enquiry into the forms, contents and implications of experience. It is an attempt at a complete knowledge of being in all the phases of its manifestation in the various processes of consciousness. 

The discovery of the ultimate meaning and essence of existence is the central purpose of philosophy. It is the art of the perfect life, the science of reality, the foundation of the practice of righteousness, the law of the attainment of freedom and bliss, and provides a key to the meaning and appreciation of beauty. 

Swami Sivananda holds philosophy to be the Vedanta or the consummation of knowledge, Brahmavidya, or the sacred lore of the Eternal, which is inseparable from Yogasastra, or the methodology of the ascent of the finite to the infinite. It is the way to the knowledge of being as such, of that which is. 

“Philosophy is love of wisdom, or striving for wisdom. It is a moral and intellectual science which tries to explain the reality behind appearances by reducing the phenomena of the universe to ultimate causes, through the application of reason and law” (Questions and Answers).

Continues...
🌹 🌹 🌹 🌹 🌹
#DailyWisdom #SwamiKrishnananda
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share 
🌹. Daily satsang Wisdom 🌹 
www.facebook.com/groups/dailysatsangwisdom/
https://t.me/Seeds_Of_Consciousness

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. వివేక చూడామణి - 87 / Viveka Chudamani - 87🌹*
✍️ రచన : *పేర్నేటి గంగాధర రావు*
సేకరణ : ప్రసాద్ భరద్వాజ 

*🍀. 21. అహంభావము - 3 🍀*

299. ఎవరికైన ఈ అహంకారముతో సంబంధమున్నచో అట్టి వ్యక్తి విముక్తిని గూర్చి మాట్లాడవలసిన పని లేదు. విముక్తి అనేది తిరుగులేనిది. 

300. అహంకారము యొక్క బంధనాల నుండి స్వేచ్ఛను పొందాలంటే వ్యక్తి తన యొక్క అసలు సత్యమైన, స్వచ్ఛమైన, శాశ్వతమైన ఎల్లపుడు ఆనంద స్థితిలో ఉండేది, స్వయం ప్రకాశవంతమైన ఆత్మను పొందాలి. ఎలానంటే రాహుగ్రహము నుండి విముక్తి పొందిన చంద్రుడు ఎలా ప్రకాశిస్తాడో అలాగా. 

301. బుద్ది వలన మాలిణ్యముతో కూడిన భౌతిక సంబంధములు ఎలా సృష్టించబడినవో, అవి శరీరానికి కళంకము తెచ్చి, నేను బలవంతుడును, నేను అమాయకుడను, నేను సంతోషముతో ఉన్నాను అనే భావనలు అహంతో చోటుచేసుకొను చున్నాయి. ఎపుడైతే ఈ అహంభావము నాశనం అయిపోతుందో అపుడే ఏ అడ్డంకులు లేకుండా బ్రహ్మమును పొందగలడు. 

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 VIVEKA CHUDAMANI - 87 🌹*
✍️ Sri Adi Shankaracharya
Swami Madhavananda
📚 Prasad Bharadwaj

*🌻 21. Ego Feeling - 3 🌻*

299. So long as one has any relation to this wicked ego, there should not be the least talk about Liberation, which is unique.

300. Freed from the clutches of egoism, as the moon from those of Rahu, man attains to his real nature, and becomes pure, infinite, ever blissful and self-luminous.

301. That which has been created by the Buddhi extremely deluded by Nescience, and which is perceived in this body as "I am such and such" – when that egoism is totally destroyed, one attains an unobstructed identity with Brahman. 

Continues.... 
🌹 🌹 🌹 🌹 🌹
#వివేకచూడామణి #VivekaChudamani #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share 
🌹. వివేకచూడామణి Viveka Chudamani 🌹
www.facebook.com/groups/vivekachudamani/
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://t.me/ChaitanyaVijnanam

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. దేవాపి మహర్షి బోధనలు - 98 🌹* 
✍️. సద్గురు కె. పార్వతి కుమార్
 సేకరణ : ప్రసాద్ భరద్వాజ 

*🌻 78. మధుర మార్గము -2 🌻*

మధుర మార్గమునకు జగద్గురువే గురువు. అతడే శ్రీకృష్ణుడు. అతని సాన్నిధ్య స్థితియే మధురానగరము. ఋషులు, దేవర్షులు, దేవతలు, మునులు, యోగులు నిమిత్త కారణములను గైకొని దివ్య మాధుర్యమునకై మధురానగరము వచ్చి పోవుచు నుండెడివారు. 

మముబోంట్ల వారి మాట యిక చెప్ప నవసరము లేదు. జగత్తునే మోహింప చేయగల చరితము శ్రీకృష్ణునిది. అతని సాన్నిధ్యము వర్ణనాతీతమగు మాధుర్యము కలిగించును. జీవుల అస్థిత్వమునే మరపింపచేయగల మాధుర్య మాయన సాన్నిధ్యమున నున్నది. గోప స్త్రీలే యన నేల? నారదాది మహర్షులు సైతము, అతని సాన్నిధ్య మాధుర్యమునకై తపన చెందుచుండిరి. అతని చూపు మధురము, నడక మధురము, నవ్వు మధురము, మాట మధురము, చేత మధురము, గానము మధురము, రథసారథ్యము మధురము.

పరవశము కలిగించు అతని రూపమును చూచి మహా భారత యుద్ధమున శత్రువులందరును అతని ముందే చేరిరి. యుద్ధమును గమనించిన మాబోటి వారికిది విదితము. అర్జునుని అస్త్రములచే సంహరింపక మునుపే కృష్ణుని చూపులతో చూపులను కలిపి శత్రువు లతనిని చేరిరి. కేవలము రక్తమాంసాదులతో కూడిన దేహములనే అర్జునుడు వధించెను. యుద్ధమున భీష్ముడొకడే ఇది గమనించెను.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
#దేవాపిమహర్షిబోధనలు #సద్గురుపార్వతీకుమార్ #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share
భారతీయ మహర్షుల బోధనలు Maharshula Wisdom 
www.facebook.com/groups/maharshiwisdom/
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://t.me/ChaitanyaVijnanam

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 30 🌹*
✍️. సౌభాగ్య
📚. ప్రసాద్ భరద్వాజ

*🍀. గతాన్ని వదులుకుంటే అనంతానికి, శాశ్వతత్వానికి తలుపులు తెరుస్తావు. 🍀*

ధైర్యమంటే ఏమిటి? దానికి విశిష్టమయిన అర్థాన్ని యిస్తే ధైర్యమంటే మనకు పరిచితమైన దాన్ని, తెలిసిన దాన్ని వదులుకునే సామర్థ్యం. ఎందుకంటే మనసంటే అదే. పరిచితమైంది. తెలిసింది. గతం. నువ్వొకసారి గతాన్ని వదులుకుంటే అనంతానికి, శాశ్వతత్వానికి తలుపులు తెరుస్తావు. 

కానీ అట్లా సిద్ధపడడానికి మనిషి భయపడతాడు. అనంత శూన్యంలో అన్నీ కోల్పోతానని ఆందోళనకు గురవుతాడు. మనసు చాలా చిన్న విషయం. అది సుఖంలో వుంటుంది. చిన్ని పురుగు. అది బంగారు పంజరం లాంటిది. అది అందంగా వుంటుంది. నువ్వు దాన్ని అలంకరించవచ్చు. ప్రతి ఒక్కరూ దాన్ని అలంకరించడానికి ప్రయత్నిస్తారు. 

మన విధ్యా విధానమంతా అదే. ఆ బంగారు పంజరాన్ని ఎంత అందంగా అలంకరిస్తారంటే దాంట్లోంచి బయటపడడం దాదాపు అసాధ్యం. దానికి అతుక్కుపోతావు. నీకు రెక్కలున్న సంగతి మరచిపోతావు. అనంత ఆకాశం నీకు ఆహ్వానం పలుకుతోంది. నువ్వు నక్షత్రాల కేసి సాగవచ్చు. నీ ముందు ఎంతో దూరం పరచుకుని వుంది. 

అందువల్ల ధైర్యంగా బంగారు పంజరమనే మనసును వదిలిపెట్టి అజ్ఞాతమైన దాని కేసి, తెలియని దానికేసి వెళ్ళగలగడమే సాహసం. అన్ని భయాల్ని, అన్ని భ్రమల్ని, భద్రతల్ని వదలిపెట్టి వెళ్ళడం అట్లాంటి లక్షణాలున్న వ్యక్తి మాత్రమే మతమున్నవాడు.

సశేషం ...
🌹 🌹 🌹 🌹 🌹
#ఓషోబోధనలు #OshoDiscourse #OshoDailyMeditations #ఓషోనిర్మలధ్యానములు #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share 
🌹 ఓషో బోధనలు - Osho Teachings 🌹
http://www.facebook.com/groups/oshoteachings/
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://t.me/ChaitanyaVijnanam
https://pyramidbook.in/Chaitanyavijnanam

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 278 / Sri Lalitha Chaitanya Vijnanam - 278 🌹*
*సహస్ర నామముల తత్వ విచారణ*
✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్ 
సేకరణ : ప్రసాద్ భరద్వాజ 
మూల మంత్రము : 
*🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁*

*🍀 65. భానుమండల మధ్యస్థా, భైరవీ, భగమాలినీ ।*
*పద్మాసనా, భగవతీ, పద్మనాభ సహోదరీ ॥ 65 ॥ 🍀*

*🌻 278. 'పద్మాసనా' 🌻* 

పద్మము ఆసనముగా గలది శ్రీదేవి అని అర్థము.
పద్మము సృష్టి చిహ్నము. సృష్టివలె పొరలు పొరలుగా విచ్చుకొనునది. పద్మదళములు ప్రకృతి మయములు. పద్మనాళము జ్ఞానమయ నాళము. ఈ నాళము బురద యగు భౌతిక సృష్టి నుండి పరతత్త్వమందుకొనుడు సత్యలోక స్థితి వఱకు వ్యాపించి యుండును. పద్మనాళము బ్రహ్మరంధ్రము వంటిది. దళముల అరలు, పొరలు వివిధలోకములై విప్పారును. దళముల యందలి కాంతి శుద్ధ చైతన్యము. పద్మముగా వ్యాప్తి చెందునది పరతత్త్వము. 

దళము లన్నియూ నాళముతో సంబంధము కలిగియుండుట సృష్టి యందలి ఏకత్వమును, ఐక్యతను, యోగస్థితిని సూచించును. ఈ సృష్టియను పద్మమును అధిష్ఠించి యుండు చైతన్య స్వరూపిణి శ్రీమాత గనుక ఆమెయే పద్మాసనా. చతుర్ముఖ బ్రహ్మ సృష్టికర్త అగుటచే అతడు కూడ పద్మమున ఆసీనుడైనట్లు పురాణములు తెలుపుచున్నవి. అతడు ప్రత్యక్ష సృష్టికర్త. 

శ్రీమాత పరోక్ష సృష్టికర్త. మానవుల యందు కూడా వివిధ లోకము లున్నవి. ఎన్ని లోకములు గలవో అన్ని పద్మములు కూడ ఏర్పడగలవు. పూర్ణ పురుషుల యందు పద్మము లన్నియూ వికసించి యుండును. వారు వికసించిన ముఖపద్మము కలిగి యుందురు. ఇతరులకు పద్మములు వికసింపక చక్రముల వలె యుండును. అన్ని లోకములయందు అన్ని పద్మముల యందు ఆసీనురాలై యుండునది శ్రీమాతయే. 

ఆమె అనుగ్రహముననే చక్రములు పద్మములుగ విచ్చుకొనును. సహస్రార దళ పద్మమున పరమ శివునితో కూడియున్న శ్రీమాత జీవుల కొఱకు జీవ సృష్టిని గావించి తానే సహస్రారము నుండి ఆజ్ఞకు, అచ్చట నుండి విశుద్ధి కేంద్రమునకు, అటు తరువాత వెన్నెముక ద్వారా మూలాధారమునకు చేరును. శ్రీమాత మూలాధారమును చేరుటయే భౌతిక సృష్టికి ఆధారము. 

ఆమె 'మూలాధారైక నిలయ'. జీవుని యొక్క పరిణామమును బట్టి మూలాధారము నుండి మరల తిరుగు ప్రయాణము ఊర్ధ్వగతిగ చేయును. కుండలిని వలె చుట్టలు చుట్టుకొనిన శ్రీమాత ఊర్ధ్వగతి చెందుటకు సంకల్పించినపుడు జీవుడు సాధన మార్గమును బట్టును. అతని సాధన యందలి శ్రద్ధా భక్తులను బట్టి శ్రీమాత ఊర్ధ్వముగ వ్యాప్తి చెందుచు షట్ పద్మముల నధిష్ఠించును. జీవుడు పరిపూర్ణుడై నపుడు సహస్రారమును చేరి శివునితో యోగించును. 

ఆమె ననుసరించుచు జీవుడు కూడ పరమును చేరును. ఇట్లు పద్మము నందాసీన మైన సర్వమును నిర్వహించు చున్నది. శ్రీమాత. పద్మాసన యగు శ్రీమాతను ఆరాధించినచో దుఃఖములు తొలగును. భాగ్యమును పొందును. దేహము, గృహము స్వర్ణమయ మగును. స్త్రీ సహకారము పరిపూర్ణముగ నుండును. సుఖములతో కూడిన దైవయోగ ముండును. పద్మము ఆసనముగా గల శ్రీమాత సర్వ శుభంకరి అని ఎఱుగవలెను. పద్మము అతి విస్తారమైన సంకేతము. ఇతర నామములలో మరికొంత వివరింపబడును.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 278 🌹*
*1000 Names of Sri Lalitha Devi* 
✍️. Ravi Sarma 
📚. Prasad Bharadwaj

*🍀 65. bhānumaṇḍala-madhyasthā bhairavī bhagamālinī |
padmāsanā bhagavatī padmanābha-sahodarī || 65 || 🍀*

*🌻 Padmāsanā पद्मासना (278) 🌻*

She is seated on a lotus or She is sitting in the posture of padmāsana (a yogic way of sitting, cross legged). Padma means lotus.  When one is seated in padmāsana, the posture will appear like a lotus.  

The leaves of lotus creeper are compared to prakṛti (the source of objectivity), its filaments to vikṛti (categories, changed condition), and its stalk to knowledge. Padma also means the Goddess of wealth Lakṣmī. In this context it indicates that She distributes wealth to Her devotees.  

Here wealth does not mean material wealth only, but also the intellectual wealth, the capacity to have higher level of consciousness, needed to realise the Brahman. It could also mean the Brahma, the lord of Creation.

Continues...
🌹 🌹 🌹 🌹 🌹
 #లలితాసహస్రనామ #LalithaSahasranama
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share 
🌹. శ్రీ లలితా దేవి చైతన్యము Sri Lalitha Devi Chatanyam 🌹
https://t.me/srilalithachaitanyavijnanam
http://www.facebook.com/groups/srilalithachaitanyavijnanam/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹