Showing posts with label ఆత్మ ప్రయాణం. Show all posts
Showing posts with label ఆత్మ ప్రయాణం. Show all posts

అంతరింద్రియం / అంతఃకరణ చతుష్టయం

అంతరింద్రియం / అంతఃకరణ చతుష్టయం

శరీరం లోపల అంతర్గముగా నుండు సూక్ష్మతత్త్వములతో కూడియుండిన అంతఃకరణమునే అంతరింద్రియమని అందురు. పంచభూతముల యొక్క సూక్ష్మంశములే మనో, బుద్ధి, చిత్త, అహంకారంలతో కూడిన అంతఃకరణం. ఈ నాలుగింటితో కూడిన అంతఃకరణమునే అంతఃకరణ చతుష్టయం అంటారు. గాలి, అగ్ని, జలము, పృథ్వి, ఆకాశాంశలతో కూడినదే అంతఃకరణం.

అంతఃకరణముది ఆకాశతత్త్వం కాగా, మనస్సుది వాయుతత్త్వం, బుద్ధిది అగ్ని తత్త్వం, చిత్తముది జలతత్త్వం, అహముది పృథ్వితత్త్వం.

మనస్సు :- వాయుతత్త్వం అగుటచే నిరంతరమూ చలించుటకు కారణమగుచున్నది. ఇది చంచలమైనది. సంకల్ప, వికల్పములు దీని కార్యములు. అనిశ్చితస్థితి. చంద్రుడు అధిష్టానదేవత.

బుద్ధి :- అగ్ని అంశమగుటచే నిశ్చయించుగుణం కలిగియున్నది. నిశ్చలస్థితి. నిశ్చయం, మంచి చెడుల విచక్షణాజ్ఞానం దీని లక్షణం. స్వంత సామర్ధ్యం కలది. అధిష్టానదేవత పరబ్రహ్మ.

చిత్తము :- జలాంశమగుటచే మందగమనం దీని స్వభావం. అనేక విధములగు ఆలోచనలు కలది. ప్రాణి కోట్ల వృత్తులన్నియు దీనియందు యుండును. శరీరమునందలి సర్వేంద్రియములను చలింపజేస్తుంది. మహావిష్ణువు అధిష్టానదేవత.

అహంకారం :- పృధ్వీ అంశం. కాఠిన్యస్వభావం. నేను, నాది అను అభిమానమును కల్గించును. ఈ తత్త్వంతో చేయు క్రియలు, వాటిచే ఏర్పడిన గర్వం దీని స్వంతం. కోపం, రోషం, స్వార్ధం మొదలగు వాటికి ఈ అహమే కారణం. అధిష్టానదేవత రుద్రుడు.

ఈ అంతఃకరణ చతుష్టయం విజ్రుంభన ఆగి నిర్విషయస్థితి కలుగనంతవరకు అంతరశుద్ధి కలుగదు. అంతఃకరణశుద్ధి కానంతవరకు ఆత్మతత్త్వం గ్రహించలేం.

ఉన్నత విలువలు - వాటి క్షీణత వల్ల మనకు లభించే ఫలితాలు

🌹 *ఉన్నత విలువలు - వాటి క్షీణత వల్ల మనకు లభించే ఫలితాలు* 🌹

*పూర్వం సాహిత్యం విలువలు కలిగి ఉండేది. అది ఈనాడు అంతగా ఉన్నట్టు కనబడదు. సృష్టి కూడా ఉన్నతంగా ఎన్నో దివ్యమైన సంకల్పములుతో ఏర్పడినదే అమరత్వంగా. కానీ క్షీణత దాని లక్షణముగా ఆయిపోయింది పదార్ధ జగతిలో.*

*ప్రతీ దాని లోనూ ఈ నశ్వర సిద్ధాంతం కనబడుతుంది. పుట్టిన ప్రతివాడు కల్మష రహితంగానే ఉంటాడు. నెమ్మదిగా తనవి కాని వాటిని సొంతం చేసుకుని ఆట మొదలు పెట్టి, అనేక దుఃఖ అనుభవములతో కూడి తొలగిపోతాడు. సాధనలు అంతే. మొదలు పెట్టినప్పుడు అతి ఉత్సాహం, నెమ్మదిగా నిరాశకు గురవుతారు. పట్టుదల కనిపించదు. సంకల్పం నుంచి విముఖులవుతారు.*

*ఈ జీవితానికి వచ్చే ముందు ఆత్మల లోకంలో శపధాలు చేస్తారు. తరువాత నానా విధ ఆలోచనలు. అందుకే దైవం స్థిరమైన బుద్ధి కలిగిన వారి కోసం కాగడా పెట్టి వెతుకుతాడు. వారికే పరిణామక్రమము లో ఉన్నతినిస్తాడు. మరి ఆయన స్థిరమైన వాడు కదా అందుకే.*

*దృఢ సంకల్పమే అన్నిటికన్నా ముఖ్యమైనది ఆధ్యాత్మిక పధంలో.*

*మంచి విలువలతో ప్రారంభం అయిన ఎన్నో ఆత్మికమైన సంబంధాలు కూడా చివరికి సాధారణ మానవీయ విలువలకు తరువాత ఆసురీ విలువలకు పడిపోతున్నాయి.*

*సాధనాపరమైన విషయాలు వరకూ సంభాషణలు వుంటే అవి ఉద్ధరణకు సహాయ పడతాయి. ఏ విషయంలో అయినా క్షీణతకు దారి తీసే అంశాల పట్ల అందరూ జాగురూకులై ఉండాలి.*

*మీరు ఆధ్యాత్మికంగా ఎదగాలి అంటే మీరు తెలుసుకోవలసిన అతి ముఖ్యమైన విషయం “మీ వాస్తవానికి మీరే సృష్టికర్తలు” మీ జీవితంలో జరుగుతున్న ప్రతిదానికి మీరే కారణం అన్న బాధ్యతను తీసుకోవాలి. మీ జీవితంలో ప్రతి ఒక్కటి కూడా మీ ఆలోచన లేక భావాలు మూలంగా జరుగుతాయి. మీరు ఇప్పుడు ఏ స్థితిలో ఉన్నా ఆ స్థితిని తప్పుగా భావించవద్దు. మీ భవిష్యత్తును ఎంతో పాజిటివ్ గా సృష్టించుకోండి. ధ్యానము మరి ఊహా శక్తి ద్వారా.*

          *దేని గురించైనా మీలో నెగిటివ్ భావాలు వస్తున్నట్లయితే, ఒక్క క్షణం ఆగి మీ అంతరాత్మను అడగండి, “దీనివల్ల నేను ఏమి నేర్చుకోవాలో ?” అని.*

    *మీరు ఉన్నత లక్ష్యాల కోసం పని చేస్తున్నప్పుడు, పట్టు విడవకుండా, ఎంతో ఇష్టంతో, స్థిరంగా పనిచేయవలసి ఉంటుంది. ఆధ్యాత్మిక లక్ష్యాలు అత్యున్నత లక్ష్యాలు.*
🌹 🌹 🌹 🌹 🌹
🙏 *ప్రసాద్*

🌹 *సత్యాన్వేషణం -- సత్యదర్శనం* 🌹

🌹  *సత్యాన్వేషణం -- సత్యదర్శనం*
🌹

సృష్టి మొత్తం అనంతమైన చైతన్యంతో నిండి వుంది. చైతన్య శక్తికి సజీవ ఉదాహరణ ‘మనిషి’. మనిషి శరీరాన్ని మన ‘భూమాత’తో పోల్చవచ్చు. భూమి ఒక ప్లానెట్. ప్రతి మనిషినీ ఒక ప్లానెట్‌గా భావిస్తే మనిషి శరీర నిర్మాణాన్ని ‘‘విధాత’’ ఎంత గొప్పగా తీర్చిదిద్దాడో అర్థం అవుతుంది.

సృష్టికర్తకు ఇలా మనిషిని తీర్చిదిద్దడానికి ఎన్ని వేల సంవత్సరాలైనా పట్టి వుండవచ్చుననిపిస్తుంది. మానవ శరీర నిర్మాణం- అందులోని గొప్పతనం- ప్రతి బాహ్యాంతర అవయవంలోని అద్భుతం జాగ్రత్తగా పరికించి స్టడీ చేస్తే!

మానవుని శరీరం- భూమి! చీము, నెత్తురు,నీరు- జలం! చైతన్యశక్తి- అగ్ని! ప్రాణశక్తి- వాయువు! వాక్కు- ఆకాశం!ఇక భూమధ్యం- సుషుమ్నానాడి; చంద్రుడు! శిరంపైన సుడి- బ్రహ్మరంధం; సూర్యుడు!

మనిషి శరీరంలోని ఈ సప్త్ధాతువులను (పంచ భూతాలు, చంద్రుడు, సూర్యుడు) విశ్వంలోని పంచభూతాలు, చంద్రుడు మరి సూర్యునితో అనుసంధానం చేయడమే ఆధ్యాత్మికత! అదే ‘‘భిన్నత్వం నుండి ఏకత్వం’’ (దైవత్వం నుండి అద్వైతం)- ‘‘ఏకత్వం నుండి అసంతత్వం! దీనినే ‘విశ్వంతో అనుసంధానం’ అని చెప్పకోవచ్చు!
Duality, to individuality! Individuality to Infinity!
CONNECTIVITY WITH COSMOS

భౌతిక శాస్త్రం (Physical Science)పదార్థ జ్ఞానం గురించి మాత్రమే చెపుతుంది. అదే ఆధ్యాత్మిక శాస్త్రం (Spiritual Science) ఆత్మస్థితి గురించి ఆత్మజ్ఞానం గురించి చెపుతుంది. ఆధ్యాత్మిక శాస్త్రం ఎంతగా స్టడీ చేస్తే సాధనవల్ల బోధనవల్ల అంత గొప్పగా (Evolution) ఆత్మ ఎదుగుదల ఉంటుంది.

ఆత్మానంద శాశ్వతానంద సుఖమస్తు ’ అన్నారు కదా వీరబ్రహ్మేంద్రస్వామి! ఎంత అద్భుతంగా వారు చెప్పారో క్రింద తెలుసుకుందాం!

‘ ధ్యానం’లో శ్వాస మీద దృష్టి నిలిపినట్లయితే, ఆలోచనా రహిత స్థితి క్రమంగా సిద్ధించి దృష్టి ఏకాగ్రమవుతుంది.

‘దృష్టి నిలిపెనేని దేవుడు దిగివచ్చు- దృష్టి నిలపడేని నష్టపడును; దృష్టిలోన సర్వసృష్టి స్పష్టమౌను- కాళికాంబ! హంస! కాళికాంబ!’’ అన్నారు వారు.

చైతన్యశక్తి వల్ల- మనలో కుండలినీ ప్రయాణం వల్ల ఎన్ని అద్భుతాలు జరుగుతాయో అంతరంలో! ఆ బ్రహ్మానందం అనుభవించవలసినదే కాని మాటలలో చెప్పడానికి వీలుకానిదది- అమృతం ఎలా వుంటుందో చెప్పడానికి ఏ భాషలో ఏ పదాలు సరిపోతాయి?

శబ్ద రూపాత్మకమైన ‘ఆకాశం’నుండి స్పర్శ కలిగిన వాయువు జనించింది. స్పర్శ కలిగిన ‘వాయువు’నుండి ‘రూపం’ కలిగిన ‘అగ్ని’ ఉద్భవించింది. రూపం కలిగిన ‘అగ్ని’ నుండి ‘రసం’ కలిగిన ‘జలం’ పుట్టింది.రసం కలిగిన ‘జలం’ నుండి ‘గంధం’ కలిగిన ‘భూమి’ సృష్టింపబడింది. ‘భూమి నుండి అన్నం- అన్నం నుండి బీజాలు, ఔషధాలు వచ్చాయి.’’ ఇది విశ్వవిస్తృతి- సృష్టి విలాసం- విధాత చమత్కారం- దానినుండి జీవరాసుల ఉత్పత్తి!

విశ్వాన్ని, సృష్టిని మూల ప్రకృతి అని, సృష్టిలోని 24 తత్త్వాలను ప్రకృతి అని చెప్పుకోవాలి! మానవ శరీరం 'భూమి’ అని చెప్పుకున్నాం.‘ఇది మూలాధారం’. దేహధర్మం! భూతత్త్వం! తాను, తన కుటుంబం, భార్య, భర్త, పిల్లలు, బంధువులు, స్నేహితులు, రక్తస్పర్శ, అనుబంధాలు ఇలా!

‘మనస్సు స్వాధిష్ఠానం’. కోరికలు- కామం- మితృత్త్వం- శత్రుత్వం- ఆలోచన- పగ- ద్వేషం- ఇష్టం- సుఖం- దుఃఖం! జలతత్త్వం!

‘మణిపూరకం’ అంటే తేజం! పాండిత్యం- కళలు- గౌరవం- కీర్తి ప్రతిష్ఠం శాస్తజ్ఞ్రానం- శక్తి! ఎనర్జీ! విభూది! ‘అగ్నితత్వం’! అంటే చైతన్యం!

‘అనాహతం’ అంటే మౌనం- ప్రశాంతత- సంతృప్తి- ప్రేమ ప్రాణం! వాయుతత్వం!

‘విశుద్ధం’’ అంటే శుద్ధి- కర్మలు శుద్ధి అయేస్థితి- శుద్ధవాక్కు- సుశబ్దం- జ్ఞానం- వినయం- విశేషవాక్సుద్ధి! ఆకాశతత్వం!

ఈ అయిదు చక్రాలనూ పంచభూతస్థితులు అని చెప్పుకోవచ్చు! ఈ యొక్క పంచభూత స్థితిని దాటిన తర్వాత ‘ఆజ్ఞాచక్రం’! సుషుమ్నానాడి! చంద్రుడు! ఆత్మజ్ఞానం!

ఆజ్ఞాస్థితి- అంటే ‘‘ఆజ్ఞ! ఆర్డర్! దివ్యచక్షువు యొక్క పూర్ణత! అష్టసిద్ధులు! నవనిధులు! ‘అహం’కారం- అంటే ఆత్మస్థితి! ఆత్మతో ప్రవర్తించడం! దేహంతో ఉంటూ దేహభావన లేకపోవడం! దివ్యదృష్టి, దివ్యశ్రవణం! దివ్యయానం! దివ్య జీవనం!

🌹🌹🌹🌹🌹
సేకరణ 🙏 ప్రసాద్