విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 471 / Vishnu Sahasranama Contemplation - 471


🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 471 / Vishnu Sahasranama Contemplation - 471🌹

📚. ప్రసాద్ భరద్వాజ

🌻471. వత్సలః, वत्सलः, Vatsalaḥ🌻


ఓం వత్సలాయ నమః | ॐ वत्सलाय नमः | OM Vatsalāya namaḥ

వత్సాంశాభ్యాం కామబలే ఇతి లచ్ప్రత్యయే కృతే ।
నిష్పాదితో వత్సలోఽయం భక్త స్నేహితయా హరిః ॥

'వత్స' అను ప్రాతిపదికముపై ల(చ్‍) ప్రత్యయము రాగా వత్సల అగును. భక్తుల విషయమున ఆ హరికి స్నేహమూ, ప్రీతి కలవు. ఆందుచేత ఈతను 'వత్సలః'.

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹



🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 471🌹

📚. Prasad Bharadwaj

🌻471. Vatsalaḥ🌻


OM Vatsalāya namaḥ

Vatsāṃśābhyāṃ kāmabale iti lacpratyaye krte,
Niṣpādito vatsalo’yaṃ bhakta snehitayā hariḥ.

वत्सांशाभ्यां कामबले इति लच्प्रत्यये कृते ।
निष्पादितो वत्सलोऽयं भक्त स्नेहितया हरिः ॥

The word 'Vatsa', which means a calf, when suffixed with la(c) becomes Vatsalaḥ. Since Lord Hari has love and affection towards his devotees like a cow for its calf, He is called Vatsalaḥ.

🌻 🌻 🌻 🌻 🌻


Source Sloka

स्वापनस्स्ववशो व्यापी नैकात्मा नैककर्मकृत् ।वत्सरो वत्सलो वत्सी रत्नगर्भो धनेश्वरः ॥ ५० ॥

స్వాపనస్స్వవశో వ్యాపీ నైకాత్మా నైకకర్మకృత్ ।వత్సరో వత్సలో వత్సీ రత్నగర్భో ధనేశ్వరః ॥ ౫౦ ॥

Svāpanassvavaśo vyāpī naikātmā naikakarmakrt ।Vatsaro vatsalo vatsī ratnagarbho dhaneśvaraḥ ॥ 50 ॥


Continues....

🌹 🌹 🌹 🌹🌹


8 Aug 2021

దేవాపి మహర్షి బోధనలు - 123


🌹. దేవాపి మహర్షి బోధనలు - 123 🌹

✍️. సద్గురు కె. పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🌻 100. శంబళ 🌻


శంబళ, ఒక దివ్యాశ్రమము. భూమిపై జరుగు దివ్య కార్యక్రమములకు ప్రధాన కేంద్రము. అన్ని ఆశ్రమములకాధారము. దివ్య జీవనులకు శంబళ దివ్యానుభూతి. శాశ్వత సత్యము. ఇతరులకు అది పుక్కిటి పురాణము. శంబళను గూర్చి అనేకానేకములుగ వదంతులున్నవి. కొందరికది, మరుగుపడిన దివ్యసంపద. మరికొందరికి అది భూగర్భితమైన ప్రాచీన గ్రామము. ఇంకొందరికి అది ఆకసమున తేలుచుండు సూక్ష్మమగు ఆశ్రమము. తెలిసినవారు శంబళను భూమికి దివ్యరాజధానిగ తెలుపుదురు.

అందు భూమిని పాలించు ఏకైక చక్రవర్తి యగు సనత్కుమారుడు, వసించియున్నాడని భావింపుడు. అతడు శ్రీకృష్ణుడు భూమిపై సంచరించినపుడు, ప్రద్యుమ్నుడై అతనికి జన్మించినాడని తెలుపుదురు. శ్రీకృష్ణుడు దేహత్యాగము చేసిన వెనుక మరల సనత్కుమారునిగ స్వస్థానమున నిలచి పరమ గురువుల పరంపరకు అండగ నిలచియున్నాడని కూడ తలతురు. అతడే భూమిని, భూమి జీవులను పరిపాలించుచు వారి పరిణామమునకై కృషి సలుపుచున్నాడని భావింతురు.

సనత్కుమారుడు సనక సనందనాదులతో నొక త్రిభుజముగ నేర్పడి బ్రహ్మలోకము నుండి భూలోకము వరకు నొక చైతన్య సూత్రమును సంధించియుంచినాడని, తత్కారణముగ భూమి జీవులు బ్రహ్మలోకమునకు చేరుటకు వలసిన మార్గము తెరచి యున్నదని మైత్రేయాదులు తెలుపుదురు.

అతడే ఈ భూమికి జీవమని, ప్రధాన చేతనమని, మేము తెలిసియున్నాము. అతడు మైత్రేయునికి కొండంత అండగ నిలచి అతని ఆశయ పరిపూర్తికై వలసిన సహాయ సహకారము లందించుచు అనాదిగనున్నాడు. అతడు చక్రవర్తి. మైత్రేయుడు గురువు. ఒకరు రాజు, మరియొకరు పురోహితుడు. మేమందర మతని ఋత్విక్కులము. మీరందరతని పిల్లలు.


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹


8 Aug 2021

నిర్మల ధ్యానాలు - ఓషో - 55


🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 55 🌹

✍️. సౌభాగ్య
📚. ప్రసాద్ భరద్వాజ

🍀. నీ ధ్యానం చప్పుడును నువ్వు తెలుసుకుంటే రూపాంతరం చెందుతావు. అదో కొత్త జన్మ, నిజమైన జన్మ. అపుడు ఆ క్షణం నువ్వు శరీరం కాదని, మనసు కాదని, స్వచ్చమైన చైతన్యమని తెలిసివస్తుంది. 🍀


చైతన్యంతో వున్న మనిషిని, ధ్యానంతో వున్న మనిషిని ఏదీ దారి మళ్ళించ లేదు. కారణం అతను అన్నిట్నీ పరిశీలిస్తాడు. ఫోను శబ్దాన్ని, పసిబిడ్డ అరుపును, పక్కింటి వాళ్ళ మాటల్ని, సౌండు పెరుగుతున్న వాళ్ళ రేడియో శబ్దాన్ని వింటాడు. దాంతో అతనికేమీ అవసరం లేదు. అతను నిశ్శబ్దంగా, నిర్మలంగా వుంటాడు. అన్ని దిశలకూ తలుపులు తెరిచి వుంటాడు. ఏమి జరిగినా, ట్రైన్ శబ్దాన్ని, విమానం శబ్దాన్ని, కోకిల పాటను అన్నిట్ని వింటాడు. ఏదీ అతన్ని ఆటంకపరచదు. అట్లా వింటూ పోతూ వుంటే తనని తడుతున్న చప్పుడుని అతను గుర్తిస్తాడు.

నీ ధ్యానం చప్పుడును నువ్వు తెలుసుకుంటే రూపాంతరం చెందుతావు. అదో కొత్త జన్మ, నిజమైన జన్మ. అపుడు ఆ క్షణం నువ్వు శరీరం కాదని, మనసు కాదని, స్వచ్చమైన చైతన్యమని తెలిసివస్తుంది. ఆ స్వచ్ఛమైన చైతన్యం నీ పుట్టుకకు ముందు వుంది. నీ మరణానంతరం వుంటుందని గ్రహిస్తావు. అదే శాశ్వతత్వం. అదే అనంత ఆవిష్కారం. మరణం లేని దాన్ని కనిపెట్టడమంటే శాశ్వతత్వాన్ని కనిపెట్టడమే.

సశేషం ...

🌹 🌹 🌹 🌹 🌹


8 Aug 2021

శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 298 / Sri Lalitha Chaitanya Vijnanam - 298


🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 298 / Sri Lalitha Chaitanya Vijnanam - 298 🌹

సహస్ర నామముల తత్వ విచారణ

✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

మూల మంత్రము :

🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁

🍀 70. నారాయణీ, నాదరూపా, నామరూప వివర్జితా ।
హ్రీంకారీ, హ్రీమతీ, హృద్యా, హేయోపాదేయ వర్జితా ॥ 70 ॥ 🍀

🌻 298. 'నారాయణీ'🌻


దివ్యజలములు నివాసముగా గలది అని అర్థము. దివ్య జలములనగా సృష్టి కాధారభూతమైన, అనంతమైన తత్త్వము. అది నీలి తరంగమువలె అనంతమై యుండును. ఇవియే సృష్టికి మూలము. వీనిని నారములని కూడ పిలుతురు. వీనియందు తేలుచు నుండునది శ్రీదేవి కనుక నారాయణి అయినది. నారాయణు డన్ననూ, నారాయణి అన్ననూ ఒక్కటియే. పురాణములందు నారాయణుని సహోదరి కనుక నారాయణి అనిరి. అట్లే శివునికి నారాయణుడను పేరు కలదు. అతని భార్య గనుక నారాయణి అని కూడ శ్రీమాత నందురు.

పద భేదము వలన తత్త్వ భేదము, అవగాహనా భేదము కలుగరాదు. సృష్టి కతీతమగు జలములను నివాసముగా గల స్థితి ఇది. శ్రీ లక్ష్మిని, పార్వతిని 'నారాయణి' అను నామముతో పిలుతురు. అట్లే విష్ణువుని, శివునిగూడ 'నారాయణుడు' అని పిలుతురు. నారముల నధిష్ఠించి యుందురు గనుక వీరు నారాయణులు. (నారాయణ అనునది ఒకటియే. నారాయణులనుట అవగాహన కలిగించుటకు.)

నరులు కూడ నారముల నుండి వచ్చినవారే కనుక వారును శాశ్వతులే. 'నర' అన్నను 'నారీ' అన్ననూ ఒక్కటియే. 'నారాయణ', 'నారాయణి' వలెనే, నర, నారీ పదము లేర్పడినవి. ఈ శబ్దములన్నిటి యందు మూలశబ్దము 'నర' శబ్దము. 'ర' అనగా నశించునది. 'నర' అనగా నశింపనిది. 'నారములు' నశింపనివి. అవి సృష్టికి ముందు, లయమునకు వెనుక కూడ నుండును. కనుక నారాయణి, నరులు ఎప్పుడూ నుందురు.

నారాయణునకు, నరునకు వ్యత్యాసము అయనము అను శబ్ద మొకటియే (నర + అయనము = నారాయణము). అయనము అనగా ఆరోహణము లేదా అవరోహణము . (దక్షిణ + అయనము, ఉత్తర + అయనము).

నరులు సృష్టి యందు అవరోహణము చెందుట, ఆరోహణము చెందుట యుండును. నారాయణుడట్లు అవరోహణ, ఆరోహణములు లేక, వాని నధిష్ఠించి నడిపించు వాడుగ నుండును. శ్రీమాత పరముగ చెప్పునపుడు నారాయణి సృష్టి స్థితి లయములను గావించు చున్నదని తెలుపుదురు. అందరునూ పూజించునది, పూజించవలసినది 'నారాయణి' లేక 'నారాయణు'లనే. ఈ పూజనము తత్త్వపరము.


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 298 🌹

1000 Names of Sri Lalitha Devi

✍️. Ravi Sarma
📚. Prasad Bharadwaj

🍀 70. nārāyaṇī nādarūpā nāmarūpa-vivarjitā |
hrīṁkārī hrīmatī hṛdyā heyopādeya-varjitā || 70 || 🍀

🌻 298. Nārāyaṇī नारायणी (298) 🌻


This nāma can be explained in several ways. Śivānanda Laharī (Śivānanda Laharī consists of one hundred verses on Śiva. Saundarya Laharī consists of one hundred verses on Śaktī) verse 82 says, that Hari (Viṣṇu) and Haran (Śiva) are conjoined in several ways.

It says “ardhavapuṣa bharyatvam āryāpate” which means Viṣṇu holds the position of Śiva’s wife as Śiva holds Viṣṇu in His left vertical half. This is the place of Śaktī in ardhanārīśvara form of Śiva. The Form of Śiva and Viṣṇu combine is called Śaṇkara Nārāyaṇa. This clearly indicates that there is no difference between Viṣṇu (also known as Nārāyaṇa) and Lalitāmbikā. This conception is further confirmed in this Sahasranāma itself in nāma-s like Govinda-rūpinī (269), Mukunda (838) and Viṣṇu-rūpinī (893).

Nārāyana is the combination of two words nara + ayaṇa. Nara here means the Brahman. Since water first originated from the Brahman, water is also called nara. Water is said to be first abode of the Brahman, hence the Brahman having the abode of water is called Nārāyaṇa. Since there is no difference between Lalitāmbikā and the Brahman, She is addressed as Nārāyaṇī.

Viṣṇu Sahasranāma nāma 245 is Nārāyaṇa. The following is the explanation given to that nāma. “The creation is made out of that Ātman (the Brahman). Such creations are known as nārāni. The abode of nārāni is called Nārāyaṇa. The feminine gender of Nārāyaṇa is Nārāyaṇī. This nāma also reconfirms Her Brahmanic status. There are several such confirmations in this Sahasranāma.


Continues...

🌹 🌹 🌹 🌹 🌹


08 Aug 2021