🌹 16, OCTOBER 2023 MONDAY ALL MESSAGES సోమవారం, ఇందు వాసర సందేశాలు 🌹

🍀🌹 16, OCTOBER 2023 MONDAY ALL MESSAGES సోమవారం, ఇందు వాసర సందేశాలు 🌹🍀
1) 🌹 16, OCTOBER 2023 MONDAY సోమవారం, ఇందు వాసరే - నిత్య పంచాంగము Daily Panchangam🌹
🌹. దేవీ నవరాత్రులు - నవ దుర్గలు సాధన - 2. బ్రహ్మచారిణి - గాయత్రీ దేవి.🌹
🌹 Worship Maa Brahmacharini - Gayatri Mata on the second day of Navaratri 🌹
2) 🌹 కపిల గీత - 250 / Kapila Gita - 250 🌹 
🌴 6. దేహ గేహముల యందు ఆసక్తుడైన వానికి ప్రాప్తించు అధోగతి - 15 / 6. Description by Lord Kapila of Adverse Fruitive Activities - 15 🌴
3) 🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 842 / Vishnu Sahasranama Contemplation - 842 🌹 
🌻842. అధృతః, अधृतः, Adhr‌taḥ🌻
4) 🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 155 / DAILY WISDOM - 155 🌹 
🌻 3. ప్రతీ వైఫల్యం ఒక రకమైన మరణం / 3. Every Failure is a Kind of Death 🌻
5) 🌹. శివ సూత్రములు - 157 / Siva Sutras - 157 🌹 
🌻 3-6. మోహవరణాత్ సిద్ధిః - 3 / 3-6. mohāvaranāt siddhih   - 3 🌻

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 16, అక్టోబరు, OCTOBER 2023 పంచాంగము - Panchangam 🌹*
*శుభ సోమవారం, Monday, ఇందు వాసరే*
*మనందరికి ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని పరమాత్మని స్మరిస్తూ - ప్రసాద్ భరద్వాజ*

*🌻. పండుగలు మరియు పర్వదినాలు : బ్రహ్మ చారిణి - గాయత్రి దేవి పూజ, చంద్ర దర్శనము, Brahmacharini - GayatriDevi Pooja, Chandra Darshan 🌻*

🌷. 2. బ్రహ్మచారిణి ప్రార్ధనా శ్లోకము :
దధానా కరపద్మాభ్యాం అక్షమాలాకమండలూ ।
దేవీ ప్రసీదతు మయి బ్రహ్మచారిణ్యనుత్తమా ॥

🌷. గాయత్రీ దేవి ధ్యాన స్తోత్రము :
ముక్తావిద్రుమ హేమనీల ధవళచ్ఛాయైర్ముఖై స్త్రీక్షణైః
యుక్తామిందు నిబద్ధరత్నమకుటాం తత్త్వార్థవర్ణాత్మికాం !
గాయత్రీం వరదాభయాంకుశ కళాః శుభ్రం కపాలంగదాం
శంఖంచక్ర మదారవిందయుగళం హస్తైర్వహంతీంభజే !!

*🌷. అలంకారము - నివేదనం :*
*గాయత్రీ దేవి - పసుపు రంగు, పులిహోర*

🌻 🌻 🌻 🌻 🌻

*🍀. నేటి సూక్తి : సాధనకు పునాది - మనస్సు చంచలంగా ఉంటే సాధనకు పునాది ఏర్పడజాలదు. కనుక మనస్సు చాంచల్యము నుడపడం సాధనలో మొట్టమొదట చేయవలసిన పని. నిశ్చలమైన మనస్సు నందే ఉన్నతమైన ఆధ్యాత్మిక చేతన నివసిస్తుంది.🍀*

🌷🌷🌷🌷🌷

విక్రమ: 2080 నల, శఖ: 1945 శోభన
కలియుగాబ్ది : 5124, శోభకృత్‌,
శరద్‌ ఋతువు, దక్షిణాయణం,
ఆశ్వీజ మాసం
తిథి: శుక్ల విదియ 25:14:27 వరకు
తదుపరి శుక్ల తదియ
నక్షత్రం: స్వాతి 19:36:04 వరకు
తదుపరి విశాఖ
యోగం: వషకుంభ 10:04:31 వరకు
తదుపరి ప్రీతి
కరణం: బాలవ 12:54:02 వరకు
వర్జ్యం: 00:09:08 - 01:50:36
మరియు 25:25:04 - 27:04:48
దుర్ముహూర్తం: 12:25:05 - 13:12:04
మరియు 14:46:02 - 15:33:01
రాహు కాలం: 07:37:17 - 09:05:23
గుళిక కాలం: 13:29:41 - 14:57:47
యమ గండం: 10:33:29 - 12:01:35
అభిజిత్ ముహూర్తం: 11:38 - 12:24
అమృత కాలం: 10:17:56 - 11:59:24
సూర్యోదయం: 06:09:11
సూర్యాస్తమయం: 17:53:59
చంద్రోదయం: 07:18:29
చంద్రాస్తమయం: 18:56:55
సూర్య సంచార రాశి: కన్య
చంద్ర సంచార రాశి: తుల
యోగాలు: ఛత్ర యోగం - స్త్రీ లాభం
19:36:04 వరకు తదుపరి మిత్ర యోగం
- మిత్ర లాభం
దిశ శూల: తూర్పు
✍️. శ్రీ వక్కంతం చంద్రమౌళి

🌻 🌻 🌻 🌻 🌻  

*🍀. నిత్య ప్రార్థన 🍀*
*వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ*
*నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా*
*యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా*
*తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం*
*తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ* 
*విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.*
🌹🌹🌹🌹🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. దేవీ నవరాత్రులు - నవ దుర్గలు సాధన - 2. బ్రహ్మచారిణి - గాయత్రీ దేవి. / Worship Maa Brahmacharini - Gayatri Mata on the second day of Navaratri 🌹*
*📚 . ప్రసాద్ భరద్వాజ*

*🌷. 2. బ్రహ్మచారిణి ప్రార్ధనా శ్లోకము :*
*దధానా కరపద్మాభ్యాం అక్షమాలాకమండలూ ।*
*దేవీ ప్రసీదతు మయి బ్రహ్మచారిణ్యనుత్తమా ॥*

*🌷. గాయత్రీ దేవి ధ్యాన స్తోత్రము :*
*ముక్తావిద్రుమ హేమనీల ధవళచ్ఛాయైర్ముఖై స్త్రీక్షణైః*
*యుక్తామిందు నిబద్ధరత్నమకుటాం తత్త్వార్థవర్ణాత్మికాం !*
*గాయత్రీం వరదాభయాంకుశ కళాః శుభ్రం కపాలంగదాం*
*శంఖంచక్ర మదారవిందయుగళం హస్తైర్వహంతీంభజే !!*

*🌷. అలంకారము - నివేదనం : గాయత్రీ దేవి - కాషాయం లేదా నారింజ రంగు, కొబ్బరి అన్నం, పాయసాన్నం*

*🌷. మహిమ :*
*ఒక చేత జపమాల, మరో చేత జలపాత్ర ధరించిన బ్రహ్మచారిణీ మాత సాధకునిలో సదాచారాన్ని ప్రవేశపెడుతుంది. ఈమె నామస్మరణతో కర్మబంధాలు చెదిరిపోయి మోక్షం సంప్రాప్తిస్తుంది. శివుణ్ణి పతిగా పొందేందుకు తపించిపోయిన రాజకన్య . ఈమెను ఆరాధిస్తే మనస్సుకు ఏకాగ్రత కలుగుతుంది.*

*దుర్గామాతయొక్క నవశక్తులలో రెండవది ‘బ్రహ్మచారిణి’ స్వరూపము. ఈ సందర్భంలో ‘బ్రహ్మ’ అనగా తపస్సు. ‘బ్రహ్మచారిణి’ అనగా తపమాచరించునది. ‘వేదస్తత్త్వం తపోబ్రహ్మ’ – ‘బ్రహ్మ’ యనగా వేదము, తత్త్వము, తపస్సు. బ్రహ్మచారిణీదేవి స్వరూపము పూర్తిగా జ్యోతిర్మయము, మిక్కిలి శుభంకరమూ, భవ్యము. ఈ దేవి కుడిచేతిలో జపమాలను, ఎడమ చేతిలో కమండలాన్నీ ధరించి ఉంటుంది.*

*🌷. చరిత్ర :*
*హిమవంతుని కూతురైన పార్వతియే ఈ బ్రహ్మచారిణీ దేవి. ఈమె పరమేశ్వరుణ్ణి పతిగా పొందటానికి నారదుడి ఉపదేశాన్ని అనుసరించి ఘోరతపము ఆచరిస్తుంది. ఈ కఠిన తపశ్చర్య కారణానే ఈమెకు ‘తపశ్చారిణి’ అనగా ‘బ్రహ్మచారిణీ’ అనే పేరు స్థిరపడింది. తపశ్చర్యకాలములో ఈమె కేవలము ఫల, కంద మూలములను మాత్రమే ఆరగిస్తూ లెక్కలేనన్ని సంవత్సరాలు గడుపుతుంది. కేవలము పచ్చికాయగూరలనే తింటూ మరికొన్ని సంవత్సరాలూ, కఠినోపవాసములతో ఎలాంటి ఆచ్ఛాదనమూ లేకుండా ఎండలలో ఎండుతూ, వానలలో తడుస్తూ కొంత కాలంపాటూ తపస్సును ఆచరిస్తుంది. ఇలాంటి కఠినతరమైన తపస్సును ఆచరించిన తరువాత, మరింకెన్నో సంవత్సరాలపాటు నేలపై రాలిన ఎండుటాకులను మాత్రమే స్వీకరిస్తూ పరమేశ్వరుణ్ణి అహర్నిశలూ ఆరాధిస్తుంది. మెల్లిగా ఎండుటాకులనుకూడా తినటం మానివేసి ‘అపర్ణ’యై చాలాకాలంపాటు ఆహారమూ, నీళ్ళు కూడా ముట్టకుండా ఘోరమైన తపస్సును ఆచరిస్తుంది.*

*ఇలా చాలాకాలంపాటు కఠినమైన తపస్సును కొనసాగించటం కారణాన, బ్రహ్మచారిణిదేవి శరీరము పూర్తిగా కృశించి పోతుంది. ఈవిడ స్థితిని చూసి తల్లియైన మేనాదేవి ఎంతగానో దుఃఖిస్తుంది. ఈమెను ఈ కఠిన తపస్సు నుండి మరలించడానికి తల్లి ‘ఉ మా’ – ‘బిడ్డా! వలదు, వలదు’ అని పలికినందున, బ్రహ్మచారిణిదేవి పేరు ‘ఉమా’ అని ప్రసిద్ధి కెక్కింది.*

*బ్రహ్మచారిణీదేవి చేసిన ఘోరతపస్సు కారణాన, ముల్లోకాలలో హాహాకారాలు చెలరేగుతాయి. దేవతలూ, ఋషులూ, సిద్ధులూ, మునులూ మొదలైనవారందరూ ఈవిడ తపస్సు కనీవినీ యెరుగనటువంటి పుణ్యకార్యమని పలుకుతూ ఈవిడను కొనియాడతారు. చివరికి పితామహుడైన బ్రహ్మదేవుడు, అశరీరవాణి ద్వారా ఈమెను సంబోధిస్తూ ప్రసన్నమైన స్వరంలో ఇలా పలుకుతారు “దేవీ! ఇట్టి కఠోర తపస్సును ఇంతవరకునూ ఎవ్వర్రునూ ఆచరింపలేదు. ఇది నీకే సాధ్యమైనది. అలౌకికమైన నీ తపశ్చర్య సర్వత్ర శ్లాఘించబడుచున్నది. నీ మనోవాంఛ సంపూర్ణముగా నెరవేరును. చంద్రమౌళియైన పరమేశ్వరుడు అవశ్యముగా నీకు పతియగును. ఇక నీవు తపస్సును విరమించి ఇంటికి మరలుము. త్వరలోనే నీ తండ్రి నిన్ను ఇంటికి తీసికొనిపోవుటకై వచ్చును.“*

*దుర్గామాతయొక్క ఈ రెండవ స్వరూపము భక్తులకూ, సిద్ధులకూ అనంతఫలప్రదము. ఈమెను ఉపాసించటంవల్ల మానవులలో తపస్సూ, త్యాగమూ, వైరాగ్యమూ, సదాచారమూ, సంయమమూ వృద్ధి చెందుతాయి. జీవితంలో ఎలాంటి ఒడుదొడుకులు ఎదురైనా దేవి అనుగ్రహముతో వారి మనస్సులు కర్తవ్యమార్గం నుండి మరలవు. లోకమాత అయిన బ్రహ్మచారిణీదేవి కృపవలన ఉపాసకులకు సర్వత్ర సిద్ధీ, విజయాలూ ప్రాప్తిస్తాయి. దుర్గానవరాత్రి పూజలలో రెండవరోజున ఈమె స్వరూపము ఉపాసించబడుతుంది. ఈ రోజు సాధకుని మనస్సు స్వాధిష్ఠాన చక్రములో స్థిరమవుతుంది. ఈ చక్రంలో స్థిరమైన మనస్సుగల యోగి, ఈమె కృపకు పాత్రుడగుతాడు. అతనికి ఈమె యెడల భక్తి ప్రపత్తులు దృఢమవుతాయి.*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Worship Maa Brahmacharini - Gayatri Mata on the second day of Navaratri 🌹*

*On the second day of Navaratri, Maa Brahmacharini - a manifestation of Maa Durga - is worshipped. The form of Goddess Brahmacharini is extremely radiant and majestic. Maa signifies love and loyalty, wisdom and knowledge. She holds a rosary in her hight hand and a Kamandal in her left hand. She wears Rudraksha. The word "Brahm" refers to Tapa (penance) - Her name means "one who performs Tapa (penance)".*

*She was born to Himalaya. Devrishi Narada influenced her thoughts and as a result, she practised tough penances as she was determined to obtain Lord Shiva as her divine consort. She spent hundred of years eating very little or nothing at all, but her penance was so pure and had so much strength, power that it caused great disturbance in all the three worlds. Her desire to obtain Lord Shiva as her divine consort was eventually fulfilled.*

*Goddess Brahmcharini blesses you with great emotional strength and you may be able to keep your mental balance and confidence even in the darkest hour. She inspires you to hold on to your ethics and march on the path of duty. By the grace of Maa Brahmacharini, you strive to move forward in life without getting disheartened by the numerous challenges coming your way. Her blessings help you get rid of selfishness, ego, greed and laziness.*

*The Mantra And Other Facts About Maa Brahmacharini:*

*Maa Brahmacharini Dhyan: Dadhaana Kar Padmabhyam Akshmala Kamandalu, Devi Prasidatu Mayi Brahmacharinyanuttama.*

*Maa Brahmacharini Mantra for the second day of Navratri:*
*Om Brahm Brahmacharinyai Namah. (Chant it 108 times).*
*Colour of the second day: Orange.*
*Prasad of the second day: Sugar and unsalted butter. - coconut rice, Sweet Rice*
*Governing Planet: It is believed that Lord Mangal, the provider of all fortunes, is governed by Goddess Brahmacharini.*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. కపిల గీత - 250 / Kapila Gita - 250 🌹*
*🍀. కపిల దేవహూతి సంవాదం 🍀*
*✍️. ప్రసాద్‌ భరధ్వాజ*

*🌴 6. దేహ గేహముల యందు ఆసక్తుడైన వానికి ప్రాప్తించు అధోగతి - 15 🌴*

*15. ఆస్తేఽవమత్యోపన్యస్తం గృహపాల ఇవాహరన్|*
*ఆమయావ్యప్రదీప్తాగ్నిరల్పాహారోఽల్పచేష్టితః॥*

*తాత్పర్యము : ఆకలి మందగించును. ఆహారము (తినుట) తగ్గిపోవును. పురుషార్థముల యందు ఆసక్తి హీనుడగును. స్త్రీ పుత్రాదుల ద్వారా అవమానములు పాలగుచు, వారు పెట్టెడి పిడికెడు మెతుకులు తినుచు కుక్క వలె హీనమైన బ్రతుకును వెళ్ళదీయుచుండును.*

*వ్యాఖ్య : మరణాన్ని కలుసుకునే ముందు ఒక వ్యక్తి అనారోగ్యంతో వికలాంగుడిగా మారడం ఖాయం, మరియు అతని కుటుంబ సభ్యులచే నిర్లక్ష్యం చేయబడినప్పుడు, అతని జీవితం కుక్క కంటే తక్కువగా ఉంటుంది, ఎందుకంటే అతను చాలా దయనీయమైన పరిస్థితులలో ఉంచబడతాడు. అందువల్ల, అటువంటి దుర్భర పరిస్థితులు రాకముందే, ఇంటిని విడిచిపెట్టి, కుటుంబ సభ్యులకు తెలియకుండా చనిపోవాలని వైదిక సాహిత్యాలు ఆదేశిస్తాయి. ఒక వ్యక్తి ఇంటి నుండి వెళ్లి తన కుటుంబానికి తెలియకుండా మరణిస్తే, అది మహిమాన్వితమైన మరణంగా పరిగణించ బడుతుంది. కానీ ఒక అనుబంధ కుటుంబ వ్యక్తి తన మరణానంతరం కూడా తన కుటుంబ సభ్యులు తనను ఒక గొప్ప ఊరేగింపులో తీసుకువెళ్లాలని కోరుకుంటాడు మరియు ఊరేగింపు ఎలా సాగుతుందో చూడలేనప్పటికీ, అతను ఇప్పటికీ తన మృతదేహాన్ని ఊరేగింపులో బ్రహ్మాండంగా తీసుకెళ్లాలని కోరుకుంటాడు. ఆ విధంగా అతను తన శరీరాన్ని విడిచిపెట్టినప్పుడు తదుపరి జన్మ కోసం అతను ఎక్కడికి వెళ్లాలో కూడా తెలియకుండా సంతోషంగా ఉంటున్నాడు.*

*సశేషం..*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Kapila Gita - 250 🌹*
*🍀 Conversation of Kapila and Devahuti 🍀*
*📚 Prasad Bharadwaj*

*🌴 6. Description by Lord Kapila of Adverse Fruitive Activities - 15 🌴*

*15. āste 'vamatyopanyastaṁ gṛha-pāla ivāharan*
*āmayāvy apradīptāgnir alpāhāro 'lpa-ceṣṭitaḥ*

*MEANING : Thus he remains at home just like a pet dog and eats whatever is so negligently given to him. Afflicted with many illnesses, such as dyspepsia and loss of appetite, he eats only very small morsels of food, and he becomes an invalid, who cannot work any more.*

*PURPORT : Before meeting death one is sure to become a diseased invalid, and when he is neglected by his family members, his life becomes less than a dog's because he is put into so many miserable conditions. Vedic literatures enjoin, therefore, that before the arrival of such miserable conditions, one should leave home and die without the knowledge of his family members. If a man leaves home and dies without his family's knowing, that is considered to be a glorious death. But an attached family man wants his family members to carry him in a great procession even after his death, and although he will not be able to see how the procession goes, he still desires that his body be taken gorgeously in procession. Thus he is happy without even knowing where he has to go when he leaves his body for the next life.*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 842/ Vishnu Sahasranama Contemplation - 842🌹*

*🌻842. అధృతః, अधृतः, Adhr‌taḥ🌻*

*ఓం అధృతాయ నమః | ॐ अधृताय नमः | OM Adhr‌tāya namaḥ*

*పృథ్వాదీనాం ధరాణామపి యో ధారకో హరిః ।*
*న కేనచిద్ధ్రియత ఇత్యధృతః ప్రోచ్యతే హి సః ॥*

*ధరించబడు వాడు కాడు. ఇతరములను ధరించు పృథివి మొదలగు వానిని గూడ ధరించు వాడగుట చేతను తానెవ్వరి చేతను ధరించ బడడు కావునను 'అధృతః' అనబడును.*

సశేషం... 
🌹 🌹 🌹 🌹 🌹 

*🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 842🌹*

*🌻842. Adhr‌taḥ🌻*

*OM Adhr‌tāya namaḥ*

पृथ्वादीनां धराणामपि यो धारको हरिः ।
न केनचिद्ध्रियत इत्यधृतः प्रोच्यते हि सः ॥

*Pr‌thvādīnāṃ dharāṇāmapi yo dhārako hariḥ,*
*Na kenaciddhriyata ityadhr‌taḥ procyate hi saḥ.*

*Being the supporter of all supports like the earth, He is not supported by anything else; hence Adhr‌taḥ.*

🌻 🌻 🌻 🌻 🌻 
Source Sloka
अणुर्बृहत्कृशः स्थूलो गुणभृन्निर्गुणो महान् ।
अधृतः स्वधृतस्स्वास्थ्यः प्राग्वंशो वंशवर्धनः ॥ ९० ॥
అణుర్బృహత్కృశః స్థూలో గుణభృన్నిర్గుణో మహాన్ ।
అధృతః స్వధృతస్స్వాస్థ్యః ప్రాగ్వంశో వంశవర్ధనః ॥ 90 ॥
Aṇurbr‌hatkr‌śaḥ sthūlo guṇabhr‌nnirguṇo mahān,
Adhr‌taḥ svadhr‌tassvāsthyaḥ prāgvaṃśo vaṃśavardhanaḥ ॥ 90 ॥

Continues....
🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 155 / DAILY WISDOM - 155 🌹*
*🍀 📖 జ్ఞానం యొక్క కాంతి పుస్తకం నుండి 🍀*
*✍️. ప్రసాద్ భరద్వాజ*

*🌻 3. ప్రతీ వైఫల్యం ఒక రకమైన మరణం 🌻*

*భౌతిక శరీరం నాశనం అవడం ఒక్కటే మరణం కాదు. ప్రతి వైఫల్యం ఒక రకమైన మరణం. మానసిక, సామాజిక లేదా వ్యక్తిగతమైన ఏ రకమైన పతనమైనా ఒక రకమైన మరణమే. మన జీవితంలోని ప్రతి క్షణం మనం మరణిస్తున్నాము మరియు మన జీవితంలోని ప్రతి క్షణం కూడా మనం పునర్జన్మ పొందుతున్నాము. సృష్టి, స్థితి మరియు లయ ప్రతి క్షణం జరుగుతూనే ఉన్నాయి. ఇవి లక్షల సంవత్సరాల క్రితం జరిగిన విశ్వోద్భవ సంఘటనలు మాత్రమే కావు. అవి శాశ్వతమైన, ఎడతెగని ప్రక్రియలు, అవి ఇప్పుడు కూడా వ్యక్తిగతంగా మరియు విశ్వవ్యాప్తంగా కొనసాగుతూనే ఉన్నాయి.*

*యోగ ముముక్షువు జీవితంలో ఎదురయ్యే పరిస్థితులకు అనుగుణంగా తన వైఖరిని మార్చుకోవడంలో సునిశిత దృష్టిని కలిగి ఉండాలి. అంతర్లీనంగా మరియు బాహ్యంగా జాగ్రత్తగా ఉండటం మరియు పూర్తిగా మానవుడిగా ఉంటూనే, ఆపై దైవం కోసం ఆకాంక్షించడం. ప్రస్తుత తరుణంలో, దీనిని పూర్తిగా ఊహించడం మరియు గ్రహించడం కష్టంగా ఉండవచ్చు. గురువులను పొందడం కష్టమే, కానీ సమర్థులైన శిష్యులను పొందడం ఇంకా కష్టం. ఈ ప్రపంచంలో ఈ రెండూ చాలా అరుదు ఈ రెండు అరుదైన ఆదర్శాల కలయిక ఖచ్చితంగా భగవంతుని దయే అని చెప్పవచ్చు. జీవితంలో మనకు సరియైన మరియు పూర్ణాత్మ యొక్క లక్ష్యం ఏమిటో తెలుసుకోవాలని మనం సర్వశక్తిమంతుడైన పరమాత్మని ప్రార్థిస్తాము.*

*కొనసాగుతుంది...*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 DAILY WISDOM - 155 🌹*
*🍀 📖 In the Light of Wisdom 🍀*
📝 Swami Krishnananda
📚. Prasad Bharadwaj

*🌻 3. Every Failure is a Kind of Death 🌻*

*Destruction of the physical body is not the only form of death. Every failure is a kind of death. Any kind of a fall—psychological, social or personal—is a kind of dying. We are dying every moment of our lives, and we are also reborn every moment of our lives. Creation, preservation and destruction are taking place every moment. These are not cosmological events that took place millions of years ago. They are an eternal, perpetual and unceasing process that continues even now, individually and cosmically.*

*The student of yoga is to be aware of all the subtle shades of difference in conducting oneself in life, to be cautious inwardly and outwardly, and to be wholly human, and then to aspire for the divine. At the present moment, this may be difficult to envisage and comprehend wholly. It is difficult to get teachers, but it is also difficult to get able disciples. Both of these are rare in this world, and the combination of these two rare ideals is surely the manifestation of God’s grace. We offer a prayer to the Almighty to know what our right and whole-souled objective in life is.*

Continues...
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శివ సూత్రములు - 157 / Siva Sutras - 157 🌹*
*🍀. శివ ఆగమ తత్వశాస్త్రం యొక్క సూత్రములు 🍀*
*3వ భాగం - ఆణవోపాయ*
*✍️. ప్రసాద్‌ భరధ్వాజ*

*🌻 3-7. మోహజయాత్‌ అనంతభోగత్‌ సహజవిద్యాజయాః - 1 🌻

*🌴. మాయ పైన విజయంతో, నిస్సందేహంగా ఒకరు శివుని యొక్క అత్యున్నత స్థితిలోకి ప్రవేశిస్తారు మరియు స్వీయ సహజమైన సత్య జ్ఞానాన్ని (సహజ విద్యను) పొందుతారు. 🌴*

*మోహ – భ్రాంతి; జయాత్‌– విజయం; అనంత – అనంతం; ఆభోగత్‌- విస్తరణ లేదా సంపూర్ణత; సహజ – స్వాభావికమైన; విద్యా – జ్ఞానం; జయః - పాండిత్యము.*

*తన ప్రాణాన్ని తన వెన్నుపాము గుండా నడిపించే ఆ సాధకుడు, మాయ పై తన విజయాన్ని స్థాపించుకో గలుగుతాడు. దీని ఫలితంగా, అతను అనంతం యొక్క సంపూర్ణతను గురించి తన స్వాభావిక జ్ఞానంలో అర్థం చేసుకోగలుగుతాడు. నిజమైన జ్ఞానం ఎల్లప్పుడూ ఆ ఆకాంక్షదారులో అంతర్లీనంగా ఉంటుంది (అందరి విషయంలో కూడా). ఈ జ్ఞానం పూర్తిగా భగవంతుని మహిమతో నిండి ఉంటుంది.*

*కొనసాగుతుంది...*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Siva Sutras  - 157 🌹*
*🍀Aphorisms of philosophy of Shiva āgama 🍀*
*Part 3 - āṇavopāya*
*✍️. Acharya Ravi Sarma, 📚. Prasad Bharadwaj*

*🌻 3-7. mohajayād anantābhogāt sahajavidyājayah  - 1 🌻*

*🌴. With unquestionable conquest of māya, one enters the supreme state of Shiva and gains true knowledge (sahaja vidya) which is natural to the self. 🌴*

*Moha – illusion; jayād– victory; ananta – infinite; ābhogāt- expansion or fullness; sahaja – inherent; vidyā – knowledge; jayaḥ - mastery.*

*That aspirant, who routes his prāṇa through his spinal cord, is able to establish his victory over māyā (mohajayād). As a result of this, he is able to understand his inherent knowledge of the fullness of the Infinite. True knowledge is always inherent in that aspirant (as is the case with everyone). This knowledge is fully endowed with the full glory of Lord.*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
Join and Share 
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
https://t.me/+9zDjTpPe_PQzMWVl
https://t.me/Sivasutras
https://t.me/Seeds_Of_Consciousness
https://t.me/bhagavadgeethaa/
https://t.me/AgniMahaPuranam
https://t.me/+LmH1GyjNXXlkNDRl
http://www.facebook.com/groups/srilalithachaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/
https://prasadbharadwaj.wixsite.com/dailybhaktimessages2
https://chaitanyavijnanam.tumblr.com/
https://prasadbharadwaj.wixsite.com/lalithasahasranama
https://www.threads.net/@prasad.bharadwajJoin and Share 
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
https://t.me/+9zDjTpPe_PQzMWVl
https://t.me/Sivasutras
https://t.me/Seeds_Of_Consciousness
https://t.me/bhagavadgeethaa/
https://t.me/AgniMahaPuranam
https://t.me/+LmH1GyjNXXlkNDRl
http://www.facebook.com/groups/srilalithachaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/
https://prasadbharadwaj.wixsite.com/dailybhaktimessages2
https://chaitanyavijnanam.tumblr.com/
https://prasadbharadwaj.wixsite.com/lalithasahasranama
https://www.threads.net/@prasad.bharadwaj

🌹. Worship Maa Shailputri on the first day of Navaratri 🌹



*🌹. Worship Maa Shailputri on the first day of Navaratri 🌹*

*One of all nine forms of Devi Durga is worshipped every day in Navaratri. The first form of Maa Durga is Shailputri, who was born to the King of Mountains. "Shail" means mountain and "putri" means daughter. Hence, she is called Shailputri - the daughter of mountain. Maa Shailputri, an absolute form of Mother Nature, is worshipped on the first day of Navratri. She is also referred to as Goddess Parvati, the consort of Lord Shiva and mother of Lord Ganesha and Kartikeya. The image of Maa Shailputri is a divine lady, holding a trishul in her right hand and lotus flower in her left hand. She rides on Nandi, a bull.*

*Maa Shailputri is the goddess of the muladhara chakra or root chakra, and upon awakening this Shakti one begins their journey to spiritual awakening and to their purpose in life. Without energising the muladhara chakra one doesn't have the power and strength to do anything worthwhile. It is said that one should worship Maa Shailputri to make full use of the precious human life. Therefore, this Avtar of Goddess Durga is worshipped on the first day of Navratri.*

*Navratri is a special occasion. A time for new beginnings and offering your dedication and reverence to the Goddess Shakti.*

*🍀. The Mantra And Other Facts About Maa Shailputri:*

*Maa Shailputri Dhyan:*
*Vande Vanchhit Laabhaya Chandrardha Krita Shekharaam Vrisharudham Shooladharam Shailputrim Yashasvinim.*

*Maa Shailputri Mantra for the first day of Navratri:* *Om Sham Shailputraye Namah. (Chant 108 times).*
*Colour of the first day: Grey or light Blue.*
*Prasad of the first day: Banana and Ghee made from cow milk & Crystal Sugar.*

*Jai Mata Di !*
🌹🌹🌹🌹🌹

Good Wishes on Devi Navaratri - Significance of Avatars of Maa Durga, and List Navratri Days 2023

🌹. Devi Navaratri Good Wishes to All 🌹

🙏. Prasad Bharadhwaj.

On the auspicious occasion during Devi Navratri, nine forms of Goddess Maa Durga - Shailputri, Brahmacharini, Chandraghanta, Kushmanda, Skanda Mata, Katyayani, Kalratri, Maha Gauri and Siddhidatri are worshipped by the devotees. Devi Navratri festival will start from Monday, 15th October 2023 and will be celebrated till 24th October 2023.

The devotees worship these nine incarnations of goddess Durga till nine days to get blessing of Maa Durga. It is believed that People who worship Maa Bhagwati, do fasting and chanting mantras during Navratri will be blessed with prosperity, health and wisdom in their life. Jaagran has also been made by the devotees during navratri nights.

Navratri celebration and worshipping style is different in every state of India but the devotion is same for Navratri festival. It is celebrated widely in every part of India with great enthusiasm with a different name of Goddess, like in Gujarat devotees worship as Goddess Jagdamba while in West Bengal it is named as Durga Puja. In Kolkata people erected huge Pandals at various places for Durga Puja and set up great idols of Mata Durga for worship. In Gujarat, Dandiya and Garba are the two popular dance forms which are performed by the people during Navratri festival.


🌹 List of Navratri Days 2023 & Various Forms of Goddess Durga 🌹

This year, Navratri starts on 15th October. On each day of Navratri, it is believed that a different form of Maa Durga is worshipped. Each of her forms has various traits and influences. Various Avatars of Goddess Durga on each day of Navratri are as follows:


🍀 Day - Dates for Navratri 2023 - Avatars of Maa Durga - Significance 🍀

1) October 15 - Shailputri - Represents Mother Nature

2) October 16 - Brahmacharini - Penance & Good- Conduct

3) October 17 - Chandraghanta - Peace & Goodness

4) October 18 - Kushmanda - Empowerment

5) October 19 - Skandmata - Salvation & Prosperity

6) October 20 - Katyayani - Fierceness

7) October 21 - Kaalratri - Eliminator of Fears & Suffering

8) October 22 - Mahagauri - Purity, Serenity & Tranquility

9) October 23 - Siddhidatri - Provider of Siddhi (accomplishments)

10) October 24 - Dasara - Conclusion of nine days and kanya puja

🌹🌹🌹🌹🌹




దేవీ నవరాత్రులు - నవ దుర్గలు - 1. శైలపుత్రి - బాలా త్రిపుర సుందరి. / Worship Maa Shailputri on the first day of Navaratri


🌹. దేవీ నవరాత్రులు - నవ దుర్గలు - 1. శైలపుత్రి - బాలా త్రిపుర సుందరి. / Worship Maa Shailputri on the first day of Navaratri 🌹

📚 . ప్రసాద్ భరద్వాజ



🌷. 1. శైలపుత్రి ప్రార్ధనా శ్లోకము :

వందే వాంఛితలాభాయ చంద్రార్ధకృతశేఖరామ్ ।
వృషారూఢాం శూలధరాం శైలపుత్రీం యశస్వినీమ్ ॥


🌷. 1. బాలా త్రిపుర సుందరి స్తోత్రము :

కదంబ వనచారిణీం ముని కదంబ కాదంబినీం
నితంబ జిత భూధారం సురనితంబిని సేవితాం
నవంబురుహ లోచనం అభినవాంబుదా శ్యామాలాం
త్రిలోచన కుటుంబనీం త్రిపుర సుందరీ మాశ్రయే



🌷. అలంకారము - నివేదనం :

బాలా త్రిపుర సుందరి - నీలి రంగు - పులిహోర, కట్టు పొంగలి



🌷. మహిమ :

కుడిచేతిలో త్రిశూలాన్ని, వామహస్తంలో పద్మాన్ని, వృషభవాహినిగా అవతరించిన శైలపుత్రిని స్మరించినంతనే, శ్రవణం చేసినంత మాత్రాన విజయోత్సాహం కలుగుతుంది.


దుర్గామాత మొదటి స్వరూపము ‘శైలపుత్రి’ నామముతో ప్రసిద్ధికెక్కినది. పర్వత రాజైన హిమవంతుని ఇంట పుత్రికయై అవతరించినందున ఆమెకు ‘శైలపుత్రి’ అనే నామము ఏర్పడినది.

వృషభవాహననారూఢయైన ఈ మాత కుడి చేతిలో త్రిశూలమూ, ఎడమచేతిలో కమలమూ విరాజిల్లుతుంటాయి. ఈ అవతారమే నవదుర్గలలో మొదటిది.

నవదుర్గలలో మొదటి అవతారమైన ‘శైలపుత్రి’ యొక్క మహిమలూ, శక్తులూ అనంతములు. మొదటి రోజున యోగులు ఉపాసన ద్వారా తమ మనస్సులను మూలాధార చక్రంలో స్థిరపరుచుకుంటారు. దీనితోనే వారి యోగ సాధనలు ఆరంభమవుతాయి.



🌷. చరిత్ర :

పూర్వజన్మలో ఈమె దక్ష ప్రజాపతికి పుత్రిక – దాక్షాయని. అ జన్మలో ఈమె పేరు సతీదేవి. ఈమె పరమేశ్వరుని పరిణయమాడినది. ఒకసారి దక్షుడొక మహాయజ్ఞమును ఆచరిస్తాడు. దేవతలు తమతమ యజ్ఞభాగములను స్వీకరించటానికై దక్షుడు వారిని ఆహ్వానిస్తాడు. కానీ పరమశివుని మాత్రము ఆ యజ్ఞానికి పిలువడు. తన తండ్రి ఒక మహాయజ్ఞమును సంకల్పించిన విషయం ఆమెకు తెలుస్తుంది. ఆ యజ్ఞాన్ని వీక్షించటానికై ఆమె మసస్సు ఉబలాటపడుతుంది. అప్పుడు ఆమె పరమేశ్వరునికి తన కోరికను తెలియజేస్తుంది. బాగా ఆలోచించి పరమేశ్వరుడు “కారణము ఏమోగానీ, దక్షుడు మనపై కినుకుబూనినాడు. అతడు తన యజ్ఞమునకు దేవతలందరినీ ఆహ్వానించినాడు. యజ్ఞభాగములనుగూడ వారికి సమర్పించుచున్నాడు. కానీ ఉద్దేశ్యపూర్వకముగానే మనలను పిలువలేదు. కనీసము సమాచారమునైననూ తెలుపలేదు. ఇట్టి పరిస్థితిలో నీవు అచటికి వెళ్ళుట ఏ విధముగను మంచిదిగాదు” అని హితవు బోధించారు. శంకరుని ఈ హితవచనము ఆమె చెవికెక్కలేదు. ఈ యజ్ఞమిషతోనైనా అక్కడికి వెళ్ళి తన తల్లినీ, తోబుట్టువులనూ చూడవచ్చునన్న కోరిక ప్రబలంగా ఉండటంతో అనుమతికై ఆమె పట్టుబడుతుంది. ఆమె పట్టుదలను చూసి, చివరకు శంకరుడు అనుమతిస్తారు.

సతీదేవి తన తండ్రియింటికి చేరినప్పుడు అక్కడివారెవ్వరూ ఆమెతో మాట్లాడరు, ఆదరించరు. అందరూ ముఖాలను పక్కకు తిప్పుకొంటారు. తల్లి మాత్రము ఆమెను ప్రేమతో కౌగిలించుకొంటుంది. తోబుట్టువుల పలుకులలో వ్యంగ్యం, పరిహాసమూ నిండి ఉంటాయి. తనవారి ప్రవర్తనకు ఆమె మనస్సు కలత చెందుతుంది. అందరిలోనూ శంకరుని పట్ల నిరాదరణభావమే ఉండటం ఆమె గమనిస్తుంది. తండ్రియైన దక్షుడు ఆమెతో అవమానకరంగా మాట్లాడతాడు. ఇదంతా అనుభవించిన పిమ్మట, సతీదేవి హృదయము క్షోభతో, గ్లానితో, క్రోధముతో ఉడికిపోతుంది. ‘పరమేశ్వరుని మాటను పాటింపక నేను ఇచ్చటికివచ్చి పెద్ద పొరబాటే చేసితిని‘ అని ఆమె భావిస్తుంది.

తన పతియైన పరమేశ్వరునికి జరిగిన ఈ అవమానమును ఆమె సహించలేక పోతుంది. వెంటనే ఆమె తన రూపమును అక్కడికక్కడే యోగాగ్నిలో భస్మము గావిస్తుంది. భరింపలేని ఈ దారుణదుఃఖకరమైన సంఘటనను గురించి విని, పరమశివుడు మిక్కిలి క్రోధితుడవుతాడు. ఆయన తన ప్రమథగణాలను పంపి దక్షుని యజ్ఞాన్ని పూర్తిగా ద్వంసం చేయిస్తారు.

సతీదేవి యోగాగ్నిలో తన తనువును చాలించి, మరుజన్మలో శైలరాజైన హిమవంతునికి పుత్రికగా అవతరిస్తుంది. అప్పుడామె ‘శైలపుత్రి’గా ప్రసిద్ధికెక్కుతుంది. పార్వతి, హైమవతి అన్నవి కూడా ఆమె పేర్లే. ఉపనిషత్తులోని ఒక కథను అనుసరించి, ఆమె హైమవతీ రూపంలో దేవతల గర్వాన్ని ఆణచివేస్తుంది.

‘శైలపుత్రి’ అవతారములో ఆమె పరమేశ్వరుణ్ణే పరిణయమాడుతుంది. పూర్వజన్మలో లాగానే ఈ అవతారంలో కూడా శంకరునికి ‘అర్ధాంగి’ అవుతుంది.

నవరాత్రి ఉత్సవములలో మొదటిరోజున ఈ దేవికై పూజలూ, ఉపవాసాలూ జరుపబడుతాయి.


🌹 🌹 🌹 🌹 🌹





🌹. Worship Maa Shailputri on the first day of Navaratri 🌹

One of all nine forms of Devi Durga is worshipped every day in Navaratri. The first form of Maa Durga is Shailputri, who was born to the King of Mountains. "Shail" means mountain and "putri" means daughter. Hence, she is called Shailputri - the daughter of mountain. Maa Shailputri, an absolute form of Mother Nature, is worshipped on the first day of Navratri. She is also referred to as Goddess Parvati, the consort of Lord Shiva and mother of Lord Ganesha and Kartikeya. The image of Maa Shailputri is a divine lady, holding a trishul in her right hand and lotus flower in her left hand. She rides on Nandi, a bull.

Maa Shailputri is the goddess of the muladhara chakra or root chakra, and upon awakening this Shakti one begins their journey to spiritual awakening and to their purpose in life. Without energising the muladhara chakra one doesn't have the power and strength to do anything worthwhile. It is said that one should worship Maa Shailputri to make full use of the precious human life. Therefore, this Avtar of Goddess Durga is worshipped on the first day of Navratri.

Navratri is a special occasion. A time for new beginnings and offering your dedication and reverence to the Goddess Shakti.


🍀. The Mantra And Other Facts About Maa Shailputri:


Maa Shailputri Dhyan:

Vande Vanchhit Laabhaya Chandrardha Krita Shekharaam Vrisharudham Shooladharam Shailputrim Yashasvinim.


Maa Shailputri Mantra for the first day of Navratri: Om Sham Shailputraye Namah. (Chant 108 times).

Colour of the first day: Grey or light Blue.

Prasad of the first day: Banana and Ghee made from cow milk & Crystal Sugar.


Jai Mata Di !


🌹🌹🌹🌹🌹




దేవీ నవరాత్రులు - నవదుర్గల అలంకారం, రంగు, నైవేద్యం Devi Navratri - Decoration, colour, naivedya of Navadurgas


🍀. దేవీ నవరాత్రులు - నవదుర్గల అలంకారం, రంగు, నైవేద్యం 🍀

✍. ప్రసాద్ భరద్వాజ



1. శైలపుత్రి :- బాలా త్రిపుర సుందరి - గులాబీ రంగు
నైవేద్యం : పులిహోర, కట్టు పొంగలి


2. బ్రహ్మచారిణి :- గాయత్రీ దేవి - కాషాయం లేదా నారింజ రంగు
నైవేద్యం : కొబ్బరి అన్నం, పాయసాన్నం


3. చంద్రఘంట :- అన్నపూర్ణ దేవి - పసుపు రంగు. 
నైవేద్యం : క్షీరాన్నం, దద్దోజనం, గారెలు


4. కూష్మాండ :- శ్రీ లలితా త్రిపుర సుందరి దేవి -కుంకుమ రంగు.
నైవేద్యం : దద్దోజనం, క్షీరాన్నం


5. స్కందమాత :- సరస్వతీదేవి - తెలుపు రంగు.
నైవేద్యం : కేసరి, పరమాన్నం, దద్దోజనం


6. కాత్యాయని :- మహాలక్ష్మి దేవి - గులాబీ రంగు.
నైవేద్యం : చక్కెర పొంగలి, క్షీరాన్నం


7. కాళరాత్రి :- దుర్గాదేవి - ఎరుపు రంగు.
నైవేద్యం : కదంబం, శాకాన్నం


8. మహాగౌరి :- మహిషాసురమర్ధిని దేవి - ముదురు ఎరుపు రంగు.
నైవేద్యం : చక్కెర పొంగలి


9. సిద్ధిదాత్రి :- రాజరాజేశ్వరీ దేవి - ఆకుపచ్చ రంగు. 
నైవేద్యం : పులిహోర, లడ్డూలు, బూరెలు, గారెలు, అన్నం



🌹 🌹 🌹 🌹 🌹




శ్రీ దుర్గా నవరాత్రి వ్రతం - సాధనాపర విశిష్టత Shri Durga Navratre Vrat (Day Long Fasting) - Significance


🌹. శ్రీ దుర్గా నవరాత్రి వ్రతం - సాధనాపర విశిష్టత 🌹

📚 . ప్రసాద్ భరద్వాజ


ప్రకృతిలోని చైతన్యశక్తి. ప్రకృతి స్వరూపాల నన్నింటినీ జీవుడు తన మనస్సులో లయం చేసి, ఒకే ఒక చైతన్య పర తత్త్వ శక్తియందు నిలిపితే జన్మసాఫల్యాన్ని పొందుతాడు. తనలో ఉండే ఆ చైతన్య శక్తి సర్వజీవులయందు ఉంటుందనే సత్యాన్ని గుర్తించి, చైతన్యాద్వైత శక్తిని అర్థం చేసికొంటే దివ్యానుభూతిని పొందుతాడు.

‘‘సర్వరోగోపశమనం సర్వోపద్రవ నాశనం శాన్తిదం సర్వారిష్టానాం నవరాత్ర వ్రతం శుభమ్’’

సర్వ రోగములను, సర్వ ఉపద్రవములను పోగొట్టి, సర్వారిష్టాల్ని పారద్రోలి సుఖశాంతుల్ని కటాక్షించేది- నవరాత్రి వ్రతం అని పేర్కొన్నది స్కాంధ పురాణం.

‘నవ’ అంటే తొమ్మిదని, క్రొత్త అని సామాన్యార్థాలు. కానీ, నవ అంటే పరమేశ్వరుడని, ‘రాత్రి’ అంటే పరమేశ్వరి అని నిర్ణయ సింధువు తెలుపుతోంది.

కనుక, నవరాత్రి వ్రతమంటే- పార్వతీ పరమేశ్వరుల, శివశక్తుల, ప్రకృతీ పురుషుల ఆరాధన లేక వ్రతము, పూజ అని అర్థము. నవరాత్రి వ్రతమంటే తొమ్మిది రాత్రులు చేయు వ్రతమని చెపుతారు. ‘‘సూయతే స్తూయతే ఇతి నవః’’ అనగా నవ శబ్దమునకు స్తుతిం పబడుచున్నవాడని అర్థము. పరమాత్మ ‘నవ’ స్వరూపుడు. శబ్దరూపమైన వేదం- ప్రకృష్టమైన ‘నవ్య స్వరూపం’. అదే ప్రణవ స్వరూపం. ‘‘నవో నవో భవతి జాయ మానః’’ పరమాత్మ నిత్య నూతనుడు. అందరి చేత స్తోత్రింపబడుచున్నవాడు. శివశక్తులకు భేదం లేదు. అం దుకే జగన్మాతకు ‘శివా’ అనే నామం కూడా ఉంది.

జగజ్జనని- ‘రాత్రి’ రూపిణి. పరమేశ్వరుడు-ప గలు. జగన్మాత ఆరాధనే- రాత్రి వ్రతం. రాత్రి దేవియే- మహాకాళి, మహాలక్ష్మి, మహా సరస్వతి వంటి రూపనామములతో పూజింపబడుతోంది. అందుకే మాతకు ‘కాళరాత్రి’ అని పేరు. నవ అహోరాత్ర దీక్షగా రాత్రి, పగలు తొమ్మిది రోజులు చేస్తారు. ‘రాత్రి శబ్దస్య తిథి వాచకత్వాత్’ అనే దాన్ని బట్టి రాత్రి అనగా తిథి అని అర్థము తీసికొని తొమ్మిది తిథులు అనగా పాడ్యమి మొదలు నవమి వరకు శ్రీదేవికి పూజ చేస్తారు.

‘పాడ్యమి’ అంటే ‘బుద్ధి’ అని చెప్పబడింది. మనుష్యుల బుద్ధియే శారదాదేవి. పాడ్యమి నుండి శారదా దేవిని ఆరాధిస్తే మంచి బుద్ధిని ప్రసాదిస్తుంది. సర్వ శుభములను చేకూర్చుతుంది. మనలో ఉన్న ఉత్సాహాన్ని పైకి వ్యక్తీకరించటమే ‘ఉత్సవం’ అంటారు. ఇది పెద్ద ఉత్సవం- మహోత్సవం. ఇది- దేవీ శరన్నవరాత్రి పూజా మహోత్సవాల అంతరార్థం.

🌹 🌹 🌹 🌹🌹


శరన్నవ రాత్రి శుభాకాంక్షలు - Good Wishes on Devi Navarti


🌹. శరన్నవ రాత్రి శుభాకాంక్షలు అందరికి. Devi Navarti Good Wishes to All.

🙏. ప్రసాద్‌ భరధ్వాజ

15-10-2023 to 24-10-2023

🍀. దేవీ నవరాత్రులు - నవ దుర్గల విశిష్టత 🍀


నవరాత్రి సమారాధ్యాం నవచక్ర నివాసినీం నవరూప ధరాం శక్తిం, నవదుర్గాముపాశ్రయే

నవరాత్రులలో ఆరాధింప దగినది, (శ్రీ చక్రం లోని) నవచక్రాలలో నివసించేది, శక్తి రూపిణి, అయిన నవదుర్గను ఆశ్రయిస్తున్నాను.

ప్రథమం శైలపుత్రీ చ ద్వితీయం బ్రహ్మచారిణీ |తృతీయం చంద్రఘంటేతి కూష్మాండేతి చతుర్థకమ్ పంచమం స్కందమాతేతి షష్ఠం కాత్యాయనీతి చ | సప్తమం కాలరాత్రీతి మహాగౌరీతి చాష్టమమ్ నవమం సిద్ధిదాత్రీ చ నవదుర్గాః ప్రకీర్తితాః | ఉక్తాన్యేతాని నామాని బ్రహ్మణైవ మహాత్మనా ||

దుర్గా మాత ముఖ్యమైన అవతారాలు మూడు. మాహాలక్ష్మి, మహాసరస్వతి, మహాకాళి. వీరు శ్రీమహావిష్ణువు, పరబ్రహ్మ, పరమశివుని అర్ధాంగినులుగా మనకు తెలుసు. వీరిలో ఒక్కొక్కరూ తిరిగి 3 అవతారాలు పొందారు. ఆ విధంగా నవదుర్గలుగా ప్రసిద్ధి చెందారు.


🌻 1. శైలపుత్రి :- బాలా త్రిపుర సుందరి

నవదుర్గలలో ప్రధమమైన శైలపుత్రి హిమవంతుని పుత్రిక. ఈమెయే వెనుకజన్మలో దక్షప్రజాపతి కుమార్తె సతి. హిమవంతుడు పర్వతరాజు. కనుక ఈమెకు శైలపుత్రి అనే పేరు కలిగింది. ఈమె వాహనం నంది. ఒక చేతిలో త్రిశూలం రెండో చేతిలో కలువ, నుదుటిన చంద్ర వంక ధరించిన ఈమె మహిమలు అపారం. నవరాత్రి సంధర్భంగా మొదటిరోజున ఈమె పూజ జరుగుతుంది.


🌻 2. బ్రహ్మచారిణి :- గాయత్రీ దేవి

దుర్గామాత అవతారాలలో రెండవది అయిన బ్రహ్మచారిణి, తపస్సుకు ప్రతీక. ఇక్కడ బ్రహ్మ అనే పదానికి తపస్సు అని అర్థం. వేదము, తత్వము, తపము అనే పదాలు బ్రహ్మ అనే పదానికి పర్యాయ పదాలుగా వాడుతారు. ఒక చేతిలో కమండలము, మరొక చేతిలో తులసి మాల ధరించే ఈమెను సకల సౌభాగ్యదాయనిగా పూజిస్తారు.


🌻 3. చంద్రఘంట :- అన్నపూర్ణ దేవి

దుర్గామాత మూడవ అవతారమైన చంద్రఘంట మాత శిరసున అర్ధచంద్రుడిని గంటరూపంలో ధరించింది. అందువలననే ఆమెకి ఈ నామధేయం కలిగింది. సింహవాహిని ఐన ఈమె బంగారు దేహఛాయ కలిగి, పది హస్తాలతో ఉంటుంది. ఈమె పది హస్తాలలో శంఖ, ఖడ్గ, గద, కమండలము, విల్లు, కమలం మొదలైనవి కలిగి చూడటానికి ఎంతో మనోహరంగా ఉంటుంది.


🌻 4. కూష్మాండ :- శ్రీ లలితా త్రిపుర సుందరి దేవి

సూర్యలోక నివాసిని అయిన కూష్మాండదేవి, సూర్యకాంతిని పోలిన దేహఛాయతో ఉంటుంది. ఈమె దేహఛ్ఛయతో దశ దిశంతాలు వెలుగు పొందుతాయి. సింహవాహిని ఐన ఈ దేవికి ఎనిమిది హస్తములలో కమండలము, విల్లు, అమ్ము, కమలము, అమృతభాండము, చక్రము, త్రిశులము, జపమాల ఉంటాయి.


🌻 5. స్కందమాత :- సరస్వతీదేవి

కుమారస్వామి లేక స్కందుని తల్లి అయిన స్కందమాత మహాదుర్గ ఐదవ అవతారం. చతుర్భుజి ఐన ఈ మాత రెండు చేతులలో కమలములనూ కుడి హస్తమందు స్కందుని ధరించి అభయ హస్తి అయి దర్శనమిస్తుంది. ఈమె పద్మములో కూర్చొని ఉండటం చేత పద్మాసన అనే నామధేయం కూడా ఉంది.


🌻 6. కాత్యాయని :- మహాలక్ష్మి దేవి

దుర్గామాత ఆరవ అవతారమైన కాత్యాయనిమాతను సకల వరప్రదాయనిగా పూజిస్తారు. శ్రీకృష్ణుని భర్తగా పొందటానికి గోపికలు ఈమెనే ఆరాధించారు. బంగారు మేనిఛాయతో, అత్యంత ప్రకాశవంతమైన ఈమెకు నాలుగు హస్తములు. ఒక చేత కత్తి, రెండవ చేత కమలం, మిగిలిన రెండుచేతులలో అభయప్రదాన ముద్రలో ఉంటుంది. ఈమె వాహనం సింహం.


🌻 7. కాళరాత్రి :- దుర్గాదేవి

దుర్గమాత ఏడవ అవతారం కాళరాత్రి. ఈమె శరీరఛాయ చిమ్మచీకటిలా నల్లగా ఉంటుంది. చెదరిన జుట్టుతో, మెడలో వాసుకొనిన మాల మెరుపులు చిందిస్తూ ఉంటుంది. ఈమెకు మూడు కళ్ళు. ఈమె ఉచ్వాస నిశ్వాసలు అగ్నిని విరజిమ్ముతుంటాయి. ఈమెకు నాలుగు హస్తములు. కుడి రెండు హస్తములలో ఒకటి అభయాన్ని, రెండవది భాయాలని పారదోలేవిగా ఉంటాయి. ఎడమచేతిలో ఒక చిన్న కత్తి, ఇనుముతోచేసిన రంపంలాంటి అయుధం ఉంటుంది. ఈమె వాహనం గాడిద. ఈమె రూపం ఉగ్రమే ఐనా ఈమెని పూజించిన వారికి అన్ని శుభములని కూరుస్తుంది కనుక ఈమెనే శుభంకరి అని కూడా పిలుస్తారు.


🌻 8. మహాగౌరి :- మహిషాసురమర్ధిని దేవి

దుర్గామాత అష్టమ అవతారం మహాగౌరి. ఈమె చంద్రునిపోలిన మేనిఛాయతో ఉంటుంది. ఈమె పార్వతి రూపంలో ఉన్నప్పుడు, శివునికోసం మహాతపస్సు చేసింది. అప్పుడు ఆమె శరీరఛ్ఛాయ నల్లగా మారిపోయింది. అది గమనించిన మహాశివుడు స్వయంగా ఆమెను పవిత్ర గంగాజలాలతో కడగగా ఆమెకు ఆ మేనిఛ్ఛాయ కలిగిందని ఒక కథ. సర్వకాల సర్వావస్తలలో ఈమెను ఎనిమిది ఏళ్ళ బాలికగానే పూజిస్తారు. అత్యంత ప్రశాంతమైన స్వరూపం కలిగిన ఈమెకు నాలుగు చేతులు. రెండు చేతులలో త్రిశులం, దమరుకము ధరించి మిగిలన రెండుచేతులతో వర, అభయ ముద్రలతో దర్శనమిస్తుంది. ఈమె వాహనం నంది.


🌻 9. సిద్ధిదాత్రి :- రాజరాజేశ్వరీ దేవి

దుర్గాదేవి ఆఖరి అవతారమైన ఈమె భక్తులకు అష్టసిద్దులను (అనిమ, మహిమ, గరిమ, లఘిమ, ప్రాప్తి, ప్రకామ్య, ఇసిత్వ, మరియు వాసిత్వ అనేవి అష్టసిద్ధులు) ప్రసాదించగలిగే దేవత. కమలంలో కూర్చునే ఈ దేవత వాహనం సింహం. నాలుగు హస్తాలలో శంఖ, చక్ర, గదా, పద్మాలతో విరాజిల్లుతూ భక్తులను అనుగ్రహిస్తుంది.

🌹 🌹 🌹 🌹 🌹




శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 485 - 494 - 8 / Sri Lalitha Chaitanya Vijnanam - 490 - 494 - 8


🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 485 - 494 - 8 / Sri Lalitha Chaitanya Vijnanam - 490 - 494 - 8 🌹

🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻

✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్

సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁

🍀 100. అనాహతాబ్జ నిలయా, శ్యామాభా, వదనద్వయా ।
దంష్ట్రోజ్జ్వలా, అక్షమాలాధిధరా, రుధిర సంస్థితా ॥ 100 ॥ 🍀

🍀 101. కాళరాత్ర్యాది శక్త్యోఘవృతా, స్నిగ్ధౌదనప్రియా ।
మహావీరేంద్ర వరదా, రాకిణ్యంబా స్వరూపిణీ ॥ 101 ॥ 🍀


🌻 485 నుండి 494వ నామము వరకు వివరణము - 8 🌻


షట్చక్ర నిరూపణమున ఈమెను కాకినీ శక్తి అని పిలుచుటలో అంతరార్థ అనాహత మందలి శ్రీమాతకు నేతి అన్నము ఎక్కువ ప్రీతి కలిగించును. ఆర్ష సంప్రదాయము ననుసరించు వారు తప్పక నేతి అన్నము భుజింతురు. నేయి తినకూడదన్న నేటి వైద్యుల వాదనము వారు మౌనముగ తోసిపుచ్చుదురు. మొదటి వేడి అన్నము ముద్దలో నేయి వేసుకొని తినుట సంప్రదాయము. దీని వలన హృదయమునకు మేలే కలుగును కాని కీడు కలుగదు. మహా వీరులకు వరముల నిచ్చునది శ్రీమాత అగుటచే 'మహా వీరేంద్ర వరదా' అని కీర్తింపబడుచున్నది.



సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 485 to 494 - 8 🌹

Contemplation of 1000 Names of Sri Lalitha Devi

✍️ Prasad Bharadwaj


🌻100. Anahatabjanilaya shyamabha vadanadvaya
danshtrojvalakshamaladi dhara rudhira sansdhita॥ 100 ॥ 🌻

🌻101. Kalaratryadishaktyao-ghavruta snigdhao-dana priya
mahavirendra varada rakinyanba svarupini ॥ 101 ॥ 🌻


🌻 Description of Nos. 485 to 494 Names - 8 🌻


According to Shatchakra proof, in calling her Kakini Shakti, ghee rice is more pleasing to Srimata. Those who follow the tradition of Arsha mandatorily eat ghee rice. They silently reject today's doctor's claim that ghee should not be eaten. It is traditional to eat the first hot rice with ghee mixed in it. This is good for the heart but not harmful. As Srimata is the giver of boons to great heroes she is glorified as 'Maha Virendra Varada'.



Continues...

🌹 🌹 🌹 🌹 🌹


శ్రీమద్భగవద్గీత - 442: 11వ అధ్., శ్లో 28 / Bhagavad-Gita - 442: Chap. 11, Ver. 28

 

🌹. శ్రీమద్భగవద్గీత - 442 / Bhagavad-Gita - 442 🌹

✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 11వ అధ్యాయము - విశ్వరూప సందర్శన యోగం - 28 🌴

28. నభ:స్పృశం దీప్తమనేకవర్ణం వ్యాత్తాననం దీప్తవిశాలనేత్రమ్ |
దృష్ట్వా హి త్వాం ప్రవ్యథితాన్తరాత్మా ధృతిం న విన్దామి శమం చ విష్ణో ||


🌷. తాత్పర్యం : అనేక నదీ ప్రవాహాలు సముద్రంవైపు వేగంగా పరుగెత్తుతున్నట్లే ఈ పరలోక వీరులంతా ప్రజ్వలిస్తున్న నీ ముఖంలో ప్రవేశిస్తున్నారు.

🌷. భాష్యము : యుద్ధ రంగంలో ఏంతో మంది ఉత్తమ రాజులు మరియు యోధులు ఉన్నారు. వారందరూ అది తమ కర్తవ్యముగా పరిగణించి యుద్ధంలో పోరాడారు మరియు యుద్ధరంగంలో తమ ప్రాణములను విడిచి పెట్టారు. అర్జునుడు వారిని నదులు తమకుతామే వచ్చి సముద్రములో కలిసిపోవటంతో పోల్చుతున్నాడు. ఇంకా చాలామంది ఇతరులు స్వార్థం కోసం మరియు దురాశతో యుద్ధ రంగానికి వచ్చారు. అర్జునుడు వారిని, అమాయకత్వంతో ఎర చూపబడి, అగ్నిలో పడి కాలిపోయే పురుగులతో పోల్చుతున్నాడు. ఈ రెంటిలో కూడా, ఆసన్నమైన మృత్యువు వైపు, వారు వడివడిగా పరుగులు పెడుతున్నారు.

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Bhagavad-Gita as It is - 442 🌹

✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj

🌴 Chapter 11 - Viswaroopa Sandarsana Yoga - 28 🌴

28. yathā nadīnāṁ bahavo ’mbu-vegāḥ samudram evābhimukhā dravanti
tathā tavāmī nara-loka-vīrā viśanti vaktrāṇy abhivijvalanti


🌷 Translation : As the many waves of the rivers flow into the ocean, so do all these great warriors enter blazing into Your mouths.

🌹 Purport : There were many noble kings and warriors in the war, who fought as their duty and laid down their lives on the battlefield. Arjun compares them to river waves willingly merging into the ocean. There were also many others, who fought out of greed and self-interest. Arjun compares them with moths being lured ignorantly into the incinerating fire. But in both cases, they are marching rapidly toward their imminent death.

🌹 🌹 🌹 🌹 🌹


15 Oct 2023 : Daily Panchang నిత్య పంచాంగము


🌹 15, అక్టోబరు, OCTOBER 2023 పంచాంగము - Panchangam 🌹

శుభ ఆదివారం, Sunday, భాను వాసరే

🍀. శరన్నవ రాత్రులు ఆరంభం శుభాకాంక్షలు అందరికి, Devi Navratri Begining Good Wishes to All. 🍀

మనందరికి ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని పరమాత్మని స్మరిస్తూ - ప్రసాద్ భరద్వాజ

🌻. పండుగలు మరియు పర్వదినాలు : శరన్నవ రాత్రులు ఆరంభం, కలశస్థాపన, శైలపుత్రి - బాలా త్రిపుర సుందరి పూజ, Navratri Begins, Ghatasthapana, Sailaputri - Bala tripura Sundari Pooja, 🌻


🌷. 1. శైలపుత్రి ప్రార్ధనా శ్లోకము :

వందే వాంఛితలాభాయ చంద్రార్ధకృతశేఖరామ్ ।
వృషారూఢాం శూలధరాం శైలపుత్రీం యశస్వినీమ్ ॥


🌷. 1. బాలా త్రిపుర సుందరి స్తోత్రము :

కదంబ వనచారిణీం ముని కదంబ కాదంబినీం
నితంబ జిత భూధారం సురనితంబిని సేవితాం
నవంబురుహ లోచనం అభినవాంబుదా శ్యామాలాం
త్రిలోచన కుటుంబనీం త్రిపుర సుందరీ మాశ్రయే


🌷. అలంకారము - నివేదనం :

బాలా త్రిపుర సుందరి - నీలి రంగు, ఉప్పు పొంగలి


🌻 🌻 🌻 🌻 🌻


🍀. నేటి సూక్తి : నేర్చుకోవలసిన మొదటి పాఠం - జీవితాన్నీ, అందలి కష్టాలనూ సహనంతో దృఢంగా ఎదుర్కోగల ధీరత్వం లేనివాడు సాధన పథంలో అంతకంటే గురుతరమైన ఆంతరంగిక కష్టాలను ఎన్నటికీ ఎదుర్కొనజాలడు. ఈశ్వరునిపై భారం వేసి, ఆచంచలమైన చిత్తంతో, ధైర్యంగా జీవిత కష్టాల నెదుర్కోడమే సాధనలో నేర్చుకొన వలసిన మొదటి పాఠం.🍀


🌷🌷🌷🌷🌷



విక్రమ: 2080 నల, శఖ: 1945 శోభన

కలియుగాబ్ది : 5124, శోభకృత్‌,

శరద్ ఋతువు, దక్షిణాయణం,

ఆశ్వీజ మాసం

తిథి: శుక్ల పాడ్యమి 24:33:40 వరకు

తదుపరి శుక్ల విదియ

నక్షత్రం: చిత్ర 18:13:32 వరకు

తదుపరి స్వాతి

యోగం: వైధృతి 10:23:08 వరకు

తదుపరి వషకుంభ

కరణం: కింస్తుఘ్న 12:00:02 వరకు

వర్జ్యం: 01:01:00 - 02:44:12

మరియు 24:08:22 - 25:49:54

దుర్ముహూర్తం: 16:20:34 - 17:07:37

రాహు కాలం: 16:26:27 - 17:54:40

గుళిక కాలం: 14:58:14 - 16:26:27

యమ గండం: 12:01:48 - 13:30:01

అభిజిత్ ముహూర్తం: 11:38 - 12:24

అమృత కాలం: 11:20:12 - 13:03:24

సూర్యోదయం: 06:08:57

సూర్యాస్తమయం: 17:54:40

చంద్రోదయం: 06:27:04

చంద్రాస్తమయం: 18:19:05

సూర్య సంచార రాశి: కన్య

చంద్ర సంచార రాశి: తుల

యోగాలు: పద్మ యోగం - ఐశ్వర్య

ప్రాప్తి 18:13:32 వరకు తదుపరి

లంబ యోగం - చికాకులు, అపశకునం

దిశ శూల: పశ్చిమం

✍️. శ్రీ వక్కంతం చంద్రమౌళి

🌻 🌻 🌻 🌻 🌻




🍀. నిత్య ప్రార్థన 🍀

వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ

నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా

యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా

తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం

తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ

విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.

🌹🌹🌹🌹🌹