సర్వయోగ సమన్వయము - గుప్తవిద్య (సీక్రెట్‌ డాక్ట్రిన్‌) - 19

🌹. సర్వయోగ సమన్వయము - గుప్తవిద్య (సీక్రెట్‌ డాక్ట్రిన్‌) - 19 🌹
✍️. రచన : సద్గురు పేర్నేటి గంగాధర రావు
📚. ప్రసాద్ భరద్వాజ


🍃. సాధనా చతుష్టయము - 1 🍃

94. యోగ విద్య యందు సాధకునికి నాలుగు రకములైన సాధన సంపత్తులు అవసరము.
1. నిత్యానిత్య వస్తు వివేకము.
2. ఇహాముత్రార్థ ఫలభోగ విరాగము.
3. శమ దమాది షట్‌ సంపత్తి.
4. ముముక్షత్వము


95. నిత్యానిత్య వస్తు వివేకమనగా ప్రపంచమంతయు మాయయని, నశ్వరమని, ఆత్మ ఒక్కటె నిత్యమని, నాశరహితమని భావించుట.

96. ఇహా ముత్రార్థ ఫల భోగ విరాగము అనగా ఇహలోక, స్వర్గలోక సుఖములందు వైరాగ్యము.

97. శమము, దమము, ఉపరతి, తితీక్ష, శ్రద్ధ, భక్తి అను ఆరింటిని షట్‌ సంపత్తి అంటారు.
1. శమమనగా: అంతరింద్రియ నిగ్రహము, నిశ్చల సమాధి.
2. దమమనగా: బాహ్యేంద్రియ నిగ్రహము, విరక్తి వైరాగ్యములు.
3. ఉపరతి అనగా అరిషడ్వర్గములను జయించుట, విషయాసక్తి వీడుట.
4. తితీక్ష అనగా సుఖఃదుఃఖములను ఓర్చుకొనుట, విషయ సమత్వము.
5. శ్రద్ధ అనగా గురువు యందు వేదాంత వాక్యములందు నమ్మకము కలిగి శ్రవణము, విచారణ చేయుట.
6. భక్తి అనగా గురువులను పూజించుట. శుశ్రూష చేయుట.

98. ముముక్షత్వము అనగా మోక్షము పొందుట యందు అభిలాష కలిగి అందుకు తగిన సాధన, యోగాభ్యాసము చేయుట, గురువులను ఆశ్రయించుట, శ్రవణాదులు చేయుట.

99. దివ్య దృష్టి గురువు ద్వారానూ, భగవంతుని అనుగ్రహము ద్వారాను పొందవచ్చు. అభ్యాసంతో దివ్యదృష్టిని అనగా జ్ఞాన నేత్రములను(మూడవ కన్ను) పొందవచ్చు. దీని వలన ఆత్మానుభూతి పొందవచ్చు. వ్యాసుడు సంజయునకు, శ్రీకృష్ణుడు అర్జునునకు, బ్రహ్మంగారు సిద్థయ్యకు దివ్య దృష్టిని ప్రసాదించిరి.

జ్ఞానంతో పాటు దివ్య దృష్టి ఉన్నప్పుడు సుదూర ప్రాంతపు దృశ్యములను కూడా దర్శించవచ్చు. బ్రహ్మాండములోని దృశ్యములలో, భవిష్యత్తు సంఘటనలు దివ్య దృష్టి ద్వారా తెలుసుకోవచ్చు. ఈ శక్తిని నిరంతర యోగ సాధన ద్వారా పొందవచ్చు. జనుల మనస్సులోని విషయములు గ్రహించవచ్చు. ఉత్తమమైన అనన్య యోగులు ఈ శక్తిని పొందగలరు. కాని ఇవన్నీ మోక్షమునకు ప్రతిబంధకము.

100. యోగసిద్ధి: ప్రాపంచిక విషయములందు ఆసక్తి లేక శాశ్వతమైన పరబ్రహ్మరూపములోనే లయించి యుండును. అట్టి వారే యోగసిద్ధిని పొందినట్లు.

అందుకు కోరికలు త్యజించవలెను. మనస్సును నిగ్రహించవలెను. ఆత్మ స్థితి యందు సర్వమును లయించవలెను. అట్టి యోగికి పునర్జన్మలేదు. సంకల్పరహితుడు మనస్సును ఆత్మ యందు లయించి యుండును. శాంతిని పొందును. సమదృష్టి కల్గి సర్వ జీవరాశులు పరబ్రహ్మ స్వరూపమే అని జీవాత్మ పరమాత్మ ఒక్కటేనని గ్రహించును.

101. యోగము సిద్ధించాలంటే దృఢ సంకల్పము, సాధన, వైరాగ్యము, సాధనాఫలితముల కొరకు చూడకుండా సాధన నిరంతరము కొనసాగించుట. భౌతిక తాపత్రయములు వదలివేయుట. సుఖ దుఃఖములకు అతీతుడై ఉండుట. ఇంద్రియ నిగ్రహము, వాసనాక్షయము, భోగరాహిత్యము కలిగి ఉండుట. అట్టి వారే యోగసిద్ధిని పొందగలరు. వారినే యోగారూఢులందురు.

102. ఉత్తమ యోగి అయినవాడు నిరంతరము భగవంతుని యందు ఆత్మను లయింపజేయుట, శ్రద్ధ, దైవచింతన కల్గి ఉండును.
🌹 🌹 🌹 🌹 🌹

🌹 జగత్సంబంధమైన దుఃఖం బారి నుండి తప్పించుకునే మార్గం - సాంఖ్యం 🌹

🌹 జగత్సంబంధమైన దుఃఖం బారి నుండి తప్పించుకునే మార్గం - సాంఖ్యం 🌹


జగత్తును మనం దానికున్న ధర్మాల రీత్యా అనేకరకాలుగా వర్ణిస్తుంటాం. అందులో ఒకటి ‘జగత్తు త్రిగుణాత్మకం.’ మరోటి ‘జగత్తు శక్తిమయం’.


జగత్తు త్రిగుణాత్మకం అన్నవర్ణనను అనుసరించి సాంఖ్యమార్గం ఏర్పడింది. జగత్తు శక్తిమయం అన్నవర్ణనను అనుసరించి యోగమార్గం ఏర్పడింది.

సాంఖ్యమార్గపు మూలసూత్రం ‘జగత్తు త్రిగుణాత్మకం’. అంటే ఈ ప్రపంచం సత్వము, రజస్సు, తమస్సు అనే పరస్పరవిరుద్ధమైన, పరస్పరం సంఘర్షించుకునే మూడు గుణాలతో కూడుకుని ఉంటుంది. ఈ మూడు గుణాలలో ప్రతీ ఒకటీ కూడా జగత్తులో తనదైన ఓ ప్రత్యేక ప్రభావాన్ని కలిగి ఉంటుంది.

ఈ మూడు గుణాల మధ్యన జరిగే సంఘర్షణలో ఏదో ఒక దానికి ఆధిక్యం లభించినపుడు అది తనకు విరుద్ధంగా ఉన్న మిగతా రెండు గుణాలనూ అణచివేసి తనదైన ప్రభావాన్ని జగత్తులో వ్యాప్తి చేస్తుంది. అది జగత్తులో దుఃఖానికి కారణమౌతుంది. ఎందుకంటే గుణసంబంధమైన లేక జగత్సంబంధమైన ప్రభావం ఏదైనప్పటికీ అది దుఃఖ మయమే.

జగత్తు, త్రిగుణాలు అనేవాటిని మనం రెండువిధాలుగా అర్థం చేసుకోవలసి ఉంటుంది.

ఒకటి అఖండదృష్టి ,  మరొకటి ప్రాతినిథ్య దృష్టి.

త్రిగుణాలు సమతుల్యతను కోల్పోవడం వలన ఈ చరాచర సృష్టి ఉనికిలోనికి వస్తుంది. అవి సమతుల్యతలో ఉన్నంతకాలం ఈ సృష్టి లేక ఈ జగత్తు లయస్థితిలోనే ఉంటుంది. జగత్తు మరియు త్రిగుణాలయొక్క అఖండ స్థితిలో జరిగే ఈ పరిణామాలలో మనకెట్టి ప్రమేయం లేదు. ఇది మానవాతీతంగా జరిగే ప్రక్రియ.

త్రిగుణాలు అఖండరూపంగా ఉండటమేకాక ఈ లోకంలో మనం ఆచరించే అన్ని కర్మలలోనూ తమ ప్రాతినిథ్యాన్ని కలిగి ఉంటాయి. ఈ కర్మలగురించి మాట్లాడేటపుడు కూడా మనం జగత్తు మరియు త్రిగుణాలనే మాటలనే ఉపయోగిస్తాము.

త్రిగుణాలు సమతుల్యత కోల్పోయినపుడు అఖండ స్థాయిలో ఈ చరాచర సృష్టి ఉనికిలోనికి వస్తే ప్రాతినిథ్య స్థాయిలో దుఃఖం ఉనికిలోనికి వస్తుంది.

త్రిగుణాల మధ్యన సమతుల్యత నెలకొన్నపుడు అఖండ స్థాయిలో సృష్టి లయమైపోతే ప్రాతినిథ్య స్థాయిలో దుఃఖం అంతరించిపోతుంది.

అలాకాక గుణాల మధ్యన జరిగే ఈ సంఘర్షణలో ఏ ఒక్కదానికీ ఆధిక్యం లభించకుండా మూడింటికీ సమప్రాధాన్యతను కల్పించినట్లైతే పరస్పరవిరుద్ధమైన ఈ మూడు గుణాలూ –బలాబలాల సమతూకం (Balance of Powers)  వలన– ఒకదాన్నొకటి న్యూట్రల్ చేసుకుంటాయి. దానితో జగత్తు ప్రభావరహితమౌతుంది. అప్పుడు జగత్తుకు అతీతమైన అంటే గుణాలకు అతీతమైన (గుణాతీత) స్థితి ఏర్పడుతుంది. సంసారబంధం తొలగిపోతుంది. దుఃఖం నశిస్తుంది.

ఆత్మానుభవం అన్నా కూడా ఇదే! భారతీయ ఇతిహాస పురాణాలలో సాంఖ్యతత్వం గురించి చర్చించేటపుడు ఎక్కువగా ఆత్మ గురించే వర్ణన జరగడానికి కారణం ఇదే. భగవద్గీత రెండవ అధ్యాయంలో ఆత్మ వర్ణన జరిగిన తరువాత "పార్థా ! ఇంతవరకూ నీకు సాంఖ్యమతానుసారం ఆత్మతత్వం గురించి చెప్పాను. " అని శ్రీ కృష్ణుడు అంటాడు.

ఇక్కడ సంసారం అంటే జగత్తు అనే అర్థమే తప్ప దారాపుత్రుల పోషణతో కూడుకున్న వైవాహిక జీవితం అని కాదు. అది బాధ్యతలను మోయలేని అసమర్థత మూలంగా వాటినుండి తప్పించుకోవాలని చూచే పిరికివారు కల్పించిన అర్థం మాత్రమే.

ప్రపంచంలోని దుఃఖాన్ని నివారించడం కొరకు సాంఖ్యమార్గం ఈ ఉపాయాన్నే అనుసరిస్తుంది.

అయితే జగత్తులోని ఈ మూడు గుణాలకూ సమప్రాధాన్యత కల్పించడం ఎలా?

సర్వకర్మలూ త్రిగుణాల వలనే జరుగుతున్నాయని ఉపనిషత్సారమైన గీతావాక్యం. అంటే సర్వకర్మలూ త్రిగుణాలకే ప్రాతినిథ్యం (Representation) వహిస్తున్నాయని అర్థం.

దీనినిబట్టి ప్రాపంచిక కర్మలన్నింటిలోనూ త్రిగుణాలకు ప్రాతినిథ్యం ఉన్నది అని మనకు అర్థమవుతున్నది.

జగత్తులోని గుణాలు లెక్కకు మూడే ఐనప్పటికీ ఒక్కొక్కదాని అభివ్యక్తీకరణ అనంతరూపాలలో ఉండి జగత్తంతా పైకి చాలా సంక్లిష్టంగా కనిపిస్తుంది. గుణం యొక్క ఈ అభివ్యక్తీకరణ కర్మ రూపంలో ఉంటుంది. ఈ కారణంగానే సర్వకర్మలూ త్రిగుణాలవలనే జరుగుతున్నాయని గీతలో పేర్కొనడం జరిగినది. ఒక గుణం యొక్క ఏ అభివ్యక్తీకరణ అయినా కూడా మిగతా రెండు గుణాలలో కూడా తన అనురూపాలను కలిగి ఉంటుంది. అంటే జగత్తులోని కర్మసంబంధమైన ఏ విషయమైనా కూడా త్రిగుణాలకు ప్రాతినిథ్యం వహించే మూడు అనురూపకర్మలుగా ఉంటుంది.

ఉదాహరణకు వాతావరణానికి సంబంధించి ఎండ, వర్షం, చలి అనేవి త్రిగుణాలకు ప్రాతినిథ్యం వహించే మూడు అనురూపకర్మలు.

అలాగే క్రమశిక్షణకు సంబంధించి అదుపు, స్వేచ్ఛ, ఉపేక్ష అనేవి అనురూపకర్మలు.

త్రిగుణాలకు ప్రాతినిథ్యం వహిస్తున్న ఈ అనురూప కర్మలు మూడింటికీ సమప్రాధాన్యత ఏర్పడితే త్రిగుణాలకు సమప్రాధాన్యత ఏర్పడినట్లే.

త్రిగుణాల పరిధిలోకి రాని కర్మలు ఎక్కడా ఉండవు కనుక మనం ఈ లోకంలో కర్మాచరణకు ఉపక్రమించిన ప్రతీసారీ మూడు గుణాలకు ప్రాతినిథ్యం వహించే మూడు అనురూప కర్మలలో ఏదో ఒక దానిని తప్పనిసరిగా ఎంచుకోవలసి వస్తుంది. అటువంటపుడు ప్రతీ సందర్భంలోనూ ఏదో ఒక గుణానికి ప్రాతినిథ్యం వహించే కర్మకే ప్రాధాన్యతనీయక సందర్భౌచిత్యాన్ని అనుసరించి ఒక్కొక సందర్భంలో ఒక్కొక గుణానికి ప్రాతినిథ్యం వహించే అనురూపకర్మకు ప్రాధాన్యతనిచ్చినట్లైతే మన జీవితంలో మూడు గుణాలకూ సమప్రాథాన్యత ఏర్పడుతుంది.

దీనినిబట్టి జగత్తును తిరస్కరించడం కాక దానిలోని వైరుధ్యాల యెడల సమదృష్టిని కలిగి ఉండి వాటన్నింటికీ సమ ప్రాధాన్యతనీయడమే జగత్సంబంధమైన దుఃఖం బారినుండి తప్పించుకునే మార్గమని, అదే సాంఖ్యమని మనం అర్థం చేసుకోవచ్చు.

ప్రాచీన భారతదేశంలో ఆయుర్వేద వైద్యవిధానం ఈ సాంఖ్యమార్గాన్ని అనుసరించే అభివృద్ధి చేయబడింది. దీనిప్రకారం మానవ శరీరంలో త్రిగుణాలకు ప్రాతినిథ్యం వహించే మూడు అనురూపకర్మలు వాతం, పిత్తం, కఫం అనబడే త్రిదోషాల రూపంలో ఉంటాయి. ఈ దోషాలు మూడు కూడా సమపరిమాణంలో, సమతుల్యతతో ఉన్నంత కాలం అవి ఒకదాన్నొకటి ప్రభావరహితం చేసుకుంటూ శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. ఆ సమతుల్యత చెడిపోయి ఏ దోషమైనా మిగతా రెంటికన్నా ఎక్కువైనపుడు ఆదోషానికి సంబంధించిన అనారోగ్యం శరీరంలో తలయెత్తుతుంది. ఆ దోషాన్ని తగ్గించి మిగతా రెంటితో సమస్థితికి తెచ్చే విధానమే ఆయుర్వేదం.

ఈ విధమైన సాంఖ్యమార్గపు ఎత్తుగడను మనం ఈ ప్రపంచంలో ఏ సమస్యకైనా అనువర్తింపచేయవచ్చు.
🌹 🌹 🌹 🌹 🌹
🙏 ప్రసాద్

సాధన చతుష్ఠయ సంపద

సాధన చతుష్ఠయ సంపద :-

నాల్గు సాధనాలు ఒక సంపదలాంటివి. లౌకిక ప్రపంచంలో సంపద మనకుంటే దాన్ని ఎలాగైనా వినియోగించుకొని ఆనందాన్ని సుఖాన్ని పొందుతాం. అలాగే ఆధ్యాత్మిక ప్రపంచంలో కూడా ఈ నాల్గు సాధనాలనే సంపద గనుక ఉంటే దాని ద్వారా శాశ్వతానందమును - లేదా మోక్షమును పొందేందుకు చేయవలసిన సాధనలను, పొందవలసిన జ్ఞానాన్ని పొందగలుగుతాం.

వేదాంత జ్ఞానాన్ని పొందాలంటే ఈ సాధన చతుష్ఠయసంపద శిష్యునిలో తప్పనిసరిగా ఉండాలి. అందుకే ఉపనిషత్తులు 'అధ' అనే శబ్ధంతో ప్రారంభిస్తారు. అధాతో బ్రహ్మజిజ్ఞాసా (బ్ర.సూ.) ---- అధ అశ్వలాయనో భగవంతం (కై.ఉ.)---- ఇక్కడ అధ అంటే 'ఇక' అని అర్థం. అంటే సాధన చతుష్ఠయం సంపాదించిన సాధకుడు ఇక తర్వాత చేయవలిసిన దాన్ని చెపుతున్నారన్నమాట.

ఈ లక్షణాలను ప్రతివారూ తమలో ఉన్నాయో లేదో చూసుకొని వాటిని వృద్ధి చేసుకొనుటకు ప్రయత్నించాలి. ఇవి ఒక దానికొకటి Link అయి ఉన్నాయి. కనుక ఏ ఒక్కదాన్నో పట్టుకుంటే మిగతావన్నీ అలవడతాయి -

(1) వివేకిన :- వివేకం అంటే తెలివి. ఏం తెలివి? నిత్యవస్తువేదో - అనిత్యవస్తువేదో తెలుసుకొనే తెలివి. లౌకిక ప్రపంచంలో కూడా వస్తువులను ఏరుకొనేటప్పుడు ఇది కాస్త ఎక్కువకాలం మన్నిక గలది అని - ఇది వెంటనే చెడిపోయేదని తెలుసుకుంటాం. ఆ తెలివి మనకు ఉంది. లౌకిక వస్తువుల పట్ల మనకున్న ఈ తెలివియే అంతరంగాన్ని శోధించినప్పుడు వివేకం అవుతుంది. ఈ తెలివివల్ల అనిత్యమైన దానిని వదులుకుంటాం. నిత్యమైనదానిని పట్టుకుంటాం. అలాగే ఈ ప్రాపంచిక వస్తువులు - విషయాలు - భోగాలు - ఇవన్నీ అనిత్యం. నిత్యమైనది ఆత్మ ఒక్కటే అని గ్రహించి అన్నింటిని "వదలి" ఆత్మవస్తువును పట్టుకోవాలి. అందుకోసమే ఈ నిత్యానిత్య వస్తు వివేకం ఉపయోగపడుతుంది. ఇటువంటి వివేకం ఆధ్యాత్మికరంగంలో ఉన్నవారికి తప్పక ఉండాలి. - బ్రహ్మ సత్యం జగన్మిధ్య - అనేది ఎల్లప్పుడూ బుద్ధిలో స్థిరంగా ఉండాలి.

(2) వైరాగ్యం :- వివేకంతో అనిత్యమైన - మిధ్య ఐన వాటిని తెలుసుకున్నప్పుడు ఇక వాటిపట్ల వైముఖ్యం మనలో ఏర్పడుతుంది. అవి మనకు అంత ప్రధానమైనవి కాదని, మనకు శాశ్వత సుఖాన్ని, సంతోషాన్ని కలిగించ లేవని నిశ్చయంగా గ్రహించినప్పుడు మనలో కలిగే మానసికమైన మార్పే వైరాగ్యం. వైరాగ్యం అంటే వ్యర్థ జీవితాన్ని గడపటం కాదు. మృత తుల్యమైన జీవితం గడపటం కాదు. పరమ ప్రశాంతంగా - ఎటువంటి అలజడులు లేకుండా జీవించటమే. జీవితం నుండి పారిపోవటం కాదు. ఈ జీవితాన్ని తిరస్కరించటం. వివేకం అనే పుష్పం వికసిస్తేనే వైరాగ్యం అనే ఫలం వస్తుంది. అలాగాక మరొక విధంగా కలిగే వైరాగ్యం నిలకడ గలిగినది కాదు. అది పైపై వైరాగ్యమే అవుతుంది - వివేకం ఎంత గట్టిగా ఉంటే వైరాగ్యం అంత గట్టిగా ఉంటుంది. నా నీడ నేను కాదని - తెలిసినప్పుడు దానికేమైనా నాకేం ఫరవాలేదు - ఎవడన్నా తుపాకీతో పేల్చినా - నాకేం? ---

(3) శమాది గుణశాలినః :- ఎవరిలో వివేకం - తద్వారా వైరాగ్యం కలిగిందో వారిలో ప్రశాంతమైన - స్వాధీనమైన - అలజడులు లేని మనస్సు ఉంటుంది. అదే శమం. ఇంద్రియాలు కూడా భోగాలకై పరుగులు తీయవు అదే దమం. ఎదురుగా వస్తువులున్నా అవి మనస్సులో ఎట్టి అలజడి కలిగించలేవు. అదే ఉపరతి. అన్నింటిని ఓర్చుకునే స్వభావం ఏర్పడుతుంది. అదే తితిక్ష. భగవంతుని మీద - శాస్త్రాల మీద - గురువుల మీద నమ్మకం, విశ్వాసం కలుగుతుంది. అదే శ్రద్ధ. చిత్తం ఏకాగ్రమై పరమాత్మ పైనే నిలుస్తుంది - అదే  సమాధానం.

(4) ముముక్షుత్వం :- చివరగా చెప్పినా ఇదే మొదటిది - బంధనంలో ఉన్నాననుకున్నవాడే విడుదల పొందాలనుకుంటాడు. సర్వ బంధనాల నుండి విముక్తి పొంది జన్మరాహిత్యాన్ని పొంది మోక్షాన్ని అందుకోవాలనే తపన అన్నింటికన్న అతిముఖ్యమైన అర్హత - ఈ పై సంపదలు ఉన్నవాడే అర్హత పొందిన వాడు, బ్రహ్మ జిజ్ఞాస పొందగల అర్హత సాధించినవాడు.

ఆధ్యాత్మికరంగంలో ప్రగతి సాధించాలంటే - ఉన్నత శిఖరాలను అందుకోవాలంటే - సాధన సిద్ధించాలంటే ప్రతి సాధకునిలోను 4 ముఖ్య అర్హతలు - లక్షణాలు ఉండాలి.

అవే (i) నిత్యానిత్యవస్తువివేకం, (ii) ఇహాముత్రార్ధ ఫలభోగవిరాగం (iii)  శమాది షట్కసంపత్తి (iv) ముముక్షుత్వం)
ఇవి ఉంటేనే ప్రగతి - విజయం - లేకపోతే సిద్ధిలేదు. మనం ఈ మార్గంలో కృషి చేస్తున్నప్పుడు - ప్రయాణం చేస్తున్నప్పుడు మనం ఏమాత్రం ముందుకు వెళ్ళటం లేదు అనుకున్నప్పుడు - ఒక్కసారి వెనక్కు తిరిగి మన అర్హతలను నిశితంగా పరిశీలించుకోవాలి. మనలో ఏ మేరకు ఈ లక్షణాలున్నాయో - ఎక్కడ లోపాలున్నాయో గమనించాలి. వాటిని సరిచేసుకొని - సాధన చేసుకొని ముందుకు సాగాలి.

మనం కొత్త కారులో ప్రయాణం చేస్తున్నాం. అది ఒకచోట ఆగిపోయింది. మనం దిగి ఎందుకు ఆగిందో పరిశీలించాలి. ఏ పార్టు సరిగ్గా పనిచేయటం లేదో - లేక Driving లో ఏదైనా పొరపాటు చేశామో చూసుకోవాలి.
మనం జబ్బు చేసి డాక్టరు దగ్గర కెళ్ళాం. ఆయన పరీక్షించి - మందులు వ్రాసిచ్చాడు. వాడాం, కాని ప్రగతి కనిపించలేదు - లోపం ఎక్కడుందో చూడాలి. వాడమన్న మోతాదు వాడుతున్నామా? భోజనానికి ముందు వేసుకోమన్నవి అలాగే వేసుకుంటున్నామా? పత్యం సరిగ్గా పాటిస్తున్నామా? అని తెలుసుకొని లోపాలు సరిచేసుకోవాలి. డాక్టరును సంప్రదించాలి.

అలాగే చదువుకొనే విద్యార్థి కొన్ని నియమాలు పాటిస్తేనే పరీక్షలలో విజయం సాధిస్తాడు.
(i) ప్రతిరోజూ స్కూలుకు వెళ్ళాలి.
(ii) శ్రద్ధతో ఏకాగ్రతతో పాఠాలు వినాలి.
(iii) విన్నవాటిని బాగా చదువుకోవాలి.
(iv) వాటిని జ్ఞాపకం పెట్టుకోవాలి.
(v) పరీక్షలలో అడిగిన వాటికి సరైన సమాధానాలు వ్రాయాలి.
నీవు pass కాలేదంటే ఎక్కడో లోపం జరిగింది. దానిని సరిచేసుకోవాలి.

ఇలా లౌకికమైన విషయాల్లో ఎలాగైతే విజయానికి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలో ఆధ్యాత్మిక రంగంలో కూడా విజయానికి జాగ్రత్తలు తీసుకోవాలి.

శాస్త్రాన్ని విని, దాని భావాన్ని సరిగ్గా గ్రహించాలన్నా - గ్రహించిన శాస్త్ర సారాన్ని జీవితంలో ఆచరణలోనికి తెచ్చుకోవాలన్నా కొన్ని అర్హతలు - సాధన చతుష్టయం ఉండాలి. మనకు ప్రగతి కనిపించక పోయినా - అశాంతి కలిగినా - నిరాశా నిస్పృహలు కలిగినా ఎక్కడో లోపం ఉన్నట్టు. అప్పుడు మన అంతరంగాన్ని చూసుకోవాలి. తనను తాను పరిశీలించుకుని సరి చేసుకోవాలి. అప్పుడే ప్రగతి - ఈ అర్హతలను మహాత్ములు తమ అనుభవంతో నిర్ణయించారు. కనుక సాధకుడికి ఇది రక్షా కవచం. దీనిని ధరించి ప్రయాణం చేయాలి.

సేకరణ : శ్రీ ఆదిశంకరాచార్యులవారి 'వివేకచూడామణి'

"నా ఆలోచనలు, పనులు అన్నీ నా ప్రమేయం లేకుండా, ఏదోక శక్తి చేతనే జరుగుతున్నాయన్నమాట ?"

"నా ఆలోచనలు, పనులు అన్నీ నా ప్రమేయం లేకుండా, ఏదోక శక్తి చేతనే జరుగుతున్నాయన్నమాట ?"

సూక్ష్మంగా గ్రహిస్తే ఒక అంతర్గత శక్తి ఆలోచనకన్నా వేగంగా మనతో పనులు చేయిస్తుందని అర్ధమవుతుంది. శరీర కర్మలు రెండు రకాలు. బాహ్యంగా మనకు తెలిసి కొన్ని పనులు జరుగుతుంటాయి. శరీరంలోపలి భాగాల్లో మనకి తెలియకుండా జరిగే పనులు అనేకం ఉన్నాయి. లోనజరిగే పనుల్లో మన ప్రమేయం లేదని మనకు తెలుస్తూనేవుంది. మన ఆలోచనలతో నిమిత్తం లేకుండా జన్మించింది మొదలు మరణించేంత వరకు ఈ శరీరాన్ని నిలిపివుంచే ఒకానొక దైవశక్తి మన ఆలోచనలకు, పనులకు ఆధారంగా ఉందనేది సత్యం. సాధకుడు ఈవిధంగా ఆలోచిస్తే సృష్టిలో జరిగే ప్రతిపనీ దైవకార్యంగానే దర్శించగలుగుతాడు !

ఆధార గ్రంథం : "శ్రీరమణీయం

ముండకోపనిషత్తు-1

ముండకోపనిషత్తు-1

నాందీ ప్రార్ధన
ఓం. ఓ భగవంతుడా, మంగళకప్రదమైనవే మేము వినెదము గాక, ఓ పూజ్యమైన దేవతలారా, మంచినే చూచెదముగాక, మా సమస్తాంగములు, దేహము శక్తిమంతమై యుండుగాక, సృష్టికర్తయైన బ్రహ్మ యిచ్చిన జీవితాన్ని ఆనందిస్తూ, నీ కీర్తనలే గానము చేతుముగాక!!!
ఓం శాంతి! శాంతి! శాంతి!

ప్రథమ ముండకము

1. ఓం. సృష్టికర్త మరియు రక్షకుడైన బ్రహ్మ దేవతలలో మొదటివాడు. అతడు జ్ఞానమునకు మూలమైన బ్రహ్మము గూర్చి అతని ప్రథమ పుత్రుడైన అథర్వునికి వివరించెను.


2. అథర్వునికి బ్రహ్మ చెప్పిన బ్రహ్మ జ్ఞానము, ఆనాడే అథర్వుడు ఆంగీరనుకి,ఆంగీరుడు భరద్వాజుని పరంపరలోని సత్యవాహునికి, అతడు అదే పరం పరలోని ఆంగీరసునికి బోధించెను.

ముండకోపనిషత్తు-2

ముండకోపనిషత్తు-2

3. శౌనకుడు ఆంగీరసునితో ఇట్లనెను: మహాశయా, ఇదంతా తెలుసుకోవడానికి ఏమి తెలిసియుండవలెను?


4. ఆంగీరసుడు అతనితో ఇట్లనెను: బ్రహ్మమును గూర్చి తెలియాలంటే రెండు విధములైన జ్ఞానమార్గమును తెలుసుకోవలెను. అవి ఉన్నతము మరియు అత్యల్ప జ్ఞానమార్గములు.


5. వాటిలో ఉన్నతమైనది జ్ఞాన మార్గము ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము మరియు అథర్వణ వేదము, శిక్ష (స్వర శాస్త్రము), కల్ప(ఆగమములు), వ్యాకరణము, నిరుక్తము, ఛందస్సు, జ్యోతిష్యము; మరియు ఉన్నత జ్ఞానము శాశ్వతమైన బ్రహ్మము పొందవలెను.


6. దేనినైతే చూడలేమో లేదా చిక్కించుకోలేమో, దేనికైతే మూలము గాని గుణముగాని ఉండదో, దేనికైతే నేత్రములు గాని శ్రవణేంద్రియములు గాని ఉండవో,దేనికైతే కరములు గాని  కాళ్ళుగాని ఉండవో, ఏదైతే సర్వవ్యాపితము, సత్యమై యుండునో అటువంటి మహోన్నతమైన బ్రహ్మమును జ్ఞానులు వారి అత్యున్నత జ్ఞానముచే  ఎల్లెడల చూచెదరు. అదంతా అనశ్వరమైనది మరియు అన్నిటికి ఆధారమైనట్టి సర్వవ్యాపితము, సూక్ష్మము.

ముండకోపనిషత్తు - 3

ముండకోపనిషత్తు - 3

7. ఒక సాలెపురుగు తన దారంతోనే గూడు అల్లినట్లు, తలపై కేశములు పెరిగినట్లుగా మరియు మానవ దేహం కూడా  అనశ్వరము నుండి లభించే బ్రహ్మజ్ఞానముతో జ్ఞానవికాసాన్ని ఏర్పరుస్తుంది.

8. బ్రహ్మమనేది కాఠిన్యత నుండి విస్తరిస్తుంది. అందుండి ప్రధానమైన జ్ఞాన వికాసము వెలువడుతుంది, ఆపైన ప్రాణ, ఆందుండి మనసు, మనసు నుండి పంచభూతములు, పంచభూతముల నుండి లోకములు అక్కడినుండి కర్మలు, కర్మల నుండి శాశ్వత జ్ఞాన ఫలములు వెలువడడం జరుగుతుంది.

9. అంతయు తెలిసియుండి, అంతయు అర్ధం చేసుకున్న వాడును, తన కాఠిన్యమందు జ్ఞానము కలిగియున్నవాడు...అతని నుండి అనశ్వరమైన బ్రహ్మము, బ్రహ్మ, ఆహారము ఏర్పడినవి.

అధ్యాయము II

1. నిజమైనది ఇది: ఋషులకు మంత్రములందు విశదమైన యజ్ఞసంబంధిత క్రియలు మూడు వేదములలో ఎన్నోవిధములుగా విశదీకరింప బడినవి. వాటిలోని యాదార్ధ్యతను తెలియాలనే తపనతో అట్టి యజ్ఞసబంధిత కర్మలనాచరించ వలెను.

2. అగ్నిని జ్వలింపజేసినప్పుడు, జ్వాలలు ప్రజ్జ్వరిల్లినపుడు రెండు వెన్నముద్దలు కరుగు నప్పుడు వాటి మధ్య ఖాళీ ప్రదేశంలో తను తన నివేదనను అర్పించవలెను.

ముండకోపనిషత్తు - 4

ముండకోపనిషత్తు - 4

తానాచరించే అగ్నికార్యము దర్శ (అమావాస్య అగ్నిహోత్రము) మరియు పౌర్ణమాసి (పౌర్ణమి నాటి అగ్నిహోత్రము) అగ్నిహోత్రములు, చాతుర్మాస్య మరియు శరత్కాల అగ్నికార్యములతో కూడియుండకుండినను, అలాగే అతిథి సత్కారము, అలాగే సరైన సమయాన అర్పించని నివేదనలు, వైశ్వదేవం లేని లేదా సరిగా ఆచరించని క్రతువులు తనయొక్క సప్తలోకములను నాశనము చేయును.


4. కాళి (నలుపు), కరాళి (భయంకరము), మనోజవము (మనోవేగము), సులోహితము (ముదురు ఎరుపు), సుధూమ్రవర్ణము (ముదురు  ధూమ్రవర్ణము), స్ప్లులింగిని (మిరిమిట్లుగొలిపే కాంతులు), దేదీప్యమాన కాంతులు ఈ ఏడునూ కాంతులీను అగ్నికీలల ఏడు నాల్కలయి ఉన్నది.


5.  ఈ జ్వాలలు కాంతివంతమైయుండగా, సమయానుసారముగా నివేదనలర్పించగా క్రతువులాచరించునతడు, ఆ నివేదనల వలన సూర్యకిరణములపైనుండి దేవలోకమునకు కొనిపోబడును.


6. ఇంతటి వికాసవంతమైన నివేదనలు క్రతవులాచరించునతనితో ఇట్లనుసు: ఇక్కడకు స్వాగతం! అతనిని అభినంచుచూ, మంచి వాక్యములు పలుకుచూ  సూర్యకిరణములపైనుండి తోడ్కొని పోవుదురు. ఇది నీయొక్క దైవకార్యముల వలన సంపాదించిన బ్రహ్మయొక్క పవిత్రమైన స్వర్గము.

భగవంతుడు మన చర్మ చక్షువులకు ఎందుకు కనపడడు?

*భగవంతుడు మన చర్మ చక్షువులకు ఎందుకు కనపడడు?*

   *వైజ్ఞానిక విశ్లేషణ*

Why the god is not visible ? Science explanation 

దేనినైనా మనం చూడాలంటే దాని మీద పడిన కాంతి 🕯పరావర్తనం చెంది మన కంటి లో ప్రతిబింబించిన రూపం ను మనం చూడగలము.
కనుక ఇలా మనకు కన్పించే వస్తువులు కొన్ని దిశలలో (DIMENTIONS ) ఉంటాయి.↘⬇⬅↖↙↕
వాటినే 2d,3d,4d మొదలగు పేర్లతో పిలుస్తాము.

వీటి గురించి #క్లుప్తం గా

ఏదైనా వస్తువు గురించి చెప్పేటప్పుడు దాని పొడవు➡,వెడల్పు↔,ఎత్తు⬆ అనే ప్రాధమిక రాశుల గురించి చెప్పడం జరుగుతుందింది. తర్వాత బరువు,వైశాల్యం,మొదలగు అంశాల గురించి ప్రస్తావన వస్తుంది.

భౌతిక శాస్త్ర పరిభాష లో

పొడవు(length) ను  X- అక్షం(రం)తోనూ

వెడల్పు(width) ను Y- అక్షం(రం) తోనూ

ఎత్తు (hight) ను Z-అక్షం(రం) తోనూ    సూచిస్తారు.

1⃣DIMENTION :-

ఇందులో X- మాత్రమే అనగా పొడవు మాత్రమే వుంటుంది.
ఉదాహరణకు పేపర్ మీద గీసిన సరళరేఖ వంటిది.➡

2⃣DIMENTION:-

ఇందులో పొడవు వెడల్పు మాత్రమే వుంటాయి.
అనగా మన సెల్ఫోన్, టాబ్లెట్, tv, కంప్యూటర్ లలో చూసే చిత్రాల వంటివి అన్నమాట.
చతురస్రం ⬜ ను ఉదహరించవచ్చు.

3⃣DIMENTION :-

ఇందులో పొడవు,వెడల్పు,లతో పాటు ఎత్తు కుడా వుంటుంది.
ఈ విశ్వం లో మనం చూసే ప్రతి వస్తువు, జీవి అన్ని కుడా ౩d వస్తువులే.
ఘనం(cube)  🎲 ను ఉదహరించవచ్చు.
ఇందులో పొడవు, వెడల్పు, ఎత్తు, తో పాటు ఘనపరిమాణం(volume) కూడా ఉంటుంది.

పై 3 కూడా అందరికి తేలిక గానే అర్ధం అవతాయి.
తర్వాత చెప్పబోయేవి వినడానికి చిత్రం గాను అర్ధం చేసుకోవడానికి కష్టం గాను వుంటాయి.

4⃣DIMENTION :-

దీనినే 🏪కాలం (time) అంటారు.
పై మూడింటి  లోనూ  మనం కాలానికి సమాంతరం  ప్రయాణం చేస్తాము..
కాని ఈ దిశలో ఉండే జీవులు కాలం లో  ప్రయాణం చేయగలరు..
అంటే ఒక వ్యక్తి వేరువేరు కాలాలలో ఉండగలడు.
మన అదిత్య369 సినిమా లో లాగ అన్నమాట.
అంటే ఇందులో వుండే జీవులు మన దగ్గరికి వస్తే
ఒకేసారి చిన్న పిల్లవాడిగాను, ముసలి వాడు గాను, మళ్లి యువకుడి గాను మారగలడు. అంటే అతను కాలం లో ముందుకి , వెనుకకు , ప్రక్కలకి ప్రయాణించగలడు.
అంతే కాక అతను అనేక ప్రదేశాలలో అనేక పనులు చేస్తూ ఏక కాలం లో మనకు కనపడగలడు.

ఉదాహరణకు ఇక్కడ  9:30am కు టీ తాగే వ్యక్తి అమెరికాలో భోజనం చేస్తూ ఆఫ్రికా లో నిద్రపోతూ అంటార్కిటికా లో ఆడుకుంటూ అదే 9:30am కు మనకు కనిపించగలడు.
మన పాతకాల సినిమాలలో మంత్రాలు తెలిసిన వాళ్ళ లాగ అన్నమాట. avengers సినిమాలో యోగి అనే ఒక వ్యక్తి చేసినట్లు అన్నమాట.

5⃣DIMENTION :-

ఇందులో వుండే జీవులు మన విశ్వం లాంటి స్థితిగతులు ఉన్న వేరొక విశ్వానికి ప్రయాణం చేయగలుతారు.

6⃣DIMENTION :-

ఇందులో వుండే జీవులు మన విశ్వం లాంటి స్థితిగతులున్న విశ్వం లోకి ప్రయాణించడమే కాకుండా అక్కడ కాలం🕰 లో కుడా ప్రయనించగలరు.
అంటే 4d,5d కలిపితే ఎలాగో అలాగా అన్నమాట.

7⃣DIMENTION :-

ఈ దిశలో ఉండే జీవులు మన విశ్వం లాంటిదే కాక వేరేవేరే స్థితిగతులున్న విశ్వాలకు కూడా ప్రయాణం చేయగలరు.

8⃣DIMENTION :-

వేరువేరు స్థితిగతులున్న విశ్వాలకు ప్రయాణం చేయడమే కాక అందులోని కాలాలలో కూడా ప్రయనించగలరు.

9⃣ DIMENTION :-

అనేక భిన్నమైన విశ్వాలలో ప్రయనించగలరు. అందులోని కాలాలలో కుడా ప్రయాణం చేయగలరు.
మన భూమీ మీద ఉండే భౌతిక శాస్త్ర సూత్రాలు అక్కడ పని చేయవు. వారి  సూత్రాలు అన్ని కుడా కొత్త గాను వింతగాను వుంటాయి. వీరు చాల ప్రత్యేకమైన పరిస్థితుల మధ్య వుంటారు.

🔟DIMENTION :-

ఈ దిశలో వుండే జీవులకు  సాధ్యం కానిది అంటూ వుండదు.
వీరు వేరు వేరు స్థితి గతులున్న విశ్వాలలోకి ఏకకాలం లో ప్రయాణించడమే కాక అందులోని కాలం లో కుడా ప్రయాణిస్తుంటారు.
అనేక సృష్టి లను చేయగలరు, నాశనం చేయగలరు. మరియు మార్చగలరు.
వీరు భౌతిక శాస్త్ర సూత్రాలను కూడా మార్చగలరు.
వారికి నచ్చినట్లు అన్నిటిని మార్చ గల సత్తా వున్నవారు.

1⃣1⃣ DIMENTION :-

దీనిని #unimaginable_dimention అంటారు.
పైన తెల్పిన వివరణ ల కంటే భిన్నం గా వుంటారు.
వీరిని మానవ మేధస్సు తో ఆలోచించలేము.

పెక్కు మంది శాస్త్ర కారుల ప్రకారం #భగవంతుడు ఈ దిశలో 11DIMENTION ఉంటాడు అని చెప్తారు.
కనుక నే మానవ నేత్రాలతో భగవంతుడిని చూడలేము అని చెప్తారు.

... వారిని పుణ్య పురుషుల,పరమాత్మ యొక్క  సేవ వలన  #మనోనేత్రం తో మాత్రమే చూడగలము అని చెప్తారు....

మరికొందరు M THEORY & STRING THEORY ప్రకారం 2⃣8⃣ DIMENTIONS ఉన్నాయని చెప్తారు. కానీ వాటిని ఊహించడం కూడా కష్టమే అని చెప్తారు.

The 11 DIMENTIONS THEORY

The 1st  DIMENTION :-

as already noted, is that which gives it #length (aka. the x-axis). A good description of a one-dimensional object is a straight line, which exists only in terms of length and has no other discernible qualities.

2nd DIMENTION:-

Add to it a second dimension, the y-axis (or #height), and you get an object that becomes a 2-dimensional shape (like a square).

3rd  DIMENTION:-

The third dimension involves #depth (the z-axis), and gives all objects a sense of area and a cross-section. The perfect example of this is a cube, which exists in three dimensions and has a length, width, depth, and hence volume. Beyond these three lie the seven dimensions which are not immediately apparent to us, but which can be still be perceived as having a direct effect on the universe and reality as we know it.

4th  DIMENTION ;-

Scientists believe that the fourth dimension is #time, which governs the properties of all known matter at any given point. Along with the three other dimensions, knowing an objects position in time is essential to plotting its position in the universe. The other dimensions are where the deeper possibilities come into play, and explaining their interaction with the others is where things get particularly tricky for physicists.
According to Superstring Theory, the fifth and sixth dimensions are where the notion of possible worlds arises.

5th  DIMENTION:-

If we could see on through to the fifth dimension, we would see a world slightly different from our own that would give us a means of measuring the similarity and differences between our world and other possible ones.

6th  DIMENTION:-

In the sixth, we would see a plane of possible worlds, where we could compare and position all the possible universes that start with the same initial conditions as this one (i.e. the Big Bang). In theory, if you could master the fifth and sixth dimension, you could travel back in time or go to different futures.

7th  DIMENTION:-

In the seventh dimension, you have access to the possible worlds that start with different initial conditions. Whereas in the fifth and sixth, the initial conditions were the same and subsequent actions were different, here, everything is different from the very beginning of time.

8th DIMENTION:-

The eighth dimension again gives us a plane of such possible universe histories, each of which begins with different initial conditions and branches out infinitely (hence why they are called infinities).

9th DIMENTION:-

In the ninth dimension, we can compare all the possible universe histories, starting with all the different possible laws of physics and initial conditions.

10th DIMENTIONS :-

In the tenth  dimension, we arrive at the point in which everything possible and imaginable is covered.

11th DIMENTION :-

Beyond this, nothing can be imagined by us lowly mortals, which makes it the natural limitation of what we can conceive in terms of dimensions.

....✴❇ Some great people says that the #GOD is in this DIMENTION. That's why we could not see him with our eyes. The only way to see him is worship him and finally we can reach or see him with #manonetra....❇✴

The existence of these additional six dimensions which we cannot perceive is necessary for String Theory in order for their to be consistency in nature. The fact that we can perceive only
....#**four dimensions of space can be explained by one of two mechanisms:...#***
either the extra dimensions are compactified on a very small scale, or else our world may live on a 3-dimensional submanifold corresponding to a brane, on which all known particles besides gravity would be restricted (aka. brane theory)

Some are says according to M & STRING THORIES  2⃣8⃣ DIMENTIONS are there. But it is impossible to even imagine also.

source :
https://youtu.be/Q_B5GpsbSQw
https://youtu.be/gB4al4VSI-s
https://m.phys.org/news/2014-12-universe-dimensions.html
https://ultraculture.org/blog/2014/12/16/heres-visual-guide-10-dimensions-reality/(from : bhattacharya)

నా రమణాశ్రమ జీవితం

నా రమణాశ్రమ యాత్ర
నా రమణాశ్రమ జీవితం

ఓం నమో భగవతే శ్రీరమణాయ

1. బాల్యం

గుంటూరు జిల్లాలో మంగళగిరికి దగ్గరనున్న కొలను కొండ అగ్రహారం నా జన్మస్థానం. జన్మించింది ప్లవనామ సంవత్సర భాద్రపద మాసం. అది భోగేశ్వర క్షేత్రం. దోర్బల చిన వెంకటశాస్త్రిగారు నా తండ్రి. సోమి దేవమ్మ నా తల్లి, వామనమూర్తివలె వుండే వ్యాఘ్ర నృసింహశాస్త్రి అనేవారు నా జ్యేష్ఠ సోదరుడు, వారి వెనుక కనకదుర్గ అనే అక్క, శేషాద్రిశాస్త్రి, శోభనాద్రిశాస్త్రి అనే అన్న లిద్దరూ, నేనూ, మా తల్లిదండ్రుల సంతానం. నాకు నాలుగేండ్ల వయస్సులోనే తండ్రి, పదేండ్ల వయసులో తల్లి స్వర్గస్థులైనారు. నా వయస్సు 11 దాటకుండా ఏలూరు వాస్తవ్యులు సూరి రామావధాన్లుగారి ప్రథమ పుత్రునకిచ్చి పెండ్లి చేశారు. సునీతి మొదలైన స్త్రీలంతా పతిసేవ వల్లనే తరించారు గదా నేనూ అదే విధంగా కాలం గడుపుదామని అనుకుంటే, పన్నెండో ఏడు దాటగానే ఆ భర్త గూడా ఆ జన్మబ్రహ్మచర్యం నాకిచ్చి స్వర్గస్థులైనారు. తెలిసీ తెలియని వయస్సయినా వెంట వెంటనే వచ్చిన యీ కష్ట పరంపరలవల్ల నా హృదయం పగిలినట్లయింది. హృదయవిదారకమైన చింతతో దాదాపు మూడేండ్ల వరకూ మా తండ్రిగారి పెద్ద భవనంలో, ఒక్క గదిలోనే ఉండిపోయినాను. తగిన ఆహారం తీసుకొన కుండుటవల్ల జీర్ణకోశం దెబ్బతిన్నది. సూర్య చంద్ర రశ్మి సోకటం అప రూపమైనందువల్ల పాలిపోయి బల్లివలె చినుగుల చాపనంటుకొని చెయ్యియే తలగడగా చాలా భాగం శయనించే వుండే దాన్ని, ఎవరు వచ్చినా ఏడుపే, అల్లా కొన్ని నెలలు గడిచినది.

పూర్వజన్మ సుకృతంవల్లనో ఏమో నాకు బుద్ధి తెలిసిన దాదిగా ఏవరైనా ఉత్తమ గ్రంథాలు చదివినా, భక్తి గీతాలు పాడినా అర్ధరాత్రి, అపరరాత్రి అనకుండా కూర్చుని వినడం నాకు పరిపాటిగా వుండేది. ఆ శ్రద్ధకు అంతా సంతోషించేవాళ్ళు. ఆ వినికిడి ఆ కష్టదశలో ఎంతో ఉపకరించిందన్నమాట. తల్లి, తండ్రి, భర్తా, బిడ్డలూ, ఇల్లూ, వాకిలీ ఇత్యాది ముఖ్య బంధాలన్నీ ముందే గతించినవి గనుక దైవ చింతనకన్న వేరే గతిలేదని తోచింది. భగవత్కృపవల్ల సంసార సాగరంలో అడుగైనా పెట్టకుండా ఆ జన్మబ్రహ్మ చర్యం లభించిందిగదా. అది ఎల్లాగైనా సార్థకపరచుకోవాలన్న ఆరాటం నన్నావరించింది. పాఠశాలాప్రవేశ మెరుగని విద్య అయినా ఎల్లాగో గుణించుకుంటూ స్వభాషలోవున్న ఉత్తమ గ్రంథాలు కొన్ని చదువుటకు ఆరంభించాను. అన్నిటి లోనూ పోతన భాగవతం అభిమాన గ్రంథం అదే అధికంగా చదువుకునే దాన్ని. ఆ భాగవతం తృతీయ స్కంధంలో కపిల మహాముని తల్లియైన దేవహూతికి తత్త్వబోధచేసే ఘట్టం చాలా అద్భుతంగా వుంటుంది. ఒకసారి ఆ ఘట్టం పదేపదే చదివి అంత వాత్సల్యంతో అన్నీ బోధించే సిద్ధపురుషు లెవ్వరూ నాకు సన్నిహితులుగా లేరే అన్న చింతతో కన్నీరు కార్చి కార్చి సొమ్మసిలి నిద్రపోయినాను.

ఆ నిద్రలో ఒక సిద్ధ పురుషుడు దక్షిణాభిముఖంగా భూమికి గజం ఎత్తున పద్మాసనస్థుడై అభయహస్తంతో దర్శనం ఇచ్చాడు. సాక్షాద్దక్షిణామూర్తివలె మౌన ముద్రాంకితుడై వున్న ఆ మహాత్ముని చుట్టూ అలౌకికమైన తేజస్సు ఆవరించి వున్నది. ఆ తేజోమూర్తిని చూడగానే శరీరం గగుర్పొడిచింది. నమస్కరింతామని లేవబోయి ఉలిక్కిపడి కళ్ళు తెఱిచాను. ఆ దృశ్యం అదృశ్యమైంది. కలవరపడిన మనస్సుతో గది అంతా కలయ జూచాను. ఎక్కడా ఏమీ లేదు. ఎంతో విభ్రాంతి కలిగింది. ఇది 1913 ఆ ప్రాంతాన జరిగిన ఘట్టం. అప్పు డప్పుడు ఆ మూర్తి నా హృదయ ఫలకంతో అచ్చు గ్రుద్దినట్లు గోచరిస్తూనే వుండేది. గోచరించి నప్పుడల్లా జాగ్రత్ప్రపంచంలో అట్టి సిద్ధపురుషుని సేవ లభించునట్లొనర్పుమని సర్వేశ్వరుని ప్రార్థిస్తూ, నా యీ అనుభవం నాలోనే ఇముడ్చుకొని సమయానుసారంగా సద్గోష్టిని కల్పించుకుంటూ జీవసేవ దేవపూజగా భావించి అన్నల వద్దనే కాలం గడుపుతూ వచ్చాను.

మా అన్న శేషాద్రిశాస్త్రిగారు విజయవాడలో వకీలు పనికి ప్రారంభించుటవల్ల 1918 లో మా మకాం అక్కడికి మారింది. అప్పుడు కృష్ణానదీ స్నానమనీ, దీపారాధనలనీ, దేవతాపూజలనీ, ఉపవాసాలనీ అందరితోపాటు నేనూ ఆరంభించాను. పూర్వాచారపరాయణులైన పెద్ద వాళ్ళల్లో కొందరు సకేశినుల కివి పరికిరావని ఆక్షేపించారు. మంత్రోప దేశం పొందుదామన్నా అదే మాట. ఆ పీడ వదలించు కుందామని మా వాళ్ళను పోరితే ఒకసారి తిరుపతి యాత్రగా బయలుదేరి అన్న లిద్దరూ కుటుంబాలతో నన్ను వెంటబెట్టుకొని మద్రాసు చేరగానే, మా ముఖ్య బంధువులకు గొప్ప విపత్తు సంభవించినదని తెలసి వెనక్కు రావలసి వచ్చింది. అంతటితో దైవ నిర్ణయం అది కాదని అనిపించింది. అదేగాక, మొదలే ఈ కేశఖండనకు అంగీకరించని మా అన్నలు ఈ అంతరాయాలవల్ల ఆ వెనుక ఆ విషయమే తలపెట్టలేదు. ఏం జేస్తాం? ఈ నియమాలన్నీ కర్మకాండకేగాని జ్ఞానకాండ కేమీ లేవు అన్న పెద్దల వాక్యాలు స్మరించి కర్మకాండకు స్వస్తి చెప్పాను, అయినా సూటిపోటు మాటలు చురుక్కు చురుక్కున సూదులల్లే గుచ్చుకుంటునే వుండేవి.

మాకు దూరపు బంధువైన కైవారపు బాలాంబగారప్పుడు మంగళగిరి క్షేత్రంలో అన్న దానంచేస్తూ వుండేది. ఆమె సత్రంలో అన్నం తినని యాత్రికు లెవ్వరూ వుండరనటం అతిశయో క్తి కాదు. ఆ క్షేత్రాధిష్ఠానదైవమైన పానకాల నృసింహస్వామియే ఆమెకు ఉపాసనా దైవం, ఉత్సవ సమయాలలో వండిన పదార్థానికి మించిన జనం అప్పుడప్పుడు రావటం కలదనీ, కార్యనిర్వాహకులంతా కలత పడుతూ వుంటే, ఆమె ఆ పదార్థ రాశివద్ద నిలిచి, టెంకాయ కొట్టి, కర్పూరం వెలిగించి, రాశి చుట్టూ ముమ్మారు తిరుగుతూ ''నాయానా! నరసింహా! ఎల్లాగురా బాబూ? అంతా సరిచేయాలి సుమా'' అని ప్రార్థించి వడ్డన ప్రారంభింప చేసే దనీ, చిత్రంగా పదార్థం సరిపోయేదనీ వింతగా చెప్పుకునే వారు. ఏటేటా చందా నిమిత్తం ఆమె విజయవాడలో మా అన్నగా రింటికి వస్తూ నన్నెంతో వాత్సల్యంతో చూచి భాగవత గాథలన్నీ చెపుతూ వుండేది. ఆమె గూడా సకేశినియగు వితంతువే. ఆమె నొక ఆదర్శంగా తీసుకొని నేను ధైర్యం తెచ్చుకునే దాన్ని.

అదేగాక కీర్తిశేషురాలైన తరికొండ వెంకమాంబ గారి జీవతమున్నూ నాకు ఆదర్శమే అయింది. ఆమె నావలెనే బాలవితంతువని వినికిడి. ఆమె బాలకృష్ణుని సాకారోపాసనతో ప్రారంభించి నిర్గుణ పరతత్త్వావధిని చేరిన ఉత్తమజ్ఞాని, ఆమె గాథ లెన్నో అజ్ఞాతంగా వున్నాయి. ఆమె వ్రాసిన వేంకటాచలమహాత్మ్యం, రాజయోగసారం (ద్విపదకావ్యం) సుప్రసిద్ధమై వున్నాయి. వాసిష్ఠంగూడా ద్విపద కావ్యంగా వ్రాసింది. బాలకృష్ణుని ముద్దులున్నూ పాటలుగ సనాతన స్త్రీల కంఠస్థమై వున్నవి. ఆమె గూడా సకేశినియేనట. తరి కొండ వాస్తవ్యులలో కొంద రది. సహించక శంకరపీఠాధిపతులలో ఒకరిద్వారా ఆజ్ఞాపత్రిక పంపగా ఆమె నేను శ్రీవారితో మాట్లాడిని వెనుక నా ప్రశ్నకు సరియైన ప్రత్యుత్తరం వస్తే వారి యాజ్ఞ శిరసావహిస్తానని అన్నదట. శ్రీవా రామెను చూడరు గదా! పటాంతరమున నిలిచి ప్రశ్నించుటకు ఏర్పాటు కాగా ''బోడి కావలసినది ఏది? మళ్ళీ మొలవనిది ఏది?'' అని ప్రశ్నిస్తే, శ్రీవారు ఆమె విజ్ఞానమునకు విస్మితులై ''తల్లీ! లోకాచారాన్ననుసరించి పత్రిక పంపామేగాని నీ వంటి వారికి విధి నిషేధములు లే'' వని ప్రశంసించినారనన్నీ ప్రతీతి. నేను ఇవన్నీ ఆదర్శంగా తీసుకున్నప్పటికీ తలపులు బోడులయ్యేందుకు తగిన గురువు కావాలి గదా? ఆ భాగ్యం ఎల్లా లభిస్తుందా? అని ఎదురుచూస్తూ వుండగా కవయిత్రి శ్రీమతి గుడిపూడి ఇందుమతీదేవిగారి పరిచయం లభించింది. ఆమెవద్ద కవిత్వ లక్షణం కొంచెం తెలుసుకొని మనస్సుకు ఎన్నో నీతులు బోధించుకుంటూ మానసశతకం అను పేరుతో 108 పద్యాలు వ్రాశాను.

ఇంతలో అశక్తుడై బ్రహ్మచారిగా నా సేవపైన ఆధారపడివుండే మా జ్యేష్ఠసోదరుడు వ్యాఘ్రనృసింహశాస్త్రి, 1923లో స్వర్గస్థులైరి. అంతటితో నాకుగల రవ్వంత బాధ్యత బంధమున్నూ వీడినట్లయింది. ఇక యీ కుటుంబాల మధ్య నలగటం ఏమాత్రం రుచించలేదు. ఏ మహనీయుని వద్దనైనా జన్మ తరించగల మార్గం తెలుసుకొనవలెనన్న జిజ్ఞాస ప్రబలమైంది. ఎందరో మహానుభావు లున్నారని విన్నాకలలో కనుపించిని సిద్ధ పురుష లక్షణాలు వారెవరికిని కలవని వినబడనందున ఎవరినీ గురువుగా స్వీకరించ లేదు. అవకాశం చిక్కినప్పుడల్లా విజయవాడకు అధిష్టాన దేవతయైన కనక దుర్గను దర్శించి సద్గురువు నొకరిని ప్రసాదింపుమని ప్రార్థిస్తూ వుండేదాన్ని, మానస శతకం ఆ దేవికే అంకిత మిచ్చాను. అందులో సద్గురుని అన్వేషణను గుఱించే చాలా పద్యాలు వున్నవి. ఈ పద్య రచన కారంభించిన కొత్తలో ఒక్కసారి శ్రీ వేలూరి శిరామశాస్త్రిగారితో నా పద్య రచనను గుఱించి సలహా అడిగాను. వారెంతో సంతసించి ''నా జీవితానికి ఈ రచన చాలా సహకరిస్తుందనీ, రచన భక్తిపరంగా వుంటే మంచిదనీ చెప్పి పది పద్యాలకు ఒక్కటి పనికి వస్తుందనే భావంతో వ్రాస్తే బాధవుండదనీ, తొందరపడి ప్రకటించవద్దనీ చక్కని సలహా యిచ్చారు. అందువల్ల నా రచన నిగూఢంగానే వుండిపోయింది.

వాసుదేవమననం, సీతారామాంజనేయం, కైవల్య నవనీతం, పంచదశి, వాసిష్ఠం ఇత్యాది వేదాంత గ్రంథాలు ఎన్నో చదివాను. ఎన్ని చదివినా శ్రీగురు కటాక్షం పొందనందువల్ల అనుభూతి నందటం దుష్కరమైంది. కడకు ఉపాసనా మార్గమును అనుసరించి, ఆత్మయే బాలకృష్ణుడుగా, చిత్తమే గోప భామినిగా మానసికారాధనతో కాలం గడుపుతూ ఏ తత్‌ పద ప్రాప్తికై చింతించునట్లు అప్పుడప్పుడొదవిన భావములను ''బాలకృష్ణ గీతావళి'' అను పేరుతో పద్యాలు వ్రాసుకుంటూ, పగలు గృహ కృత్యములతో గడపి రాత్రికాలం ఈ చింతనకు ఉపయోగించే దాన్ని, అందువల్ల నా పద్య రచనగాని, నా ఉపాసనా విధానంగాని, స్వప్నగత సిద్ధ పురుష సందర్శనంగాని నా అన్నలకు గూడా తెలియనంత నిగూఢంగా వుండిపోయింది. మా అన్నలు నే నడిగిన గ్రంథాలన్నీ ఆదరంతో తెచ్చేవారు. అన్నీ చదివే దాన్ని, ఎన్ని చదివినా ఎంత సాధనచేసినా శాంతి కుదరలేదు.

సీతారామాంజనేయ సంవాదం చదివినప్పుడు, ముద్రా లక్షణాలున్నూ పట్టి చూచాను. ఉహూ! పట్టు చిక్కలేదు. అప్పుడప్పుడు పద్మాసనం మొదలైన ఉత్తమ ఆసనాలున్నూ అభ్యసించి చూచాను. శాంతి కుదరలేదు. శారదా నికేతనానికి రమ్మని ఉన్నవ లక్ష్మీబాయమ్మగారు ఆహ్వానించింది. ''అది ఆధ్యాత్మిక పంథా కాదు గదా?'' అని మా అన్న లందుకు సమ్మతించలేదు. జీవసేవ దేవ పూజగా భావించి వ్యాధిగ్రస్తు లెందరికో సేవ చేశాను. అయినా తృప్తిలేదు ఏదో వ్యధ, ఏదో అసంతృప్తి, అనవరతం బాధించేది. రానురాను ఈ అసంతృప్తి ప్రబలి కుటుంబాల మధ్యనుండి ఎట్లా గైనా బయలపడాలని అనిపించింది. ఏ క్షేత్రమందైనా వుండి ప్రశాంతంగా జీవితం గడుపుట కాశించి అన్నల నడిగితే ''ఒంటరిగా ఎక్కడకు వెళ్ళగలవమ్మా?'' అని అనేవారు. మా చిన్నన్న డి. యస్‌. శాస్త్రిగారు అలప్పిలో వుండగా వారితో అనంతశయనం, కన్యకుమారి ఇత్యాది క్షేత్రాలన్నీ చూచాను. అక్కడ ఒంటరిగావుండి కొన్నాళ్లు చూద్దామా? అని అనిపించింది. కాని ఒంటరిగా వదులుతారా? పోనీ, విజయవాడలోనే విడిగా చిన్న కుటీరం నిర్మిస్తే, అక్కడ వుంటూ సద్గోష్ఠితో కాలం గడుపగలను అని అనే దాన్ని, ''అయితే, అక్క కొడుకును దత్తత చేసుకో'' అనేవారు. అదొక సంసారం కాదా? అనీ, మనువర్తిదారుకు దత్తుయేమనీ అనేదాన్ని. అందువల్ల అది జరగలేదు.

విజయవాడ వచ్చిన దాదిగా అప్పుడప్పుడు అరుణా చలంలో ఒక మహాత్ముడున్నాడని చెవిని పడేదేగాని వెళ్ళాలన్న తీవ్రత అప్పుడు కలుగలేదు. అల్లా దాదాపు పదేండ్లు ఆ అసంతృప్తితోనే గడిచిపోయింది. అంతకంతకు ఆ జిజ్ఞాస (అసంతృప్తి) ప్రబలమై నరాలలోని బలాన్ని క్రుంగదీసి మంచం పట్టించింది. మందులు ఎన్నో వాడారు. ప్రయోజనం సున్న. కోకా చలపతిరావుగారూ, కొమఱ్ఱాజు అచ్చమాంబ మాకు కుటుంబ వైద్యులూ, ఆప్తమిత్రులూను, వారిద్దరూ చాలా దూరం పరిశీలించి ''ఈ వ్యాధికి మూలం మానసికంగా కనుపిస్తున్నది, మా మందులకు లొంగదు. ఆమె చిత్తవృత్తికి అనుకూలమైన వాతావరణంలో వుంచితేగాని కుదుటపడదు.'' అని మా అన్నలతో చెప్పుటయేగాక ''నీ మనస్సును నీవే బాగుపరచుకోవలసిం'' దని నాకున్నూ సలహా యిచ్చారు. నాకదే భగవ దాదేశంగా తోచి ఏ విధంగా నైనా ఈ కుటుంబాలలోనుంచి బయట పడవలెనన్న దృఢ నిశ్చయం కలిగింది. 1940 జనవరి, ఫిబ్రవరి ఆ ప్రాంతాలలో జరిగిన యీ ప్రబోధము ఫలితంగా 1940 మేలో ప్రకృతి వైద్యం ఆరంభించి, జొన్న నూకతో అన్నమూ, సాత్వికమైన కూరలూ ఆహారంగా తీసుకుంటూ ఆ వైద్యమే ఒక నెపంగా 1940 జూన్‌లో మా అన్నల అనుమతి పొంది కొలనుకొండకు నా మకాం మార్చాను.

మా తండ్రి కట్టించిన పెద్ద భవనంలో అప్పు డెవరూ కాపురం లేరు. అందువల్ల పెద్ద పెద్ద పాములూ, జెఱ్ఱులూ, తేళ్ళూ తిరుగుతూ వుండేవి. అవి, నేనూ ఆ యింట్లో వుండే వాళ్ళం, నా జోలి కవీ రాలేదు. వాటి జోలికి నేనూ పోలేదు. రాత్రి సంచారం వాటిదీ, పగటి సంచారం నా దీను. మా నివాసం చాలా చిత్రంగా వుండేది. మనస్సుకు నిర్భీతిని అలవరించుకొనుట కానివాసం ఎంతో సహకరించింది. ప్రకృతి వైద్యం, అంటే తొట్టి స్నానం, కృష్ణ కాల్వలో శిరఃస్నానం సాత్వికాహారం, భోగేశ్వర, విశ్వేశ్వర, పట్టాభిరామ దేవాలయాల సేవ, మధ్యాహ్న వేళల భాగవత పఠనం ఇదీ అక్కడి నా దినచర్య. ఈ మార్పుతో ఆరోగ్యం కొంతవరకు కుదుట పడ్డది. ఆ రోజుల్లోనే గుడిపూడి ఇందుమతీ దేవి, ఆమె భర్త యాత్రకు వెడుతుంటే వారితో భద్రాచలం, రామేశ్వరం వగైరా యాత్రలు చేసివచ్చాను. అదీ అంతగా శాంతినీయలేదు. అందువల్ల ఏదో ఒక సత్పురుషసాన్నిధ్యం కావాలన్న చింతమాత్రం అంతకంతకు అధికమైంది. మార్గం కనిపించక భోగేశ్వరస్వామిని మనసా ప్రార్థిస్తూ వుండేదాన్ని. అప్పుడు మా చిన్నిన్న డి. యస్‌. శాస్త్రిగారు ఎర్నాకొలం (కేరళ) సెంట్రల్‌ బ్యాంకులో పనిచేస్తూ వుండేవారు. వారికి 1941-లో అక్కడనుండి అహమ్మదాబాదు బదిలీ కావటంవల్ల ఒక నెల సెలవుపెట్టి కుటుంబంతో సహా అటూయిటూ తిరగటంలో అరుణాచలం వెళ్ళి శ్రీ రమణభగవానుని దర్శనం చేసుకొనే భాగ్య వారికి లభించింది. భగవానుని చూడగానే నా పూర్వ పుణ్యంవల్ల నాగమ్మను ఇక్కడకు పంపితే స్తిమితపడగలదని వారికి తోచిందట.

అప్పు డక్కడ మా పెత్తండ్రిగారి కొమార్తె దేవులపల్లి సుబ్బమ్మగారు భర్త గతించిన దుఃఖం శమించుటకై కొన్నాళ్ళుగా వుంటున్నదట. ఆమెకూడా వున్నందున ఫరవాలేదని తోచి అహమ్మదాబాదు వెళ్ళగానే అంటే, 1941 జూన్‌లో శ్రీరమణభగవానుని సన్నిధికి వెళ్ళుమని నాకూ, పంపుమని విజయవాడలోనున్న పెద్దన్న శేషాద్రిశాస్త్రిగారికీ జాబులు వ్రాశారు. తోడెవరూ లేకుండా ఎల్లాపోగలనని వ్రాస్తే భగవంతుడే తోడని బదులు వచ్చింది. ఆ చిన్నన్నగారి కుటుంబంతోనే అప్పుడప్పుడు అటు బొంబాయి, ఇటు దక్షిణా పథంలో కోయంబుత్తూరు, ఎర్నాకొలం వగైరా వూళ్ళన్నీ నేనున్నూ తిరగటంవల్ల హిందీ, అరవం కొద్దిగా మాట్లాడటం అలవాటయింది. అందువల్ల ఒంటరిగా వెళ్ళినా ఫరవాలేదని 1941, జూలైలో మా పెద్దన్న గారు తిరువణ్ణామలకు సరాసరి టికెట్టుకొని విజయవాడలో రాత్రివేళ మద్రాసుమెయిలు ఎక్కించారు. గూడూరులో దిగి కాట్పాడిమీదగా విల్లుపురం వెళ్ళే రైలు ఎక్కాలన్నమాట.