T͎w͎e͎l͎v͎e͎ S͎t͎a͎n͎z͎a͎s͎ f͎r͎o͎m͎ t͎h͎e͎ B͎o͎o͎k͎ o͎f͎ D͎z͎y͎a͎n͎ - 2͎1͎

🌹  T͎w͎e͎l͎v͎e͎ S͎t͎a͎n͎z͎a͎s͎ f͎r͎o͎m͎ t͎h͎e͎ B͎o͎o͎k͎ o͎f͎ D͎z͎y͎a͎n͎ - 2͎1͎  🌹

🌴 The Prophetic Record of Human Destiny and Evolution 🌴 

STANZA V
🌻 The Persecution of Love - 3 🌻

39. It was as though drops of hot tears were falling on the unyielding surface of a stone. The stone was helpless in the face of that steady tap-tap-tapping. It was knocking at the door of its soul, demanding that it open itself to the whole world. The world waited. The stone was silent. 

But the drop proved to be stronger, and washed away all soulless barriers with which the darkness had attempted to smother the stone’s ever so delicate nature. Now it was free and open to all. And the New World believed in it... 

40. The Sons of God finally caught their breath and let out a quiet sigh: the scale-pan of evil was becoming noticeably lighter. 

They breathed out a new stream of fresh Fires in response to the Call of the Hearts that reached them from the bowels of Earth. Plunged into darkness, the planet resembled the night sky, for she was all a-twinkling with little sparks of stars — these glowed in the Hearts of those who had preserved the Fire safe from the malicious claws of forces that would extinguish it. 

The Sons of God were reaching out with stellar silver threads towards the Hearts of the Light-Bearers, turning them into immortal carriers of Divine Currents. Such people were able to love and to know what Love is.

Continues...
🌹 🌹 🌹 🌹 🌹

శ్రీ శివ మహా పురాణము - 203

🌹 . శ్రీ శివ మహా పురాణము - 203 🌹

రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. రుద్ర సంహితా - సృష్టిఖండః 🌴

45. అధ్యాయము - 20

🌻. శివుడు కైలాసమునకు వెళ్లుట - 2 🌻

విష్టంభోsష్టాభిరగమదఎ్టాభిశ్చంద్రతాపనః |మహాకేశస్సహస్రేణ కోటీనాం గణపో వృతః || 15
కుండీ ద్వాదశభి ర్వాహస్తథా పర్వతకశ్శుభః | కాలశ్చ కాలకశ్చైవ మహాకాలశ్శతేన వై || 16
అగ్ని కశ్శతకోట్యావై కోట్యా భిముఖ ఏవ చ | ఆదిత్య మూర్ధా కోట్యా చ తథ చైవ ధనావహః || 17
సన్నాహశ్చ శతేనైవ కుముదః కోటిభిస్తథా | అమోఘః కోకిలశ్చైవ కోటి కోట్యా సుమంత్రకః || 18
కాకపాదోsపరష్షష్ట్యా షఎ్టా్య సంతానకః ప్రభుః | మహాబలశ్చ నవభిర్మధుబపింగశ్చ పింగలః || 19

విష్టంభుడు ఎనిమిది, చంద్ర తాపనుడు ఎనిమిది, మహాకేశుడనే గణపతి వేయి (15),

కుండి, వాహుడు, శుభకరుడగు పర్వతకుడు, కాలుడు, కాలకుడు అనువారు ఒక్కొక్కరు పన్నెండు, మహాకాలుడు వంద (16),

అగ్నికుడు వంద, అభిముఖుడు, ఆదిత్యమూర్దుడు, ధనావహుడు ఒక్కొక్కటి (17),

సన్నాహుడు వంద, కుముదుడు వంద, అమోఘుడు, కోకిలుడు, సుమంత్రకుడు ఒక్కొక్కటి (18),

కాకపాదుడను వాడు అరవై, సంతానకుడను గణపతి అరవై, మహాబలుడు, మధుపింగుడు, పింగలుడు ఒక్కొక్కరు తొమ్మిది కోట్ల గణములతో వచ్చిరి (19).

నీలో నవత్యా దేవేశం పూర్ణ భద్రస్తథైవ చ | కోటీనాం చైవ సప్తానాం చతుర్వక్త్రో మహాబలః || 20
కోటికోటి సహస్రాణాం శతైర్వింశతిభిర్వృతః | తత్రాజగామ సర్వేశః కైలాసగమనాయ వై || 21
కాష్ఠాగూఢశ్చ తుష్షఎ్టా్య సుకేశో వృషభస్తథా | కోటి భిస్సస్తభిశ్చైత్రో నకులీశస్స్వయం ప్రభుః || 22
లోకాంతకశ్చ దీప్తాత్మా తథా దైత్యాంతకః ప్రభుః | దేవో భృంగీ రిటిశ్ర్శీమాన్‌ దేవదేవప్రియస్తథా || 23
అశనిర్భానుకశ్చైవ చతుష్షఎ్టా్య సనాతనః | నందీశ్వరో గణాధీశశ్శత కోట్యా మహాబలః || 24

నీలుడు తొంభై, పూర్ణ భద్రుడుకూడ తొంభై, మహాబలశాలియగు చతుర్వక్త్రుడు ఏడు కోట్ల గణములతో శివుని వద్దకు వచ్చిరి (20).

సర్వేశ్వరుడగు శివుడు కైలాసమునకు వెళ్లుటకై ఇరువది వందల కోటి కోట్ల గణములతో కూడి బయలుదేరెను (21).

కాష్ఠాగూఢుడు, సుకేశుడు, వృషభుడు ఒక్కొక్కరు అరవై నాలగు, చైత్రుడు, నకులీశుడు (22),

లోకాంతకుడు, దీప్తాత్మ, దైత్యాంతకుడు, భృంగి దేవుడు, శివునకు అతి ప్రియుడగు శ్రీమాన్‌ రిటి (23),

అశని, భానుకుడు ఒక్కొక్కరు ఏడు, సనాతనుడు అరవై నాలుగు, మహాబలుడగు నందీశ్వరుడనే గణపతి వంద కోట్ల గణములతో విచ్చేసిరి (24).

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

శ్రీ మదగ్ని మహాపురాణము - 74

🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 74 🌹

✍️. శ్రీ పుల్లెల శ్రీరామచంద్రుడు
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

ప్రథమ సంపుటము, అధ్యాయము - 30

🌻. అధ మండల విధి - 3 🌻

అరకాన్పీతరక్తాభిః శ్యామన్నే మిం తు రక్తతః |
సితశ్యామారుణాః కృష్ణాః పీతా రేఖాస్తు బాహ్యతః. 18

శాలిపిష్టాది శుక్లం స్యాద్రక్తం కౌసుంభకాదికమ్‌ |
హరిద్రయా చ హారిద్రం కృష్ణం స్యాద్దగ్ధధాన్యతః. 19

శమీపత్రాదికైః శ్యామం బీజానాం లక్షమప్యతః |
చతుర్లక్షస్తు మన్త్రాణాం విద్యానాం లక్షసాధనమ్‌. 20

అయుతం బుద్ధవాద్యానాం స్తోత్రాణాం చ సహస్రకమ్‌ |
పూర్వమేవాథ లక్షేణ మన్త్రశుద్తిస్తథాత్మనః. 21

తథాపరేణ లక్షేణ మన్త్రః క్షేత్రీకృతో భవేత్‌ |
పూర్వసేవాసమో హోమో బీజానాం సంప్రకీర్తితః. 22

పూర్వసేవాదశాంశేన మన్త్రాదీనాం ప్రకీర్తితా |
పురశ్చరణమన్త్రే తు మాసికం వ్రతమాచరేత్‌. 23

భువి న్యసేద్వామపాదం న గృహ్ణీయాత్ర్పతిగ్రహమ్‌ |
ఏవం ద్విత్రిగుణన్తెవ మధ్యమోత్తమసిద్ధయః. 24

మన్త్రధ్యానం ప్రవక్ష్యామి యేన స్యాన్మన్త్రజంఫలమ్‌ | 
స్థూలం శబ్దమయం రూపం విగ్రహం బాహ్యమిష్యతే. 25

సూక్ష్మం జ్యోతిర్మయం రూపం హార్దం చిన్తామయం భవేత్‌ |
చిన్తయా రహితం యత్తు తత్పరం పరికీర్తితమ్‌. 26

వారాహసింహశక్తీ నాం స్థూలరూపం ప్రధానతః |
చిన్తయా రహితం రూపం వాసుదేవస్య కీర్తితమ్‌. 27

చక్రకమలము ఆకులకు పసుపు-ఎరుపు రంగులు వేయవలెను. చక్రము అంచును నీలము-ఎరుపు రంగులు వేసి అలంకరింపవలెను. బైట నున్న రేఖలకు తెలుపు, శ్యామము, ఎరుపు, నలుపు, పసుపు రంగులు వేయవలెను.

వరిపిండి మొదలగువాటిని తెలుపురంగునకు ఉపమోగించవచ్చును. కుసుంధచూర్ణాదులు ఎరుపురంగునకును, పసుపు పసుపురంగునకును, మాడ్చిన బియ్యపు పిండు నల్లరంగునకును ఉపయోగించును. శమీపత్రాదులచే శ్యామవర్ణము వేయవచ్చును.

బీజమంత్రములను ఒక లక్ష జపించుటచేతను, ఇతరమంత్రములను అక్షరలక్షలు జపించుటచేతను, విద్యలను ఒక లక్షజపించుటచేతను, బుద్ధవిద్యలను పదివేల సార్లు జపముచేయుటచేతను స్తోత్రములను వేయి పర్యాయములు జపించుటచేతను, లేదా అన్ని మంత్రములను మొదట ఒక లక్ష జపించుటచేతను, మంత్రశుద్ధియు, ఆత్మశుద్ధియు కూడ కల్గును.

రెండవ పర్యాయము ఒక లక్ష జపించుటచే మంత్రము క్షేత్రీకృత మగును (సాధకునకు దానిపై నిలకడ ఏర్పడును). బీజమంత్రజపము మొదట ఎంత సంఖ్యలో చేయబడునో హోమము కూడ అంత సంఖ్యలోనే చేయవలెను. ఇతరమంత్రముల విషయమున హోమము జపసంఖ్యలో పదవ వంతు చేయవలెను.

మంత్రపురశ్చరణము చేయ సంకల్పించినప్పుడు ఒక్కొక్క మాసము వ్రతము ఆవలంబింపవలెను. నేలపై మొదట ఎడమ కాలు ఉంచవలెను. దానము పట్టగూడదు. ఈ రెండు రెట్లు-మూడురెట్లు జపము చేసిననే మధ్యమ-ఉత్తమశ్రేణికి చెందిన ఫలముల లభించును.

ఇపుడు మంత్రమువలన ఫలము సిద్ధించుటకై ఉపమోగించు మంత్రధ్యానమును చెప్పెదను - మంత్రముయొక్క స్థూలరూపము శబ్దము. ఇది దాని బాహ్యరూపము.

మంత్రముయొక్క సూక్ష్మరూపము జ్యోతిర్మయ మైనది. ఇదే దాని ఆంతరరూపము. ఇది కేవలము చింతనామయ మైనది. చింతనమునకు కూడు అతీతమైనది మంత్రముయొక్క పరరూపము.

వరాహ-నరసింహ-శక్తిమంత్రముల స్థూలరూపమునకే ప్రాధాన్యము. వాసుదేవుని రూపము చిన్తనరహిత మని చెప్పబడినది.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 90

🌹. భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 90 🌹

🌷. సద్గురు శివానంద 🌷
📚. ప్రసాద్ భరద్వాజ

🌻. పరాశర మహర్షి - 9 🌻

50. భగవంతుణ్ణి ఆర్యుడు ఆరాధించేటప్పుడు – ఆరాధ్యవస్తువుగా భగవంతుణ్ణి మాత్రమే ఎందుకు గుర్తించాడంటే, నాలుగో పురుషార్థమయిన మోక్షాన్ని కేవలం పరమేశ్వరుడే ఇవ్వగలడనే నమ్మకంవలన! అందువల్లనే ఈశ్వరుడు పరమపూజ్యుడయ్యాడు.

51. అటువంటి నివృత్తి, మోక్షము బ్రహ్మదేవుడివ్వటంలేదు. దానికేదో శాపాలు అవీ కల్పించబడ్డాయి పురాణాలలో. కాని యథార్థంగా బ్రహ్మయొక్క లక్షణమే ఇది. గాధలు ఎవరైనా కల్పించవచ్చు. బ్రహ్మయొక్క ప్రవృత్తి సృష్టిచేయటమే! అదే ఆయన కార్యం. సృష్టిలో పంచభూతములలో దేహాత్మభావనతో జీవుడు ఉండడమనేది బ్రహమ ఉద్దేశ్యం. సత్కర్మలాచరించి, ఇక్కడ సుఖాలున్నాయి, అక్కడ స్వర్గముంది, ఇక్కడ నరకముంది – జాగ్రత్తగా ఉండమని తెలుపుతుంది బ్రహ్మయొక్క ఈ ప్రవృత్తి మార్గం. మోక్షవిషయం దాని తరువాతిది.

52. ఈ యజ్ఞాదిక్రతువులన్నీకూడా బ్రహ్మముఖము నుంచీ వచ్చి, వేదములు ప్రతిపాదించినటువంటి త్రిగుణములతో కూడినటువంటివి. కర్మలు జ్ఞాన స్వరూపములుకావు. సుగునాత్మకమైన వేదములచేత ప్రతిపాదించబడినవి! వేదకర్మలెప్పుడూ కోరికలకు ఫలములు ఇచ్చేవే. ఎవడైనా కేవలం జ్ఞానం కోసమే వీటిని ఆచరిస్తున్నాడనేది నిజం కాదు.

53. శంకరులు చెప్పిన శ్రుతివాక్యములు, ఉపనిషద్వాక్యములు ఎక్కువగా ఉన్నాయి. శృతులలోంచి కొన్నివాక్యములు, బ్రాహ్మణములలోంచి కొన్ని వాక్యములను ఆయన తీసుకున్నారు.

54. ‘కర్మబ్రహ్మస్వరూపిణే’ అంటూ అగ్నిహోత్రుడికి రోజూ నమస్కారం చేస్తున్నాం కదా! బ్రహ్మ కర్మస్వరూపుడు అంటే, కార్యబ్రహ్మస్వరూపుడు అని అర్థం చెప్పుకోవచ్చు. ‘కర్మలో నిర్గుణమయిన బ్రహ్మస్వరూపుడని కాదు’. ‘కార్యబ్రహ్మలోంచీ వచ్చిన వేదసమ్మితమైనటువంటి కర్మస్వరూపుడివి – అగ్నిహోత్రుడివి నీవు – నీకు నమస్కారం. నాకు ఐశ్వర్యం ఇయ్యి. ఆరోగ్యం ఇయ్యి’ అని ప్రార్థిస్తాం.

55. అంటే నిర్గుణమైన బ్రహ్మవస్తువైతే, ఇవన్నీ ఎలా అడుగుతాము? వైదికకర్మలన్నీ సగుణమైనవే. మన ప్రార్థన అంతా లౌకికమే! యజ్ఞమూ లౌకికమే! జ్ఞానంకోసం కాదు. ‘నిస్త్రైగుణ్యో భవార్జున!’ అని భగవద్గీతలో కృష్ణపరమాత్మ అన్నమాటలకు – త్రిగుణములకూ అతీతుడవుకమ్మనే అర్థం.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి సంక్షిప్త జీవిత చరిత్ర - కాలజ్ఞానం - 40

🌹.  శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి సంక్షిప్త జీవిత చరిత్ర - కాలజ్ఞానం - 40  🌹
📚. ప్రసాద్ భరద్వాజ

🌻. సిద్ధయ్యకు చేసిన జ్ఞాన బోధ 🌻

వీర బ్రహ్మేంద్ర స్వామి పుష్పగిరి నుండి వచ్చే మార్గమధ్యంలో ఒక చెట్టు నీడలో విశ్రాంతి తీసుకుంటున్నారు. ఆ సమయంలో సిద్దయ్య, స్వామివారి పాదాలు ఒత్తుతూ తనకు జ్ఞానబోధ చేయమని కోరాడు.

దానికి అంగీకరించిన బ్రహ్మేంద్రస్వామి అమూల్యమైన విషయాలను ప్రసంగించడం మొదలుపెట్టారు. “సిద్ధయ్యా, విను, జ్ఞానేంద్రియాలు అయిదు, కర్మేంద్రియాలు అయిదు, ప్రాణాలు ఐదు. ఇవి అన్నీ కలిసి 24 తత్వములవుతాయి. . ధవళ, శ్యామల, రక్త, శ్వేత వర్ణముల మధ్య ప్రకాశించేది ‘ప్రకృతి’. అదే ‘క్షేత్రము’. అదే సర్వసాక్షి అయిన సచ్చిదానంద స్వరూపం.. ధవళ, శ్యామల, రక్త, పీత వర్ణాలలో రక్తవర్ణమే స్థూల శరీరం. శ్వేతవర్ణమే సూక్ష్మదేహం.. శ్యామలవర్ణమే కారణ శరీరం. వీటి నడుమ ప్రకాశించే పీత వర్ణమే మహా కారణ దేహము. ఈ కాయమూలా ప్రమాణం గురించి వివరిస్తాను విను...

''స్థూలకాయము ఒకటిన్నర అంగుళాల వ్యాసము గలది. కాయమూలము అంగుళముపైన వుంటుంది. వీటిని మించి ప్రకాశిస్తూ, వుండేదే ఆత్మ. అదే చైతన్యం. ఇవన్నియూ నేత్రములకు కనిపించేవే! నీకు అవి గోచరమయ్యే విధంగా నేను నా శక్తిని వినియోగిస్తాను’’ అని చెప్పి, సిద్ధయ్యకు వాటిని దర్శింపచేశారు స్వామి.దాంతో సిద్దయ్య సంతృప్తి పడ్డాడు.

🌻. స్వామివారు పంచాననం వారికి కాలజ్ఞానమును చెప్పటం... 🌻

శ్రీముఖ నామ సంవత్సరమున శ్రీ వీరభోగ వసంతరాయులనై వచ్చి పరిపాలనా బాధ్యత స్వీకరిస్తాను. మహానందికి ఉత్తరాన అనేకమంది మునులు పుట్టుకొస్తారు. భూమి మీద ఎన్నో మాయలు ప్రదర్శిస్తారు.

5000 సంవత్సరం వచ్చేసరికి బ్రాహ్మణులు సంకరవృత్తులను చేస్తూ, తమ వైభవం కోల్పోతారు. ఏ కులం వారు కూడా బ్రాహ్మణులను గౌరవించరు. సిద్ధులు, యోగులు జన్మించిన ఆ బ్రాహ్మణకులము పూర్తిగా వర్ణసంకరం అవుతుంది.

ఆనాటికి ప్రజలలో దుర్భుద్ధులు అధికమవుతాయి. కృష్ణవేణమ్మ పొంగి కనకదుర్గమ్మ ముక్కుపోగును తాకుతుంది. రాజాధిరాజులు అణిగి వుంటారు. శూద్రులు విలాసాలను అనుభవిస్తూ, రాజుల హోదాలో వుంటారు. వారి ఇంట ధనలక్ష్మి నాట్యమాడుతూ వుంటుంది. నా భక్తులయిన వారికి నేనిప్పుడే దర్శనమిస్తాను. కానీ వారి నెత్తురు భూమిమీద పారుతుంది. కొంత భూభారము తగ్గుతుంది. దుర్మార్గుల రక్తముతో భూమి తడుస్తుంది.

చీమలు నివసించే బెజ్జాల్లో చోరులు దూరతారు. దురాలోచనలు మితిమీరుతాయి. అందువల్ల చోరులు ప్రత్యేకముగా కనపడరు. బిలం నుంచి మహానంది పర్వతము విడిచి వెళ్తుంది.

గడగ్, లక్ష్మీపురం, రాయచూరు, చంద్రగిరి, అలిపిరి, అరవరాజ్యము, వెలిగోడు, ఓరుగల్లు, గోలకొండ మొదలైనవి అభివృద్ధి చెందుతాయి. నా మఠంలో ఏడుసార్లు దొంగలు పడతారు. క్షత్రియులు అంతరిస్తారు. చలనేంద్రియయములు, ఆయుధాల చేత, బాణముల వల్ల నశిస్తాయి.

ఉత్తర దేశాన భేరి కోమటి ‘గ్రంథి’ అనే మహాత్ముడు అవతరిస్తాడు.

అందరిచే పూజింపబడతాడు. . అందరూ పాటించవలసిన కొన్ని ధర్మములను గురించి నీకు చెబుతాను ... విను …

తాము భోజనము చేయబోయే ముందుగానే ఇతరులకు పెట్టటం ఉత్తమ ధర్మం. తాము భోజనం చేసి యింకొకరికి పెట్టటం మాధ్యమం, ఫలాపేక్షతో ఒకరికి అన్నదానం చేయటం అధమం. చాలకుండా అన్నం పెట్టటం అధమాధమం. దానాలన్నిటిలోనూ అన్నదానం అత్యుత్తమం.

కలియుగం 4808 సంవత్సరములు గడిచిన తరువాత కొట్లాటలు ఎక్కువవుతాయి. నిద్రాహార కాల పరిమితులు పాటించక మానవులు ధర్మహీనులవుతారు. శాంత స్వభావం కలవారు కూడా కోపాన్ని ఆపుకోలేకపోతారు. పిల్లలు పెద్దలను ఆశ్రయించుటకు బదులు, పెద్దలే పిన్నలను ఆశ్రయిస్తారు. దుష్టమానవుల బలం పెరుగుతుంది. రాజ్యాలేలిన వారు భిక్షాటనకు దిగుతారు. భిక్షమెత్తిన వారు ఐశ్వర్యమును పొందుతారు.

కుటుంబాలలో సామరస్యత తొలగిపోతుంది. వావి వరసలు నశిస్తాయి.

బ్రాహ్మణనింద, వేదనింద, గురువుల నిందలు ఎక్కువవుతాయి.

జారుత్వం, చోరత్వం, అగ్ని, రోగ, దుష్టులవలన ప్రజలు పీడింపబడతారు.

అడవిమృగాలు పట్టణాలు, పల్లెలలో తిరుగుతాయి.

మాల, మాదిగలు వేదమంత్రాలు చదువుతారు.

ఏనుగు కడుపున పంది, పంది కడుపున కోతి జన్మిస్తాయి.

రక్త వాంతులు, నోటిలో పుండ్లు వలన, తలలు పగలడం వలన జనం మరణిస్తారు (ఇది అణు దాడి వల్ల సంభవించే కాన్సర్ తదితర వ్యాధుల వల్ల జరగవచ్చు)

కొండల మీద మంటలు పుడతాయి.

జంతువులూ గుంపులు గుంపులుగా మరణిస్తాయి.

భారతదేశము పరుల పాలనలోకి వెళుతుంది.

ఈ పాలనలో అన్ని వర్ణాల వారు చదువుకుంటారు. కులం, ఆచారం నశిస్తాయి. మనుషులందరూ కలిసి మెలిసి, కుల మత వర్ణబేధాలు లేక ప్రవర్తిస్తారు.

ఎడ్లు లేకుండా బండ్లు నడుస్తాయి.

మంచినీటితో జ్యోతులు వెలుగుతాయి.

ఒకే రేవున పులి, మేక నీరు తాగుతాయి.

వెంపలి మొక్కకు నిచ్చెనలు వేసే మనుష్యులు పుడతారు.

విజయనగర వైభవము నశిస్తుంది.

కాశీ నగరం పదిహేను రోజులు పాడుపడిపోతుంది.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

అద్భుత సృష్టి - 11

అద్భుత సృష్టి - 11 

 రచన, సంకలనం- DNA స్వర్ణలత గారు
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

. ఇప్పుడు మన యొక్క DNA 2 నుండి 12 స్థాయిల వరకు ఎదిగే క్రమంలో ఉంది. ఇది యుగమార్పుల వలన సంభవించింది. ఎన్నో యుగాలుగా కోట్ల మంది తమ సహజమైన స్థితి ని అంగీకరించి తమ యొక్క శరీర ఫ్రీక్వెన్సీని 2 ప్రోగులు స్థాయి నుండి 12 ప్రోగుల స్థాయికి ఎదిగేలా తమ శరీరాలలో మార్పులు తెచ్చుకుంటున్నారు.

. వారు మారడమే కాకుండా గ్రహంపైన కూడా ఎన్నో మార్పులను తీసుకుని వచ్చి ఈ గ్రహాన్ని పవిత్ర శక్తి క్షేత్రంగా మారుస్తున్నారు.
12 ప్రోగుల DNA శరీర కణాల్లోనే కాకుండా శరీరం బయట విశ్వం మూలం వరకు విస్తరించి ఉంటుంది.

. అధిక శక్తి, కాంతి సమాచారం శరీరంలోనికి రావటం వలన DNA యాక్టివేట్ అయ్యి మన శరీర ఫ్రీక్వెన్సీ పెరిగి ఒక గొప్ప స్థితిలోకి మారుతుంది. ఎప్పుడైతే భౌతిక శరీరం తన స్థితిని మార్చుకుని క్రిస్టల్ రూపమైన కాంతి శరీరంగా మారుతుందో ఆ రూపాన్ని "12 ప్రోగుల DNA యాక్టివేషన్" అని చెప్పడం జరిగింది.

. క్రిస్టల్ రూపమైన కాంతి శరీరంలోని కణ నిర్మాణం ఎప్పటికీ నశింపుకాని విధంగా ఉంటుంది. ఈ శరీరాన్ని కలిగిన వారిని "ఇమ్మోర్టల్ బీయింగ్స్" అంటారు. ఈ కాంతి దేహం సూపర్ కంప్యూటర్ వలె పని చేస్తూ అన్ని విశ్వాల సమాచారాన్నంతా నిక్షిప్తం చేస్తూ పునః ప్రసారం చేస్తూ ఉంటుంది.

. దీనివలన శరీరంలోని శక్తి క్షేత్రాలు అన్నీ కూడా ఏకీకృతం అవ్వడం జరుగుతుంది. దివ్యత్వపు జాగృతి పెరుగుతుంది. మానవ అనుభవాల నుండి దివ్య అనుభవాలను పొందే స్థితికి మారిపోతుంది.
ఇప్పటి వరకు ఉన్న సరికాని శక్తి అయిన భౌతికమైన గ్రేడ్లను చేదిస్తూ కాంతి గ్రేడ్లను ఏర్పాటు చేసుకుంటుంది. శరీరం బయటా మరి లోపలా కూడా కాంతిని కలిగి ఏక స్థితిని పొందుతూ ప్రాధాన్యం తాదాత్మ్యం చెందుతూ ఉంటుంది.

. తనని తాను మార్చుకోవడమే కాకుండా తాను నివసిస్తున్న గ్రహాన్నీ..‌. ఆ గ్రహంపై ఉన్న జీవరాశినంతటినీ ఒక గొప్ప షిఫ్టులోనికి తీసుకొని వెళ్ళడం జరుగుతుంది.

. ఈ మార్పు కారణంగా ఎన్నో విశ్వాలు (భూమితో అనుసంధానమైనవి) శాంతినీ, కాంతినీ పొంది జాగృతమవ్వడం జరుగుతుంది. బహుశా ఈ మార్పును " నూతన యుగ మార్పు" అనవచ్చు. ఈ మార్పు ఇంకా, ఇంకా జరుగుతూ భూమి అనంతంగా చైతన్యవంతం అవుతూ ఉంటూనే ఉంటుంది.(This is endless process). 

సశేషం.... 

కఠోపనిషత్‌ వివరణ - చలాచలభోధ - 33

🌹. కఠోపనిషత్‌ వివరణ - చలాచలభోధ - 33 🌹

✍️. సద్గురు శ్రీ విద్యాసాగర్
📚. ప్రసాద్ భరద్వాజ

🌻. శ్రేయోమార్గము - ప్రేయోమార్గము - 22 🌻

అట్లాగే మన నిజజీవితంలో కూడా జగత్ వ్యవహారమునకు, జగత్ వ్యాపారమునకు సంబంధించి అనేక సూచనలని, సలహాలని, అవగాహనలని, ఆక్షేపణలని, ఆశ్రయాలని అందించేటటువంటివారు కోకొల్లలుగా వుంటారు.

కాని నాయనా! ఆత్మనిష్ఠ గురించి మీరేమైనా తెలియజేయగలరా అని ప్రశ్నించాలట. అత్మానుభూతి మీరు పొందారా అని ప్రశ్నించాలట. అట్టి ఆత్మానుభూతి విషయమై ఆత్మనిష్ఠ విషయమై నాకు మీరు సహాయం చేయగలరా అని పరిప్రశ్న వేయాలిట. అలా ఎవరినైతే నీవు అర్ధిస్తావో, తప్పక నీకు సహాయం చేస్తాను ఆత్మనిష్ఠ విషయమై, తప్పక నీకు ఆత్మానుభూతి పొందేట్లుగా చేస్తాను అనే వాగ్ధానం చేయగలిగేటటువంటి ఆచార్యుడని ఆశ్రయించాలి.

కాబట్టి గురుపౌర్ణమి అంటే ఏమిటంటే హస్తమస్తక సంయోగము అనేటటువంటి పద్ధతి ద్వారా గురువుగారు నీకు ఈశ్వరుడు సాక్షిగా వాగ్ధానం చేస్తున్నారు. శిష్యుడు ఈశ్వరుడి సాక్షిగా గురుపాదమును ఆశ్రయిస్తున్నాడు. శరణాగతుడౌతున్నాడు. చరణాగతి కాదు అది, శరణాగతి. అంటే సంజ్ఞారూపకంగా కాళ్ళుపట్టుకుని ప్రార్ధిస్తున్నాం అన్నమాట. ఇంక అంతకుమించి ప్రార్ధించడానికి వేరే మార్గము లేదు కాబట్టి.

హృదయపూర్వకమైనటువంటి నివేదన, శరణాగతి. అటువంటి పద్ధతిగా మనం గురువును ఆశ్రయించాము. మానసిక ఆశ్రయాన్ని పొందటం. మనస్సుని హృదయ స్థానంలో నిలిపి ఉంచడమే అన్ని సాధనల యొక్క పరమగమ్యం.

కాబట్టి అన్ని తపస్సుల యొక్క ఉద్దేశ్యం ఏమిటంటే మనస్సుని హృదయస్థానమందు నిలిపి వుంచి స్వరూపజ్ఞాన విశేషంచేత నీవు జీవించడం. అట్లా జీవనం ఎవరైతే చేస్తారో వాళ్ళు సరియైనటువంటి విధానంలోకి ప్రవేశిస్తారనమాట. అటువంటివారు అతికుశలురైనటు వంటి గురువును ఆశ్రయిస్తున్నారు.

గురువు ఎటువంటి వాడయ్యా అంటే శిష్యునిలో ఏర్పడేటటువంటి కొద్దిపాటి మార్పులని కూడా చెప్పకనే గ్రహించగలిగేటటువంటి సమర్ధత ఆయన దగ్గర వుంది. అలా చూస్తేనే గ్రహిస్తాడు. వింటూనే గ్రహిస్తాడు. వినకుండా కూడా గ్రహిస్తాడు. అపరోక్షంగా కూడా చూడగలుగుతాడు. నిన్ను నీడలాగా వెంబడిస్తూ వుంటాడు. నీ హృదయస్థానంలోనే నిలకడైనటువంటి స్థానం కలిగి వుండి నీలో కలుగుతున్నటువంటి మార్పులన్నిటినీ గ్రహిస్తాడు. ఆ రకంగా నువ్వు గురువుని నీ హృదయస్థానంలో నిలుపుకోవాలి.

ఆ రకమైనటువంటి మానసిక ఆశ్రయాన్ని పొందేటటువంటి కుశలత్వాన్ని సంపాదించాలి. నైపుణ్యాన్ని సంపాదించాలి. అప్పుడేమౌతావు. సర్వార్పణ అయిపోతావు అనమాట. అట్లా ఎవరైతే సర్వార్పణైనటువంటి శరణాగతి స్థితిని అనుభవిస్తున్నారో వాళ్ళు ఉత్తమగతి చెందేటటువంటి అవకాశం కలుగుతుంది.

ఇంకా ఇందులో ఒక మర్మగర్భమైనటువంటి విశేషం కూడా వుంది. నూటికో కోటికో అనడంలో ఒక ఉద్దేశ్యం వుంది. తెలుసా మీకు ఎవరికైనా? సాధారణంగా అందరూ అంటుంటారు - ఎక్కడో నూటికో కోటికోనండీ అంటుంటారు. అంటే శతజన్మలకి ఒకసారి ఈ అవకాశం వస్తుంది.

వందసార్లు పుట్టి పోతే, శత జన్మలకు - శతజన్మల ఆయుర్దాయం - వంద వందలు - అంటే ఎంత- పదివేల సంవత్సరాలకి ఒకసారి నీకు ఈ ఆత్మనిష్ఠని పొందాలి అనే ఆసక్తి కలుగుతుంది. అటువంటి ఆసక్తిని ఏదో ఒక ప్రతిబంధకాలని ఉద్దేశించి, ఏదో ఒక సమస్యలనుద్దేశించి, ఏదో ఒక తాత్కాలికమైన అంశాలని ప్రాధమ్యాలుగా స్వీకరించి ఆత్మానుభూతి కొరకు చేసేటటువంటి ప్రయత్నాన్ని విరమించడం అనేది అత్యంత హీనమైనటువంటిది. ధన్యత చెందే అవకాశం శతజన్మలకి ఒకసారి వస్తుంది.

ఇంకా కోటికో అంటాం.. తెలుసా మీకెవరికైనా. ‘కోటికో’ అనడం వెనక ఉద్దేశ్యం ఏమిటంటే ఒక్కొక్క పర్యంతము క్రిమికీటకాదుల జన్మలతో గనక నువ్వు ప్రారంభించినట్లయితే కోటి జన్మలకి ఒకసారి కూడా లభించే అవకాశం వుండదు. అన్నిసార్లు పుట్టిపోతూ వుంటావు. ఏ వంద జన్మలకో, ఏ కోటి జన్మలకో గాని నీకు ఆత్మనిష్ఠని పొందాలి అనేటటువంటి బలమైన నిర్ణయం కలగడం లేదు.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

గీతోపనిషత్తు - సాంఖ్య యోగము : 10. మార్పు - మహత్మ్యము

🌹. 10. మార్పు - మహత్మ్యము -
నేను అను ఈ ప్రజ్ఞ గుణాతీతము, కాలాతీతము కూడ! దీనినుండి సమస్త భావములు, కాలానుసారముగ వృద్ధి చెంది, ప్రవర్తించి, ఈ నేనను ప్రజ్ఞలో మరల కలియుచున్నవి.
🌹

✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

📚. గీతోపనిషత్తు - సాంఖ్య యోగము - 18, 19, 20, 21 📚

ఈ సృష్టి మొత్తమును పరిశీలించి చూచినచో సమస్తమును మార్పు చెందుచున్నట్లు గోచరించును. మార్పు చెందు ఈ సమస్తమునకు మార్పు చెందని ఒక కేంద్రము కలదు. అది మార్పు చెందువానిలో మార్పు చెందక యుండును. అది ఆధారముగా సమస్తమును ఉద్భవించి, వృద్ధిపొంది, లయమగు చున్నది.

ఉద్భవము, వృద్ధి, లయము, మరల ఉద్భవము, అనంతముగా సాగుచుండును. లయమైనపుడు వృద్ధిపొందిన విషయము సూక్ష్మమై ఈ కేంద్రమునందు యిమిడి యుండును. మరల కాలము ననుసరించి ఉద్భవించుట, వృద్ధిపొందుట జరుగుచున్నది.

అన్తవన్త ఇమే దేహా నిత్యస్యోక్తా: శరీరిణ: |
అనాశినో ప్రమేయస్య తస్మాత్ యుధ్యస్వ భారత || 18

య ఏనం వేత్తి హన్తారాం యశ్చైనం మన్యతే హతం |
భౌ తౌ న విజానీతో నాయం హన్తి న హన్యతే || 19

న జాయతే మ్రియతే వా కదాచిన్
నాయం భూత్వా భవితా వా న భూయ: |

అజో నిత్య: శాశ్వతోయం పురాణో
న హన్యతే హన్యమానే శరీరే || 20

వేదావినాశినం నిత్యం య ఏనమజమవ్యయమ్ |
కథం స పరుష: పార్థ కం ఘాతయతి హన్తి కం || 21

ఉదాహరణకు మనలో బాల్యము నుండి వృద్ధాప్యము వరకు అనుదినము మార్పులు జరుగుచునే యున్నప్పటికీ దైనందినముగ ఆ మార్పులను మనము గమనించము.

కారణమేమన సహజముగా మార్పు చెందని ఆ కేంద్ర ప్రజ్ఞయే మనము. మనమాధారముగా అనేక భావములు కలిగినవి. ఆ భావములు మార్పు కూడ చెందినవి. భాషణములు కూడ అట్లే! ఎన్నెన్నో భావములు, భాషణములు, చేతలు, వాియందు ఎన్నెన్నో మార్పులు! ఇన్ని యందు ' నేనున్నా''నను ప్రజ్ఞకు ఏ మార్పూలేదు.

ఈ ప్రజ్ఞ గుణాతీతము, కాలాతీతము కూడ! దీనినుండి సమస్త భావములు, కాలానుసారముగ వృద్ధి చెంది, ప్రవర్తించి, ఈ నేనను ప్రజ్ఞలో మరల కలియుచున్నవి.

ఈ ప్రజ్ఞనే ఆత్మ యందురు. అది నిత్యముగను, నాశరహితముగను, కొలతలకు అతీతముగను, జనన మరణముల కతీతముగను ఉండును.

ఉండుటయే దీని సహజ లక్షణము. దీనినుండి పుట్టిన వానికి చంపుట, చచ్చుట ఇత్యాది లక్షణము లుండును. ఇది మాత్రము శాశ్వతముగ నుండును.

కావుననే భీష్మాదులు మరణించినను, మరణించుట అనగా ఆ మరణము వారి దేహములకు, భావములకే గాని, వారికి కాదని, వారింతకు ముందు కలరని, ఇక ముందును ఉందురని భగవానుడు తెలిపెను. వారిని దేహములుగా కాక దేహులుగా అనగా దేహములను ధరించిన వారిగా చూడుమని జ్ఞానదృష్టి కల్పించబూనెను.

దేహములు నిత్యము కావనియు, దేహులు నిత్యులనియు, చంపకుండినను దేహములు కాలక్రమమున మరణించుననియు,

అట్టి దేహములు ధర్మ యుద్ధమున మరణించుటచే అందలి ప్రజ్ఞలకు ఉత్తమ సంస్కారములు కలుగుననియు, కావున యుద్ధము చేయుమనియు భగవానుడు బోధించినాడు.

ఇందొక మహోపదేశము కలదు. ''దేహి నిత్యుడు కావున దేహమును ధర్మాచరణమునకై వినియోగించుచు, అట్టి ఆచరణమున వలసినచో మరణించుటకైనను మానవుడు వెనుతీయరాదని'' ఉపదేశము.

ధర్మము ఎటు పోయినను మనము ఉండవలె ననుకొనుట కాక, మనకేమైనను ధర్మము నిలబెట్టుట గీత ప్రతిపాదించు ముఖ్యమైన సూత్రము.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

శ్రీ గజానన్ మహరాజ్ జీవిత చరిత్ర - 30 / ŚŔĨ ĞĂĴĂŃĂŃ МĂĤĂŔĂĴ ĹĨŦĔ ĤĨŚŤŐŔŶ - 30

🌹. శ్రీ గజానన్ మహరాజ్ జీవిత చరిత్ర - 30 / ŚŔĨ ĞĂĴĂŃĂŃ МĂĤĂŔĂĴ ĹĨŦĔ ĤĨŚŤŐŔŶ - 30 🌹

✍️. దాసగణు స్వామి
📚. ప్రసాద్ భరద్వాజ

🌻. 7వ అధ్యాయము - 1 🌻

శ్రీగణేశాయనమః ! మీకుజై. రామా, మేఘశ్యామా, సీతాపతే, దశరధే నీవు యోగులకు శరణాగతుడవు. మీఆశీస్సులు వలన వానరులు బలంపొంది, లంకలో రావణుడిని ఓడించారు. నీ ఆశీస్సులతో ఎల్లప్పుడూ విజయము కలిగి, కోరికలు పరిపూర్ణం అవుతాయి. రాజుకు ప్రియమయిన మంత్రి ఎంత చేతకాని వాడయినా మిగిలిన మంత్రులకు ప్రియుడవుతాడు. ఈవిధమయిన అనుగ్రహానికి నేను అర్హుడనా ?

ఈ విధమయిన ప్రశ్నతో ఓపాండురంగా, నాకు భక్తి, తెలివితేటలూ కొరవగా ఉండి నాపరిస్థితి దయనీయంగా ఉన్నట్టు నేను తెలుసుకున్నాను. నామనస్సు ఎప్పుడూ అస్థిరంగా, అనుమానాలతో, కోరికలతో ఉంటుంది. ఇటువంటి వాటితో నేను మీఅనుగ్రహం ఎలా పొందగలను ?

తర్కం ప్రకారం ఇది నిజమే, కాని మీకు పాపులమీద నిజమయిన కోరిక ఉంది అని పురాణాలు చెపుతున్నాయి. మీరు ఉత్తములను ముక్తులను చెయ్యడంలో వింతలేదు, పాపులకు ముక్తి ఇవ్వడంలో మీ నిజమయిన గొప్పతనం ఉంది. ఈ ప్రపంచంలో మీకంటే గొప్పవారు ఎవరూ లేరు, కావున నాపాపాలను క్షమించి, నన్ను దీవించమని నేను మిమ్మల్నే వేడుకుంటున్నాను. ఓనారాయణా మీపాదాల దగ్గర చేరిన ఈదాసగణును స్వీకరించి మీయొక్క గొప్పతనం నిలబెట్టుకోండి.

ఖండేరావ్ పాటిల్ నాయకత్వం క్రింద, హనుమాన్ మందిరంలోని ఈ ఉత్సవాలలో గ్రామస్థులు చురుకుగా పాల్గొన్నారు. ఈపాటిల్ కుటుంబాలకి వారి పూర్వజుల ఆస్థిపాస్థులు ఉన్నాయి. యోగుల పైన, మునీశ్వరుల పైన వీరికి భక్తి ఆనవాయితీ. ఇప్పుడు గ్రామాధికారి కావడంతో ఇంకా ఉత్సాహంతో పూజించడం జరుగుతోంది.

మహద్జిపాటిల్కు కడత్జి మరియు కుకాజి అనే ఇద్దరు కుమారులు. చిన్నవాడయిన కుకాజి పండరిపూరు పాండురంగ యొక్క గొప్ప భక్తుడు. ఈకుటుంబానికి నాగ్టరివాసి అయిన శ్రీగోమాజి మహారాజు ఆశీర్వాదాలు ఉన్నాయి. కడత్జిపాటిల్ కు ఆరుగురు కుమారులుండగా, కుకాజికి పిల్లలులేరు. కడతజి మరణానంతరం ఆరుగురు పిల్లల్ని, కుకాజి తన స్వంత పిల్లల వలె పెద్దవాళ్ళను చేసాడు. అంతేకాక పూర్తి కుటుంబానికి మంచి అభివృద్ధి తెచ్చాడు.

కుకాజి తరువాత ఖండుపాటిల్ కుటుంబానికి పెద్ద వాడయ్యాడు. గ్రామస్తులకు ఇతనంటే భయం మరియు తన అధికారాన్ని నిర్భయంగా ఉపయోగించేవాడు. ఇతనికి గణపతి, నారాయణ, మారుతి, హరి మరియు కృష్ణాజి అనే 5 గురు సోదరులు. ఇతనికి దొరికిన గ్రామాధికారి హోదాతోసహా ఇతనికి చాలా ఆస్థి కూడా ఉంది. ఈ అన్నదమ్ములకు నిత్యవ్యాయామం మీద ఉత్సుకత ఉంది. వీరు కత్తి మరియు కర్ర సాములు చేసేవారు. హరిపాటిల్ మల్లయుద్ధం ఇష్టపడేవాడు.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

🌹 ŚŔĨ ĞĂĴĂŃĂŃ МĂĤĂŔĂĴ ĹĨŦĔ ĤĨŚŤŐŔŶ - 30 🌹

✍️. Swamy Dasaganu
📚. Prasad Bharadwaj

🌻 Chapter 7 - part 1 🌻

Chapter 7

Shri Ganeshayanamah! Jai to You Rama, Meghashyama, Sitapate, Dasharathe! You are the refuge to the saints. It was by Your blessings that the monkeys gained strength and defeated Ravana in Lanka. Your blessings always bring victory and fulfilment of desires.

A favorite of the King, howsoever incapable he may be, becomes lovable to the ministers. Am I suitable for such a favour? With this question, O Panduranga, I realise that my condition is most pitiable as I lack real knowledge and devotion.

My mind is always unsteady, suspicious and full of desires. With all this, how can I expect to get your favor? Logically, it seems right, but O God, even the Puranas say that you have got a genuine liking for the sinners. It is no wonder if you liberate the pious ones.

But real greatness lies in saving a sinner. Since there is nobody greater than you in this world, I invoke you to ignore my sins and bless me. O Narayana, accept this Dasganu who has surrendered at your feet and uphold your greatness.

Under the leadership of Khanderao Path, all the villagers actively participated in the function at Hanuman temple. These Patil people have an ancient heritage of wealth and landed property.

Devotion to saints and sages has been their family tradition and now with the authority as village head, this worshipping is done with greater enthusiasm. Mahadaji Patil had two sons, Kadtaji and Kukaji.

Kukaji, the younger was a great devotee of Pandurang of Pandharpur. The family had the blessings of Shri Gomaji Maharaj of Nagzari. Kadtaji Patil had six sons and Kukaji none.

After the death of Kadtaji Patil, Kukaji did the bringing up of these six children as his own, and also brought great prosperity to the family. After Kukaji, Khandu Patil became the head of the family. He was a terror to the village and used his authority fearlessly.

He had five brothers, Ganpat, Narayan, Maruti, Hari and Krishnaji. In addition to the authority of Patil, wielded by him, he possessed a lot of wealth too. All the brothers were fond of regular exercise, playing swords and sticks. Hari Patil liked wrestling.

Continues...
🌹 🌹 🌹 🌹 🌹

【 భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 20 】

🌹. భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 20 🌹

✍️. శ్రీ బాలగోపాల్
📚. ప్రసాద్ భరద్వాజ

🌻. భగవంతుని మొదటి పాత్ర - పరాత్పర - పరబ్రహ్మ - 20 🌻

73. పరాత్పర స్థితియొక్క అనంతత్వము, భగవంతుని పూర్తిగా సర్వస్వతంత్రుని చేసినది. అందుచేత సర్వస్వతంత్రుడైయున్న భగవంతుడు తన అనంత (లీల) విలాసమును సాధన పూర్వకముగా అనుభవించి ఆనందించుట సహజమే.

74. లీలను సాధన చేయుటయే స్వతంత్ర స్వభావమునకు చిహ్నము. ఎందుచేతననగా ఈ విలాసమే స్వతంత్ర స్వభావమునకు రంగును (సంస్కారమును) పూసినది.

75. సర్వమ్‌లో, అభావముగా అంతర్నిహితమైయున్నదంతయు,ఆవిర్భవించుటకుగల కారణమునకు ఆనంతమైన ఆదివిలాసమునదే బాధ్యత.

76. విలాసము అనగా విలాసమే గనుక, యీ భగవద్విలాసము యొక్క స్వభావమును బట్టి, అది ఎందుకు వచ్చినది ? ఎక్కడ వచ్చినది ? ఎప్పుడు వచ్చినది ? అని అనుకొనుటకు ఎక్కడను ఆస్కారము లేదు.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 133

🌹. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 133 🌹

✍️. రచన : సద్గురు ఇ. కృష్ణమాచార్యులు
📚 . సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🌻. శ్రీకష్ణావతారము 🌻

కృష్టావతార తత్త్వమున అనేక కళలున్నవి. శ్రీకృష్ణుడు పాండవులకు ఆదర్శపురుషుడు. ధర్మరాజునకు గురువు, దైవము, ద్రౌపదికి‌ రక్షకుడు. కుంతీ దేవికి దిక్కు. కౌరవులకు రాజకీయ విజ్ఞానవేత్త. రాజలోకము దృష్టిలో ఆదర్శ రాయబారి. అర్జునునకు దేహమునకు, ఆత్మకు సారధి. కాని తనకు తాను మాత్రము క్రీడాపరుడైన శిశువు.

కురు‌పాండవ‌ యుద్ధమును గాని, యాదవుల వినాశమును గాని వారించుటకు తనకు ప్రయోజనం లేదు. వారింపవలసిన మమకారము లేదు. తాను‌ కావలయును అని అనుకొన్నవారికి‌ కావలసినవాడు. జీవితమున సన్నివేశములను క్రీడగా నడిపి, దేహపరిత్యాగ క్రీడలో జగత్తునకు వెలుగుగా మైత్రేయునందు ప్రవేశించినవాడు.

....✍ మాస్టర్ ఇ.కె.🌻
🌹 🌹 🌹 🌹 🌹

శ్రీ లలితా సహస్ర నామములు - 69 / 𝓢𝓻𝓲 𝓛𝓪𝓵𝓲𝓽𝓪 𝓢𝓪𝓱𝓪𝓼𝓻𝓪𝓷𝓪𝓶𝓪𝓿𝓪𝓵𝓲 - 𝓜𝓮𝓪𝓷𝓲𝓷𝓰 - 69

🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 69 / 𝓢𝓻𝓲 𝓛𝓪𝓵𝓲𝓽𝓪 𝓢𝓪𝓱𝓪𝓼𝓻𝓪𝓷𝓪𝓶𝓪𝓿𝓪𝓵𝓲 - 𝓜𝓮𝓪𝓷𝓲𝓷𝓰 - 69 🌹
🌻. మంత్రము - అర్ధం 🌻
📚. ప్రసాద్ భరద్వాజ

శ్లోకం 131.

అష్టమూర్తి రజాజైత్రీ లోకయాత్రావిధాయినీ

ఏకాకినీ భూమరూపా నిర్ద్వైతా ద్వైత వర్జితా

662. అష్టమూర్తి: :
8 రూపములు కలిగినది (పంచేంద్రియాలు, చిత్తము, బుద్ధి,అహంకారము)

663. అజా :
పుట్టుకలేనిది

664. జైత్రీ :
సర్వమును జయించినది

665. లోకయాత్రావిధాయినీ :
లోకములను నియమించునది

666. ఏకాకినీ :
ఏకస్వరూపిణీ

667. భూమరూపా :
భూదేవిరూపము ధరించునది

668. నిర్ద్వైతా :
అద్వైతము కలిగినది (రెందవది అనునది లేకుండుట)

669. ద్వైత వర్జితా :
ద్వైతభావము లేనిది

శ్లోకం 132.

అన్నదా వసుదా వృద్ధా బ్రహ్మత్మైక్యస్వరూపిణీ

బృహతి బ్రాహ్మణీ బ్రాహ్మీ బ్రహ్మానందా బలిప్రియా

670. అన్నదా :
సర్వజీవులకు ఆహారము ఇచ్చునది

671. వసుదా :
సంపదలిచ్చునది

672. వృద్ధా :
ప్రాచీనమైనది

673. బ్రహ్మత్మైక్యస్వరుపినీ :
ఆత్మ, పరమాత్మల ఐక్యస్వరూపిణి

674. బృహతీ :
అన్నిటికన్న పెద్దది

675. బ్రాహ్మణీ :
బ్రహ్మఙ్ఞాన స్వరూపిణీ

676. బ్రాహ్మీ :
సరస్వతీ

677. బ్రహ్మానందా :
బ్రహ్మానందస్వరూపిణీ

678. బలిప్రియా :
బలి(త్యాగము) యందు ప్రీతి కలిగినది

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

🌹. Sri Lalita Sahasranamavali - Meaning - 69 🌹
📚. Prasad Bharadwaj

🌻 Sahasra Namavali - 69 🌻

662) Ashta moorthy -
She who has eight forms

663) Aja jethree -
She who has won over ignorance

664) Loka yathra vidahyini -
She who makes the world rotate(travel)

665) Ekakini -
She who is only herself and alone

666) Bhooma roopa -
She who is what we see , hear and understand

667) Nirdwaitha -
She who makes everything as one

668) Dwaitha varjitha -
She who is away from “more than one”

670) Vasudha -
She who gives wealth

669) Annadha -
She who gives food

671) Vriddha -
She who is old

672) Brhmatmykya swaroopini -
She who merges herself in brahma-the ultimate truth

673) Brihathi -
She who is big

674) Brahmani -
She who is the wife of easwara

675) Brahmi -
She who has one aspect of Brhma

676) Brahmananda -
She who is the ultimate happiness

677) Bali priya -
She who likes the strong

678) Bhasha roopa -
She who is personification of language

Continues...
🌹 🌹 🌹 🌹 🌹

నారద భక్తి సూత్రాలు - 7͓̽2͓̽

🌹. నారద భక్తి సూత్రాలు - 7͓̽2͓̽ 🌹

✍️. సద్గురు శ్రీ విజ్ఞాన స్వరూప్ కోసూరి మురళీకృష్ణ,
📚. ప్రసాద్ భరద్వాజ

🌻. చలాచలభోధ
తృతీయాధ్యాయము - సూత్రము - 41

🌻. 41... తస్మిన్‌ తజ్జనే భేదాభావాత్‌ ॥ - 3 🌻

సీ, తనయందు నఫీల భూతములందు నొక భంగి సమహితత్వంబున జరుగువాడు పెద్దల బొడగన్న భృత్యుని కైవడి జేరి నమస్కృతుల్‌ చేయువాడు

కన్ను దోయికి నన్యకాంతలడ్డంబైన
మాతృ భావము సేసి మరలువాడు
తలి దండ్రుల భంగి ధర్మ వత్సలతను
దీనుల గాన జింతించువాడు
తే. సఖుల యెడ సోదర స్థితి జరుపువాడు

దైెవతములంచు గురువుల దలచువాడు లీలలందును బొంకులు లేనివాడు లలిత మర్యాదుదైన ప్రహ్లాదు డధిప!

తా ప్రహ్లాదుడు సమస్త ప్రాణులు తనవంటివెనని, వాని యందు సమ దృష్టి కలిగి, ఉండెను. పెద్దల యెడల దాసుని వలె వినయశీలుడయ్యెను.

పరస్త్రీల యెడల మాతృభావం కలిగి, అడ్డు తొలగేవాడు. దీనులను తల్లిదండ్రులను చూచినట్లు చూచి, ధర్మ బుద్ధితో ఆదరించేవాడు. సాటి మిత్రులతో సోదరభావంతో మెలగేవాడు. గురువులను దైవ సమానులుగా జూచి, సేవించెవాడు. హాస్వానికైనా అబద్దాలాదెవాడు కాదు. ఈ ప్రహ్లాదుడు ఇటువంటి సత్వగుణ సంపన్నుడు. ఇట్టి ఉపాయం తప్పక భగవదనుగ్రహాన్ని ప్రాప్తింపజేస్తుంది.

ఎల్ల శరీరధారులకు నిల్లను చీంకటి నూతిలోపలం
ద్రైళ్ళక వీరు నే మను మతి భ్రమణంబున ఖిన్నులై ప్రవ
ర్తిలక సర్వము న్నతని దివ్య కళామయ మంచు విష్ణునం
దుల్లముం జేర్చి తా రడవి నుండుట మేలు నిశాచరాగ్రణీ ॥

-భాగవతం

ఈ విధంగా అద్వితీయ ఆత్మ భావనను బోధిస్తున్నాడు. సర్వమందున్న వాడు, దివ్య కళామయుడు అయిన విష్ణువు గురించి తెలియ జేస్తున్నాడు ఆ ప్రహ్లదుడు.

అజ్ఞల్‌ కొందరు మెము తామనుచు మాయంజెంది సర్వాత్మకుం
బ్రజ్ఞాల్బ దురన్వయ క్రమములన్‌ భాషింపగా నెర రా
జిజ్ఞానా పథమందు మూఢులుగదా చింతింప బ్రహ్మాది వే
దజ్ఞుల్‌ తత్పరమాత్ము విష్ణు నితరుల్‌ దర్శింపగా నేర్తురే ॥

-భాగవతం

భగవత్తత్తాన్ని కేవలం తెలివితో, వాదంతో తెలుసుకొనడం అసాధ్యం. అలాగైతే వేదవెత్తలైన బ్రహ్మాది దెవతలు ఆ పురుషోత్తముని గ్రహించె వారే కదా! కాని ఆ తత్త్వం దేవతలకు కూడా అందనిది.

ఇక రాక్షస స్వభావంగల వారెట్లు దర్శించగలరు? అయితే నావంటి భక్తుల చిత్తం కరిగి హృషికేశుని సన్నిధిలో కలుస్తున్నది. అంబుజోదర దివ్య పాదారవింద చింతనామృత వాన విశేషమత్తమైన భక్తునికి, భగవంతునికంటె అన్యత లెదు. అనన్యమెనని నిశ్చయం. ఈ విధంగా ప్రహ్లాదుడు తన తండ్రికి బోధించెను. ఇంకను ఇట్లు పలికెను.

కలడంబోధి గలండు గాలిన్‌ కల దాకాశంబునం గుంభినిం గలడగ్నిన్‌ దిశలం బగళ్ళ నిశలన్‌ ఖద్యోత చంద్రాత్మలం గలడోంకారమునం ద్రిమూర్తులం ద్రైలింగవ్యక్తులం దంతటం గల దీశుండు గలండు తండ్రీ ! వెదకంగా నేలయీ యా యొదన్‌

-భాగవతం

పాలింపుము శేముషి - నున్మూలింపుము కర్మ బంధముల సమదృష్టిన్‌ చాలింపుము సంసారము - కీలింపుము హృద యమందు కేశవ భక్తిన్‌ అని అద్భుతమైన సలహా ఇచ్చాడా ప్రహ్లాదుడు తన తండ్రికి.

సశేషం..
🌹 🌹 🌹 🌹 🌹

శివగీత - 38 / 🆃🅷🅴 🆂🅸🆅🅰-🅶🅸🆃🅰 - 38

Image may contain: 1 person
🌹.  శివగీత - 38 / 🆃🅷🅴 🆂🅸🆅🅰-🅶🅸🆃🅰 - 38  🌹
🌴. పరమేశ్వరుడు - శ్రీరాముడు మధ్య జరిగిన జ్ఞాన సంవాదము. 🌴

📚. ప్రసాద్ భరద్వాజ
షష్ట మాధ్యాయము

🌻. విభూతి యోగము - 2 🌻

మందరం ప్రయయు స్సర్వే - మమ ప్రియతరం గిరిమ్,
స్తుత్వా ప్రాంజల యో దేవా - మాం తదా పురత స్థ్సితాః 8

తాన్ద్రుష్ట్వాద మయా దేవాన్ - లీలా కులిత చేతసః,
తేషామ పహృతం జ్ఞానం - బ్రహ్మాదీనాం ది వౌకసామ్ 9

అసంస్తే సకృద జ్ఞానా - మామాహు: కో భవానితి,
అధా బ్రువ మహం దేవా - బ్రహ మేవ పురాతనః 10

ఆటకు వెళ్ళిన వారై బద్దాంజలు లై నన్ను గురించి స్తోత్రము చేయుచు, నా పర్వతము చేరువలో నిలిచిరి. అట్టి వారినే కనుగొని

లీలామాత్రమైన చిత్తముతో నేను బ్రహ్మాది దేవతల యొక్క ఇంగిత జ్ఞానము నపహరించితిని .

అప్పుడు వారు అజ్ఞానముతో నన్ను " నీ వెవ్వడవని " ప్రశ్నించితిరి. ఆ సందర్భమున నేను ఆ దేవతలతో " ఓయీ దేవతలారా! నేనే అనాది పురుషుడిని.

ఆసం ప్రధమ మేవాహం - వర్తామిచ సురేశ్వరాః,
భవిష్యామి చ లోకేస్మి - న్మత్తో నాన్యోస్తి కశ్చనః 11

వ్యతిరిక్తం చ మత్తోస్తి - నాన్య త్కింఛి త్సురేశ్వరాః,
నిత్యో నిత్యో హమనగో - బ్రహ్మణాం బ్రహ్మణ స్పతి: 12

దక్షిణాంచ ఉదంచో హం - ప్రాజ్ఞా ప్రత్యజ్ఞ ఏవచ,
అధశ్చ ర్ద్వం చ విదిశో - దిశశ్చాహం సురేశ్వరా 13

సావిత్రీ చాపి గాయత్రీ - స్త్రీ పుమాన పుమానపి,
తిష్టుప్ జగత్యను ష్టుప్చ- పజ్కిశ్చంద స్త్రయీ మయః 14

మరియును ఓయీ దేవతలారా! నేనే అతి ప్రాచీనుడిని ,నిత్యుడిని , అనిత్యుడిని ,పాప రహితుడను, బ్రహ్మణ స్పతిని, పది దిక్కులును నేనే , సావిత్రీ - గాయత్రీ స్త్రీ పున్న పుంసకములు నేనే . త్రిష్టుప్ -జగతి- అనుష్టుప్ - పంక్తీ చందంబులు నేనే.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

🌹 🆃🅷🅴 🆂🅸🆅🅰-🅶🅸🆃🅰 - 38 🌹
🌴. Dialogue between Rama and Lord Siva 🌴

✍️ Ayalasomayajula.
📚. Prasad Bharadwaj

Chapter 06 :
🌻 Vibhooti Yoga - 2
🌻

After assembling there, they stood near the mount Mandara with folded hands and sang hymns in my praise. Knowing their desire, out of playful mood i had stolen away their knowledge.

Then when I appeared, under the stupor of ignorance, they question me: "Who are you?". In that context I addressed them and said: O gods! I'm the AdiAnadiPurusha (oldest primordial being).

O deities! Know that in this entire universe, there is none other than me. I'm the nondual one.

I'm the ancient one. I'm the one who is eternal and I'm the noneternal too, I'm the one who is blemishless (sinless).

I'm the one called as Brahmanaspati. I'm all the directions. I'm savitri, I'm Gayatri. All these male, female and eunuchs also are me. I'm the Thrishtup, Jagati, Anushthup, Pankti chandas.

Continues...
🌹 🌹 🌹 🌹 🌹

21-August-2020 Messages

1) 🌹 శ్రీమద్భగవద్గీత - 465 / Bhagavad-Gita - 465🌹
2) 🌹 Sripada Srivallabha Charithamrutham - 253 🌹
3) 🌹. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 133🌹
4) 🌹 The Masters of Wisdom - The Journey Inside - 155 🌹
5) 🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 69 / Sri Lalita Sahasranamavali - Meaning - 69 🌹
6) 🌹. నారద భక్తి సూత్రాలు - 72 🌹
7) 🌹 Guru Geeta - Datta Vaakya - 41🌹
8) 🌹. శివగీత - 38 / The Shiva-Gita - 38 🌹
9) 🌹. సౌందర్య లహరి - 80 / Soundarya Lahari - 80🌹
10) 🌹. భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 20🌹
11) 🌹. శ్రీమద్భగవద్గీత - 379 / Bhagavad-Gita - 379🌹

12) 🌹. శివ మహా పురాణము - 203🌹
13) 🌹 AVATAR OF THE AGE MEHER BABA MANIFESTING - 79 🌹
14) 🌹.శ్రీ మదగ్ని మహాపురాణము - 74 🌹
15) 🌹. భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 90 🌹
16) 🌹 Twelve Stanzas From The Book Of Dzyan - 21🌹
17)🌹.శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి సంక్షిప్త జీవిత చరిత్ర - కాలజ్ఞానం - 39 🌹
18) 🌹. అద్భుత సృష్టి - 11 🌹
19) 🌹 Seeds Of Consciousness - 155🌹 
20) 🌹. కఠోపనిషత్ వివరణ - చలాచలభోధ - 33 🌹
21) 📚. గీతోపనిషత్తు - సాంఖ్య యోగము - 10 📚
22)

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీమద్భగవద్గీత - 465 / Bhagavad-Gita - 465 🌹*
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ

*🌴. 13వ అధ్యాయము - క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగం - ప్రకృతి, పురుషుడు, చైతన్యము - 05 🌴*

05. ఋషిభిర్బహుధా గీతం ఛన్దోభిర్వివిధై: పృథక్ |
బ్రహ్మసూత్రపదైశ్చైవ హేతుమద్భిర్వినిశ్చితై: ||

🌷. తాత్పర్యం : 
క్షేత్రము, క్షేత్రములను గూర్చిన ఆ జ్ఞానము పలువురు ఋషులచే వివిధ వేదగ్రంథములందు వర్ణింపబడినది. అట్టి జ్ఞానము విశేషముగా వేదాంతసూత్రములందు కార్యకారణములతో హేతుబద్ధముగా ప్రకటింపబడినది.

🌷. భాష్యము :
ఈ క్షేత్రక్షేత్రజ్ఞ జ్ఞానమును విశదీకరించుటలో దేవదేవుడైన శ్రీకృష్ణుడే వాస్తవమునకు అత్యున్నత ప్రామాణికుడై యున్నాడు. 

అయినను సామాన్య ఆచారము ప్రకారము విద్వాంసులు మరియు ప్రామాణికులైనవారు సర్వదా ఏ విషయమును గూర్చియైననను పూర్వపు ఆచార్యుల వచనములను నిదర్శనములుగా చూపుదురు గనుక ఇచ్చట శ్రీకృష్ణుడు ఆత్మ, పరమాత్మల అతి వివాదాస్పాదమైన ద్వైతాద్వైత విషయములను ప్రామాణికమైనవిగా అంగీకరించబడిన వేదాంతసూత్రములకు అన్వయించుచు వివరించుచున్నాడు. కనుకనే తొలుత అతడు “ఇది పలువురు ఋషుల అభిప్రాయము ననుసరించి యున్నది” యని పలికియుండెను. అట్టి ఋషులలో వేదాంతసూత్ర కర్తయైన వ్యాసదేవుడు గొప్ప ఋషి. 

ఆ వ్యాసదేవుని వేదాంతసూత్రములలో ద్వైతత్వము పూర్ణముగా విశదీకరింపబడినది. వ్యాసదేవుని జనకుడైన పరాశరముని సైతము గొప్ప ఋషి. ఆయన తన ధర్మగ్రంథములలో “అహం త్వం చ తథాన్యే.... “ యని రచించియుండెను. “అనగా నేను, నీవు, ఇతర జీవులనెడి మనమందరము భౌతికదేహముల యందున్నను వాస్తవమునకు దివ్యులమే. 

కాని ప్రస్తుతము మన వివిధకర్మల కారణముగా మనము వివిధ ప్రకృతిజన్యగుణములచే బంధితులమైనాము. తత్కారణముగా కొందరు ఉన్నతగుణ స్థితిలో, మరికొందరు అధమనైజములో నిలిచియున్నారు. కాని ఈ ఉన్నత, అధమ స్వభావములనునవి అజ్ఞానజనితములు. 

అవియే అసంఖ్యాక జీవరాసులుగా ప్రకటమగుచుండును. కాని చ్యుతి లేనటువంటి పరమాత్ముడు మాత్రము ప్రకృతిజన్య త్రిగుణములచే అపవిత్రుడు గాక దివ్యుడై యున్నాడు.” 
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Bhagavad-Gita as It is - 465 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj

*🌴 Chapter 13 - Kshetra Kshtrajna Vibhaga Yoga - Nature, the Enjoyer and Consciousness - 05 🌴*

05. ṛṣibhir bahudhā gītaṁ
chandobhir vividhaiḥ pṛthak
brahma-sūtra-padaiś caiva
hetumadbhir viniścitaiḥ

🌷 Translation : 
That knowledge of the field of activities and of the knower of activities is described by various sages in various Vedic writings. It is especially presented in Vedānta-sūtra with all reasoning as to cause and effect.

🌹 Purport :
The Supreme Personality of Godhead, Kṛṣṇa, is the highest authority in explaining this knowledge. Still, as a matter of course, learned scholars and standard authorities always give evidence from previous authorities. 

Kṛṣṇa is explaining this most controversial point regarding the duality and nonduality of the soul and the Supersoul by referring to a scripture, the Vedānta, which is accepted as authority. First He says, “This is according to different sages.” 

As far as the sages are concerned, besides Himself, Vyāsadeva (the author of the Vedānta-sūtra) is a great sage, and in the Vedānta-sūtra duality is perfectly explained. And Vyāsadeva’s father, Parāśara, is also a great sage, and he writes in his books of religiosity, aham tvaṁ ca tathānye.… “we – you, I and the various other living entities – are all transcendental, although in material bodies. Now we are fallen into the ways of the three modes of material nature according to our different karma. 

As such, some are on higher levels, and some are in the lower nature. The higher and lower natures exist due to ignorance and are being manifested in an infinite number of living entities. 

But the Supersoul, which is infallible, is uncontaminated by the three qualities of nature and is transcendental.” 
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹 Sripada Srivallabha Charithamrutham - 253 🌹*
✍️ Satya prasad
📚. Prasad Bharadwaj

Chapter 29
*🌴. Explanation of couples who did Agni pravesam - 3 🌴*

🌻 Explanation of Gothras - 2 🌻

 Trijatasa gothram belonging to Hayagreeva,   

 Valmeekasa gothram belonging to Valmika,   

 Tyteyasa gothram belonging to Pavithrapani,   

 Mareechasa gothram belonging to Mareecha,   

 Sowvarnasa gothram belonging to Bhodhayana,  
 
 Outhitsasa gothram belonging to Sabara Muni,  

  Kantheyasa gothram belonging to Kamyaka Rishi,   

 Saatyasa gothram belonging to Satyavratha,  

  Sanatkumarasa gothram belonging to Mahasena,   

 Koutsasa gothram belonging to Koutsa,   

 Vatukasa gothram belonging to Sthula Sirassu,   

 Soucheyasa gothram belonging to Krishna Dwaipayana,   

 Jambasudhanasa gothram belonging to Madhava,   

 Devarathasa gothram belonging to Devaratha,   

 Sharabhangasa gothram belonging to Sharabhanga,  

  Netrapadasa gothram belonging to Netrapada. In this gothram, Dhoumya is being called Netrapada Dhoumya in Netrapada Vamsam.   

 Grutsnamadasa gothram belonging to Vishnu Vruddha Muni,   

 Chakrapanisa gothram belonging to Chakrapani Muni,   

 Jeevanthisa gothram belonging to Bruhaspathi,   

 Vashishtasa gothram belonging to Vashishta,   

 Sounakasa gothram belonging to Thuryavratha,   

 Suvarnasa gothram belonging to Mousala Rishi,   

 Souvarnasa gothram belonging to Angeerasa Rishi,   

 Sanandanasa gothram belonging to Sanandana,   

 Utkrushtasa gothram belonging to Pundareeka,   

 Sukhlasa gothram belonging to Angeerasa,   

 Pundareekasa gothram belonging to Pundareeka,  

  Krishnasa gothram belonging to Krishna,   

 Tharanisa gothram belonging to Trijata,  

  Pallavasa gothram belonging to Pallava Muni,   

 Mousalasa gothram belonging to Chathushkarnu,   

 Acchayanasa gothram belonging to Aswalayana,  

  Sundarasa gothram belonging to Soundarya Muni,   

 Varunasa gothram belonging to Varuna,   

 Vasudevasa gothram belonging to Jabali,   

 Sharangavasa gothram belonging to Sharangarava,   

 Sutheekshanasa gothram belonging to Sutheekshana,  

  Soumyasa gothram belonging to Soumya,   

 Parasparayanasa gothram belonging to Poulasthya,   

 Kousikasa gothram belonging to Kousika,   

 Chaamaranasa gothram belonging to Prethamanaska,   

 Jabalasa gothram belonging to Sanatkumara Rishi,   

 Naradasa gothram belonging to Paavana Rishi,   

 Bruhavasrusa gothram belonging to Bruhadeesha Rishi,  

  Viswamithrasa gothram belonging to Viswamithra Rishi.   

My Dear! These are 102 gothras.

Sri Dharma Gupta said, ‘Victory to Mahaguru. There is no Labhadi gothram in the 102 gothras you said. If you add Labhadi gothra, it will be 103. Prabhu! Please clear my doubt. Sripada said, ‘Labhada Maharshi gothram has another name Dhanadakula gothram. There is one Kasyapasa gothram related to Labhadi Maharshi. In Prabhata gothra, not only Abhiramamba and Ramachandrarya couple, but also Kusumamba and Kusuma Shresti couple did ‘agni pravesam’. Dhanadakula gothram related to Labhada Maharshi is there. Kasyapasa gothram ended. So, there were 102 gothras.  
When the marriage takes place between Srivasavee Kanyakamba and Sri Nagareswar at the end of Kali Yuga, the gothra of Sri Vasavee Kanyakamba should be read as Prabhata gothram and that of Sri Nagareswara as Kasyapasa gothram. This is the subtle Dharma principle in this.  

As long as Sri Vasavee is treated as Kanyaka, Dhanadakula gothram should be taken in 102 gothras. At the end of Kali Yugam, Labhada Maharshi gothram should be known as Kasyapasa gothram. At the end of Kali Yugam, Dhanadakula gothram will end. 

Continues...
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 133 🌹*
✍️. రచన : సద్గురు ఇ. కృష్ణమాచార్యులు  
📚 . సేకరణ : ప్రసాద్ భరద్వాజ

 *🌻. శ్రీకష్ణావతారము 🌻*

కృష్టావతార తత్త్వమున అనేక కళలున్నవి. శ్రీకృష్ణుడు పాండవులకు ఆదర్శపురుషుడు. ధర్మరాజునకు గురువు, దైవము, ద్రౌపదికి‌ రక్షకుడు. కుంతీ దేవికి దిక్కు. కౌరవులకు రాజకీయ విజ్ఞానవేత్త. రాజలోకము దృష్టిలో ఆదర్శ రాయబారి. అర్జునునకు దేహమునకు, ఆత్మకు సారధి. కాని తనకు తాను మాత్రము క్రీడాపరుడైన శిశువు. 

కురు‌పాండవ‌ యుద్ధమును గాని, యాదవుల వినాశమును గాని వారించుటకు తనకు ప్రయోజనం లేదు. వారింపవలసిన మమకారము లేదు. తాను‌ కావలయును అని అనుకొన్నవారికి‌ కావలసినవాడు. జీవితమున సన్నివేశములను క్రీడగా నడిపి, దేహపరిత్యాగ క్రీడలో జగత్తునకు వెలుగుగా మైత్రేయునందు ప్రవేశించినవాడు. 
....✍ *మాస్టర్ ఇ.కె.*🌻
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹 The Masters of Wisdom - The Journey Inside - 153 🌹*
*🌴 Beyond Concepts - 3 🌴*
✍️ Master E. Krishnamacharya
📚 . Prasad Bharadwaj

*🌻 Living in Light 🌻*

Seen from above, the many concepts look like holes dug into the ground. If we are stuck in a concept we are like a frog in a well seeing from the hole his own sky and defining it that way. 

The sky, however remains unlimited. We look up and say, this is Sirius, Orion, the Great Bear. This, however, is only a fragmentary truth. Thus, knowledge can also lead to illusion.

 In the truth of existence all concepts of knowledge and of wisdom disappear. When we see the Light behind the mind, behind ideas and concepts, the agitations of the mind come to rest.

Therefore, we should not get stuck in our concepts about wisdom, like what we have learnt about the seven rays and astrology, about colours and sounds. 

Many who see themselves as spiritual have filled their heads with wisdom concepts and live in mental polarisations or emotional views. Yoga proposes freedom from all concepts, to live in the originality and simplicity which are human.

Spiritual concepts are a means to experience the Light. To live in Light, however, is more important than to live in concepts of light. When our thoughts and emotions become transparent and we live deep enough in the Light also the concepts expressing through us become magnetic. 

And the people then listening to us and assimilating the concepts will equally live beyond the concepts in the Light.

🌻 🌻 🌻 🌻 🌻 
Sources : Master K.P. Kumar: Uranus – The Alchemist of the Age / Saturn / notes from seminars.

Continues... 
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 69 / Sri Lalita Sahasranamavali - Meaning - 69 🌹*
🌻. మంత్రము - అర్ధం 🌻
📚. ప్రసాద్ భరద్వాజ

శ్లోకం 131. 
అష్టమూర్తి రజాజైత్రీ లోకయాత్రావిధాయినీ 
ఏకాకినీ భూమరూపా నిర్ద్వైతా ద్వైత వర్జితా 
 
662. అష్టమూర్తి: : 
8 రూపములు కలిగినది (పంచేంద్రియాలు, చిత్తము, బుద్ధి,అహంకారము) 

663. అజా : 
పుట్టుకలేనిది 

664. జైత్రీ : 
సర్వమును జయించినది 
665. లోకయాత్రావిధాయినీ :
 లోకములను నియమించునది 

666. ఏకాకినీ : 
ఏకస్వరూపిణీ 

667. భూమరూపా : 
భూదేవిరూపము ధరించునది 

668. నిర్ద్వైతా : 
అద్వైతము కలిగినది (రెందవది అనునది లేకుండుట) 

669. ద్వైత వర్జితా : 
ద్వైతభావము లేనిది  

శ్లోకం 132. 
అన్నదా వసుదా వృద్ధా బ్రహ్మత్మైక్యస్వరూపిణీ 
బృహతి బ్రాహ్మణీ బ్రాహ్మీ బ్రహ్మానందా బలిప్రియా 
 
670. అన్నదా : 
సర్వజీవులకు ఆహారము ఇచ్చునది 

671. వసుదా : 
సంపదలిచ్చునది 

672. వృద్ధా : 
ప్రాచీనమైనది 

673. బ్రహ్మత్మైక్యస్వరుపినీ : 
ఆత్మ, పరమాత్మల ఐక్యస్వరూపిణి 

674. బృహతీ : 
అన్నిటికన్న పెద్దది 

675. బ్రాహ్మణీ : 
బ్రహ్మఙ్ఞాన స్వరూపిణీ 

676. బ్రాహ్మీ : 
సరస్వతీ 

677. బ్రహ్మానందా :
 బ్రహ్మానందస్వరూపిణీ 

678. బలిప్రియా : 
బలి(త్యాగము) యందు ప్రీతి కలిగినది  

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

*🌹. Sri Lalita Sahasranamavali - Meaning - 69 🌹*
📚. Prasad Bharadwaj 

*🌻 Sahasra Namavali - 69 🌻*

662 ) Ashta moorthy -   
She who has eight forms

663 ) Aja jethree -   
She who has won over ignorance

664 ) Loka yathra vidahyini -   
She who makes the world rotate(travel)

665 ) Ekakini -   
She who is only herself and alone

666 ) Bhooma roopa -   
She who is what we see , hear and understand

667 ) Nirdwaitha -   
She who makes everything as one

668 ) Dwaitha varjitha -   
She who is away from “more than one”

670 ) Vasudha -   
She who gives wealth

669 ) Annadha -   
She who gives food

671 ) Vriddha -   
She who is old

672 ) Brhmatmykya swaroopini -   
She who merges herself in brahma-the ultimate truth

673 ) Brihathi -   
She who is big

674 ) Brahmani -   
She who is the wife of easwara

675 ) Brahmi -   
She who has one aspect of Brhma

676 ) Brahmananda -   
She who is the ultimate happiness

677 ) Bali priya -   
She who likes the strong

678 ) Bhasha roopa -   
She who is personification of language

Continues...
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. నారద భక్తి సూత్రాలు - 72 🌹* 
✍️. సద్గురు శ్రీ విజ్ఞాన స్వరూప్ కోసూరి మురళీకృష్ణ, 
*🌻. చలాచలభోధ*
📚. ప్రసాద్ భరద్వాజ 
 తృతీయాధ్యాయము - సూత్రము - 41

*🌻. 41... తస్మిన్‌ తజ్జనే భేదాభావాత్‌ ॥ - 3 🌻*

తనయందు నఫీల భూతములందు నొక భంగి సమహితత్వంబున జరుగువాడు పెద్దల బొడగన్న భృత్యుని కైవడి జేరి నమస్కృతుల్‌ చేయువాడు 
కన్ను దోయికి నన్యకాంతలడ్డంబైన 
మాతృ భావము సేసి మరలువాడు 
తలి దండ్రుల భంగి ధర్మ వత్సలతను 
దీనుల గాన జింతించువాడు
 
తే. సఖుల యెడ సోదర స్థితి జరుపువాడు 
దైెవతములంచు గురువుల దలచువాడు లీలలందును బొంకులు లేనివాడు లలిత మర్యాదుదైన ప్రహ్లాదు డధిప! 
 
తా: ప్రహ్లాదుడు సమస్త ప్రాణులు తనవంటివెనని, వాని యందు సమ దృష్టి కలిగి, ఉండెను. పెద్దల యెడల దాసుని వలె వినయశీలుడయ్యెను. 

పరస్త్రీల యెడల మాతృభావం కలిగి, అడ్డు తొలగేవాడు. దీనులను తల్లిదండ్రులను చూచినట్లు చూచి, ధర్మ బుద్ధితో ఆదరించేవాడు. సాటి మిత్రులతో సోదరభావంతో మెలగేవాడు. గురువులను దైవ సమానులుగా జూచి, సేవించెవాడు. హాస్వానికైనా అబద్ధాలాడే వాడు కాదు. ఈ ప్రహ్లాదుడు ఇటువంటి సత్వగుణ సంపన్నుడు. ఇట్టి ఉపాయం తప్పక భగవదనుగ్రహాన్ని ప్రాప్తింపజేస్తుంది. 
 
ఎల్ల శరీరధారులకు నిల్లను చీంకటి నూతిలోపలం 
ద్రైళ్ళక వీరు నే మను మతి భ్రమణంబున ఖిన్నులై ప్రవ 
ర్తిలక సర్వము న్నతని దివ్య కళామయ మంచు విష్ణునం 
దుల్లముం జేర్చి తా రడవి నుండుట మేలు నిశాచరాగ్రణీ ॥ 
-భాగవతం 
 
ఈ విధంగా అద్వితీయ ఆత్మ భావనను బోధిస్తున్నాడు. సర్వమందున్న వాడు, దివ్య కళామయుడు అయిన విష్ణువు గురించి తెలియ జేస్తున్నాడు ఆ ప్రహ్లదుడు.  
 
అజ్ఞల్‌ కొందరు మెము తామనుచు మాయంజెంది సర్వాత్మకుం 
బ్రజ్ఞాల్బ దురన్వయ క్రమములన్‌ భాషింపగా నెర రా 
జిజ్ఞానా పథమందు మూఢులుగదా చింతింప బ్రహ్మాది వే 
దజ్ఞుల్‌ తత్పరమాత్ము విష్ణు నితరుల్‌ దర్శింపగా నేర్తురే ॥ 
 
-భాగవతం 
 
భగవత్తత్తాన్ని కేవలం తెలివితో, వాదంతో తెలుసుకొనడం అసాధ్యం. అలాగైతే వేదవెత్తలైన బ్రహ్మాది దెవతలు ఆ పురుషోత్తముని గ్రహించె వారే కదా! కాని ఆ తత్త్వం దేవతలకు కూడా అందనిది. 

ఇక రాక్షస స్వభావంగల వారెట్లు దర్శించగలరు? అయితే నావంటి భక్తుల చిత్తం కరిగి హృషికేశుని సన్నిధిలో కలుస్తున్నది. అంబుజోదర దివ్య పాదారవింద చింతనామృత వాన విశేషమత్తమైన భక్తునికి, భగవంతునికంటె అన్యత లెదు. అనన్యమెనని నిశ్చయం. ఈ విధంగా ప్రహ్లాదుడు తన తండ్రికి బోధించెను. ఇంకను ఇట్లు పలికెను. 
 
కలడంబోధి గలండు గాలిన్‌ కల దాకాశంబునం గుంభినిం 
గలడగ్నిన్‌ దిశలం బగళ్ళ నిశలన్‌ ఖద్యోత చంద్రాత్మలం 
గలడోంకారమునం ద్రిమూర్తులం ద్రైలింగవ్యక్తులం దంతటం 
గల దీశుండు గలండు తండ్రీ ! వెదకంగా నేలయీ యా యొదన్‌ 
 
-భాగవతం 
పాలింపుము శేముషి - నున్మూలింపుము  
కర్మ బంధముల సమదృష్టిన్‌  
చాలింపుము సంసారము - కీలింపుము హృద యమందు కేశవ భక్తిన్‌ 
 
అని అద్భుతమైన సలహా ఇచ్చాడా ప్రహ్లాదుడు తన తండ్రికి. 

సశేషం..  
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹 Guru Geeta - Datta Vaakya - 41 🌹*
✍️ Sri GS Swami ji Datta Vaakya
📚. Prasad Bharadwaj

*🌻 Verse: Kena margena … “O Lord, how does man, who occupies a body, become one with God? - 2 🌻*

If the pains are felt by you, it means that you are experiencing them as your own pains. 

You are under the delusion that you are the body. Hence, the pains are experienced by you as your own pains. “Is there no way to identify myself with God? 

 Is this pain unavoidable? Is there no way out of this? Should I continue under this illusion that I am the body? Should I keep claiming this pain as mine? 

 Even if I do not intentionally say so, are you making me say it? Is there not a way to escape this? How to be rid of this illusion? Is there no way for me to regain my identification with the Supreme Soul?  

O Lord God, Please grant liberation to this being. I offer my prostrations at your feet. Please show mercy upon me.” Mother Goddess is offering prayers. 

Mother Goddess is here repeatedly praying to the Lord. Just like humans who keep asking Guru, “O Guru, you still have not given me.” “What do you want?” “I asked you the other day. You still have not given it to me.  

Please give it to me.” Mother Goddess is repeatedly falling at the Lord’s feet and is begging Him. Does it mean that the Lord has forgotten? No. He is not being reminded nor is he being subjected to demands. 

That is not what it means. That is the way to pray. Mother Goddess is here speaking as if she has also fallen into the delusion of identifying herself with the body. 

We may wonder why she is behaving like this. Has she also fallen into the delusion (Maya) that she is the body? It is not correct to think like that. 

Mother Goddess knows that it is only when she also behaves like the rest of us, that the Lord will disclose to us the secret in its entirety. By this we understand what immense compassion Mother Goddess has (towards us).

Continues...
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. శివగీత - 38 / The Siva-Gita - 38 🌹*
 *🌴. పరమేశ్వరుడు - శ్రీరాముడు మధ్య జరిగిన జ్ఞాన సంవాదము. 🌴*
📚. ప్రసాద్ భరద్వాజ

షష్ట మాధ్యాయము

*🌻. విభూతి యోగము - 2 🌻*

మందరం ప్రయయు స్సర్వే - మమ ప్రియతరం గిరిమ్,
స్తుత్వా ప్రాంజల యో దేవా - మాం తదా పురత స్థ్సితాః 8
తాన్ద్రుష్ట్వాద మయా దేవాన్ - లీలా కులిత చేతసః,
తేషామ పహృతం జ్ఞానం - బ్రహ్మాదీనాం ది వౌకసామ్ 9
అసంస్తే సకృద జ్ఞానా - మామాహు: కో భవానితి,
అధా బ్రువ మహం దేవా - బ్రహ మేవ పురాతనః 10

ఆటకు వెళ్ళిన వారై బద్దాంజలు లై నన్ను గురించి స్తోత్రము చేయుచు, నా పర్వతము చేరువలో నిలిచిరి. అట్టి వారినే కనుగొని
 లీలామాత్రమైన చిత్తముతో నేను బ్రహ్మాది దేవతల యొక్క ఇంగిత జ్ఞానము నపహరించితిని .

అప్పుడు వారు అజ్ఞానముతో నన్ను " నీ వెవ్వడవని " ప్రశ్నించితిరి. ఆ సందర్భమున నేను ఆ దేవతలతో " ఓయీ దేవతలారా! నేనే అనాది పురుషుడిని.

ఆసం ప్రధమ మేవాహం - వర్తామిచ సురేశ్వరాః,
భవిష్యామి చ లోకేస్మి - న్మత్తో నాన్యోస్తి కశ్చనః 11
వ్యతిరిక్తం చ మత్తోస్తి - నాన్య త్కింఛి త్సురేశ్వరాః,
నిత్యో నిత్యో హమనగో - బ్రహ్మణాం బ్రహ్మణ స్పతి: 12
దక్షిణాంచ ఉదంచో హం - ప్రాజ్ఞా ప్రత్యజ్ఞ ఏవచ,
అధశ్చ ర్ద్వం చ విదిశో - దిశశ్చాహం సురేశ్వరా 13
సావిత్రీ చాపి గాయత్రీ - స్త్రీ పుమాన పుమానపి,
తిష్టుప్ జగత్యను ష్టుప్చ- పజ్కిశ్చంద స్త్రయీ మయః 14

మరియును ఓయీ దేవతలారా! నేనే అతి ప్రాచీనుడిని ,నిత్యుడిని , అనిత్యుడిని ,పాప రహితుడను, బ్రహ్మణ స్పతిని, పది దిక్కులును నేనే , సావిత్రీ - గాయత్రీ స్త్రీ పున్న పుంసకములు నేనే . త్రిష్టుప్ -జగతి- అనుష్టుప్ - పంక్తీ చందంబులు నేనే. 

సశేషం... 
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 The Siva-Gita - 38 🌹*
*🌴. Dialogue between Rama and Lord Siva 🌴*
✍️ Ayalasomayajula. 
📚. Prasad Bharadwaj

Chapter 06 :
*🌻 Vibhooti Yoga - 2 🌻*

After assembling there, they stood near the mount Mandara with folded hands and sang hymns in my praise. Knowing their desire, out of playful mood i had stolen away their knowledge. 

Then when I appeared, under the stupor of ignorance, they question me: "Who are you?". In that context I addressed them and said: O gods! I'm the AdiAnadiPurusha (oldest primordial being).

O deities! Know that in this entire universe, there is none other than me. I'm the nondual one. 

I'm the ancient one. I'm the one who is eternal and I'm the noneternal too, I'm the one who is blemishless (sinless). 

I'm the one called as Brahmanaspati. I'm all the directions. I'm savitri, I'm Gayatri. All these male, female and eunuchs also are me. I'm the Thrishtup, Jagati, Anushthup, Pankti chandas.

Continues... 
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. శ్రీ గజానన్ మహరాజ్ జీవిత చరిత్ర - 30 / Sri Gajanan Maharaj Life History - 30 🌹*
✍️. దాసగణు స్వామి
📚. ప్రసాద్ భరద్వాజ

*🌻. 7వ అధ్యాయము - 1 🌻*

శ్రీగణేశాయనమః ! మీకుజై. రామా, మేఘశ్యామా, సీతాపతే, దశరధే నీవు యోగులకు శరణాగతుడవు. మీఆశీస్సులు వలన వానరులు బలంపొంది, లంకలో రావణుడిని ఓడించారు. నీ ఆశీస్సులతో ఎల్లప్పుడూ విజయము కలిగి, కోరికలు పరిపూర్ణం అవుతాయి. రాజుకు ప్రియమయిన మంత్రి ఎంత చేతకాని వాడయినా మిగిలిన మంత్రులకు ప్రియుడవుతాడు. ఈవిధమయిన అనుగ్రహానికి నేను అర్హుడనా ?

 ఈ విధమయిన ప్రశ్నతో ఓపాండురంగా, నాకు భక్తి, తెలివితేటలూ కొరవగా ఉండి నాపరిస్థితి దయనీయంగా ఉన్నట్టు నేను తెలుసుకున్నాను. నామనస్సు ఎప్పుడూ అస్థిరంగా, అనుమానాలతో, కోరికలతో ఉంటుంది. ఇటువంటి వాటితో నేను మీఅనుగ్రహం ఎలా పొందగలను ? 

తర్కం ప్రకారం ఇది నిజమే, కాని మీకు పాపులమీద నిజమయిన కోరిక ఉంది అని పురాణాలు చెపుతున్నాయి. మీరు ఉత్తములను ముక్తులను చెయ్యడంలో వింతలేదు, పాపులకు ముక్తి ఇవ్వడంలో మీ నిజమయిన గొప్పతనం ఉంది. ఈ ప్రపంచంలో మీకంటే గొప్పవారు ఎవరూ లేరు, కావున నాపాపాలను క్షమించి, నన్ను దీవించమని నేను మిమ్మల్నే వేడుకుంటున్నాను. ఓనారాయణా మీపాదాల దగ్గర చేరిన ఈదాసగణును స్వీకరించి మీయొక్క గొప్పతనం నిలబెట్టుకోండి. 

ఖండేరావ్ పాటిల్ నాయకత్వం క్రింద, హనుమాన్ మందిరంలోని ఈ ఉత్సవాలలో గ్రామస్థులు చురుకుగా పాల్గొన్నారు. ఈపాటిల్ కుటుంబాలకి వారి పూర్వజుల ఆస్థిపాస్థులు ఉన్నాయి. యోగుల పైన, మునీశ్వరుల పైన వీరికి భక్తి ఆనవాయితీ. ఇప్పుడు గ్రామాధికారి కావడంతో ఇంకా ఉత్సాహంతో పూజించడం జరుగుతోంది.

మహద్జిపాటిల్కు కడత్జి మరియు కుకాజి అనే ఇద్దరు కుమారులు. చిన్నవాడయిన కుకాజి పండరిపూరు పాండురంగ యొక్క గొప్ప భక్తుడు. ఈకుటుంబానికి నాగ్టరివాసి అయిన శ్రీగోమాజి మహారాజు ఆశీర్వాదాలు ఉన్నాయి. కడత్జిపాటిల్ కు ఆరుగురు కుమారులుండగా, కుకాజికి పిల్లలులేరు. కడతజి మరణానంతరం ఆరుగురు పిల్లల్ని, కుకాజి తన స్వంత పిల్లల వలె పెద్దవాళ్ళను చేసాడు. అంతేకాక పూర్తి కుటుంబానికి మంచి అభివృద్ధి తెచ్చాడు. 

కుకాజి తరువాత ఖండుపాటిల్ కుటుంబానికి పెద్ద వాడయ్యాడు. గ్రామస్తులకు ఇతనంటే భయం మరియు తన అధికారాన్ని నిర్భయంగా ఉపయోగించేవాడు. ఇతనికి గణపతి, నారాయణ, మారుతి, హరి మరియు కృష్ణాజి అనే 5 గురు సోదరులు. ఇతనికి దొరికిన గ్రామాధికారి హోదాతోసహా ఇతనికి చాలా ఆస్థి కూడా ఉంది. ఈ అన్నదమ్ములకు నిత్యవ్యాయామం మీద ఉత్సుకత ఉంది. వీరు కత్తి మరియు కర్ర సాములు చేసేవారు. హరిపాటిల్ మల్లయుద్ధం ఇష్టపడేవాడు. 

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Sri Gajanan Maharaj Life History - 30 🌹* 
✍️. Swamy Dasaganu 
📚. Prasad Bharadwaj

*🌻 Chapter 7 - part 1 🌻*

Chapter 7

Shri Ganeshayanamah! Jai to You Rama, Meghashyama, Sitapate, Dasharathe! You are the refuge to the saints. It was by Your blessings that the monkeys gained strength and defeated Ravana in Lanka. Your blessings always bring victory and fulfilment of desires. 

A favorite of the King, howsoever incapable he may be, becomes lovable to the ministers. Am I suitable for such a favour? With this question, O Panduranga, I realise that my condition is most pitiable as I lack real knowledge and devotion. 

My mind is always unsteady, suspicious and full of desires. With all this, how can I expect to get your favor? Logically, it seems right, but O God, even the Puranas say that you have got a genuine liking for the sinners. It is no wonder if you liberate the pious ones.

 But real greatness lies in saving a sinner. Since there is nobody greater than you in this world, I invoke you to ignore my sins and bless me. O Narayana, accept this Dasganu who has surrendered at your feet and uphold your greatness. 

Under the leadership of Khanderao Path, all the villagers actively participated in the function at Hanuman temple. These Patil people have an ancient heritage of wealth and landed property.

 Devotion to saints and sages has been their family tradition and now with the authority as village head, this worshipping is done with greater enthusiasm. Mahadaji Patil had two sons, Kadtaji and Kukaji. 

Kukaji, the younger was a great devotee of Pandurang of Pandharpur. The family had the blessings of Shri Gomaji Maharaj of Nagzari. Kadtaji Patil had six sons and Kukaji none. 

After the death of Kadtaji Patil, Kukaji did the bringing up of these six children as his own, and also brought great prosperity to the family. After Kukaji, Khandu Patil became the head of the family. He was a terror to the village and used his authority fearlessly. 

He had five brothers, Ganpat, Narayan, Maruti, Hari and Krishnaji. In addition to the authority of Patil, wielded by him, he possessed a lot of wealth too. All the brothers were fond of regular exercise, playing swords and sticks. Hari Patil liked wrestling.

Continues...
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 20 🌹*
✍️. శ్రీ బాలగోపాల్
📚. ప్రసాద్ భరద్వాజ 

*🌻. భగవంతుని మొదటి పాత్ర - పరాత్పర - పరబ్రహ్మ - 20 🌻*

73. పరాత్పర స్థితియొక్క అనంతత్వము, భగవంతుని పూర్తిగా సర్వస్వతంత్రుని చేసినది. అందుచేత సర్వస్వతంత్రుడైయున్న భగవంతుడు తన అనంత (లీల) విలాసమును సాధన పూర్వకముగా అనుభవించి ఆనందించుట సహజమే.

74. లీలను సాధన చేయుటయే స్వతంత్ర స్వభావమునకు చిహ్నము. ఎందుచేతననగా ఈ విలాసమే స్వతంత్ర స్వభావమునకు రంగును (సంస్కారమును) పూసినది.

75. సర్వమ్‌లో, అభావముగా అంతర్నిహితమైయున్నదంతయు,ఆవిర్భవించుటకుగల కారణమునకు ఆనంతమైన ఆదివిలాసమునదే బాధ్యత.

76. విలాసము అనగా విలాసమే గనుక, యీ భగవద్విలాసము యొక్క స్వభావమును బట్టి, అది ఎందుకు వచ్చినది ? ఎక్కడ వచ్చినది ? ఎప్పుడు వచ్చినది ? అని అనుకొనుటకు ఎక్కడను ఆస్కారము లేదు.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. సౌందర్య లహరి - 80 / Soundarya Lahari - 80 🌹*
📚. ప్రసాద్ భరద్వాజ 

80 వ శ్లోకము

*🌴. ఇంద్రజాల విద్యల యందు నైపుణ్యము, గొప్పదైన ఆరోగ్యము 🌴*

శ్లో: 80. కుచౌ సద్యస్స్విద్య త్తటఘటిత కూర్పాసభిదురౌ 
కషన్తౌ దోర్మూలేకనక కలశాభౌ కలయతా 
తవ త్రాతుం భజ్గాదలమితి వలగ్నం తనుభువా 
త్రిధా నద్దం దేవి త్రివళిలవలీవల్లిభిరవ ll 
 
🌷. తాత్పర్యం : 
అమ్మా! ఎప్పటికప్పుడు చెమటలు పట్టుచున్న పార్శ్వములు అంటుకొని పిగుల్చుటకు సిద్ధముగా ఉన్నవినూ,బాహు మూలములను ఒరుసుచున్నవియునూ సువర్ణ కుంభ కాంతి కలిగినట్టివినూ అయిన కుచములను నిర్మించుచున్న మన్మధుడు వీని బరువు వలన నడుమునకు భంగము కలుగకుండా మూడు ఏలకీ లతలచే మూడు ముడతలు గా చుట్టబడినదిగా యున్నది .కదా! 

🌻. జప విధానం - నైవేద్యం:-
ఈ శ్లోకమును 1000 సార్లు ప్రతి రోజు 45 రోజులు జపం చేస్తూ, తేనె నివేదించినచో ఇంద్రజాల విద్యల యందు నైపుణ్యం, గొప్పదైన ఆరోగ్యము లభించును అని చెప్పబడింది
🌹 🌹 🌹 🌹 🌹 

*🌹 Soundarya Lahari - 80 🌹*
📚 Prasad Bharadwaj 

SLOKA - 80

*🌴 Getting Remarkable Beauty and Becoming Expert in Magic 🌴*

80. Kuchou sadhya swidhya-sthata-ghatitha koorpasabhidurou Kasnthou dhormule kanaka kalasabhou kalayatha Thava thrathum bhangadhalamithi valagnam thanubhava Thridha naddham devi trivali lavalovalli bhiriva 
 
🌻 Translation :
Oh goddess mine,placed just below your shoulders,by cupid, the god of love,tearing your blouse which is attached,to your body by the sweat,when you think of the greatness of your lord,and resembling pots of gold,your breasts appear to be tied by him,securely three times,by the three creeper like folds.

🌻 Chanting procedure and Nivedhyam (offerings to the Lord) :  
If one chants this verse 1000 times a day for 45 days, offering honey as prasadam, it is believed that they will become expert in magic and get Great Health 
 
🌻 BENEFICIAL RESULTS: 
Attainment of magical powers, success in betting, handsome personality. 
 
🌻 Literal Results: 
Rejuvenation, great health.
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

🌹. శ్రీమద్భగవద్గీత - 379 / Bhagavad-Gita - 379 🌹
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 10వ అధ్యాయము - భగవద్విభూతియోగం - 29 🌴

29. అనన్తశ్చాస్మి నాగానాం వరుణో యాదసామహమ్ |
పితౄణామర్యమా చాస్మి యమ: సంయమతామహమ్ ||

🌷. తాత్పర్యం :
నేను పెక్కుపడగలు గల నాగులలో అనంతుడను, జలవాసులలో వరుణదేవుడను, పితృదేవతలలో అర్యముడను, ధర్మనిర్వాహకులలో మృత్యుదేవతయైన యముడను అయి యున్నాను. 

🌻. భాష్యము : 
జలవాసులలో వరుణదేవుడు ఘనుడైనట్లుగా పెక్కుపడగలు గల నాగులలో అనంతుడు ఘనుడైనట్టివాడు. వారిరువురును శ్రీకృష్ణుని ప్రతినిధులు. ఆర్యముడు అధిపతిగా గల పితృలోకమొకటి కలదు. అతడు శ్రీకృష్ణునికి ప్రాతినిధ్యము వహించును. దుష్కృతులైనవారిని దండించుటకు గల పెక్కుమందిలో యమధర్మరాజు ముఖ్యుడు. ఈ భూలోకమునకు చేరువలోగల లోకమునందే అతడు నిలిచియుండును. మరణానంతరము పాపులు అచ్చటకు గొనిపోబడగా అతడు వారికి వివిధరకములైన శిక్షలు విధించుచుండును.
🌹 🌹 🌹 🌹 🌹

🌹 Bhagavad-Gita as It is - 379 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj

🌴 Chapter 10 - Vibhuti Yoga - 29 🌴

29. anantaś cāsmi nāgānāṁ
varuṇo yādasām aham
pitṝṇām aryamā cāsmi
yamaḥ saṁyamatām aham

🌷 Translation : 
Of the many-hooded Nāgas I am Ananta, and among the aquatics I am the demigod Varuṇa. Of departed ancestors I am Aryamā, and among the dispensers of law I am Yama, the lord of death.

🌹 Purport : 
Among the many-hooded Nāga serpents, Ananta is the greatest, as is the demigod Varuṇa among the aquatics. They both represent Kṛṣṇa. 

There is also a planet of Pitās, ancestors, presided over by Aryamā, who represents Kṛṣṇa. There are many living entities who give punishment to the miscreants, and among them Yama is the chief. 

Yama is situated in a planet near this earthly planet. After death those who are very sinful are taken there, and Yama arranges different kinds of punishments for them.
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 . శ్రీ శివ మహా పురాణము - 203 🌹* 
రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ

*🌴. రుద్ర సంహితా - సృష్టిఖండః 🌴* 
45. అధ్యాయము - 20

*🌻. శివుడు కైలాసమునకు వెళ్లుట - 2 🌻*

విష్టంభోsష్టాభిరగమదఎ్టాభిశ్చంద్రతాపనః |మహాకేశస్సహస్రేణ కోటీనాం గణపో వృతః || 15

కుండీ ద్వాదశభి ర్వాహస్తథా పర్వతకశ్శుభః | కాలశ్చ కాలకశ్చైవ మహాకాలశ్శతేన వై || 16

అగ్ని కశ్శతకోట్యావై కోట్యా భిముఖ ఏవ చ | ఆదిత్య మూర్ధా కోట్యా చ తథ చైవ ధనావహః || 17

సన్నాహశ్చ శతేనైవ కుముదః కోటిభిస్తథా | అమోఘః కోకిలశ్చైవ కోటి కోట్యా సుమంత్రకః || 18

కాకపాదోsపరష్షష్ట్యా షఎ్టా్య సంతానకః ప్రభుః | మహాబలశ్చ నవభిర్మధుబపింగశ్చ పింగలః || 19

విష్టంభుడు ఎనిమిది, చంద్ర తాపనుడు ఎనిమిది, మహాకేశుడనే గణపతి వేయి (15), 

కుండి, వాహుడు, శుభకరుడగు పర్వతకుడు, కాలుడు, కాలకుడు అనువారు ఒక్కొక్కరు పన్నెండు, మహాకాలుడు వంద (16),

 అగ్నికుడు వంద, అభిముఖుడు, ఆదిత్యమూర్దుడు, ధనావహుడు ఒక్కొక్కటి (17), 

సన్నాహుడు వంద, కుముదుడు వంద, అమోఘుడు, కోకిలుడు, సుమంత్రకుడు ఒక్కొక్కటి (18), 

కాకపాదుడను వాడు అరవై, సంతానకుడను గణపతి అరవై, మహాబలుడు, మధుపింగుడు, పింగలుడు ఒక్కొక్కరు తొమ్మిది కోట్ల గణములతో వచ్చిరి (19).

నీలో నవత్యా దేవేశం పూర్ణ భద్రస్తథైవ చ | కోటీనాం చైవ సప్తానాం చతుర్వక్త్రో మహాబలః || 20

కోటికోటి సహస్రాణాం శతైర్వింశతిభిర్వృతః | తత్రాజగామ సర్వేశః కైలాసగమనాయ వై || 21

కాష్ఠాగూఢశ్చ తుష్షఎ్టా్య సుకేశో వృషభస్తథా | కోటి భిస్సస్తభిశ్చైత్రో నకులీశస్స్వయం ప్రభుః || 22

లోకాంతకశ్చ దీప్తాత్మా తథా దైత్యాంతకః ప్రభుః | దేవో భృంగీ రిటిశ్ర్శీమాన్‌ దేవదేవప్రియస్తథా || 23

అశనిర్భానుకశ్చైవ చతుష్షఎ్టా్య సనాతనః | నందీశ్వరో గణాధీశశ్శత కోట్యా మహాబలః || 24

నీలుడు తొంభై, పూర్ణ భద్రుడుకూడ తొంభై, మహాబలశాలియగు చతుర్వక్త్రుడు ఏడు కోట్ల గణములతో శివుని వద్దకు వచ్చిరి (20). 

సర్వేశ్వరుడగు శివుడు కైలాసమునకు వెళ్లుటకై ఇరువది వందల కోటి కోట్ల గణములతో కూడి బయలుదేరెను (21).

కాష్ఠాగూఢుడు, సుకేశుడు, వృషభుడు ఒక్కొక్కరు అరవై నాలగు, చైత్రుడు, నకులీశుడు (22), 

లోకాంతకుడు, దీప్తాత్మ, దైత్యాంతకుడు, భృంగి దేవుడు, శివునకు అతి ప్రియుడగు శ్రీమాన్‌ రిటి (23), 

అశని, భానుకుడు ఒక్కొక్కరు ఏడు, సనాతనుడు అరవై నాలుగు, మహాబలుడగు నందీశ్వరుడనే గణపతి వంద కోట్ల గణములతో విచ్చేసిరి (24).

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹 AVATAR OF THE AGE MEHER BABA MANIFESTING - 79 🌹*
Chapter 22
✍️ Bhau Kalchuri
📚 . Prasad Bharadwaj

*🌻 Imprisonment - 2 🌻*

The duty of the Avatar is to reveal the reason for everything. This is the divine law of Knowledge. Therefore, being all-knowing, he is bound by his divine law to give a reason for why we exist, and a reason for each individual's existence. But he cannot reveal the reason until, in the end, he frees one from the bondage of illusion. 

Illusion imprisons each of us, and only a few know that they are in the prison of illusion. Each one's reason for being imprisoned becomes clear after eternal freedom is gained; therefore it is necessary first to realize and experience that one is imprisoned by illusion.

An ordinary man of the world, though free, cannot enjoy freedom, because he does not know what freedom means. But, if the same man is arrested and placed in a concentration camp, he suffers because his freedom has been taken away. 

When the man has been released from the concentration camp, he realizes what freedom is, and then he enjoys his freedom even more. Very few people, however, are aware that this very world is a prison of illusion. When the Avatar works for the world, he gives a push in consciousness to every person. 

This push makes individuals aware that the world they are in is the prison of illusion, and the Avatar works out the ways to set individuals free from the gross world, the subtle world and the mental world. When individuals escape from one world to a higher world, or into Reality, it is because of the work already done by the Avatar. 

At that time the divinity of the Avatar is manifesting at every level of human consciousness and the prison walls of the three worlds of illusion are beginning to crumble.
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 74 🌹*
✍️. శ్రీ పుల్లెల శ్రీరామచంద్రుడు
ప్రథమ సంపుటము, అధ్యాయము - 30
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

*🌻. అధ మండల విధి - 3 🌻*

అరకాన్పీతరక్తాభిః శ్యామన్నే మిం తు రక్తతః | సితశ్యామారుణాః కృష్ణాః పీతా రేఖాస్తు బాహ్యతః. 18

శాలిపిష్టాది శుక్లం స్యాద్రక్తం కౌసుంభకాదికమ్‌ | హరిద్రయా చ హారిద్రం కృష్ణం స్యాద్దగ్ధధాన్యతః. 19

శమీపత్రాదికైః శ్యామం బీజానాం లక్షమప్యతః | చతుర్లక్షస్తు మన్త్రాణాం విద్యానాం లక్షసాధనమ్‌. 20

అయుతం బుద్ధవాద్యానాం స్తోత్రాణాం చ సహస్రకమ్‌ | పూర్వమేవాథ లక్షేణ మన్త్రశుద్తిస్తథాత్మనః. 21

తథాపరేణ లక్షేణ మన్త్రః క్షేత్రీకృతో భవేత్‌ | పూర్వసేవాసమో హోమో బీజానాం సంప్రకీర్తితః. 22

పూర్వసేవాదశాంశేన మన్త్రాదీనాం ప్రకీర్తితా | పురశ్చరణమన్త్రే తు మాసికం వ్రతమాచరేత్‌. 23

భువి న్యసేద్వామపాదం న గృహ్ణీయాత్ర్పతిగ్రహమ్‌ | ఏవం ద్విత్రిగుణన్తెవ మధ్యమోత్తమసిద్ధయః. 24

మన్త్రధ్యానం ప్రవక్ష్యామి యేన స్యాన్మన్త్రజంఫలమ్‌ |
స్థూలం శబ్దమయం రూపం విగ్రహం బాహ్యమిష్యతే. 25

సూక్ష్మం జ్యోతిర్మయం రూపం హార్దం చిన్తామయం భవేత్‌ |

చిన్తయా రహితం యత్తు తత్పరం పరికీర్తితమ్‌. 26

వారాహసింహశక్తీ నాం స్థూలరూపం ప్రధానతః | చిన్తయా రహితం రూపం వాసుదేవస్య కీర్తితమ్‌. 27

చక్రకమలము ఆకులకు పసుపు-ఎరుపు రంగులు వేయవలెను. చక్రము అంచును నీలము-ఎరుపు రంగులు వేసి అలంకరింపవలెను. బైట నున్న రేఖలకు తెలుపు, శ్యామము, ఎరుపు, నలుపు, పసుపు రంగులు వేయవలెను. 

వరిపిండి మొదలగువాటిని తెలుపురంగునకు ఉపమోగించవచ్చును. కుసుంధచూర్ణాదులు ఎరుపురంగునకును, పసుపు పసుపురంగునకును, మాడ్చిన బియ్యపు పిండు నల్లరంగునకును ఉపయోగించును. శమీపత్రాదులచే శ్యామవర్ణము వేయవచ్చును. 

బీజమంత్రములను ఒక లక్ష జపించుటచేతను, ఇతరమంత్రములను అక్షరలక్షలు జపించుటచేతను, విద్యలను ఒక లక్షజపించుటచేతను, బుద్ధవిద్యలను పదివేల సార్లు జపముచేయుటచేతను స్తోత్రములను వేయి పర్యాయములు జపించుటచేతను, లేదా అన్ని మంత్రములను మొదట ఒక లక్ష జపించుటచేతను, మంత్రశుద్ధియు, ఆత్మశుద్ధియు కూడ కల్గును. 

రెండవ పర్యాయము ఒక లక్ష జపించుటచే మంత్రము క్షేత్రీకృత మగును (సాధకునకు దానిపై నిలకడ ఏర్పడును). బీజమంత్రజపము మొదట ఎంత సంఖ్యలో చేయబడునో హోమము కూడ అంత సంఖ్యలోనే చేయవలెను. ఇతరమంత్రముల విషయమున హోమము జపసంఖ్యలో పదవ వంతు చేయవలెను. 

మంత్రపురశ్చరణము చేయ సంకల్పించినప్పుడు ఒక్కొక్క మాసము వ్రతము ఆవలంబింపవలెను. నేలపై మొదట ఎడమ కాలు ఉంచవలెను. దానము పట్టగూడదు. ఈ రెండు రెట్లు-మూడురెట్లు జపము చేసిననే మధ్యమ-ఉత్తమశ్రేణికి చెందిన ఫలముల లభించును.

ఇపుడు మంత్రమువలన ఫలము సిద్ధించుటకై ఉపమోగించు మంత్రధ్యానమును చెప్పెదను - మంత్రముయొక్క స్థూలరూపము శబ్దము. ఇది దాని బాహ్యరూపము. 

మంత్రముయొక్క సూక్ష్మరూపము జ్యోతిర్మయ మైనది. ఇదే దాని ఆంతరరూపము. ఇది కేవలము చింతనామయ మైనది. చింతనమునకు కూడు అతీతమైనది మంత్రముయొక్క పరరూపము.

 వరాహ-నరసింహ-శక్తిమంత్రముల స్థూలరూపమునకే ప్రాధాన్యము. వాసుదేవుని రూపము చిన్తనరహిత మని చెప్పబడినది.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 90 🌹*
🌷. సద్గురు శివానంద 🌷
📚. ప్రసాద్ భరద్వాజ

*🌻. పరాశర మహర్షి - 9 🌻*

50. భగవంతుణ్ణి ఆర్యుడు ఆరాధించేటప్పుడు – ఆరాధ్యవస్తువుగా భగవంతుణ్ణి మాత్రమే ఎందుకు గుర్తించాడంటే, నాలుగో పురుషార్థమయిన మోక్షాన్ని కేవలం పరమేశ్వరుడే ఇవ్వగలడనే నమ్మకంవలన! అందువల్లనే ఈశ్వరుడు పరమపూజ్యుడయ్యాడు. 

51. అటువంటి నివృత్తి, మోక్షము బ్రహ్మదేవుడివ్వటంలేదు. దానికేదో శాపాలు అవీ కల్పించబడ్డాయి పురాణాలలో. కాని యథార్థంగా బ్రహ్మయొక్క లక్షణమే ఇది. గాధలు ఎవరైనా కల్పించవచ్చు. బ్రహ్మయొక్క ప్రవృత్తి సృష్టిచేయటమే! అదే ఆయన కార్యం. సృష్టిలో పంచభూతములలో దేహాత్మభావనతో జీవుడు ఉండడమనేది బ్రహమ ఉద్దేశ్యం. సత్కర్మలాచరించి, ఇక్కడ సుఖాలున్నాయి, అక్కడ స్వర్గముంది, ఇక్కడ నరకముంది – జాగ్రత్తగా ఉండమని తెలుపుతుంది బ్రహ్మయొక్క ఈ ప్రవృత్తి మార్గం. మోక్షవిషయం దాని తరువాతిది.

52. ఈ యజ్ఞాదిక్రతువులన్నీకూడా బ్రహ్మముఖము నుంచీ వచ్చి, వేదములు ప్రతిపాదించినటువంటి త్రిగుణములతో కూడినటువంటివి. కర్మలు జ్ఞాన స్వరూపములుకావు. సుగునాత్మకమైన వేదములచేత ప్రతిపాదించబడినవి! వేదకర్మలెప్పుడూ కోరికలకు ఫలములు ఇచ్చేవే. ఎవడైనా కేవలం జ్ఞానం కోసమే వీటిని ఆచరిస్తున్నాడనేది నిజం కాదు.

53. శంకరులు చెప్పిన శ్రుతివాక్యములు, ఉపనిషద్వాక్యములు ఎక్కువగా ఉన్నాయి. శృతులలోంచి కొన్నివాక్యములు, బ్రాహ్మణములలోంచి కొన్ని వాక్యములను ఆయన తీసుకున్నారు.

54. ‘కర్మబ్రహ్మస్వరూపిణే’ అంటూ అగ్నిహోత్రుడికి రోజూ నమస్కారం చేస్తున్నాం కదా! బ్రహ్మ కర్మస్వరూపుడు అంటే, కార్యబ్రహ్మస్వరూపుడు అని అర్థం చెప్పుకోవచ్చు. ‘కర్మలో నిర్గుణమయిన బ్రహ్మస్వరూపుడని కాదు’. ‘కార్యబ్రహ్మలోంచీ వచ్చిన వేదసమ్మితమైనటువంటి కర్మస్వరూపుడివి – అగ్నిహోత్రుడివి నీవు – నీకు నమస్కారం. నాకు ఐశ్వర్యం ఇయ్యి. ఆరోగ్యం ఇయ్యి’ అని ప్రార్థిస్తాం. 

55. అంటే నిర్గుణమైన బ్రహ్మవస్తువైతే, ఇవన్నీ ఎలా అడుగుతాము? వైదికకర్మలన్నీ సగుణమైనవే. మన ప్రార్థన అంతా లౌకికమే! యజ్ఞమూ లౌకికమే! జ్ఞానంకోసం కాదు. ‘నిస్త్రైగుణ్యో భవార్జున!’ అని భగవద్గీతలో కృష్ణపరమాత్మ అన్నమాటలకు – త్రిగుణములకూ అతీతుడవుకమ్మనే అర్థం.

సశేషం... 
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 Twelve Stanzas from the Book of Dzyan - 21 🌹*
*🌴 The Prophetic Record of Human Destiny and Evolution 🌴* 

STANZA V
*🌻 The Persecution of Love - 3 🌻*

39. It was as though drops of hot tears were falling on the unyielding surface of a stone. The stone was helpless in the face of that steady tap-tap-tapping. It was knocking at the door of its soul, demanding that it open itself to the whole world. The world waited. The stone was silent. 

But the drop proved to be stronger, and washed away all soulless barriers with which the darkness had attempted to smother the stone’s ever so delicate nature. Now it was free and open to all. And the New World believed in it... 

40. The Sons of God finally caught their breath and let out a quiet sigh: the scale-pan of evil was becoming noticeably lighter. 

They breathed out a new stream of fresh Fires in response to the Call of the Hearts that reached them from the bowels of Earth. Plunged into darkness, the planet resembled the night sky, for she was all a-twinkling with little sparks of stars — these glowed in the Hearts of those who had preserved the Fire safe from the malicious claws of forces that would extinguish it. 

The Sons of God were reaching out with stellar silver threads towards the Hearts of the Light-Bearers, turning them into immortal carriers of Divine Currents. Such people were able to love and to know what Love is.

Continues...
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹.శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి సంక్షిప్త జీవిత చరిత్ర - కాలజ్ఞానం - 39 🌹* 
 📚. ప్రసాద్ భరద్వాజ

*🌻. శ్రీ స్వామి వారు కడప నవాబుకు కాలజ్ఞాన బోధ చేయుట - 4 🌻*

హరిద్వారంలోని మఱ్ఱి చెట్టుపై మహిమలు పుడతాయి. అక్కడి దేవాలయం వాకిలి మూసి వుంటుంది.

అహోబిలంలో ఉక్కు స్తంభానికి కొమ్మలు పుట్టి జాజిపువ్వులు పూస్తాయి.

నా రాకకు ఇవే మీకు నిదర్శనాలు. నన్ను నమ్మిన వారికి నా రక్షణ కలుగుతుంది.

వైశాఖ శుద్ధ పంచమిన నేను బయలుదేరి సూర్య మండలం నుండి కొలువుపాకకు వస్తాను. అక్కడి నుండి అహోబిలము, తర్వాత సూర్యనంది చేరుకుంటాను.

శ్రీకృష్ణ నిర్యాణం ఆదిగా 4999నాటికి కలిరూపం కొంత నాశనమవుతుంది.

కలికి అవతారం కలియుగాంతాన వస్తుంది. పూర్వులు గ్రంథములలో కలియుగము, కలికి అవతారం వివరించారు వ్యాసభగవానుడు. శాంతి పర్వం చివరన ఈ అవతారం గూర్చి చెప్పారు.

శ్రీశైలాన పొగ మంటలు పుడతాయి. బసవడు నాట్యమాడ 'గణగణ ' మువ్వల మోత వినబడుతుంది.

భ్రమరాంబ దేవాలయంలో ఒక మొసలి 7రోజులపాటు కనిపించి, ఆపైన అదృశ్యమవుతుంది.

భ్రమరాంబ మెడలోని మంగళసూత్రం తెగిపడిపోతుంది. ఆమె కంట నీరు కారుతుంది. స్తనాలనుంచి పాలు కారతాయి.

కందనూరి గోపాలుని గుడి ముందు చింతచెట్టు పుడుతుంది. మహానందిలో ఈశ్వరుని విగ్రహం కదులుతుంది. దేవాలయమున రెండు పాములు తిరుగుతాయి. వాటిల్లో పెద్ద పాము శిఖరాన మూడు రోజులుండి తరువాత అదృశ్యమవుతుంది.

సూర్యనందీశ్వరుని ముందట పనసమాను పుడుతుంది. ఆ చెట్టు ఆ క్షణాన పూలు పూచి, కాయలు కాచి, పండ్లు పండి వెను వెంటనే మాయమవుతుంది.

శిరువెళ్ళ నరసింహుని గుడి ముందర గంగరావి చెట్టు మొలుస్తుంది. బహు ధాన్య నామ సంవత్సరం, వైశాఖ శుద్ధ తదియ, శుక్రవారం నాడు పల్లెకు తురకలు వస్తారు.

బసవన్న రంకె వేస్తాడు. తిరువళ్ళువరు వీరరాఘవస్వామికి చెమటలు పడతాయి. భద్రకాళి కంపిస్తుంది. కంచి కామాక్షమ్మ దేహాన చెమటలు పుడతాయి. ఆమె కంట నీరు స్తనాల పాలు కారతాయి.

శాలివాహనశకంలో 1541న ధూమకేతువు పుడుతుంది. శాలివాహన శకం 1555 నాటికి వివిధ దేశాల్లో జననష్టం జరుగుతుంది.

పెమ్మసాని తిమ్మనాయుడు వంశం నిర్వంశమయ్యేను. ఉదయగిరి, నెల్లూరులు రూపుమాసి పోయేను. గండిపేట, గోలకొండ, ఆదలేని, కందనూరి పట్టణాలు నశించి తురకలు పారిపోతారు. విజయపురంలాంటి పట్టణాలు క్షయనామ సంవత్సరం నాటికి నశించెను.

స్త్రీల కన్నుల నుండి నెత్తుటి బిందువులు రాలతాయి. వడగండ్ల వానలు, బాణ వర్షాలు కురిసెను. చెరువులు, బావులు, నదుల నీరు ఇంకిపోతాయి. అయినా జుర్రేరు నీరు ఇంకదు.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. అద్భుత సృష్టి - 11 🌹*
 ✍ రచన, సంకలనం- DNA స్వర్ణలత గారు
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
          
🌟. ఇప్పుడు మన యొక్క DNA 2 నుండి 12 స్థాయిల వరకు ఎదిగే క్రమంలో ఉంది. ఇది యుగమార్పుల వలన సంభవించింది. ఎన్నో యుగాలుగా కోట్ల మంది తమ సహజమైన స్థితి ని అంగీకరించి తమ యొక్క శరీర ఫ్రీక్వెన్సీని 2 ప్రోగులు స్థాయి నుండి 12 ప్రోగుల స్థాయికి ఎదిగేలా తమ శరీరాలలో మార్పులు తెచ్చుకుంటున్నారు.

💫. వారు మారడమే కాకుండా గ్రహంపైన కూడా ఎన్నో మార్పులను తీసుకుని వచ్చి ఈ గ్రహాన్ని పవిత్ర శక్తి క్షేత్రంగా మారుస్తున్నారు.

12 ప్రోగుల DNA శరీర కణాల్లోనే కాకుండా శరీరం బయట విశ్వం మూలం వరకు విస్తరించి ఉంటుంది.

💫. అధిక శక్తి, కాంతి సమాచారం శరీరంలోనికి రావటం వలన DNA యాక్టివేట్ అయ్యి మన శరీర ఫ్రీక్వెన్సీ పెరిగి ఒక గొప్ప స్థితిలోకి మారుతుంది. ఎప్పుడైతే భౌతిక శరీరం తన స్థితిని మార్చుకుని క్రిస్టల్ రూపమైన కాంతి శరీరంగా మారుతుందో ఆ రూపాన్ని *"12 ప్రోగుల DNA యాక్టివేషన్"* అని చెప్పడం జరిగింది.

💫. క్రిస్టల్ రూపమైన కాంతి శరీరంలోని కణ నిర్మాణం ఎప్పటికీ నశింపుకాని విధంగా ఉంటుంది. ఈ శరీరాన్ని కలిగిన వారిని *"ఇమ్మోర్టల్ బీయింగ్స్"* అంటారు. ఈ కాంతి దేహం సూపర్ కంప్యూటర్ వలె పని చేస్తూ అన్ని విశ్వాల సమాచారాన్నంతా నిక్షిప్తం చేస్తూ పునః ప్రసారం చేస్తూ ఉంటుంది.

💫. దీనివలన శరీరంలోని శక్తి క్షేత్రాలు అన్నీ కూడా ఏకీకృతం అవ్వడం జరుగుతుంది. దివ్యత్వపు జాగృతి పెరుగుతుంది. మానవ అనుభవాల నుండి దివ్య అనుభవాలను పొందే స్థితికి మారిపోతుంది.

ఇప్పటి వరకు ఉన్న సరికాని శక్తి అయిన భౌతికమైన గ్రేడ్లను చేదిస్తూ కాంతి గ్రేడ్లను ఏర్పాటు చేసుకుంటుంది. శరీరం బయటా మరి లోపలా కూడా కాంతిని కలిగి ఏక స్థితిని పొందుతూ ప్రాధాన్యం తాదాత్మ్యం చెందుతూ ఉంటుంది.

💫. తనని తాను మార్చుకోవడమే కాకుండా తాను నివసిస్తున్న గ్రహాన్నీ..‌. ఆ గ్రహంపై ఉన్న జీవరాశినంతటినీ ఒక గొప్ప షిఫ్టులోనికి తీసుకొని వెళ్ళడం జరుగుతుంది.

💫. ఈ మార్పు కారణంగా ఎన్నో విశ్వాలు (భూమితో అనుసంధానమైనవి) శాంతినీ, కాంతినీ పొంది జాగృతమవ్వడం జరుగుతుంది. బహుశా ఈ మార్పును *" నూతన యుగ మార్పు"* అనవచ్చు. ఈ మార్పు ఇంకా, ఇంకా జరుగుతూ భూమి అనంతంగా చైతన్యవంతం అవుతూ ఉంటూనే ఉంటుంది.(This is endless process). 

సశేషం.... 
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹 Seeds Of Consciousness - 155 🌹*
✍️ Nisargadatta Maharaj 
📚. Prasad Bharadwaj

*🌻 2. Just stay put firmly and establish yourself in the ‘I am’, reject all that does not go with ‘I am’. 🌻*

Having understood the ‘I am’ in every way, the next thing is to stay there, establish yourself in your sense of ‘being’ and not deviate from it at all. 

The very moment you start thinking about anything else you can be lest assured there have been ‘addons’ on the basic ‘I am’ and it has lost its purity. 

Reject anything that is ‘I am plus …’and so forth because all the rest are contaminants and do not go with it.

Continues....
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. కఠోపనిషత్‌ వివరణ - చలాచలభోధ - 33 🌹*
✍️. సద్గురు శ్రీ విద్యాసాగర్ 
📚. ప్రసాద్ భరద్వాజ

*🌻. శ్రేయోమార్గము - ప్రేయోమార్గము - 22 🌻*

అట్లాగే మన నిజజీవితంలో కూడా జగత్ వ్యవహారమునకు, జగత్ వ్యాపారమునకు సంబంధించి అనేక సూచనలని, సలహాలని, అవగాహనలని, ఆక్షేపణలని, ఆశ్రయాలని అందించేటటువంటివారు కోకొల్లలుగా వుంటారు.

కాని నాయనా! ఆత్మనిష్ఠ గురించి మీరేమైనా తెలియజేయగలరా అని ప్రశ్నించాలట. అత్మానుభూతి మీరు పొందారా అని ప్రశ్నించాలట. అట్టి ఆత్మానుభూతి విషయమై ఆత్మనిష్ఠ విషయమై నాకు మీరు సహాయం చేయగలరా అని పరిప్రశ్న వేయాలిట. అలా ఎవరినైతే నీవు అర్ధిస్తావో, తప్పక నీకు సహాయం చేస్తాను ఆత్మనిష్ఠ విషయమై, తప్పక నీకు ఆత్మానుభూతి పొందేట్లుగా చేస్తాను అనే వాగ్ధానం చేయగలిగేటటువంటి ఆచార్యుడని ఆశ్రయించాలి. 

కాబట్టి గురుపౌర్ణమి అంటే ఏమిటంటే హస్తమస్తక సంయోగము అనేటటువంటి పద్ధతి ద్వారా గురువుగారు నీకు ఈశ్వరుడు సాక్షిగా వాగ్ధానం చేస్తున్నారు. శిష్యుడు ఈశ్వరుడి సాక్షిగా గురుపాదమును ఆశ్రయిస్తున్నాడు. శరణాగతుడౌతున్నాడు. చరణాగతి కాదు అది, శరణాగతి. అంటే సంజ్ఞారూపకంగా కాళ్ళుపట్టుకుని ప్రార్ధిస్తున్నాం అన్నమాట. ఇంక అంతకుమించి ప్రార్ధించడానికి వేరే మార్గము లేదు కాబట్టి.

 హృదయపూర్వకమైనటువంటి నివేదన, శరణాగతి. అటువంటి పద్ధతిగా మనం గురువును ఆశ్రయించాము. మానసిక ఆశ్రయాన్ని పొందటం. మనస్సుని హృదయ స్థానంలో నిలిపి ఉంచడమే అన్ని సాధనల యొక్క పరమగమ్యం. 

కాబట్టి అన్ని తపస్సుల యొక్క ఉద్దేశ్యం ఏమిటంటే మనస్సుని హృదయస్థానమందు నిలిపి వుంచి స్వరూపజ్ఞాన విశేషంచేత నీవు జీవించడం. అట్లా జీవనం ఎవరైతే చేస్తారో వాళ్ళు సరియైనటువంటి విధానంలోకి ప్రవేశిస్తారనమాట. అటువంటివారు అతికుశలురైనటు వంటి గురువును ఆశ్రయిస్తున్నారు.   

         గురువు ఎటువంటి వాడయ్యా అంటే శిష్యునిలో ఏర్పడేటటువంటి కొద్దిపాటి మార్పులని కూడా చెప్పకనే గ్రహించగలిగేటటువంటి సమర్ధత ఆయన దగ్గర వుంది. అలా చూస్తేనే గ్రహిస్తాడు. వింటూనే గ్రహిస్తాడు. వినకుండా కూడా గ్రహిస్తాడు. అపరోక్షంగా కూడా చూడగలుగుతాడు. నిన్ను నీడలాగా వెంబడిస్తూ వుంటాడు. నీ హృదయస్థానంలోనే నిలకడైనటువంటి స్థానం కలిగి వుండి నీలో కలుగుతున్నటువంటి మార్పులన్నిటినీ గ్రహిస్తాడు. ఆ రకంగా నువ్వు గురువుని నీ హృదయస్థానంలో నిలుపుకోవాలి. 

ఆ రకమైనటువంటి మానసిక ఆశ్రయాన్ని పొందేటటువంటి కుశలత్వాన్ని సంపాదించాలి. నైపుణ్యాన్ని సంపాదించాలి. అప్పుడేమౌతావు. సర్వార్పణ అయిపోతావు అనమాట. అట్లా ఎవరైతే సర్వార్పణైనటువంటి శరణాగతి స్థితిని అనుభవిస్తున్నారో వాళ్ళు ఉత్తమగతి చెందేటటువంటి అవకాశం కలుగుతుంది.

ఇంకా ఇందులో ఒక మర్మగర్భమైనటువంటి విశేషం కూడా వుంది. నూటికో కోటికో అనడంలో ఒక ఉద్దేశ్యం వుంది. తెలుసా మీకు ఎవరికైనా? సాధారణంగా అందరూ అంటుంటారు - ఎక్కడో నూటికో కోటికోనండీ అంటుంటారు. అంటే శతజన్మలకి ఒకసారి ఈ అవకాశం వస్తుంది. 

వందసార్లు పుట్టి పోతే, శత జన్మలకు - శతజన్మల ఆయుర్దాయం - వంద వందలు - అంటే ఎంత- పదివేల సంవత్సరాలకి ఒకసారి నీకు ఈ ఆత్మనిష్ఠని పొందాలి అనే ఆసక్తి కలుగుతుంది. అటువంటి ఆసక్తిని ఏదో ఒక ప్రతిబంధకాలని ఉద్దేశించి, ఏదో ఒక సమస్యలనుద్దేశించి, ఏదో ఒక తాత్కాలికమైన అంశాలని ప్రాధమ్యాలుగా స్వీకరించి ఆత్మానుభూతి కొరకు చేసేటటువంటి ప్రయత్నాన్ని విరమించడం అనేది అత్యంత హీనమైనటువంటిది. ధన్యత చెందే అవకాశం శతజన్మలకి ఒకసారి వస్తుంది.

ఇంకా కోటికో అంటాం.. తెలుసా మీకెవరికైనా. ‘కోటికో’ అనడం వెనక ఉద్దేశ్యం ఏమిటంటే ఒక్కొక్క పర్యంతము క్రిమికీటకాదుల జన్మలతో గనక నువ్వు ప్రారంభించినట్లయితే కోటి జన్మలకి ఒకసారి కూడా లభించే అవకాశం వుండదు. అన్నిసార్లు పుట్టిపోతూ వుంటావు. ఏ వంద జన్మలకో, ఏ కోటి జన్మలకో గాని నీకు ఆత్మనిష్ఠని పొందాలి అనేటటువంటి బలమైన నిర్ణయం కలగడం లేదు.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. 10. మార్పు - మహత్మ్యము - నేను అను ఈ ప్రజ్ఞ గుణాతీతము, కాలాతీతము కూడ! దీనినుండి సమస్త భావములు, కాలానుసారముగ వృద్ధి చెంది, ప్రవర్తించి, ఈ నేనను ప్రజ్ఞలో మరల కలియుచున్నవి. 🌹*

✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్ 
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

*📚. గీతోపనిషత్తు - సాంఖ్య యోగము - 18, 19, 20, 21 📚*

ఈ సృష్టి మొత్తమును పరిశీలించి చూచినచో సమస్తమును మార్పు చెందుచున్నట్లు గోచరించును. మార్పు చెందు ఈ సమస్తమునకు మార్పు చెందని ఒక కేంద్రము కలదు. అది మార్పు చెందువానిలో మార్పు చెందక యుండును. అది ఆధారముగా సమస్తమును ఉద్భవించి, వృద్ధిపొంది, లయమగు చున్నది. 

ఉద్భవము, వృద్ధి, లయము, మరల ఉద్భవము, అనంతముగా సాగుచుండును. లయమైనపుడు వృద్ధిపొందిన విషయము సూక్ష్మమై ఈ కేంద్రమునందు యిమిడి యుండును. మరల కాలము ననుసరించి ఉద్భవించుట, వృద్ధిపొందుట జరుగుచున్నది.  

అన్తవన్త ఇమే దేహా నిత్యస్యోక్తా: శరీరిణ: |
అనాశినో ప్రమేయస్య తస్మాత్ యుధ్యస్వ భారత || 18

య ఏనం వేత్తి హన్తారాం యశ్చైనం మన్యతే హతం |
ఉభౌ తౌ న విజానీతో నాయం హన్తి న హన్యతే || 19