🌹. భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 20 🌹
✍️. శ్రీ బాలగోపాల్
📚. ప్రసాద్ భరద్వాజ
🌻. భగవంతుని మొదటి పాత్ర - పరాత్పర - పరబ్రహ్మ - 20 🌻
73. పరాత్పర స్థితియొక్క అనంతత్వము, భగవంతుని పూర్తిగా సర్వస్వతంత్రుని చేసినది. అందుచేత సర్వస్వతంత్రుడైయున్న భగవంతుడు తన అనంత (లీల) విలాసమును సాధన పూర్వకముగా అనుభవించి ఆనందించుట సహజమే.
74. లీలను సాధన చేయుటయే స్వతంత్ర స్వభావమునకు చిహ్నము. ఎందుచేతననగా ఈ విలాసమే స్వతంత్ర స్వభావమునకు రంగును (సంస్కారమును) పూసినది.
75. సర్వమ్‌లో, అభావముగా అంతర్నిహితమైయున్నదంతయు,ఆవిర్భవించుటకుగల కారణమునకు ఆనంతమైన ఆదివిలాసమునదే బాధ్యత.
76. విలాసము అనగా విలాసమే గనుక, యీ భగవద్విలాసము యొక్క స్వభావమును బట్టి, అది ఎందుకు వచ్చినది ? ఎక్కడ వచ్చినది ? ఎప్పుడు వచ్చినది ? అని అనుకొనుటకు ఎక్కడను ఆస్కారము లేదు.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
No comments:
Post a Comment