నడు భౌమాశ్విని యోగం

🌷 నడు భౌమాశ్విని యోగం 🌷

అశ్విని నక్షత్రంతో కూడిన మంగళవారం ను భౌమాశ్విని యోగం అంటారు.... ఇది అరుదుగా లభ్యమయ్యే యోగం..... ఈ రోజు దేవీ అధర్వశీర్షం ప్రకారం దేవీమంత్రపారాయణ చేయడం ద్వారా మహామృత్యువును కూడా తరమవచ్చు అనేది ఆర్యోక్తి! అమ్మవారి కి ఇష్టమైన నవమి తిధితో కలసి రావడం మరింత ప్రాధాన్యత సంతరించుకుంది.....

భౌమాశ్విన్యాం మహాదేవీసన్నిధౌ జప్త్వా మహామృత్యుం తరతి !
స మహామృత్యుం తరతి ! య ఏవం వేద ! ఇత్యుపనిషత్!

భౌమాశ్విని పర్వదినం నాడు అనగా 16మార్చి 2021మంగళవారం, తృతీయా తిథి, అశ్విని నక్షత్రం నాడు అమ్మవారి అనుగ్రహం కోసం అందరూ, శంకరులు కైలాసం నుండి తెచ్చిన మంత్రరూపమైన స్తోత్రం సౌందర్యలహరి, లలితా సహస్ర నామ పారాయణం, విరాట పర్వంలోని అమ్మవారి స్తోత్ర పారాయణం, సప్తశ్లోకి పారాయణం, దుర్గా చంద్రకళా స్తుతి పారాయణం, అచ్యుతానంతగోవింద నామ జపం, మన్యుసూక్త పారాయణ, సుబ్రహ్మణ్య స్వామి మాలమంత్ర జపం... ఇలా ఏది వీలు అయితే అది వారి శక్త్యానుసారం చేసుకోవచ్చు..... చండీమూలమన్త్ర జపం, హోమం ఇంట్లోకానీ, గుడిలోకాని ప్రజలు ఎక్కువ గుమిగూడకుండా, ప్రజా క్షేమం కోరి నిర్వహించిన కూడా మంచిదే! ఈ భౌమాశ్వని పర్వకాలంలో చేసే అనుష్ఠానానికి మన నిత్య అనుష్ఠానానికన్నా ఎక్కువ ఫలితాలుంటాయి....

యా దేవి సర్వభూతేషు శాంతి రూపేణ సంస్థితా!నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః !!

రోగానశేషా నపహంసి తుష్టారుష్టాతుకామాన్ సకలాబభీష్టాన్!
త్వామాశ్రితానాం న విపన్నరాణాం త్వామాశ్రితాహ్యా శ్రయతాం ప్రయాంతి !!

స్వర్వబాధా ప్రశమనం త్రైలోక్యస్యాఖిలేశ్వరి!
ఏవమేవ త్వయా కార్యమస్మద్వైరి వినాశనం !!

ఈ సందర్భంగా పరాశక్తి అనుగ్రహం తో మహాశక్తిమంతులుగా మంచి కార్యక్రమాలు చేయడానికి ప్రార్థన – ప్రయత్నం రెండూ చేసుకోవాలి…

సర్వేజనాసుఖినో భవంతు...



16 Mar 2021

శ్రీ లలితా సహస్ర నామములు - 48 / Sri Lalita Sahasranamavali - Meaning - 48


🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 48 / Sri Lalita Sahasranamavali - Meaning - 48 🌹

🌻. మంత్రము - అర్ధం 🌻

📚. ప్రసాద్ భరద్వాజ


🍀 48. నిష్క్రోధా, క్రోధశమనీ, నిర్లోభా, లోభనాశినీ ।
నిఃసంశయా, సంశయఘ్నీ, నిర్భవా, భవనాశినీ ॥ 48 ॥🍀

🍀 168. నిష్క్రోధా -
క్రోధము లేనిది.

🍀 169. క్రోధశమనీ -
క్రోధమును పోగొట్టునది.

🍀 170. నిర్లోభా -
లోభము లేనిది.

🍀 171. లోభనాశినీ -
లోభమును పోగొట్టునది.

🍀 172. నిస్సంశయా -
సందేహములు, సంశయములు లేనిది.

🍀 173. సంశయఘ్నీ -
సంశయములను పోగొట్టునది.

🍀 174. నిర్భవా -
పుట్టుక లేనిది.

🍀 175. భవనాశినీ -
పుట్టుకకు సంబంధించిన సంసార బంధక్లేశములు లేకుండా చేయునది.


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹



🌹. Sri Lalita Sahasranamavali - Meaning - 48 🌹

📚. Prasad Bharadwaj


🌻 48. niṣkrodhā krodhaśamanī nirlobhā lobhanāśinī |
niḥsaṁśayā saṁśayaghnī nirbhavā bhavanāśinī || 48 ||🌻

🌻168 ) Nishkrodha -
She who is devoid of anger

🌻 169 ) Krodha - samani -
She who destroys anger

🌻 170 ) Nir Lobha -
She who is not miserly

🌻 171 ) Lobha nasini -
She who removes miserliness

🌻 172 ) Nissamsaya -
She who does not have any doubts

🌻 173 ) Samsayagni -
She who clears doubts

🌻 174 ) Nirbhava -
She who does not have another birth

🌻 175 ) Bhava nasini -
She who helps us not have another birth.


Continues..

🌹 🌹 🌹 🌹 🌹


16 Mar 2021

భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 193


🌹. భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 193 🌹

✍️. శ్రీ బాలగోపాల్
📚. ప్రసాద్ భరద్వాజ

🌻. భగవంతుని పదవపాత్ర సద్గురువు - నాల్గవ దివ్య యానము - సద్గురువు -అవతార పురుషుడు. - 7 🌻


మహిమా ప్రదర్శనములు. వివిధములైన సిద్ధులు, లేక చమత్కారములు.

723.

1. అవతార పురుషుడు చేయు మహిమలు

2. సద్గురువు చేయు మహిమలు

3. మహాపురుషుడు (5వ భూమిక) సత్పరుషుడు (6వ భూమిక) చేయు మహిమలు.

4. 1, 2, 3, 4 భూమికలలో నుండు యోగులు చేయు మహిమలు.

1. సార్వజనీనముగా అవసరమైనప్పుడు, అవతార పురుషుడు విశ్వాత్మక లక్షణముతో మహిమలు చేయును. పరిస్థితుల ననుసరించి, అవతార పురుషుడు అంతవరకు 6, 5 లేక 4 భూమికలలో నుండును. ఆ మహిమలు చాల ఉధృతముగ నున్నప్పుడు అంతవరకు 4వ భూమికలో నుండును.

2. సద్గురువు కూడా మానవుల ఆధ్యాత్మిక శ్రేయస్సుకై మహిమలు చేయును. కాని అవతార పురుషుడు చేసినట్లు, విశ్వమంతటికి సంబంధించి యుండవు. అవసర పరిస్థితులను బట్టి, అవతార పురుషుని వలెనే, అంతవరకు 6, 5, 4 భూమికలలో నుండును. 7వ భూమికలో బ్రహ్మీభూతుడు మహిమలు చేయడు. ఎందుచేత ననగా ఆతనికి యీ సృష్టిలేదు. కాబట్టి.

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹


16 Mar 2021

భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 251


🌹. భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 251 🌹

🌷. సద్గురు శివానంద 🌷
📚. ప్రసాద్ భరద్వాజ

🌻. కాశ్యప మహర్షి - 2 🌻


9. ఈ విషయం చాలా చమత్కారంగా ఉంది. మనసును శంకించటం ఎలాగ అంటారు. ఉదాహరణకు ఒక బ్రహ్మరాక్షసుడున్నాడు. వాడు ఒకడిని పట్టుకున్నడనుకోండి. అలా పట్టుకుని అతడి వశంలో ఉండి, ఘడియ ఘడియకూ తనకు ఏదయినా పని చెప్పమని, “నీవు నాకు చేతినిండా పనిచెప్పు, అట్లాగైతే నేను నిన్ను సేవిస్తూ ఉంటాను.

10. నాకు ఎప్పుడయితే పని చెప్పలేకపోతావో అప్పుడు నేను నిన్ను తినేస్తాను.” అని, పని అడగడం మొదలు పెట్టాడు. వీడు ఏం చేస్తాడు! కాశీనుంచి గనగను తెమ్మన్నాడు. అరక్షణంలో పట్టుకొచ్చాడు వాడు. తనవద్ద పదార్తాలులేవు, అగ్నిహోత్రంలేదు, ఉన్నాట్టుండి బ్రహ్మాండమైన భోజనం కల్పించమని అడిగాడు. అంతే, భోజనం వచ్చేసింది! ఏ పని చెప్పినా, వాడు క్షణంలో చేసేస్తున్నాడు!

11. ఈ బ్రహ్మరాక్షసుడికి పని చెప్పకపోతే తనను తినేస్తాడు. ఏమీ తోచలేదు. ఇక వాడికి పనిచెప్పలేక పారిపోతున్నాడు. అలా పోతుంటే ఒక పెద్ద అరణ్యం కనబడింది. “ఇక్కడి చెట్లన్నీ శుభ్రంగా నరికేసెయ్యి, నేలఅంతా చదును చేసెయ్యి అంటే, అర ఘడియలో అలాచేసి వచ్చేసాడు! అక్కడ ఒక పట్టణనిర్మాణం చెయ్యమంటే, అదీ చేసాడు. ఒక పెద్ద చెరువును, నదిని నిర్మించమంటే, క్షణంలో అది అయిపోయింది. మళ్ళీ పనిచెప్పమన్నాడు వాడు! ఇక చేసేది లేక మళ్ళో పారిపోవటం మొదలెట్టాడు.

12. చివరిగా ఆగి అక్కడ పెద్ద తాడిచెట్టు ఉన్నది, నువ్వు ఆ చెట్టును కింది నుంచి పైకి, పైనుంచి కిందికి, మళ్ళీ పైకి, కిందికి ఎక్కిదిగుతూ ఉండు, నేను చెప్పేవరకూ అలాగే చేస్తూఉండు. ఇంకే పనీ చెయ్యకు అన్నాడు. కొంతసేపు అలా చేసిన తరువాత, “బాబోయ్! నన్ను రక్షించు. ఈ తాటిచెట్టు నుంచి నన్ను వదిలిపెట్టు. ఇక నువ్వు స్మరిస్తేనే వస్తాను. నిన్ను చంపను, నీ జోలికిరాను అని వెళ్ళిపోయాడు.

13. అపరిమితమైన శక్తి గల వారికి ఏ పని చెప్పినా, అంతులేని పని చెప్పాలి. అలాగే మనసు కూడా! మనసుకు కూడా ఏ పని చెప్పినా, అది చేసి వెనక్కు వచ్చేస్తుంది. ఆ బ్రహ్మరాక్షసుడి లాంటిదే మనసుకూడా. దానికి సాధ్యం కానిది ఒకటి అప్పగిస్తే, అంతలోనే అది నశిస్తుంది.

14. మనసు నశించాలి కదా! “ఆత్మ ఎక్కడ ఉందో చూచిపెట్టు” అని మనస్సును అడగాలి. అంటే అన్ని రకాల పనులూ చేస్తుంది ఈ మనస్సు. దానికి సాధ్యం కానిది లేదు. “ఆత్మ వస్తువు ఎక్కడ ఉందో వెతికిపెట్టు” అని అన్నరనుకోండి! ఏంచేస్తుంది మనస్సు? దానికి అది దొరకక, విసిగివేసారి ఎక్కడో నశిస్తుంది అది.

15. అంటే, మనస్సు, “హృదయంలోని జ్యోతిని చూడు” అంటే, చూచి ఇవతలికి వస్తుంది ఆ బ్రహ్మరాక్షసుడివలె. అలాగే, “ఒకమాటు శ్రీహరిని ధ్యానం చెయ్యి” అంటే. చేసి, “ధ్యానం అయిపోయింది” అంటుంది. “కాసేపు రుద్రుణ్ణి ధ్యానం చెయ్యి” అంటే, చేసి వచ్చేస్తుంది. చెప్పినపనినల్లా చేసి వచ్చేస్తుంది.

16. అందుకని, దానికి అంతులేని పనిచెప్పాలి. ఇంక దాని అంతు ఆ కార్యమే కనుక్కుంటుంది. అది ఒక్కక్షణమే. అందువల్ల. మనస్సు ఎక్కడ నిల్సుతుందో, అక్కడ దానిని నిలుపమన్నాడు.

సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹


16 Mar 2021

శ్రీ శివ మహా పురాణము - 371


🌹 . శ్రీ శివ మహా పురాణము - 371 🌹

రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. రుద్ర సంహితా - పార్వతీ ఖండః 🌴

అధ్యాయము - 10

🌻. కుజ గ్రహోత్పత్తి - 1 🌻

నారదుడిట్లు పలికెను -

ఓ విష్ణు శిష్యా! మహాత్మా! విధీ! ప్రభూ! నీవు శివ భక్తులలో శ్రేష్ఠుడవు. ఈ శివలీలను నాకు సంగ్రహముగా ప్రీతితో నీవు చెప్పదగుదువు(1). సతీ విరహముతో కూడి యున్న శివుడు ఏమి చేసెను? శివుడు తపస్సును చేయుటకై హిమవత్పర్వతాగ్ర భాగమునకు ఎప్పుడు వచ్చెను? ఆ చరితమును చెప్పుము (2). శివశివులకు మధ్య జరిగిన సంభాషణ ఎట్టిది? మన్మథుడు నశించిన తీరు ఏది? పార్వతి తపస్సును చేసి మంగళ స్వరూపుడగు శివుని పొందిన విధమెట్టిది? (3) ఓ బ్రహ్మా! ఈ వృత్తాంతమునంపతనూ చెప్పి, ఇతరమగు శివచరితమును కూడ నీవు చెప్పదగుదువు. ఈ శుభ చరితము నాకు మహానందమును కలిగించుచున్నది. (4).

సూతుడిట్లు పలికెను-

నారదుని ఈప్రశ్నను విని, లోకపాలురందరిలో శ్రేష్ఠుడగు బ్రహ్మశివుని పాదపద్మమునలు స్మరించి మిక్కిలి ప్రీతితో ఇట్లనెను (5)

బ్రహ్మ ఇట్లు పలికెను-

ఓ దేవర్షీ! నీవు శివభక్తులలో శ్రేష్ఠుడవు. పవిత్రము చేయునది, మంగళములనిచ్చునది, భక్తిని పెంచునది అగు శివుని ఉత్తమకీర్తిని ఇపుడు శ్రధ్ధగా వినుము (6). ప్రియురాలి వియోగముచే దుఃఖితుడై యున్న శంభుడు తన నివాసమగు కైలాసమునకు తిరిగి వచ్చి, ప్రాణముల కంటె అధికముగా తనకు ప్రియురాలైన సతీదేవిని మనస్సులోస్మరించెను(7). ఆయన లోకపు పోకడను అనుకరించువాడై గణములను పిలిచి వారి యెదట ప్రేమను పెంపొందిచు ఆమె గుణములను మిక్కిలి ప్రీతితో వర్ణించెను(8). లీలా పండితుడగు ఆ శివుడు సద్గతినిచ్చు గృహస్థాశ్రమమును విడిచి పెట్టి దిగంబరుడై లోకములనన్నిటినీ తిరుగాడెను(9).

భక్తులకు మంగళమునిచ్చు ఆ శంకరుడు సతీ వియోగముచే దుఃఖితుడై అమెను ఎక్కడను గాన జాలక కైలాస పర్వతమునకు తిరిగి వచ్చెను(10). అయన ప్రయత్నపూర్వకముగా మనస్సును నిగ్రహించి దుఃఖానాశకమగు సమాధిని పొంది నాశరహితమగు ఆత్మ స్వరూపమును దర్శించు చుండెను(11).మూడు గుణములకు అతీతమైన వాడు, వికారములు లేనివాడు, పరబ్రహ్మ స్వరూపుడు, మాయను వశము చేసుకున్నవాడు అగు ఆశివప్రభుడు ఈ తీరున చిరకాలము సమాధియందుడెను (12). ఆయన అనేక సంవత్సరములు ఇట్లు గడిపి తరువాత సమాధి నుండి బయటకు వచ్చెను. అపుడు జరిగిన వృత్తాంతమును మీకు చెప్పెదను (13).

ఆ ప్రభుని లలాట భాగమునుండి శ్రమ వలన చెమట పుట్టి నేలపై బడగా, అది వెంటనే ఒక శిశువాయెను(14). ఓమహార్షీ! ఆ శిశువు నాల్గు భుజములతో, అరుణ వర్ణముతో, సుందరమగు ఆకారముతో, దివ్యకాంతులీనుచూ, శోభాయుక్తమై, ఇతరులు చూడ శక్యము కాని తేజస్సుతో వెలుగొందెను(15).

సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹


16 Mar 2021

గీతోపనిషత్తు -171


🌹. గీతోపనిషత్తు -171 🌹

✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్

సేకరణ : ప్రసాద్ భరద్వాజ

📚. 6వ అధ్యాయము - ఆత్మ సంయమ యోగము 📚

శ్లోకము 14


🍀 14. పూర్ణ జిజ్ఞాస - జీవుల యందలి దైవముతో అనుసంధానము చెందుట యోగము. జీవుడహంకార ప్రజ్ఞ. అతడు త్రిగుణాత్మకుడు. నే నున్నానను ప్రత్యేక భావము కలవాడు. జీవులయందున్న దేవుడు త్రిగుణాతీతుడు. అంతర్యామి. అన్నిటియందు గుణముల కావల ఉండువాడు. కావున సర్వాంతర్యామి. అతడాధారముగ గుణము లేర్పడి, అందుండి ప్రత్యగాత్మగ జీవుడేర్పడు చున్నాడు. నిజమునకు జీవుడు స్థితి మార్పు చెందిన దైవమే. జీవుని పేరు నేను. దైవము పేరు కూడ నేనే. నేనను జీవుడు, నేను అను దైవముతో అనుసంధానము చెందుటకు చేయు ప్రయత్నమే యోగాభ్యాసము. నేనను ప్రత్యేక ప్రజ్ఞ, నేనను అంతర్యామి ప్రజ్ఞతో జతపడవలెను. 🍀

ప్రశాంతాత్మా విగతజీ ర్ర్బహ్మచారిత్రతే స్థితః |
మన స్సంయమ్య మచ్చిత్తో యుక్త ఆసీత మత్పరః || 14

ప్రశాంతమైన మనస్సు కలవాడై, భయము వీడినవాడై బ్రహ్మ యందు చరించుట స్థిరమగు వ్రతము కలవాడై, సంయమము చెందిన ఇంద్రియములతో కూడిన మనస్సు కలవాడై, 'నా' యందు ఆసక్తి, ప్రేమ కల చిత్తము కలవాడై, మత్పరుడై 'నా'తో ముడిపడిన వాడై ఉండవలెను.

శ్రీకృష్ణుడు అందించిన ఈ ఉపదేశము ధ్యానమున మణి పూస వంటిది. ఇచ్చట 'నేను' అని కృష్ణుడు వాడిన పదము సాధకుని యందు అంతర్యామిగనున్న నేను. అనగ జీవుని యందలి దైవము.

జీవుల యందలి దైవముతో అనుసంధానము చెందుట యోగము. జీవుడహంకార ప్రజ్ఞ. అతడు త్రిగుణాత్మకుడు. నే నున్నానను ప్రత్యేక భావము కలవాడు. జీవులయందున్న దేవుడు త్రిగుణాతీతుడు. అంతర్యామి. అన్నిటియందు గుణముల కావల ఉండువాడు. కావున సర్వాంతర్యామి. అతడాధారముగ గుణము లేర్పడి, అందుండి ప్రత్యగాత్మగ జీవుడేర్పడు చున్నాడు. నిజమునకు జీవుడు స్థితి మార్పు చెందిన దైవమే.

జీవుని పేరు నేను. దైవము పేరు కూడ నేనే. నేనను జీవుడు, నేను అను దైవముతో అనుసంధానము చెందుటకు చేయు ప్రయత్నమే యోగాభ్యాసము. నేనను ప్రత్యేక ప్రజ్ఞ, నేనను అంతర్యామి ప్రజ్ఞతో జతపడవలెను. ఇది అంటు కట్టుట వంటిది. అట్లు భావనతో కట్టివుంచుటచే, క్రమముగ రెండుగ నున్నవి ఒకటిగ నేర్పడగలవు. “యుక్త ఆసి" అని శ్లోకము చెప్పుచున్నది. అనగ కలిపి యుంచవలెనని అర్థము. ఇట్లు చాల కాలము కలిపియుంచుటకు ప్రయత్నము సాగవలెను.

ఈ ప్రయత్నమున శ్రద్ధ, భక్తి దైనందినముగ నున్నచో క్రమముగ ప్రశాంతత చిక్కును. భయము తొలగును. అంతర్యామి యందే చరించు దినచర్య ఆరంభమగును. ఇంద్రియములు మనస్సు అనుకూలము లగును. ఇది ఒక పద్ధతి. ఈ పద్ధతి యందు దైవమే కర్తయై నిలచును.

మరియొక పద్ధతి ప్రశాంతమగు మనస్సు నేర్పరచుకొనుట, భయమును తొలగించు కొనుట, మనస్సు ఇంద్రియములను మచ్చిక చేసుకొనుట, బ్రహ్మము నందు చరించుట తానుగ స్వప్రయత్నమున నిర్వర్తించుకొనుచు, తన యందలి అంతర్యామితో యోగించుట.

ఇందు మొదటి పద్ధతి భక్తునకు సహజము. అతడు దైవమే ఉపాయమని, అంతట, అన్నిట దైవమునే చూచుచు, దైవ యుక్తుడగు చుండును. జ్ఞాని పురుష ప్రయత్నమున తనను తాను సమకూర్చుకొని దేవునితో యోజించుటకు ప్రయత్నించును. ఇరువురికిని ఫలప్రదాత దైవమే. ప్రతినిత్యము పై తెలిపిన మూడు శ్లోకముల ననుసరించుచు, నిర్ణీత సమయమున ధ్యానము నాచరించుట ప్రధానమని తెలియవలెను.

కేవలము దైవమునందే ఆసక్తి, ప్రేమ కల వారు ఆత్మ సంయమమును సులభముగ బడయుదురు. వారి దినచర్య యంతయు కూడ దైవదర్శనమునే అంతట, అన్నిట చేయుచు నిర్వర్తించుకొను చుందురు. అట్టి వారికి ఆత్మ సంయమము శీఘ్రగతిని సిద్ధించును.

ఇతరములు గోచరించు వారికి సిద్ధించుట కష్టము. చిత్త మెంతవరకు దైవము నాశించునో అంతవరకు యోగము జరుగుచుండును. చిత్త మితర విషయములపై ఆసక్తిని చూపినపుడు యోగ మాగును. కావున పూర్ణ జిజ్ఞాసువులకే ఆత్మ సంయమము సాధ్యమగునని తెలియవలెను.

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹


16 Mar 2021