1) 🌹. నిత్య పంచాంగము Daily Panchangam 25, శుక్రవారం, మార్చి 2022 భృగు వాసరే 🌹2) 🌹. గీతోపనిషత్తు - రాజవిద్య రాజగుహ్య యోగము 30-1 - 341 - శ్రద్ధాభక్తులు🌹
3) 🌹. శివ మహా పురాణము - 539 / Siva Maha Purana - 539 🌹
4)🌹. మాస్టర్ ఇ.కె సందేశాలు -169🌹
5) 🌹 ఓషో రోజువారీ ధ్యానములు - 158 / Osho Daily Meditations - 158🌹
6) 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 358 / Sri Lalitha Chaitanya Vijnanam - 358🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శుభ శుక్రవారం మిత్రులందరికీ 🌹*
*భృగు వాసరే, 25, మార్చి 2022*
*మీకు ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని కోరుకుంటూ*
*ప్రసాద్ భరద్వాజ*
*🌻. పండుగలు మరియు పర్వదినాలు : శీతల అష్టమి, కాలాష్టమి, Sheetala Ashtami, Kalashtami🌻*
*🍀. శ్రీ మహాలక్ష్మి స్తోత్రం - 15 🍀*
*29. సుఖసౌభాగ్యసంపన్నో మనస్వీ బుద్ధిమాన్భవేత్ |*
*పుత్రవాన్ గుణవాన్ శ్రేష్ఠో భోగభోక్తా చ మానవః*
*30. ఇదం స్తోత్రం మహాపుణ్యం లక్ష్మ్యాగస్తిప్రకీర్తితమ్ |*
*విష్ణుప్రసాదజననం చతుర్వర్గఫలప్రదమ్*
🌻 🌻 🌻 🌻 🌻
*🍀. నేటి సూక్తి : మన చేతలు సాధనకు అనుగుణంగా ఉండాలి. వచ్చిన అవకాశాన్ని అలసత్వముతో, బద్ధకంతో జారవిడుచు కోకూడదు. - మాస్టర్ ఆర్.కె. 🍀*
🌷🌷🌷🌷🌷
విక్రమ సంవత్సరం: 2078 ఆనంద
శఖ సంవత్సరం: 1943 ప్లవ,
ఉత్తరాయణం, శిశిర ఋతువు,
ఫాల్గుణ మాసం
తిథి: కృష్ణ అష్టమి 22:05:01 వరకు
తదుపరి కృష్ణ నవమి
నక్షత్రం: మూల 16:08:41 వరకు
తదుపరి పూర్వాషాఢ
యోగం: వరియాన 25:46:03 వరకు
తదుపరి పరిఘ
కరణం: బాలవ 11:07:25 వరకు
వర్జ్యం: 01:02:40 - 02:33:12
మరియు 25:12:00 - 26:42:40
దుర్ముహూర్తం: 08:42:44 - 09:31:30
మరియు 12:46:34 - 13:35:20
రాహు కాలం: 10:50:45 - 12:22:11
గుళిక కాలం: 07:47:53 - 09:19:19
యమ గండం: 15:25:03 - 16:56:29
అభిజిత్ ముహూర్తం: 11:58 - 12:46
అమృత కాలం: 10:05:52 - 11:36:24
సూర్యోదయం: 06:16:27
సూర్యాస్తమయం: 18:27:55
చంద్రోదయం: 00:36:07
చంద్రాస్తమయం: 11:50:33
సూర్య సంచార రాశి: మీనం
చంద్ర సంచార రాశి: ధనుస్సు
స్థిర యోగం - శుభాశుభ మిశ్రమ ఫలం
16:08:41 వరకు తదుపరి వర్ధమాన
యోగం - ఉత్తమ ఫలం
🌻 🌻 🌻 🌻 🌻
*🍀. నిత్య ప్రార్థన 🍀*
*వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ*
*నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా*
*యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా*
*తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం*
*తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ*
*విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.*
🌹🌹🌹🌹🌹
#పంచాగముPanchangam
#PanchangDaily
#DailyTeluguCalender
Join and Share
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. గీతోపనిషత్తు -341 🌹*
*✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*📚. 9వ అధ్యాయము - రాజవిద్య రాజగుహ్య యోగము - 30 📚*
*🍀 30-1. శ్రద్ధాభక్తులు - తనయందు, తన పరిసరములయందు నిండి యున్నది, దైవమే అని తెలుయుట రాజవిద్య. దైవమే అనేకానేక మగు రూపాంతరములు చెంది వివిధ రూపములలో, వివిధ గుణములలో ప్రకాశించు చున్నాడని తెలుయుట వలన భేదబుద్ధి లేక పరిసరములను తగురీతిగ సేవించుట యుండును. అనన్యముగ దైవమే యున్నాడు. ఇట్టి సత్యము ఎవరి మనసున నిత్యము ఏర్పడునో అట్టివాడు స్థిరమతి యగును.🍀*
*అపి చేత్పుదురాచారో భజతే మా మనన్యభాక్ |*
*సాధురేవ సమంతవ్య స్సమ్యగ్వ్యవసితో హి సః || 30*
*తాత్పర్యము : ఎంత దురాచారు డైనప్పటికిని అనన్య భక్తితో నన్ను సేవించునేని అతడు స్థిరమైన మనసును బొంది క్రమముగ సత్పురుషుడుగ తలంపబడు చున్నాడు.*
*వివరణము : 9వ అధ్యాయమగు ఈ రాజవిద్య పరమ పవిత్రమైనది. తనయందు, తన పరిసరములయందు నిండి యున్నది, దైవమే అని తెలుయుట రాజవిద్య. దైవమే అనేకానేక మగు రూపాంతరములు చెంది వివిధ రూపములలో, వివిధ గుణములలో ప్రకాశించు చున్నాడని తెలుయుట వలన భేదబుద్ధి లేక పరిసరములను తగురీతిగ సేవించుట యుండును. తల్లిగ గోచరించునది దైవమే. తండ్రిగ గోచరించునది దైవమే. గురువుగ గోచరించునది గూడ దైవమే. సోదర సోదరీమణులుగను, బంధువులుగను, మిత్రుడుగను, శత్రువులుగా కూడ గోచరించు నది దైవమే.*
*అట్లే పశువులుగను, పక్షులుగను, వృక్షములుగను, పర్వతములుగను, నదులుగను అన్నియు దైవమే. దైవము కాని దేదియు లేదు. అన్యమేదియు లేదు. అనన్యముగ దైవమే యున్నాడు. ఇట్టి సత్యము ఎవరి మనసున నిత్యము ఏర్పడునో అట్టివాడు స్థిరమతి యగును. అట్టి స్థిరమతికి అన్నిట, అంతట దైవమే గోచరించుచు నుండును. కనుక ఆ రూపమున నున్న దైవమును దర్శించి సేవించుట యుండును. ఇట్లు సేవించుట అభ్యాసమైనపుడు మనిషి సాధువగును. అతని ప్రవర్తనమునందలి సాధుత్వము దర్శించిన వారందరునూ అతనిని సత్పురుషునిగనే తలంతురు.*
*సశేషం...*
🌹 🌹 🌹 🌹 🌹
#గీతోపనిషత్ #సద్గురుపార్వతీకుమార్
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
https://t.me/bhagavadgeethaa/
www.facebook.com/groups/bhagavadgeethaa/
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹 . శ్రీ శివ మహా పురాణము - 539 / Sri Siva Maha Purana - 539 🌹*
రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ
*🌴. రుద్ర సంహితా - పార్వతీ ఖండః - అధ్యాయము - 48 🌴*
*🌻. కన్యాదానము - 4 🌻*
పర్వతము లిట్లు పలికినవి -
ఓ పర్వత రాజా! నీ విపుడు కన్యాదాన కార్యము నందు నిమగ్నుడవు కమ్ము. ఉత్తి మాటలతో నీ కార్యము చెడగలదు. కాన ఈ మాటలేల? మేము సత్యమును పలుకుచున్నాము. ఈ విషయములో విమర్శను కట్టి పెట్టుము. కన్యను ఈశ్వరునకు ఇమ్ము (36).
బ్రహ్మ ఇట్లు పలికెను -
ఆ మిత్రుల వచనములను విని హిమవంతుడు బ్రహ్మగారి పర్యవేక్షణలో తన కుమార్తెను శివునకు ఇచ్చెను (37). ఓ పరమేశ్వరా! ఈ కన్యను నేను నీ కొరకు ఇచ్చు చున్నాను. ఓ సర్వేశ్వరా! నీవు ప్రసన్ననుడవై ఈమెను భార్యగా స్వీకరించుము (38). హిమవంతడు ఈ మంత్రమును చెప్పి మహాత్ముడగు రుద్రునకు ముల్లోకములకు తల్లి, తనకు కుమార్తె యగు పార్వతిని ఇచ్చెను (39). ఈ తీరున హిమవంతుడు పార్వతి చేతిని శివుని చేతిలో ఉంచి మనస్సులో చాల ఆనందించెను. ఆయన కామనలనే మహాసముద్రమును దాటి వేసెను (40).
పరమేశ్వరుడగు కైలాసపతి ప్రసన్నుడై వెంటనే వేదమంత్రమును పఠించి, పార్వతియొక్క పద్మము వంటి చేతిని తనచేతితో పట్టకొనెను (41). ఓ మునీ! శంకరుడు లోకాచారమును ప్రదర్శించువాడై భూమిని స్పృశించి కామస్య క్రోదాత్ ఇత్యాది మంత్రమును శ్రద్ధగా పఠించెను (42).
అంతటా మహానందమునిచ్చే మహోత్సవము ఆరంభమయ్యెను. భూమి యందు, అంతరిక్షము నందు, స్వర్గమునందు జయధ్వానములు బయలు దేరెను (43). అందరు ఆనందముతో 'బాగు, నమస్కారము' అనుచుండిరి. గంధర్వులు ఆనందముతో పాడగా అప్సరసలు నాట్యమాడిరి (44).
హిమావంతుని రాజ్యములోని పౌరులు మనస్సులో చాల ఆనందించిరి. గొప్ప మంగళ శబ్దములతో కూడిన మహోత్సవము ప్రవర్తిల్లెను (45). నేను, విష్ణువు, ఇంద్రుడు, దేవతలు, మునులు, అందరు వికసించిన ముఖ పద్మములు గలవారై మిక్కిలి ఆనందించితిమి (46).
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 SRI SIVA MAHA PURANA - 539 🌹*
*✍️ J.L. SHASTRI*
*📚. Prasad Bharadwaj *
*🌴 Rudra-saṃhitā (3): Pārvatī-khaṇḍa - CHAPTER 48 🌴*
*🌻 The ceremonious entry of Śiva - 4 🌻*
The mountains said:—
36. O mountain, be firm and stand by your decision to give your daughter. If you say “No”, you stand to lose. We speak the truth. Do not hesitate. Let the girl be given to Śiva.
Brahmā said:—
37. On hearing the words of his friends, Himavat urged by Brahmā gave his daughter to Śiva.
38. “O lord Śiva, I am giving this girl, my daughter to you as your wife. O lord of all, be pleased to accept her.”
39. Himavat gave his daughter Pārvatī, the mother of the three worlds, to Śiva the great, repeating the mantra “Tasmai Rudrāya Mahate”.
40. Placing the hand of Pārvatī in the hand of Śiva the mountain rejoiced much mentally. He had the satisfaction of crossing the ocean of his ambition.
41. Śiva grasped the lotus-like hand of Pārvatī in his hand repeating the Vedic mantras. Lord Śiva was greatly delighted.
42. Touching the ground and showing the worldly course of action, O sage, Śiva recited the mantra “Kāmasya Kodāt”.[3]
43. There was a great jubilation everywhere that gladdened everyone. Cries of “Victory” rose up in the heaven, the earth and the sky.
44. The delighted people shouted “Well done” and “Obeisance to you”. The Gandharvas sang sweetly with pleasure. The celestial damsels danced.
45. The citizens, the subjects of Himavat rejoiced in their minds. There was great auspicious jubilation.
46. Viṣṇu, Indra, I and the gods were delighted, with the faces beaming like full blown lotuses.
Continues....
🌹🌹🌹🌹🌹
#శివమహాపురాణము
#SivaMahaPuranam #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
https://facebook.com/groups/hindupuranas/
https://facebook.com/groups/chaitanyavijnanam/
https://t.me/ChaitanyaVijnanam
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 169 🌹*
*✍️. రచన : సద్గురు ఇ. కృష్ణమాచార్యులు*
*📚 . సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*🌻. భావ బలము - 4 🌻*
*పరిశుద్ధి చెందిన జలములలో ఏదయిన సంచలనమును కలిగించినను, ఎట్టి అవక్షేపమును అడుగునకు జేరదు. రంగు మార్పు జరుగదు. మనలో ఇట్లు పరిశుద్ధీకరణము చెందిన అనుభూతి యొక్క వాహికను పెంపొందించు కొననగును. అనగా, అనుభూతి తన ద్వారమున అందుకొననగు వాహిక అను మాట. ఇట్టి స్థితినే 'స్పూర్తి' అందురు.*
*ఇట్టి స్థితిలో మన సంబాషణ, అవతలి వానిలో ఉద్వేగమును గాక, పరమప్రేమ రూపమగు భక్తిని ప్రేరేపించును. భక్తికి, ఉద్వేగమునకు గల వ్యత్యాసము పరిశుద్ధ జలములకు మట్టితో గూడిన మురికి నీటికి గల వ్యత్యాసము వంటిదే. భక్తి అనునది, మన దృక్పథమును ఉదాత్తము గావించి, మనకు అనుభూతి నందించును.*
.... ✍️ *మాస్టర్ ఇ.కె.*🌻
🌹 🌹 🌹 🌹 🌹
#మాస్టర్‌ఇకెసందేశములు #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share
🌷. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు 🌷
www.facebook.com/groups/masterek/
https://t.me/ChaitanyaVijnanam
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. ఓషో రోజువారీ ధ్యానాలు - 158 / Osho Daily Meditations - 158 🌹*
*📚. ప్రసాద్ భరద్వాజ్*
*🍀 158. అవమానం 🍀*
*🕉. వినయంగా ఉండండి, అప్పుడు మిమ్మల్ని ఎవరూ అవమానించ లేరు. అహంకారాన్ని తగ్గించుకోండి, అప్పుడు మిమ్మల్ని ఎవరూ బాధించ లేరు. 🕉*
*కొన్నిసార్లు ఇతరులు తమ కోపాన్ని బయటపెట్టడానికి సాకులు వెతుక్కోవడం జరుగుతుంది, కానీ మీరు కలవరపడటానికి ఇది కారణం అవదు. ఇక్కడ కేవలం రెండు అవకాశాలు మాత్రమే ఉన్నాయి: అవతలి వ్యక్తి సరైనది అంటున్నప్పుడు, అప్పుడు మీరు అవమానంగా భావిస్తారు; లేదా తప్పుగా ఆరోపిస్తూ ఉంటే, వారు హాస్యాస్పదంగా మాట్లాడుతున్నట్టే కాబట్టి మొత్తం పరిస్థితి హాస్యభరితంగా ఉంటుంది మరియు ఎవరైనా దానిని ఆనందించ వచ్చు.*
*అవతలి వ్యక్తి అన్నది సరైనదని మీకు అనిపిస్తే, ఏది చెప్పినా అంగీకరించండి మరియు వినయంగా ఉండండి. మీరు వినయంగా ఉంటే మీరు ఎప్పుడూ అవమానించ బడలేరు; అన్నది పాయింట్. మీరు ఇప్పటికే చివరి వరుసలో నిలబడి ఉన్నారు; మీరు వెనుకకు విసిరి వేయబడలేరు. మీరు మొదటి వ్యక్తి కావడానికి ప్రయత్నించడం లేదు, కాబట్టి ఎవరూ మిమ్మల్ని అడ్డుకోలేరు. ఇది జీవితం పట్ల మొత్తం సమర్పణా వైఖరి. వినయంగా ఉండండి, అప్పుడు మిమ్మల్ని ఎవరూ అవమానించలేరు. అహంకారం లేకుండా ఉండండి, అప్పుడు మిమ్మల్ని ఎవరూ బాధించ లేరు.*
*కొనసాగుతుంది...*
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Osho Daily Meditations - 158 🌹*
*📚. Prasad Bharadwaj*
*🍀 158. HUMILIATION 🍀*
*🕉 Be humble, then nobody can humiliate you. Be ego less, then nobody can hurt you. 🕉*
*Sometimes it happens that others just find excuses to throw out their anger, but that's no reason for you to get disturbed. There are only two possibilities: Either the other person is right, then you feel humiliated; or the other is wrong, then they are being ridiculous, so the whole situation is humorous and one can enjoy it. If you feel that the other person is right, accept whatever is being said and be humble.*
*If you are humble you can never be humiliated; that is the point. You are already standing in the last row; you cannot be thrown backward. You are not trying to become the first, so nobody can obstruct you. That is the whole Taoist attitude toward life. Be humble, then nobody can humiliate you. Be egoless, then nobody can hurt you.*
*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹
#ఓషోరోజువారీధ్యానములు
#OshoDailyMeditations
#ఓషోబోధనలు #OshoDiscourse
#ఓషోనిర్మలధ్యానములు #PrasadBhardwaj
https://t.me/ChaitanyaVijnanam
http://www.facebook.com/groups/oshoteachings/
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 358 / Sri Lalitha Chaitanya Vijnanam - 358 🌹*
*🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻*
*✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*మూల మంత్రము :*
*🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁*
*🍀 79. తాపత్రయాగ్ని సంతప్త సమాహ్లాదన చంద్రికా ।*
*తరుణీ, తాపసారాధ్యా, తనుమధ్యా, తమోఽపహా ॥ 79 ॥ 🍀*
*🌻 358. 'తరుణీ' 🌻*
*ఎల్లప్పుడునూ యౌవనవతియై యుండునది, గోచరించునది శ్రీమాత అని అర్థము. పదహారు కళలతో కూడిన శ్రీమాత పదహారు సంవత్సరముల వయస్సుగల స్త్రీమూర్తి వలె దర్శన మిచ్చుచుండును. శ్రీరాముడు శ్రీకృష్ణుడు కూడ ఎల్లప్పుడునూ పదహారు వత్సరముల వయస్సుగల వారి వలె గోచరించెడివారు.*
*శతాధిక సంవత్సరములు జీవించిననూ వారు ఎప్పుడునూ పదహారు సంవత్సరముల యువకుల వలెనే గోచరించెడివారు. నేటికిని వారి దర్శన మట్లే యుండును. పూర్ణ కళలతో కూడిన దేహము పదహారు సంవత్సరముల కేర్పడును. అట్టి దేహము అతి సుకుమారముగ నుండును. పవిత్రముగ నుండును. అందముగా నుండును. ఈ రూపమునే తపస్వి జనులు ఆరాధింతురు.*
*సశేషం...*
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 358 🌹*
*Contemplation of 1000 Names of Sri Lalitha Devi*
*✍️. Acharya Ravi Sarma *
*📚. Prasad Bharadwaj*
*🌻 79. Tapatrayagni santapta samahladana chandrika*
*Tatuni tapasaradhya tanumadhya tamo-paha ॥ 79 ॥ 🌻*
*🌻 358. Taruṇī तरुणी 🌻*
*She is eternally youthful. Eternal youth is possible only in the absence of modifications, an exclusive quality of the Brahman.*
*The Brahman is non-decaying and immortal said Bṛhadāraṇyaka Upaniṣad. The eternality of the Brahman is discussed in nāma-s 136, 292, and 344.*
*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹
#శ్రీలలితాసహస్రనామచైతన్యవిజ్ఞానము #SriLalithaChaitanyaVijnanam #లలితాసహస్రనామములు #LalithaSahasranama
#PrasadBhardwaj
https://t.me/srilalithachaitanyavijnanam
http://www.facebook.com/groups/srilalithachaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
https://www.facebook.com/103080154909766/
https://incarnation14.wordpress.com/
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹