శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 358 / Sri Lalitha Chaitanya Vijnanam - 358


🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 358 / Sri Lalitha Chaitanya Vijnanam - 358 🌹

🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻

✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

మూల మంత్రము :

🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁

🍀 79. తాపత్రయాగ్ని సంతప్త సమాహ్లాదన చంద్రికా ।
తరుణీ, తాపసారాధ్యా, తనుమధ్యా, తమోఽపహా ॥ 79 ॥ 🍀

🌻 358. 'తరుణీ' 🌻


ఎల్లప్పుడునూ యౌవనవతియై యుండునది, గోచరించునది శ్రీమాత అని అర్థము. పదహారు కళలతో కూడిన శ్రీమాత పదహారు సంవత్సరముల వయస్సుగల స్త్రీమూర్తి వలె దర్శన మిచ్చుచుండును. శ్రీరాముడు శ్రీకృష్ణుడు కూడ ఎల్లప్పుడునూ పదహారు వత్సరముల వయస్సుగల వారి వలె గోచరించెడివారు.

శతాధిక సంవత్సరములు జీవించిననూ వారు ఎప్పుడునూ పదహారు సంవత్సరముల యువకుల వలెనే గోచరించెడివారు. నేటికిని వారి దర్శన మట్లే యుండును. పూర్ణ కళలతో కూడిన దేహము పదహారు సంవత్సరముల కేర్పడును. అట్టి దేహము అతి సుకుమారముగ నుండును. పవిత్రముగ నుండును. అందముగా నుండును. ఈ రూపమునే తపస్వి జనులు ఆరాధింతురు.


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹


🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 358 🌹

Contemplation of 1000 Names of Sri Lalitha Devi

✍️. Acharya Ravi Sarma
📚. Prasad Bharadwaj

🌻 79. Tapatrayagni santapta samahladana chandrika
Tatuni tapasaradhya tanumadhya tamo-paha ॥ 79 ॥ 🌻


🌻 358. Taruṇī तरुणी 🌻


She is eternally youthful. Eternal youth is possible only in the absence of modifications, an exclusive quality of the Brahman.

The Brahman is non-decaying and immortal said Bṛhadāraṇyaka Upaniṣad. The eternality of the Brahman is discussed in nāma-s 136, 292, and 344.


Continues...

🌹 🌹 🌹 🌹 🌹


25 Mar 2022

No comments:

Post a Comment