శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 550 - 1 / Sri Lalitha Chaitanya Vijnanam - 550 - 1
🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 550 - 1 / Sri Lalitha Chaitanya Vijnanam - 550 - 1 🌹
🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻
✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁
🍀 112. విమర్శరూపిణీ, విద్యా, వియదాది జగత్ప్రసూః ।
సర్వవ్యాధి ప్రశమనీ, సర్వమృత్యు నివారిణీ ॥ 112 ॥ 🍀
🌻 550. 'వియదాది జగత్ప్రసూః' - 1 🌻
ఆకాశము ఆదిగా గల జగత్తును ప్రసవించునది అని అర్థము. ఆకాశము అనగా అంతటా వ్యాపించిన వెలుగు. అంతులేని వెలుగు. అది కేవలము కంటికి కనిపించు వెలుగు మాత్రమే కాదు. వెలుగు చీకటుల కావలి వెలుగు. ఈ వెలుగును అదితి అందురు. ప్రధానము అందురు. సృష్టికి మూలమని మూలప్రకృతి అందురు. ఈ వెలుగు నుండియే జగత్తులన్నియు పుట్టినవి. దీని ప్రధాన లక్షణము ఎరుక. ఇదియే ఈశ్వర లేక ఈశ్వరీ తత్త్వము. దీని నుండి ప్రకృతి పురుషులు పుట్టును. అటుపైన మహదహంకారము పుట్టును. వాని నుండి త్రిగుణములు పుట్టును. త్రిగుణముల నుండియే దేవాసురులు, మానవులు, సకల జీవరాసులు పుట్టును.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 550 - 1 🌹
Contemplation of 1000 Names of Sri Lalitha Devi
✍️ Prasad Bharadwaj
🌻 112. Vimarsharupini vidya viyadadi jagatprasuh
sarvavyadhi prashamani sarvamrutyu nivarini ॥112 ॥ 🌻
🌻 550. 'Viyadadi jagatprasuh' - 1 🌻
It means that the sky gives birth to the primordial world. Akasha is the all-pervading light. Endless light. It is not just visible light. Light is beyond light and darkness. This light is called Aditi. It's primary. It is the source of creation. All the worlds are born from this light. Its main symptom is awareness. This is the essence of Ishwara or Iswari. From this the man and nature are born. Thereon the great ego is born. From there are born trigunas. Devas, asuras, humans and all living beings are born from trigunas.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
నిజమైన ఆనందం / True Happiness
🌹 నిజమైన ఆనందం / True Happiness🌹
✍️. ప్రసాద్ భరధ్వాజ
మీరు తప్పనిసరిగా కావాలనుకుంటే, మీలో స్వీయ-పరివర్తనను తీసుకురావడానికి ఒకే ఒక మార్గం ఉంది. కానీ మీరు ఇప్పటికీ మీ ఆనందాన్ని బయటి నుండి తీసుకుంటూ, దాని ఫలితంగా వచ్చే అసంతృప్తిని తట్టుకోగలుగుతూ ఉంటే, బహూశా మీరు ఈ స్వీయ పరివర్తనను అంత అవసరం అనుకోరు. మీ సంతోషం ఎందుకు హెచ్చుతగ్గులకు లోనవుతుందో తెలుసా? మీ ఆనందం బయటి దేనిపైనైనా ఆధారపడి ఉన్న వెంటనే, మిమ్మల్ని మీరు ఒక స్థితికి, పదార్థానికి లేదా బహుశా ఒక వ్యక్తికి మిమ్మల్ని బానిసగా చేసుకుంటారు. ఒక బానిస ఎప్పుడూ స్వతంత్రుడు కాదు.
మీరు స్వేచ్ఛగా లేకుంటే నిజమైన ఆనందం అసాధ్యం. నిజమైన ఆనందంలో హెచ్చుతగ్గులు ఉండవు. నిజమైన స్వాతంత్య్రం అంటే మీ ఆనందం లోపల నుండి రావడం. అది సాధించడానికి మీరు సంఘటనల పట్ల నిర్లిప్తతను మరియు సమాజం కల్పించే భ్రమలను త్యజించడాన్ని సాధన చేయడం అవసరం. ఎందుకంటే సమాజం మీరు బయటి నుండి అనందాన్ని పొందవచ్చునని భ్రమ కల్పిస్తుంది. కానీ బయటి నుండి లొపలకు కాదు, లోపల నుండి బయటకు ఆనందం ప్రవహిస్తుందని గ్రహించడం సాధకులకు అత్యవసరం.
🌹🌹🌹🌹🌹
🌹 True Happiness 🌹
✍️. Prasad Bharadwaj
There is only one way to bring about self-transformation in yourself, but you must desire it. If you still derive your happiness from outside and can tolerate the resulting unhappiness, you probably won't find this self-transformation so necessary. Do you know why your happiness fluctuates? As soon as your happiness depends on something outside, you enslave yourself to a situation, a substance, or perhaps a person. A slave is never free.
True happiness is impossible if you are not free. True happiness does not fluctuate. True freedom is when your happiness comes from within. To achieve that you need to practice detachment from events and renunciation of the illusions that society creates. Because society creates the illusion that you can find happiness from outside. But it is imperative for the aspirant to realize that happiness flows from within and not from outside to loopholes.
🌹🌹🌹🌹🌹
సిద్దేశ్వరయానం - 90 Siddeshwarayanam - 90
🌹 సిద్దేశ్వరయానం - 90 🌹
💐 శ్రీ సిద్దేశ్వరానంద భారతీ స్వామి విరచిత 💐
🏵 గుహలో స్వామి - 19వ శతాబ్దం 🏵
మా స్వగ్రామం ప్రకాశం జిల్లా ఏల్చూరు. నరసరావుపేటకు 20 కి.మీ. దూరం. మూడు కొండల కింద మావూరు. చుట్టూ దగ్గరి గ్రామాల కొండలు కనిపిస్తుంటవి. వాటిమీద పులులు తిరుగుతుంటవి. ఒకసారి పులిని పట్టుకొని బోనులో పెట్టి ఊరంతా తిప్పారు. అయినా పిల్లలు కొండ ఎక్కుతూనే ఉండేవారు. మా ఊళ్ళో చుట్టూ తోటలు. వాటిలో నెమళ్ళు చాలా ఉండేవి.ఒక పర్యాయం ఆ ప్రాంతంలో పరిపాలకుడైన తెల్లదొర తుపాకీతో నెమళ్ళను వేటాడటానికి వచ్చాడు. అతడి తుపాకీ చప్పుళ్ళకు ఊరు ఉలిక్కిపడింది. చాలామంది అక్కడికి వెళ్ళారు.
నెమళ్ళను చంపవద్దని అభ్యర్థించారు. కాని అహంకార పూరితుడైన ఆంగ్లేయుడు వీళ్ళమాట పెడచెవిని పెట్టాడు. నెమళ్ళ మీదికి తుపాకి గురిపెట్టాడు. అప్పుడు మా తాతగారు లక్ష్మీనరసింహకవి పైఉత్తరీయం నడుముకు కట్టుకొని అతని ఎదురుగా వెళ్ళి అడ్డంగా నిల్చొని ముందునన్ను కాల్చి తరువాత నెమళ్ళను కాల్చు అన్నాడు. ఈ దృశ్యాన్ని ఊహించని తెల్లదొర ఒక క్షణం బిత్తరపోయినాడు. తుపాకీ దించి మారుమాటాడకుండా వెనక్కు వెళ్ళిపోయినాడు.
తన పేరుగల యువకుడీ సాహసం చేయటం కొండమీది గుహలో ఉన్న నరసింహస్వామి చూస్తూనే ఉన్నాడు.అవధానిభూషణ, వినయప్రధానభాషణ అని వారి గ్రంథాల గద్యలో ఉండేది. చాలామృదుభాషి, చిన్నవయస్సులో మారుటూరి పాండురంగారావు అనే మిత్రునితో కలిసి కరుణా సింధువు అనే గ్రంథం రచించినప్పుడు నన్ను ఆశీర్వదిస్తూ చెప్పిన పద్యం మరచిపోలేనిది.
ఉ॥ నేనవధానముల్ సలిపి నిల్పితి తండ్రియశంబు నీవునట్లే నవ కావ్య మొండు రచియించి భవత్పితపేరు నిల్పి వి ద్యానిథి పోతరాట్కులమటన్న సమాఖ్యకు భంగమింతయున్ రాని గతిన్ మెలంగితివి నాయన! నీకు చిరాయువయ్యెడున్
ప్రసిద్ధ పండితులు గురుభాగవతాది బహు గ్రంథకర్త బ్రహ్మశ్రీ మిన్నికంటి గురునాధశర్మగారు మా తాతగారిని గురించి చెపుతూ ఆయన మీద ఎంతో గౌరవంతో పలికిన పద్యమిది.
చం॥ ఎరుగవుగాక నీ బలము నీవు సమీరకుమారు వైఖరిన్ తిరుపతి వేంకటేశ్వరుల దీకొని సత్సభ విన్నకొండ నీ పరపిన పద్యవర్షమున బమ్మెరవోరె? అధీశుడౌ కలె క్టరు పనిబూని అడ్డుపడడా! పరపూర్వుడు బ్రహ్మశాస్త్రియున్
వినుకొండలో తిరుపతి వెంకట కవులతో వివాదం వచ్చి పద్యవర్షం కురిపిస్తుంటే సభాధ్యక్షుడుగా ఉన్న సబ్కలెక్టరు పరబ్రహ్మశాస్త్రి జంటకవుల ఇబ్బంది చూచి ఆపించాడు. ఆ దృశ్యాన్ని గుర్తుచేశారు గురునాధశర్మ గారు.
ఇంతకు ఆ కొండమీది నరసింహస్వామి అనుగ్రహం ఉండబట్టే మా తాతగారి సాహిత్య జీవితం నిరాటంకంగా కొనసాగింది. ఆ మహా శైలగుహావాసియైన నరసింహస్వామిని చూడటానికి చిన్నతనంలో పరుగెత్తు కుంటూ మెట్లెక్కి వెళ్ళేవాళ్ళము. ఆ స్వామి ఆకృతిని ఆ గుహను మనస్సులో నిక్షిప్తం చేసుకొని తరువాతి కాలంలో ఒక పద్యం వ్రాశాను.
సీ॥ దారుణారుణ సముద్భటసటాపాళికి కమ్మ సంపెగతావి కలయ చూసి పటుశిలా కఠినమౌ వక్షస్థలంబున సురభి చందనము కస్తూరి నలది క్రకచ భీషణ దంష్ట్రికలనుండి చల్లని చిరునవ్వు వెన్నెలల్ చిలకరించి కహకహారవ ఘోరగర్జనల్ విడనాడి గళమున గాంధర్వగానమూని
గీ॥ శ్రీమహాలక్ష్మి చేతము చిగురులొత్త! భవ్యశృంగారమూర్తి వై వచ్చినావొ జ్వాలికామాలికా యోగశక్తిరంహ! గిళిత భక్తాంహ! యేర్చూరి గిరినృసింహ!
ఆ కొండగుహలోన నా గుండెగుహలోన కొలువు దీరిన నారసింహా! కులదైవమని పిల్చి యిలవేలుపని కొల్చి నిన్నె నమ్మితి శక్తి రంహా!
( సశేషం )
🌹🌹🌹🌹🌹
శ్రీమద్భగవద్గీత - 546: 14వ అధ్., శ్లో 22 / Bhagavad-Gita - 546: Chap. 14, Ver. 22
🌹. శ్రీమద్భగవద్గీత - 546 / Bhagavad-Gita - 546 🌹
✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ
🌴. 14వ అధ్యాయము - గుణత్రయ విభాగ యోగము - ప్రకృతి త్రిగుణములు - 22 🌴
22. శ్రీ భగవానువాచ
ప్రకాశం చ ప్రవృత్తిం చ మెహమేవ చ పాణ్డవ |
న ద్వేష్టి సంప్రవృత్తాని న నివృత్తాని కాంక్షతి ||
🌷. తాత్పర్యం : శ్రీ భగవానుడిట్లనియెను: హే పాండవా! సంప్రాప్తములైన సత్త్వగుణ సంబంధమగు ప్రకాశమును, రజోగుణ సంబంధమగు కర్మప్రవృత్తిని, తమోగుణ సంబంధమగు మోహమును ఎవడు ద్వేషింపడో, ఇవి విడిచి పోయినచో వీటిని తిరిగి కోరడో అట్టివాడు త్రిగుణాతీతుడగును.
🌷. భాష్యము :
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Bhagavad-Gita as It is - 546 🌹
✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj
🌴 Chapter 14 - Gunatraya Vibhaga Yoga - Nature, 3 Gunas - 22 🌴
22. śrī-bhagavān uvāca
prakāśaṁ ca pravṛttiṁ ca moham eva ca pāṇḍava
na dveṣṭi sampravṛttāni na nivṛttāni kāṅkṣati
🌷 Translation : The Blessed Lord said: Light, activity and delusion,—when they are present, O Arjuna, he hates not, nor does he long for them when they are absent!
🌹 Purport :
🌹 🌹 🌹 🌹 🌹
✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ
🌴. 14వ అధ్యాయము - గుణత్రయ విభాగ యోగము - ప్రకృతి త్రిగుణములు - 22 🌴
22. శ్రీ భగవానువాచ
ప్రకాశం చ ప్రవృత్తిం చ మెహమేవ చ పాణ్డవ |
న ద్వేష్టి సంప్రవృత్తాని న నివృత్తాని కాంక్షతి ||
🌷. తాత్పర్యం : శ్రీ భగవానుడిట్లనియెను: హే పాండవా! సంప్రాప్తములైన సత్త్వగుణ సంబంధమగు ప్రకాశమును, రజోగుణ సంబంధమగు కర్మప్రవృత్తిని, తమోగుణ సంబంధమగు మోహమును ఎవడు ద్వేషింపడో, ఇవి విడిచి పోయినచో వీటిని తిరిగి కోరడో అట్టివాడు త్రిగుణాతీతుడగును.
🌷. భాష్యము :
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Bhagavad-Gita as It is - 546 🌹
✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj
🌴 Chapter 14 - Gunatraya Vibhaga Yoga - Nature, 3 Gunas - 22 🌴
22. śrī-bhagavān uvāca
prakāśaṁ ca pravṛttiṁ ca moham eva ca pāṇḍava
na dveṣṭi sampravṛttāni na nivṛttāni kāṅkṣati
🌷 Translation : The Blessed Lord said: Light, activity and delusion,—when they are present, O Arjuna, he hates not, nor does he long for them when they are absent!
🌹 Purport :
🌹 🌹 🌹 🌹 🌹
🌹 29, JUNE 2024 SATURDAY ALL MESSAGES శనివారం, స్థిర వాసర సందేశాలు🌹
🍀🌹 29, JUNE 2024 SATURDAY ALL MESSAGES శనివారం, స్థిర వాసర సందేశాలు🌹🍀
1) 🌹. శ్రీమద్భగవద్గీత - 546 / Bhagavad-Gita - 546 🌹
🌴. 14వ అధ్యాయము - గుణత్రయ విభాగ యోగము - ప్రకృతి త్రిగుణములు - 22 / Chapter 14 - Gunatraya Vibhaga Yoga - Nature, 3 Gunas - 22 🌴
3) 🌹 సిద్దేశ్వరయానం - 90 🌹
🏵 గుహలో స్వామి - 19వ శతాబ్దం 🏵
4) 🌹 నిజమైన ఆనందం / True Happiness🌹
5) 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 550 - 1 / Sri Lalitha Chaitanya Vijnanam - 550 - 1 🌹
🌻 550. 'వియదాది జగత్ప్రసూః' - 1 / 550. 'Viyadadi jagatprasuh' - 1 🌻
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శ్రీమద్భగవద్గీత - 546 / Bhagavad-Gita - 546 🌹*
*✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ*
*🌴. 14వ అధ్యాయము - గుణత్రయ విభాగ యోగము - ప్రకృతి త్రిగుణములు - 22 🌴*
*22. శ్రీ భగవానువాచ*
*ప్రకాశం చ ప్రవృత్తిం చ మెహమేవ చ పాణ్డవ |*
*న ద్వేష్టి సంప్రవృత్తాని న నివృత్తాని కాంక్షతి ||*
*🌷. తాత్పర్యం : శ్రీ భగవానుడిట్లనియెను: హే పాండవా! సంప్రాప్తములైన సత్త్వగుణ సంబంధమగు ప్రకాశమును, రజోగుణ సంబంధమగు కర్మప్రవృత్తిని, తమోగుణ సంబంధమగు మోహమును ఎవడు ద్వేషింపడో, ఇవి విడిచి పోయినచో వీటిని తిరిగి కోరడో అట్టివాడు త్రిగుణాతీతుడగును.*
🌷. భాష్యము :
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Bhagavad-Gita as It is - 546 🌹*
*✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj*
*🌴 Chapter 14 - Gunatraya Vibhaga Yoga - Nature, 3 Gunas - 22 🌴*
*22. śrī-bhagavān uvāca*
*prakāśaṁ ca pravṛttiṁ ca moham eva ca pāṇḍava*
*na dveṣṭi sampravṛttāni na nivṛttāni kāṅkṣati*
*🌷 Translation : The Blessed Lord said: Light, activity and delusion,—when they are present, O Arjuna, he hates not, nor doeshe long for them when they are absent!*
🌹 Purport :
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹 సిద్దేశ్వరయానం - 90 🌹*
*💐 శ్రీ సిద్దేశ్వరానంద భారతీ స్వామి విరచిత 💐*
*🏵 గుహలో స్వామి - 19వ శతాబ్దం 🏵*
*మా స్వగ్రామం ప్రకాశం జిల్లా ఏల్చూరు. నరసరావుపేటకు 20 కి.మీ. దూరం. మూడు కొండల కింద మావూరు. చుట్టూ దగ్గరి గ్రామాల కొండలు కనిపిస్తుంటవి. వాటిమీద పులులు తిరుగుతుంటవి. ఒకసారి పులిని పట్టుకొని బోనులో పెట్టి ఊరంతా తిప్పారు. అయినా పిల్లలు కొండ ఎక్కుతూనే ఉండేవారు. మా ఊళ్ళో చుట్టూ తోటలు. వాటిలో నెమళ్ళు చాలా ఉండేవి.ఒక పర్యాయం ఆ ప్రాంతంలో పరిపాలకుడైన తెల్లదొర తుపాకీతో నెమళ్ళను వేటాడటానికి వచ్చాడు. అతడి తుపాకీ చప్పుళ్ళకు ఊరు ఉలిక్కిపడింది. చాలామంది అక్కడికి వెళ్ళారు.*
*నెమళ్ళను చంపవద్దని అభ్యర్థించారు. కాని అహంకార పూరితుడైన ఆంగ్లేయుడు వీళ్ళమాట పెడచెవిని పెట్టాడు. నెమళ్ళ మీదికి తుపాకి గురిపెట్టాడు. అప్పుడు మా తాతగారు లక్ష్మీనరసింహకవి పైఉత్తరీయం నడుముకు కట్టుకొని అతని ఎదురుగా వెళ్ళి అడ్డంగా నిల్చొని ముందునన్ను కాల్చి తరువాత నెమళ్ళను కాల్చు అన్నాడు. ఈ దృశ్యాన్ని ఊహించని తెల్లదొర ఒక క్షణం బిత్తరపోయినాడు. తుపాకీ దించి మారుమాటాడకుండా వెనక్కు వెళ్ళిపోయినాడు.*
*తన పేరుగల యువకుడీ సాహసం చేయటం కొండమీది గుహలో ఉన్న నరసింహస్వామి చూస్తూనే ఉన్నాడు.అవధానిభూషణ, వినయప్రధానభాషణ అని వారి గ్రంథాల గద్యలో ఉండేది. చాలామృదుభాషి, చిన్నవయస్సులో మారుటూరి పాండురంగారావు అనే మిత్రునితో కలిసి కరుణా సింధువు అనే గ్రంథం రచించినప్పుడు నన్ను ఆశీర్వదిస్తూ చెప్పిన పద్యం మరచిపోలేనిది.*
*ఉ॥ నేనవధానముల్ సలిపి నిల్పితి తండ్రియశంబు నీవునట్లే నవ కావ్య మొండు రచియించి భవత్పితపేరు నిల్పి వి ద్యానిథి పోతరాట్కులమటన్న సమాఖ్యకు భంగమింతయున్ రాని గతిన్ మెలంగితివి నాయన! నీకు చిరాయువయ్యెడున్*
*ప్రసిద్ధ పండితులు గురుభాగవతాది బహు గ్రంథకర్త బ్రహ్మశ్రీ మిన్నికంటి గురునాధశర్మగారు మా తాతగారిని గురించి చెపుతూ ఆయన మీద ఎంతో గౌరవంతో పలికిన పద్యమిది.*
*చం॥ ఎరుగవుగాక నీ బలము నీవు సమీరకుమారు వైఖరిన్ తిరుపతి వేంకటేశ్వరుల దీకొని సత్సభ విన్నకొండ నీ పరపిన పద్యవర్షమున బమ్మెరవోరె? అధీశుడౌ కలె క్టరు పనిబూని అడ్డుపడడా! పరపూర్వుడు బ్రహ్మశాస్త్రియున్*
*వినుకొండలో తిరుపతి వెంకట కవులతో వివాదం వచ్చి పద్యవర్షం కురిపిస్తుంటే సభాధ్యక్షుడుగా ఉన్న సబ్కలెక్టరు పరబ్రహ్మశాస్త్రి జంటకవుల ఇబ్బంది చూచి ఆపించాడు. ఆ దృశ్యాన్ని గుర్తుచేశారు గురునాధశర్మ గారు.*
*ఇంతకు ఆ కొండమీది నరసింహస్వామి అనుగ్రహం ఉండబట్టే మా తాతగారి సాహిత్య జీవితం నిరాటంకంగా కొనసాగింది. ఆ మహా శైలగుహావాసియైన నరసింహస్వామిని చూడటానికి చిన్నతనంలో పరుగెత్తు కుంటూ మెట్లెక్కి వెళ్ళేవాళ్ళము. ఆ స్వామి ఆకృతిని ఆ గుహను మనస్సులో నిక్షిప్తం చేసుకొని తరువాతి కాలంలో ఒక పద్యం వ్రాశాను.*
*సీ॥ దారుణారుణ సముద్భటసటాపాళికి కమ్మ సంపెగతావి కలయ చూసి పటుశిలా కఠినమౌ వక్షస్థలంబున సురభి చందనము కస్తూరి నలది క్రకచ భీషణ దంష్ట్రికలనుండి చల్లని చిరునవ్వు వెన్నెలల్ చిలకరించి కహకహారవ ఘోరగర్జనల్ విడనాడి గళమున గాంధర్వగానమూని*
*గీ॥ శ్రీమహాలక్ష్మి చేతము చిగురులొత్త! భవ్యశృంగారమూర్తి వై వచ్చినావొ జ్వాలికామాలికా యోగశక్తిరంహ! గిళిత భక్తాంహ! యేర్చూరి గిరినృసింహ!*
*ఆ కొండగుహలోన నా గుండెగుహలోన కొలువు దీరిన నారసింహా! కులదైవమని పిల్చి యిలవేలుపని కొల్చి నిన్నె నమ్మితి శక్తి రంహా!*
*( సశేషం )*
🌹🌹🌹🌹🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹 నిజమైన ఆనందం / True Happiness🌹*
*✍️. ప్రసాద్ భరధ్వాజ*
*మీరు తప్పనిసరిగా కావాలనుకుంటే, మీలో స్వీయ-పరివర్తనను తీసుకురావడానికి ఒకే ఒక మార్గం ఉంది. కానీ మీరు ఇప్పటికీ మీ ఆనందాన్ని బయటి నుండి తీసుకుంటూ, దాని ఫలితంగా వచ్చే అసంతృప్తిని తట్టుకోగలుగుతూ ఉంటే, బహూశా మీరు ఈ స్వీయ పరివర్తనను అంత అవసరం అనుకోరు. మీ సంతోషం ఎందుకు హెచ్చుతగ్గులకు లోనవుతుందో తెలుసా? మీ ఆనందం బయటి దేనిపైనైనా ఆధారపడి ఉన్న వెంటనే, మిమ్మల్ని మీరు ఒక స్థితికి, పదార్థానికి లేదా బహుశా ఒక వ్యక్తికి మిమ్మల్ని బానిసగా చేసుకుంటారు. ఒక బానిస ఎప్పుడూ స్వతంత్రుడు కాదు.*
*మీరు స్వేచ్ఛగా లేకుంటే నిజమైన ఆనందం అసాధ్యం. నిజమైన ఆనందంలో హెచ్చుతగ్గులు ఉండవు. నిజమైన స్వాతంత్య్రం అంటే మీ ఆనందం లోపల నుండి రావడం. అది సాధించడానికి మీరు సంఘటనల పట్ల నిర్లిప్తతను మరియు సమాజం కల్పించే భ్రమలను త్యజించడాన్ని సాధన చేయడం అవసరం. ఎందుకంటే సమాజం మీరు బయటి నుండి అనందాన్ని పొందవచ్చునని భ్రమ కల్పిస్తుంది. కానీ బయటి నుండి లొపలకు కాదు, లోపల నుండి బయటకు ఆనందం ప్రవహిస్తుందని గ్రహించడం సాధకులకు అత్యవసరం.*
🌹🌹🌹🌹🌹
*🌹 True Happiness 🌹*
*✍️. Prasad Bharadwaj*
*There is only one way to bring about self-transformation in yourself, but you must desire it. If you still derive your happiness from outside and can tolerate the resulting unhappiness, you probably won't find this self-transformation so necessary. Do you know why your happiness fluctuates? As soon as your happiness depends on something outside, you enslave yourself to a situation, a substance, or perhaps a person. A slave is never free.*
*True happiness is impossible if you are not free. True happiness does not fluctuate. True freedom is when your happiness comes from within. To achieve that you need to practice detachment from events and renunciation of the illusions that society creates. Because society creates the illusion that you can find happiness from outside. But it is imperative for the aspirant to realize that happiness flows from within and not from outside to loopholes.*
🌹🌹🌹🌹🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 550 - 1 / Sri Lalitha Chaitanya Vijnanam - 550 - 1 🌹*
*🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻*
*✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁*
*🍀 112. విమర్శరూపిణీ, విద్యా, వియదాది జగత్ప్రసూః ।*
*సర్వవ్యాధి ప్రశమనీ, సర్వమృత్యు నివారిణీ ॥ 112 ॥ 🍀*
*🌻 550. 'వియదాది జగత్ప్రసూః' - 1 🌻*
*ఆకాశము ఆదిగా గల జగత్తును ప్రసవించునది అని అర్థము. ఆకాశము అనగా అంతటా వ్యాపించిన వెలుగు. అంతులేని వెలుగు. అది కేవలము కంటికి కనిపించు వెలుగు మాత్రమే కాదు. వెలుగు చీకటుల కావలి వెలుగు. ఈ వెలుగును అదితి అందురు. ప్రధానము అందురు. సృష్టికి మూలమని మూలప్రకృతి అందురు. ఈ వెలుగు నుండియే జగత్తులన్నియు పుట్టినవి. దీని ప్రధాన లక్షణము ఎరుక. ఇదియే ఈశ్వర లేక ఈశ్వరీ తత్త్వము. దీని నుండి ప్రకృతి పురుషులు పుట్టును. అటుపైన మహదహంకారము పుట్టును. వాని నుండి త్రిగుణములు పుట్టును. త్రిగుణముల నుండియే దేవాసురులు, మానవులు, సకల జీవరాసులు పుట్టును.*
*సశేషం...*
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 550 - 1 🌹*
*Contemplation of 1000 Names of Sri Lalitha Devi*
*✍️ Prasad Bharadwaj*
*🌻 112. Vimarsharupini vidya viyadadi jagatprasuh*
*sarvavyadhi prashamani sarvamrutyu nivarini ॥112 ॥ 🌻*
*🌻 550. 'Viyadadi jagatprasuh' - 1 🌻*
*It means that the sky gives birth to the primordial world. Akasha is the all-pervading light. Endless light. It is not just visible light. Light is beyond light and darkness. This light is called Aditi. It's primary. It is the source of creation. All the worlds are born from this light. Its main symptom is awareness. This is the essence of Ishwara or Iswari. From this the man and nature are born. Thereon the great ego is born. From there are born trigunas. Devas, asuras, humans and all living beings are born from trigunas.*
*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
#నిత్యసందేశములు #DailyMessages
Join and Share
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom
https://t.me/+9zDjTpPe_PQzMWVl
https://t.me/Sivasutras
https://t.me/Seeds_Of_Consciousness
https://t.me/bhagavadgeethaa/
https://t.me/AgniMahaPuranam
https://t.me/+LmH1GyjNXXlkNDRl
http://www.facebook.com/groups/srilalithachaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/
https://prasadbharadwaj.wixsite.com/dailybhaktimessages3
https://www.kooapp.com/profile/Prasad_Bharadwaj
https://www.threads.net/@prasad.bharadwaj
Subscribe to:
Posts (Atom)