1) 🌹 శ్రీమద్భగవద్గీత - 622 / Bhagavad-Gita - 622🌹
2) 🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 254, 255 / Vishnu Sahasranama Contemplation - 254, 255🌹
3) 🌹 Daily Wisdom - 41🌹
4) 🌹. వివేక చూడామణి - 05 🌹
5) 🌹Viveka Chudamani - 05 🌹
6) 🌹. దేవాపి మహర్షి బోధనలు - 15🌹
7) 🌷. అహం వదిలితే.. హద్దుల్లేని ఆకాశం నీదే 🌷
🍀. ‘స్వేచ్ఛ. మీరనుకుంటున్నది కాదు’ నుంచి ( ఓషో బోధ ) 🍀
8) 🌹. శ్రీమద్భగవద్గీత - 12 / Bhagavad-Gita - 12🌹
9) 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 192 / Sri Lalita Chaitanya Vijnanam - 192🌹
10) 🌹. శ్రీమద్భగవద్గీత - 535 / Bhagavad-Gita - 535 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శ్రీమద్భగవద్గీత - 622 / Bhagavad-Gita - 622 🌹*
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ
*🌴. 18వ అధ్యాయము - మోక్ష సన్యాస యోగం - సన్న్యాసము యొక్క పూర్ణత్వము - 39 🌴*
39. యదగ్రే చానుబన్దే చ సుఖం మోహనమాత్మన : |
నిద్రాలస్యప్రమాదోత్థం తత్తామసముదాహృతమ్ ||
🌷. తాత్పర్యం :
ఆత్మానుభవదృష్టి లేనిదియు, ఆది నుండి అంత్యము వరకు మోహ కారణమైనదియు, నిద్ర, సోమరితనము, భ్రాంతుల నుండి ఉద్భవించినదియు నైన సుఖము తమోగుణప్రధానమైనదని చెప్పబడును.
🌷. భాష్యము :
సోమరితనము మరియు నిద్ర యందు ఆనందము పొందువాడు నిక్కము తమోగుణమునందు స్థితుడైనట్టివాడే. అలాగుననే ఏ విధముగా వర్తించవలెనో, ఏ విధముగా వర్తించరాదో ఎరుగజాలనివాడు కూడా తమోగుణసహితుడే. అట్టివానికి ప్రతిదియు భ్రాంతియే.
ఆద్యంతములందును వానికి సుఖము లభింపదు. రజోగుణస్వభావునకు ఆదిలో బుద్భుదప్రాయమైన సుఖము మరియు అంత్యమున దుఃఖము లభించును, తమోగుణునికి మాత్రము ఆద్యంతములు రెండింటి యందును దుఖమే ప్రాప్తించును.
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Bhagavad-Gita as It is - 622 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj
*🌴 Chapter 18 - Moksha Sanyasa Yoga - The Perfection of Renunciation - 39 🌴*
39. yad agre cānubandhe ca
sukhaṁ mohanam ātmanaḥ
nidrālasya-pramādotthaṁ
tat tāmasam udāhṛtam
🌷 Translation :
And that happiness which is blind to self-realization, which is delusion from beginning to end and which arises from sleep, laziness and illusion is said to be of the nature of ignorance.
🌹 Purport :
One who takes pleasure in laziness and in sleep is certainly in the mode of darkness, ignorance, and one who has no idea how to act and how not to act is also in the mode of ignorance. For the person in the mode of ignorance, everything is illusion.
There is no happiness either in the beginning or at the end. For the person in the mode of passion there might be some kind of ephemeral happiness in the beginning and at the end distress, but for the person in the mode of ignorance there is only distress both in the beginning and at the end.
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 254, 255 / Vishnu Sahasranama Contemplation - 254, 255 🌹*
📚. ప్రసాద్ భరద్వాజ
*🌻 254. సిద్ధిదః, सिद्धिदः, Siddhidaḥ 🌻*
*ఓం సిద్ధిదాయ నమః | ॐ सिद्धिदाय नमः | OM Siddhidāya namaḥ*
సిద్ధిదః, सिद्धिदः, Siddhidaḥ
సిద్ధిం ఫలం కర్తృభ్యః స్వాధికారాను రూపతః దదాతి కర్మల ననుష్ఠించిన కర్తలకు సిద్ధి లేదా కర్మఫలమును వారి వారి యోగ్యతను అనుసరించి ఇచ్చును.
:: పోతన భాగవతము - దశమ స్కంధము, పూర్వభాగము ::
క. కర్మమునఁ బుట్టు జంతువు, కర్మమునన వృద్ధిఁ బొందుఁ గర్మమునఁ జెడుం
గర్మమే జనులకు దేవత, కర్మమే సుఖదుఃఖములకుఁ గారణ మధిపా!
మహారాజా! తాను చేసిన కర్మము చేతనే ప్రాణి పుడుతుంది. కర్మంచేతనే వృద్ధి పొందుతున్నది. ఆ కర్మంచేతనే లయిస్తున్నది. కనుక కర్మమే జనులకు దైవం. కర్మమే జీవుల దుఃఖానికీ, సుఖానికీ హేతువు.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
*🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 254🌹*
📚. Prasad Bharadwaj
*🌻254. Siddhidaḥ🌻*
*OM Siddhidāya namaḥ*
Siddhiṃ phalaṃ kartr̥bhyaḥ svādhikārānu rūpataḥ dadāti / सिद्धिं फलं कर्तृभ्यः स्वाधिकारानु रूपतः ददाति He who bestows Siddhi or the apt results upon those who have performed karma or action according to their merit or worthiness.
Śrīmad Bhāgavata - Canto 11, Chapter 20
Yadr̥cchayā matkathādau jātaśraddhastu yaḥ pumān,
Na nirviṇṇo nātisakto bhaktiyogo’sya siddhidaḥ. (8)
:: श्रीमद्भागवत - एकादशस्कन्धे, विंषोऽध्यायः ::
यदृच्छया मत्कथादौ जातश्रद्धस्तु यः पुमान् ।
न निर्विण्णो नातिसक्तो भक्तियोगोऽस्य सिद्धिदः ॥ ८ ॥
If somehow or other by good fortune one develops faith in hearing and chanting My glories, such a person, being neither very disgusted with nor attached to material life, should achieve perfection through the path of loving devotion to Me.
🌻 🌻 🌻 🌻 🌻
Source Sloka
असंख्येयोऽप्रमेयात्मा विशिष्टश्शिष्टकृच्छुचिः ।सिद्दार्थस्सिद्धसङ्कल्पः सिद्धिदस्सिद्धिसाधनः ॥ २७ ॥
అసంఖ్యేయోఽప్రమేయాత్మా విశిష్టశ్శిష్టకృచ్ఛుచిః ।సిద్దార్థస్సిద్ధసఙ్కల్పః సిద్ధిదస్సిద్ధిసాధనః ॥ ౨౭ ॥
Asaṃkhyeyo’prameyātmā viśiṣṭaśśiṣṭakr̥cchuciḥ ।Siddārthassiddhasaṅkalpaḥ siddhidassiddhisādhanaḥ ॥ 27 ॥
Continues....
🌹 🌹 🌹 🌹 🌹
*🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 255 / Vishnu Sahasranama Contemplation - 255🌹*
📚. ప్రసాద్ భరద్వాజ
*🌻255. సిద్ధి సాధనః, सिद्धि साधनः, Siddhi sādhanaḥ🌻*
*ఓం సిద్ధిసాధనాయ నమః | ॐ सिद्धिसाधनाय नमः | OM Siddhisādhanāya namaḥ*
సిద్ధి సాధనః, सिद्धि साधनः, Siddhi sādhanaḥ
యస్సాధకః క్రియాసిద్ధేస్సహరిస్సిద్ధిసాధనః క్రియకు తగిన సిద్ధిని లేదా ఫలమును సాధించి ఇచ్చువాడు.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
*🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 255🌹*
📚. Prasad Bharadwaj
*🌻255. Siddhi sādhanaḥ🌻*
*OM Siddhisādhanāya namaḥ*
Yassādhakaḥ kriyāsiddhessaharissiddhisādhanaḥ / यस्साधकः क्रियासिद्धेस्सहरिस्सिद्धिसाधनः He is the means or sādhana to siddhi or fulfillment.
🌻 🌻 🌻 🌻 🌻
Source Sloka
असंख्येयोऽप्रमेयात्मा विशिष्टश्शिष्टकृच्छुचिः ।सिद्दार्थस्सिद्धसङ्कल्पः सिद्धिदस्सिद्धिसाधनः ॥ २७ ॥
అసంఖ్యేయోఽప్రమేయాత్మా విశిష్టశ్శిష్టకృచ్ఛుచిః ।సిద్దార్థస్సిద్ధసఙ్కల్పః సిద్ధిదస్సిద్ధిసాధనః ॥ ౨౭ ॥
Asaṃkhyeyo’prameyātmā viśiṣṭaśśiṣṭakr̥cchuciḥ ।Siddārthassiddhasaṅkalpaḥ siddhidassiddhisādhanaḥ ॥ 27 ॥
Continues....
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹 DAILY WISDOM - 41 🌹*
*🍀 📖 Philosophy of Yoga 🍀*
📝 Swami Krishnananda
📚. Prasad Bharadwaj
*🌻 10. Yoga is a Process of Rejoicing 🌻*
Yoga is a process of rejoicing. It is not a suffering. It is a movement through happiness. From one state of joy, we move to another state of joy. It is not that yoga starts with sorrow, or that it is a kind of prison house into which we are thrown.
We have sometimes a feeling that yoga is a torture, a suffering, to the normal life of man. Sadhana means a fear, and indicates an unnatural seriousness. This is so, often because people have created a picture of awe and sternness about yoga, an other-worldliness about it, dissociated from the natural likings of the human being. Our desires are, no doubt, obstacles to yoga.
But they are ‘our’ desires; this much we must remember, and they are not somebody’s. So, we have to wean ourselves from these desires gradually and not make it appear that we are peeling our own skin. Such a drastic step should not be taken, and it is not the intention of yoga.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. వివేక చూడామణి - 5 🌹*
✍️ రచన : సద్గురు పేర్నేటి గంగాధర రావు
📚. ప్రసాద్ భరద్వాజ
*🌻 3. సాధకుడు - 3 🌻*
27. అజ్ఞానముతో కూడిన బంధనాల నుండి విముక్తిని పొందుట, కోరికల నుండి విడివడుట ద్వారా అహంకారమును తొలగించు కొనుటనే ముముక్షుత్వమని చెప్పబడింది.
28. బద్దకము, పాలుమాలికను వదలి గురువు యొక్క దయతో స్వేచ్ఛను పొంది వైరాగ్యముతో సమత్వ స్థితిని, శాంతిని పొందుట చేయాలి.
29. ఈ విషయములలో ముఖ్యముగా లౌకిక విషయాలకు అతీతముగా ఉంటూ స్వేచ్ఛ కొరకు ప్రాకులాడుచూ, ఉన్నతమైన శాంతిని పొందుతూ ఇతర సాధనలు చేయుట నిజమైన ఫలితాలను ఇస్తుంది.
30. ఎడారిలోని నీటిలాగ కేవలము ప్రాపంచిక విషయాలకు దూరముగా ఉంటూ స్వేచ్ఛ కొరకు ప్రశాంతత కొరకు చేయు సామాన్య ఫలితములన్నియూ నిష్ఫలము.
31. జన్మ రాహిత్యానికి, భక్తికి చేయు ప్రయత్నాలు అత్యున్నత స్థానమును ఆక్రమిస్తాయి. భక్తి అనేది ద్వైత సిద్దాంతము ప్రకారము ఒక దివ్యాత్మ మీద ప్రేమను వ్యక్తము చేస్తున్నప్పటికి, అద్వైత సిద్ధాంతము ప్రకారము పరమాత్మ ఒక్కడే. పూజింపదగినవాడు. ఈ రెండు వేరుగా చెప్పబడినప్పటికి, పరమాత్మ అంశయైన దివ్యాత్మకు, పరమాత్మకు ఎక్కువ భేదము లేదని, అవి దాదాపు సమానమని చెప్పవచ్చు.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹VIVEKA CHUDAMANI - 5 🌹*
✍️ Swami Madhavananda
📚 Prasad Bharadwaj
*🌻 3. Seeker - 3 🌻*
27. Mumukshuta or yearning for Freedom is the desire to free oneself, by realising one’strue nature, from all bondages from that of egoism to that of the body – bondages superimposed by Ignorance.
28. Even though torpid or mediocre, this yearning for Freedom, through the grace of theGuru, may bear fruit (being developed) by means of Vairagya (renunciation), Shama (calmness), and so on.
29. In his case, verily, whose renunciation and yearning for Freedom are intense,calmness and the other practices have (really) their meaning and bear fruit.
30. Where (however) this renunciation and yearning for Freedom are torpid, therecalmness and the other practices are as mere appearances, like water in a desert..
31. Among things conducive to Liberation, devotion (Bhakti) holds the supreme place.The seeking after one’s real nature is designated as devotion.
Continues....
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. దేవాపి మహర్షి బోధనలు - 15 🌹*
✍️. సద్గురు కె. పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
*🌻 6. గోపాల మంత్రము -2 🌻*
'గోపా' శబ్దము, పరిరక్షింపబడి అమృత పానము చేయుచు సామరస్యమును, విజయమును, పొందిన జీవాత్మను సూచించును. గోప, గోపీజనులనగా వీరే. సూర్య చంద్రాత్మక ప్రజ్ఞలుగ సృష్టి వలయమును ఏర్పరచువారు కూడా వీరే.
వీరు పొందు తాదాత్మ్యస్థితిని శబ్దపరముగ ఇంద్రబీజము అయిన 'ల' అను అక్షరముగ ఋషులు తెలిపిరి. పానము, పరిరక్షణము, అమృతత్త్వము, సామరస్యము, విజయము అను గుణములన్నియు 'గోపాల' అను శబ్దమున ఇమిడి యున్నవి. గోపాల మంత్రముచే ఇట్లు తాదాత్మ్యము చెందిన జీవులు ఎందరో కలరు.
శ్రీకృష్ణుని గానము, భజనము, ధ్యానము, స్మరణము చేసిన భక్తులు పరిసరముల ప్రభావము నండి పరిరక్షింపబడుట కృష్ణభావనా పారవశ్యమున జీవించుట ఇందలి రహస్యము.
జగద్గురువగు శ్రీకృష్ణుడు తనను ధ్యానము చేసిన వారందరికీ పై విజయమును అనుగ్రహించు చుండును. జీవుని ప్రయాణమున ప్రతి నిత్యము మాధుర్యము నిండి యుండుట, జీవితము వైభవోపేతముగా ముందుకు సాగుట ఇందలి అద్భుతము.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌷. అహం వదిలితే.. హద్దుల్లేని ఆకాశం నీదే 🌷*
*🍀. ‘స్వేచ్ఛ. మీరనుకుంటున్నది కాదు’ నుంచి ( ఓషో బోధ ) 🍀*
అంతమాత్రాన మీరు తల్లి గర్భంలోనే శాశ్వతంగా ఉండిపోవాలని కోరుకుంటారా? నిజమే. తల్లి గర్భంలో చాలా సౌకర్యంగానే ఉంటుంది. అంతకన్నా గొప్ప సౌకర్యాన్ని ఇంతవరకు సృష్టించలేక పోయామని శాస్తజ్ఞ్రులు కూడా ఒప్పుకున్నారు. అంత మాత్రాన అదే జీవితం కాదు. అసలైన జీవితం ఎప్పుడూ బహిరంగ ప్రపంచంలోనే- చాలా ఆటవికంగా- ఉంటుంది.
‘‘ఎక్స్‌టసీ’’అనే ఆంగ్ల పదానికి చాలా ప్రాముఖ్యత ఉంది. ‘‘ఎక్స్‌టసీ’’ అంటే ‘‘బయటపడడం’’అని అర్థం. అంటే, అన్నిరకాల సౌకర్యాలు, భద్రతలనుంచి, మృత్యు సమానమైన అహం అడ్డగోడలనుంచి బయటపడి, ఒక ప్రక్రియగా మారి హాయిగా, స్వేచ్ఛగా అడుగు ముందుకు వెయ్యడం, ‘‘ఎక్స్‌టసీ (పరవశం)’’అంటే అదే. అప్పుడే మీ నుంచి పవనాలు పయనించగలవు.
‘‘అది చాలా అద్భుతమైన అనుభవం’’ అని మనం అప్పుడప్పుడు అంటూ ఉంటాం.
విత్తనం మొలకెత్తడం, తల్లిగర్భంలో లభించే సౌకర్యాలన్నింటినీ వదిలి తెలియని ప్రపంచంలోకి శిశువు అడుగుపెట్టడం, గుడ్డునుంచి బయటపడ్డ పక్షి ఆకాశంలోకి ఎగరడం, మొగ్గ వికసించడం- ఇలాంటివన్నీ పరవశాలే. ‘‘ఎక్స్‌టసీ’’అంటే అదే.
అహం ఒక గుడ్డులాంటిది. అందులోంచి మీరు బయటపడాలి. అలాగే అన్నిరకాల భద్రతలు, రక్షణల వలయాల అడ్డుగోడల నుంచి కూడా మీరు బయటపడాలి. అప్పుడే అంతులేని అనంతమైన విశాల ప్రపంచం మీ సొంతమవుతుంది. అందులో మీరు సమృద్ధిగా జీవిస్తారు.
కానీ, భయం మిమ్మల్ని అవిటివానిగా చేస్తుంది. ‘‘తల్లి గర్భంనుంచి బయటపడే శిశువుకూడా ‘‘బయటకు రావాలా, వద్దా’’అని సంకోచిస్తూ, ఒక అడుగుముందుకు, ఒక అడుగు వెనక్కివేస్తూ ఉంటాడు. అలా గతం మిమ్మల్ని వెనక్కి లాగుతుంది. భవిష్యత్తు మిమ్మల్ని ముందుకు తోస్తుంది. పురిటి నొప్పులంటే అవే. ఆ రకంగా శిశువు పుట్టుకతోటే విభజించబడతాడు.
గతాన్ని, అహాన్ని పట్టుకుని వేలాడడంవల్ల మీరు ఏదీ నిర్ణయించుకోలేని స్థితిలో ఇరుక్కుపోతారు. కానీ, మీరు చాలా అప్రమత్తంగా, జీవంతో తొణికిసలాడే అరుదైన క్షణాలలో మాత్రం ఆ స్థితి మీకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అలా లేని క్షణాలలో ఆ స్థితి ఒక పారదర్శకమైన గోడలా ఎంత స్పష్టంగా కనిపిస్తున్నప్పటికీ, దానిని మీరు ఎప్పటికీ గమనించలేరు.
అన్ని తలుపులు, కిటికీలు పూర్తిగా మూసేసి తమ అంతరంగ మందిరంలో ఎవరు నివసిస్తున్నారో తెలుసుకోకుండానే అందరూ- ఒక జన్మ కాదు, అనేక జన్మలు-తమ జీవితాన్ని గడిపేస్తున్నారు. నిజానికి, అక్కడ నివసిస్తున్నది ఎవరో మీకు తెలుసా? మీలోని అహమే అక్కడ నివసిస్తోంది. దానిని మీరు ఎలాగైనా వదిలించుకోవాలి. అందుకు మీరు చాలా ధైర్యాన్ని కూడగట్టుకుని దానిని చంపెయ్యాలి. కానీ, అలా చెయ్యకుండా అందరూ దానిని అనేక రకాలుగా పోషిస్తూ, తమకే తెలియకుండా తమ నరకాన్ని తామే సృష్టించుకుంటున్నారు.
మరణించిన ‘మర్ఫీ’ శవపేటిక పక్కన అతని భార్య, కొడుకు ఉన్నారు. సంతాపాన్ని తెలిపేందుకు వచ్చిన వారిలో ఒకామె మర్ఫీని చూస్తూ ‘ఎంత సుఖంగా పడుకున్నాడో! ఇంతకీ ఎలా పోయాడు?’అంది. ‘‘అందరి దగ్గర అలా పడుకునే సుఖరోగంతో పోయాడు’’అంది మర్ఫీ భార్య. ‘‘అలా చెప్తావేమిటి మమీ. విరేచనాలు వచ్చి కదా నాన్నపోయాడు’’ అన్నాడు కొడుకు. అది నాకు తెలుసురా! నాన్న చాలా సుఖంగా పోయాడని చెప్పాలి కానీ, అలా ఛండాలంగా పోయాడని చెప్పడమెందుకు?’’ అంది మర్ఫీ భార్య. అలా అందరూ అంతా ముగిసిన తరువాత నాటకాలాడతారు.
అహం ఎప్పుడూ అవాస్తవమైనదే. అందుకే అది ఎప్పుడూ మిమ్మల్ని బలవంతంగా అవాస్తవంలోకి నెట్టేస్తుందే కానీ, వాస్తవంగా జీవించనివ్వదు. అహం ఎప్పుడూ అబద్ధమే కానీ, దానిని ఎవరికివారే నిర్ణయించుకోవాలి. దానికి చాలా ధైర్యం కావాలి.
- ఇంకాఉంది.
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🌹. శ్రీమద్భగవద్గీత - 12 / Bhagavad-Gita - 12 🌹
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ
🌴. ప్రధమ అధ్యాయము - విషాద యోగము - 12 🌴
12. తస్య సంజయన్ హర్షం కురువృద్ధ: పితామహ: |
సింహనాదం వినద్యోచ్చై: శంఖం దధ్మౌ ప్రతాపవాన్ ||
🌷. తాత్పర్యం :
అప్పుడు కురువృద్దుడును, యోధుల పితామహుడును అగు భీష్ముడు దుర్యోధనునకు ఆనందమును గూర్చుచు సింహగర్జన వంటి ధ్వని కలుగునట్లుగా తన శంఖమును బిగ్గరముగా పూరించెను.
🌻. బాష్యము :
కురువృద్ధుడు తన మనుమడైన దుర్యోధనుని హృదయమందలి భావనను అవగతము చేసికొనగలిగెను. అంతట దుర్యోధనుని యెడ గల సహజకరుణతో అతడు సింహముగా తన స్థితికి తగినట్లుగా అతిబిగ్గరముగా శంఖమును పూరించి అతనిని సంతోషింపజేయ యత్నించెను.
దేవదేవుడైన శ్రీకృష్ణుడు ప్రతిపక్షమున ఉన్నందున అతనికి యుద్దమందు విజయావకాశము లేదని శంఖము యొక్క సంకేతము ద్వారా భీష్ముడు విషణ్ణుడగు దుర్యోధనునికి (మనుమనికి) పరోక్షముగా తెలియజేసెను. అయినప్పటికిని యుద్దమును నిర్వహించుట అతని ధర్మమై యున్నది. ఆ విషయమున ఎట్టి కష్టమునకైనను అతడు వెనుదీయరాదు.
🌹 BhagavadGita As it is - 12 🌹
✍️ Swamy Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj
🌴 Chapter 1 - Vishada Yoga - 12 🌴
12. tasya sañjanayan harṣaṁ
kuru-vṛddhaḥ pitāmahaḥ
siṁha-nādaṁ vinadyoccaiḥ
śaṅkhaṁ dadhmau pratāpavān
🌷 Translation :
Then Bhīṣma, the great valiant grandsire of the Kuru dynasty, the grandfather of the fighters, blew his conchshell very loudly, making a sound like the roar of a lion, giving Duryodhana joy.
🌷 Purport :
The grandsire of the Kuru dynasty could understand the inner meaning of the heart of his grandson Duryodhana, and out of his natural compassion for him he tried to cheer him by blowing his conchshell very loudly, befitting his position as a lion.
Indirectly, by the symbolism of the conchshell, he informed his depressed grandson Duryodhana that he had no chance of victory in the battle, because the Supreme Lord Kṛṣṇa was on the other side. But still, it was his duty to conduct the fight, and no pains would be spared in that connection.
🌹🌹🌹🌹🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 192 / Sri Lalitha Chaitanya Vijnanam - 192 🌹*
*సహస్ర నామముల తత్వ విచారణ*
✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
మూల మంత్రము :
*🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁*
*🍀. పూర్తి శ్లోకము :*
*నిస్తులా, నీలచికురా, నిరపాయా, నిరత్యయా |*
*దుర్లభా, దుర్గమా, దుర్గా, దుఃఖహంత్రీ, సుఖప్రదా ‖ 50 ‖*
*🌻 192. 'సుఖప్రదా' 🌻*
సుఖమును ప్రసాదించునది శ్రీమాత అని అర్థము.
శ్రీమాత తాత్కాలికముగ సుఖములే కాక శాశ్వత సుఖములు కూడ అందించును. తాత్కాలిక సుఖములు తాత్కాలికముగ ఆనందమును అందించును. సుఖము తాత్కాలికమైనపుడు మిగిలిన సమయములలో దుఃఖమే మిగులును, సుఖ దుఃఖములు ఎత్తు పల్లములుగా సామాన్యజీవుల జీవితము సాగుచుండును.
సుఖమునకు కారణము జ్ఞానము. దుఃఖమునకు కారణము అజ్ఞానము. జీవుని యందు సురాసుర సంపత్తి సమన్వయింపకుండుట వలన, దేవతల ప్రజ్ఞ కారణముగ సుఖము, అసురప్రజ్ఞల కారణముగ దుఃఖము కలుగు చుండును.
ద్వంద్వములను అనుభవించుచూ జీవుడు శాశ్వతమగు సుఖములకై పరితపించును. శాశ్వత సుఖము లభించవలెనన్నచో నిర్దిష్టమగు ఒక మార్గమును అనుసరించ వలెను. శ్రీమాత ఆరాధనము కారణముగ ప్రాథమికముగా భక్తి కుదిరిన జీవునకు, జ్ఞాన ఉపాసన కలుగును.
భక్తి జ్ఞానముల సహాయమున నిత్య అనిత్య వివేకము కలిగి ముందుకు సాగును. శాశ్వత విలువలు గల విషయములయందు ఆసక్తి పెరుగుచు, అశాశ్వత విషయములందు ఆసక్తి తగ్గుచునుండును. అప్పుడు అనిత్యము, నశ్వరము అగు విషయములను క్రమముగా విసర్జించును.
అటుపైన శ్రీగురు కటాక్షమున యోగమున ప్రవేశించి ముక్తుడగును. ముక్తుడనగా ఎట్టి బంధములూ లేనివాడు. అతని జీవితమున బ్రహ్మానుభూతియే రసానుభూతిగా సాగును. అది శాశ్వతమగు సుఖానుభూతి. శ్రీమాత అట్టి సుఖమును ప్రసాదించు తల్లి.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 192 🌹*
*1000 Names of Sri Lalitha Devi*
✍️. Ravi Sarma
📚. Prasad Bharadwaj
*🌻 Sukhapradā सुखप्रदा (192) 🌻*
She confers happiness. When sorrow is removed what remains is happiness. But, She confers eternal happiness by forbidding Her devotees from rebirth.
This is considered as one of the best boons She gives to Her devotees. But She has Her own way of preferring such devotees. Such devotees should have tasted the sweetness (knowing the self is called as sweetness) and the source of sweetness (Taittirīya Upaniṣad II.7). They are ‘ānandī bhavati’ i.e., happy.
Since She acts as per the law of karma-s (refer nāma 187. niratyayā), Her selection of devotees purely depends upon their sādana (practice). For such sādhaka-s alone, She confers happiness that arises out of having no future births.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శ్రీమద్భగవద్గీత - 535 / Bhagavad-Gita - 535 🌹*
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ
*🌴. 15వ అధ్యాయము - పురుషోత్తమ యోగము - 18 🌴*
18. యస్మాత్క్షరమతీతోహ మక్షరాదపి చోత్తమ: |
అతోస్మి లోకే వేదే చ ప్రథిత: పురుషోత్తమ: ||
🌷. తాత్పర్యం :
క్షర, అక్షరపురుషులకు అతీతుడను, ఉత్తమోత్తముడను అగుటచే నేను జగమునందును మరియు వేదములందును పురుషోత్తమునిగా ప్రసిద్ధినొందితిని.
🌷. భాష్యము :
బద్ధ, ముక్తజీవులలో ఎవ్వరును దేవదేవుడైన శ్రీకృష్ణుని అతిక్రమింపజాలరు. కనుకనే అతడు పురుషోత్తమునిగా తెలియబడినాడు. అనగా జీవులు మరియు భగవానుడు సర్వదా వ్యక్తిగతులే యని ఇచ్చట స్పష్టమగుచున్నది. వారిరువురి నడుమ భేదమేమనగా జీవులు తమ బద్ధస్థితియందు కాని, ముక్తస్థితియందు కాని దేవదేవుని అచింత్యమైన శక్తులను పరిమాణరీతిని అతిశయింపలేరు.
భగవానుడు మరియు జీవులు ఒకేస్థాయికి చెందినవారు లేదా సర్వవిధముల సమానులని భావించుట సమంజసము కాదు. వారిరువురి నడుమ ఉన్నతము మరియు సామాన్యము లనెడి విషయములు శాశ్వతముగా నుండును. కనుకనే “ఉత్తమ” అను పదము ఇచ్చట ప్రాధాన్యమును సంతరించుకొన్నది. అనగా దేవదేవుడైన శ్రీకృష్ణుని ఎవ్వరును అతిశయింపజాలరు.
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Bhagavad-Gita as It is - 535 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj
*🌴 Chapter 15 - Purushothama Yoga - 18 🌴*
18. yasmāt kṣaram atīto ’ham
akṣarād api cottamaḥ
ato ’smi loke vede ca
prathitaḥ puruṣottamaḥ
🌷 Translation :
Because I am transcendental, beyond both the fallible and the infallible, and because I am the greatest, I am celebrated both in the world and in the Vedas as that Supreme Person.
🌹 Purport :
No one can surpass the Supreme Personality of Godhead, Kṛṣṇa – neither the conditioned soul nor the liberated soul. He is therefore the greatest of personalities. Now it is clear here that the living entities and the Supreme Personality of Godhead are individuals.
The difference is that the living entities, either in the conditioned state or in the liberated state, cannot surpass in quantity the inconceivable potencies of the Supreme Personality of Godhead. It is incorrect to think of the Supreme Lord and the living entities as being on the same level or equal in all respects.
There is always the question of superiority and inferiority between their personalities. The word uttama is very significant. No one can surpass the Supreme Personality of Godhead.
The word loke signifies “in the pauruṣa āgama (the smṛti scriptures).” As confirmed in the Nirukti dictionary, lokyate vedārtho ’nena: “The purpose of the Vedas is explained by the smṛti scriptures.”
The Supreme Lord, in His localized aspect of Paramātmā, is also described in the Vedas themselves. The following verse appears in the Vedas (Chāndogya Upaniṣad 8.12.3): tāvad eṣa samprasādo ’smāc charīrāt samutthāya paraṁ jyoti-rūpaṁ sampadya svena rūpeṇābhiniṣpadyate sa uttamaḥ puruṣaḥ.
“The Supersoul coming out of the body enters the impersonal brahma-jyotir; then in His form He remains in His spiritual identity. That Supreme is called the Supreme Personality.”
This means that the Supreme Personality is exhibiting and diffusing His spiritual effulgence, which is the ultimate illumination. That Supreme Personality also has a localized aspect as Paramātmā. By incarnating Himself as the son of Satyavatī and Parāśara, He explains the Vedic knowledge as Vyāsadeva.
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
Join and Share
చైతన్య విజ్ఞానం - Chaitanya Vijnanam
www.facebook.com/groups/chaitanyavijnanam/
Join and Share
DAILY SATSANG WISDOM
www.facebook.com/groups/dailysatsangwisdom/
Join and Share
భారతీయ మహర్షుల బోధనలు MAHARSHULA WISDOM
www.facebook.com/groups/maharshiwisdom/
Join and Share
శ్రీ లలితా చైతన్య విజ్ఞానం Sri Lalitha Chaitanya Vijnanam
http://www.facebook.com/groups/srilalithachaitanyavijnanam/
Join and share.....
విష్ణు సహస్ర నామ తత్వ విచారణ / Vishnu Sahasranama Contemplation
www.facebook.com/groups/vishnusahasranam/
Join and Share శ్రీమద్భగవద్గీత Bhagavad-Gita
www.facebook.com/groups/bhagavadgeetha/
Join and Share శ్రీ యోగ వాసిష్ఠ సారము / YOGA-VASISHTA
www.facebook.com/groups/yogavasishta/
Join and Share వివేక చూడామణి viveka chudamani
www.facebook.com/groups/vivekachudamani/
Join and Share
చైతన్య విజ్ఞానం - Chaitanya Vijnanam
www.facebook.com/groups/chaitanyavijnanam/
Join and Share
DAILY SATSANG WISDOM
www.facebook.com/groups/dailysatsangwisdom/
Join and Share
భారతీయ మహర్షుల బోధనలు MAHARSHULA WISDOM
www.facebook.com/groups/maharshiwisdom/
Join and Share
శ్రీ లలితా చైతన్య విజ్ఞానం Sri Lalitha Chaitanya Vijnanam
http://www.facebook.com/groups/srilalithachaitanyavijnanam/
Join and share.....
విష్ణు సహస్ర నామ తత్వ విచారణ / Vishnu Sahasranama Contemplation
www.facebook.com/groups/vishnusahasranam/
Join and Share శ్రీమద్భగవద్గీత Bhagavad-Gita
www.facebook.com/groups/bhagavadgeetha/
Join and Share శ్రీ యోగ వాసిష్ఠ సారము / YOGA-VASISHTA
www.facebook.com/groups/yogavasishta/
Join and Share వివేక చూడామణి viveka chudamani
www.facebook.com/groups/vivekachudamani/
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹