భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 159


🌹. భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 159 🌹

✍️. శ్రీ బాలగోపాల్
📚. ప్రసాద్ భరద్వాజ


🌻. భగవంతుని పదవపాత్ర సద్గురువు - 4 🌻

619. సృష్టిలోని ప్రతిప్రాణి ఫనా-బకాలను కలిగి యున్నట్లే భూమికలలో నున్న వారు కూడా ఫనా-బకా లను కలిగియుండును. కాని వాటి వాటి సంస్కారములను బట్టి అవి తేడాలు కలిగియుండును.

ఉదాహరణము:- హంసతూలికా తల్పమున పరుండిన వాడును, ఱాతి బండ పై పరుండిన వాడైనను లేక ఇద్దరును కలిసి ఓకే పరుపుపై పరుండిన ను ఇద్దరికీ సుషుప్తి - జాగృతులున్నప్పటికీ ఎవరి ఫనా-బకాలు వారివి.

620. బ్రహ్మీభూతుడైన తరువాత, సచ్చిదానంద స్థితి ననుభవించుచు భూమి మీద భగవంతుని దివ్య జీవనము గడుపుటకై సామాన్య మానవుని చైతన్యమునకు క్రిందకి దిగివచ్చి, దానితోపాటు భగవంతుని దివ్య జీవితములో స్థిరపడిన వానిని నిజమైన దివ్యుడు అందరు.

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹


28 Jan 2021

No comments:

Post a Comment