శ్రీ లలితా సహస్ర నామములు - 84 / Sri Lalita Sahasranamavali - Meaning - 84

🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 84 / Sri Lalita Sahasranamavali - Meaning - 84 🌹

🌻. మంత్రము - అర్ధం 🌻

📚. ప్రసాద్ భరద్వాజ

🍀 84. సద్యః ప్రసాదినీ, విశ్వసాక్షిణీ, సాక్షివర్జితా ।
షడంగదేవతా యుక్తా, షాడ్గుణ్య పరిపూరితా ॥ 84 ॥ 🍀

🍀 383. సద్యఃప్రసాదినీ -
తక్షణములోనే అనుగ్రహించునది.

🍀 384. విశ్వసాక్షిణీ -
విశ్వములోని కృత్యములకు ఒకే ఒక సాక్షి.

🍀 385. సాక్షివర్జితా -
సాక్షి లేనిది.

🍀 386. షడంగదేవతాయుక్తా -
ఆరు అంగదేవతలతో కూడి ఉంది.

🍀 387. షాడ్గుణ్య పరిపూరితా -
ఆరు విధములైన గుణములచే పుష్కలముగా నిండి యుండునది.

సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹

🌹. Sri Lalita Sahasranamavali - Meaning - 84 🌹

📚. Prasad Bharadwaj

🌻 84. sadyaḥprasādinī viśva-sākṣiṇī sākṣivarjitā |
ṣaḍaṅgadevatā-yuktā ṣāḍguṇya-paripūritā || 84 || 🌻

🌻 383 ) Sadya prasadini -
She who is pleased immediately

🌻 384 ) Viswa sakshini -
She who is the witness for the universe

🌻 385 ) Sakshi varjitha -
She who does not have witness for herself

🌻 386 ) Shadanga devatha yuktha -
She who has her six parts as gods viz., heart, head, hair. Battle dress, eyes and arrows

🌻 387 ) Shadgunya paripooritha -
She who is full of six characteristics viz., wealth, duty, fame, knowledge, assets and renunciation

Continues...

🌹 🌹 🌹 🌹 🌹

03 Jun 2021

మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 35

🌹. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 35 🌹

✍️. సద్గురు ఇ. కృష్ణమాచార్యులు
సంకలనం : వేణుమాధవ్

సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🌻. సర్వాంతర్యామి సాక్షాత్కారం 🌻

సృష్టిలోనున్న భగవంతుని మరచి, అందలి రూపములైన జీవుల సంబంధములను జ్ఞప్తి యందుంచుకొనినవాడు మత్తుడై ఇంద్రియార్థములను గూర్చిన చింతలలో నిమగ్నుడై జీవించును.

దినములు గడచి పోవుచుండునే గాని, జీవించుటకు తీరుబడి యుండదు. అనగా అంతర్యామిని స్మరించుట ఉండదు. చిత్తశాంతి లభింపక ఆశల వెంట పరుగెత్తుచుండును.

క్రమముగా వ్యాధి, ముసలితనము, ఇతరులపై పట్టుదలలు, తన పరాజయములు, ఆశాభంగములు మున్నగు దుష్టశక్తులు యమదూతలై పొడుచు చుందురు. దుఃఖపరంపరలతో జీవితమును ఈదవలసి వచ్చును కనుక, నిప్పుల గుండమును ఈదుచున్నట్లుండును.

ఈ స్థితినే వైతరణి యందురు పరిస్థితుల రూపములలోని‌ అంతర్యామిని మరచి, పరిస్థితులకు లొంగిచేయకూడని పనులు అనేకములు చేయుటతో శిక్షానుభవము తప్పదు.

రోగముల రూపమును యమదూతలు దేహమున మంటలు మండింతురు. శస్ర్తచికిత్సల రూపమున ముక్కలుగా ‌కోయుదురు.

కృతాంతుని భటులు వీరు. కృతాంతుడు అనగా చేసిన కర్మలకు ఫలితములు ఇచ్చువాడు. యముడనగా అధర్మము ‌నుండి ధర్మమార్గమునకు నియమించునట్టి నిర్మల ధర్మస్వరూపుడు.)

🌹 🌹 🌹 🌹 🌹

03 Jun 2021

గీతోపనిషత్తు -207

🌹. గీతోపనిషత్తు -207 🌹

✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

📚. 6వ అధ్యాయము - ఆత్మ సంయమ యోగము 📚

శ్లోకము 46, 47, Part 3

🍀 45-3. యోగీభవ - యోగి అనగా దైవముతో యోగము చెంది యుండు వాడు. అట్టివాని నుండి దైవమే సర్వము నిర్వర్తించును. తానుగ అతడేమియు నిర్వర్తించడు. ఇట్టి యోగస్థితి కన్న సుందరము వైభవము అగు జీవనము లేదు. అతడు తన కొరకు గాక దైవము కొరకు, దైవము నందు వసించి యుండును. 🍀

అట్టి యోగికన్న దైవమునకు ప్రియు డెవ్వరును లేరు. యోగి అనగ భక్తుడే. దైవముతో విభక్తి లేక యుండును. అతని యందు జ్ఞానము భాసించును. మహత్తరమగు కార్యములు జరుగును. ఈ రహస్యములు తెలియుటకే రామాయణమున సుందరకాండము ఈయబడినది.

హనుమంతుడు పరులు గుర్తింప లేని మహాయోగి. హనుమంతుని జీవితము తనకొరకు జీవింపబడ లేదు. దైవము కొరకే తన ఉనికి. అతడు సహజయోగి. అతని యందు నాలుగు వేదములు భాసించును. అతనిని మించిన జ్ఞాని లేడు.

కాని అతడు జ్ఞానమునకు తగులుకొని యుండడు. అతడు మహత్తరమగు కార్యములను నిర్వర్తించెను. అతడు సాధించిన కార్యములు అనితర సాధ్యము. కాని వానిని గూర్చిన జ్ఞప్తి కూడ అతనికి ఉండదు. అతడు నిత్య తపస్వి. విశ్వాత్మ రాముని చింతనలో తనను తాను మరచి యుండును.

తాను భక్తుడనని, యోగినని, జ్ఞానినని, శక్తివంతుడనని భావింపడు. తన భావన, తను భావన లేక కేవలము బ్రహ్మము వలె వసించి యుండును. శ్రీకృష్ణుడు అర్జునునకు యోగమును బోధించు సమయమున అర్జునుని రథము పై జెండావలె యుండెను.

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹

03 Jun 2021

శ్రీ శివ మహా పురాణము - 407

🌹 . శ్రీ శివ మహా పురాణము - 407🌹

రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. రుద్ర సంహితా - పార్వతీ ఖండః 🌴

అధ్యాయము - 22

🌻. పార్వతీ తపోవర్ణనము - 3 🌻

అపుడా పార్వతి తల్లితండ్రులకు ఆనందముతో ప్రణమిల్లి సకురాండ్రిద్దరితో గూడినదై, శివుని స్మరించి తపస్సును చేయుటకై ఇంటినుండి బయులదేరెను (28).

ఆమె తనకు ప్రీతిపాత్రములగు వివిధ వస్త్రములను విడనాడి నారబట్టలను ధరించి ముంజత్రాడును బంధించి శోభిల్లెను (29). ఆమె హారమును వీడి చక్కని మృగచర్మను ధరించి తపస్సు చేయుటకై, గంగానది దివినుండి భువికి దిగిన స్థానమును చేరుకొనెను (30).

గంగావతరణమని ప్రసిద్ధి గాంచిన ఆ హిమవంతుని శిఖరముపైననే శంభుడు ధ్యానము చేయుచూ, విఘ్న కారకుడు మన్మథుడు దహించెను (31). హిమవంతుని ఆ శిఖరమునకు జగదంబయగు పార్వతీ దేవి విచ్చేసెను. ఓ వత్సా! అచట ఆమెకు శివుడు ఎచ్చటనూ కానరాలేదు (32).

ఏ స్థలములో పూర్వము శంభుడు కూర్చుండి ఘోరమగు తపస్సును ఆచరించినాడో, అదే స్థలమునందు ఆమె క్షణ కాలము నిలుచుండి విరహముచే దుఃఖితురాలయ్యెను (33). ఆ పార్వతీ దేవి చింతాశోకములతో నిండిన మనస్సు గలదై మిక్కిలి దుఃఖితురాలై ఆచట 'హా హారా!' అని బిగ్గరగా రోదించెను (34).

తరువాత చాల సేపటికి ఆ పార్వతీ దేవి ధైర్యమును వహించి, మోహమును వీడి, తపోనియమముల నారంభించుటకై దీక్షను గైకొనెను (35). పరమ పవిత్ర తీర్థమగు ఆ శిఖరము నందామె తపస్సును చేసెను. ఆమె తపస్సును చేయుటచే ఆ శిఖరమునకు గౌరీశిఖరమను పేరు వచ్చినది (36).

ఓ మహర్షీ! తపస్సును చేయు కాలము యొక్క గణన కొరకై ఆమె అచట సుందరమైనవి, పవిత్రమైనవి, పండ్లను ఇచ్చునని అగు వృక్షములను పాతెను (37).

సుందరియగు ఆ శివాదేవి అచట భూమిని శుద్ధిచేసి వేదికను నిర్మించి, తరువాత మునులకైన చేయ శక్యముగాని కఠిన తపస్సును చేయుట ఆరంభించెను (38). ఆమె వెనువెంటనే మనస్సును, ఇతర ఇంద్రియములనన్నింటినీ నిగ్రహించి, శివుడు తపస్సు చేసిన స్థానమునకు సమీపములో గొప్ప తపస్సును చేసెను (39).

సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹

03 Jun 2021

3-JUNE-2021 MESSAGES

1) 🌹. గీతోపనిషత్తు - సాంఖ్య యోగము - 207🌹  
2) 🌹. శివ మహా పురాణము - 407🌹 
3) 🌹 Light On The Path - 154🌹
4)🌹. మాస్టర్ ఇ.కె సందేశాలు -35🌹  
5) 🌹 Osho Daily Meditations - 24🌹
6) 🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 84 / Lalitha Sahasra Namavali - 84🌹 
7) 🌹. శ్రీ విష్ణు సహస్ర నామములు - 84 / Sri Vishnu Sahasranama - 84🌹 

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. గీతోపనిషత్తు -207 🌹*
✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్ 
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
*📚. 6వ అధ్యాయము - ఆత్మ సంయమ యోగము 📚*
శ్లోకము 46, 47, Part 3

*🍀 45-3. యోగీభవ - యోగి అనగా దైవముతో యోగము చెంది యుండు వాడు. అట్టివాని నుండి దైవమే సర్వము నిర్వర్తించును. తానుగ అతడేమియు నిర్వర్తించడు. ఇట్టి యోగస్థితి కన్న సుందరము వైభవము అగు జీవనము లేదు. అతడు తన కొరకు గాక దైవము కొరకు, దైవము నందు వసించి యుండును. 🍀*

అట్టి యోగికన్న దైవమునకు ప్రియు డెవ్వరును లేరు. యోగి అనగ భక్తుడే. దైవముతో విభక్తి లేక యుండును. అతని యందు జ్ఞానము భాసించును. మహత్తరమగు కార్యములు జరుగును. ఈ రహస్యములు తెలియుటకే రామాయణమున సుందరకాండము ఈయబడినది. 

హనుమంతుడు పరులు గుర్తింప లేని మహాయోగి. హనుమంతుని జీవితము తనకొరకు జీవింపబడ లేదు. దైవము కొరకే తన ఉనికి. అతడు సహజయోగి. అతని యందు నాలుగు వేదములు భాసించును. అతనిని మించిన జ్ఞాని లేడు. 

కాని అతడు జ్ఞానమునకు తగులుకొని యుండడు. అతడు మహత్తరమగు కార్యములను నిర్వర్తించెను. అతడు సాధించిన కార్యములు అనితర సాధ్యము. కాని వానిని గూర్చిన జ్ఞప్తి కూడ అతనికి ఉండదు. అతడు నిత్య తపస్వి. విశ్వాత్మ రాముని చింతనలో తనను తాను మరచి యుండును. 

తాను భక్తుడనని, యోగినని, జ్ఞానినని, శక్తివంతుడనని భావింపడు. తన భావన, తను భావన లేక కేవలము బ్రహ్మము వలె వసించి యుండును. శ్రీకృష్ణుడు అర్జునునకు యోగమును బోధించు సమయమున అర్జునుని రథము పై జెండావలె యుండెను. 

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
#గీతోపనిషత్ #సద్గురుపార్వతీకుమార్
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share 
🌹. భగవద్గీత BhagavadGita Telegram, FB Groups 🌹
https://t.me/bhagavadgeethaa/
www.facebook.com/groups/bhagavadgeethaa/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 . శ్రీ శివ మహా పురాణము - 407🌹* 
రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ

*🌴. రుద్ర సంహితా - పార్వతీ ఖండః 🌴* 
అధ్యాయము - 22

*🌻. పార్వతీ తపోవర్ణనము - 3 🌻*

అపుడా పార్వతి తల్లితండ్రులకు ఆనందముతో ప్రణమిల్లి సకురాండ్రిద్దరితో గూడినదై, శివుని స్మరించి తపస్సును చేయుటకై ఇంటినుండి బయులదేరెను (28). 

ఆమె తనకు ప్రీతిపాత్రములగు వివిధ వస్త్రములను విడనాడి నారబట్టలను ధరించి ముంజత్రాడును బంధించి శోభిల్లెను (29). ఆమె హారమును వీడి చక్కని మృగచర్మను ధరించి తపస్సు చేయుటకై, గంగానది దివినుండి భువికి దిగిన స్థానమును చేరుకొనెను (30). 

గంగావతరణమని ప్రసిద్ధి గాంచిన ఆ హిమవంతుని శిఖరముపైననే శంభుడు ధ్యానము చేయుచూ, విఘ్న కారకుడు మన్మథుడు దహించెను (31). హిమవంతుని ఆ శిఖరమునకు జగదంబయగు పార్వతీ దేవి విచ్చేసెను. ఓ వత్సా! అచట ఆమెకు శివుడు ఎచ్చటనూ కానరాలేదు (32).

ఏ స్థలములో పూర్వము శంభుడు కూర్చుండి ఘోరమగు తపస్సును ఆచరించినాడో, అదే స్థలమునందు ఆమె క్షణ కాలము నిలుచుండి విరహముచే దుఃఖితురాలయ్యెను (33). ఆ పార్వతీ దేవి చింతాశోకములతో నిండిన మనస్సు గలదై మిక్కిలి దుఃఖితురాలై ఆచట 'హా హారా!' అని బిగ్గరగా రోదించెను (34). 

తరువాత చాల సేపటికి ఆ పార్వతీ దేవి ధైర్యమును వహించి, మోహమును వీడి, తపోనియమముల నారంభించుటకై దీక్షను గైకొనెను (35). పరమ పవిత్ర తీర్థమగు ఆ శిఖరము నందామె తపస్సును చేసెను. ఆమె తపస్సును చేయుటచే ఆ శిఖరమునకు గౌరీశిఖరమను పేరు వచ్చినది (36).

ఓ మహర్షీ! తపస్సును చేయు కాలము యొక్క గణన కొరకై ఆమె అచట సుందరమైనవి, పవిత్రమైనవి, పండ్లను ఇచ్చునని అగు వృక్షములను పాతెను (37). 

సుందరియగు ఆ శివాదేవి అచట భూమిని శుద్ధిచేసి వేదికను నిర్మించి, తరువాత మునులకైన చేయ శక్యముగాని కఠిన తపస్సును చేయుట ఆరంభించెను (38). ఆమె వెనువెంటనే మనస్సును, ఇతర ఇంద్రియములనన్నింటినీ నిగ్రహించి, శివుడు తపస్సు చేసిన స్థానమునకు సమీపములో గొప్ప తపస్సును చేసెను (39).

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
#శివమహాపురాణము #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share 
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://t.me/ChaitanyaVijnanam
https://pyramidbook.in/Chaitanyavijnanam

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 LIGHT ON THE PATH - 154 🌹*
*🍀 For those WHO DESIRE TO ENTER WITHIN - For DISCIPLES 🍀*
✍️. ANNIE BESANT and LEADBEATER
📚. Prasad Bharadwaj

CHAPTER 11 - Master Hilarion’s note on Rule 21.
*🌻 When the disciple is ready to learn, then he is accepted, acknowledged, recognized. It must be so, for he has lit his lamp, and it cannot be hidden. - 5 🌻*

566. So in various ways links may be made, and it may well be that the person who is chosen as a disciple is by no means perfect, but he could not be chosen in that particular way if he were not worthy. That he has still certain faults and failings does not debar him if he has other and greater recommendations, if the advantages overbalance the disadvantages. There are many circumstances which may operate in the taking of a particular pupil by a Master. 

We may be quite sure that he cannot be taken unless he deserves it, but we may not be able to see how he has deserved it. The converse of that proposition is equally certain – that no one who deserves it can fail to be observed and be taken. It is not wise to use this lower mind, which we have developed with so much pain and trouble, in criticizing the actions of the Masters, who know far more than we. 

We may not always be able to understand why They do this or that, but those who follow Them should at least so far trust Them as to say: “I know the Master must be right. I do not see plainly why. As far as I am concerned I know that I shall be taken when I am ready. My business is to make myself fit for it. In the meantime, I have no concern with what the Master does with regard to other people.”

Continues...
🌹 🌹 🌹 🌹 🌹
#LightonPath #Theosophy
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share
Thosophical Teachings దివ్యజ్ఞాన సందేశములు
www.facebook.com/groups/theosophywisdom/
https://t.me/Seeds_Of_Consciousness

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 35 🌹*
✍️. సద్గురు ఇ. కృష్ణమాచార్యులు 
సంకలనం : వేణుమాధవ్ 
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

*🌻. సర్వాంతర్యామి సాక్షాత్కారం 🌻*

సృష్టిలోనున్న భగవంతుని మరచి, అందలి రూపములైన జీవుల సంబంధములను జ్ఞప్తి యందుంచుకొనినవాడు మత్తుడై ఇంద్రియార్థములను గూర్చిన చింతలలో నిమగ్నుడై జీవించును. 

దినములు గడచి పోవుచుండునే గాని, జీవించుటకు తీరుబడి యుండదు. అనగా అంతర్యామిని స్మరించుట ఉండదు. చిత్తశాంతి లభింపక ఆశల వెంట పరుగెత్తుచుండును. 

క్రమముగా వ్యాధి, ముసలితనము, ఇతరులపై పట్టుదలలు, తన పరాజయములు, ఆశాభంగములు మున్నగు దుష్టశక్తులు యమదూతలై పొడుచు చుందురు. దుఃఖపరంపరలతో జీవితమును ఈదవలసి వచ్చును కనుక, నిప్పుల గుండమును ఈదుచున్నట్లుండును. 

ఈ స్థితినే వైతరణి యందురు పరిస్థితుల రూపములలోని‌ అంతర్యామిని మరచి, పరిస్థితులకు లొంగిచేయకూడని పనులు అనేకములు చేయుటతో శిక్షానుభవము తప్పదు.

రోగముల రూపమును యమదూతలు దేహమున మంటలు మండింతురు. శస్ర్తచికిత్సల రూపమున ముక్కలుగా ‌కోయుదురు. 

కృతాంతుని భటులు వీరు. కృతాంతుడు అనగా చేసిన కర్మలకు ఫలితములు ఇచ్చువాడు. యముడనగా అధర్మము ‌నుండి ధర్మమార్గమునకు నియమించునట్టి నిర్మల ధర్మస్వరూపుడు.)
🌹 🌹 🌹 🌹 🌹
#మాస్టర్‌ఇకెసందేశములు #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share
🌷. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు 🌷 
www.facebook.com/groups/masterek/
https://t.me/ChaitanyaVijnanam
 www.facebook.com/groups/chaitanyavijnanam/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 Osho Daily Meditations - 24 🌹*
📚. Prasad Bharadwaj

*🍀 AUTHORITY 🍀*

*🕉 Never ask anybody what is right and what is wrong. Life is an experiment to find out. 🕉*

Each individual has to be conscious, alert, and watchful, and experiment with life and find out what is good for him. Whatever gives you peace, whatever makes you blissful, whatever gives you serenity, whatever brings you closer to existence and its immense harmony is good. And whatever creates conflict, misery, pain in you is wrong. 

Nobody else can decide it for you, because every individual has' his own world, his own sensitivity. We are unique. So formulas are not going to work. The whole world is a proof of this. Never ask anybody what is right and what is wrong. Life is an experiment to find out what is right, what is wrong. 

Sometimes you may do what is wrong, but that will give you the experience of it, that will make you aware of what has to be avoided. Sometimes you may do something good, and you will be immensely benefited. The rewards are not beyond this life, in heaven and hell. They are here and now. Each action brings its result immediately. Just be alert and watch. 

Mature people are those who have watched and found for themselves what is right, what is wrong, what is good, what is bad. And by finding it for themselves, they have a tremendous authority. The whole world may say something else, and it makes no difference to them. They have their own experience to go by, and tha1 is enough.

Continues...
🌹 🌹 🌹 🌹 🌹
#ఓషోబోధనలు #OshoDiscourse #OshoDailyMeditations #ఓషోనిర్మలధ్యానములు #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share 
🌹 ఓషో బోధనలు - Osho Teachings 🌹
http://www.facebook.com/groups/oshoteachings/
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://t.me/ChaitanyaVijnanam
https://pyramidbook.in/Chaitanyavijnanam

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 84 / Sri Lalita Sahasranamavali - Meaning - 84 🌹*
🌻. మంత్రము - అర్ధం 🌻
📚. ప్రసాద్ భరద్వాజ

*🍀 84. సద్యః ప్రసాదినీ, విశ్వసాక్షిణీ, సాక్షివర్జితా ।*
*షడంగదేవతా యుక్తా, షాడ్గుణ్య పరిపూరితా ॥ 84 ॥ 🍀*

🍀 383. సద్యఃప్రసాదినీ - 
తక్షణములోనే అనుగ్రహించునది.

🍀 384. విశ్వసాక్షిణీ - 
విశ్వములోని కృత్యములకు ఒకే ఒక సాక్షి.

🍀 385. సాక్షివర్జితా - 
సాక్షి లేనిది.

🍀 386. షడంగదేవతాయుక్తా - 
ఆరు అంగదేవతలతో కూడి ఉంది.

🍀 387. షాడ్గుణ్య పరిపూరితా - 
ఆరు విధములైన గుణములచే పుష్కలముగా నిండి యుండునది.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

*🌹. Sri Lalita Sahasranamavali - Meaning - 84 🌹*
📚. Prasad Bharadwaj 

*🌻 84. sadyaḥprasādinī viśva-sākṣiṇī sākṣivarjitā |*
*ṣaḍaṅgadevatā-yuktā ṣāḍguṇya-paripūritā || 84 || 🌻*

🌻 383 ) Sadya prasadini -   
She who is pleased immediately

🌻 384 ) Viswa sakshini -  
 She who is the witness for the universe

🌻 385 ) Sakshi varjitha -   
She who does not have witness for herself

🌻 386 ) Shadanga devatha yuktha -   
She who has her six parts as gods viz., heart, head, hair. Battle dress, eyes and arrows

387 ) Shadgunya paripooritha -   
She who is full of six characteristics viz., wealth, duty, fame, knowledge, assets and renunciation

Continues...
🌹 🌹 🌹 🌹 🌹
 #లలితాసహస్రనామ #LalithaSahasranama
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share 
🌹. శ్రీ లలితా దేవి చైతన్యము Sri Lalitha Devi Chatanyam 🌹
https://t.me/srilalithachaitanyavijnanam
http://www.facebook.com/groups/srilalithachaitanyavijnanam/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీ విష్ణు సహస్ర నామములు - 84 / Sri Vishnu Sahasra Namavali - 84 🌹*
*నామము - భావము*
📚. ప్రసాద్ భరద్వాజ 

*🌷. ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్ 🌷*

*ఉత్తరాషాడ నక్షత్ర చతుర్ధ పాద శ్లోకం*

*🍀 84. శుభాంగో లోకసారంగః స్తతన్తు స్తన్తువర్ధనః|*
*ఇంద్రకర్మా మహాకర్మా కృతకర్మా కృతాగమః|| 🍀*

 🍀 782) శుభాంగ: - 
దివ్యములైన, సుందరములైన అవయువములు గలవాడు.

🍀 783) లోకసారంగ: - 
లోకములోని సారమును గ్రహించువాడు.

🍀 784) సుతంతు: - 
జగద్రూపమున అందమైన తంతువువలె విస్తరించినవాడు.

🍀 785) తంతువర్థన: - 
వృద్ధి పరచువాడు, నాశనము చేయువాడు.

🍀 786) ఇంద్రకర్మా - 
ఇంద్రుని కర్మవంటి శుభప్రధమైన కర్మ నాచరించువాడు.

🍀 787) మహాకర్మా - 
గొప్ప కార్యములు చేయువాడు.

🍀 788) కృతకర్మా - 
ఆచరించదగిన కార్యములన్నియు ఆచరించినవాడు.

🍀 789) కృతాగమ: - 
వేదముల నందించువాడు.

సశేషం.... 
🌹 🌹 🌹 🌹 🌹 

*🌹 Vishnu Sahasra Namavali - 84 🌹*
*Name - Meaning*
📚 Prasad Bharadwaj

*🌷 OM NARAYANAYA VIDMAHE VASUDEVAYA DHIMAHI । TANNO VISHNU PRACHODAYAT ॥ 🌷*

*Sloka for Utarashada 4th Padam*

*🌻 śubhāṅgō lōkasāraṅgaḥ sutantustantuvardhanaḥ |*
*indrakarmā mahākarmā kṛtakarmā kṛtāgamaḥ || 84 || 🌻*

🌻 782. Śubhāṅgaḥ: 
One whose form is very auspicious to meditate upon.

🌻 783. Lōkasāraṅgaḥ: 
One who like the Saranga (honey-beetle) grasps the essence of the world.

🌻 784. Sutantuḥ: 
As this universe of infinite extension belongs to Him, the Lord is called Sutantu.

🌻 785. Tantu-vardhanaḥ: 
One who can augment or contract the web of this world.

🌻 786. Indra-karmā: 
One whose actions are like that of Indra, that is, are of a highly commendable nature.

🌻 787. Mahākarmā: 
One of whom the great elements like Akasha are effects.

🌻 788. Kṛtakarmā: 
One who has fulfilled everything and has nothing more to accomplish.

🌻 789. Kṛtāgamaḥ: 
One who has given out the Agama in the shape of the Veda.

Continues...
🌹 🌹 🌹 🌹 🌹
#విష్ణుసహస్రనామములు #VishnuSahasranama #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share
విష్ణు సహస్రనామ స్తోత్రము / Vishnu Sahasranama group. 
https://t.me/vishnusahasranaam
www.facebook.com/groups/vishnusahasranaam/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹