శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 399 - 1 / Sri Lalitha Chaitanya Vijnanam - 399 - 1

🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 399 - 1 / Sri Lalitha Chaitanya Vijnanam - 399 - 1 🌹

🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻

✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్

సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁

🍀 86. ప్రభావతీ, ప్రభారూపా, ప్రసిద్ధా, పరమేశ్వరీ ।
మూలప్రకృతి రవ్యక్తా, వ్యక్తాఽవ్యక్త స్వరూపిణీ ॥ 86 ॥ 🍀

🌻 399. 'వ్యక్తావ్యక్త స్వరూపిణి' - 1🌻

అవ్యక్తమైన శ్రీమాత అవరోహణ క్రమమున వ్యక్త మగును అని అర్థము. శ్రీమాత వ్యక్తముగను, అవ్యక్తముగను కూడ ఏక కాలమున నున్నది. కనబడువానిలో కనబడని ప్రజ్ఞ, శక్తి రూపములతో నున్నది. ప్రజ్ఞ కతీతముగ కూడ నున్నది. కనబడునది చూచి, అది ఆధారముగ కనబడని మూడు స్థితులను గ్రహించువారు తెలిసినవారు. వారినే మనుషులని, బ్రాహ్మణులని వేదము తెలుపుచున్నది.

"చత్వారి వాక్పరిమితా పదాని తాని విదుర్భాహ్మణా యే మనీషిణః ।
గృహా త్రీణి నిహితా సంగయంతి తురీయం వాచో మనుష్యా వదంతి ॥ "

నాలుగు స్థితులలో పరా, పశ్యంతి, మధ్యమ, వైఖరిలుగ నున్న వాక్కును మనీషులైన బ్రాహ్మణు లెరుగుదురు. ఇతరులు నాలుగవది అయిన వైఖరీ వాక్కునే ఎరుగుదురు.

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹

🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 399 -1 🌹

Contemplation of 1000 Names of Sri Lalitha Devi

✍️. Acharya Ravi Sarma 📚. Prasad Bharadwaj

🌻 86. Prabhavati prabha rupa prasidha parameshari
Mulaprakruti ravyakta vyaktavyakta svarupini ॥ 86 ॥ 🌻

🌻 399. Vyaktāvyakta-svarūpiṇī व्यक्ताव्यक्त-स्वरूपिणी 🌻

It is vyakta (manifested) + avyakta (un-manifested) svarūpiṇī. She is both manifested and un-manifested form. Since this form is the first of manifested form, it is called mahat which means great. It is the fundamental tool of the phenomenal universe. This mahat is endowed with supreme knowledge. The undifferentiated prakṛti is mahat. From mahat, further evolution takes place.

Vyakta means perishable and a-vyakta means imperishable. The soul-Brahman relationship is cited here. In general, this stage provides happiness and the final salvation. This nāma means the first signs of creation and final liberation are both caused by Lalitāmbikā.

Continues...

🌹 🌹 🌹 🌹 🌹

17 Aug 2022

ఓషో రోజువారీ ధ్యానాలు - 230. జీవితం మరియు మరణ ధ్యానములు / Osho Daily Meditations - 230. LIFE AND DEATH MEDITATIONS

🌹. ఓషో రోజువారీ ధ్యానాలు - 230 / Osho Daily Meditations - 230 🌹

📚. ప్రసాద్ భరద్వాజ

🍀 230. జీవితం మరియు మరణ ధ్యానములు 🍀

🕉. ఈ రెండు--జీవితం మరియు మరణ ధ్యానాలు --మీకు అద్భుతంగా సహాయపడతాయి 🕉

మీరు నిద్రించడానికి ముందు రాత్రి, ఈ పదిహేను నిమిషాల ధ్యానం చేయండి. ఇది మరణ ధ్యానం. పడుకుని, మీ శరీరాన్ని విశ్రాంతిలోకి తీసుకోండి. మీరు చనిపోయారని మరియు మీరు చనిపోయినందున మీ శరీరాన్ని కదల్చలేరని భావించండి. మీరు శరీరం నుండి అదృశ్య మవుతున్నారనే భావనను సృష్టించండి. పది, పదిహేను నిముషాల పాటు ఇలా చేస్తే వారం రోజుల్లోనే మీరు అనుభూతి చెందుతారు. ఆ విధంగా ధ్యానం చేస్తూ, నిద్రలోకి జారుకోండి. దానికి అంతరాయం కలిగించ వద్దు. ధ్యానం నిద్రగా మారనివ్వండి మరియు నిద్ర మిమ్మల్ని అధిగమిస్తే, దానిలోకి వెళ్లండి. ఉదయం, మీరు మేల్కొన్నట్లు అనిపించిన క్షణం - కళ్ళు తెరవకండి - జీవిత ధ్యానం చేయండి.

మీరు మరింత పూర్తిగా జీవిస్తున్నారని, జీవితం తిరిగి వస్తోందని మరియు శరీరం మొత్తం ప్రాణం మరియు శక్తితో నిండి ఉందని భావించండి. కళ్ళు మూసుకుని మంచం మీద ఊగుతూ కదలడం ప్రారంభించండి. మీలో జీవం ప్రవహిస్తున్నట్లు భావించండి. శరీరం గొప్ప ప్రవహించే శక్తిని కలిగి ఉందని భావించండి - ఇది మరణ ధ్యానానికి వ్యతిరేకం. జీవిత ధ్యానంతో మీరు లోతైన శ్వాసలను తీసుకోవచ్చు. ఊపిరి పీల్చుకోవడంతో ప్రాణం ప్రవేశిస్తోందని, శక్తితో నిండిన అనుభూతిని పొందండి. నిండుగా మరియు చాలా సంతోషంగా, సజీవంగా అనుభూతి చెందండి. అప్పుడు పదిహేను నిమిషాల తర్వాత, లేవండి. ఈ రెండు-జీవితం మరియు మరణం ధ్యానాలు --మీకు అద్భుతంగా సహాయపడతాయి.

కొనసాగుతుంది...

🌹 🌹 🌹 🌹 🌹

🌹 Osho Daily Meditations - 230 🌹

📚. Prasad Bharadwaj

🍀 230. LIFE AND DEATH MEDITATIONS 🍀

🕉. These two--the life and death meditations--can help you tremendously 🕉

In the night before you go to sleep, do this fifteen-minute meditation. It is a death meditation. Lie down and relax your body. Just feel like dying and that you cannot move your body because you are dead. Create the feeling that you are disappearing from the body. Do it for ten, fifteen minutes, and you will start feeling it within a week. Meditating that way, fall asleep. Don't interrupt it. Let the meditation turn into sleep, and if sleep overcomes you, go into it. In the morning, the moment you feel you are awake--don't open your eyes---do the life meditation.

Feel that you are becoming more wholly alive, that life is coming back and the whole body is full of vitality and energy. Start moving, swaying in the bed with eyes closed. Just feel that life is flowing in you. Feel that the body has a great flowing energy-just the opposite of the death meditation. With the life meditation you can take deep breaths. Just feel full of energy, that life is entering with the breathing. Feel full and very happy, alive. Then after fifteen minutes, get up. These two-the life and death meditation--can help you tremendously.

Continues...

🌹 🌹 🌹 🌹 🌹

17 Aug 2022

శ్రీ శివ మహా పురాణము - 610 / Sri Siva Maha Purana - 610

🌹 . శ్రీ శివ మహా పురాణము - 610 / Sri Siva Maha Purana - 610 🌹

✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి 📚. ప్రసాద్ భరద్వాజ

🌴. రుద్రసంహితా-కుమార ఖండః - అధ్యాయము - 07 🌴

🌻. యుద్ధారంభము - 2 🌻

నిర్భయులై తారకునితో యుద్దమును చేయగోరి ఒక్కుమ్మడిగా లేచి నిలబడిరి (12). దేవేంద్రుడు కుమారుని ఏనుగుపై ఎక్కించి, లోకపాలురతో మరియు దేవతల పెద్ద స్తెన్యముతో గూడి ముందు నడిచెను (13). అపుడుదుందుభులు, అనేక విధముల భేరీలు, తూర్యములు, వీణలు, వేణువులు, మద్దెలలు మ్రోగినవి. గంధర్వులు పాడజొచ్చిరి (14).

కుమారుడు ఏనుగును ఇంద్రునకిచ్చి, అనేక వింతలతో గూడినది, నానావిధ రత్నములచే పొదగబడినది అగు విమానము నధిష్ఠించెను (15). గొప్ప కీర్తి గలవాడు, సర్వ సద్గుణ సంపన్నుడు, శోభా యుక్తుడు అగు ఆ శంకరపుత్రుడు విమానము నధిష్ఠించెను. అపుడు గొప్ప ప్రకాశము గల వింజామరలచే వీచు చుండా ఆ మహాత్ముడు గొప్పగా ప్రకాశించెను (16) మిక్కిలి శోభ గలది, రత్నములతో పొదిగినది అగు వరుణచ్ఛత్రమును కుమారుని శిరస్సుపై పట్టిరి. అపుడా ఛత్రము చంద్రకిరణముల వంటి గొప్ప కాంతులను అనంతముగా వెదజల్లెను (17).

అపుడు ఇంద్రాది దేవతలందరు తమ తమ స్తెన్యములతో గూడి యుద్దమును చేయు కోరికతో ఒక చోట చేరిరి. మహాబలశాలురగు (18) దేవతలు, రాక్షసులు ఈ విధముగా యుద్ధమును చేయు కోరికతో భూమిపై నిలబడి యుండిరి. వారు తమ మహస్తెన్యములను వేర్వేరు వ్యూహములలో తీర్చిదిద్దిరి (19). స్తోత్రపాఠకులచే స్తుతింపబడుచున్న ఆ దేవదానవ స్తెన్యములు పరస్పరము సంహరించు కోరిక గలవై ఆ సమయములో విరాజిల్లినవి (20). వీరులు కాని వారికి మహాభయమును, వీరులకు ఆనందమును కలిగించు, ఆరణ్యముల వలె వ్యాపించియున్న ఆ రెండు సేనలు అపుడు గర్జించినవి (21).

సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹

🌹 SRI SIVA MAHA PURANA - 610🌹

✍️ J.L. SHASTRI

📚. Prasad Bharadwaj

🌴 Rudra-saṃhitā (4): Kumara-khaṇḍa - CHAPTER 07 🌴

🌻 Commencement of the War - 2 🌻

11. The Asuras in the company of Tāraka roared and shook the ground with their thudding footsteps, leapings and bouncings.

12. Undaunted by that terrible noise, the gods simultaneously rose up to fight Tāraka.

13. Accompanied by the great army of the gods and the guardians of the quarters, lord Indra seated Kumāra on an elephant and rushed forward.

14. Great war-drums, Dundubhis, Bherīs and Tūryas, lutes, flutes and Mṛdaṅgas were sounded and the Gandharvas sang war songs.

15. Leaving the elephant to lord Indra, Kumāra got in an aerial chariot of wonderful build and studded with different sets of gems.

16. Seated in the aerial chariot, the son of Śiva endowed with good qualities and of great renown shone with great splendour. He was being fanned with lustrous chowries.

17. The lustrous umbrella presented by Varuṇa, shining with various gems was held aloft over his head. Beams of light as though of infinite moons shed great lustre around.

18. Indra and other gods of great strength, desirous of fighting, joined him with their own divisions of the army.

19. The gods and the demons stood in their arrays on the ground with a vast army ready to start the battle.

20. With the bards singing their songs of praise, the armies of the gods and the Asuras shone in their eagerness to pounce on and crush each other.

21. The two armies as vast as a wild jungle roared. They were terrific to the coward and pleasing to the brave.

Continues....

🌹🌹🌹🌹🌹

17 Aug 2022

శ్రీ మదగ్ని మహాపురాణము - 95 / Agni Maha Purana - 95

🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 95 / Agni Maha Purana - 95 🌹

✍️. పుల్లెల శ్రీరామచంద్రుడు, 📚. ప్రసాద్ భరద్వాజ

శ్రీ గణేశాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ.

ప్రథమ సంపుటము, అధ్యాయము - 31

🌻. అపామార్జన (ఆత్మ రక్షణ ) విధానము - 2 🌻

ఇతరుల వినాశమును కోరువారు చేసిన అభిచారిక ప్రయోగములను, వారిచ్చిన విషమిశ్రాన్నపానములను, వారు కల్పించిన మహారోగములను జరాజీర్ణములుగ చేసి వాటి నన్నింటిని నశింపచేయుము. ఓం భగవంతు డైన వాసుదేవునకు నమస్కారము. ఖడ్గధారియైన కృష్ణునకు నమస్కారము. కమలనేత్రుడును, ఆది చక్రధారియు అగు కేశవునకు సమస్కారము. పద్మముల కింజల్కముల వలె పసుపు రంగు గల నిర్మలవస్త్రములు ధరించిన, భగవంతుడైన పీతాంబరునకు నమస్కారము.

ఘోరసంగ్రామములలో శత్రువుల కంఠములతో రాచుకొను చక్రమును ధరించిన చక్రపాణికి నమస్కారము. కోరపై లేవదీయబడిన భూమిని ధరించినవాడును, వేదవిగ్రహుడును శేషశయ్యపై శయనింఉవాడును అగు మహాయజ్ఞవరాహమూర్తికి నమస్కారము. ఓ! దివ్యసింహమూర్తీ! నీ కేశాంతములు కరిగించిన బంగారము వలె ప్రకాశించుచున్నవి. నేత్రములు అగ్ని వలె ప్రజ్వంచుచున్నవి. నీ నఖముల స్పర్వ వజ్రస్పర్శకంటె గూడ ఎక్కువ తీక్షణమైనది. నీకు నమస్కారము. చాల చిన్న శరీరము కలిగి, బుగ్వజుఃసామవేదముచే అలంకృతుడ వైన కాశ్యపకుమారా! వామనా! నమస్కారము. పిమ్మట విరాడ్రూపము ధరించి భూమిని ఆక్రమించిన త్రివిక్రమునకు నమస్కారము.

ఓ వరాహమూర్తీ! సమస్తపాపఫలరూపమున వచ్చిన సకలదుష్టరోగములను ఆణచివేయుము; ఆణచివేయుము. గొప్పకోరలు గల మహావరాహా! పాపమువలన కలిగిన ఫలమును అణచివేయుము; అణచివేయుము. వికట మైన ముఖము గల నీ దంతాగ్రములు అగ్ని వలె ప్రకాశించుచున్నవి. ఓ ఆర్తివినాశనా! ఆక్రమణము చేయు దుష్టుల వైపు చూడుము; నీ గర్జనముచే వారి నందరిని నశింపచేయుము; నశింపచేయుము.

ఓ! వామనమూర్తీ! ఋగ్యజుఃసామవేదముల గూఢతత్త్వములతో నిండిన వాక్కుతో ఈ ఆర్తుని సకలదుఃఖములను శమింపచేయుము గోవిందా! త్రిదోషములవలన కలిగినదియు, సంనిపాతమువలన కలిగినదియ, ఆగంతుకమునుఅగు ఐకాహికజ్వరమును (రోజువిడిచి రోజువచ్చు జ్వరము), ద్వ్యాహికజ్వరమును (రెండు రోజులకు (వచ్చునది). త్ర్యాహికజ్వరమును, అత్యంతముభయంకర మగు చాతుర్థిక జ్వరమును (నాలుగురోజులకొకసారివచ్చునది), మానకుండా వచ్చు జ్వరమును శీఘ్రముగ శమింప చేయుము. దానివలన కలుగు బాధలను తొలగింపుము.

సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹

🌹 Agni Maha Purana - 95 🌹

✍️ N. Gangadharan 📚. Prasad Bharadwaj

Chapter 31

🌻 Mode of cleansing and Protection oneself and others - 2 🌻

9. (You) destroy the magical incantations set up by others with meditation for working evils, causing diseases and decrepitude.

10. Oṃ, salutations to Vāsudeva, Kṛṣṇa, bearer of sword. Salutations to lotus-eyed, Keśava (and) the first holder of the disc.

11. Salutations to the wearer of clean dress made yellow by the filaments of lotuses (and) the disc (of Viṣṇu) hurled on the shoulders of the enemies at the great battle, (and) the wielder of the same.

12. Salutations to the one who lifted the earth on his tusk[1], who has the three forms embodied in him, the great Yajñavarāha,[2] and the one who reclines on the hood of (the serpent) Śeṣa.

13. Salutations to you, the divine lion having manes of the hue of molten gold, eyes bright like the burning fire, (and) claws (harder) than thunder-bolt to touch.

14. Salutations again and again to you, Kāśyapa, the shortest statured, adorned with the Ṛg, Yajur and Sāma (veda) (and) the Dwarf form which covered the earth.

15. O Boar, One with huge tusks, you crush all evils completely, their effects and also the effects of sins.

16. O Man-lion, having a dreadful face (and) the burning fire in between the teeth, the destroyer of distress, you breakdown all evils by your cry.

17. May Janārdana (Viṣṇu), the one who assumed the form of a Dwarf, dispel all grief of this person by words embedded with the Ṛg, Yajur and Sāma (veda).

18-19. O Govinda! (You) destroy quickly this person’s sufferings. Destroy fevers—quotidian occurring on alternate days, tertian, quartan and also the terrible satata, those arising out of derangement (of humours), the sannipāta (caused by the derangement of three humours), as well as accidental.

Continues....

🌹 🌹 🌹 🌹 🌹

17 Aug 2022

కపిల గీత - 56 / Kapila Gita - 56

🌹. కపిల గీత - 56 / Kapila Gita - 56🌹

🍀. కపిల దేవహూతి సంవాదం 🍀

✍️. శ్రీమాన్ క.రామానుజాచార్యులు, 📚. ప్రసాద్‌ భరధ్వాజ

2వ అధ్యాయము

🌴 2వ అధ్యాయము - సృష్టి తత్వం - 12 🌴

12. మహాభూతాని పంచైవ భూరాపోఽగ్నిర్మరున్నభః|
తన్మాత్రాణి చ తావంతి గంధాదీని మతాని మే॥

భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశము - అను ఐదును పంచమహా భూతములు, గంధము (వాసన), రసము (రుచి), రూపము, స్పర్శ, శబ్దము - అను ఐదును పంచతన్మాత్రలు.

సశేషం..

🌹 🌹 🌹 🌹 🌹

🌹 Kapila Gita - 56 🌹

🍀 Conversation of Kapila and Devahuti 🍀

✍️ Swami Prabhupada. 📚 Prasad Bharadwaj

🌴 2. Fundamental Principles of Material Nature - 12 🌴

12. mahā-bhūtāni pañcaiva bhūr āpo 'gnir marun nabhaḥ
tan-mātrāṇi ca tāvanti gandhādīni matāni me

There are five gross elements, namely earth, water, fire, air and ether. There are also five subtle elements: smell, taste, color, touch and sound.

Continues...

🌹 🌹 🌹 🌹 🌹

17 Aug 2022

17 Aug 2022 Daily Panchang నిత్య పంచాంగము

🌹17 August 2022 పంచాగము - Panchagam 🌹

శుభ బుధవారం, సౌమ్య వాసరే Wednesday

🌹. మళయాళ నూతన సంవత్సరం, మరియు బలరామ జయంతి శుభాకాంక్షలు 🌹

మీకు ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని కోరుకుంటూ

ప్రసాద్ భరద్వాజ

🌺. పండుగలు మరియు పర్వదినాలు : బలరామ జయంతి, సింహ సంక్రాంతి, మళయాళ నూతన సంవత్సరం, Balarama Jayanti, Simha Sankranti, Malayalam New Year 🌺

🍀. నారాయణ కవచము - 16 🍀

24. గదేఽశనిస్పర్శనవిస్ఫులింగే నిష్పింఢి నిష్పింఢ్యజితప్రియాసి |
కూష్మాండవైనాయకయక్షరక్షో భూతగ్రహాంశ్చూర్ణయ చూర్ణయారీన్ ||

🌻 🌻 🌻 🌻 🌻

🍀. నేటి సూక్తి : మరణానంతరం మనోమయ పురుషుడు మిగిలి వుండడమనేది ఒక విధంగా అమృతత్వమే అయినా అది నిజమైనది కాదు. శరీర ముండగానే, మెలకువగా వున్న స్థితిలోనే చావుపుట్టుకలు లేని ఆత్మోప లబ్ది కలిగి వుండడమే నిక్కమైన అమృతత్వం. శరీరం అట్టి ఆత్మకు ఛాయ, ఉపకరణము మాత్రమే. 🍀

🌷🌷🌷🌷🌷

శుభకృత్‌ సంవత్సరం, శ్రావణ మాసం

దక్షిణాయణం, వర్ష ఋతువు

తిథి: కృష్ణ షష్టి 20:26:47 వరకు

తదుపరి కృష్ణ సప్తమి

నక్షత్రం: అశ్విని 21:59:05 వరకు

తదుపరి భరణి

యోగం: దండ 20:55:24 వరకు

తదుపరి వృధ్ధి

కరణం: గార 08:17:08 వరకు

వర్జ్యం: 17:49:30 - 19:28:54

దుర్ముహూర్తం: 11:54:41 - 12:45:26

రాహు కాలం: 12:20:03 - 13:55:13

గుళిక కాలం: 10:44:53 - 12:20:03

యమ గండం: 07:34:34 - 09:09:44

అభిజిత్ ముహూర్తం: 11:55 - 12:45

అమృత కాలం: 14:30:42 - 16:10:06

సూర్యోదయం: 05:59:24

సూర్యాస్తమయం: 18:40:43

చంద్రోదయం: 22:38:17

చంద్రాస్తమయం: 10:46:26

సూర్య సంచార రాశి: కర్కాటకం

చంద్ర సంచార రాశి: మేషం

మృత్యు యోగం - మృత్యు భయం

21:59:05 వరకు తదుపరి కాల యోగం

- అవమానం

🌻 🌻 🌻 🌻 🌻

🍀. నిత్య ప్రార్థన 🍀

వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ

నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా

యశివ నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా

తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం

తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ

విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.

🌹🌹🌹🌹🌹

🍀 17 - AUGUST - 2022 TUESDAY ALL MESSAGES బుధవారం, సౌమ్య వాసర సందేశాలు 🍀

🌹 17 - AUGUST - 2022 TUESDAY ALL MESSAGES బుధవారం, సౌమ్య వాసర సందేశాలు 🌹
1) 🌹. నిత్య పంచాంగము Daily Panchangam 17, బుధవారం, ఆగస్టు 2022 సౌమ్య వాసరే Wednesday 🌹
🌹. మళయాళ నూతన సంవత్సరం, మరియు బలరామ జయంతి శుభాకాంక్షలు 🌹
2) 🌹 కపిల గీత - 56 / Kapila Gita - 56 🌹 సృష్టి తత్వము - 12
3) 🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 95 / Agni Maha Purana - 95 🌹 
4) 🌹. శివ మహా పురాణము - 611 / Siva Maha Purana -611 🌹
5) 🌹 ఓషో రోజువారీ ధ్యానములు - 230 / Osho Daily Meditations - 230 🌹
6) 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 399-1 / Sri Lalitha Chaitanya Vijnanam - 399-1 🌹 

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹17 August 2022 పంచాగము - Panchagam 🌹*
*శుభ బుధవారం, సౌమ్య వాసరే Wednesday*
*🌹. మళయాళ నూతన సంవత్సరం, మరియు బలరామ జయంతి శుభాకాంక్షలు 🌹*
*మీకు ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని కోరుకుంటూ*
*ప్రసాద్ భరద్వాజ*

*🌺. పండుగలు మరియు పర్వదినాలు : బలరామ జయంతి, సింహ సంక్రాంతి, మళయాళ నూతన సంవత్సరం, Balarama Jayanti, Simha Sankranti, Malayalam New Year 🌺*

*🍀. నారాయణ కవచము - 16 🍀*

*24. గదేఽశనిస్పర్శనవిస్ఫులింగే నిష్పింఢి నిష్పింఢ్యజితప్రియాసి |*
*కూష్మాండవైనాయకయక్షరక్షో భూతగ్రహాంశ్చూర్ణయ చూర్ణయారీన్ ||*

🌻 🌻 🌻 🌻 🌻

*🍀. నేటి సూక్తి : మరణానంతరం మనోమయ పురుషుడు మిగిలి వుండడమనేది ఒక విధంగా అమృతత్వమే అయినా అది నిజమైనది కాదు. శరీర ముండగానే, మెలకువగా వున్న స్థితిలోనే చావుపుట్టుకలు లేని ఆత్మోప లబ్ది కలిగి వుండడమే నిక్కమైన అమృతత్వం. శరీరం అట్టి ఆత్మకు ఛాయ, ఉపకరణము మాత్రమే. 🍀*

🌷🌷🌷🌷🌷

శుభకృత్‌ సంవత్సరం, శ్రావణ మాసం
దక్షిణాయణం, వర్ష ఋతువు
తిథి: కృష్ణ షష్టి 20:26:47 వరకు
తదుపరి కృష్ణ సప్తమి
నక్షత్రం: అశ్విని 21:59:05 వరకు
తదుపరి భరణి
యోగం: దండ 20:55:24 వరకు
తదుపరి వృధ్ధి
కరణం: గార 08:17:08 వరకు
వర్జ్యం: 17:49:30 - 19:28:54
దుర్ముహూర్తం: 11:54:41 - 12:45:26
రాహు కాలం: 12:20:03 - 13:55:13
గుళిక కాలం: 10:44:53 - 12:20:03
యమ గండం: 07:34:34 - 09:09:44
అభిజిత్ ముహూర్తం: 11:55 - 12:45
అమృత కాలం: 14:30:42 - 16:10:06
సూర్యోదయం: 05:59:24
సూర్యాస్తమయం: 18:40:43
చంద్రోదయం: 22:38:17
చంద్రాస్తమయం: 10:46:26
సూర్య సంచార రాశి: కర్కాటకం
చంద్ర సంచార రాశి: మేషం
మృత్యు యోగం - మృత్యు భయం 
21:59:05 వరకు తదుపరి కాల యోగం
- అవమానం

🌻 🌻 🌻 🌻 🌻  

*🍀. నిత్య ప్రార్థన 🍀*
*వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ*
*నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా*
*యశివ నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా*
*తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం*
*తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ* 
*విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.*
🌹🌹🌹🌹🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
.
*🌹. కపిల గీత - 56 / Kapila Gita - 56🌹*
*🍀. కపిల దేవహూతి సంవాదం 🍀*
*✍️. శ్రీమాన్ క.రామానుజాచార్యులు, 📚. ప్రసాద్‌ భరధ్వాజ*
*2వ అధ్యాయము*

*🌴 2వ అధ్యాయము - సృష్టి తత్వం - 12 🌴*

*12. మహాభూతాని పంచైవ భూరాపోఽగ్నిర్మరున్నభః|*
*తన్మాత్రాణి చ తావంతి గంధాదీని మతాని మే॥*

*భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశము - అను ఐదును పంచమహా భూతములు, గంధము (వాసన), రసము (రుచి), రూపము, స్పర్శ, శబ్దము - అను ఐదును పంచతన్మాత్రలు.*

*సశేషం..*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Kapila Gita - 56 🌹*
*🍀 Conversation of Kapila and Devahuti 🍀*
*✍️ Swami Prabhupada. 📚 Prasad Bharadwaj*

*🌴 2. Fundamental Principles of Material Nature - 12 🌴*

*12. mahā-bhūtāni pañcaiva bhūr āpo 'gnir marun nabhaḥ*
*tan-mātrāṇi ca tāvanti gandhādīni matāni me*

*There are five gross elements, namely earth, water, fire, air and ether. There are also five subtle elements: smell, taste, color, touch and sound.*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 95 / Agni Maha Purana - 95 🌹*
*✍️. పుల్లెల శ్రీరామచంద్రుడు, 📚. ప్రసాద్ భరద్వాజ*
*శ్రీ గణేశాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ.*
*ప్రథమ సంపుటము, అధ్యాయము - 31*

*🌻. అపామార్జన (ఆత్మ రక్షణ ) విధానము - 2 🌻*

ఇతరుల వినాశమును కోరువారు చేసిన అభిచారిక ప్రయోగములను, వారిచ్చిన విషమిశ్రాన్నపానములను, వారు కల్పించిన మహారోగములను జరాజీర్ణములుగ చేసి వాటి నన్నింటిని నశింపచేయుము. ఓం భగవంతు డైన వాసుదేవునకు నమస్కారము. ఖడ్గధారియైన కృష్ణునకు నమస్కారము. కమలనేత్రుడును, ఆది చక్రధారియు అగు కేశవునకు సమస్కారము. పద్మముల కింజల్కముల వలె పసుపు రంగు గల నిర్మలవస్త్రములు ధరించిన, భగవంతుడైన పీతాంబరునకు నమస్కారము. 

ఘోరసంగ్రామములలో శత్రువుల కంఠములతో రాచుకొను చక్రమును ధరించిన చక్రపాణికి నమస్కారము. కోరపై లేవదీయబడిన భూమిని ధరించినవాడును, వేదవిగ్రహుడును శేషశయ్యపై శయనింఉవాడును అగు మహాయజ్ఞవరాహమూర్తికి నమస్కారము. ఓ! దివ్యసింహమూర్తీ! నీ కేశాంతములు కరిగించిన బంగారము వలె ప్రకాశించుచున్నవి. నేత్రములు అగ్ని వలె ప్రజ్వంచుచున్నవి. నీ నఖముల స్పర్వ వజ్రస్పర్శకంటె గూడ ఎక్కువ తీక్షణమైనది. నీకు నమస్కారము. చాల చిన్న శరీరము కలిగి, బుగ్వజుఃసామవేదముచే అలంకృతుడ వైన కాశ్యపకుమారా! వామనా! నమస్కారము. పిమ్మట విరాడ్రూపము ధరించి భూమిని ఆక్రమించిన త్రివిక్రమునకు నమస్కారము.

ఓ వరాహమూర్తీ! సమస్తపాపఫలరూపమున వచ్చిన సకలదుష్టరోగములను ఆణచివేయుము; ఆణచివేయుము. గొప్పకోరలు గల మహావరాహా! పాపమువలన కలిగిన ఫలమును అణచివేయుము; అణచివేయుము. వికట మైన ముఖము గల నీ దంతాగ్రములు అగ్ని వలె ప్రకాశించుచున్నవి. ఓ ఆర్తివినాశనా! ఆక్రమణము చేయు దుష్టుల వైపు చూడుము; నీ గర్జనముచే వారి నందరిని నశింపచేయుము; నశింపచేయుము. 

ఓ! వామనమూర్తీ! ఋగ్యజుఃసామవేదముల గూఢతత్త్వములతో నిండిన వాక్కుతో ఈ ఆర్తుని సకలదుఃఖములను శమింపచేయుము గోవిందా! త్రిదోషములవలన కలిగినదియు, సంనిపాతమువలన కలిగినదియ, ఆగంతుకమునుఅగు ఐకాహికజ్వరమును (రోజువిడిచి రోజువచ్చు జ్వరము), ద్వ్యాహికజ్వరమును (రెండు రోజులకు (వచ్చునది). త్ర్యాహికజ్వరమును, అత్యంతముభయంకర మగు చాతుర్థిక జ్వరమును (నాలుగురోజులకొకసారివచ్చునది), మానకుండా వచ్చు జ్వరమును శీఘ్రముగ శమింప చేయుము. దానివలన కలుగు బాధలను తొలగింపుము.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Agni Maha Purana - 95 🌹*
*✍️ N. Gangadharan 📚. Prasad Bharadwaj *

*Chapter 31*
*🌻 Mode of cleansing and Protection oneself and others - 2 🌻*

9. (You) destroy the magical incantations set up by others with meditation for working evils, causing diseases and decrepitude.

10. Oṃ, salutations to Vāsudeva, Kṛṣṇa, bearer of sword. Salutations to lotus-eyed, Keśava (and) the first holder of the disc.

11. Salutations to the wearer of clean dress made yellow by the filaments of lotuses (and) the disc (of Viṣṇu) hurled on the shoulders of the enemies at the great battle, (and) the wielder of the same.

12. Salutations to the one who lifted the earth on his tusk[1], who has the three forms embodied in him, the great Yajñavarāha,[2] and the one who reclines on the hood of (the serpent) Śeṣa.

13. Salutations to you, the divine lion having manes of the hue of molten gold, eyes bright like the burning fire, (and) claws (harder) than thunder-bolt to touch.

14. Salutations again and again to you, Kāśyapa, the shortest statured, adorned with the Ṛg, Yajur and Sāma (veda) (and) the Dwarf form which covered the earth.

15. O Boar, One with huge tusks, you crush all evils completely, their effects and also the effects of sins.

16. O Man-lion, having a dreadful face (and) the burning fire in between the teeth, the destroyer of distress, you breakdown all evils by your cry.

17. May Janārdana (Viṣṇu), the one who assumed the form of a Dwarf, dispel all grief of this person by words embedded with the Ṛg, Yajur and Sāma (veda).

18-19. O Govinda! (You) destroy quickly this person’s sufferings. Destroy fevers—quotidian occurring on alternate days, tertian, quartan and also the terrible satata, those arising out of derangement (of humours), the sannipāta (caused by the derangement of three humours), as well as accidental.

Continues....
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 . శ్రీ శివ మహా పురాణము - 610 / Sri Siva Maha Purana - 610 🌹* 
✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి 📚. ప్రసాద్ భరద్వాజ

*🌴. రుద్రసంహితా-కుమార ఖండః - అధ్యాయము - 07 🌴*
*🌻. యుద్ధారంభము - 2 🌻*

నిర్భయులై తారకునితో యుద్దమును చేయగోరి ఒక్కుమ్మడిగా లేచి నిలబడిరి (12). దేవేంద్రుడు కుమారుని ఏనుగుపై ఎక్కించి, లోకపాలురతో మరియు దేవతల పెద్ద స్తెన్యముతో గూడి ముందు నడిచెను (13). అపుడుదుందుభులు, అనేక విధముల భేరీలు, తూర్యములు, వీణలు, వేణువులు, మద్దెలలు మ్రోగినవి. గంధర్వులు పాడజొచ్చిరి (14).

కుమారుడు ఏనుగును ఇంద్రునకిచ్చి, అనేక వింతలతో గూడినది, నానావిధ రత్నములచే పొదగబడినది అగు విమానము నధిష్ఠించెను (15). గొప్ప కీర్తి గలవాడు, సర్వ సద్గుణ సంపన్నుడు, శోభా యుక్తుడు అగు ఆ శంకరపుత్రుడు విమానము నధిష్ఠించెను. అపుడు గొప్ప ప్రకాశము గల వింజామరలచే వీచు చుండా ఆ మహాత్ముడు గొప్పగా ప్రకాశించెను (16) మిక్కిలి శోభ గలది, రత్నములతో పొదిగినది అగు వరుణచ్ఛత్రమును కుమారుని శిరస్సుపై పట్టిరి. అపుడా ఛత్రము చంద్రకిరణముల వంటి గొప్ప కాంతులను అనంతముగా వెదజల్లెను (17).

అపుడు ఇంద్రాది దేవతలందరు తమ తమ స్తెన్యములతో గూడి యుద్దమును చేయు కోరికతో ఒక చోట చేరిరి. మహాబలశాలురగు (18) దేవతలు, రాక్షసులు ఈ విధముగా యుద్ధమును చేయు కోరికతో భూమిపై నిలబడి యుండిరి. వారు తమ మహస్తెన్యములను వేర్వేరు వ్యూహములలో తీర్చిదిద్దిరి (19). స్తోత్రపాఠకులచే స్తుతింపబడుచున్న ఆ దేవదానవ స్తెన్యములు పరస్పరము సంహరించు కోరిక గలవై ఆ సమయములో విరాజిల్లినవి (20). వీరులు కాని వారికి మహాభయమును, వీరులకు ఆనందమును కలిగించు, ఆరణ్యముల వలె వ్యాపించియున్న ఆ రెండు సేనలు అపుడు గర్జించినవి (21).

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 SRI SIVA MAHA PURANA - 610🌹*
*✍️ J.L. SHASTRI*
*📚. Prasad Bharadwaj *

*🌴 Rudra-saṃhitā (4): Kumara-khaṇḍa - CHAPTER 07 🌴*

*🌻 Commencement of the War - 2 🌻*

11. The Asuras in the company of Tāraka roared and shook the ground with their thudding footsteps, leapings and bouncings.

12. Undaunted by that terrible noise, the gods simultaneously rose up to fight Tāraka.

13. Accompanied by the great army of the gods and the guardians of the quarters, lord Indra seated Kumāra on an elephant and rushed forward.

14. Great war-drums, Dundubhis, Bherīs and Tūryas, lutes, flutes and Mṛdaṅgas were sounded and the Gandharvas sang war songs.

15. Leaving the elephant to lord Indra, Kumāra got in an aerial chariot of wonderful build and studded with different sets of gems.

16. Seated in the aerial chariot, the son of Śiva endowed with good qualities and of great renown shone with great splendour. He was being fanned with lustrous chowries.

17. The lustrous umbrella presented by Varuṇa, shining with various gems was held aloft over his head. Beams of light as though of infinite moons shed great lustre around.

18. Indra and other gods of great strength, desirous of fighting, joined him with their own divisions of the army.

19. The gods and the demons stood in their arrays on the ground with a vast army ready to start the battle.

20. With the bards singing their songs of praise, the armies of the gods and the Asuras shone in their eagerness to pounce on and crush each other.

21. The two armies as vast as a wild jungle roared. They were terrific to the coward and pleasing to the brave.

Continues....
🌹🌹🌹🌹🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. ఓషో రోజువారీ ధ్యానాలు - 230 / Osho Daily Meditations - 230 🌹*
*📚. ప్రసాద్ భరద్వాజ*

*🍀 230. జీవితం మరియు మరణ ధ్యానములు 🍀*

*🕉. ఈ రెండు--జీవితం మరియు మరణ ధ్యానాలు --మీకు అద్భుతంగా సహాయపడతాయి 🕉*
 
*మీరు నిద్రించడానికి ముందు రాత్రి, ఈ పదిహేను నిమిషాల ధ్యానం చేయండి. ఇది మరణ ధ్యానం. పడుకుని, మీ శరీరాన్ని విశ్రాంతిలోకి తీసుకోండి. మీరు చనిపోయారని మరియు మీరు చనిపోయినందున మీ శరీరాన్ని కదల్చలేరని భావించండి. మీరు శరీరం నుండి అదృశ్య మవుతున్నారనే భావనను సృష్టించండి. పది, పదిహేను నిముషాల పాటు ఇలా చేస్తే వారం రోజుల్లోనే మీరు అనుభూతి చెందుతారు. ఆ విధంగా ధ్యానం చేస్తూ, నిద్రలోకి జారుకోండి. దానికి అంతరాయం కలిగించ వద్దు. ధ్యానం నిద్రగా మారనివ్వండి మరియు నిద్ర మిమ్మల్ని అధిగమిస్తే, దానిలోకి వెళ్లండి. ఉదయం, మీరు మేల్కొన్నట్లు అనిపించిన క్షణం - కళ్ళు తెరవకండి - జీవిత ధ్యానం చేయండి.*

*మీరు మరింత పూర్తిగా జీవిస్తున్నారని, జీవితం తిరిగి వస్తోందని మరియు శరీరం మొత్తం ప్రాణం మరియు శక్తితో నిండి ఉందని భావించండి. కళ్ళు మూసుకుని మంచం మీద ఊగుతూ కదలడం ప్రారంభించండి. మీలో జీవం ప్రవహిస్తున్నట్లు భావించండి. శరీరం గొప్ప ప్రవహించే శక్తిని కలిగి ఉందని భావించండి - ఇది మరణ ధ్యానానికి వ్యతిరేకం. జీవిత ధ్యానంతో మీరు లోతైన శ్వాసలను తీసుకోవచ్చు. ఊపిరి పీల్చుకోవడంతో ప్రాణం ప్రవేశిస్తోందని, శక్తితో నిండిన అనుభూతిని పొందండి. నిండుగా మరియు చాలా సంతోషంగా, సజీవంగా అనుభూతి చెందండి. అప్పుడు పదిహేను నిమిషాల తర్వాత, లేవండి. ఈ రెండు-జీవితం మరియు మరణం ధ్యానాలు --మీకు అద్భుతంగా సహాయపడతాయి.*
  
*కొనసాగుతుంది...*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Osho Daily Meditations - 230 🌹*
*📚. Prasad Bharadwaj*

*🍀 230. LIFE AND DEATH MEDITATIONS 🍀*

*🕉. These two--the life and death meditations--can help you tremendously 🕉*
 
*In the night before you go to sleep, do this fifteen-minute meditation. It is a death meditation. Lie down and relax your body. Just feel like dying and that you cannot move your body because you are dead. Create the feeling that you are disappearing from the body. Do it for ten, fifteen minutes, and you will start feeling it within a week. Meditating that way, fall asleep. Don't interrupt it. Let the meditation turn into sleep, and if sleep overcomes you, go into it. In the morning, the moment you feel you are awake--don't open your eyes---do the life meditation.*

*Feel that you are becoming more wholly alive, that life is coming back and the whole body is full of vitality and energy. Start moving, swaying in the bed with eyes closed. Just feel that life is flowing in you. Feel that the body has a great flowing energy-just the opposite of the death meditation. With the life meditation you can take deep breaths. Just feel full of energy, that life is entering with the breathing. Feel full and very happy, alive. Then after fifteen minutes, get up. These two-the life and death meditation--can help you tremendously.*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 399 - 1 / Sri Lalitha Chaitanya Vijnanam - 399 - 1 🌹*
*🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻*
*✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁*

*🍀 86. ప్రభావతీ, ప్రభారూపా, ప్రసిద్ధా, పరమేశ్వరీ ।*
*మూలప్రకృతి రవ్యక్తా, వ్యక్తాఽవ్యక్త స్వరూపిణీ ॥ 86 ॥ 🍀*

*🌻 399. 'వ్యక్తావ్యక్త స్వరూపిణి' - 1🌻* 

*అవ్యక్తమైన శ్రీమాత అవరోహణ క్రమమున వ్యక్త మగును అని అర్థము. శ్రీమాత వ్యక్తముగను, అవ్యక్తముగను కూడ ఏక కాలమున నున్నది. కనబడువానిలో కనబడని ప్రజ్ఞ, శక్తి రూపములతో నున్నది. ప్రజ్ఞ కతీతముగ కూడ నున్నది. కనబడునది చూచి, అది ఆధారముగ కనబడని మూడు స్థితులను గ్రహించువారు తెలిసినవారు. వారినే మనుషులని, బ్రాహ్మణులని వేదము తెలుపుచున్నది.*

*"చత్వారి వాక్పరిమితా పదాని తాని విదుర్భాహ్మణా యే మనీషిణః ।*
*గృహా త్రీణి నిహితా సంగయంతి తురీయం వాచో మనుష్యా వదంతి ॥ "*

*నాలుగు స్థితులలో పరా, పశ్యంతి, మధ్యమ, వైఖరిలుగ నున్న వాక్కును మనీషులైన బ్రాహ్మణు లెరుగుదురు. ఇతరులు నాలుగవది అయిన వైఖరీ వాక్కునే ఎరుగుదురు.*

*సశేషం...*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 399 -1 🌹*
*Contemplation of 1000 Names of Sri Lalitha Devi* 
*✍️. Acharya Ravi Sarma 📚. Prasad Bharadwaj*

*🌻 86. Prabhavati prabha rupa prasidha parameshari*
*Mulaprakruti ravyakta vyaktavyakta svarupini ॥ 86 ॥ 🌻*

*🌻 399. Vyaktāvyakta-svarūpiṇī व्यक्ताव्यक्त-स्वरूपिणी 🌻*

*It is vyakta (manifested) + avyakta (un-manifested) svarūpiṇī. She is both manifested and un-manifested form. Since this form is the first of manifested form, it is called mahat which means great. It is the fundamental tool of the phenomenal universe. This mahat is endowed with supreme knowledge. The undifferentiated prakṛti is mahat. From mahat, further evolution takes place.*

*Vyakta means perishable and a-vyakta means imperishable. The soul-Brahman relationship is cited here. In general, this stage provides happiness and the final salvation. This nāma means the first signs of creation and final liberation are both caused by Lalitāmbikā.*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹