1) 🌹. నిత్య పంచాంగము Daily Panchangam, 26, మార్చి 2022 శనివారం, స్థిర వాసరే 🌹2) 🌹. శ్రీమద్భగవద్గీత - 177 / Bhagavad-Gita - 177 - 4-15 జ్ఞానయోగము 🌹
3) 🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 576 / Vishnu Sahasranama Contemplation - 576🌹
4) 🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 25 / Agni Maha Purana 25 🌹
5) 🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 255 / DAILY WISDOM - 255 🌹
6) 🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 156 🌹
7) 🌹. మైత్రేయ మహర్షి బోధనలు - 94 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శుభ శనివారం మిత్రులందరికీ 🌹*
*స్థిర వాసరే, 26, మార్చి 2022*
*మీకు ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని కోరుకుంటూ*
*ప్రసాద్ భరద్వాజ*
*🌻. పండుగలు మరియు పర్వదినాలు : లేవు. 🌻*
*🍀. శ్రీ వేంకటేశ అష్టకం-7 🍀*
*13. విష్ణోర్లోకైకసోపానం సర్వదుఃఖైకనాశనమ్ |*
*సర్వైశ్వర్యప్రదం నౄణాం సర్వమంగళకారకమ్*
*14. మాయావీ పరమానందం త్యక్త్వా వైకుంఠముత్తమమ్ |*
*స్వామిపుష్కరిణీతీరే రమయా సహ మోదతే*
🌻 🌻 🌻 🌻 🌻
*🍀. నేటి సూక్తి : మనము మన సధ్బావనలకు నాటడమే ఉర్ధ్వమూల మధః శాఖం. అంతరిక్షములో నాటిన ఆ సధ్భావనలు భూమిలోకి చేరి మళ్లీ పుష్పములుగా వికసిస్తాయి. మాస్టర్ ఆర్.కె. 🍀*
🌷🌷🌷🌷🌷
విక్రమ సంవత్సరం: 2078 ఆనంద
శఖ సంవత్సరం: 1943 ప్లవ,
ఉత్తరాయణం, శశిర ఋతువు,
ఫాల్గుణ మాసం
తిథి: కృష్ణ నవమి 20:03:46 వరకు
తదుపరి కృష్ణ దశమి
నక్షత్రం: పూర్వాషాఢ 14:48:00 వరకు
తదుపరి ఉత్తరాషాఢ
యోగం: పరిఘ 22:58:33 వరకు
తదుపరి శివ
కరణం: తైతిల 09:03:09 వరకు
వర్జ్యం: 01:12:00 - 02:42:40
మరియు 22:23:00 - 23:54:00
దుర్ముహూర్తం: 07:53:19 - 08:42:09
రాహు కాలం: 09:18:47 - 10:50:20
గుళిక కాలం: 06:15:39 - 07:47:13
యమ గండం: 13:53:27 - 15:25:00
అభిజిత్ ముహూర్తం: 11:57 - 12:45
అమృత కాలం: 10:16:00 - 11:46:40
సూర్యోదయం: 06:15:39
సూర్యాస్తమయం: 18:28:07
చంద్రోదయం: 01:38:30
చంద్రాస్తమయం: 12:53:05
సూర్య సంచార రాశి: మీనం
చంద్ర సంచార రాశి: ధనుస్సు
మతంగ యోగం - అశ్వ లాభం
14:48:00 వరకు తదుపరి రాక్షస
యోగం - మిత్ర కలహం
🌻 🌻 🌻 🌻 🌻
*🍀. నిత్య ప్రార్థన 🍀*
*వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ*
*నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా*
*యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా*
*తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం*
*తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ*
*విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.*
🌹🌹🌹🌹🌹
#పంచాగముPanchangam
#PanchangDaily
#DailyTeluguCalender
Join and Share
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శ్రీమద్భగవద్గీత - 177 / Bhagavad-Gita - 177 🌹*
*✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద*0
*📚. ప్రసాద్ భరద్వాజ*
*🌴. 4 వ అధ్యాయము - జ్ఞాన యోగము - 15 🌴*
*15. ఏవం జ్ఞాత్వా కృతం కర్మ*
*పుర్వైరపి ముముక్షుభి: |*
*కురు కర్మైవ తస్మాత్త్వం పుర్వై:*
*పూర్వతరం కృతమ్ ||*
🌷. తాత్పర్యం :
*పూర్వకాలమున ముక్త పురుషులందరు నా దివ్యతత్త్వపు ఈ అవగాహనతోనే కర్మలను ఒనరించి యుండిరి. కావున నీవు కూడా వారిని అనుసరించుచు నీ కర్మనొనరింపుము.*
🌻. భాష్యము :
మానవులలో రెండు తరగతులవారు కలరు. ఒకరు హృదయమునందు మలినభావములను కలవారు కాగా, మిగిలినవారు కల్మషదూరులై యుందురు. ఈ ఇరువురికిని కృష్ణభక్తిరసభావానము సమానముగా శ్రేయోదాయకమైనదే. మలినచిత్తులు భక్తియోగము నందలి నియమితసూత్రములను అనుసరించుచు పవిత్రతను పొందుటకై కృష్ణభక్తి విధానమును స్వీకరింపవచ్చును.
విషయమాలిన్యము తొలగియున్నవారు సైతము ఈ కృష్ణభక్తిభావన యందు కొనసాగుచు, ఇతరులు తమను అనుసరించి లాభపడురీతిలో ఆదర్శముగా కర్మల నొనరింపవచ్చును. మూర్ఖజనులు లేదా భక్తి యొక్క ఆరంభదశలో నున్నవారు కొందరు తగినంత కృష్ణపరజ్ఞానము లేకుండుటచే కర్మల నుండి విరమింపగోరుదురు.
యుధరంగకర్మల నుండి విరమించవలెననెడి అర్జునుని కోరికను శ్రీకృష్ణభగవానుడు ఆమోదింపలేదు. అనగా మనుజుడు కర్మను ఏ విధముగా ఒనరించవలెనో తెలిపిన చాలును. కృష్ణపరములగు కర్మల నుండి విరమించి కృష్ణభక్తి ప్రదర్శనము కావించుచు ఒంటరిగా కూర్చుండుట యనునది కృష్ణపరమగు కర్మరంగమున నియుక్తమగుట కన్నను ముఖ్యమెన్నడును కాబోదు. కనుకనే పూర్వము తెలుపబడిన వివస్వానుడు(సూర్యదేవుడు) వంటి శ్రీకృష్ణభగవానుని శిష్యులను అనుసరించుచు కృష్ణభక్తిభావనలో వర్తింపవలసినదిగా ఇచ్చట అర్జునుడు భోధింపబడెను.
శ్రీకృష్ణభగవానుడు తన పూర్వకర్మలన్నింటిని మరియు పూర్వము కృష్ణభక్తిభావనలో వర్తించిన వారి కర్మలన్నింటిని సంపూర్ణముగా ఎరిగియుండెను. కనుకనే తన నుండి లక్షలసంవత్సరములకు పూర్వము విద్యను బడసిన సూర్యదేవుని కర్మలను అతడు అనుసరణియములని పలుకుచున్నాడు. శ్రీకృష్ణుని అట్టి శిష్యులే ఇచ్చట ముక్తపురుషులుగా పేర్కొనబడిరి. వారన్దరునుఆ దేవదేవుడు నిర్దేశించిన కార్యనిర్వాహణమందు నియుక్తులై యుందురు.
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Bhagavad-Gita as It is - 177 🌹*
*✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada*
*📚 Prasad Bharadwaj*
*🌴 Chapter 4 - Jnana Yoga - 15 🌴*
*15. evaṁ jñātvā kṛtaṁ karma pūrvair api mumukṣubhiḥ*
*kuru karmaiva tasmāt tvaṁ pūrvaiḥ pūrva-taraṁ kṛtam*
🌷 Translation :
*All the liberated souls in ancient times acted with this understanding of My transcendental nature. Therefore you should perform your duty, following in their footsteps.*
🌹 Purport :
There are two classes of men. Some of them are full of polluted material things within their hearts, and some of them are materially free. Kṛṣṇa consciousness is equally beneficial for both of these persons. Those who are full of dirty things can take to the line of Kṛṣṇa consciousness for a gradual cleansing process, following the regulative principles of devotional service.
Those who are already cleansed of the impurities may continue to act in the same Kṛṣṇa consciousness so that others may follow their exemplary activities and thereby be benefited. Foolish persons or neophytes in Kṛṣṇa consciousness often want to retire from activities without having knowledge of Kṛṣṇa consciousness. Arjuna’s desire to retire from activities on the battlefield was not approved by the Lord. One need only know how to act. To retire from the activities of Kṛṣṇa consciousness and to sit aloof making a show of Kṛṣṇa consciousness is less important than actually engaging in the field of activities for the sake of Kṛṣṇa.
Arjuna is here advised to act in Kṛṣṇa consciousness, following in the footsteps of the Lord’s previous disciples, such as the sun-god Vivasvān, as mentioned hereinbefore. The Supreme Lord knows all His past activities, as well as those of persons who acted in Kṛṣṇa consciousness in the past. Therefore He recommends the acts of the sun-god, who learned this art from the Lord some millions of years before. All such students of Lord Kṛṣṇa are mentioned here as past liberated persons, engaged in the discharge of duties allotted by Kṛṣṇa.
🌹 🌹 🌹 🌹 🌹
#భగవద్గీత #BhagavadGita
#చైతన్యవిజ్ఞానం #PrasadBhardwaj
https://t.me/bhagavadgeethaa/
www.facebook.com/groups/bhagavadgeethaa/
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 576 / Vishnu Sahasranama Contemplation - 576🌹*
*📚. ప్రసాద్ భరద్వాజ*
*🌻 576. సామః, सामः, Sāmaḥ 🌻*
*ఓం సామ్నే నమః | ॐ साम्ने नमः | OM Sāmne namaḥ*
సామః, सामः, Sāmaḥ
*వేదానాం సామవేదోఽస్మీత్యుక్తేస్సామేతి కథ్యతే*
*సామవేదము కూడా పరమాత్ముని రూపవిశేషమే! శ్రీమద్భగవద్గీతయందు దీని ప్రమాణము...*
:: శ్రీమద్భగవద్గీత - విభూతి యోగము ::
వేదానాం సామవేదోఽస్మి దేవానామస్మి వాసవః ।
ఇన్ద్రియాణాం మనశ్చాస్మి భూతానామస్మి చేతనా ॥ 22 ॥
*నేను వేదములలో సామవేదమును, దేవతలలో ఇంద్రుడను, ఇంద్రియములలో మనస్సున్ను, ప్రాణులలో చైతన్యమున్ను నేనే అయి యున్నాను.*
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
*🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 576🌹*
*📚. Prasad Bharadwaj*
*🌻576. Sāmaḥ🌻*
*OM Sāmne namaḥ*
वेदानां सामवेदोऽस्मीत्युक्तेस्सामेति कथ्यते /
*Vedānāṃ sāmavedo’smītyuktessāmeti kathyate*
*Sāma Veda is also His opulence as told by the Lord in Śrīmad Bhagavad Gīta.*
:: श्रीमद्भगवद्गीत - विभूति योग ::
वेदानां सामवेदोऽस्मि देवानामस्मि वासवः ।
इन्द्रियाणां मनश्चास्मि भूतानामस्मि चेतना ॥ २२ ॥
Śrīmad Bhagavad Gīta - Chapter 10
Vedānāṃ sāmavedo’smi devānāmasmi vāsavaḥ,
Indriyāṇāṃ manaścāsmi bhūtānāmasmi cetanā. 22.
*Among the Vedas, I am Sāma Veda; among the gods, I am Indra. Among the organs, I am the mind, and I am the intelligence in creatures.*
🌻 🌻 🌻 🌻 🌻
Source Sloka
त्रिसामा सामगस्साम निर्वाणं भेषजं भिषक् ।सन्न्यासकृच्छमश्शान्तो निष्ठा शान्तिः परायणम् ॥ ६२ ॥
త్రిసామా సామగస్సామ నిర్వాణం భేషజం భిషక్ ।సన్న్యాసకృచ్ఛమశ్శాన్తో నిష్ఠా శాన్తిః పరాయణమ్ ॥ 62 ॥
Trisāmā sāmagassāma nirvāṇaṃ bheṣajaṃ bhiṣak,Sannyāsakrcchamaśśānto niṣṭhā śāntiḥ parāyaṇam ॥ 62 ॥
Continues....
🌹 🌹 🌹 🌹🌹
#విష్ణుసహస్రనామతత్వవిచారణ #విష్ణుసహస్రనామములు #VishnuSahasranama #PrasadBhardwaj
https://t.me/vishnusahasranaam
www.facebook.com/groups/vishnusahasranaam/
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://chat.whatsapp.com/
https://incarnation14.wordpress.com/
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 25 / Agni Maha Purana - 25 🌹*
*✍️. పుల్లెల శ్రీరామచంద్రుడు*
*ప్రథమ సంపుటము, అధ్యాయము - 10*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*శ్రీ గణేశాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ.*
*🌻. యుద్ధకాండ వర్ణనము - 1 🌻*
నారదుడు చెప్పెను: రాముడు పంపగా అంగదుడు వెళ్ళి రావణునితో ఇట్లు చెప్పెను. "వెంటనే సీతను రామునకు ఒప్పగించుము. కానిచో మరణింపగలవు"
యుద్ధమునకై ఉద్దతులైన రాక్షసుల గల రావణుడు అతనిని చంపుటకు ప్రయత్నించెను. అతడు తిరిగివచ్చి. "దశగ్రీవుడు యద్ధమును మాత్రమే కోరుచున్నాడు" అని రామునితో చెప్పెను.
ఆ మాట విని రాముడు వానరసమేతుడై లంక చేరెను. హనుమంతుడు మైందుడు, ద్వివిదుడు, జాంబవంతుడు, నలుడు, నీలుడు, తారుడు, అంగద-ధూమ్ర-సుషేణులు, కేనరి, గజ - పనస - వినత - రంభ - శరభ క్రథనులు, బల శాలియైన గవాక్షుడు; దధివక్త్ర - గవయ - గంధమాదనులు, తదితర వానరులును వెళ్ళిరి. వీరితోడను, అసంఖ్యాకులగు ఇతరవానరులతోడను కూడిన సుగ్రీవుడు కూడ వెళ్ళెను.
వానరరాక్షసుల మధ్య సంకుల యుద్ధము కొనసాగెను. రాక్షసులు బాణములు, శక్తులు, గదలు మొదలగు వాటితో వానరులను కొట్టిరి. వానరులు, గోళ్ళు దంతములు, శిలలు మొదలగు వాటితో వానరులను కొట్టిరి. రాక్షసుల ఏనుగులు, గుఱ్ఱములు, రథములు, కాలిబంటులు-ఈ రూపములో నన్ను సైన్యము చంపబడెను. హనుమంతుడు శత్రువైన ధూమ్రాక్షున పర్వతశిఖరముతో చెంపెను. నీలుడు యుద్ధము చేయుచున్న అకంపన- ప్రహస్తులను చెంపెను.
గరుత్మంతుని దర్శనముచే ఇంద్రజిత్తు ప్రయోగించిన శరబంధము నుండి విములైన రామలక్ష్మణులు బాణములతో రాక్షస సైన్యమును సంహరించిరి. రణరంగమున రాముడు బాణములచే రావణున జర్జరశరీరునిగా చేసెను. రావణుడు దుఃఖితుడై కుంభకర్ణుని మేల్కొలిపెను.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Agni Maha Purana -25 🌹*
*✍️ N. Gangadharan*
*📚. Prasad Bharadwaj *
*Chapter 10*
*🌻 Yudda (War) Kand - 1 🌻*
Nārada said:
1. Being asked by Rāma, Aṅgada went to Rāvaṇa (and) said, “Let Jānakī be returned to Rāghava immediately, otherwise you will die.”
2. Rāvaṇa was intent on killing (Aṅgada). The ten-headed demon who was ready to fight sent words to Rāma that war was the only way thought of.
3- 5. After hearing these words, Rāma came to Laṅkā with the monkeys for the sake of battle. The monkeys were Hanūmat, Mainda, Dvivida, Jāmbavat, Nala, Nīla, Tāra, Aṅgada, Dhūmra, Suṣeṇa, Keśarī, Gaya, Panasa, Vinata, Rambha, Śarabha, Krathana the strong, Gavākṣa, Dadhivaktra, Gandhamādana and others and Sugrīva. With these and other innumerable monkeys (Rāma came to Laṅkā).
6. There was a disorderly battle between the demons and monkeys. The demons killed the monkeys with arrows, spears and mace”.
7. The monkeys killed demons with nails, teeth and stones. The force of the demons consisting of elepḥants cavalry, chariots and infantry was destroyed.
8. Hanūmat killed the enemy Dhūmrākṣa with a big rock. Nīla killed the fighting Akampana and Prahasta.
9. Rāma and Lakṣmaṇa fainted on account of the arrow discharged by Indrajit. Regaining their consciousness after perceiving Tārkṣya (the chief of the eagles), they killed the forces of demons.
10. Rāma made Rāvaṇa shattered in the battle by means of arrows. And the grief-stricken Rāvaṇa woke up Kumbhakarṇa.
Continues....
🌹 🌹 🌹 🌹 🌹
#అగ్నిపురాణం #శ్రీమదగ్నిమహాపురాణం #AgniMahaPuranam #చైతన్యవిజ్ఞానం
Join
🌹Agni Maha Purana Channel 🌹
https://t.me/AgniMahaPuranam
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom
www.facebook.com/groups/hindupuranas/
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 255 / DAILY WISDOM - 255 🌹*
*🍀 📖. జీవితం మరియు అనంతం యొక్క ఉపదేశాలు నుండి 🍀*
*📝 .స్వామి కృష్ణానంద*
*📚. ప్రసాద్ భరద్వాజ*
*🌻 11. పరిణామక్రమంలో మానవుడు మధ్య బిందువుని దాటాడు 🌻*
*స్పృహ యొక్క పరిణామం నిజంగా మనిషితో ముగియదు. మనిషిని కేవలం అలంకారికంగా మాత్రమే భగవంతుని ప్రతిరూపంగా వర్ణించవచ్చు కానీ నిజంగా కాదు. ఎందుకంటే మనిషి నుండి సర్వోత్తమ మనిషిగా పరిణామం చెందే ప్రక్రియలో మరింత ఎదగాలి. ఆ ఎదుగుదల స్థాయి మనిషికి మరియు అంతిమ దైవానికి మధ్య వారధిగా పనిచేసే స్థితికి రావాలి. మానవ స్థితికి మించిన ఉన్నత స్థాయి జీవన స్థాయిల సూచనలు ఉపనిషత్తులలో అనేకం నమోదు చేయబడ్డాయి. ఉత్తమమైన మానవుల కంటే కూడా పితృ, గంధర్వులు, దేవతల రాజ్యాల లాంటి స్థాయిలు అనేకం ఉన్నాయి. స్వర్గానికి చెందిన ఉన్నత దేవతలు, పరిపూర్ణులు దాదాపు విరాట్, హిరణ్యగర్భ, ఈశ్వరుడు మరియు బ్రాహ్మణ దశల్లో కలుస్తున్నారు.*
*అంటే, మనిషి మరింతగా పరిణామం చెందాలి. ప్రస్తుతం అతను దేవునికి మరియు పరిపూర్ణతకు మధ్యలో కొంత స్థానాన్ని ఆక్రమించాడు. అశాంతి, అంతిమత, ప్రతి వైపు నుండి పరిమితుల స్పృహ, స్థలం మరియు జీవితంలో తన ఆధిపత్యాన్ని విస్తరించాలనే ఎడతెగని కోరికలు మరియు అంతులేని ప్రతిఘటనలు వంటివి, అంతే కాదు పుట్టడం మరియు చనిపోవడం కూడా ఈ ప్రయాణంలోని ఒత్తిడిని బిగ్గరగానే ప్రకటిస్తాయి. దైవము - ప్రకృతి పథకంలో మనిషి, ఆశించిన పరిపూర్ణతకు, మనిషి నుండి దైవ మనిషికి, దైవమనిషి స్థితి నుండి స్వయంగా దైవంగా మారడంలో ఇంకా చాలా దూరంలోనే ఉన్నాడని చెప్పవచ్చు.*
*కొనసాగుతుంది...*
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 DAILY WISDOM - 255 🌹*
*🍀 📖 from Essays in Life and Eternity 🍀*
*📝 Swami Krishnananda*
*📚. Prasad Bharadwaj*
*🌻 11. God and Brute Crossed at One Point 🌻*
*The evolution of consciousness does not end with man, really. Man may be described as the image of God only figuratively but not truly, for there has to be a further ascent in the process of evolution from man to superman, a stage which acts as a link between man and the ultimate Godhead. Indications of the higher category of levels of life, beyond the human state, are available in the positive statements recorded in the Upanishads to the effect that above even the best of human beings there are the levels of the realms of the Pitrs, Gandharvas, Devas, the higher gods of the heavens, the perfected ones almost converging in the stages of Virat, Hiranyagarbha, Ishvara and Brahman.*
*That is to say, man has to evolve further on and he at present occupies a place somewhat midway between god and brute crossed at one point. The restlessness, the finitude, the consciousness of limitation from every side, the incessant and resistless longings for expansion of one's suzerainty in larger dimensions of space and endless life in time, nay, even the compulsions of being born and dying, announce in loud voice that man is far from the expected perfection to be reached in nature's scheme of evolution, and there is a long way higher up, from man to Godman, and from Godman to God Himself.*
*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹
#DailyWisdom
#నిత్యప్రజ్ఞాసందేశములు #SwamiKrishnananda
#PrasadBhardwaj
https://t.me/Seeds_Of_Consciousness
www.facebook.com/groups/dailysatsangwisdom/
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://incarnation14.wordpress.com/
https://dailybhakthimessages.blogspot.com
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 155 🌹*
*✍️. సౌభాగ్య*
*📚. ప్రసాద్ భరద్వాజ*
*🍀. సమాజం మనుషుల్లో యాంత్రికతని తెచ్చింది. మానవ అభివృద్ధి కన్నా ఉత్పత్తికే ప్రాధాన్యమిచ్చింది. సౌఖ్యమే శాంతి అంటుంది. ఈ రకమయిన శాంతిని నమ్మేవాడు బుద్ధిహీనుడు. యిట్లాంటి శాంతికి లొంగేవాడు ఆనందాన్ని, ప్రేమని కోల్పోతాడు. 🍀*
*సమాజం నిన్ను సజీవంగా చూడదలచుకోదు. నిర్జీవంగా చూడదలచు కుంటుంది. నిన్ను చంపి నిన్నొక యంత్రపు పనిముట్టుగా మార్చాలని ప్రయత్నిస్తుంది. సమాజం ఆ విషయంలో విజయం సాధించింది. మనుషుల్లో యాంత్రికతని తెచ్చింది. మానవ అభివృద్ధి కన్నా ఉత్పత్తికే ప్రాధాన్యమిచ్చింది. దాని కోసం ప్రాణాల్ని కూడా పణంగా పెట్టింది. సౌఖ్యం దైవికమంటుంది. సౌఖ్యమే శాంతి అంటుంది.*
*ఈ రకమయిన శాంతిని నమ్మేవాడు బుద్ధిహీనుడు. ఇది మృతశాంతి. నిర్జీవశాంతి. యిట్లాంటి శాంతికి లొంగేవాడు స్వేచ్ఛను కోల్పోతాడు. తెలివితేటల్ని కోల్పోతాడు. ఆనందాన్ని, ప్రేమని కోల్పోతాడు. అతనొక బండిచక్రంలో భాగమవుతాడు. ఆ భాగం మార్చవచ్చు. ఒకటి పోతే యింకొకటి ఆ స్థానంలో పెట్టవచ్చు. కారణం వాళ్ళు వ్యక్తులు కారు. మరలు, అన్ని మతాలూ ఈ పద్ధతికి ప్రబోధించాయి. ఇక్కడ గొప్ప కుట్ర దాగుంది.*
*సశేషం ...*
🌹 🌹 🌹 🌹 🌹
#ఓషోరోజువారీధ్యానములు
#OshoDailyMeditations
#ఓషోబోధనలు #OshoDiscourse
#ఓషోనిర్మలధ్యానములు #PrasadBhardwaj
https://t.me/ChaitanyaVijnanam
http://www.facebook.com/groups/oshoteachings/
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. మైత్రేయ మహర్షి బోధనలు - 94 🌹*
*✍️. రచన : సద్గురు కె. పార్వతి కుమార్*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*🌻 77. సద్గురువు -2 🌻*
*అతడు దేనిని ద్వేషింపడు. యోగులు ద్వేషించిన వారిని అతడు కరుణించును. అతడు మహాత్ములను, సధ్రంథములను సమర్థించునే గాని అపహాస్యము చేయడు. అతని నడత నిర్దిష్టముగను, నిర్దుష్టముగను వుండును. సందిగ్ధ ముండదు. అనుయాయులకు గల అపాయము సూచనప్రాయముగ తెలుపుచునుండును. అతడికి కించిత్ మేలు చేసిన వారి యందు కృతజ్ఞుడై యుండును.*
*జీవుల హృదయమందు ప్రవేశించగల వాడగుటచే వారి ఉద్దేశ్యములను సులభముగ గ్రహించును. అతడు నిర్భయుడు. అట్లని ఎవరిని నిర్లక్ష్యము చేయడు. అతని పని జీవులను వారి హృదయము లందు మేల్కొల్పుటయే. అట్టి సద్గురువు సాన్నిధ్యమును హృదయమున పెంపొందించు కొనుట నిజమగు సౌభాగ్యము.*
*సశేషం.....*
🌹 🌹 🌹 🌹 🌹
#మైత్రేయమహర్షిబోధనలు #MaitreyaMaharshi #సద్గురుపార్వతీకుమార్ #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
www.facebook.com/groups/maharshiwisdom/
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹