శ్రీ మదగ్ని మహాపురాణము - 25 / Agni Maha Purana - 25


🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 25 / Agni Maha Purana - 25 🌹

✍️. పుల్లెల శ్రీరామచంద్రుడు

ప్రథమ సంపుటము, అధ్యాయము - 10

సేకరణ : ప్రసాద్ భరద్వాజ

శ్రీ గణేశాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ.

🌻. యుద్ధకాండ వర్ణనము - 1 🌻


నారదుడు చెప్పెను: రాముడు పంపగా అంగదుడు వెళ్ళి రావణునితో ఇట్లు చెప్పెను. "వెంటనే సీతను రామునకు ఒప్పగించుము. కానిచో మరణింపగలవు"

యుద్ధమునకై ఉద్దతులైన రాక్షసుల గల రావణుడు అతనిని చంపుటకు ప్రయత్నించెను. అతడు తిరిగివచ్చి. "దశగ్రీవుడు యద్ధమును మాత్రమే కోరుచున్నాడు" అని రామునితో చెప్పెను.

ఆ మాట విని రాముడు వానరసమేతుడై లంక చేరెను. హనుమంతుడు మైందుడు, ద్వివిదుడు, జాంబవంతుడు, నలుడు, నీలుడు, తారుడు, అంగద-ధూమ్ర-సుషేణులు, కేనరి, గజ - పనస - వినత - రంభ - శరభ క్రథనులు, బల శాలియైన గవాక్షుడు; దధివక్త్ర - గవయ - గంధమాదనులు, తదితర వానరులును వెళ్ళిరి. వీరితోడను, అసంఖ్యాకులగు ఇతరవానరులతోడను కూడిన సుగ్రీవుడు కూడ వెళ్ళెను.

వానరరాక్షసుల మధ్య సంకుల యుద్ధము కొనసాగెను. రాక్షసులు బాణములు, శక్తులు, గదలు మొదలగు వాటితో వానరులను కొట్టిరి. వానరులు, గోళ్ళు దంతములు, శిలలు మొదలగు వాటితో వానరులను కొట్టిరి. రాక్షసుల ఏనుగులు, గుఱ్ఱములు, రథములు, కాలిబంటులు-ఈ రూపములో నన్ను సైన్యము చంపబడెను. హనుమంతుడు శత్రువైన ధూమ్రాక్షున పర్వతశిఖరముతో చెంపెను. నీలుడు యుద్ధము చేయుచున్న అకంపన- ప్రహస్తులను చెంపెను.

గరుత్మంతుని దర్శనముచే ఇంద్రజిత్తు ప్రయోగించిన శరబంధము నుండి విములైన రామలక్ష్మణులు బాణములతో రాక్షస సైన్యమును సంహరించిరి. రణరంగమున రాముడు బాణములచే రావణున జర్జరశరీరునిగా చేసెను. రావణుడు దుఃఖితుడై కుంభకర్ణుని మేల్కొలిపెను.


సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹



🌹 Agni Maha Purana -25 🌹

✍️ N. Gangadharan
📚. Prasad Bharadwaj


Chapter 10

🌻 Yudda (War) Kand - 1 🌻



Nārada said:


1. Being asked by Rāma, Aṅgada went to Rāvaṇa (and) said, “Let Jānakī be returned to Rāghava immediately, otherwise you will die.”

2. Rāvaṇa was intent on killing (Aṅgada). The ten-headed demon who was ready to fight sent words to Rāma that war was the only way thought of.

3- 5. After hearing these words, Rāma came to Laṅkā with the monkeys for the sake of battle. The monkeys were Hanūmat, Mainda, Dvivida, Jāmbavat, Nala, Nīla, Tāra, Aṅgada, Dhūmra, Suṣeṇa, Keśarī, Gaya, Panasa, Vinata, Rambha, Śarabha, Krathana the strong, Gavākṣa, Dadhivaktra, Gandhamādana and others and Sugrīva. With these and other innumerable monkeys (Rāma came to Laṅkā).

6. There was a disorderly battle between the demons and monkeys. The demons killed the monkeys with arrows, spears and mace”.

7. The monkeys killed demons with nails, teeth and stones. The force of the demons consisting of elepḥants cavalry, chariots and infantry was destroyed.

8. Hanūmat killed the enemy Dhūmrākṣa with a big rock. Nīla killed the fighting Akampana and Prahasta.

9. Rāma and Lakṣmaṇa fainted on account of the arrow discharged by Indrajit. Regaining their consciousness after perceiving Tārkṣya (the chief of the eagles), they killed the forces of demons.

10. Rāma made Rāvaṇa shattered in the battle by means of arrows. And the grief-stricken Rāvaṇa woke up Kumbhakarṇa.



Continues....

🌹 🌹 🌹 🌹 🌹


26 Mar 2022

No comments:

Post a Comment