🌹 19, DECEMBER 2023 TUESDAY ALL MESSAGES మంగళవారం, భౌమ వాసర సందేశాలు 🌹

🍀🌹 19, DECEMBER 2023 TUESDAY ALL MESSAGES మంగళవారం, భౌమ వాసర సందేశాలు 🌹🍀
1) 🌹19, DECEMBER 2023 TUESDAY మంగళవారం, భౌమ వాసరే, నిత్య పంచాంగము Daily Panchangam🌹
2) 🌹. శ్రీమద్భగవద్గీత - 474 / Bhagavad-Gita - 474 🌹
🌴. 12వ అధ్యాయము -భక్తియోగము -05 / Chapter 12 - Devotional Service - 05 🌴
🌹. శ్రీ శివ మహా పురాణము - 830 / Sri Siva Maha Purana - 830 🌹
🌻. శంఖచూడుని జననము - 4 / The birth of Śaṅkhacūḍa - 4 🌻
3) 🌹. ఓషో రోజువారీ ధ్యానాలు - 87 / Osho Daily Meditations  - 87 🌹
🍀 87. నిశ్శబ్దంగా వస్తుంది / 87. LIKE A BREEZE 🍀
4) 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 513 - 1 / Sri Lalitha Chaitanya Vijnanam - 513 - 1 🌹 
🌻 513. 'కాకినీ రూప ధారిణీ' - 1 / 513. 'Kakini Roopa Dharini' - 1 🌻

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 19, డిసెంబరు, DECEMBER 2023 పంచాంగము - Panchangam 🌹*
*శుభ మంగళవారం, Tuesday, భౌమ వాసరే*
*మనందరికి ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని పరమాత్మని స్మరిస్తూ - ప్రసాద్ భరద్వాజ*

*🌻. పండుగలు మరియు పర్వదినాలు : లేవు 🌻*

*🍀. శ్రీ ఆంజనేయ సహస్రనామ స్తోత్రం - 32 🍀*

*64. యాజకో యజమానశ్చ పావకః పితరస్తథా |*
*శ్రద్ధా బుద్ధిః క్షమా తంద్రా మంత్రో మంత్రయితా సురః *
*65. రాజేంద్రో భూపతీ రూఢో మాలీ సంసారసారథిః |*
*నిత్యః సంపూర్ణకామశ్చ భక్తకామధుగుత్తమః*

🌻 🌻 🌻 🌻 🌻

*🍀. నేటి సూక్తి : అంతస్సత్తలో దాగివున్న అఖండ రాజ్యసంపద : బహిరంతస్సత్తల నడుమగల అడుగోడను ఛేదించి మనలోని చేతన అంతర్ముఖమై నిక్కమైన అంతర్జీవనం మనలో ప్రారంభమైనప్పుడు, బాహ్యసత్త కడు అల్పమై, అప్రధానమై మనకు గోచరిస్తుంది, అంతస్పత్తలో దాగివున్న అఖండ రాజ్య సంపదను మనం తెలియ గలుగుతాము. 🍀*

🌷🌷🌷🌷🌷

విక్రమ: 2080 నల, శఖ: 1945 శోభన
కలియుగాబ్ది : 5124, శోభకృత్‌,
హేమంత ఋతువు, దక్షిణాయణం,
మార్గశిర మాసము
తిథి: శుక్ల-సప్తమి 13:08:04 వరకు
తదుపరి శుక్ల-అష్టమి
నక్షత్రం: పూర్వాభద్రపద 24:03:57
వరకు తదుపరి ఉత్తరాభద్రపద
యోగం: సిధ్ధి 18:38:48 వరకు
తదుపరి వ్యతీపాత
కరణం: వణిజ 13:09:04 వరకు
వర్జ్యం: 07:24:56 - 08:55:40
దుర్ముహూర్తం: 08:53:10 - 09:37:32
రాహు కాలం: 14:59:17 - 16:22:30
గుళిక కాలం: 12:12:52 - 13:36:05
యమ గండం: 09:26:27 - 10:49:39
అభిజిత్ ముహూర్తం: 11:50 - 12:34
అమృత కాలం: 16:29:20 - 18:00:04
సూర్యోదయం: 06:40:02
సూర్యాస్తమయం: 17:45:43
చంద్రోదయం: 12:03:25
చంద్రాస్తమయం: 00:14:07
సూర్య సంచార రాశి: ధనుస్సు
చంద్ర సంచార రాశి: కుంభం
యోగాలు: కాల యోగం - అవమానం
24:03:57 వరకు తదుపరి సిద్ది యోగం
- కార్య సిధ్ధి , ధన ప్రాప్తి
దిశ శూల: ఉత్తరం
✍️. శ్రీ వక్కంతం చంద్రమౌళి

🌻 🌻 🌻 🌻 🌻  

*🍀. నిత్య ప్రార్థన 🍀*
*వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ*
*నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా*
*యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా*
*తయో సంస్మరణా త్పుంసాం సర్వతో జయ మంగళం*
*తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ* 
*విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.*
🌹🌹🌹🌹🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీమద్భగవద్గీత - 474 / Bhagavad-Gita - 474 🌹*
*✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ*

*🌴. 12వ అధ్యాయము -భక్తియోగము -05 🌴*

*05. క్లేశోధికతరస్తేషామవ్యక్తాసక్తచేతసామ్ |*
*అవ్యక్తా హి గతిర్దు:ఖం దేహవద్భిరవాప్యతే ||*

*🌷. తాత్పర్యం : పరమపురుషుని అవ్యక్త నిరాకార తత్త్వము నందు ఆసక్తమైన చిత్తము గలవారికి పురోగతి యనునది మిగుల క్లేశకరము. ఆ విధానమున ప్రగతి సాధించుట దేహధారులకు ఎల్లప్పుడును కష్టతరమే.*

*🌷. భాష్యము : పరమపురుషుని అచింత్య, అవ్యక్త, నిరాకారతత్త్వమార్గము ననుసరించు ఆధ్యాత్మికవాదుల సమూహము జ్ఞానయోగులని పిలువబడుచుండ, పూర్ణ కృష్ణభక్తిభావనలో ఆ దేవదేవుని భక్తియుతసేవ యందు నియుక్తులైన ఆధ్యాత్మికులు భక్తియోగులని పిలువబడుదురు. ఈ జ్ఞానయోగము, భక్తియోగము నడుమ గల భేదము ఇచ్చట చక్కగా విశదీకరింపబడినది. అంత్యమున మనుజుని ఒకే లక్ష్యమునకు గొనివచ్చునదైనను జ్ఞానయోగవిధానము మిక్కిలి క్లేశకరము. కాని శ్రీకృష్ణభగవానుని ప్రత్యక్షసేవా మార్గమైనందున భక్తియోగము అత్యంత సులభమైనదే గాక జీవాత్మకు సహజధర్మమై యున్నది. జీవుడు అనంతకాలముగా బద్ధుడై యున్నాడు. తాను దేహమును కానని సిద్ధాంతపూర్వకముగా అవగాహన చేసికొనుట అతనికి అత్యంత కరినమైన విషయము.*

*కనుక భక్తియోగియైనవాడు శ్రీకృష్ణుని శ్రీవిగ్రహమును పూజనీయమైనదిగా స్వీకరించును. మనస్సులో కొద్దిపాటి దేహభావన స్థిరమై యుండుటచే అందులకు కారణము. దానిని ఆ విధముగా అతడు అర్చనమునందు నియోగించును. అయినను దేవదేవుని రూపమునకు మందిరమునందు చేయబడు పూజ విగ్రహారాధానము కాదు. అర్చనము సగుణము (గుణసహితము) మరియు నిర్గుణము(గుణరహితము) అను రెండు విధములుగా నుండునని వేదవాజ్మయము నుండి నిదర్శనము లభించుచున్నది. భగవానుని రూపము భౌతికగుణములతో రూపొందియుండుటచే మందిరమునందలి శ్రీవిగ్రహారాధానము సగుణమని తెలియబడును. భగవానుని రూపము ఆ విధముగా భౌతికములైన రాయి, దారువు లేదా తైలవర్ణపటములతో సూచింపబడినను అదెన్నడును నిజమునకు భౌతికము కాదు. అదియే దేవదేవుని పూర్ణస్వభావమై యున్నది.*
🌹 🌹 🌹 🌹 🌹 

*🌹 Bhagavad-Gita as It is - 474 🌹*
*✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj*

*🌴 Chapter 12 - Devotional Service - 05 🌴*

*05. kleśo ’dhika-taras teṣām avyaktāsakta-cetasām*
*avyaktā hi gatir duḥkhaṁ dehavadbhir avāpyate*

*🌷 Translation : For those whose minds are attached to the unmanifested, impersonal feature of the Supreme, advancement is very troublesome. To make progress in that discipline is always difficult for those who are embodied.*

*🌹 Purport : The group of transcendentalists who follow the path of the inconceivable, unmanifested, impersonal feature of the Supreme Lord are called jñāna-yogīs, and persons who are in full Kṛṣṇa consciousness, engaged in devotional service to the Lord, are called bhakti-yogīs. Now, here the difference between jñāna-yoga and bhakti-yoga is definitely expressed. The process of jñāna-yoga, although ultimately bringing one to the same goal, is very troublesome, whereas the path of bhakti-yoga, the process of being in direct service to the Supreme Personality of Godhead, is easier and is natural for the embodied soul.*

*The individual soul is embodied since time immemorial. It is very difficult for him to simply theoretically understand that he is not the body. Therefore, the bhakti-yogī accepts the Deity of Kṛṣṇa as worshipable because there is some bodily conception fixed in the mind, which can thus be applied. Of course, worship of the Supreme Personality of Godhead in His form within the temple is not idol worship. There is evidence in the Vedic literature that worship may be saguṇa or nirguṇa – of the Supreme possessing or not possessing attributes. Worship of the Deity in the temple is saguṇa worship, for the Lord is represented by material qualities. But the form of the Lord, though represented by material qualities such as stone, wood or oil paint, is not actually material. That is the absolute nature of the Supreme Lord.*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 . శ్రీ శివ మహా పురాణము - 829 / Sri Siva Maha Purana - 829 🌹* 
*✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి 📚. ప్రసాద్ భరద్వాజ*

*🌴. రుద్రసంహితా-యుద్ద ఖండః - అధ్యాయము - 27 🌴*

*🌻. శంఖచూడుని జననము - 4 🌻*

*దంభుడిట్లు పలికెను - ఓ దేవదేవా! నీకు నమస్కారము. పద్మముల వంటి కన్నులు గలవాడా! లక్ష్మీపతి! త్రిలోకనాథా ! నాపై దయను చూపుము (27). నీ భక్తుడు, గొప్ప బలము పరాక్రమము గలవాడు, ముల్లోకములను జయించు వాడు, వీరుడు, దేవతల కైననూ జయింపశక్యము కానివాడు అగు పుత్రుని ఇమ్ము (28).*

*సనత్కుమారుడిట్లు పలికెను - ఓ మునీ! ఆ రాక్షసేంద్రుడు ఇట్లు కోరగా విష్ణువు అతనికి ఆ వరమునిచ్చి కఠినమగు తపస్సును విరమింప జేసి తరువాత అంతర్ధానము జెందెను (29). విష్ణువు అంతర్ధానమైన తరువాత ఆ రాక్షసేంద్రుడు ఆ దిక్కునకు నమస్కారము చేసెను. ఆతని తపస్సు సిద్ధించెను. ఆతని కోరిక ఈడేరెను. అపుడాతడు తన గృహమునకు వెళ్లెను (30). కొద్ది కాలములో భాగ్యవంతురాలగు ఆతని భార్య గర్భవతియై తన తేజస్సుతో ఇంటిలోపల భాగములన మిక్కిలి ప్రకాశింపజేయుచూ శోభిల్లెను (31). ఓ మునీ! శ్రీకృష్ణుని అనూయాయులలో మొదటి వాడు, రాధచే శపింపబడినవాడు అగు సుదాముడనే గోపాలకుడు ఆమె గర్భములో ప్రవేశించి యుండెను (32). తరువాత ఆ పతివ్రత నెలలు నిండిన పిదప గొప్ప తేజస్సు గల పుత్రుని గనెను. తండ్రి అనేక మహర్షులను పిలిపించి ఆ బాలుని జాతకర్మను చేయించెను (33).*

*ఓ బ్రాహ్మణశ్రేష్ఠా! ఆ బాలుడు జన్మించగానే గొప్ప ఉత్సవము జరిగెను. వానికి తండ్రి శుభముహూర్తమునందు శంఖచూడుడు అని నామకరణము చేసెను (34). ఆ బాలుడు తండ్రి గృహములో శుక్లపక్షచంద్రుని వలె పెరిగెను. గొప్ప తేజస్సు గల ఆ బాలుడు బాల్యమునందే విద్యలనభ్యసించెను (35). ఆ బాలుడు ఆటపాటలతో నిత్యము తల్లి దండ్రుల ఆనందమును విస్తరింప జేసెను. బంధువర్గములోని వారందరికీ ఆ బాలుడు విశేషించి ప్రీతి పాత్రుడాయెను (36).*

*శ్రీ శివమహాపురాణములోని రుద్రసంహితయందు యుద్ధఖండలో శంఖచూడోత్పత్తి వర్ణనమనే ఇరువది ఏడవ అధ్యాయము ముగిసినది (27).*

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 SRI SIVA MAHA PURANA - 829 🌹*
*✍️ J.L. SHASTRI, 📚. Prasad Bharadwaj *

*🌴 Rudra-saṃhitā (4): Yuddha-khaṇḍa - CHAPTER 27 🌴*

*🌻 The birth of Śaṅkhacūḍa - 4 🌻*

Dambha said:—
27. “O lord of gods, Obeisance be to you, O Lotuseyed one, O lord of Lakṣmī, O lord of the three worlds, please take pity on me.

28. Please give me a powerful and valorous son who will be your devotee, who will be invincible to the gods and who will conquer the three worlds.”

Sanatkumāra said:—
29. On being thus requested by the lord of Dānavas, Viṣṇu granted him the boon. O sage, making him desist from the penance he vanished from the place.

30. When Viṣṇu went away, the lord of Danavas performed obeisance to that direction and returned home, his penance having been fulfilled and his desires realised.

31. Within a short time, his fortunate wife became pregnant. Illuminating the inner apartments of her abode by her brilliance she shone much.

32. O sage, it was Sudāmā a cowherd, one of the leading comrades of Kṛṣṇa who had been cursed by Rādhā, that entered her womb.

33. At the proper time the chaste lady gave birth to a brilliant son. The father invited sages and performed the post-natal rites.

34. O excellent brahmin, when the boy was born there was great jubilation. On an auspicious day the father named him “Śaṅkhacūḍa.”

35. In the abode of his father he grew up like the moon in the bright half. Learning all lores in childhood he became resplendent.

36. With his childish sports he increased the parents’ delight. He became a special favourite of all the members of the family.

Continues....
🌹🌹🌹🌹🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. ఓషో రోజువారీ ధ్యానాలు - 87 / Osho Daily Meditations  - 87 🌹*
*✍️. ప్రసాద్ భరద్వాజ*

*🍀 87. నిశ్శబ్దంగా వస్తుంది 🍀*

*🕉. అది అలా వచ్చినట్లే, వెళ్ళిపోతుంది; మీరు దానిని పట్టుకోలేరు, మీరు దానిని హత్తుకోలేరు. గాలి గుసగుసలా వస్తుంది. ఇది శబ్దం చేయదు, ప్రకటనలు చేయదు; ఇది చాలా నిశ్శబ్దంగా వస్తుంది, మీరు దానిని వినలేరు ---- అకస్మాత్తుగా అది అక్కడ ఉంటుంది. దేవుడు కూడా అలాగే వస్తాడు - సత్యం వస్తుంది - ఆనందం వస్తుంది, ప్రేమ వస్తుంది - అవన్నీ గుసగుసలాడుతూ వస్తాయి, బాకాలు మరియు డప్పులతో కాదు. అపాయింట్‌మెంట్ కూడా తీసుకోకుండా, “నేను లోపలికి రావచ్చా?’ అని కూడా అడగకుండానే వారు హఠాత్తుగా వస్తారు. గాలి అలాగే వస్తుంది: ఒక క్షణం అది లేదు, మరొక క్షణం ఉంది. 🕉*

*ఇక రెండవ విషయం: అది వచ్చినట్లే, వెళ్ళిపోతుంది; మీరు దానిని పట్టుకోలేరు, మీరు దానిని హత్తుకోలేరు. అది ఉన్నప్పుడే దాన్ని ఆస్వాదించండి మరియు అది వెళ్ళినప్పుడు దాన్ని వదిలేయండి. అది వచ్చినందుకు కృతజ్ఞతతో ఉండండి. ఎటువంటి పగను కలిగి ఉండకండి, ఫిర్యాదు చేయవద్దు. అది వెళ్ళినప్పుడు, అది వెళుతుంది-దాని గురించి ఏమీ చేయలేము. కానీ మనమందరం అంటిపెట్టుకుని ఉంటాము. ప్రేమ వచ్చినప్పుడు చాలా సంతోషిస్తాం, అది పోతే చాలా బాధ పడతాం.*

*అది చాలా అపస్మారక స్థితి - కృతజ్ఞత లేనిది - అపార్థం. గుర్తుంచుకోండి, అది ఒక మార్గంలో వస్తుంది, ఇప్పుడు అదే విధంగా వెడుతోంది. రావటానికి అడగలేదు... పోవటానికి ఎందుకు అడగాలి? ఇది ఆవలి నుండి వచ్చిన బహుమతి, రహస్యమైనది మరియు ఇది అదే రహస్య మార్గంలో వెళ్ళాలి. జీవితాన్ని గాలిగా మలచుకుంటే, అంటిపెట్టుకోవడం లేదు, అనుబంధం ఉండదు-యావ ఉండదు- అందుబాటులో ఉంటారు ఇక ఏది జరిగినా మంచిదే.*

*కొనసాగుతుంది...*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Osho Daily Meditations  - 87 🌹*
📚. Prasad Bharadwaj

*🍀 87. LIKE A BREEZE 🍀*

*🕉.  Just as it comes, it goes; you cannot hold on to it, you cannot cling to it. The breeze comes like a whisper. It does not make noise, it does not make proclamations; it comes In very silently, you cannot hear it----suddenly it is there. And that's how God comes--truth comes--bliss comes, love comes--they all come in a whisper like manner, not with trumpets and drums. They suddenly come without even having an appointment, without even asking you, “May I come in?"-they just suddenly come. And that's how the breeze comes: One moment it is not there, another moment it is. 🕉*

*And the second thing: Just as it comes, it goes; you cannot hold on to it, you cannot cling to it. Enjoy it while it is there, and when it goes, let it go. Be thankful that it came. Don't hold any grudge, don't complain. When it goes, it goes-nothing can be done about it.  But we are all clingers. When love comes, we are very happy, but when it goes we are very hurt.*

*That is being very unconscious — ungrateful --misunderstanding. Remember, it comes in one way, now it is going in the same way. It did not ask to come ... why should it ask now if it can go? It was a gift from the beyond, mysterious, and it has to go in the same mysterious way. If one takes life as a breeze, then there is no clinging, no attachment-no obsession— one simply remains available, and whatever happens is good.*

Continues...
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము  - 513 - 1 / Sri Lalitha Chaitanya Vijnanam  - 513 - 1 🌹*
*🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻*
*✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం  శ్రీమాత్రే నమః 🍁*

*🍀  105. మేదోనిష్ఠా, మధుప్రీతా, బందిన్యాది సమన్వితా ।*
*దధ్యన్నాసక్త హృదయా, కాకినీ రూపధారిణీ ॥ 105 ॥ 🍀*

*🌻 513. 'కాకినీ రూప ధారిణీ' - 1🌻*

*స్వాధిష్ఠాన మందలి అమ్మవారిని కాకినీదేవి అని లలితా సహస్రమున చెప్పబడి యున్నది. కాకిని అనగా కకార భావము కలిగి యుండునది. కకారము కామబీజము. కామము దివ్యము, అమృతమయము. దానిని భూమిపై సవ్యముగ నిర్వర్తించగల శక్తి సిద్ధులకు ఉండును. ఇతరులు అట్టి శక్తిని పొందునంత వరకు భూమిపై అనుభవము చెందుచూ, జనన మరణముల చక్రమందు తిరుగు చుందురు. యోగ శాస్త్రమున హృదయమునకు కాకినీమాత నిర్వచింప బడినది. యోగ శాస్త్రమున ఈ కేంద్రమునకు స్వాధిష్ఠాన పద్మమున రాకినీమాత తెలుపబడగ, యిచ్చట కాకినీ అని తెలుపబడినది. స్వాధ్యాయమున తెలియవలసిన కొన్ని విషయములు ఈ విధముగ వ్యత్యాసముతో గోచరించుట కద్దు.*

*సశేషం...*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Sri Lalitha Chaitanya Vijnanam  - 513 - 1 🌹*
*Contemplation of 1000 Names of Sri Lalitha Devi* 
*✍️ Prasad Bharadwaj*

*🌻105. Medhonishta maduprita bandinyadi samanvita*
*dadyannasakta hrudaya kakini rupadharini ॥ 105 ॥ 🌻*

*🌻 513. 'Kakini Roopa Dharini' - 1🌻*

*It is said in Lalita Sahasram that the Goddess of the Sacral chakra is Kakini Devi. Ka syllable is seat of desire. Desire is divine, filled with fulfilment. Siddhas have the power to perform it properly on earth. Others, till they reach the siddha stage, get trapped in experiences on earth and thus go round in the cycles of birth and death. In Yoga Shastra Kakinimata is defined as the heart. In Yoga Shastra, Rakinimata is told as the presiding goddess of this chakra. But here, kakinimata is days to be the presiding goddess. Things should not be confused with this kind of difference in the explanations but they have to be understood by self experience.*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
#నిత్యసందేశములు #DailyMessages 
Join and Share 
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
https://t.me/+9zDjTpPe_PQzMWVl
https://t.me/Sivasutras
https://t.me/Seeds_Of_Consciousness
https://t.me/bhagavadgeethaa/
https://t.me/AgniMahaPuranam
https://t.me/+LmH1GyjNXXlkNDRl
http://www.facebook.com/groups/srilalithachaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/
https://prasadbharadwaj.wixsite.com/dailybhaktimessages3

Siva Sutras - 188 : 3-19. kavargadisu mahesvaryadyah pasumatarah - 3 / శివ సూత్రములు - 188 : 3-19. క వర్గాదిశు మహేశ్వర్యాద్యః పశుమాతరః - 3


🌹. శివ సూత్రములు - 188 / Siva Sutras - 188 🌹

🍀. శివ ఆగమ తత్వశాస్త్రం యొక్క సూత్రములు 🍀

3వ భాగం - ఆణవోపాయ

✍️. ప్రసాద్‌ భరధ్వాజ

🌻 3-19. క వర్గాదిశు మహేశ్వర్యాద్యః పశుమాతరః - 3 🌻

🌴. మహేశ్వరి మరియు ఇతర 'క' శక్తుల సమూహంలోని వారు మాయచే కప్పబడిన పశు లేదా జంతు స్వభావంతో జన్మించిన జీవులకు తల్లులు అవుతారు. 🌴


ఇంతకుముందు, అతనికి అన్ని అభిరుచులు, అన్ని వాసనలు మొదలైనవి ఒకే విధంగా ఉండేవి. ఇప్పుడు అతను ఇది రుచికరమైనది, ఈ సువాసన అద్భుతం, ఇంకా చెప్పాలంటే అతను ఇప్పుడు విభిన్న జ్ఞానాన్ని కలిగి ఉంటాడు. శివుని యొక్క అత్యున్నత శక్తిని పరమేశ్వరి అని పిలుస్తారు, అతను సంకల్పం, జ్ఞానం మరియు క్రియలతో విశ్వాన్ని నియంత్రిస్తాడు. అది ఒకదాని తర్వాత ఒకటి వ్యక్తమవుతుంది. చివరికి ప్రాపంచిక వ్యక్తీకరణలకు వరకూ విచ్ఛిన్నమవుతుంది. ఆశించే వాడు జాగ్రత్తగా ఉండకపోతే, అతను తన అత్యున్నత స్థాయి స్పృహ నుండి పడిపోతాడు, దాని ఫలితంగా అతను యోగి దశ నుండి పశువు దశకు చేరతాడు.


కొనసాగుతుంది...

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Siva Sutras - 188 🌹

🍀Aphorisms of philosophy of Shiva āgama 🍀

Part 3 - āṇavopāya

✍️. Acharya Ravi Sarma, 📚. Prasad Bharadwaj

🌻 3-19. kavargādisu māheśvaryādyāh paśumātarah - 3 🌻

🌴. Mahesvari and others of the “ka” group of shaktis become mothers of pashu's or beings who are born with animal nature, veiled by maya. 🌴


Previously, all tastes, all smells, etc were the same for him. Now he says this is delicious, this fragrance is awesome, etc. In other words he now possesses differentiated knowledge. Supreme energy of Śiva is known as Parameśvarī who controls the universe with will, knowledge and action that manifests one after the other, ultimately breaking down to mundane manifestations. If the aspirant is not careful, he is bound to fall from his highest level of consciousness, as a result of which he becomes a paśu from the stage of a yogi.


Continues...

🌹 🌹 🌹 🌹 🌹


DAILY WISDOM - 185 : 3. The Puranas are Right, the Psychologists also are Right / నిత్య ప్రజ్ఞా సందేశములు - 185 : 3. పురాణాలు సరైనవి, మనస్తత్వవేత్తలు చెప్పేవి కూడా సరైనవే



🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 185 / DAILY WISDOM - 185 🌹

🍀 📖 మహాభారతం మరియు భగవద్గీత యొక్క ఆధ్యాత్మిక అంశాలు 🍀

✍️. ప్రసాద్ భరద్వాజ

🌻 3. పురాణాలు సరైనవి, మనస్తత్వవేత్తలు చెప్పేవి కూడా సరైనవే 🌻


పురాణాలలో వర్ణించబడిన దేవతలు మరియు అసురులు వ్యక్తులలో మానసిక క్రియల యొక్క ఉపమానాలు అని తరచుగా ప్రజలు చెబుతారు. ఇవన్నీ కృత్రిమమైన, ఆధునికీకరించబడిన వివరణలు. అంటే వాళ్ళ వాస్తవికత అనేది జీవితంలోని ఒక విభాగానికి మాత్రమే పరిమితమై ఉంటుంది. వ్యక్తిగత మనస్తత్వానికి విశ్వ ప్రతిరూపం లేదని మనం చెప్పలేము. పురాణాలు సరైనవి; మనస్తత్వవేత్తలు చెప్పేది కూడా సరైనదే. సుషుమ్నా నాడి రూపంలో మనలో గంగ ప్రవహిస్తోంది, ఇడ మరియు పింగళ రూపంలో యమునా మరియు సరస్వతి ప్రవహిస్తున్నాయి అనేది నిజం.

ఇక్కడ లాభం కోసం చెప్పేది ఏదీ లేదు; అది పూర్తిగా నిజం. కానీ బయటి గంగ కూడా ఉంది; మనం దానిని తిరస్కరించలేము. బయటి ప్రపంచం మరియు లోపల ప్రపంచం వాస్తవికత యొక్క ఒకే మిశ్రమ నిర్మాణం యొక్క రెండు ముఖాలు. కాబట్టి దేవతలు మరియు అసురుల మధ్య యుద్ధం ప్రతి ప్రాంతంలో మరియు జీవితంలోని ప్రతి దశలో జరుగుతుంది. ఇది స్వర్గంలో జరుగుతుంది, ఇది విశ్వంలో జరుగుతుంది, ఇది సమాజంలో జరుగుతుంది మరియు ఇది మనలోనే జరుగుతుంది. మహాభారతం కేవలం కొన్ని శతాబ్దాల క్రితం జరిగిన మానవ సంఘటనల చిత్రణ మాత్రమే కాదు-అయితే అది కూడా.


కొనసాగుతుంది...

🌹 🌹 🌹 🌹 🌹




🌹 DAILY WISDOM - 185 🌹

🍀 📖 The Spiritual Import of the Mahabharata and the Bhagavadgita 🍀

📝 Swami Krishnananda
📚. Prasad Bharadwaj

🌻 3. The Puranas are Right, the Psychologists also are Right 🌻


Often people say the Devas and the Asuras described in the Puranas are allegories of psychological functions in individuals. These are all artificial, modernised interpretations, under the impression that reality is confined to one section of life alone. We cannot say that there is no cosmic counterpart of the individual psyche. The Puranas are right; the psychologists also are right. It is true that there is a Ganga flowing in us in the form of the sushumna nadi, and there are the Yamuna and the Saraswati in the form of the ida and pingala.

There is no gainsaying; it is perfectly true. But there is also an outward Ganga; we cannot deny it. The world outside and the world inside are two faces of the single composite structure of reality. So the battle between the Devas and the Asuras takes place in every realm and every phase of life. It takes place in the heavens, it takes place in the cosmos, it takes place in society, and it takes place within ourselves. The Mahabharata is not merely a depiction of a human series of events that happened some centuries back—though it is also that.


Continues...

🌹 🌹 🌹 🌹 🌹


విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 873 / Vishnu Sahasranama Contemplation - 873


🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 873 / Vishnu Sahasranama Contemplation - 873🌹

🌻 873. అర్హః, अर्हः, Arhaḥ 🌻

ఓం అర్హాయ నమః | ॐ अर्हाय नमः | OM Arhāya namaḥ

స్వాగతాసనశంసార్ఘ్యపాద్యస్తుత్యాదిసాధనైః ।
పూజ్యైశ్చ పూజనీయ ఇత్యర్హ ఇత్యుచ్యతే బుధైః ॥


పూజనమును పొందుటకు అర్హుడు. ఆవాహనము, ఆసనము, ప్రశంస, అర్ఘ్యము, పాద్యము, స్తుతి, సమస్కారము మొదలగు పూజాసాధనములచే పూజ చేయదగినవాడు.


:: పోతన భాగవతము - దశమ స్కంధము, ఉత్తర భాగము ::

వ.పూజించునప్పు డం దగ్రపూజార్హు లెవ్వ రని యడిగిన సదస్యులు దమకుఁ దోఁచిన విధంబులం బలుక వారి భాషణంబులు వారించి వివేకశీలుండును, జతుర వచనకోవిదుండును నగు సహదేవుండు భగవంతుండును, యదుకుల సంభవుండును నైన శ్రీకృష్ణునిం జూపి 'యీ మహాత్ముని సంతుష్టుం జేసిన భువనంబులన్నియుం బరితుష్టిం బొందు' నని జెప్పి ధర్మజుం జూచి ఇట్లనియె. (777)

ఉ.కాలము దేశమున్ గ్రతువుఁ గర్మముఁ గర్తయు భోక్తయున్ జగ

జ్జాలము దైవమున్ గురువు సాంఖ్యము మంత్రము నగ్ని యాహుతుల్‍

వేళలు విప్రులున్ జననవృద్ధిలయంబుల హేతుభూతముల్‍

లీలలఁ దానయై తగ వెలింగెడు నెక్కటితేజ మీశుఁడున్‍. (778)

చ.ఇతఁడే యితండు గన్ను లొకయించుక మెడ్చిన నీ చరాచర

స్థితభువనంబు లన్నియు నశించు నితం డవి విచ్చిచూచినన్‍

వితతములై జనించుఁ బ్రబవిష్ణుఁడు విష్ణుఁడు నైన యట్టి యీ

క్రతుఫలదుండుగా కొరుఁ డొకం డెటు లర్హుఁడు శిష్టపూజకున్‍? (779)

ఉ.ఈ పురుషోత్తమున్ జగదధీశు ననంతుని సర్వశక్తుఁ జి

ద్రూపకు నగ్రపుజఁ బరితోషితుఁ జేయ సమస్త లోకముల్‍

వే పరితుష్టిఁ బొందుఁ బృథివీవర! కావున నీవు కృష్ణునిన్‍

శ్రీపతిఁ బూజసేయు మెడసేయక మాటలు వేయు నేటికిన్‍? (780)


ఈ విధంగా పూజించే సందర్భంలో అగ్రపూజకు అర్హుడెవడనే ప్రశ్న పుట్టింది. సభలో ఉన్నవారు తమకు తోచిన విధంగా తలకొకరీతిగా చెప్పారు. వారి మాటలను వారించి బుద్ధిమంతుడైన సహదేవుడు భగవంతుడైన కృష్ణుడిని చూపించి 'ఈ మహాత్ముడిని సంతుష్టుడిని చేసిన సమస్త లోకాలు సంతోషిస్తాయి' అని పలికి ధర్మరాజుతో ఇలా అన్నాడు.

కాలమూ, దేశమూ, యజ్ఞమూ, కర్మమూ, కర్తా, భోక్తా, ప్రపంచమూ, దైవమూ, గురువూ, మంత్రమూ, అగ్నీ, హవ్యద్రవ్యాలూ, సృష్టి-స్థితి-లయలు సమస్తమూ తానేయై ప్రకాశించే ఏకైక దివ్యస్వరూపుడు ఈ కృష్ణ పరమాత్ముడొక్కడే.

పరమేశ్వరుడైన ఈ శ్రీకృష్ణుడు కన్నులు మూసుకొన్నాడంటే ఈ చరాచర ప్రపంచమంతా నశిస్తుంది. కన్నులు విప్పి చూస్తే ఈ లోకాలన్నీ జన్మిస్తాయి. సృష్టి, స్థితి, లయలకు కారకుడైన ఈ పుణ్యపురుషుడు యజ్ఞ ఫలాన్ని ప్రసాదించే ప్రభువు విష్ణుస్వరూపుడు. సర్వ సమర్థుడు. అగ్రపూజకు అర్హుడు ఇతడు గాకపోతే మరెవ్వరు?

ఓ రాజా! పురుషోత్తముడూ, లోకాధిపతీ, అనంతుడూ, సమస్త శక్తులు కలవాడూ, చిద్రూపుడూ, అయిన శ్రీకృష్ణుడిని ప్రప్రథమంగా పూజించి సంతోషింపజేసినట్లయిన సమస్త లోకాలూ సంతృప్తినొందుతాయి.



సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹




🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 873🌹

🌻873. Arhaḥ🌻

OM Arhāya namaḥ


स्वागतासनशंसार्घ्यपाद्यस्तुत्यादिसाधनैः ।
पूज्यैश्च पूजनीय इत्यर्ह इत्युच्यते बुधैः ॥



Svāgatāsanaśaṃsārghyapādyastutyādisādhanaiḥ,
Pūjyaiśca pūjanīya ityarha ityucyate budhaiḥ.


One who deserves to be worshipped by words of welcome, offer of a seat, water to wash the hands and feet, praise, prostration and other instruments of worship.


Śrīmad Bhāgavata - Canto 10, Chapter 74

The members of the assembly then pondered over who among them should be worshiped first, but since there were many personalities qualified for this honor, they were unable to decide. Finally Sahadeva spoke up. He said "Certainly it is Acyuta, the Supreme God and chief of the Yādavas, who deserves the highest position. In truth, He Himself comprises all the gods worshiped in sacrifice, along with such aspects of the worship as the sacred place, the time and the paraphernalia. This entire universe is founded upon Him, as are the great sacrificial performances, with their sacred fires, oblations and mantras. Sāńkhya and yoga both aim toward Him, the One without a second. O assembly members, that unborn Lord, relying solely on Himself, creates, maintains and destroys this cosmos by His personal energies, and thus the existence of this universe depends on Him alone. He creates the many activities of this world, and thus by His grace the whole world endeavors for the ideals of religiosity, economic development, sense gratification and liberation. Therefore we should give the highest honor to Kr‌s‌n‌a, the Supreme Lord. If we do so, we will be honoring all living beings and also our own selves."



Continues....

🌹 🌹 🌹 🌹🌹



కపిల గీత - 281 / Kapila Gita - 281


🌹. కపిల గీత - 281 / Kapila Gita - 281 🌹

🍀. కపిల దేవహూతి సంవాదం 🍀

✍️. ప్రసాద్‌ భరధ్వాజ

🌴 7. మానవజన్మను పొందే జీవుని గతిని వర్ణించుట - 12 🌴

జంతురువాచ

12. తస్యోపసన్నమవితుం జగదిచ్ఛయాత్త నానాతనోర్భువి కాలక్‌ చరణారవిందమ్|
సోఽహం వ్రజామి శరణం హ్యకుతోభయం మే యేనేదృశీ గతిరదర్శ్యసతోఽనురూపా ॥


తాత్పర్యము : జీవుడు పరమాత్మను స్తుతించుచు ఇట్లనును - ప్రభూ! నీ శరణాగత భక్తులను రక్షించుట కొరకై లోకకళ్యాణ నిమిత్తముగా నీవు నీ ఇచ్ఛచే అప్పుడఫ్ఫుడు పెక్కు రూపములతో అవతరించెదవు. అప్పుడు పవిత్రములైన, సర్వ అభయస్థానమగు నీ పాదపద్మములతో భూతలమునందు సంచరించెదవు. అట్టి నీ చరణసరోజములను శరణు జొచ్చుచున్నాను. అధముడనగు నాకు తగినట్టి ఈ గర్భవాసము యొక్క గతిని చూపించితివి. ఇక నీవే నాకు దిక్కు.

వ్యాఖ్య : కాలక్‌-కారణారవిందం అనే పదం భగవంతుని యొక్క సర్వోన్నత వ్యక్తిని సూచిస్తుంది, అతను వాస్తవానికి ప్రపంచం యొక్క ఉపరితలంపై నడిచే లేదా ప్రయాణించేవాడు. కాబట్టి ఈ ప్రార్ధన ఈ భూమి యొక్క ఉపరితలంపైకి లేదా ఈ విశ్వంలోని ఏదైనా భాగానికి దిగివచ్చిన పరమాత్మునికి, భక్తిపరుల రక్షణ కోసం మరియు దుర్మార్గుల నాశనం కోసం సమర్పించ బడుతుంది. అధర్మం పెరిగి, వైరుధ్యాలు తలెత్తినప్పుడు, భగవంతుడు భక్తులను రక్షించడానికి మరియు దుష్టులను చంపడానికి వస్తాడని భగవద్గీతలో ధృవీకరించబడింది.

ఈ శ్లోకంలోని మరో ముఖ్యమైన అంశం ఏమిటంటే, భగవంతుడు తన ఇష్టానుసారం వస్తాడు, ఇచ్చాయా. భగవద్గీతలో కృష్ణుడు ధృవీకరించినట్లుగా, సంభవామి ఆత్మ మాయయాః ( BG 4.6 ) 'నేను నా ఇష్టానుసారం, నా అంతర్గత సంభావ్య శక్తి ద్వారా కనిపిస్తాను.' భౌతిక ప్రకృతి నియమాల ద్వారా అతను బలవంతంగా రావాలని కాదు. ఇక్కడ చెప్పబడింది. భగవానుడు జీవుడిని భయంకరమైన అస్తిత్వ స్థితికి చేర్చినట్లుగా, అతను అతనిని విడిపించగలడు కూడా. అందుచేత కృష్ణుడి పాద పద్మాల వద్ద ఆశ్రయం పొందాలి. కృష్ణుడు, 'అన్నీ విడిచిపెట్టి, నాకు లొంగిపో' అని చెప్పాడు. ఆయనను సంప్రదించే ఎవరైనా భౌతిక ఉనికిలో ఒక రూపాన్ని స్వీకరించడానికి మళ్లీ తిరిగి రారు, కానీ భగవంతుని వద్దకు తిరిగి వెళతారు, ఇంటికి తిరిగి వెళ్లిపోతారు.


సశేషం..

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Kapila Gita - 281 🌹

🍀 Conversation of Kapila and Devahuti 🍀

📚 Prasad Bharadwaj

🌴 7. Lord Kapila's Instructions on the Movements of the Living Entities - 12 🌴

12. jantur uvāca :

tasyopasannam avituṁ jagad icchayātta- nānā-tanor bhuvi calac-caraṇāravindam
so 'haṁ vrajāmi śaraṇaṁ hy akuto-bhayaṁ me yenedṛśī gatir adarśy asato'nurūpā


MEANING : The human soul says: I take shelter of the lotus feet of the Supreme Personality of Godhead, who appears in His various eternal forms and walks on the surface of the world. I take shelter of Him only, because He can give me relief from all fear and from Him I have received this condition of life, which is just befitting my impious activities.

PURPORT : The word calac-caraṇāravindam refers to the Supreme Personality of Godhead, who actually walks or travels upon the surface of the world. The prayer is therefore offered to the Supreme Personality of Godhead, who descends to the surface of this earth, or any part of this universe, for the protection of the pious and the destruction of the impious. It is confirmed in Bhagavad-gītā that when there is an increase of irreligion and discrepancies arise in the real religious activities, the Supreme Lord comes to protect the pious and kill the impious.

Another significant point in this verse is that the Lord comes, icchayā, by His own will. As Kṛṣṇa confirms in Bhagavad-gītā, sambhavāmy ātma-māyayā: (BG 4.6) "I appear at My will, by My internal potential power." As the Supreme Lord puts the living entity into the condition of horrible existence, He can also deliver him, and therefore one should seek shelter at the lotus feet of Kṛṣṇa. Kṛṣṇa demands, "Give up everything and surrender unto Me." And it is also said in Bhagavad-gītā that anyone who approaches Him does not come back again to accept a form in material existence, but goes back to Godhead, back home, never to return.


Continues...

🌹 🌹 🌹 🌹 🌹


18 Dec 2023 : Daily Panchang నిత్య పంచాంగము.jpg


🌹 18, డిసెంబరు, DECEMBER 2023 పంచాంగము - Panchangam 🌹

శుభ సోమవారం, Monday, ఇందు వాసరే

మనందరికి ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని పరమాత్మని స్మరిస్తూ - ప్రసాద్ భరద్వాజ

🌻. పండుగలు మరియు పర్వదినాలు : సుబ్రమణ్య షష్టి, చంపా షష్టి, Subrahmanya Sashti, Champa Shashthi 🌻

🍀. శ్రీ శివ సహస్రనామ స్తోత్రం - 56 🍀


115. దేవాసురగురుర్దేవో దేవాసురనమస్కృతః |
దేవాసురమహామాత్రో దేవాసురగణాశ్రయః

116. దేవాసురగణాధ్యక్షో దేవాసురగణాగ్రణీః |
దేవాదిదేవో దేవర్షిర్దేవాసురవరప్రదః

🌻 🌻 🌻 🌻 🌻



🍀. నేటి సూక్తి : అంతర్జీవనారంభం : మనలోని చేతన సామాన్యంగా బాహ్యసత్త యందు కేంద్రీకృతమై వున్న హేతువు చేత దానికినీ అంతస్సత్తకునూ నడుమ ఒక తెర వంటిది, ఒక అడ్డు గోడ వంటిది ఏర్పడుతున్నది. చేతన ఇప్పుడా తెరను __ ఆ అడ్డుగోడను భేదించి అంతస్సత్త యందు కేంద్రీకృతం కావడం అవసరం. అలా జరిగినప్పుడే మనలో నిక్కమైన అంతర్జీవనం ప్రారంభమవుతుంది.🍀

🌷🌷🌷🌷🌷


విక్రమ: 2080 నల, శఖ: 1945 శోభన

కలియుగాబ్ది : 5124, శోభకృత్‌,

హేమంత ఋతువు, దక్షిణాయణం,

మార్గశిర మాసము

తిథి: శుక్ల షష్టి 15:15:08 వరకు

తదుపరి శుక్ల-సప్తమి

నక్షత్రం: శతభిషం 25:22:59

వరకు తదుపరి పూర్వాభద్రపద

యోగం: వజ్ర 21:31:59 వరకు

తదుపరి సిధ్ధి

కరణం: తైతిల 15:16:09 వరకు

వర్జ్యం: 09:39:06 - 11:08:54

దుర్ముహూర్తం: 12:34:34 - 13:18:57

మరియు 14:47:43 - 15:32:06

రాహు కాలం: 08:02:43 - 09:25:56

గుళిక కాలం: 13:35:36 - 14:58:49

యమ గండం: 10:49:09 - 12:12:23

అభిజిత్ ముహూర్తం: 11:50 - 12:34

అమృత కాలం: 18:37:54 - 20:07:42

సూర్యోదయం: 06:39:30

సూర్యాస్తమయం: 17:45:16

చంద్రోదయం: 11:22:55

చంద్రాస్తమయం: 23:17:04

సూర్య సంచార రాశి: ధనుస్సు

చంద్ర సంచార రాశి: కుంభం

యోగాలు: అమృత యోగం - కార్య

సిధ్ది 25:22:59 వరకు తదుపరి

ముసల యోగం - దుఃఖం

దిశ శూల: తూర్పు

✍️. శ్రీ వక్కంతం చంద్రమౌళి

🌻 🌻 🌻 🌻 🌻



🍀. నిత్య ప్రార్థన 🍀

వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ

నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా

యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా

తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం

తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ

విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.

🌹🌹🌹🌹🌹



శ్రీ సుబ్రహ్మణ్య షష్ఠి, సుబ్రమణ్య స్వామి స్తోత్రాలు - Sri Subrahmanya Shashti, Subrahmanya Swami Stotras

🌹శ్రీ సుబ్రహ్మణ్య షష్ఠి. 🌹

దేవేంద్రుడు మార్గశిర శుద్ధ షష్ఠినాడు దేవసేనతో "శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి" వారికి అత్యంత వైభవంగా వివాహము జరిపించిన ఈ రోజును "శ్రీ సుబ్రహ్మణ్య షష్ఠి" గా పరిగణిస్తారు. ఈ స్వామివారి జన్మవృత్తాంత విశిష్టత సమీక్షగా తెలుసుకుందాము !

పూర్వం మూడులోకాలను భయభ్రాంతులను చేస్తూ బాధిస్తున్న "తారకా సురుడు" అను రాక్షసుని బారి నుండి రక్షణ పొందుటకై ! దేవతలు బ్రహ్మదేవుని శరణువేడినారు. దానికి బ్రహ్మ వారికి ఒక సూచన చేసినారు. ఈ తారకాసురుడు అమిత తపోబలసంపన్నుడు, అమితబలశాలి , వీనికి ఈశ్వర తేజాంశ సంభవుని వల్లకాని వానికి మరణములేదు. కావున ! మీరు సతివియోగ దుఃఖముతో ఉన్న ఈశ్వరునకు ఆ సతీదేవియే మరుజన్మయందు గిరిరాజు హిమవంతునకు పుత్రికగా అవతరించిన ఆ పార్వతీదేవికి వివాహం జరిపించండి. వారికి కలుగు పుత్రుడే తారకాసురుని సంహరించగల సమర్ధుడు అవుతాడు అని తరుణోపాయం శెలవిచ్చారు.

అప్పటికే తపోదీక్షలో ఉన్న పరమశివునకు సేవలు చేస్తున్న ఆ జగన్మాత పార్వతికి , శివునకు అన్యోన్యత చేకూర్చే వాతావరణాన్ని కల్పించేందుకు ! దేవతలు మన్మధుని ఆశ్రయిస్తారు.

మొత్తం మీద మన్మధుని పూలబాణాలతో ఈశ్వరుని చలింపచేసి తాను ఈశ్వరుని ఆగ్రహానికి గురు అయినా ! పార్వతి పరమేశ్వరుల కళ్యాణానికి మన్మధుడు కారణ భూతుడవుతాడు. కళ్యాణం అనంతరం దేవతల అభ్యర్ధనమేరకు పునర్జీవింపబడతాడు.

ఇలా ఉండగా ! పార్వతీ పరమేశ్వరులు ఏకాంత ప్రణయానందసమయాన అగ్నిదేవుడు పావురం రూపంలో వారి ఏకాంత మందిరంలోకి ప్రవేశిస్తాడు. అది గ్రహించిన పరమ శివుడు తన దివ్య తేజస్సును ఆ అగ్నిహోత్రునిలోకి ప్రవేశపెడతాడు. దానిని భరించలేక ఆ దివ్య తేజమును గంగానదిలో విడచి పెడతాడు. ఆ తేజము ఆ సమయమందు ఆ నదిలో స్నానమాడుచున్న షట్‌కృత్తికల దేవతల గర్భాన ప్రవేశిస్తుంది. ఆ రుద్రతేజమును వారు భరించలేక రెల్లుపొదలో విసర్జిస్తారు. అంత ఆ ఆరుతేజస్సులు కలసి ఆరుముఖాలతో ఒక దివ్యమైన బాలుడుగా ఉద్భవిస్తాడు. ఇది తెలిసిన పార్వతీ పరమేశ్వరులు రుద్రాంశ సంభూతునిగా ఆ షణ్ముఖుని అక్కున చేర్చుకుని కైలాసం తీసుకుని వెళతారు.

ఆ బాలుడు గంగాగర్భంలో తేజోరూపంలో ఉన్నందుకు గాంగేయుడని , షట్‌కృత్తికలు వానిని పెంచి పెద్దచేసిన కారణం వల్ల మరియు ఆరుముఖాలు కలవాడు అగుటవల్ల షణ్ముఖుడని , కార్తికేయుడని , అతడు గౌరీశంకరుల పుత్రుడగుటచే కుమారస్వామి అనియు , సుబ్రహ్మణ్యస్వామి అనియు నామాలతో పిలువసాగిరి.

కారణజన్ముడైన ఈ స్వామి పార్వతి పరమేశ్వరులు , దేవతలు కోరిక మేరకు కుమారస్వామిగా చేసి , వానిని దేవతల సర్వసైన్యాధ్యక్షునిగా నియమించి పరమేశ్వరుడు "శూలం" మొదలైన ఆయుధాలను ఇవ్వగా , ఆ జగన్మాత పార్వతి కుమారుని దీవించి "శక్తి" అను ఆయుధాలను ఇచ్చి సర్వశక్తివంతుడ్నిచేసి, తారకాసురునిపై యుద్ధ శంఖారావాన్ని మ్రోగిస్తారు.

అంత ఆ స్వామి నెమలి వాహనారూఢుడై ఆరుముఖాలు పన్నెండు చేతులతో ఉగ్రరూపందాల్చి ఆరు చేతులతో ధనస్సులను మరో ఆరు చేతులతో బాణాలు ధరించి కొన్ని అక్షౌహిణులను సంహరించి, రాక్షస సేనను ఒకేసారి సంహరించాలని తలచి "సర్పరూపం" దాల్చి వారిని ఉక్కిరి బిక్కిరి చేసి, భీకర యుద్ధము చేసి తారకాసురుని సంహరించి విజయుడైనాడు.

సర్వశక్తి స్వరూపుడైన ఈ స్వామికి దేవేంద్రుడు దేవసేనతో వివాహము జరిపిన ఈ రోజును "శ్రీ సుబ్రహ్మణ్యషష్ఠి"గా పరిగణిస్తారని , సర్వులకు పూజ్యనీయులైన శ్రీ వేదవ్యాసులవారు దీని విశిష్టతను వివరిస్తారు.

ఈ సుబ్రహ్మణ్యేశ్వరస్వామి వార్కి గ్రామాలు , పట్టణాలు అనుబేధము లేకుండా దేశం నలుమూలలా దేవాలయాలు కలవు. ఈ రోజున "శ్రీవల్లి దేవసేనా సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి" వారికి భక్తులు కళ్యాణోత్సవములు, సహస్రనామ పూజలు తీర్ధములు అత్యంత వైభవంగా జరుపుతూ ఉంటారు.

ఈ స్వామి ఆరాధనవల్ల నేత్రరోగాలు , చర్మవ్యాధులు తగ్గుతాయని , పెళ్లికాని వారికి వివాహం జరిగి సత్‌సంతాన సౌభాగ్యం కలిగి ఆయురారోగ్య ఐశ్వర్యములతో వర్ధిల్లు తారని ప్రజల విశ్వాసం. అలా సంతానం కలిగినవారు శ్రీ స్వామివారి సహస్రనామాలలో ఇష్టమైన పేరును వారి బిడ్డలకు పెట్టుకుంటారు. ఈ పుణ్యదినాన శ్రీ స్వామికి పాలు, పండ్లు , వెండి , పూలు పడగలు , వెండి కళ్ళు మొదలైన మొక్కుబడులు సమర్పించుకుంటూ ఉంటారు.

ఇటువంటి పుణ్యప్రదమైన "శ్రీ సుబ్రహ్మణ్యషష్ఠి" నాడు మనమంతా శ్రీ స్వామి విశేష పూజలు గావించి శ్రీ స్వామివారి కృపాకటాక్ష వీక్షణలు పొందుదాము.

వీలున్న వారందరూ తప్పకుండా సుబ్రహ్మణ్య స్వామివారిని ఆరాధించండి. పెళ్ళి కాని వారికి , సంతానం లేని వారికి ఇది అమృతతుల్యమైన అవకాశం. సుబ్రహ్మణ్యుని అనుగ్రహముతో వివాహ ప్రాప్తి , సత్సంతానం , వంశాభివృద్ధి , జ్ఞానము , తేజస్సు, పాప కర్మల నుండీ విముక్తి కలుగుతుంది. కుండలినీ శక్తిని జాగృతం చేసి జీవితాశయం పొందడానికి కూడా సుబ్రహ్మణ్యుని అనుగ్రహము అతి ముఖ్యము🙏

🌹🌹🌹🌹🌹



><><><><><><><><><><><><><><><><><><><><><><><><><><><><><><><><><><><><


🌹 సుబ్రమణ్య స్వామి స్తోత్రాలు 🌹


సుబ్రమణ్య అష్టకం

సుబ్రమణ్యం కరవాలంబ స్తోత్రం

సుబ్రమణ్య పంచరత్న స్తోత్రం

సుబ్రమణ్య అష్టోత్తర శతనామావళి

స్కంద షష్ఠి కవచం

----------------------------------------

స్కందషష్ఠి సందర్భంగా...


#స్కందోత్పత్తి

తప్యమానే తదా దేవే సేంద్రా సాగ్ని పురోగమాః౹
సేనాపతిమ్ మభీప్సంతః పితామహముపాగమన్౹౹ 1

తతో బ్రువన్ సురాస్సర్వే భగవంతం పితామహమ్౹
ప్రణిపత్య సురా రామ సేంద్రాస్సాగ్ని పురోగమాః౹౹ 2

యో నస్సేనాపతిర్దేవ దత్తో భాగవతా పురా౹
సదమః పరమాస్థాయ తప్యతే స్మ సహోమయా౹౹ 3

యదత్రానంతరం కార్యం లోకానాం హితకామ్యయా౹
సంవిధత్స్వ విధానజ్ఞ త్వం హాయ్ నః పరమాగతిః౹౹ 4

దేవతానాం వచః శ్రుత్వా సర్వలోక పితామహః౹
స్వాంతయాన్ మధురైర్వాక్యైః త్రిదశానిదమబ్రవీత్౹౹ 5

శైలపుత్ర్యా యదుక్తం తత్ న ప్రజా స్వాసు పత్నిషు౹
తస్యా వచనమక్లిష్టం సత్యమేవ నసంశయః౹౹ 6

ఇయమాకాశ గంగా యస్యాం పుత్త్రం హుతాశనః౹
జనయిష్యతి దేవానాం సేనాపతిమరిందమమ్౹౹ 7

జ్యేష్టా శైలేంద్ర దుహితా మానయిష్యతి తత్సుతమ్౹
ఉమాయాస్తద్బహుమతం భవిష్యతి న సంశయః౹౹ 8

తచ్చ్రుత్వా వచనం తస్య కృతార్థా రఘునందన౹
ప్రణిపత్య సురా స్సర్వే పితామహమపూజయన్౹౹ 9

తే గత్వా పరమం రామ కైలాసం ధాతుమండితమ్౹
అగ్నిం నియోజయామాసుః పుత్రార్థం సర్వదేవతాః౹౹ 10

దేవకార్యమిదం దేవా సంవిధత్స్వ హుతాశన౹
శైలపుత్ర్యాం మహాతేజో గంగాయాం తేజ ఉత్సృజ౹౹ 11

దేవతానాం ప్రతిజ్ఞాయ గంగామభ్యేత్య పావకః౹
గర్భం ధారయ వై దేవి దేవతానాం ఇదం ప్రియమ్౹౹ 12

ఇత్యేతత్వచనం శృత్వా దివ్యం రూపమధారయత్౹
స్వతస్యా మహిమాం దృష్ట్వా సమంతాదవసీర్యత౹౹ 13

సమంతతస్తదా దేవీం అభ్యషించత పావకః౹
సర్వస్రోతాంసి పూర్ణాని గంగాయా రఘునందన౹౹ 14

తమువాచ తతో గంగా సర్వ దేవా పురోగమం౹
అశక్తా ధారణే దేవా తేజస్సముద్ధతం౹
దాహ్యమానాగ్నినా తేన సంప్రవ్యథిత చేతనా౹౹ 15

అథాబ్రవీదిదం గంగం సర్వదేవ హుతాశనః౹
ఇహ హైమవతే పార్స్వే గర్భోయం సన్నివేశ్యతామ్౹౹ 16

శ్రుత్వా త్వగ్నివచో గంగా తమ్ గర్భమతి భాస్వరం౹
ఉత్ససర్జ మహాతేజః శ్రోతోభ్యో హాయ్ తదానఘ౹౹ 17

యదస్యా నిర్గతం తస్మాత్౹ తప్తజాంబూనదప్రభం౹౹ 18

కాంచనం ధరణీం ప్రాప్తం హిరణ్యమతులం ప్రభుం౹
తామ్రం కార్ష్ణాయసం చైవ తైక్ష్ణ్యాదేవాభ్యజాయత౹౹ 19

మలం తస్యా భవత్ తత్ర త్రపుసీసకమేవ చ౹
తదేతద్ధరణీం ప్రాప్య నానాధాతురవర్ధత౹౹ 20

నిక్షిప్తమాత్రే గర్భేతు తేజోభిరభిరంజితం౹
సర్వం పర్వత సన్నద్ధం సౌవర్ణమభవద్వనమ్౹౹ 21

జాత రూపమితి ఖ్యాతం తదాప్రభృతి రాఘవ౹
సువర్ణం పురుష వ్యాఘ్ర హుతాశన సమప్రభం౹
తృణవృక్షలతాగుల్మం సర్వం భవతి కాంచనం౹౹ 22

తం కుమారం తతో జాతం సేంద్రా స్సహమరుద్గణాః౹
క్షీరసంభావనార్థాయ కృత్తికా స్సమయోజయన్౹౹ 23

తాః క్షీరం జాతమాత్రస్య కృత్వా సమయముత్తమం౹
దదుః పుత్త్రోయ మస్మాకం సర్వాసామితినిశ్చితాః౹౹ 24

తతస్తు దేవతా స్సర్వాః కార్తికేయ ఇతి బ్రువన్౹
పుత్త్రస్త్రైలోక్యవిఖ్యాతో భవిష్యతి న సంశయః౹౹ 25

తేషాం తద్వచనం శ్రుత్వా స్కన్నం గర్భపరిస్రవే౹
స్నాపయన్ పరయా లక్ష్మ్యా దీప్యమానం యథానలమ్౹౹ 26

స్కంద ఇత్యబ్రువన్ దేవాః స్కన్నం గర్భపరిస్రవేత్౹
కార్తికేయం మహాభాగం కాకుత్స్థ జ్వలనోపమమ్౹౹ 27

ప్రాదుర్భూతం తతః క్షీరం కృత్తికా నామనుత్తమమ్౹
షన్ణాం షడాననో భూత్వా జగ్రాహ స్తనజం పయః౹౹ 28

గృహీత్వా క్షీరమేకాహ్నా సుకుమారవపుస్తాదా౹
అజయ స్వేన వీర్యేణ దైత్యసైన్యగణాన్ విభుః౹౹ 29


సురసేనాగణపతిం అభ్యషించిన్ మహద్యతిం౹
తతస్తమలా సర్వే సమేత్యాగ్ని పురోగమాః౹౹ 30

ఏష తే రామ గంగాయా విస్తరోభిహితో మయా౹
కుమారసంభవశ్చైవ ధన్యః పుణ్యస్తథైవ చ౹౹ 31

భక్తశ్చ యః కార్తికేయే కాకుత్స్థ భువి మానవః౹
ఆయుష్మాన్ పుత్త్ర పౌత్త్రైశ్చ స్కందసాలోక్యతాం వ్రజేత్౹౹

ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే బాలకాండే సప్త త్రింశస్సర్గః౹౹ 32


👉దీనిని, గర్భవతులు విన్నా... చదివినా... కీర్తి,ప్రతిష్ఠలు కలిగిన పుత్రులు కలుగుతారు.

👉సుబ్రహ్మణ్యషష్ఠి రోజు ఎవరైతే, స్కందోత్పత్తి చదువుతారో వారిపిల్లలు ఆపదలు నుంచి రక్షించబడతయారు. -------------------------------------

సర్వం శ్రీవల్లీదేవసేనాసమేత శ్రీసుబ్రహ్మణ్యేశ్వరార్పణమస్తు🙏

🌹🌹🌹🌹🌹


><><><><><><><><><><><><><><><><><><><><><><><><><><><><><><><><><><><><



🌹. పెళ్లి కానివారు , సంతానం లేనివారు సుబ్రహ్మణ్య షష్టి రోజు స్వామిని పూజించండి 🌹

మాసానాం మార్గశీర్షోహం అని శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో చెప్పాడు. ఈ మాసం ఎంతో విశిష్ఠతను సంతరించుకుందని అర్థం. ఇది సంవత్సరంలో తొమ్మిదవ మాసం.

మృగశిరా నక్షత్రంతో కూడిన పౌర్ణమి గల మాసమే ఈ మార్గశీర్షం. ఈ మాసంలో పౌర్ణమి నాడు మృగశిర నక్షత్రం ఉంటుంది. మార్గశిర మాస శుక్ల షష్టి నాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి జననం జరిగింది. తారకాసుర సంహారం కోసం , దేవతల కోరిక మేరకు పరమశివుని అంశతో మార్గశిర శుధ్ధ షష్టినాడు సుబ్రహ్మణ్యస్వామి జన్మించారు.

సుబ్రహ్మణ్యేశ్వరుడు కారణ జన్ముడు. తారకాసుర సంహారం కోసం జన్మించినవాడు. దేవగణానికి సర్వసేనాధిపతిగా పురాణాలు చెబుతున్న ఆ స్వామి సర్వశక్తిమంతుడు. ఆది దంపతులైన శివపార్వతులకు ముద్దుల తనయుడు. హిరణ్యకశ్యపుని కుమారుడు ‘నీముచి’. ‘నీముచి’ కొడుకు తారకాసురుడు.

తారకాసురుడు రాక్షసుడు. అతడు పరమేశ్వరుడి గురించి ఘోర తపస్సుచేసి ఆయన ఆత్మ లింగాన్ని వరంగా పొందుతాడు.

అంతేకాకుండా ఒక బాలుడి చేతిలో తప్ప ఇతరులెవ్వరి వల్ల తనకు మరణం లేకుండా వరం పొందుతాడు. వర ప్రభావంతో తారకాసురుడు దేవతలను హింసించసాగాడు.

అతడితో యుద్ధం చేసి దేవతలు ఓడిపోతారు. ఇక తమ వల్లకాదనుకుని తారకుడి బాధలు పడలేక దేవతలు తమకొక శక్తిమంతుడైన బాలుడ్ని ప్రసాదించమని శివుడ్ని వేడుకున్నారట. వారి కోరిక మేరకు శివాంశతో కుమారస్వామి జన్మించాడు.

కుమారస్వామి దేవతలకు సేనానిగా నిలిచి తారకుడ్ని సంహరించాడు. అందువల్ల తారకుడి సంహారం కోసం జన్మించినవాడు కుమారస్వామి. అతనికి సుబ్రహ్మణ్యేశ్వరుడు అనే పేరుకూడా వుంది.

సర్పరూపుడైన సుబ్రహ్మణ్యేశ్వరుడు కుజునకు అధిష్టాన దైవం. రాహువునకు సుబ్రహ్మణ్యస్వామి , సర్పమంత్రాలు అధిష్టాన దైవాలు.

సర్వశక్తిమంతుడైన సుబ్రహ్మణ్యేశ్వరస్వామి కరుణామయుడు. దయాహృదయుడు పిలిచిన వెంటనే పలికే దైవం. మానవుని దైనందిన జీవితంలో కుజునికి అత్యంత ప్రాధాన్యం ఉంది. మన శరీరంలో ఉండే కుండలినీ శక్తికి సుబ్రహ్మణ్యస్వామి అధిదైవం. పురుషుల్లో ఉండే శుక్ర కణాలకు కూడా సుబ్రహ్మణ్యస్వామి కారకుడు. శరీరంలో ఉండే కుండలినికి చాలా శక్తి ఉంటుంది. శరీరంలో ఉండే ఎనర్జీ అంతా పాము ఆకారంలోనే ఉంటుంది. సర్పాలను నాశనం చేసిన వారికి లేదా ఎనర్జీని పాడు చేసినవారికి సంతానం ఉండదనేది ఒక సూత్రం. కాబట్టి ఆ ఎనర్జీని , ప్రకృతిని కాపాడడం కోసం ఈ రోజు సుబ్రహ్మణ్యస్వామిని పూజించాలి.

కొంతమంది ఈ రోజు బ్రహ్మచారులను పూజిస్తారు. కుజుడు మనిషికి శక్తి , ధనాన్ని , ధైర్యాన్నిస్తాడు. అందువల్ల సుబ్రహ్మణ్య ఆరాధన చేస్తే అవన్నీ మానవులకు సమకూరుతాయి. అలాగే సుబ్రహ్మణ్యేశ్వరుడు సర్పరూపుడు కావడం వల్ల , సర్పగ్రహాలైన రాహుకేతువులు సుబ్రహ్మణ్య ఆధీనంలో ఉంటారని జ్యోతిష్య గ్రంథాలు చెబుతున్నాయి. అందువల్ల సుబ్రహ్మణ్య ఆరాధనం , సుబ్రహ్మణ్య పూజ సర్వ శుభాలనిచ్చి , రాహుకేతు దోషాలకు కూడా పరిహారంగా భావించబడుతోంది.

పెళ్ళికాని వారు , పిల్లలు లేని వారు సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించాలి.

స్కంద షష్టి నాడు శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యస్వామి కళ్యాణం నిర్వహిస్తారు. అవివాహితులు ఈ కళ్యాణం వీక్షిస్తే ఆటంకాలు తొలగి వివాహాలు జరుగుతాయి.

అంతే కాదు సత్సంతానం కలుగుతుందని పెద్దలు చెబుతున్నారు. విశిష్టమైన ఈ రోజు సుబ్రహ్మణ్య స్వామి పూజ చేసినా , కావడి సమర్ఫించినా సత్సంతాన ప్రాప్తి. రాబోయే తరాలవారికి కూడా సంతాన లేమి లేకుండా వంశాభివృద్ధి జరుగుతుందని నమ్మకం.

తమిళనాడు ప్రాంతాలలో ఈ రోజున కావడి మొక్కును తీర్చటం కనిపిస్తుంది. షష్టి నాడు కుమారస్వామి ఆలయానికి కావడి మోసుకుని పోవటమే దీనిలోని ప్రధానాంశం.

ఈ కావడిలో ఉండే కుండలను పంచదారతోనూ , పాలతోనూ నింపుతారు. సుబ్రహ్మణ్య షష్ఠి రోజున భక్తులు తెల్లవారు ఝూమున లేచి తలస్నానమాచరించి పాలు , పంచాదారలతో నిండిన కావడిలను ధరించి సుబ్రహ్మణ్య స్వామికి సమర్పిస్తారు. దేవాలయాలను దర్శించి భక్తి శ్రద్ధలతో అష్టోత్తర శతనామాల పూజలు చేస్తారు. భక్తులు కావడిలతో తెచ్చిన పంచదార , పాలను స్వామికి సమర్పించుకుంటారు. అయితే ఈ కావడిలోని వస్తువులు భక్తుల మొక్కుల బట్టి ఉంటాయి.

మంగళవారం , శుద్ధ షష్టి , మృగశిర , చిత్త , ధనిష్ట ఏ నక్షత్రం కలిసిన రోజైనా కుజునికి , సుబ్రహ్మణ్యేశ్వరునికి ప్రీతికరం. ఆరోజున సుబ్రహ్మణ్య మంత్రం , కుజ మంత్రం జపించాలి. అనంతరం సుబ్రహ్మణ్య కుజులకు అష్టోత్తర , శత నామావళితో పూజచేయాలి. ఇలా తొమ్మిది రోజులు జపమూ , పూజ చేసి చంద్ర లేదా మోదుగ పుల్లలతో నెయ్యి తేనెలతో తొమ్మిది మార్లకు తగ్గకుండా హోమం చేసి దాని ఫలితాన్ని పగడానికి ధారపోసి ఆ పగడాన్ని ధరిస్తే మంచిదని చెబుతారు. ఇందువల్ల కుజ గ్రహ దోష పరిహారం జరిగి సుబ్రహ్మణ్యస్వామి అనుగ్రహం కూడా కలుగుతుందంటారు. ఈ పూజా అనంతరం సర్ప సూక్తం లేదా సర్పమంత్రాలు చదవడంవల్ల ఇంకా మేలు జరుగుతుంది.

_________

🌹🌹🌹🌹🌹



><><><><><><><><><><><><><><><><><><><><><><><><><><><><><><><><><><><><


🌹. కాలసర్పదోషం ఉన్నవారికి సుబ్రహ్మణ్య ఆరాధన శ్రేయస్కరం 🌹

జాతకంలో కాలసర్పదోషం ఉన్నవారు,కేతు దోషం ఉన్నవారు సుబ్రహ్మణ్య ఆరాధన చేయడం అన్నివిధాల శ్రేయస్కరం. ఆ స్వామి జపం సర్వవిధాలా మేలు చేస్తుంది. అలాగే రాహు మంత్రం, సుబ్రహ్మణ్య మంత్రం సంపుటి చేసి జపించి సర్పమంత్రాలు చదువుతూ, పగడాన్ని ధరిస్తే మేలు జరుగుతుంది. ఈ పూజల వల్ల రాహుగ్రహం అనుగ్రహమూ కలుగుతుంది, అలాగే సంతాన ప్రాప్తికోసం మహిళలు ఎక్కువగా ఆరాధించే దైవం సుబ్రహ్మణ్యేశ్వరుడు. సుబ్రహ్మణ్యేశ్వరుడు బాలుడి రూపంలో దర్శనమిస్తాడు కాబట్టి, తన రూపంతో బిడ్డలను ప్రసాదిస్తాడని భక్తులు నమ్ముతారు. అందుకనే సుబ్రహ్మణ్య ఆలయాలలో సంతానం లేని స్ర్తీలు పూజలు చేయడం మనం చూస్తూ వుంటాం.

సంతానప్రాప్తిని కోరే స్రీలు వెండి సర్పానికి సుబ్రహ్మణ్య, కేతు మంత్రాలతో 21మార్లు పాలతో అభిషేకించి ఆ పాలను సేవిస్తే సత్ సంతానం కలుగుతుందని మహిళా భక్తుల ప్రగాఢ విశ్వాసం. అలాగే ఏదైనా పుట్టకు నమస్కరించి పుట్ట చుట్టు 21 లేదా 108 మార్లు మండలం పాటు (40రోజులు) ప్రదక్షిణలు చేస్తే సంతానం కలుగుతుందని అంటారు. అందువల్ల సుబ్రహ్మణ్య ఆరాధనం సర్వ క్లేశాలను దూరంచేసి,సర్వశక్తుల్ని ఇస్తుందని భక్తుల విశ్వాసం. సుబ్రహ్మణ్య షష్ఠి రోజు ఎవరైతే స్కందోత్పత్తి చదువుతారో వారి పిల్లలు ఆపదల నుంచి రక్షింపబడతారు....

రామాయణాంతర్గత స్కందోత్పత్తి

-----------------------------------

పరమేశ్వరుడు తపస్సు చేయుచుండగా పూర్వము దేవతలు ఋషులతో గూడి, సేనాపతిని కోరుకొనుచు బ్రహ్మదేవుని కడకు వెళ్ళిరి. ఇంద్రాది దేవతలు అగ్నిని ముందుంచుకొని, బ్రహ్మదేవునకు ప్రణమిల్లి, ఆయనతో ఇట్లు విన్నవించుకొనిరి. “ఓదేవా! పూర్వము మీరు పరమేశ్వరుని మాకు సేనాపతిగా నియమించియుంటిరి.

ఆ శంకరుడు ఇప్పుడు పార్వతీదేవితో గూడి హిమవత్పర్వతమున తపమొనరించుచున్నాడు. కర్తవ్య విధానము నెరిగిన ఓ బ్రహ్మదేవా! ఈ (సెనాపతి) విషయమున లోకహితమును గోరి అనంతర కార్యమును గూర్చి ఆలోచిమ్పుడు. ఇప్పుడు మాకు మీరే దిక్కు”.

దేవతల ప్రార్థనను ఆలకించి, సరలోక సృష్టికర్తయైన బ్రహ్మదేవుడు మృదుమధుర వచనములతో వారిని ఓదార్చుచు ఇట్లు పలికెను.

“పార్వతీదేవి శాప కారణముగా మీకు మీ పత్నులయందు సంతానము కలుగు అవకాశము లేదు. ఆమె వచనము తిరుగులేనిది. ఇది ముమ్మాటికిని సత్యము. ఇందు సందేహము లేదు. ఆకాశమున ప్రవహించు ఈ గంగాదేవి యందు అగ్నిదేవుడు ఒక పుత్రుని పొందగలడు. అతడు దేవసేనాపతియై, శత్రు సంహారకుడు కాగలడు.

హిమవంతుని పెద్ద కూతురైన గంగ ఆ అగ్నిసుతుని (శివ తేజః ప్రభావమున అగ్నివలన తనయందు జనించిన సుతుని) ఆదరింప గలదు. అతడు పార్వతీదేవికి మిక్కిలి ప్రీతిపాత్రుడగును. ఇందు సంశయము లేదు”.

ఓ రఘునందనా! బ్రహ్మదేవుడు పలికిన ఆ మాటలకు దేవతలందరును సంతసించి, తాము కృతార్థులైనట్లు భావించిరి. అనంతరము వారు బ్రహ్మదేవునకు ప్రణమిల్లి, పూజించిరి. అంతట ఆ దేవతలందరునూ గైరికాదిధాతువులతో విలసిల్లుచున్న కైలాసపర్వతమునకు చేరి, పుత్రోత్పత్తికై అగ్నిదేవుని నియమించిరి. శివతెజమును భరించిన ఓ అగ్నిదేవా! ఈ దేవకార్యమును నెరవేర్పుము. శైలపుత్రికయైన గంగయందు ఆ శివ తేజస్సును ఉంచుము’ అని దేవతలు పలికిరి.

అగ్నిదేవుడు దేవతలతో ‘అట్లే’అని పలికి, గంగాదేవి కడకు వెళ్ళి “ఓ దేవీ! గర్భమును ధరింపుము. ఇది దేవతలకు హితమొనర్చు కార్యము” అని నుడివెను. అప్పుడు గంగ ఆయన మాటలను విని దివ్యమైన స్త్రీ రూపమును ధరించెను. అగ్ని ఆమె సౌందర్యాతిశయమును జూచి, శివతేజమును ఆమెయందంతటను వ్యాపింపజేసెను.

ఓ రఘునందనా! అగ్ని ఆమెపై వ్యాపింపజేసిన శివతేజముతో గంగా ప్రవాహములన్నియును నిండిపోయెను. ఆ అగ్ని తేజస్సుయొక్క తాపమునకు తట్టుకొనలేక గంగాదేవి సర్వ దేవతలకును పురోహితుడైన అగ్నిదేవునితో “క్షణక్షణమునాకును బలీయమగుచున్న నీ తేజస్సును ధరింపలేకయున్నాను” అని పలికెను.

సర్వదేవతల కొరకై సమర్పించెడి ఆహుతులను స్వీకరించునట్టి అగ్నిదేవుడు గంగతో “ఓ దేవీ! ఈ శ్వేత పర్వతప్రదేశమున నీ గర్భమును ఉంచుము’ అని యనెను. మహా తేజస్వివైన ఓ పుణ్యపురుషా! రామా! గంగాదేవి అగ్నిదేవుని మాటలను పాటించి, మిక్కిలి తేజోరాశియైన ఆ గర్భమును తన ప్రవాహములనుండి అచట వదలెను. గంగానది గర్భమునుండి వెడలిన తేజస్సు మేలిమి బంగారము వలె కాంతిమంతమై యుండెను.

కనుక ఆ తేజస్సు ఉంచబడిన భూమియు, అచటి వస్తువులన్నియును సువర్ణమయములాయెను. ఆ పరిసరములన్నియును రజిత మయములై నిరుపమానమైన కాంతితో వెలుగొందెను. ఆ తేజస్సు యొక్క తీక్ష్ణత్వము వలన రాగి ఇనుము పుట్టెను. ఆ రేతస్సు యొక్క మలము తగరము, సీసము ఆయెను. ఈవిధంగా ఆ తేజస్సు భూమిని జేరి, వివిధ ధాతువులుగా రూపొందెను.

ఆ గర్భము భూమిపై ఉంచబడగానే దాని తేజః ప్రభావముచే ఆశ్వేతపర్వతమూ, అందలి శరవణమూ(రెల్లుగడ్డి) సువర్ణమయములై తేజరిల్లసాగెను. పురుష శ్రేష్ఠుడైన ఓ రాఘవా! అగ్నితో సమానమైన కాంతి గల ఆ బంగారము అప్పటినుండియు ‘జాతరూపము’ అను పేరుతో ప్రసిద్ధికెక్కెను. అచటి తృణములు, వృక్షములు, లతలు, పొదలు మొదలగునవి అన్నియును స్వర్ణమయములాయెను.

తదనంతరము అచట జన్మించిన కుమారునకు పాలిచ్చి పోషించుటకై, ఇంద్రుడు, మరుద్గణములు మొదలగు దేవతలు ఆరుమంది కృత్తికలను నియోగించిరి. “ఈబాలుడు మా అందరి యొక్క పుత్రుడగును” అని ఆ కృత్తికలు దేవతలతో ఒప్పందము చేసుకొనిరి. పిమ్మట ఆ నిశ్చయముతో అప్పుడే పుట్టిన ఆ శిశువునకు పాలియ్యసాగిరి. అంత దేవతలందరును “ఈ బాలకుడు కార్తికేయుడు అను పేరుతో ముల్లోకముల యందును ఖ్యాతికెక్కును. ఇందు సంశయము లేదు” అని పలికిరి.

గంగాద్వారా అచటికి చేరిన శివతేజస్సు యొక్క ప్రభావమున పుట్టిన ఆ బాలుడు అగ్నివలె వెలుగొందుచుండెను. దేవతలా మాటలను విని, వారి ఆదేశమును అనుసరించి, కృత్తికలు ఆ బాలకునకు స్నానము చేయించిరి. ఓ కాకుత్స్థా! గంగాదేవి గర్భమునుండి స్ఖలితుడైనందున దేవతలు అగ్నితుల్యుడై, కారణజన్ముడైన ఆ మహానుభావుని ‘స్కందుడు’ అని పిలువసాగిరి.

కృత్తికల పోషణ వలన అతనికి ‘కార్తికేయుడు’ అనియు పేరు ఏర్పడెను. అప్పుడు ఆ ఆరుగురు కృత్తికల స్తనములలో సమృద్ధిగా పాలు ఏర్పడెను. ఆరు ముఖములు గలవాడై ఆ బాలుడు ఆ ఆరుగురి నుండి స్తన్యములను గ్రోలెను. సుకుమార శరీరుడైనను ఆ కుమారస్వామి ఒక దినము మాత్రమే వారినుండి పాలుద్రాగి, మహిమాన్వితుడై అతడు తన పరాక్రమము చేత రాక్షస సైన్యములను జయించెను.

దేవతలు అగ్నిదేవుని నాయకత్వమున సాటిలేని తేజస్వియైన ఆ బాలుని కడకు చేరి, అతనిని ‘దేవసేనాపతి’గా అభిషేకించిరి.

------------------------

పవిత్రమైన ఈ గాథను విన్నవారు ధన్యులగుదురు. కుమారస్వామి పై భక్తిగల మానవుడు ఈ లోకమున దీర్ఘాయుష్మంతుడై పుత్రపౌత్రులతో వర్ధిల్లును. తుదకు స్కంద సాలోక్య ఫలమును గూడ పొందును.

సర్వం శ్రీకృష్ణార్పణమస్తు

🌹🌹🌹🌹🌹




🌹 18, DECEMBER 2023 MONDAY ALL MESSAGES సోమవారం, ఇందు వాసర సందేశాలు 🌹

🍀🌹 18, DECEMBER 2023 MONDAY ALL MESSAGES సోమవారం, ఇందు వాసర సందేశాలు 🌹🍀
1) 🌹 18, DECEMBER 2023 MONDAY సోమవారం, ఇందు వాసరే - నిత్య పంచాంగము Daily Panchangam🌹
2) 🌹 కపిల గీత - 281 / Kapila Gita - 281 🌹 
🌴 7. మానవజన్మను పొందే జీవుని గతిని వర్ణించుట - 12 / 7. Lord Kapila's Instructions on the Movements of the Living Entities - 12 🌴
3) 🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 873 / Vishnu Sahasranama Contemplation - 873 🌹
🌻 873. అర్హః, अर्हः, Arhaḥ 🌻
4) 🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 185 / DAILY WISDOM - 185 🌹
🌻 3. పురాణాలు సరైనవి, మనస్తత్వవేత్తలు చెప్పేవి కూడా సరైనవే / 🌻 3. The Puranas are Right, the Psychologists also are Right 🌻 🌻
5) 🌹. శివ సూత్రములు - 188 / Siva Sutras - 188 🌹 
🌻 3-19. క వర్గాదిశు మహేశ్వర్యాద్యః పశుమాతరః - 3 / 3-19. kavargādisu māheśvaryādyāh paśumātarah - 3 🌻

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 18, డిసెంబరు, DECEMBER 2023 పంచాంగము - Panchangam 🌹*
*శుభ సోమవారం, Monday, ఇందు వాసరే*
*మనందరికి ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని పరమాత్మని స్మరిస్తూ - ప్రసాద్ భరద్వాజ*

*🌻. పండుగలు మరియు పర్వదినాలు : సుబ్రమణ్య షష్టి, చంపా షష్టి, Subrahmanya Sashti, Champa Shashthi 🌻*

*🍀. శ్రీ శివ సహస్రనామ స్తోత్రం - 56 🍀*

*115. దేవాసురగురుర్దేవో దేవాసురనమస్కృతః |*
*దేవాసురమహామాత్రో దేవాసురగణాశ్రయః*
*116. దేవాసురగణాధ్యక్షో దేవాసురగణాగ్రణీః |*
*దేవాదిదేవో దేవర్షిర్దేవాసురవరప్రదః*

🌻 🌻 🌻 🌻 🌻

*🍀. నేటి సూక్తి : అంతర్జీవనారంభం : మనలోని చేతన సామాన్యంగా బాహ్యసత్త యందు కేంద్రీకృతమై వున్న హేతువు చేత దానికినీ అంతస్సత్తకునూ నడుమ ఒక తెర వంటిది, ఒక అడ్డు గోడ వంటిది ఏర్పడుతున్నది. చేతన ఇప్పుడా తెరను __ ఆ అడ్డుగోడను భేదించి అంతస్సత్త యందు కేంద్రీకృతం కావడం అవసరం. అలా జరిగినప్పుడే మనలో నిక్కమైన అంతర్జీవనం ప్రారంభమవుతుంది.🍀*

🌷🌷🌷🌷🌷

విక్రమ: 2080 నల, శఖ: 1945 శోభన
కలియుగాబ్ది : 5124, శోభకృత్‌,
హేమంత ఋతువు, దక్షిణాయణం,
మార్గశిర మాసము
తిథి: శుక్ల షష్టి 15:15:08 వరకు
తదుపరి శుక్ల-సప్తమి
నక్షత్రం: శతభిషం 25:22:59
వరకు తదుపరి పూర్వాభద్రపద
యోగం: వజ్ర 21:31:59 వరకు
తదుపరి సిధ్ధి
కరణం: తైతిల 15:16:09 వరకు
వర్జ్యం: 09:39:06 - 11:08:54
దుర్ముహూర్తం: 12:34:34 - 13:18:57
మరియు 14:47:43 - 15:32:06
రాహు కాలం: 08:02:43 - 09:25:56
గుళిక కాలం: 13:35:36 - 14:58:49
యమ గండం: 10:49:09 - 12:12:23
అభిజిత్ ముహూర్తం: 11:50 - 12:34
అమృత కాలం: 18:37:54 - 20:07:42
సూర్యోదయం: 06:39:30
సూర్యాస్తమయం: 17:45:16
చంద్రోదయం: 11:22:55
చంద్రాస్తమయం: 23:17:04
సూర్య సంచార రాశి: ధనుస్సు
చంద్ర సంచార రాశి: కుంభం
యోగాలు: అమృత యోగం - కార్య
సిధ్ది 25:22:59 వరకు తదుపరి
ముసల యోగం - దుఃఖం
దిశ శూల: తూర్పు
✍️. శ్రీ వక్కంతం చంద్రమౌళి

🌻 🌻 🌻 🌻 🌻  

*🍀. నిత్య ప్రార్థన 🍀*
*వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ*
*నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా*
*యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా*
*తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం*
*తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ* 
*విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.*
🌹🌹🌹🌹🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. కపిల గీత - 281 / Kapila Gita - 281 🌹*
*🍀. కపిల దేవహూతి సంవాదం 🍀*
*✍️. ప్రసాద్‌ భరధ్వాజ*

*🌴 7. మానవజన్మను పొందే జీవుని గతిని వర్ణించుట - 12 🌴*

*జంతురువాచ*
*12. తస్యోపసన్నమవితుం జగదిచ్ఛయాత్త నానాతనోర్భువి కాలక్‌ చరణారవిందమ్|*
*సోఽహం వ్రజామి శరణం హ్యకుతోభయం మే యేనేదృశీ గతిరదర్శ్యసతోఽనురూపా ॥*

*తాత్పర్యము : జీవుడు పరమాత్మను స్తుతించుచు ఇట్లనును* - ప్రభూ! నీ శరణాగత భక్తులను రక్షించుట కొరకై లోకకళ్యాణ నిమిత్తముగా నీవు నీ ఇచ్ఛచే అప్పుడఫ్ఫుడు పెక్కు రూపములతో అవతరించెదవు. అప్పుడు పవిత్రములైన, సర్వ అభయస్థానమగు నీ పాదపద్మములతో భూతలమునందు సంచరించెదవు. అట్టి నీ చరణసరోజములను శరణు జొచ్చుచున్నాను. అధముడనగు నాకు తగినట్టి ఈ గర్భవాసము యొక్క గతిని చూపించితివి. ఇక నీవే నాకు దిక్కు.*

*వ్యాఖ్య : కాలక్‌-కారణారవిందం అనే పదం భగవంతుని యొక్క సర్వోన్నత వ్యక్తిని సూచిస్తుంది, అతను వాస్తవానికి ప్రపంచం యొక్క ఉపరితలంపై నడిచే లేదా ప్రయాణించేవాడు. కాబట్టి ఈ ప్రార్ధన ఈ భూమి యొక్క ఉపరితలంపైకి లేదా ఈ విశ్వంలోని ఏదైనా భాగానికి దిగివచ్చిన పరమాత్మునికి, భక్తిపరుల రక్షణ కోసం మరియు దుర్మార్గుల నాశనం కోసం సమర్పించ బడుతుంది. అధర్మం పెరిగి, వైరుధ్యాలు తలెత్తినప్పుడు, భగవంతుడు భక్తులను రక్షించడానికి మరియు దుష్టులను చంపడానికి వస్తాడని భగవద్గీతలో ధృవీకరించబడింది.

*ఈ శ్లోకంలోని మరో ముఖ్యమైన అంశం ఏమిటంటే, భగవంతుడు తన ఇష్టానుసారం వస్తాడు, ఇచ్చాయా. భగవద్గీతలో కృష్ణుడు ధృవీకరించినట్లుగా, సంభవామి ఆత్మ మాయయాః ( BG 4.6 ) 'నేను నా ఇష్టానుసారం, నా అంతర్గత సంభావ్య శక్తి ద్వారా కనిపిస్తాను.' భౌతిక ప్రకృతి నియమాల ద్వారా అతను బలవంతంగా రావాలని కాదు. ఇక్కడ చెప్పబడింది. భగవానుడు జీవుడిని భయంకరమైన అస్తిత్వ స్థితికి చేర్చినట్లుగా, అతను అతనిని విడిపించగలడు కూడా. అందుచేత కృష్ణుడి పాద పద్మాల వద్ద ఆశ్రయం పొందాలి. కృష్ణుడు, 'అన్నీ విడిచిపెట్టి, నాకు లొంగిపో' అని చెప్పాడు. ఆయనను సంప్రదించే ఎవరైనా భౌతిక ఉనికిలో ఒక రూపాన్ని స్వీకరించడానికి మళ్లీ తిరిగి రారు, కానీ భగవంతుని వద్దకు తిరిగి వెళతారు, ఇంటికి తిరిగి వెళ్లిపోతారు.*

*సశేషం..*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Kapila Gita - 281 🌹*
*🍀 Conversation of Kapila and Devahuti 🍀*
*📚 Prasad Bharadwaj*

*🌴 7. Lord Kapila's Instructions on the Movements of the Living Entities - 12 🌴*

*12. jantur uvāca : 
*tasyopasannam avituṁ jagad icchayātta- nānā-tanor bhuvi calac-caraṇāravindam*
*so 'haṁ vrajāmi śaraṇaṁ hy akuto-bhayaṁ me yenedṛśī gatir adarśy asato'nurūpā*

*MEANING : The human soul says: I take shelter of the lotus feet of the Supreme Personality of Godhead, who appears in His various eternal forms and walks on the surface of the world. I take shelter of Him only, because He can give me relief from all fear and from Him I have received this condition of life, which is just befitting my impious activities.*

*PURPORT : The word calac-caraṇāravindam refers to the Supreme Personality of Godhead, who actually walks or travels upon the surface of the world. The prayer is therefore offered to the Supreme Personality of Godhead, who descends to the surface of this earth, or any part of this universe, for the protection of the pious and the destruction of the impious. It is confirmed in Bhagavad-gītā that when there is an increase of irreligion and discrepancies arise in the real religious activities, the Supreme Lord comes to protect the pious and kill the impious.*

*Another significant point in this verse is that the Lord comes, icchayā, by His own will. As Kṛṣṇa confirms in Bhagavad-gītā, sambhavāmy ātma-māyayā: (BG 4.6) "I appear at My will, by My internal potential power." As the Supreme Lord puts the living entity into the condition of horrible existence, He can also deliver him, and therefore one should seek shelter at the lotus feet of Kṛṣṇa. Kṛṣṇa demands, "Give up everything and surrender unto Me." And it is also said in Bhagavad-gītā that anyone who approaches Him does not come back again to accept a form in material existence, but goes back to Godhead, back home, never to return.*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 873 / Vishnu Sahasranama Contemplation - 873🌹*

*🌻 873. అర్హః, अर्हः, Arhaḥ 🌻*

*ఓం అర్హాయ నమః | ॐ अर्हाय नमः | OM Arhāya namaḥ*

*స్వాగతాసనశంసార్ఘ్యపాద్యస్తుత్యాదిసాధనైః ।*
*పూజ్యైశ్చ పూజనీయ ఇత్యర్హ ఇత్యుచ్యతే బుధైః ॥*

*పూజనమును పొందుటకు అర్హుడు. ఆవాహనము, ఆసనము, ప్రశంస, అర్ఘ్యము, పాద్యము, స్తుతి, సమస్కారము మొదలగు పూజాసాధనములచే పూజ చేయదగినవాడు.*

:: పోతన భాగవతము - దశమ స్కంధము, ఉత్తర భాగము ::
*వ.పూజించునప్పు డం దగ్రపూజార్హు లెవ్వ రని యడిగిన సదస్యులు దమకుఁ దోఁచిన విధంబులం బలుక వారి భాషణంబులు వారించి వివేకశీలుండును, జతుర వచనకోవిదుండును నగు సహదేవుండు భగవంతుండును, యదుకుల సంభవుండును నైన శ్రీకృష్ణునిం జూపి 'యీ మహాత్ముని సంతుష్టుం జేసిన భువనంబులన్నియుం బరితుష్టిం బొందు' నని జెప్పి ధర్మజుం జూచి ఇట్లనియె. (777)*

ఉ.కాలము దేశమున్ గ్రతువుఁ గర్మముఁ గర్తయు భోక్తయున్ జగ
జ్జాలము దైవమున్ గురువు సాంఖ్యము మంత్రము నగ్ని యాహుతుల్‍
వేళలు విప్రులున్ జననవృద్ధిలయంబుల హేతుభూతముల్‍
లీలలఁ దానయై తగ వెలింగెడు నెక్కటితేజ మీశుఁడున్‍. (778)
చ.ఇతఁడే యితండు గన్ను లొకయించుక మెడ్చిన నీ చరాచర
స్థితభువనంబు లన్నియు నశించు నితం డవి విచ్చిచూచినన్‍
వితతములై జనించుఁ బ్రబవిష్ణుఁడు విష్ణుఁడు నైన యట్టి యీ
క్రతుఫలదుండుగా కొరుఁ డొకం డెటు లర్హుఁడు శిష్టపూజకున్‍? (779)
ఉ.ఈ పురుషోత్తమున్ జగదధీశు ననంతుని సర్వశక్తుఁ జి
ద్రూపకు నగ్రపుజఁ బరితోషితుఁ జేయ సమస్త లోకముల్‍
వే పరితుష్టిఁ బొందుఁ బృథివీవర! కావున నీవు కృష్ణునిన్‍
శ్రీపతిఁ బూజసేయు మెడసేయక మాటలు వేయు నేటికిన్‍? (780)

*ఈ విధంగా పూజించే సందర్భంలో అగ్రపూజకు అర్హుడెవడనే ప్రశ్న పుట్టింది. సభలో ఉన్నవారు తమకు తోచిన విధంగా తలకొకరీతిగా చెప్పారు. వారి మాటలను వారించి బుద్ధిమంతుడైన సహదేవుడు భగవంతుడైన కృష్ణుడిని చూపించి 'ఈ మహాత్ముడిని సంతుష్టుడిని చేసిన సమస్త లోకాలు సంతోషిస్తాయి' అని పలికి ధర్మరాజుతో ఇలా అన్నాడు.*

*కాలమూ, దేశమూ, యజ్ఞమూ, కర్మమూ, కర్తా, భోక్తా, ప్రపంచమూ, దైవమూ, గురువూ, మంత్రమూ, అగ్నీ, హవ్యద్రవ్యాలూ, సృష్టి-స్థితి-లయలు సమస్తమూ తానేయై ప్రకాశించే ఏకైక దివ్యస్వరూపుడు ఈ కృష్ణ పరమాత్ముడొక్కడే.*

*పరమేశ్వరుడైన ఈ శ్రీకృష్ణుడు కన్నులు మూసుకొన్నాడంటే ఈ చరాచర ప్రపంచమంతా నశిస్తుంది. కన్నులు విప్పి చూస్తే ఈ లోకాలన్నీ జన్మిస్తాయి. సృష్టి, స్థితి, లయలకు కారకుడైన ఈ పుణ్యపురుషుడు యజ్ఞ ఫలాన్ని ప్రసాదించే ప్రభువు విష్ణుస్వరూపుడు. సర్వ సమర్థుడు. అగ్రపూజకు అర్హుడు ఇతడు గాకపోతే మరెవ్వరు?*

*ఓ రాజా! పురుషోత్తముడూ, లోకాధిపతీ, అనంతుడూ, సమస్త శక్తులు కలవాడూ, చిద్రూపుడూ, అయిన శ్రీకృష్ణుడిని ప్రప్రథమంగా పూజించి సంతోషింపజేసినట్లయిన సమస్త లోకాలూ సంతృప్తినొందుతాయి.*

సశేషం... 
🌹 🌹 🌹 🌹 🌹 

*🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 873🌹*

*🌻873. Arhaḥ🌻*

*OM Arhāya namaḥ*

स्वागतासनशंसार्घ्यपाद्यस्तुत्यादिसाधनैः ।
पूज्यैश्च पूजनीय इत्यर्ह इत्युच्यते बुधैः ॥

*Svāgatāsanaśaṃsārghyapādyastutyādisādhanaiḥ,*
*Pūjyaiśca pūjanīya ityarha ityucyate budhaiḥ.*

*One who deserves to be worshipped by words of welcome, offer of a seat, water to wash the hands and feet, praise, prostration and other instruments of worship.*

*Śrīmad Bhāgavata - Canto 10, Chapter 74*
*The members of the assembly then pondered over who among them should be worshiped first, but since there were many personalities qualified for this honor, they were unable to decide. Finally Sahadeva spoke up. He said "Certainly it is Acyuta, the Supreme God and chief of the Yādavas, who deserves the highest position. In truth, He Himself comprises all the gods worshiped in sacrifice, along with such aspects of the worship as the sacred place, the time and the paraphernalia. This entire universe is founded upon Him, as are the great sacrificial performances, with their sacred fires, oblations and mantras. Sāńkhya and yoga both aim toward Him, the One without a second. O assembly members, that unborn Lord, relying solely on Himself, creates, maintains and destroys this cosmos by His personal energies, and thus the existence of this universe depends on Him alone. He creates the many activities of this world, and thus by His grace the whole world endeavors for the ideals of religiosity, economic development, sense gratification and liberation. Therefore we should give the highest honor to Kr‌s‌n‌a, the Supreme Lord. If we do so, we will be honoring all living beings and also our own selves."*

Continues....
🌹 🌹 🌹 🌹🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 185 / DAILY WISDOM - 185 🌹*
*🍀 📖 మహాభారతం మరియు భగవద్గీత యొక్క ఆధ్యాత్మిక అంశాలు 🍀*
*✍️.  ప్రసాద్ భరద్వాజ*

*🌻 3. పురాణాలు సరైనవి, మనస్తత్వవేత్తలు చెప్పేవి కూడా సరైనవే 🌻*

*పురాణాలలో వర్ణించబడిన దేవతలు మరియు అసురులు వ్యక్తులలో మానసిక క్రియల యొక్క ఉపమానాలు అని తరచుగా ప్రజలు చెబుతారు. ఇవన్నీ కృత్రిమమైన, ఆధునికీకరించబడిన వివరణలు. అంటే వాళ్ళ వాస్తవికత అనేది జీవితంలోని ఒక విభాగానికి మాత్రమే పరిమితమై ఉంటుంది. వ్యక్తిగత మనస్తత్వానికి విశ్వ ప్రతిరూపం లేదని మనం చెప్పలేము. పురాణాలు సరైనవి; మనస్తత్వవేత్తలు చెప్పేది కూడా సరైనదే. సుషుమ్నా నాడి రూపంలో మనలో గంగ ప్రవహిస్తోంది, ఇడ మరియు పింగళ రూపంలో యమునా మరియు సరస్వతి ప్రవహిస్తున్నాయి అనేది నిజం.*

*ఇక్కడ లాభం కోసం చెప్పేది ఏదీ లేదు; అది పూర్తిగా నిజం. కానీ బయటి గంగ కూడా ఉంది; మనం దానిని తిరస్కరించలేము. బయటి ప్రపంచం మరియు లోపల ప్రపంచం వాస్తవికత యొక్క ఒకే మిశ్రమ నిర్మాణం యొక్క రెండు ముఖాలు. కాబట్టి దేవతలు మరియు అసురుల మధ్య యుద్ధం ప్రతి ప్రాంతంలో మరియు జీవితంలోని ప్రతి దశలో జరుగుతుంది. ఇది స్వర్గంలో జరుగుతుంది, ఇది విశ్వంలో జరుగుతుంది, ఇది సమాజంలో జరుగుతుంది మరియు ఇది మనలోనే జరుగుతుంది. మహాభారతం కేవలం కొన్ని శతాబ్దాల క్రితం జరిగిన మానవ సంఘటనల చిత్రణ మాత్రమే కాదు-అయితే అది కూడా.*

*కొనసాగుతుంది...*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 DAILY WISDOM - 185 🌹*
*🍀 📖 The Spiritual Import of the Mahabharata and the Bhagavadgita 🍀*
📝 Swami Krishnananda
📚. Prasad Bharadwaj

*🌻 3. The Puranas are Right, the Psychologists also are Right 🌻*

*Often people say the Devas and the Asuras described in the Puranas are allegories of psychological functions in individuals. These are all artificial, modernised interpretations, under the impression that reality is confined to one section of life alone. We cannot say that there is no cosmic counterpart of the individual psyche. The Puranas are right; the psychologists also are right. It is true that there is a Ganga flowing in us in the form of the sushumna nadi, and there are the Yamuna and the Saraswati in the form of the ida and pingala.*

*There is no gainsaying; it is perfectly true. But there is also an outward Ganga; we cannot deny it. The world outside and the world inside are two faces of the single composite structure of reality. So the battle between the Devas and the Asuras takes place in every realm and every phase of life. It takes place in the heavens, it takes place in the cosmos, it takes place in society, and it takes place within ourselves. The Mahabharata is not merely a depiction of a human series of events that happened some centuries back—though it is also that.*

Continues...
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శివ సూత్రములు - 188 / Siva Sutras - 188 🌹*
*🍀. శివ ఆగమ తత్వశాస్త్రం యొక్క సూత్రములు 🍀*
*3వ భాగం - ఆణవోపాయ*
*✍️. ప్రసాద్‌ భరధ్వాజ*

*🌻 3-19. క వర్గాదిశు మహేశ్వర్యాద్యః పశుమాతరః - 3 🌻*

*🌴. మహేశ్వరి మరియు ఇతర 'క' శక్తుల సమూహంలోని వారు మాయచే కప్పబడిన పశు లేదా జంతు స్వభావంతో జన్మించిన జీవులకు తల్లులు అవుతారు. 🌴*

*ఇంతకుముందు, అతనికి అన్ని అభిరుచులు, అన్ని వాసనలు మొదలైనవి ఒకే విధంగా ఉండేవి. ఇప్పుడు అతను ఇది రుచికరమైనది, ఈ సువాసన అద్భుతం, ఇంకా చెప్పాలంటే అతను ఇప్పుడు విభిన్న జ్ఞానాన్ని కలిగి ఉంటాడు. శివుని యొక్క అత్యున్నత శక్తిని పరమేశ్వరి అని పిలుస్తారు, అతను సంకల్పం, జ్ఞానం మరియు క్రియలతో విశ్వాన్ని నియంత్రిస్తాడు. అది ఒకదాని తర్వాత ఒకటి వ్యక్తమవుతుంది. చివరికి ప్రాపంచిక వ్యక్తీకరణలకు వరకూ విచ్ఛిన్నమవుతుంది. ఆశించే వాడు జాగ్రత్తగా ఉండకపోతే, అతను తన అత్యున్నత స్థాయి స్పృహ నుండి పడిపోతాడు, దాని ఫలితంగా అతను యోగి దశ నుండి పశువు దశకు చేరతాడు.*

*కొనసాగుతుంది...*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Siva Sutras  - 188 🌹*
*🍀Aphorisms of philosophy of Shiva āgama 🍀*
*Part 3 - āṇavopāya*
*✍️. Acharya Ravi Sarma, 📚. Prasad Bharadwaj*

*🌻 3-19. kavargādisu māheśvaryādyāh paśumātarah - 3 🌻*

*🌴. Mahesvari and others of the “ka” group of shaktis become mothers of pashu's or beings who are born with animal nature, veiled by maya. 🌴*

*Previously, all tastes, all smells, etc were the same for him. Now he says this is delicious, this fragrance is awesome, etc. In other words he now possesses differentiated knowledge. Supreme energy of Śiva is known as Parameśvarī who controls the universe with will, knowledge and action that manifests one after the other, ultimately breaking down to mundane manifestations. If the aspirant is not careful, he is bound to fall from his highest level of consciousness, as a result of which he becomes a paśu from the stage of a yogi.*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
#నిత్యసందేశములు #DailyMessages 
Join and Share 
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
https://t.me/+9zDjTpPe_PQzMWVl
https://t.me/Sivasutras
https://t.me/Seeds_Of_Consciousness
https://t.me/bhagavadgeethaa/
https://t.me/AgniMahaPuranam
https://t.me/+LmH1GyjNXXlkNDRl
http://www.facebook.com/groups/srilalithachaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/
https://prasadbharadwaj.wixsite.com/dailybhaktimessages3