1) 🌹 శ్రీమద్భగవద్గీత - 640 / Bhagavad-Gita - 640🌹
2) 🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 290, 291 / Vishnu Sahasranama Contemplation - 290, 291🌹
3) 🌹 Daily Wisdom - 59🌹
4) 🌹. వివేక చూడామణి - 23🌹
5) 🌹Viveka Chudamani - 23🌹
6) 🌹. దేవాపి మహర్షి బోధనలు - 33🌹
7) 🌹. వాస్తవమే ధైర్యస్థైర్యాలిస్తుంది 🌹
🍀. ‘స్వేచ్ఛ. మీరనుకుంటున్నది కాదు’ నుంచి ( ఓషో బోధ ) 🍀
8) 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 210 / Sri Lalita Chaitanya Vijnanam - 210🌹
9) 🌹 శ్రీమద్భగవద్గీత - 551 / Bhagavad-Gita - 551🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శ్రీమద్భగవద్గీత - 640 / Bhagavad-Gita - 640 🌹*
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ
*🌴. 18వ అధ్యాయము - మోక్ష సన్యాస యోగం - సన్న్యాసము యొక్క పూర్ణత్వము - 57 🌴*
57. చేతసా సర్వకర్మాణి మయి సన్న్యస్య మత్పర: |
బుద్ధియోగముపాశ్రిత్య మచ్చిత్త: సతతం భవ ||
🌷. తాత్పర్యం :
సర్వకర్మల యందు నా పైననే ఆధారపడి సదా నా రక్షణమునందే కర్మ నొనరింపుము. అట్టి భక్తియుతసేవలో సంపూర్ణముగా నా యందే చిత్తము కలవాడగుము.
🌷. భాష్యము :
మనుజుడు కృష్ణభక్తిభావన యందు వర్తించినపుడు తాను జగమునకు ప్రభువునన్న భావనలో వర్తించడు. వాస్తవమునకు ప్రతియొక్కరు సంపూర్ణముగా దేవదేవుడైన శ్రీకృష్ణుని నిర్దేశమునందు సేవకుని వలె వర్తించవలసియున్నది.
సేవకుడైనవాడు కర్మ విషయమున స్వతంత్రతను కలిగియుండక యజమాని ఆజ్ఞానుసారమే వర్తించవలసివచ్చును. అదే విధముగా దివ్య యజమానుడైన శ్రీకృష్ణుని తరపున వర్తించు సేవకుడు కర్మ యొక్క లాభనష్టములతో ప్రభావితుడు గాకుండును.
అతడు కేవలము తన విధ్యుక్తధర్మమును ఆ భగవానుని ఆజ్ఞానుసారము ఒనరించుచుండును. అర్జునుడు శ్రీకృష్ణుని ప్రత్యక్ష నిర్దేశమున వర్తించియుండెను. కాని శ్రీకృష్ణుడు లేని సమయమున మనుజడు ఎట్లు వర్తించవలెనని ఎవరైనను వాదించు అవకాశము కలదు.
ఈ గీతాగ్రంథమునందు శ్రీకృష్ణభగవానుడు తెలిపిన నిర్దేశానుసారము మరియు ఆ దేవదేవుని ప్రతినిధియైన గురువు యొక్క నేతృత్వములో మనుజుడు కర్మనొనరించినచో శ్రీకృష్ణుని ప్రత్యక్ష నిర్దేశములో వర్తించిన ఫలమే కలుగుననుట దానికి సమాధానము.
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Bhagavad-Gita as It is - 640 🌹*
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj
*🌴 Chapter 18 - Moksha Sanyasa Yoga - The Perfection of Renunciation - 57 🌴*
57. cetasā sarva-karmāṇi
mayi sannyasya mat-paraḥ
buddhi-yogam upāśritya
mac-cittaḥ satataṁ bhava
🌷 Translation :
In all activities just depend upon Me and work always under My protection. In such devotional service, be fully conscious of Me.
🌹 Purport :
When one acts in Kṛṣṇa consciousness, he does not act as the master of the world. Just like a servant, one should act fully under the direction of the Supreme Lord. A servant has no individual independence.
He acts only on the order of the master. A servant acting on behalf of the supreme master is unaffected by profit and loss. He simply discharges his duty faithfully in terms of the order of the Lord.
Now, one may argue that Arjuna was acting under the personal direction of Kṛṣṇa but when Kṛṣṇa is not present how should one act? If one acts according to the direction of Kṛṣṇa in this book, as well as under the guidance of the representative of Kṛṣṇa, then the result will be the same.
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #భగవద్గీత #BhagavadGita
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom Telegram group 🌹
https://t.me/ChaitanyaVijnanam
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 290, 291 / Vishnu Sahasranama Contemplation - 290, 291 🌹
📚. ప్రసాద్ భరద్వాజ
🌻290. భూతభవ్య భవన్నాథః, भूतभव्य भवन्नाथः, Bhūtabhavya bhavannāthaḥ🌻
ఓం భూతభవ్య భవన్నాథాయ నమః | ॐ भूतभव्य भवन्नाथाय नमः | OM Bhūtabhavya bhavannāthāya namaḥ
యో భూతభవ్యభవతాం భూతానాం నాథ ఈశ్వరః ।
తైర్యాచ్యతే తాంస్తపతి తేషామీష్టేచ శాస్తివా ।
భూతభవ్యన్నాథ ఇతి స ప్రోచ్యతే బుధైః ॥
గడచిన, గడువనున్న, గడచుచున్న కాలములందలి ప్రాణులకు రక్షచేయ శక్తుడు. ఈ మూడు విధములగు ప్రాణులచే ప్రార్థించ బడువాడు. వారిని ఉపతపింప అనగా స్వస్వకర్మానుసారము బాధించ సమర్థుడు. ఆ ప్రాణులను శాసించు అనగా స్వస్వప్రవృత్తులయందు ప్రవర్తిల్లునట్లు చేయువాడు..
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 290🌹
📚. Prasad Bharadwaj
🌻290. Bhūtabhavya bhavannāthaḥ🌻
OM Bhūtabhavya bhavannāthāya namaḥ
Yo bhūtabhavyabhavatāṃ bhūtānāṃ nātha īśvaraḥ,
Tairyācyate tāṃstapati teṣāmīṣṭeca śāstivā,
Bhūtabhavyannātha iti sa procyate budhaiḥ.
यो भूतभव्यभवतां भूतानां नाथ ईश्वरः ।
तैर्याच्यते तांस्तपति तेषामीष्टेच शास्तिवा ।
भूतभव्यन्नाथ इति स प्रोच्यते बुधैः ॥
One who is the master for all the beings of the past, future and present. He is the object of their prayers. He subjects them to ordeals as per their past deeds and He is their master. Or He is the one who exercises discipline, control etc., over them.
Śrīmad Bhāgavata - Canto 10, Chapter 46
Dr̥ṣṭaṃ śrutaṃ bhūtabhavadbhaviṣyat
Sthāsnuścariṣṇurmahadalpakaṃ ca,
Vinācyutādvastu tarāṃ na vācyaṃ
Sa eva sarvaṃ paramātmbhūtaḥ. (43)
:: श्रीमद्भागवते दशमस्कन्धे पूर्वार्धे षट्चत्वारिंशोऽध्यायः ::
दृष्टं श्रुतं भूतभवद्भविष्यत्
स्थास्नुश्चरिष्णुर्महदल्पकं च।
विनाच्युताद्वस्तु तरां न वाच्यं
स एव सर्वं परमात्म्भूतः ॥ ४३ ॥
Nothing can be said to exist independent of Lord Acyuta - nothing heard or seen, nothing in the past, present or future, nothing moving or unmoving, great or small. He indeed is everything, for He is the Supreme Soul.
🌻 🌻 🌻 🌻 🌻
Source Sloka
भूतभव्यभवन्नाथः पवनः पावनोऽनलः ।
कामहा कामकृत्कान्तः कामः कामप्रदः प्रभुः ॥ ३२ ॥
భూతభవ్యభవన్నాథః పవనః పావనోఽనలః ।
కామహా కామకృత్కాన్తః కామః కామప్రదః ప్రభుః ॥ ౩౨ ॥
Bhūtabhavyabhavannāthaḥ pavanaḥ pāvano’nalaḥ ।
Kāmahā kāmakr̥tkāntaḥ kāmaḥ kāmapradaḥ prabhuḥ ॥ 32 ॥
Continues....
🌹 🌹 🌹 🌹🌹
🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 291 / Vishnu Sahasranama Contemplation - 291🌹
📚. ప్రసాద్ భరద్వాజ
🌻291. పవనః, पवनः, Pavanaḥ🌻
ఓం పవనాయ నమః | ॐ पवनाय नमः | OM Pavanāya namaḥ
పవనః, पवनः, Pavanaḥ
పవనః పవతామస్మిత్యుక్తేర్గీతాసు యోహరిః ।
భగవాన్ పవతే యస్మాత్తస్మాత్స పవనః స్మృతః ॥
'పవిత్రతను కలిగించువానిలో వాయువు నేనే' అని భగవద్గీతయందు భగవద్‍వచనము. పవిత్రతను కలిగించువాడు. వాయు రూపుడు.
:: శ్రీమద్భగవద్గీత - విభూతి యోగము ::
పవనః పవతామస్మి రామశ్శస్త్రభృతామహమ్ ।
ఝుషాణాం మకరశ్చాస్మి స్రోతసామస్మి జాహ్నవీ ॥ 31 ॥
నేను పవిత్రమొనర్చువారిలో వాయువును, ఆయుధమును ధరించినవారిలో శ్రీరామచంద్రుడను, చేపలలో మకరమును, నదులలో గంగానదిని అయియున్నాను.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 291🌹
📚. Prasad Bharadwaj
🌻291. Pavanaḥ🌻
OM Pavanāya namaḥ
Pavanaḥ pavatāmasmityuktergītāsu yohariḥ,
Bhagavān pavate yasmāttasmātsa pavanaḥ smr̥taḥ.
पवनः पवतामस्मित्युक्तेर्गीतासु योहरिः ।
भगवान् पवते यस्मात्तस्मात्स पवनः स्मृतः ॥
Makes blow as the wind. One who is the purifier. Says the Gīta.
Śrīmad Bhagavad Gīta - Chapter 10
Pavanaḥ pavatāmasmi rāmaśśastrabhr̥tāmaham,
Jhuṣāṇāṃ makaraścāsmi srotasāmasmi jāhnavī. (31)
:: श्रीमद्भगवद्गीत - विभूति योगमु ::
पवनः पवतामस्मि रामश्शस्त्रभृतामहम् ।
झुषाणां मकरश्चास्मि स्रोतसामस्मि जाह्नवी ॥ ३१ ॥
Of the purifiers I am air; among the wielders of weapons I am Rāma. Among fishes too, I am the shark; I am Gangā among rivers.
🌻 🌻 🌻 🌻 🌻
Source Sloka
भूतभव्यभवन्नाथः पवनः पावनोऽनलः ।
कामहा कामकृत्कान्तः कामः कामप्रदः प्रभुः ॥ ३२ ॥
భూతభవ్యభవన్నాథః పవనః పావనోఽనలః ।
కామహా కామకృత్కాన్తః కామః కామప్రదః ప్రభుః ॥ ౩౨ ॥
Bhūtabhavyabhavannāthaḥ pavanaḥ pāvano’nalaḥ ।
Kāmahā kāmakr̥tkāntaḥ kāmaḥ kāmapradaḥ prabhuḥ ॥ 32 ॥
Continues....
🌹 🌹 🌹 🌹🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #విష్ణుసహస్రనామములు #VishnuSahasranama
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom Telegram group 🌹
https://t.me/ChaitanyaVijnanam
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹 DAILY WISDOM - 59 🌹*
*🍀 📖 Philosophy of Yoga 🍀*
📝 Swami Krishnananda
📚. Prasad Bharadwaj
*🌻28. Science Cannot Give Us Knowledge 🌻*
What is knowledge? It is an assimilation of the object into the consciousness. If I assimilate you in my consciousness, I know you, but if you stand outside as a stranger to me, as an object which is totally independent of me, I cannot know you. All knowledge is participation in the content thereof.
Participation implies our capacity to enter into the nature of the object, and the capacity in the object to enter into the nature of our being, our knowledge; that is mutual assimilation of the nature of things. If I stand outside you totally and you stand outside me wholly, there would be no concourse between the two. I cannot know you and you cannot know me.
This is what has happened to the scientific observations of modern times. If science is an observation of objects, regarding them as objects having nothing to do with the subjects which observe them, then science cannot give us knowledge.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #DailyWisdom #SwamiKrishnananda
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom Telegram group 🌹
https://t.me/ChaitanyaVijnanam
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. వివేక చూడామణి - 23 🌹*
✍️. రచన : సద్గురు పేర్నేటి గంగాధర రావు
📚. ప్రసాద్ భరద్వాజ
*🍀. పంచభూతాలు - 6 🍀*
89. జీవాత్మ తాను ఈ శరీరమును ఆవాసముగా పొంది, తాను వేరైనప్పటికి, ప్రాపంచిక వస్తు సముధాయమును, మాలలు, సుగంధ ద్రవ్యాలు మొదలగు వాటితో శరీరము యొక్క బాహ్య అంగముల ద్వారా అనుభవించు చున్నది. అందువలన ఈ శరీరము మెలుకవ స్థితిలో ఆత్మకు ఒక ఆట వస్తువుగా ఉపయోగ పడుచున్నది.
90. ఈ భౌతిక శరీరము ఆత్మకు ఒక నివాస స్థానము. ఏలానంటే గృహానికి గృహ యజమాని వలె తాను ఈ ప్రాపంచిక వ్యవహారాలన్ని ఈ ఇంటి నుండే కొనసాగించినట్లు.
91. ఈ భౌతిక శరీరము పుట్టుక, పెరుగుదల, చావు అను వివిధ స్థితులతో; కుల, మత, భేదాలతో; రోగాలు వాటి నివారణ చర్యలు; దైవ పూజలు, అవమానాలు, గౌరవాలతో జీవిస్తున్నది.
92. పంచజ్ఞానేంద్రియాలైన కళ్ళు, ముక్కు, చెవి, నాలుక, చర్మములతో భౌతిక పరిజ్ఞానమును పొంది; నోరు, చేతులు, కాళ్ళు మొదలగు కర్మేంద్రియములతో వాటి వాటి ధర్మానుసారము అవి పనిచేయుచున్నవి.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #వివేకచూడామణి #VivekaChudamani
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom Telegram group 🌹
https://t.me/ChaitanyaVijnanam
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹 VIVEKA CHUDAMANI - 23 🌹*
✍️ Swami Madhavananda
📚. Prasad Bharadwaj
*🌻 Five Elements - 6 🌻*
89. Identifying itself with this form, the individual soul, though separate, enjoys gross objects, such as garlands and sandal-paste, by means of the external organs. Hence this body has its fullest play in the waking state.
90. Know this gross body to be like a house to the householder, on which rests man’s entire dealing with the external world.
91. Birth, decay and death are the various characteristics of the gross body, as also stoutness etc., childhood etc., are its different conditions; it has got various restrictions regarding castes and orders of life; it is subject to various diseases, and meets with different kinds of treatment, such as worship, insult and high honours.
92. The ears, skin, eyes, nose and tongue are organs of knowledge, for they help us to cognise objects; the vocal organs, hands, legs, etc., are organs of action, owing to their tendency to work.
Continues.....
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #వివేకచూడామణి #VivekaChudamani
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom Telegram group 🌹
https://t.me/ChaitanyaVijnanam
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. దేవాపి మహర్షి బోధనలు - 33 🌹*
✍️. సద్గురు కె. పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
*🌻 24. పూర్వకథ - 2 🌻*
మానవుని పూర్వ వృత్తాంతము, భూగోళపు చరిత్ర తెలియుటకు బాహ్య పరిశోధనలతోపాటు అంతశ్శోధన కూడ చాల ముఖ్యము. అంతశ్శోధనలో కలుగు దర్శనముల ఆధారముగా బాహ్య పరిశోధనలు నిర్వర్తించుకొన్నచో సూక్ష్మ విషయములు తెలియగలవు. ఒకప్పటి శిఖరములు ఇప్పుడు సముద్ర గర్భమున నున్నవి.
ఇప్పటి ఉన్నత శిఖరములు ఒకప్పుడు సముద్ర గర్భములో నున్నవియే. ఈ భూమి యిప్పటికి రెండుమార్లు జలప్రళయమును, మరి రెండుమార్లు అగ్నిప్రళయమును చవిచూచినది! యుగముల మార్పిడి జరిగినపుడెల్ల కొన్ని నాగరికతలు, కొన్ని భూభాగములు అదృశ్యమై పరిశోధనమునకు అందక నిలచును. పూర్వము ఈ భూమిపై మూడు కన్నులు కల మానవులు యున్నారు. నాలుగు చేతులు, మూడు కన్నులు కలిగిన మానవులు కూడ జీవించిరి.
వారిని సంకేతించుటకే ద్వాపర మున శిశుపాలుడు వికృత రూపమున జన్మించెననియు, కృష్ణ స్పర్శచే అతనికి అప్పుడు జనబాహుళ్యమునకుండిన రూప మేర్పడినదనియు తెలుపబడినది.
పూర్వమేవిధముగ భూఖండములు మార్పు చెందినవో ఇక ముందుకూడ అట్లు మార్పులు చెందుట సంభవము. మానవాకారములకు కూడ ఇట్టి మార్పులు తప్పనిసరి. మార్పు సృష్టియొక్క సహజ లక్షణము కదా!
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #దేవాపిమహర్షిబోధనలు #సద్గురుపార్వతీకుమార్
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom Telegram group 🌹
https://t.me/ChaitanyaVijnanam
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. వాస్తవమే ధైర్యస్థైర్యాలిస్తుంది 🌹*
*🍀. ‘స్వేచ్ఛ. మీరనుకుంటున్నది కాదు’ నుంచి ( ఓషో బోధ ) 🍀*
✍️. భరత్, 📚. ప్రసాద్ భరద్వాజ
మనోవైజ్ఞానిక విశ్లేషణ విజయ రహస్యమదే. అది చాలా చిన్నరహస్యమే అయినా, దాని మొత్తం రహస్యమంతా అదే.
మీ అచేతనంలో ఉన్న దానిని సచేతన స్థాయికి తెచ్చేందుకు, మీ ఉనికి చీకటి ప్రపంచంలో ఉన్న దానిని మీకు తెలిసేలా చేసేందుకు మనోవైజ్ఞానిక విశ్లేషకుడు చక్కగా సహాయపడతాడు. అప్పుడే వాటిని మీరు చూడగలరు, ఇతరులు కూడా చూడగలరు. అవి మీ దృష్టిలో పడగానే వాటికి మృత్యువు ఆసన్నమైనట్లే. మీలో గొప్ప మార్పులు రావాలంటే వాటిని మీరు ఏ ఒక్కరికి వివరించినా సరిపోతుంది. అప్పుడే అద్భుతాలు జరుగుతాయి.
మనోవైజ్ఞానిక విశ్లేషణకుని మీ వివరాలన్నీ ఎలాంటి దాపరికం లేకుండా చెప్తారు. మనోవైజ్ఞానిక విశ్లేషణలో మీరుచేసే పని అదే. కానీ, దానికీ పరిమితులుంటాయి. ఎవరికీ చెప్పకుండా రహస్యంగా ఉంచుతానని హామీ ఇచ్చినప్పుడే- అది మనోవైజ్ఞానిక విశ్లేషణకుని వృత్తి రంగంలో ఒక భాగం.
అలా ప్రమాణం చేసేవారు ఆ వృత్తిని స్వీకరిస్తారు- వాటిని మీరు ఏకాంతంలో అతనికి చెప్పేందుకు సిద్ధపడతారు. అంతా వృత్తిపరమైన పరిమితుల్లోనే జరుగుతుంది కాబట్టి, అది కొన్ని రోజుల్లో ముగించే పని కాదు. అయినా మీకు మేలు జరుగుతుంది. అందుకే మనో విశ్లేషణ చేసేందుకు కొన్ని సంవత్సరాలు పడుతుంది. అయినా అది ఎప్పటికీ పూర్తికాదు, పూర్తయిన దాఖలాలు కూడా ఇంతవరకు లేవు.
ఎందుకంటే, మీ మనో విశ్లేషకులు కూడా పూర్తిగా మనో విశ్లేషణ చేసుకున్నవారు కాదు. ఎందుకంటే, వారుకూడా కొన్ని నిబంధనల పరిమితులకు లోబడి చెప్పినవారే. అందుకే మనో విశ్లేషకుడు మీరు చెప్తున్నవి వినీవిననట్లుగా వింటారు. అయినా మీ మనోభారం తగ్గుతుంది. ఎందుకంటే, వాటిని అతడు ఎవరికీ చెప్పడు. అలా మీకు మేలు జరుగుతుంది.
మీరు మీ వాస్తవాలను- పరిమితులకు లోబడి ఎవరితోనో రహస్యంగా చెప్పడం కాకుండా- మీతో ధైర్యంగా చెప్పుకోగలిగితే మీరు ధార్మికులైనట్లే. సన్యాసమంటే అదే. మీ నగ్నత్వాన్ని మీరు తెలుసుకోవడమే సన్యాసం.
అది అన్నిరకాల పరిస్థితులలోను, సంబంధాలలోను- మీ భార్యతో, బంధువుతో, శత్రువుతో, స్నేహితునితో, అధికారితో, సేవకునితో-నిరంతరాయంగా చేసుకునే స్వీయ మనోవైజ్ఞానిక విశ్లేషణ. అలా మిమ్మల్నిమీరు తెలుసుకునే పనిలోముందు మీకు నిజంగా అనేక భయాలు కలుగుతాయి.
కానీ, త్వరలోనే మీరు మరింత శక్తిని పుంజుకోవడం ప్రారంభిస్తారు. ఎందుకంటే, ఒకసారి సత్యం బయటపడగానే అది మరింత బలపడుతుంది, అసత్యం అంతరిస్తుంది.
అలా బలపడిన సత్యంతో పాతుకుపోయిన మీరు కేంద్రంగా మారతారు. దానితో మీ వ్యక్తిత్వం అంతరించి మీ వాస్తవ స్వరూపం బయటపడుతుంది. అలా మీరు వాస్తవమైన విశిష్ట వ్యక్తిగా మారడం ప్రారంభిస్తారు.
సామాజిక ఆడంబరాల మెరుగులతో బయటినుంచి వేయబడ్డ ముసుగే మీ వ్యక్తిత్వం. అందుకే అది నకిలీ. మీ విశిష్ట అస్తిత్వమే మీ వాస్తవం. అదే అసలైనది. ఎందుకంటే, మిమ్మల్ని ఆ దేవుడే తయారుచేశాడు. అందుకే అది అద్భుతమైన శక్తితో చాలా పచ్చిగా, దృఢంగా, విశృంఖలంగా ఉంటుంది.
భయం చాలా సహజం. ఎందుకంటే, చిన్నప్పటినుంచే మీకు అవాస్తవాలు బోధించడం జరిగింది. మీరు వాటితోనే ఎక్కువగా గుర్తింపు పొందారు. వాటిని వదులుకోవాలంటే దాదాపు ఆత్మహత్య చేసుకుంటున్నట్లనిపిస్తుంది.
ఆ గుర్తింపు సంక్షోభంనుంచి బయట పడాలంటే భయంగానే ఉంటుంది. ఎందుకంటే, యాభై, అరవై ఏళ్ళపాటు ఒక రకమైన గుర్తింపుతో ఉన్న మీరు ఇప్పుడు జీవిత చరమాంకంలోకి ప్రవేశించారు.
- ఇంకాఉంది.
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #ఓషోబోధనలు
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom Telegram group 🌹
https://t.me/ChaitanyaVijnanam
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 210 / Sri Lalitha Chaitanya Vijnanam - 210 🌹*
*సహస్ర నామముల తత్వ విచారణ*
✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
మూల మంత్రము :
*🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁*
*🍀. పూర్తి శ్లోకము :*
*సర్వయంత్రాత్మికా, సర్వతంత్రరూపా, మనోన్మనీ |*
*మాహేశ్వరీ, మహాదేవీ, మహాలక్ష్మీ, ర్మృడప్రియా ‖ 53 ‖*
*🌻 210. 'మహాలక్ష్మీ' 🌻*
దేవి వైభవము అని అర్థము. శ్రీదేవి శక్తి స్వరూపిణిగ పార్వతిగను, వైభవరూపిణిగ లక్ష్మిగను, విద్యారూపిణిగ సరస్వతిగను ఆరాధింపబడుచున్నది. సృష్టి వైభవమే శ్రీమహాలక్ష్మి. మహాలుడను రాక్షసుని చంపినందున ఆమె మహాలస, మహాలక్ష్మి అని ప్రసిద్ధి చెందినది. ఆమె అత్యంత సౌందర్యవతి. సర్వమనోహరి కూడ.
ఎప్పుడునూ పదమూడు సంవత్సరముల వయస్సుగల కన్యగ ఆమె గోచరించును. భూమిపైన మహలక్ష్మి పడమటి సముద్ర తీరమున సహ్యాద్రి కొండచరియలలో వసించుచున్నదని పురాణములు తెలుపు చున్నవి. కరవీర పురమున కూడ వసించు చున్నదని పురాణములు తెలుపుచున్నవి. ప్రస్తుతమున ఈ కరవీరపురమును కోల్హాపూర్ అని పిలుచుచున్నారు.
లక్ష్మి అను పదమునకు సంకేతమని అర్థము కలదు. రూపము లన్నియూ సంకేతములే. ఇది ఉప్పు అని, ఇది పప్పు అని రూపమును బట్టే జీవులు గుర్తించు చుందురు. అట్లే ఇతడు ఇంద్రుడని, ఇతడు విష్ణువని రూపములనుబట్టే తెలియబడు చున్నది. కోటానుకోట్ల
రూపములుగ సృష్టి వున్నప్పటికిని అందరి జీవులను, లోకములను గుర్తించుటకు రూపమే ఆధారము. రూపములన్నియూ గుణములను పట్టి ఏర్పడుచున్నవి.
గుణములన్నియూ త్రిగుణముల నుండి పుట్టినవే. త్రిగుణములు శ్రీమాత యందు పుట్టినవి. మహాలక్ష్మి యనగా శ్రీమాత రూప సంపద. నీరును నీరుగా గుర్తించుటకు, అట్లే అగ్ని, వాయువు, ఆకాశములను గుర్తించుటకు, లోకములను, అందలి జీవులను గుర్తించుటకు ఆవశ్యకత ఎంతయూ కలదు. పులిని - పిల్లిని, కుక్కను - నక్కనూ భేద మెరిగి జీవించుటలో సదుపాయమున్నది.
రూపమును బట్టి గుణమును కూడ అంచనా వేయవచ్చును. పులిని - పిల్లిని అట్లే అంచనా వేయుచున్నాము. మానవుల యందు కూడ వివిధ స్వభావములను (గుణములు) బట్టియే వారి రూపము లేర్పడుచున్నవి. వికృత రూపములు వికృత గుణములను సంకేతించు చుండును. రామ లక్ష్మణులను జూచిన హనుమంతుడు వెంటనే వారిని దివ్యపురుషులుగా గుర్తించెను.
హనుమంతుని చూచిన శ్రీరాముడు అతనిని వెంటనే వేదవిదుడని గుర్తించెను. అట్లే విభీషణుని జూచిన హనుమంతుడు అతనిని సత్పురుషునిగ గుర్తించెను. సృష్టి యందు లక్ష్మీరూపములు, అలక్ష్మీ రూపములు కలవు. వానిని తెలియుటకే సాముద్రిక శాస్త్రము. అలక్ష్మీ రూపముల యందు రజస్తమస్సులు అధికమై యుండును. లక్ష్మీప్రద రూపములందు సత్త్వగుణ మబ్బును. సత్వగుణ మధిక మగుచున్నకొలదీ ఆరాధించు వారి రూపము కూడ తదనుగుణమైన అందము, ఆకర్షణము కలిగి యుండును.
కోతి రూపమున నుండిననూ హనుమంతుడు అందము గనే గోచరించును కదా! అట్లే గజముఖుడగు గణేశుడు. అట్లే ప్రమథ గణములు కూడ. ఇవి విశిష్టమగు లక్ష్మీ రూపములు.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 210 🌹*
*1000 Names of Sri Lalitha Devi*
✍️. Ravi Sarma
📚. Prasad Bharadwaj
*🌻 Mahālakṣmī महालक्ष्मी (210) 🌻*
The great (mahā) wife of Viṣṇu. Śiva manifests in the form of Viṣṇu for sustenance and His wife is Mahālakṣmī. Liṅga Purāṇa says that Mahālakṣmī is the mother of the universe.
“May Lakśmī who is endowed with all attributes, who has all three characteristics, who is the goodness that bestows all and who is omnipresent, dispel my sin” is a hymn in Liṅga Purāṇa. Mahālakṣmī also means a girl of thirteen years.
If Mahālakṣmī is worshipped on every 13th lunar day (trayodaśa) with Her bīja (śrīṃ- श्रीं), there will no dearth of prosperity and auspiciousness.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #లలితాదేవి #LalithaDevi #లలితాసహస్రనామ #LalithaSahasranama
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom Telegram group 🌹
https://t.me/ChaitanyaVijnanam
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శ్రీమద్భగవద్గీత - 551 / Bhagavad-Gita - 551 🌹*
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ
*🌴. 16వ అధ్యాయము - దైవాసుర స్వభావములు - 14 🌴*
14. అసౌ మయా హత: శత్రుర్హనిష్యే చాపరానపి |
ఈశ్వరోహమహం భోగి సిద్ధోహం బలవాన్ సుఖీ ||
🌷. తాత్పర్యం :
అతడు నా శత్రువు. అతనిని నేను వధించితిని. ఇతర శత్రువులు కూడా వధింప బడుదురు. నేనే సర్వమునకు ప్రభువును. నేనే భోక్తను. పూర్ణుడను, శక్తిమంతుడను మరియు సుఖిని నేనే. భాగ్యవంతులైన బంధువులతో కూడియుండు నేనే అత్యధిక ధనశాలిని.
🌷. భాష్యము :
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Bhagavad-Gita as It is - 551 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj
*🌴 Chapter 16 - The Divine and Demoniac Natures - 14 🌴*
14. asau mayā hataḥ śatrur
haniṣye cāparān api
īśvaro ’ham ahaṁ bhogī
siddho ’haṁ balavān sukhī
🌷 Translation :
He is my enemy, and I have killed him, and my other enemies will also be killed. I am the lord of everything. I am the enjoyer. I am perfect, powerful and happy. I am the richest man, surrounded by aristocratic relatives.
🌹 Purport :
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #భగవద్గీత #BhagavadGita
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom Telegram group 🌹
https://t.me/ChaitanyaVijnanam
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹