1) 🌹. నిత్య పంచాంగము Daily Panchangam, 06, ఫిబ్రవరి 2022 ఆదివారం, భాను వాసరే 🌹2) 🌹. శ్రీమద్భగవద్గీత - 154 / Bhagavad-Gita - 154 - 3-35 కర్మయోగము 🌹
3) 🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 552 / Vishnu Sahasranama Contemplation - 552🌹
4) 🌹 DAILY WISDOM - 230🌹
5) 🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 132 🌹
6) 🌹. మైత్రేయ మహర్షి బోధనలు - 69 🌹
7) 🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 1 ఉపోద్ఘాతము - 1 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శుభ ఆదివారం మిత్రులందరికీ 🌹*
*భాను వాసరే, 06, ఫిబ్రవరి 2022*
*మీకు ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని కోరుకుంటూ*
*ప్రసాద్ భరద్వాజ*
*🍀. ద్వాదశ ఆదిత్య ధ్యాన శ్లోకాలు - 5 🍀*
*🌟 5. ఇంద్రః –*
*ఇంద్రో విశ్వావసుః శ్రోతా ఏలాపత్రస్తథాఽంగిరాః |*
*ప్రమ్లోచా రాక్షసోవర్యో నభోమాసం నయంత్యమీ*
*సహస్రరశ్మిసంవీతం ఇంద్రం వరదమాశ్రయే |*
*శిరసా ప్రణమామ్యద్య శ్రేయో వృద్ధిప్రదాయకమ్*
🌻 🌻 🌻 🌻 🌻
*పండుగలు మరియు పర్వదినాలు :*
*స్కందషష్టి, Skanda Sashti*
*🍀. నేటి సూక్తి : మనిషి తానైనదానికి, తాను కాని దానికి మధ్య తేడాను గుర్తించినప్పుడు మాత్రమే సత్యానికి చేరువ అవుతాడు. 🍀*
🌷🌷🌷🌷🌷
విక్రమ సంవత్సరం: 2078 ఆనంద
శఖ సంవత్సరం: 1943 ప్లవ,
ఉత్తరాయణం,
శిశిర ఋతువు, మాఘ మాసం
తిథి: శుక్ల షష్టి 28:39:14 వరకు
తదుపరి శుక్ల-సప్తమి
నక్షత్రం: రేవతి 17:11:55 వరకు
తదుపరి అశ్విని
యోగం: సద్య 16:53:41 వరకు
తదుపరి శుభ
కరణం: కౌలవ 16:12:03 వరకు
సూర్యోదయం: 06:46:31
సూర్యాస్తమయం: 18:13:47
వైదిక సూర్యోదయం: 06:50:12
వైదిక సూర్యాస్తమయం: 18:10:07
చంద్రోదయం: 10:25:28
చంద్రాస్తమయం: 23:03:23
సూర్య సంచార రాశి: మకరం
చంద్ర సంచార రాశి: మీనం
వర్జ్యం: 29:26:00 - 42:24:16
మరియు 06:31:20 - 40:06:24
దుర్ముహూర్తం: 16:42:09 - 17:27:58
రాహు కాలం: 16:47:53 - 18:13:47
గుళిక కాలం: 15:21:58 - 16:47:53
యమ గండం: 12:30:09 - 13:56:04
అభిజిత్ ముహూర్తం: 12:08 - 12:52
అమృత కాలం: -
వర్ధమాన యోగం - ఉత్తమ ఫలం
17:11:55 వరకు తదుపరి ఆనంద
యోగం - కార్య సిధ్ధి
🌻 🌻 🌻 🌻 🌻
*🍀. నిత్య ప్రార్థన 🍀*
*వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ*
*నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా*
*యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా*
*తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం*
*తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ*
*విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.*
🌹🌹🌹🌹🌹
#పంచాగముPanchangam
#PANCHANGUM
#DAILYCalender
Join and Share
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://chat.whatsapp.com/EqnNZXIsHgS3n7FezzRz5T
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శ్రీమద్భగవద్గీత - 154 / Bhagavad-Gita - 154 🌹*
*✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద*
*📚. ప్రసాద్ భరద్వాజ*
*🌴. తృతీయ అధ్యాయము - కర్మ యోగము - 35 🌴*
*35. శ్రేయాన్ స్వధర్మో విగుణ: పరధర్మాత్ స్వనుష్టితాత్ |*
*స్వధర్మే నిధనం శ్రేయ: పరధర్మో భయావహ: ||*
🌷. తాత్పర్యం :
*పరధర్మము చక్కగా నిర్వహించుట కన్నను గుణరహితమైనను స్వధర్మమును ఆచరించుట ఉత్తమము. పరధర్మపాలనము హానికరమైనది కావున దానిని పాటించుట కన్నను స్వధర్మపాలనము నందు నాశనము పొందుటయైనను ఉత్తమమైనదే!*
🌷. భాష్యము :
ప్రతియొక్కరు పరధర్మమును నిర్వహించుటకు బదులు సంపూర్ణ కృష్ణభక్తిభావన యందు తమ విధ్యుక్తధర్మములను నిర్వహింపవలసియున్నది. భౌతికప్రకృతి యొక్క త్రిగుణముల ప్రభావములో మనుజుని స్థితి ననుసరించి విధింపబడిన ధర్మములే విధ్యుక్తధర్మములు.
ఇక శ్రీకృష్ణుని దివ్య సేవార్థమే ఆధ్యాత్మికగురువుచే ఒసగబడిన కర్మలు ఆధ్యాత్మికకర్మలు. భౌతికమైనను లేదా ఆధ్యాత్మికమైనను మరణము వరకు ప్రతియొక్కరు పరధర్మమును అనుసరించుటకు బదులు తమ విధ్యుక్తధర్మములను నిర్వహింపవలసియున్నది. ఆధ్యాత్మికస్థాయిలో ఒనరింపబడు కర్మలు మరియు భౌతికస్థాయిలో ఒనరింపబడు కర్మలు భిన్నమైనను ప్రామాణికమైన నిర్దేశమును అనుసరించుట కర్తకు సర్వదా లాభదాయకము.
గుణప్రభావము నందున్న మనుజుడు ఇతరులను అనుకరింప తన స్థితికి అనుగుణముగా విధింపబడిన నియమములను చక్కగా పాటింపవలెను. ఉదాహరణకు సత్వగుణము నందుండెడి బ్రాహ్మణుడు అహింసాపరుడుగా నుండును. కాని రజోగుణము నందుండెడి క్షత్రియుడు హింసాపూర్ణుడగుటకు ఆమోదయోగ్యమైనది. క్షత్రియుడైనవానికి హింసకు సంబధించిన నియమముల ననుసరించి నశించుట యనునది అహింసాపరుడైన బ్రహ్మణుని అనుకరించుట కన్నను ఉత్తమమైనది.
ప్రతియొక్కరు తమ హృదయకల్మషము క్రమవిధానము ద్వారా శుద్ధిపరచుకొనవలెనే గాని తొందరపాటుతో కాదు. అయినను గుణసంపర్కమును దాటి సంపూర్ణముగా కృష్ణభక్తిరసభావన యందు స్థితుడైన పిమ్మట మనుజుడు గురునిర్దేశములో ఎట్టి కర్మమునైనను ఒనరింప సమర్థుడగును. అట్టి సంపూర్ణ కృష్ణభక్తిభావనా స్థితి యందు క్షత్రియడు బ్రాహ్మణునిగా వర్తించవచ్చును. అలాగుననే బ్రాహ్మణుడు క్షత్రియునిగా వర్తించవచ్చును. అనగా అట్టి దివ్య ఆధ్యాత్మికస్థితి యందు భౌతికజగమునకు సంబంధించిన భేదములు ఏమాత్రము వర్తించవు.
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Bhagavad-Gita as It is - 154 🌹*
*✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada*
*📚 Prasad Bharadwaj*
*🌴 Chapter 3 - Karma Yoga - 35 🌴*
*35. śreyān sva-dharmo viguṇaḥ para-dharmāt sv-anuṣṭhitāt*
*sva-dharme nidhanaṁ śreyaḥ para-dharmo bhayāvahaḥ*
🌷 Translation :
*It is far better to discharge one’s prescribed duties, even though faultily, than another’s duties perfectly. Destruction in the course of performing one’s own duty is better than engaging in another’s duties, for to follow another’s path is dangerous.*
🌷 Purport :
One should therefore discharge his prescribed duties in full Kṛṣṇa consciousness rather than those prescribed for others. Materially, prescribed duties are duties enjoined according to one’s psychophysical condition, under the spell of the modes of material nature. Spiritual duties are as ordered by the spiritual master for the transcendental service of Kṛṣṇa. But whether material or spiritual, one should stick to his prescribed duties even up to death, rather than imitate another’s prescribed duties. Duties on the spiritual platform and duties on the material platform may be different, but the principle of following the authorized direction is always good for the performer.
When one is under the spell of the modes of material nature, one should follow the prescribed rules for his particular situation and should not imitate others. For example, a brāhmaṇa, who is in the mode of goodness, is nonviolent, whereas a kṣatriya, who is in the mode of passion, is allowed to be violent. As such, for a kṣatriya it is better to be vanquished following the rules of violence than to imitate a brāhmaṇa who follows the principles of nonviolence.
Everyone has to cleanse his heart by a gradual process, not abruptly. However, when one transcends the modes of material nature and is fully situated in Kṛṣṇa consciousness, he can perform anything and everything under the direction of a bona fide spiritual master. In that complete stage of Kṛṣṇa consciousness, the kṣatriya may act as a brāhmaṇa, or a brāhmaṇa may act as a kṣatriya. In the transcendental stage, the distinctions of the material world do not apply.
🌹 🌹 🌹 🌹 🌹
#భగవద్గీత #BhagavadGita
#చైతన్యవిజ్ఞానం #PrasadBhardwaj
https://t.me/bhagavadgeethaa/
www.facebook.com/groups/bhagavadgeethaa/
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://chat.whatsapp.com/EqnNZXIsHgS3n7FezzRz5T
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 552 / Vishnu Sahasranama Contemplation - 552 🌹*
*📚. ప్రసాద్ భరద్వాజ*
*🌻 552. సఙ్కర్షణః అచ్యుతః, सङ्कर्षणः अच्युतः, Saṅkarṣaṇaḥ Acyutaḥ 🌻*
*ఓం సఙ్కర్షణాచ్యుతాయ నమః | ॐ सङ्कर्षणाच्युताय नमः | OM Saṅkarṣaṇācyutāya namaḥ*
*సంహారకాలే యుగపత్ ప్రజాః సఙ్కర్షతీతిసః ।*
*న చ్యోతతి స్వరూపాత్స ఇతి సఙ్కర్షణోఽచ్యుతః ।*
*సఙ్కర్షణోఽచ్యుత ఇతి నామైకం సవిశేషణమ్ ॥*
*ప్రళయ సమయమున అఖిల ప్రాణులను తన దగ్గరకు లెస్సగా లాగికొనునుగనుక సంకర్షణః. తన స్థితినుండి తొలగడుగనుక అచ్యుతుడు. ఈ రెండు నామములును కలిసి సవిశేషణము అగు ఒకే నామము.*
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
*🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 552🌹*
*📚. Prasad Bharadwaj*
*🌻 552. Saṅkarṣaṇaḥ Acyutaḥ 🌻*
*OM Saṅkarṣaṇācyutāya namaḥ*
संहारकाले युगपत् प्रजाः सङ्कर्षतीतिसः ।
न च्योतति स्वरूपात्स इति सङ्कर्षणोऽच्युतः ।
सङ्कर्षणोऽच्युत इति नामैकं सविशेषणम् ॥
*Saṃhārakāle yugapat prajāḥ saṅkarṣatītisaḥ,*
*Na cyotati svarūpātsa iti saṅkarṣaṇo’cyutaḥ,*
*Saṅkarṣaṇo’cyuta iti nāmaikaṃ saviśeṣaṇam.*
*At the time of annihilation of the worlds, He draws all beings to Himself and hence He is Saṅkarṣaṇaḥ. As He does not slide down from His nature and is infallible, He is Acyutaḥ. Saṅkarṣaṇācyutaḥ is one name with an adjective.*
🌻 🌻 🌻 🌻 🌻
Source Sloka
वेदास्स्वाङ्गोऽजितःकृष्णो दृढस्सङ्कर्षणोऽच्युतः ।
वरुणो वारुणो वृक्षः पुष्कराक्षो महामनाः ॥ ५९ ॥
వేదాస్స్వాఙ్గోఽజితఃకృష్ణో దృఢస్సఙ్కర్షణోఽచ్యుతః ।
వరుణో వారుణో వృక్షః పుష్కరాక్షో మహామనాః ॥ 59 ॥
Vedāssvāṅgo’jitaḥkrṣṇo drḍassaṅkarṣaṇo’cyutaḥ,
Varuṇo vāruṇo vrkṣaḥ puṣkarākṣo mahāmanāḥ ॥ 59 ॥
Continues....
🌹 🌹 🌹 🌹🌹
#విష్ణుసహస్రనామతత్వవిచారణ #విష్ణుసహస్రనామములు #VishnuSahasranama #PrasadBhardwaj
https://t.me/vishnusahasranaam
www.facebook.com/groups/vishnusahasranaam/
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://chat.whatsapp.com/
https://incarnation14.wordpress.com/
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹 DAILY WISDOM - 230 🌹*
*🍀 📖 from Lessons on the Upanishads 🍀*
*📝 Swami Krishnananda*
*📚. Prasad Bharadwaj*
*🌻 17. Everybody Uses the Word ‘Self' 🌻*
*When we speak of the soul, we do not know what it is that we are speaking about, finally. It is a nebulous, flimsy, slippery object. What are we talking about when we say “self”? Everybody uses the word ‘self'. “I myself I have done this work.” “He himself is responsible for that mistake.” Do we not use the word ‘self' in this manner? We are very well acquainted with the use of the word ‘self': myself, yourself, himself, herself, itself—everywhere this ‘self' comes in. It is so common in our daily life that we do not see any special significance in that usage at all. We do not see the significance because we do not know the meaning of the word ‘self', and no dictionary gives us the correct meaning of this word.*
*Even if the dictionary says it is you, one's own Self, the basic Reality, the Atman, these are only words which will mean as little as the word ‘self' itself. This is because here is a question of the handling of one's self by one's Self. You may ask me: “Why should I handle my self when there are more important things in the world? The world is so rich and beautiful and grand and vast; instead of that I handle my self? What is the great thing that I am going to gain out of it?” Terrible is the problem. If you have answers and questions of this kind and you have doubts as to why this Self is to be considered as so important, you will not be immediately fit for the knowledge of the Upanishads.*
*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹
#DailyWisdom #SwamiKrishnananda
#PrasadBhardwaj
https://t.me/Seeds_Of_Consciousness
www.facebook.com/groups/dailysatsangwisdom/
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://chat.whatsapp.com/EqnNZXIsHgS3n7FezzRz5T
https://pyramidbook.in/Chaitanyavijnanam
https://incarnation14.wordpress.com/
https://dailybhakthimessages.blogspot.com
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 132 🌹*
*✍️. సౌభాగ్య*
*📚. ప్రసాద్ భరద్వాజ*
*🍀. మార్మికుడు దేవుడికి సంబంధించిన విషయంలో మౌనంగా వుంటాడు. కారణం నిజమైన దేవుడు నిశ్శబ్దంలో మాత్రమే అనుభవానికి వస్తాడు. కాబట్టి దేవుడికి సంబంధించిన అభిప్రాయాల్ని వదిలిపెట్టి మరింత మరింత నిశ్శబ్దంగా మారు. 🍀*
*నీకు కొంత తెలివితేటలు వుంటే చాలు. నిన్ను ఏ మతమూ సంతృప్తి పరచలేదు. అన్ని మతాల్లో అలవిమీరిన తెలివి తక్కువ తనముంది. నిజమైన మార్మికుడు దేవుడికి సంబంధించిన విషయంలో మౌనంగా వుంటాడు. కారణం నిజమైన దేవుడు నిశ్శబ్దంలో మాత్రమే అనుభవానికి వస్తాడు. కాబట్టి దేవుడికి సంబంధించిన అభిప్రాయాల్ని వదిలిపెట్టి మరింత మరింత నిశ్శబ్దంగా మారు.*
*నిశ్శబ్దం సంపూర్ణ నిశ్శబ్దంలా మారినపుడు నువ్వు ఆశ్చర్యానికి లోనవుతావు. నువ్వు అతని పదధ్వనుల్ని వినవు. ఒక క్షణం అతనక్కడ వుండడు. యింకో క్షణం వుండదు. నువ్వు అతనితో కలిసి సాగుతావు. నువ్వు వెనుకటిలా వుండవు. అంతే కాదు అప్పుడు ఈ ప్రపంచం కూడా వెనకటిలా వుండదు.*
*సశేషం ...*
🌹 🌹 🌹 🌹 🌹
#ఓషోబోధనలు #OshoDiscourse #OshoDailyMeditations #ఓషోనిర్మలధ్యానములు #PrasadBhardwaj
https://t.me/ChaitanyaVijnanam
http://www.facebook.com/groups/oshoteachings/
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://chat.whatsapp.com/EqnNZXIsHgS3n7FezzRz5T
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. మైత్రేయ మహర్షి బోధనలు - 69 🌹*
*✍️. రచన : సద్గురు కె. పార్వతి కుమార్*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*🌻 55. కృషి కర్మ 🌻*
*సహకారము, సోదరభావము ఉండవలెనని, ఇది కరవగు చున్నదని ప్రతి ఆధ్యాత్మిక సంస్థయందు సభ్యులు వాపోవుచుందురు. ఈ వాపోవుట తల వాచిపోవుట వరకు జరుగును. కాని పరిష్కారము మాత్రము లభింపదు. సహకారము, సోదరభావము కోరినంత మాత్రమున లభింపవు. మానవునికి మొదటినుండి కోరుట యందే ఆసక్తి గాని, కోరిన దానిని పొందుటకు వలసిన క్రమశిక్షణ, దీక్ష, మనోనియతి, వాజ్నియతి ఉండవు. కోరినంత మాత్రమున ఏదియు లభింపదు. కోరిక ఫలించుటకు నిర్దిష్టమగు కార్య క్రమమును శ్రద్ధతో నిర్వర్తింపవలెను. అది చేయక ఊరక కోరి ఫలమేమి? శాంతి కావలెనని కోరుదురు. సంపద, సమృద్ధి కావలెనని కోరుదురు. కీర్తి కావలెనని కోరుదురు. ఆరోగ్యము కావలెనని కోరుదురు. మోక్షమును కూడ కోరుదురు. కోర్కెను తీవ్రము, తీవ్రతరము కూడ చేయుదురు.*
*కోరిక తీవ్రతరమగుటచే ఉద్రిక్తత ఏర్పడును గాని, పరిష్కారము రాదు. ఏమి కావలెనో తెలిసిన మానవుడు, దానినెట్లు పొందవలెనో తెలుసుకొనవలెను. తగువిధముగ తనను తాను నియంత్రించుకొన వలెను. క్రమశిక్షణ పాటించుచు ఆత్మ నియంత్రణకు లొంగియుండ వలెను. నిర్వర్తింపవలసిన కర్తవ్యమును దీక్షతో దీర్ఘకాలము అనుస రించవలెను. సూర్యచంద్రాదులు, పంచభూతములు, సృష్టిలోని సమస్త ప్రజ్ఞలు ఇట్లు క్రతుబద్ధముగ జీవించుచున్నవి. నిరంతర కృషి చిన్నతనమునుండి అభ్యాసము కావలెను. ఆ కృషి జీవితపు విలువలను గూర్చి ఉండవలెను. ఈ ప్రాథమిక సూత్రము నవలంబింపక ఏమి చేసినను నిష్ప్రయోజనము.*
*సశేషం.....*
🌹 🌹 🌹 🌹 🌹
#మైత్రేయమహర్షిబోధనలు #MaitreyaMaharshi #సద్గురుపార్వతీకుమార్ #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
www.facebook.com/groups/maharshiwisdom/
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom
https://chat.whatsapp.com/EqnNZXIsHgS3n7FezzRz5T
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 1 / Agni Maha Purana - 1 🌹*
*✍️. పుల్లెల శ్రీరామచంద్రుడు*
సేకరణ : ప్రసాద్ భరధ్వాజ
*ప్రథమ సంపుటము*
*🌻. ఉపోద్ఘాతము - 1 🌻*
ఇది అష్టాదశ మాహాపురాణాలలో ఒకటి. అగ్నిరూపుడైన శ్రీ మహావిష్ణువు నుండి ఆవిర్భవించడం చేత దీనికి "అగ్ని మహా పురాణము" అనే పేరు వచ్చినది.
అగ్నిదేవుడు వసిష్ఠునకు చెప్పిన ఈ పురాణాన్ని వ్యాసుడు ఆయన నుండి (వసిష్ఠుని నుండి) గ్రహించి తన శిష్యుడైన సూతునికి బోధించాడు. అగ్ని పురాణంలో 15000 శ్లోకాలున్నవని భాగవతంలోను, 16000 శ్లోకాలున్నవని మత్స్యపురాణంలోను చెప్పబడి ఉన్నది.
శ్లోక సంఖ్య12000 అని అగ్నిపురాణం లోనే 272వ అధ్యాయంలోనూ, 15000 అని చివరి అధ్యాయంలోను చెప్పబడి ఉన్నది. వాస్తవంలో ఉన్న శ్లోకాల సంఖ్య మాత్రం 11457 అయితే దీనిలో కొన్ని గద్య భాగాలు ఉన్నాయి. వాటిని 32 అక్షరాల శ్లోకాలుగా భాగించి లెక్క పెటితే దాదాపు 1000 శ్లోకాలు పెరగవచ్చును.
383 అధ్యాయాల ఈ మహాపురాణంలో పరాపర విద్యలకు సంబంధించిన అన్ని విషయాలు ఉన్నవనీ, అందుచేత ఒక విధంగా ఇది విజ్ఞాన సర్వస్వం అనీ అక్కడక్కడ చెప్పబడింది.
ఈ పురాణంలో మొత్తం 50 ప్రధాన విషయాలు చెప్పబడినట్లుగా చివరి అధ్యాయంలో ఉన్నది. "సర్గశ్చ ప్రతిసర్గశ్చ" ఇత్యాది పురాణ లక్షణం ప్రకారం ఈ పురాణంలో కూడా సృష్టి, అవాంతర సృష్టి లేదా ప్రళయము, దేవాదుల వంశాలు, మన్వంతరాలు, రాజవంశాలు అనే ఐదు విషయాలు ఉన్నాయి అని చెప్పినా ఈ విషయాలు అసంపూర్ణంగానే కనబడతాయి.
ఈ పురాణం వ్యాసరచితమైనదనే సంప్రదాయం ఉన్నది కాని ఆధునికులు మాత్రం అనేకమైన ఆంతరంగిక ప్రమాణాలను పురస్కరించుకొని దీని రచన క్రీ. శ. 700-900 సంవత్సరాల కాలంలో జరిగినట్లు భావిస్తున్నారు.
వైష్ణవ పాంచరాత్రము, భగవద్గీత మొదలైనవి పొందు పరచటం చేత ఈ పురాణానికి వైష్ణవచ్ఛాయ కల్పించడం జరిగింది. కృష్ణుని నారాయణునిగా, విష్ణువునుగా పూజించ వలెనని దీనిలో ప్రతిపాదింపబడింది.
అగ్ని విష్ణువుగాను, కాలాగ్నిగాను, రుద్రుడుగాను ప్రారంభాధ్యాయములలో వర్ణింపబడినాడు. "విష్ణువు, అగ్ని అనేవి ఒక దేవత యొక్క రెండు రూపాలు. ఈ పురాణంలో విష్ణువే అగ్నిగా స్తుతింపబడినాడు" అని 174వ అధ్యాయంలో చెప్పబడింది.
అగ్ని విష్ణువు యొక్క రూపాంతరమే. సర్వ పాపాలను దహించ కలిగిన ఈ అగ్నిని ధ్యానించి, పూజించి, స్మరించి, స్తుతించాలి. అయితే ఈ పురాణంలో శైవాగమానికి సంబంధించిన విషయాలు, శివలింగపూజ, తాంత్రిక పూజా విధానాలు కూడా చెప్పబడి ఉన్నాయి.
సశేషం....
🌹🌹🌹🌹🌹
*🌹 Agni Maha Purana -1🌹*
*✍️ N. Gangadharan*
*📚. Prasad Bharadwaj*
*🌻. INTRODUCTION -1🌻*
Introduction
Agni Purana, one of the major eighteen Puranas, contains descriptions and details of various incarnations (avatars) of Vishnu. It also has details account about Rama, Krishna, Prithvi, and the stars. It has a number of verses dealing with ritual worship, cosmology, history, warfare, and even sections on Sanskrit grammar, meter, law, medicine, and martial arts. Tradition has it that it was originally recited by Agni to the sage Vasishta.
Its composition is either dated to the 8th-9th century or the 10th-11th century
Agni Purana is the celebration of Agni the Fire God. He is the most revered deity among Hindu pantheons. Numerous hymns have been dedicated to Him in Vedas. Agni is closest to mankind among all divine icons because of its indispensability in daily life. That is why it is worshipped more at home than in temples. This scripture will introduce Agni with its multi-dimensional grandaunt from birth to death.
Hindu Puranas are the best fusion of Indian ethos and literature. They contain the triumphs and tribulations of mankind. The Eighteen Puranas relate the tales of duty and action, sins and virtues through the life and events of divine icons.
The contents of Agni Puran
The presently available Agni Purana consists 383 chapters. The last chapter of the text gives a list of fifty topics discussed in the text. After the customary opening (chapter 1), the text describes the ten avataras of Vishnu in detail.
Chapters 2-4 deal with the Matsya, the Kurma and the Varaha avatars respectively.
Next seven chapters (5-11) are the summaries of the seven Kandas of the Ramayana.
Chapter 12 is a summary of the Harivamsha.
Chapters 13-15 narrate the story of the Mahabharata.
Chapter 16 describes Buddha and Kalki as the avatars of Vishnu.
Chapters 17-20 describe the five essential characteristics of a Purana.
🌹🌹🌹🌹🌹
#అగ్నిపురాణం #శ్రీమదగ్నిమహాపురాణం #AgniMahaPuranam #చైతన్యవిజ్ఞానం
Join and Share
🌹 అగ్ని మహా పురాణము చానెల్ 🌹Agni Maha Purana
https://t.me/AgniMahaPuranam
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom www.facebook.com/groups/hindupuranas/
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹