శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 349-2 / Sri Lalitha Chaitanya Vijnanam - 349-2
🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 349-2 / Sri Lalitha Chaitanya Vijnanam - 349-2 🌹
🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻
✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
మూల మంత్రము :
🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁
🍀 77. విజయా, విమలా, వంద్యా, వందారు జనవత్సలా ।
వాగ్వాదినీ, వామకేశీ, వహ్నిమండల వాసినీ ॥ 77 ॥ 🍀
🌻 349-2. 'వందారు జనవత్సలా' 🌻
భక్తి మార్గమున జీవనయాత్ర సాగించువారు ఎవరికి నమస్కారము చేయుటకైననూ సంసిద్ధులై యుందురు. అందులకే భక్తుల విషయమున భగవత్ తత్త్వము కూడ అమిత వాత్సల్యము కలిగి యుండును. 'వసుదేవుడు గాడిద కాళ్ళు పట్టుకొనే' నని సామెత కలదు. వసుదేవుడు అనన్య భక్తియుతుడు. అతని కందరి యందు దైవమే గోచరించును. అత్యంత పవిత్రమూర్తి. సంస్కారవంతుడైన వసుదేవుడు దురహంకారియైన కంసుని, దేవకిని రక్షించుకొనుటకై గాడిద కాళ్ళు పట్టుకొనుటకు కూడ వెనుకాడలేదు.
వసుదేవుని ఈ చర్యయే శ్రీకృష్ణ అవతారమునకు తెర తొలగించినది. భక్త జను లనగా అంతర్యామియైన దైవమును అందరి యందు దర్శించుచూ దైవ సంకల్పమును నిర్లిప్తతతో నిర్వర్తించువారు. అట్టి వారియందు అమిత వాత్సల్యమును శ్రీమాత చూపును. శ్రీకృష్ణుడు అంతర్యామి దైవమే. అతడు అర్జునునితో ఇట్లు పలికెను. “అర్జునా! నేను వైకుంఠమునందు అప్పసము (ఎల్లవేళలా) వుండను. యోగుల హృదయములందు కూడ నిరంతర ముండను. నన్ను సతతము స్మరించు భక్తులతో మాత్రమెప్పుడునూ ఉందును.”
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 349-2 🌹
Contemplation of 1000 Names of Sri Lalitha Devi
✍️. Acharya Ravi Sarma
📚. Prasad Bharadwaj
🌻 77. Vijaya vimala vandya mandaru janavatsala
Vagvadini vamakeshi vahni mandala vasini ॥ 77 ॥ 🌻
🌻 349. Vandāru-jana-vatsalā वन्दारु-जन-वत्सला (349) 🌻
This can be considered as an extension of the previous nāma. She loves Her devotees like a mother who loves her children. The vibration of love is emanated through one’s body like fragrance of a flower. Because of caring and loving nature also She is known as Vimalā (nāma 347). One can notice this in daily life. When one serves food for his dog, by impulse he develops love for his dog and this is radiated through his body. The dog reads his vibrations and feels his love and wags its tail as a token of reciprocating his love.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
17 Feb 2022
మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 151
🌹. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 151 🌹
✍️. రచన : సద్గురు ఇ. కృష్ణమాచార్యులు
📚 . సేకరణ : ప్రసాద్ భరద్వాజ
🌻. భాగవతము-అనుభూతి -2 🌻
ధర్మము కన్నా ధనము, అధికారము, కీర్తి, ఐహికముగా పైకి వచ్చుట వీటికే ప్రాధాన్యమొసగి మందబుద్ధులయి, జడులై అల్పాయుష్కులగుట తప్పదు. వీరికి కావలసినవి సుఖశాంతులు. కాని సుఖశాంతులను ఏ విషయమొసంగునో, ఇవి ఎట్లు లభించునో వీరికి తెలియదు. సుఖశాంతులను కలిగించునది దైవానుభూతి ఒక్కటే. ఇట్టి అనుభూతికి సులభము, తీయనైన బోధయుండవలయును.
వేదాంత గ్రంధములకు ఇట్టి సమర్థత లేదు. ఇంద్రియముల ఆకర్షణకు లోనై జీవించువారిని ఈ అనుభూతిని అందించుటకు అంతకన్నా గొప్పదయిన, మధురమయిన ఆకర్షణ వైపు లాగవలెను. అందుకే నారదుడు వ్యాసునకు భాగవతమును ఉపదేశించి వ్రాయించెను.
... ..✍️ మాస్టర్ ఇ.కె.🌻
🌹 🌹 🌹 🌹 🌹
17 Feb 2022
శ్రీ శివ మహా పురాణము - 521
🌹 . శ్రీ శివ మహా పురాణము - 521 🌹
రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ
🌴. రుద్ర సంహితా - పార్వతీ ఖండః 🌴
అధ్యాయము - 44
🌻. మేన యొక్క మంకు పట్టు - 7 🌻
బ్రహ్మ ఇట్లు పలికెను -
అపుడు మేనక ఈ తీరున పరిపరి విధముల దుఃఖించి బిగ్గరగా రోదించెను. ఓ మునీ! ఆమె మనస్సు దుఃఖముతో నిండియుండెను (72). అపుడు నేను వెంటనే అచటకు వచ్చి దుష్ట జ్ఞానమును హరించి వేయు ఉత్తమమైన పరమ శివతత్త్వమును ఆ మేనకకు బోధించితిని (73).
ఓ మేనా! నా శుభకరములగు పలుకులను ప్రీతితో వినుము. నా మాటను శ్రద్ధగా విన్నచో, నీ చెడు బుద్ధి నశించును (74). జగత్తును సృష్టించి, పోషించి, లయము చేయునది శంకరుడే. నీవు ఆయన రూపమును ఎరుంగవు. ఆయన దుఃఖమునకు నిలయుడని నీవు ఎట్లు ఊహించుచున్నావు? (75)
ఆ ప్రభుడు అనేక నామ రూపములతో వివిధ లీలలను చూపుచుండును. ఆ సర్వేశ్వరుడు స్వతంత్రుడు. మాయకు ప్రభువు. అద్వితీయుడు (76). ఓ మేనా! నీవీ సత్యము నెరింగి శివునకు ఇమ్ము. చెడు పట్టుదలను, సర్వకార్యములను పాడు జేయు జ్ఞానమును విడిచిపెట్టుము (77) ఓ మునీ! ఈ నా మాటను విని ఆ మేన పరిపరి విధముల విలపించుచూ సిగ్గును కొద్దిగా మెల్లగా విడిచి నాతో ఇట్లు పలికెను (78).
మేన ఇట్లు పలికెను -
ఓ బ్రహ్మా! నీవు ఈమె యొక్క గొప్ప రూపమును ఏల వ్యర్థము చేయ నిచ్చగించుచున్నావు? ఈమెను నీవె స్వయముగా సంహరించరాదా? (79). శివునకు ఇమ్మని నీవు నాకు చెప్పకుము. నాకు ప్రాణ ప్రియురాలగు ఈ నా కుమార్తెను నేను శివునకు ఈయను (80).
బ్రహ్మ ఇట్లు పలికెను -
ఓ మహర్షీ! ఆమె ఇట్లు చెప్పగా, అపుడు సనకాది సిద్ధులు ముందుకు వచ్చి మహాప్రేమతో ఇట్లు పలికిరి (81).
సిద్ధులిట్లు పిలికిరి -
బ్రహ్మానందమును ఇచ్చువాడు, జగన్నాథుడు అగు ఈ పరమశివుడు దయతో నీ కుమార్తెకు సాక్షాత్కరించి దర్శన మిచ్చినాడు (82).
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
17 Feb 2022
గీతోపనిషత్తు -323
🌹. గీతోపనిషత్తు -323 🌹
✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
📚. 9వ అధ్యాయము - రాజవిద్య రాజగుహ్య యోగము - 24-3 📚
🍀 24-3. తత్త్వదర్శనము - సమస్త సృష్టియందు నటించుచు నర్తించుచునున్న దైవమును చూచుట నిత్యము సాధనగ సాగవలెను. లేనిచో కనిపించినను చూడలేరు. వినిపించినను వినలేరు. ఇది నిజమగు పతన స్థితి. తాము నమ్ముకొన్న నామమే దైవ నామమని, తాము నమ్ముకొన్న రూపమే దైవ రూపమని సంకుచితమగు భావములలో బంధింపబడి భేదములు సృష్టించు కొనుచు, కలహించు కొనుచు, దేవుని పేరున అధోగతి చెందుచున్నారు. అన్ని ప్రార్ధనలు ఒకే దైవమును చేరునను భావన ప్రధానము. 🍀
అహం హి సర్వయజ్ఞానాం భోక్తా చ ప్రభురేవ చ |
న తు మామభిజానంతి తత్త్యనాత శ్చ్యవంతి తే || 24
తాత్పర్యము : వివిధ దేవతా రూపములను ఆరాధనము చేయువారు తత్త్వ దర్శనము చేయజాలకున్నారు. సర్వయజ్ఞములకును ప్రభువును, భోక్తను నేనే అని తెలియలేకున్నారు. కనుక వారు జారిపోవుచున్నారు.
వివరణము : ఎన్ని రకముల వేషములు వేసినను అట్టి వేషములను ధరించిన నటుని గుర్తించినట్లు సమస్త సృష్టియందు నటించుచు నర్తించుచునున్న దైవమును చూచుట నిత్యము సాధనగ సాగవలెను. లేనిచో కనిపించినను చూడలేరు. వినిపించినను వినలేరు. ఇది నిజమగు పతన స్థితి. పై విధముగ దైవమును దర్శించ లేకుండుటకు, విన లేకుండుటకు, స్పృశించ లేకుండుటకు ముఖ్యకారణ మొక్కటియే. అదియే తత్త్వజ్ఞాన లేమి. సంప్రదాయబద్ధులై ఏదో ఒక భగవద్రూపమునకు, ఒక భగవన్నామమునకు కట్టుబడి యుండువారు తద్భిన్నమగు కోటాను కోట్ల సృష్టి రూపములను దర్శించినపుడు, అవి దైవ రూపములే అని గుర్తించలేరు. కనుక గ్రుడ్డివారు, చెవిటివారు దైవమునందే జీవించుచు దైవమును తెలియలేక అజ్ఞానులై పడి యున్నారు. ఇది మానవజాతి దుస్థితి.
తాము నమ్ముకొన్న నామమే దైవ నామమని, తాము నమ్ముకొన్న రూపమే దైవ రూపమని సంకుచితమగు భావములలో బంధింపబడి భేదములు సృష్టించు కొనుచు, కలహించుకొనుచు, రక్తపాతములు సృష్టించుచు దేవుని పేరున అధోగతి చెందుచున్నారు. చ్యవనము చెందు చున్నారని దైవము పలికినాడు. అన్ని ప్రార్ధనలు ఒకే దైవమును చేరునను భావన ప్రధానము. యజ్ఞములు, క్రతువులు, కీర్తనలు, భజనములు, జపములు, ధ్యానములు అన్నిటి గమ్యము నేనే. అన్నిటికిని ప్రభువు నేనే.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
17 Feb 2022
17 - FEBRUARY - 2022 గురువారం MESSAGES
1) 🌹. నిత్య పంచాంగము Daily Panchangam 17, గురువారం, ఫిబ్రవరి 2022 బృహస్పతి వాసరే 🌹
2) 🌹. గీతోపనిషత్తు - రాజవిద్య రాజగుహ్య యోగము 24-3 - 323 - తత్వదర్శనము 🌹
3) 🌹. శివ మహా పురాణము - 521🌹
4)🌹. మాస్టర్ ఇ.కె సందేశాలు -151🌹
5) 🌹 Osho Daily Meditations - 140🌹
6) 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 349-2 / Sri Lalitha Chaitanya Vijnanam - 349-2 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శుభ గురువారం మిత్రులందరికీ 🌹*
*బృహస్పతి వాసరే, 17, ఫిబ్రవరి 2022*
*మీకు ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని కోరుకుంటూ*
*ప్రసాద్ భరద్వాజ*
*🍀. శ్రీ కల్కి స్తోత్రం - 2 🍀*
*3. తవ యశో జగచ్ఛోకనాశకం మృదుకథామృతం ప్రీతిదాయకమ్ |*
*స్మితసుఖేక్షితం చంద్రవన్ముఖం తవ కరోత్యలం లోకమంగళమ్*
*4. మమ పతిస్త్వయం సర్వదుర్జయో యది తవాప్రియం కర్మణాచరేత్ |*
*జహి తదాత్మనః శత్రుముద్యతం కురు కృపాం న చేదీదృగీశ్వరః*
🌻 🌻 🌻 🌻 🌻
*🍀. నేటి సూక్తి : చూడబడేదంతా మాయ. చూచేవాడు బ్రహ్మము.
రూపంగా ఉన్నవాడు జీవుడు. స్వరూపంగా ఉన్నవాడు దేవుడు.🍀*
*పండుగలు మరియు పర్వదినాలు : లేవు*
🌷🌷🌷🌷🌷
విక్రమ సంవత్సరం: 2078 ఆనంద
శఖ సంవత్సరం: 1943 ప్లవ,
ఉత్తరాయణం, శిశిర ఋతువు,
మాఘ మాసం
తిథి: కృష్ణ పాడ్యమి 22:41:54 వరకు
తదుపరి కృష్ణ విదియ
నక్షత్రం: మఘ 16:11:44 వరకు
తదుపరి పూర్వ ఫల్గుణి
యోగం: అతిగంధ్ 19:47:31 వరకు
తదుపరి సుకర్మ
కరణం: బాలవ 10:35:15 వరకు
సూర్యోదయం: 06:41:45
సూర్యాస్తమయం: 18:18:31
వైదిక సూర్యోదయం: 06:45:22
వైదిక సూర్యాస్తమయం: 18:14:53
చంద్రోదయం: 19:00:16
చంద్రాస్తమయం: 07:12:53
సూర్య సంచార రాశి: కుంభం
చంద్ర సంచార రాశి: సింహం
వర్జ్యం: 03:43:00 - 05:22:44
మరియు 24:21:20 - 25:59:24
దుర్ముహూర్తం: 10:34:00 - 11:20:27
మరియు 15:12:42 - 15:59:09
రాహు కాలం: 13:57:13 - 15:24:19
గుళిక కాలం: 09:35:56 - 11:03:02
యమ గండం: 06:41:45 - 08:08:50
అభిజిత్ ముహూర్తం: 12:07 - 12:53
అమృత కాలం: 13:41:24 - 15:21:08
ముసల యోగం - దుఃఖం 16:11:44
వరకు తదుపరి గద యోగం -
కార్య హాని , చెడు
🌻 🌻 🌻 🌻 🌻
*🍀. నిత్య ప్రార్థన 🍀*
*వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ*
*నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా*
*యశివ నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా*
*తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం*
*తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ*
*విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.*
🌹🌹🌹🌹🌹
#పంచాగముPanchangam
#PANCHANGUM
#DAILYCalender
Join and Share
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. గీతోపనిషత్తు -323 🌹*
*✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*📚. 9వ అధ్యాయము - రాజవిద్య రాజగుహ్య యోగము - 24-3 📚*
*🍀 24-3. తత్త్వదర్శనము - సమస్త సృష్టియందు నటించుచు నర్తించుచునున్న దైవమును చూచుట నిత్యము సాధనగ సాగవలెను. లేనిచో కనిపించినను చూడలేరు. వినిపించినను వినలేరు. ఇది నిజమగు పతన స్థితి. తాము నమ్ముకొన్న నామమే దైవ నామమని, తాము నమ్ముకొన్న రూపమే దైవ రూపమని సంకుచితమగు భావములలో బంధింపబడి భేదములు సృష్టించు కొనుచు, కలహించు కొనుచు, దేవుని పేరున అధోగతి చెందుచున్నారు. అన్ని ప్రార్ధనలు ఒకే దైవమును చేరునను భావన ప్రధానము. 🍀*
*అహం హి సర్వయజ్ఞానాం భోక్తా చ ప్రభురేవ చ |*
*న తు మామభిజానంతి తత్త్యనాత శ్చ్యవంతి తే || 24*
*తాత్పర్యము : వివిధ దేవతా రూపములను ఆరాధనము చేయువారు తత్త్వ దర్శనము చేయజాలకున్నారు. సర్వయజ్ఞములకును ప్రభువును, భోక్తను నేనే అని తెలియలేకున్నారు. కనుక వారు జారిపోవుచున్నారు.*
*వివరణము : ఎన్ని రకముల వేషములు వేసినను అట్టి వేషములను ధరించిన నటుని గుర్తించినట్లు సమస్త సృష్టియందు నటించుచు నర్తించుచునున్న దైవమును చూచుట నిత్యము సాధనగ సాగవలెను. లేనిచో కనిపించినను చూడలేరు. వినిపించినను వినలేరు. ఇది నిజమగు పతన స్థితి. పై విధముగ దైవమును దర్శించ లేకుండుటకు, విన లేకుండుటకు, స్పృశించ లేకుండుటకు ముఖ్యకారణ మొక్కటియే. అదియే తత్త్వజ్ఞాన లేమి. సంప్రదాయబద్ధులై ఏదో ఒక భగవద్రూపమునకు, ఒక భగవన్నామమునకు కట్టుబడి యుండువారు తద్భిన్నమగు కోటాను కోట్ల సృష్టి రూపములను దర్శించినపుడు, అవి దైవ రూపములే అని గుర్తించలేరు. కనుక గ్రుడ్డివారు, చెవిటివారు దైవమునందే జీవించుచు దైవమును తెలియలేక అజ్ఞానులై పడి యున్నారు. ఇది మానవజాతి దుస్థితి.*
*తాము నమ్ముకొన్న నామమే దైవ నామమని, తాము నమ్ముకొన్న రూపమే దైవ రూపమని సంకుచితమగు భావములలో బంధింపబడి భేదములు సృష్టించు కొనుచు, కలహించుకొనుచు, రక్తపాతములు సృష్టించుచు దేవుని పేరున అధోగతి చెందుచున్నారు. చ్యవనము చెందు చున్నారని దైవము పలికినాడు. అన్ని ప్రార్ధనలు ఒకే దైవమును చేరునను భావన ప్రధానము. యజ్ఞములు, క్రతువులు, కీర్తనలు, భజనములు, జపములు, ధ్యానములు అన్నిటి గమ్యము నేనే. అన్నిటికిని ప్రభువు నేనే.*
*సశేషం...*
🌹 🌹 🌹 🌹 🌹
#గీతోపనిషత్ #సద్గురుపార్వతీకుమార్
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
https://t.me/bhagavadgeethaa/
www.facebook.com/groups/bhagavadgeethaa/
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹 . శ్రీ శివ మహా పురాణము - 521 🌹*
రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ
*🌴. రుద్ర సంహితా - పార్వతీ ఖండః 🌴*
అధ్యాయము - 44
*🌻. మేన యొక్క మంకు పట్టు - 7 🌻*
బ్రహ్మ ఇట్లు పలికెను -
అపుడు మేనక ఈ తీరున పరిపరి విధముల దుఃఖించి బిగ్గరగా రోదించెను. ఓ మునీ! ఆమె మనస్సు దుఃఖముతో నిండియుండెను (72). అపుడు నేను వెంటనే అచటకు వచ్చి దుష్ట జ్ఞానమును హరించి వేయు ఉత్తమమైన పరమ శివతత్త్వమును ఆ మేనకకు బోధించితిని (73).
ఓ మేనా! నా శుభకరములగు పలుకులను ప్రీతితో వినుము. నా మాటను శ్రద్ధగా విన్నచో, నీ చెడు బుద్ధి నశించును (74). జగత్తును సృష్టించి, పోషించి, లయము చేయునది శంకరుడే. నీవు ఆయన రూపమును ఎరుంగవు. ఆయన దుఃఖమునకు నిలయుడని నీవు ఎట్లు ఊహించుచున్నావు? (75)
ఆ ప్రభుడు అనేక నామ రూపములతో వివిధ లీలలను చూపుచుండును. ఆ సర్వేశ్వరుడు స్వతంత్రుడు. మాయకు ప్రభువు. అద్వితీయుడు (76). ఓ మేనా! నీవీ సత్యము నెరింగి శివునకు ఇమ్ము. చెడు పట్టుదలను, సర్వకార్యములను పాడు జేయు జ్ఞానమును విడిచిపెట్టుము (77) ఓ మునీ! ఈ నా మాటను విని ఆ మేన పరిపరి విధముల విలపించుచూ సిగ్గును కొద్దిగా మెల్లగా విడిచి నాతో ఇట్లు పలికెను (78).
మేన ఇట్లు పలికెను -
ఓ బ్రహ్మా! నీవు ఈమె యొక్క గొప్ప రూపమును ఏల వ్యర్థము చేయ నిచ్చగించుచున్నావు? ఈమెను నీవె స్వయముగా సంహరించరాదా? (79). శివునకు ఇమ్మని నీవు నాకు చెప్పకుము. నాకు ప్రాణ ప్రియురాలగు ఈ నా కుమార్తెను నేను శివునకు ఈయను (80).
బ్రహ్మ ఇట్లు పలికెను -
ఓ మహర్షీ! ఆమె ఇట్లు చెప్పగా, అపుడు సనకాది సిద్ధులు ముందుకు వచ్చి మహాప్రేమతో ఇట్లు పలికిరి (81).
సిద్ధులిట్లు పిలికిరి -
బ్రహ్మానందమును ఇచ్చువాడు, జగన్నాథుడు అగు ఈ పరమశివుడు దయతో నీ కుమార్తెకు సాక్షాత్కరించి దర్శన మిచ్చినాడు (82).
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
#శివమహాపురాణము #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://t.me/ChaitanyaVijnanam
https://pyramidbook.in/Chaitanyavijnanam
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 151 🌹*
*✍️. రచన : సద్గురు ఇ. కృష్ణమాచార్యులు*
*📚 . సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*🌻. భాగవతము-అనుభూతి -2 🌻*
*ధర్మము కన్నా ధనము, అధికారము, కీర్తి, ఐహికముగా పైకి వచ్చుట వీటికే ప్రాధాన్యమొసగి మందబుద్ధులయి, జడులై అల్పాయుష్కులగుట తప్పదు. వీరికి కావలసినవి సుఖశాంతులు. కాని సుఖశాంతులను ఏ విషయమొసంగునో, ఇవి ఎట్లు లభించునో వీరికి తెలియదు. సుఖశాంతులను కలిగించునది దైవానుభూతి ఒక్కటే. ఇట్టి అనుభూతికి సులభము, తీయనైన బోధయుండవలయును.*
*వేదాంత గ్రంధములకు ఇట్టి సమర్థత లేదు. ఇంద్రియముల ఆకర్షణకు లోనై జీవించువారిని ఈ అనుభూతిని అందించుటకు అంతకన్నా గొప్పదయిన, మధురమయిన ఆకర్షణ వైపు లాగవలెను. అందుకే నారదుడు వ్యాసునకు భాగవతమును ఉపదేశించి వ్రాయించెను.*
... ..✍️ *మాస్టర్ ఇ.కె.*🌻
🌹 🌹 🌹 🌹 🌹
#మాస్టర్‌ఇకెసందేశములు #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share
🌷. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు 🌷
www.facebook.com/groups/masterek/
https://t.me/ChaitanyaVijnanam
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹 Osho Daily Meditations - 140 🌹*
*📚. Prasad Bharadwaj*
*🍀 140. AWARENESS FIRST 🍀*
*🕉 When awareness grows, and you become clearly alert, acceptance is a natural consequence. 🕉*
*Acceptance is an outgrowth of awareness. Greed is there; ... watch it. Ambition is there; watch it. A lust for power is there; watch it. Right now don't complicate things by the idea of accepting it, because if you try to accept and you cannot, you will start repressing. That's how people have repressed. They cannot accept, so the only way is to forget about things and put them in the dark. Then one is okay, one feels that there is no problem.*
*First, forget about acceptance. Just be aware. When awareness grows, and you become clearly alert, acceptance is a natural consequence. Seeing the fact, one has to accept it because there is nowhere else to go. What can you do? It is there just like your two eyes. They are not four, only two. Once you accept something, if it is real, only then can it remain. If it is unreal, it will dissolve. Love will remain; hate will dissolve. Compassion will remain; anger will dissolve.*
*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹
#ఓషోబోధనలు #OshoDiscourse #OshoDailyMeditations #ఓషోనిర్మలధ్యానములు #PrasadBhardwaj
https://t.me/ChaitanyaVijnanam
http://www.facebook.com/groups/oshoteachings/
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 349-2 / Sri Lalitha Chaitanya Vijnanam - 349-2 🌹*
*🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻*
*✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*మూల మంత్రము :*
*🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁*
*🍀 77. విజయా, విమలా, వంద్యా, వందారు జనవత్సలా ।*
*వాగ్వాదినీ, వామకేశీ, వహ్నిమండల వాసినీ ॥ 77 ॥ 🍀*
*🌻 349-2. 'వందారు జనవత్సలా' 🌻*
*భక్తి మార్గమున జీవనయాత్ర సాగించువారు ఎవరికి నమస్కారము చేయుటకైననూ సంసిద్ధులై యుందురు. అందులకే భక్తుల విషయమున భగవత్ తత్త్వము కూడ అమిత వాత్సల్యము కలిగి యుండును. 'వసుదేవుడు గాడిద కాళ్ళు పట్టుకొనే' నని సామెత కలదు. వసుదేవుడు అనన్య భక్తియుతుడు. అతని కందరి యందు దైవమే గోచరించును. అత్యంత పవిత్రమూర్తి. సంస్కారవంతుడైన వసుదేవుడు దురహంకారియైన కంసుని, దేవకిని రక్షించుకొనుటకై గాడిద కాళ్ళు పట్టుకొనుటకు కూడ వెనుకాడలేదు.*
*వసుదేవుని ఈ చర్యయే శ్రీకృష్ణ అవతారమునకు తెర తొలగించినది. భక్త జను లనగా అంతర్యామియైన దైవమును అందరి యందు దర్శించుచూ దైవ సంకల్పమును నిర్లిప్తతతో నిర్వర్తించువారు. అట్టి వారియందు అమిత వాత్సల్యమును శ్రీమాత చూపును. శ్రీకృష్ణుడు అంతర్యామి దైవమే. అతడు అర్జునునితో ఇట్లు పలికెను. “అర్జునా! నేను వైకుంఠమునందు అప్పసము (ఎల్లవేళలా) వుండను. యోగుల హృదయములందు కూడ నిరంతర ముండను. నన్ను సతతము స్మరించు భక్తులతో మాత్రమెప్పుడునూ ఉందును.”*
*సశేషం...*
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 349-2 🌹*
*Contemplation of 1000 Names of Sri Lalitha Devi*
*✍️. Acharya Ravi Sarma *
*📚. Prasad Bharadwaj*
*🌻 77. Vijaya vimala vandya mandaru janavatsala*
*Vagvadini vamakeshi vahni mandala vasini ॥ 77 ॥ 🌻*
*🌻 349. Vandāru-jana-vatsalā वन्दारु-जन-वत्सला (349) 🌻*
*This can be considered as an extension of the previous nāma. She loves Her devotees like a mother who loves her children. The vibration of love is emanated through one’s body like fragrance of a flower. Because of caring and loving nature also She is known as Vimalā (nāma 347). One can notice this in daily life. When one serves food for his dog, by impulse he develops love for his dog and this is radiated through his body. The dog reads his vibrations and feels his love and wags its tail as a token of reciprocating his love.*
*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹
#శ్రీలలితాసహస్రనామచైతన్యవిజ్ఞానము #SriLalithaChaitanyaVijnanam #లలితాసహస్రనామములు #LalithaSahasranama
#PrasadBhardwaj
https://t.me/srilalithachaitanyavijnanam
http://www.facebook.com/groups/srilalithachaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
https://www.facebook.com/103080154909766/
https://incarnation14.wordpress.com/
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
Subscribe to:
Posts (Atom)